Sunday, October 6, 2019

Vemana

వేమన శతకము

About Vemana

Vemana was born in 17th century in then Composite Andhra Pradesh. He commented on many of the social rituals and processes in a meter peculiar to him. A typical padyam (పద్యము) or verse contains 4 sub-verses always ending with viswada-abhirama-vinura-vema (విశ్వదాభిరామ వినుర వేమా) or just plain vema (వేమా)! This is called makutam (మకుటం ). He was supposed to have courted death by remaining naked and entering a cave at the end of his life. It is my privilege and honor to present 100 out of his 1000's of verses taken from వేమన పద్య రత్నాకరము published by బాల సరస్వతీ బుక్ డిపో and compiled by శ్రీ బులుసు వేంకటరమణయ్య గారు . My contribution to this blogspot is to raise the awareness of readers and providing an English Translation.

Selected

1) మాటలాడగల్గు మర్మము లెఱిగిన పిన్న పెద్దతనములు ఎన్నవలదు, పిన్న చేతి దివ్వె పెద్దగా వెలగదా ? వి. వే.

మాటలాడగల్గు మర్మము లెఱిగిన
పిన్న పెద్దతనములు ఎన్నవలదు,
పిన్న చేతి దివ్వె పెద్దగా
వెలగదా ? వి. వే.

మాటలాడు నేర్పు కలవాడు పిన్నవాడైనను, పెద్దవాడైనను సమానమే. భేదము లేదు. చిన్నవాని చే తిలో ఉన్నను దీపము బాగుగా ప్రకాశించును కదా !

A person with gift of gab, whether younger or older, it is the same. There is no difference. If a torch light is in the hands of the younger one, it will be shining just as in the hands of the older one.

2) పాము కన్న లేదు పాపిష్టి యగు జీవి యట్టి పాము చెప్పినట్టు వినును ఇలను మూర్ఖుజెప్ప నెవ్వరి తరమయా ! వి. వే.

పాము కన్న లేదు పాపిష్టి యగు
జీవి యట్టి పాము చెప్పినట్టు
వినును ఇలను మూర్ఖుజెప్ప
నెవ్వరి తరమయా ! వి. వే.

పాము కంటే దుష్టమైన ప్రాణి లేదు కదా! అట్టి పాము కూడ పాములవాడు చెప్పినట్లు వినును . మూర్ఖుడో! ఎవ్వరు చెప్పినను వినడు !

A snake is highly dangerous. But a snake charmer can make it respond to his commands. Whereas an idiot (మూర్ఖుడు) won't listen to anyone's words.

3) పొట్ల కాయ రాయి పొదుగ ద్రాటను గట్ట లీల తోడ వంక లేక పెరుగు కుక్క తోక గట్ట కుదురునా చక్కగా? వి. వే.

పొట్ల కాయ రాయి పొదుగ ద్రాటను
గట్ట లీల తోడ వంక లేక
పెరుగు కుక్క తోక గట్ట
కుదురునా చక్కగా? వి. వే

పొట్ల కాయ వంకరలు లేక తిన్నగా పెరుగుటకు త్రాటితో రాయి కట్టుదురు . కుక్క తోకను అట్లు కట్టినను అది తిన్నగా ఉండదు . మూర్ఖుడును అట్లే బాగుపడడు

We tie a stone at the end of snake guard to keep it straight. However if you tie a stone at the end of a dog's tail, it won't straighten the tail. Similarly an idiot (మూర్ఖుడు) cannot be reformed.

What vemana is saying is certain aspects of the universe can be controlled with will and persistence. There will always be some aspects that defy our persuasion. One of them is our inability to reform certain people who have chosen the wrong path in life. This could be a genetic trait or a conscious choice. Fortunately 99% of the individuals we meet are conformists. The rest defy all odds. Interestingly we are taught to be different and distinguish ourselves from others in the same class or region. As always the difference between a genius and an idiot is that the genius carries out acts that are pleasing to the rest of us.

4) ఆత్మ శుద్ధి లేని ఆచార మది యేల? భాండ శుద్ధి లేని పాక మేల ? చిత్త శుద్ధి లేని శివ పూజ లేలరా ? వి. వే.

ఆత్మ శుద్ధి లేని ఆచార మది
యేల? భాండ శుద్ధి లేని పాక
మేల ? చిత్త శుద్ధి లేని
శివ పూజ లేలరా ? వి. వే.

దా౦భికులు మనః శుద్ధి లేకయే పేరునకు శివ పూజలు చేయుచుందురు . అట్టి పూజలు వ్యర్థములు . ఆత్మ శుద్ధిలేని ఆచారము , శుద్ధము చేయని పాత్రలలో వ౦డిన వంటయు నిరుపయోగములే కదా!

Pompous people perform prayers to Shiva as a ritual or for name's sake. Such prayers are a waste. The prayers done with impure mind is like cooking with unclean pots.

Vemana is advising us to cleanse our minds and hearts before launching into a spiritual life. According to some, the spiritual life process is precisely that. It is hard to keep stray thoughts away from the mind. No one has given a prescription to clean up the mind other than by meditation.

5 ) చిలుక గర్భమ౦ దు శ్రీ సుకుడుదయించి ముని వరేణ్యులయందు ముఖ్యుడయ్యే , ప్రత్తి కాయ చిత్రపటములు పుట్టునా ? వి. వే.

చిలుక గర్భమ౦ దు శ్రీ సుకుడుదయించి
ముని వరేణ్యులయందు ముఖ్యుడయ్యే,
ప్రత్తి కాయ చిత్రపటములు
పుట్టునా ? వి. వే.

తక్కువ వారి యందు గొప్పవారును పుట్టుదురు . చిలుక కడుపున శుక మహర్షి పుట్టెను. ప్రత్తి కాయల నుండి రంగు రంగుల వస్త్రములు నిర్మింపబడలేదా ?

A rishi(sage) called Suka was born to a parrot and went on to become the most learned one among the rishis. This is like clothes with variegated colors could be made with cotton.

Surprising things happen in the nature. A person considered a low life can raise up to an occasion. Everyone has a spark of a genius. The goal of life is finding this spark. For some sages the goal of life is to attain salvation by carrying out yeoman's work. Tyagaraja and Annamachaarya composed thousands of kritis or verses that enriched all the telugu speaking people and more. They have given away all of their works freely to others.

6 ) చీమ కుట్టె నేని చివుకు అనిపించును చీమ ఎంత ? దాని సృష్టి ఎంత? చీమవంటివాని సృష్టిలో నెఱుగుము , వి. వే.

చీమ కుట్టె నేని చివుకు అనిపించును
చీమ ఎంత ? దాని సృష్టి
ఎంత? చీమవంటివాని సృష్టిలో
నెఱుగుము , వి. వే.

శక్తి లేని చీమ కుట్టినను బాధ యనిపించును . ఆ శక్తి లేని చీమ వంటి జీవి యందును ఈశ్వరుడు ఉన్నట్లు గ్రహింపుము .

A puny ant's bite is painful. Such creatures though seemingly powerless are embodiment of Iswara (God).

What Vemana says is god is everywhere and in everyone. One need not go looking for God. He is right here within us and among all living creatures. A demon by the name of Hiranyakasyap had a son called Prahlad who said this to his father: ఇందు గలదండు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎంద౦దు వెదకినా అందందే గలడు దాన వాగ్రని వింటే! The above poem taken from Bammera Potana's Bhagavatam essentially says God is everywhere without an exception.

7 ) చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబు అయ్యె నీటబడ్డ చినుకు నీళ్ళ గలసె ప్రాప్తమున్న చోట ఫలమేల తప్పురా? వి. వే.

చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబు
అయ్యె నీటబడ్డ చినుకు నీళ్ళ
గలసె ప్రాప్తమున్న చోట
ఫలమేల తప్పురా? వి. వే.

ప్రాప్తి ఉన్న చోట వద్దన్నను ఫలము లభించును . నీటి బొట్టు ముత్యపు చిప్పలో పడిన ముత్యమగును . నీటిలోబడిన ఆ నీటిలో కలసిపోవును

A deserving person will receive material possessions by fate no matter where he is positioned in life. A drop of water in the oyster will turn into a pearl no matter what. When a drop of water falls in sea, it will merge into the sea.

They say when it rains it pours. Such is the thing with fate. Some people are fortunate in receiving life's gifts consistently. The reason could be the good karma performed by them in this life and in previous lives. Karma has been said to be of these kinds: praarabdha (the one being experienced), sanchita (the one accrued in previous life), aagaami (the one about to unfold in the future), etc. In Bhagavat Gita Lord Krishna asked us not to expect rewards for karma. We are only given the right to perform karma but not the right to demand their rewards. He goes on to say all the rewards offered by Devas go from him. So he is the source of all karma phalam. And each of us receives it according to his grace.

8 ) జఠరమందు జ్యోతి చాల దేదీప్యము కానలేని నరులు కలుష మతులు కన్ను విచ్చి చూచు ఘనుడగు సుజను౦డు , వి. వే.

జఠరమందు జ్యోతి చాల దేదీప్యము
కానలేని నరులు కలుష మతులు
కన్ను విచ్చి చూచు ఘనుడగు
సుజను౦డు , వి. వే.

మనలోనే ఉన్న ఆత్మ జ్యోతి దేదీప్యమానమై వెలుగుచు ఉండగా దుష్టులు దానిని చూడలేరు. సుజనులు చూడగలరు

An evil person cannot see ఆత్మ (soul) that is shining in our bodies. A righteous person can see ఆత్మ (soul) (soul).

The question is whether we have a soul or aatma. The entire literature of vedas is based on the existence of aatma. Aatma is the one that unites us despite our apparent differences. A tall man, a short woman, a brown person, etc. are all manifestations of the paramaatma (the supreme soul). So there is no denying that there is a viswa yoni (cosmic creator) that shapes our personalities. Incidentally, hinduism is the only religion that unites not only all mankind but also animal kingdom and plant kingdom which are life forms of their own right.

9 ) గంగి గోవు పాలు గంటెడైనను చాలు కడవడైననేమి ఖరముపాలు ? భక్తి గల్గు కూడు పట్టెడైనను చాలు, వి. వే.

గంగి గోవు పాలు గంటెడైనను
చాలు కడవడైననేమి ఖరముపాలు?
భక్తి గల్గు కూడు పట్టెడైనను
చాలు, వి. వే.

ఆవు పాలు కొంచెము లభించినను మేలు. గాడిద పాలు కుండడైనను ప్రయోజనము లేదు . ప్రేమతో పెట్టిన తిండి పట్టెడైనను తృప్తి నిచ్చును . తిట్టుచు ఎంత పెట్టినను తృప్తి ఉండదు .

A cow's milk, though small in quantity, will satiate us. A donkey's milk, even if it is in plenty, will not satisfy us. A meal served to a guest with love and affection is very satisfying. Meal reluctantly served to a guest will never satisfy him.

Sometimes we are not sure what the guest expects. A vegan/vegetarian appears at your door step and if you serve him meat and eggs he could be under consternation. So it is always better to know your guests in advance. I was told a story about a crane and a fox. Once a fox befriended a crane and invited her to his house. He then served a dish on a flat plate. The poor crane could not handle it with its long beak. To teach a lesson to the fox, the crane invited him to her house and served him soup in a pot with a long snout. The fox got the message and behaved nice from then on.

1 0 ) ఎంత చదువు చదివి ఎన్ని నేర్చిన గాని హీనుడవ గుణంబు మానలేడు బొగ్గు పాల కడుగు బోవునా మలిన౦బు ? వి. వే.

