Saturday, February 8, 2020

Moha-Paddati


886
అంతరంగమందు నభువునుద్దేశించి నిల్పి చూడ జూడ నిల్చుగాక బాహ్యమందు శివుని భావింప నిల్చునా ? వి. వే.

అంతరంగమందు నభువునుద్దేశించి
నిల్పి చూడ జూడ నిల్చుగాక
బాహ్యమందు శివుని భావింప
నిల్చునా ? వి. వే.

మనస్సులో పరమేశ్వరుని నిల్పి స్థిరముగా అర్చింపగా ఆత్మసిద్ధి యగును. బయటి స్తుతివలన మేలు కలుగజాలదు

By fixating on Lord Iswara in the mind and meditating over him it is possible to attain salvation. There is no use in praising him without meditation.

887
అది యొకటి తెలిసి యాదిని మదినిల్పి అది పాయకున్న నభువుడగును అది పాయువాడికంధుని రీతిరా , వ. వే.

అది యొకటి తెలిసి యాదిని
మదినిల్పి అది పాయకున్న
నభువుడగును అది పాయువాడికంధుని
రీతిరా , వ. వే.

మోక్షమునకు మూలమైన బ్రహ్మస్వరూపామును తెలిసికొని; మనస్సున నిల్పిన బ్రహ్మతత్త్వమును పొందవచ్చును . అట్లు లేనిచో మనుజుడు గ్రుడ్డివానితో సమానుడు

One has to know that the creator is the basis for salvation and attain such knowledge. Without such knowledge a person is blind.

888
అధరసుధను జూచి యన్నియు మఱచును తరుణి రూపు చూచి తన్ను మఱచు ఉక్తులాలకించి యోగంబు మఱచురా , వి. వే.

అధరసుధను జూచి యన్నియు మఱచును
తరుణి రూపు చూచి తన్ను
మఱచు ఉక్తులాలకించి యోగంబు
మఱచురా , వి. వే.

మనుజుడు మోహమునబడి స్త్రీ సౌందర్యమును చూచి తన్ను మరచును . అధరామృతము గ్రోలి అన్నియు మరచును . మాటలు విని యోగము మరచును

Man falls in love with a woman's beauty and forgets himself. He forgets everything by lusting on her lips like amrita (elixir). By listening to her, he forgets yoga.

889
అరసి సూక్ష్మమైన యానంద మెఱుగక మతియు లేక చదివి మందుడయ్యె అల రహస్య మెల్ల నాత డెట్లఱుగును , వి. వే.

అరసి సూక్ష్మమైన యానంద మెఱుగక
మతియు లేక చదివి మందుడయ్యె
అల రహస్య మెల్ల నాత
డెట్లఱుగును , వి. వే.

ముగ్దుడు సూక్ష్మమైన జ్ఞానానంద మెరుగక గ్రంధములు చదివి చదివి మందుడే అగును . సరియైన బుద్ధి లేనిచో బ్రహ్మరహస్యమును తెలిసికొన సాధ్యము కాదు

One by reading tomes becomes a dunce by not knowing the bliss from knowledge about aatma. Without suitable disposition it is not possible to see the secrets of the creator.

890
అన్నరసము వలన నల బిందు రసమయ్యె బిందు రసమువలన బీజమయ్యె బిందు బీజములను భేదించి చూడరా, వి. వే.

అన్నరసము వలన నల బిందు రసమయ్యె
బిందు రసమువలన బీజమయ్యె
బిందు బీజములను భేదించి
చూడరా, వి. వే.

అన్నమువలన రేతస్సు , దానివల్ల జీవాణువులు పుట్టును . ఆ రెంటిని వేర్వేరుగా విభజించి , వాని తత్త్వమెరుగ యత్నింపుము

One sows the seeds of life because of food thereby giving raise to life.

891
అభవుననుభవమున నార్గురరులు నీల్గ సంశయంబు లేదు సాధకులకు జెంత దీపమిడక చీకటి పోవునా? వి. వే.

అభవుననుభవమున నార్గురరులు
నీల్గ సంశయంబు లేదు
సాధకులకు జెంత దీపమిడక
చీకటి పోవునా? వి. వే.

ఈశ్వరానుభవము కల్గిన సాధకునకు కామక్రోధాది శత్రువులు నశించుటలో సంశయము లేదు . దీపమున్నచో చీకటి నశించును

By experiencing Lord Iswara one can over-power lust and anger. There is no doubt. In light perishes the darkness.

892
అమృత సాధనమున నందఱు బలిసెద అమృత మె౦చి చూడ నందలేరు అమృతము విషమాయె నదియేమి చిత్రమో , వి. వే.

అమృత సాధనమున నందఱు బలిసెద
అమృత మె౦చి చూడ నందలేరు
అమృతము విషమాయె నదియేమి
చిత్రమో , వి. వే.

అమృతపానమున బలము కల్గును . కాని అది లభించుటయే కష్టము . ఆ అమృతమే ఒకప్పుడు విషమగును

The devas fought with demons to generate Amrita. It endows one with longevity and strength. But it is hard to find on earth. Sometimes it can become the poison.

893
అరయు గంటి దృష్టి గుఱిగను ముక్కుపై రెప్పపడక గ్రుడ్లు త్రిప్పినట్టి వివరమెఱుగ శాంభవీముద్ర యదియండ్రు , వి. వే.

అరయు గంటి దృష్టి గుఱిగను ముక్కుపై
రెప్పపడక గ్రుడ్లు త్రిప్పినట్టి
వివరమెఱుగ శాంభవీముద్ర
యదియండ్రు , వి. వే.

దృష్టిని ముక్కుచివర నిల్పి రెప్పవేయక శివుని ధ్యానించుటయే శాంభవీముద్ర . అది ముక్తి సాధనమైనది

The Sambhavi posture is to focus eyes on the nose tip without blinking by meditating over Lord Siva. It is useful for salvation.

894
అలవికాని బయలునందిన మదిజూడ గూడి మెలగుచుండ గోచరించు జూడ జూడ నెఱుక చోద్యమై తోచురా , వి. వే.

అలవికాని బయలునందిన మదిజూడ
గూడి మెలగుచుండ గోచరించు
జూడ జూడ నెఱుక చోద్యమై
తోచురా , వి. వే.

అసాధ్యమగు ఆకాశరూపమున మనస్సు చేర్చి ఎల్లపుడు పరికించినచో చిత్రముగా బ్రహ్మము సాక్షాత్కరించును

By doing the impossible thing of merging mind with the space, and searching for him, the creator will appear.

895
అష్టకష్టములకు నాలయమై యుండి గతుల దుర్గతులను గన్నెదెదియొ కానకుండబోయె గగన స్వరూపమై , వి. వే.

అష్టకష్టములకు నాలయమై యుండి
గతుల దుర్గతులను గన్నెదెదియొ
కానకుండబోయె గగన
స్వరూపమై , వి. వే.

శరీరమెన్నో కష్టములు పొంది , మంచిచెడ్డలకు లోనై , చివరకు ఆకాశమున కలిసిపోవుచున్నది . మోహమున దీని నెరుగకున్నాము

Body disintegrates after experiencing difficulties, good and bad. We are not able to realize because of love (of life).

896
అక్షయాత్మకంబు అర్ధింప గుఱిగని నిశ్చలంబుగాను నిలిపి మనసు రక్షకట్టినట్లు రట్టడి మాన్పరా , వి. వే.

అక్షయాత్మకంబు అర్ధింప గుఱిగని
నిశ్చలంబుగాను నిలిపి
మనసు రక్షకట్టినట్లు రట్టడి
మాన్పరా , వి. వే.

అవ్యయమగు బ్రహ్మమును గురిగా నుంచుకొని మనస్సును బంధించి రక్ష కట్టినట్లు మనోవికారము నడ్డగించిన సిద్ధి కలుగును

By fixating the mind over the immutable creator and avoiding distractions one can attain salvation.

897
అస్థిరమగు మేని కదరిపాటుల బొంది పెక్కు విధములందు బెంచి బెంచి అగ్ని కిచ్చు ; లేక యడవి నక్కల కిచ్చు , వి. వే.

అస్థిరమగు మేని కదరిపాటుల బొంది
పెక్కు విధములందు బెంచి
బెంచి అగ్ని కిచ్చు ; లేక యడవి
నక్కల కిచ్చు , వి. వే.

మూఢులు స్థిరముకాని దేహమునకై ఎన్నో శ్రమలు పొంది , పెంచి, చివరికి అగ్నిపాలో , నక్కలపాలో చేయుటను తెలిసికొనలేరు

Foolish people don't realize that their bodies will be burnt or eaten away by wild animals after experiencing much strife in life for the sake of their bodies.

898
ఆకు కానవచ్చు హరిహరాదులకైన కొమ్మకానరాదు కోరిచూడ గొమ్మగానరాక కొనియాడుకొందురా? వి. వే.

ఆకు కానవచ్చు హరిహరాదులకైన
కొమ్మకానరాదు కోరిచూడ
గొమ్మగానరాక కొనియాడుకొందురా?
వి. వే.

బ్రహ్మాండ వృక్షమునకు బ్రహ్మము కొమ్ము, ఆకులు మాయ . హరిహరాదులును ఆకు చూతురేకాని కొమ్మ చూడలేరు . కొమ్మను చూడక కృతార్ద్ధులు కాలేరు ; కైవల్యమును పొందలేరు

For the tree of universe, the Lord Brahma is the branches and leaves are the Lord Vishnu and Lord Siva. One sees the leaves but not the branches. It is not possible to attain salvation without realizing this.

899
అండుదనగ రోత , యది చూడగా రోత తలచి చూడ దనకు దానె రోత ఎంత వారికైన నింతియే బల్ ఘాత , వి. వే.

అండుదనగ రోత , యది చూడగా
రోత తలచి చూడ దనకు దానె
రోత ఎంత వారికైన నింతియే
బల్ ఘాత , వి. వే.

ఆజ్ఞులు స్త్రీ మోహమున పడుదురుగాని - స్త్రీ దాని అంగములు రోత . ఆలోచింప తన దేహమే తనకు రోత , యువతి ఉపద్రవము కల్గి౦చును

Ignorant people fall in love with women even though their bodies give raise to depression. Lusting over young women creates bad consequences.

900
ఆత్మబుద్ధివలన అఖిలంబు తానయ్యె జీవబుద్ధివలన జీవుడయ్యె మోహబుద్ధివలన ముదితలు దర్శించె , వి. వే.

ఆత్మబుద్ధివలన అఖిలంబు తానయ్యె
జీవబుద్ధివలన జీవుడయ్యె
మోహబుద్ధివలన ముదితలు
దర్శించె , వి. వే.

ఆత్మభావనవల్ల తానే పరమాత్మయగును . జీవబుద్ధివల్ల జీవాత్మ అగును . మోహబుద్ధివలన స్త్రీయెడ మోహము కలుగును

By thinking about aatma one becomes paramaatma (universal spirit). By limiting his thinking to the confines of his body he becomes jeevaatma. By thinking about women one becomes passionate about life.

901
ఆత్మలోని జ్యోతి యమరుట లింగంబు తెలిసి చూడకున్న తేటపడదు అదియు గురువులేక యబ్బునా తెలియక? వి. వే.

ఆత్మలోని జ్యోతి యమరుట లింగంబు
తెలిసి చూడకున్న తేటపడదు
అదియు గురువులేక యబ్బునా
తెలియక? వి. వే.

హృదయములోని జ్యోతిర్మండలమును గాంచుటే ఈశ్వర సాక్షాత్కారము . గురువు మూలమున అనుభవమును సంపాదించినగాని దానిని పొందుట సాధ్యము కాదు

Visualizing the light within one's heart is the only human way to see the creator. One has to experience this after training by a teacher/guru. Otherwise it is not easy to attain.

902
ఆదిమూలమేది?ఆధారమెయ్యది?సోది చెప్పదరమె సుద్దులరసి ?తోడులేక లోని తుల్యముగనుమయా , వి. వే.

ఆదిమూలమేది?ఆధారమెయ్యది?సోది
చెప్పదరమె సుద్దులరసి?
తోడులేక లోని తుల్యముగనుమయా,
వి. వే.

ఏది ప్రపంచమునకు మూలము? దాని కాధారమేది ? అని చర్చించి , హృదయములోని ఈశుని సందర్శింపుము . అంతేకాని సోదె చెప్పకుము

On what the world rests? Where is its root? Contemplate over these questions and visualize Lord Iswara. Don't be loquacious without reason.

903
ఆపగాళివెంట అడవుల వెంటను కొండరాలవెంట నుండనేల ? ఉల్లమందు శివుడటుండుట తెలియవా, వి. వే.

ఆపగాళివెంట అడవుల వెంటను
కొండరాలవెంట నుండనేల?
ఉల్లమందు శివుడటుండుట
తెలియవా, వి. వే.

నదుల యొద్దను , కొండలపైన , అడవులలోన ఉండిన ముక్తి కల్గదు . నీ మనస్సులోనే ఈశ్వరుడున్నాడని , అతడే ముక్తి నిచ్చునని గ్రహింపుము

There is no salvation near rivers (holy places), mountains and forests. One has to realize that Lord Iswara is within himself. He is the only one who can offer salvation.

904
ఆరు వేషములను నరయగ గడు వింత ఆత్మయందు ధ్యానమమరదెందు ; భీకరంబుగాని బిరుదు లేదు విరక్తి , వి. వే.

ఆరు వేషములను నరయగ గడు వింత
ఆత్మయందు ధ్యానమమరదెందు;
భీకరంబుగాని బిరుదు
లేదు విరక్తి , వి. వే.

ఆరింద్రియములు ఆర్భాట మెక్కువ . అవి లొంగినగాని మనస్సున ధ్యానము కుదరదు . అది వైరాగ్యమున సాధ్యమగును

The senses cause many distractions. It is not possible to meditate without controlling them. It is only possible when one renounces all bondage and desires.

905
ఆలి నమ్మి భువిని ఆచారహీనుడై ప్రాలు మాలె నొక్క ప్రతిన కొఱకు ఆడి తప్పకుండ కాడుకాచినవాడు వాడె పరమ గురుడు వసుధ వేమ!

ఆలి నమ్మి భువిని ఆచారహీనుడై
ప్రాలు మాలె నొక్క ప్రతిన కొఱకు
ఆడి తప్పకుండ కాడుకాచినవాడు
వాడె పరమ గురుడు వసుధ వేమ

ప్రతిజ్ఞ కొరకై హరిశ్చంద్రుడు భార్య నమ్మి , ఆచారము నశింపగా కాటికి కాపరియైనాడు . ఆడిన మాట తప్పకుండుటకు అతడే మార్గదర్శి

King Harischandra became a custodian of a burial ground after selling his wife and losing his kingdom because he didn't want to take back his word. He is the torch-bearer of truth.

906
ఆలు బిడ్డలనుచు అతిమోహముననున్న ధనముమీద వాంఛ తగిలియున్న అట్టి నరులకెల్ల నవని ముక్తియెలేదు , వి. వే.

ఆలు బిడ్డలనుచు అతిమోహముననున్న
ధనముమీద వాంఛ తగిలియున్న
అట్టి నరులకెల్ల నవని
ముక్తియెలేదు , వి. వే.

భార్యపైని , బిడ్డలపైని వ్యామోహము ; ధనముపై ఆశ ఉన్నవానికి మోక్షము లభింపదు

It is not possible to attain salvation when one has desire for wife, children and wealth.

907
ఆలుబిడ్డలు ధనమరయ తల్లియుతండ్రి కల మనుజుడు మిగుల కష్టపడును తనకు నెవరులేరు తాను బ్రహ్మముగన్న , వి. వే.

ఆలుబిడ్డలు ధనమరయ తల్లియుతండ్రి
కల మనుజుడు మిగుల కష్టపడును
తనకు నెవరులేరు తాను
బ్రహ్మముగన్న , వి. వే.

బ్రహ్మముతప్ప తన కెవ్వరును లేరని గ్రహింపవలెను . భార్యాపుత్రులు , తల్లితండ్రులు , ధనము కష్టమునకే . బ్రహ్మమును కనని పర్యంతమే యీ తాపత్రయము

There is no one—even wife, children, parents, wealth, etc.-who can accompany him other than the creator. When one doesn't see the creator he remains attached to taapa-trayam (1.ఆధిదైవికము (god), 2. ఆధ్యాత్మికము (spiritual), 3. ఆధిభౌతికము(phsical).).

