Sunday, December 1, 2019

Karma-Paddati


655
అష్టకష్టి బ్రతుకు అగ్నిపాలైపోవు నిర్దయాత్ముండును నీటగలియు క్రూరకర్ము బ్రతుకు చోరులపాలౌను , వి. వే.

అష్టకష్టి బ్రతుకు అగ్నిపాలైపోవు
నిర్దయాత్ముండును నీటగలియు
క్రూరకర్ము బ్రతుకు
చోరులపాలౌను , వి. వే.

అష్ట కష్టాలు పడి గడించిన సొమ్ము, గడించినవాడు దయలేనివాడును , క్రూరుడును ఐనచో నశించిపోవును

An unkind and cruel person's wealth will disappear no matter how hard he worked to garner it.

656
ఆకలిగొని వచ్చెనని పరదేశికి పట్టెడన్నమైన పెట్టలేడు లంజెదానికొడుకు లంజెల కిచ్చును , వి. వే.

ఆకలిగొని వచ్చెనని పరదేశికి
పట్టెడన్నమైన పెట్టలేడు
లంజెదానికొడుకు లంజెల
కిచ్చును , వి. వే.

పాపకర్ముడు ఆకలితో వచ్చు అతిథికి పట్టెడన్నము పెట్టలేడు . కాని లంజెలకు ఎంత ధనమైన ఇయ్యగలడు.

A bad person won't feed a hungry guest but offers money generously to his fiancee.

657
ఆదితుదల నరయక అల్పుడై దినమెల్ల వూర్పుచేత బుద్ధి మరిగి తిరుగు మ్రానుమ్రాను తిరుగు మహి కోతికైవడి , వి. వే.

ఆదితుదల నరయక అల్పుడై దినమెల్ల
వూర్పుచేత బుద్ధి మరిగి
తిరుగు మ్రానుమ్రాను తిరుగు
మహి కోతికైవడి , వి. వే.

మూర్ఖుడు స్థిరమైన బుద్ధిలేనివాడై ఒక చెట్టునుండి మరియొక చెట్టుకు తిరుగు కోతివలె అంతమన్నదిలేక తిరుగుచుండును

A foolish person roams around as if there is no tomorrow with a fickle mind like a monkey that jumps from one tree to another.

658
ఆలు మగనిమాట కడ్డంబువచ్చెనే నాలుకాదు నుదుటి వ్రాలుగాని అట్టి యాలి విడిచి అడవినుండుట మేలు, వి. వే.

ఆలు మగనిమాట కడ్డంబువచ్చెనే
నాలుకాదు నుదుటి వ్రాలుగాని
అట్టి యాలి విడిచి అడవినుండుట
మేలు, వి. వే.

నొసటి వ్రాతనుబట్టి తనభర్తను వ్యతిరేకించి తిరుగు భార్య లభించును . అట్టి భార్యను విడిచి సన్యసించుట మేలు

A man's rebellious wife is a result of fate. It is better to renounce the world than live with her.

659
ఆలుసుతులు ధనము లరయంగ మీరని మొనసి కర్మమునను మోసపోయె కాలుగన్న యపుడు కడతేరగాలేడు , వి. వే.

ఆలుసుతులు ధనము లరయంగ మీరని
మొనసి కర్మమునను మోసపోయె
కాలుగన్న యపుడు
కడతేరగాలేడు , వి. వే.

మనుజుడు కర్మబద్ధుడై భార్యాపుత్రులు ధనము శాశ్వతమనుకొని మోసపోయి , అవసానమున కృతార్థుడు కాలేకున్నాడు

A man immersed in karma under the delusion that wife, children and wealth are permanent, is unable to attain salvation.

660
ఇంచుకంత బోనమీశ్వరార్పణమన్న పుణ్యలోకములకు పోవునతడు కర్మసూక్ష్మములను గనవలె ఘనులెల్ల , వి. వే.

ఇంచుకంత బోనమీశ్వరార్పణమన్న
పుణ్యలోకములకు పోవునతడు
కర్మసూక్ష్మములను గనవలె
ఘనులెల్ల , వి. వే.

భక్తితో కొంచె మన్నమును భగవదర్పణము చేసిన నరుడు పుణ్య లోకములను పోగలడు . ఈ కర్మ సూక్ష్మమును గ్రహింపవలెను

When a man offers food with devotion in the name of God he will achieve a better nether world after life.

661
ఇంచుకంతసుఖమె యీరేడు జగములు కంచమునకు బిల్లి కాచినట్లు పంచబాణుబారి బడలుచు నాసి ౦త్రు , వి. వే.

ఇంచుకంతసుఖమె యీరేడు జగములు
కంచమునకు బిల్లి కాచినట్లు
పంచబాణుబారి బడలుచు
నాసి ౦త్రు , వి. వే.

స్వల్పమైన కామ సుఖమునకై లోకము లన్నియు ఆశపడుచున్నవి . ఇది ఆకలితో పిల్లి కంచములోని తిండికై కాచుకొనియున్నట్లున్నది

Men are aspiring for trivial pleasures. They are like a cat that looks forward to food.

662
ఇంటి మగనిజూచి యిల్లాలు దుఃఖించి విటుని వెంటదగిలి వెతలబడును తుంటరైనదాని తొలగింప మేలురా , వి. వే.

ఇంటి మగనిజూచి యిల్లాలు దుఃఖించి
విటుని వెంటదగిలి
వెతలబడును తుంటరైనదాని తొలగింప
మేలురా , వి. వే.

కర్మనుబట్టి స్త్రీ , భర్తను విడిచి విటుని వెంటబడును . అట్టి భార్యను విడిచిపెట్టుట మేలు

Based on the karma one's wife leaves him for a paramour.

663
ఇమ్ము దప్పువేళ నెమ్మెలన్నియు దప్పు కాలమొక్క రీతి గడపవలయు విజయు డనువు దప్పి విరటుని గొల్వడా , వి. వే.

ఇమ్ము దప్పువేళ నెమ్మెలన్నియు
దప్పు కాలమొక్క రీతి గడపవలయు
విజయు డనువు దప్పి విరటుని
గొల్వడా , వి. వే.

సమయము అనుకూలముగా లేనప్పుడు ఏట్లో కాలమును గడపవలసి యుండును . అర్జును నంతటివాడు విరటుని సేవించెను

When the time is not right one has to somehow bide it. The valorous Arjuna had to serve King Virata.

664
ఇరుగుపొరుగులందు నిమిడికతోనుండి తనకుదానె మెలగి తలపు జూపి ధర్మమన్న యెఱుక తన్నుదా బొడసూపు కర్మఫలమువలన గలిగి వేమ!

ఇరుగుపొరుగులందు నిమిడికతోనుండి
తనకుదానె మెలగి తలపు జూపి
ధర్మమన్న యెఱుక తన్నుదా బొడసూపు
కర్మఫలమువలన గలిగి వేమ

కర్మము ధర్మ స్వరూపము . అది చుట్టుప్రక్కలతో కలిసియు౦డి , తనకు తానే తోచి , వృద్ధిపొంది , ఫలమును అనుభవింపజేయును

Karma is a form of dharma. It delivers the fruit by co-existing with the world when it ripens by itself.

665
ఇఱుకువచ్చువేళ ఈశ్వరుదలతురు కరుణగనునె వట్టిగాసిగాక సుఖమువచ్చువేళ జూడగ నొల్లరు , వి. వే.

ఇఱుకువచ్చువేళ ఈశ్వరుదలతురు
కరుణగనునె వట్టిగాసిగాక
సుఖమువచ్చువేళ జూడగ
నొల్లరు , వి. వే.

నరులు, తమకు సుఖము కల్గునపుడు దేవుని స్మరింపరు . కష్టము కలిగినపుడు స్మరింతురు . అట్టివారిని దేవుడు దయతో ఎట్లు చూడగలడు?

Men forget god when the going is good. They remember god only when they face difficulties. How can god show kindness to such people?

666
ఇసుక బొగ్గు రాయి యిసుమును చర్మంబు కసవుపొల్లుగట్టి కట్టపెట్టి పల్లు దోమినంత పరిశుద్ధులగుదురా , వి. వే.

ఇసుక బొగ్గు రాయి యిసుమును
చర్మంబు కసవుపొల్లుగట్టి కట్టపెట్టి
పల్లు దోమినంత పరిశుద్ధులగుదురా,
వి. వే.

ఇసుక, బొగ్గు మున్నగువానితో పల్లు, కసవు మొదలగువానితో చర్మము తోమిన౦త మాత్రమున నరుడు పరిశుద్ధుడు కాడు. మనస్సు పరిశుద్ధముగా ఉండవలెను

Even if a man washes himself with sand, coal, etc. he won't be considered clean. One's mind should be pure

667
ఉచ్చవచ్చుచుండు ఇచ్చకు సరిగాను మచ్చికైన మనసు మర్మమెఱి౦గి హెచ్చు కర్మములయు ముచ్చట లిట్లురా , వి. వే.

ఉచ్చవచ్చుచుండు ఇచ్చకు సరిగాను
మచ్చికైన మనసు మర్మమెఱి౦గి
హెచ్చు కర్మములయు ముచ్చట
లిట్లురా , వి. వే.

కర్మములనుబట్టియే మంచి బుద్ధులు , వాటినిబట్టి ఉన్నత స్థితి కలుగును . మనస్సును స్వాధీనము చేసుకొని ఉత్తమ కర్మములు ఆచరించిన గొప్పతనము కల్గును

Good character and higher status are dependent on karma. One becomes great by controlling the mind and performing good karma.

668
ఉన్నతావు వదలి యూరూరు తిరిగిన కన్నదేమి నరుడు గ్రాసమునకు తన్ను లోనజూడ దమమెల్ల వీడును, వి. వే.

ఉన్నతావు వదలి యూరూరు తిరిగిన
కన్నదేమి నరుడు గ్రాసమునకు
తన్ను లోనజూడ దమమెల్ల
వీడును, వి. వే.

మనుష్యుడు ఉన్న యూరు విడిచి పైచోట్లకు తిండిని సంపాదించుకొనుటకు మాత్రము పోవుచుండును . ఇదే ప్రయోజనము . అది మాని, తనలోని ఆత్మను గ్రహించిన అజ్ఞానము నశించును

A man goes in search of livelihood leaving behind his town if necessary. One has to give up such an attitude and focus on aatma and destroy the ignorance.

669
ఋతువు ననుసరించి స్థితికాలముననొప్పు గతినిబట్టి మనుజు మతియు నొప్పు స్వేఛ్చబట్టి యువిద చెర్లాటమును నొప్పు, వి. వే.

ఋతువు ననుసరించి స్థితికాలముననొప్పు
గతినిబట్టి మనుజు మతియు
నొప్పు స్వేఛ్చబట్టి యువిద
చెర్లాటమును నొప్పు, వి. వే.

కాల పరిస్థితి ఋతువునుబట్టియు , మనుష్యుని బుద్ధి గతినిబట్టియు , స్త్రీయొక్క చెరలాటము స్వేఛ్చనుబట్టియు ఉండును

The weather is dependent on the season, a man's mind-set depends on the fate and a woman's playfulness depends on how free she is.

670
ఎదుటి కలిమిజూచి యేడ్చెడువారికి భాగ్యమెట్లు కూర్చు పరమగురుడు? తనదు పూర్వకర్మ దైవమెఱు ౦గడా? వి. వే.