ఎంత చదువు చదివి ఎన్ని నేర్చిన
గాని హీనుడవ గుణంబు
మానలేడు బొగ్గు పాల కడుగు
బోవునా మలిన౦బు ? వి. వే.

ఎంత చదివి , ఎన్ని నేర్చినను హీనుడు తన చెడ్డ గుణమును విడువడు . బొగ్గును పాలతో కడిగినను దాని నలుపు పోనేపోదు

No matter how much a decrepit man learns, he will not leave his bad qualities. Just as a piece of coal's blackness cannot be washed away.

Learning is relative. Once upon a time scripture was considered as the only learning one required (vidya). Over the course of time we have engineering, medicine, etc. that required scientific and mathematical reasoning. Vemana is referring to the ones who are trained in the scripture but it equally applies to the doctors and technocrats who cannot live an honest life with the paychecks they earned resulting in corruption and sloth.

1 1 ) వేఱు పురుగు చేరి వృక్షంబు జెఱచును . చీడపురుగు చేరి చెట్టుజెఱుచు , కుచ్చితుండు చేరి గుణవంతు జెఱచురా ! వి. వే.

వేఱు పురుగు చేరి వృక్షంబు జెఱచును.
చీడపురుగు చేరి చెట్టుజెఱుచు,
కుచ్చితుండు చేరి
గుణవంతు జెఱచురా ! వి. వే.

వేరుపురుగు చేరి చెట్టును చంపును. చీడపురుగు కూడ అట్లే చెట్టును చెరచును. కుచ్చితుడు మంచివానిని చెరచును.

A locust can destroy a tree. Just as bad friends or company can destroy the good in us.

It takes one drop of venom to spoil the entire pot of milk. Such is the power of a devious thought. In these days of mass slaughter in the name of terrorism we see a single idea planted by an evil person such as a guru gone rogue can inspire a young man to take up arms and shoot indiscriminately at people. We need to stay away from all such deviousness.

1 2 ) అంతరంగమందు అపరాధములు చేసి మంచివానివలెనె మనుజుడు౦డు ఇతరులు ఎఱుగకున్న ఈశ్వరుడు ఎఱుగడా ? వి. వే.

అంతరంగమందు అపరాధములు చేసి
మంచివానివలెనె మనుజుడు౦డు
ఇతరులు ఎఱుగకున్న ఈశ్వరుడు
ఎఱుగడా ? వి. వే.

దుర్జనులు తమ మనస్సున ద్రోహచింత కలిగి , పైకి మంచివారి వలెనె కానవత్తురు . ఇతరులకు తెలియకున్నను వారి చెడ్డతనము భగవంతునికి తెలియదా యేమి? వి. వే.

Evil people with their penchant to back-stab masquerade as good people. Iswara (ఈశ్వర – God) knows their evil designs even if men can't.

Vemana continues talking about evil people by describing a specific act—back stabbing. It is a universal trait that men undermine each other. A person deserving a Bharat Ratna would be down sized as one not even deserving a Padmashree. Another deserving a raise in salary is set aside by greedy bosses and colleagues. It is not restricted to professions as family members can do the same when sharing inheritence.

1 3 ) అంతరాత్మ గనక అల్ప బుద్ధుల తోడ మెలగెడు జనులు ఎల్ల మేదినిపయి యముని నరకమునకు నరుగంగ సాక్ష్యము , వి. వే.

అంతరాత్మ గనక అల్ప బుద్ధుల
తోడ మెలగెడు జనులు ఎల్ల మేదినిపయి
యముని నరకమునకు నరుగంగ
సాక్ష్యము , వి. వే.

మనస్సు కని పెట్టలేక దుర్జనులతో తిరిగెడి జనులకు ప్రాణాపాయము కూడా సంభవించును

A man can lose his life by befriending an evil person whose mind cannot be understood.

1 4 ) అల్పుడెపుడు బలుకు ఆడంబరముగాను సజ్జను౦డు పల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా ? వి. వే.

అల్పుడెపుడు బలుకు ఆడంబరముగాను
సజ్జను౦డు పల్కు చల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు
మ్రోగునా ? వి. వే.
దుష్టుడు ఆర్భాటముగా మాటలాడును. మంచివాడు మెల్లగా పల్కును . కంచు కంగున ధ్వని చేయును. బంగారము ధ్వనింపదు .

A pompous person talks with grandiose. A good person, on the other hand, talks with humbleness. A pot made of brass rings loudly. Whereas a pot made of gold does not ring loudly.

1 5 ) కర్మ ఫలములన్ని కపత్యంబుగా చూచి ధర్మ ఫలములన్ని తగిలియ౦డి ధర్మకర్మములను దాటుటే ముక్తిరా! వి. వే.

కర్మ ఫలములన్ని కపత్యంబుగా
చూచి ధర్మ ఫలములన్ని తగిలియ౦డి
ధర్మకర్మములను దాటుటే
ముక్తిరా! వి. వే.

కర్మ ఫలములను పొల్లుగా భావించి ధర్మ ఫలములు స్వీకరించి , పిదప ధర్మ కర్మములను దాటి ముక్తిని కాంచవలెను .

The fruits of karma should be considered as inferior to the fruits of dharma. However for salvation both karma and dharma have to be renounced.

1 6 ) కర్మమునను బుట్టి కష్ట౦బులో జేరి కర్మ మేరుపడుట కానలేరు, కర్మ బంధమునను కడతేరలేరాయా! వి. వే.

కర్మమునను బుట్టి కష్ట౦బులో
జేరి కర్మ మేరుపడుట
కానలేరు, కర్మ బంధమునను
కడతేరలేరాయా! వి. వే.

మనుజుడు కర్మము వలననే పుట్టి, కష్టములకు చిక్కి, ఆ కర్మ బంధమును విడిపించలేక తరింపలేక ఉన్నాడు

A man born out of karma, caught in vicissitudes of life, is unable to attain salvation (మోక్షము ) when he has established bonds with friends and family.

Vedas and their ultimate commentaries in upanishats talk about renouncing family and friends as an essential trait of a mumukshu (one who aspires for moksha or salvation). If one wants rebirth, then there is no such need. All the bonds are to be broken when one enters vaanaprastha in the old age in search of a birth-less state or moksha. The other types of salvation provide sojourn into swarga loka or heaven, vaikuntham or vishnu loka, kailasam or Siva's abode and so on.

1 7) కూడదేమి చేసె ? కులమేమి చేసెను? భూమి యేమిచేసె ? బొందికట్టె నరుడు పడెడు పాట్లు నగుబాట్లు చూడరా ! వి. వే.

కూడదేమి చేసె ? కులమేమి చేసెను?
భూమి యేమిచేసె ? బొందికట్టె
నరుడు పడెడు పాట్లు నగుబాట్లు
చూడరా ! వి. వే.

ఉపవాస, కుల నివాసాదులబట్టి నరుడు శ్రమపడిన లాభము లేదు. వీనిని విడిచి మోక్షమునకై యత్ని ౦పవలెను.

By fasting and adhering to the work imposed by caste, despite hard work, a man cannot attain salvation. He has to first renounce such things.

Vemana is emphasizing that the only sure way of attaining salvation is by renouncing earthly connections. So what one has to do by renouncing all things? What is that he should think about? To what aim his actions are to be carried out? In Bhagavat Gita Lord Krishna said you get what you ask for at the last breath. Of course, this assumes one is deserving. So the quest after renouncing all earthly bonds is to figure out what one needs: after life or moksha. It also involves penance and staying away from sin.

1) అచ్చు పడగ మనసు మచ్చిక జేపట్టి ముచ్చటించు శివుని మూర్తి చూచి కుచ్చితంబు మాని చొచ్చుట యోగo బు, వి. వే.

అచ్చు పడగ మనసు మచ్చిక జేపట్టి
ముచ్చటించు శివుని మూర్తి
చూచి కుచ్చితంబు మాని
చొచ్చుట యోగo బు, వి. వే

ధైర్యముతో మనస్సును నిలిపి కల్మషము విడిచి భగవంతుని చూచుటయే యోగము.

Yoga is renouncing evil thoughts with courage and praying to God.

2) అవని ధైర్యమని అతిశయ కాముడై నిన్ను నమ్మి నిష్ఠ నెగడుచుండి నిన్ను గొల్వ ముక్తి నిశ్చయముగ కలుగు , వి. వే.

అవని ధైర్యమని అతిశయ కాముడై
నిన్ను నమ్మి నిష్ఠ నెగడుచుండి
నిన్ను గొల్వ ముక్తి
నిశ్చయముగ కలుగు , వి. వే

తన ఘనతను కోరి భగవంతుని నమ్మి, ధైర్యము వహించి అతనిని సేవించినచో ముక్తి కలుగును.

One can attain salvation by believing in God, by being courageous and by serving the God.

It appears as though Vemana is providing a simple path for moksha when thousands of verses in the scripture deal with it. Despite the thousands of verses, no one knows for sure what moksha offers. Okay, there is no rebirth. So what is the state of consciousness? Do I still remember by past lives? Is it like watching movie re-runs? The scripture is totally unclear about the passage of time in moksha. Those of us earth bound perform karmas like walking, laughing and eating. What is their equivalent in moksha? No one knows. Hence Vemana's simple prescription is not all that simple if you think about it.

3) అంతరంగమందు నభువును ఉద్దేశించి తలప దలప ముక్తి తనకు కలుగు , బాహ్య రంగమందు భయమంద ఫలము ఏమి? వి. వే.

అంతరంగమందు నభువును ఉద్దేశించి
తలప దలప ముక్తి తనకు
కలుగు , బాహ్య రంగమందు
భయమంద ఫలము ఏమి? వి. వే.

మనస్సులో భగవంతుని నిలిపి , ధైర్యముతో మననము చేయగా ముక్తి లభించును. బాహ్యములను చూచి భయపడవద్దు .

By fixating mind on God and praying him with courage is the way to attain salvation. Don't fear the external world.

Vemana is suggesting a gradual process to attain moksha. Why courage? One is so used to the security and comfort of having bonds—a parent living with a son or a young man staying with parents—that one forgets about God. It is the god that protects us from all sorts of vicissitudes. The people around us are there to discharge god's function. If god desires to give you wealth, then it will be delivered through your employer or by inheritence. So there is nothing practically that does not involve god as the mediator. So it is a safe bet to keep faith on him at all times.

4) అదరి పడక మనసును ఆనందమును కోరి మదిని మెలగువాడు మాన్యుడు అరయ సదమలత్వమునను శాశ్వత ఈశ్వరుడగు , వి. వే.

అదరి పడక మనసును ఆనందమును కోరి
మదిని మెలగువాడు మాన్యుడు
అరయ సదమలత్వమునను శాశ్వత
ఈశ్వరుడగు , వి. వే.

ధ్యాన సమయమున స్తిరుడయి నిర్మలుడు అయి, బ్రహ్మానందము కోరువాడే మాన్యుడు . అతడు ఈశ్వర భావము పొందగలడు .

During meditation one has to concentrate and desire supreme happiness to realize the Iswara (God)

Volumes have been written about the benefits of meditation. It is imperative that we have a regimented life with discipline to attain the fruits of meditation. We cannot be for example thinking about our neighbor when we set out to explore our thoughts. To some, replaying the day's events is a launching pad for meditation. In Gita Lord Krishna said one who constantly thinks about worldly matters begets self-love that leads to kama or desire resulting in krodha or anger. Krodha leads to sammohana (more lust) that leads to smriti brahmsa (memory lapse) and budhi naasa (moral decay). Thus, when meditating we should be careful about what we are asking for.

5) అందరాని పండదడవి వెన్నెల బైట నుండు జూడ బెద్ద పండుగాను పండు పడిన జెట్టు బట్టగలేరాయా! వి. వే.