908
ఆలుసుతులు మాయ , అన్నదమ్ములు మాయ , తల్లితండ్రి మాయ , తాను మాయ తెలియనీదు మాయ దీనిల్లు పాడాయె , వి. వే.

ఆలుసుతులు మాయ , అన్నదమ్ములు
మాయ , తల్లితండ్రి మాయ ,
తాను మాయ తెలియనీదు మాయ దీనిల్లు
పాడాయె , వి. వే.

ఆలుబిడ్డలు, అన్నదమ్ములు , తల్లితండ్రులు , తాను - సమస్తము మాయయే . ఈ మాయ దేనిని గమనింపనీయదు

Children, wife, siblings, parents, one himself are all illusory. It prevents one from attaining true knowledge.

909
ఆవు చన్ను పిదికి ఆ పాలు కాచిన పేరి, పెరుగు చల్ల పేర్లు కలుగు తవిలిలోన గలదు నవనీత మిట్లురా , వి. వే.

ఆవు చన్ను పిదికి ఆ పాలు కాచిన
పేరి, పెరుగు చల్ల పేర్లు
కలుగు తవిలిలోన గలదు
నవనీత మిట్లురా , వి. వే.

ఆవుపాలు కాచి తోడు వేసిన పెరుగు, మజ్జిగ , వెన్న వచ్చును . అట్లే తరచి చూడగా తత్త్వము తెలియును

From milk come yogurt, butter, etc. Similarly by analysis one can figure out true knowledge.

910
ఆవుపాలు శివుని కభిషేకమునకౌను , ఆవుపాలు చూడ నౌషధంబు ఆవుపాలనున్న అతిశయ మెఱుగుడీ , వి. వే.

ఆవుపాలు శివుని కభిషేకమునకౌను,
ఆవుపాలు చూడ నౌషధంబు
ఆవుపాలనున్న అతిశయ
మెఱుగుడీ , వి. వే.

ఆకార మొక్కటియైనను యోగ్యత వేరుగా ఉండును . ఆవు పాలు అభిషేకమునకు , మందుకు కూడా ఉపయోగించును గదా!

Even though by appearance things could be the same, their qualities will differ. One can use cow's milk to bathe the deity or as food and medicine.

911
ఆశాలనెడి త్రాళ్ళ అఖిల జంతువులెల్ల కట్టబడునుగాని నిట్టలమున జ్ఞానమనెడి చురియ బూని కోయగరాదె , వి. వే.

ఆశాలనెడి త్రాళ్ళ అఖిల జంతువులెల్ల
కట్టబడునుగాని నిట్టలమున
జ్ఞానమనెడి చురియ
బూని కోయగరాదె , వి. వే.

ప్రాణులన్నియు ఆశాపాశములచే కట్టబడుచున్నవి . జ్ఞానమను చూరకత్తితో ఆ బంధములను కోయవచ్చును

Men are tied to desires by threads of passion. One has to cut the threads with the knife of knowledge.

912
ఆశాలనెడి త్రాళ్ళ నమర కోయగజేసి పారవైవగాని పరములేదు కొక్కు తిండియాస జిక్కి చచ్చినయట్లు , వి. వే.

ఆశాలనెడి త్రాళ్ళ నమర కోయగజేసి
పారవైవగాని పరములేదు
కొక్కు తిండియాస జిక్కి
చచ్చినయట్లు , వి. వే.

ఆశాలనెడి త్రాళ్ళను త్రెంచివేసినగాని ముక్తి లేదు . పందికొక్కు తిండికాశించి బోనులో చిక్కి చచ్చును కదా!

There is no salvation without breaking the threads that bind one to desires. A rodent gets caught in a cage by seeking cheese/food.

913
ఇచ్చువానికంటె ఇంద్రియ నిగ్రహ౦ ధరయ అతనికంటె అధికుడగును వాడు వానికంటె వీడును పాపముల్ , వి. వే.

ఇచ్చువానికంటె ఇంద్రియ నిగ్రహ౦
ధరయ అతనికంటె అధికుడగును
వాడు వానికంటె వీడును
పాపముల్ , వి. వే.

దాతకంటె ఇంద్రియములు జయించినవాడే అధికుడు . దాత కొన్ని పాపములు చేయునేమోగాని ఇంద్రియజేతకు పాపములు లేవు

A person over-coming his senses is superior to a charitable person who has performed sinful acts. Sins don't attach to the conqueror of the 5 senses.

914
ఇట్టి కనుల బ్రహ్మ మెట్టు చూడగ వచ్చు? చూచు కనులు వేఱు ; చూపు వేఱు చూపులోన మంచి చూడగ వలవదా? వి. వే.

ఇట్టి కనుల బ్రహ్మ మెట్టు
చూడగ వచ్చు? చూచు కనులు వేఱు;
చూపు వేఱు చూపులోన మంచి
చూడగ వలవదా? వి. వే.

ఈ కన్నులతో బ్రహ్మమును చూడలేము . దానిని జ్ఞాన నేత్రములతో , జ్ఞాన దృష్టితో చూడవలెను

We can't see the creator with eyes. One needs spiritual mind and sight to see him.

915
ఇట్టి తనువు కలిగి యీ లోకమందున బుట్టి చచ్చు భ్రమను గట్టిగాను తెట్ట తెరువు చేసి తెలివినంటి చూడరా! వి. వే.

ఇట్టి తనువు కలిగి యీ లోకమందున
బుట్టి చచ్చు భ్రమను గట్టిగాను
తెట్ట తెరువు చేసి
తెలివినంటి చూడరా! వి. వే.

చావు పుట్టుకలు భ్రమమూలములే ; ఆ భ్రాంతిని విడిచి సరియైన మార్గమున వివేకము నుపయోగించి గ్రహింపుము

Birth-death are illusory. One has to over-come them and pursue a life of wisdom

916
ఇంటిలోని కోతి యిరవు కానగలేక తిరుగ బోవువారు తీరకుంద్రు కోతి నొకటి నిల్పి కుదురుండలేరయా! వి. వే.

ఇంటిలోని కోతి యిరవు కానగలేక
తిరుగ బోవువారు తీరకుంద్రు
కోతి నొకటి నిల్పి
కుదురుండలేరయా! వి. వే.

మనస్సు కోతివలె చంచలమైనది . కోతి నొకచోట స్థిరముగా ఉంచలేనట్టు మనస్సు నిల్పుట కష్టము . మనస్సు నిల్పిననే ముక్తి.

Mind is fickle like a simian. One can't make a monkey sit tight in one place. One can't attain salvation without controlling mind.

917
ఇంటి వెనుక తీగ యింగిలీకము నుండ పాదరసము గల్గ పసిడి రాదె?సత్తు పొత్తు చేసి సాధింప వచ్చురా , వి. వే.

ఇంటి వెనుక తీగ యింగిలీకము
నుండ పాదరసము గల్గ పసిడి
రాదె?సత్తు పొత్తు చేసి సాధింప
వచ్చురా , వి. వే.

దగ్గరగా మూలిక , ఇంగిలీకము , పాదరసము, సత్తు ఉండగా బంగారు చేయుట సులభము (అట్లే తగిన సామగ్రి యున్నప్పుడు మోక్షము పొందుట సులభము)

When one has herbs, mercury, pewter, etc. one can make gold. Similarly one has to gather necessary qualities to attain salvation

918
ఇంతకాలముండి యెఱుకమాలిన జీవి చచ్చిపుట్టుచుండు సహజమనుచు ఎఱుక మఱచుచోట నెఱుగునా బ్రహ్మము? వి. వే.

ఇంతకాలముండి యెఱుకమాలిన జీవి
చచ్చిపుట్టుచుండు సహజమనుచు
ఎఱుక మఱచుచోట నెఱుగునా
బ్రహ్మము? వి. వే.

అజ్ఞాని చావు పుట్టుకలు సహజములని ఊరకుండును . జ్ఞాని తన జ్ఞానమున బ్రహ్మమును సాధించి ముక్తి పొందును

An ignorant person considers birth and death as natural events. Whereas a knowledge seeker tries to meet with the creator and attain salvation

919
ఇంతి గన్న జన్ను లింతింతలని చూచి మోహమంది బుద్ధిమోసపోవు గరిత విడనివాని గానరాదాయెరా , వి. వే.

ఇంతి గన్న జన్ను లింతింతలని
చూచి మోహమంది బుద్ధిమోసపోవు
గరిత విడనివాని
గానరాదాయెరా , వి. వే.

స్త్రీ స్తనాదులు యందమును చూచి అందరును మోహమున పడుదురు . ఆ స్త్రీ వ్యామోహము లేనివాడు కానరాడు

One sees the beautiful bosom of a woman and falls in love with her. It is very rare to find a man who doesn't have lust for women

920
ఇంతిజూచెనేని ఇంతింత యనరాదు కనలు వహ్ని లక్క కరగునట్లు వట్టి మోహమిట్లు రట్టులజేయురా , వి. వే.

ఇంతిజూచెనేని ఇంతింత యనరాదు
కనలు వహ్ని లక్క కరగునట్లు
వట్టి మోహమిట్లు
రట్టులజేయురా , వి. వే.

అగ్నిని తాకినచో లక్క కరగునట్లు స్త్రీని చూడగనే పురుషుని మనస్సు కరిగిపోవును . మోహమెంతవారినైన చిక్కుల పెట్టును

Men's hearts melt like lac coming in contact with heat, when they see women. Lust lands anyone in trouble.

921
ఇంతియాకృతిపై నాస కెదురుచూచి చింతలోబడి ప్రాణముల్ చిక్కుబట్టి యంతుగనలేక చచ్చెద అవనిలోన కాముకుల గతి యీ రీతి గాదె వేమ?

ఇంతియాకృతిపై నాస కెదురుచూచి చింతలోబడి
ప్రాణముల్ చిక్కుబట్టి
యంతుగనలేక చచ్చెద అవనిలోన కాముకుల
గతి యీ రీతి గాదె వేమ

స్త్రీల అందము చూచి హద్దులేని మోహములో పడి జనులు తన్నుకొనెదరు . కాముకుల స్థితి వర్ణింపరానిది

Lusting over women without boundaries men fight with one another. The decrepit life of romanticist is indescribable.

922
ఇంద్ర భోగమనగ ఇంద్రజాల మనగ ఇంద్ర పదవి యనగ నిన్ని యొకటె కలియుగమున నరులు కానలేరు భ్రమచేత , వి. వే.

ఇంద్ర భోగమనగ ఇంద్రజాల మనగ
ఇంద్ర పదవి యనగ నిన్ని
యొకటె కలియుగమున నరులు కానలేరు
భ్రమచేత , వి. వే.

ఇంద్ర భోగమునకు , ఇంద్ర పదవికి యాగాదులు చేయుదురు . ఇది మాయ!ఈ విషయమును కలియుగజనులు గుర్తింప లేరు

To attain the luxurious life akin to Lord Indra, the ruler of the world, people perform yagna and rituals. This is all illusion. People living in Kali yug can't realize this.

923
ఇంద్రియముల చేష్ట లెన్నక భువిలోన తన్ను తెలిసి మదిని తమక ముడిగి మింటిమంటి నడుమ మిత్తిని ద్రొక్కరా , వి. వే.

ఇంద్రియముల చేష్ట లెన్నక భువిలోన
తన్ను తెలిసి మదిని తమక
ముడిగి మింటిమంటి నడుమ మిత్తిని
ద్రొక్కరా , వి. వే.

ఇంద్రియముల చేష్టలను లెక్కింపక , తన్ను తెలిసికొని తత్తరపాటు మాని , మాయ నణచి బ్రహ్మస్వరూపామును గ్రహింపుము

By over-coming the 5 senses, introspection, over-powering confusion, realizing that the world is illusory, one has to meditate over the creator.

924
ఇంద్రియముల భ్రాంతి నీరేడు జగములు మందు పెట్టినట్లు మరులుకొనుచు బొందు సుఖముచేత బుత్రులుగాంచిరి సకల జనులు నిట్లు జగతి వేమ!

ఇంద్రియముల భ్రాంతి నీరేడు జగములు
మందు పెట్టినట్లు మరులుకొనుచు
బొందు సుఖముచేత బుత్రులుగాంచిరి
సకల జనులు నిట్లు జగతి వేమ

ఇంద్రియభ్రాంతిచే పదునాలుగు లోకములు మందుపెట్టిన రీతి మోహములో పడును . జనులు సంసారమును నడుపుదురేకాని మోక్షమునకు యత్నింపరు

Because of the 5 senses the 14 worlds succumb to lust. People strive to uphold their bondage not trying for salvation These are the 14 worlds (లోకాలు పదునాలుగని ప్రసిద్ధి. వీటిని చతుర్దశ భూవనాలని కూడా వ్యవహరిస్తారు. లోకాల పేర్లివి):

  • భూర్లోకం (భూలోకంor earth),
  • భువర్లోకం,(bhuvar)
  • సువర్లోకం,(suvarna or gold)
  • మహాలోకం/ మహర్లోకం, (mahaa)
  • జనలోకం,(jana or people)
  • తపోలోకం,(tapo or meditative)
  • సత్యలోకం,(satya or truth)
  • అతలం, (atalam)
  • వితలం,(vitalam)
  • సుతలం, (sutalam)
  • తలాతలం,(talaatala)
  • మహాతలం, (mahaatalam)
  • రసాతలం.,(rasaatalam)
  • పాతాళం.(paatalam)
    ఇందులో మొదటి ఏడు ఊర్ధ్వలోకాలు. మిగిలినవి అథోలోకాలు.

    925
    ఇంద్రియములు విడిచి యేకతతో నిల్చి ఎఱిగి పిదప దన్ను నెఱుగకున్న యతడె మౌని జ్ఞాని యగునని యందురు , వి. వే.

    ఇంద్రియములు విడిచి యేకతతో
    నిల్చి ఎఱిగి పిదప దన్ను నెఱుగకున్న
    యతడె మౌని జ్ఞాని
    యగునని యందురు , వి. వే.

    ఇంద్రియములను జయించి ఏకాకియై ఆత్మస్వరూపామును పరికించువాడే ముని యని , జ్ఞాని యని చెప్పబడును

    One who courts seclusion by being alone and over-powering the senses is the true yogi and wise.

    926
    ఇంద్రుడాయె కామి హీనుడై పోయెను మారుడాయె కామి మడిసిపోయె బ్రహ్మయయ్యె కామి బయిసిపోనాడెను, వి. వే.

    ఇంద్రుడాయె కామి హీనుడై పోయెను
    మారుడాయె కామి మడిసిపోయె
    బ్రహ్మయయ్యె కామి
    బయిసిపోనాడెను, వి. వే.

    ఇంద్రుడు కామియై అవమానము పొందెను . మన్మధుడు కామియై మరణము పొందెను . బ్రహ్మ కామియై సిగ్గుచేటొందెను (కామము చెడ్డది)

    Indra, the ruler of the world, was insulted by women for expressing his desires. The cupid called Manmatha met with death for lusting over women. The creator has married one of the women he created without shame.

    927
    ఇంద్రుడైనగాని చంద్రుడైనగాని నందదుర్గ మెక్కి నాతితోడ పొందుపడక ముక్తి పోరాడవలెనయా , వి. వే.

    ఇంద్రుడైనగాని చంద్రుడైనగాని
    నందదుర్గ మెక్కి నాతితోడ
    పొందుపడక ముక్తి
    పోరాడవలెనయా , వి. వే.

    ఇంద్రుడైనను , చంద్రుడైనను సరే - మోక్షము పొందవలెనన్న , సంతోషదుర్గమెక్కి , స్త్రీల పొందువిడిచి గట్టి ప్రయత్నము చేయవలెను

    Whether he is the ruler of the world (devas) or the moon god himself, to attain salvation he has to climb up the mountain of Santosha (happiness), give up distractions from women and work hard.

    928
    ఇన్ని నాళ్ళ నుండి యెనసిన మోహంబు చెలిమి , చుట్టఱికము , చెల్లె , లక్క , తలితండ్రి బిడ్డ దాయాదులను నిట్టి భ్రాంతిచేత జిక్కు వడుర వేమ!