ఎదుటి కలిమిజూచి యేడ్చెడువారికి
భాగ్యమెట్లు కూర్చు
పరమగురుడు? తనదు పూర్వకర్మ
దైవమెఱు ౦గడా? వి. వే.

ఇతరుల సంపదను చూచి సహించలేనివారికి భాగ్యమబ్బదు . వారి పూర్వజన్మ కర్మమునుబట్టియే కలిమిలేములు కలుగును

When one is jealous of others' wealth, one can't be fortunate. Wealth is dependent on karma in the previous births.

671
ఎద్దుకన్నదెలియు నెనుబోతు తక్కువ వివరమెఱిగి చూడు వృత్తియందు నేర్పులేనివాని నెఱయోధుడందురా ? వి. వే.

ఎద్దుకన్నదెలియు నెనుబోతు
తక్కువ వివరమెఱిగి చూడు వృత్తియందు
నేర్పులేనివాని
నెఱయోధుడందురా ? వి. వే.

పని చేయుటలో ఎద్దు , దున్నపోతు సమానములే . కాని బుద్ధినిబట్టియే ఎక్కువ తక్కువలు ఏర్పడినవి . బలమున్నను నేర్పు లేనిచో అట్టివాడు వీరుడు కాడు .

An ox and a buffalo are equal in performance. But their mind-sets are different. A person cannot be chivalrous by strength alone without adroitness.

672
ఎన్ని తపము లేర్చి ఎన్ని నోములు నోచి ఎంత కష్టపడిన నేమి సుఖము? కర్మఫలముగాని కలుగదెందును ముక్తి, వి. వే.

ఎన్ని తపము లేర్చి ఎన్ని నోములు
నోచి ఎంత కష్టపడిన నేమి
సుఖము? కర్మఫలముగాని కలుగదెందును
ముక్తి, వి. వే.

ఎన్ని తపస్సులు చేసినను, ఎన్ని నోములు నోచినను , ఎన్ని కష్టములు పడినను లాభమేమి?కర్మఫలము పరిపక్వమైననే ముక్తి కలుగును

No matter how much meditation, how many rituals are performed and however many difficulties are endured, salvation is achieved only when the fruit of karma is ripe,

673
ఎన్ని ఫలములున్న నీ ఫలంబెక్కుడు అన్ని సుఖముల ౦డు నధికమగుచు కన్నది కననిదై కనిపించు కర్మము, వి. వే.

ఎన్ని ఫలములున్న నీ ఫలంబెక్కుడు
అన్ని సుఖముల ౦డు నధికమగుచు
కన్నది కననిదై కనిపించు
కర్మము, వి. వే.

తనకు తెలిసియు , తెలియకయు చేయు కర్మ లన్నిటికి ఫలము లభించును . కాని ఫలము లన్నింటిలో కర్మఫలమే గొప్పది.

The fruit of karma is obtained by acts performed with volition or not. Among all fruit the fruit of karma is the most superior.

674
ఎఱుకకన్నను సుఖ మేలోకమునలేదు ఎఱుకనెఱుగ నెవనికెఱుక లేదు ఎఱుకసాటి దెఱుకె ఎఱుకయే తత్త్వము , వి. వే.

ఎఱుకకన్నను సుఖ మేలోకమునలేదు
ఎఱుకనెఱుగ నెవనికెఱుక
లేదు ఎఱుకసాటి దెఱుకె ఎఱుకయే
తత్త్వము , వి. వే.

జ్ఞానమే సుఖము . దానిని తెలియుట కష్టము . దాని కదియే సాటి . అదియే తత్త్వము

True knowledge offers comfort. But it is hard to achieve. It is called tattva

675
ఎల్లలోకమందు నే వస్తువున్నదో తల్లిపిల్ల సందుతగులు నదియె నిస్తరంగవార్థి నియతిని జూడుము, వి. వే.

ఎల్లలోకమందు నే వస్తువున్నదో
తల్లిపిల్ల సందుతగులు
నదియె నిస్తరంగవార్థి నియతిని
జూడుము, వి. వే.

సర్వలోకములందు వ్యాపించియున్న వస్తువే తల్లి పిల్లల మధ్య ప్రేమగా ఉన్నది . కావున వంచనలకు లొంగక నియమముతో అలలులేని సముద్రమువలె శాంతమగు పరమేశ్వరుని రూపమును కనుగొనుము . భగవంతుడు ప్రేమరూపుడై కనబడును

The love between a mother and her child is universal. Remain like a wave-less sea without yielding to deceit and realize the peaceful form of Lord Siva. Then god can be realized as an embodiment of love.

676
ఎసగు వేత్తేయనుచ నెఱుగరే యీ నరుల్ వేయి మార్గములను వెలుపజుడు అవని సృష్టికర్త యంతకు గురుడౌను , వి. వే.

ఎసగు వేత్తేయనుచ నెఱుగరే యీ
నరుల్ వేయి మార్గములను వెలుపజుడు
అవని సృష్టికర్త
యంతకు గురుడౌను , వి. వే.

ప్రపంచమును సృజించిన వేల్పు బ్రహ్మ. అతడే వేత్త . ఆ సృష్టికర్తయే అంతటికి గురువు

Lord Brahma is the one who created the world. He is omniscient. The creator is the ultimate guru.

677
ఏమి కొంచువచ్చె నేమి తా గొనిపోవు పుట్టువేళ నరుడు గిట్టువేళ దనము లెచటికేగు దానేగు నెచటికి ? వి. వే.

ఏమి కొంచువచ్చె నేమి తా గొనిపోవు
పుట్టువేళ నరుడు గిట్టువేళ
దనము లెచటికేగు దానేగు
నెచటికి ? వి. వే.

నరుడు పుట్టినపుడు తనతో ధనము తేలేదు . చచ్చినపుడు కొనిపోలేదు . దీనినెరిగి లోభి కాకుండవలెను . దానము చేయవలెను

A man did not bring wealth at the time of birth. Nor could he take wealth to the nether world after death. Knowing this one should not covet wealth and always be a donor.

678
ఒక్క తోలు తెచ్చి యొనర బొమ్మనుజేసి ఆడునట్లుచేసి యట్టెవైచి తన్ను ద్రిప్పువాని దానేలుకొనడో , వి. వే.

ఒక్క తోలు తెచ్చి యొనర బొమ్మనుజేసి
ఆడునట్లుచేసి యట్టెవైచి
తన్ను ద్రిప్పువాని
దానేలుకొనడో , వి. వే.

నరుడు తోలుతో బొమ్మను చేసి, ఆటలాడించి వినోదించునే గాని తన్నాడించు భగవంతుని తెలిసికోకున్నాడు

Men enjoy a puppet show conducted by a puppeteer. They don't realize they are the puppets of God.

679
ఒల్లననినబో ది కొల్లెద ననరాదు తొల్లిచేయు కర్మ ధూర్తఫలము ఉల్లమందు వగవకుండటే యోగ్యంబు , వి. వే.

ఒల్లననినబో ది కొల్లెద ననరాదు
తొల్లిచేయు కర్మ ధూర్తఫలము
ఉల్లమందు వగవకుండటే
యోగ్యంబు , వి. వే.

పూర్వజన్మ కర్మఫలము ననుభవింపవలసినదే . అది రమ్మన్న రాదు, వద్దన్న పోదు . దానిని గూర్చి ఆలోచింపకుండటే మేలు

One has to experience the karma from previous lives. It can't be invited nor uninvited. It is better not to think about it.

680
కంటిగంటి ననుచు కర్మాధికారంబు వెంటగొనుచు చెడును వెఱ్ఱిజనుడు బట్టబయల ముక్తి బాటి౦చి చూడుము , వి. వే.

కంటిగంటి ననుచు కర్మాధికారంబు
వెంటగొనుచు చెడును వెఱ్ఱిజనుడు
బట్టబయల ముక్తి బాటి౦చి
చూడుము , వి. వే.

వెర్రి మనుష్యుడు , అన్నియు తనకు తెలియునని కర్మాధికారమును తనపై పెట్టుకొనును . లేనిపోనివి నెత్తిపై పెట్టుకొనక ముక్తికి ప్రయత్నింపవలెను

A foolish man thinking he is omniscient considers himself as responsible for his karma. One has to strive for salvation without thinking about worldly things.

681
కంటిమంటచేత గాముని దహియించి కామమునను కడకు గౌరిగూడె నట్టి శివునినైన నంటును కర్మము , వి. వే.

కంటిమంటచేత గాముని దహియించి
కామమునను కడకు గౌరిగూడె
నట్టి శివునినైన నంటును
కర్మము , వి. వే.

శివుడు కంటిమంటచే మన్మథుని దహించియు కామమునకు లొంగి గౌరిని పెండ్లాడెను. శివుడైనను కర్మము తప్పించుకోలేడు

Lord Siva burnt the cupid Manmatha. He then married Gowri. Even Lord Siva could not escape karma.

682
కర్మమయుడుకాక కర్మంబు తెలియదు కర్మజీవి మేలు కానలేడు నీరుసొరక లోతు నికరము తెలియదు , వి. వే.

కర్మమయుడుకాక కర్మంబు తెలియదు
కర్మజీవి మేలు కానలేడు
నీరుసొరక లోతు నికరము
తెలియదు , వి. వే.

కర్మమును అనుభవించినగాని దాని తత్త్వము తెలియదు . మంచి తెలియదు . నీటిలో దిగినగాని దాని లోతు తెలియదు

One has to experience karma to gain its knowledge. One doesn't know the depth of a body of water without immersing in it.

683
కర్మఫలములన్ని కపటంబుగాజూచి ధర్మఫలములన్ని తగిలియు౦డి ధర్మకర్మములను దాటుటే ముక్తిరా , వి. వే.

కర్మఫలములన్ని కపటంబుగాజూచి
ధర్మఫలములన్ని తగిలియు౦డి
ధర్మకర్మములను దాటుటే
ముక్తిరా , వి. వే.

కర్మఫలములను పొల్లుగా భావించి ధర్మఫలములు స్వీకరించి, పిదప ధర్మ కర్మములను దాటి ముక్తిని కాంచవలెను

One has to consider the fruit of karma as trivial and accept the fruit of dharma. Later on one has to attain salvation by renouncing karma and dharma.

684
కర్మముననుబట్టి కష్టంబులోజేరి కర్మ మేరుపడుట కానలేరు కర్మ బంధమునను కడతేరలేరయా , వి. వే.

కర్మముననుబట్టి కష్టంబులోజేరి
కర్మ మేరుపడుట
కానలేరు కర్మ బంధమునను
కడతేరలేరయా , వి. వే.

మనుజుడు కర్మము వల్లనే పుట్టి, కష్టములకు చిక్కి ఆ కర్మబంధమును విడిపించుకోలేక తరింపలేకున్నాడు

Men born because of karma, are trapped in difficulty. They are unable to free themselves from karma and attain salvation.

685
కాడు చేరియున్న గతిలోన నున్నను వీటి నడుమనున్న విధము లొకటె జాడవిడని మదిని జర్చించి చూడరా, వి. వే.

కాడు చేరియున్న గతిలోన నున్నను
వీటి నడుమనున్న విధము
లొకటె జాడవిడని మదిని
జర్చించి చూడరా, వి. వే.

నరుడు అడవిలో గాని , దారిలో గాని, పట్టణములో గాని ఎక్కడ నున్నను ఒక్కటే కర్మఫలము . ఆలోచించి చూడుడు .

No matter a person lives in a forest or a city, the fruit of karma is the same (law of karma is the same)

686
కూడదేమి చేసె?కులమేమి చేసెను?భూమి యేమి చేసె ?బొందికట్టె నరుడు పడెడిపాట్లు నాగుబాట్లు చూడరా , వి. వే.

కూడదేమి చేసె?కులమేమి చేసెను?భూమి
యేమి చేసె ?బొందికట్టె
నరుడు పడెడిపాట్లు నాగుబాట్లు
చూడరా , వి. వే.

ఉపవాస , కుల నివాసాదులబట్టి నరుడు శ్రమపడిన లాభము లేదు. వీనిని విడిచి మోక్షమునకై యత్నింపవలెను

There is no use in enduring hardship from fasting, caste and domestic situation. One has to give these up and strive to attain salvation.

687
కొడుకును వరియింపగోరి వచ్చినదాని తండ్రి పెండ్లియాడ ధర్మమగునె ?తప్పని తెలిసియు దాజేయు కర్మంబు తప్పదెపుడు భువిని దగులు వేమ!

కొడుకును వరియింపగోరి వచ్చినదాని
తండ్రి పెండ్లియాడ ధర్మమగునె?
తప్పని తెలిసియు దాజేయు కర్మంబు
తప్పదెపుడు భువిని దగులు వేమ

కొడుకు పెండ్లాడవలసిన కన్యను తండ్రి వివాహమాడుట అధర్మము. రాజరాజనరేంద్రుడట్టి చెడుపని చేసెను. ఇట్లు జరుగుటకు కర్మయే కారణము

A man marrying his son's bride is violating dharma. King Raja Raja Narendra did such a bad act. It is all because of karma.

688
క్రొత్తసుద్ధులైన గురుబోధచే విన్న కర్మయుక్తి యోగకాండతతులు ప్రాతసుద్ధులైన బాయునా కర్మంబు , వె. వే.

క్రొత్తసుద్ధులైన గురుబోధచే
విన్న కర్మయుక్తి యోగకాండతతులు
ప్రాతసుద్ధులైన బాయునా
కర్మంబు , వె. వే.

క్రొత్త పాత నీతులు,బోధలు , యుక్తి యోగములు ఎన్ని యున్నను కర్మము నెవ్వరును తప్పించుకోలేరు

No matter how many sayings, teachings, yogic methods exist, one cannot escape the law of karma.

689
చిఱుతనాడు నీవు చేసిన కర్మంబు మఱుతవేమొ మదిని మల్లడించి తఱిమి ముట్టుజావు తలపడినప్పుడు , వి. వే.

చిఱుతనాడు నీవు చేసిన కర్మంబు
మఱుతవేమొ మదిని మల్లడించి
తఱిమి ముట్టుజావు
తలపడినప్పుడు , వి. వే.

చిన్నప్పటి కర్మలను మరచిన , అవి మరణ సమయమునకు వెంటనంటి వచ్చును . వానిని అనుభవింప మరియొక జన్మమెత్తవలెను

When one forgets karma of youth, they will follow until death. One has to be born again to experience them.


690
చేటు వచ్చెనేని చెడనాడు దైవంబు మేలు వచ్చెనేని మెచ్చుకొనును గరిమ మేలుకీళ్ళు కావడికుండలు , వి. వే.

చేటు వచ్చెనేని చెడనాడు దైవంబు
మేలు వచ్చెనేని మెచ్చుకొనును
గరిమ మేలుకీళ్ళు
కావడికుండలు , వి. వే.

చెడ్డ కలిగిన దైవమును నిందింతుము . మంచి కలిగిన మెచ్చుకొందుము . కష్టసుఖములు కావడికుండలవలె సమానములే . వానికి కర్మమే కారణము . దైవము కారణము కాదు

We blame god when bad things happen. And praise him when we are successful. Comfort and strife are equal. Karma is responsible for everything. Not god.

691
చదివి చదివి కర్మసారము గనలేక తిరిగి తిరిగి తిరిగి దిమ్మరాయె మరిగి తిరిగి మొఱిగి మత్తిల్లి చచ్చెరా , వి. వే.

చదివి చదివి కర్మసారము గనలేక
తిరిగి తిరిగి తిరిగి దిమ్మరాయె
మరిగి తిరిగి మొఱిగి మత్తిల్లి
చచ్చెరా , వి. వే.

ఎంత చదివినను సారము గ్రహింపలేక , దేశములు తిరిగి తిరిగి పిచ్చిపట్టి చచ్చుట కర్మమునుబట్టియే జరుగును .

When one is well read but not knowing the essence and roams around with insanity, it is all because of bad karma

692
చాకి కోక లుతికి చీకాకు పడ జేసి మైలతీసి లెస్స మడిచినట్లు బుద్ధిచెప్పువాడు గ్రుద్దినమేలయా , వి. వే.

చాకి కోక లుతికి చీకాకు పడ
జేసి మైలతీసి లెస్స మడిచినట్లు
బుద్ధిచెప్పువాడు గ్రుద్దినమేలయా,
వి. వే.

మురికి పోవుటకు చాకలి బట్టల నుదుకును . అట్లే బుద్ధి చెప్పేవాడు గ్రుద్దినను మంచిదే

A washer man beats the clothes to rid dirt from them. Similarly when a man teaching good things, slaps one to drive good sense, there is no harm.

693
తనకు ప్రాప్తిలేక దానము చిక్కదు దైవనింద వెఱ్ఱితనము కాదె ?కర్మజీవులేల కర్మంబు దెలియరు , వి. వే.

తనకు ప్రాప్తిలేక దానము చిక్కదు
దైవనింద వెఱ్ఱితనము
కాదె ?కర్మజీవులేల కర్మంబు
దెలియరు , వి. వే.

ప్రాప్తము లేనిచో ఏమియు లభించదు . దైవమును నిందించి ప్రయోజనము లేదు . అంతకును కర్మయే కారణము

Without being deserving, nothing is possible. There is no use blaming god. The law of karma is the root of everything.

694
తనకు ప్రాప్తిలేదు దాత యీలేదంచు నొరుల దూఱుటెల్ల నోగుబుద్ధి కలిమిలేమి కతన కష్టమై తోచురా , వి. వే.

తనకు ప్రాప్తిలేదు దాత యీలేదంచు
నొరుల దూఱుటెల్ల నోగుబుద్ధి
కలిమిలేమి కతన
కష్టమై తోచురా , వి. వే.

లేమివలన కష్టమే తోచును. ఒకరు ఇవ్వలేదని వారిని నిందించినను ప్రయోజనము లేదు . తనకు ప్రాప్తిలేనిచో ఎట్లు వచ్చును?

Neediness is hard. There is no use cursing one for not helping him. When one is undeserving, how can one profit?

695
తనకు బ్రొద్దువోని తరుణంబదైనచో వినక తీరదధిక విద్యలైన గరిత వినదె ప్రియుని కొఱకు గాకధ్వని , వి. వే .

తనకు బ్రొద్దువోని తరుణంబదైనచో
వినక తీరదధిక విద్యలైన
గరిత వినదె ప్రియుని కొఱకు
గాకధ్వని , వి. వే .

తనకు ఇష్టము లేకున్నను , కాలము వ్యర్థమని తోచినను వేదాంత విద్యను వినక తప్పదు . భర్త రాకకై నిరీక్షించు యువతి కఠోరమైన కాకి యరుపు విని సంతోషించును గదా !

One has to learn about vedas even if he is disinterested and think of it as waste of time. A house-wife waiting for the arrival of her husband is elated by the omen of a crow's call.

696
తనదు కర్మచేత దాను లోకములోన దనదు తల్లి గర్భమునను పుట్టె తనదు కర్మమఱచి తగనివిచేయునా ? వి. వే.

తనదు కర్మచేత దాను లోకములోన
దనదు తల్లి గర్భమునను
పుట్టె తనదు కర్మమఱచి
తగనివిచేయునా ? వి. వే.

పూర్వజన్మ కర్మవల్లనే తల్లి గర్భమున పుట్టుక కల్గును. దీనిని మరచి మూర్ఖుడు తగని పనులకు సిద్ధపడి కష్టములు తెచ్చుకొనును

Because of karma in past lives one is born. Forgetting this a foolish person invites trouble by performing bad karma.

697
తనదు నీడ శిశువు తా జూచుచుండును తనదు నీడజూచి తన్నుమఱచి పనులొనర్చుచుండు భ్రాంతులనేమందు ? వి. వే .

తనదు నీడ శిశువు తా జూచుచుండును
తనదు నీడజూచి తన్నుమఱచి
పనులొనర్చుచుండు భ్రాంతులనేమందు?
వి. వే .

శిశువులు తమ నీడను చూచి ఆడుకొన్నట్లే పెద్దలును తమ జీవిత చ్చాయను చూచి, మేను మరచి కర్మబద్దులై వర్తించుచుందురు

Like kids that are fascinated by their shadows, adults reflecting on their past are unaware of themselves and live by performing karma.

698
తనదు భ్రాతలెల్ల దానంబు చేయగ దనకు ఫలమటంచు మిణుకరాదు తనకు కాలుగోయ తన తమ్ముడేడ్చునా ? వి. వే.

తనదు భ్రాతలెల్ల దానంబు
చేయగ దనకు ఫలమటంచు మిణుకరాదు
తనకు కాలుగోయ తన తమ్ముడేడ్చునా?
వి. వే.

సోదరులు చేసిన దానముల ఫలము తనకు లభించునని తలపరాదు . తనకు కాలు కోసిన తమ్మునికి నొప్పి కలుగునా?

One should not think the alms given by his siblings will protect him. Will the brother feel pain when one's leg is hurt?

699
తెలివినొందలేక తిరమున బడయక తిరుగు నస్థిరు౦డయి దేహి జగతి తిరుగనేల ? కర్మదెలియ దివ్యజ్ఞాని , వి. వే.

తెలివినొందలేక తిరమున బడయక
తిరుగు నస్థిరు౦డయి దేహి
జగతి తిరుగనేల ? కర్మదెలియ
దివ్యజ్ఞాని , వి. వే.

దేహి జ్ఞానశూన్యుడై స్థైర్యము పొందలేక లోకమున తిరుగుచుండును . జ్ఞానియై కర్మను తెలిసికొనవలెను

With ignorance a man functions in the world as a coward. One has to be knowledgeable about the law of karma.

700
ధర్మమార్గములను తప్పుగా జూచును కర్మజీవి మేలుకానలేడు నిర్మలహృదయు౦డు నీరూపముననుండు , వి. వే.

ధర్మమార్గములను తప్పుగా
జూచును కర్మజీవి మేలుకానలేడు
నిర్మలహృదయు౦డు నీరూపముననుండు,
వి. వే.

కర్మబద్ధుడు ధర్మమార్గములను తప్పులని భావించును . నిర్మలమనస్సుతో యత్నించినచో ఆత్మరూపము నందవచ్చును

A man performing karma thinks of the path of dharma as wrong. If the mind is pure, it is possible to realize aatma.

701
నరజన్మము దా నేత్తియు పరమాత్మ నెఱుగలేక పాపాత్ముడై కొఱగాని పనులొనర్చిన దిరిగి యధోగతికి నేగు దిరముగ వేమా!

నరజన్మము దా నేత్తియు పరమాత్మ
నెఱుగలేక పాపాత్ముడై కొఱగాని
పనులొనర్చిన దిరిగి యధోగతికి
నేగు దిరముగ వేమా

నరజన్మ మెత్తినందుకు పరమాత్మను తెలిసికొనవలెను . అట్లు చేయక పాపబుద్ధితో చెడ్డపనులు చేసిన , అధోగతియే కల్గును

Having been born as a man, one has to seek god. If bad acts are committed by him, he will be relegated to hell.

702
నరుడయినను లేక నారాయణుడైన దత్త్వబద్ధుడైన ధరణి నరయ కర్మభావములను ఘనత నొప్పగవలె , వి. వే.

నరుడయినను లేక నారాయణుడైన
దత్త్వబద్ధుడైన ధరణి
నరయ కర్మభావములను ఘనత
నొప్పగవలె , వి. వే.

నరుడు గాని, నారాయణుడు గాని,తత్త్వవేత్త గాని, ఎవ్వడైనను సరే , కర్మకు లొంగవలసినదే

Whether a learned man or Lord Vishnu, one must obey the law of karma.

703
నింగి నెగయువాడు నెఱిలోకమున లేడు బంగి త్రాగువాడు బలియబోడు కొంగయోగములను గోర్కులడంగునా ? వి. వె.

నింగి నెగయువాడు నెఱిలోకమున
లేడు బంగి త్రాగువాడు
బలియబోడు కొంగయోగములను గోర్కులడంగునా?
వి. వె.

కొంగ జపము చేయు దొంగ యోగులు భంగు త్రాగుచు ఆకాశముపై కెగురుదుమని ప్రజలను మోసగింతురు . వారికిని కోరికలున్నవి . అట్టివారిని నమ్మరాదు

Like a crane with its heads stuck in its feathers resembling meditation, false yogis under intoxication convince people that they can fly. Even they have desires. One can't trust them.

704
పది యసంగతములు పదిసార్లు చేసిన తప్పుదారిద్రొక్క దార్ ఢ్య మొదవు కూడదేలయట్టి కుదిరిక మంచికి, వి. వే.

పది యసంగతములు పదిసార్లు చేసిన
తప్పుదారిద్రొక్క దార్
ఢ్య మొదవు కూడదేలయట్టి
కుదిరిక మంచికి, వి. వే.

పది తప్పులు పదిసార్లు చేసిన, తప్పుదారి త్రొక్కుటకు శక్తి కలుగును . మంచి మార్గమునకును అట్టి కుదిరిక కలిగియుండిన మేలు

One by committing multiple sins develops passion for a bad path. It is better to have that kind of persistence for a good path.

705
పరగ నింతవఱకు బడినపాటెఱుగరు ఘనతనొప్పు మనుజు డనగబుట్టి కీడు మేలెఱుగక క్రి౦దాయె జూడరా! వి. వే.

పరగ నింతవఱకు బడినపాటెఱుగరు
ఘనతనొప్పు మనుజు డనగబుట్టి
కీడు మేలెఱుగక క్రి౦దాయె
జూడరా! వి. వే.

మనుష్యుడు జన్మమెత్తి ఎన్ని పాట్లు పడెనో స్మరింపడు . కర్మమునుబట్టియే మేలు కీళ్ళు కలిగెనని గ్రహింపడు

A man won't recount all of the travails since birth. Because of karma one is experiencing good and bad.

706
పరగ ఇలను ముందు బ్రతుకు తీరెఱుగక సకలసంపదలను సతములనుచు కర్మమర్మములను గనలేరు మూర్ఖులు, వి. వే.

పరగ ఇలను ముందు బ్రతుకు
తీరెఱుగక సకలసంపదలను సతములనుచు
కర్మమర్మములను గనలేరు
మూర్ఖులు, వి. వే.

మూర్ఖులు సంపదలే శాశ్వతమనుకొని , బ్రతుకుతీరు తెలియక కర్మరహస్యముల నెరుగలేకుందురు

Foolish people thinking wealth will last for ever, and not knowing about life, won't strive to learn about the secrets of karma.

707
పాపమనగ వేఱె పరదేశమున లేదు తాను చేయు పనుల తగిలియు౦డు కర్మ జనుడుగాక కనగలిగినయెడ పాపభయము లేదు పరగ, వేమ!

పాపమనగ వేఱె పరదేశమున లేదు
తాను చేయు పనుల తగిలియు౦డు
కర్మ జనుడుగాక కనగలిగినయెడ
పాపభయము లేదు పరగ, వేమ

మనము చేయు కర్మలయందే పాపమిమిడియున్నదికాని వేరే లేదు. కర్మపరుడు కాకున్నచో పాపభయము లేదు

Sins are embedded within karma. There is no fear of sin when one is obeying the law of karma.

708
పుట్టువు తెలియని పురుషాధములు భూమి బుట్టనేమి?లేక గిట్టనేమి ?పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా ? వి. వే.

పుట్టువు తెలియని పురుషాధములు
భూమి బుట్టనేమి?లేక గిట్టనేమి?
పుట్టలోని చెదలు పుట్టవా
గిట్టవా ? వి. వే.

తన జన్మకు ఫలమేమో ఎరుగని మూర్ఖుడు ఉన్నను చచ్చినను ఒక్కటే . అతడు పుట్టలో పుట్టి నశించిన చెదలవంటివాడు

A man not knowing the purpose of his life would rather be dead than alive. He is like the termites that are born and dead.

709
పుట్టుముగ్ధ తిరిగిపోయెడుచో ముగ్ధ తేరముగ్ధ తన్ను తెలియలేడు ఉన్నానాటికైనను ఉపకారి కాలేడు , వి. వే.

పుట్టుముగ్ధ తిరిగిపోయెడుచో
ముగ్ధ తేరముగ్ధ తన్ను తెలియలేడు
ఉన్నానాటికైనను
ఉపకారి కాలేడు , వి. వే.

మనుష్యుడు పుట్టుకతో మూఢుడు , చచ్చినపుడును జ్ఞానముండదు . ఇది తెలియక మూఢుడు జీవితకాలమున ఉపకారి కాలేకున్నాడు

Man is foolish at birth and devoid of knowledge at the time of death. Without realizing this a foolish man is unable to carry out good karma.

710
పుట్టుటకు ముదంబు గిట్టుటకును వెత అందఱెఱిగినట్టి అల్ప విద్య చచ్చుగాన బుట్ట జప్పున నేడ్వరే ? వి. వే.

పుట్టుటకు ముదంబు గిట్టుటకును
వెత అందఱెఱిగినట్టి అల్ప
విద్య చచ్చుగాన బుట్ట జప్పున
నేడ్వరే ? వి. వే.

పుట్టిన సంతోషము , చచ్చిన విచారము కల్గును. దీనిని అందరు ఎరుగుదురు . పుట్టగానే , వీనికిని చావు తప్పదని ఏల ఏడ్వరో చిత్రము

People celebrate birth and mourn death. However, they don't cry when one is born, knowing that he would die one day.

711
పుడమి కర్మవశత బురుకుత్సుడను మేటి ధర్మమును అనుసరించి ధాత్రినేలె తనకుగానివేళ దాబడె కష్టముల్ , వి. వే.

పుడమి కర్మవశత బురుకుత్సుడను
మేటి ధర్మమును అనుసరించి
ధాత్రినేలె తనకుగానివేళ
దాబడె కష్టముల్ , వి. వే.

పురుకుత్సునంతవాడు ధర్మముగా ప్రజలను పాలించినను తుదకు కానికాలము రాగా కష్టపడెను . దీనికి కర్మమే కారణము

King Purukutsa ruled with dharma and fell under bad circumstance. Karma is responsible for this.

712
పురుషు లరసి కొన్ని పుణ్యభూములటండ్రు బుద్ధిలేదొ యిదియు భూమికాదొ పుణ్యమనగనేమి పురుషుని కర్మమే , వి. వే.

పురుషు లరసి కొన్ని పుణ్యభూములటండ్రు
బుద్ధిలేదొ యిదియు
భూమికాదొ పుణ్యమనగనేమి పురుషుని
కర్మమే , వి. వే.

కొన్నిచోట్లు పుణ్యభూము లందురు . అన్నియు సమానమే . పుణ్యమునకు , పాపమునకు వారివారి కర్మలే కారణము

People say some places are holy. All are equals. Only karma gives raise to virtue and sin.

713
పూతగడ్డికేల పుట్టించె ఆపద కనకము తనకేమి కలుగజేసె ? బ్రహ్మచేతలెల్ల బాడైన చేతలు , వి. వే.

పూతగడ్డికేల పుట్టించె
ఆపద కనకము తనకేమి కలుగజేసె?
బ్రహ్మచేతలెల్ల బాడైన
చేతలు , వి. వే.

బ్రహ్మ చేయు పనులు విచిత్రములు . లేతగడ్డి ఆపద పొందును (తినబడును). బంగారము గౌరవింపబడును . ఇది కర్మాధీనము

The acts of the creator are confounding. Young grass, before it can grow fully, is eaten by animals and gold is coveted. It is all happening because of law of karma.

714
పెక్కు జనులగొట్టి పేదల వధియించి డొక్కకొఱకు నూళ్ల దొంగలించి యెక్కడికరిగిన నెఱగి యము౦డు చంపు , వి. వే.

పెక్కు జనులగొట్టి పేదల వధియించి
డొక్కకొఱకు నూళ్ల దొంగలించి
యెక్కడికరిగిన నెఱగి
యము౦డు చంపు , వి. వే.

క్రూరుడు పొట్టకై జనులను కొట్టి , చంపి, దొంగలించు చుండును . కాని, ఎక్కడికి పోయినను వానికి చావు తప్పదు

A cruel person harms others and steals from them. No matter how far he runs and hides he can't escape death.

715
కర్మజాలమనుచు ఘనులెల్ల బల్కేరు కర్మమేమి ? దాని ఘనతయేమి?తెలుపొ నలుపొ యెఱుపొ తెలిసిన బల్కుడు , వి. వే.

కర్మజాలమనుచు ఘనులెల్ల బల్కేరు
కర్మమేమి ? దాని ఘనతయేమి?తెలుపొ
నలుపొ యెఱుపొ తెలిసిన
బల్కుడు , వి. వే.

మంచి చెడ్డలకు కర్మయే కారణమని పెద్దలందురు . దాని ఘనతను, స్వరూపామును తెలిసికొని యత్నింపవలెను

Wise people say good or bad outcomes are because of karma. One has to strive to understand it.

716
ప్రాణ మాత్మ మెన్న ప్రాణి జీవితమగు జీవి ప్రాణ ఆత్మ చేరియొకటి కర్మబంధమునను గట్టునదుండును , వి. వే.

ప్రాణ మాత్మ మెన్న ప్రాణి
జీవితమగు జీవి ప్రాణ ఆత్మ
చేరియొకటి కర్మబంధమునను
గట్టునదుండును , వి. వే.

ప్రాణము, ఆత్మ, జీవి కలిసి జీవితము. ఇవి మూడును చేరియే కర్మబంధముచే కట్టబడియుండును

Breath, aatma and body are the bases for life. All three of them are tied together by karma.

717
మంచి గంధముగన మనసు రంజిల్లును ఎంతొ వాసననుచు నెన్నుచుండ్రు తా మెఱుగలేరు తమ పూర్వవాసన, వి. వే.

మంచి గంధముగన మనసు రంజిల్లును
ఎంతొ వాసననుచు నెన్నుచుండ్రు
తా మెఱుగలేరు
తమ పూర్వవాసన, వి. వే.

మంచి గంధము గొప్పదని , మంచి వాసన గలదని జనులు మెచ్చుకొందురు . వారు తమ పూర్వజన్మ వాసనను తెలిసికోలేరు

Men are appreciative of the pleasant scent of sandal wood. They don't know about the scent of previous births.

718
మంచినీరు పోయ మల్లె పూచునుగాని ఫలిత మొనరుటెట్లు పనిజొరమిని వంటచేయుటకెట్లు వంటకమబ్బును ? వి. వే.

మంచినీరు పోయ మల్లె పూచునుగాని
ఫలిత మొనరుటెట్లు పనిజొరమిని
వంటచేయుటకెట్లు
వంటకమబ్బును ? వి. వే.

మంచినీరు పోసిన మల్లెమొక్క పూచునందురు . పని చేయక ఎట్లు పూచును ? వంట చేయక అన్నమెట్లు లభించును?

They say a jasmine tree will bloom when it is fed with water. How can it bloom without effort? How can one enjoy a meal without cooking?

719
మంచి రుచులగోరు మంచి స్త్రీలనుగోరు మనుజుడెంత చెడ్డ మనసొ చూడు డించుకంతయైన నేలని విడువడు , వి. వే.

మంచి రుచులగోరు మంచి స్త్రీలనుగోరు
మనుజుడెంత చెడ్డ
మనసొ చూడు డించుకంతయైన
నేలని విడువడు , వి. వే.

మనుష్యుని మనస్సు చెడ్డది . అతడు రుచిగల పదార్థములను , అందమైన స్త్రీలను కోరును . ఇంత భూమిని విడువడు . వీనికి మోక్షమెట్లు కలుగును?

Men tempted by tasty food and beautiful women are of bad character who don't want to leave this earth. How can they attain salvation?

720
మంచి శకునములని యెంచి పెండిలిసేయు వారెకాని లేరు వసుధ నొకరు జనుల కర్మములకు శకునముల్ నిల్చునా , వి. వే.

మంచి శకునములని యెంచి పెండిలిసేయు
వారెకాని లేరు వసుధ
నొకరు జనుల కర్మములకు శకునముల్
నిల్చునా , వి. వే.

మంచి శకునములను(omen ) చూచియే అందరును పెండిండ్లు చేయుదురు . కాని చెడ్డయు కల్గును . శకునములు కర్మముల నడ్డగింపలేవు

Even though marriages are performed at auspicious time and when omens are good, bad things can happen. Omen and astrology cannot prevent the effects of karma.

721
మంటిలోన బుట్టి మంటిలోన పెరిగి మన్ను చూచి జనులు మగ్నులైరి మన్ను మన్నుజేర మది నిల్పలేరయా , వి. వే.

మంటిలోన బుట్టి మంటిలోన పెరిగి
మన్ను చూచి జనులు మగ్నులైరి
మన్ను మన్నుజేర మది
నిల్పలేరయా , వి. వే.

నరుని శరీరము మన్ను . అతడు మట్టిలోనే పుట్టి మట్టిలోనే కలిసిపోవును . అజ్ఞానములో మునిగి పరుని గాంచలేకున్నారు

The body is made of the 5 elements (earth, water, air, space, fire) and merges with them after death. With ignorance one can't realize there is a creator.

722
మతపు భేదముగల మాయ సంసారియై దారితెలియువాడు ధన్యుడు కాడొకో , వి. వే.

మతపు భేదముగల మాయ
సంసారియై దారితెలియువాడు
ధన్యుడు కాడొకో,
వి. వే.

మత భేదము పాటించి సంసార మాయలో పడి జనుడు ముక్తి మార్గమును తెలియలేకున్నాడు . అది తెలిసినవాడే ధన్యుడు

By discriminating among religions and falling into the illusion of bondage, one is unable to realize the path to salvation.

723
మతము లెన్నియైన సతములు కావవి సతము కర్మమగును జగతియందు అన్ని మతములందు నరయ నొక్కటిలేదు , వి. వే.

మతము లెన్నియైన సతములు కావవి
సతము కర్మమగును జగతియందు
అన్ని మతములందు నరయ
నొక్కటిలేదు , వి. వే.

మతములు స్థిరములు కావు . కర్మమే స్థిరము . మతములన్నిటికి ఒక కట్టుబాటు కానరాదు

Religions are not permanent. Only karma is for ever. Religions don't seem to have a precept.

724
మద్యమాంస రుచిని మాదిగదైవాల యెంగిలి తినగానె నింగి కలదె ? భక్తిని హరుగొల్చి భవ్యులుకండయా , వి. వే.

మద్యమాంస రుచిని మాదిగదైవాల
యెంగిలి తినగానె నింగి
కలదె ? భక్తిని హరుగొల్చి
భవ్యులుకండయా , వి. వే.

క్షుద్రదేవతలకు మద్యమాంసములు నివేదించి తిన్నంత మాత్రమున స్వర్గము రాదు . భక్తితో శివుని కొల్చిననే ముక్తి

By praying to demi gods and offering them alcohol and meat, one can't go to heaven. Only devotion to Lord Siva will help one attain salvation.

725
మధురసంబు గోరి మక్షికములు చేరి చొచ్చి వెడలలేక చొక్కినట్లు మునిగి విడువలేడు మూఢు౦డు కర్మల, వి. వే.

మధురసంబు గోరి మక్షికములు
చేరి చొచ్చి వెడలలేక చొక్కినట్లు
మునిగి విడువలేడు
మూఢు౦డు కర్మల, వి. వే.

తేనె త్రాగగోరి ఈగ , దానిపై వ్రాలి చిక్కుకొన్నట్లు మూఢుడు కర్మములలో చిక్కుకొని , వానినుండి బయటపడలేడు

Like a fly that is trapped in honey, a foolish person is caught in karma and can't hope to be free.

726
మనసులోని ముక్తి మఱియొక్కచోటను వెదుకబోవువాడు వెఱ్ఱివాడు గొఱ్ఱె చంకబెట్టి గొల్ల వెదుకురీతి , వి. వే.

మనసులోని ముక్తి మఱియొక్కచోటను
వెదుకబోవువాడు వెఱ్ఱివాడు
గొఱ్ఱె చంకబెట్టి గొల్ల
వెదుకురీతి , వి. వే.

ముక్తి మార్గము మనస్సులోనే ఉన్నది. దాని కొరకు పైచోట వెతకనక్కరలేదు . అట్లు వెదకుట గొల్లవాడు గొర్రెను చంకబెట్టుకొని దానికై ఊరంతయు వెతిక నట్టు ఉండును

The path to salvation is within one's reach. There is no need to look for it everywhere like a shepherd who searches all over the village for a lamb unaware that he is holding it.

727
బ్రదుకులన్ని మాయ భవబంధములు మాయ తెలివి మాయ తన్ను దెలియ మాయ తనదు కర్మమొకటె తనరును స్థిరమయి , వి. వే.

బ్రదుకులన్ని మాయ భవబంధములు
మాయ తెలివి మాయ తన్ను దెలియ
మాయ తనదు కర్మమొకటె తనరును
స్థిరమయి , వి. వే.

బ్రతుకులు , సంసారబంధములు , తన తెలివీ మాయలే. కర్మ మొక్కటే స్థిరమైనది . పై మాయ లాత్మజ్ఞానమువలన నశించును

Life, bondage, intelligence are all illusory. Only karma is real. With the knowledge about aatma all the illusions can be dispelled.

728
మర్మమెఱుగలేక మతములు కల్పించి ఉర్విజనులు దుఃఖమొందుచుండ్రు గాజుటింటి కుక్క కళవళపడురీతి , వి. వే.

మర్మమెఱుగలేక మతములు కల్పించి
ఉర్విజనులు దుఃఖమొందుచుండ్రు
గాజుటింటి కుక్క
కళవళపడురీతి , వి. వే.

జనులు ఆత్మ తత్త్వము ఎరుగలేక మతములు కల్పించి అద్దపు టింటిలో కుక్క తన నీడ చూచి కలతపడినట్లు బాధపడుచుందురు

Men not realizing the true knowledge of aatma created religions. They are confused like a dog seeing its reflections inside a house of mirrors.

729
మాట నిలుపలేని మహితుండు చండాలుడు ఆజ్ఞలేని నాధు డాడుముండ మహిమలేని వేల్పు మంటిజేసిన పులి, వి. వే.

మాట నిలుపలేని మహితుండు చండాలుడు
ఆజ్ఞలేని నాధు డాడుముండ
మహిమలేని వేల్పు మంటిజేసిన
పులి, వి. వే.

మాట నిలకడ లేనివాడు నీచుడు . ప్రభువై ఆజ్ఞ చేయలేని రాజు పనికిమాలినవాడు . మహత్తులేని దేవుడు మట్టిపులివలె నిరుపయుక్తుడు

A person who can't stand on his word is a low-life. A ruler who can't give orders is unfit to be a king. A deity who can't give boons is like a toy tiger and is useless.

730
మాటలోనివాని మహిమ దాదెలియక మాట తెలియలేక మమత జిక్కె మాట తెలిసెనేని మహితుడు యోగియౌ , వి. వే.

మాటలోనివాని మహిమ దాదెలియక
మాట తెలియలేక మమత జిక్కె
మాట తెలిసెనేని మహితుడు
యోగియౌ , వి. వే.

గురువు చెప్పిన మాటలోని మహిమను , మాటను తెలియక మమతకు లోబడరాదు . గురువాక్యములోని మేలు తెలిసినవాడే గొప్ప యోగి

One has to listen to guru and not get entrapped in bondage. A true yogi is one who grasps the words of guru.

731
మానసమున మంచి మల్లెపూలచవికె బావితోటజేసి బాలగూడి భోగినయ్యెదనన బోయె బోకాలంబు , వి. వే.

మానసమున మంచి మల్లెపూలచవికె
బావితోటజేసి బాలగూడి
భోగినయ్యెదనన బోయె
బోకాలంబు , వి. వే.

తోటలో బావి త్రవ్వి , మల్లెపందిరిలో యువతితో వినోదింతునను ఊహతోనే కాలము గడుచును . పని సాగదు . అట్లే ప్రయత్నించినగాని ఊహాలతో ముక్తి రాదు

One day-dreams that he can dig a well in the backyard and live happily for ever with a young woman in the orchid. It is not possible without effort. So is salvation for which one has to work hard without falling into delusions.

732
మాయ జగమటంచు మనుజులు చెప్పేరు మాయకాదు కర్మమయముగాని మాయయైన జగము మరియేడనున్నదో , వి. వే.

మాయ జగమటంచు మనుజులు చెప్పేరు
మాయకాదు కర్మమయముగాని
మాయయైన జగము మరియేడనున్నదో,
వి. వే.

కర్మము సంగతి తెలిసికొనలేక జగత్తు మాయ యని జనులు చెప్పుకొందురు . మాయ యనుట భ్రాంతి . కర్మయే మూలము

Without knowing the law of karma, people say the world is an illusion. They are deluding themselves. Karma is the root cause.

733
మాయ జగములోని మమకారవృత్తిచే మాయ దగిలి మనసు మంకువిడక మదపుజేతచేత మహితులెట్లవుదురు ? వి. వే.