అందరాని పండదడవి వెన్నెల
బైట నుండు జూడ బెద్ద పండుగాను
పండు పడిన జెట్టు
బట్టగలేరాయా! వి. వే.

మోక్ష ఫలము అందరానిది. దానిని పొందుటకు అడవిలో జ్ఞానమను వెన్నెలతో చూడ వచ్చును. ఆ ఫలము గల వృక్షమును పట్టుకొనుట చాల కష్టము.

The path to salvation is extremely difficult. One can strive to attain knowledge about salvation (మోక్షము just as one sees a tree in the forest lit up by the full moon but has difficulty identifying a fruit bearing tree.

It seems, almost all want salvation but no one wants to do due diligence. Being forewarned is being forearmed. There is no doubt that creation will end when everyone attains moksha because there is no rebirth. That's what hindus call kalpam. By repeating the actions in various births to perfection one finally attains moksham. It is a gradual process not an over-night venture. Even though the babas and gurus these days promise moksha if you listen to them, there is no such guarantee. There is no proof that anyone we know in the past or present has attained moksha. There is no communication back and forth unlike the astronauts in the space-station talking to us.

దుర్జన పద్దతి

1) అగ్ని చేత బట్టి ఆ పరమ ఈశుని నింద చేసి నరులు నీరుకారె ? దక్షు క్రతువులోన తల్లడము ఎఱుగరా ? వి. వే.

అగ్ని చేత బట్టి ఆ పరమ ఈశుని
నింద చేసి నరులు నీరుకారె
? దక్షు క్రతువులోన తల్లడము
ఎఱుగరా ? వి. వే.

దుర్జనులు అహంకరించి దేవుని నిందించిన నశి ౦తురు. దక్షుడు అహంకరించి శివుని నిందించి హాని పొందలేదా?

Evil people perish by abusing God. King Daksha received retribution by cursing Siva, didn't he?

Hiranyakasyap perished in the hands of Sri Maha Vishnu by constantly badgering his child Prahlad and questioning where is Hari or vishnu. God can only take so much. In vishnu sahasranaamam the God says పరిత్రాణయ సాధూనాం వినాసాయచ దుష్కృతం ధర్మ సంస్థాపనార్ధయా౦ సంభావామి యుగే యుగే . So god knows when to put an end to evil. He is always looking out for bad people to go rampant before destroying them. Unfortunatley those of us on the good-side of God have to be patient and willing to wait for the good days to come.

2) అంటు ముట్టును ఎంచి యదలించి పడవైచి దూరమందు జేరి దూఱుచు ఉందురు , పుట్టి చచ్చు జనులు పూర్ణంబు నెఱుగరు , వి. వే.

అంటు ముట్టును ఎంచి యదలించి
పడవైచి దూరమందు జేరి దూఱుచు
ఉందురు , పుట్టి చచ్చు జనులు
పూర్ణంబు నెఱుగరు , వి. వే

దుర్జనులు అహంకారముతో అంటు, ముట్టులు అని ఇతరులను కసిరి దూరముగా తరుముదురు . చావు పుట్టుకలు కల జనులకు అంటు ముట్టుల సంగతి ఏమి తెలియును?

Evil people full of ego curse others with lame excuses such as purity of body. How can such people destined to be born and dead understand the purity of mind?

When I was growing up in an orthodox hindu family, my grand mother used to call “untu” (అంటు) whatever she refused to touch. It is a sign of purity.There could be a scientific reason involving exchange of germs. She never hurt anyone with her belief. If any one touched her, including the family members, she would take a bath and be done with it.

3) అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలెనె మనుజుడు ఉండు, ఇతరులు ఎఱుగక ఉన్న ఈశ్వరుడు ఎఱుగడా ? వి. వే.

అంతరంగమందు అపరాధములు చేసి
మంచివాని వలెనె మనుజుడు ఉండు,
ఇతరులు ఎఱుగక ఉన్న ఈశ్వరుడు
ఎఱుగడా ? వి. వే.

దుర్జనులు తమ మనస్సున ద్రోహి చింత కలిగి , పైకి మంచివారి వలెనె కాన వత్తురు. ఇతరులకు తెలియక ఉన్నను వారి చెడ్డతనము భగవంతునికి తెలియదా ఏమి ?

Evil people by harboring bad thoughts masquerade as good people. Even if other humans might not know their designs, Iswara (God) knows it all, doesn't he?

4) అంతరాత్మ గనక అల్ప బుద్ధుల తోడ మెలగెడు జనులు ఎల్ల మేది నిపయి యముని నరకమునకు నరుగంగ సాక్ష్యము, వి. వే.

అంతరాత్మ గనక అల్ప బుద్ధుల
తోడ మెలగెడు జనులు ఎల్ల మేది
నిపయి యముని నరకమునకు నరుగంగ
సాక్ష్యము, వి. వే.

మనస్సు కనిపెట్టలేక దుర్జనులతో తిరిగెడి జనులకు ప్రాణాపాయము కూడా సంభవించును .

One can lose life by mingling with evil people whose mind cannot be understood.

In the scripture the evil people are variously called raakshas, demons, asuras, etc. In modern day we have rowdies, muscle men, strong men, etc. that perform evil acts on innocent people. Some nations have highly trained military to do the same as evidenced in the case of Nazis. We need to guard freedom. That should not mean to gang up and hurt innocent people.

5) అధికుడు అయిన రాజు ఒక అల్ పుని చేపట్ట వాని మాట చెల్లు వసుధ లోన గణకులు ఒప్పియున్న గవ్వలు చెల్లవా? వి. వే.

అధికుడు అయిన రాజు ఒక అల్ పుని
చేపట్ట వాని మాట చెల్లు
వసుధ లోన గణకులు ఒప్పియున్న
గవ్వలు చెల్లవా? వి. వే

రాజు అభిమానించి దగ్గర చేర్చిన అల్పుని మాటయే చెల్లును. లెక్కించు వారు ఇష్ట పడినచో గవ్వలకును విలువ కలుగును.

The word of a lowly person befriended by a king carries weight. Just as a shop-keeper can sell goods with sea shells instead of money if he so desires.

It is well known that rich people have a way with the wordly matters. The fact that they have become rich in the first place, other than by inheritence, is a testimonial to their selfishness and penchant to accumulate wealth no matter how. It gives them pleasure to be able to flaunt their wealth. A learned man might derive happiness by exhibiting his knowledge but a rich man needs to display his wealth and in the end may not be happy.

జీవముక్తి

1 ) జీవ సంజ్ఞ గలుగు జీవతత్త్వంబును జీవ పరుని గురుని చెంద చేసి తనువు నిలుపువాడు తత్త్వజ్ఞుడు యోగి, వి. వే.

జీవ సంజ్ఞ గలుగు జీవతత్త్వంబును
జీవ పరుని గురుని చెంద
చేసి తనువు నిలుపువాడు తత్త్వజ్ఞుడు
యోగి, వి. వే.

జీవ సంజ్ఞ గల జీవ తత్త్వమే బ్రహ్మము . ఆ తత్త్వమును తెలిసికొనిన వాడే తత్త్వజ్ఞుడు.

Serving humanity is the essence of a human. Such a thing is closer to brahma (బ్రహ్మ – creator). Knowing this makes one a sage.

If you have ever wondered why so many people give so much free advice on the world wide web (WWW) remember this verse by Vemana. All of those kind people who have enriched my life without taking a penny from me deserve my deepest thanks. Tyagaraaja composed ఎందరో మహానుభావులు అందరికీ వందనములు for a reason. Ancient hindus gave away their scripture, yoga, and the rest of the smritis and srutis free of cost to the world. Now the world is paying back to us in the form of WWW and its assorted web sites.

2) జ్ఞానియైనవాని మానక పూజించు మనుజుడు ఎపుడు పరమునను ముదంబు సుఖము న౦దుచుండు సూరులు మెచ్చగ వి. వే.

జ్ఞానియైనవాని మానక పూజించు
మనుజుడు ఎపుడు పరమునను
ముదంబు సుఖము న౦దుచుండు
సూరులు మెచ్చగ వి. వే.

జ్ఞానిని గుర్తించి ఎల్లప్పుడును పూజించు పుణ్యాత్ముడు ఇహమునందును , పరమునందును సమస్త సుఖములను అనుభవించును

A person, by recognizing a knowledgeable person and by serving him, can enjoy comforts in this life and in after life.

A knowledgeable person should know how to lead a productive life. By that I mean anything that enriches the surrounding people and places. In this sense, comforts are nothing but amenities a knowledgeable person has created over a period of time using science, technology and so on. As human race advances knowledge has become the most precious commodity. We will see knowledge embedded in machines soon. In other words, the routine knowledge will be transferred to machines and humans will keep the esoteric knowledge such as Vemana has given us.

3) తత్త్వము తిరమైన తావుల వెదకుచు తాను తత్త్వమగుట దలచి యోగి తలపు లన్ని యుడుగ తత్త్వము తానగు , వి. వే.

తత్త్వము తిరమైన తావుల వెదకుచు
తాను తత్త్వమగుట దలచి
యోగి తలపు లన్ని యుడుగ తత్త్వము
తానగు , వి. వే.

తత్త్వమును స్థిరమైన స్తానములందు వెదుకుచు యోగి తానును తత్త్వము నెరి౦గి కోరికలను అణచివేసికొని ముక్తుడు అగును.

A sage by seeking knowledge about brahman (బ్రహ్మం) and by suppressing desires attains salvation.

A sage is de facto a mumukshu or someone who aspires for moksha.We can all be sages. Mahatma Gandhi is one among us. India has produced thousands of such Gandhis other than his progeny or name sakes. We need to be aware that Gandhi was never inspired by moksha for himself. If anything he wanted everyone to follow him to heaven. And his definition of heaven is a free India. So salvation to each is their own.

4 ) తత్త్వము లోన పరమాత్మ తత్త్వము ఎరి౦గి నిత్య నిర్ముక్త పరిపూర్ణ నిలయ మంది సరి పరబ్రహ్మ మయమని సంచరించు అతడే పో పరశివుడన నగును వేమ!

తత్త్వము లోన పరమాత్మ తత్త్వము ఎరి౦గి
నిత్య నిర్ముక్త పరిపూర్ణ నిలయ
మంది సరి పరబ్రహ్మ మయమని సంచరించు
అతడే పో పరశివుడన నగును వేమ

తత్త్వముల అన్నింటిలోను పర తత్త్వమునే ఎరిగి పూర్ణుడై ఉండుటేగాక బ్రహ్మమును గుర్తించి ప్రపంచమంతయు బ్రహ్మ స్వరూపమే యని తలచు వాడే బ్రహ్మ స్వరూపుడు

By serving others, by seeing brahman (బ్రహ్మం) in every one and by considering all the world as brahma (బ్రహ్మ) , one will attain brahman (బ్రహ్మం).

It is imperative that we see the world as a global village. However, the proponents of global village ephasize on our differences and ask for diversity. It is like Indian government pigeonholing each person with a caste certificate while openly talking about the injustices of caste system. That's what the ancient hindu rishis thought about and came up with aatma. Call it energy or light, it is common within us all. There is no aatma that is not the same amongst all of us. It is that which unites all of us regardless of our religion and customs.

5 ) తత్త్వ మెఱుగు వాడు దైవంబు నెఱుగును సర్వ సారములను జావ చేయు కదళి మ్రింగునట్లె గరళంబు మ్రింగును, వి. వే.

తత్త్వ మెఱుగు వాడు దైవంబు
నెఱుగును సర్వ సారములను జావ
చేయు కదళి మ్రింగునట్లె గరళంబు
మ్రింగును, వి. వే.

