Sunday, October 31, 2021

Eknath Chapter 13 Sloka 8

13.8

ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ

జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనమ్ ఇంద్రియ విషయములయందు విరక్తి , అహంకార త్యాగము, పుట్టుట, చచ్చుట, ముదిమి, రోగము, దుఃఖములలోని దోషములను దర్శించుట మరియు

శ్రీకృష్ణుడు వైరాగ్యంతో మెలిగే మనిషి గూర్చి ఇంకా వివరిస్తున్నాడు.

ఈ శ్లోకం మన వ్యక్తిత్వంలో యాంత్రికంగా జరిగే విషయముల గూర్చి చెప్పుచున్నది. మన శరీరం , మనస్సు రెండూ మనము ఉపయోగించే పనిముట్లు. మనం మన యంత్రం అనే భావన లేకపోతే యంత్రం బాగా పనిచేస్తుంది. అదే శారీరిక, మానసిక స్థితికి అనుకూలం. ఇంకా విచిత్రంగా మనము తెలిసికొనే విషయమేమిటంటే ఈ యంత్రానికే అనారోగ్యం, క్షయము, నాశనము కలిగేవి. మనం దానిని నడిపే వాళ్ళం.

మేధతో శరీరమును యంత్రంగా చూడడానికి అతిగా కష్ట పడనక్కరలేదు. మన శరీరము శక్తివంతమైన, ఆధునాతనమైన వాహనము. దానితో మనం కారు లేదా రైలు లేదా విమానంలో లాగా తిరుగవచ్చు. నేను సాన్ ఫ్రాన్ సిస్కో కి నా వోల్ వో కారులో వెళతాను. అది ఒక గంట సమయం పడుతుంది. అలాగే నాకు ఎక్కువ సమయం ఉంటే శరీరమనే చిన్న కారులో వెళ్తాను. నా భౌతిక శరీరాన్ని ఇలాగే చూస్తాను. అది "నేను" కాదు. అది నా జీవితంలో దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా క్రియలు చేయుటకు ఉపయోగపడే వాహనము.

ఇక్కడ ఒక కంగారు పెట్టే విషయం ఉంది . మనం మన కార్ ని చూపి "నేనిక్కడకు ఈ వాహనంలో వచ్చాను" అని చెప్పవచ్చు. కానీ మన శరీరాన్ని చూపి: "ఇది కూడా ఇక్కడికి రావడానికి ఉపయోగింపబడిన వాహనము" అని చెప్పలేము. మనము అలా నిజంగా చెప్ప గలిగితే ఈ వాహనాన్ని బాడుగ ఇచ్చిన వారికి వంద సంవత్సరాల తరువాత తిరిగి వాపస్ ఇవ్వాలి. ఈ కార్ తో మనం తాదాత్మ్యం చెందేము. అవిద్య కారణంగా మనము ఒక ఘోరమైన తప్పు చేసి, మనం మన శరీరమని అనుకొన్నాము. జననమరణాలు శరీరానికే అని తెలిసికోలేకపోతున్నాము. యూదుల, క్రిస్టియన్ ల సంప్రదాయంలో దీన్ని దైవ సంబంధమైన స్థితి నుండి నీచ స్థితికి రావడం అంటారు. ఆ దైవ సంబంధమైన స్థితిలో మనం మన శరీరము కాదు. మనమొక ప్రయోజకరమైన శక్తి. మనం చావుకి, విభాగాలికి అతీతం. ఎప్పుడైతే ఆ ఉన్నతి స్థితి తిరిగి పొందుతామో భూతల స్వర్గం చూస్తాము.

నాకు వోల్క్స్ వాగన్ అనే సంస్థ కారులను బాగా ఇష్టపడే మిత్రముంది. నేను ఆవిడకి నా శరీరాన్ని చూపి ఇలా అనేవాడిని: "నీకు ఎర్ర రంగు వోల్క్స్ వాగన్ కార్ ఉంది. ఇది చామనఛాయది. దీన్ని బాడుగకు తీసికోవచ్చు. ఇక్కడ తీసికొని, అక్కడ వదలవచ్చు." నేను చక్కటి సంరక్షణ -- ఆయిల్, టైర్లు సమయానికి మార్చి, తుడిచి శుభ్రం చేసి -- చేస్తే ఇది వందేళ్లు మంచిగా ఉంటుంది. ఇది సరైన పరిమాణం గలది. టిబెట్ కి చెందిన జ్ఞానులు రెండు జన్మల మధ్య కాలంలో బార్డో అనే అటూ-ఇటూ --త్రిశంకు స్వర్గం--కాని ప్రదేశంలో ఉంటామని అంటారు. మన అవసరాలకు , వ్యక్తిత్వానికి సరైన కార్ గురించ అక్కడ నిరీక్షిస్తామట. నాకైతే ఈ చామనఛాయ కారు చాలు. నాకు పెద్దవి, ఖరీదైనవి, అయిన కారులపై ఎటువంటి అసూయ లేదు. అవి ఎక్కువ భూమిని ఆక్రమిస్తాయి. అలాగే ఎక్కువ పెట్రోలును తాగుతాయి. నా కారు తగినంతగా పెట్రోలు తాగుతుంది. అది సమంగా నడపడానికి తగినట్లుగా ఉంటుంది. దాని ఇంజను అతి వేగవంతమైన ఫెరారీ కారు అంత శక్తివంతమైనది.

ఇటువంటి దృక్పధం వల్ల మనం శరీరంనుంచి విడిబడతాం. అలా కాని వాళ్ళు ఎల్లప్పుడూ తమ శరీర సంరక్షణకై బట్టలు, ఆహారం, సుఖాలమీద దృష్టి కేంద్రీకరిస్తారు. తమ ఇంద్రియాలుచేసే కోర్కెలను నియంత్రించుకోలేరు. ఇంద్రియాలు ఏమి కోరితే అదే చేస్తారు. దేహంనుoచి విడిబడడం అంటే మన నాలుకకు ఇలా చెప్పడం: "అది నా శరీరానికి అవసరం లేదు. దానిని మాడిసన్ వీధి లోని దుకాణాలు కొనమని చెప్తాయి. అది చాలా సంవత్సరాలు నిల్వ ఉంటుంది. అది నీ జీవితానికి పనికి రాదు." మనం ఎప్పుడైతే వద్దు అని భౌతిక దబాయింపులకు లొంగకుండా ఉంటామో అప్పుడు మన శరీరానికి కావలసిన ఆరోగ్యం, హుషారు, అందం పెంపొందించగలం.

క్రీడాకారులు ఈ క్రింది విషయం అర్థం చేసికోగలరు. ఒక క్రీడాకారుడు వొలింపిక్స్ లో పతకం గెలవాలని తన శరీరాన్ని రేసు కారులా చూసుకొంటాడు. అందరూ ఈ కారణ౦తో ఏకగ్రీవం చూపుతారు: నీకు వొలింపిక్స్ లో పతాకం వచ్చే అవకాశం ఉంటే, పిజ్జా మీద దృష్టి ఎందు కుంటుంది? నాకు ఆశ్చర్యమైన విషయమేమిటంటే మన స్వస్థతకి, సంపూర్ణ ఆయుష్షుకి అవసరమైన పనులు చేయమంటే కొందరు "వాటికి విలువ లేదు. బీరు పిజ్జా గురించే బ్రతకాలి" అని అంటారు. గీత య౦త్రo, యంత్రాన్ని నడిపేవాడి మధ్యన గల తేడా ఈ కారణంవల్ల చెప్తుంది: మనం మన యంత్రానికి తల వొగ్గక్కరలేదు. యంత్రం మన చెప్పుచేతల్లో ఉండాలి.

మన కార్ ని అపురూపంగా చూసుకొంటాం. దానికి కావలసిన హంగులన్నీ సమయం, ధనం వెచ్చించి చేస్తాం. దానికి మంచి రంగు వేయిస్తాం. వర్షా కాలంలో ఉపయోగపడే పరికరాలను అమరిస్తాం. మంచి స్టీరియో పాటలు వినడానికై పెట్టిస్తాం. లేదా మంచి హారన్ వేయిస్తాం. ఇవన్నీ ముఖ్యమైనవే. మనకు హారన్ అవసరం ఉంది. కానీ సమయమంతా శరీరం మీద వెచ్చించి, ఇంజన్ వలె ఉన్న మనస్సుని మరిచిపోయేం.

చాలా ఏళ్ల క్రిందట -- నేనింకా అమెరికాలో క్రొత్తగా ఉన్నప్పుడు -- నా మిత్రుడు తన కార్ ను చూపించడానికి తీసికెళ్ళేడు. "చూడు. నీకొక అద్బుతమైన విషయం చెప్తాను. ఈ కార్ కి ఇంజన్ లేదు. " అన్నాడు. తన కార్ ముందున్న హుడ్ ని తీసి చూపేడు. నేనక్కడ పాత గుడ్డలు, కొన్ని పనిముట్లు తప్ప ఏమీ చూడలేదు. కొంతసేపయ్యేక ఇంజన్ ముందుకాక వెనక ఉందని చెప్పేడు.

మనలో చాలామంది ఇలాగే ఆలోచిస్తాం. మన శరీరo ఇంజన్ లాంటిది. అది సదా నడుస్తూ ఉంటుంది. ఆ ఇంజన్ అతి నికృష్టమైన పరిస్థితిలో ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు. దేవుని దయవల్ల ప్రమాదములు లేక మన దినం సజావుగా నడవడానికి పనిచేస్తుంది. అందుకే గీత చెప్తుంది: మొదట నీ దృష్టి ఇంజన్ మీద కేంద్రీకరించు. అనగా నీ ఆలోచనా క్రమం, నీ మానసిక స్థితి, నీ ప్రేమ స్వభావం, నీ పట్టుదల మీద దృష్టి సారించు. నీకు శక్తివంతమైన ఇంజన్ ఉంటే కార్ కి హారన్ లేకపోయినా పరవాలేదు. కార్ కి ప్రక్క కిటికీలు లేక పోయినా పరవాలేదు. చాలా జీప్ కార్లకు ప్రక్క కిటికీలు ఉండవు. అయినా కొందరు వాటిని నడపగలుగుతున్నారు. ఇంజన్ మీద పనిచేయి: అది వెసులుబాటు లేని తప్పనిసరిగా చేయవలసిన పని. నీ మనస్సు మీద పని చేయి. అవి ఒక మంచి స్థితికి వచ్చి చక్కగా పనిచేస్తున్న తరువాత, సమయం ఇంకా ఉంటే, ఒక బొమ్మను తెచ్చి కార్ వెనుకనున్న కిటికీకి తగిలించు. శ్రీకృష్ణుడు నిర్లిప్తంగా అకాలమంటాడు.

ప్రస్తుత శాస్త్రాలు మనం మెదడు గురించి పూర్తిగా అధ్యయనం చేస్తే చాలు మనస్సుని గూర్చి పూర్తిగా విదితమౌతుందని చెప్తాయి. ఒక పత్రికా కథన౦లో ఇలా వ్రాసేరు: "ఎంతో పరిశోధన తరువాత మెదడును అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు తరతరాలుగా వస్తున్న సందేహాన్ని నివృత్తి చేయలేకపోతున్నారు. అది ఏంటంటే: మన భౌతిక శరీరం మన చైతన్యానికి కారణమా కాదా. సoదేహనివృత్తి కొంచం తక్కువ వ్యవధిలో అవుతుందన్న తరుణాన, వాళ్ళు మెదడులో చైతన్యం ఎక్కడ ఉంది, నరాల్లో ఎక్కడ సంగీతం ఉంది లేదా దృశ్యం ఉంది, అనే అంశాల మీద అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది." అవి మన చైతన్యం యొక్క అగ్రమే కాని పూర్తి చైతన్యమైతే కాదు. ఇంకా ఇలా వ్రాసేరు: "నిజానికి చైతన్యానికి సంబందించిన పరిశోధనలన్నీ సందిగ్దావస్తాలో పడ్డాయి. " అది తప్పదు. ఎందుకంటే అది ప్రశ్న వేయడం బట్టి ఉంటుంది. ఒకదాని మీద పరిశోధన చేసి అది మరొకటి అనుకోవడం మరింత సందిగ్దావస్థని కలిగిస్తుంది.

మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Massachusetts Institute Of Technology) సంబంధిత ఒక శాస్త్రజ్ఞుడు ఈ విధంగా చెప్పేరు: "మన మెదడుని కంప్యూటర్ గా చూస్తే మెదడు యొక్క వ్యవస్థ అతి క్లిష్టమైనది. అది ఆశ్చర్యం కలిగించేది, ఉత్తేజ పరిచేది. మెదడుతో పోలిక చూస్తే ఇప్పుడున్న కంప్యూటర్ లు దిగతుడుపే." మెదడు ఎంతో క్లిష్టమైనది. అయినప్పటికీ అది కంప్యూటర్ లేదా ఒక యంత్రము మాత్రమే. దాన్ని ఒక బల్ల మీద పెట్టి పరీక్షించవచ్చు. దాని ప్రతిరూపం తయారు చేయవచ్చు. దాని క్రియలన్నీ కృత్రిమంగా చేయించవచ్చు. కాని దానిని నడిపేవాడెవ్వడో చెప్పలేము.

చాలా ఏళ్ల క్రిందట ఓక్ లాండ్ అనే నగరంలో ఒక కంప్యూటర్ ప్రదర్శనకి వెళ్ళేను. చుట్టూ కంప్యూటర్ లు శబ్దాలు చేస్తూ బీప్, బీప్ అంటున్నాయి . కొన్ని నిమిషాలు ఉన్న తరువాత ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చేడు. నేను అతనికి వేరే దేశస్థుడిగా అనిపించి "మీకు ఇవి ఏమిటో తెలుసా?" అని అడిగేడు. గౌరవంకొద్దీ "దయచేసి మీరు చెప్పండి" అన్నాను. "ఇవి కంప్యూటర్లు" అని హుందాగా చెప్పేడు. "మీకు అవి ఏమి చేయగలవో తెలుసా?" అని మళ్ళీ అడిగేడు. "దయచేసి మీరు చెప్పండి" అని మళ్ళీ అన్నాను. "మీరేమి చేయగలరో అవి అన్నీ చేయగలదు" అన్నాడు. నేను నవ్వుతూ "అవి ధ్యానం చేయలేవు" అన్నాను.

అతనికి ధ్యానమంటే ఏమిటో తెలియక పోవచ్చు. కాబట్టి నేను చేసిన హాస్యం అతనికి అర్థం అవ్వలేదు. ఎటువంటి స్పందన లేదు. అతనికి జటిలమైన మెదడులా పనిచేసే కంప్యూటర్ గానీ ఉంటే చాలా గర్వ పడేవాడు. అది ఎంత జటిలమైనప్పటికీ మనం మెదడులా పనిచేసే కంప్యూటర్ చేయలేము. ఎందుకంటే మనలో మానవత్వం ఉంది. పదాలకు, ఆలోచనలకు, ఇంద్రియ అనుభవానికి అతీతంగా ఉన్న జ్ఞానం, ఎరుక మనకున్నాయి. అవి మనం మరణించినా ఉండేవి. దానికి కారణం ఏమో కాదు. కంప్యూటర్ కి ఆత్మ లేదు. అది ఒక యంత్రం మాత్రమే. ఏదీ దాన్ని ఒక జీవిగా మార్చలేదు. కొంత మంది కంప్యూటర్లు , యంత్రాలు ఏదో ఒకనాడు ఒక రాక్షసి లాగ మన జీవితాలను నియంత్రిస్తాయి అని భయపడుతూ ఉంటారు. అలా భయపడడానికి అవసరం లేదు. యంత్రాలు ఎన్నటికి మానవాళిని పరిపాలించలేవు. ఎందుకంటే వాటిలో చైతన్యం లేదు. కానీ అలాగని ధీమాగా ఉండకూడదు. యంత్రాలు మన చిక్కులను విడదీస్తాయి, చైతన్యాన్ని పెంపొందిస్తాయి, మన జీవిత గమ్యాన్ని చేరుస్తాయి అనుకోవడం అతిశయోక్తి. అది ఒకరకంగా ప్రమాదం కూడా.

స్వామీ అరబిందో ఇలా వ్రాసేరు: "తప్పులు చేసే మానవాళి చుట్టుప్రక్కల ప్రాంతాలను, సమాజాన్ని ప్రభుత్వ యంత్రాంగముతో నిర్దోషమైనవిగా మార్చాలని కలలు కంటుంది. నిజానికి మన ఆత్మలని నిర్దోషము చేయకపోతే సమాజాన్ని మార్చలేము. నీవు లోపల ఎలా ఉన్నావో, అదేవిధంగా బయట వస్తువులను అనుభవించి ఆనందంగా ఉంటావు. ఎటువంటి యంత్రాంగం నీ స్వధర్మం నుండి నిన్ను రక్షింపలేదు." చివరగా "నీ యొక్క ఆదర్శమేమిటి? మన లోపల ఉన్న భావంతో సర్వ మానవ ఐకమత్యము.. మన ఆత్మ శక్తిని భౌతిక మైన , మానసికమైన ఉపకరణాల మీద వ్యచ్చించి, శాస్త్రజ్ఞులు మనం జంతువులనుంచి పరిణామం చెందేమని చెప్పినా నిరుత్సాహ పడకుండా, పట్టుదలతో మన ప్రస్తుత పరిస్థితిని అధిగమించి..ముందుకు సాగాలి" అరబిందో గొప్ప జ్ఞాని అయినప్పటికి శాస్త్రాలను వల్లించటంలేదు. అటువంటి వాక్యాలు స్వీయ అనుభవంతోనే సాధ్యము.

వైరాగ్యం ఎక్కువవుతున్న కొద్దీ ఆరోగ్యం చక్కబడుతుంది. మన దైనింద చర్యలు: మంచి పోషకాహారం తినడం, ఎక్కువ వ్యాయామం చేయడం, సరిగా నిద్ర పోవడం వల్ల ఊహించనంత స్వస్థత మనకు చేకూరుతుంది. ముఖ్యంగా మనకు మనఃశాంతి కలుగుతుంది. అదిలేక ఎంత పోషకాహారం తిన్నా, వ్యాయాయం చేసినా స్వస్థత కలుగదు.

నేను చదివిని పుస్తకాలలో మనస్సును గురించి పెద్ద ఏమీ చెప్పబడలేదు. గుండె జబ్బు, కేన్సర్ గూర్చి చేసిన పరిశోధనాలలో తేలిన విషయం ఏమిటంటే ధూమ పానము, ఆహారంలోని కొవ్వు, రక్త పోటు వల్లనే ఎక్కువ హాని కలుగుతుంది . ఇవన్నీ బాహ్యమైన కారణాలు. అంతర్గతంగా ఉన్న కారణాలను ఎవ్వరూ పట్టించుకోవటంలేదు. ముఖ్యంగా మనస్సు యొక్క ప్రభావం. మనస్సు గురించి ఒకవేళ అడిగినా వాళ్ళకు ఎక్కడనుంచి మొదలెట్టాలో కొన్ని భౌతిక కారణాలవల్ల తెలియదు. మన కోపం వల్ల వాటిల్లే ప్రమాదం, కొలస్ట్రాల్ వలన కలిగేదానికన్నా ఎక్కువ. క్రోధం, నిరుత్సాహం, భయం, దురాశ -- డబ్బు గురించే కాదు పదవి, ఆనందానికై -- మన ఆరోగ్యానికి హాని కలుగిస్తాయి. అందరూ అనుకున్నట్టు చిరుతిండ్లు, బద్దకం ప్రభావం వీటికన్నా తక్కువే. ఒకతను బ్యాగ్ బంగాళాదుంప చిప్స్ రోజూ తినేవాడాని ఎక్కడో చదివేను. నాకైతే అతని శరీరం ఒప్పుకుందని నమ్మకం లేదు. మనం దయపూరితమైతే రోజుకు 3 బంగాళాదుంప చిప్స్ బ్యాగులు తిన్నా ఒక మంచి ఆహారం తినే క్రోధమైన వ్యక్తి తో పోలిస్తే ఆరోగ్యానికి ఏమీ హాని కాక పోవచ్చు.

కాఫీ వల్ల కలిగే దుష్ప్రభావాలు ఎన్నో. అందుకే నేను డీకాఫ్ ని చాలా తక్కువగా తాగుతాను. కొందరు కాఫీ లో ఉండే కఫీన్ అనే రసాయనం యొక్క ప్రమాదాలను నాకు చెప్పినపుడు వాళ్ళనిలా కుదుట పరుస్తాను. "నాకు మీతో విబేధం లేదు. మీరు ఎక్కువ ఆలోచించవలసినది కోపం గురించి. మీ కోపాన్ని వదులుకుంటే, మీకు కావలసినంత కాఫీ తాగవచ్చు ." మన ఆరోగ్యానికి ఈ 4 కారణాలు మిక్కిలి హాని కలిగించేవి: కోపం, భయం, దురాశ, స్వార్థం. మనం వీనిమీద మన దృష్టి కేంద్రీకరించాలి. లేదా అవి మన ఆరోగ్యానికి, క్షేమానికి, ప్రేమించగల శక్తికి దెబ్బ కొడతాయి.

మనం శరీరంతో తాదాత్మ్యం అవ్వకపోతే రోగాల బారిన పడం. వృద్ధాప్యం కూడా బాధ అనిపించదు. గాంధీ గారు దీనికి తార్కాణం. దయనీయుడైన బుద్ధుడు కూడ తన 70 వ సంవత్సరాల వయస్సులో చక్కగా ఉండేవాడు. చరిత్ర పుటల్లోనూ, చిత్రాల్లోనూ ఆగ్నేయ ఆసియాలో ఎక్కడైతే బౌద్ధ మతం అతి ప్రాచీన మైనదో, బుద్ధుడు వృద్ధాప్యంలోనూ మంచి బలంతో , ఉత్సాహంగా ఉండేవాడని చెప్పబడినది. కావి దుస్తులు ధరించి, ఏ సంపద లేక, భిక్ష పాత్ర పట్టుకున్నా అతను ఎన్నటికీ రాజే (రాజై పుట్టినందుకు).

కాలం గడుస్తున్న కొద్దీ మన భౌతిక శరీరం క్షీణిస్తుంది. కాని మనకున్న స్థిరభావం వల్ల -- అనగా శరీరంతో తాదాత్మ్యం -- మననుంచి కాలo కొల్లగొడుతు౦ది. విల్ రోజర్స్ అనే ఆయన ఇలా చెప్పేవాడు: ఆయన అందమైన యువతిని చూస్తే, ఉంకో 20 ఏళ్లలో ఆమె తనకన్నా 5 ఏళ్లు ఎక్కువ వున్నట్టు కనిపిస్తుంది. అది ఆధ్యాత్మికతను అవలంబించిన వారలు కూడా వర్తిస్తుంది. 20 ఏళ్లు ధ్యానం చేస్తే, మనo 5 ఏళ్ళ పాటే వృద్ధాప్యంకి దగ్గర అవుతాం.

