Saturday, March 26, 2022

Eknath Gita Chapter 14 Sloka 9

14.9

సర్వద్వారేషు దేహే అస్మిన్ ప్రకాశ ఉపజాయతే

జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ద౦ సత్త్వమిత్యుత

ఈ శరీరద్వారములైన సర్వేంద్రియముల యందును ఎప్పుడు ప్రకాశమానమగు జ్ఞానము ఆవిర్భవించునో అప్పుడు సత్త్వగుణము బాగా వృద్ధి నొందుచున్నదని గ్రహింపుము

ఈ శ్లోకంలో ఉపనిషత్తులు చెప్పిన విధముగా: శరీరమును చుట్టూ గోడ, రాకపోకలకి ద్వారాలు గల పురాతన పట్టణములతో పోలిక చెప్పబడినది. ఇంద్రియాలు శరీరం యొక్క ద్వారాలు. శ్రీకృష్ణుడు శరీరము లోపల ఒక అధ్యక్షుడుగా ఉన్నానని గుర్తు చేయుచున్నాడు. పట్టణము చక్కగా ఉండి, కాపలా భటులు అధ్యక్షుడు చెప్పినట్లుగా కొందరిని లోపలికి రానిస్తారు, కొందరిని వెనుకకు పంపిస్తారు. ఇది సత్త్వ గుణముతో పోలిక. రజస్ తో కూడిన పట్టణములో కాపలా భటులు వాళ్ళ ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తారు. తమస్ తో కూడిన పట్టణములో వాళ్ళు పడుకొని ఉంటారు.

ఒక చిన్న ఉదాహరణ. నేను ఉంటున్న పెటలూమా అనే ఊరులో ఒక భయానకమైన సినిమా విడుదలయింది. ఆడ మగ పెద్ద ఎత్తున ఆ సినిమా చూడడానికి, అనారోగ్యము వస్తుందని తెలిసినా, బారులు కట్టేరు. అది వారికి నచ్చుతుంది. సాన్ ఫ్రాన్కిస్ కో నగరంలో ఒక ఆడది సినిమా హాల్ లో మూర్ఛతో పడిపోయినదని విన్నాను.

నేను ఒక దంపతులను ఆ వరసలో చూసేను. టిక్కెట్టు కొంటున్నప్పుడు జరిగే దృశ్యాన్ని ఊహించగలను. "ఈమె నా జూలిఎట్. నాకు ఆమె అంటే ఎంత ఇష్టమంటే, ఆవిడకి మూర్ఛ తెప్పిస్తాను. "

కళ్ళు, చెవులు మనస్సుకు రహదారులు. ఇటువంటి సినిమా చూస్తున్నప్పుడు మనం విన్నది, కన్నది వికల్పమైన మనస్సుకు దారి తీస్తాయి.

ఆత్మ కాంతి వంటిది. తమస్ గాఢాంధకారము. రజస్ పట్టణంలో రభస. సత్త్వ౦ అనగా ఆ పట్టణం ప్రశాంతంగా ఉండడం. ఆ స్థితిలో మీ హృదయం ప్రేమతో, జ్ఞానముతో నిండుగా ఉండి, మీ తేజస్సు నలుదిక్కులా వ్యాపిస్తుంది. 139

Saturday, March 19, 2022

Eknath Gita Chapter 14 Sloka 8

14.8

రజస్తమశ్చాభిభూయ సత్త్వ౦ భవతి భారత

రజస్సత్త్వం తమశ్చైవ తమస్సత్త్వం రజస్తథా

భారతా! సత్త్వగుణము రజో తమోగుణములను, రజోగుణము సత్త్వ తమో గుణములను, తమోగుణము సత్త్వరజోగుణములను అణుచుచు ఆయా గుణము ప్రధానమగుచుండును

ఎవ్వరూ రజో, తమో గుణములతో జీవించాలని కాంక్షించరు. కాని చాలామంది వాటితోనే జీవిస్తారు. మంచి ఉద్దేశము ఉన్నా, ఎందుకు నిస్వార్థ కర్మల చేయుటకు మానసిక అవరోధాలు ఉన్నాయి? అపాయం కలిగించే స్వార్థ కర్మలు ఎందుకు చేస్తున్నాం?

ఇదే మానవులకున్న సందిగ్దావస్థ. కొన్నిసార్లు మనకు పని చేయవలసినప్పుడు బద్దకం ఆవహిస్తుంది. మనం "నేనిది చేయలేను. వేరేవాళ్ళచేత చేయిస్తాను" అనుకుంటాం. మనకు ఇష్టమైన పని చేయవలసినపుడు పూనుకొని మనః పూర్వకంగా చేస్తాం. దాని వల్ల ఏ లాభం ఉండకపోవచ్చు. దానివల్ల మనకు, ఇతరులకు అపాయం కలగవచ్చు. మరుసటి రోజో, కొన్నినెలల తరువాతో, లేదా తరువాత తరంలోనో దాని ప్రభావం తెలుస్తుంది. మనం పని మీద దృష్టి కేంద్రీకరించి సమయాన్ని మర్చిపోతాం. మనం సమయాన్ని సద్వినియోగం చేసుకొని జీవితాన్ని మరచిపోయేం.

ఈ శ్లోకం ఒక గుహ్యమైన విషయం చెప్తోంది. సత్త్వ గుణంతో బ్రతకాలంటే రజస్ తమస్ లను నియంత్రించుకో. ఈ విధంగా రెండు గుణాలను స్వాధీనంతో పెట్టుకొంటే మూడవది అనుభవంలోకి వస్తుంది.

మీ స్వీయానుభవంతో తెలుసుకోవచ్చు. మీరు సోమవారము గీత చదివి ఉత్సాహపూరితలు అవుతారు. ఆ బోధ మనస్సులో బాగా నాటుకు౦ది. మీరు జీవితాన్ని తదనుగుణంగా మార్చుకొని దాని పరమార్థం తెలిసికొన్నారు. మరుసటిరోజు ఉదయం వేరంగా లేచి, ధ్యానం చేసి, సాత్విక టిఫిన్ తిని, పనిమీద పూర్తి ధ్యాస పెట్టి, తోటివారలను గౌరవంగా చూసి, నిర్దయులకు ప్రేమ చూపిస్తారు. బద్దకం వస్తే నడక మొదలెట్టి మంత్రం జపించుకొంటూ వెళతారు. లేదా జాప్యం చేసిన పనిని మొదలెడతారు. మనస్సు వేగంగా ఉంటే మంత్ర సహాయంతో దాని వేగం తగ్గిస్తారు. ఒక ముఖ్యమైన పని చేయడానికి తక్కిన వాటిని ప్రక్కన పెడతారు. వీటివల్ల రజస్ తమస్ ల నుండి విడివడి ఒక మూడు రోజులు సాత్వికంగా ఉంటారు.

ఆ తరువాత నెమ్మదిగా పట్టు సడలుతుంది. నిరుత్సాహం ఆవరిస్తుంది. ఆఫీస్ లో పని ఒత్తిడి పెరుగుతుంది. చుట్టూ ఉన్న వారు ఏదో పని వెంటనే చేయమని అడుగుతారు. మనకు తెలీకుండానే పాత అలవాట్లు తిరిగి వస్తాయి. మనస్సు వేగంగా చలిస్తుంది. ఇతరులు మీ పనికి అడ్డం వస్తే వాళ్ళ మీద చికాకు పడతారు. గురువారం మీరు ఇంటిలో ఆఫీస్ పని చేయ బూనుతారు. భోజనం చేస్తున్నప్పుడు దానిపైనే ధ్యాస పెడతారు. భార్యను, పిల్లలను పలకరించరు. ఈవిధంగా సత్త్వగుణాన్ని వదలి, రజస్ తో ఉన్నారు.

శనివారం పడిపోతారు. పక్క మీద నుంచి లేవరు. కలలు కంటూ వాటితో రమిస్తారు. ధ్యానం చేద్దామని కూర్చొని, నిద్ర పోతారు. "నాకు ఈ వారమంతా పని ఒత్తిడి ఎక్కువయింది. ఇప్పుడు పూర్తిగా విశ్రమిస్తాను" అని అనుకొంటారు. టిఫిన్ ఎక్కువగా తిని కాఫీ కప్పు పట్టుకొని బయట ఎండలో కూర్చొని ఆనందిస్తారు.

ఆదివారం అయోమయంగా ఉంటుంది. ఎక్కడా నొప్పి లేకున్నా మనస్సు సరిగా ఉండదు. దేహంలో శక్తిలేనట్టు అనిపిస్తుంది. "ఏదో వైరస్ వల్ల కాబోలు" అనుకొంటారు. "నేను వేరే వాళ్ళని చూడను. పక్కమీదే ధ్యానం చేస్తాను" అని గుడికి వెళ్ళే కార్యక్రమాన్ని విరమించుకుంటారు. ఏవో పిచ్చి పుస్తకాలను తిరగేస్తారు.

రజస్ తాండవం చేస్తున్నప్పుడు సత్త్వ౦ కొరకు పెద్ద యుద్ధమే చేయాలి. ఏమైనప్పటికి తమస్ ను ఆశ్రయించకూడదు. సత్త్వ గుణం తగ్గుముఖం పడుతూంటే, దానికి ఊత నివ్వండి. ఇది చాలా బాధించేదే కాని పట్టుతో దాన్ని విడువకండి. వేరే మార్గం లేదు. 139

Sunday, March 13, 2022

Eknath Gita Chapter 5 Section 14

Bhagavat Gita

5.14

కామక్రోధ వియుక్తానాం యతీనాం యత చేతసా౦

అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనామ్

కామాక్రోధముల నుండి విడిపడిన వారును, మనసు స్వాధీనపడిన వారును, ఆత్మ జ్ఞానులును అగు యతి పురుషులకు బ్రహ్మజ్ఞానము సర్వత్ర కలదు.

ఈ శ్లోకంలో బ్రహ్మనిర్వాణ అనే పదం శ్రీకృష్ణుడు ప్రయోగించేడు. అంటే ఒక ఉత్కృష్టమైన లక్ష్యం. దాన్ని చేరాలంటే రెండు అడ్డంకులు ఉన్నాయి. ఒకటి స్వార్థం. దాని వల్ల ఒకడు లాభము, పేరుప్రఖ్యాతలు, ప్రతిష్ఠ కొరకై ప్రేరేపింపబడతాడు. బుద్ధుడు దీన్నే తన్హా -- అంటే తనది పొందటానికి ఇతరులతో అవసరమైతే కలహం పెట్టుకొని చేయడం-- అంటాడు. రెండవ ప్రతిబంధకం క్రోధం. ఎక్కడైతే వేర్పాటు, తానొక్కడే తృప్తి పొందాలనే భావన ఉంటుందో అక్కడ క్రోధం ఉన్నట్టే. కామము, క్రోధము కలసి వస్తాయి. మనమంతా స్వార్థ౦తో ఒక పెద్ద వస్తువు పొందాలని ప్రయత్నిస్తే, అది ప్రపంచంలో ఒకే ఒక వస్తువయితే, మన మధ్య స్పర్థలు కలగక మానవు.

అనేక విడిపోవడాలలో -- వ్యష్ఠి అయినా, సమిష్ఠి అయినా-- మన ఇష్టం, ఇతరుల ఇష్టం మధ్య, మన సౌభాగ్యం ఇతరుల సౌభాగ్యం మధ్య కలహం ఉంటుంది. సౌభాగ్యం, శాంతి విడదీయబడలేవు. నేతలు ప్రపంచ శాంతి ఎంతో అవసరమని చెప్తున్నారు. ప్రపంచం ఒక మూలలో యుద్ధం జరుగుతూ ఉంటే, మరో మూలలో శాంతి ఉన్నా లాభం లేదు. అలాగే ఒక దేశంలో సౌభాగ్య ముండి, వేరే దేశం దరిద్రంతో బాధ పడుతూ ఉంటే కూడా లాభం లేదు. ఎలాగంటే మన ఇంట్లో వంట గది నిప్పంటుకుంటే, దానిని ఆర్పకపోతే, అది ఇల్లంతా వ్యాపించి ఇల్లునే తగలబెడుతుంది.

కామాక్రోధాలను నియంత్రించాలంటే, మన ఇంటిలో కలసిమెలసి ఉండాలి. లేకపోతే ఇంట్లో యుద్ధ బీజాలు నాటబడతాయి. ఇంట్లోని వ్యక్తుల మధ్య కలహాలు, వేర్పాటు భావాలు ఉన్నాయంటే, ఆ ఇంట్లో ఒక చిన్న యుద్ధం జరుగుతున్నట్టే. అది ప్రపంచ యుద్ధమంత పెద్దది కాకపోయినా, అది యుద్ధమే.

యుద్ధ ప్రతిపాదిక మనస్సులో కలుగుతుంది. అది క్రమంగా మన హృదయాలలోనూ, ఇళ్లలోనూ, సమాజంలోనూ, చివరకు ప్రపంచమంతా వ్యాపిస్తుంది. గీత చేసే బోధ: యుద్ధం స్వార్థం-నిస్వార్థం, శుద్ధం-అశుద్ధం, ఆసురిక-దైవీక స్వభావాల మధ్య జరిగే పోరాటం. గీత చెప్పే యుద్ధం మన మనస్సులో, హృదయంలో జరిగే గందరగోళం. యుద్ధం రెండు వర్గాల మధ్య పోరాటం కాబట్టి మనకి ఆసురిక వర్గమైనా లేదా దైవిక వర్గమైనా ఎన్నిక చేసికోవచ్చు. అది దేశాకాలమానాలతో సంబంధం లేనిది. 331

Saturday, March 12, 2022

Eknath Gita Chapter 14 Sloka 7

14.7

సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత

జ్ఞాన మావ్రుత్య తు తమః ప్రమాదే సంజయత్యుత

భారతా! సత్త్వ గుణము సుఖములో జీవుని ప్రవర్తింపజేయును. రజోగుణము కర్మలలోనికి నెట్టును. తమోగుణము జ్ఞానము నావరించి జీవుని ప్రమాదమున ముంచును

ఏ విషయానికైనా మన స్పందన యాంత్రికము. ధనము వచ్చిన మనము దాని వ్యామోహములో అనాలోచితంగా పడతాము. సుఖం దానికన్నాఎక్కువగా ఆకర్షిస్తుంది. పేదవాడు, ధనవంతుడు అని తేడాలేక వాటిచే ఆకర్షింపబడతారు. మనం "నేను తీసికోవచ్చు లేదా వదిలేయవచ్చు" అనుకోవచ్చు. కానీ ధన-సుఖాలకు వేరే మార్గముంది.

మనము ధ్యానం మొదలుపెట్టిన తరువాత, సుఖం వచ్చి మనను తనవైపు లాగుకొ౦టే, అప్రయత్నంగా మనము దానివైపు వెళదామనుకున్నా, వెళ్లము. దానికి కోపంవస్తుంది. సుఖము ఇలా అంటుంది: "ఇది క్రికెట్ కాదు. నీవు నా వైపు రావాలి. జీవితమంటే అదే. చుట్టూ చూడు. ఎవరయినా నన్ను చూసి దూరంగా పరిగెడుతున్నారా? ప్రతి ఒక్కరు నన్ను కాంక్షిస్తారు. నేను ప్రతిఒక్కరికి మిత్రుడను." సెయింట్ ఫ్రాన్ సిస్ ఇలా తలుస్తారు: "నేను ఆకర్ష-వికర్షణలకు బద్దుడను కాను. నేను నాకు కావలసినది చేస్తాను. సుఖం నన్ను ప్రభావితం చేయలేదు".

ఎంతో ధ్యానం చేసిన పిదప, మనం తీసికొన్న నిర్ణయాలు కాకతాళీయంగా, బయట విషయాల వల్ల కాక, ఉన్నా, అవి వేరే గతి లేని స్పందనలు మాత్రమే. అవి నిర్ణయాలు కావు. గాఢమైన కోర్కెలు. అవి యాంత్రికంగా మన మనస్సుకు వస్తాయి. మనం వాటిని నియంత్రించాలి. మోక్షమనగా అట్టి కోర్కెలకు బానిస కాకపోవడం.

తామసికుడు, జడత్వంతో, ఇలా ఆలోచిస్తాడు: "నేను ఈ రోజు పక్క మీదే ఉంటాను". తమస్ "నేను వీడిని ఒక వేలుతో నా స్వాధీనంలోకి తీసుకొన్నాను. వీడు మంచానికి తాళ్లతో కట్టి పడేసిన వాడిలా ఉన్నాడు" అంటుంది. వాడితో "నీకు స్వతంత్రం లేదు " అంటే నమ్మడు . "చూడు నా చేయిని ఎత్త గలుగుతున్నాను. నా కాళ్ళను కదపగలను. నేను స్వతంత్రుడిని" అని అంటాడు.

మనం అడుగుతాం "అయితే పక్క మీదనుంచి ఎందుకు లేవలేక పోతున్నావు?"

"నేను తలచుకొంటే లేవగలను. కానీ నేను పక్క మీదే ఉండాలని నిర్ణయం తీసికొన్నాను"

ఒకడు ఆఫీస్ కు వచ్చి "నేనీ ఆదివారం ఊరెళుతున్నాను" అని అంటాడు. రాజసికుడు నవ్వి "వీడు మనస్సు వికల్పమైనది. నేను వాడిని ఎక్కడికైనా ప్రయాణం కట్టించగలను." ఇవి నిర్భంధమైన విషయాలు. అవి మనను కర్మ చేత బంధిస్తాయి. ఎందుకంటే మనను ఒక ధ్రుక్పధంలో బంధిస్తాయి. దీనిని శ్రద్ద అంటారు. ఒక దృఢమైన, స్థిరమైన, తిరిగి ప్రశ్నించ బడలేని, నమ్మకం బయట వస్తువేదో ఆనందాన్ని కల్గిస్తుందని అనిపిస్తుంది. అది ప్రస్తుత కాలంలోనే కాదు. సుఖమును కోరినవారు చరిత్రపుటలలో చాలా మంది ఉన్నారు. సుఖానికై ప్రతిఒక్కరు వెతుకుతారు. కానీ దాన్ని సంపూర్ణముగా పొందలేరు.

మనలో చాలామంది ఇంద్రియ సుఖము ఎక్కడో ఉందని తలుస్తాము. మన కది దొరకటం లేదని భావిస్తాము. అతి కొద్ది మందికి జ్ఞానోదయం కలుగుతుంది: "సుఖం బయటెక్కడో లేదు. నా అంతర్గతంలోనే ఉంది." ఈ విధమైన పరిపక్వమయిన జ్ఞానము సత్త్వ గుణమువలననే సాధ్యము. తద్వారా మన౦ మంచి నిర్ణయాలు చేయగలిగే శక్తిని పొందుతాము.

పరిపక్వాన్ని చాలా విధాలుగా ఊహిస్తారు. ఈనాటి మంత్రం: "నీకు బాగా అనిపించేదాని కోసమై వెళ్ళు." అంటే "ఎంత వీలయితే అంత మూర్ఖంగా వుండు." పరిపక్వతకి అసంగత్వం ఉండాలి. అదిలేని వాడు స్వార్థంతో: తన కోర్కెలు, అభిప్రాయాలు, క్రియలు గురించే ఆలోచిస్తాడు. పరిపక్వత చెందినవాడు తన ఇష్టాయిష్టాలకు అతీతుడై , సహనంతో వాటిని ఎదుర్కోగలడు.