తత్త్వవేత్త యగువాడు దైవమును తెలిసికొనును. సమస్త సంసారమును రూపు మాపగలను . అరటి పండును మ్రింగినట్లే గరళమును మ్రింగ గలుగును.

A sage seeking brahma (బ్రహ్మ) can free himself from worldly bonds. He can swallow poison just as he swallows a banana.

Lord Siva was known to have ingested haalahalam (poison from churning milky ocean with meru parvata by the devas and asuras in search of amritam) that didn't bother him. The story goes as if he swallowed it fully all the way to stomach then it could harm him. But if he kept it in his neck region then it won't bother him. We all need to do the same about the evil we hear, see and experience in the world. We should not let it creep into our physical and psychological systems. We should hold them at a superficial level or ignore them.

స్వభావ పద్దతి

1 ) ఆడుదాని బొంకు గోడ పెట్టిన యట్లు పురుష వరుని బొంకు పూరి తడక స్త్రీల నేర్పు మగల జీకాకు పఱచురా , వి. వే.

ఆడుదాని బొంకు గోడ పెట్టిన
యట్లు పురుష వరుని బొంకు పూరి
తడక స్త్రీల నేర్పు మగల
జీకాకు పఱచురా , వి. వే.

ఆడుది అసత్యము ఆడిన గోడ కట్టినట్లు ధృఢముగాను ఉండును. మగవాడు అసత్యము పలికిన తడకవలె అతుకు అతుకులుగా ఉండును. ఆడుదాని నేర్పు మగవారిని చిక్కులు పెట్టును

When a woman lies, it is as impregnable as a fort. Whereas a man's lie is weak as a wall made of wood. A woman's skill puts men in trouble.

Women are many things for many men. A woman complements a man in every respect. Lord Siva and his consort Parvati demonstrated this by the ardha naareeswara. We need to be aware that women can be diabolical if they are not respected and honored by the men. So what is see is what you get.

2) ఆలన గల సౌఖ్యములకు నాలయ మగునేని దాని నాలన వచ్చున్ ఆలాగున గాకుండిన గాలుని పెను దూత అదియు గదరా వేమా!

ఆలన గల సౌఖ్యములకు నాలయ మగునేని
దాని నాలన వచ్చున్
ఆలాగున గాకుండిన గాలుని పెను
దూత అదియు గదరా వేమా

తనకు కష్టముల కలగింపక సుఖములు కూర్చుప్పుడే భార్యను భార్యగా చెప్పవచ్చును. అట్లు కానిచో యమదూతయే యని చెప్ప వచ్చును

A wife is considered as a real wife when she does not cause difficulties and provides comforts to her husband. Or else she can be considered as a death curse.

Traditionally women were relegated to house hold duties. In the modern era women are free to take up professional duties just as men. Indeed some women have completely replaced men in taking care of financial and family needs. There is no telling how much women have changed the world for better.

3) ఆలనగా ఆత్మ సుమీ ఆలనగా నమ్మ సుమ్మి యరయగ మదిలో నా లమ్మ యనగ నెవ్వరో వాలాయము దీని డెలియవలయును వేమా!

ఆలనగా ఆత్మ సుమీ ఆలనగా నమ్మ
సుమ్మి యరయగ మదిలో నా
లమ్మ యనగ నెవ్వరో వాలాయము
దీని డెలియవలయును వేమా

భార్య ఆత్మ వంటిది . తా నామె యందు పుత్ర రూపమున జన్మించుట వలన తల్లి వంటిది కూడ . కావున భార్యను తల్లి వలె చూచి , భార్యను ప్రేమించినట్లే తల్లిని ప్రేమతో చూడవలెను.

Wife is like soul. By conceiving and delivering a baby she is a mother too. Hence one has to respect his wife as mother and honor his mother as he honors his wife.

A woman has to be respected for carrying out the heavy burden of raising a new generation of humans. By the same token, a woman can beget evil men. No one talks about Hitler's mother. But she had to be there somewhere when he was running rampant destroying the world.

4) ఆలి డోలి వెంట అధముడై తా వెంట నేల పోవుటెల్ల నెడ్డె తనము చెట్టు ముదురనిచ్చి చిదిమిన బోవునా? వి. వే.

ఆలి డోలి వెంట అధముడై తా వెంట
నేల పోవుటెల్ల నెడ్డె
తనము చెట్టు ముదురనిచ్చి
చిదిమిన బోవునా? వి. వే

భార్యకు స్వేచ్చనిచ్చి చెడగొట్టి, పిదప దాని మూలముగా చెడిపోవువాడు మూర్ఖుడు . చెట్టు ముదిరిన పిదప చిదుముట కష్టము. మొదటనే జాగ్రత్త పడవలెను .

An idiotic person gives unfettered freedom to his wife and suffers as a consequence. After a seed grows into a big tree it is not possible to cut it with bare hands.


5) ఇంతి చనుల బిరుసు కొంత కాలమెకాని పంతగించి చూడ బాల తిత్తి చెంత విడక ఏ డ్చి చీకడా పుత్రు౦డు ? వి. వే.

ఇంతి చనుల బిరుసు కొంత కాలమెకాని
పంతగించి చూడ బాల
తిత్తి చెంత విడక ఏ డ్చి చీకడా
పుత్రు౦డు ? వి. వే

స్త్రీకి అందము గూర్చు చనుల బిగువు కొంత కాలము మాత్రమే . పిదప అవి పాల తిత్తులే . పసి బిడ్డడు తల్లిని చేరి యేడ్చి ఆ పాల తిత్తులను చీకు చుండును కదా

A woman's youth lasts for only a while after which her bosoms function as milk producers to feed her child.

ప్రపంచ పద్ధతి

1 ) అండములను బుట్టు నలరు ప్రాణులు కొన్ని ఉద్భుదములు బుట్టు పురుగులెల్ల స్వేదములను బుట్టు జీవులు కొన్నిరా, వి. వే.

అండములను బుట్టు నలరు ప్రాణులు
కొన్ని ఉద్భుదములు బుట్టు
పురుగులెల్ల స్వేదములను బుట్టు
జీవులు కొన్నిరా, వి. వే.

కొన్ని ప్రాణులు (పక్షులు) గ్రుడ్లను౦డి పుట్టును. కొన్ని చెమట నుండి పుట్టును. కొన్ని మాంస పిండములనుండి జనించును.

Some life forms such as birds are born from eggs. Some are born from sweat (such as microbes). Others are born from flesh.

2 ) అందె ఇంద్రజాలము ఆయె లోకంబులై మించె నొకటికి ఒకటి వింటి యందు తన్ను తానె చూడదలపుల మఱచెను, వి. వే.

అందె ఇంద్రజాలము ఆయె లోకంబులై
మించె నొకటికి ఒకటి
వింటి యందు తన్ను తానె చూడదలపుల
మఱచెను, వి. వే.

ప్రకృతి యందు లోకములు ఏర్పడెను . గారడి వలె మాయ లోకములను ఆవరి౦చె ను . జీవ రాశిలో ఒక దాని నొకటి మించుట ప్రయత్నించెను . మాయ వలన జీవరాశి జ్ఞానాశక్తిని కోలుపోయెను

World is made of nature. Maya (మాయ) has spread inside the world like a magician's trick. As a result life forms tried to outsmart one another and lost their power to reason.

3) అన్ని జాతులకును ఆధారమైనట్టు లున్న సానగాది మన్నె ఋషుల ఎన్ని జన్మములను ఎక్కడ గానము, వి. వే.

అన్ని జాతులకును ఆధారమైనట్టు
లున్న సానగాది మన్నె
ఋషుల ఎన్ని జన్మములను
ఎక్కడ గానము, వి. వే.

సమస్తమునకును ఆధారమని చెప్పబడు సానగాది ఋషులు ఎచ్ఛటను కానరారు. ఈ కలికాలమున అట్టి మహర్షులు కానరాకున్నారు.

One cannot find the ancient sages who are considered the root of our existence, anywhere. Because in this kali (కలి ) era such sages are not found.

4) అరిషడ్ వర్గ౦ బులచే నరులెల్లను జిక్కి సోక్కి నైజము విడకే ఎఱుగుదురు గాక ఎఱుగక మఱు గైనది బ్రహ్మము యనుచు మహిలో వేమా!

అరిషడ్ వర్గ౦ బులచే నరులెల్లను
జిక్కి సోక్కి నైజము విడకే
ఎఱుగుదురు గాక ఎఱుగక మఱు గైనది
బ్రహ్మము యనుచు మహిలో వేమా

మనుజులు కామాది షట్ వర్గముచే కృశించి స్వభావ సిద్ధమగు మనః చాంచల్యమును విడువక ఉన్నారు. మరుగుపడి ఉన్న బ్రహ్మమును కనుగొన లేక ఉన్నారు.

Men are unable to free their minds from the six evils: desire, anger, ego, evil, selfishness and lust. As a result they are unable to embrace transcendental brahman.

5 ) ఆలివ౦క వారలు ఆత్మ బంధువులైరి తల్లివ౦ కవారు తగిన పాటి తండ్రి వంకవారు దాయాదులు అయిరయా, వి. వే.

ఆలివ౦క వారలు ఆత్మ బంధువులైరి
తల్లివ౦ కవారు తగిన
పాటి తండ్రి వంకవారు దాయాదులు
అయిరయా, వి. వే.

భార్య వంకవారు దగ్గరి బంధువులు, తల్లి వంకవారు సామాన్య బంధువులు, తండ్రి వంకవారు దాయాదులు (విరోధులు)

Wife's relatives are dear to heart. Mother's relatives are less dear. Whereas father's relatives are enemies.

గురు పద్ధతి

1) అంజనంబు కనుల కంటి ౦ చి చూచిన సొమ్ము దొరుకు భూవిని సూత్రముగను గురుని నమ్మి కరుణ గుణంటి చూడరా, వి. వే.

అంజనంబు కనుల కంటి ౦ చి చూచిన
సొమ్ము దొరుకు భూవిని
సూత్రముగను గురుని నమ్మి కరుణ
గుణంటి చూడరా, వి. వే.

అంజనము పెట్టుకొని చూచిన నిధులు కనబడునట్లు గురువును భక్తితో సేవించినచో మోక్షమును పొందగలవు

One can find buried treasures with persistence. Similarly one has to serve a guru consistently to attain salvation.

2) అన్ని దానములను అన్న దానమె గొప్ప కన్నవారికంటె ఘనులు లేరు ఎన్న గురునికన్న ఎక్కువ లేరయా , వి. వే.

అన్ని దానములను అన్న దానమె
గొప్ప కన్నవారికంటె ఘనులు
లేరు ఎన్న గురునికన్న
ఎక్కువ లేరయా , వి. వే.

దానములలో అన్న దానమే గొప్పది. ఉత్తములలో తల్లిదండ్రులే అధికులు. ఆ రీతినే ఉత్తముడగు గురువుక౦టె గొప్పవారు లోకమున లేరు.

Among all donations, the food donation is the most important one. Among all good people, parents are the most important ones. A good guru transcends all the worldly people.

3) ఆత్మ యందె దృష్టి ననువుగా ఒనరించి నిశ్చలముగ దృష్టి నిలిపెనేని అతడు నీవె సుమ్మి అనుమాన మేలరా , వి. వే.

ఆత్మ యందె దృష్టి ననువుగా ఒనరించి
నిశ్చలముగ దృష్టి నిలిపెనేని
అతడు నీవె సుమ్మి
అనుమాన మేలరా , వి. వే.

ఆత్మ యందే మనస్సు ఉంచి చలింపని దృష్టితో చూచినచో కైవల్యమును పొందగలవు. అది గురునివల్లనే సాధ్యమగును.