మాయ జగములోని మమకారవృత్తిచే
మాయ దగిలి మనసు మంకువిడక
మదపుజేతచేత మహితులెట్లవుదురు?
వి. వే.

నరులు మాయా ప్రపంచమున మమతకు చిక్కి మూర్ఖత్వమును దుష్కర్మలు చేయుచుందురు . వారు ఉత్తములు కాజాలరు

Foolish men perform bad acts after being held in bondage in this world which is an illusion. They can't be virtuous.

734
మాయను చెఱసాల మనసను గొలుసులు భేదమనెడి బొండ బెరసియుండు ఇట్టి కర్మబద్ధు డెన్నడు ముక్తుడౌ ? వి. వే .

మాయను చెఱసాల మనసను గొలుసులు
భేదమనెడి బొండ బెరసియుండు
ఇట్టి కర్మబద్ధు డెన్నడు
ముక్తుడౌ ? వి. వే .

మాయయే ఖైదు . మనస్సే కట్టుగొలుసులు . భేదబుద్ధియే బొండకొయ్య . ఈ మూడు జనుని కర్మబద్ధుని చేయును . ఇట్టివానికి ముక్తి కలుగదు

Illusory world is the prison. Mind is the chains that restrict freedom. Discrimination is the lug that has to be pulled with effort. These three bind one to karma without the possibility of salvation.

735
మాలయంటనుచును మఱి నీళ్ళ మునిగిరి మాలకర్మచేత మాలడాయె ఏల తెలియలేరొ యీ నరపశువులు ? వి. వే.

మాలయంటనుచును మఱి నీళ్ళ
మునిగిరి మాలకర్మచేత మాలడాయె
ఏల తెలియలేరొ యీ
నరపశువులు ? వి. వే.

మాలను తాకితినని శుద్ధికై స్నానము చేయుదురు వాడు కర్మవశమున మాలవాడయ్యెనని , అంటు లేదని ఏల గ్రహింపరో తెలియకున్నది

Some people take a bath when they touch a low-caste person. A person is born into low caste because of karma only.

736
మాలవాని యంటు మంచినీళ్ళను బోవు తురకవాని యంటు త్రుళ్ళిపోవు మ్రుచ్చువాని యంటు చచ్చిన బ్రోవునా ? వి. వే.

మాలవాని యంటు మంచినీళ్ళను బోవు
తురకవాని యంటు త్రుళ్ళిపోవు
మ్రుచ్చువాని యంటు చచ్చిన
బ్రోవునా ? వి. వే.

మాలవాని యంటు, తురక యంటు స్నానమున పోవునేమో కాని మోసగాని యంటు ఎన్నటికిని పోదు . వానిని దరి చేర్చరాదు

The contact with a low-caste person or a muslim may be cleansed but not so when one contacts a deceitful person.

737
ముక్కుపట్టి ఈడ్చు ముండను చేపట్టి తిక్కయెత్తి నరుడు తిరుగుచుండు ఎక్కడి తలిదండ్రు లేమైన తనకేల? వి. వే.

ముక్కుపట్టి ఈడ్చు ముండను చేపట్టి
తిక్కయెత్తి నరుడు
తిరుగుచుండు ఎక్కడి తలిదండ్రు
లేమైన తనకేల? వి. వే.

గయ్యాళి భార్యను కట్టుకొన్నవాడు పిచ్చియెత్తినట్లు తిరుగును . వానికి తలిదండ్రుల సంగతి అక్కరలేదు

A person married to a shrew roams around insanely. He doesn't care for his parents.

738
మీది యీకతీసి మిగుల పెద్దలమని కానరాక తిరుగు కర్మజనులు బయలు కోరినట్లు భావంబు గోరరు , వి. వే.

మీది యీకతీసి మిగుల పెద్దలమని
కానరాక తిరుగు కర్మజనులు
బయలు కోరినట్లు భావంబు
గోరరు , వి. వే.

తలను గొరిగించుకొని శుద్ధులమని కర్మబద్ధులనుకొందురే కాని, బయట శుద్ధి వారికి భావములో ఉండదు

Men delude that with tonsured heads and performance of karma, they are pious. The external purity is not reflected in their thoughts.

739
ముక్తి ఎవరి సొమ్ము ముక్కుమీదుగజూడ భక్తి ఎవరిసొమ్ము భజనచేయ శక్తి ఎవరి సొమ్ము యుక్తిచే సాధింప , వి. వే.

ముక్తి ఎవరి సొమ్ము ముక్కుమీదుగజూడ
భక్తి ఎవరిసొమ్ము
భజనచేయ శక్తి ఎవరి సొమ్ము యుక్తిచే
సాధింప , వి. వే.

భక్తి, శక్తి , ముక్తులకు దైవానుగ్రహమే కారణము . మనుష్యుని ప్రయత్నమువల్ల ప్రయోజనము లేదు

Devotion, energy and salvation are possible with God's help. There is no use in performing karma.

740
ముక్తులకు నేలపెట్టడు మూర్ఖజనుడు దూదిమూటను బోలిన దొడ్డకడుపు నించుచుండును సతమని నిత్యముగను కడుపు తన్నుద్ధరించునే వేమ

ముక్తులకు నేలపెట్టడు మూర్ఖజనుడు
దూదిమూటను బోలిన దొడ్డకడుపు
నించుచుండును సతమని నిత్యముగను
కడుపు తన్నుద్ధరించునే వేమ

మూర్ఖుడు తానే శాశ్వతమనుకొని తన పెద్ద పొట్ట నింపుకొనునే కాని సన్యాసులకు కొంచెమైనను పెట్టడు . తన దేహము స్థిరమా?

A foolish person who thinks he will live for ever, feeds himself copiously without sharing with mendicants. Is his body permanent?

741
ముండజూచినంత మొగమోటవినిగండ్రు ముండకూడు తినక ముక్తిలేదు ముండకూడు పాపమూలంబుకాదొకో , వి. వే.

ముండజూచినంత మొగమోటవినిగండ్రు
ముండకూడు తినక ముక్తిలేదు
ముండకూడు పాపమూలంబుకాదొకో,
వి. వే.

మూర్కులు ఉంపుడుకత్తెతోనే యుండి, దాని కూడే ముక్తి మార్గమని తలుతురు . అది పాపమూలమని గ్రహింపలేరు

A foolish person spends time with a mistress thinking she can show the path to salvation. He won't realize it is sinful.

742
ముండల తగుగోష్ఠి మునుగుచుదేలుచు విడువలేరు సుమ్మి వెఱ్ఱి నరులు అండబాయు వెనుక నన్నియుబోవురా ! వి. వే.

ముండల తగుగోష్ఠి మునుగుచుదేలుచు
విడువలేరు సుమ్మి వెఱ్ఱి
నరులు అండబాయు వెనుక
నన్నియుబోవురా ! వి. వే.

బుద్ధిహీనులు జారిణులతోనే కాలము గడుపుచుందురు . వారు తమ్ము విడిచిన వెనుక అన్నియు పోవుట నెరుగరు

A foolish person prefers to bide time with an adulteress. He doesn't realize death will take away all of his possessions.

743
ముదిత అడవినుంచి మునులేడి వెన్న ౦టె రామచంద్రుకంటె రసికుడేడి ? పొలుపు తొలగువేళ బుద్ధులట్లు౦డురా! వి. వే.

ముదిత అడవినుంచి మునులేడి వెన్న
౦టె రామచంద్రుకంటె రసికుడేడి?
పొలుపు తొలగువేళ బుద్ధులట్లు౦డురా!
వి. వే.

ఆపదలు రాగలప్పుడు బుద్ధులు పనిచేయవు . శ్రీరాముడు సీత నడవిలో దిగవిడిచి లేడివెంట పరుగెత్తెను కదా!

When accidents happen the mind won't function. Lord Rama left behind his wife Sita alone in the forest to hunt a deer.

744
మునిజనములు కలగ మునిగి వెళ్ళిన బావి బ్రహ్మకు దలనెత్తరాని బావి మొలలబంటిగాను ముంచు నెవ్వనినైన , వి. వే.

మునిజనములు కలగ మునిగి వెళ్ళిన
బావి బ్రహ్మకు దలనెత్తరాని
బావి మొలలబంటిగాను ముంచు
నెవ్వనినైన , వి. వే.

సంసారకూపము మొలబంటిగా నున్నను జనులను ముంచివైచును . మునులు, దేవతలుకూడ అందు మునిగిపోవుదురు

Bondage even if enjoyable restricts one's freedom. Even gods and sages fell into the ocean of bondage.

745
మును తెలిసినవారు మొగి నష్టమైరిల తిరిగి చెప్పితనుచు తిట్టవలదు తెలియజెప్పువాడ దెలియుము కర్మంబు , వి. వే.

మును తెలిసినవారు మొగి నష్టమైరిల
తిరిగి చెప్పితనుచు తిట్టవలదు
తెలియజెప్పువాడ దెలియుము
కర్మంబు , వి. వే.

“ఇదివరకు తెలిసికొన్నవారు నశించిరికాన నాకు చెప్పవద్దు" అని అనవద్దు . బంధమునకు కర్మమే కారణమను నా మాట వినుము

Don't say: even the people who knew about karma perished; so why fret over it? Karma is responsible for bondage.

746
మురికి కొంపలోన నిరికించ జీవుని కర్మపాశములను గట్టివేసి నిట్టి కర్మజీవి కెట్లొకో మోక్షంబు ? వి. వే.

మురికి కొంపలోన నిరికించ జీవుని
కర్మపాశములను గట్టివేసి
నిట్టి కర్మజీవి కెట్లొకో
మోక్షంబు ? వి. వే.

జీవుని మురికి శరీరములో కర్మపాశములతో కట్టి పడవేసినచో మోక్షమెట్లు కలుగును?కర్మబంధములను త్రెంపవలెను

How can a man attain salvation when his body is tied to the bonds of karma? One has to break the threads binding karma to oneself.

747
మురికి తోలుక ౦త మూలంబె మదిచింత నరకమబ్బ జెంత నలుగుడెంత పరము గోరినంత బయలగు నీవింత , వి. వే.

మురికి తోలుక ౦త మూలంబె
మదిచింత నరకమబ్బ జెంత నలుగుడెంత
పరము గోరినంత బయలగు
నీవింత , వి. వే.

దేహధారులకు మనస్సున విచారమే కల్గును . నలుగుడువల్ల విచారమే కల్గును . పరమును కోరినపుడే ఈ విషయము వెల్లడగును

Men are filled with sorrow because of life's travail. This is revealed when they are desirous of nether world.

748
మురికిలోనబుట్టె మురికిలోనె పెరిగె మురికి తనువుకింత మురిపెమేల ? మురికెరు౦గు నతడు మురికిలో పుట్టునా , వి. వే.

మురికిలోనబుట్టె మురికిలోనె
పెరిగె మురికి తనువుకింత మురిపెమేల?
మురికెరు౦గు నతడు మురికిలో
పుట్టునా , వి. వే.

శరీరము మురికిలో పుట్టి మురికిలో పెరుగును . గొప్పగా ఎంచనేల?తత్త్వ మెరిగినవాడు మురికిలో తిరిగి జన్మించడు

Body is formed from the 5 elements (earth, water, air, space, fire) and falls back into the 5 elements at the time of death. Why be proud of it? A man with true knowledge won't be reborn with the 5 elements.

749
మూటి నీషణముల మొదలంట చెఱుపక చిత్తమేల నిలుచు స్థిరముగాను ? చిత్తశుద్ధిలేక శివుడు కాన్పించునా ? వి. వే.

మూటి నీషణముల మొదలంట చెఱుపక
చిత్తమేల నిలుచు స్థిరముగాను?
చిత్తశుద్ధిలేక శివుడు
కాన్పించునా ? వి. వే.

దారేషణ , ధనేషణ, పుత్రేషణ అను మూడు కోరికలను నశింపజేయక మనస్సు స్థిరముగా నిలువదు . మనస్సు స్థిరముగా లేనియెడల భగవంతుని చూడలేము

Mind won't be still without giving up the love of wife, wealth and sons. One can't realize god without a still mind.

750
మూడుగుణము లొకట మొదలనె యుండగా కలిపి మూలబెట్టి తెలివిలేక భ్రమల జిక్కు కర్మి బలువెఱ్ఱివాడురా! వి. వే.

మూడుగుణము లొకట మొదలనె యుండగా
కలిపి మూలబెట్టి తెలివిలేక
భ్రమల జిక్కు కర్మి బలువెఱ్ఱివాడురా!
వి. వే.

సత్త్వరజస్తమో గుణములు తొలుతనుండియూ ఉండగా, వానిని సరిచేసికోలేక భ్రమలలో పడువాడు పెద్ద మూర్ఖుడు

The 3 gunas (sattva=calm, rajas=activity, tamas=indolence) have been there for ever. A foolish person is ignorant of them and lives in delusion.

751
మూఢభక్తిచేత ముక్కంటి పూజింప మున్ను బోయవరుడు ముక్తుడాయె పూజకేమి ? తనదు బుద్ధిప్రధానము , వి. వే

మూఢభక్తిచేత ముక్కంటి పూజింప
మున్ను బోయవరుడు ముక్తుడాయె
పూజకేమి ? తనదు బుద్ధిప్రధానము,
వి. వే

తొల్లి తిన్నడను బోయ (వాడు) మూఢ భక్తితో శివుని పూజించి ముక్తి పొందెను . పూజ యెట్టిదైన నేమి? బుద్ధియే ప్రధానము

A hunter called Timma prayed to God with blind faith and attained salvation. Pooja is irrelevant when character is good.

752
మూల మెవ్వరనుచు ముగ్గురిలోగల మూల మెఱుగలేరు మూఢజనులు మూలమంతటికిని ముఖ్యము కర్మము, వి. వే.

మూల మెవ్వరనుచు ముగ్గురిలోగల
మూల మెఱుగలేరు మూఢజనులు
మూలమంతటికిని ముఖ్యము
కర్మము, వి. వే.

త్రిమూర్తులలో ఎవరు ముఖ్యులని జనులు తగవులాడుదురు . అంతకును కర్మమే మూలము . త్రిమూర్తులును దానికి లొంగిరి

Men fight over who is the greatest among Lord Vishnu, Lord Siva and Lord Brahma. For all of them karma is the basis. Even the triumvirate had to obey the law of karma.

753
మూల విద్యయందు ముఖ్య తేజములోన మెలగు చిత్పరుండు మిహురు పగిది కాలకర్మములకు గాలుండె సాక్షిరా , వి. వే.

మూల విద్యయందు ముఖ్య తేజములోన
మెలగు చిత్పరుండు మిహురు
పగిది కాలకర్మములకు గాలుండె
సాక్షిరా , వి. వే.

వేదాంత విద్యనుబట్టి చిత్స్వరూపుడగు పరుడు తేజస్సుతో సూర్యునివలె ప్రకాశించుచుండును . అది తెలిసికొన్నచో కాలమునకు , కర్మకు యముడు సాక్షీభూతుడు మాత్రమే . పీడ కల్గి౦పడు

With the knowledge of Vedas the subtle form of God is resplendent like Sun. Lord Yama, the god of death, is only a witness to time and karma. He can't cause any harm.

754
మాట లుడుగకున్న మంత్రంబు దొరకదు మంత్రముడుగకున్న మది కుదరదు మనసు కుదురకున్న మఱి ముక్తిలేదయా , వి. వే.

మాట లుడుగకున్న మంత్రంబు దొరకదు
మంత్రముడుగకున్న మది
కుదరదు మనసు కుదురకున్న మఱి
ముక్తిలేదయా , వి. వే.

మౌనము లేనిచో మంత్రము పనిచేయదు . మంత్రమును విడువక మనస్సు నిలువదు . మనస్సు నిలిచిననేకాని ముక్తి లభింపదు

Without silent contemplation a mantra won't work. The mind will be fickle without a mantra. Salvation is only possible with an unwavering mind.

755
మొదటి తరువునందు మూడు కొమ్మలు పుట్టె ననలు కొనలు తీగ లాకు లమరె పువ్వు పిందె పండ్లు భువనముల్ నిండెరా , వి. వే.

మొదటి తరువునందు మూడు కొమ్మలు
పుట్టె ననలు కొనలు తీగ లాకు
లమరె పువ్వు పిందె పండ్లు
భువనముల్ నిండెరా , వి. వే.

ప్రకృతి వృక్షమునకు సత్త్వరజస్తమములు కొమ్మలు . ఇంద్రియములు పువ్వులు , పండ్లును . విశ్వసృష్టి ఒక మహావృక్షము వంటిది

The universe is like a huge (banyan) tree. Its branches are the 3 gunas (sattva=serene, rajas=activity, tamas=lethargy). The flowers and fruit are the senses.

756
మ్రుచ్చు యాత్రకేగ ముల్లె విడుచుగాని మ్రొక్కుబ్రొద్దులేదు మొనసి యెపుడు కుక్క యిల్లుచొచ్చి కుండలు మోయునా ,వి. వే.

మ్రుచ్చు యాత్రకేగ ముల్లె విడుచుగాని
మ్రొక్కుబ్రొద్దులేదు
మొనసి యెపుడు కుక్క యిల్లుచొచ్చి
కుండలు మోయునా ,వి. వే.

మూటలు విప్పుటకే దొంగ యాత్రకు పోవును . దేవుని చూచుటకు కాదు . కుక్క కుండలను దొర్లించునుగాని మోయునా ? (మోయలేదని భావము)

A thief goes on a pilgrimage not to pray to god but to steal. A dog can collapse a stack of pots but cannot arrange them into a stack.

757
యౌవనమున ఈశు ధ్యానమ్మును మది నిలుపనపుడు ముందునెగ్గ కర్మ చేయని యతనికి క్షితి సౌఖ్యమేదయా , వి. వే.

యౌవనమున ఈశు ధ్యానమ్మును
మది నిలుపనపుడు ముందునెగ్గ
కర్మ చేయని యతనికి క్షితి
సౌఖ్యమేదయా , వి. వే.

వయసున్నపుడు భగవంతుని మనస్సులో ధ్యానింపక మంచి పనులు చేయక సౌఖ్యమును కోరిన ఎట్లు కలుగును?

When one at a young age does not pray to god and perform good karma, but craves for comforts, how is it possible?

758
రాయియై అహల్య రాముపాదము సోకి ఆడుదయ్యెనందు రవనిజనులు చేయు సుకృతములు ఇట్లు శిలలైన తప్పవు , వి. వే.

రాయియై అహల్య రాముపాదము సోకి
ఆడుదయ్యెనందు రవనిజనులు
చేయు సుకృతములు ఇట్లు
శిలలైన తప్పవు , వి. వే.

రాయిగా ఉండిన అహల్య రాముని పాదము సోకి స్త్రీయైనదని అందురు . సుకృతమున్నచో రాళ్ళకైన మేలు కలుగును

It was believed that Lord Rama's touch with his feet resurrected Ahalya who was condemned to be a stone by her husband's curse. When there is good karma, even stones will be set free.

759
వలపుచూప మదిని వర్ణించి కానక వెతలజిక్కుచుండు వెఱ్ఱివాడు కులము గోరువాడు గుణహీనుడగువాడు , వి. వే.

వలపుచూప మదిని వర్ణించి కానక
వెతలజిక్కుచుండు వెఱ్ఱివాడు
కులము గోరువాడు గుణహీనుడగువాడు,
వి. వే.

స్త్రీ వలపు ప్రకటింపగా మూఢుడు లొంగి కన్నుగానక ప్రవర్తించి గుణహీనుడై , తా నుత్తమ కులుడనని గర్వించును

When a woman declares love, a foolish person behaves like a low-life, loses good qualities and deludes he is of superior caste.

760
వలలు పన్ని దుష్ట వన్యమృగంబుల పట్టవచ్చుగాని పాడుకర్మ గురుని బోధలేక కుదుట నొందదు సుమీ , వి. వే.

వలలు పన్ని దుష్ట వన్యమృగంబుల
పట్టవచ్చుగాని పాడుకర్మ
గురుని బోధలేక కుదుట
నొందదు సుమీ , వి. వే.

వలలు పన్ని క్రూరమృగములను పట్టుకొనవచ్చునేగాని గురూపదేశము లేనిదే దుస్సాధ్యములగు కర్మలను సాధింపలేము

Even though it is possible to trap wild animals with nets, it is impossible to escape the law of karma without the guidance of a guru.

761
వాక్కుచేత దప్పు వావులు వరసలు వాక్కుచేత దప్పు వనితగుణము వాక్కుచేత గల్గు వరకర్మములు భువి , వి. వే.

వాక్కుచేత దప్పు వావులు వరసలు
వాక్కుచేత దప్పు వనితగుణము
వాక్కుచేత గల్గు వరకర్మములు
భువి , వి. వే.

మాట చేతనే బంధుత్వము చెడును ; స్త్రీలకు చెడ్డ పేరు వచ్చును . సత్కార్యములు చేయుగల్గుటయు వాక్కు చేతనే

With bad speech, relationships sour and women get bad reputation. The ability to carry out good actions is because of one's speech.

762
వాగులడ్డుకట్టి వల్లకాడులు దున్ని మున్ను నడచుత్రోవ ము౦డ్లుగొట్టి పైరుపెట్టునట్టి పాపులు కలరొకో , వి. వే.

వాగులడ్డుకట్టి వల్లకాడులు
దున్ని మున్ను నడచుత్రోవ ము౦డ్లుగొట్టి
పైరుపెట్టునట్టి
పాపులు కలరొకో , వి. వే.

కొందరు పాపులు వాగులు, వంకలు బిగించి శ్మశానములను దున్ని , దారిలో ముండ్లు వేసియు పైరు పెట్టుచుందురు

Some sinful people build bridges across streams, plough burial grounds, cover pathways with thorns to carry out agriculture.

763
వాడుకులములేక వర్తించు మనుజుడు కర్మబద్ధుడగుచు ఘనతలేక లేనివానిబోలె దీనవాక్యములాడు , వి. వే.

వాడుకులములేక వర్తించు మనుజుడు
కర్మబద్ధుడగుచు
ఘనతలేక లేనివానిబోలె దీనవాక్యములాడు,
వి. వే.

పూర్వజన్మ దుష్కర్మల ఫలితముగ కర్మబద్ధులై కొందరు ఊరు పేరులేక తిరుగుచు దరిద్రులవలె దీనముగా పల్కుదురు

Because of bad karma in the previous lives, bound to the law of karma, some people roam around like paupers and conduct themselves in despair.