నేనిక్కడ సమాధి గురించి మాట్లాడటలేదు. అంతకన్నా ముందు మనం ధ్యానంలో శరీరాన్ని కూడా మరచిపోయే స్థితిని అనుభవిస్తాం. సాధన పెరుగుతున్నకొద్దీ ఆ స్థితి నిద్రలో కూడా అచేతనంగా అనుభవిస్తాం. అదే అయితే పక్కనుండి ఎగిరి గంతెయ్యకండి. మీ మంత్రాన్ని కొన్ని నిమిషాలు జపిస్తూ లేవండి. అలా చేస్తే మీరు అత్యంత సుఖాన్ని అనుభవిస్తారు. దాని ఆస్వాదన వల్ల మీరు మీ శరీరాన్ని మునుపటికన్నా విలక్షణమైనట్టి దానిగా చూస్తారు. మీరు మీ శరీరాన్ని ప్రేమగా, నాలాగా, చూస్తారు. కానీ దానితో తాదాత్మ్యం చెందరు. శరీరాన్ని ఎంతో విలువైనది, మనకు పూర్ణ సంతృప్తిని ఇవ్వ వలసినదానిగా చూడరు. ఇక కోరికలుగాని, వాంఛలు గాని ఉండవు. అవి ప్రసక్తికే రావు. కోరికలు, వాంఛలు పాత ప్రపంచానికి సంబంధించినవి. మనం ఇప్పుడు ఉంకో ప్రపంచంలో నివసిస్తున్నాము. 76

Saturday, October 23, 2021

Eknath Chapter 13 Sloka 7

13.7

అనామిత్వ మదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం

ఆచార్యోపాశనం శౌచం స్థైర్య మాత్మ వినిగ్రహః

అభిమానము లేకుండుట, దంభము లేకుండుట , అహింసా, సహనము, ఋజుత్వము , గురుసేవ, శుభ్రత, స్థిరత్వము , మనోనిగ్రహము మరియు

ఈ శ్లోకం, వచ్చే 4 శ్లోకాలు అసంగత్వంగా జీవించేవారి గూర్చి చెప్పబడినది. అనగా ఎవరైతే తాము శరీరము, మనస్సు గానివారమని భావింతురో వారిని గూర్చి.

ప్రతి సంప్రదాయంలో ఇటువంటి మనుష్యులున్నారు. మాటలు వేరై ఉండచ్చు కానీ వాటి అర్థము ఒకటే. బుద్ధుడు అహంకారం జ్ఞానానికి చిహ్నం అని ఎన్నడూ అనలేదు. జీసస్ "దంభం ఉన్నవారు అదృష్టవంతులు" అని ఎప్పుడూ అనలేదు. ఈ 5 శ్లోకాలలో చెప్పబడిన గుణాలు నిజమైన జ్ఞానులకు చెందినవి. ఎక్కడైతే స్త్రీగాని పురుషుడు గాని ఆత్మ సాక్షాత్కారం చేసుకొంటారో ఈ గుణాలు వల్లే. అవి దేశకాల, సంస్కృతులకు అతీతం.

ఇవి ఉత్తేజ పరిచే సద్గుణాల జాబితా మాత్రమే కావు. ఇవి విత్తనాల జాబితా: ఒక్కొక్క గుణాన్ని పండించి వైరాగ్యం పొందవచ్చు. అవి విత్తనము మరియు ఫలం. వాటిని పాతి, పెంచితే అవి పెద్దవై మనోక్షేత్రంలో వ్యాపించి, జీవితాంతం సరిపోయే పంటను ఇస్తాయి.

ఈ గుణాలు ఒకదానితో ఒకటి సంభందం ఉన్నవి. నా దృష్టిలో ఈ శ్లోక సారాంశం క్షమ. ఎవరైతే క్షమని -- మాటాలతోనే కాక హృదయంతో -- ఎలా ఇవ్వాలో తెలుసుకొంటే వారు ఎక్కడైనా సామరస్యంతో పని చేస్తారు. వారికెట్టి భయం ఉండదు. ఇదేమి పెద్ద రహస్యం కాదు. చిన్నపాటి అహంకారం. దానిలోంచి వైరాగ్యమనే సద్గుణం వస్తుంది.

మొదట నిగర్వము. శ్రీకృష్ణుడు దానిని పొగరు లేకుండుట అని చెప్పాడు. నాకు తెలీని విషయమేమిటంటే గర్వాన్ని పటుత్వం గాను, వినయాన్ని బలహీనంగాను చూస్తారు. అందరికీ గర్వం బలహీనపరుస్తుందని తెలుసు. గర్వమంటే కాఠిన్యం. మానవ సంభందాలలో అగాధమైన వేర్పాటు మనకున్న అభిప్రాయాలు, విలువలు వల్ల కాదు. ఒక్క గర్వం వల్లే. ఏ పక్షము మొదటి అడుగు వేయడానికి ముందుకు రాదు. ఎవరికైతే భద్రత, బలము ఉన్నాయో గర్వాన్ని వీడి రాజీకై ముందడుగే గాక లెక్కలేనన్ని అడుగులు వేయవచ్చు.

ఇక్కడ అహింసతో సంబంధం ఉంది. అహింస అనగా హింస చేయకుండా ఉండడము మాత్రమే కాదు. అది ఒక తత్వం. మన మనస్సులో క్రోధం లేకుండా చేసుకొనుట. అనుభవంలో క్రోధాన్ని దయగా, జాలిగా మార్చుకోవడం.

అహింస మన సహజ స్థితి. అది ఒక సారమైన భూమి వంటిది. దానిలో దయ అనే విత్తనాలు వేయనక్కరలేదు. మంచి మాటలు, క్రియలు దానిలోంచి సహజంగా వస్తాయి. కానీ క్షేత్రం స్వార్థంతో నిండిపోయింది. స్వార్థ పూరిత, లోభముతో కూడిన నడత, మనమెప్పుడైతే అధికులమనుకొన్నామో, అప్పుడు వస్తుంది. స్వార్థమనే కలుపు మొక్కలను తీసేస్తే భద్రత, తృప్తి పెరుగుతాయి. అది ఏదో బాహ్య శక్తి వల్ల కాదు. మనలో సహజంగా ఉన్న దయ వల్ల. అలాగే రాక్షస దంతాలను నాటితే విరోధము మొలకెత్తుతుంది. ఇటువంటి తోట వల్ల పర్యావసానము జీసన్ కి రాలేదా? ఎక్కడైతే ఒక దంతం పడిందో దానినుంచి సైనికులు యుద్ధానికై ఆవిర్భవించేరు. ఇది నమ్మశక్యం కానిదవవచ్చు. కానీ ఇది మనం రోజూ పత్రికలలో చదివే హింసను గూర్చి చెప్పేది అక్షరాలా నిజం.

హింసపూరిత భావనలు ఒక గొలుసులా ప్రతిస్పందిస్తాయి. ఒకరోజు నా మిత్రుడు మూకా అనబడే నా కుక్కను చూస్తున్నాడు. మూకా ప్రక్కింటివాళ్ళ పిల్లిని చూస్తున్నది. ఆ పిల్లి ఒక పక్షుల గుంపును చూస్తున్నది. పిల్లి సహజంగా ఆ పక్షుల వైపు దూకింది. మూకా వెంటనే పిల్లి మీదకు దూకింది. నా మిత్రుడు మూకా వెనక పడ్డాడు. ఇదే మన జీవితంలో జరిగేవి. మనని ఆఫీసులో ఎవరైనా అవమానిస్తే, మనతో ఇంట్లో సహజీవనం చేసే వాళ్ళ మీద కోపం ప్రదర్శిస్తాo. వాళ్ళు తక్కినవాళ్ళ మీద రోషంగా ఉంటారు. ఇది ఒక వ్యష్టికి మాత్రమే చెందదు. ప్రపంచ దేశాలుకూడా ఇలాగే ప్రవర్తిస్తాయి.

చాలా ఏళ్ల క్రిందట టివి లో ఒక వ్యక్తి గొలుసుకట్టును చూపించేడు. అతడు ఒక గదిని ఎలకలను పట్టే స్ప్రింగ్ లతో (mouse trap) నింపేడు. ఎప్పుడైతే ఆ స్ప్రింగ్ ని కదిలిస్తామో అది రెండు బంతులను విసురుతుంది. ఒక పలక మీద ఎలా ఒక యురేణియం కణాన్ని ఒక న్యూట్రాన్ పరమాణువు తాకితే రెండు న్యూట్రాన్లు వస్తాయో వివరించేడు. ప్రకటించకుండా ఒక బంతిని స్ప్రింగ్ మీద వేసేడు. ఆ స్ప్రింగ్ నుండి 2 బంతులు విడిపించుకొని తక్కిన స్ప్రింగ్ ల మీద పడాయి. వాటినుంచ్చ 4 బంతులు ఎగిరేయి. ఇలాగ అవి వ్యాపిస్తే గదంతా ఎగురుతున్న బంతులతో నిండి పోయింది.

మన ప్రపంచం అలాగే ఉందనడం అతిశయోక్తి కాదు. ఒకడు చాలా కాలం క్రోధ పూరితుడై తన క్రోధాన్ని నలువైపులా వ్యాపింపజేస్తాడు. ఎప్పుడైతే చాలా మంది క్రోధంతో, ద్వేషంతో , అసహనంతో , వైరంతో ఉంటారో, హింస పెరుగుతుంది . అది మన హృదయాల్లో , ఇళ్ళల్లో , వీధుల్లో , నగరాల్లో, వివాదంతో ఉన్న జాతుల్లో , ముఠాలలో, దేశాలలో విలయ తాండవం చేస్తుంది.

వైరాగ్యం ఈ గొలుసుకట్టును నివారిస్తుంది. ఒక పిల్లి సహజంగా పక్షులపైకి గెంతుతుంది. దానికి తెలిసిందంతా అదే. మూకా అనబడే నా కుక్క పిల్లి వెనక పడడం దాని సహజ గుణం. కాని మనుష్యులకు తమ ప్రతిక్రియను నియంత్రించుకొనే శక్తి ఉంది. మన స్పందన-ప్రతిస్పందన అనే గొలుసుకట్టును నివారించవచ్చు. ఎలాగంటే అసహ్యన్ని ఓర్పుతో, ద్వేషాన్ని దయతో , భయాన్ని నమ్మికతో విశ్వసనీయంగా, నియమంగా పాటిస్తే పెరుగుతున్న హింసను అరికట్టవచ్చు.

ధ్యానంతో మన మనస్సును కుదుట పరచుకొంటే స్వార్థం తగ్గి, వైరాగ్యం వచ్చి మన దృక్పథం మారుతుంది. అప్పుడే మనం క్షమించడానికి ఉన్న అవరోధాలు ఏవో సైద్ధాంతిక, తత్వజ్ఞానం వల్ల కాదని తెలుస్తుంది. అవరోధాలు మన స్వార్థం, పట్టుదల, ఇతరులమీద ప్రదర్శిస్తే వాళ్ళు మనమీద కూడా ఆదేరీతి స్పందిస్తే వచ్చేవి. దీన్ని సరిగా భావన చేస్తే క్షమను పెంపొందిచ్చవచ్చు. వోల్టైర్ ఇల్లా చెప్పేరు: "అందరినీ అర్థం చేసుకోవడమంటే వారిని క్షమించడమే". మనకు మరింత పదునైన చూపు ఉండాలి. అది మన పట్టుదల. పరిస్థితులు ప్రకోపించినప్పుడు శాంతంగా ఉండడానికి ఎంతో ఆత్మస్థైర్యము అవసరము. ఎప్పుడూ మన సమత్వాన్ని కోల్పోక, దురుసు మాటలాడక ఉండాలి. అలా చేస్తే ఒక అద్భుతం మనందరి అనుభవానికి వస్తుంది. మన ప్రత్యర్థి శాంతిస్తాడు. అతని కళ్ళు తేట అవుతాయి. మళ్ళీ సఖ్యత పెరుగుతుంది.

నూతన నాగరీకతలో క్రోధం ఒక మంచి సంస్కారంలా చిత్రీకరింప పబడినది. మంచి సంస్కారం అనగా మంచి సంబంధం. అది నిజం కాదు. క్రోధం బంధాలను త్రెంచుతుంది. మానవుల మధ్య అగాధం ఏర్పడిస్తుంది. బంధాలను నాశనం చేస్తుంది. "నీవంటే నాకు లెక్కలేదు" అని చెపుతుంది. "నువ్వు గౌరవింపబడే వ్యక్తి కాదు" అని అంటుంది. సంభాషణ ఒకే ఒక్క విధానంగా చేయగలం. అది ఓర్పు, సహనం ద్వారా. వానివల్ల మన మనస్సులో గాయాలేర్పడవచ్చు. నిజానికి గాయాలు ఏర్పడుతాయి. మన సహనాన్ని పరీక్షిస్తుంది. అందువలననే ఆధ్యాత్మిక జీవితం అతి కష్టం. మనం ఎంత ఇతరులకు ఇస్తే అంతకన్నా రెట్టింపు మనకు తిరిగి వస్తుంది. జీసస్ ఈ విధముగా చెప్పెను: "ఎవ్వరికి ఉందో, వాళ్ళకి ఎక్కువ ఇవ్వబడుతుంది. ఎవ్వరికీ లేదో, వాళ్ళ కున్నది లాక్కోబడుతుంది". ఆయని శిష్యుడు "అది న్యాయం కాదు", అంటే ఆయన చిరునవ్వుతో "ఏది న్యాయం కాదు? ఆ ఎన్నిక నీ చేతిలో ఉంది" అనవచ్చు.

దీన్ని ఒకే విధంగా తెలిసికోగలం. అది ఇచ్చి-పుచ్చుకోవడమనే మన మధ్య ఉన్న బంధం. మనకి దగ్గరి వాళ్ళు మనను ప్రేరేపింపవచ్చు. మనమూ వాళ్ళను ప్రేరేపింపవచ్చు. ఇది ప్రతీ దేశంలోనూ సహజంగా జరిగేదే. ఒక మగవాడు, ఆడది భిన్నమైన విద్యాలయాలికి వెళ్ళి చదివి, భిన్న సంస్కృతిలో పెరిగి, భిన్నంగా పని, ఆట, తినడం, మాట్లాడడం, ఆలోచించడం చేసి, అప్పుడప్పుడు కలహించకపోతే అది మనము ఆహ్లాద పడవలిసిన విషయం. మన మధ్య గల వేర్వేరు గుణాలు సహనం, ఓర్పు, గౌరవం ప్రదర్శించుకోవడానికి దోహదం చేస్తాయి. దీని కన్నా నేర్చుకోవడానికి వేరొక మార్గం లేదు.

క్షమ ఎటువంటి బంధాలకైనా మూలం. ముఖ్యంగా ప్రేమించడానికి. ఇద్దరు ప్రేమించుకున్నారనుకుందాం. ఒకరు తప్పు చేస్తే "నేనూ అదే చేస్తాను. చెల్లుకు చెల్లు" అని మరొకరు అనరు. ఒకరిమీదవొకరికి గౌరవం తగ్గదు. ఆ సమయంలో ప్రేమికునికి చేయూతవనివ్వాలి. అంతేగానీ వానిని కించ పరచకూడదు. వానిని తప్పును అధిగమించేలా చేసి, మానసికంగా ఎదగడానికి ప్రోత్సాహించాలి. ఇది ఒక కళ. ఇది ఒకని నడవడిపై తీర్పు లేదా అసహ్యం పడవలసిన విషయం కాదు. అంటే మన అహంకారాన్ని పూర్తిగా లేకుండా చేయాలి. మనలో చాలామంది లోతుగా ఆలోచింపక, ఉన్నత జ్ఞానం లేక, బంధం చెడితే దానినుంచి విముక్తిని కోరుకొంటారు. దీని గురించి దుఃఖించ నవసరము లేదు. నేను అజ్ఞానంతో ఎన్నో తప్పులు చేసాను. అలాగే నా చుట్టు ప్రక్కల వాళ్ళు కూడా. ఇప్పడినుంచీ ధ్యానంతో మన జీవితాలను గడుపుదాం. మనం దృఢనిశ్చయంతో జావ కారకుండా ఉందాం. ఎక్కడైతే ద్వేషం, విరోధం, పగ చూపించేమో ఇప్పుడు ప్రేమ, గౌరవం చూపిద్దాం.

మనం పరిపూర్ణితను కోరనక్కరలేదు. రోబర్ట్ బ్రౌనింగ్ ఒక గొప్ప ఉపమానము చెబుతూ ఇలా అన్నారు: "మనం అర్థచంద్రాకృతి గీస్తే చాలు, పరమాత్ముడు దాన్ని పూర్ణ వృత్తాన్ని చేస్తాడు. అతడు మనముంటున్న క్లిష్ట పరిస్తితులను పరిగణలోకి తీసికొంటాడు. పత్రికల్లో తరచూ కామం , డబ్బు గురించి వ్రాస్తున్నారు. ప్రపంచమంతా అర్థంలేని ఉన్మాదంతో నిండి ఉన్నది. ఆయన మన దేశ, సాంస్కృతిక, భౌతిక లేదా బుద్ధి కున్న లోటుపాటులను అర్థంచేసికొని ఇలా అంటాడు: ఇతరుల గురించి నువ్వు వీలయినంత మంచి చెయ్యి. అందరి పురోగతికై పాటు పడు. నువ్వది చేయగలిగితే నువ్వు ఐక్యతకు, సామరస్యానికి, శాంతికి ఒక గొప్ప శక్తి అవుతావు." "

పరమాత్మ మనను గాఢంగా ప్రేమిస్తాడు. ఆయనకు ఎనలేని దయ, క్షమ ఉన్నాయి. ఆయన ప్రేమ ఎంతవరకంటే మనం ఇతరులను ప్రేమించినంత. దీనిలో ఎటువంటి చిత్రం లేదు. నేను ఒకరిని క్షమించినపుడు నా మనస్సులోని అంతర్గత ప్రపంచంలో చాలా నిజంగా అనిపించి నా బాధలను మరచిపోతాను. దానివల్ల నా నరాల వ్యవస్తకు, ముఖ్య ఆవయవాలకి మంచి జరుగుతుంది. పురాతన భాషలో చెప్పాలంటే నాపై దైవ కృప ఉన్నది. కోపం అనేకమైన శారీరక బాధలను కలుగజేస్తుంది. క్షమ బాధలను ఉపశమనం చేస్తుంది. అవి మానసిక బాధలవ్వచ్చు లేదా శారీరకమైనవి కావచ్చు.

ఒకరోజు నేను బెర్క్ లీ దగ్గర కార్ పార్ కింగ్ చేసి వస్తూ వుంటే పూర్వపు రాజ కోటల దగ్గర ఉండే పెద్దపెద్ద మేకులవంటి ఇనుప శలాకలు నేల మీదు కనిపించేయి. అక్కడ ఒక సూచన ఉంది: "ఇక్కడ ప్రవేశించ వద్దు. టైర్ లు నాశనమవుతాయి". ఆ శలాకలు చూస్తూ ఉంటే టైర్ లు పచ్చడి అవుతాయి. మనలో కూడా ఇటువంటి సూచన ఉంది: "స్వార్థంతో బ్రతుకకు. ఆధ్యాత్మికంగా, మానసికంగా, భౌతికంగా కష్టాలను అనుభవించవలసి వస్తుంది." జీసస్ మరియు శ్రీకృష్ణుడు మనకు "ఇతరులపై పగ తీర్చుకో వద్దు. ఇతరులను దూషణ చేయవద్దు" అని బోధ చేయడం ఏదో మతమునకు పరిమితం కాదు. అవి సజీవ సిద్ధాంతాలు. నిర్దయమైన ఆలోచనలు, మాటలు, నడవడిక వల్ల మనకే అమిత నష్టం వాటిల్లుతుంది. ఎప్పుడైతే మీరు బద్ద శత్రువును క్షమిస్తారో అది మీ బంధాన్ని పునః నిర్మాణము చేయడానికి తోడ్పడుతుంది . దానితో బాటు మీలో పేరుకుపోయిన క్రోధం, వైరం సమసిపోయి ఆరోగ్యం కుదుటపడుతుంది. నన్ను అడుగుతూ వుంటారు: "నేను వేరే వారి స్వస్థత కై ప్రార్ధిస్తే అది పని చేస్తుందా?" నా సమాధానం: "అది పరులకు ఎంత ఉపయోగకరమో నాకు తెలీదు. కానీ నీకు మాత్రం చాలా ఉపయోగ పడుతుంది."

ఇది శ్రీకృష్ణుడు మంచి జ్ఞానం అని అంటాడు : మన మధ్య ఎన్నో బేధాలు ఉన్నా దేవుని అందరిలోనీ చూడాలి. దేవుడుని తెలుసుకోవాలంటే కష్టాల నెదుర్కొని అతనిలా మార్పు చెందాలి. జీసస్ ను తెలిసికోవాలంటే అతనిలాగ నిగర్వముతో ఉండాలి. ఆయన శిలువ మీద నుండి శత్రువులను క్షమించేడు. మనకు ఎలా జీవించాలో చెప్పడానికి తన జీవితాన్ని దారపోసేడు. ఎలాగంటే తెలివిగా, సహనంతో, అందరి సౌఖ్యం గురించి. ఆయన్ని గౌర వించడానికి పరిమితులు లేవు. మనని మనమే ఆయనకు శిష్యులుగా చేసికోవాలి. అలాగ మన అనుబంధాలలో క్షమ అనే ఉన్నత గుణాన్ని ప్రదర్శించాలి. ఆయన అన్నట్టు: "తండ్రీ , వారిని క్షమించు. ఎందుకంటే వారేమి చేస్తున్నారో వారికి తెలీదు." 71

Wednesday, October 13, 2021

Eknath Chapter 13 Sloka 6

13.6

[శ్లోకం 13.5 లో ఉన్నది ]

క్రిందటి శ్లోకంలో శ్రీకృష్ణుడు ఘటనా ప్రపంచం (phenomenal world) లోని ఘటకములను (ingredients) చెప్పెను. ఇప్పుడు ఆ ఘటకములను మేళవించి ఒక వ్యక్తిని తయారుచేసే పద్దతి చెప్పబోవుచున్నాడు. శరీరము ఆ పద్దతిలో ఒక భాగము, కానీ అది ఒక చిన్న పాత్రను పోషిస్తుంది. ఒక వ్యక్తిలో ఎక్కువ శాతం అంతర్గత ప్రపంచం. దానిని మనస్సు అనవచ్చును. ఆ ఘటకములన్నీ ఒకే ఘటనా ప్రపంచమునకు చెందినవి. అది సదా మారుతూనే ఉంటుంది. మనకు దానితో తక్కువ సంభందం ఉంది.

ఉదాహరణకు నా శరీరం తీసికోoడి. అది దిట్టంగా, వెచ్చగా, చామనచాయి రంగులో ఉంది. అయినా నా వైద్య మిత్రులు అది సదా మారుతూ ఉంటుందని చెప్తారు. నా చేతులు ఎప్పుడూ ఉన్నవే. నా చర్మము వేరు. నా కండరాలు వేరు. నా ఎముకలు కూడా వాటిలాగే సదా మారుతున్నాయి. నేనిలా కూర్చున్నప్పుడు నా చేయిలోపల నాకు తెలీకుండా కణాలు మారుతున్నాయి. అయినప్పటికి అది ఒక చేయి. అది నా చేయి. దానియందలి కణాలు చేపగా మారవు. అవి నా శరీరానికి అనుగుణంగా మారుతాయి.

నా పూర్తి శరీరం అంతే. అది 20 ఏళ్ల క్రిందటి శరీరం కాదు. అయినప్పటికీ అది ఒక సంపూర్ణ శరీరం. నా శరీరం. అది ఒక పదార్థమే కాదు. ఒక వ్యవస్థ కూడా. ఈ జ్ఞానం వల్ల మనకి తెలిసినదేమిటంటే శరీరం మీద వ్యామోహము, దురభిమానము తగదు. ముక్కు సూటిగా ఉన్నదని అహంకారం చెందవచ్చు. కానీ అది చెందే మార్పులు మనం తెలిసికోనక్కరలేదు.