By concentrating mind on soul, and praying consistently, one can attain salvation. It is only possible with the right guru.

4) ఇతరాపేక్షలు పోనిడి సతతము గురు భక్తి యుక్తి సారము గనకే గతి యగు బ్రహ్మానందము మతికి ఇంపుగ దోపబోదు మహిలో వేమా !

ఇతరాపేక్షలు పోనిడి సతతము గురు
భక్తి యుక్తి సారము గనకే
గతి యగు బ్రహ్మానందము మతికి
ఇంపుగ దోపబోదు మహిలో వేమా

లౌకికములగు కోరికలను విడిచిపెట్టి గురువునెడ భక్తితో మోక్షమును గూర్చిన ఉపదేశములను గ్రహించిన గాని బ్రహ్మానందము లభించదు.

By renouncing worldly desires and receiving pious teachings about salvation from a suitable guru one can attain supreme happiness.

5) ఇఱువది ఆఱవ తత్త్వం బరయగ జీవ ఆత్ము నెలవు నల పరమాత్మ ఇరు వొంద గూర్చు గురు పద మెరయంగా గురువట౦చు నె౦తురు వేమా!

ఇఱువది ఆఱవ తత్త్వం బరయగ జీవ
ఆత్ము నెలవు నల పరమాత్మ ఇరు
వొంద గూర్చు గురు పద మెరయంగా
గురువట౦చు నె౦తురు వేమా

శరీరము పంచవింశతి తత్త్వమయము అయినది. ఇరువది యారవ తత్త్వమగు జీవుని స్థానమున పరమాత్మను పొందునట్లు చేయగలవాడు గురువే!

Physical body is made of 25 regions. The 26th region can be assigned to God by a guru.

బ్రహ్మ పద్ధతి

1) అఖిలాకారుడు అనంతుడు సకల ఆత్మల యందు సర్వ సాక్షియు తానై నిఖిలముల నిర్వికారుడు నికరము బ్రహ్మంబనంగ నిజముర వేమా!

అఖిలాకారుడు అనంతుడు సకల ఆత్మల
యందు సర్వ సాక్షియు తానై
నిఖిలముల నిర్వికారుడు నికరము
బ్రహ్మంబనంగ నిజముర వేమా

సమస్త వస్తు రూపుడు , నాశము లేనివాడు, హృదయ సాక్షి, వికార రహితుడునయి పరమాత్మ తేజరిల్లుచు ఉండును.

God is resplendent by being the embodiment of all objects. He cannot be destroyed. He is the witness to our thoughts. He is immutable.

2) అగ్ర మందుజేరి అగ్రేసు డై యుండు నిగ్రహించి యెఱుక నియతి మీఱి మోహగుణములన్ని ముక్కొని దాటరా! వి. వే.

అగ్ర మందుజేరి అగ్రేసు డై
యుండు నిగ్రహించి యెఱుక
నియతి మీఱి మోహగుణములన్ని
ముక్కొని దాటరా! వి. వే.

బ్రహ్మము అగ్ర భాగమున ఉండుట వలన ఇంద్రియములను జయించి మోహమును విడిచి తన్మయుడవై ఆ బ్రహ్మమును గుర్తు ఎరుగుము.

Because brahma (బ్రహ్మ) stays on our head, we can vanquish the faculties of eyes, ears, skin, tongue, nose. By renouncing desires attain supreme happiness and see brahma (బ్రహ్మ).

3) అచల తత్త్వమనగా అనుభవ గమ్యంబు చూసి చెప్పరాదు సూక్ష్మ మదియె మదికి దోచుగాని మర్మ మెన్నగ రాదు , వి. వే.

అచల తత్త్వమనగా అనుభవ గమ్యంబు
చూసి చెప్పరాదు సూక్ష్మ
మదియె మదికి దోచుగాని మర్మ
మెన్నగ రాదు , వి. వే.

చలింపని తత్త్వమగు బ్రహ్మము అనుభవైక వేద్యమేగాని దానిని వివరించి చెప్పలేము. దీని మర్మమిదియని చెప్పుట ఎవ్వరికేని సాధ్యము కాదు. అది అతి సూక్ష్మము అయినది.

Immovable brahma (బ్రహ్మ) can only be experienced but not accessible to reasoning. No one can describe brahma (బ్రహ్మ) . It is very minute.

4) అచల తపోన్విత యుక్తిని ప్రచురించెడి ఆత్మ కాంతి ప్రతి బింబములో సూచిరిత్ర౦ బగు నిష్కళ రచియింపుము బట్టబయలు రాజులు వేమా!

అచల తపోన్విత యుక్తిని ప్రచురించెడి
ఆత్మ కాంతి ప్రతి బింబములో
సూచిరిత్ర౦ బగు నిష్కళ రచియింపుము
బట్టబయలు రాజులు వేమా

నిశ్చల తపో దృష్టితో కనుగొనిన ఎడల హృదయమున కాంతి పుంజము గోచరించును. అది దృక్ శక్తిని చెదర జేయును. నిబ్బరముగా ఉన్నచో నిర్గుణ స్వరూపము కాన వచ్చును.

One can see a divine light in the heart by performing meditation incessantly. Such divine light destroys harmful thoughts. By trying hard, one can visualize the brahma (బ్రహ్మ) who is without any gunas (గుణములు) (సాత్విక (pious), రాజస (activity), తామస (lethargy)).

5) అచల యోగ తపము నందంగ గమకించి ప్రచురమైన కాంతి బడయుచుండి రుచిరము గను దాట రూపింప పరమాత్మ, వి. వే.

అచల యోగ తపము నందంగ గమకించి
ప్రచురమైన కాంతి బడయుచుండి
రుచిరము గను దాట రూపింప
పరమాత్మ, వి. వే.

నిశ్చల సమాధిని పొంద యత్నించి దివ్య తేజస్సును చూచి మాయకు లొంగక ఉన్నచో నీవే పరమాత్మ అగుదువు.

By performing incessant meditation and visualizing great light, not yielding to maaya (మాయ) one can become supreme soul.

యోగి పద్ధతి


1) అంజనంబు బెట్టి ఆత్మలో ద్రవ్యంబు కనగలేని ఘనత కడగి యెఱగి ఆశ దప్పినప్పు డత డెపో ఘనయోగి! వి. వే.

అంజనంబు బెట్టి ఆత్మలో ద్రవ్యంబు
కనగలేని ఘనత కడగి
యెఱగి ఆశ దప్పినప్పు డత
డెపో ఘనయోగి! వి. వే.

అంజనమున నిధులు కనుగొనినట్లు జ్ఞానము వలన ఆత్మ స్వరూపము నెరిగి , ఆశలకు లొంగనివాడే నిజమైన యోగి.

Just as one can find buried treasures with persistence, one can find the soul with knowledge obtained by meditation. One who does not yield to desires is the true yogi.

2) అంతరంగ హృదయమందగా సాధించి చింతలు ఊడబెఱికి చిక్కు పడక వింత జూచి మెలగ విజ్ఞానమందురా! వి. వే.

అంతరంగ హృదయమందగా సాధించి
చింతలు ఊడబెఱికి చిక్కు
పడక వింత జూచి మెలగ విజ్ఞానమందురా!
వి. వే.

మనస్సును చెడ్డ పనుల మీదికి పోనీక లోబరుచుకొని విచారముల నడచి ఆత్మ జ్ఞానము నార్జింపవలెను

By turning away mind from evil acts and sorrow, one has to earn the knowledge about soul.

3) అంతరిక్షమందు నమరిన లింగం బు చింత బూనవలెను జెనకి ఆత్మ వింతలోన వింత వెన్నంటి చూడరా! వి. వే.

అంతరిక్షమందు నమరిన లింగం
బు చింత బూనవలెను జెనకి
ఆత్మ వింతలోన వింత వెన్నంటి
చూడరా! వి. వే.

చిదాకాశమందలి ఈశ్వర బింబమును ధ్యానించుచు నిష్కా ముడై మెలగి మోక్షము పొందవలెను .

By meditating on Iswara(God) who is omnipresent and renouncing desires, one has to attain salvation.

4) అయిదు చక్రములను నాది ని బడవైచి అయిదు చక్రములకు నవల దెలియ అయిదు చక్రములను నడగి బయల్ తోచు, వి. వే.

అయిదు చక్రములను నాది ని
బడవైచి అయిదు చక్రములకు నవల
దెలియ అయిదు చక్రములను
నడగి బయల్ తోచు, వి. వే.

అన్నామయాది పంచకోశములను లెక్కింపక స్వాధిష్ఠానాది పంచ చక్రములను తెలిసికొని, పంచభూతములందును శరీరామ్శలను కలిపినచో జ్ఞానమయ చిదాకాశము గోచరించును .

One has to meld the five kosas (కోశాలు) (అన్న (anna or food), ప్రాణ (praana or breath), మనోమయ (manomaya or mind), విజ్ఞాన (vignana or superior gnaana) , ఆనంద (aananda or happiness) ), five chakras (చక్రములు) (మూలాధార moolaadhara, స్వాధీష్టాన swadishtaan, మణిపూర manipoora, అనాహత anaahita, విశుద్ధ visudha, aagnya), five bhootas (earth, water, air, sky, fire) with body to attain the space made of pure knowledge.

5) అరసి కట్టి వేసి ఆధార చక్రంబు ప్రాణ వాయువ o దె పదిల పఱచి ఎడతెగక ఉండు నిలయోగ్యుడగు యోగి, వి. వే.

అరసి కట్టి వేసి ఆధార చక్రంబు
ప్రాణ వాయువ o దె పదిల
పఱచి ఎడతెగక ఉండు నిలయోగ్యుడగు
యోగి, వి. వే.

హృదయమున శివుని నెలకొల్పి, ఆధార చక్రమును గుర్తించి దాన ప్రాణవాయువును నిలిపి ఎడతెగక యోగము నవలంబించువాడే యోగ్యుడైన యోగి.

By fixing Siva in the mind, identifying aadhaara chakras, by controlling breath (praana (ప్రాణ), apaana (అపాన), vyaana (వ్యాన) , udaana (ఉదాన), samaana (సమాన)) when one continuously meditates, he is the true yogi.

మోహ పద్ధతి

1) అంగమెల్ల సడలి యటు దంతములు నూడి తనువు ముదిమిచేత దఱచు వడక ముప్పు త్రిప్పుల బడి మోహంబు విడువడు , వి. వే.

అంగమెల్ల సడలి యటు దంతములు
నూడి తనువు ముదిమిచేత దఱచు
వడక ముప్పు త్రిప్పుల బడి
మోహంబు విడువడు , వి. వే.

శరీరము సడలిపోయి , దంతములు ఊడిపోయి , ముసలి తనముచే శరీరము వణకుచు , ఎన్నో బాధలు పడుచున్నను మానవుడు స్త్రీలపై మోహమును మాత్రము విడువడు.

Even if body becomes decrepit, the teeth are lost, body quivers from old age, one does not renounce lust for women

2) అగ్నిగుండమందు నరయంగ ఘటియించి యవని నీరు బియ్య మందు నునిచి అది పచనముగాగ హరునికి అర్పింపుము , వి. వే.

అగ్నిగుండమందు నరయంగ ఘటియించి
యవని నీరు బియ్య మందు
నునిచి అది పచనముగాగ హరునికి
అర్పింపుము , వి. వే.

ఈశ్వరునియందే మనస్సు నిల్పి , మోహము విడిచి ప్రొ య్యి రాజవేసి , అన్నము వండి శివార్పణము కావింపుము.