    ఇన్ని నాళ్ళ నుండి యెనసిన మోహంబు
    చెలిమి , చుట్టఱికము , చెల్లె , లక్క,
    తలితండ్రి బిడ్డ దాయాదులను నిట్టి
    భ్రాంతిచేత జిక్కు వడుర వేమ

    స్నేహము , బంధుత్వముబట్టి పితృప్రేమ, సోదర, పుత్ర, బంధుప్రేమ మోహమును కల్గి౦పగా అందులో జనులు చిక్కుకొందురు

    One is caught in the love of friendship, family, parents, siblings, children. (Overcoming such bondage is needed for salvation)

    929
    ఇల్లుసుమీ సంసారమె యిల్లుసుమీ ఆయుధంబు లీక చాలంగా తల్లిసుమీ పంచాక్షరి కల్లసుమీ సతుల వలపు కనుగొన వేమా!

    ఇల్లుసుమీ సంసారమె యిల్లుసుమీ
    ఆయుధంబు లీక చాలంగా తల్లిసుమీ
    పంచాక్షరి కల్లసుమీ
    సతుల వలపు కనుగొన వేమా

    ఈ సంసారము , పరాక్రమము , స్త్రీల ప్రేమ అసత్యములు , అనిత్యములు , పంచాక్షరి (నమశ్శివాయ)మాత్రమే స్థిరమై రక్షించును

    The family, valor, love of the women are not real and impermanent. Only the mantra Om is the permanent savior.

    930
    ఇష్టసిద్ధికొఱకె యీరారు బీజముల్ కష్టమునను చదివి కానలేరు నిష్ఠలోని నిష్ఠ నిజమని కనవలె , వి. వే.

    ఇష్టసిద్ధికొఱకె యీరారు బీజముల్
    కష్టమునను చదివి
    కానలేరు నిష్ఠలోని నిష్ఠ
    నిజమని కనవలె , వి. వే.

    పoడ్రెండు బీజాక్షరములతో కూడిన హృదయగతానాహత చక్రమును విద్వాంసులు ఎరుగుట కష్టము . దీనిని నియమముతో చూడవచ్చును

    The anahata chakra situated in heart composed of 12 mantras like Om, Hreem, etc. is hard to visualize even for the learned people. One can see it with practice.

    931
    ఇహమునందు సుఖము లీడెరగా లేదు పరము నమ్మెనేని బ్రతుకు నగునె ? మొదటలేని సుఖము తుదినెట్లు కల్గును ? వి. వే.

    ఇహమునందు సుఖము లీడెరగా లేదు
    పరము నమ్మెనేని బ్రతుకు
    నగునె ? మొదటలేని సుఖము తుదినెట్లు
    కల్గును ? వి. వే.

    ఈ జన్మమున సుఖము లేదు . పరజన్మమున కల్గునని యెట్లు నమ్మవచ్చును?ఏలయన - మొదటలేని సుఖము తర్వాత ఎట్లు వచ్చును?

    When there is no peace in this life, where is the guarantee that it will come in the next life? How can one attain comfort when there is none to begin with?

    932
    ఈతరాని వాడి కెగరోజి దిగరోజి యేరు దాటగలడె యీదబోయి ?పరుడు కానివాడు పరలోకమందునా ? వి. వే.

    ఈతరాని వాడి కెగరోజి దిగరోజి
    యేరు దాటగలడె యీదబోయి?
    పరుడు కానివాడు పరలోకమందునా?
    వి. వే.

    ఈతరానివాడు రోజుచు శ్రమపడునేగాని నదిని దాటలేడు . విజ్ఞుడు కానివాడు మోక్షమును పొందలేడు

    One who does not know swimming cannot cross the river without a boat. A person without true knowledge cannot attain salvation

    933
    ఈ మాయ జగము చూడగ ప్రేమాస్పద దృష్టిలోన బెంపగచుండున్ కామాంధకారమునబడి దీమసమున తెలియలేరు దేవుని వేమా!

    ఈ మాయ జగము చూడగ ప్రేమాస్పద
    దృష్టిలోన బెంపగచుండున్
    కామాంధకారమునబడి దీమసమున
    తెలియలేరు దేవుని వేమా

    మిధ్యారూపమైన ఈ జగత్తును జనులు కామాంధకారమునబడి ప్రేమదృష్టితోనే చూచుచున్నారు . వారు దేవునెట్లు చూడగలరు ?

    Men are caught in the romance the world can offer, even though it is an illusion. How can they see God?

    934
    ఈశునకియ్యది యిసుమంతయగు సొడ్డు బ్రహ్మలే నొసగితి పాడుసొడ్డు విష్ణుదేవునకిది విపరీతమగు సొడ్డు , వి. వే.

    ఈశునకియ్యది యిసుమంతయగు సొడ్డు
    బ్రహ్మలే నొసగితి పాడుసొడ్డు
    విష్ణుదేవునకిది విపరీతమగు
    సొడ్డు , వి. వే.

    మోహమునునది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురికిని దోషమే! (వారు భార్యలను మిక్కిలి ప్రేమించుచునే యున్నారు )

    The Lord Brahma, Lord Vishnu and Lord Siva by virtue of being married and in love with their wives are caught in bondage

    935
    ఈశుమీద భక్తి యిసుమంతయును లేక పాశమందు జిక్కి ఫలముగనక కాశియాత్ర బోవ గాలుడెఱుగడా ? వి. వే.

    ఈశుమీద భక్తి యిసుమంతయును
    లేక పాశమందు జిక్కి
    ఫలముగనక కాశియాత్ర బోవ
    గాలుడెఱుగడా ? వి. వే.

    శివునిపై భక్తిలేక , మోహపాశమునకు చిక్కి , కాశికి పోయిన మాత్రమున పుణ్యము లభించునా? పాపఫలమనుభవింపక తప్పునా ?

    Without devotion of Lord Siva, when one is in the bondage with family and friends, he does not become holy by going on pilgrimage to Kasi,. He still has to experience bad karma

    936
    ఈషణత్రయంబు నెడపగ నేరక మోహరాశిలోన మునిగియుండు జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు కల్గును? వి. వే.

    ఈషణత్రయంబు నెడపగ నేరక
    మోహరాశిలోన మునిగియుండు
    జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు
    కల్గును? వి. వే.

    దారేషణ , పుత్రేషణ , ధనేషణ అను మూడు కోరికలు విడువక, మోహములో మునిగినవారికి మోక్షము కలుగదు

    The three strongest affections of mankind, viz., దారేషణము(daarEshana or love of wife), విత్తేషణము(vittEshana or love of wealth), పుత్రేషణము(putrEshana or love of children), prevent a person to attain salvation

    937
    ఉచ్చచెలమ కోరియున్నది జగమెల్ల పిచ్చిపట్టి తిరిగి పెనగుచుంద్రు తుఛ్ఛసుఖము దీనిద్రు౦పంగ లేరయా! వి. వే.

    ఉచ్చచెలమ కోరియున్నది జగమెల్ల
    పిచ్చిపట్టి తిరిగి పెనగుచుంద్రు
    తుఛ్ఛసుఖము దీనిద్రు౦పంగ
    లేరయా! వి. వే.

    జనులు స్త్రీ మోహమున పిచ్చిపట్టి తిరుగుచు , తుచ్చ సుఖమునే కోరుచుందురుగాని, దానిని విడువలేరు

    Ignorant people roam around with insanity by lusting over women and aspiring for fleeting pleasures.

    938
    ఉయ్యలందు జేర్చి యూహించి నిద్రింప నెయ్యమమర మదిని నిలిపనపుడె దయ్యమంత బ్రహ్మ తన్మయమందును , వి. వే.

    ఉయ్యలందు జేర్చి యూహించి
    నిద్రింప నెయ్యమమర మదిని
    నిలిపనపుడె దయ్యమంత బ్రహ్మ
    తన్మయమందును , వి. వే.

    హృదయమున ఇంద్రియ నిగ్రహమొనరించి , దానిని లోబరచుకొని అభ్యసించినయెడల పరబ్రహ్మమును పొందవచ్చును

    By controlling the 5 senses and over-coming their power with meditation, one can attain the creator.

    939
    ఉఱుము మొఱుమురీతి నొప్పెడి మదియందు మరులుసేరి దాని మహిమ జెఱుప నరులు మరులదగిలి నరకమందెదరయా! వి. వే.

    ఉఱుము మొఱుమురీతి నొప్పెడి
    మదియందు మరులుసేరి దాని
    మహిమ జెఱుప నరులు మరులదగిలి
    నరకమందెదరయా! వి. వే.

    సాధకుని మనస్సున ప్రణవనాదము, చిత్కళలు ఉరుము మెరుపులవలె నుండగా మనస్సులో మోహముచేరి వానిని చెరచును . దానికి లొంగిన నరులు నరకములోనే పడుదురు

    When a seeker of knowledge is engrossed in the mantra Om, and his spiritual centers are enhanced, lust and desire can enter his mind and put an end to his meditation. Seekers succumbing to the distractions end up in hell.

    940
    ఊరుకొండ వీడు; ఉనికి పశ్చిమ వీధి ; మూగచింతపల్లె , మొదటి యిల్లు , ఎడ్డెరెడ్డికుల మదేమని చెప్పుదు , వి. వే.

    ఊరుకొండ వీడు; ఉనికి పశ్చిమ
    వీధి ; మూగచింతపల్లె , మొదటి
    యిల్లు , ఎడ్డెరెడ్డికుల
    మదేమని చెప్పుదు , వి. వే.

    కొండవీటి సీమలోని మూగచింతపల్లె పడమటి వీధిలో నివాసమని, తనది రెడ్డికులమని(వేమన)చెప్పుచున్నాడు

    Yogi Vemana is born in Mooga Chinta Palli of Kondaveeti area, in the first house on a street called Padamati (West) and he belongs to the Reddy caste

    941
    ఋషులటవినుండి రుచులు కోరుట రోత నరులు కలిగి తినమి యరయ రోత భార్యలనుచు వారి భరియింపమియు రోత , వి. వే.

    ఋషులటవినుండి రుచులు కోరుట
    రోత నరులు కలిగి తినమి యరయ
    రోత భార్యలనుచు వారి భరియింపమియు
    రోత , వి. వే.

    అడవిలోని మునులు రుచులు కోరుట, ఉన్నవారు తినకుండుట , పెండ్లాడిన భార్యలను పోషించకుండుట రోతయే యగును

    Sages meditating in forests seeking spicy food, fasting when one has enough food to eat, neglecting the needs of one's wife, cause dejection and depression.

    942
    ఋత మనృత మెఱుగ నెవ్వరి తరమగు స్థితియు గతియు దెలియ తేటపడును విన్నమాత్రముననె వివరింపగా రాదు , వి. వే.

    ఋత మనృత మెఱుగ నెవ్వరి తరమగు
    స్థితియు గతియు దెలియ తేటపడును
    విన్నమాత్రముననె వివరింపగా
    రాదు , వి. వే.

    విన్నంతనే నిజము , కల్లలను నిర్ణయింపరాదు . స్థితిగతులను తెలిసికొని , బాగుగా చర్చించి పిదపనే నిర్ణయి౦పవలెను

    One should not jump into conclusions about truth and deceit. Only after ascertaining the complete facts and by discussion one has to judge.

    943
    ఎగ్గుసిగ్గులేనిది ఏకమై తోచగా మొగ్గి చూచుటెల్ల మూలవిద్య తగ్గి యొగ్గకెపుడు తాకుట పరమురా, వి. వే.

    ఎగ్గుసిగ్గులేనిది ఏకమై తోచగా
    మొగ్గి చూచుటెల్ల మూలవిద్య
    తగ్గి యొగ్గకెపుడు
    తాకుట పరమురా, వి. వే.

    లజ్జ మున్నగువానిని విడిచి బ్రహ్మమును ధ్యానించుటయే విద్య. అందు లీనమై పరము సాధించువాడు ఇతరములను లెక్కింపడు

    By giving up shame one has to meditate over the creator. That is true knowledge. One doesn't worry about distractions when he is fixated over the creator.

    944
    ఎచ్చు కులమునొంది ఎన్నాళ్ళు బ్రతికిన జచ్చి పుట్ట జన్మ శతము లగును మెచ్చునట్టి పూజ మెప్పుగా బూనరా , వి. వే.

    ఎచ్చు కులమునొంది ఎన్నాళ్ళు
    బ్రతికిన జచ్చి పుట్ట జన్మ
    శతము లగును మెచ్చునట్టి పూజ
    మెప్పుగా బూనరా , వి. వే.

    ఎట్టి గొప్పకులమున పుట్టినను జనన మరణములు తప్పవు . కాన నిశ్చలమనస్సుతో మోహమును విడిచి ఈశ్వరుని ధ్యానింపవలెను

    No matter one is born in a superior caste, the life-death cycle can't be overcome. Therefore, with an unwavering mind, give up desire and meditate over Lord Iswara

    945
    ఎట్టి యోగికైన నిల మన్మధావస్థ తెలియవచ్చునేని తేటగాను యోగమెల్ల మండి జోగియై పాడగు, వి. వే.

    ఎట్టి యోగికైన నిల మన్మధావస్థ
    తెలియవచ్చునేని
    తేటగాను యోగమెల్ల మండి
    జోగియై పాడగు, వి. వే.

    ఎంత గొప్ప యోగియైనను మన్మథమాయ లోబడినయెడల యోగము నశించి అతడు భ్రష్ఠుడగును .

    No matter how great a yogi, if he yields to cupid, he would become morally bankrupt.

    946
    ఎట్టి వాడొ తానదెఱుగుడు తొలిపుట్టు నీచజీవనమున నీమ మేల ? ఎఱుగుడయ్య లోకమీశ్వరమయమని , వి. వే.

    ఎట్టి వాడొ తానదెఱుగుడు
    తొలిపుట్టు నీచజీవనమున
    నీమ మేల ? ఎఱుగుడయ్య లోకమీశ్వరమయమని,
    వి. వే.

    పూర్వజన్మమున తానేకులమువాడో తెలియలేదు . ఇప్పుడు పెద్ద నియమమేల ? ఈ లోకమంతయు సమానమే ; ఈశ్వరమయమేకదా !

    One doesn't know his caste in the previous birth. So why fret over it in this life. All castes are equal. This is all the illusion by Lord Iswara

    947
    ఎంత కష్టముండు అంత పాపపు జి౦త చింత చేత మిగుల జివుకు మనసు, చింత లేకయున్న జెడని సంపద గాంచు , వి. వే.

    ఎంత కష్టముండు అంత పాపపు జి౦త
    చింత చేత మిగుల జివుకు
    మనసు, చింత లేకయున్న జెడని
    సంపద గాంచు , వి. వే.

    కష్టములు ఎక్కువ కాగా, పాపపుటాలోచన లెక్కువై మనస్సు చెడిపోవును . ఏ చింతయు లేనివాడే మోక్షపదవిని పొందును

    With increased difficulties one embraces sinful thoughts and loses peace of mind. A person without worries is fit for salvation.

    948
    ఎంతకాలమున్న నెఱుకలేకాయె జీవి చచ్చిపుట్టుచుండు సహజముగను , ఎఱుక మఱపుగలుగ నెఱుగునా బ్రహ్మము ? వి. వే.

    ఎంతకాలమున్న నెఱుకలేకాయె జీవి
    చచ్చిపుట్టుచుండు సహజముగను,
    ఎఱుక మఱపుగలుగ నెఱుగునా
    బ్రహ్మము ? వి. వే.

    పరముగూర్చిన జ్ఞానములేని జీవి జనన మరణములు పొందుచునే యుండును . ఆ జ్ఞానములేక బ్రహ్మమును తెలిసికొనలేడు

    Without the knowledge about nether world, a person is caught in life-death cycle. He can't attain the creator without true knowledge about him.

    949
    ఎంతనాటినుండి యెనసిన మోహమో చెలిమిచేత దల్లి , చెల్లె, లక్క , అన్న , తమ్ములనెడి యా భ్రాంతినే పడు, వి. వే.

    ఎంతనాటినుండి యెనసిన మోహమో
    చెలిమిచేత దల్లి , చెల్లె,
    లక్క , అన్న , తమ్ములనెడి యా
    భ్రాంతినే పడు, వి. వే.

    ఎంతకాలము నుండియో మోహము వ్రేళ్ళుతన్ని యుండుటచే అన్నదమ్ములు, అక్కచెల్లె౦డ్రు , తల్లి అను నిట్టి భ్రాంతి తొలగకుండును

    Because of many births of the soul the bonds with siblings and parents are entrenched in the mind and are hard to remove.

    950
    ఎంత నేర్పుతోడ నేమేమి చదివిన జింతలేని విద్య చిక్కబోదు , పంతగించి మదిని పరికించి చూడరా , వి. వే.

    ఎంత నేర్పుతోడ నేమేమి చదివిన
    జింతలేని విద్య చిక్కబోదు,
    పంతగించి మదిని పరికించి
    చూడరా , వి. వే.

    ఎంత నేర్పుతో చదివినను దుఃఖమును పోగొట్టు పరమార్థ జ్ఞానము కలుగుట కష్టము . పట్టుదలతో దానికై యత్నింపవలెను

    One can be highly educated but one can't be free from sorrow. One has to try hard and attain spirituality to overcome sorrow in life.

    951
    ఇన్ని వేషములకు నెఱుకయే మూలంబు యముని గెలువవలెను సమయమెఱిగి దొంగవసతిగాక దొరకునా శౌఖ్య౦బు ? వి. వే.

    ఇన్ని వేషములకు నెఱుకయే మూలంబు
    యముని గెలువవలెను సమయమెఱిగి
    దొంగవసతిగాక దొరకునా
    శౌఖ్య౦బు ? వి. వే.

    ఎన్ని రీతులకును మోక్షము ప్రధానము . దానివల్ల మృత్యువును జయింపవలెను . దొంగవ్రేటున సాహసధైర్యములతో యత్నించినగాని ఆ సుఖము లభించదు

    Of all things, attaining salvation is the most precious. One has to defeat death. Like a thief one has to be courageous to achieve salvation.

    952
    ఎఱిగి మఱిగి తిరిగి యేకాంతమునుగోరి పరుగు లిడక యోగ పధము పట్టి పరము గోరి మించు పరిపూర్తి చెందురా , వి. వే.

    ఎఱిగి మఱిగి తిరిగి యేకాంతమునుగోరి
    పరుగు లిడక యోగ పధము
    పట్టి పరము గోరి మించు పరిపూర్తి
    చెందురా , వి. వే.

    తత్తరపాటులేక ఏకాంత ప్రదేశమున యోగమార్గమున పరమునుగోరి , ఆ కోరికను సఫలము చేసికొనుము

    One shouldn't fret and seek spirituality in a secluded place and fulfill all of one's spiritual desires

    953
    ఏకచక్ర ధరుడె యెల్లలోకంబుల బాక మెఱిగి యేలు ప్రభుడు కాడు రాకపోక లడచి రాజిల్లు మదిలోన , వి. వే.

    ఏకచక్ర ధరుడె యెల్లలోకంబుల
    బాక మెఱిగి యేలు ప్రభుడు
    కాడు రాకపోక లడచి రాజిల్లు
    మదిలోన , వి. వే.

    విష్ణు ఒక్కడే సర్వనియంతయని తలచి విఫలుడవు కావద్దు . మాయకు లొంగక జ్ఞానము సంపాదించుము

    One shouldn't feel dejected by thinking Lord Vishnu is the ruler of all. One has to attain true knowledge without yielding to illusion.

    954
    ఏక సమమునందు నెఱుక కల్గిన యోగి పరము నెఱిగి చూడ భావమందు నాశలేక మించి యన్నిట దానగు , వి. వే.

    ఏక సమమునందు నెఱుక కల్గిన
    యోగి పరము నెఱిగి చూడ
    భావమందు నాశలేక మించి యన్నిట
    దానగు , వి. వే.

    జ్ఞానియగు యోగి సర్వసమదృష్టితో బ్రహ్మమును చూడగలడు . అన్నిటియందునుండు బ్రహ్మమున ఐక్యము చెందగలడు

    A knowledgeable yogi seeing the world with wisdom can attain salvation. One who sees atma in everything, merges with the creator.

    955
    ఏడునైదునారు నెనిమిది తొమ్మిది యేమికట్టునుండి యెట్లు తిరుగు వాడివాడి నంతవాడ దదేమొకో? వి. వే.

    ఏడునైదునారు నెనిమిది తొమ్మిది
    యేమికట్టునుండి యెట్లు
    తిరుగు వాడివాడి నంతవాడ
    దదేమొకో? వి. వే.

    మాయావృతమై ఈ చంచలభావము పంచకోశములు , సప్తజ్ఞాన భూమికలు , అష్ట పాశములు , అరిషడ్వర్గము తాపత్రయములలో మునిగియున్నది . అవి నశించిననే ముక్తి లభించును

    The fickle mind is made with 5 kosas (anna, praana, manOmaya, gnaana, aananda), 7 jnaanas:

  • శుభేచ్ఛ (subhEchha)
  • తనుమానసి(tanumaanasi)
  • సత్వాపత్తి(satwaapatti)
  • అసంసక్తి (asam-sakti)
  • పదార్థ భావన,(padaartha bhaavana)
  • తురీయం, (tureeyam)
  • విచారణ. (vichaarana) 8 forms of bondage
  • దేహాభి మానం/ మోహం, (lust for body)
  • బంధు, మిత్ర, కులాభి మానం,(attachment to caste and one's relatives and friends)
  • కీర్తి, ప్రతిష్ఠలను పెంచుకోవాలనే ఆరాటం, (desire to enhance one's fame)
  • ఇంకా ఇంకా కావాలనే ఆశ, (unsatiated desire)
  • ఇతరుల మంచిని చూసి ఓర్వలేకపోవడం, (jealous of others)
  • దేనికో ఒక దానికోసం దిగులు చెందడం, (always in depression over things)
  • ద్వేషభావం, వైరం తెచ్చుకోవడం, (always seeking quarrels)
  • తనకోసమే గాక సంసారం కోసం నిరంతరం పాటుపడటం. (always striving to improve one's family neglecting his needs) 6 qualities (కామక్రోధలోభ మోహమదమాత్సర్యము, lust + anger + greed + covetous + pride + arrogance), 3 taapaas
  • ఆధిదైవికము,(adhi daivikam)
  • ఆధ్యాత్మికము, (aadhyaatmikam)
  • ఆధిభౌతికము.(aadi bhowthikam)). One attains salvation by over-powering them

    956
    ఏది కోరిన నీ కోర్కె యెఱుకయగును , ఏది కోరిక నిండెనో యిరవు నగును సాధు విద్యకు ధరలోన సమము లేదు కోవిదుల కిది తెలిసిన గుఱుతు వేమ!

    ఏది కోరిన నీ కోర్కె యెఱుకయగును,
    ఏది కోరిక నిండెనో యిరవు నగును
    సాధు విద్యకు ధరలోన సమము లేదు కోవిదుల
    కిది తెలిసిన గుఱుతు వేమ

    నీకు సంతుష్టి నిచ్చునది , కోరిక పూరించునది శాంత రూపమగు జ్ఞానము; సాధు విద్య. దీనిని జ్ఞానులెరిగియే యుందురు

    Only true knowledge can offer happiness and fulfill desires by being peaceful. Learned people already know this.

    957
    ఒడలి మెఱుగు చూచి నడక సొబగు చూచి వంక కొప్పు పెట్టు వనిత జూచి విటుల కడుపులోన వెత బొందుకుందురా , వి. వే.

    ఒడలి మెఱుగు చూచి నడక సొబగు
    చూచి వంక కొప్పు పెట్టు వనిత
    జూచి విటుల కడుపులోన వెత
    బొందుకుందురా , వి. వే.

    మేని మెరుగు , నడక సొగసు , వంకకొప్పుకల యువతిని చూడగానే విటుల మనస్సు మిగుల కలతబడును

    A romantic's mind is disturbed when he sees a fair lady with an attractive gait and hair style.

    958
    కడుపులోన నున్న ఘనమైన పిండము ముందు కష్టమెల్ల మొదల రోసె యింకనైన బుద్ధి యేర్పడబుట్టదా ? వి. వే.

    కడుపులోన నున్న ఘనమైన పిండము
    ముందు కష్టమెల్ల మొదల
    రోసె యింకనైన బుద్ధి యేర్పడబుట్టదా?
    వి. వే.

    జీవి తల్లిగర్భములో ఉన్నప్పుడు మిక్కిలి విరక్తితో తనకీ జన్మ యేల యనుకొనును . పుట్టగానే మాయావృతుడగును . వీనికి బుధివచ్చుటెట్లు ?

    One's aatma repents over past lives and seeks renunciation when one is in the mother's womb. As soon as one is delivered into the world, he is over-powered by illusion. How can he be intelligent?

    959
    కల్మషంబు సోక గనుపింపదెందును రూపమెవ్వరికిని రూఢి తోడ దామసముడిగిన దగగల్గు జ్ఞానము , వి. వే.

    కల్మషంబు సోక గనుపింపదెందును
    రూపమెవ్వరికిని రూఢి
    తోడ దామసముడిగిన దగగల్గు
    జ్ఞానము , వి. వే

    పాపబుద్ధికల్గి తామసమున ఉన్నచో ఏదియు కానరాదు . దానిని విడిచి , ప్రయత్నించిననే జ్ఞానము కలుగును

    With a decrepit mind and laziness, one can't attain true knowledge.

    960
    కాంతకుంకయైన కానికులంబైన పాయలేక విటుడు బ్రమసియుండు మరిగి గ్రుడ్డికుక్క మాంసంబు గొన్నట్లు , వి. వే.

    కాంతకుంకయైన కానికులంబైన పాయలేక
    విటుడు బ్రమసియుండు
    మరిగి గ్రుడ్డికుక్క మాంసంబు
    గొన్నట్లు , వి. వే.

    యువతి కులశీలములు లేనిదైనను విటుడు భ్రాంతితో దాని వెంటనే తిరుగును . గ్రుడ్డికుక్క తేరగావచ్చిన మాంసమును వదలదు

    Even when a girl is devoid of character, her paramour sticks with her. A blind dog won't give up its desire for a piece of meat.

    961
    కాంతసిందురంబు గడు పిత్తరోగికి నొనర మధువుతోడ నొసగినంత దనరు దేహబలిమి ధన్యుడై గట్టెక్కు , వి. వే.

    కాంతసిందురంబు గడు పిత్తరోగికి
    నొనర మధువుతోడ నొసగినంత
    దనరు దేహబలిమి ధన్యుడై
    గట్టెక్కు , వి. వే.

    అయస్కాంత సిందూరము తేనెతో కలిపి పిత్తరోగికిచ్చిన రోగము కుదిరి బలము కల్గునట్టే జ్ఞానమువల్ల మోక్షము కలుగును

    When a patient with excessive bile is given vermilion, he will get cured. Similarly with spiritual knowledge it is possible to attain salvation

    962
    కామచింత జిక్కి కనుగాననేరవు నియమనిష్ఠ గలిగి నియతిమీఱి తామసంబు నడచి తన్మయమందరా , వి. వే.

    కామచింత జిక్కి కనుగాననేరవు
    నియమనిష్ఠ గలిగి నియతిమీఱి
    తామసంబు నడచి
    తన్మయమందరా , వి. వే.

    కామముపై కోరికతో కన్ను గానకున్నావు . తామసమును విడిచి , నియమనిష్ఠలతో యత్నించి తన్మయత్వమును పొందుము

    With desire one loses balance. One has to give up laziness and become disciplined to attain true happiness.

    963
    కాయమును గనుకయు గనియు నావలనున్న కాయమును విడిచిన గాడు యోగి కాయమందు ముక్తిగతి కేగవలయును , వి. వే .

    కాయమును గనుకయు గనియు నావలనున్న
    కాయమును విడిచిన గాడు
    యోగి కాయమందు ముక్తిగతి
    కేగవలయును , వి. వే .

    ఈ శరీరమును చూచియు చూడకయు పరిశీలించి పునర్జన్మము రాకుండుటకై యత్నించువాడే యోగి . ఈ శరీరమున్నపుడే ముక్తికి యత్నింపవలెను

    A true yogi is one who aspires to free himself from birth-death cycle. One has to use his body as a tool to attain salvation when still being able-bodied.

    964
    కాయమున్న యిపుడె కామాదులను గోసి జ్ఞాన మార్గమునకు గడగవలయు జాగుచేయ గాయమేగిన నేమగు? వి. వే.

    కాయమున్న యిపుడె కామాదులను
    గోసి జ్ఞాన మార్గమునకు
    గడగవలయు జాగుచేయ గాయమేగిన
    నేమగు? వి. వే.

    కామాదులను విడిచి , శరీరమున్నపుడే ముక్తి , జ్ఞానమునకు యత్నింపవలెను . ఆలసించిన , దేహమే నశించిన నేమి లాభము?

    One has to seek true knowledge and salvation by giving up desires when one is able-bodied. When body becomes weak and is about to perish, it is too late for attaining spiritual knowledge.

    965
    కాలు చేయి వంచి గాలి నిండగ జేర్చి నేలవ్రాలి కొన్ని, నిలిచి కొన్ని ఆసన ముఖవిద్య లభ్యాస విద్యలు, వి. వే.

    కాలు చేయి వంచి గాలి నిండగ
    జేర్చి నేలవ్రాలి కొన్ని,
    నిలిచి కొన్ని ఆసన ముఖవిద్య
    లభ్యాస విద్యలు, వి. వే.

    కాలు చేతులను చిత్ర విచిత్రముగా వంచి , వాయువు కుంభించి నేలపై వ్రాలి గాలిలో నిలిచి చేయు ఆసనములు యోగాభ్యాస విద్యలేకాని మోక్షమునిచ్చునవి కావు

    The contorted bodies of yogis while performing yoga and their breath control are only physical exercises. Such acts don't help to attain salvation.

    966
    కావుకావు మనచు గాళ్ళు ౦డి పలికెడి కాకి కరణి బల్కి కానరారు బాపలైనవారు బ్రహ్మము నెఱుగరు , వి. వే.

    కావుకావు మనచు గాళ్ళు ౦డి
    పలికెడి కాకి కరణి బల్కి
    కానరారు బాపలైనవారు బ్రహ్మము
    నెఱుగరు , వి. వే.

    కాకులు కావుకావుమని కూసినట్లు వేదము చదువు బ్రాహ్మణులు అర్థము తెలియకయే అరచెదరు . వారికి బ్రహ్మమెట్లు తెలియును ?

    Brahmins reciting vedas without knowing their meaning are like ravines crowing. How can they know the true nature of the creator?

    967
    కులము హెచ్చు తగ్గు గొడవల పనిలేదు సానుజాతమయ్యె సకల కులము హెచ్చు తగ్గు మాట లెట్లెఱు౦గవచ్చు ? వి. వే.

    కులము హెచ్చు తగ్గు గొడవల
    పనిలేదు సానుజాతమయ్యె సకల
    కులము హెచ్చు తగ్గు మాట లెట్లెఱు౦గవచ్చు?
    వి. వే.

    కులములలో ఎక్కువ తక్కువ గోడవలేల ? అన్ని కులములు సమానములే . ఎక్కువ తక్కువ భేదములను చెప్పుట అసాధ్యము

    Why fight over the superiority of one caste over another? All castes are equal. It is impossible to tell which caste is superior.

    968
    కూడు కుడిచి లెస్స గూర్చున్నవాడైన ఆడుదానిగన్న నట్టె తగులు అన్నసార మొడలి కతిమదంబిడునురా , వి. వే.

    కూడు కుడిచి లెస్స గూర్చున్నవాడైన
    ఆడుదానిగన్న నట్టె
    తగులు అన్నసార మొడలి కతిమదంబిడునురా,
    వి. వే.

    కడుపునిండ తిని కూర్చున్నవాని కాడుదానిపై మనస్సు పోకతప్పదు . అన్నసారము దేహమునకు మదము కల్గి ౦చును

    When one is satiated with food, he goes after women. The strength attained from food makes one to lust over women.

    969
    కూడు బెట్టకున్న కుక్షిలో జఠరాగ్ని భక్షణంబు చేయు గుక్షిమలము కూడువిడిచి మలము గుడుచురా యుపవాసి , వి. వే.

    కూడు బెట్టకున్న కుక్షిలో జఠరాగ్ని
    భక్షణంబు చేయు గుక్షిమలము
    కూడువిడిచి మలము గుడుచురా
    యుపవాసి , వి. వే.

    అన్నము తిననిచో కడుపులోని జఠరాగ్ని కుక్షిమలమునే తినును . ఉపవాసము చేయువారు తిండిమాని మలమునే తిన్నట్లగును

    When one doesn't eat, the acid in the stomach attacks the body. There is no use in fasting as it results in unhygienic practices.

    970
    కొమ్మ త్రిమ్మరైన ద్రిమ్మరుల వలచు సరస విటులనేల సమ్మతించు ?పెండదిన్న పురుగు బెల్లమేమెఱుగును? వి. వే.