శ్రీకృష్ణుడు "సత్త్వ౦ మనను ఆనందంలో ఓలలాడిస్తుంది" అని చెప్పేడు. అంటే మనం ప్రపంచంలో ఏదీ శాశ్వత సుఖం ఇవ్వదని తెలుసుకొంటాం. మనం మార్పు చెందని సుఖం గురించి వెదుకుతా౦. దీనివలన మనం సత్త్వాన్ని దాటి, త్రిగుణాల కతీతంగా శాశ్వతమైన స్వతంత్రం, ఆనందాన్ని పొందుతా౦.

నాకు పదేళ్ళ వయస్సులో ఆంగ్ల సాహిత్యం పరిచయం చేయబడింది. అంత మంచి కథలు, పాత్రధారులు ఉన్నారని ఊహించలేకపోయేను. నా స్కూల్ లో గ్రంధాలయం అంతా ఒక బీరువాలో హెడ్ మాస్టర్ కుర్చీ వెనుక ఉండేది. ఆయనకు సాహిత్యం అంటే ఎంతో ఇష్టం. నిజంగా శ్రద్ధ ఉన్న వారికి ఆయన పుస్తకాలు ఇచ్చేవాడు. ఆంగ్ల నవలలు చాలా పెద్దగా కూడా ఉండేవి. ముఖ్యంగా చార్లెస్ డికన్స్ వ్రాసిన నవలలు. ఆంగ్లం నేర్చుకోవడం నాకు అతి కష్టం అనిపించేది. అందువలన నేను నెమ్మదిగా చదివేవాడిని. ఆ పొడుగాటి నవలలో పూర్తిగా మునిగిపోయేవాడిని. వాటి ముగింపులో నాకు చాలా బాధ వేసేది. ఎందుకంటే అంతటితో నవల చదవడం అయిపోయింది. నేను దాన్ని ఇంకా పొడిగించటాకి దాన్ని మూసి, ప్రక్కన పెట్టేవాడిని. నా చిన్న మేనకోడలికి నా భార్య క్రిస్టినా చకలేట్ ఇస్తే అది దాన్ని దాచి అప్పుడప్పుడు తింటూ ఉండేది. అది చిన్న పిల్లలు చేస్తే ఫరవాలేదు. కానీ పెద్దవారు అలా చేయరు.

ధ్యానం గురించి నా ప్రసంగాన్ని వినడానికి అప్పుడప్పుడు క్రొత్తవాళ్ళు వచ్చేవారు. వాళ్ళు అశాశ్వతమైన విషయాలగురించి ఎంత నిరుత్సాహంగా ఉన్నారో చూద్దామని వాళ్ళని పరీక్షించే వాడిని. ఎవరైతే అశాశ్వత సుఖాలను కాంక్షి౦చరో వారు ఆధ్యాత్మికంగా పైకి ఎదగగలరు. అట్టివారు జీవితమనే బొమ్మలాటకు అతీతమైనవారు. వాళ్ళకి అప్పటికీ బట్టల విషయంలో వ్యామోహం ఉండవచ్చు. ఆధ్యాత్మికత వస్తే అదీ పోతుంది. ఆధ్యాత్మిక జీవితం కష్టమైనది. దానిపై గట్టి పట్టు ఉండాలి. వాళ్ళకి అది అలవాటైతే ముందుకు సాగగలరు.

శ్రీకృష్ణుడు "రజస్ మనను కర్మతో బంధిస్తుంది" అంటాడు. రాజసికుడు సవా లక్ష పనులు చేస్తూ ఉంటాడు. కానీ దేని మీదా వాడికి ఏకాగ్రత లేదు. ఎంతసేపూ చలనంలో ఉండి, అశాంతిగా ఉంటాడు.

ఇవాళ ఇంటికి వెళుతూ ఉంటే ఒక చెత్తలబండి మీద "ఇది ఎక్కువగా ఆగుతుంది" అని వ్రాసి ఉన్నది. ఇది రాజసికునికి వర్తిస్తుంది. చెత్తల బండి చెత్త ఉన్న అన్ని చోట్లా ఆగుతుంది. అది పెద్ద శబ్దం చేస్తుంది. చెత్తను ఎత్తి మీద వేసికొంటుంది. మరికొంత దూరం వెళ్ళి అదే పని చేస్తుంది. ఎవరైతే లక్ష్యంలేని పనులు చేస్తారో, సుఖానికి బద్ధులవుతారో అటువంటి వారే. వాళ్ళు దుకాణం నుంచ దుకాణంకు, హోటల్ నుంచి హోటల్ కు, దేశం నుంచి దేశంకు మారి తిరుగుతూ ఉంటారు. మార్పుకై జీవితాన్ని వృధా చేస్తారు. "నాకు మార్పు కావాలి" అనుకుంటాం. మనకి మార్పు ఆఖరుగా కావాలి. అది కానివి చాలా ఉన్నాయి. మనకి అత్యవసరం శాశ్వతమైనది.

కర్మ చేయాలనే పట్టువల్ల ఒత్తిడి కలుగుతుంది. ఒకనికి ధనార్జనపై ఎక్కువ కోరిక ఉంటుంది. వాడు ఇంటి గురించి ఎక్కువ ఆలోచించడు. తన కుటుంబంతో ఆనందంగా కాలం గడపడు. వాడు సెలవు రోజు కూడ దుర్భరంగా తలుస్తాడు.

రాజసికుడి మంత్రం: "లక్ష్య సిద్దికి ఏ పనైనా చెయ్యచ్చు ." అతడు లక్ష్యం నెరవేర్చుకోవడానికి సదా ఆలోచిస్తూ ఉంటాడు. అది పని చేస్తుందా? అది అధర్మం కావచ్చు కాని వృధా. మంచి దారులతో మంచి లక్ష్యాన్ని సాధించడమనేది ఆధ్యాత్మిక జీవనంలో మొదటి సిద్ధాంతం. మనం శాంతిని తయారు చేయలేం. శాంతి శాంతి వలననే కలుగుతుంది. యుద్ధం తననితాను పెంచుకుంటూ పోతుంది. దురాశ సంతృప్తి నివ్వదు. అది మరింత దురాశ కలిగిస్తుంది. పోటీ ఒకడికి క్షేమం కలిగించదు. అది వేర్పాటుని కలిగిస్తుంది.

మహాత్మా చెప్పేరు లక్ష్యం, దాన్ని సాధించే మార్గాలు ఒక్కటే. మంచి మార్గంలో వెళ్ళి, ఇంటిలో ఒకరినొకరు అర్థం చేసుకొని, ఐకమత్యంతో ఉంటే "నేను విజయం సాధించేనా?" అని అడగనక్కర లేదు. ఆ ప్రశ్న నిరర్థకం. గాంధీ చెప్పేది: "పూర్తి ప్రయత్నము పూర్తి విజయాన్ని ఇస్తుంది. " మనం చేయవలసినదేమిటంటే హింసా కాండకి పరిష్కారం కనుగోవడం. మా ధ్యాన పాఠశాలవంటి దానికి సమయం, శక్తి, వనరులు సమకూర్చడం. బౌద్ధులు లాగ మనము గొప్పదైన క్రియను, కోపం, భయం, దురాశ లేకు౦డా చెయ్యాలి. మనం ఆడగవలసింది "నేను పూర్తి ఏకాగ్రతతో ప్రతి రోజూ ఏదో చేతనైనంత మంచి చేస్తున్నానా?"

పై శ్లోకం తమస్ భ్రాంతిని కలుగజేస్తుందని చెప్తుంది. అది జ్ఞానాన్ని కప్పివేసి అజ్ఞానాన్ని కలిగిస్తుంది. మన ఎరుకను తెలియకుండా చేయిస్తుంది. తామసికుడు మానవాళిలో అతి క్రింద ఉన్నవాడు. వాడు కర్మ ససేమిరా చేయడు. ఎందుకంటే వాడికి ఖాతరు లేదు.

మన అయిష్టమైన క్రియ చేయాలంటే తమస్ ఆవహించి మనని నిశ్చేష్టులిని చేస్తుంది. పక్షవాతంలా ఉంటుంది. తామసికుడు ఏ కర్మను చేయలేడు. సున్నిత స్వభావం వానిలో లేదు. వాని వలన ఇతరులకు కలిగే ఇబ్బందిని తెలుసుకోలేడు. వాడు ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నాడని తెలియక, తన స్వార్థాన్ని తాను చూసుకొంటాడు. ఎన్నో ద్రోహాలు, విశ్వాసఘాతక పనులు, తమస్ ఆవహించినప్పుడు కలుగుతాయి. మనకు విశ్వాసమంటే తెలియకపోతే దాని పర్యావసానము కూడా తెలియదు.

తమస్ వలన ఒక మనిషి, జాతి, దేశం స్వార్థానికి ఉపయోగింపబడితే మనకి ఏమీ పట్టనట్టు ఉంటాము. ఎటువంటి సానుభూతి, కోపం కలుగదు. ఒకనికి జరిగిన అన్యాయము, వాడు పడే యాతన, మన గుండెను కరిగించదు. అది చాలా బాధాకరమైన విషయము. చాలా మందికి ప్రపంచంలో జరుగుతున్న యాతన గురించి తెలియదు. ఎందుకంటే వారికి స్వార్థ బుద్ధి తప్ప వేరేది లేదు.

కొంత కాలం క్రిందట దినపత్రికలో సాన్ ఫ్రాన్సిస్ కో నగర అధ్యక్షుడు (mayor) తన సహోద్యోగి చే కాల్చి చంపబడ్డాడాని చదివేను. చంపినవాడు ఆ అధ్యక్షుడు వానికి అన్యాయం చేసేడని వెళ్ళి ఒక తుపాకీ కొన్నాడు. నేను ఆ నగరవాసులు కలత చెంది తుపాకీలకు సంబంధించిన చట్టాలను బలోపేతం చేస్తారని తలంచేను. కానీ వారు కొన్ని రోజులు శోకం చెంది, ఆ విషయం మరచిపోయేరు. క్రోధం వల్ల చాలా గొప్పవారు - కెనెడి, మార్టిన్ లూథర్ కింగ్ వంటి వారు--వేలకొలది సామాన్యులు, ఆడవారు, పిల్లలు తుపాకీలచే కాల్చబడి మరణించేరు. ఇటువంటి దుర్ఘటనలు జరుగుతన్నా ప్రజలు షరా మామూలు అని ఉన్నారు. చాలా మందికి తెలీని విషయం మనం నిస్వార్థమైన, అహింసా చట్టాలను దబాయించి అడగాలి.

శ్రీకృష్ణుడు మనమందరమూ జీవితానికి తోడ్పడాలి అని మన కర్తవ్యం గుర్తు చేస్తున్నాడు. మన భూలోక వాసానికి ఉన్న కారణమదే. ఎవ్వడైతే స్వార్థంతో, దేహాభిమానంతో, ఇతరులకేమైనా జరిగినా పట్టించుకోకుండా, పర్యావసానాలను తెలిసికోకుండా, ఉన్నాడో వాడు తమస్ అనే మసుగేసుకొని, తను తక్కిన వారిని ప్రభావితం చేయనట్టు ఉన్నాడు. అయినప్పటికీ వాడు తమస్ ను వీడి ధ్యానంలో ప్రవేశిస్తే బాగుపడతాడు. 137

Saturday, March 5, 2022

Eknath Gita Chapter 14 Sloka 6

13.6

తమస్త్వ జ్ఞానజం విద్ధి మోహనం సర్వ దేహినాం

ప్రమాదాలనిద్రాభిః తన్ని బధ్నాతి భారత

భారతా! అజ్ఞాన జనితమైన తమోగుణము సర్వ జీవులకు మోహనమును కలుగజేయుచు మఱపు, అలసత్వము, నిద్రలలో జీవుని బంధించివేయుచున్నది

ఇంతవరకు శ్రీకృష్ణుడు చెప్పిన ఉపోద్ఘాతము, "ప్రపంచంలో వింతైన పాత్రని చూస్తారు. అతడు చెప్పిన మాట వినడు, బద్దకస్తుడు, స్తిమితము లేని వాడు, కృతజ్ఞత లేనివాడు" అని టివిలో ప్రకటన చేసినట్టు.

శ్రీకృష్ణుడు తమస్ చిహ్నాలు వల్లిస్తున్నాడు. మొదటిది ప్రమాద: మనఃపూర్వకత లేక పోవుట. ఇది చాలా చెడ్డని అలవాటు. అట్టివారు ముందుకు సాగలేరు. వాళ్ళ దృష్టి సదా మారుతూ ఉంటుంది. మనఃపూర్వకత ఉన్నవాళ్ళు విజయాన్ని పొందుతారు అని యోగి పతంజలి చెప్పియున్నారు. అట్టివారు ఒక మంచి లక్ష్యాన్ని మనస్సులో పెట్టుకొని మనస్పూర్తిగా, దిక్కులు చూడకుండా, పని చేస్తారు. ఆధ్యాత్మిక గురువులు ఒకరిని శిష్యునిగా చేర్చు కోవలంటే కొన్ని సంవత్సరాలు వాని స్వభావమును, మనఃపూర్వకతను తెలిసికొనుటకై నిఘా వేసి వుంచుతారు. అలాకాక వచ్చిన ప్రతి వొక్కరినీ శిష్యునిగా తీసుకొంటే, వానికి మనఃపూర్వకత లేకపోతే, గురువు సమయం, శక్తి వృధా అవుతాయి.

రెండవది ఆలస్య అనగా బద్దకం. అది నిరుత్సాహం, జడత్వం మొదలైనవాటితో కూడియున్నది. ఒకడు తన జడత్వం వలన నడుస్తున్నా, సంసిద్ధతతో యుండడు. మనస్సు గడిచిన కాలం గూర్చి, భవిష్యత్తులో ఏమి జరబోతుందని సదా ఆలోచిస్తూ ఉంటుంది. శరీరము మాంద్యముతో కూడి ఉంటుంది. అడుగులు నెమ్మదిగా పడతాయి. తల క్రిందకు వంచబడి ఉంటుంది. కూర్చున్నప్పుడు వెన్నెముక వంగియుంటుంది. దానివలన ధ్యానం సరిగా చేయలేడు.

చివరది నిద్ర. అది శరీరానికి కావలసినంత కాదు. దాన్నే అతినిద్ర అంటారు. ప్రపంచ విషయాలనుండి తప్పించుకోవడానికి తామసికుడు నిద్రలోకి ప్రవేశిస్తాడు. అతి కష్టంతో కళ్ళు తెరిచి ఉంటాడు. వాడు సినిమా చూస్తున్నా, ఒక సమావేశం జరుగుతున్నా, చివరకు భోజనం చేస్తున్నా ఎక్కడైనా నిద్రను కాంక్షిస్తాడు. వాడికి ఒక సమస్య వేధించినా, ఒక పని చేయలేకపోయినా బద్దకంతో, ఆవులింతలు చేసి, చంచల మైన మనస్సుతో నిద్రకు ఉపక్రమిస్తాడు.

ఈ బద్దకం విద్యాలయాల్లో కూడా ఉంది. ఎవ్వరో అన్నారు ప్రొఫెసర్ అనగా అవతలి వారి నిద్రలో మాట్లాడేవాడు. నా విద్యార్థి ఒకడు ఎప్పుడూ మొదటి పంక్తిలో కూర్చొనేవాడు. నేను ఎంతో కష్టపడి సాహిత్యం గురించి చెప్తూ ఉంటే, వాడు నెమ్మదిగా నిద్రలోకి జారుకునేవాడు. నిద్రలో తూగుతూ, మెడ ఛాతీకి తగులుతూ ఉండేదా దృశ్యం. వాడిని ఒకసారి ఏమి కనపడుతున్నాదని అడిగేను. "మీరు కొంతసేపు దయ్యంలా కనిపిస్తారు. ఆ తరువాత మీరు ఆవిరి ఐపోతారు. చివరకు మీరు మాయమవుతారు".

ఎప్పుడైతే క్లిష్టమైన మానసిక సమస్యలతో వేధింపబడతారో అప్పుడు నిద్ర రాదు. కానీ అచేతన మనస్సుది పైచేయి అయివుంటుంది. ఎంత మేల్కొని ఉందామని ప్రయత్నించినా సాధ్యము కాదు. అది ఆఫీసు లోనే కావచ్చు, కొంతమంది సన్నిధిలోనైనా, లేదా వాహనం నడుపుతున్నా అలా అవ్వవచ్చు. ఆ సమయాల్లో ఎంత ప్రయత్నించినా అచేతన మనస్సును స్వాధీనం చేసికోలేరు. పిడికిలి బిగించినా, తల తిన్నగా పెట్టినా అది పనిచేయదు. ఇవన్నీ భౌతికమైన చర్యలు. కాని అది నిజంగా అభౌతికము. అందుకే ఒక మంత్ర౦ సహాయం కావాలి. ఒక పవిత్రమైన -- సెయింట్ బెర్నార్డ్ చెప్పినట్లు "శక్తినిచ్చే పదం"--నామం తలుచుకొంటూ దానితో పోరు చేయాలి.

తామసుని మంత్రం: "నాకు లెక్క లేదు. నేను తక్కినవారికి ఏమైనా పట్టించుకోనవసరంలేదు. నాకేమైనా కూడా ఫరవాలేదు." ఈ రోజుల్లో చాలా మందికి ఇటువంటి భావన ఉంది. గీత దృష్టిలో అట్టివారు జీవచ్చవాలు. వారు రాతితో చేయబడిన విగ్రహాల్లా౦టివారు. ఒక రాయి అనుకొంటుంది: "నేను ఇక్కడనుంచి కదలను. ఇక్కడ మంటలొచ్చినా పరిగెత్తను. మంటలు రానీ. నన్ను మండించినా సరే కదలను." ఈ విధంగా పట్టించకోపోవడం తామసుని సహజ నైజం. ఎంతమంది పొంచి యున్న ప్రమాదాలను పట్టించుకుంటున్నారు? యుద్ధాలు, హింస, ఆకలితో అలమటించు పేదలు, తునాతునకలైన కుటుంబ వ్యవస్థ, విషంగా మారిన పర్యావరణం, వీటి గురించి ఎవరు స్పందిస్తున్నారు? ఇవి మనలనందరినీ మంటల్లాగా ఆవరిస్తాయి. దినపత్రికలు వీటి గురించి చెప్పినా ఎవరూ పట్టించు కోవటంలేదు.

మానసిక, సాంఘిక శాస్త్రజ్ఞులు ఎవరిలోనూ ఈ సమస్యలను నిర్మూలంచడానికి ప్రేరేపణ లేదని చెప్తున్నారు. ప్రేరణ లేకపోవడం తామసిక లక్షణం. తామసికుడు భయానికి స్పందిస్తాడు. ఒకే గాడిలో ఉండడం వాని స్వభావం. చాలా మందికి ఒకే గాడిలో ఉండడం ఇష్టం. ఎందుకంటే దాని వల్ల జీవితం ప్రపంచాన్ని చూడకుండానే గడిపేయవచ్చు. ఒకరి గాడి మరొకరి గాడిని తగలదు. స్త్రీ, పురుషులు ఒకే ఇంట్లో కలసి వుండవచ్చు, భోజన సమయంలో ఉదయం, సాయంత్రం ఒకరినొకరు పలకరించకోవచ్చు, పిల్లల్ని పెంచవచ్చు, చివరకు ఒకరి మొహాలొకరు చూస్కోకుండా విడిపోవచ్చు. అతను వాని గాడిలో ఉన్నాడు. ఆమె తన గాడిలో ఉంది.

మార్పు అంటే తామసికునికి భయం. మనం జీవితంలో ఒక సమస్యను ఎదుర్కోవలసి వచ్చినా, లేదా మార్పు వచ్చినా తమస్ తో స్పందిస్తాం. జీవతంలో మార్పు సహజం. బుద్ధుడు చెప్పినట్టు ఏదీ మార్పు చెందకుండా ఉండదు. మనం దానికి అనుగుణంగా ప్రవర్తించాలి. కాని తామసికుడు మార్పు గురించి ఇలా ఆలోచిస్తాడు: "నాలో మార్పు రాదు. నేను దృఢమైనవాడిని. నేను వంగలేను."

మొన్నొక జపనీస్ మిత్రుడు ఒక బొమ్మను చూపించేడు. దాన్ని నొక్కితే కుంచించుకు పోతుంది. దాని మీదనుంచి చెయ్యి తీసేస్తే మామూలుగా ఉంటుంది. మనం అలాగే ఉండాలి. పరిస్థితులు విషమించి నపుడు మనం లొంగాలి. పరిస్థితులు బాగయినపుడు తిరిగి మన పూర్వ స్థితికి రావాలి. ఇంకా ధృడంగా ఉండాలి.

తామసికుడు పరిస్థితులు విషమించినపుడు క్రింద పడిపోతాడు. అదే వాని సహజ స్థితి. "నేను చేయలేను" అన్నది వానికి ఊతపదం.

నా ధ్యానం తరగతిలో అటువంటివాళ్లను చూసేను. వారు మొదట్లో చాలా ఉత్సాహంతో ఉంటారు. క్రొత్త తలదిండు, ధ్యానానికై కొనుక్కున్న క్రొత్త బట్టలు, మొదలైన వాటితో వస్తారు. వాళ్ళు కళ్ళు మూసుకొంటే వారి మనస్సు కోతిలాగ పరివర్తిస్తుంది.

ఒక ఆంగ్ల సాహిత్యవేత్త ధ్యానం గురించి ఇలా అన్నారు: "ధ్యానంలో కూర్చున్న తరువాత, నేను చదివిన పుస్తకాలన్నీ గుర్తుకొచ్చేయి. నేను వ్రాయవలసిన పుస్తకంలోని పాత్రల గురించి ఆలోచనలు వచ్చేయి. అంతలోనే అరగంటసేపు చేయవలసిన ధ్యానం ముగిసిందని కళ్ళు తెరిచేను. వాచీ చూసుకొంటే ఐదు నిమిషాలు గడిచాయి."

ఇటువంటి అలజడి సాధారణంగా మన మనస్సును స్వాధీనంలో ఉంచడానికి ప్రయత్నిస్తే ఉంటుంది. తామసికునికి అది భరించ రానిది. అతడు ధ్యానంలో వాడే తలదిండును షాపుకు తీసికెళ్ళి "దీన్ని అమ్మిపెట్టు. ఆ డబ్బంతా నువ్వే వుంచుకో. నేను ధ్యానాన్ని వదిలేస్తున్నాను."

తమస్ అంటే చీకటి. తామసికుడు చూడలేడు. వాడు జీవితమంతా చీకటిలో బ్రతుకుతూ అంధుడిలా ప్రవర్తిస్తాడు. యుద్ధం వస్తే వానికి తెలీదు. పీల్చే గాలి కాలుష్యంతో నిండివున్నా వానికి పట్టదు. వాని నివాస స్థలంలో హింసాకాండ చెలరేగుతుంటే పట్టించుకోడు. నేనెప్పుడో చదివేను ఒక కుటుంబంలోని సభ్యులంతా నిద్రలో నడుస్తారని. మధ్య రాత్రిలో లేచి వారు కలసి తింటారు. మరుసటి ఉదయం వాళ్ళలో వాళ్ళే ప్రశ్నించుకొంటారు "ఎవళ్లు ఇక్కడ తిన్నారు?" ఇది మనం చేసే క్రియలకు భిన్నంగా లేదు. మనకున్న చేతనంతో పోలిక చేస్తే, మనలో చాలామంది జీవితం అర్థరాత్రి తినడంలాగా గడుపుతారు.

కొన్ని సంవత్సారల క్రితం నా మేనకోడలిని ఐస్ షో కి తీసికెళ్ళేను. అక్కడ ఒక మర మనిషి ఐస్ మీద స్కేటింగ్ చేసింది. దాని చుట్టూ ఒక ఆడది, మెరుపులు గొలిపే బట్టలు వేసుకొని, మానిటర్ తో మర మనిషిని కదిలిస్తున్నది. "రోబోట్ కుడివైపు తిరుగు, పరిగెత్తు, నోరు తెరచు" అన్నట్టు ఆ మానిటర్ తో దానిని నడిపింది. ఇదే తామసికునికి జరిగేది. బుద్ధుడు చెప్పినట్లు ఇది జీవించడం కాదు. నిద్రపోవడం. స్వార్థపూరిత కోర్కెలతో అటునిటు లాగబడితే దాని వల్ల ఎవరికీ ఉపయోగం లేదు.

బద్దకం తామసికుని లక్షణం. వానికి ఆలోచించడం, అనుభవించడం, కదలడం, వ్యాయామం చేయడం, టివి చానెల్ ను మార్చడం అంటే బద్దకం. మనకు చెడుని ఎదిరించి, ప్రపంచానికి ఏదైనా మంచి చేయడం కష్టమే. తామసికులు వలం అవతారు. వాని మనస్సు బరువుగా ఉంటుంది కాబట్టి శరీరం దానితో సమానంగా ఉంటుంది.

బెర్ క్లీ లో ఒక గోడమీద ఇలా వ్రాసి ఉంది: "నాకు కావలసినది మద్యం, గంజా". ఇది తామసికునికి బాగా వర్తిస్తుంది.

తామస గుణాన్ని వదిలించుకోవాలంటే మొదటి అడుగు భౌతికం. తామసికుడు జడత్వంతో నిరుత్సాహంగా, నిర్లక్ష్యంగా ఉంటాడు. వాడిని ఎవరో ఇలా శాసించునట్టు తలుస్తాడు: "నాకు కావాలసినట్టు కూర్చోకూడదని ఎందుకు చెప్పారు?" తామసికుడు భౌతికంగా ఆరోగ్యంతో లేనని తలుస్తాడు. వొళ్లంతా నొప్పులతో ఉన్నట్టు, ఎవరూ పట్టించుకోనట్టు వాని అనిపిస్తుంది. కాని తమస్ ఉన్నప్పుడు విశ్రాంతి తీసికోకూడదు. కావలసింది విశ్రాంతిని తగ్గించుకోవడం. పైపై కొన్ని ఆనవాలు ఉంటాయి : తలనొప్పి, నరాల బలహీనత, కాళ్ళలో రక్త ప్రసారం లేనట్టు, తల బిరుసుగా ఉన్నట్టు. మంచంమీద పడుకొంటే భౌతిక పరిస్థితి విషమిస్తుంది. లేచి నడవాలి. మంత్రం జపిస్తూ వేగంగా నడవాలి. పది నిమిషాలు అలా నడుస్తే వొళ్ళు స్వాధీనంలోకి వస్తుంది. అక్కడితో ఆపకూడదు. అలా నడుస్తూ ఉ౦డాలి.

మీరు ఒక రిపోర్ట్ రాద్దా మనుకొన్నారు. తామసం ఆవహించింది అనుకోండి. కొన్ని పెన్సిళ్ళను ముల్లు చెక్కి తయారుచేసుకొన్నారు. దానితోనే కొన్ని పుస్తకాలు బెంచీ మీద పెట్టేరు. తెల్ల కాగితం ముందు పెట్టుకున్నారు. వ్రాయడానికై ఆలోచన చేస్తున్నారు. ఇది చాలాకాలంగా జాప్యం చేయబడిన రిపోర్ట్ . అది రేపే పై వాడికి ఇవ్వాలి. ఏదో ఒకటి వ్రాయాలి.

మీకు రిపోర్ట్ దేని మీద వ్రాయాలో తెలీదు. బహుశా మీరు ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నీ చదివి, కాచి వడబోసి, రిపోర్ట్ తయారు చేసుకోవాలనుకొంటున్నారు. ఇక్కడ పరిపక్వం అంటే జాప్యం. పరిపక్వతను సాధించడానికి ప్రయత్నించడంలో తప్పులేదు. కానీ అది క్రియ చేయకముందే ఉండాలంటే దానికి చాలా కాలం వేచి వుండాలి.

నా విద్యార్థులకు స్వీయానుభవం ఇలా చెప్పేను: మీకున్న జ్ఞానంతో వ్రాయడం మొదలు పెట్టండి. ఏదో క్రొత్త గ్రంధాన్ని ఆవిష్కరిస్తున్నట్టు కాదు. మీ వ్రాసే శైలిని గురించి బాధ పడకండి. ఎవరూ చదవకపోయినా కొంత మంది సరైన పదం గురించి తర్జనబర్జన పడతారు. ఒక్కొక్కపుడు దానివలన కొన్ని గంటలు కాగితాన్ని చూస్తూ గడుపుతారు. వ్రాసే విధానం గూర్చి బాధ పడకండి. మీకు కావలసినది వ్రాయడం. అది అయిన తరువాత దానికి తగిన రీతిలో మెరుగులు దిద్దవచ్చు.

మొదటి మెట్టు భౌతికమైన క్రియ. మీ కలాన్ని ముందుకు నడపండి. మీరేమి వ్రాస్తున్నానని అని బాధ పడకండి. క్రమంగా తమస్ తగ్గి దాని స్థానంలో రజస్ వస్తుంది. ఒక ఆలోచన వస్తుంది. అటు తరువాత దానిని ఖండించే ఉంకో ఆలోచన వస్తుంది. వాటిని వ్రాసి, ఆ రెండిటికి ఏమైనా సంబంధం ఉందో లేదో చూసుకోండి. దాన్ని మరల, మరల, పరీక్షించండి. ఇంతలోనే ఒక గంట గడిచిపోతుంది. మీ మిత్రుడు కాఫీ త్రాగడానికి రమ్మంటాడు. మీ సమాధానం: "నేను తరువాత వస్తాను. బుర్రలో జ్ఞాపకమున్నప్పుడే ఈ పని చేయాలి."

భౌతిక క్రియలతో, కలంతో కాగితం మీద వ్రాస్తూ, తమస్ ని వెళ్ళగొట్టి, ప్రాణ శక్తిని పొందుతారు. ఇప్పుడు మీరు దృష్టిని కేంద్రీకరించగలరు. మీ సావధానత పూర్తిగా మీరు చేస్తున్న క్రియపై పెట్టండి. తమస్ దాన్ని చిందరవందర చేయడానికి ప్రయత్నిస్తుంది. అదే అయితే మీ మనస్సు వికలమవుతుంది. ఇది మనకు చేస్తున్న పని వృధా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ క్రియని ఆపేస్తే తీరని నష్టం కలుతుంది. సమస్యను జటిలం చేస్తుంది. ఎప్పుడైతే ఒక క్రియ వృధా అనిపిస్తుందో, దానిమీద దృష్టి కేంద్రీకరించాలి. మనస్సు వికలంగా ఉంటే ఇంకా తీక్షణంగా ఉండాలి. మీ మనస్సును ధ్యానంలో లాగ వెనక్కు తీసికో౦డి. కొంత కాలం తరువాత అది సహజమై, కావలసిన ఫలితం ఇస్తుంది.

ధ్యానం వల్ల మనస్సును మనకు కావలసినట్టుగా మార్పు చేయవచ్చు. నా దగ్గర ఒక టార్చ్ లైట్ ఉంది. నేను దాన్ని జేబులో పెట్టుకుంటాను. దాన్ని నాకు కావలసిన చోట వాడుతాను. అది దానికై సర్వసిద్ధంగా ఉండాలి. చాలామందికి క్రియాశీలత సిద్ధంగా ఉండదు. ఎలాగంటే టార్చ్ లైట్ జేబులో ఉన్నంత కాలం అది నిరుపయోగం. దాని ఉపయోగం తెలుసుకోవాలంటే వాడి చూడాలి .

మన మనస్సును నియంత్రించుకొంటే మనం చేయవలసిన క్రియ మీద పూర్తి ఏకాగ్రత ఉంటుంది. ఇది అమోఘం. ఎవరైతే అలా ఉన్నారో వాళ్ళు సాధించనిదంటూ ఏమీ లేదు. వాళ్ళు ఇలా తమను తాము ప్రశ్నించుకోరు: "నాకిది ఇష్టమా? నాకు దీని వల్ల ఒరిగేదేమిటి?" కాలుష్యం లేదా హింస ని లేకుండా చేయడానికి పూనుకొన్నవారు తమని తాము మరచి, వేరొకరికై పాటుపడతారు. ఇటువంటి క్రియలవల్ల ఒత్తిడి, ఉద్రిక్తత, నిరాశ దూరమౌతాయి. 137

Saturday, February 26, 2022

Eknath Gita Chapter 14 Sloka 5

14.5

రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం

తన్ని బధ్నాతి కౌన్తేయ కర్మసంగేన దేహినమ్

కౌన్తేయా! రజోగుణము కామరూపమైనది , అది ఆశను, సంగమును కలుగజేయును. కర్మలయందు ఆసక్తిని కల్పించి జీవుని బంధించును

రజస్ మనను బంధించ కారాగారంలో పడేస్తుంది. ఎందుకంటే అది స్వార్థపూరితమైనది: నేను, నాది, మొదలైనవి. ఇది రజస్ కున్న పెద్ద లోపం. రాజసికుడు తామసికుడు కన్న ఫరవాలేదు: వానికి మోహం, అపరిమిత శక్తి ఉన్నా, కొంత సున్నితత్వము కూడా ఉంది. "నేను సున్నిత స్వభావము కలవాడిని. సున్నితులలో మొదటి వాడిని. నాకు ఏమి కావాలో నాకు తెలుసు" అని అంటాడు. వానికి ఏమి కావాలో వాడికి నిజంగా తెలుసు. దానిని ఏదో విధంగా పొందుతాడు. దాని వల్ల ఎవరికైనా హాని జరిగితే పట్టించుకోడు. అది పర్యావరణ విషయమైతే "మనం దానితో సద్దుకుపోవాలి" అంటాడు. అది మారణాయుధాల గురించి అయితే "పురోగతికై అవసరము. " అంటాడు.

స్మాగ్ విషయం చూద్దాం. స్మాగ్ నిరోధక యంత్రాలు నిజంగా స్మాగ్ ని నిరోధించటంలేదు. స్మాగ్ కి కారణం యంత్రాలు, ఫర్నెస్ లు, ఇంజిన్ లు కావు. మానవులను శాస్త్రజ్ఞులు హోమో సేపియన్స్ అంటారు. అనగా ఆలోచించే శక్తి గలవారు. ఇది అనవసరమైన బిరుదు. బెర్గ్ సన్ అన్నారు మానవులకు అచ్చొ చ్చిన పేరు హోమో ఫేబర్ . అనగా ఎవరైతే వస్తువులను తయారు చేస్తారో. రాజసికుడు అంటాడు "నేను వస్తువులను తయారు చేస్తాను. అది కాక నేను ఏమి చేయగలను? అన్నిచోట్లా నాకు వీలైనన్ని వస్తువులను తయారు చేసి నింపుతాను. పిదప, వాటిని మానవాళి వాంఛిస్తుంది. వారికి వాటితో ఏమి చేయాలో తెలియదు కాని, అవి కావాలనే ధృడమైన సంకల్పం కలుగుతుంది". వాడు రహదారులు, పట్టణాలు, వాహనాలు, పళ్ళు తోముకొనే బ్రష్ లు, విమానాలు, ఆయుధాలు, ఒకటేమిటి అన్నీ చేయాలని ఆకాంక్షిస్తాడు.

వస్తువులు చేయడంలో తృప్తి ఉంది. దానిని నేను కాదనను. ఆ సంతుష్టే మనని బంధిస్తుంది. రాజసికుడు ఏమైనా తయారు చేస్తూంటే దానిలో లీనమైపోతాడు. అతడు వస్తువు లోపలకి దూరినట్టు ఉండి, తాళం వేసుకొని నట్టు ఉండి, బయటనుంచి ఎవరు కేకేసినా విననట్టు ఉంటాడు. ఈ విషయంలో తామసికుడు లాగ అంధుడు, చెవిటివాడు.

ఏదైనా బజారులో లేదా షాపులలో చూడండి, వాటిలో ప్రదర్శించబడిన వస్తువులలో మనకి నిజంగా ఎన్ని కావాలి? వాటిలో ఎన్ని మనకు నిజంగా ఉపయోగపడతాయి? ఇది హోమో ఫేబర్ లు చేసిన సహాయం. మనం నేతి, నేతి ప్రక్రియతో అక్కరలేని వస్తువులు తీసివేస్తే మిగిలేవి ఒకే ఒక షాపులో నిండినన్ని.

అనుభవించే మనకి ఈ ప్రక్రియతో అవినాభావ సంబంధం ఉంది. కొనేవాళ్ళము మనము. మనం వాహనాలకై, బట్టలకై, పరికరాలకై అక్కరలేని కొనుగోళ్లు చేస్తూవుంటే, కాలుష్యాన్ని పెంచినవారమౌతాము. నేను నిరాడంబరంగా ఉండడానికి పేదరికం మంచిదని అనటంలేదు. నిరాడంబర జీవితం ఆనందం, తృప్తి నిచ్చేది. వస్తుసముదాయముతో కూడిన జీవితం అవసరంలేదు. అవి కళలకు సంబంధించినవి అయినా సరే.

నేను, నా భార్య వోక్ లాండ్ లో నివసిస్తూ ఉండగా ఒకరోజు ఒక పెద్ద లారీ మా నివాస స్థలానికి వచ్చింది. "వాళ్ళు న్యూ జర్సీ నుంచి వస్తున్నారు" అని నా ఇంటి ప్రక్క వాడు చెప్పేడు. ప్రపంచంలో ఎక్కడికైనా వస్తువులను తీసికివెళతాం అని ఆ లారీ మీద వ్రాసి ఉంది. నేను కుతూహలంగా ఏ రకమైన కళలకు సంబంధించిన వస్తువుల మూడు వేల మైళ్ళు మోసుకొని తెచ్చేరో చూద్దామని అనుకున్నాను.

ఆ లారీ తలుపులు తెరిస్తే ఇవి కనబడ్డాయి: కుర్చీలు, దీపాలు, మంచాలు, కోట్లు తగిలించే హ్యాంగరులు మొదలగు వస్తువులు. అవి అమెరికాలో ఎక్కడైనా దొరుకుతాయి. వాటిని వాళ్ళు న్యూ జర్సీ లోనే వదిలి, ఓక్ లాండ్ లో కొనుక్కొన వచ్చు. ఏమీ తేడా తెలీదు. మానవులు తమ వస్తువులతో బంధింపబడతారు. వాటిని ఎక్కడికి వెళ్ళినా మోసుకొను పోతారు. గతంలో ముడిపడిన వాటి భారాన్ని లెక్క చేయరు.

నేను చెప్పినంత మాత్రాన మీ ఇంట్లో వస్తువులను దాన ధర్మాలు చేయకండి. నేను చెప్పేది వస్తువులతో అసంగత్వంగా ఉండమని. మీవద్ద ఎంతో పురాతనమైన, ఖరీదైన కళా వస్తువులు ఉండచ్చు. వాటిని చూసి ఆనందించండి కాని వాటికి అతుక్కుపోవద్దు. వాటితో తాదాత్మ్యం చెందితే వాటిని నిజంగా అనుభవించిన వారు అవ్వరు.

మనం స్వార్థంతో ఒకరితో అనుబంధం పెంచుకోవచ్చు. నిస్వార్థ అనుభందం ప్రేమ. మీరు మీగురుంచి ఆలోచించకుండా, అవతల వాళ్ళ సుఖానికై బ్రతుకుతారు. కానీ స్వార్థపూరిత బంధంలో ప్రేమ లేదు. ప్రేమ నిస్వార్థమైతే అనుబంధం గట్టి పడుతుంది; అదే స్వార్థపూరితమైతే అనుబంధం తెగుతుంది. వస్తువులలాగే, స్వార్థంతో సంబంధం పెట్టుకుంటే, మీరు దానితో బంధింపబడతారు. మీవారి అక్కరలు తెలియదు. నిజానికి మీకు కావలసినది ఏమిటో కూడా తెలీదు. నిజంగా మనం ఒకరిని ప్రేమించామంటే వాళ్ళని వస్తువులులా -- అంటే "ఇది నాది. ఎవ్వరూ ముట్టుకోకూడదు" -- చూడకూడదు.

మనందరికీ సహజంగా ఒక వస్తువును పొందుదాము, ఒక వస్తువును ఇతరులకు ఇద్దాము అని ఉంటుంది. మనం చిన్నప్పడినుంచీ, దేవుడి దయతో, ఒక వస్తువుని ఇతరులనుండి పొందితే ఎవ్వరికీ లాభం లేదని నేర్చుకోవచ్చు. మొదట్లో అంతా బాగా ఉన్నట్టే ఉంటుంది. అది స్వార్థ బుద్ధికి నిదర్శనం. క్రమంగా ఆకాశం మారుతుంది. ఒక చిన్న మేఘం -- మన చెయ్యి అంత పెద్దది -- అగుపిస్తుంది. "బ్రెడ్ ని కాల్చాలా, లేక పచ్చిగా తినాలా ? బ్రెడ్ గోధుమతో చేయబడినదా లేదా వేరొక పదార్థంతోనా?" అని తర్జనబర్జన పడతాం. మనతో మనకు కావలసిన వారు ఏకీభవించరు. ఆ మేఘం కాఫీ వైపు వెళుతుంది. రాజసికుడు చిక్కని కాఫీ అవసరమున్నా లేకున్నా తాగాలనుకొంటాడు. వాని భార్య కెఫీన్ లేని కాఫీ తాగాలనుకొంటుంది. వాని చెయ్యి పరిమాణమున్న మేఘం, వాని తలంత పెద్దదయింది.

రాజసికుడు ఇంటికి మధ్యాహ్న భోజనానికి వస్తాడు. వాని భార్య సాదరంగా ఆహ్వానించి "మీ గురించి వేచి ఉన్నాను" అంటుంది.

రాజసికుడు "నా వాచీలో ఐదే అయింది. క్రిందటి వారం డైరీ క్వీన్ వద్ద నీ గురించి ఎంతసేపు వేచి ఉన్నానో గుర్తుందా?" అని అడుగుతాడు.

"గతాన్ని తవ్వకండి. ఇప్పటి కాలంలో ఉండండి. అది డైరీ క్వీన్ కాదు. "

స్వార్థ పూరిత అనుబంధం ఇలాగే ఉంటుంది. అది ఒకానొక రోజు తిరగబడుతుంది. కొన్నాళ్ళకు మనం నిజమైన ప్రేమ అనేది అత్యంత బాధను కలిగించేదిలా అవుతుంది: మీరు ఎవరినైతే గతంలో గాఢంగా ప్రేమించారో, వాళ్ళు ఇప్పుడు ప్రకోపింప జేసేవారవుతారు. క్లియోపాత్ర రాణిని తలపించిన ఆమె ముక్కు ఇప్పుడు చూడడానికే అసహ్యం అనిపిస్తుంది. ఆయనగురించి ఒకప్పుడు కలలు గనేవారు. కలలు పండకపోతే ఆయనను చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది. ఈ రోజుల్లో రాజసికుల జీవితం ఇలాగే ఉంటుంది. వాళ్ళు ఇలాగ క్రిందకి పడనక్కరలేదు. ఒకవేళ పడినా వాళ్ళ సంబంధాలను సత్త్వంతో తిరిగి పెంపొందించుకోవచ్చు.

ఒకరోజు నేను పాచి (Lichens) గురించి చదువుతున్నాను. దీన్నిబట్టి మీరు జ్ఞానార్జనకి నేను ఎంత దూరం వెళతానో అర్థం చేసుకోగలరు. నేను జీవితంలో మార్చలేని సిద్ధాంతాలను పాచిని ఉదాహరణగా తీసికొని చెప్తాను. నా మనస్సు ఒక్కొక్కప్పుడు ఇలా చెప్తుంది: "నువ్వు రచయితవు. నువ్వు చిన్న చిన్న జీవుల గురించి తెలుసుకోవడంకంటే ఒక మంచి నాటకం గూర్చిన పుస్తకం చదవరాదూ ? " కానీ నాకు పాచి వ్రాయడానికి మంచి స్పూర్తినిచ్చింది. అవి ఏ మొక్కా పెరగలేని వాతావరణంలో బ్రతుకుతాయి. శాస్త్రజ్ఞులు దానికి కారణమేమిటని పరిశోధన చేస్తున్నారు. పాచి రెండు రకాల జీవుల సంయోగం. ఒకటి ఆల్గే , రెండవది ఫన్గస్. అవి పరస్పర౦ సహాయం చేసికుంటూ బ్రతుకుతాయి. వాటి జీర్ణశక్తిలో, స్వభావములో, ప్రకృతిలో చాలా తేడాలున్నాయి. ఒకటి పదార్థాన్ని తయారు చేస్తే, రెండవది నీరు సమకూరుస్తుంది. రెండూ కలసి మెలసి ఎటువంటి వాతావరణంలోనైనా ఒత్తిడి పడక బ్రతుకుతాయి.

ఇది ఒక మగవాడు, ఆడది కూడా చేయగలరు. వాళ్ళు ఇద్దరూ శివ-పార్వతులులా ఒకే స్వరూపం. వాళ్ళు పరస్పర అవగాహన పెంచుకొని, ఒకరికొకరు సహాయం చేసికొ౦టే ఎటువంటి శక్తీ వారిని విడదీయలేదు. అటువంటి స్థితిలో వాళ్ళ మధ్య గట్టి బంధం ఏర్పడుతుంది.

ఎక్కడైతే ఆడ మగ పోటీ పడతారో అక్కడ ప్రేమ ఉండదు. కృత్రిమ ప్రేమ నటన కూడా పనిచేయదు. ఎక్కడైతే స్పర్థ ఉంటుందో అక్కడ మరణమొక్కటే ఉండగలదు. మన సమాజములో శోచనీయాంశం ఏమిటంటే ప్రేమ పేరుతో ఆడ మగ మధ్య ప్రతి రంగంలోనూ స్పర్థలు కలిగించడం. నేను రోజూ వాటిగురించి పుస్తకాలలో, సినిమాలలో , టివిలో, విద్యాలయాలలో, ఇళ్ళలో చూస్తున్నాను. మనమందరము మన బుద్ధిని ఉపయోగించుకొని ఆడామగా పరస్పర సహాయంతో కలసి మెలసి ఉండాలని తలచి వాళ్ళ మధ్య స్పర్థలు పెట్టకుండుటకు ప్రయత్నించాలి. 126

Saturday, February 19, 2022

Eknath Gita Chapter 14 Sloka 4

14.4

తత్ర సత్త్వ౦ నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం

సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ

అర్జునా ! ఈ త్రిగుణములలో సత్త్వ గుణము నిర్మలమైన దగుటచేత ప్రకాశమును కలుగజేయునదియు, నిర్వికారమైనదియు నగుచు సుఖాభిలాషయచేతను, జ్ఞానాభిలాష చేతను జీవుని బంధించుచున్నది

త్రిగుణాలను వ్యష్టి పరిణామము దృష్ట్యా చూడవచ్చు. జడత్వం, జాప్యం చేయుట, శక్తిలేమి, లక్ష్యం లేకుండుట, "నాకు లెక్క లేదు. ఈ కర్మ చేయకపోతే ఏమవుతుంది?" అని తలంచేవారు, తమస్ యొక్క లక్షణాలు గలవారు. అపరిమిత శక్తితో క్రియలు చేయవలెనని పట్టుదలతో, ఎప్పుడూ ముందుకు సాగుతూ, లక్ష్యం లేకుండా ప్రవర్తిస్తూ, స్వాధీనములోలేని గాలివానవంటి మోహంతో ఉన్నవారిలో రజస్ ఎక్కువగా ఉన్నది. ఎవరైతే తమ సమయాన్ని, శక్తిని పరోపకారమునకై దారపోస్తారో, ఇతరులను దూషింపక వారి తప్పులను క్షమిస్తారో అట్టివారిలో సత్త్వ గుణము అధిక పాళ్ళలో ఉన్నట్టు. వారిలోని గుప్తమైన శక్తిని వెలికి తీసి, దాన్ని స్వాధీనము చేసుకొని ఇతరుల వృధ్ధికై పాటుపడతారు.

సత్త్వము, తమస్ పరస్పరం సహాయం చేసుకుంటాయి. కాని వాటిలో అగాధమంత తేడా ఉంది. తమస్ మొద్దు బారినది. తామసిక వ్యక్తికి కుర్చీలోంచి లేచి పక్క దగ్గరకు వెళ్ళడానికి బద్దకం. సాత్త్వికమైన వ్యక్తి అపారమైన శక్తితోకూడి ఉంటాడు. ఆ శక్తి అతని ఆధీనంలో ఉంటుంది. వానికి అందరికన్నా ముందు ఉండాలనే కోర్కె ఉండదు. తన శక్తిని ఎప్పుడు ఎలా ప్రదర్శించాలో తెలిసినవాడు.

"నేను ఏమి చేయాలో ఆలోచించుకొని చేస్తాను. సాధారణంగా ఏమీ చేయవలసిన అవసరం లేదు. వేచి చూడు అన్నది నా ధ్యేయం. వాటిపాటికి వదిలేస్తే అవే సద్దు కొంటాయి" అని తామసిక వ్యక్తి అనుకొంటాడు.

సాత్వికునికి సులభంగా కోపం రాదు. దానివలన వానిలో గొప్ప శక్తి గుప్తంగా ఉంటుంది. వానికి ప్రాణ అనే ఆర్జన ఉండి, బ్యాంక్ అకౌంటు లో కొంత సొమ్ము ఉంటుంది. వీటి వెనుక ఎక్కువ సొమ్ము స్టాక్ మార్కెట్ లో ఉంటుంది. కావలిసినప్పుడు తన స్టాక్ ను అమ్మి లక్షలు తన బ్యాంక్ అకౌంటు కు జమ కట్ట గలడు. రజస్ తో ఉన్న వ్యక్తి తన సొమ్మంతా బ్యాంక్ లో దాస్తాడు. అతని వద్ద చాలా క్రెడిట్ కార్డ్ లు ఉండి, వాటిపై ఖర్చులు పెట్టి, దివాలాకి దగ్గరగా ఉంటాడు. అతని ఆస్తులు గొప్పవే. అలాగే అతని ఖర్చులు కూడా. అతను నడివయస్సును దాటిన తరువాత తలకుమించిన ఖర్చులు చేసి, బ్యాంక్ లోని సొమ్ము నంతటిని వాడుకుంటాడు. తామసిక వ్యక్తి డబ్బంతా పోగొట్టుకుంటాడు. తను చెల్లించ వలసిన రుసుములను ప్రక్కన పెడతాడు. వానిని జమ కట్టడానికి తయారవుతాడు, కాని ఎన్నో ఆలోచనలలో మునిగి వాటిని నిర్లక్ష్యం చేస్తాడు. బాహ్య కర్మలే ప్రాణాన్ని క్షయం చేయనక్కరలేదు. స్వార్థానికి ఎక్కడలేని ఖర్చులు చేసినా ప్రాణం వ్యచ్చి౦పబడుతుంది. తామసిక వ్యక్తి తన జీవితాన్ని వ్యధతో గడుపుతాడు. ఎల్లప్పుడూ తన సమస్యలు, కాంక్షలు గురించి ఆలోచిస్తూ తను కట్టవలసిన రుసుములను నిర్లక్ష్యం చేస్తాడు. గాలిలో మేడలు ఇలా లెక్కలు కడతాడు: "సెలవుకు 20, నా జాలి 75, పైనున్న ఉద్యోగికి ఏమి చెప్పాలో దానికి 100, మొత్తం 477.95". అతను అలాగ సతమతమౌతాడు.

మా ఎలెక్ట్రిక్ సంస్థ రోడ్డు ప్రక్కన విద్యుత్చ్ఛక్తి వాడకాన్ని తగ్గించుకోమని ప్రకటనలు పెట్టింది. "ఇది ఇలా చేయకు. అనవసరమైన వానిని ఆఫ్ చేయి." మన ప్రాణ శక్తిని కూడా అలాగే వ్యర్థం అవ్వకుండా చూసుకోవాలి. దానికై సులభమైన పద్దతి: "స్వార్థాన్ని తగ్గించుకొని, పరోపకారానికి పూనుకోవాలి." మననుండి దృష్టి మార్చి, ఉదాహరణకు మంత్రాన్ని మనస్సులో ధ్యానిస్తూ ఉంటే, ప్రాణ శక్తి తక్కువ ఖర్చు అవుతుంది. ఇతరుల గూర్చి ఆలోచిస్తున్నప్పుడు ప్రాణ శక్తి వృద్ధి అవుతుంది. ఈ విధంగా సాత్వికుడు ప్రాణ పరంగా ధనికుడవుతాడు. సెయింట్ ఫ్రాన్ సిస్ ఇలా చెప్పేరు: "మనం ఇతరులకు దానం చేయడం వలననే లబ్దిని పొందుతాము." అది అక్షరాలా నిజం. పరులకు 10 ప్రాణ రూపాయలు ఇస్తే , మనకు భగవంతుడు ప్రతిఫలంగా 20 ప్రాణ రూపాయలు ఇస్తాడు. మీరు దీనిని అమలుపెట్టి చూడండి. మీకే తెలుస్తుంది. దానికి వ్యతిరేకంగా ఒకరి దగ్గరనుండి కాజేస్తే మనకు నష్టం కలుగుతుంది. మనం ఏదీ పొందకపోవడం సరి కదా, ఉన్నది ఊడ్చుకు పోతుంది.

మనం క్రియా శక్తి దృష్ట్యా చూడవచ్చు. తామసిక వ్యక్తికి అది శూన్యం. అదిలేక తన క్రియలను చేయలేకున్నాడు. వానికి జాప్యం చేయడం వలన కలిగే నష్టాలను ఎంత చెప్పినా వినడు. తమస్సు అతనికి చెప్పిన దానిపై మనస్సును పెట్టక, చెవులున్నా వినీ విననట్టు చేస్తుంది.

రజస్ కు క్రియాశక్తి , క్రియల చేయాలనే ఉత్సాహం ఎక్కువ ఉంది కానీ బుద్ధి తక్కువ. ఎక్కువ కోర్కె, తక్కువ బుద్ధి వల్ల సమస్యలు ఎదురవుతాయి. తమోగుణమున్నవానికి ఒక మంచి లక్షణం ఉంది. వానికి ఆశ లేదు. ఎందుకంటే వానిలో శక్తి లోపించింది. ప్రపంచంలో అతి మూల్యమైన చాకోలేట్ తీసుకొని ఒక స్థంబం ముందు పెడితే ఎలా ఆ స్థంబం స్పందించదో అలాగే తామసిక వ్యక్తికి కోర్కె లేదు. వానికి అమితమైన తిండి తినాలని అనిపించవచ్చు, కాని దానికి కూడా బద్దకిస్తాడు. తామశికులు శిలా విగ్రహాల్లాగ ఉంటారు. వారిని ఒకచోట వదిలి, రెండేళ్ళ తరువాత చూస్తే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నటు వాళ్ళ స్థితిలో ఎట్టి మార్పూ ఉండదు. అలాగే తామసికులకు కోపం రాదు. అది వాళ్ళలో క్షమించాలనే లక్షణం ఉండి కాదు. వాళ్ళలో ఆశ అనేది లేక. వాళ్ళలో దురాశ లేదు. అది వాళ్ళ వైరాగ్యం వల్ల కాదు. వాళ్ళలో స్పందన లేక ఏదీ కాంక్షించరు. వాళ్ళు దేన్నీ ప్రేమించ లేరు. ఒక వింతను చూడడానికి ఇష్ట పడరు. అది వాళ్ళ ప్రక్కనే ఉన్నా. గొప్ప ఖరీదైన వాహనాన్ని చూసి "నాకు దాన్ని పొందుతే ఎలావుంటుంది" అని అనుకోరు. వాళ్ళ జవాబు "నాకేం పట్టింది?"

తమస్ లో సున్నితము, స్పురణ లేదు. స్వామి వివేకానంద ఇలా చెప్పేవారు: నిరాశ కన్నా ఆశ నయం, స్తభ్దత కన్నా కోపం నయం, చచ్చినట్టు పడి ఉండడం కన్నా ఒక్కొక్కప్పుడు విలాసంగా బ్రతకడం నయం. ఈ వ్యాఖ్యలు మనకి తమోగుణం హెచ్చయినప్పుడు పనికి వస్తాయి. కూర్చోవడం కన్నా ఏదో దిక్కులో అటూ ఇటూ తిరగడం నయం. కదులుతూ ఉన్నప్పుడు దిక్కుని మార్చుకోవడం సులభం.

రాజసికులుకు కోపం వెంటనే వచ్చేస్తుంది. వాళ్ళు అవతలి వాళ్ళని లెక్క చేయక, వస్తువులను కోరుకుంటూ, వాళ్ళ మార్గమే ఉత్తమమనే విధంగా ఉంటారు. విరోధము ఎన్నాళ్లయిన పెట్టుకొంటారు. వాళ్ళ జ్ఞాపకశక్తి మెండు. మనమనవచ్చు "ఎంత చెడు భావన!". అయినప్పటికి రాజసికులకు భవిష్యత్ ఉంది. గ్రీటింగ్ కార్డ్ పంపిస్తున్నపుడు మనమిలాగ వ్రాయవచ్చు: "మంచి మిత్రునికి వ్రాయునది." శక్తి చాలా ఉంది. అలాగే మార్పుకుకూడ అవకాశముంది.

దానితో పోలిస్తే తమస్సు తుస్సు టపాకాయి. స్వామి వివేకానంద తమస్సును మెత్తగా నానిన దుంగ అంటారు. ఎన్ని అగ్గిపుల్లలు వెలిగించినా దానిని మండించలేము. రజస్సు అలాగ కాదు. ఒక్క అగ్గి పుల్ల చాలు. వాని చిత్త చాంచల్యం ప్రమాదకరమవ్వచ్చు . కానీ వాడు ఏదో క్రియచేస్తూ ఉంటాడు. వానికి శక్తి ఉన్నది.

రాజసికుడికి ఎప్పుడూ ఏదో పని చేయాలని ఉంటుంది. పనిలేకుండా ఉండడు. బస్ గురించి నిరీక్షించాలంటే ఊరకనే ఉండడు. సిగరెట్ వెలిగిస్తాడు లేదా మెటికలు విరుచుకుంటాడు. ఊరకనే కూర్చొని సినిమా చూడడు. ఏదో తినుబండారాన్ని తింటూ త్రాగుతూ ఉంటాడు. దేని గతి ఐనా నెమ్మదిగా ఉంటే లేచి వెళిపోతాడు. వాహనం నడుపుతున్నప్పుడు రేడియో పెట్టుకొని, వ్రేళ్ళతో స్టీరింగ్ వీల్ మీద తాళం వేస్తూ, రేడియో స్టేషన్ మారుస్తూ ఉంటాడు. రెడ్ సిగ్నల్ దగ్గర దినపత్రిక చదువుతాడు లేదా ఎవరినైనా ఫోన్ చేసి మాట్లాడుతాడు. తన పనిగురించి, సమస్యల గురించి ఆలోచిస్తూ, పక్క మీద అటూ ఇటూ దొర్లుతూ, నిద్ర లోకి జారుకుంటాడు. నిద్రపట్టడానికి మేకలను లెక్క పెడుతూ సింహాలని, పులులని ఊహించుకుంటాడు.

తామసికుడు పరిగెత్తడం కన్నా నడకే మేలనుకొంటాడు. పార్క్ లో పరిగెత్తడం హింసగా భావిస్తాడు. అది రక్తపు పోటుకు దారితీస్తుంది అంటే "అయితే అవ్వనీ" అంటాడు. గుండెపోటు రానంత కాలం ధీమాగా ఉంటాడు. ఊహించ రాని విషయం గురించి ఎందుకు వ్యధ చెందాలి అని తలుస్తాడు. తామసికుడు నడవడం కన్నా కూర్చోవడమే ఉత్తమమని అంటాడు. కార్ మీద "నేను పడుకొని ఉంటే బాగుండును" అని స్టిక్కర్ పెట్టుకుంటాడు. వానికి రాజసికుడు లా కాక నిద్రకు భంగం ఉండదు. స్పృహ లేక నిద్రపోతాడు. మనస్సు పనిచేస్తూనే ఉంటుంది. అతడు భౌతికముగా ఏ పనులూ చేయకున్నా, సంపూర్ణ విశ్రాంతి అనుభవించడు. అతని మనస్సులో భయానకమైన దృశ్యాలు చూస్తాడు.

సాత్త్వికుడికే విశ్రాంతి ఎలా తీసికోవాలో తెలుసు. అవసరమైనప్పుడు కష్టపడి పని చేస్తాడు. కాని వాని మనస్సు అతలాకుతల మవ్వదు. అది మందమవ్వదు. అతను విశ్రాంతి సమయంలో టెన్నిస్ ఆడవచ్చు, కుటుంబంతో సినిమాకి వెళ్ళవచ్చు, లేదా మిత్రులతో ముచ్చటలాడవచ్చు. అతని మనస్సు ఆఫీస్ పని మీదకు మళ్లక ఎదుటివారు ఏం మాట్లాడుతున్నారో చక్కగా వింటాడు. అతని ఆఫీస్ పనిని భౌతికంగా, మానసికంగా అక్కడే వదిలేస్తాడు. ఎక్కడకి వెళ్ళినా పూర్తిగా నిమగ్నమై ఉంటాడు. అతనికి నిద్రపోవడానికి ఇబ్బందిలేదు. అతను మనలాంటివారి ఇద్దరి, ముగ్గురి చేసేపనిని సునాయసంగా తను ఒక్కడే చేయగలడు. అతని రహస్యం: అసంగత్వం. అతను తన పనితో తాదాత్మ్యం చెందడు . కష్టపడి పనిచేసి, ఫలితం గురించి వ్యధ చెందడు. ఫలం దైవానికే వదిలేస్తాడు.

ఒక మంచి నటుని ఉదాహరణగా తీసికొని చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రిందట సర్ మైకేల్ రెడ్ గ్రేవ్ ఆంగ్ల సాహిత్యంలోని కొన్ని అంశాలను చదవడానికి ఏర్పరచిన సమావేశానికి వెళ్ళాను. ఆయన పిక్ విక్ పేపర్స అనే పుస్తకంలోనుంచి ఒకానొక అంశం తీసికొన్నారు. టాప్ మేన్ అనే పాత్ర ప్రేమ వలలో పడడం దాని ప్రధాన విషయము. సర్ మైకేల్, మిస్ వార్ డిల్ ఆ పాత్రలకు అనుగుణంగా నటించేరు. తరువాత వాళ్ళు ఉంకో నవల (The Importance of Being Earnest) ఆధారిత పాత్రలను పోషించేరు. వాళ్ళ మాట తీరు, ప్రవర్తన, మొదటి దానికన్నా చాలా భిన్నంగా ఉన్నాయి. నేను వాళ్ళు వేరే వ్యక్తులనుకునేలా అ విభిన్న పాత్రలలో కనిపించేరు. అలాగే జాన్ డాన్, షేక్స్ పియర్, షా సాహిత్యాని కనుగుణంగా పాత్రలు పోషించేరు. ఈ విభిన్న పాత్రలు చేసిన సర్ మైకేల్ ఉన్నది ఒక్కడే. మనమది ఎప్పటికీ మరువం. దానిలోనే ఉంది సగం కళ. సర్ మైకేల్ అలాగే మరువరు.

సాత్వికుడు అలాగే ఉంటాడు. తన స్వస్వరూపం తెలిసికొని, తన విభిన్న పాత్రలను తడబాటు లేకుండా చేస్తాడు. అతను వైద్యుడయితే ఉదయాన్నే తెల్ల కోటు వేసికొని తన క్రియలను సామర్థ్యంతో నిర్వర్తిస్తాడు. అది అతని వృత్తి. రోగులకది నమ్మిక కలిగిస్తుంది. కానీ తను ఒకానొక పాత్రధారినని మరచిపోడు. ఇంటి కెళుతున్నప్పుడు తన కోటుని తీసి, దానితోనే తన పాత్రను విరమించి ఇంటికి వెళతాడు. ఇంట్లో ప్రేమించే భర్తగా, తండ్రిగా, వివిధ పాత్రలను సునాయసంగా ధరిస్తాడు.

అదే రజస్ అనే వైద్యుని వైనం చూద్దాం. అతనికి తను చదువుకొన్న పాఠ్య పుస్తకాలు కంఠతా వచ్చు. కానీ మానసికంగా రోగులు వారి రోగములతో తాదాత్మ్యం చెందుతాడు. ఇంటికి వెళ్ళినా తన రోగుల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అతను అతి తక్కువ సమయం భార్యాపిల్లలపైన వ్యచ్చిస్తాడు. ఆ వ్యాపకంతో మరుసటి దినం తన ఆసుపత్రికి వెళ్ళేక క్రొత్త రోగులను చూస్తూ, పాత రోగుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దీని వలన తన మనస్సును రోగులమీద కేంద్రీకరించ లేకపోతాడు. అతను గత స్మృతులను తలచుకొంటూ, వాటి బరువును మోస్తూ, అవి తనవేనని ఆవేదన చెందుతాడు. దీనివల్ల ఎవరికీ లాభంలేదు.

అసంగత్వం లేకపోవడం పనిలో పెద్ద అవరోధం. ఈమధ్య ఒక లావాటి పుస్తకం చదివేను. దానిలో అనేక రోగుల చరిత్ర, వారికి సంబంధించిన చిత్ర పఠాలు ఉన్నాయి. దాని రచయితకు తెలీని విషయం: ఒక సాత్వికుడు నిరంతరం అసంగత్వంగా సమస్య లేకుండా పని చేయగలడు.

ఒక ఉపాధ్యాయుడికీ ఇది వర్తిస్తుంది. ఇక్కడ నా స్వీయానుభవము చెప్తాను. ఒక కాలేజీ ప్రొఫెసర్ నిజానికి ప్రొఫెసర్ కాదు. అతను ఇంటా, బయటా, అన్నిచోట్లా ఒక మంచి వాడు. కాని అతడు కాలేజీ లోకి ప్రవేశించగానే పాండిత్యం ఉదయిస్తుంది. గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలను పోగుచేసి, అందులో కొన్ని పెద్ద పుస్తకాలను ఎంచుకొంటాడు. పాఠం చెప్తున్నప్పుడు బోర్డు మీద వ్రాసి, చిత్రాలు గీసి, స్లయిడ్ లు చూపించి, తోచిన హాస్యం కూర్చి, ఒక పండితుడిగా వ్యవహరిస్తాడు. కాలేజీ బయటకు వచ్చినపుడు షాపు కు వెళ్తే అక్కడ అతను ప్రొఫెసర్ కాడు. అందరిలాగా వ్యవహరిస్తాడు. కల్పిత శాస్త్ర సాహిత్యం, స్టాక్ మార్కెట్ లో ఎలా పెట్టుబడి పెట్టాలి మొదలైన వాటి గురించి ఆలోచిస్తూ ఒక సగటి మధ్య తరగతి వ్యక్తి గా మెలుగుతాడు.

సాత్వికుడు అసంగతవ్యంగా వ్యవహరిస్తాడు. ఒక సాత్వికమైన భార్య తన బాధ్యతను సక్రమముగా నిర్వర్తిస్తుంది. పిల్లలకు మంచి తల్లిగా ఉంటుంది. ఆఫీస్ లో డాక్టర్ , ఉపాధ్యాయిని, గుమాస్తా, కంప్యూటరు ప్రోగ్రామర్, అకౌంటెంట్ మొదలగు పాత్రలు ధరించి చక్కగా పనిచేస్తుంది. కొంత కాలం తరువాత యధేచ్చగా, సహజంగా సర్ మైకేల్ రెడ్ గ్రేవ్ లాగ ఆమె వ్యవహరిస్తుంది. తన స్వస్వరూపం ఆత్మ అని తెలిసికొని, జీవితంలో వివిధ పాత్రలను ధరించి, ఇతరులకు సహాయకారిగా ఉండాలనే కాంక్ష ఆమెను బలపరుస్తుంది.

ప్రతి గుణంలోనూ లోపం లేకపోలేదు. తమస్ భయమును కలిగిస్తుంది. తామసికుడు తన నీడను చూసి భయపడకపోవచ్చు. తనను తాను భయంకరమని తలంపక పోవచ్చు. కానీ భయం అనేక రూపాలలో వస్తుంది. అతడు సదా వ్యధతో నుండి, ఏ కార్యము చేయకుండా ఉంటాడు. అతడు దేశ ఆర్థిక పరిస్థితి, అంటువ్యాధుల గురించి వ్యధ చెందవచ్చు. అతడు తన గురించి తక్కినవారు ఏమనుకుంటున్నారన్న భావనతో సతమతమవ్వచ్చు. వాళ్ళు తనను ప్రేమిస్తున్నారో లేదో, తనకు కావలసిన విధంగా స్పందిస్తారో లేదో అని బాధ పడుతూ ఉండొచ్చు. అతడు చాలమార్లు భయానికి లొంగి ఉంటాడు. అది మంచి పద్దతి కాదు.

రాజసికుడు రెండు విధాలుగా స్పందిస్తాడు: కోపం లేదా ఆశ. అతడు ఎన్నిక చేసుకోలేడు. అయినప్పటికి అతని ఎదుగదలకు ఆస్కారం ఉంది. అతను తనను మార్చుకోగలడు. అతనికి కొంత బుద్ధి ఉంది. సమస్యలు ఎందుకు ఎదురవుతాయంటే తనను క్రియలలో నిర్బంధించుకుంటాడు కాబట్టి. అతనిలోని బుద్ధి, కోర్కె ఒక చిన్నపిల్లవాడు, తండ్రిలాగా ఉంటాయి. కోర్కె వేగంగా నడుస్తూంటే బాలుడిలా బుద్ధి వెనకబడుతుంది. కానీ తండ్రిలాంటి కోరిక వేచి చూడదు. అతనికి సహనం లేదు. "నాతో నడవడానికి ప్రయత్నించు. అడుగు తీసి అడుగు వెయ్యి" అంటాడు. కానీ బుద్ధి ముందుకు వేగంగా సాగలేదు. అది ఇంకా వెనుకబడిపోతుంది. అది ఒక సమస్యగా మారుతుంది. అతడు తన కోర్కెలకు బలి అయిపోతాడు. అతడికి ఎన్నుకోడానికి స్వతంత్రము లేదు. ఎంతసేపు ముందుకు సాగాలనే తపన పట్టి పీడిస్తుంది. ఒక వస్తువు లేదా వ్యక్తి గురించి వచ్చే ఆలోచనలను నియంత్రి౦చలేక పోతే, మనస్సును కట్టడి చేయలేకపోతే, కోర్కెను చంపుకోలేకపోతే బుద్ధి తీవ్రంగా వెనకబడుతుంది.

కోర్కె విపరీతంగా ఉంటే అది తీరే వరకు చేతనాన్ని వేదిస్తుంది. ఉద్యోగం చేస్తున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, వాహనాన్ని నడుపుతున్నప్పుడు, నిద్రలో మనస్సు కోర్కె వైపు తిప్పుతుంది. దృష్టి కేంద్రీకరించలేక ఏ పనీ సక్రమంగా నిర్వర్తించలేక, స్నేహితులకు, బంధువులకు దూరమవుతూ ఉండడానికి కారణం బుద్ధి లేక పోవడమే.

అదృష్టవశాత్తూ ధ్యానం ఇందుకు సహకరిస్తుంది. భారత దేశంలో తల్లులు తమ బిడ్డ నడక నేర్చుకుంటున్నప్పుడు మూడు చక్రాలున్న ఊత నిస్తారు. దానితో బిడ్డ చిన్న చిన్న అడుగులు వేసి, నడవడానికి ప్రయత్నిస్తాడు. వాడు సమంగా నడుస్తే తల్లిని చేరుకొంటాడు. ఒకరోజు ఆ ఊతను తల్లి తీసేస్తుంది. "ఇక్కడికి రా" అని పిలుస్తుంది. బిడ్డ రెండు మూడు అడుగులు తత్తరపాటుతో వేస్తాడు. తల్లి వాడిని ప్రోత్సాహిస్తుంది. "రా, ముందుకు రా" అంటుంది. వాడు చివరకు తల్లిని చేరి సేద తీర్చుకొంటాడు. చివరికి వాడికి నడక వస్తుంది. త్వరలోనే వాడు పరిగెత్తి ఫూట్ బాల్ ఆడుతాడు. తల్లి వాడిని ఇంట్లో వుండేలా చేయలేదు.

ఇదే విధంగా మన బుద్ధిని కూడా పెంపొందించుకోవాలి. అది తినే ఆహారంతో మొదలవుతుంది. మధ్యాహ్న రాత్రి భోజనాల మధ్య కాలంలో తినకపోవడం, శరీరానికి హాని కలిగించే ఆహారాన్ని తినకుండా, తీపి కొవ్వు తగ్గించి, పచ్చటి ఆకుకూరలను తింటూ ఉండాలి. ఇది మంచి పోషకాహారమనే కాదు, మన బుద్ధిని కూడా మేల్కొలుపుతుంది.

మన ఇంద్రియాలను కేవలం నేర్పడానికే కాదు. వాని ద్వారా మన బుద్ధిని ప్రభావితం చెయ్యడానికి. దానికి వేరే మార్గ౦లేదు. "సిగరెట్ అలవాటును మానుకోవడానికి మాతో సముద్ర యానంకి రండి" అని ప్రకటనలు చూస్తాం. ఇవి కట్టు కథలు మాత్రమే. మనం వాటిని చూసి మోసపోకూడదు. మీ బుద్ధిని బలపరచడం నిరంకుశముగా మీకు కావలసిన వస్తువును లాక్కోడం, లేదా మనం పట్టిన పట్టు సాధించడానికి కాదు. దాని అవసరం పట్టు వదలని రజస్ ని స్వాధీనం చేసుకోడానికి. తద్వారా మోహం, ఉద్రేకం మొదలైన వాటిని కట్టడి చేసి ఇతరులకై పాటు పడడానికి.

ఇంద్రియాలకు నేర్పుతూఉంటే, రాజసికుడ క్రమంగా బుద్ధిని నేర్చుకోంటాడు. అలాగ అతడు సాత్వికుడిగా మారుతాడు. బుద్ధి పరంగా ఒక పెద్ద వస్తాదు అవుతాడు. కాని వానికి ఎంతో పని లేదు. సాత్వికుడు ఒక కోర్కెను నిరాకరించినా, బుద్ధి సరిగా పనిచేని కోర్కెను తరిమేస్తుంది. కానీ సత్త్వ గుణాన్ని ఎదిరించేది లైంగిక కామం. దానితో నిజమైన యుద్ధం జరుగుతుంది. అదే సాధన. అది చాలా కాలం జరుగుతుంది.

దీని గురించి ఇబ్బంది పడక్కరలేదు. లైంగిక కామం చాలా బలమైన కోరిక. అది జీవితమిచ్చే పెద్ద భౌతిక సుఖం. అందుకే దానికి అంతులేని శక్తి ఉన్నది. కామ కోర్కె అధికంగా ఉంటే వాహనంలో ఇంధనం అధికంగా ఉన్నట్టే. ఆ ఇంధన పాత్రను తీసి పారేయలేం. మనకున్న ఎన్నిక: లైంగిక కామానికి బానిసలమా కామా. దాన్ని అధిగమిస్తే గొప్ప శక్తిని పొంది, అయస్కాంతం లాంటి వ్యక్తిత్వాన్ని పొందవచ్చు. కోర్కెలోని శక్తిని కుండలిని అంటారు. అది మనని చేతనవంతులుగా చేసి, ఉత్తమ పురుషులుగా పరిణామ౦ చెందిస్తుంది. లైంగిక కామంతో చాలా శక్తి వ్యర్థం అవ్వకుండా నియంత్రించుకొంటే, మనలాంటి సాధారణ వ్యక్తులు ఆధ్యాత్మిక శిఖరాలను చేరుకొనేలాగా, నిస్వార్థ కర్మలను ఆచరించేలాగా చేస్తుంది.

సత్త్వ గుణం మన బుద్ధి ఎంత పెంపొందిస్తుందంటే, అది లైంగిక కామాన్ని అణచివేస్తుంది. అప్పుడు గీత చెపుతుంది హృదయం పరిశుద్ధ మవుతుందని. జీసస్ చెప్పినట్లు ఎవరి హృదయం పరిశుద్ధంగా ఉంటుందో వాళ్ళు దేవుడిని చూస్తారు. మన హృదయంలోని స్వార్థ మోహాన్ని తీసివేయడానికే మన బుద్ధిని అతి బలవంతునిగా చేసుకోవడం. 122

Saturday, February 12, 2022

Eknath Gita Chapter 14 Sloka 3

14.3

సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః

నిభధ్నంతి మహాబాహో దేహే దేహిన మవ్యయం

అర్జునా! ప్రకృతినుండి జనించిన సత్త్వరజస్తమో గుణములు అవ్యయుడైన జీవుని దేహమునందు బంధించుచున్నవి

మన గ్రంథములు జీవి, పరమాత్మ నుండి ఆవిర్భవించి, మూడు శక్తులచే బంధింపబడ్డవాడని చెప్పుచున్నవి. ఆ మూడు గుణాల గూర్చి గీత చెప్పే సిద్ధాంతం అతి ముఖ్యమైనది. గుణాలు ప్రకృతికి మూలం. పదార్థం, శక్తి, మనస్సు ఈ మూడు గుణాల కలయికగా చెప్పవచ్చు. సత్త్వ గుణం అనగా నీతి, సామరస్యం, సమత్వం. రజస్ అనగా శక్తి. తమస్ అనగా జడత్వం. వ్యష్టిగా సత్త్వ గుణము ఆనంద సామ్రాజ్యానికి దారి తీస్తుంది. రజస్ మనను అక్కడికి తీసుకు వెళ్ళే శక్తి. అది స్వాధీనములో లేకపోతే మనం అడ్డదారులు తొక్కుతాం. తమస్ మనకు కలిగే అవరోధాలు.

హిందూ శాస్త్రాల దృష్ట్యా, సృష్టికి పూర్వం, నిర్వికల్పమైన, విభజింపబడని, చైతన్యం ఉన్నది. దానినే మనం పరమాత్మ లేదా దేవుడు అంటాము. పురాణాలలో విష్ణు మూర్తిని సర్వాంతర్యామి అయిన దేవుడుగా భావిస్తారు. ఆయన అంతములేని ఆది శేషునిపై, ప్రపంచమనే సముద్రమధ్యలో శయనించి ఉంటాడు. చైతన్యం సర్వవ్యాపాకమై, ఏఖాండమైనంతకాలం వేరే పదార్థానికి తావులేదు. జెనెసిస్ లో చెప్పినట్లు "దేవుడుచే నీరు మీద ఆయని శక్తి పయనించింది". దేవుడు ధ్యానంలోకి వెళ్ళేడు. దానివల్ల చైతన్యం మూడు గుణాలతో వికల్పమైనది. వాటినుండి పదార్థము, శక్తి ఆవిర్భవించినవి. ఈ విధముగా మూడు గుణాల సముదాయంతో సృష్టి గోచరమైనది. జ్ఞానులు సృష్టి జరగబడలేదు, వివర్తించినది అని కూడా నమ్ముతారు. ఎలాగైతే సాలీడు తన స్వశక్తితో గూడు కడుతుందో, అలాగే దేవుడు సృష్టి తనంతట తానే చేసేడు. మూడు గుణాలూ ఆ సృష్టికి మూలం.

కోట్ల సంవత్సరాల పరిణామము వలన మానవులలో మూడు గుణాలూ వివిధ పరిమాణములో ఉంటాయి. ఒకడు బహు శక్తిమంతుడు. మరొకడు మందగొండి. బహు కొద్దిమంది శాంతమైన, నమ్మకమైన, భద్రతతో కూడిన వారు. ప్రతి ఒక్కరిలో ఒక గుణం ప్రబలమై ఉంటుంది. అది వ్యక్తిత్వంలో వివిధ దశలలో వ్యక్తమౌతుంది.

నిజానికి ఆ మూడు గుణాలూ ప్రతీ వ్యక్తిలోనూ ఉన్నాయి. ఒకప్పుడు ఒకడు శక్తితో పూనుకొని ఉంటాడు. ఉదాహరణకి వాడు తనకిష్టమైన కార్యం చేస్తున్నప్పుడు. అతడే వేరే సమయములో ఉదాసీనంగా ఉంటాడు. అది తనకయిష్టమైన పని చేయవలసి వచ్చినపుడు. వ్యక్తి ఒక్కడే గాని గుణాల వల్ల తన ప్రమేయం లేకుండా ప్రభావితమౌతున్నాడు.

ఒక్కొక్కప్పుడు సమయం, శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఉదయం మనం శక్తితో కూడి, ఏ కార్యాన్నైనా చేయడానికి సిద్ధంగా ఉంటాము. మధ్యాహ్నం, ముఖ్యంగా భోజనం చేసిన తరువాత, స్తబ్దుగా ఉంటాము. ఒక పరిశీలకుడు వానిని ఇద్దరు వేర్వేరు వ్యక్తులుగా, వ్యక్తిత్వాలుగా భావించవచ్చు. మనలో మూడవ వ్యక్తిత్వం కూడా బహు అరుదుగా ఉంది. మానవులమైనందుకు మనలో సత్త్వ గుణం ఎంతోకొంత ఉంది. దాని వల్ల మనలో దయ, భద్రత, సమభావము, స్వయం నియంత్రణ ఉన్నాయి. అవి గుప్తంగా ఉండవచ్చు. కానీ మనలో అవి వున్నాయి కాబట్టి మనం జంతువులనుండి పరిణామం చెందేమని తెలుస్తుంది. మనం రజస్ యొక్క శక్తిచే తమస్ కలిగించే అవరోధాల్ని దాటే౦. పిదప రజస్ యొక్క శక్తిని నియంత్రించేం.

గుణాలతో మన వ్యక్తిత్వాన్ని విశ్లేషించి, అదెలా ఏర్పడిందో, దానికి ఉంకో దానితో ఎలా సంబంధం ఉన్నదో చెప్పగలం. మన స్వభావం ఎలాగ మారుతుందో గుణాల బట్టి చెప్పవచ్చు. అవి స్తబ్దంగా ఉండేవి కావు. గీత మన వ్యక్తిత్వం క్రింద ఎటువంటి శక్తులు ఉన్నాయో చెప్పడం, ఒక ఆదర్శమైన వ్యక్తిగా మనం మనలను మలచుకోడానికి.

మనం ఒక దృఢమైన మూసలో, పెరుగుదల లేకుండా, లేము. మనము నిజంగా తలచుకుంటే మనను మార్చుకోవచ్చు. కానీ దానికి ఒక మంచి సంకల్పం కలగాలి. అవసరమైతే మన పరిస్థితి బట్టి ఎదురీత ఈదాలి. మొదట తమస్ ని రజస్ గా మార్చుకోవాలి. అనగా జడత్వాన్ని ఉత్సాహపూరితంగా, శక్తిమంతంగా మార్చాలి. రజస్ అనగా: మనలో ఉన్న భయం, కోపం, ఆశ మొదలైనవి. వాటిని తగినట్లుగా నియంత్రించి జడంగా ఉన్న వ్యక్తిత్వాన్ని మేల్కొలిపి ఉన్నత మైన స్థితికి చేరవచ్చు. మన లక్ష్యాన్ని సాధించడానికి అది తోడ్పడుతుంది.

ఇక్కడితో అయిపోలేదు. మనం రజస్ ను సత్త్వం గా మార్చగలగాలి. అతిశయముగాఉన్న శక్తిని నిస్వార్థ కర్మకై వినియోగించాలి. చివరిగా, అన్ని నియంత్రణలూ తీసి వేయాలంటే త్రిగుణాలను కూడా దాటి వెళ్ళాలి.

ఈ గుణాల పరిణామం ప్రాణం వల్ల సాధ్యం. భౌతిక శాస్త్రంలో ఎలాగైతే గుప్తంగా ఉన్న శక్తిని, చలన శక్తిగా మార్చి, తద్వారా విద్యుత్తును కలుగజేయవచ్చని చెప్పేరో, తమస్ ను కూడా రజస్ గా మార్చి తద్వారా సత్త్వ గుణాన్ని పొందవచ్చు. తమస్ ఘనీభవించిన గుప్త౦గా ఉన్న బలము. అది ఫ్రిడ్జ్ లో చాలా కాలముండి ఘనీభవించింది. అదలా కూర్చొని, ఎవరైనా మెల్కొలుపుతారా అని వేచి చూస్తోంది. ఘనీభవించిన నీరుని, మళ్ళీ ద్రవంగా మార్చవచ్చు. అలాగే తమస్ కరిగి రజస్ అవుతుంది. అది పరిగెత్తే నదిలాటిది. నది పదార్థాలను అతలాకుతలం చేసి, అవరోధాలని అధిగమించి, ఒక ప్రదేశాన్ను౦చి శరవేగంగా ఉంకో ప్రదేశానికి ఎలాగైతే ప్రవహిస్తుందో, రజస్ కూడా అలాగే శక్తివంతమైనది. కాని అది నది వరదగా మారినట్టు వినాశకారి అవుతుంది. సత్త్వమ్ రైలును నడపగల ఆవిరి వంటిది. రజస్, సత్త్వ గుణాల శక్తి, తమస్ లో గుప్తంగా ఉన్న శక్తివలననే. తమస్ ని కరిగించిన కొలదీ శక్తి ఉత్పన్నమౌతుంది.

తమస్ కరిగినికొద్దీ మన జీవితంలో ఎనలేని శక్తి వస్తుంది. దీనితో మన ధ్యాననికి పరీక్ష పెట్ట వచ్చు: ఎప్పుడైతే పనులు వాయిదా వేస్తున్నామో, మనం ధ్యానాన్ని పెంపొందించుకోవాలి. ధ్యానంలో భౌతికంగా , మానసికంగా అప్రమత్తంగా ఉండి మన కుటుంబానికి , సమాజానికి ఉపయోగపడే రీతిలో ఉండాలి. కష్టపడి పనిచేస్తే తమస్ నుండి ఉత్పన్నమైన శక్తిని ఉపయోగించుకోవచ్చు.

తెరెసా ఆఫ్ ఆవిలా ఇలా చెప్పేరు: "నిస్వార్థ సేవ ధ్యానం యొక్క చివరి లక్ష్యం. భగవంతుని నుండి మనకు అనుగ్రహింపబడినవి మన సేవలకు నిదర్శనం." మరొక పరీక్ష : "మన౦ మానవ కళ్యాణనికై నిస్వార్థంగా, ఏకాగ్రతతో పని చేస్తున్నామా లేదా?" కష్టపడి పని చేయడంతో సరిపోలేదు. రజస్ కు అవసరమైనా లేకున్నా మన ఆనందానికై పనులు చేయి౦చే సామర్థ్యం ఉంది. చాలా మంది నియంత్రించబడని రజస్ తో పనికిరాని, వ్యర్థమైన, ఇతరులకు హాని కలిగించే పనులు చేస్తారు.

వ్యాకులత చెడ్డ గుణం కాదు. తమస్ తో పోలిక చేస్తే అది మంచిదే. వ్యాకులత సూచించేది: "ధ్యానం నేర్చుకొని, అంతర్ముఖులము అవ్వాలి" . ఆ సూచనని పాటించని వారు ఊర్లు , దేశాలు, ఉద్యోగాలు, మారుతూ ఉంటారు. ఇది లోపలి శక్తులను వృధా చేయడమే. వ్యాకులత వల్ల ప్రపంచాన్నే మార్చేయాలి, లేదా ప్రపంచాన్ని ఒక వాహనంతో చుట్టేయాలి, మొదలైన ఎవరికీ ఉపయోగపడని, అహంకారాన్ని పోషించే, తన సాహసాన్ని ప్రదర్శించే వ్యర్థమైన కోర్కెలు కలుగుతాయి. అటువంట కోర్కెలు వచ్చినపుడు ధ్యానం చేయాలి. మనకున్న శక్తిని పోగుచేసి సత్త్వగుణంగా మార్చుకొంటే స్వర్గం ఎక్కడో లేదు, మన హృదయం లోనే ఉంది అని తెలుసుకొంటాము. 115

Friday, February 4, 2022

Eknath Gita Chapter 14 Sloka 2

14.2

మమ యోని ర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం

సంభవ స్సర్వభూతానాం తతో భవతి భారత

అర్జునా! గొప్పదియగు మాయ నాకు గర్భస్థానము . దానియందు నేను బీజరూపమున గర్భదానము చేయుదును. అందుచేత సర్వప్రాణుల ఉత్పత్తి కలుగుచున్నది

సర్వయోనిషు కౌన్తేయ మూర్తయః సంభవంతి యాః

తాసాo బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా

కౌన్తేయా! సర్వయోనులయందు జనించు రూపము లన్నిటికి ప్రకృతి తల్లి. నేను బీజప్రదానము చేయు తండ్రిని.

నిన్నటి రాత్రి టివి లో పసిఫిక్ సాల్మన్ అనబడే చేపల గురించి చూసాను. అవి అతి సాహసంగా తమ జీవిత చక్రాన్ని త్రిప్పుతాయి. వాటితో నేను తాదాత్మ్యం చెందేను. ఎక్కడో కొండల్లో పుట్టి, అవి నిర్మలమైన, తేటయిన నదీ జలాల్లో 6 ఇంచీలు పెరిగి పెద్దదవుతాయి. ఏదో శక్తి వాటిని ప్రేరణ చేస్తే సముద్రంవైపుగా, క్రొత్త పరిసరాలవైపుగా, తమ ప్రయాణాన్ని సాగిస్తాయి. అక్కడ నీరు నల్లగా, ఉప్పగా ఉంటుంది. ఇప్పటిదాకా వేర్పాటుగా ఉన్న ఆ చేపలు ఇప్పుడు అనేక జల జీవాల మధ్య బ్రతకాలి. కనిపించినదానిని తినాలా, వొదిలేయాలా లేక భయపడి వెనక్కి తగ్గాలా అన్న విషయాలు అవి నేర్చుకోవాలి. ఆ అనంతమైన సముద్రం వాటి విద్యాలయం. సముద్ర ఉపరితలంలో అలలు ఎగసిపడుతాయి. లోపలి కెరటాలు ఖండాలను దాటుకొని ప్రయాణం చేస్తాయి. అది అలా చూస్తున్నప్పుడు, నాకు గీత చెప్పిన "సంసార సాగరం" గుర్తుకు వచ్చింది.

సాల్మన్ తన నూతన పరిసరాలకు అలవాటు పడి కొన్ని రోజులు ఉంటుంది. అది తన రూపాన్ని, నా బెర్క్లీ విశ్వవిద్యాలయానికి ఇంటినుండి క్రొత్తగా వచ్చిన విద్యార్థులలాగ , కూడా మార్చుకొంటుంది. అది ఇప్పుడు ఒక ఉప్పునీటి చేప. హఠాత్తుగా, కారణం లేకుండా, దాని మదిలో ఒక సంచలనం కలుగుతుంది. వెనక్కి వెళ్ళడానికి సమయమిది అని నిశ్చయించుకొంటుంది

మిగతా కథ చాలా ఉర్రూతలూగిస్తుంది. ఆ చేప తను వచ్చిన నది వైపుకు వెళుతుంది. నదీ ప్రవాహానికి వ్యతిరేకంగా ఈత చేసి తను ఎక్కడైతే నిర్మలమైన నీటిలో పుట్టిందో అక్కడికి చేరుకొంటుంది. దీనిలో సహజంగా ఉన్నదేమీ లేనట్టుంది. ఇది ససేమిరా సులభం కాదు. అ చిన్న చేప ప్రతి అడుగు ఘర్షణతో ముందుకు సాగాలి. అది ప్రయాణం సాగిస్తున్న కొద్దీ శక్తిని పొందుతున్నట్టు అనిపిస్తుంది. అది తన కొండ ప్రదేశంలోని వేగంగా వచ్చే ప్రవాహానికి ఎదురీదుతూ, పైకి ఎగురుతూ, ఒక ప్రాణ జ్వాలలాగ ఉంటుంది. దానిని తన శరీరానికన్న ఎన్నో రెట్లు పెద్దదైన శుద్ధమైన శక్తి నడిపిస్తోంది. దానికి వేరే మనోభావం లేదు. తన గమ్యం చేరడమే దాని లక్ష్యం. "ఇది ఒక యుద్ధం" అనిపించింది. గీత మొదలు గుర్తు వచ్చింది. ఇది రణనాడి. యుద్ధం అనబడే నదీ ప్రవాహం, నది లాంటి జీవితం.

చివరకు అంతా అయిపోయింది. ఆ చేప ఆఖరి జలపాతం దాటి, శుద్ధమైన నీటితో నిండిన కొండల మధ్యన ఉన్న కొలనులోకి ప్రవేశిస్తుంది. అక్కడ గుడ్లు పెట్టి తన శేష జీవితం గడుపుతుంది.

కొన్ని చేపలకి ఈ కథ ఇంకా సమాప్తం కాలేదు. అవి గుడ్లు పెట్టి సముద్రానికి తిరిగి వెళ్తాయి. మళ్ళీ ఎదురీత చేసి, ఇలాగ మూడు, నాల్గు సార్లు క్రిందకీ మీదకీ తిరుగుతాయి. బహుశా అవి సముద్రంలో ఉన్నప్పుడు తమ నది ఆవిర్భవన ప్రదేశాన్ని గుర్తుంచుకొని, మనకి చెప్తున్నదేమిటంటే: జీవికి ఒక ఆరంభం ఉంది. దాని వైపు వెళ్ళాలంటే యుద్ధం చేయాలి. ఆ యుద్ధంలో గెలిచే అవకాశం చాలా ఉంది.

ఆ టివి ప్రసారం ఒక గంట సేపే అయినా, పసిఫిక్ సాల్మన్ జీవితాన్ని పూర్తిగా వివరించబడినది. కొన్ని కోట్ల సంవత్సరాల వెనక్కు వెళితే హిందువులు, భౌద్ధులు చెప్పే పరిణామ సిద్ధాంతం అవగాహనకి వస్తుంది. జీవి అనేక జన్మలెత్తి, తక్కిన ప్రాణులను అధిగమించి, మానవుడుగా పుట్టి, తిరిగి తన పుట్టుటకు కారణమైన భగవంతుని చేరుకొనడానికి కొట్టుమిట్టాడుతాడు. 112

Saturday, January 29, 2022

Eknath Gita Chapter 14 Sloka 1

14.1

శ్రీ భగవానువాచ :

పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం

యజ్ఞాత్వా మునయస్సర్వే పరాం సిద్ధిమితో గతాః

దేనిని తెలిసికొని మునులు ఉత్తమమైన మోక్షమును బొందిరో, అట్టి విద్యలలో ఉత్తమ విద్యయైన పరవిద్యను మఱల చెప్పుచున్నాను

ఇదం జ్ఞాన ముపాశ్రిత్య మమ సాధర్మ్య మాగతాః

సర్గే అపి నోపజాయంతే ప్రళయే న వ్యథoతి చ

ఈ జ్ఞానమును ఆశ్రయించి నా స్వరూపామును పొందినవారు సృష్టి కాలమున జన్మించరు. ప్రళయ కాలమున నశించరు

ఇక్కడ ఉపనిషత్తులు చేప్పే పరాపార విద్యల గూర్చి చెప్పబడినది. అపర అనగా ఆథ్యాత్మిక జ్ఞానం. తక్కినవన్నీ పరా విద్యలు. పరా విద్య మేధా శక్తి పై ఆధారపడివుంది. దానిచే ఎక్కువ తెలుసుకొనవలెనని కాంక్ష కలుగుతూనే ఉంటుంది. అది మంచికే కావచ్చు. కానీ అపరా విద్య మనకు మృత్యువుని దాటిన తరువాత కూడా ఉపయోగపడుతుంది.

మనమెంత శరీరంతో తాదాత్మ్యం చెందుతామో, మరణం గురించి అంత వ్యధ ఉంటుంది. మనం ఇతరులని భౌతికంగా చూస్తే --ఉదాహరణకు మనము ఒకరి అందమును చూసి ప్రేమించవచ్చు -- మరణకాల మాసన్నమైనప్పుడు వారిని పోగొట్టుకుంటున్నామన్న వ్యధ కలుగుతుంది. వేర్పాటుతో కలుగు పరితాపము భరించలేనిది. ఒకరు ఇక సాకారంగా కనిపించరేమో అన్న బాధ మనని వేధిస్తుంది.

రెండవది, మరణం శరీరాన్ని బలవంతంగా లాక్కుంటుంది. మనము శరీరముతో లావాదేవీ పెట్టుకొంటే, మరణం తీవ్ర భయాన్ని కలిగిస్తుంది. క్రుంగి కృశించి పోయినప్పుడు, శక్తినంతా వెచ్చించి శరీరాన్ని అంటిపెట్టుకొని ఉంటాము. భౌతికంగా ఆలోచించే వారు, మరణ కాలంలో తీవ్ర యాతనకు గురవుతారు. అది చేతన స్టితి లోనే కాదు. వాళ్ళ ఎరుక మరణమునకు చేరువలో ఉన్నప్పుడు అచేతనమనస్సుకు లాక్కో బడుతుంది. ఇదంతా శరీరాన్ని విడిచివేస్తున్నామన్న బాధ వల్ల. శరీరము అచేతనముగా పడి ఉన్నప్పుడు, నిశితమైన దృష్టితో ఈ బాధను చేతన మనస్సుతో చూడవచ్చు.

నేను మరణం సంబంధిత విషయాలను చెప్పడానికి ఒకే కారణం: మిమ్మల్ని శరీరముతో తాదాత్మ్యం చెందవద్దని చెప్పడానికి. మీకు ఇతరులతో నున్న స్నేహబాంధవ్యాలు ఆధ్యాత్మికత పరంగా ఉండాలి. మన బాంధవ్యాలు ఆధ్యాత్మికత పరంగా ఉంటే, ముఖ్యంగా ఆడ మగవారల బంధం, మనమధ్యనున్న ఐకమత్యం లేదా సాన్నిహిత్యం అర్థమవుతుంది. ఇది కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. దాని తరువాత వేర్పాటు ఉండదు. ఇది భౌతిక పరంగా చెప్పలేము. ఇద్దరు తమను ఏ పరిస్థితిలోనూ ఎట్టి శక్తీ వేర్పాటు చేయలేదని భావిస్తారో, వాళ్ళ సాన్నిహిత్యం మరణంలోకూడా ఉంటుంది. 110

Saturday, January 22, 2022

Eknath Chapter 13 Sloka 21

Bhagavat Gita

13.21

అనాదిత్వా న్నిర్గుణత్వాత్ పరమాత్మా ఆయా మవ్యయః

శరీరస్థో అపి కౌన్తేయ ! న కరోతి న లిప్యతే

కౌన్తేయా ! అవ్యయుడగు ఈ పరమాత్మ ఆదిలేనివాడగుట చేతను, గుణరహితుడైనందునను శరీరమునందున్నను కర్మలను చేయడు. కర్మలచే అంటబడడు

యథా సర్వగతం సాక్షామ్యత్ ఆకాశం నోపలిప్యతే

సర్వత్రావస్థితో దేహే తదాత్మా నోపలిప్యతే

సూక్ష్మమైనందున సర్వగతమైన ఆకాశము దేనిచేతను అంటబడని విధముగ ఆత్మ దేహమునందు సర్వత్ర ఉన్నను అంటబడదు

యథా ప్రకాశయత్వేకః కృత్సనo లోకమిమం రవిః

క్షేత్రం క్షేత్రీ తథా కృత్సనo ప్రకాశయతి భారత!

అర్జునా! ఒక్క సూర్యుడు సమస్త ప్రపంచమును ప్రకాశింప జేయునట్లు క్షేత్రజ్ఞుడు క్షేత్రము నంతటిని ప్రకాశింపజేయుచున్నాడు

క్షేత్రక్షేత్రజ్ఞయో రేవం అంతరం జ్ఞాన చక్షుషా

భూత ప్రకృతి మోక్షం చ యే విదుర్యాంతి తే పరమ్

ప్రాణులు ప్రకృతి చేత విడువబడు మార్గమును తెలిసికొనుచున్నారో వారు మోక్షమును పొందుచున్నారు

నా చిన్నప్పుడు సినిమాలు తక్కువగా విడుదల చేసేవారు. నేనున్న పల్లెలో ప్రపంచ సంబంధాలున్న సంస్థలులేవు. అలాగే సినిమా హాళ్లు, సమావేశ మందిరాలు లేవు. అప్పుడప్పుడు ఒక ఉత్సాహపూరితుడైన వ్యక్తి తన వాహనములో ప్రొజెక్టర్, జనరేటర్, ఒక పాత ఆంగ్ల ఫిల్మ్ తీసికొని వచ్చేవాడు. మేము ప్రొజెక్టర్ ను ఒక గుడారంలో పెడితే, ఊర్లో వారందరూ చీకటైన తరువాత సినిమా చూడడానికి అక్కడ గుమిగూడేవారు. వాళ్ళకు అదొక కొత్త వింత. వాళ్ళు ఆ రోజుల్లో చాలా అమాయకులు. చాలామంది ఆ ఊరొదిలి ప్రక్క ఊరుకు కూడా వెళ్ళలేదు. మేము ఆ సినిమాని చూస్తున్నాం కానీ, దాని గూర్చి పూర్తి అవగాహన లేదు. మాకు తెలిసింది అదొక చలనచిత్రమని. ఒకడు తెరమీద ఏమవుతున్నాదో ఎవరూ అడగకుండానే గట్టిగా చెపుతూవుంటే ఎవరూ అభ్యంతరం చెప్పేవారు కాదు. కానీ ఆ చిత్రాలు ఎంత అనుభూతిని ఇచ్చేవంటే, మేము మా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరచేవాళ్ళం. తెరమీద ఒక దొంగ పడుక్కుని ఉన్న వ్యక్తి వెనుక ఉంటే, మేము చిన్న పిల్లల్లాగ ఊపిరి బిగ పెట్టు కొనేవాళ్ళం. నా మామయ్య తెరమీద నిద్రిస్తున్న వ్యక్తి నుద్దేశించి "నిద్రలే, వాడి దగ్గర కత్తి ఉంది" అని అరిచేవాడు.

పాత రోజులు గుర్తుకు తెచ్చుకోవడం సరదాగా ఉంటుంది. మనం సినిమా అనే ఆభాశకు ఎంత అలవాటు పడ్డామంటే, దాని శక్తిని మరచిపోతున్నాం. పౌలీన్ కేల్ "మనని చీకటిలో అవాక్కయి పిస్తాయి" అన్నారు. చూసినంత సేపూ నిజమైన ప్రపంచం గూర్చి మరచిపోతాము. జీవితం -- ప్రపంచంతో వేర్పడిన ఉనికి -- అదే చేస్తుంది. సినిమాలు మనకు ప్రపంచంతో వేర్పాటు ఎలాగ అన్నది ముఖ్యంగా చెప్తాయి.

నేనూ, క్రిస్టీన్, గాన్ విత్ ది విండ్ అనే సినిమా చూడడానికి వెళ్ళేము. ముందు ఆ మిలమిలలాడే తెర మీద తెల్లని కాంతి పడుతున్నాది. అంతలోనే అది తన రూపాన్ని చిన్న కిటికీగా మార్చుకున్నట్టయి, మమ్మల్ని క్రిందటి శతాబ్దంలోని అమెరికాలో దక్షిణ ప్రాంతానికి తీసికెళ్లింది. ఎక్స్ట్రా లు కాకుండా ఆ సినిమాలో కొన్ని డజన్ల పాత్రలు ఉన్నాయి. వాళ్ళు వస్తూ పోతూ ఉన్నారు. ఒక మారు క్లార్క్ గేబుల్ తెర అంతా వ్యాపించి ఉంటాడు. మరొకమారు వివియన్ లై తెరంతా ఉంటాడు. హఠాత్తుగా తెర మీదకి గుర్రాలూ , సైనికులూ యుద్ధానికి వస్తారు. సినిమా అయిపోయిన తరువాత ఆ తెర తన సహజ స్థితికి వస్తుంది. అది తెల్లగా అసంగత్వంగా ఉంటుంది.

ఇది చెప్తే ఊర్లో ఉన్న నా మామయ్య ఆశ్చర్య పడేవాడు. ఆ చిత్రాలు ఎంతో నిజం అనిపించేవి. కానీ తెర మీద ఎవ్వరూ రంగులు పూయలేదు. ఉద్రేకం, యుద్ధం, డిక్సీ మండుతున్నప్పటి మంటలు ఏవీ తెర మీద గురుతు వేయలేదు. ఒకే కాంతి వివధములైన పాత్ర ధారులను తెరమీద చూపించింది. క్లార్క్ గేబుల్ మీద పడ్డ కాంతి, వివియన్ లై మీద కూడా పడింది. మనం కూడా ఆఫీస్ లో , దుకాణాల్లోనూ ఒకరినొకరు చూసుకొని ఇలా ఆలోచిస్తాం: "వాళ్ళు ఎంతో మారిపోయేరు. వాళ్ళు వేరే విధంగా చేష్టలు చేస్తున్నారు. నేను అటువంటి బట్టలు ఎప్పుడూ కట్టుకోను. నేను నా పైవాడితో ఆఫీస్ లో అలా మాట్లాడను. నేను ఆ సంస్థ యొక్క నూడుల్స్ తినను. కాబట్టి మనమందరము లోపల సమానంగా ఉన్నామని ఎలా తలుస్తాము?" ఎలా ఐతే ఒకే కాంతి సినిమాలో పాత్రలను తెరమీద చూపిస్తోందో, అలాగే ఆత్మ యొక్క ప్రకాశము క్షేత్రములో ప్రసరించి వివధములైన శరీరాలను ధరించి వేర్వేరు రూపాలతో కనిపిస్తున్నాది

మనము ఈ దృష్టాంతాన్ని పొడిగించ కూడదు. ఎందుకంటే మన శరీరాలు మిథ్య కాదు. కానీ మనలోని తేడాలు మిథ్య. ఒకే ఆత్మ మన వివిధములైన శరీరాలను , వ్యక్తిత్వాలను చైతన్యవంతము చేస్తున్నాది. సినిమా అంతమైన పిదప, ప్రొజెక్టర్ ను ఆపివేస్తే ఎంత గొప్ప పాత్ర అయినా మనుకగుపించదు. తెరమీద ఏమీ లేదు. ఫిల్మ్ వల్ల దానికి రంగులు, పాత్ర ధారులు ఆపాదించబడ్డాయి. కఠ ఉపనిషత్తు అడుగుతుంది: "ఆత్మ శరీరాన్ని విడిచితే, ఏమి మిగులుతుంది?" పంచభూతాలు తప్ప ఏమీ మిగలవు. ప్రాణం, చైతన్యం, బుద్ధి, ఉనికి అన్నీ ఆత్మ వల్లనే సాధ్యం.

సాన్ ఫ్రాన్ సిస్కో లోని ఒక సినిమా హాల్లో పాత ఏడుపు సినిమా కొన్ని నెలలుగా చూపిస్తున్నారు. ఇప్పుడు అక్కడ రిచర్డ్ అటెన బరో దర్శకత్వంలో చేయబడిన "గాంధీ" సినిమా చూపిస్తున్నారు. మొదట ఒక హీనమైన వ్యక్తి యొక్క పాత్రలో హింస, స్వార్థం, కామం, క్రోధం చూపించేరు. గాంధీ సినిమా ఉత్కృష్టమైన మానవ జీవితాన్ని చూపిస్తుంది. ఒక సాధారణ మనిషి ప్రేమ, సత్యం, అహింస లతో తనను ఎలాగ మహా మనీషి గా మార్చుకొన్నాడో, ఎలాగ మనను మలిచేడో, ఆ సినిమా ప్రతిబింబింప చేస్తుంది.

నాకు ఆ సినిమా హాలు చేసిన ఎన్నికకు ఆనందం కలిగింది. ఆ నగరం అంతా ఆ సినిమా వల్ల లాభం పొందింది. కానీ చిత్రాన్ని చూపించిన తెరలో ఎటువంటి మార్పూ లేదు. మనం దానిమీద హింస చూపవచ్చు. కానీ దానికి ఎటువంటి హానీ జరగదు. దానిమీద మంటలు చూపవచ్చు. కానీ అది మండిపోదు. అలాగే శ్రీకృష్ణుడు మనకు చెప్పే బోధ: ఆత్మ కి మన ఆలోచనలు, కర్మలు చెందవు. అనగా ఆత్మని వాటితో ప్రభావింప చేయలేము.

మనము దీన్ని నిజంగా అర్థం చేసుకొంటే, మన భుజస్కందాల మీదనుంచి గతంలో చేసిన తప్పులన్నీ తీయ బడతాయి. మనం మన శరీరముకాదు. మనం మనస్సుము కాము. శరీరము ఒక పదార్థము. సహజంగా అది భౌతిక ప్రపంచంతో లావాదేవీ పెట్టుకుంది. మనస్సు సహజంగా తప్పులు చేస్తుంది. శరీర, మానసిక కర్మల మధ్య అవినాభావ సంబంధం ఉంది. కాని మన ఆత్మ వాటివల్ల కళంకమైనది లేదా హీనమైనది కాలేదు. వ్యక్తిత్వం లోలోపల ప్రతి మనిషిలోనూ, అతడు ఎన్ని తప్పులు చేసినా, శుద్ధత, పరిపక్వత ఉన్నాయి. అలాగ గతంలో మనము ఎన్ని తప్పులు చేసినా, మనలో ఎన్ని లోటుపాట్లున్నా, మన వ్యక్తిత్వము యొక్క ప్రతి కళంకమును చెరుపుగోగలం.

Friday, January 14, 2022

Eknath Chapter 13 Sloka 20

13.20

ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః

యః పశ్యతి తథాఆత్మానాం ఆకర్తారం స పశ్యతి

సర్వకర్మలు ప్రకృతి చేతనే చేయబడుచున్న వనియు, ఆత్మ కర్మలకు కర్త కాదనియు ఎవడు చూచుచున్నాడో వాడే నిజముగ చూచువాడు

యదా భూతపృథగ్భావం ఏకస్థ మనుపశ్యతి

తత ఇవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా

భిన్నములైన భూతజాలమంతయు ఒక్కదాని యందే ఉన్నవనియు, దానివలననే విస్తరించుచున్నదనియు ఎవ్వడు గాంచునో అతడు బ్రహ్మత్వమును పొందుచున్నాడు

నేను బాలుడిగా ఉన్నప్పుడు అలెక్సాన్డర్ డ్యూమస్ రచించిన నవలలంటే ఇష్టపడేవాడిని. ముఖ్యంగా ది మ్యాన్ ఇన్ ద ఐరన్ మాస్క్ (The Man In The Iron Mask) అనే నవల. నాకు తెలిసిన మటుకు మాస్క్ వేసుకున్న మనిషి ఎవరో నిర్ణయింపబడలేదు. ఒకడు లూయీ xiv అనే రాజుచే 40 సంవత్సరాలు శిక్షింప బడి బాస్టిల్ అనే నగరంలో మరిణించేడని చరిత్ర చెపుతోంది. అతని పేరు, ఊరూ ఎవరికీ తెలీదు. డ్యూమస్ అతని గూర్చి మంచి కథ అల్లేడు. ఆ వ్యక్తి లూయీ రాజు కవల తమ్ముడు; అతను రాజుని అనుకరించి అతనిని బంధీని చేయబోయేడని డ్యూమాస్ వ్రాసేడు.

ఇది ఒక మంచి దృష్టాంతము కూడా. మనందరము ఇనుప ముసుగు వేసికొని జీవితాన్ని గడుపుతామని గీత చెపుతుంది. ముసుగులో నున్న భద్రత వల్ల -- హిందువుల, భౌద్ధుల దృక్పథంలో అనేక జన్మల వలన -- మనకు ముఖముందని మరచిపోతాం. ఆ ముసుగే మనమనుకుంటాం. ఇతరులకూ అలాగే అనిపిస్తుంది. కానీ ముసుగు క్రింద రాజు ఉన్నాడు. వాడే మనం.

ముసుగు మన వేరే వ్యక్తిత్వం. అది వింతగా ఎందుకుందంటే అది ఒక వస్తువు కాదు. హిందూ మానసిక శాస్త్రం మనం రెండు ముసుగులు వేసుకొన్నామని చెప్పచ్చు: ఒకదాని క్రింద మరొకటి. పై ముసుగు మన భౌతిక శరీరము. లోపల వున్నది సూక్ష్మ శరీరము. అది మనస్సు, బుద్ధి, అహంకారములతో కూడి యున్నది. మనం శరీరం మనస్సులతో తాదాత్మ్యం చెందడంవల్ల, ప్రకృతి ఈ ముసుగులను చేసింది. దాన్ని ధరించినవాడు పురుషుడనబడును. అనగా మనలో ప్రతి ఒక్కరు.

ఈ రెండు ముసుగుల మధ్య సామరస్యముంది. దాని వలన మన స్వస్థతకి పర్యావసాన ముంది. శరీరము పాతుకుపోయిన వ్యక్తిత్వాన్ని అద్దంలాగా ప్రతిబింబింప చేస్తుంది. మనం తప్పక చేయాలనే మానసిక ఒత్తిడి వలన వ్యాధులు మొదలవుతాయి.

ఈ విషయం నిఘూడ మైనది కాదు. తప్పక చేయాలనే మానసిక ఒత్తిడి వల్ల మన నడవడిక కూడా అలాగే మారి మన శరీరము మీద ప్రభావిత మవుతుంది. చాలా కాలము రక్తపు పోటు తో ఉన్న వ్యాధిగ్రస్తుడు కలహశీలి అయినట్లు. ఇంకా లోతైన విషయం కూడా ఉంది. సూక్ష్మ శరీరం అతి క్లిష్టమైనది, అది ప్రాణముతో బాటు శక్తులతో --క్రోధం, భయం, కోరికలు తో -- కూడుకొని యున్నది. మనస్సును పోషించే ప్రాణము, మన మెదడును, శరీరాన్ని పోషించే ప్రాణము ఒక్కటే. మనస్సులో ఆలోచనలు గాఢమైతే శరీరములోని కొన్ని అవయవాలకు తగినంత ప్రాణ శక్తి చేరదు . దీని వలన కొన్ని సంవత్సరాల పిదప అనేక దౌర్భల్యములు వస్తాయి.

నేను చెప్పింది సులభ౦గా అర్థం చేసుకోవడానికి మాత్రమే. వ్యక్తిత్వం క్లిష్టమైనది. ప్రతి వ్యక్తి అనేక భౌతిక, మానసిక కారణాల వల్ల వ్యాధిగ్రస్తుడవుతాడు. నయము చేయ శక్యము కాని వ్యాధులు-- హృద్రోగము, కీళ్ల వాతం, క్యాన్సరు -- ఇటువంటి కారణాలవల్ల వస్తాయని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. భవిష్యధ్యానముగల సర్ విలియం ఆస్లర్ తోటి వైద్యులనుద్దేశించి ఈ విధంగా అన్నారు: "రోగికి ఏ వ్యాధిఉందో అడగకు. కానీ ఎటువంటి రోగికి వ్యాధి ఉందో అడుగు."

హిందువులు, భౌద్ధులు ఏమని చెప్తారంటే : మనము ఎన్నో జన్మలుగా సూక్ష్మ శరీరమనే ముసుగును తయారు చేసుకొంటున్నాము. మనకు కలిగే ప్రతి ఆలోచన, స్పందన, చేసే క్రియ, ఎన్నిక ఆ ముసుగును మారుస్తూ ఉంటాయి. నాకిది సమంజసమనిపిస్తుంది. మనలో ఉండే స్వార్థ పూరిత ఆలోచన -- లేదా నిస్వార్థమైనది -- మన చేతన మనస్సులోని శక్తులను ప్రభావితం చేసి -- స్వార్థ లేదా నిస్వార్థ క్రియలు చేయిస్తుంది.

మొదట మనము నూనెతో, రంగుతో, బంకతో, మీసంతో తాత్కాలిక ముసుగును చేసికొంటాం . ఇది సూక్ష్మ శరీరము యొక్క సహజ స్థితి: సాగేది, వంగేది, స్వతఃసిద్ధమైనది, ఖచ్చితమైన ఆకారము లేనిది. కానీ మనస్సు అలా కాదు. అది దాని సహజ స్థితిలో ఉండదు. అది ఆలోచన చేస్తూ, చేస్తూ, కోరికలు కోరుతూ, కోరుతూ ఉంటుంది. అలా పోయి, అది స్వార్థ పూరితమై, కఠినముగా అవుతుంది. చివరికి మన ముసుగు ఇనుముతో చేయబడినదై అది మనల్ని అవయవమనిపించే లేదా వ్యక్తిత్వమనిపించే స్థితికి దిగజారుస్తుంది. ఈ ముసుగును, అదృష్టవశాత్తూ, తీసి వేయ వచ్చు. ధ్యానం తదితరమైనవి ఇందుకు ఉపయోగపడతాయి. మనమెప్పుడైతే ఆ ముసుగును తీసేస్తామో మనల్ని శుద్ధమైన, సంపూర్ణమైన, మిగతా సృష్టితో వేరు కాని వారములుగా చూస్తాము. 105

Saturday, January 8, 2022

Eknath Chapter 13 Sloka 19

13.19

సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరం

వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి

సమస్త భూతములయందు సమముగా ఉండి, ఆయా భూతముల శరీరములు నశించుచున్నను తాను అవినాశిగనుండు పరమేశ్వరుని ఎవడు గాంచుచున్నాడో వాడే నిజముగ చూచువాడు

నాకు ఒక చలన చిత్రములో భీకరమైన మంటలతో ఒక అడవి మండుచున్న వృత్తాంతం గుర్తుంది. అది పచ్చికలోకి పాకి ప్రతి గడ్డి మొక్కను ఆవరించింది. అది చెట్ల పై పాకి వాని ఆకారమును పొందియున్నది. ప్రతి కొమ్మ దారువుతో కాక మంటతో నిండినది. చెట్లు అలా నిలిచి, అగ్నితో కాల్చ బడుచున్నవి. వాటి కొమ్మలు నారింజ, బంగారు రంగుల్లో మండుతున్నాయి.

అగ్ని స్వతహాగా నుంచోదు, అబద్ధం చెప్పదు. అది దేనిని ఆవరిస్తుందో దాని ఆకారాన్ని పొందుతుంది. కఠ ఉపనిషత్తులో ఇలా ఉంది:

ఒకే అగ్ని వివిధ రూపాలు ధరించునట్టుగా

అది వివిధ ఆకారాలు గల పదార్థములను దహించుచున్నట్టుగా

ఆత్మ జీవిని బట్టి వివిధ రూపాములు ధరించుచున్నది

ఎవరిలో ఐతే అది అంతర్గముగా ఉందో

గాలి లాగా ఆ రూపాన్ని పొందుతుంది

అది వివిధ రూపాలుగల వస్తువులలో ప్రవేశించిన

ఒకే ఆత్మ ప్రతి జీవి ఆకారాన్ని పొందుతుంది

దానిలో అట్లు స్థితమై ఉన్నది

ఇది ఒక సిద్ధాంతము మాత్రమే కాదు. దానిని అనుభవంలోకి తెచ్చుకోవచ్చును. జీన్ మేయర్ అనే ఆయన ప్రపంచంలో అతి ప్రసిద్ధ ఆహారాన్ని శోధించే శాస్త్రజ్ఞుడు. ఆయన 1974 లో రోమ్ నగరములో జరిగిన సమావేశంలో వ్రాసిన వ్యాసంను నేను చదివేను. నేను ఆయని అభిప్రాయాలను గౌరవిస్తాను. అది ఆయన గొప్పతనం వలన కాదు. ఆయన ఆర్ధ్రత, దయాగుణముల వలన. ఒక బంగ్లాదేష్ శాస్త్రజ్ఞుడు తన దేశంలో త్వరలో రాబోయే కరువుగూర్చి ప్రసంగిస్తున్నాడు. మేయర్ ఇలా వ్రాసేరు: "ఆ గదిలో ఎవరూ లేరు. చాలామంది బయట ధాన్యంతో చేయబడిన మద్యాన్ని సేవిస్తున్నారు. అనగా మన ఆహారపదార్థంతో చేసిన మద్యం." ఆయన ఇంకా ఇలాగ వ్రాసేరు: "1973 లో మద్యం తయారు చేయుటకు వాడిన ధాన్యం కోట్ల మందిని పోషించేది." ఆయన అడిగేరు ఈ సమావేశంలో హాజరైన వారిలో ఎందరికి ఈ విషయం తెలుసు?

కొందరు అడగవచ్చు "మేమెందుకు పట్టించుకోవాలి? మద్యం తయారయిపోయింది. ఉన్నందుకు ఎందుకు త్రాగకూడదు?" దానికి సమాధానం: మనం త్రాగక పోతే ధాన్యంతో మద్యం చేయ బడదు. మేయర్ ఇలా అన్నారు: మనము ఒక ఎన్నిక చేసుకోవచ్చు. అది ఇతరులకు లాభంలేని -- మద్యం తయారుచేసే పరిశ్రమలకు తప్ప- అలవాటు చేసుకోవచ్చు లేదా ఆకలితో బాధపడుతున్న కోట్లమంది పొట్టలు నింపవచ్చు.

ఈ విషయం బుద్ధికి తెలుసు. కానీ బుద్ధిని ప్రేరేపించే శక్తి హృదయానికుంది. సున్నితమైన మనిషి, ఈ విషయం తెలికొన్న, ప్రతిసారి మద్యంతో నిండియున్న గ్లాస్ ని ఎత్తినపుడు, దాని అంచులలో ఆకలితో అలమటిస్తున్న పిల్లవాడిని చూస్తాడు.

ఉంకో అభ్యంతరం ఉంది: "నేను మద్యం సేవించడం మానేస్తే ఒరిగేదేమిటి? నా వంతు ధాన్యాన్ని మద్యం చేసే పరిశ్రమలు బీదవారికి ఇవ్వరు. వాళ్ళు దానితో గ్యాసహాల్ ఇంధనం చేస్తారు. లేదా ధరలు పెంచడానికి దాన్ని తగలెట్టచ్చు. లేదా ఆవులను బలిష్టం చేయడానికి వాటికి గ్రాసముగా పెట్టవచ్చు." ఈ అభ్యంతరములలో నిజం లేక పోలేదు. ఒక సంస్థ చేసే పదార్థాలను కొనకపోవడం మొదటి అడుగు మాత్రమే. కాని వాళ్ళకు మద్దతు ఇవ్వకపోవడం ముఖ్యం . గీత సంపూర్ణమైన జ్ఞానం ఇస్తోంది. మనకు ఎన్నిక చేసికోడానికి చాలా ఉన్నాయి. ప్రతి ఎన్నికను పరిశీలించాలి. సాధారణ బుద్ధికి ఆ శక్తి లేదు. దానికి నిశితమైన బుద్ధి కావాలి. చేతన మనస్సు మార్పుతో ఎన్నికను విశ్లేషించాలి. మనము తద్వారా భగవంతుని అన్నిటియందు చూసి, దాని ప్రకారము క్రియలుచేసి జీవి౦చాలి.

మేయర్ ఇంకా ఇలా వ్రాసేరు: ప్రపంచ దేశాలు, ప్రజలు తిండిలేక బాధపడుతున్న వర్ధమాన దేశాలను కలుపుకొని, కోట్లాన కోట్లు ఆయుధాలపై వెచ్చిస్తున్నారు. 1987 సంవత్సరములో ఆయుధాలకై రోజుకి 7 కోట్లు ఖర్చుపెట్టేరు. అందులో ఒక భాగం స్వయం ప్రపత్తికై వినియోగిస్తే, ఆహార పదార్థ లేమిని అరికట్టవచ్చు. నేను వాదించటంలేదు. ఆయుధాలు చేసే సంస్థలను చూడండి. మేధావులైన శాస్త్రజ్ఞులు, ఇంజినీర్లు కొన్ని దశాబ్దాలలో ఒకానొక అంశముపై దృష్టిని కేంద్రీకరించి ఎలా నమ్మశక్యం కాని వస్తువులను చెయ్యగలరో చూడవచ్చు. ఆ ఉత్సాహాన్ని ఆకలితో అలమటిస్తున్న వారిని ఆదుకోవాడానికి వ్యచ్చిస్తే, బీద దేశాలేకాదు, అభివృద్ది చెందిన అమెరికా వంటి దేశాలలో ఉన్న బీద వారికి కూడా, ఒక తరంలో తిండిలేమిని తొలగించవచ్చు. ఇదేమీ జటిలమైన సమస్య కాదు. కాని స్వార్థం వలన, అయిష్టత వల్ల, దృష్టిని దీనిపై సారించటంలేదు.

మన మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎన్ శైక్ లో పీడియా బ్రిటానికా బుక్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ 1975 లో ఇలా వ్రాసేరు:

"ఏ దేశమూ తన స్వార్థంకోసం సంకుచిత భావాలతో తమ ఇష్టం వచ్చినట్టు ఉండుట తగదు. ఎందుకంటే మనమందరమూ ఒకే సంధింపబడిన ప్రపంచంలో బ్రతుకుతున్నాము. సంపన్న దేశాలు వాళ్ళ బాధ్యతను విస్మరించకూడదు. పేదరికంలో ఎక్కువమంది ఉండగా అతి కొద్ది ధనవంతులు జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. ప్రపంచ శాంతి లేకపోవడానికి కారణం ప్రపంచ యుద్ధం ఒకటే కాదు. తారతమ్యాలు కూడా యుద్ధంలాగే ప్రమాదం"

ఆమె ఇలా ఉపసంహరించేరు: "మన అన్వేషణ మానవాళికి సమానత్వ సంఘమును స్థాపించుటకే కాదు, ప్రపంచంలో తారతమ్యాలు లేకుండా చేయడం. ప్రపంచం ఒక పద్దతిలో కొనసాగాడానికి, అవగాహనతో, దయతో మనస్సులను మార్చక పోతే, కరువుకాటకాలను నిర్మూలించక పోతే, ప్రగతి సాధించలేము."

ఇది ఒక అర్థంలేకుండా వాదించడం కాదు. నాలాంటి ఆమెరికన్లు చరిత్రలోనే అత్యంత సంపన్నమైన దేశంలో మనుగడ సాగిస్తున్నారు . అయినప్పటికి ఏమి సాధించేము? పిల్లలకు చేయూతనిచ్చే, బీదవారిని ఆదుకొనే, మరియు సాంఘిక సమస్యలను తీర్చే ప్రణాళికలు చేయటంలేదు. అదేసమయంలో ఆయుధాలకై కోట్లానుకోట్లు, అప్పులుచేసి ఖర్చు పెడుతున్నారు. నిజంగా లక్షల పిల్లలు, ముసలివారు తిండిలేక అతి దీనావస్థలో ఉన్నారు. నేను అతిశయోక్తి చేయటంలేదు. పరిస్థితి చాలా విషమంగా ఉంది. దీనికి కారణం మనం స్వార్థంతో ప్రజలను దృష్టిలో పెట్టుకోవటంలేదు. బీదవారేకాదు మధ్య తరగతిలో ఉన్నవారు కూడా ఈ భౌతిక వాదన సంబంధిత ప్రగతి వల్ల బాధపడుతున్నారు. ఎవ్వరూ పేదల సంక్షేమమునకు ముందుకు రారు.

ప్రపంచ ఆహార సమావేశం జరిగిన కొన్ని నెలల తరువాత, నేను జేమ్స్ రెస్టన్ న్యూయార్క్ టైమ్స్ లో వ్రాసిన సునిశిత వ్యాసాన్ని చదివేను. ఆయన కూడా సంపన్న దేశాల జీవన ప్రమాణం మితిమీరిన వ్యర్థాలకు దారి తీస్తున్నాదని తప్పుబట్టేరు. వాళ్ళ విలాశాలకై వర్తమాన దేశాలలోని ముడి సరుకు నుపయోగించుకొని, తక్కువ జీతంతో ఎక్కువ శ్రమపడే వారల కష్టాన్ని అనుభవిస్తున్నారు. కాలం మారుతోంది. వర్ధమాన దేశాల ప్రజలు మనం చేసే కార్యాలను చూస్తూ నోరుమూసుకొని ఉండలేరు. మనం అంతర్జాతీయ ఉగ్రవాద శకములో ఉన్నాము. కొన్ని ఉగ్రవాదుల గుంపులు, అణ్వాశ్త్ర ములను చేజిక్కుంచుకొని ఒక దేశాన్ని చెఱపట్టచ్చు లేదా ఒక దేశంతో యుద్ధం చేయవచ్చు. ఈ శతాబ్ద చివరికి, పరిస్థితులు మారకపోతే, విచ్చిత్తి శక్తితో కూడిన పదార్థాలను రవాణాచేసి, వేల కొలది అణ్వాశ్త్రాలను తయారు చేస్తారు. ఫ్రెడ్ ఇక్లే ఇలా వ్రాసేరు: "నిజంగా మనం మనను రక్షించుకోలేం. అది అతి సున్నితమైన విషయం కావచ్చు లేదా శిక్షితమైన అణ్వాశ్త్రాల యుధ్ధం కావచ్చు. భారీగా సొమ్ము ఖర్చు చేసి, మనం చేసికొన్న రక్షణ వ్యవస్థవల్ల ఏమీ ప్రయోజనం లేదు. మనం ఎవ్వరితోనైతే శతృత్వము ఉండ కూడదో, వారి దాడికి అనువుగా ఉన్నాం." దయ, ఐకమత్యంతో కూడిన సిద్ధాంతాన్ని పర్యావసానము లేకుండా ఉల్లంఘించలేము.

మన సహజీవనానికి ఒకే ఒక మార్గమున్నది. అది ఇతరులను నమ్ముట. మానవాళికి అవసరమైన వస్తువుల్లో మనం ఆనందంగా తక్కువ వాటా తీసికోవాలి. ఇది ప్రతికూల అంశంకాదు. ఈ విషయాల్లో ఎక్కువ ప్రగతి కలుగలేదు. నిజానికి చాలా తక్కువ జరిగింది. ప్రజలకు అవగాహనకు తక్కువ పాటుపడ్డాం. ఇలా నిస్వార్థంగా బ్రతకడంలో చాలా ఆనందం ఉంది. మన స్వంత సాధనములతో కలసికట్టుగా అర్పితమై ఆత్మహత్యలతో బెదిరించే పరిస్థితిని తొలగించాలి. 103

Eknath Chapter 13 Sloka 18

13.17

యావ త్సంజాయతే కించిత్ సత్త్వం స్థావరజంగమం

క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ది భరతర్షభ

అర్జునా ! ఈ ప్రపంచమున చరాచర రూపమైన సకల వస్తువులను క్షేత్రక్షేత్రజ్ఞుల కలయిక వలననే కలుగుచున్నవని గ్రహించుము.

హిందూ మతము శివ శక్తులు సృష్టికి కారణమని చెప్పును. శివుడు అనాది పురుషునిగను, శక్తి అనాది స్త్రీగాను హిందువులు తలంతురు. శక్తి అనగా బలం, సామర్థ్యం, పరాక్రమము. ఇటువంటి అద్వితీయ సంప్రదాయములో బలాన్ని స్త్రీగా ఆపాదించేరు. శివుడు నిర్వికల్పము. శక్తి మార్పు చెందునది. శక్తి అనగా ప్రకృతి. మనస్సు మరియు పదార్థము లను కలుపుకొని, సమస్త సృష్టి క్షేత్రము. ఆమె తన సామర్థ్యముతో సృష్టి యొక్క ఆకారమును నిర్దేశించునది. ప్రతి స్త్రీ, ఆధ్యాత్మికతో చూచిన, పురుషుని కన్న మిక్కిలి సామర్థ్యం కలది కనుక, ఆమె శక్తికి ప్రతిరూపము. ఒక నిస్వార్థ స్త్రీ తన చుట్టూ ఉన్నవారిని పెంపొందించును. అట్లే ఒక అభద్రత, స్వార్థ పూరిత స్త్రీ తక్కిన వాళ్ళ పురోగతిని నిరోధించును. కాబట్టి ఆమె బాధ్యత విచిత్రమైనది. నా అమ్మమ్మను చూసినట్టే నేను ప్రతి స్త్రీని ప్రేమతో, గౌరవము తో చూస్తాను. ఎందుకనగా ఆమె గర్భిత, అవ్యక్త సామర్థ్యము గలది. ఆమె మిక్కిలి శక్తివంతురాలు.

సృష్టి జరగవలెనన్న శివ శక్తులు ఏకమవ్వాలి. వారి కలయికవల్ల సమస్త జీవులు ఆవిర్భవించుచున్నవి. ప్రసిద్ధమైన కవి, నాటక రచయిత కాళిదాసు రఘువంశ గ్రంథము యొక్క ఉపోద్ఘాతములో శివశక్తుల గూర్చి ఇట్లు రచించెను: "పదము దాని అర్థమువలె మిళితమైన ఆది దంపతులను ప్రార్థించెదను". పదమునుండి దాని అర్థమును వేరుచేయలేము. ప్రపంచము మనకు విదితమవ్వవలెనన్న తలిదండ్రుల వలె నున్న ఆ భగవంతుడు కరుణించవలెను . 100