By fixing mind on Iswara (God), renouncing desire, fire up the stove and prepare a meal to offer to Siva (God)

3) అగ్ని శిఖలయందు నమరంగ మమకార మభువుమీద ధ్యానము అమరనునిచి ఆహుతియగు వెన్క హరునకు అర్పింపుము, వి. వే.

అగ్ని శిఖలయందు నమరంగ మమకార
మభువుమీద ధ్యానము అమరనునిచి
ఆహుతియగు వెన్క హరునకు
అర్పింపుము, వి. వే

మనస్సునందు ఈశ్వరుని నిలిపి మామకారమును వైరాగ్య అగ్ని యందు ఆహుతి చేయవలెను . మోక్షమునపుడు పొంద వచ్చును.

By fixing Iswara(God) in mind, renouncing bonds into a fire made of equanimity, one can attain salvation.

4) అజ్ఞానమనెడి అడవిని సు జ్ఞానపు ఖడ్గమునను జూచి నరుకురా అజ్ఞాన మాత్మ దెలుపుట సుజ్ఞానపు దివ్య పదము చూడర వేమా!

అజ్ఞానమనెడి అడవిని సు జ్ఞానపు
ఖడ్గమునను జూచి నరుకురా
అజ్ఞాన మాత్మ దెలుపుట సుజ్ఞానపు
దివ్య పదము చూడర వేమా

సుజ్ఞాన స్థానమును చూచుటకు అడ్డముగ నున్న అజ్ఞాన వనమును సుజ్ఞాన ఖడ్గముచే నరకవలెను . ఆత్మ జ్ఞానము కలుగ గలదు .

To see the seat of pious knowledge, one has to destroy ignorance with the sword of pious knowledge. It is possible to attain knowledge about soul this way.

5) అంతరంగమందు ననువుగా సో ధించి తలప దలప ముక్తి తనకు కలుగు బాహ్య రంగమందు భాషింప దెలియునా ? వి. వే.

అంతరంగమందు ననువుగా సో ధించి
తలప దలప ముక్తి తనకు
కలుగు బాహ్య రంగమందు భాషింప
దెలియునా ? వి. వే.

భగవంతుని మనస్సులో నిల్పి నిరంతరము ధ్యానించు చుండిన ముక్తి కలుగును. బయటి మాటలవల్ల ప్రయోజనము లేదు .

By fixing mind on God and constantly praying God, one attains salvation. There is no use talking about it.

ధైర్య పద్ధతి

1) అచ్చు పడగ మనసు మచ్చిక జేపట్టి ముచ్చటించు శివుని మూర్తి చూచి కుచ్చితంబు మాని చొచ్చుట యోగo బు, వి. వే.

అచ్చు పడగ మనసు మచ్చిక జేపట్టి
ముచ్చటించు శివుని మూర్తి
చూచి కుచ్చితంబు మాని
చొచ్చుట యోగo బు, వి. వే

ధైర్యముతో మనస్సును నిలిపి కల్మషము విడిచి భగవంతుని చూచుటయే యోగము.

By fixing mind with courage, renouncing impure thoughts, visualizing God one attains the true yoga.

2) అవని ధైర్యమని అతిశయ కాముడై నిన్ను నమ్మి నిష్ఠ నెగడుచుండి నిన్ను గొల్వ ముక్తి నిశ్చయముగ కలుగు , వి. వే.

అవని ధైర్యమని అతిశయ కాముడై
నిన్ను నమ్మి నిష్ఠ నెగడుచుండి
నిన్ను గొల్వ ముక్తి
నిశ్చయముగ కలుగు , వి. వే

తన ఘనతను కోరి భగవంతుని నమ్మి, ధైర్యము వహించి అతనిని సేవించినచో ముక్తి కలుగును.

By desiring glory, believing in God, holding courage, serving God, one can attain salvation.

3) అంతరంగమందు నభువును ఉద్దేశించి తలప దలప ముక్తి తనకు కలుగు , బాహ్య రంగమందు భయమంద ఫలము ఏమి? వి. వే.

అంతరంగమందు నభువును ఉద్దేశించి
తలప దలప ముక్తి తనకు
కలుగు , బాహ్య రంగమందు
భయమంద ఫలము ఏమి? వి. వే.

మనస్సులో భగవంతుని నిలిపి , ధైర్యముతో మననము చేయగా ముక్తి లభించును. బాహ్యములను చూచి భయపడవద్దు .

By fixing God in mind, meditating with courage one can attain salvation. Don't be afraid of external things.

4) అదరి పడక మనసును ఆనందమును కోరి మదిని మెలగువాడు మాన్యుడు అరయ సదమలత్వమునను శాశ్వత ఈశ్వరుడగు , వి. వే.

అదరి పడక మనసును ఆనందమును కోరి
మదిని మెలగువాడు మాన్యుడు
అరయ సదమలత్వమునను శాశ్వత
ఈశ్వరుడగు , వి. వే.

ధ్యాన సమయమున స్తిరుడయి నిర్మలుడు అయి, బ్రహ్మానందము కోరువాడే మాన్యుడు . అతడు ఈశ్వర భావము పొందగలడు .

At the time of meditation by being fixated and pious and by seeking supreme happiness, one becomes suitable to receive Iswara's blessings.

5) అందరాని పండదడవి వెన్నెల బైట నుండు జూడ బెద్ద పండుగాను పండు పడిన జెట్టు బట్టగలేరాయా! వి. వే.

అందరాని పండదడవి వెన్నెల
బైట నుండు జూడ బెద్ద పండుగాను
పండు పడిన జెట్టు
బట్టగలేరాయా! వి. వే.

మోక్ష ఫలము అందరానిది. దానిని పొందుటకు అడవిలో జ్ఞానమను వెన్నెలతో చూడ వచ్చును. ఆ ఫలము గల వృక్షమును పట్టుకొనుట చాల కష్టము.

The fruits of salvation are unreachable. One can see with knowledge like moon light in a forest. However it is hard to grasp a tree bearing fruits.

కర్మ పద్ధతి

1) అడవి తిరుగ చిక్కదు ఆకాశమున లేదు , అవని తీర్థ యాత్రలందు లేదు . వొడలు శుద్ధి చేసి యొడయని చూడరా ! వి. వే.

అడవి తిరుగ చిక్కదు ఆకాశమున
లేదు , అవని తీర్థ యాత్రలందు
లేదు . వొడలు శుద్ధి చేసి
యొడయని చూడరా ! వి. వే

శరీర శోధన చేసుకొని సమాధి మగ్నుడవై పరమాత్మను చూడుము . అడవులు తిరిగి ఆకాశమున కెగిరి , తీర్థ యాత్రలకు పోయినను ప్రయోజనము లేదు .

By exploring body, meditating deeply, see the God. You cannot see God by flying in the sky and touring religious places.

2) అతిథి రాక చూచి య దలించి పడ వైచి కపట చిత్తులు అగుచు గానలేరు కర్మ బద్ధు లగుచు ధర్మంబు సేయరు , వి. వే.

అతిథి రాక చూచి య దలించి
పడ వైచి కపట చిత్తులు అగుచు
గానలేరు కర్మ బద్ధు లగుచు
ధర్మంబు సేయరు , వి. వే.

మనమందు పాప కర్మానుభవము పొందు కప టులు ధర్మ బుద్ధి లేక అతిథులు రాగా తరిమి కొట్టుదురు .

By harboring sinful karma in mind, the decrepit people drive away guests without any compunction.

3) అరయు కర్మమునను నా హరి శ్చo ద్రుడు ఆలి బిడ్డ నమ్మి యతడు కూడ మాలవానికి అపుడు మఱి లోకువై యుండె , వి. వే.

అరయు కర్మమునను నా హరి శ్చo
ద్రుడు ఆలి బిడ్డ నమ్మి యతడు
కూడ మాలవానికి అపుడు మఱి
లోకువై యుండె , వి. వే.

ఎట్టి గొప్పవానికిని కర్మ అనుభవము తప్పదు. చక్రవర్తి యగు హరి శ్చ o ద్రుడు భార్య బిడ్డలను అమ్మి, ఒక నీచ జాతి వానికి దాసుడు కావలసి వచ్చెను .

No matter how great one is, there is no reprieve from karma. The emperor Harischandra sold his wife and children. He also had to serve as a servant of a low class person.

4) అరయ నాస్తి యనక అడ్డు మాటాడక తట్టుపడక మదిని తన్నుకొనక తనది గాదనుకొని తాబెట్టునది పెట్టు, వి. వే.

అరయ నాస్తి యనక అడ్డు మాటాడక
తట్టుపడక మదిని తన్నుకొనక
తనది గాదనుకొని తాబెట్టునది
పెట్టు, వి. వే.

అతిథి రాగా లేదనక, అడ్డు చెప్పక, అది తనది కాదని, ఇతరులకు పెట్టినదే పెట్టు .

Real charity is serving whole heartedly a guest who arrives at door step

5) అలను బుడగ పుట్టినప్పుడే క్షయ మవును , కలను గాంచు లక్ష్మి కనుట లేదు , ఇలను భోగభాగ్య మీ తీరె కానరు , వి. వే.

అలను బుడగ పుట్టినప్పుడే క్షయ
మవును , కలను గాంచు లక్ష్మి
కనుట లేదు , ఇలను భోగభాగ్య
మీ తీరె కానరు , వి. వే.

నీటిలో బుడగ పుట్టిన వెంటనే నశించును . కలలో కనపడిన సంపదను పొందలేము . అదే విధముగా ఈ ప్రపంచము లోని భోగ భాగ్యమైన ప్రతి వస్తువు ఆశాశ్వతమైనది

A bubble in water is destroyed. One cannot receive anything in return from a dream. Thus, all desirable objects in this world are not permanent.

దేవ పద్ధతి


1) అండమందు నుండు అఖిలమవు జనులార ! ఎందు లేక యుండు నెఱుగుడు అతడే , అతని పూజ ఫలము అందేనా శివ యోగి, వి. వే.

అండమందు నుండు అఖిలమవు జనులార!
ఎందు లేక యుండు నెఱుగుడు
అతడే , అతని పూజ ఫలము అందేనా
శివ యోగి, వి. వే.

ఓ జనులారా! అన్ని యెడల నుండు వాడొక్క దైవమే ! అతనిని మనసారా పూజించి , ముక్తిని పొంది యోగులు కండు .

People! God is omnipresent. Pray to him whole heartedly and attain salvation.

2) అందు నిందు నుండు అఖలు o డు చూడగా ఎందు తానె యుండి యె ఱు గుచు ఉండు, అతని పూజ ఫలము అ o దగ వలె నయా ! వి. వే.

అందు నిందు నుండు అఖలు o డు
చూడగా ఎందు తానె యుండి యె ఱు
గుచు ఉండు, అతని పూజ ఫలము
అ o దగ వలె నయా ! వి. వే.

అంతటను వ్యాపించి ఉన్న దేవుడు సమస్తము ఎరుగును. అతనిని మనసారా పూజించి ముక్తిని పొందుడు.

The omnipresent God knows every thing. By praying him wholeheartedly attain salvation

3) అల్ పుడు అయిన నేమి ? అధికుడు అయిన నేమి? చెప్పవలయు రీతి చెప్పినాడ , హరుని ఎఱుకలేక యాకులు అల్లాడునా ? వి. వే.

అల్ పుడు అయిన నేమి ? అధికుడు
అయిన నేమి? చెప్పవలయు రీతి
చెప్పినాడ , హరుని ఎఱుకలేక
యాకులు అల్లాడునా ? వి. వే.

నేను సరి అయిన మాట చెప్పుచున్నాను. వినుడు. కొద్ది వానికి , గొప్ప వానికి - అందరికిని దైవ బలమే బలము , శివుని ఆజ్ఞ లేనిదే ఆకు అయినను కదలదు .