    కొమ్మ త్రిమ్మరైన ద్రిమ్మరుల
    వలచు సరస విటులనేల సమ్మతించు?
    పెండదిన్న పురుగు బెల్లమేమెఱుగును?
    వి. వే.

    పేడపురుగునకు బెల్లము రుచింపని రీతి , తిరుగులాడి స్త్రీ విటులనే వెదకునుగాని భర్త్రు సుఖమును కోరదు

    A dung beetle doesn't know the worth of jaggery. A loose woman goes after a romantic and won't aspire for the happiness with a husband

    971
    కొండెగాడు చావ గొంతదనుకబోవు వంతుకింతెగాని వగపులేదు కొంకినక్క చావ గొఱ్ఱె యేమిటి కేడ్చు ? వి. వే.

    కొండెగాడు చావ గొంతదనుకబోవు
    వంతుకింతెగాని వగపులేదు
    కొంకినక్క చావ గొఱ్ఱె యేమిటి
    కేడ్చు ? వి. వే.

    దుష్టుడు చావగా ఎవ్వరును దుఃఖింపరు . లాంఛనముగా శవము వెంట కొంచెము దూరము వెళ్ళుదురు . నక్క చచ్చిన గొర్రెకు దుఃఖమా ?

    When a bad person dies no one mourns. Will a sheep mourn over the death of a wolf?

    972
    ఖచరవరులు భూమి గనబడరందురు కానవచ్చినంత గౌరవింత్రొ ? తల్లి తండ్రి గురువు తత్సముల్ కారొకో ? వి. వే.

    ఖచరవరులు భూమి గనబడరందురు
    కానవచ్చినంత గౌరవింత్రొ?
    తల్లి తండ్రి గురువు తత్సముల్
    కారొకో ? వి. వే.

    దేవతలు భూమిపై కనబడరు . వారు కనబడినచో గౌరవింతురా యేమి? తలిదండ్రులు , గురువు , దైవసామానులు . వారిని గౌరవింపవచ్చునుగదా!

    Gods can't be found on earth. Will humans respect them even if they descend on the earth? Why can't men respect their parents and guru's who are equivalent to God?

    973
    ఖనులబుట్టు లోహగుణమునందెల్లెడ బనికివచ్చు నొక్క యినుమె చాలు నైన జులకపరుతురది యెచ్చుగా నుంట , వి. వే.

    ఖనులబుట్టు లోహగుణమునందెల్లెడ
    బనికివచ్చు నొక్క యినుమె
    చాలు నైన జులకపరుతురది
    యెచ్చుగా నుంట , వి. వే.

    గనులలో లభించు లోహములలో మిక్కిలి ఉపయోగించునది ఇనుమే . అయినను అది సమృద్ధిగా దొరకుటచే హీనముగా చూచెదరు (స్వల్పముగా లభించుదానిపైన గౌరవమెక్కువ )

    Among all the metals found in the mines, iron is the most plentiful. Because of its abundance, iron is also cheap. Thus men assign higher weightage to a scarce resource.

    974
    గట్టుమీది మన్ను గుట్టపై దగురాయి పుట్టలోనివాని బుడుగు తొడుగు గట్టిగాను మూట కనకంబు పుట్టును , వి. వే.

    గట్టుమీది మన్ను గుట్టపై దగురాయి
    పుట్టలోనివాని బుడుగు
    తొడుగు గట్టిగాను మూట కనకంబు
    పుట్టును , వి. వే.

    గట్టుమీది మన్ను , కొండరాయి , పాముపొర బంగారు సాధించుటకు తగిన సాధనములు

    People used to believe that sand over the river banks, stones over the mountains, and the skin of a snake are the tools needed to make gold (alchemy)

    975
    గడ్డె గణము నిద్రకలలు కోరికలును ముదమొసంగు శకునములను జెలగు ప్రశ్నలు పదివేలు పరికించి చూడగా ఔనుగాక పోనునౌను వేమ!

    గడ్డె గణము నిద్రకలలు కోరికలును
    ముదమొసంగు శకునములను జెలగు
    ప్రశ్నలు పదివేలు పరికించి
    చూడగా ఔనుగాక పోనునౌను వేమ

    సోదె, కల, శకునములు, ప్రశ్నలు మొదలైనవి ఒకప్పుడు ఫలించును . వేరొకప్పుడు ఫలింపవు . వానిని నమ్మరాదు

    One should not believe blindly in astrology, omens and other occult things as they prove to be wrong some times.

    976
    గాసి చెందనేల ? గతికామమును మించి వాసిగాను భక్తి వరుస దెలిసి మోసపోక యెఱుక ముగియుట కానరా! వి. వే.

    గాసి చెందనేల ? గతికామమును
    మించి వాసిగాను భక్తి వరుస
    దెలిసి మోసపోక యెఱుక
    ముగియుట కానరా! వి. వే.

    కామములను జయించి , బాధపడక భక్తియోగమును గుర్తించి , మోసములకు లొంగక జ్ఞానమును సంపాదించవలెను

    One can attain true knowledge by overcoming lust, meditating with devotion to overcome suffering, and not yielding to deceit.

    977
    గుఱికిరావు జగతి గోమటి నిష్ఠలు లోభితనముచేత లోనికడగు బులియు దాసరికుడు పొలుపగు చందమౌ , వి. వే.

    గుఱికిరావు జగతి గోమటి నిష్ఠలు
    లోభితనముచేత లోనికడగు
    బులియు దాసరికుడు పొలుపగు
    చందమౌ , వి. వే.

    లాభముకోరి లోభమున చేయు నిష్ఠలు ప్రయోజనము లేనివి . అవి, పులి ఆశపెట్టి దాసరిని తినివేసినరీతినే యుండును .

    There is no use in performing rituals by coveting profit. It is like the old tale of a greedy Lord Vishnu devotee being eaten by a tiger.

    978
    గోచి పాతబెట్టి కోరి తా మునినంచు మనసులోని యాశ మానలేడు ఆకృతెన్నవేఱికాశ యెన్నగు వేఱు , వి. వే.

    గోచి పాతబెట్టి కోరి తా
    మునినంచు మనసులోని యాశ మానలేడు
    ఆకృతెన్నవేఱికాశ
    యెన్నగు వేఱు , వి. వే.

    గోచిధరించిన మాత్రాన మునియనుకొన్నవాడు ఆశను విడువడు . ఆకారము వేరు; ఆశ వేరు . అట్టి యోగి ఉభయభ్రష్టుడు

    Just by wearing loin if one considers himself as a sage one is not free of desire. A desire is different from attire. Such a yogi will lose on both counts.

    979
    గోచి విడుచు యోగి గోతిగా నాడించి వెఱ్ఱివానిజేసి వెతలజిక్క జేయునయ్య లేమి చేసెదరో రేల ? వి. వే.

    గోచి విడుచు యోగి గోతిగా
    నాడించి వెఱ్ఱివానిజేసి
    వెతలజిక్క జేయునయ్య లేమి
    చేసెదరో రేల ? వి. వే.

    మూర్ఖులు దిగంబరయోగిని చూచి , అతని తత్త్వమెరుగక హేళనచేసి అవమానింతురు . తాము రాత్రిచేయు పనుల నెంచరు

    Foolish people make fun of a naked yogi without knowing his wisdom. They don't realize what they do in darkness of night.

    980
    గృహము దేహమొండె కేవలగుణమొండె దాని నిలిపికొనియు దీని దీర్ప గానరాదె నీకు నానంద సుఖమది , వి. వే.

    గృహము దేహమొండె కేవలగుణమొండె
    దాని నిలిపికొనియు దీని
    దీర్ప గానరాదె నీకు
    నానంద సుఖమది , వి. వే.

    దేహమే గృహము . అందలి సాధనములు సత్త్వరజస్తమములు . దేహధారి ఆ గుణవికారములను అణచిన , ఆనంద సౌఖ్యము లభించును

    Body is the abode of three gunas (sattva=calmness, rajas=activity, tamas=laziness). When one controls the urges created by the gunas, one can attain true happiness.

    981
    ఘటము గాన్గజేసి ఘనగుణ మెద్దుగా దవిలి కర్మములను నువులజేసి తెలిసి గానుగాడు తిలకార కాత్మము , వి. వే.

    ఘటము గాన్గజేసి ఘనగుణ మెద్దుగా
    దవిలి కర్మములను నువులజేసి
    తెలిసి గానుగాడు తిలకార
    కాత్మము , వి. వే.

    శరీరమును గానుగగా చేసి, గుణముల నెద్దుగా చేసి , కర్మములనెడి నువ్వులను గానుగాడిన , తిలకారుడు తైలము నార్జించినట్లు నీవు మోక్షమును పొందగలవు

    The body is like an oil mill. The three gunas (sattva=calmness, rajas=activity, tamas=lethargy) are the oxen who provide the energy for the mill. Actions (karma) are the oil seeds. Thus one attains salvation like one extracts oil in the mill.

    982
    చిత్తముగలయోగి శివునివలెనెయుండు మిధ్యయోగియుండు మిడుతవలెను నిత్యుడైన యోగి నీవలె నుండును, వి. వే.

    చిత్తముగలయోగి శివునివలెనెయుండు
    మిధ్యయోగియుండు మిడుతవలెను
    నిత్యుడైన యోగి
    నీవలె నుండును, వి. వే.

    జ్ఞానియగు యోగి ఐహికములకంటక , నిర్వికల్పుడై యుండును . మాయ యోగి మిడిసిపడును. నిశ్చలయోగి బ్రహ్మమువలె నుండును

    A knowledgeable yogi is unattached to things and free of sinful thoughts. A fake yogi is proud of his knowledge. A true yogi is one who constantly meditates, thus, is closer to the creator.

    983
    చీకటింటజేర జేదివ్వె లేకయే రూక కానరాదు రూఢిగాను రాకపోకలడచి రవములో విని సొక్కు, వి. వే.

    చీకటింటజేర జేదివ్వె లేకయే
    రూక కానరాదు రూఢిగాను
    రాకపోకలడచి రవములో
    విని సొక్కు, వి. వే.

    దీపములేక చీకటి గదిలోని వస్తువు కానరాదు . గురూపదేశము పొంది, అజ్ఞానభూమికల నడచి, ప్రణవనాదమును విని మోక్షానందమును పొందవచ్చును

    Without light, one can't see in a dark room. One has to follow a teacher (guru) who will guide him to overcome ignorance and shows him the happy path to salvation by focusing the mind over the mantra Om.

    984
    చెలిమి మీఱ మదిని చింతలు విడనాడి పిన్న పెద్దలకును పెరిగివచ్చు మంటి మింటనడుమ మదినిల్పి చూడుము, వి. వే.

    చెలిమి మీఱ మదిని చింతలు విడనాడి
    పిన్న పెద్దలకును పెరిగివచ్చు
    మంటి మింటనడుమ మదినిల్పి
    చూడుము, వి. వే.

    ఇతరులతోడి సంబంధము విడిచి, మనస్సున చింతలేక భూమ్యాకాశముల నడుమగల జ్యోతిపై మనస్సు నిల్పిన బ్రహ్మమును కాంచవచ్చును

    By secluding oneself, freeing mind of sorrow, contemplating about the universe by meditating over the light between the earth and space, one can visualize the creator

    985
    చచ్చె జచ్చెనంచు జావెంచి వగచెడు దీన నరుల వెఱ్ఱి తెలుపరాదు ప్రాణమునకు మృత్యుబంధము లుండునా ? వి. వే.

    చచ్చె జచ్చెనంచు జావెంచి వగచెడు
    దీన నరుల వెఱ్ఱి తెలుపరాదు
    ప్రాణమునకు మృత్యుబంధము
    లుండునా ? వి. వే.

    మానవుడు "చచ్చెను చచ్చెను " అని దీనముగా పల్కుటలో అర్థము లేదు . ప్రాణమునకు చావు లేదు . శరీరమే నశించునది

    There is no reason to wail over the dead. Aatma (soul) won't die. Only the body disintegrates

    986
    చమురు రాచికొన్న చర్మంబు మెఱుగెక్కు సాముచేయ మేన సత్తువెక్కు జ్ఞానమార్గ మెఱుగ గడతేరు జన్మంబు , వి. వే.

    చమురు రాచికొన్న చర్మంబు మెఱుగెక్కు
    సాముచేయ మేన సత్తువెక్కు
    జ్ఞానమార్గ మెఱుగ
    గడతేరు జన్మంబు , వి. వే.

    చమురు దేహమునకు మెరుగిచ్చును . సాము సత్తువ నిచ్చును . అట్లే జ్ఞానము జన్మమును కడతేర్చి ముక్తినిచ్చును

    Oil smeared over body gives shine. A wrestler attains tremendous strength with practice. Similarly true knowledge frees one from the birth and death and helps to attain salvation

    987
    చాడికాని మాట చావడిలో నిక్కు వేటబో శునకము వెలయ నిక్కు వెలది జూచినపుడు విటకాడు నిక్కురా , వి. వే.

    చాడికాని మాట చావడిలో నిక్కు
    వేటబో శునకము వెలయ నిక్కు
    వెలది జూచినపుడు విటకాడు
    నిక్కురా , వి. వే.

    కొండెగానిమాట రచ్చలో విజృంభించును . కుక్క వేటలో విజృంభించును . యువతిని చూడగా విటుడు విజృంభించును

    A deceitful person's word may prevail in the court. A hunter dog excels during a hunt. Similarly a romantic reacts extremely at the sight of a lady.

    988
    చాలు జాలు ఇలను జనన మరణమును మేలుగాను మాయ మెలకువెఱిగి ప్రాలుమాలకిలను భక్తి చేబూనుము , వి. వే.

    చాలు జాలు ఇలను జనన మరణమును
    మేలుగాను మాయ మెలకువెఱిగి
    ప్రాలుమాలకిలను భక్తి
    చేబూనుము , వి. వే.

    మాయల మర్మము తెలిసికొని , శ్రద్ధపూని , భక్తిని చేపట్టి భగవంతుని ధ్యానించినచో జనన మరణములు ఉండవు

    By discovering that this world is an illusion, when one meditates over God with determination, he can free himself from the cycle of births and deaths.

    989
    ఛిద్రమెన్నువాడు శిష్యుడు తానౌనె ? ఛిద్రమెఱుగువాడు శిష్యుడగును , ఛిద్రమెఱిగి విడువ భద్రంబు చేకురు , వి. వే.

    ఛిద్రమెన్నువాడు శిష్యుడు తానౌనె?
    ఛిద్రమెఱుగువాడు శిష్యుడగును,
    ఛిద్రమెఱిగి విడువ
    భద్రంబు చేకురు , వి. వే.

    వరుల తప్పులెన్నక , తన తప్పు తెలిసికొన్నవాడే శిష్యుడు . తన తప్పును సవరించుకొన్నచో అతనికి మేలు కలుగును

    A true disciple is one who doesn't look for flaws in others but looks inward. By making amends to one's short-comings, one profits.

    990
    ఛేద్యమైనదాని జేపట్టియుండిన మూలవస్తు వెట్లు కేలబట్టు ? దానినూనగల్గు దార్ ఢ్య౦బు లేకున్న , వి. వే.

    ఛేద్యమైనదాని జేపట్టియుండిన
    మూలవస్తు వెట్లు కేలబట్టు?
    దానినూనగల్గు దార్ ఢ్య౦బు
    లేకున్న , వి. వే.

    ఛేదింపదగిన అవిద్యను గ్రహించినవానికి జ్ఞానమెట్లు లభించును? జ్ఞానార్జమునకు చిత్తస్థయిర్యము కావలెను

    How can one attain wisdom by pursuing knowledge to feed himself? To attain true knowledge a courageous heart is the pre-requisite

    991
    జగమనగ నింద్రజాలము జగమనగా మాయసుమ్మ జన్మాదులకు భగవంతుడగును బ్రహ్మము నిగమాగమ నిర్వికారనిపుణు౦డు వేమా!

    జగమనగ నింద్రజాలము జగమనగా
    మాయసుమ్మ జన్మాదులకు భగవంతుడగును
    బ్రహ్మము నిగమాగమ
    నిర్వికారనిపుణు౦డు వేమా

    ఈ లోకము ఇంద్రజాలము . జనన మరణాదులకు మాయావరణ కారణము . మాయాతీతుడగు భగవంతుడే బ్రహ్మము

    This world is make-believe. Life and death are illusion. God is above delusion and is the true creator

    992
    జంతురాసులందు జనియించి జనియించి దిమ్మపట్టినట్లు తిరిగి తిరిగి తనువు నిత్యమంచు దలపగ నెవ్వరో ? వి. వె.

    జంతురాసులందు జనియించి జనియించి
    దిమ్మపట్టినట్లు తిరిగి
    తిరిగి తనువు నిత్యమంచు
    దలపగ నెవ్వరో ? వి. వె.

    ప్రాణులనడుమ పుట్టిపుట్టి , మాయలోకములో తిరిగితిరిగి ఈ శరీరమే నిత్యమని తలచుట మూఢత్వము

    Even after being born several times and roaming around the impermanent world, foolish people think their bodes are permanent

    993
    జనన మెట్లు కలిగె? జాతి యెయ్యదియయ్యె ? జనన మరణములకు జాడలఎఱుగ వినగ వినగ దీని వివరించి కానారో? వి. వే.

    జనన మెట్లు కలిగె? జాతి యెయ్యదియయ్యె?
    జనన మరణములకు
    జాడలఎఱుగ వినగ వినగ దీని
    వివరించి కానారో? వి. వే.

    జీవికి పుట్టక యెట్లు కల్గెనో . ఏ జాతులలో ఎన్ని జన్మములెత్తి ఎట్లు మరణించెనో వివరముగా ఆలోచించువారు కానరారు

    Even thoughtful people don't know how a human being is born and how many castes his soul manifested in previous births.

    994
    జాతిభేదమెంచి జన్మముల్ తెలియక ముక్తిగానలేరు మూర్ఖజనులు జాతి నెంచనేల , జన్మము తెలియుము , వి. వే.

    జాతిభేదమెంచి జన్మముల్ తెలియక
    ముక్తిగానలేరు మూర్ఖజనులు
    జాతి నెంచనేల , జన్మము
    తెలియుము , వి. వే.

    ఆవివేకులు జన్మమున అందరును సమానులని తెలియక జాతి భేదము లెన్నుచు భేదభావముతో మోక్షమునకు దూరమగుచున్నారు

    All men are equal. Foolish people don't realize this and create artificial castes thereby moving away from salvation

    995
    జాతాసూతకముల సత్యమైయుండగా నంటినంత నెట్టులంటుకలుగు ? వితముగానలేరు వెలయంగ జీవులు , వి. వే.

    జాతాసూతకముల సత్యమైయుండగా
    నంటినంత నెట్టులంటుకలుగు?
    వితముగానలేరు వెలయంగ
    జీవులు , వి. వే.

    జనన మరణములు నిత్యములైనందున అశౌచ మెప్పుడు నున్నదే! అంటిన వచ్చునది కాదు . నరులు దీని నెరుగలేకున్నారు

    Birth and death are always present. There is no reason to create differences between untouchables and the rest of the castes.

    996
    జీవముండుచోటు స్థిరముగా దెలియక తిరుగు నస్థిరమగు దేహమందు తిరుగనేల యనుచు తెలియలేడజ్ఞాని , వి. వే.

    జీవముండుచోటు స్థిరముగా దెలియక
    తిరుగు నస్థిరమగు దేహమందు
    తిరుగనేల యనుచు తెలియలేడజ్ఞాని,
    వి. వే.

    అస్థిరమైన ఈ దేహములో స్థిరమైన బ్రహ్మ మెచటనుండునో తెలియక మూర్ఖులు వృధాగా తిరిగి కాలము గడపెదరు

    Foolish people are in search of the creator in vain when he is permanently situated within their impermanent bodies.

    997
    జీవమేడ నుండు?భావమెక్కడ నుండు? కాపురంబు లేడ గదిసియుండు ?తనరుచున్న రెంటి స్థలమేల తెలియరు ? వి. వే.

    జీవమేడ నుండు?భావమెక్కడ నుండు?
    కాపురంబు లేడ గదిసియుండు?
    తనరుచున్న రెంటి స్థలమేల
    తెలియరు ? వి. వే.

    జీవ భావములు దేహములోనే ఇమిడియున్నవి . అవి ఏయే స్థానముల సంబంధము కల్గియున్నదియు మానవులు తెలిసికోరు

    Life's attributes are embedded in our bodies. Men don't know the relationships within their bodies

    998
    జీవాత్ముడెప్పుడుండెడి తావును దా తెలియలేక తగనస్థిరమున్ భావమున నమ్మి తిరిగెడి జీవికి ధర ముక్తి కల్గజెల్లునె వేమా!

    జీవాత్ముడెప్పుడుండెడి తావును
    దా తెలియలేక తగనస్థిరమున్ భావమున
    నమ్మి తిరిగెడి జీవికి ధర
    ముక్తి కల్గజెల్లునె వేమా

    జీవాత్మయందు స్థలమును తెలిసికోలేక అస్థిరమును దైవముగా భావించి తిరుగు జీవులకు మోక్షమెట్లు కలుగును?

    How can men attain salvation when they are searching for God in impermanent objects rather than the permanent aatma?

    999
    జీవి జీవి జంప శివుని చంపుటెయగు జీవుడరసి తెలియ శివుడు కాడె?భావమందు దీని బరికించి చూడుము, వి. వే.

    జీవి జీవి జంప శివుని చంపుటెయగు
    జీవుడరసి తెలియ శివుడు
    కాడె?భావమందు దీని బరికించి
    చూడుము, వి. వే.

    జీవుడు శివుడు ఒక్కటే. జీవిని చంపినచో శివుని చంపుటయే యగును. ఈ యంశమును యోచించి గ్రహించవలెను

    There is no difference between human beings and God. Killing a fellow human is akin to hurting God

    1000
    జీవుడిలను నిండి సృష్టిలో నుండంగ శివుని వెదుకబోవు జీవుడహహ ! జీవుడు శివిడును చిహ్నంబు తెలియక, వి. వే.

    జీవుడిలను నిండి సృష్టిలో
    నుండంగ శివుని వెదుకబోవు జీవుడహహ!
    జీవుడు శివిడును
    చిహ్నంబు తెలియక, వి. వే.

    జీవుడే శివుడు . జీవ శివులకు భేదము తలచి , శివుని కొరకు పైచోట్లు వెదుకుచు నరుడు మోసపోవుచున్నాడు

    There is no difference between the creator and the created. Men are foolishly searching for God

    1001
    జల్లిమాటలనుచు జగమున దిరిగెడు కల్లగురుడు కట్టు నెల్లకర్మ పల్లుపురుగు చేరి పలవింప జేయదా ? వి. వే.

    జల్లిమాటలనుచు జగమున దిరిగెడు
    కల్లగురుడు కట్టు నెల్లకర్మ
    పల్లుపురుగు చేరి
    పలవింప జేయదా ? వి. వే.

    పంటిలో పురుగుచేరి బాధింపగా చెడ్డగురువులు పొల్లు మాటలు చెప్పి , కర్మములను ప్రోత్సహించుచు లోకమున తిరుగుదురు .

    With a tooth ache false gurus propagate wrong philosophy that encourages karma and roam around the world.

    1002
    జాణలైన యట్టి చపలాయతాక్షులు వలపులరసి చూచి బ్రమయనేల ? బయలి రూపులెల్ల పరికింపగానేల ? వి. వే.

    జాణలైన యట్టి చపలాయతాక్షులు
    వలపులరసి చూచి బ్రమయనేల?
    బయలి రూపులెల్ల పరికింపగానేల?
    వి. వే.

    నేర్పరులై వాల్చూపులచే భ్రమింపజేయు యువతుల వలపులకు , వారి చక్కదనమునకును లొంగిపోకుము

    Some women are adept at luring men with their eyes and looks. Men should not yield to their advances.

    1003
    జ్ఞాన భావపథము గనుగొనకున్నను మానరాదు మనసు మమత దగిలి పూని జన్మములను బొందు దాబుడమిని , వి. వే.

    జ్ఞాన భావపథము గనుగొనకున్నను
    మానరాదు మనసు మమత దగిలి
    పూని జన్మములను బొందు
    దాబుడమిని , వి. వే.

    జ్ఞానమార్గమును తెలిసికొని దాని నవలింబింపనంతవరకు మానవుడు మమత్వము కలిగి జన్మములను పొందుచునేయుండును .

    Until a man realizes the path of knowledge that frees him from bondage, he will be caught in the life-death cycle.

    1004
    తనదు నాత్మయందు దైవంబు గలుగంగ తీర్థయాత్రలు కిల తిరుగు నరుడు గంధపు దునకల గాడ్దె మోసినయట్లు , వి. వే.

    తనదు నాత్మయందు దైవంబు గలుగంగ
    తీర్థయాత్రలు కిల తిరుగు
    నరుడు గంధపు దునకల గాడ్దె
    మోసినయట్లు , వి. వే.

    తనలోనే దేవుడు౦డగా , తీర్థయాత్రలకు పోవుట వ్యర్థము . అట్టివాడు గంధపుచెక్కలను మోయ గాడిదతో సమానుడు

    When god resides in oneself there is no use in going on pilgrimage to holy places in search of him. He is like a donkey that carries sandal wood.

    1005
    తనదులోని జీవతత్త్వము తెలియక వేఱుయనుచు దలచి వెతకుటెల్ల భానునరయ దివ్వె పట్టినరీతిరా , వి. వే.

    తనదులోని జీవతత్త్వము తెలియక
    వేఱుయనుచు దలచి వెతకుటెల్ల
    భానునరయ దివ్వె
    పట్టినరీతిరా , వి. వే.

    తనలోనున్న పరుని తత్త్వము తెలియక వేరోచోట వెదకుట సూర్యుని దీపముతో వెదకుచున్నట్లగును

    Without realizing that god is in oneself, searching for him in various places is like carrying a torch in bright sunlight.

    1006
    తనువు నడవిజేసి తనలోనె గూర్చుండి తపము చేయలేని తపసులెల్ల నడవియందు జేరి యలజడి పడెదరు , వి. వే.

    తనువు నడవిజేసి తనలోనె గూర్చుండి
    తపము చేయలేని తపసులెల్ల
    నడవియందు జేరి
    యలజడి పడెదరు , వి. వే.

    తన దేహమును అడవిలోనుండి ధ్యానము చేసిన ఆత్మ తత్త్వము తెలియును . మునులై అడవులకుపోయి శ్రమపడనక్కరలేదు

    1007
    తన్నుదెలియకున్న దగ వేదములు వెఱ్ఱి సర్వసంపదల మూసాబు వెఱ్ఱి ఆఱు శాస్త్రములు నికా పురాణములును జబ్బులనుచు జగతి జాటు వేమ!

    తన్నుదెలియకున్న దగ వేదములు వెఱ్ఱి
    సర్వసంపదల మూసాబు వెఱ్ఱి
    ఆఱు శాస్త్రములు నికా పురాణములును
    జబ్బులనుచు జగతి జాటు వేమ

    ఆత్మజ్ఞానములేని వేద, శాస్త్ర , పురాణాదుల పఠనము వ్యర్థము. ఆ జ్ఞానములేనివాని సంపదలును వ్యర్థములు

    It is a waste when one without the knowledge about aatma reads vedas, saastras and puranas. The wealth of such a person is also a waste

    1008
    తమ్ము దెలియనట్టి దైవజ్ఞు లెన్న౦గ నిన్ను దెలియరేని నిలువరైరి మాయ దెలియకున్న మంటిపాలైరయా , వి. వే.

    తమ్ము దెలియనట్టి దైవజ్ఞు
    లెన్న౦గ నిన్ను దెలియరేని
    నిలువరైరి మాయ దెలియకున్న
    మంటిపాలైరయా , వి. వే.

    తమ్ము తాము తెలిసికోలేని జోస్యులు నీకు జోస్యము చెప్పబూని విఫలులై మాయ తెలియలేక నశించుచున్నారు

    Astrologers who can't predict their own fate, try to advise others and fail without realizing the maaya (illusion).

    1009
    తమకు సాటియండ్రు దైవజ్ఞులగు నరుల్ పరగ గూఢభావ మెఱుగలేక ఇట్లు మాయబడిన నెట్లు తెలియును మాయ ? వి. వే.

    తమకు సాటియండ్రు దైవజ్ఞులగు
    నరుల్ పరగ గూఢభావ మెఱుగలేక
    ఇట్లు మాయబడిన నెట్లు
    తెలియును మాయ ? వి. వే.

    జోస్యులు తమకు ఆగతానాగతములు తెలియునని వ్యర్థముగా పల్కి మాయలో పడుదురు . మాయలో పడినవారికి దాని తత్త్వము యెట్లు తెలియును ?

    Astrologers cheat by claiming they know all about the future. How can people under delusion know about their deceit?

    1010
    తమమున జచ్చిన మనుజుడు మమతను దాబుట్టుచుండు మరణముకొఱకే శ్రమదీర్చు గురుని వేడిన భ్రమమూల మిదజగత్తు బయలగు వేమా!

    తమమున జచ్చిన మనుజుడు మమతను
    దాబుట్టుచుండు మరణముకొఱకే శ్రమదీర్చు
    గురుని వేడిన భ్రమమూల
    మిదజగత్తు బయలగు వేమా

    మానవుడు జ్ఞానియై మమతవల్ల చచ్చుచు , పుట్టుచు నుండును . జ్ఞానమిచ్చు గురువు నాశ్రయించిన , ఇదియంతయు భ్రమయే అని తెలియగలదు

    A man being knowledgeable is caught in life-death cycle because of bondage. If he approaches a proper guru, he will realize it is all delusional.

    1011
    తరుణి సొగసుకాని దనయునిగన్నను మరుని కళలె మించి మనసు పాఱు పాపజాతిమనసు పట్టంగరాదయా , వి. వే.

    తరుణి సొగసుకాని దనయునిగన్నను
    మరుని కళలె మించి
    మనసు పాఱు పాపజాతిమనసు
    పట్టంగరాదయా , వి. వే.

    అందగాడైన పుత్రుని చూచినను , యువతికి వానిపై మనస్సు పోవును. ఈ మనస్సు చాలా చెడ్డది . దానిని నిలుపుట కష్టము

    A mother lusts for her handsome child. Such a mind is evil. It is hard to keep it still.

    1012
    తలను వ్రేలతీసి తొలిమించుకలేక యోగితెఱచు గన్ను మూగ జ్ఞానమది యెటౌను?కష్టంపు దేహమౌ , వి. వే.

    తలను వ్రేలతీసి తొలిమించుకలేక
    యోగితెఱచు గన్ను
    మూగ జ్ఞానమది యెటౌను?కష్టంపు
    దేహమౌ , వి. వే.

    యోగులు మనస్సు నిలుపలేక , తలక్రిందుగ వ్రేలబడి శరీరమును కష్టపెట్టుదురుకాని , దానివల్ల జ్ఞానము కలుగదు

    Some yogis without being able to control their minds, hang upside down. They don't receive any knowledge in such acts.

    1013
    తలపు చేతగల్గు తారక బ్రహ్మంబు తలచిచూడ దానె తత్త్వమగును తలపులోని తలపు తానె తన్నెఱిగిన , వి. వే.

    తలపు చేతగల్గు తారక బ్రహ్మంబు
    తలచిచూడ దానె తత్త్వమగును
    తలపులోని తలపు తానె
    తన్నెఱిగిన , వి. వే.

    తలపు నిలిపినచో తారకయోగమున బ్రహ్మమును తెలిసి కొనవచ్చును . తానే ఈశ్వరుడనని గ్రహించినచో సంకల్పము ఫలించును

    By keeping mind still, because of taaraka-yoga, one can realize the creator. A man's wish is fulfilled by understanding that self is eeswara (god).

    1014
    తలపు తలప గూలి తగసేయకీయడు వలపుతీర నీయగలుగు రూక ముక్తినీని గురుడు మ్రుచ్చులకొడుకాయా , వి. వే.

    తలపు తలప గూలి తగసేయకీయడు
    వలపుతీర నీయగలుగు రూక
    ముక్తినీని గురుడు మ్రుచ్చులకొడుకాయా,
    వి. వే.

    పనిచేయనిదే యజమాని కూలీయడు . వలపుతీర్చనిదే విటుడు డబ్బీయడు . ముక్తిమార్గము తెలుపని గురుడు దొంగ గురుడే !

    A master won't pay without performing work. A jon won't pay the prostitute until his wishes are fulfilled. A guru who won't teach the path to salvation is fake.

    1015
    తలపునందు శివుని దలపోయాగాలేక తలపదెల్ల బయటి తలపుజేసి తలపు తానయైన తత్త్వజ్ఞుడగు సుమీ! వి. వే.

    తలపునందు శివుని దలపోయాగాలేక
    తలపదెల్ల బయటి తలపుజేసి
    తలపు తానయైన తత్త్వజ్ఞుడగు
    సుమీ! వి. వే.

    మనస్సున దేవుని ధ్యానింపలేక బాహ్యవిషయములను గూర్చియే ఆలోచించిన ముక్తి అబ్బదు . మనస్సులో ఆత్మతత్త్వము నెరుగువాడే తత్త్వజ్ఞుడగును

    By being not able to meditate on god and always thinking about worldly things, one won't attain salvation. A knowledgeable person must understand aatma (soul).

    1016
    తలపులోని తలపు తలపోసి తెలియరా తలపులెల్ల విడిచి తగిన భంగి తలపులోని తలపు తత్త్వంబు నాత్మరా , వి. వే.

    తలపులోని తలపు తలపోసి తెలియరా
    తలపులెల్ల విడిచి తగిన
    భంగి తలపులోని తలపు తత్త్వంబు
    నాత్మరా , వి. వే.

    తలపులోని దేవుని నిరంతర ధ్యానముచే తెలిసికోవలెను . వేరే తలపులేక , ఆత్మతత్త్వము తెలిసికొనుటకు యత్నింపవలెను

    One has to meditate over god in the mind. Without other thoughts, one has to strive to learn about aatma (soul)

    1017
    తల్లితండ్రి కలరు తగ జన్మజన్మల తనకు డెల్పువాని గనగలేరు నాదమే పరమని నమ్మినవారికి నిహమునందు పరము నెసగు వేమ!

    తల్లితండ్రి కలరు తగ జన్మజన్మల
    తనకు డెల్పువాని గనగలేరు
    నాదమే పరమని నమ్మినవారికి
    నిహమునందు పరము నెసగు వేమ

    నీకు ప్రతి జన్మమున తలిదండ్రులు కలరు . కాని , తానెవరో తెలుపువారు కనిపించరు . నాదమే బ్రహ్మమని ఎరిగినవారి కీలోకముననే పరము కానవచ్చును

    One has parents in every birth. But there is no one who can tell the real self. One who realizes that naada (the sound of “aum”) is same as the creator, will attain nether world pleasures on the earth itself.

    1018
    తల్లితండ్రి చావదా దా నాలితోగూడి యిల్లుగట్టుకొన్న యింపులెల్ల కొఱతమీది దొంగ కూడడిగినయట్లు , వి. వే.

    తల్లితండ్రి చావదా దా నాలితోగూడి
    యిల్లుగట్టుకొన్న
    యింపులెల్ల కొఱతమీది దొంగ
    కూడడిగినయట్లు , వి. వే.

    తలిదండ్రులు బాధపడుచుండగా , ఇల్లాలిగూడి వైభవములను అనుభవించువాడు , కొరతపైనున్న తిండికి దేవిరించు దొంగవంటివాడు

    When parents are suffering, a person enjoying comforts with his wife is like a thief who craves for food during shortage.

    1019
    తల్లి గర్భమందు దా జనియించియు తనదు ప్రేమసతికి దానె పుట్ట దల్లు లిర్వురయ్యు తనువొక్కటయ్యెరా , వి. వే.

    తల్లి గర్భమందు దా జనియించియు
    తనదు ప్రేమసతికి దానె
    పుట్ట దల్లు లిర్వురయ్యు తనువొక్కటయ్యెరా,
    వి. వే.

    తల్లి గర్భమున పుట్టిన తాను తన భార్య గర్భమున పుత్రరూపమున పుట్టును . కాన తన కిర్వరు తల్లులును ఒక్క శరీరమే యగును

    A man will be born to his wife just as he was born to his mother. Hence he has two mothers but one body.

    1020
    తలితండ్రులనెడి తత్త్వంబు నెఱుగరు యోనిలింగముల నటుద్భవించి విష్ణువరయ తల్లి వెలయ శివుడు తండ్రి , వి. వే.

    తలితండ్రులనెడి తత్త్వంబు నెఱుగరు
    యోనిలింగముల నటుద్భవించి
    విష్ణువరయ తల్లి వెలయ
    శివుడు తండ్రి , వి. వే.

    తన పుట్టుకకు కారకులగు తల్లితండ్రుల తత్త్వము నెరుగకున్నారు . విష్ణువే తల్లి , శివుడే తండ్రి అని గ్రహింపవలెను

    One is unable to understand the parents who gave birth to him. Lord Vishnu is mother and Lord Siva is the father.

    1021
    తల్లితండ్రులెవరొ తనకు జన్మము లెన్నొ తిరుగనెఱుగునట్టి దిక్కులెన్నొ స్థిరము నస్థిరమును తెలియలేడజ్ఞాని , వి. వే.

    తల్లితండ్రులెవరొ తనకు జన్మము
    లెన్నొ తిరుగనెఱుగునట్టి దిక్కులెన్నొ
    స్థిరము నస్థిరమును
    తెలియలేడజ్ఞాని , వి. వే.

    మూఢుఢు తనకెన్ని జన్మలో , ఏయే జన్మల నెవ్వరెవ్వరు తలిదండ్రులో , ఏది స్థిరమో , ఏది అస్థిరమో తెలిసికొనలేకున్నాడు . ఆలోచించిన ఇది భగవన్మాయ యని తెలియును

    A foolish person won't know how many times he was born, who are his parents in each birth, what is permanent and what is temporary. These are all illusory by the design of the god.

    1022
    తల్లియేడ్వ వినక తనయాలు వగచిన జాలిపడెడువాడు జడుడు సుమ్మి తారతమ్య మెఱుగనేరని పశువువాడు , వి. వే.

    తల్లియేడ్వ వినక తనయాలు వగచిన
    జాలిపడెడువాడు జడుడు
    సుమ్మి తారతమ్య మెఱుగనేరని
    పశువువాడు , వి. వే.

    తల్లి దుఃఖించిన లెక్కింపక భార్య దుఃఖించినచో జాలిపడేవాడు మూర్ఖుడు . వాడు హెచ్చుతగ్గులెరుగని పశువు

    When one sympathizes with wife in grief but not his mother in sorrow, he is a foolish person who does not realize the hierarchy like a bull.

    1023
    తాననంగ నెవడొ తనవార లెవ్వరొ తెలిసి తెలియలేడు తిక్కనరుడు అరిది పిసినికాయ పురుగుపద్దతిలాగు , వి. వే.

    తాననంగ నెవడొ తనవార లెవ్వరొ
    తెలిసి తెలియలేడు తిక్కనరుడు
    అరిది పిసినికాయ పురుగుపద్దతిలాగు,
    వి. వే.

    తానెవరో , తనవారెవ్వరో తెలిసికొనలేని మూఢుఢు పిసినికాయలోని పురుగువలె ఉన్నచోటనే చిక్కి పేరులేక నశించును

    Without knowing about self and his relations a foolish person will perish like the silk worm in the cocoon.

    1024
    తాను తానెయనెడి తత్త్వంబులోగల యన్వయంబు దెలియ డబ్బతోడు తాను తానెయైన దల్లడంబేలరా ? వి. వే.

    తాను తానెయనెడి తత్త్వంబులోగల
    యన్వయంబు దెలియ
    డబ్బతోడు తాను తానెయైన
    దల్లడంబేలరా ? వి. వే.

    అవివేకి యోగి తనలోనే దేవుడున్న తత్త్వమును తెలిసికొనలేక యవస్థపడును . ఆత్మతత్త్వమే తెలిసినచో కలతపాటు౦డదు

    An ignorant yogi struggles without realizing that god is within him. There is no confusion when one is knowledgeable about aatma (soul)

    1025
    తాను తనువటంచు ద్వయమును పలికి మోహవార్థిలోన మునుగు నరుడు కానలేడు మోక్షగతి యెట్లు సిద్ధించు ? వి. వే.

    తాను తనువటంచు ద్వయమును పలికి
    మోహవార్థిలోన మునుగు నరుడు
    కానలేడు మోక్షగతి యెట్లు
    సిద్ధించు ? వి. వే.

    తాను, తన శరీరము ఒక్కటేయని తలుచువాడు అజ్ఞానమున మునిగి మోక్షము పొందలేడు . తత్త్వమెరుగక మోక్షము కల్గదు

    A person deluding that self and body are the same will always be ignorant and cannot attain salvation.

    1026
    తాను వెలయు భూమి దనరంగ దిరిగెడి జనులగాంచి పొంచి పరగగఱుచు జనులగాంచి పొంచి పరగగఱచు కుక్కబుద్ధియంట గుణమేల మానును? వి. వే.

    తాను వెలయు భూమి దనరంగ దిరిగెడి
    జనులగాంచి పొంచి పరగగఱుచు జనులగాంచి
    పొంచి పరగగఱచు కుక్కబుద్ధియంట
    గుణమేల మానును? వి. వే.

    తాను కాచుచున్న యింటికి వచ్చుపోవువారినిగూడ కుక్క కఱచును . దాని నీచబుద్ధి పోదు . అట్లే మూర్ఖులును నీచబుద్ధి విడువరు .

    A dog will bark at anyone who visits the home. Some times it bites too. Similarly a low life cannot give up his foolishness.

    1027
    తానె తత్త్వమనుచు దలపోయగాలేక మాయతత్త్వమనుచు మఱుగుచుండు కర్మఫలములేక కలుగునా తత్త్వంబు ? వి. వే.

    తానె తత్త్వమనుచు దలపోయగాలేక
    మాయతత్త్వమనుచు మఱుగుచుండు
    కర్మఫలములేక కలుగునా
    తత్త్వంబు ? వి. వే.

    జీవుడు తానే బ్రహ్మమని తెలియలేక మాయనే తత్త్వముగా ఎంచును . పూర్వజన్మ సత్కర్మ ఫలముననే మోక్షము సిద్ధించును

    A jiva will think illusion is the true knowledge without realizing the creator. One attains salvation because of good karma performed in previous lives.

    1028
    తాముకన్నవారు తాముగన్నవారును చచ్చుటెల్ల తమకు సాక్ష్యమే కద ! బ్రతుకుటెల్ల దెలియ బ్రహ్మకల్పంబులా , వి. వే.

    తాముకన్నవారు తాముగన్నవారును
    చచ్చుటెల్ల తమకు సాక్ష్యమే
    కద ! బ్రతుకుటెల్ల దెలియ
    బ్రహ్మకల్పంబులా , వి. వే.

    తల్లితండ్రులు , సుతులు చచ్చుట కనులారా చూచుచున్నాము . జీవతత్త్వము తెలిసిన బ్రహ్మము తెలియును

    We are witnessing the death of parents and children with our own eyes. Once we understand the jiva, the knowledge about creator will be apparent.

    1029
    తిట్టెనేని గొట్టు కొట్టిన గొట్టును కొట్టెనేని యముడు కొద్దిపఱచు కోపమె౦చ జేర్చు బాపపు నరహత్య , వి. వే.

    తిట్టెనేని గొట్టు కొట్టిన
    గొట్టును కొట్టెనేని యముడు
    కొద్దిపఱచు కోపమె౦చ జేర్చు
    బాపపు నరహత్య , వి. వే.

    మనము పైవారిని తిట్టినను కొట్టినను పరలోకమున యముడు శిక్షించి యవమానించును . కోపము నరహత్యవంటిది

    If we abuse our superiors, the lord of death will punish us. Anger is like killing a fellow human.

    1030
    తిరుగవలయు మనసు తిరిగినవఱకును తిరుగునట్టి మనసు విరుగవలయు తిరిగి విరిగెనేని దేవుడు తానగు , వి. వే.

    తిరుగవలయు మనసు తిరిగినవఱకును
    తిరుగునట్టి మనసు విరుగవలయు
    తిరిగి విరిగెనేని
    దేవుడు తానగు , వి. వే.

    కోరిక నెరవేరువరకు విషయసుఖము లనుభవించి , పిదప మనస్సును దైవముపై పూర్తిగా మళ్ళించినచో తానే దేవుడు కావచ్చును

    When one enjoys life for as long as desires are not met, and then turns the mind towards God completely, he can become god himself

    1031
    తీర్థయాత్ర కనుచు దిరుగబోయినవాడు పామరుడుగాక భక్తుడగునె ?తీర్థయాత్ర చేత దివ్యుడు కాలేడు , వి. వే.

    తీర్థయాత్ర కనుచు దిరుగబోయినవాడు
    పామరుడుగాక భక్తుడగునె?
    తీర్థయాత్ర చేత దివ్యుడు
    కాలేడు , వి. వే.

    తీర్థయాత్రలకు పోవుట వ్యర్థము . అంతమాత్రమున భక్తుడు దివ్యుడు కాలేడు . భక్తి ముఖ్యము . తిరుగుట ముఖ్యము కాదు

    Going on pilgrimage is a waste. A devotee cannot become great by visiting holy places. Devotion is important but not the travels.

    1032
    తుంట వింటికాని తూపుల ఘాతకు మింటి మంటి నడుమ విడుక దరమె ?ఇంటియాలి విడిచి యెట్లు౦డవచ్చురా , వి. వే.

    తుంట వింటికాని తూపుల ఘాతకు
    మింటి మంటి నడుమ విడుక
    దరమె ?ఇంటియాలి విడిచి యెట్లు౦డవచ్చురా,
    వి. వే.

    భూమ్యాకాశములమధ్య యున్నవాడెవ్వడును మరుని బాణముల దెబ్బకు తాళలేరు . భార్యను విడిచియుండుటెంతో కష్టము

    One living on the earth cannot withstand the arrows from maru (Manmatha or cupid). It is very hard to live apart from wife.

    1033
    తులసిక్షీరములును దూముపై నీరము పరచి దాన దుష్టపాలుపోసి కరగి రాగిపైని క్రమముగా నుంచరా, వి. వే.

    తులసిక్షీరములును దూముపై
    నీరము పరచి దాన దుష్టపాలుపోసి
    కరగి రాగిపైని క్రమముగా
    నుంచరా, వి. వే.

    తులసిక్షారము , తూమునీరు , దానిపై దుష్టపాలు పోసి కరిగించి రాగిపై పోసినయెడల ఆ రాగి బంగారమగును

    It is possible to convert copper to gold by using the water from tulsi plant (Ocymum sanctum ), village water and milk.

    1034
    తెరమఱుగునగల తేజమంతయుజూచి మఱియు బ్రహ్మమందు మనసునిలిపి గరిమనున్నయట్టి ఘనులెందుగలరాయా , వి. వే.

    తెరమఱుగునగల తేజమంతయుజూచి
    మఱియు బ్రహ్మమందు మనసునిలిపి
    గరిమనున్నయట్టి ఘనులెందుగలరాయా,
    వి. వే.

    మాయావృతమగు బ్రహ్మస్వరూపామును గుర్తించి మనస్సును దానిపైనే నిలిపి బ్రహ్మసాక్షాత్కారము పొందువారు అరుదుగా నుందురు

    People who can break maaya (delusion) and visualize the form of the creator and remain steadfast can see the creator. Such people are rare.

    1035
    తెలియ భాగవతులె తెలివిగలారింక నందఱెట్టులగుదు రకట భువిని అయినవారిని గనునతడెపో శివయోగి, వి. వే.

    తెలియ భాగవతులె తెలివిగలారింక
    నందఱెట్టులగుదు రకట
    భువిని అయినవారిని గనునతడెపో
    శివయోగి, వి. వే.

    భగవత్భక్తులే విజ్ఞులు . ఇతరులు కారు. అట్టి భక్తులను గుర్తింపగలవాడే శివయోగి

    Only god's devotees are real but not others. A Siva yogi is one who recognizes such devotees.

    1036
    తెలివి నిలిపిచూడు దీపించు నాకళల్ కళలుడుగక చూడు కలుగుబయలు బయలునంటి చూడ బ్రహ్మంబు గాంచెదు , వి. వే.

    తెలివి నిలిపిచూడు దీపించు
    నాకళల్ కళలుడుగక చూడు కలుగుబయలు
    బయలునంటి చూడ బ్రహ్మంబు
    గాంచెదు , వి. వే.

    మనస్సును నిలుకడగానుంచి చూచిన బిందుకళలుదయించును . వానిని స్థిరదృష్టితో చూచిన మహదాకాశము కానబడును . పిదప బ్రహ్మము సాక్షాత్కరించును

    By keeping the mind still one can observer bindu-kalas. When one is fixated on them, one can see the infinite space. Then the creator will be visible.

    1037
    తెలియ తనదు భార్య తెగబాఱు సంకెల చిన్న శిశువులెల్ల చీలలరయ అరసిచూడ దనువె యల చెఱసాలరా , వి. వే.

    తెలియ తనదు భార్య తెగబాఱు
    సంకెల చిన్న శిశువులెల్ల
    చీలలరయ అరసిచూడ దనువె
    యల చెఱసాలరా , వి. వే.

    నరునకు దేహమే చెరసాల , భార్యయే సంకెల , చిన్నబిడ్డలు దాని చీలలు . ఆ బంధమునుండి విడుదలకు యత్నింపుము

    A man's body is his prison. His wife is the shackles. The little kids are the nails on the shackles. One has to strive to free oneself from such relationships.

    1038
    తెలుపుమాయటంచు దేవరయంచును వెంటబడెడువారి వెతలదీర్ప నెవ్వడైనజెప్పు నేదైన నొక్కటి , వి. వే.

    తెలుపుమాయటంచు దేవరయంచును
    వెంటబడెడువారి వెతలదీర్ప
    నెవ్వడైనజెప్పు నేదైన
    నొక్కటి , వి. వే.

    అజ్ఞులై అందరివెంటనుబడి చెప్పుము చెప్పుమని వేడిన ఎవరో ఒకరు ఏదో చెప్పుదురు . అది ప్రమాణము కాదు

    Being ignorant when one goes after any one seeking knowledge, he will receive whatever they tell him. Such knowledge will not be considered as the standard.

    1039
    తొడలమెఱుపు మోవి తోరపుగుచములు నోరకొప్పు గల్గు నువిదజూచి విటుడు నిలువగలడె విరహాగ్నిజూరకయె , వి. వే.

    తొడలమెఱుపు మోవి తోరపుగుచములు
    నోరకొప్పు గల్గు నువిదజూచి
    విటుడు నిలువగలడె విరహాగ్నిజూరకయె,
    వి. వే.

    యువతుల తొడలు , మోవి, స్తనములు , కొప్పుల యందము చూచి విటుడు విరహాగ్నిచే తపించిపోవును . (మోహము చెడ్డది)

    By lusting over the various organs of a woman, a man will endure pain.

    1040
    తొత్తుతోడి పొందు దోషంబు దోషంబు లంజెతోడి పొందు లజ్జ చెఱుపు జాండ్రతోడి పొందు చావునకేయగు , వి. వే.

    తొత్తుతోడి పొందు దోషంబు
    దోషంబు లంజెతోడి పొందు లజ్జ
    చెఱుపు జాండ్రతోడి పొందు
    చావునకేయగు , వి. వే.

    దాసిదానిపొందు చాల తప్పు . లంజెపొందు సిగ్గుచేటు . జాండ్రదానిని పొందిన ప్రాణహాని కలుగును

    It is a mistake to fall in love with one's servant. It is shameful to visit a prostitute. Falling in love with a weaver can threaten one's life.

    1041
    తోలు ఘటములోన దొలగక యున్నప్పు డాలుమగలు ప్రీతి నలరుచుంద్రు జీవిఘటము విడువ జిక్కూడిపోవురా , వి. వే.

    తోలు ఘటములోన దొలగక యున్నప్పు
    డాలుమగలు ప్రీతి నలరుచుంద్రు
    జీవిఘటము విడువ జిక్కూడిపోవురా,
    వి. వే.

    దేహములో జీవుడున్నంతవరకు భార్యాభర్తలు సుఖముతో ఉందురు. జీవి దేహమును విడువగనే ఆ బంధము తెగును

    For as long as the jiva has the body, the relationship between a wife and a husband will be pleasant. When jiva leaves the body, the relationship is severed.

    1042
    దశమి యేకాదశియని వ్రతములు పూని మెదుకు తినకున్న దుర్గుణమది యడగునె పుట్టపైగొట్ట నురగంబు గిట్టబోదు తీరెఱుగని మౌఢ్యమీతెఱగు వేమ!

    దశమి యేకాదశియని వ్రతములు పూని మెదుకు
    తినకున్న దుర్గుణమది యడగునె
    పుట్టపైగొట్ట నురగంబు గిట్టబోదు
    తీరెఱుగని మౌఢ్యమీతెఱగు వేమ

    ఏకాదశి మున్నగు దినములలో ఉపవాసమున్న మాత్రమున చెడ్డగుణములు పోవు. పుట్టమీద కొట్టిన లోనున్న పాము చచ్చునా ?

    Fasting on certain days of the calendar won't remove bad qualities. Will the snake die when one hits at its hill?

    1043
    దృశ్యమైనదాని దెలిసి నమ్మెదరట్లు కానిదాని నమ్మ బూనుకొనరు కానిదృశ్యమగుట కానరే యదియేల? వి. వే.

    దృశ్యమైనదాని దెలిసి నమ్మెదరట్లు
    కానిదాని నమ్మ
    బూనుకొనరు కానిదృశ్యమగుట
    కానరే యదియేల? వి. వే.

    జనులు చూచినదానినేగాని చూడనిదానిని నమ్మరు. కారణములనుబట్టి దృశ్యమగుచున్న బ్రహ్మమునేల నమ్మరో తెలియదు

    People won't believe in invisible things. It is not clear why they don't believe in the creator who is apparent to anyone who seeks him.

    1044
    దేవళములలోను తీర్థంబులందును మూలమెఱుగకున్న ముక్తిలేదు ఆత్మమూలమెఱుగ డదియెట్లు తెలియును ? వి. వే.

    దేవళములలోను తీర్థంబులందును
    మూలమెఱుగకున్న ముక్తిలేదు
    ఆత్మమూలమెఱుగ డదియెట్లు
    తెలియును ? వి. వే.

    దేవాలయములకు , తీర్థములకు ఏల పోవలెనో తెలియనివాడు , ఆత్మమూల మెరుగనివాడు ముక్తినెట్లు పొందగలడు ?

    One who does not know the reason to visit temples and go on pilgrimage and without realizing the aatama (soul) cannot attain salvation.

    1045
    దేహాభిమాన ముండగ మోహాదులు విడుచునెట్లు మునులకునైనన్ సాహసమున నది విడువగ సోహమ్మని యెఱుగవచ్చు సుమ్మీ , వి. వే.

    దేహాభిమాన ముండగ మోహాదులు విడుచునెట్లు
    మునులకునైనన్ సాహసమున
    నది విడువగ సోహమ్మని యెఱుగవచ్చు
    సుమ్మీ , వి. వే.

    దేహాభిమానమున్నప్పుడు మునులుకూడ మోహాదులను విడువలేరు . దానిని విడిచిననే "ఆ బ్రహ్మమును నేను " అని తెలిసికొనవచ్చును

    With bondage to one's body, even rishis cannot give up desires. The ones who renounces the attachment with one's body, will know that the self is the creator.

    1046
    నమ్మినట్టెయుండి నౌక భూతమనగ చావ బొరలవేసి చక్కబోవు నితగాడాయినను నిట్లేల పోనిచ్చు , వి. వే.

    నమ్మినట్టెయుండి నౌక భూతమనగ
    చావ బొరలవేసి చక్కబోవు
    నితగాడాయినను నిట్లేల
    పోనిచ్చు , వి. వే.

    నౌక ప్రయాణికులను నమ్మించి ఒక్కొక్కప్పుడు తలక్రిందులై మునుగును. ఈతగాడైన నావికుడు దానిని మునుగనీయడు . అట్లే తత్త్వమెరిగిన సంసారమున మునగనక్కరలేదు

    Some times a boat carrying people can collapse and turn upside down in water. A navigator who can swim well won't let it sink. Similarly with spiritual knowledge one need not be entangled in bondage.

    1047
    నరుడట పరమాత్మ గురుని జేసినయప్డు హస్తమందు మోక్షమపుడె చూపు విరివి సంపదలను విఱ్ఱవీగిన జీవి పర మెఱుగడు యముని పాలె వేమ!

    నరుడట పరమాత్మ గురుని జేసినయప్డు
    హస్తమందు మోక్షమపుడె చూపు
    విరివి సంపదలను విఱ్ఱవీగిన జీవి
    పర మెఱుగడు యముని పాలె వేమ

    నరుడు ఉత్తముడగు గురుని చేరినచో ముక్తిని పొందగలడు . సంపదగలదని గర్వించి ఉపేక్షించిన ముక్తి లభింపదు

    A person by seeking a proper guru can attain salvation. He cannot attain salvation by being egotistical about his wealth

    1048
    నాదు నీదటంచు ననువుగా బల్కిన కాదుకాదటంచు గాలద్రొక్కి పాదుకొనెడియుక్తి బడయనివారికి చేదు పుట్టి ముక్తి చెడును వేమ !

    నాదు నీదటంచు ననువుగా బల్కిన
    కాదుకాదటంచు గాలద్రొక్కి పాదుకొనెడియుక్తి
    బడయనివారికి చేదు
    పుట్టి ముక్తి చెడును వేమ

    నాది , నీది అని భేదబుద్ధిచూప ; కాదని , సర్వమీశ్వరునిదే అని యుక్తిగా చెప్పనివానికి ముక్తి లేదు

    Everything belongs to Lord Siva. A person not knowing this and counting his and others' property as different can never attain salvation.

    1049
    నిద్రలోని నిద్ర నిర్భేద్యమనదగు తామసంపు నిద్ర తలగద్రోచి సతతమదియె పూన సర్వదాయోగియౌ , వి. వే.

    నిద్రలోని నిద్ర నిర్భేద్యమనదగు
    తామసంపు నిద్ర తలగద్రోచి
    సతతమదియె పూన సర్వదాయోగియౌ,
    వి. వే.

    యోగనిద్ర యితరులు మేలుకొల్పలేనిది . అట్టి నిద్రా సుఖము కలవారికి అజ్ఞానము అంటుకొనదు . యోగముకలవాడే యోగి

    When one is in the yoga-nidra (sleep) , no one can wake him up. People with such comfortable sleep will not be ignorant. A yogi is one with such knowledge.

    1050
    నిబిడమైన తమము నిక్కి దాటగలేక గుబురుబట్ట బయలు గూడుటెట్లు ప్రబలుచున్న మదిని పాలించుచుండును , వి. వే.

    నిబిడమైన తమము నిక్కి దాటగలేక
    గుబురుబట్ట బయలు గూడుటెట్లు
    ప్రబలుచున్న మదిని పాలించుచుండును,
    వి. వే.

    అధికమైన అజ్ఞానము నశించునంతవరకు ఈశ్వరజ్యోతి కానరాదు . అది హృదయములో వెలుగుచున్నను అజ్ఞానదృష్టికి గోచరించదు

    Until the ignorance is destroyed, the resplendence of Lord Siva cannot be seen. Even though it is present in one's heart region, it won't be visible.

    1051
    నిర్మలజ్ఞాన పరిపూర్ణ నిష్ఠయందు కర్మసన్యాస యోగియై కసిమసంగి మర్మమెఱుగుచు నుండుటే మౌనమయ్య ధర్మమింతియె బోధించు ధరణి వేమ !

    నిర్మలజ్ఞాన పరిపూర్ణ నిష్ఠయందు
    కర్మసన్యాస యోగియై కసిమసంగి మర్మమెఱుగుచు
    నుండుటే మౌనమయ్య ధర్మమింతియె
    బోధించు ధరణి వేమ

    నిర్మలజ్ఞానము కల్గి , కర్మములు విడిచి , నిష్ఠతోనుండి మర్మమెరిగి మోక్షరహస్యము మెరుగుటయే యోగము

    With clear knowledge, by giving up karma, by remaining pious and by learning the secret of salvation, one attains yoga.

    1052
    నీరు నన్నములును నిదురయు దా మాని ముక్తికొఱకు తిరుగు మూఢజనుడు వెఱ్ఱికుక్కయట్లు వేసరి తిరుగురా , వి. వే.

    నీరు నన్నములును నిదురయు దా
    మాని ముక్తికొఱకు తిరుగు
    మూఢజనుడు వెఱ్ఱికుక్కయట్లు
    వేసరి తిరుగురా , వి. వే.

    అన్నపానములు , నిద్ర మాని ; ముక్తికై తిరుగువాడు మూఢుఢు , వాడూరివెంట తిరుగు వెర్రికుక్కవంటివాడు

    One who searches for salvation by giving up food and sleep is like a stray dog that roams around the town.

    1053
    నీళ్ళమీద బుగ్గ నిలిచిన యప్పుడు తళ్ళువేగవచ్చి తాకుగాదె విడెడు కుండకింత విభ్రాంతి యేలరా , వి. వే.

    నీళ్ళమీద బుగ్గ నిలిచిన యప్పుడు
    తళ్ళువేగవచ్చి తాకుగాదె
    విడెడు కుండకింత విభ్రాంతి
    యేలరా , వి. వే.

    నీటిబుడగ అల రాగానే నశించునట్లు క్షణికమై నశించు ఈ శరీరమునకై ఇన్ని పాట్లేల ? భ్రాంతియేల?

    Like an air bubble that is evanescent and lasts for as long as a wave, why go to great lengths for a body that won't last for ever? Why the delusion?

    1054
    నీళ్ళమునుగువాడు నిర్మలాత్ముడుకాడు పూర్ణ మైన ముక్తి బొందలేడు నీరుకోడి యెపుడు నీళ్ళనుమున్గదా ? వి. వే.

    నీళ్ళమునుగువాడు నిర్మలాత్ముడుకాడు
    పూర్ణ మైన ముక్తి
    బొందలేడు నీరుకోడి యెపుడు
    నీళ్ళనుమున్గదా ? వి. వే.

    నదీస్నానము చేసినంతనే ముక్తిలేదు . అట్టివాడు నీరుకోడివంటివాడు . నీరుకోడి స్నానము చేయుచునే యుండును

    There is no use in dipping in rivers. One is like water-fowl that keep on dipping in water.

    1055
    పడతి జూచినపుడె పాలిండ్లపై నాశ నుడుగలేక మనుజు డుపచరించి యిడుములొంది పొంది యిలబట్టి చచ్చును , వి. వే.

    పడతి జూచినపుడె పాలిండ్లపై
    నాశ నుడుగలేక మనుజు డుపచరించి
    యిడుములొంది పొంది యిలబట్టి
    చచ్చును , వి. వే.

    పొలతి స్తనముల చక్కదనము చూచి , విడువలేక ఆమెను సేవించు మూఢుడు ఎన్నో శ్రమలుపడి చచ్చునేగాని ముక్తిని పొందడు

    A foolish person lusting over a woman's bosom serves her in bondage, will die with grief rather than attain salvation

    1056
    పక్షిజాతిబట్టి పరగ హింసలుబెట్టి కుక్షినిండ కూడు కూరుటకును వండి తినెడివాడు వసుధ చండాలుడు , వి. వే.

    పక్షిజాతిబట్టి పరగ హింసలుబెట్టి
    కుక్షినిండ కూడు కూరుటకును
    వండి తినెడివాడు
    వసుధ చండాలుడు , వి. వే.

    పక్షులను పట్టి , చంపి తినువాడే చండాలుడు .

    A person who captures and eats birds is a low-life

    1057
    పిండమగుచు దల్లి పెనుగర్భమున నుండి పూర్వకర్మమెంచి పొరలియేడ్చి ధరణి బుట్టి యద్ది మఱచి వర్తించురా , వి. వే.

    పిండమగుచు దల్లి పెనుగర్భమున
    నుండి పూర్వకర్మమెంచి పొరలియేడ్చి
    ధరణి బుట్టి యద్ది
    మఱచి వర్తించురా , వి. వే.

    బిడ్డ తల్లిగర్భములో ఉన్నప్పుడు తన పూర్వకర్మమును తలచి మిక్కిలి దుఃఖించును . నేలపై పడగానే దానిని మరచిపోవును

    When one is still in the womb, he suffers in grief by remembering the karma performed in the previous lives. Once he comes out of the womb he forgets it.

    1058
    పటువుగాను బుద్ధి పరికించి నొక్కుచు కుటిల గుణములన్ని కూలద్రొక్కి పటుతరంపు మోహపటలంబు వీడరా , వి. వే.

    పటువుగాను బుద్ధి పరికించి
    నొక్కుచు కుటిల గుణములన్ని
    కూలద్రొక్కి పటుతరంపు మోహపటలంబు
    వీడరా , వి. వే.

    బుద్ధియందు బాగుగా పరిశీలించుచు చెడ్డగుణములను విడిచి అజ్ఞానమును నశింపజేయుము

    By focusing mind, one has to give up bad practices and remove his ignorance

  • No comments:

    Post a Comment