764
వానరాకడ మఱి ప్రాణంబుపోకడ కానబడదు కాలకర్మవశత గానబడినమీద కలి యిట్లు నడచునా ? వి. వే.

వానరాకడ మఱి ప్రాణంబుపోకడ
కానబడదు కాలకర్మవశత
గానబడినమీద కలి యిట్లు
నడచునా ? వి. వే.

వాన వచ్చుట , ప్రాణము పోవుట తెలియదు . కాలము , కర్మము కూడి అవి జరుగును . వాని సంగతి ముందుగా తెలిసినచో కలికాలము సవ్యముగనే ఉండెడిది

The onset of rain and the time of death cannot be known. It all depends on the law of karma. If one knew when they happen the kali yug would have been perfect.

765
విడువని మాయా కర్మము గడవగలేరైరి జనులు కడుచిత్రముగా సుడివడి పుట్టుచు జచ్చుచు కడతేరు గాంచుటెట్లు ఖలులకు వేమా !

విడువని మాయా కర్మము గడవగలేరైరి
జనులు కడుచిత్రముగా సుడివడి
పుట్టుచు జచ్చుచు కడతేరు
గాంచుటెట్లు ఖలులకు వేమా

మాయాకర్మమును గడచుట అసాధ్యము . పుట్టుచు చచ్చుచున్నను మూర్ఖులు ప్రయత్నింపక కడతేరలేకున్నారు

The illusory world functioning with law of karma cannot be overcome by ignorant people who are caught in the birth-death cycle.

766
వితరణు౦డు తానె విజ్ఞాన తపమూని మతికి గతియటంచు మాన్యబుద్ధి సతతమాత్మ కర్మ సందేహములు రోయు , వి. వే.

వితరణు౦డు తానె విజ్ఞాన తపమూని
మతికి గతియటంచు మాన్యబుద్ధి
సతతమాత్మ కర్మ సందేహములు
రోయు , వి. వే.

త్యాగి యగువాడు విజ్ఞానము నార్జించుకొని గౌరవముతో మెలగి కర్మరూప సందేహములను విడిచి కృతార్థుడగును

A generous person attains salvation by garnering true knowledge, conducting himself in a respectable way and clearing any doubts about the law of karma.

767
విత్తనంబు గురువు విశ్వంబునకులెల్ల ప్రణవమంత్రమరయ పరమ గురువు కర్మగురువుసుమ్ము గాయత్రి మంత్రంబు , వి. వే.

విత్తనంబు గురువు విశ్వంబునకులెల్ల
ప్రణవమంత్రమరయ పరమ
గురువు కర్మగురువుసుమ్ము గాయత్రి
మంత్రంబు , వి. వే.

విశ్వమునకు మూలకారణము గురువు . ఓంకారము పరమ గురువు. కర్మలనుండి కడతేర్చు గురువు గాయత్రీ మంత్రము

The root cause of the world is guru. The mantra Om is a supreme guru. The ultimate guru is the Gayatri mantra.

768
విత్తును నుముకయు తమలో బొత్తున పుట్టగను పొట్టు పోయిన భంగిన్ వేత్తగునాతని కర్మం బత్తెఱగున గడచి చనును ననువుగ వేమా!

విత్తును నుముకయు తమలో బొత్తున
పుట్టగను పొట్టు పోయిన భంగిన్
వేత్తగునాతని కర్మం బత్తెఱగున
గడచి చనును ననువుగ వేమా

విత్తుతో పొట్టునట్లు మానవుని కర్మ అంటియుండును. దంచినచో పొట్టు (chaff ) పోవునట్లు సద్గురూపదేశమున కర్మబంధము పోవును

Like the chaff around a grain, karma is bound to one. The chaff will be separated when the grain is pounded. Similarly with the teaching of a virtuous guru, man will be freed from karma.

769
వ్రాత వెంటగాని వరమీడు దైవంబు చేతకొలదిగాని వ్రాతరాదు వ్రాత కజుడుకర్త చేతకు దాగర్త , వి. వే.

వ్రాత వెంటగాని వరమీడు దైవంబు
చేతకొలదిగాని వ్రాతరాదు
వ్రాత కజుడుకర్త చేతకు
దాగర్త , వి. వే.

మనము చేసిన పనినిబట్టి వ్రాత ఉండును . వ్రాతనుబట్టియే దేవుడు వరమిచ్చును . చేత మన యధీనము . వ్రాత దైవాధీనము

Our fate depends on our actions. Accordingly god gives boons. Only action is in our control. Fate is in the hands of God.

770
శనియె చాలదనుచు ననిరట కొందఱు శనికి జాలనిదది కనగలేరు కర్మఫలమె మిగుల కష్టముల్ గడుపును , వి. వే.

శనియె చాలదనుచు ననిరట కొందఱు
శనికి జాలనిదది కనగలేరు
కర్మఫలమె మిగుల కష్టముల్
గడుపును , వి. వే

శనిదశ బాగులేక కష్టములు కల్గెనని కొందరందురు . దానిని మించినదానిని గ్రహింపలేరు . కర్మఫలము వల్లనే కష్టములు కలుగుచున్నవి

Some people claim because of negative influence from Saturn, difficulties arise in life. All of life's difficulties are due to the law of karma.

771
సతిని చూచి చూచి సౌఖ్యంబు దాగోరు గతిని కానలేడు కర్మజీవి గతులు సతులవలన గానంగ లేరుగా , వి. వే .

సతిని చూచి చూచి సౌఖ్యంబు
దాగోరు గతిని కానలేడు కర్మజీవి
గతులు సతులవలన గానంగ
లేరుగా , వి. వే .

భార్యను చూచి ఆమెవలన సౌఖ్యమును పొందవలెనని తలతురేకాని కర్మజీవులు తమ గతిని గూర్చి యోచింపరు . సతీమూలమున గతి కలుగదు కదా!

A man looks forward to enjoying comforts from his wife, rather than salvation achieved with good karma. One can't obtain salvation because of one's wife.

772
సుతులచేత పుణ్యసుఖము నొందుదునని మనుజుడుండు కర్మమతము తగిలి ఏనుగు పడియున్న నెత్తునా మశకంబు? వి. వే.

సుతులచేత పుణ్యసుఖము నొందుదునని
మనుజుడుండు కర్మమతము
తగిలి ఏనుగు పడియున్న నెత్తునా
మశకంబు? వి. వే.

కర్మబద్ధుడైన మానవుడు పుత్రులవల్ల పుణ్యగతులు కల్గునని భ్రాంతిపడును. కాని, ఏనుగు పడిన దోమ యెత్తగలదా ?

Obeying the law of karma, a man thinks he can attain salvation with the help of his sons. Can a mosquito lift up an elephant that has fallen on the ground?

773
సతుల జూడజూడ సంసారి కాగోరు సుతులు పుట్టపుట్ట వెతలబడును గతులు చెడగచెడగ కర్మమంచేడ్చును , వి. వే.

సతుల జూడజూడ సంసారి కాగోరు
సుతులు పుట్టపుట్ట వెతలబడును
గతులు చెడగచెడగ కర్మమంచేడ్చును,
వి. వే.

నరుడు స్త్రీని చూచి సంసారి కాగోరును . బిడ్డలు పుట్టగా బాధ లొందును . గతులు చెడగా , ఆజ్ఞుడై "నా కర్మము" అని యేడ్చును

A man is desirous of family when he marries a woman. He becomes melancholic after children are born. When things get rough he weeps and blames the law of karma being ignorant.

774
సేతువందు మునుగ క్షితి కాకి తెలుపౌనె ? కాశికేగి గ్రద్ద గరుడుడౌనె ? బదరి కరుగ వృద్ధు బాలుడు కాడయా , వి. వే.

సేతువందు మునుగ క్షితి కాకి
తెలుపౌనె ? కాశికేగి గ్రద్ద
గరుడుడౌనె ? బదరి కరుగ వృద్ధు
బాలుడు కాడయా , వి. వే.

సేతువులో మునిగిన కాకి తెల్లగా కాదు . కాశికి పోయిన గ్రద్ద గరుడుడు (vishnu వాహనం ) కాలేదు . అట్లే బదరికేగిన ముసలివాడు బాలుడు కాలేడు

A crow cannot become white by dipping in water; a kite cannot become Lord Vishnu's conveyance (Garuda) by going to Kasi; similarly an old man going on a pilgrimage to Badari cannot transform into a younger person

775
స్థిరులుగాక క్షుద్రజీవులలో జేరి ఎచ్చుతగ్గులందు హీనమతులు గాడ్దెపిల్లలగుచు గ్రక్కున చెడుదురు , వి. వే.

స్థిరులుగాక క్షుద్రజీవులలో
జేరి ఎచ్చుతగ్గులందు హీనమతులు
గాడ్దెపిల్లలగుచు గ్రక్కున
చెడుదురు , వి. వే.

హీనబుద్ధులు స్థిరులుకాక నీచులలో చేరి ఎక్కువ తక్కువలు పొందుచు౦దురు . గాడిదపిల్లలవలె చెడిపోవుచుందురు

Low lives being fickle join hands with bad company and reap the karma.

776
హరి విధి సురమును లాదిని మెఱిసియు జన్మించి పిదప మేలులకెడగా జరయందు మరణమందును వరుసన్ వర్తిలిరి కర్మవాసన వేమా!

హరి విధి సురమును లాదిని మెఱిసియు
జన్మించి పిదప మేలులకెడగా
జరయందు మరణమందును వరుసన్
వర్తిలిరి కర్మవాసన వేమా

బ్రహ్మ, విష్ణువు , దేవతలు , మునులు – అందరును కర్మవాసన తప్పించుకొనలేకున్నారు . మానవమాతృ లెట్లు తప్పించుకొనగలరు?

Even Lord Brahma, Lord Vishnu, gods and sages could not escape the law of karma. How can human beings not submit to the law of karma?

778
హంస మానసోదకమంటక తిరిగిన యట్లు కర్మచయము నంటకుండు యోగి తిరుగు సకల భోగముతోడను , వి. వే.

హంస మానసోదకమంటక తిరిగిన
యట్లు కర్మచయము నంటకుండు
యోగి తిరుగు సకల
భోగముతోడను , వి. వే.

హంస మానస సరస్సులో నీటి నంటక తిరుగునట్లు యోగి కర్మల నంటకుండ తిరిగి ఆత్మానందము అనుభవించును

A swan swims in Maanas Sarovar (lake) without getting wet. Similarly a yogi transcends karma and revels in the pleasure of knowing his aatma.

779
హేమనగము చేత నెప్పుడు కలవాడు వెండికొండపైని వెలయువాడు ఎత్తవలసె బిచ్చ మేమనవచ్చురా ? వి. వే.

హేమనగము చేత నెప్పుడు కలవాడు
వెండికొండపైని వెలయువాడు
ఎత్తవలసె బిచ్చ
మేమనవచ్చురా ? వి. వే.

శివుని విల్లు బంగారు కొండయైన మేరువు , నివాసము వెండి కొండయగు కైలాసము . అయినను అతడు బిచ్చమెత్తుట తప్పలేదు. కర్మానుభవము ఈశ్వరునికిని తప్పదు .

Lord Siva's bow is the golden mountain Meru; his abode, is silver mountain Kailas; despite these, he had to beg. Even he had to obey the law of karma.

No comments:

Post a Comment