Listen to my good word. Both a low or a high status person needs the grace of God. A leaf won't quiver without Siva's (god 's) will.

4) ఆకు మీది వ్రాత అందఱికి తెలియు. చేతి లోని వ్రాత చెప్పవచ్చు . తోలు క్రింది వ్రాత దొడ్డవాడు ఎఱుగునా ? వి. వే.

ఆకు మీది వ్రాత అందఱికి తెలియు.
చేతి లోని వ్రాత చెప్పవచ్చు.
తోలు క్రింది వ్రాత దొడ్డవాడు
ఎఱుగునా ? వి. వే.

పత్రముపై వ్రాత సులభముగా తెలియును. హస్త రేఖలను బట్టి తెలిసికోవచ్చును . కాని బ్రహ్మ వ్రాతను ఎట్టి వాడును కనిపెట్టలేడు .

One can read the leaves. One can read the lines on the palm. But one cannot know the will of Brahma.

5) ఆకులందు జదివి యందగ రానిది ఏక మమర యుక్తి నెఱుగ వలయు . దాకి పూర్తిగాను తన్మయము ఒందుడీ , వి. వే.

ఆకులందు జదివి యందగ రానిది
ఏక మమర యుక్తి నెఱుగ
వలయు . దాకి పూర్తిగాను తన్మయము
ఒందుడీ , వి. వే.

పుస్తకములు చదివి తత్త్వమును తెలిసికొనలేము . ఐక్యమును బోధించి యుక్తి నెరిగిననే తన్మయత్వము కలుగును .

We cannot attain truth by reading books. By teaching the technique of merging with God one can attain supreme bliss.

సజ్జన పద్ధతి

1) అచట నిచట జూడ అమరగా గురు భక్తి ప్రచురముగను ఆత్మ బయలు చేయు రుచిరముగను సుజనుడు అచలుడై కనపడు, వి. వే.

అచట నిచట జూడ అమరగా గురు భక్తి
ప్రచురముగను ఆత్మ బయలు
చేయు రుచిరముగను సుజనుడు
అచలుడై కనపడు, వి. వే.

సుజనుడు ఇటునటు చూడక నిశ్చలముగ గురువును సేవించును. నిర్మలుడై తన అభిప్రాయము స్పష్టము చేయును. ఎప్పుడును అతని మనస్సు చలించదు .

A pious person serves guru with dedication and concentration. His mind never wavers.

2) అంటి యంటకుండ నమలుని తెఱగున మి o టి మ o టి నడుమ మెలగు దాని, వంటి స్థంబమందు జంటి o చి చూచును, వి. వే.

అంటి యంటకుండ నమలుని తెఱగున
మి o టి మ o టి నడుమ మెలగు
దాని, వంటి స్థంబమందు జంటి
o చి చూచును, వి. వే.

తత్త్వవేత్త యగు సజ్జనుడు పరమాత్మ వలె అ౦టీ అంటక యుండును. భూమ్యాకాశముల నడుమ వెలుగు తత్త్వమును తన ఏకాగ్ర దృష్టితో చూచి తెలిసికొనును .

A truthful pious person remains unattached like God. Learn by observing the true light between the earth and the sky.

3) అండ తప్పిన నరుడు అతి ధార్మికుని ఇల్లు , చేరవలయు బ్రతుక చేయు అతడు ఆ విభీషణునకు అతి గౌరవo బీడె భూతలమున రామ మూర్తి వేమ!

అండ తప్పిన నరుడు అతి ధార్మికుని
ఇల్లు , చేరవలయు బ్రతుక చేయు
అతడు ఆ విభీషణునకు అతి గౌరవo
బీడె భూతలమున రామ మూర్తి వేమ

వేరే సహాయము లేనప్పుడు ధర్మాత్ముని ఇల్లు చేరవలెను. అతడు కాపాడును. శ్రీ రాముడు విభీషణుని రక్షింపలేదా?

When helpless, seek the help of a kind person. Didn't Lord Sri Rama rescue Vibhishana?

4) అడుగడుగున చిత్రము అఖిల వస్తువులను భోగ భాగ్యములను బోలుపు మిగుల దానె తిరుగు చుండు తన తోడునీడా అయి, వి. వే.

అడుగడుగున చిత్రము అఖిల వస్తువులను
భోగ భాగ్యములను బోలుపు
మిగుల దానె తిరుగు చుండు
తన తోడునీడా అయి, వి. వే.

సజ్జనులకు సమస్త వస్తువులు , భోగ భాగ్యములు, నీడవలె వాని యంత ఆవియే వెంబడించి వచ్చును.

For good people all good things follow like shadow all by themselves

5) అంతరంగ మెఱుగ హరుడవును గురుడవును , అంతరంగ మెఱుగ ఆర్యుడగును, అంతరంగ మెఱిగి నతడెపో శివ యోగి , వి. వే.

అంతరంగ మెఱుగ హరుడవును గురుడవును,
అంతరంగ మెఱుగ ఆర్యుడగును,
అంతరంగ మెఱిగి నతడెపో
శివ యోగి , వి. వే.

ఇతరుల మనస్సు నెరుగుట కష్టము. దాని నెరిగిన వాడే సజ్జనుడు. అతడే భగవత్ సమానుడగు యోగియు అగును.

It is hard to guess other people's minds. The one who knows it becomes a yogi equivalent to God.

విద్వత్ పద్ధతి

1) అంది యందనట్టి యచల స్వరూపంబు పొందుపడగ బూని పొదలువాడు , చెంది మిన్నకుండ చిన్మయాకారుండు , వి. వే.

అంది యందనట్టి యచల స్వరూపంబు
పొందుపడగ బూని పొదలువాడు,
చెంది మిన్నకుండ చిన్మయాకారుండు
, వి. వే

పర తత్వము తెలిసినట్లు ఉండునేకాని తెలియుట కష్టము . అట్టి దానిని పొందినవాడే విద్వాంసుడు . అతడు తానే చిన్మయ స్వరూపుడ నని ఎరిగియు గర్ వింపక తెలియని వాని వలె ఊరకయే ఉండును .

The truth about God seems reachable but it is difficult. The one who attains it is the true pundit. He remains humble and ego-less and stays equanimous.

2) అన్నమునకు అంటదు అయిన ఆత్మకు అంటు ఆత్మను పేనగొన్న అన్నము అంటు ఆత్మ శుద్ధియున్నను అన్నశుద్ధియును ఆత్మ , వి. వే.

అన్నమునకు అంటదు అయిన ఆత్మకు
అంటు ఆత్మను పేనగొన్న అన్నము
అంటు ఆత్మ శుద్ధియున్నను అన్నశుద్ధియును
ఆత్మ , వి. వే.

విద్వాంసుల జ్ఞానము గొప్పది . అది అన్నమునకు అంటుకొని అంటుకాదు . ఆత్మకు అంటుకొనును . ఆత్మను అన్నము అంటుకొనును . ఆత్మ శుద్ధి అభిన్నములు. అనగా - జ్ఞానము అఖండమై ఆనందరూపము అయి మాయతో చేరక ప్రకాశించును .

The knowledge of pundits is great. It sticks to food but not considered as a weakness. It sticks to soul. Even food sticks to soul. Soul and purity are two different things. The whole point is, knowledge becomes supreme and by not associating with maya it turns resplendent.

3) అరయ మూలమందు అర్ధంబునందును నిర్మల ఆత్మ యందు నియతి యందు బయలునందు శ్రుతులు భావంబు నొక్కట వెలయు శివుని చూచి వేడ్క వేమ!

అరయ మూలమందు అర్ధంబునందును నిర్మల
ఆత్మ యందు నియతి యందు బయలునందు
శ్రుతులు భావంబు నొక్కట
వెలయు శివుని చూచి వేడ్క వేమ

జ్ఞానము బ్రహ్మము వలెనే సర్వ వ్యాపి అయి సర్వ సమతను చెందును. అది మూలము, వస్తువు, ఆత్మ, నియతి, ఆకాశము, ఉపనిషత్తులు - ఈ అన్నింటి యందును ఒక్కటిగానే ఉన్నది .

Knowledge becomes omnipresent like Brahma (బ్రహ్మ). It shines as the root of all objects, all souls, sky and vedas.

4) అష్ట తనువులకును నాది మమము అయినట్టి ఆది శక్తి కూడి యాభవుడు యగును , భయము లేక ఉండు బ్రహ్మగ్నుడగు యోగి, వి. వే.

అష్ట తనువులకును నాది మమము అయినట్టి
ఆది శక్తి కూడి యాభవుడు
యగును , భయము లేక ఉండు బ్రహ్మగ్నుడగు
యోగి, వి. వే

పృధివి మున్నగు ఎనిమిది తనువులు కలిగి జన్మ రహితుడగు పురుషుడు ప్రకృతి యగు ఆదిశక్తితో కూడి యుండును. బ్రహ్మజ్ఞఉడు, విద్వాంసుడు యగు యోగి దీనిని తెలిసి నిర్భయుడు అయి ఉండును.

Deathless purusha (పురుష) stays with his consort-- nature and the primal power. The yogi with knowledge about Brahma and a pundit know this and remain fearless.

5) ఆత్మ తన లోన గమనించి యనుదినంబు నిర్గుణాత్మను అర్చనము చేసి నిత్యము అమర ప్రత్యగాత్మను లోనెంచి ప్రబల యోగి సత్ చిదానంద పదము యందు సతము వేమ!

ఆత్మ తన లోన గమనించి యనుదినంబు నిర్
గుణాత్మను అర్చనము చేసి నిత్యము అమర
ప్రత్యగాత్మను లోనెంచి ప్రబల యోగి
సత్ చిదానంద పదము యందు సతము వేమ

విద్వాంసుడు ఆత్మను తనలోనే పరికించి , ప్రతి దినము తాను చేయు కార్యములను ఆత్మ అర్పణ చేయును. ప్రత్యాగాత్మను మనసులో పాదుకొల్పి యోగి అయి చిదానందమును పొందును.

A pundit sees soul in himself and dedicates all of his actions to supreme soul. The soul that craves for others is turned inward in such a person. And he remains with supreme bliss.

అర్థ పద్ధతి

1) అధముడు అయిన మనుజుడు అర్ధవంతుడు అయిన అతని మాట నడచును అవనిలోన , గణపతి ఇంటన ఉన్న గవ్వలు చెల్లవా? వి. వే.

అధముడు అయిన మనుజుడు అర్ధవంతుడు
అయిన అతని మాట నడచును
అవనిలోన , గణపతి ఇంటన ఉన్న
గవ్వలు చెల్లవా? వి. వే.

గణపతుల ఇంటిలోన గవ్వ కూడా విలువు అయినదే ! ధనవంతుని మాటయే చెల్లును - అతడు అధముడు అయిననూ సరే!

In rich man's house a sea shell is also valuable. The word of the rich man is carried out no matter how idiotic it is.

2) అప్పు లేనివాడె అధిక సంపన్నుడు , తప్పు లేనివారు ధరణి లేరు, గొప్ప లేని బుద్ధి కొంచెమై పోవురా! వి. వే.

అప్పు లేనివాడె అధిక సంపన్నుడు,
తప్పు లేనివారు ధరణి
లేరు, గొప్ప లేని బుద్ధి
కొంచెమై పోవురా! వి. వే.

అప్పు చేయుటే గొప్ప తప్పు. అది లేనివాడు గొప్ప సంపన్నుడు. కానీ అట్టివాడు కానరాడు. ఆ తప్పు చేయక గౌరవము లేక ఉండుటచే జనులు చులకన యగుదురు .