ఆ ప్రక్రియ చాలామటుకు ఆకాశానికి (space) కి చెందినదే. శరీరంలో ఘన పదార్థం చాలా తక్కువ. ఎక్కువ ఉన్నది ఆకాశమే. ఆకాశాన్నంతా తీసేస్తే పదార్థo ఒక వేరుశెనగ తొక్కoత ఉంటుందని ఎక్కడో చదివేను. ఇది ఆశ్చర్యకరమైనది అతిశయం కాదు. దీని వలన తెలిసినదేమిటంటే పదార్థం ఎంత ఉపయోగకరమో ఆకాశం కూడా అంతే ఉపయోగకరం. అందుకే ఆకాశం పంచ భూతాల్లో ఒకటని చెప్పబడినది. గాలితో నిండిన ఆకాశమే మన శరీరం అని ఎలా నమ్మడం?

మనం నిజంగా నమ్మితే, బహుశా మనం కలవరం చెందుతాము. ప్రణయం చేయుట మిక్కిలి కష్టం. రోమియో అక్కడ గాలితో నిండి కనిపించని జూలీయట్ గురించి ఏమనుకొంటాడు? వేరుశెనగ తొక్కతో సమానమైన శరీరంని చూసి ప్రేమలో పడతాడా? మాయ ఇటువంటి గ్రాహ్యతను సహించలేదు. కాబట్టి దాని మీద ముసుగు వేస్తుంది. మన నైజం విచిత్రం. రోమియో ఎన్నిమార్లు "అది వేరుశెనగ తొక్కే, అది వేరుశెనగ తొక్కే" అనుకున్నా, జూలియట్ చేయి పట్టుకోగానే శరీరంలో మార్పులు చెందుతాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. రక్తం వేగంగా ప్రవహిస్తుంది. మోహం వల్ల చేయి ఘన పదార్థంగా గ్రహించబడుతుంది

ఇది ఇప్పటికే మూర్చావస్తని కలుగజేసింది. దాన్ని ఇంకొంచెం పొడిగిద్దాము. మనస్సును చూద్దాం. ప్రతిరోజూ క్రిందటి దినములాగే మార్పు లేకుండా నిద్రనుంచి లేస్తాము. ఎందుకు? మార్పు లేనిదెందుకు? నువ్వు భిన్నంగా చూస్తావు. బహుశా క్రిందటి రోజు రాజాగా తలంచేవు. ఈరోజు విశేషంగా చూస్తావు. "భోజనం చేసిన తరువాత చూద్దాం. నేను భోజనం చేసే వరకు నేను కాదు." భోజనం చేసిన తరువాత నువ్వు నిజంగా మారవచ్చు. మనమంతా అటువంటి భావనలు గలవారమే. వేర్వేరు సమయాల్లో, వేర్వేరు వ్యక్తులతో మనం వేర్వేరుగా ఉంటాము. ఆఫీసులో అందరినీ గౌరవంగా పలకరిస్తారు. ఇంట్లో స్వార్థపూరితంగా ఉండచ్చు. ఈ విధంగా మనకు రెండు వ్యక్తిత్వాలు ఉండచ్చు. ఇది సమత్వం ఉన్నవారికి కూడా వర్తిస్తుంది. ఇదేవిధంగా మన కోరికలు మారుతాయి. ఒక వ్యక్తిత్వంలో నువ్వు చెత్తలబండిని నడిపించే వాడిగా భావించవచ్చు. ఉదయాన్నే బండిని ఇంకా నిద్రపోతున్న చుట్టుప్రక్కలివారిని కలవర పరిచేలాగా తోలుతావు. నీ మనస్సులో వేరే ఉద్దేశం ఉండవచ్చు. అభిప్రాయాలు మారుతాయి. దయపూరిత వారలెందరో నాకు తెలిసి ఇప్పుడు సంప్రదాయ బద్దంగా ఉన్నారు. మార్పు మనస్సు యొక్క స్వభావము.

జ్ఞానులుకూడా అలాగే తలిచేరు. "మరినేను ఎవర్ని" అని ప్రశ్నించు కొన్నారు. మనం అవయవాల సమూహం కాదు. అవి ఏవీ కావు. అవి శూన్యాన్ని సూచిస్తాయి. మనస్సు కూడా మార్పు చెందేదే. ఆలోచిస్తే వేరుశెనగలో చాలామంది ఇముడుతారు అన్న భావన కలుగుతుంది.

ఒక భౌతిక శాస్త్రవేత్తకు, ప్రపంచం పరమాణువులు, శక్తి తో కూడినట్టుగా కనిపిస్తుంది. అలాగే మనస్సు అభిప్రాయాల, ఆలోచనల మహా సముద్రం. వ్యక్తి మార్పు చెందినప్పటికీ, వానిలో ఏదో శక్తి దినదినం మార్పు చెందకుండా ఉంటుంది. మనస్సు స్వభావం పునరుచ్ఛరించడం. అది దేనినైనా ఆలోచించ గలదు. నిజానికి అది పాత ఆలోచనలు గుర్తు చేస్తూ ఉంటుంది. ఎలాగంటే నా చేయి పాత కణాలు విసర్జించి కొత్త కణాలను తయారు చేసికోవడం లాగ. కానీ ఉన్న చేయి ఉన్నట్టే ఉంటుంది. అలాగే మనస్సు కూడా పని చేస్తుంది. ధ్యానం వల్ల మనస్సును మార్పు చేసుకోవచ్చు. మనస్సులో ఘన పదార్థం , మార్పులేనిదంటూ ఏమీ లేదు. మనం దాని స్వరూపాన్ని పట్టుకోవాలి. మనకున్న అలవాట్లు, గుణాలు, స్వీయ భావావరోధం ని సంస్కృతంలో సంస్కారాలు అంటారు.

ఇవన్నీ మన అహంకారాన్ని గాబరా పెడతాయి. అది ముఖ్యమైన పాత్రని పోషిస్తున్నాదని తలస్తుంది. కానీ అది అబద్ధం. కోరికలు, అలవాట్లు, కోపము, అభద్రత లతో గజిబిజిగా చేసిన కట్టలా యాధృచ్చికంగా ఉన్నది. ఈ కట్టను ఎవరు మోస్తున్నారు? చేతులతో మోద్దామని ప్రయత్నిస్తే అది చిందరవందరగా నేల పడుతుంది. కాబట్టి దానితో కూడి ఉంటే మన అభద్రత ఎక్కువవుతుంది. దానిలో అతిశయోక్తి లేదు. ఈ పేకముక్కలతో చేయబడిన నీడ వంటి ఇల్లుని ఏదైనా భయపెట్టగలదు. దానివల్ల తాడుతో కట్టబడడానికి ప్రయత్నిస్తున్న అహంకారం తన రక్షణ కొరకై ప్రాకులాడుతుంది .

ఎలాగైతే మనస్సులోని ఆలోచనా ప్రవాహం అహంకారానికి వర్తిస్తాయో, అది ఆత్మ తప్ప వేరే వస్తువుకు వర్తించదు. అన్నిటికీ మూలమైన ఆత్మను అహంకారం ఆక్రమించి దాని గుణాలను స్వంతం చేసుకోవడానికి తయారవుతుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. అహంకారం ఆత్మ లక్షణాలను అపహరించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అది కోటు వేసుకొని, టోపీ పెట్టుకొని నన్ను ఆత్మలాగా తెలివైన, ప్రతిసృష్టి చేయగల, ప్రేమించదగిన, మరణంలేనిదానిగ చూడండి అని దబాయించి అడుగుతుంది. కానీ ఒక చిన్న భాగం దాన్ని నమ్మదు. అది అద్దంలో చూసుకొని తనను తాను పొగుడుకోడానికై ప్రయత్నిస్తుంది. కానీ అక్కడ ప్రతిబింబం లేదు. ఘనమైన పదార్థము లేదు. నిమిషనిమిషానికి మార్పు చెందుతుంది. అవన్నీ ఏకమై దానికి అభద్రత, భయము కలిగిస్తాయి. అవి చేతనావస్తలో తొలగాలంటే ముందు మనమెవరో తెలిసికోవాలి.

ఈ ప్రక్రియనంతటిని క్షేత్రంగా శ్రీకృష్ణుడు అభివర్ణించేడు. అది ఎంత నిజమో మన ఆధునిక జీవన శైలిని చూస్తే తెలుస్తుంది. మనము పదార్థము, శక్తిని వరసగా గోచరమై, సూక్ష్మమై ఒక బలవంతమైన భౌతిక శక్తిగా తలుస్తాము. ఇది పాఠశాలలలోనూ, టివి లోనూ బోధించరు. ఆపై అది ఎందుకూ పనికిరానిదని, నిరూపణ చేయలేనిదని అవహేళన చేస్తారు. మన ఒక విషయం అర్థం చేసుకోవాలి. వస్తువుకి సంబంధించిన జ్ఞానం ఎలా అతిశయోక్తికి గురి అవుతుందో జ్ఞప్తి పెట్టుకోవాలి . అదే గీత చెప్తున్నది. శక్తులతో కూడివున్న ఆ క్షేత్రం అణువుకన్న సూక్ష్మమైన వస్తువుల్లో వ్యాప్తి కలిగినది. అదే మనస్సుకున్న శక్తి.

ఇది వాక్చాతుర్యము కాదు. మనo కరెంటును (electricity) చూడలేము. దాని కార్యాలన్నీటినీ చూడగలం. అలాగే మన వ్యక్తిత్వంలో ఉన్న శక్తులను కూడా చూడలేం. అయస్కాంతం చూస్తే ఒక ఇనప ముక్కలాగ ఉంటుంది. కానీ అది ఒక కుప్పగా ఉన్న ఇనుప రజను దగ్గరకు తెస్తే ఆ రజను కుప్ప సమాంతర రేఖలుగా మారుతుంది. మనం ఆ రేఖలను చూడగలం. అది అయస్కాంత క్షేత్రం యొక్క రూపం.

అదేవిధంగా మనం వ్యక్తిత్వం యొక్క ఆకారాన్ని దాని క్రియలద్వారా తెలిసికోవచ్చు. మొదట శరీర ఆకారం. సూక్ష్మమైన అణువులలో, ఒక శాస్త్రజ్ఞుడు చెప్పినట్లు, శరీరo వర్ణింప శక్యం గాని శక్తిగా తెలియబడుతుంది . మనము శరీరమని దేన్ని అంటామో అది ఘన పదార్థము. ఎందుకంటే అది మన ఇంద్రియాలకు అనుభూతి కలిగిస్తుంది. హిందూ-బౌద్ధ శాస్త్రాలు ఒక అడుగు ముందుకు వేసి: మన భౌతిక శరీరం వ్యక్తిత్వం యొక్క ఘన పదార్థం. అది ఎన్నో సంవత్సరాల కాలంలో మన ఆలోచనల క్రమంతో చేయబడినది. ఇది గుహ్యమైన సిద్ధాంతము కాదు. శాస్త్రాలు స్వస్థత, ఆరోగ్యం, ఎలా బాల్యం నుంచి ఉన్న జీవన శైలిలో నిర్ణయింపబడినవో మన జ్ఞప్తికి తెస్తాయి. మనమేమి తింటామో, రోజుకు ఎన్నిమార్లు తింటామో, పని ఎలా చేస్తామో , జీవితంలో తటస్తిoచే చిక్కులను ఎలా విడదీస్తామో, మన తీరిక సమయం ఎలా గడుపుతామో ఇవన్నీ బాల్యంనుంచి వచ్చినవి. ఇవన్నీ మన ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయి. ఈ శ్లోకం మన ఇష్టాయిష్టాలను, పట్టుదలను , మనను క్రియాశీలులను చేయు కోరికలను జ్ఞప్తికి తెస్తుంది. అది జన్యు సంభందమైన విషయంగూర్చి చెప్పటంలేదు. చాలా సార్లు మన వ్యక్తిత్వం జన్యువుల మీద ఆధారపడి ఉంటుంది. మన సమర్థత జన్యువులు కూడా నిర్ణయిస్తాయి. తక్కువ కదలిక వల్ల తిండిని నియంత్రించకపోతే లావు అవతాం. మనను ఎక్కువ బరువుగా ఉండమని ఎవ్వరూ శపించరు. మన కోరికలు, నడవడిక, మనం చేసుకొన్న ఎన్నికలు, గుప్తంగాఉన్న ప్రవృత్తులను వెలుపలికి తెస్తాయి.

ఇతరులపైన జరుగు కార్యములు ద్వారా శక్తివంతమైన క్షేత్రం గూర్చి ఇంకా చెప్పవచ్చు.

సాన్ ఫ్రాన్సిస్కో అనే నగరంలో ఒక శక్తివంతమైన కరెంట్ తో పనిచేసే ఆయస్కాంతాన్ని చూసేను. నా నడుముకున్న ఎత్తులో రెండు స్థoబాలు ఒకదానివైపు ఇంకోటి వంచ బడి ఉన్నాయి. చెయ్యిని వాటి మధ్య పెడితే ఎటువంటి చలనం ఉండదు. కానీ కరెంటు వాటి లోకి పంపితే అది వేరే విషయం. వాటి మధ్య కొంత ఇనుప రజనను వేస్తే, అవి సమాంతర రేఖల వలె మార్పు చెంది ఒక వంతెనలా గాలిలో తేలుతాయి. నువ్వు దాన్ని కదపవచ్చు. దాని మీద చేయి పెట్ట వచ్చు. ఎటువంటిదీ ఆ రజనును మొయ్యకపోయినా ఆ వంతెన దిట్టంగా ఉంటుంది. కంటికి అగుపడని క్షేత్రం నిజంగా ఇలా ఉంటుంది. అది తన చుట్టూ ఉన్న ఆకాశాన్ని (space) వంచుతుంది.

ఒక మనిషికూడా అలా ఉండవచ్చు. మనము వాడుక భాషలో "ఆమె వ్యక్తిత్వం దృఢంగా ఉంటుంది" అంటాం. అయస్కాంతం లాగ మన వ్యక్తిత్వం ఎక్కడికి వెళ్ళినా శక్తివంతమైన క్షేత్రాన్ని ప్రసరింపజేస్తుంది. అది మంచికయినా లేదా చెడుకయినా కావచ్చు. అందుకే ఒక మనిషి కొందరికి ఆకర్షణీయంగా ఉంటాడు. మరికొందరికి అసహ్యకరoగా ఉంటాడు. సమస్య ఏమిటంటే: మనం కావలసిన వారిని ఆకర్షించ౦. అలాగే మనం అసహ్యించే వారి బారినుండి తప్పించుకోలేం. ఇoకోవిధంగా చెప్పాలంటే మనం కర్మ బీజాన్ని నాటి దాని పంటను పొందే వాళ్ళనే ఆకార్షిస్తాం. ఒక కోపిష్టికి తన కోపాన్ని ప్రేరేపించే మనుష్యులు, సంఘటనలు ఎదురౌతాయి.

తగిన పరిస్థితులు కలుగజేస్తే ఒకని శక్తివంతమైన క్షేత్రం చాలా దూరం ప్రసరించవచ్చు. గీత ఆదిలో చీకటిలో ఉన్న శక్తిలా దుర్యోధనుని వర్ణిస్తుంది. జీవితమనే నదిలో అతడు సుడిగుండం వంటి వాడు. మీరు సుడిగుండాన్ని చూసేరో లేదో నాకు తెలీదు. బాల్యంలో నదిలో ఈదుతూ ఉంటే నాకు భయoకరమైన సుడిగుండాలు కనబడ్డాయి. ఎక్కువగా వర్షా కాలంలో. అది ఒక భయానకమైనది. ఒక కనబడని చెయ్యి దానిని ఈవొడ్డు నుంచి ఆ వొడ్డుకి కదిపినట్టు ఉంటుంది. అది వేగంగా, చీకటిలోలాగా, బలమైన సుడులుగా కనిపిస్తుంది. అలా కదులుతూ దారిలోనున్న వాటినన్ని తనలోకి లాక్కుంటుంది. దుర్యోధనుడు అటువంటి వాడే. అతడు క్రోధం, బలమైన అహంకారలతో ప్రపంచాన్ని తన చుట్టూ త్రిప్పికొని దాని నాశనానికి కారణమయ్యేడు. నేను ఒక వాచ్యార్థానికై ఇది చెప్ప లేదు. హిట్లర్ జీవిత చరిత్ర చదివిన వారికి వాని క్రోధానికి ఎంత మంది బలి అయ్యేరో తెలుసు. దుర్యోధనుడూ ఆ కోవకు చెందినవాడే.

శక్తివంతమైన క్షేత్రం యొక్క చిత్రం మనకు ఒకరిమీద మరొకరు ఎలా ఆధారపడి ఉన్నామో తెలుపుతుంది. మరియ మన మనోవాచాకర్మలు ఎంత దూరం వెళ్లగలవో వివరిస్తుంది. ఎలా అయితే ఒక కెరటాన్ని నదినుంచి విడదీయలేమో, మనలోఉన్న శక్తిగల క్షేత్రం మనం నివసించే శరీరానికే పరిమితమని అనలేం. ఆ కెరటాల సమూహం -- మనలాంటి సాధారణ మనుష్యుల లెక్కపెట్టలేని కోరికలు, కర్మలు -- ఒక సుడిగుండాన్ని సృష్టించి ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందవచ్చు .

ఉదాహరణకు నేను ఒక సాధారణ, అమాయకమైన విషయం యొక్క కార్యం గురించి ఆలోచిస్తున్నాను. అది ఆవు మాంసం తినాలనే కోరిక. కొంతమంది అవసరమున్నా లేకపోయినా అదేపనిగా మాంసం తింటారు. రోజూ మాంసాన్నే ఆకాంక్షిస్తారు. కొందరు రోజుకు రెండు సార్లు తింటారు. అది ఆహారంలా కాక ఒక చిహ్నం లా ఉన్నది. ఇది సాధారణంగా మోతాదులో తినే మాంసం గురించి చెప్పబడలేదు. నేను చెప్పేది మాంసం తినాలనే స్థిర భావం. నియంత్రణ చేయని బలమైన కోరిక. ఎప్పుడైతే ఒక కోరికకు నియంత్రణ లేకపోయిందో, కొందరు డబ్బు చేసికొoటారు . ఎపుడైతే బలమైన కోరిక, దురాశ కలసి ఉంటాయో, వాని దుర్మార్గం అన్నిటినీ వ్యాపిస్తుంది.

రస్సెల్ బేకర్ అమెరికాని ఆవు మాంసం మత్తులో ఉన్నట్టు వర్ణించేరు. అమెరికాలో మాంసాహార మార్పు రెండవ ప్రపంచ యుద్ధం తరువాత వచ్చింది. యుద్ధం ముగిసిన తరువాత ఆవు మాంసం -- ముఖ్యంగా స్టేక్ అనబడేది--ఎక్కువ వాడుకలోకి వచ్చింది. అది ఒకని గొప్పతనానికి, ధనానికి చిహ్నం అయ్యింది. 1950 దశాబ్దంలో ఆవు మాంస విక్రయం కొన్ని కోట్ల వ్యాపారంగా మారింది. నేను ఈ దేశానికి వచ్చినపుడు ఆవు మాంసం సర్వ సాధారణంగా ఉండేది. ఆవు మాంసంతో చేయబడిన అనేక ఆహార పదార్థాలు మధ్యాహ్నం తినేవారు; స్టేక్ లు సాయంత్రం తినేవారు. అతిథులు వచ్చినపుడు బార్ బెక్యూ లు విపరీతంగా చేసేవారు. స్టేక్ బర్గరు లేని జీవన శైలి అమెరికాలో లేదని చెప్పడం అతిశయం కాదు.

క్రమంగా బర్గరు సంపన్నదేశాలకు వ్యాపించింది. పశ్చిమ ఐరోపా, జపాన్, లాటిన్ అమెరికాలో ధనికులు ఆ వ్యాప్తికి దోహదం చేసేరు.

ఇప్పుడు దాని ఫలితాలను కారణ కార్య రూపంలో చూద్దాం. ఆవుల్ని పెంచడానికి లాటిన్ అమెరికాలోని అరణ్యాల్లో చెట్లని నరికేశారు. ఆవు మాంసం తినాలనే కోరిక ఈ విధంగా ప్రపంచాన్నే కబళిస్తోంది.

బ్రజిల్ లో సగం అమెజాన్ అరణ్యము ఉంది. అది కొన్ని కోట్ల విస్తీర్ణం గలది. కేలిఫోర్నియా అంత వైశాల్యం గలది. 1970 సంవత్సరంలో బ్రజిల్ ఆ అరణ్యాన్ని పాశ్చాత్యులకు అమ్మింది. ఎవరైతే ఆవుల్ని పెంచడానికి పెట్టుబడులు పెట్టాలనుకున్నారో వాళ్ళకి ఆర్థికంగా లబ్దిని ఇచ్చింది.

అరణ్యాల్లోని చెట్లను నరకడానికి కారణం: ఆవులు మసలడానికి, వాటికి కావలసిన గడ్డిని పెంచడానికి. ఉష్ణ ప్రదేశ్శాల్లో ఆవుల్ని పెంచడంవల్ల పర్యావరణానికి మిగతా వాటి కన్న అత్యంత ప్రమాదకరం. రెయిన్ ఫారెస్ట్ అనబడే అరణ్యం ఆవులను పెంచేవారు వలన గాక ముఖ్యంగా బహుళ దేశ వ్యాపారస్తుల దూరాశకు గురయ్యింది. ట్రాక్టర్లతో ఉపరితల మొక్కలను నరికేరు. ఏజెంట్ ఆరెంజ్ అనబడే గుల్మ నాశినిని (herbicide) వాడి చెట్లను పీకేశారు. వాటి అవశేషాలను, చచ్చిన జంతు శరీరాలతో కలిపి, దహనం చేసేరు. కొన్ని సంవత్సరాల తరువాత మట్టిలో సారం తగ్గింది. విషపూరిత కలుపు మొక్కలు పెరిగేయి. ఆ తరువాత ఆ ప్రదేశాన్ని ఆవులను పెంచే వారు విడనాడడం జరిగింది. వాళ్ళు మళ్ళీ ఉంకో ప్రదేశానికి వెళ్ళి ఈ విషవలయాన్ని ఆవృత్తి చేసేరు.

పెట్టుబడుదారులు ఇలా అన్నారు : "అయితే ఏమిటంటా? చాలా అరణ్యం చెట్లతో మిగిలి ఉంది. కోట్ల ఎకరాల భూమి సాగులేకుండా ఉంది. పర్యావరణం గురించి గుండెలు బాదుకొనే వారి వల్ల మేము ఆ భూమిని వాడుకోలేకపోతున్నాం. వాళ్ళకి అరణ్యం అంటే మక్కువ ఉంటే ఉండచ్చు". బ్రజిల్ ప్రభుత్వం వాళ్ళతో అంగీకరించింది. వాళ్ళకి కావలసింది విదేశీ పెట్టుబడులు.

తరువాత వరదలు వచ్చేయి. సైన్స్ అనే పత్రికలో డిసెంబర్ 1980 లో ఒక కధనం వచ్చింది. "గత దశాబ్దంగా అమెజాన్ వరద నీటి మట్టం పెరుగుతూ వచ్చింది. అది అదుపులేకుండా అరణ్యంలోని చెట్లను నరకడం వలననే. నాల్గవ వంతు అమెజాన్ అరణ్యం నరకడం జరిగింది. అది విపరీతం అవుతున్నది." వరద నీటిమట్టం ఎక్కువవడం వల్ల ఉపరితలంలోని మట్టి వరద నీటిలో కొట్టుకు పోతుంది. అలాగే తక్కువ వృక్షాలు వుండడంవల్ల గాలిలో తేమ తక్కువై, వర్షాలు తగ్గేయి. అంటే అనావృష్టి. కొన్నేళ్లలో పచ్చటి అరణ్యం ఉండవలసిన ప్రదేశం ఎడారిగా మారవచ్చు.

ఈ విషయం గూర్చి అనేక కథనాలు వార్తల్లో వచ్చేయి. అవి ఒక పెద్ద చిత్రీకరణకు దారితీసేయి. దక్షిణ అమెరికాలో ఆహార వనరులు ప్రమాదంలో పడ్డాయి. ప్రపంచ పర్యావరణం అమెజాన్ అరణ్యం మీద ఆధారపడి ఉంది. ఎప్పుడైతే అరణ్యం విస్తీర్ణం తగ్గినదో భారత దేశంలో వర్షాలు సాగుభూమి మీద కాక సముద్రంలో పడ్డాయి. అలాగే బర్మా (మయనమార్), ఈశాన్య ఆసియాల్లో కరువు వచ్చింది. ఎక్కడో 12 వేల దూరంలో వున్న బ్రజిల్ లోని ఆవుల పెంపకం గూర్చి జరిగిన సంఘటనల వల్ల నీటి ఎద్దడి, కరువు, వరదలు వాళ్ళపై తాండవించేయి.

కొద్ది సంవత్సరముల తరువాత శాస్త్రవేత్తలు పర్యావరణంలో చెడుకు దారి తీసిన మార్పులు గురించి అధ్యయనం చేయడానికి సమావేశం అయ్యారు. "అమెజాన్ అరణ్యాలను ఏఒక్క సహజ వనర౦ కన్న వేగంగా నాశనం చేస్తున్నారు." అని సందేశం ఇచ్చారు. ఆహారముకు సంబంధించిన సంస్థ (Institute for Food and Development Policy) 1987 లో ఇలా చెప్పింది: "ప్రస్తుత పరిస్థితులు గానీ కొనసాగితే ఇంకో 75 ఏళ్లలో అమెజాన్ అరణ్యం కనుమరుగవుతుంది." ప్రపంచంలో ఉన్న అరణ్యాలలో మూడవ వంతు బ్రజిల్ లోనే ఉన్నది. బ్రజిల్ కి అనిశ్చయమైన ఘనత లభించింది. ఎందుకంటే అక్కడ కోట్ల ఎకరాల అరణ్యాలు భూతలంలో ఎక్కడా లేనట్లు నాశనమయ్యేయి.

శాస్త్రవేత్తలు అమెజాన్ అరణ్యాలను భౌగోళిక వనరులుగా భావిస్తారు. ఒకటికి 12 వ వంతు భూమి అరణ్యాలతో కప్పబడినది. మన జీవనం సజావుగా సాగాలంటే అవి ఎంతో అవసరం. మన ఆహార వనరులు వాటి మీద ఆధార పడి ఉన్నాయి. వాటిని "తల్లి భూమి ఊపిరి తిత్తులుగా" వర్ణించేరు. ఎందుకంటే అవి ప్రమాదకరమైన కాలుష్యకారక బొగ్గు పులుసు వాయువుని, ఓజోన్ ని వడపోసి మనకు కావలసిన ప్రాణ వాయువుని, నీటిని సమకూరుస్తాయి. వాటివల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ తగ్గుతుంది. అనగా పరిశ్రమలు కారణంగా పెరుగుతున్న భూగోళ ఉష్ణోగ్రత అరికట్టబడుతుంది. లేకపోతే మనము ఐస్ ఏజ్ కి వెళ్ళవలసి వస్తుంది. అమెజాన్ అరణ్యాలు విచిత్రంగా తప్పుడుగా అర్థం చేసుకోబడ్డా పరిశ్రమలు నుండి వచ్చే కాలుష్యాలను నివారించి మన మనుగడకి తోడ్పడుతున్నాయి.

ఉష్ణ ప్రదేశాల్లో ఉన్న అడవుల్లో సగం జీవరాస్యులు నివసిస్తాయి. వాటి జన్యు నాశనం ఎటువంటి అనార్థాలకు దారితీస్తుందో ఎవళ్ళకీ తెలీదు. మనకు తెలిసినది అమూల్యమైన ఓషధులు, ఆహార దినుసులు మనకు అందకుండా పోతాయి. అతికొద్ది వృక్ష, జంతు జాతులను ఇప్పటివరకు అధ్యయనం చేసేరు. అవి 4 వేల ఫల, కూరగాయల జాతులు. నూటికి 90 శాతం ఇంకా వృద్ధి చెందలేదు. మనను రక్షించే మందులు తయారీలో నాల్గవ వంతు అక్కడి నుంచి వచ్చినవే. అక్టోబర్ 3, 1988 సైన్స్ పత్రికలో ఇలా వివరించేరు: "అరణ్యాలు కనుమరుగు ఐతే భూమి పై ఉన్న జంతువులు, వృక్షాలు, కీటకాలు 50 శాతం నాశనమవుతాయి. " చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన డేవిడ్ రాప్ ఇలా చెప్పేరు: "6 కోట్ల సంవత్సారల క్రిందట జరిగిన అతి పెద్ద వినాశనంతో డైనోసార్లు (dinosaurs) అంతరించిపోయేయి. వాటితో పాటు 60-80 శాతం జీవరాసులు కూడా కనుమరుగయ్యేయి. ఒకవేళ ప్రస్తుతం ఉన్న జీవరాసులలో 50 శాతం నాశనమైతే 6 కోట్ల సంవత్సరాల క్రిందన జరిగిన వినాశనం పునరావృత్త మైనట్లే"

ఈ పంథాలో కొన్ని విషాదకరమైన కార్యాలు మనకు అగుపించవు. కొన్ని ఏళ్ల క్రింద న్యూ యార్కర్ అనే పత్రికలో ఈ విషయం చదివేను. రాబిన్ హాన్ బరీ టెనిసన్ అనబడే వ్యక్తి సర్వైవల్ ఇంటర్ నాషనల్ (Survival International) అనే సంస్తను నడుపుతుంటాడు. అతను సమూలంగా నాశనమవుతున్న మానవ జాతులగూర్చి అధ్యయనం చేసేడు. ఆయనకు స్పూర్తి లన్ డన్ టైమ్స్ పత్రిక యొక్క ఆదివార అనుభందంలో ప్రచురించబడ్డ "జినొసైడ్" అనే కథనం. అది జర్మనీ నాజీల గురించి కాదు. అది అమెజాన్ ఇండియన్స్ కు సంబంధించినది. 1500 శతాబ్దంలో అరకోటి ఇండియన్స్ బ్రజిల్ లో ఉండేవారు. అది కాబ్రల్ రాక పూర్వం. నేడు వాళ్ళ సంఖ్య 5 శాతం తగ్గింది. వాళ్ళ వినాశనం ఎంతో దూరంలో లేదు. 20 వ శతాబ్దంలో సంవత్సరానికి ఒక మానవ జాతి కనుమరుగవుతున్నాది. ఇది ఒక క్రూరమైన పద్దతిలో జరుగుతున్నాది. ఎందుకంటే వాళ్ళు ఖాళీ చేసిన ప్రదేశాలను ఆవులతో వ్యాపారం చేసే వాళ్ళు, ఖనిజాలను వెతికేవాళ్ళు, ఇళ్ళు కట్టేవాళ్ళు, తమ హస్తగతం చేసుకొంటున్నారు. ఇదంతా నాగరీకతలో ముందంజ వేసిన దేశంలో జరుగుతున్నది. నేను ఇవన్నీ భూమిని కొల్లగొట్టే సంస్కృతి లేదా మానసిక కారణాల వల్ల జరుగుతున్నాయని నమ్ముతాను.

నేను ఒక సామాన్య కోరిక గూర్చి విచారణ చేసేను. అదేంటంటే మనకు ఒక పదార్థాన్ని తినాలనే కోరిక ఉద్భవించిందనుకోండి. అది చాలా మంచి పదార్థము. దాని వలన మనమెంతో ఉన్నత స్థానంలో ఉన్నామని తెలియజెప్పబడుతుంది అనుకోండి. ఎవరికైనా ఇది ఒక చిన్న కోరికే. కానీ అది సర్వ వ్యాప్తమైతే, ప్రశ్నలు రానీకుండా డబ్బు చేసుకోవడానికి వీలవుతుంది. డబ్బుచేసుకోదలచిన వాపారస్తులు టివిలో ప్రకటనలు ఇచ్చి, మన సహజ అభిలాషను పెంపొందిస్తారు. మనం మంచి పోషకాహారం తినాలనుకొంటాం. మన పిల్లలకు సుఖాలను అందివ్వాలనుకొంటాం. మనం కష్టపడి సంపాదించినది అనుభవిద్దామనుకొంటాం. ఇలా ఉండగా వ్యాపార సంస్థలు వాటిని మనలోని బలహీనతలుగా తలచి ఎక్కువ సంపాదనకై ప్రయత్నిస్తాయి. అవి భూగోళమంతటా పెట్టుబడులు పెడతాయి. సంపన్న దేశాలు --అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ లెక్కలో-- కూడా ఈ ఆటలో ప్రవేశిస్తాయి. తద్వారా విలువైన సహజ సంపదలను సంపన్నుల విలాశాలకై కట్టబెడతారు. వారి దేశ ప్రజలకు వొరిగిందేమీ లేదు. అది అలా వ్యాప్తి చెందుతుంది. ఎప్పటివరకంటే మన చిన్న కోరిక ఒక అలవాటుగా మారి, మనం ప్రకటనలు ఇచ్చే సంస్థల నియంత్రణలో ఉన్నంతవరకు. అందుకే కోరికలను, అవి ఎంత చిన్నవైనా, ఆలోచించుకొని కోరాలి. లేదా ఒక చిన్న కోరిక వేరొకరికి మనను మోసగించడానికి చేయూత నిస్తుంది. 66

Saturday, October 9, 2021

Eknath Chapter 13 Sloka 5

13.5 -13.6

మహాభూతా న్యహంకారో బుద్ధిరవ్యక్త మేవ చ

ఇంద్రియాణి దశైకంచ పంచ చేంద్రియగో చరాః

ఇచ్చా ద్వేషః సుఖం దుఃఖం సంఘాత శ్చేతనా ధృతిః

ఏతత్క్షేత్రం సమాసేన సవికార ముదాహృతం

పంచభూతములు, అహంకారము, బుద్ధి, పదనొకoడు ఇంద్రియములు, ఐదు శబ్దాది విషయములు, ఇచ్ఛ , ద్వేషము , సుఖము, దుఃఖము, దేహేంద్రియాదుల సమూహము, చేతనత్వము, ధైర్యము అను వీటితో గూడి వికారయుతమైనట్టిదియే క్షేత్రము

రెండు దశాబ్దాల క్రిందట నేను కారు డ్రైవింగ్ బెర్క్లీ నగరములో నేర్చుకున్నాను. ఆమెరికన్లతో పోలిస్తే చాలా ఆలశ్యం. అలాగైతే నేను ఏనుగు సవారి బాల్యంలో నేర్చుకొన్నాను. అమెరికన్లకు అది రాదు. నేను డ్రైవింగ్ పాఠాల్ని పూర్తి చేసాను. కానీ తక్కిన ప్రాణుల భద్రత కోసం నేను ఎక్కువగా డ్రైవింగ్ చేయను. నాకు డ్రైవింగ్ నేర్పిన గురువు చాలా ప్రావీణ్యo గలవాడు. అతను బెర్క్లీ లో ఉండే ఉపాధ్యాయులకు కూడా డ్రైవింగ్ నేర్పించి ఉండవచ్చు. ఎందుకంటే డ్రైవింగ్ గురించ విపులంగా చెప్తాడు.

చాలకాలంపాటు నాకు కారు గేర్లు మార్చడం రాలేదు. అతను నాకు గేర్ల గురించి వివరించేడు. "ఈ స్టిక్ లోపలున్న స్పైడర్ గేర్ తో కలపబడినది" అని అతను కాగితంమీద బొమ్మలు గీసి చూపించేడు. "ఈ స్టిక్ ఇక్కడ ఉంది. గేర్ లతో తగలకుండా ఉన్నప్పుడు దానిని న్యూట్రల్ అంటారు. ఇక్కడ నాల్గు గేర్ లు ఉన్నాయి.."

నేను అడిగేను: "క్షమించండి, డ్రైవింగ్ నేర్చుకోడానికి ఇది అవసరమా".

"అవసరం కాదు. నువ్వు చేతులతో డ్రైవింగ్ చేస్తావు కాబట్టి లోపల ఏమవుతున్నదో తెలిసికోనక్కరలేదు. కొంతమంది లోపల ఏమవుతున్నదో తెలిసికొని తొందరగా నేర్చుకొంటారు. "

"దయచేసి పాఠం చెప్పండి. మీరు చెప్పింది అనుభవానికి తెచ్చుకోడానికి ప్రయత్నిస్తాను" అన్నాను.

పై శ్లోకాలవంటివానిలో శ్రీకృష్ణుడు పారిభాషికంగా అనుభవానికి కావలసిన దాని కన్నా ఎక్కువ చెప్తాడు. మనము ఓపిక పట్టాలి. ఆ 22 విశ్వ సిద్ధాంతాలు విశ్వం గురించి మనోహరంగా వివరిస్తాయి. అందువల్ల మనకి సులభంగా అనుభవానికి వస్తాయి. హిందూ శాస్త్రాల్లో దీనిని సాంఖ్య అంటారు. దాని అర్థం లెక్కపెట్టుట లేదా జాబితా చేయుట. యోగ, ధ్యానము దానితో ముడి పడినవి. తరతరాలుగా సాంఖ్య, యోగ కలిపి భోదించేవారు. అవి పరస్పరంగా సహకరించు కొంటాయి. జ్ఞానం ధ్యానానికి దోహదం చేస్తుంది. ధ్యానము దానిని అనుభవoలోకి తెచ్చి సిద్ధాంతాలను అర్థంచేసుకోవడానికి సహాయపడుతుంది. కొన్ని సంవత్సరాలు సాధనచేస్తే ఆ పురాతనమైన సిద్ధాంతాలు యోగ, ధ్యానములతో మంచి అవగాహన కలిపించి మనస్సుని స్వాధీనం చేసుకోవడానికి తోడ్పడతాయి.

ఈ 22 సిద్ధాంతాలను ఆంగ్లంలో అనువాదం ఎలా చేయాలో నాకు తెలీదు. ఎందుకంటే వాటికి పశ్చిమ దేశాలలో వాడే పద ప్రయోగాలతో పొంతన లేదు. వారు వాడే తర్కము వేరు. సాంఖ్యలో ఒక శక్తివంతమైన భావన ఉంది: అది భౌతిక సత్యాలను గూర్చి చెప్పటం లేదు. అది మనస్సును విశ్లేషిస్తుoది "మన మెవరము" అనే ప్రశ్నకు సమాధానం సమకూరుస్తుంది. సాంఖ్య భౌతిక ప్రపంచం మనస్సు కన్నా వేరు కాదని నమ్ముతుంది. అది మన బాహ్య, అంతర్గత ఇంద్రియాల గూర్చి మాట్లాడదు. అది చెప్పేదంతా "ఇది ఏకైక ప్రపంచ అనుభవము." వస్తువు, ఇంద్రియము వేర్వేరు కావు. అవి ఒకే ఘటనకు చెందినవి. మనస్సు, శక్తి , పదార్థము అవిచ్ఛిన్నమైనవి. భౌతిక ప్రపంచమనగా మన మనస్సుకు తోచినది కానీ తనంతటతాను ఉద్భవిందినది కాదు .

ఒక ఉదాహరణ ఇస్తాను. ఇవాళ ప్రొద్దున్నే ఒక మంచి మామిడిపండుని తిన్నాను. అది పెద్దది, అందమైనది, సువాసన గలది. అది సమయానికి పరిపక్వం అయినది. దాని తొక్క ఎరుపు , పసుపు రంగులతో కూడియున్నది. మీకు ఇప్పటికి మామిడి పండ్లు నాకెంతో ఇష్టమని తెలిసి ఉండచ్చు. నేను బాల్యంలో వందలకొద్ది మామిడి పండ్లను తిన్నాను. నాకు వాటి జాతి రంగు, ఆకారము, వాసన వల్ల చెప్పగలను.

సాంఖ్య నేను తిన్న మామిడి పండు బాహ్య ప్రపంచంలో నేను చెప్పిన విశేషణాలతో లేదoటుంది. ఆ పండులో ఎరుపు పసుపు అనే అంతర్భాగాలు లేవు. దాని విశేషణాలు మన కన్ను అనే జ్ఞానేంద్రియం యొక్క పరిమిత శక్తి వల్ల ,మన నరాల వ్యవస్థ వల్ల తెలియబడుచున్నవి. నా పెంపుడు కుక్క మూకా ఎరుపు, పసుపు రంగులను చూడలేదు. అది విశేషమైనది కాని నెరసిన ముద్ద అనుకొంటుంది. దానిని ఒక వెన్నతో పూసిన బ్రెడ్ ముక్క కన్నా విలువ తక్కువని భావిస్తుంది. మన చేతన మనస్సు పంచేంద్రియాల ద్వారా వచ్చిన సందేశాలను కూర్చి మామిడిపండు రూపాన్ని కల్పిస్తుంది. ఆ బాహ్యంగాలేని రూపం నా అనుభవంలోకి వస్తుంది. అలాగని నిజమైన మామిడిపండు లేదని కాదు. కానీ అది ఇంద్రియాల ద్వారా నాలో కల్పించబడినది. నా జ్ఞానంలో, చేతన మనస్సులో మాత్రమే ఉంది. ఒక మెదడు, నరాల వ్యవస్తాను అధ్యయనం చేసే శాస్త్రజ్ఞుడు ఇలా చెప్పేడు : "మనం ప్రపంచాన్ని నిజంగా ఎదుర్కోము. ఇంద్రియముల శక్తి వలన మనము అనుభవించేదంతా మన నరాల వ్యవస్తను మాత్రమే"

గీత సృష్టి పంచ భూతాలతో చేయబడినదని చెప్పడం అవి మన పంచేంద్రియాలా ద్వారా అనుభవ యోగ్యం కాబట్టి. ఉదాహరణకు కుర్చీలు, టేబిళ్ళు అనేవి నిజము కాదు. అవి మన మనస్సులో నిక్షిప్తమై ఉన్న నామరూపాత్మకములు. ఈ విధంగా భౌతికమైన వస్తువులు మనస్సులో చిత్రీకరింపబడాలి. మన పంచేంద్రియాలు గ్రహించేవి తన్మాత్రలు : శబ్ధ, స్పర్శ, రూప, రస, గంధాలు. ఈ తన్మాత్రలకి పంచభూతాలు గ్రాహ్యము. కాబట్టి సాంఖ్య 5 సంఖ్యను విశేషంగా చూడడం ఏదో నిభందన లేక కాదు. అది మన మెదడు లోని విద్యుత్ రసాయన రూపాలుగా ఒక క్రమములో ఉన్నవి.

పంచభూతలలో నాల్గుటికి ఆంగ్లంలో అనువాదము ఉన్నది. అవి earth, fire, air water . గ్రీక్ దేశస్తులు మననుంచే పూర్వ కాలంలో వీనిని సంగ్రహించి ఉండవచ్చు. మనం పంచభూతాలిని మన గ్రహణ శక్తితో అనుసంధానము చేసేము కానీ వాటిని విశ్లేషణము చేయలేదు. అది భౌతిక శాస్త్రము చేసే పని . మన సిద్ధాంతాలు అధునాతనము కాకపోవచ్చు. కానీ అవి విశేషమైనవి. శాస్త్రజ్ఞులు చెప్పే నూతన సిద్ధాంతాలు వానితో ఏకీభవిస్తాయి. ఒక విషయం తెలియాలంటే జ్ఞాతను జ్ఞేయం నుండి విడదీయలేము. తేజస్సు అంటే అగ్ని మాత్రమే కాదు. దాని అర్థము గొప్ప వెలుగు లేదా ప్రకాశం అని కూడా కావచ్చు. మన మనస్సులోని ఉద్ధేశ్యం ప్రకారం తేజస్సు యొక్క అర్థాన్ని అగ్ని లేదా మరోటి కి ఆపాదిస్తాం.

ఐదవ భూతం ఆకాశం. దాన్ని ఆంగ్లంలో ఈథర్ అనవచ్చు. ఆ పదము శాస్త్రజ్ఞులు గగనానికి ఆవల వున్న ప్రదేశాన్ని సూచిస్తుందని అని చెప్తారు. అది ఒకరకంగా భ్రమ కలిపించేది. ఐన్ స్టైన్ అనే శాస్త్రజ్ఞుడు అది తప్పని వివరించగా ఇప్పుడు శాస్త్రజ్ఞులు ఈథర్ పదాన్ని వాడటంలేదు. కాబట్టి నేను ఆకాశం పదాన్నే వాడుతాను. భౌతిక శాస్త్రవేత్తలు పదార్థం, శక్తి దేశ కాలాల కే పరిమితమని చెప్తారు. అది సహజంగా ఎటువంటి పదార్థం గాని శక్తిగాని లేని మూసలో ఉన్నట్టు చెప్తారు. ఆ మూస రూపం దానిలో ఉన్నా పదార్థాల బట్టి ఉంటుంది. ఆకాశం ఆ మూస వంటిది. అది సృష్టి యొక్క భౌతిక ప్రపంచం.

ఇంద్రియాలు వాటి గ్రాహ్యములు మధ్య చాలా తాదాత్మ్యం ఉంది. మనం చూసే వస్తువులు , కన్ను ఇంద్రియము మధ్య ప్రేరణ క్రియ (causal connection) ఉంది. ఎట్లనగా మన కన్ను నరాల వ్యవస్త గుండా కాంతి కిరణాలను మెదడు లేదా మనస్సులో ప్రతిబింబింప చేస్తుంది. ఈవిధంగా అన్నీ మన మనస్సుకి సంభందించినవి. మనం చూసే వస్తు బింబాల యొక్క ఆకారం మనo చూసే విధానంలో ఉంటుంది. ఇలాగ ఇంద్రియాలు అవి పనిచేసే వస్తువులు కలిపి చెప్పుకోవాలి. యోగశాస్త్రం మానసిక పరంగా ఎందుకు ఇంద్రియాలు, అవి పనిచేసే వస్తువులు మధ్య తాదాత్మ్యం ఉన్నదో వివరంగా చెపుతుంది. ఇంద్రియాలకు లోబడితే ఆ సంబంధం ఇంకా గట్టి పడుతుంది.

గీత ఆ అవినాభావ సంభందం మనం కాదు, అది ఆత్మది, జ్ఞానిది అని చెబుతుంది. . ఆయస్కాంతము ఆకర్షణ లాగ క్షేత్రంలోని పదార్థాల మధ్య అవినాభావ సంభందం ఉంది. అది మనతో సంబంధం లేనిది. మనకు నేనే క్షేత్రమనే భావన లేకపోతే వాటి మధ్య ఉన్న ఆకర్షణను చూడవచ్చు. కానీ దానితో తాదాత్మ్యం చెందకూడదు. నేను ప్రిన్స్ అలఫాన్సో జాతి మామిడి పండ్లను చూస్తే ఇంద్రియాలు సహజంగా స్పందిస్తాయి. కానీ నేను వాటికి దూరంలో ఉండి వాటి మధ్యగల ఆకర్షణని అసంగత్వoగా చూడాలి. ఎలాగంటే ఎవరు బరువులెత్తి మోస్తున్నారో వారలను చూచినట్లు. ఇలా అయితే నా ఇంద్రియాలు పంపే సందేశాలను గ్రహిస్తూ ఆనందంగా ఉండచ్చు. నా చేయికి నేనిలా చెప్పగలను: "ఇక చాలు. మనం తగినంతగా తిన్నాము. మిగిలినది రేపటికి."

సాంఖ్య చెప్పే 24 విధాలు బహు పెద్ద గాధ. ఒక వ్యష్టి చైతన్యo పరిణామం చెంది మన ఇంద్రియాలకు లెక్కపెట్టలేని అనుభవాలు అందిస్తుంది. ఇది ప్రపంచం బిగ్ బాంగ్ నుండి ఎలా పరిణామం అయిందో అలాగునే. ప్రపంచం అతి వేడి అయిన, అతి సూక్ష్మమైన, అనంతమైన శక్తిగల ఆది కణం నుంచి ఆవిర్భవించినదని అనేక శాస్త్రజ్ఞులు చెపుతారు. కాలారంభంలో, సృష్టికి ముందు, మనం సృష్టి అంతా ఒక అణు రూపంలో ఉన్నట్టు ఊహించుకోవాలి. కాలారంభం అంటే అంతకు పూర్వం దేశ కాలాలు ఇంకా పుట్టలేదు. ఇది ఒక మాటల చాతుర్యం. నాకు అటువంటి శాస్త్రాలు చదువుతే నవ్వు వస్తుంది. అది శాస్త్రాలకు మాటలతో అందని విషయం. యోగులు ఈ విధంగా మాట్లాడితే శాస్త్రజ్ఞులు జుట్టు పీక్కొని, వారు చెప్పేది కవిత్వం అని హేళన చేస్తారు.

బిగ్ బాంగ్ సిద్ధాంతం ప్రకారం సమత్వంతో కూడిన, అవికల్పమైన శక్తిని ఎవరో కదిలించేరు. దానిచే సృష్టి ఆరంభంలో గొప్ప కాంతి వెదజల్లబడినది. నాలుగు నిమిషాల వ్యవధిలో అది వ్యాప్తి చెంది, కొంచెం చల్లబడిన తరువాత న్యూట్రాన్ అనబడే పరమాణువులు పుట్టేయి. వాటినుండి మనం చూసే సూక్ష్మ కణాలు పుట్టడానికి కోట్ల సంవత్సరాలు పట్టింది. జాన్ గ్రిబ్బిన్ ఈవిధంగా వర్ణిoచేరు: "సృష్టి ఆరంభంలో ప్రపంచమంతా మన సూర్యని ఉపరితలంలాగ ఉండేది. అది మిక్కిలి వేడి, కిరణబేధ్యమైన, పచ్చని రంగులతో నింప బడినది. ఎప్పుడైతే పదార్థం, శక్తి విడిపోయేయో అది పారదర్శక మయింది." ఈ విధంగా పదార్థము శక్తికన్న పైచేయి పొందింది. అప్పడినుంచి విశ్వం పరిణామం చెందుతూ సర్వ వ్యాప్తమై వివిధ రూపాలుగా భిన్నత్వం చెందింది.

సాంఖ్య సిద్ధాంతం దీనికనుగుణంగా ఉంటుంది. కానీ అది శక్తితో కాక చైతన్యంతో మొదలవుతుంది. మనం భౌతిక ప్రపంచంలో చూసే వివిధ నామ-రూపాలు ఒకే ఒక చైతన్యం నుండి ఎలా వచ్చేయో దాని ముఖ్యాంశం. మనం పరిణామాలను అవరోహణ క్రమంలో అర్థంచేసికొoటే సృష్టికి మూలం దేవుడొక్కడే.

నాకున్న 6 ఏళ్ల మిత్రులు జానీ ఆపిల్ సీడ్ ని నాయకుడిగా ఆరాధిస్తారు. వాళ్ళు ఆపిల్ తిన్నప్పుడు విత్తనాలను దాచుతారు. వాళ్ళు ఒకానొక రోజు ఇంట్లోంచి పారిపోయి వాటిని భూమిలో పాతుతామని బెదిరిస్తూ ఉంటారు. ఒక విత్తనాన్ని వాళ్ళ చూసినట్టు చూసాను. అంత చిన్నదాన్నుoచి ఒక పెద్ద చెట్టు వస్తుందని ఎవరు ఊహించగలరు? అది ఎక్కడ నుంచి వస్తుంది? పాతి, నీళ్ళు పోసి, చూస్తే గాలి, నీరు, మట్టి, సూర్య రశ్మి ఆధారంతో అది ఆహారాన్ని తయారుచేస్తుంది. ఆ పనిని కాండము, ఆకులు, వ్రేళ్ళు పంచుకొని తమతమ విధులు సక్రమంగా నిర్వర్తిస్తాయి. చివరకు ఒక పెద్ద చెట్టు అవుతుంది. ఎలాగ? విస్తృతమైన, అర్థం చేసుకోవడానికి క్లిష్టమైన, చైతన్యముతో కూడిన చెట్టు అంత చిన్న విత్తనం లోంచి ఎలా తయారయింది? దానికి తనను తాను పునః నిర్మాణం చేసుకోవడం ఎలా తెలుసు? దాని వ్రేళ్ళు ఊర్ధ్వ ముఖంగా ఎందుకు వుండవు? శాస్త్రవేత్తలు ఈ ప్రశ్న లన్నీటికీ సమాధానాలు చెప్తారని నాకు తెలుసు. అయినప్పటికీ అవి మంచి ప్రశ్నలు. అదొక వింతగా మనం ఊహించుకోవడం మన జ్ఞానం పరిమితము కాబట్టి.

ఆపిల్ విత్తనం చిన్నది, చైతన్యములేనట్టు ఉండి, అపరిమితమైన అవ్యక్త శక్తిని పొంది యున్నది. దానిలో ఉన్న వివరణాత్మక పథకం ఎలా వ్రేళ్ళు మొలుస్తాయో, ఆకులు కాస్తాయో, పెద్ద చెట్టు అవుతుందో సూక్ష్మ రూపంలో ఉండాలి. అలాగే విశ్వమనే విత్తులో పరిమాణం లేకపోయినా, సూక్ష్మ వివరణ పథకంతో, సిద్ధాంతాలకు లోబడి శక్తితో నక్షత్రాల, చేపల, మానవుల సృష్టికి కారణ భూతమై యున్నది. సాంఖ్య మన విశ్వం చెట్టులాoటిది అని చెప్తుంది. "చెట్టనే జీవితం, భూమిలో కాండము -- ఇంద్రియముల అనుభవం కొరకు --, ఊర్థ్వముఖంగా వ్రేళ్ళు గల అవిచ్ఛిన్న చైతన్యమై ఉన్నది. దానినే మహత్ అందురు. మనం ఊహించిన విశ్వ-విత్తు లాగా మహత్ అతి పెద్దది. ఎలాగంటే దానిలోని సూక్ష్మ శక్తి వల్ల మొత్తం విశ్వం పుట్టింది. అయినప్పటికి అది దేశకాలాతీతం. ఎందుకంటే అది పుట్టక పూర్వం దేశకాలాలు, పదార్థం-శక్తి ఇంకా అవ్యక్త రూపంలో ఉండేవి.

ఎప్పుడైతే సమత్వంలోవున్న స్థితిని కదిపేరో అది విచ్ఛిన్నమైంది. మహత్ నుండి విశ్వం ఒక క్రమ పద్దతిలో పరిణామం చెంది ఒక మహత్తర శక్తితో, అనేక నామ రూపాలుగా ఆవిర్భవించింది. ఇది ఉపమాన పరంగా ఒక పెద్ద చెట్టు చిన్న విత్తుతో మొదలైనట్టు. మొదట అహంకారం పుట్టింది. అది నేను అనే భావనతో ఇతరులు వేరని చెప్పడం. తరువాత బుద్ధి వచ్చింది. దాని విశేషణాలు విశ్లేషణము, విచక్షణ, బేధపరచు శక్తి. వాని నుంచి మనస్సు, ఇంద్రియాలు, వాటికి గోచరమైన ప్రకృతి వచ్చేయి..

ఈ వివరాలన్నీ బహు జటిలమైనవి. వానివలన వొరిగేమీ లేదు. ధ్యానంలో పరిణామ వివరాలన్నీ విదితమౌతాయి. పరిణామంలో అనేక దశలున్నాయి. ఒక్కొక్క దశ ఒక చేతనమైన శక్తిని స్ఫురింప చేస్తుంది , అది సమిష్టి నుంచి వ్యష్టికి, సూక్ష్మo నుంచి బ్రహ్మాండంకు వ్యాప్తమైనది. ఒక వ్యక్తిలో ఆ దశలను వ్యక్తిత్వంగా భావన చేస్తాం. ఒక దశలో మనం సాధారణ జంతువులం. అక్కడ మనము భిన్నత్వాన్ని చూస్తాం. అది మన బాహ్య నామ-రూపాలు మాత్రమే. భౌతిక ప్రపంచం క్రింద అనేక పొరలు ఉన్నాయి. లోతుకు వెళుతున్న కొద్దీ ఆ పొరలు చైతన్యంతో కూడి ఉంటాయి. అతి పెద్ద లోతులో అఖండ చైతన్యం. ఏదీ కనపడదు. ఇంద్రియ సుఖం అనుభవించడమంటే పై పొరలోనే ఉండి, తక్కినదంతా చీకటిలో ఉందని అనుకోవడం. ధ్యానంలో అంతః ముఖులమై అవరోహణ క్రమంలో మన భిన్నత్వం, భౌతిక స్వరూపం ఏ దశలలో వచ్చేయో తెలుసుకోగలం. మనం మనస్సు లోలోతులకు పయనించి మన ఆవిచ్ఛిన్నమైన, పవిత్రమైన చైతన్యాన్ని చవి చూస్తాం.

ఒక శాస్త్రవేత్త ఇలా అన్నారు "కొన్ని దశల తరువాత ప్రాణులకు చెందిన శాస్త్రము ముందుకు పోవాలంటే అణువులను విశ్లేషించాలి". ఇది జీవితం అనే భవంతిలో మొదటి అంతస్తు కాదు. ఒక అంతస్తులో సూక్ష్మం కన్నా అతిసూక్ష్మం ఉన్నదని ఉపనిషత్తులు చెప్పేయి. అదే చైతన్యం. పరిపూర్ణమైన చైతన్యంలో నామ-రూపాలు లేవు. ఆ స్థితిలో మన మనస్సు, ఇంద్రియాలు ఎలా పనిచేస్తాయో తెలుస్తుంది. ఆ మాటకొస్తే భౌతిక స్వరూపాలు ఎలా పరిణామం చెందేయో తెలుస్తుంది.

పరిణామం యొక్క అంతం పరమాత్మను చేరటమే. మైస్టర్ ఎక్ హార్ట్ ఇలా అన్నారు: "నీకు ఇష్టమున్నా లేకపోయినా, తెలిసినా తెలియకపోయినా, రహస్యంగా ప్రకృతి యందలి దేవుని అడుగుజాడలనుండి దేవుని వెదకడం మొదలెడుతావు". ప్రతి అనుభవం, క్రియ, సమర్థత మనని అంతః ముఖులను చేసి ఆ పరమాత్మను వెదకి పట్టుకోడానికే. దీనిలోని ఆర్ధ్రతను చూడు. ఎవరైతే సుఖము, అధికారము, లాభం, గౌరవం కోసం ప్రపంచంలో మసలుతున్నారో వారు నిజంగా భగవంతుని వెదకడానికి పూనుకొన్నవారు. మనo అలవరచుకొన్న గుణాలకు, చెడ్డ గుణాలతో కలుపుకొని, గమ్యం ఉంది. అది అచేతన మనస్సులో జరుగుతున్న అంతర్యుద్ధములో జయించి మనమేవరో తెలిసికోవడం.

ఈ అపారమైన విషయం గురించి వివరంగా చెప్పేనని తలుస్తాను. సాధన పరిణామానికి అంతం. ఆ యుద్ధం యొక్క ఉద్దేశం మనలోని దుశ్శక్తులను మంచి వారిగా మార్చడం. ఇది మానవాళి జంతు దశనుంచి పోగుచేసుకొన్న వారసత్వపు సంపద. అందుకే యోగులు ఇలా చెప్తారు: ఆధ్యాత్మికను కాంక్షించే ప్రతి ఒక్కరూ అది మానవాళి మనుగడకై చేస్తారు. ఒకని జయం అందరి విజయం. అది మనకి ఏది సాధ్యమో, మన ఉత్కృష్ట ప్రకృతి ఏమిటో తెలియజేస్తుంది. మహాత్మా ఇలా అన్నారు: "ఒక్కడు ఆధ్యాత్మికను పొందితే ప్రపంచమంతటకీ లాభం. ఒక్కడు దెబ్బ తింటే ప్రపంచమంతా ఆ మోస్తరు క్రింద పడినట్టే. " ఆయన ఇంకా ఇలా చెప్పేరు: "నాకు, నా సహాయకులకు లబ్ది లేనిదే నా శత్రువులకు సహాయం చేయను." 57

Wednesday, October 6, 2021

Eknath Chapter 13 Sloka 4

13.5

ఋషిభిర్ బహుధా గీతం ఛందోభిర్ వివిధైః పృథక్

బ్రహ్మసూత్ర పదైశ్ చైవ హేతుమద్భిర్ వినీస్చితైః

ఈ సత్యాలు గొప్ప జ్ఞానులు పలు విధాలుగా స్తుతించి బ్రహ్మన్ గురించి హేతుబద్దమైన వ్యాఖ్యలు వ్రాసేరు

"నువ్వెలా నాటుతావో, అలాటి పంట పండించుకొంటావు" అని క్రీస్తు చెప్పెను. అది పరమ సత్యం. గలిలీ కొండ (Mount Galilee)మీద విన్న వారంతా క్రీస్తు మాటలలోని సత్యాన్ని గ్రహించేరు. విత్తనాన్ని భూమిలో పాతు, దానిని సరిగా పోషించు, అది మొలకెత్తుతుంది. నువ్వు పొందే పంట ఆ విత్తుకి సంభందించినదే కానీ వేరొకటి కాదు. "మీ కర్మలు విత్తనాలు. అలాగే మీ ఆలోచనలు కూడా" అని క్రీస్తు పలికినప్పుడు ఆయన శిష్యులు, విన్నవారు ఆశ్చర్యచకితులై వుంటారు.

ఇరవై శతాబ్దంలో అమెరికాలో నివసించేవారు ఒక పట్టాన క్రీస్తు మాటలు పట్టించుకోరు. అయినప్పటికీ ఆ మాటలలోని సత్యం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. మనం ఒక నిట్టూర్చి "ఆయని మాటలు ఒకానొక సందర్భానికి పనికొచ్చేవి. బహుశా గలిలీ కొండ మీద వారిని ఉద్దేశించి అలా మాట్లాడి ఉండచ్చు" అని అనుకోవచ్చు. ఆ భావాలు నేటికీ నిజం. రెండు వేల సంవత్సరాల క్రితం, ఇప్పుడు, భవిష్యత్లోనూ అవి పరమ సత్యాలుగా మిగిలి పోతాయి. ఏమైనప్పటికీ ఆధ్యాత్మిక గురువులు పాత వాక్యాలను దేశకాలమానానుసారముగా క్రొత్త పంథాలో వివరించి మన సంస్కృతి ప్రకారం అవగాహన కల్పిస్తారు.

బుద్ధుడు మనస్సును జయించడం గురించి పల్లె ప్రజలకు బోధించినప్పుడు, వారి గ్రహణ శక్తికి అందుబాటులో ఉన్న ఉపమానాలు వాడేడు. అందులో ఒకటి గుడిస. "నువ్వు పూరి గుడిసలో నివశిస్తుంటే, వర్షం పడితే కప్పులోంచి నీళ్ళు పడవా? నువ్వు తడిసిపోతావు. దుఃఖితుడవవుతావు. న్యుమోనియ (pneumonia) వ్యాధి కూడా రావచ్చు. మనస్సు అలాంటిదే. తపస్సు (meditation) ద్వారా మనస్సులోని కారెడు కన్నాలు మూయకపోతే, కోరికలు పుట్టుకొస్తాయి". కొన్నేళ్ళ తరువాత మానసిక పరమైన శరీర జాడ్యం (psychosomatic)రావచ్చు.

బుద్ధుని గుడిస ఉపమానం పరమ సత్యం. ఈనాటి ప్రపంచంలో ప్రతీదీ మానసిక సంబంధం గలది అని తీర్మానించి, బుద్ధుని మాటలకి పెడార్థాలు తీసి ప్రగతిని సాదిద్ధామానే ప్రబుద్ధులు ఉన్నారు . మొదట మన శరీరం ఒక చిన్న ఇల్లని , అందులో మన ఆత్మ ఉందని అనుకొందాం. ఇది ఒక ఉపమానము మాత్రమే కాదు. మన శరీరం అలాంటిదే. అది ఒక నివాసయోగ్యమైన ఇల్లు. కల్పిత శాస్త్ర (science fiction) కథనాల్లో అటువంటివి చదవవచ్చు. ఇంకా పెరిగే గోడలు, మాట్లాడే పొయ్యలు, మనను చూచే టివిలు, గురించి కూడా ఆ కథానాల్లో ఉంటాయి. ఇటువంటి ఇల్లు గూర్చి నేను తరువాత వ్రాస్తాను. ఎందుకంటే అటువంటి ఇంట్లోకి వెళితే మనస్సుకు ఆహ్లాదంగా ఉంటుంది. కాబట్టి మనం ఆ భౌతికమైన ఇంటి గురించి, అనగా మన శరీరం గూర్చి తెలుసుకొందాం.

మా ఆశ్రమంలో నేను నివసించే ఇల్లు కట్టెలతో కట్టబడినది. ఉపనిషత్తుల్లో నా శరీరమనే ఇల్లు తినే పదార్థాలమీద ఆధారపడివుందని చెప్పబడినది. నేను మా తోటలో పండించే ఆకుకూరలు , లారెల్ చేసిన బ్రెడ్ (Bread), సాండ్రా చేసిన సోయా పాలు, శోభా అనబడే ఆవు పాలనుంచి వచ్చిన వెన్న మొదలైనవి తింటాను. నా శరీరం దిట్టంగా ఉంది. కానీ నా కండరాలు, నాలో ఉన్న జీవాణువులు సదా మారుతూ ఉంటాయి. కొన్నిటిని నా శరీరం మరామత్తులు ఎల్లప్పుడూ చేస్తూ ఉంటుంది.

నేను జూలియా --ఆమెకు 13-18 మధ్యన వయస్సుoటుంది -- అనే మిత్రముతో శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళేను. అక్కడ ఒక దుకాణంలో చాకలేట్, పంచదారతో చేసిన ఇల్లు, శాంతా క్లాస్ మరియు అతని జింకల దృశ్యం కనబడింది. "జూలీ దీనిని చూచి ఎలా స్పందిస్తున్నావు?" అని అడిగేను.

"నేను ఆ మొత్తాన్ని తినేస్తాను", అని అంది.

"నీవు అటువంటి ఇల్లులో నివసించడానికి ఇష్టపడవా ?"

"అమ్మో అది అసంభవం. వర్షం పడితే ఏమి చేస్తాను?"

మనం విపరీతమైన చాకలేట్ తింటే అటువంటి ఇంట్లో ఉన్నట్టే. మనం తినే వస్తువు కాకపోయినా మన శరీరం తినే వస్తువు మీద ఆధారపడి ఉంటుంది. మన శరీరం కణాల ద్వారా తనని తాను పునః నిర్మాణం సదా చేస్తూ ఉంటుంది. నేను రోజంతా చాకలేట్ తింటే, శరీరం నిర్మాణానికి ఒక జీవకణం అడిగితే, నేను "ఇదిగో ఈ చాకలేట్ తిను" అంటాను. నా శరీరం ఊబకాయమైతే, నా ఇంటి యజమాని వలన కాదు. దానికి నేనే మూల కారణం. మనం నిర్మాణానికి కావలసిన వస్తువులు ఎంచుకోవడానికి మన నాలుక రుచి మీద ఆధారపడకూడదు. మనం తినే ఆహారం మనని స్వస్థతతో బలవంతులిని చేయాలి.

ఇక్కడితో మన శరీర వర్ణన ఆగి పోలేదు. దానిలో అంతర్గతంగా ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి కూడా ఉన్నాయి. ఒక గుడిసె ఆధునిక ప్రపంచoలో ఉన్న మనకి చిహ్నం కాదు. ఎందుకంటే మన మనస్సు పరిపరి విధాలుగా బయట విషాయాలకై పరుగులిడుతుంది. ఫ్రాయిడ్ (Freud) పోయిన తరువాత ఆయన చెప్పినట్లు మనం రాజభవనాల్లో నివసిస్తున్నాము. అటువంటి భవనాన్ని నేను సాన్ ఫ్రాన్సిస్కోలో చూసాను. చాలామంది తమ బాహ్య శరీరాన్ని అందంగా ఉంచడానికై ప్రయత్నిస్తారు. నా అనుభవంలో తమ ఇంటిలోపలికి వెళ్లని వారు చాలామంది ఉన్నారు. ఇంటికి తలుపున్నదని కూడా వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఇంటి బయట నివసిస్తారు. పరిశ్థితులు వానను కలుగజేస్తే తడుస్తారు. అది నాకు చాలా బాధను కలిగిస్తుంది. మనందరికీ తలదాచుకోడానికి ఇల్లు ఉంది. ఆ ఇంటి అంతర్గతం మనను ఆరోగ్యంతో , సౌఖ్యతతో, బాంధవ్యాలతో క్షేమంగా ఉండడానికి దోహదం చేయాలి. కానీ ప్రస్తుత ప్రపంచం ఇచ్చే సందేశం: "అంతర్గతంలో ఏమీ లేదు. నీవు శరీరానికే పరిమితం. తడిసి ముద్దవడం, న్యుమోనియా వ్యాధితో బాధపడడం జీవితంలో జరిగే సామాన్య విషయాలు" .

నేను రాజ భవనాన్ని ఉదాహరణగా తీసుకోవటానికి కారణం, అది మన కర్థంచేసుకోవడానికి క్లిష్టమైన మనస్సుకు ఉపమానంగా ఉంటుంది. కొన్నేళ్ళ క్రిందట నేను సాన్ హోసే అనబడే నగరానికి వెళ్ళినపుడు గొప్ప చరిత్రగల ఇంటిని చూసేను. దాని పేరు విన్ చెస్టర్ మిస్టెరీ (Winchester Mystery). విన్ చెస్టర్ అనబడే ఒక వనితకు నిగూఢమైన విషయాలను--అనగా జ్యోతిష్యం వంటివి - అంటే నమ్మకం . ఆమెకు ఎవరో ఆ ఇంటి పునః నిర్మాణము జరిగినన్న ఏళ్ళు బ్రతికి ఉంటుందని చెప్పేరు. తెలివితో ఆమె నిరంతరం ఆ ఇంటికి మార్పులు చేర్పులు చేస్తూనే ఉంటుంది.

నేను ఆ ఇంటిలోకి ఎప్పుడూ ప్రవేశించలేదు. కొన్ని కథనాల ప్రకారం అది చిత్ర విచిత్రంగా ఉంటుంది. చాలా మరమత్తులు అవసరం లేకపోయినా చేయిస్తూ ఉంటారు. ఆ వనిత చూడని గదులు ఎన్నో ఉన్నాయి. కొన్ని తలుపులు కవతల గోడలు మాత్రమే ఉంటాయి. కొన్ని మెట్లు ఎక్కడికీ దారి తీయవు. ఆ ఇంట్లో పుస్తకాలు పెట్టే బీరువాలు లెక్కలేనన్ని ఉండవచ్చు. అలాగే సొరంగాలు, తలుపులు లేని గదులు ఉండవచ్చు. మనం సులభంగా దారి తప్పి పోవచ్చు. అదే ఆ వనితకు అయి ఉంటుంది. ఆమె ఆ ఇల్లు నేనేనని ఆ ఇంటితో తాదాత్మ్యం చెందింది. ఎప్పుడైతే ఆ భావన పోయిందో ఆమె కూడా అంతరిస్తుంది. కొన్ని తెలియని కారణాల వల్ల ఆ ఇంటికి మరిన్ని మార్పులు చేయలేదు. ఆమె పండువయస్సులో చివరకి మరణించింది.

ఆ ఇంటిలాగే మన మనస్సు కూడా వుంది. దానిలో అనేకమైన సొరంగాలు, గదులు, మెట్లు ఉన్నట్టుoటుంది. దానికి లెక్కలేనన్ని కిటికీలు, బయటనుంచి చూడలేని దృశ్యాలు, బాహ్య ప్రపంచాన్ని చూడడానికి ఉంటాయి. దానిలో పలురకములైన కథలూ ఉన్నాయి. రాగము, బుద్ధి మొదలైనవి కూడా ఉన్నాయి. అవన్నీ అచేతనంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఆ అచేతన మనస్సుని శోధించడం బహు కష్టం.

కొంతమంది దానిలోకి ప్రవేశించరు. కొందరు ప్రవేశించి దాని వ్యూహంలో చిక్కుకుంటారు. వాళ్ళు వెలుపలికి రావడానికి నిర్వీర్యులై ఇతరులకు చెప్పలేని పరిస్థితిలో ఉంటారు. జీవితం సజావుగా సాగాలంటే మనం లోపలికి వెళ్ళడం, అలాగే బయటకు రావడం అవసరమైనవి. బయటకు రావడమంటే నిష్కామ కర్మ చేయడం. లోపలికి వెళ్ళడం అంటే మన ఆరోగ్యం, భద్రత, మనఃశక్తికై వీలయినంత ధ్యానము చేయడం. లోపలికి వెళ్ళడంతో సరిపోలేదు. అంతర్గతం తెలిసికోడానికి చాలామంది ప్రయత్నిస్తారు. ఒకమారు లోపలి కెళ్ళిన తరువాత ఎలా అన్వేషించాలో వారికి తెలీదు. ఆ ప్రయత్నంలో వాళ్ళూ చుట్టూ గోడలను, రాజ సింహాసనాన్ని, తపాలా పెట్టెలను చూసి "ఇక్కడిoతే ఉంది కాబోసు" అనుకొంటారు. నిజానికి అక్కడ ఎన్నో వింతలున్నాయి. కానీ వాటిని ఎక్కడ చూడాలో , ఎలా చూడాలో, తలుపులు ఎలా తియ్యాలి, మెట్లు ఎలా ఎక్కాలి అన్న విషయాలు తెలిసుండాలి. ఒక సమర్థుడు, అనుభవజ్ఞుడు, దయగలవాడు అయిన గురువువద్ద ధ్యానం నేర్చుకోవాలి.

ఒకసారి నేను మనస్సుగురించి ఉపన్యాసం ఇచ్చేను. ఎలాగ అహంకారం రాజ భవనంలోని అంతః పురంలో ఉంటుందో, ఎలా కల్పన చేస్తుందో, ఆర్శన్ వెల్స్ (Orson Wells) వ్రాసిన జేన్ ఐర్ (Jane Eyre) పుస్తకంలోలాగ ఎలా కనిపిస్తుందో అన్న విషయాల గురించి మాట్లాడేను. తన మతిభ్రమించిన భార్యను రాజ పీఠానికి వారసురాలుగా కాకుండుటకై ఎలా బంధించేడో కాదు అసలు విషయం. మనం మన ఆత్మను బంధించేము. మొత్తానికి అదంతా రేడియో నాటకంలాగ పనికివస్తుంది.

ఇకపోతే ఆ ఇంటి అంతర్భాగాన్ని చూద్దాం. మన మనస్సనే ఇంట్లో అనేకమైన అంతర్భాగాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఆత్మతత్త్వజ్ఞుడికి జీవితాంతం సరిపోయే పని కల్పిస్తాయి. ఫ్రాయిడ్ అనే ఆత్మతత్త్వజ్ఞుడు ఒకటి లేదా రెండు అంతర్భాగాలను పరిశీలించేడు. దానివల్ల ఆధునిక మానవుడిపై తనను తాను ఎలా భావిస్తాడో అన్న విషయం ప్రభావితమైంది. మనకి చేతన సమయంలో ఆ అంతర్భాగాలను పరిశీలించి, వాటిని శుద్ధ పరచే చిట్కా తెలిసుండాలి.

నేనీ పుస్తకం రాస్తున్నప్పుడు చాలామంది కంప్యూటర్ లో డంజెన్స్ (Dungeons) అనే ఆటను ఆడుతున్నారు. అంటే భూగర్భంలోని సొరంగాలతో ఆట. నువ్వు ఒక శిధిలమైన ఇంటిలో ప్రవేశించి, నేలమీద ఉన్న రహస్య తలుపును తెరిచి , కారుచీకటిలో నడిచి, అనేకమైన గదులలోనున్న నిధిని పొందాలి. మన మనస్సు అటువంటిదే. కొన్ని సంవత్సరాలు ధ్యానం అభ్యశిస్తే, చేతన మనస్సుకు క్రిందనున్న అంతర్భాగానికి ప్రవేశించవచ్చు. దానిలో అనేకములైన వస్తువులను తెలిసికోవచ్చు. మొదట లైట్ స్విచ్. అది చులకనగా చూసేది కాదు. చీకటితో నిండిన అంతర్భాగాన్ని చూడడానికి లైట్ స్విచ్ ఎక్కడుందో తెలిసికోవడం ఎంతో అవసరం. తరువాత చుట్టూ చూసి మనని ప్రతి దినమూ బాధించే విషయాలను పరిశీలించవచ్చు. ఉదాహరణకు ఇతరులతో మన నడవడిక గురుంచి అంతకు ముందు రహస్యంగా ఉన్న నిజాలను తెలుసుకోవడం.

ఇంతవరకు చేసిన పనులలో ఎంతో తెలిసికొనవలసినది ఉంది. యోగులు చెప్పినట్టు "నువ్వు ఇప్పుడే మొదలెట్టేవు. లోతుకు వెళ్ళు". అంతర్భాగoనుంచి అనేక దారులు అనేకములైన గదులను చేరుస్తాయి. చాలా గదులను పరిశీలించనక్కరలేదు. నేను చెప్పినట్లు, అచేతన మనస్సులో చాలా వింతలు మన గమ్యoచేరడానికి దోహదం చెయ్యవు. నా అమ్మమ్మ సంరక్షణవల్ల, నేను ఒకగది నుంచి ఉంకో గదికి దిక్కులు చూడకుండా వెళ్ళగలిగేను. అక్కడక్కడ పరిశీలించడానికి కారణాలు ఉన్నాయి. కానీ నా మనస్సులో ఒకేఒక సంకల్పం ఉన్నది: అతి తక్కువ కాలంలో అచేతన మనస్సు లోతులకు చేరడం. ఎందుకంటే అందలి నిధిని వెలుపలకు తెచ్చి నలుగురికీ పంచి పెట్టడానికి .

మన అచేతన మనస్సులో చాలా అంతర్భాగాలు ఉన్నాయి. చాలా మటుకు మనకి తెలియనివే. మనము చేతనమును నుంచి అచేతనమునకు సాధారణంగా కలల్లో అవ్వడం చూస్తాం. మెలకువ వచ్చినప్పుడు ఆ కలల్లోని విషయాలు గుర్తుతెచ్చుకొని ఆశ్చర్య పడతాం. లోతుకు వెళుతున్నకొద్దీ ఆ అంతర్భాగాలు జీవరాశ్యులకన్నిటికీ ఒకటే అన్న జ్ఞానం ఉదయిస్తుంది. మొదట్లో దాన్ని నిరూపించలేము. మనం అచేతనం గురించి చేతనంలో తెలిసికొని అక్కడి వింత అంతర్భాగాలలో మన ఇంట్లో ఎలా గదులెక్కడున్నాయో తెలిసినట్టు ధైర్యంగా ముందుకు సాగాలి.

ఈ అంతర్భాగాలలో తెలిసికొనే విషయాలు చాలా ఉన్నాయి. పురావస్తుశాస్త్రజ్ఞులు (archaelogist) కొన్ని పురాతన నగరాల్లో పెద్ద కుండలలో విత్తనాలు కనిపెట్టేరు. అవి కొన్ని వందల ఏళ్లనాటివి అయినప్పటికీ, మట్టిలో పాతి, తగిన వనరులు ఇచ్చినప్పుడు, మొలకెత్తేయి. అలాగే మన అంతర్భాగాలలో కర్మ అనే విత్తనాలు పెద్ద పెద్ద కుండల్లోలాగ పొందు పరచి ఉన్నాయి. అవి తగిన సమయంలో మొలకెత్తడానికి వేచి ఉన్నాయి. ఈ విత్తన నిధిని సృష్టి ఆరంభంనుంచీ పోగుచేసుకున్నాము. ఉపరితలంలో మనకు అందుబాటులో ఉన్న విత్తనాలు వ్యక్తిగత కర్మలు. ఎలాగయితే కృష్ణుడు రాముడిని కొట్టడం. ఇంకా లోతు కెళితే మనకి యుగ కర్మ అనే విత్తనాలు కనిపిస్తాయి. ఇవి మనందరం పోగుచేసుకున్న సమిష్టి కర్మ. మనందరం ఈ శతాబ్దంలో పుట్టేం కాబట్టి మనందరిలో ఒక సూక్ష్మమైన కర్మ ఉంది. ఆ సూక్ష్మ కర్మ ఈ శతాబ్దంలో ఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కర్మ విషయంలో గురి తప్పడమన్నది లేదు. మన దేశమాన కాలo,తలిదండ్రులు, సామజిక జీవితం అన్నీ మన మనుగడకి హేతువులు. మనం ఇవవ్నిటినీ విత్తనపు జాబితానుంచి పూర్వ ఆలోచన, క్రియల బట్టి ఎంచుకున్నాము.

అచేతన మనస్సు యొక్క లోతైన భాగంలో గోడలులేని ప్రదేశం ఉన్నది. అది ఎప్పటికీ ఉండే ఒక అపూర్వ ప్రదేశం. తక్కిన అంతర్భాగాలు దీనితో పోలికచూస్తే అవి వ్యష్టికి సంభందించినవి. అంటే మన ఇంటికి చెందినవి. కానీ ఆ ప్రదేశం సమిష్టి. దానిని సమిష్టి అచేతనం అని చెప్పవచ్చు. భౌద్దులు దానిని కర్మ-బీజాలయమoటారు. ప్రతిఒక్కరి అంతర్భాగం ఈ భాగంతో అనుసంధానమై ఉంది. దానిలో సమిష్టి సంస్కారములు పొందుపడుపబడినవి. కొన్ని సంస్కారాలు మానవుల పరిణామములో జంతు దశకు చెందినవి. అవి క్రోధము, మోహము, లోభము, భయము. అక్కడ కోట్లకొలది విత్తనాలు పెద్ద పెద్ద కుండల్లో ఉంచబడినవి. మనకు ప్రతిదినము ఆ భాండారాలలోంచి కొన్ని విత్తనాలు పంపబడతాయి. వాటిని మన పెరట్లో పాతి పెడతాము. మనము కోపానికి వేరొకడు లేదా వేరొకటి కారణమని తలంచవచ్చు. కానీ ప్రతివొక్కనికి ఆ విత్తనాలు అందజేయబడతాయి.

ఎప్పుడైతే మనం చేతనంగా ఆ ప్రదేశాలలో ప్రవేశించి తిరుగుతామో , వానినుంచ తరగలేని ప్రేమ, జ్ఞానము, బలము, స్ఫూర్తి లభిస్తాయి. ఆ ప్రదేశంలోని పదాలు, క్రియలు ఎనలేని శక్తివంతమైనవయి మనను ఇతరులకు సహాయము చేయుటకు, ప్రేరణ చేయుటకు ప్రోత్సాహిస్తాయి. ఎందుకంటే ఆ ప్రదేశం మనందరికీ సమిష్టిగా ఉంది.

దీనిగురుంచి ఇలా చెప్పుకు పోవచ్చు. కానీ ఈ పుస్తకం సరిపోదు. అచేతనం గురించి చెప్పాలంటే ఒక పెద్ద పుస్తకం వ్రాయాలి. అందుకే నేను మనస్సును గురించి ఎందుకు అధ్యయనం చేయాలో ఉదాహరణల ద్వారా చూపించేను. గీతలో ఉన్న మానసిక శాస్త్రము అపారం. దానిని స్వయం కృషితో తెలుసుకొని ఆచరణలో పెట్టాలి. అందుకే శ్రీ కృష్ణుడు శాస్త్రములు క్రొత్త అర్థాలతో వ్యాఖ్యానం చేయబడతాయి అని చెప్పెను. శాస్త్రము, యోగులు ఒకే విషయాన్ని పలు రకాలుగా ఒకే సందేశముతో ప్రవచించుచున్నారు. యోగాభ్యాసము మరియు సాధన అనుభవము ఎప్పటికీ ఒక్కటే. 51

Sunday, October 3, 2021

Eknath Chapter 13 Sloka 3

13.4

తత్ క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతస్చ యత్

స చ యో యత్ ప్రభావశ్చ తత్ సమాసేన మే శృణు

నేను చెప్పింది విను. నేను క్షేత్రం యొక్క లక్షణాన్ని , దానిలో మార్పు ఎలా వస్తుందో చెప్తాను. అలాగే క్షేత్రమును తెలిసినవాడు (క్షేత్రజ్ఞుడు) వాని శక్తిని వివరించెదను

పెక్కుమంది ప్రపంచ మధ్యలో నిలబడి బాహ్య దృష్టి కలవారని తలచుదురు. చెట్లు, వాహనాలు, జంతువులు, మనుష్యులు మనకన్న వేరని, మనం విజాతీయమని; ధృక్కు, తెలిసికొనేవారు బాహ్య ప్రపంచానికి అర్థం చెపుతారు.

కానీ ఒక భౌతిక శాస్త్రవేత్త మనం చూసే వస్తువులు విజాతీయం కాదని తెలుసుకొంటాడు. మన ఇంద్రియ గ్రహణశక్తి కొంచెమే. కావున వస్తువులు వేర్వేరుగా ఉన్నట్టు కనిపిస్తాయి. మన కళ్ళకు ఏడు రంగుల కన్న సూక్ష్మమైన కాంతి కిరణాలను చూడగల శక్తి ఉంటే ఒక అణు శాస్త్రవేత్త చూచే విధంగా ప్రపంచాన్ని చూస్తాము. నిజంగా ప్రపంచం పదార్థం, శక్తితో కూడిన సజాతీయం.

శాస్త్రవేత్తలు పదార్థము అణువుల సముదాయమని చెప్పినపుడు అదొక వింత అయింది. అణువు ప్రపంచమనే ఇంటికి ఒక ఇటికెలా పని చేస్తుంది. అణువు ఒక ఘన పదార్థమని భావించేరు. తదుపరి అణువు కన్నా చిన్నవి--పరమాణువులు--ఉన్నవని తెలిసికొన్నారు. అలాగే అణువులో అధిక భాగం ఆకాశం (space). కన్ను చూడలేని పరమాణువులు ఒకప్పుడు ఘన పదార్థంగాను, మరొక్కప్పుడు శక్తిగాను పనిచేస్తాయి. శాస్త్రవేత్తలు పరమాణావుల మీద తీవ్ర పరిశోధనలు చేసి వాటి శ్వస్వరూపామును తెలిసకొనడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేనైతే ఆశ్చర్య చకితుడై (లెక్కపెట్టలేనన్ని) పరమాణువులను లెక్క పెట్టడం మానేసాను.

మొత్తానికిది గ్రాహ్యము కాని ప్రపంచ సత్యం. ప్రపంచంలో ఘన పదార్థమన్నది లేదు; అది ఇంద్రియాలకు గ్రాహ్యము కాదు; అది సదా మారుతూనే ఉంటుంది (స్థిరంగా ఉండదు). ఆర్తర్ ఎడ్డిoగ్ టన్ (Sir Arthur Eddington) "బాహ్యమైన భౌతిక శాస్త్రము చెప్పినది ఏమిటంటే ప్రపంచం మీద అనేక నీడలు పడ్డాయి. ఎప్పుడైతే దాని మాయ తీసివేస్తామో, పదార్థము తీసివేయ బడుతుంది. ఎందుకంటే పదార్థము మనకున్న భ్రాంతి మాత్రమే". మనం ప్రపంచాన్ని ఘన పదార్థాల సముదాయంగా విజాతీయంగా చూస్తున్నామంటే దానికి ముఖ్య కారణం మనకున్న ఇంద్రియాలకు తగినంత గ్రాహ్య శక్తి లేకపోవడమే. కాబట్టి ఇక మనం వేర్వేరుగా ఉన్న భౌతిక శరీరాలుగా ఎలా అనుకోగలం?

నేను ఒక క్రొత్త సూక్ష్మ దర్శిని (Microscope) గురించి వార్తల్లో చదివేను. అది అణువులను సైతం కళ్ళకు చూపిస్తుంది. మనకళ్ళకి కూడా అంత సూక్ష్మ పదార్థాల -- లేదా పరమాణువుల--చూసే శక్తి ఉంటే ఏమవుతుందో ఊహించుకోండి. పదార్థాల మధ్య ఉన్న పరిమితి నీడలు మాత్రమే. జీవితాన్ని వేర్వేరుతనo , పరిచ్చిన్నాల మధ్య ఊగిసలాడేది. అట్టి ప్రపంచం వింతగా ఉంటుంది. మనం గాలి, నీరు ఆకుల, వ్రేళ్ళ, రాళ్ళ, చర్మం లోని కణాల గుండా దూసుకుపోవడం చూస్తాం. సూర్య శక్తి తో పచ్చని ఆకులు తమ ఆహారాన్ని ఎలా తయారుచేస్తాయో తెలుసుకొంటాం. అలాగే కాయలను , పండ్లను తిని జంతువుల శరీరం ఎలా వృద్ధి నొందుతుందో చూస్తాం. శరీరం మరణించిన తరువాత అది పంచ భూతాలలో ఎలా కలసిపోతుందో చూస్తాం. దీనివల్ల మనకు తెలిసినదేమిటంటే జీవి ఒక అపరిచ్చిన్నమైన ఐక్యతలో ఒక భాగం మాత్రమే.

మళ్ళీ స్టీవ్ తోటకి వెళ్దాం . ఆ తోట చుట్టూ కంచె ప్రక్కింటి పాల వ్యాపారి పెరటితో సరిహద్దుగా ఉంది. అతను కంచెలోపు భూమి తక్కిన భూమితో పోలుస్తే వేరని తలుస్తాడు. ఇది ఒక విధంగా నిజం. అలాగే పాల వ్యాపారి కంచెవల్ల ఉపయోగం ఉందని అంటాడు. బహుశా అతను భూముల పట్టాల అధికారి చెప్పిన విధంగా ఒక జానెడు భూమి ఆక్రమించకుండా కంచె వేసి ఉంటాడు. ఒక వానపాము కంచె ఉన్నా లేకున్నా పట్టించుకోదు. దానికి కంచెతో పనిలేదు. దానికి స్టీవ్ తోట వేరని తెలీదు. ఎక్కడ భూమి ఉంటే అది అక్కడికి ప్రాకుతుంది. అది దాని తప్పు కాదు. ఉన్నది ఒక్క భూమే. ఆ పాల వ్యాపారి రసాయనిక ఎరువులు వాడితే అవి స్టీవ్ తోటలో ప్రవేశించి అతని పిల్లల శరీరాల్లోకి పండ్ల, కాయల ద్వారా చేరుతాయి. మనందరి శరీరాలు ఇంతే. కొన్ని ముఖ్య కారణాలవల్ల మనం వేర్వేరు. పర్యావరణంలో మనoదరం కలసికట్టుగా ఉన్నాము.

శ్రీకృష్ణుడు క్షేత్రం అనే పదం వాడడం మన శరీర పరిధిని దాటి అని అర్థం చెప్పుకోవాలి. పర్యావరణమంతా క్షేత్రం క్రింద వస్తుంది. దానిలో మన కర్మ అనే విత్తనాలు నాటి వానినుండి వచ్చిన ఫలాన్ని అనుభవిస్తాం. ఇది చెప్పడానికి సులభమే. ఆచరణ వేరు. దాని అర్థం ప్రతి కర్మ క్షేత్రం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది.

నేను మొదట భౌతిక ప్రపంచాన్ని తీసుకొని వివరిస్తాను. నేను టైమ్స్ బీచ్ , మిస్సోరీ (Times Beach , Missouri) గురించి వార్తల్లో చదువుతున్నాను. అది ఒక బాధాకరమైన విషయం. మీరు భవిష్యత్తులో దీని గురించి మరిన్ని వార్తలు వింటారు. ఈనాడు అది ఇంకా మొదటి దశలో ఉంది. పదేళ్ళ క్రిందట ఒక ట్రక్కు (Truck) నడిపేవాడు టైమ్స్ బీచ్ రోడ్ల మీద పెట్రోలియం నూనె (oil) జల్లేడు . ఆ నూనె డైఆక్సిన్ (dioxin) అనే విష పదార్థముతో కూడినది. శాస్త్రజ్ఞులు పరిశోధనా శాలల్లో జంతువుల మీద డైఆక్సిన్ జల్లితే వాటికి అవిటితనం (Birth Defects), నరాల బలహీనత (Nervous Disorder) , కేన్సరు (Cancer) మొదలగు వ్యాధులు, కొన్నిటిలో మరణం కూడా వచ్చేయి. కొన్ని రహదారుల మీద డైఆక్సిన్ మామూలుకన్నా వంద రేట్లు సాంద్రత ఉన్నది. వానలు కొంత డైఆక్సిన్ ను ఊరంతటికీ ప్రాకేలా చేశాయి. ఎంత మంది పిల్లలు ఆ వూరిలో బయట ఆడేరు? ఆ విషం ఎంత లోతుకు ప్రాకింది ? అది త్రాగే నీటిలోనూ తినే కాయల, పండ్లలోనూ ప్రాకిందా ? దాన్ని కనిపెట్టడం ఎలా? దాన్ని కట్టడి చేయడం ఎలా ? వీటన్నిటికీ కారణం దశాబ్దాల క్రిందన తీసికొన్న చిన్న చిన్న నిర్ణయాలు. ఆ ట్రక్ డ్రైవరు తెలీక పలు చోట్ల అ విషపూరిత నూనెను జల్లేడు. అధికారులు ఆ నూనె విషపూరితమని వార్తల్లో వచ్చిన కథనాలను పెడచెవిన పెట్టేరు. శాస్త్రవేత్తలు దానిని ఒక చిన్న విషయంగా పరిగణించేరు. అ విష ప్రభావం ఇప్పటికే చాలా స్థలాల్లో ఉంది. జన్యులలో జరిగిన మార్పులు పుట్టబోయే వారిని ప్రభావితం చేస్తాయి

ఇది ఒకానొక చోట జరిగిన విషయం. ప్రభుత్వ కథనం ప్రకారం అమెరికాలో 14 వేల ప్రదేశాల్లో విష పూరిత పదార్థాలను దాచి ఉంచేరు (hazardous waste dumps). వాటి ప్రభావం దేశ కాలాల మీద ఎలా వుంటుందో వేచి చూడాలి .

మరియొక చిన్నదైన దుర్ఘటన ఈమధ్య జరిగింది . పి సి బి (PCB : Polychlorinated Biphenyls) అనే విష పదార్థం ఆహార పదార్థాలలో కనిపించింది. ఎలాగంటే అది ఒక ప్రేలిన ట్రాన్స్ఫార్మర్ (Transformer) ద్వారా పది రాష్ట్రాలలో వ్యాపించింది. 18 రాష్ట్రాలలో తినే పదార్థాలలో పిసిబి కనబడినది. దేశ విదేశాల వ్యాపారం చేసేవాళ్ళ వల్ల ఆ విషపూరిత పదార్థాలు మొత్తం అమెరికాకు లేదా ప్రపంచానికి ఎగుమతుల వల్ల ప్రాకేయి. ఇటువంటి దుర్ఘటన ఒక మనిషి చేసిన చిన్న తప్పు వల్ల కలుగుతుంది . ఒక ట్రక్ డ్రైవరు ప్యాకేజీలు (Containers) మీద అంటించిన సూచనలను (labels) చదివి ఉండకపోవచ్చు. కానీ వాటి ప్రభావం ఎంత ఉన్నదో! కర్మ సంభందమైన క్షేత్రం యొక్క ఐక్యతను తెలియజేసే విషయాలివి . ఒక చోట పాతిన విత్తనం పలు చోట్ల దుఃఖమనే ఫలాన్ని కలుగజేసింది.

ఈ ఐకమత్యం వల్ల ఒక భయంకరమైన న్యాయం కర్మ మీద ఆరోపితమౌతుంది. ఈ విషయం గూర్చి మిగతా పుస్తకంలో చెప్తాను. కర్మ యొక్క ముఖ్య అంశం: మన స్వార్థం గురించి మన జీవితం గడపరాదు . మనం నాటిన విత్తనాల నుంచి పండిన ఫలాలను మనం పొందుతాము. అది కేవలం ఒకరికి ఆ పండ్లను పంచి పెట్టడానికైనా కావచ్చు. ఉదాహరణకు పంటల (Agriculture) పండించడం గురించి ఆలోచిద్దాం. అమెరికాలో కనిపెట్టబడి, తయారుచేయబడిన క్రిమి సంహారక రసాయనాలు ప్రపంచంలోని అన్ని దేశాలకు ఎగుమతి చేస్తారు. ఎక్కువగా బీద దేశాలకు. వీటిలో కొన్ని రసాయనాలు అమెరికా లోనే నిషేధింపబడినవి! లేదా తీవ్రంగా నియత్రింప బడినవి. వాని గురించి కొనేవాళ్ళకి ఎటువంటి అవగాహన ఉండదు. ఎందుకంటే వాటి ప్రమాదాల గూర్చి సూచనలిస్తే ఎవ్వరూ కొనరు గనుక. కానీ వాటి వలన కలిగే అపాయాలు ఒక దేశానికే పరిమితం కావు. ఖరీదైన క్రిమి సంహారక రసాయనాలు తమ దేశస్తులకు పండించిన పంటమీద జల్లరు . ఎందు కంటే ధర గిట్టుబాటు కాదు. ఏ పంట ఐతే ఎగుమతి చెయ్యడానికి పండించేరో దాని మీద జల్లుతారు. ఈ విధంగా ఆ విషపూరిత పదార్థాలు మళ్ళీ అమెరికా వంటి సంపన్న దేశాలకు తిరిగి వస్తాయి.

ఇవన్నీ కర్మ సిద్ధాంతానికి ఉదాహరణలు . కర్మను నా ఉద్దేశంలో చాలామంది తప్పుగా అర్థం చేసుకొంటారు. కాబట్టి నేనీ అవకాశాన్ని తీసుకొని కర్మ గూర్చి విపులంగా చెప్తాను. సంస్కృతంలో కర్మ అంటే ఒకరు చేసిన పని. దాన్ని క్రియ లేదా కార్యమనవచ్చును. కర్మ సిద్ధాంతం చెప్పేదేమిటంటే ఒకే సంఘటన హేతువు లేదా కారణము మరియు కార్యము లేదా ఫలము అగుట. ప్రతి క్రియకీ పర్యావసానము ఉంటుంది. ఆ పర్యావసానికి మళ్ళీ పర్యావసానము ఉంటుంది. దీనిని అనవస్తా దోషం అంటారు. అలాగే ప్రతి కర్మ అంతకు పూర్వం చేసిన క్రియకి పర్యావసానము.

దీనిలో అత్యంత వ్యాపితమైన భావం ఉంది. ముందు నేను ఒక వ్యక్తికి సంభందించిన కర్మ గూర్చి చెప్తాను. ఎందుకంటే సాధారణంగా మనం చేసే కర్మ క్షేత్రమనే మన శరీరానికి మనస్సుకూ పరిమితం కనుక.

భారతీయులకు మరియు ఇతర దేశస్తులకు కర్మ అంటే భౌతికమైన క్రియ అనే అర్థము సర్వ సాధారణము. దీని ప్రకారం మనమేమి క్రియ చేసినా మనకది ఫల రూపంలో తిరిగి వస్తుంది. రాముడు కృష్ణుడిని కొడితే , దాని ఫలము కృష్ణుడు రాముడిని కొట్టే రూపంలో వస్తుంది. ఒకప్పుడు అది వింతగా, అగుపడని రీతిలో ఉంటుంది. ఎందుకంటే దాని పర్యావసానములన్నీ మనం ఊహించలేము కనుక. కానీ కర్మకు పర్యావసానము ఉంది. ఈవిధంగా కర్మ సిద్ధాంతము అతి గుహ్యమైనది కాదు. గురుత్వాకర్షణ ఎలా పని చేస్తుందో అలాగే కర్మ సిద్ధాంతం కూడా పని చేస్తుంది.

మళ్ళీ కృష్ణుడు రాముని కొట్టిన ఉదాహరణ చూద్దాం . కర్మ సిద్ధాంతం ప్రకారం దానికి పర్యావసానము ఉంటుంది. రాముని కన్నుకు దెబ్బ తగిలి ఉండచ్చు. అది రాముని అంతరంలో ముద్రితమౌతుంది. దాని వల్ల అతనికి కోపం వస్తుంది. అది కృష్ణుని అంతరంలో ముద్రితమౌతుంది. రాముడు కృష్ణుని కొట్టి ప్రతీకారము వెంటనే తీసికొనవచ్చును. దీనిని నేను "క్యాష్ కర్మ" (cash karma) అంటాను. దీని అంతరార్థo చెల్లుకు చెల్లు అని రాముడు కృష్ణుని వెంటనే కొట్టడం. కొన్ని కారణాల వల్ల రాముడు కృష్ణుని వెంటనే కొట్టడు. తనకు కలిగిన కోపం తన భార్యపై ప్రదర్శిస్తాడు. లేదా ఇంట్లోని పిల్లిని కాలుతో బయటకు తంతాడు.

కర్మ ఇంత సులభంగా చెప్పబడేది కాదు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. చెప్పవలసిన విషయమేమిటంటే రాముని కోపం తన బంధమిత్రులు మీద ప్రభావితమౌతుంది. రాముని భార్య ఆ కోపం కృష్ణుడితో పనిచేసే అర్జునుడి మీద చూపవచ్చు. కృష్ణుడు అర్జునుని అవమానిస్తే అర్జునుడు కృష్ణుని కొట్టవచ్చు. కృష్ణునికి తనకు కలిగిన దెబ్బ తను మొదట రాముడిని కొట్టినందువలననే అని తెలియక పోవచ్చు. వాని కోపమంతా అర్జునుని మీదే . ఈ విధంగా కర్మ పర్యావసానము ఒక గొలుసులాగా ఉన్నది. కృష్ణుని కర్మ పంటకి బీజమవుతున్నది.

మన నడవడి ఎంత దూరం, ఎంతమందిని ప్రభావితం చేసిందో చెప్పలేం. దీని వల్ల మనకి తెలిసిన విషయమేమిటంటే కర్మ చాలా క్లిష్టమైనది. మనలో ఏఒక్కరికీ దాని గురుంచి పూర్తి అవగాహన లేదు. ఇంకో విషయమేమిటంటే ఈ కర్మ వలయం సహజంగా తరతరాలుగా ఉన్నది. మన ప్రస్తుత పరిస్థితి--చెడు అయినా మంచి అయినా-ఎప్పుడో ఎక్కడో కర్మవల్ల నిర్దేశింపబడినది. మనం ఒకరికి చేసిన పుణ్యమో పాపమో కర్మకి మూలంగా ఉన్నది.

దీని పర్యావసానము అనుభవానికి ఈ విధంగా వస్తుంది: మనకు జరిగేవన్నీ మన నడవడిక వలననే; వేరెవరూ దానికి బాధ్యులు కారు; తెలిసో తెలీయకో మన చేష్టలు మన పరిస్థితిని ప్రభావితం చేస్తాయి. ఇకపోతా ఒక మంచి విషయం ఏమిటంటే మన నడవడికగానీ మార్చుకోగలిగితే మనకి జరిగే కర్మ మార్చుకోవచ్చు. మన విధిని మనమే నియంత్రించుకోవచ్చు. సులభంగా చెప్పాలంటే మన విధివ్రాత మన చేతుల్లోనే ఉంది.

ముందు చెప్పినట్లు ఎంతో మంది కర్మను పైపైనే చూస్తారు. అది ఒప్పే కానీ సంపూర్ణమైన జ్ఞానం కాదు. మనం చూసే కర్మ ఒక ఐస్ బర్గ్ (Iceberg) కనిపించే శిఖరాగ్రాము. కర్మను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనస్సును విశ్లేషణం చెయ్యాలి.

మళ్ళీ కృష్ణుడు-రాముడు కథకి వెళదాం. కృష్ణుడు రాముడిని కొట్టడంవల్ల పరిణామాలు చాలా ఉన్నాయి. రామునికి దెబ్బ తగిలింది. రాముని మనస్సులో ముద్రితమయింది. అలాగే కృష్ణుని మనస్సులో కూడా. కృష్ణుడు తన నడవడికను మార్చుకోకపోతే అతనికి కోపంవల్ల ఇంకొకరిని కొట్టవచ్చు. అతను తన కోపం వల్ల కొట్టడం కొంత ఉపశమనం ఇస్తుందని తలచవచ్చు. నిజానికి అతని కోపం హద్దులు ఇంకా ఎక్కువగా దాటవచ్చు. ఎంతంటే హింస చేసే దాకా.

మన క్రియలన్నీ మన మనస్సులో కర్మను కలుగజేస్తాయి. ఇది అనుభవం లేని ఉత్తి జ్ఞానం కాదు. దాని పర్యవసానం కళ్ళారా చూడవచ్చు. కృష్ణుడు ఎలా క్రియవల్ల తనలోపల మార్పు చెందేడో చూద్దాం. అతను భవిష్యత్తులో కోపం నియంత్రిoచకపోతే ఇంకా క్రూరమైన పనులు చేస్తాడు. అతను మాటిమాటికి పరులను బాధ పెడతాడు. అతని ప్రకృతి వల్ల ఎప్పుడూ కోపానికి దారితీసే పరిస్థితులలో చిక్కు కొంటాడు. ఎప్పుడోఒకప్పుడు ఒక పెద్ద కోట్లాట చేసి తన్నులు తింటాడు. ఇది రాముని కొట్టడం మొదలు ఇంత దూరం వచ్చింది.

దీనికన్నా విచిత్రమేమిటంటే మన ఆరోగ్యం మీద కర్మ ప్రభావం.

బుద్ధుడు చెప్పినట్లు మనం కోపంవల్ల శిక్షింపబడం; కోపమే మనను శిక్షిస్తుంది. అంటే కోపం తనంతట తానే కర్మగా మార్చుకొంటుంది. కృష్ణుడు రాముని కొట్టి ఆనందించవచ్చు. కానీ ఒక అసంగతుడైన వైద్యుడు దానిని అంగీకరించడు. అతడు కృష్ణుని శరీరంలో జరిగే మార్పులను చూస్తాడు. అతని రక్తపోటు, నరాల వ్యవస్థ పై ప్రభావం కొలుస్తాడు. కోపం వల్ల కృష్ణుని రక్తపోటు పెరుగుతుంది, గుండె అతివేగంగా కొట్టుకుంటుంది, హార్మోనులు మరియు అడ్రినలిన్ విపరీతంగా ప్రకోపిస్తాయి. వైద్యుడు "నువ్వు పరిమితి మించిన ఒత్తిడిని నెత్తికెక్కించుకున్నావు" అని కృష్ణునికి సలహా ఇస్తాడు. నా ఉద్దేశంలో కోపం గుండెపోతుకన్నా వెయ్యి రెట్లు ప్రమాదం. నువ్వు కోపంవల్ల అప్పటి కప్పుడే చెడు అనుభవిస్తావు. ఇది ఒకరోజుతో తీరే సమస్యకాదు.

కృష్ణుని కోపం ఇలా చాలా యేళ్ళు కొనసాగింది అనుకొందాం. రాముడు తనని కొట్టక పోయినా, అతను తనలోనే తన్ను కొట్టుకుంటాడు. అతను తీవ్ర ఒత్తిడికి గురై ఎల్లప్పుడూ కొట్లాటా లేదా పలాయనమా (fight or flight) అని ఆలోచిస్తూ ఉంటాడు. వైద్య శాస్త్రం చెప్పేదేమిటంటే ఇటువంటి వొత్తిడి వల్ల గుండె జబ్బు, మానసిక వ్యాధులు, తీవ్రమైన తలనొప్పి, కడుపులో అల్సర్లు , చివరకు క్యాన్సరు కూడా రావచ్చు. ఈ విధంగా కోపం వల్లే కలిగే కర్మ నడుస్తూ ఉంటుంది.

కృష్ణుడు మండిపడడంవల్ల , ఇతరులమీద దాడి చేయడంవల్ల వానితో సహజీవనం చేయడం అతి కష్టం. మానవ సంభందాలు క్షీణిస్తాయి. అతని మిత్రులు అతన్ని చూసి తప్పుకుంటారు. సహ ఉద్యోగులు అతన్ని అసహ్యించుకొంటారు. దీనివల్ల అతను ఇంకా కోపం చెందుతాడు. జీవితం దుర్భరమవుతుంది. కృష్ణుడు ధూమపానం, త్రాగుడు తనని తాను శిక్షించుకోడానికి మొదలెడుతాడు. ప్రమాదకరమైన క్రియలు చేస్తాడు. స్కై డైవింగ్ (sky diving) , రాక్ క్లైంబింగ్ (rock climbing), కార్ రేసింగ్ (car racing) వంటి ప్రమాదకరమైన పనులు చేస్తాడు. ఇవన్నీ చెడు కర్మను పెంపొందించుకొనే మార్గాలు. ఇంకా ఎన్నో రకాలుగా కృష్ణుడు చెడిపోవచ్చు. అవన్నీ చెప్పడానికి ఈ పుస్తకం చాలదు.

కర్మ యొక్క విశేషం ఏమిటంటే కృష్ణుడు ఎవరినీ కొట్టక పోయినా, అంతర్గతంలో కోపం శరీరాన్ని మనస్సునీ ప్రభావితం చేస్తుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోడానికి ప్రయత్నిస్తే అతని రక్త పోటు పెరుగుతుంది, కడుపు మండుతుంది, గుండె అతి వేగంగా కొట్టుకుంటుంది. కానీ వాటి కర్మ ఫలము ఒకరిని కొట్టడం కన్న తక్కువ తీవ్రత గలది. కాబట్టి మన ఆలోచనలు కూడా మనపై ప్రభావం చూపిస్తాయి. అవి మన దృక్పధాన్ని మారుస్తాయి, దానివలన మన ఆరోగ్యం ప్రభావితమౌతుంది. మన నడవడిక, ఏ ఉద్యోగం చేస్తామో, మిత్రులు కూడా --ఒక్కమాటలో చెప్పాలంటే మనం చేసే క్రియలన్నీ-- మన ఆలోచనలవలననే .

మీరు కర్మ సిద్ధాంతం ఎంత తార్కికంగా బలీయమో, మానసిక కర్మ ఎంత ప్రమాదకరమైనదో అర్థం చేసికొన్నారని తలుస్తాను. అది భౌతిక కర్మ కన్నా విలక్షణంగా ఉన్నట్టుoటుంది, కానీ మరింత ప్రమాదకరమైనది. అది దీర్ఘ కాలం పనిచేస్తుంది. అందుకే "శరీరం, మనస్సు క్షేత్రoలాంటివి" అన్న వాక్యం నాకు నచ్చింది. ఆలోచన ఒక విత్తనంలాంటిది: అతి సూక్ష్మం; కానీ అది పెద్ద, శక్తివంతమైన, వృక్షం లాగా పెరగగలదు. నేను రోడ్ల మీద ఒక చిన్న కన్నంలో ఎలాగ ఒక విత్తు పెరిగి పెద్దదయి మహా వృక్షమై చివరకు ఆ రోడ్డునే చీల్చివేస్తుందో చూశాను. దాని వ్రేళ్ళు భూమిలో పాకి పక్కనున్న ఇంటి పునాదిని కూడా చీల్చివేసింది. అటువంటి వృక్షాన్ని వేళ్ళతో పెకిలించడం అతి కష్టం. అలాగే జీవితాంతం చెడు ఆలోచనలతో గడిపి సక్రమమార్గానికి రావడం కూడా. చెడు ఆలోచనలవలన తనను తాను హింసించుకోవడం కాక ఇతరులను ప్రభావితం చేయడం జరుగుతుంది.

నాకు ఎంతసేపూ చెడును గూర్చి మాట్లాడడం నచ్చదు. కాబట్టి ఇప్పుడు ఒక మంచి విషయం చెప్తాను. పై ఉదాహరణలవలన మనకి తెలిసినదేమిటంటే కర్మకి మనము బాధ్యులము. అది మన ఆలోచనల, క్రియల మీద ఆధార పడుతుంది. కర్మకి మూలకారణం మనస్సు. కాబట్టి మన ఆలోచనలను మార్చుకొంటే కర్మయొక్క చెడు ప్రభావాన్ని నియంత్రిoచవచ్చు. ఒక వ్యక్తి ఎందుకో మనమీద కోపంగా ఉన్నప్పుడు, మనం సాత్వికం, దయ పూరిత విధంగా మాట్లాడితే అది మంచి కర్మ. అందరూ బాగుపడతారు. ఆ కోపిష్టికి కర్మభారం తగ్గుతుంది. శారీరకంగా మంచి మార్పులు వస్తాయి. అతని నరాల వ్యవస్థ స్వస్తతో పనిచేసి కోపం తగ్గిస్తుంది. అతను తక్కిన వారిమీద కోపం చెందక మరింత చెడు కర్మ చేయడు. మన శరీరం మనస్సు కూడా లబ్ది పొందుతాయి. మనం పరుషమైన మాటలు మాట్లాడకుండా అవసరమైతే పళ్ళు అరగదీసినా సరే అది మంచికి దారి తీస్తుంది. మన కీలక అవయవాలు క్షేమంగా కాళ్ళ మీద కాళ్ళేసుకొని "మంచి పని మిత్రమా" అంటాయి. మనం కోపిష్టికి సహాయ పడ్డామని తెలిసికొని, తృప్తితో ఉంటాం. దీనివల్ల ఇతరులతో కలిసిమెలిసి ఉండడంలో ప్రావీణ్యత పొందుతాo. సెయింట్ ఫ్రాన్సిస్ చెప్పినట్లు మనం శాంతిని పెంపొందించడానికి ఒక పనిముట్టు మాత్రమే. 45

Friday, October 1, 2021

Ekanath Chapter 13 Sloka 2

13.3

క్షేత్రజ్ఞo చాపి మాం విద్ది సర్వ క్షేత్రేషు భారత

క్షేత్ర క్షేత్రజ్ఞ యో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ

నేను సర్వ క్షేత్రములను తెలిసినవాడను. క్షేత్రాన్ని తెలిసికొనుట , క్షేత్రమును తెలిసినవాడు నిజమైన జ్ఞానం

నువ్వు నీ క్షేత్రమనుకొంటే, వేరే రైతుఅవసరం లేదు. విత్తనాలు యాధృచ్చికముగా వస్తాయి, ఎవరూ పాత లేదు అని నమ్ముతావు. పంట మంచిదో కాదో యాధృచ్చికముగా జరుగుతుంది. ఒక మంచి పంట పండితే --ఎలాగైతే ఆరోగ్యం, ఆనందం, ప్రేమించే కుటుంబం, నమ్మకమైన మిత్రులు ఉంటే -- "అదృష్టం నన్ను వరించింది" అంటావు. లేక పంట సరిలేకపోతే అది నీకు సంభందించినది కాదు. "దురదృష్టం నాకు కలిగింది. అతివృష్టి, అనావృష్టి. అకాల వానలు కలిగేయి". గీత ఈ రెండు విరుద్ధ భావాలను సవరిస్తుంది: "నువ్వు నీ విత్తనములను పెంచుకొనుటకు, పంటను పండించుకొనుటకు పూర్తి కారణము. వేరొకరు కారణం కాదు. నువ్వు విత్తనములు కొరకై వేచి చూచిన, ఒక రోజా పూల తోట చేయలేవు."

ఒక క్షేత్రాన్ని దాని మటుకు వదిలేస్తే, అది క్రమంగా కలుపు మొక్కలతో నిండిపోతుంది. ఏదైతే ఏపుగా పేరుగుతుందో అది తక్కిన వాటిని ఆక్రమిస్తుంది. ఇదేవిధంగా ప్రయత్నంలేనిదే ఒకని వ్యక్తిత్వము అహంకారంగా మారుతుంది. అహంకారం వానిపాటికి వదిలేసిన కలుపు వంటి సంస్కారములు. అక్కడ పుష్పాలు ఉన్నాయి గాని ఏపుగా పెరిగిన కలుపు మొక్కలతో మారుబడ్డాయి.

మనం అలిస్ ఇన్ వండర్ లాండ్ (Alice's Wonderland) కి ఒకమారు వెళ్దాం. మనం స్టీవ్ తనను తోటతో తాదాత్మ్యం చెందితే ఏమవుతుంది అన్న విషయం గురించి క్రిందటి శ్లోకంలో ప్రశ్నించేము. నేను ఇప్పుడు తోటే తాను స్టీవ్ అనుకొంటే ఏమవుతుందని అడుగుతాను.

తోటలో స్టీవ్ పిల్లలను కలుద్దామని వెళ్ళేవనుకో. ఒక కప్పు వైన్ (Wine) తాగి ఎండలో పడుకున్నావనుకో. నిద్ర లేచినవెంటనే ఆ తోట ఒక అరణ్యం లాగ అగుబడుతుంది. ఆ తోట పెద్ద పెద్ద కాండాలతో , వాటిని మించిన పుష్పాలతో నీ తలమీద ఊగిసలాడి మౌన సంభాషణ కావిస్తుంది. క్రమంగా నువ్వు చిన్న రూపాన్ని ధరించి ఆ మౌన సంభాషణను అర్థం చేసుకొనే సామర్థ్యం కాలవాడివి. ఆ తోటలోని చెట్లు తమలో తాము ఆలోచనలను పంచుకోగలవు. ఎలాగంటే మన శరీరంలోని కణాలు మాట్లాడుకున్నట్టు. ఆ చెట్లు తెలివిగల ఒక సమిష్టిగా వ్యవహరిస్తున్నాయి. కేబేజు (cabbage), కేరట్టు(carrot) వస్తూ పోతూ ఉంటాయిగానీ తోట ఎక్కడికీ పోదు. ఇక్కడ జీవితం కొనసాగిస్తున్నది ఆ తోట. తోటకే తెలివి, వాక్చాతుర్యం, ఆలోచనా శక్తి,, స్థిరత్వం ఉన్నాయి. "నేను ప్రసిద్ధమైనదానిని" అని అనుకొంటుంది. "నాకన్నా ఆశ్చర్యకరమైన విషయం ఉంటే చెప్పు" అని అంటుంది.

"నువ్వు అనేక కొమ్మలు, రెమ్మలు, విత్తనాలు. అవేమీ పెద్ద గొప్ప కాదు" అన్నావు. శాస్త్రాల గూర్చి కల్పితం (Science Fiction) చదివేవారు, ఇది ఒక ప్రమాదకరమైన ప్రక్రియ అని చెప్తారు. ఎందుకంటే నువ్వు తోట మధ్యలో ఉండి దానిని విమర్శిస్తున్నావు. కానీ ఆ తోటకి ఎంతో అహంకారం ఉంది. మీరు గ్రహించి ఉండేవుంటారు అహంకారానికి తోట చిహ్నం. "నీ సంభాషణ మార్చుకో. నువ్వు నా పరిధిలో ఉన్నావు. నువ్వు నాతో వాదిస్తే నిన్ను మింగేయగలను" అని భయపెడుతుంది.

"నిన్ను తయారు చేసిందెవారు?" అని అడిగేవు.

"ఎవరూ కాదు. నేను నా అంతటే పెరిగేను"

ఇప్పుడా తోటలోని బాటలు పెద్ద పెద్ద రహదారులుగా నీకు కనిపిస్తున్నాయి. క్యారెట్ (carrot) ప్రపంచం , బీట్రూట్ (beet root) పుంత కనిపిస్తున్నాయి. నువ్వు ధైర్యం తెచ్చుకొని "నువ్వు నీకు కావలసిన మొక్కను పెంచగలవా " అని తోటను అడిగేవు.

తోట గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయి "నాకు ఇష్టమైన మొక్కలనే పెంచుతాను. ఏదైతే ఇక్కడ పండుతుందో నాకది ఇష్టం" అంది.

"పెద్ద గాలీ వానా వస్తే ఏమి చేస్తావు?"

"నేను మొదట చస్తాను. కానీ కొంచెం కాలం గడిచిన తరువాత మళ్ళీ పెరిగి పెద్దదాన్ని అవుతాను. ఈ మొక్కలు వచ్చి పోతాయి. కానీ నేను శాశ్వతం."

నువ్వు తల విదుల్చుకొని "తోటా నీ అంతట నువ్వు చేయగలిగిందేమీ లేదు. ఒక తోటమాలి నీకు అనేక సేవలు చేయాలి. విత్తనాలను పాతి, నీళ్ళు పోసి, గొప్పులు త్రవ్వాలి. బాటలు వేయాలి. నీ ప్రేమేయం ఇందులో ఏమీ లేదు. నువ్వు నీ మాలి విశేషణాలన్నిట్నీ నీ సొంతం చేసుకొన్నావు. ఇందులో నీ ఘనత ఏమీ లేదు" అని అన్నావు.

మన అహంకారం ఇలాగే ఉంటుంది. మళ్ళీ తెలివితో. అది ఒక క్షేత్రానికే పరిమితం. కొన్ని కణాల సముదాయం. ఒక రకమైన ప్రక్రియ. దానికి స్వతంత్రమైన తెలివి లేదు. ఒక్క ఆత్మ మాత్రమే తెలిసినది.

క్షేత్రం అని వాడ బడిన మాట భారతదేశంలోని అనేక భాషలలో గుడిగా అనువదించవచ్చు (ఉదాహరణకు పుణ్యక్షేత్రం). సాధువులు తమ శరీరాలను గుడితో పోలుస్తారు. ఎందుకంటే భగవంతుడు ప్రతిఒక్కరిలో ఉన్నాడు. ఆ గుడికి గోపురం కట్టనక్కరలేదు. ఎక్కడైతే మన ఆత్మ ఉన్నదో అక్కడ మనలో భగవంతుని మూల విరాట్టు ప్రతిష్టితమై ఉంది. అట్టి ఆత్మ సర్వం తెలిసినది మరియు మన శ్వస్వరూపం.

మితిమీరి ఆహారం తినడం వల్ల ఆ గుడి అపరిశుభ్రం అవుతుంది. అలాగే పొగ త్రాగడం. అది అగరొత్తులు కి విరుద్ధం. మన శరీరాలను భగవంతుని గుడిగా తలచిన మనం దూరలవాట్లుకు బానిసలవ్వo, రోజూ వ్యాయాయం చేస్తాం, మంచి పదార్థాలను తగినంతగా భుజిస్తాo, మన శరీరాల్ని తగినవిధంగా పోషిస్తాo.

కానీ మనస్సును విడనాడం . అది కూడా మన గుడిలో ఒక భాగం. దానిని స్థిరంగా, దయతో ఉంచకపోతే ఎంత శరీరాన్ని బాగుపరచినా లాభం లేదు. అంటే శరీరం అస్వస్థకు గురి అవుతుంది. అభద్రత, ఆరోగ్యo ఎంత బాగున్నట్టుగా ఉన్నా, మన శరీర రక్షణ కణాలను నిర్వీర్యం చేస్తుంది. నేను ఇది వ్రాస్తూ ఉండగా, ఫ్లూ ( Flu) వ్యాధి మళ్ళీ ప్రబలినట్టు వార్తలు వస్తున్నాయి. "ఫ్లూ వస్తున్నాది. మీరు సిద్ధంగా ఉన్నారా?" అని పత్రికలు రాస్తున్నాయి. ఆ వార్త విన్న ప్రతివొక్కరు "అది నిజంగా వస్తోందా ? నేను సిద్ధంగా ఉన్నానా? నాకా వ్యాధి అంటుకొంటుందా ? నాకప్పుడే ఆ వ్యాధి సోకిందా?" అని తమను తాము ప్రశ్నించికొంటున్నారు. గీత ఫ్లూ మీద ఆలోచన చేస్తే నువ్వు ఫ్లూ అవుతావని అంటుంది. మన శరీరాన్ని కాపాడుకొని, పరులగూర్చి బ్రతికి, వ్యధ లేకుండా జీవించాలి. అలాగైతే మన భద్రత , వ్యాధి నివారణ శక్తి అధికంగా ఉంటుంది. ఒకవేళ ఫ్లూ నిజంగా వస్తే మనం అతివేగంగా దాని బారి నుంచి బయట పడతాము.

శరీరం ముమ్మాటికీ గుడి అని జర్మనీ దేశస్తుడు యోగి జొహనెస్ టాలెర్ (Johannes Tauler) అంటాడు. "కానీ శరీరం సరిగా పనిచేయాలంటే మనం దానినుండి డబ్బు పిశాచాలని, పిట్ట లమ్మేవారిని, మరి కొందరు కబ్జాదారులను భహిష్కరించాలి." అని అంటాడు. ఇది మానసిక లోలోతులకు పాతుకుపోయిన అహంకారం గురించి చెప్తున్న విషయం. గుడిలోనున్న దేవుడు ప్రకటితమవ్వాలంటే అహంకారం అనే దొంగను బయటకు త్రోలాలి

ఇక్కడ క్రిస్మస్ (Christmas) వస్తోంది. నా అమ్మను పెద్ద దుకాణానినికి సరదాగా తీసుకెళ్ళేను. అక్కడ క్రీస్తు (Christ) పుట్టిన సమయాన్ని (Nativity Scene) బొమ్మలతో ప్రదర్శించేరు. హిందువులు మేరీ మాతను సానుకూలంగా చూస్తారు. అందువలన నా అమ్మ ఆ బొమ్మలను చూసి భావోద్వేగం చెందింది. కానీ ఆ చిత్రకారులు ఒక తప్పు చేసేరు. ఎందుకంటే నా అమ్మ అడిగింది "అక్కడ ఉయ్యాల (Cradle) ఉంది గాని బాల క్రీస్తు (బొమ్మ) లేడు"

మనమందరకీ టాలెర్ దృక్పధంలో ఉయ్యాల తయారుగా మన హృదయాల్లో ఉంది. కానీ మన అహంకారం అడ్డు వస్తున్న కారణంవల్ల అంతర్ముఖులం కాలేకున్నాము. ఆ అహంకారం ఎంత పెద్దదంటే ఆ ఉయ్యాలను చీల్చి బయటకు వస్తోంది. అదృష్టవశాత్తూ మనం బాల క్రీస్తుని వెదికి హృదయ ఉయ్యాలలో పెట్ట నక్కరలేదు. నెమ్మదిగా మన అహంకారాన్ని బయటకు పంపిస్తే లోపల ఉన్నది దైవ స్వరూపమే !

సెయింట్ పాల్ (St. Paul) కూడా చెప్పినదిదే. "నేను మరణించేను, కానీ బ్రతికే ఉన్నాను. నాలో నివసించేది నేనుకాదు. అది క్రీస్తు. " ఒకానప్పుడు పాల్ ఆధ్యాత్మిక చింతన లేనివాడు. అతని వృత్తి గుడారాలు చేయడం. పేరు సాల్ (Saul) అతనికి కోపం అంతా ఇంతా కాదు. నాకైతే గుడారాల కర్రతో కొట్టే వాడనిపిస్తుంది. ఎవరైనా వచ్చి "నజారేత (Nazareth) క్రీస్తు అంటే నాకిష్టం లేదు" అంటే వెంటనే "నీకు తక్కువ ధరకు అమ్ముతాను" అనేవాడు. అతను డమాస్కస్ (Damascus) కి ప్రయాణించేటప్పుడు అతనిలో చెలరేగుతున్న మంటలు బయటకు పేలుడు వస్తువులా అగిపించాయి. మూడు రోజులు గ్రుడ్డివాడై , అచేతనుడై పడిపోవడంతో అతని అహంకారం పఠాపంచల్ అయిపోయి క్రీస్తు భక్తులకున్న సమత్వం వచ్చింది. అతను కళ్ళు తెరిచిన తరువాత ఒక నూతన వ్యక్తిలా ఆవిష్కరింపబడి తన క్రోధాన్ని దయ, ప్రేమగా మార్చుకొని రాత్రింబవళ్ళు క్రీస్తు సందేశాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పేడు. మనం పాల్ లాగా నాటక ఫక్కీలో జీవించనక్కరలేదు. ఒక్క అహంకారాన్నే చంపుకుంటే మన చుట్టూ ఆనంద సంబరాలు జరుగుతాయి. "నూతనoగా అవతరించిన రాజుకు జయహో"

నేను సెయింట్ పాల్ గురించి చెప్పడం ఎందుకంటే అది మనందరికీ వర్తిస్తుంది. ప్రపంచంలో అతి పెద్ద అగాంతకుడు కూడా తన మనస్సును ప్రయత్నంతో మార్చుకోవచ్చు. నేను ఆంగ్లం బోధిస్తున్నప్పుడు ఈ విషయాన్ని సరదాకి మాక్బెత్ (Macbeth)ని ఉదాహరణంగా చేసుకొని చెప్పేవాడిని. మాక్బెత్ సహజంగా సౌమ్యుడు కాడు. మాక్బెత్ కూడా ధ్యానాన్ని నేర్చుకోవచ్చు. దానివల్ల విషాదంతో ముగిసే నాటకం మనం కోరుకుంటున్నట్టు సుఖాంతం అవ్వచ్చు. దురుసు, క్రూర స్వభావముగల మాక్బెత్ కూడా సాత్వికుడవ్వచ్చు. అతను మంత్రగాళ్లకు "ఎందుకు నాలో లోభత్వాన్ని పెంచుతారు? ఇదిగో ఒక మంత్రం. జీసస్ , జీసస్ , జీసస్. మీరు అది స్మరిస్తూ రాత్రంతా మీ మాయల లోకంలో గడపండి" అని చెప్పి ఉండచ్చు. మంత్రగాళ్లు నిజంగా వెలుపల లేరు. వాళ్ళు మనలోనే ఉన్నారు. వాళ్ళకు స్వస్తి చెప్పడానికి నిజమైన ధైర్యం ఉండాలి. ధైర్యం వలన స్వతంత్రం. దానివలన అంతులేని ఆనందం పొందవచ్చు.

గీత ఇక్కడ రెండు విధాలుగా జ్ఞానం సంపాదించవచ్చునని భోదిస్తోంది. క్షేత్రం లోపలైనా, వెలుపనైనా సదా మార్పు చెందుతూ ఉంటుంది. దానిని అపరా విద్య అనవచ్చు. ఇది ఒక మెట్టు క్రిందన ఉన్న జ్ఞానం. ఇది ఏమీ తక్కువగా చూడవలసినది కాదు. అంతా దానిని భోదించే గురువు మీద ఆధారపడి ఉంటుంది. మనం విద్యాలయాల్లో నేర్చుకొనే శాస్త్రాలు ఈ కోవకు చెందుతాయి. వాటి వలన మనకు చెడుకన్నా మంచే ఎక్కువ జరుగుతుంది. ఇకపోతే పరా విద్య ఒక మెట్టు మీదనుంది. అది ఉన్నత విద్య. ఎందుకంటే మనం తీసుకునే నిర్ణయాలు ధర్మానికి కట్టుబడే లాగ పరా విద్య సహకరిస్తుంది. దానివలన విశ్వమంతా ఐక్యమత్యమైన ఒకటేనన్న జ్ఞానం ఉదయిస్తుంది.

మన మిత్రుడు స్టీవ్ మట్టిని విశ్లేషించినా, వాన పాముల సాంద్రతను కొలిచినా అది అపరా విద్య. అది మంచి పంట పండడానికి అవసరం. అలాగే తానెవారో తెలుసుకోవడం స్టీవ్ కి ఎంతో అవసరం. అతను మట్టి, విత్తనము, పంట కాదని ముందు మనం చూసేం. అది పరా విద్య. అంటే జ్ఞాత తననే జ్ఞేయంగా పరిశోధించడం.

క్రింద మెట్టులో ఉన్న మేధా శక్తిలా కాక ఆధ్యాత్మిక జ్ఞానం మన బుద్ధిని సూటిగా నిర్దేశిస్తుంది. నేను ఒక చిన్న పిల్లని ఉదాహరణగా చేసి విపులీకరిస్తాను. నేను ఆ పిల్లని అమెరికాకు ఫుల్బ్రైట్ స్కాలర్ (Fulbright Scholar) గా వచ్చినపుడు కలిసేను. నేను మొదట ఉద్యోగం చేసిన విశ్వవిద్యాలయంలో ఆమె ఉన్నత తరగతి విద్యార్థిని. ఆమెకి మంచి తెలివి, రూపం తో పాటు పట్టుదల కూడా వుంది. వీటన్నిటితో ఆమెకు విపరీతమైన కోపం ఉండేది. అది ఆధ్యాత్మిక చింతనకు అనుసంధానం చేస్తే ఉపయోగకరం.

ఆమె ధూమపానం ఎక్కువగా చేస్తుందని తెలిసి చాలా బాధపడ్డాను. అప్పట్లో ధూమపానo గురించి పరిశోధనలు ఇంకా జరగలేదు. అయినా నాకు అది ప్రమాదకరమని తెలుసు. దానివల్ల మన ఊపిరితిత్తులతో పాటు మనశ్శక్తి కూడా నాశనమవుతాయి. నన్ను ఆమె నమ్ముతుందని తెలుసు. ఆమెకి మిక్కిలి పట్టుదల కూడా ఉంది. కాబట్టి ఒకరోజు సూటిగా అడిగేను "మన మైత్రిని ఉపయోగించుకొని నిన్నొక ప్రశ్న అడగవచ్చా? నీకు ఇష్టం లేక పోతే ఇంకెప్పుడూ అడగను".

ఆమె అదోలా చూసి, "అడగండి" అంది

"నువ్వెందుకంత ధూమపానం చేస్తావు? నాకు నీ ఆరోగ్యం తలచుకొంటే బాధ వేస్తుంది"

ఆమె తన మేధనుపయోగించి చాలా సాకులు చెప్పింది. నేను అవి అన్నిటినీ విన్నాను. "ఒక బలంగా నాటిన అలవాటుని ఎదుర్కొని విజయం సాధిస్తే ఉన్న ఆనందం దానికి బానిస అయితే ఉందా?" అని అడిగేను.

ఆమె గుడ్లప్పగించి కొంచెంసేపు చూసింది. చిరునవ్వుతో అంగీకరించింది. నాకప్పుడు చేసిన బోధ పని చేసిందని నమ్మకం ఏర్పడింది. నాకు తెలిసి ఆమె మళ్ళీ ధూమ పానం చేయలేదు. నేను చెప్పిన సూటి మాటలు ఆమెలోని పట్టుదలను మేల్కొలిపి మంచి మార్పును తెచ్చేయి.

ఇది పరా విద్యకు అనగా ఆధ్యాత్మిక జ్ఞానానికి చిహ్నం. నేను ధూమపానం చేస్తూ ఎక్స్ రే (x-ray) లోని నాశనమైన ఊపిరితిత్తులను పరీక్షిస్తున్న వైద్యులనూ చూసేను. ఇది అపరా. ఎందుకంటే ఆ వైద్యునికి తెలుసు ధూమపానం చేస్తే ఏమవుతుందో. ఆయన జ్ఞానానికి కర్మకి పొంతన లేదు.

సెయింట్ ఫ్రాన్సిస్ (St Francis) "నీ జ్ఞానం నీ కర్మకున్న లోతు మాత్రమే" అని చెప్పేరు. అంటే అది మన మనశ్శక్తి కన్నా లోతుగా లేదు. ఉన్నత జ్ఞానం మన దైనింద కార్యాలకు చక్కగా అనుష్టించడానికి సహకరిస్తుoదని పై చెప్పిన వైద్యుని, విద్యార్థిని ఉదాహరణలు నిరూపిస్తాయి.

కొందరు ఆధ్యాత్మిక చింతన తామసానికి దారి తీస్తుందని నాకు చెప్పేరు. దీనికి భారత దేశాన్ని ఉదాహరణగా చూపిస్తారు. ప్రస్తుతం మన దేశం వెనుకబడి ఉంది. ఒకప్పుడు ఆధ్యాత్మిక చింతన ప్రబలంగా ఉండేది. ఆనాడు చరిత్రలో మన దేశం మిక్కిలి ధనవంతమైనదిగా వర్ణించేరు. అలాగే సాంస్కృతి పరంగా మన దేశం ఉన్నత స్తితిలో ఉండేది. ఇతర దేశాలకు బానిసగా ఉన్నప్పుడు , అనగా స్వరాజ్యం లేనప్పుడు, మనం ఆధ్యాత్మికకు దూరం అయ్యాము. ఇప్పుడు, స్వరాజ్యం వచ్చిన తరువాత, మన పురోగతికి విజ్ఞానం కన్నా ఆధ్యాత్మికమే కారణం అని నేను భావిస్తాను. ఇదే గాంధీ మహాత్ముని స్పూర్తి. ఆయని ఘనతకి కారణం ఇదే. ఆయన కోట్లాది ప్రజలను ఆధ్యాత్మికతో మేల్కొలిపేరు. వారికి చిరకాలం నుండి ఉన్న ఆధ్యాత్మికను గుర్తు తెచ్చేరు. చాలా మంది భారతీయులకు వారిని ఆధ్యాత్మికవైపు తిప్పడానికి శ్రీ రామకృష్ణ గారి పాత్ర పెక్కుగా ఉందని తెలీదు. చరిత్రను తెలిసిని వారికి మన స్వాతంత్ర సమరంలో ఆధ్యాత్మికకు కాని అంశం లేదని తెలుస్తుంది. ఆధ్యాత్మికత మన సంస్కృతిని మార్చగలదు . ఈనాటి ప్రపంచ దేశాలతో ప్రభావితమవుతున్నా, మన సంస్కృతి ఎన్నటికీ చెరిగిపోదు.

ఆధ్యాత్మిక చింతన ఎన్నటికీ సోమరితనాన్ని పెంచదు. అది అంతర్ మరియు బాహ్య దుశ్శక్తులను ఎదుర్కొనడానికి అవసరమైన సంకల్పం, ఆయుధాలను సమకూరిస్తుంది. మానవులంతా సమైక్యతతో ఒకే గ్రహం మీద చోటు పంచుకున్నాము. మనందరం ఒకే ఇంటివాళ్ళం. ఒక గదిలో కుర్చీలు, బల్లలూ ఉండచ్చు; వేరొక గదిలో తివాచీలు, పాలరాతి గచ్చు ఉండవచ్చు; కానీ అవి అన్నీ ఒకే పైకప్పు క్రింద ఉన్నాయి. ఒక గదిలో పేదరికం ఉంటే, ఇంట్లోవారందరూ బాధ పడాలి. ఆ బాధ నైతిక విలువలవలన కావచ్చు లేదా ఆర్ధికంగా కావచ్చు. ఒక గదిలో నిప్పు పెడితే మొత్తం ఇల్లంతా కాలి పోతుంది. ప్రపంచ యుద్ధాల వలన ఇదే అవుతోంది. ఒక గదిలోనివారికి మహామారి వస్తే "అది వేరే గదిలో ఉంది. నాకు సంభందించినది కాదు" అని కాళ్ళు చాచుకొని కూర్చోలేం. మహామారి ఒక అంటువ్యాధి. కొంత సమయానికి అది ఇల్లంతా వ్యాపించి ఇంట్లోని వారందరిని వ్యాధిగ్రస్తులను చేస్తుంది. ఇక ఇంట్లో వ్యాధిలేని వైద్యులెక్కడ?

నూతన విజ్ఞానంతో ప్రస్తుతం మానవాళికి భూగోళమంతా స్వస్థత, శాంతి, సుఖాలతో నింపగల సామర్థ్యం ఉంది. మనముందు రెండు మార్గాలు ఉన్నాయి : ఒకటి అపరిమితమైన బాధ, దుఃఖం కలిగించునది; రెండవది అచింత్యనీయమైన ధనం, సుఖాలకు దారి తీసేది. ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోతే అపరా విద్య మననందరిని నాశనం చేస్తుంది. ఎందుకంటే దానికి మన గమ్యoగురించి తెలీదు. దానిని ఆధ్యాత్మిక జ్ఞానంతో మిళితం చేస్తే భూతల స్వర్గం ఆవిష్కరింపబడుతుంది.