The big mistake is taking a loan. The one without any loans is the true rich man. But it is hard to find such people. Men with loans are viewed as less than honorable and considered as trivial.

3) అరయ దఱుచు కల్లలు ఆడెడి వారి ఇంట వెడల కేల లక్ష్మి విశ్రమించు ? నీరమోటుకుండ నిలువని చందాన, వి. వే.

అరయ దఱుచు కల్లలు ఆడెడి వారి
ఇంట వెడల కేల లక్ష్మి విశ్రమించు?
నీరమోటుకుండ
నిలువని చందాన, వి. వే.

చిల్లి కుండలో నీరు నిలువని రీతిని, తరచుగా అబద్ధము లాడువారి యింట సంపద నిలిచి ఉండదు .

Water in a pot with a hole does not stay for ever. And so do riches of liars.

4) అర్ఢవంతు సొమ్మను ఆశిo తురు ఆర్దిలయి , ఆర్ధికి ఈయ సొమ్ము వ్యర్ధము అగును వ్యర్ధము అయిన సొమ్ము వ్యర్ దుల చేరురా! వి. వే.

అర్ఢవంతు సొమ్మను ఆశిo తురు ఆర్దిలయి,
ఆర్ధికి ఈయ సొమ్ము వ్యర్ధము
అగును వ్యర్ధము అయిన సొమ్ము
వ్యర్ దుల చేరురా! వి. వే.

ధనము ఉన్న వానిని అందరూ యాచింతురు. యాచకులకు ఇచ్చిన ధనము వ్యర్ధము . ఊరక వచ్చిన ఆ సొమ్ము నిరుపయోగ కార్యములకే ఉపయోగింప బడుచున్నది .

People beg rich men. The money offered to such beggars is a waste when such money offered to people is used to perform useless work.

5) ఆడువారి గన్న అర్ధంబు బొడగొన్న సారమైన రుచుల చవులగన్న , అయ్యవారికి అయిన ఆశలు కలుగురా, వి. వే.

ఆడువారి గన్న అర్ధంబు బొడగొన్న
సారమైన రుచుల చవులగన్న,
అయ్యవారికి అయిన
ఆశలు కలుగురా, వి. వే.

స్త్రీలను చూచినను, ధనమును చూచినను, రుచి గల వస్తువులను చూచినను ఎంతటి వారికైనను ఆశ కలుగక మానదు .

When they see women, wealth, tasty food, all men develop a desire.

దా ౦భిక పద్ధతి

1) అచ్చువేసికొన్న అడియేని యన్నను తమ్మదిన్నగాని దాసుడనన భార్యావశతగాని బ్రతుకులు లేవయా! వి. వే.

అచ్చువేసికొన్న అడియేని
యన్నను తమ్మదిన్నగాని దాసుడనన
భార్యావశతగాని బ్రతుకులు
లేవయా! వి. వే.

భుజాములపై బడాయికి ముద్రలు వేసికొన్నాను, “ఆడియేన్ " అన్నను, ఎంగిలి తిన్నను, దాసుడనని వంకదండములు పెట్టినను దాంభికునకు భార్య మూలమూగనే బ్రతుకు కానవచ్చుచున్నది

A pompous person can flaunt his mannerisms. But his life is dependent on his wife.

2) అందు నిందు వెదకి అనుభవముండక కొందఱయ్యలెపుడు కొంగవలెను మూర్ఖతముబూని మురియుట చూడవా!వి. వే.

అందు నిందు వెదకి అనుభవముండక
కొందఱయ్యలెపుడు కొంగవలెను
మూర్ఖతముబూని
మురియుట చూడవా!వి. వే.

కొందరు దాంభికులు అనుభవము లేక, అక్కడ ఇక్కడ తిరిగి జపము చేయుచున్నట్లుండు కొంగవలె నటన జేయుచు,సంతోషించుచు ఉందురు

Some pompous people lacking experience roam around hither and tither meditating and acting like a crane that keeps its head within its feathers. They are always happy.

3) అధికమైన యజ్ఞ మల్పుడుతాజేసి మొనసి శాస్త్రములని మురువు దక్కు దొబ్బనేర్చు కుక్కదుత్తులు మోచునా?వి. వే.

అధికమైన యజ్ఞ మల్పుడుతాజేసి
మొనసి శాస్త్రములని మురువు
దక్కు దొబ్బనేర్చు కుక్కదుత్తులు
మోచునా?వి. వే.

అల్పుడు బడాయికి యాగము చేసి పశువును చంపును. అది శాస్త్ర సమ్మతమునును . వానికి హింస చేసిన పాప ఫలము లేకుండునా ? కుక్క కుండలోని అన్నము తినగలదు కానీ, ఆ కుండను మోయగలదా ?

An idiot can offer as a sacrifice a cow in a yagna (యజ్ఞము). It is acceptable to scripture. But isn't he sinning and eligible to receive retribution? A dog can eat from a pot, but can it carry the pot?

4) అరయు దోచుకొనుచు గురువని తన్నెంచె తిరుగువాడు తన్ను నరయలేడు పనికిమాలినట్టి బానిసకొడుకురా! వి. వే.

అరయు దోచుకొనుచు గురువని
తన్నెంచె తిరుగువాడు తన్ను
నరయలేడు పనికిమాలినట్టి
బానిసకొడుకురా! వి. వే.

ఇతరులు తన్ను గురువని గౌరవించగా దాంభికుడు వారిని దోచుకోనునేగాని తానెట్టివాడో గ్రహింపడు. అట్టివాడు పనికిమాలిన తొత్తుకొడుకు.

If others consider a pompous person as a guru, he still tries to rob them. He does not realize who he is. He is useless.

5) ఆఱతు లింగముండ నడియెఱుగగలేక పర్వతంబుబోవు బానిసీడు ముక్తిగానానగునె ! మూఢాత్మడగుగాని , వి. వే.

ఆఱతు లింగముండ నడియెఱుగగలేక
పర్వతంబుబోవు బానిసీడు
ముక్తిగానానగునె ! మూఢాత్మడగుగాని,
వి. వే.

మెడలో లింగము (శివుడు) ఉండగా, దానిని తెలిసికొనలేక దేవునకై శ్రీశైలమునకు పోవువాడు మూర్ఖుడు . కొండ ఎక్కిన మాత్రాన ముక్తి కలుగునా ?

Wearing Siva's image in his neck, a person goes to religious places seeking God. Such a person is an idiot. Can one attain salvation by climbing a mountain?

మూర్ఖ పద్ధతి

1) అడవి యడవి తిరిగి యాసను విడలేక, గాసిపడెడు వాడు ఘనుడు కాడు రోసి రోసి మదిని ఝూడిగా నిల్పిన, వాడె పరముగన్నవాడు వేమ!

అడవి యడవి తిరిగి యాసను విడలేక,
గాసిపడెడు వాడు ఘనుడు కాడు
రోసి రోసి మదిని ఝూడిగా నిల్పిన,
వాడె పరముగన్నవాడు వేమ

ఆశను విడువలేక ఎన్ని ఆడవులు తిరిగి తపస్సు చేసినను గొప్పవాడు కాలేడు. మనస్సును నిశ్చలముగా ఉంచుకొన్నవాడే ముక్తిని పొందును

Without renouncing desires no matter how many forests one roams around meditating one is not great. One who makes his mind unmoving can attain salvation.

2) అదిమి మనసు నిలిపి యానంద కేళిలో, బ్రహ్మమయుడు ముక్తి బడయుగోరు జిహ్వరుచుల చేత జీవుడు చెడునయా, విశ్వదాభిరామ వినురవేమ

అదిమి మనసు నిలిపి యానంద కేళిలో,
బ్రహ్మమయుడు ముక్తి బడయుగోరు
జిహ్వరుచుల చేత జీవుడు చెడునయా,
విశ్వదాభిరామ వినురవేమ

సమస్తము నిచ్చునట్టి దేవునకు ఇష్టుడవైన వో వేమన్నా! బుద్ధిమంతుడు తన మనస్సును జిహ్వచాపల్యమువలన మనస్సును నిలుపలేక చెడును

A good person by being unable to control his appetite turns bad.

3) అనువుగానిచోట బనిగొని జూదము, నాడి యాడి యోడి యడవి సొచ్చు ఘనుని జాడజూచి గడువుముమూర్ఖత, విశ్వదాభిరామ వినురవేమ

అనువుగానిచోట బనిగొని జూదము, నాడి
యాడి యోడి యడవి సొచ్చు
ఘనుని జాడజూచి గడువుముమూర్ఖత,
విశ్వదాభిరామ వినురవేమ

మూర్ఖుడు తనకు అనువుగాని స్థలమున జూదమాడి ఓడిపోయి అడవులకు పోవును. ధర్మరాజు దీనికి ఉదాహరణము. దీనిని గమనించి మూర్ఖత్వము విడిచి ప్రవర్తింపుము.

An idiot gambles and loses money in an unfamiliar place. There is a precedent to this in the story of Dharma Raja in scripture. By recognizing this give up ignorance and function wisely.

4) అలయుజేసి మలచి యడిగండ్లు మలిగండ్లు, తిరిపెమిడెడు కటికదేబెలెల్ల నెలిమి మన్నుదినెడి యెఱ్ఱ లవుదురు సుమీ ! వేమ!

అలయుజేసి మలచి యడిగండ్లు మలిగండ్లు,
తిరిపెమిడెడు కటికదేబెలెల్ల
నెలిమి మన్నుదినెడి
యెఱ్ఱ లవుదురు సుమీ ! వేమ

అతిథిని త్రిప్పి త్రిప్పి నానా బాధలు పెట్టి బిచ్చము పెట్టు మూర్ఖులు మరు జన్మలో మట్టి తినెడి ఎఱ్ఱలు (వానపాములు) గా పుట్టుదురు

By offering alms after torturing and insulting a guest an idiot will be reborn as a worm.

5) ఆభిజాత్యమననె యాయువున్నంతకు, దిరుగుచుండ్రు భ్రమల దెలియలేక మురికి భాండమునను ముసరునీగలరీతి , విశ్వదాభిరామ వినురవేమ

ఆభిజాత్యమననె యాయువున్నంతకు, దిరుగుచుండ్రు
భ్రమల దెలియలేక
మురికి భాండమునను ముసరునీగలరీతి
, విశ్వదాభిరామ వినురవే

మూర్ఖులు బ్రతికి ఉన్నంత కాలము - మురికి కుండలో ఈగలు ముసురుకొని ఉన్న రీతిని, “నేను గొప్ప కులమున పుట్టినాను" అని అహంకరించి తిరుగుదరు . తాము భ్రాంతి పడుచున్నట్లు వారికి తెలియదు

Idiots while alive roam around by thinking they are born in a superior caste. This is like flies gathering in an unclean pot. They are not aware they are deluding themselves.

6) తలీదండ్రులయందు దయ లేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా , విశ్వదాభిరామ వినుర వేమ

తలీదండ్రులయందు దయ లేని పుత్రుడు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా,
విశ్వదాభిరామ వినుర వే

It doesn't matter when one who has no regard for his parents dies or reborn. The termites inhabiting snake hills die and reborn again and again.

7) మేడిపండు చూడ మేలిమయి ఉండు పొట్ట విప్పి చూడ పురుగులుండు పిరికివాని మదిని బింక మేలాగరా, విశ్వదాభిరామ వినుర వేమ

మేడిపండు చూడ మేలిమయి ఉండు పొట్ట
విప్పి చూడ పురుగులుండు పిరికివాని
మదిని బింక మేలాగరా, విశ్వదాభిరామ
వినుర వేమ

A fruit called mAdy looks perfect on the outside. But when it is cut, one can find a host of worms. Such is the fear of a coward.

1 comment: