Saturday, February 8, 2020

Dhairya-Paddati


779
అచ్చుపడగ మనసు మచ్చిక చేపట్టి ముచ్చటించి శివుని మూర్తిజూచి కుచ్చితంబు మాని చొచ్చుట యోగంబు , వి. వే.

అచ్చుపడగ మనసు మచ్చిక చేపట్టి
ముచ్చటించి శివుని మూర్తిజూచి
కుచ్చితంబు మాని చొచ్చుట
యోగంబు , వి. వే.

ధైర్యముతో మనస్సును నిల్పి కల్మషము విడిచి భగవంతుని చూచుటయే యోగము

The vision of God witnessed with untainted and fearless mind is the true yoga

780
అవని ధైర్యమూని యతిశయ కాముడై నిన్ను నమ్మి నిష్ఠ నెగడుచుండి నిన్ను గొల్వ ముక్తి నిశ్చయముగ గల్గు , వి. వే.

అవని ధైర్యమూని యతిశయ కాముడై
నిన్ను నమ్మి నిష్ఠ నెగడుచుండి
నిన్ను గొల్వ ముక్తి
నిశ్చయముగ గల్గు , వి. వే.

తన ఘనతను గోరి భగవంతుని నమ్మి ధైర్యము వహించి అతనిని సేవించినచో ముక్తి కలుగును

Aspiring for his well-being one who believes in God and is courageous and unwavering with devotion, attains salvation.

781
అంతరంగమందు నభువు నుద్దేశించి తలప దలప ముక్తి తనకు గలుగు బాహ్యరంగమందు భయమంద ఫలమేమి ? వి. వే.

అంతరంగమందు నభువు నుద్దేశించి
తలప దలప ముక్తి తనకు
గలుగు బాహ్యరంగమందు భయమంద
ఫలమేమి ? వి. వే.

మనస్సులో భగవంతుని నిల్పి , ధైర్యముతో మననము చేయగా చేయగా ముక్తి లభించును . బాహ్యములను చూచి భయపడవద్దు

Fixating the mind over God and reflecting over him with courage will lead one towards salvation. One should not fear the external events and things.

782
అదరిపడక మనసు నానందమును గోరి మదిని మెలగువాడు మాన్యుడరయ సదమలత్వమునను శాశ్వతేశ్వరుడగు , వి. వే.

అదరిపడక మనసు నానందమును గోరి
మదిని మెలగువాడు మాన్యుడరయ
సదమలత్వమునను శాశ్వతేశ్వరుడగు,
వి. వే.

ధ్యాన సమయమున స్థిరుడై నిర్మలుడై బ్రహ్మానందము కోరువాడే మాన్యుడు . అతడు ఈశ్వరభావము పొందగలడు

A person is venerable by meditating with strong conviction and purity of mind in search of eternal bliss. He can attain Lord Iswara with much devotion.

783
అందరాని డదడవి వెన్నెల బైట నుండు జూడ బెద్ద పండుగాను పండుపడిన జెట్టు బట్టంగలేరయా ! వి. వే.

అందరాని డదడవి వెన్నెల బైట
నుండు జూడ బెద్ద పండుగాను
పండుపడిన జెట్టు
బట్టంగలేరయా ! వి. వే.

మోక్షఫలము అందరానిది . దానిని పొందుట కడవిలో జ్ఞానమను వెన్నెలతో చూడవచ్చును . ఆ ఫలము గల వృక్షమును పట్టుకొనుట చాల కష్టము

The fruit of salvation is hard to achieve. It is like searching for a fruit on a tree in a forest lit up by moonlight.

784
అరుణు నుదయ సంఖ్య అస్త౦సమయ సంఖ్య జనన మరణ సంఖ్య జాతి సంఖ్య దీనినెఱిగి యోగి ధీరుడై యుండును, వి. వే.

అరుణు నుదయ సంఖ్య అస్త౦సమయ
సంఖ్య జనన మరణ సంఖ్య జాతి
సంఖ్య దీనినెఱిగి యోగి
ధీరుడై యుండును, వి. వే.

సూర్యోదయాస్తమయములు , జనన మరణములు , మానవజాతి లెక్కింపరానివి . అట్టిచో "పరమాత్మ స్వరూపామును గుర్తింపగలమా ?” అని అధైర్యపడరాదు . నిశ్చలహృదయమున అది సాధ్యమే !

There are countless sunrises, sunsets, births, deaths and humans on the earth. If that is so, one might get discouraged and ask, “can I recognize the true form of God?” There is no need for discouragement. With an unwavering mind it is possible.

785
అష్టాంగ యోగసాధన కష్టంబులకు ఓర్వలేడు కనలేడుగదా ? చేష్టలు విడువని జీవికి కష్టంబగు ; బుట్టజావ గతియగు వేమా!

అష్టాంగ యోగసాధన కష్టంబులకు
ఓర్వలేడు కనలేడుగదా ? చేష్టలు
విడువని జీవికి కష్టంబగు;
బుట్టజావ గతియగు వేమా

అష్టాంగ యోగము కష్టమని , మోహాదుల చేష్టలకు చిక్కినవాడు పరముని చూడలేడు . అది కష్టసాధ్యమే . అతడు జనన మరణములకు లోబడుచునే యుండును

Ashtaanga yOga is given as:

  • యమం (yama)
  • నియమం (niyama)
  • ఆసనం (aasana)
  • ప్రాణాయామం (praanayaama)
  • ప్రత్యాహారం (pratyaahaara)
  • ధ్యానం (dhyaana)
  • ధారణం (dhaarana)
  • సమాధి (samaadhi) One who thinks such yoga is too difficult and is caught in the fleeting desires of the world cannot visualize the nether world. Such a person will be confined to birth-death cycle.

    786
    ఆత్మలోని జ్యోతి అమరుట లింగంబు తెలివిచేతగాని తేటపడదు అది యధైర్యపరున కంటదు మదిలోన , వి. వే.

    ఆత్మలోని జ్యోతి అమరుట లింగంబు
    తెలివిచేతగాని తేటపడదు
    అది యధైర్యపరున కంటదు
    మదిలోన , వి. వే.

    హృదయములోని ప్రత్యగాత్మ జ్యోతియే లింగము . దీనిని జ్ఞానముతో తెలిసికొనవలయును . అధైర్యమున్నచో అది తేటపడదు

    The light within the body closer to the heart is where aatma is situated. One has to recognize it with knowledge and fearlessness.

    787
    ఆదినెవరు పుట్టిరని తెలియగోర సోదియగును పిదప సుఖములేదు ఆదిశక్తియున్న నదిబయలని నమ్ము , వి. వే.

    ఆదినెవరు పుట్టిరని తెలియగోర
    సోదియగును పిదప సుఖములేదు
    ఆదిశక్తియున్న నదిబయలని
    నమ్ము , వి. వే.

    సృష్టికి మూలకారణమేదియని చర్చింప అది సోదెయే యగును. శుష్క చర్చవలన సుఖము లేదు . ఆది యున్నది మహాశక్తి అని, అదియే గగనమని తెలియవలెను .

    It is not necessary to debate over the root cause of creation. Such a discussion is moot. At the beginning there was Sakti (energy) that gave raise to all creation.

    788
    ఇంతి వగపదేల? ఏకాంతబుద్ధితో హారిహరాదులందు ఆశాలుడిగి శాంతబుద్ధినుండ సమకూడును ఫలంబు , వి. వే.

    ఇంతి వగపదేల? ఏకాంతబుద్ధితో
    హారిహరాదులందు ఆశాలుడిగి
    శాంతబుద్ధినుండ సమకూడును
    ఫలంబు , వి. వే.

    సంసారబంధనమున చిక్కితినను విచారము విడిచి శివకేశవుల భేదబుద్ధిలేక ఏకాంతబుద్ధితో శాంతచిత్తుడవై ఉన్నచో మోక్షమును పొందవచ్చును

    Instead of wallowing in self-pity for having been entangled in bondage, one has to pray with devotion Lord Siva and Lord Vishnu regardless of their differences. By attaining peace with such devotion one can receive salvation.

    789
    ఇలను జ్ఞానమనెడి యీత నేర్చినవాడు జలధియనెడి తమము జడియక విడి విలయమనెడి గట్టు వెఱవక దాటును , వి. వే.

    ఇలను జ్ఞానమనెడి యీత నేర్చినవాడు
    జలధియనెడి తమము జడియక
    విడి విలయమనెడి గట్టు
    వెఱవక దాటును , వి. వే.

    ఈత నేర్చినవాడు సమద్రము నీది గట్టు దాటినట్లు జ్ఞాని అజ్ఞానమును విడిచి విలయమును దాటి ముక్తి నొందగలడు

    Like a swimmer who can cross an ocean, a knowledgeable person should wipe away ignorance and cross the universe when it gets devolved by Brahma.

    790
    ఉచిత మిత్రలు సతి సుతు లూరు పేరు ధనము ధాన్యంబు పాడియు ఘనమతములు నాశమొందును ధీరుడై నమ్మబోకు నీవె స్థిరుడ వెఱు౦గవో నిన్ను వేమ!

    ఉచిత మిత్రలు సతి సుతు లూరు పేరు
    ధనము ధాన్యంబు పాడియు ఘనమతములు
    నాశమొందును ధీరుడై నమ్మబోకు నీవె
    స్థిరుడ వెఱు౦గవో నిన్ను వేమ

    లోకములోని పుత్రుడు , మిత్రుడు , మున్నగువారు ధనధాన్యాదులు నిత్యములు కావు . వానిని నమ్మక , ధైర్యముతో నీలోని ఆత్మను తెలిసికొమ్ము

    The children, friends, wealth, etc. are not permanent. Only aatma is ever lasting. So without believing in impermanent things pursue the knowledge about aatma.

    791
    ఉడుము తోకబట్టి యుదిరిగా లాగిన నడుగు విడక పూని యానియుండు మురికిపైనజేర ముదమందవలెనట్లు , వి. వే.

    ఉడుము తోకబట్టి యుదిరిగా
    లాగిన నడుగు విడక పూని యానియుండు
    మురికిపైనజేర ముదమందవలెనట్లు,
    వి. వే.

    ఉడుము ఒకదానిని పట్టుకొన్నచో ఎంత లాగినను విడువదు . ఆ రీతినే దేహముపై ఎంత మురికి యున్నను లెక్కింపక నిర్వికారుడై ఉండవలెను

    An iguana has a strong hold on things. Once it holds on to a thing it is hard to free it. With such determination one should remain steadfast no matter how much his body decays.

    792
    ఊతకఱ్ఱబట్టి యుదిరిగా బోవుచు కోతి కొమ్మలందు గుదిరినట్లు జ్యోతియందు బొంచి సోహమ్ము కనుమయా , వి. వే.

    ఊతకఱ్ఱబట్టి యుదిరిగా బోవుచు
    కోతి కొమ్మలందు గుదిరినట్లు
    జ్యోతియందు బొంచి సోహమ్ము
    కనుమయా , వి. వే.

    కోటి ఊతకర్రతో కొమ్మనుండి కొమ్మకు పోవుచు తిరుగునట్లు అంతర్జ్యోతిని గని బ్రహ్మఐక్యమును పొందవలెను

    Like a monkey that darts from tree branch to tree branch, one should realize the light within his body and seek to merge with the creator.

    793
    ఊపబోయి కొంత యూగించి విడిచిన నూగుగాని గమ్య మొందలేదు పట్టు పూన్కి కొలది పనిచేయు లక్ష్యంబు , వి. వే.

    ఊపబోయి కొంత యూగించి విడిచిన
    నూగుగాని గమ్య మొందలేదు
    పట్టు పూన్కి కొలది పనిచేయు
    లక్ష్యంబు , వి. వే.

    చెట్టు కొమ్మ మున్నగువాని నూగించి విడిచిన కొంతసేపే యూగును . అట్లుగాక పూనికతో యత్నించిననే లక్ష్యము సిద్ధించును

    When one pulls on a tree branch it will shake the tree for a certain length of a time but not for ever. One should seek the salvation not just for a limited time but for ever.

    794
    ఎండ నీడవన్నె లేకమౌనట్టుగ నిండుకుండలందు నిలువజేసి దండి తత్త్వమెల్ల దలపోసి చూడరా , వి. వే.

    ఎండ నీడవన్నె లేకమౌనట్టుగ
    నిండుకుండలందు నిలువజేసి
    దండి తత్త్వమెల్ల దలపోసి
    చూడరా , వి. వే.

    ఎండ నీడ వన్నె లేకమేయనురీతి సుఖదుఃఖములను సమానముగా చూచి తత్త్వపు పూర్ణరూపమును ప్రత్యక్షము చేసికొనుము

    Like the sun light and shadow that exist on the same plane, one should view with equanimity sorrows and pleasures. That way one can visualize the totality of knowledge.

    795
    ఎదుటి తమ బలంబు లెంచుకోనేఱక డీకొని చాలముననె దీర్చెనేని ఎలుగు దివిటిసేవకేర్పడు చందము, వి. వే.

    ఎదుటి తమ బలంబు లెంచుకోనేఱక
    డీకొని చాలముననె దీర్చెనేని
    ఎలుగు దివిటిసేవకేర్పడు
    చందము, వి. వే.

    తన బలము , ఎదిరి బలము తెలిసికొనలేక పట్టుదల వహించినచో , ఎలుగును దివిటీ సేవకు నియమించినట్లే నిష్పలము (దివిటీని భల్లూకము సమ్మతింపనే సమ్మతింపదు )

    Withough knowing the relative strengths of oneself vis-a-vis the opponent, when one is determined foolishly to conquer, it will be like recruiting a bear to look after a lighted torch (that it fears)

    796
    ఎఱిగిన శివపూజ ఎన్నడు చెడిపోదు మొదట బట్టుపట్టి వడాలరాదు మొదలువిడిచి గోడ తుదిబెట్టగల్గునా , వి. వే.

    ఎఱిగిన శివపూజ ఎన్నడు చెడిపోదు
    మొదట బట్టుపట్టి వడాలరాదు
    మొదలువిడిచి గోడ తుదిబెట్టగల్గునా,
    వి. వే.

    పట్టుదలతో పని ప్రారంభించిననే సాధ్యము. తొలుత ఉపేక్షించి తర్వాత పట్టుదల ఉన్న లాభమేమి ? గోడను క్రిందినుండియేగాని మీదినుండి పెట్టలేము కదా ! పట్టుదలతోడి జ్ఞానము బ్రహ్మమును చూపును

    Kick starting a project with determination is the only way to achieve success. When one hesitates at the beginning there is no use. One can only build a wall from ground up but not the other way. Knowledge about the creator comes with determination

    797
    ఎఱిగి మనసుబట్టి యేకా౦ తమున జేర్చి పరుగు లిడక భావపదము నొందు దరముకాని బయలు తాకుట పరమగు , వి. వే.

    ఎఱిగి మనసుబట్టి యేకా౦ తమున
    జేర్చి పరుగు లిడక భావపదము
    నొందు దరముకాని బయలు
    తాకుట పరమగు , వి. వే.

    మంచి చెడ్డల నెరిగి మనస్సు నిలుపుకొని తొందరపాటు లేక యత్నించిన మహాకాశరూపమగు బ్రహ్మమును చేరవచ్చును

    By fixating the mind on him, knowing the pros and cons, and not being hasty, if one tries hard then one can merge with the creator whose embodinet is the universe.

    798
    ఏకరూపమమర నె౦ దాక చూచిన బోక యెఱుకవలన బొందుపడదు తాకిమదిని నిల్పు , తత్తఱమందుకు , వి. వే.

    ఏకరూపమమర నె౦ దాక చూచిన
    బోక యెఱుకవలన బొందుపడదు
    తాకిమదిని నిల్పు , తత్తఱమందుకు,
    వి. వే.

    ప్రపంచమంతయు ఏకరూపమే అని జ్ఞానమువల్ల మాత్రమే తెలియగలదు . ధైర్యముతో మనస్సును స్థిరముగానుంచి తత్తరపడకున్నచో ముక్తిని పొందవచ్చును

    With true knowledge only one can realize that the entire universe is homegenous and has one form. By being courageous and unwavering one can attain salvation.

    799
    కట్టువారలేరి కట్టనివారేరి ?కట్టికట్టనట్టి కర్ములేరి ?గట్టిపఱచి లెస్స కనుగల్గి చూడుము , వి. వే.

    కట్టువారలేరి కట్టనివారేరి?
    కట్టికట్టనట్టి కర్ములేరి?
    గట్టిపఱచి లెస్స కనుగల్గి
    చూడుము , వి. వే.

    ఈ లోకమున కట్టువారు , కట్టనివారు , కట్టి కట్టనివారు కానరారు . మనస్సు గట్టిపరచుకొని ధైర్యముతో నుండుము

    We can't find in this world the builders, non-builders and in between of the universe. One has to be courageous to seek the creator.

    800
    గుణవికారములను ద్రొక్కి గుట్టుతెలిసి ధణధణాన్విత ప్రణవంబు దెలిసికొనియు తృణము సర్వంబట౦చును తృప్తిగలిగి గణుతిచేయును మిన్నక ఘనుడు , వి. వే.

    గుణవికారములను ద్రొక్కి గుట్టుతెలిసి
    ధణధణాన్విత ప్రణవంబు దెలిసికొనియు
    తృణము సర్వంబట౦చును తృప్తిగలిగి గణుతిచేయును
    మిన్నక ఘనుడు , వి. వే.

    గుణత్రయము నణచివేసి , వాని తత్త్వమెఱిగి , ఓంకార ధ్వనిని గుర్తించి, ఈ లోకపు సుఖములు తృణసామానములని యెంచి , ఆ బ్రహ్మమును తెలిసికున్నవాడే ఘనుడు .

    By suppressing the 3 guans (sattva=serene, rajas=activity, tamas=lethargy), and knowing their tricks on the mind, when one meditates over the Om mantra, one realizes that the comforts in the world are trivial. Such a man knowing the creator is truly great.

    801
    గుఱుతు గూడుచేసి గుణము వత్తిగజేసి సరవి కర్మసమితి జమురు చేసి మూల నొక్కజ్యోతి ముట్టించి చూడరా! వి. వే.

    గుఱుతు గూడుచేసి గుణము వత్తిగజేసి
    సరవి కర్మసమితి జమురు
    చేసి మూల నొక్కజ్యోతి
    ముట్టించి చూడరా! వి. వే.

    మాయయను చీకటిలోవున్న బ్రహ్మము జ్ఞానజ్యోతివల్లనే కానవచ్చును . ఆ జ్యోతికి గురియే గూడు , గుణమే వత్తి , కర్మ పరంపరయే చమురు

    One can imagine the creator as a lamp behind the illusion of darkness. Such a lamp of knowledge has the gunas (sattva=calmness, rajas=activity, tamas=laziness) as wick and karma as oil.

    802
    చీకటింటజేరి చింతింపబనిలేదు రాకపోక లెఱగి రంగుమీఱ ఏకతేజమునను నిలద్రొక్కి చూడరా , వి. వే.

    చీకటింటజేరి చింతింపబనిలేదు
    రాకపోక లెఱగి రంగుమీఱ
    ఏకతేజమునను నిలద్రొక్కి
    చూడరా , వి. వే.

    అజ్ఞానాంధకారమున పడి విచారింపకుము . జ్ఞానము రాకపోకలను గుర్తించి తన్మూలముగా తేజోరూపుని కాంచుము

    Don't worry about ignorance. By witnessing the ins and outs of knowledge realize the resplendence of the creator.

    803
    చుట్టు పరిజనంబు సుఖలీల చెలువ ౦బు నడుమ నాయకతయు నర్తనంబు బ్రహ్మపదము మీరు బ్రతుకుడీ జనులార ! వి. వే.

    చుట్టు పరిజనంబు సుఖలీల చెలువ
    ౦బు నడుమ నాయకతయు నర్తనంబు
    బ్రహ్మపదము మీరు బ్రతుకుడీ
    జనులార ! వి. వే.

    బ్రహ్మానందము రాజభోగమువంటిది . మోక్షార్థులు పరిజనులు . పరలోక సౌఖ్యమే చెలువము . నడుమ నాయకుడై నర్తించువాడే ఆనందము పొందువాడు . జనులు దానికై యత్నించవలె .

    The eternal bliss of knowing the creator is like royal pleasure. The seekers of salvation are servants, the comfort of knowing the creator is the royal elegance, and the one who is at the center dancing is the experiencer of eternal bliss.

    804
    ఛేద్యమైన చేపట్టినాడని మూలవస్తువేల కేలబట్టు దాని నూనగల్గు దాంర్ధ్య౦బు లేకున్న, వి. వే.

    ఛేద్యమైన చేపట్టినాడని
    మూలవస్తువేల కేలబట్టు
    దాని నూనగల్గు దాంర్ధ్య౦బు
    లేకున్న, వి. వే.

    ఛేదింపదగిన మాయకు లోబడినవాడు పరబ్రహ్మమును దర్శింపలేడు . ధృడబుద్ధితో మాయను జయించినవాడే ముక్తిని పొందగలడు

    Without having the ability to see through the illusion, if one is controlled by it, then one can't see the creator. One who conquers the illusion with determination can attain salvation

    805
    జాతి వేఱులేక జన్మక్రమంబున నెమ్మదిన నభవుని నిలిపెనేని అఖిల జనులలోన నతడు ఘను ౦డయా , వి. వే.

    జాతి వేఱులేక జన్మక్రమంబున
    నెమ్మదిన నభవుని నిలిపెనేని
    అఖిల జనులలోన నతడు
    ఘను ౦డయా , వి. వే.

    జాత్యాదిభేదములేక పుట్టుకనుండి ఈశ్వరునే మనస్సులో ధ్యానము చేయుచుండినవాడే ఘనుడు . అతడే ముక్తి పొందును

    One who meditates over Lord Iswara from birth by ignoring caste-differences is truly great. He will attain salvation.

    806
    తను వనదగునింట దగు శత్రుమిత్రులు తెలియలేనివాని తెలివదేల? తెలిసి చక్కబఱుప దివ్యామృతమ్మదే , వి. వే.

    తను వనదగునింట దగు శత్రుమిత్రులు
    తెలియలేనివాని తెలివదేల?
    తెలిసి చక్కబఱుప దివ్యామృతమ్మదే,
    వి. వే.

    తన శరీరమును ఇంటిలోనే శత్రువులు కామ క్రోధాదులు . మిత్రులు సహనాదులు ఉండుట తెలిసికొని , శత్రువులను జయించి మిత్రుల సాహాయమ్మున తత్త్వామృతము స్వీకరింపుము

    In the house of body, the enemies are lust and anger and the friends are tolerance and patience. By conquering the enemies with the help of friends one attains true knowledge about salvation.

    807
    తాము వెలయు నూర క్షామంబు వాటిల్ల నట్టి యూరువిడిచి యవలబోరె ? కొలకు లెండినంతం గొక్కెరలుండునా? వి. వే.

    తాము వెలయు నూర క్షామంబు వాటిల్ల
    నట్టి యూరువిడిచి యవలబోరె?
    కొలకు లెండినంతం
    గొక్కెరలుండునా? వి. వే.

    తామున్న యూర కరవు వచ్చిన దానిని విడిచిపోవుట లోక ధర్మము. ఎండిన చెరువులలో కొంగలుండవు గదా!

    When one's village is afflicted with famine, then migrating to the nearby village is quite natural. One can't find cranes in a dry lake bed.

    808
    తారకంబు జూచు దారి వేఱుగవద్దు సమముగాను జూడ చక్కబడును వెఱ్ఱిగానుజూడ వెలుగెల్ల బాఱురా , వి. వే.

    తారకంబు జూచు దారి వేఱుగవద్దు
    సమముగాను జూడ చక్కబడును
    వెఱ్ఱిగానుజూడ వెలుగెల్ల
    బాఱురా , వి. వే.

    తరింపజేయు మార్గమును బాగుగా చూచి గ్రహించిన ఆత్మజ్యోతి కానవచ్చును . వెర్రిగా చూచిన ఆ జ్యోతి పారిపోవును

    The path to salvation when observed carefully will reveal the light of aatma. With extreme folly, the light won't be visible.

    809
    దేవుడనగ వేఱుదేశమందున్నాడె ? దేవుడనగ తనదు దేహముపయి వాహనంబునెక్కి వడిగదలును చూడు, వి. వే.

    దేవుడనగ వేఱుదేశమందున్నాడె?
    దేవుడనగ తనదు దేహముపయి
    వాహనంబునెక్కి వడిగదలును
    చూడు, వి. వే.

    దేవుడన్నవాడు వేరే లేడు . అతడు మన శరీరముపై అధిరోహించియే యున్నాడని తెలిసికొనుము

    God is nowhere else but riding on our bodies.

    810
    ధైర్యయుతున కితర ధనమైన నరు దాన మిచ్చినపుడె తనకు దక్కె ఎలమి మించుపనికి నెవరేమి సేతురు ? వి. వే.

    ధైర్యయుతున కితర ధనమైన నరు
    దాన మిచ్చినపుడె తనకు
    దక్కె ఎలమి మించుపనికి నెవరేమి
    సేతురు ? వి. వే.

    ధైర్యము కలవానికి ఇతరుల వస్తువు చేజిక్కును . దానిని దానము చేయుట ధర్మము . ధైర్యము లేనిచో ఏదియు సాధ్యము కాదు . ఎవరును ఏమియు చేయజాలరు

    A courageous person can usurp objects from others. Gifting away such spoils is a moral act. Without courage nothing is possible.

    811
    నియామితాసనమున నిలిచిన చిత్తంబు తామసంపు నిద్ర దలగద్రోయు నిద్ర తొలగినంత నిర్భీతి యుదయించు , వి. వే.

    నియామితాసనమున నిలిచిన చిత్తంబు
    తామసంపు నిద్ర దలగద్రోయు
    నిద్ర తొలగినంత నిర్భీతి
    యుదయించు , వి. వే.

    నియమముతో ఆసనమున కూర్చుండి మనస్సు నిల్పిన, తామసమను నిద్ర తొలగును . అది తొలగిన ధైర్యము కలుగును

    With religious observance when one meditates by controlling the mind, one can conquer the sporofic effects of tamas guna. When that is no longer an impediment, one attains courage.

    812
    పట్టుబట్టినతఱి బరవాదము లవేల ? నెట్టుకొన్న తలపె నిలుపవలయు వట్టి పల్కులనిన వసుధలో నగుదురు , వి. వే.

    పట్టుబట్టినతఱి బరవాదము లవేల?
    నెట్టుకొన్న తలపె నిలుపవలయు
    వట్టి పల్కులనిన వసుధలో
    నగుదురు , వి. వే.

    పట్టుపట్టి స్థిరముగా ధ్యానము నిల్పవలెను . వాదముల వలన , వట్టి మాటలవలన లాభము లేదు . దానివల్ల నగుబాటే కల్గును

    One has to be determined to do meditation. There is no use in gossipping and arguing which are nothing but mockery

    813
    పందనధిపుజేసి బవరంబునకు బంప పాఱిపోవు , గార్యభంగమగును ; పాఱునట్టి బంటు పనికిరాడె౦దును , వి. వే.

    పందనధిపుజేసి బవరంబునకు బంప
    పాఱిపోవు , గార్యభంగమగును;
    పాఱునట్టి బంటు పనికిరాడె౦దును,
    వి. వే.

    పిరికివాడు సేనానియైనచో యుద్ధమున పారిపోవును . అపజయము కల్గును . పారిపోవు వీరుడు యుద్ధమునకు పనికిరాడు

    When a coward is the general he will run away from battle field resulting in defeat. Such a person is unfit to fight in a war.

    814
    పొంకములకు మనసు బోనీక సర్వేశు వంక నిలుపువాడు వంశపరు౦డ వంక నిలుపకున్న వచ్చునా పదవులు? వి. వే.

    పొంకములకు మనసు బోనీక సర్వేశు
    వంక నిలుపువాడు వంశపరు౦డ
    వంక నిలుపకున్న వచ్చునా
    పదవులు? వి. వే.

    మనస్సును విషయములపైక పోనీయక భగవంతును ధ్యానించువాడే ఉత్తముడు . అట్లు చేయకున్న మోక్షపదవి రాదు .

    A pious person is one who prays God with an unwavering mind. Without such meditation it is impossible to attain salvation.

    815
    ప్రజలెఱు౦గ బ్రతుకు బట్టభద్రుడు కాడు పై కిరీటముండు ప్రభుడు కాడు ఓగు తెలిసి పలుకు యోగీశ్వరుడుకాడు , వి. వే.

    ప్రజలెఱు౦గ బ్రతుకు బట్టభద్రుడు
    కాడు పై కిరీటముండు ప్రభుడు
    కాడు ఓగు తెలిసి పలుకు
    యోగీశ్వరుడుకాడు , వి. వే.

    ధైర్యవంతుడు పట్టాభిషిక్తుడు కాకున్నను , ప్రజలతనిని గుర్తింతురు . రాజు కాకున్నను కీర్తి పొందును . యోగి కాకున్నను మంచి చెడ్డలు తెలిసి మాటలాడును

    A courageous person will be recognized by people even if he is not coronated. Even if he is not the king, he will attain fame. Even if he is not a yogi he can talk about the pros and cons.

    816
    బంటుతనముగాదు బలముతో గట్టగా వెంటనుండి మనసు వెతలబఱచు ఇంటగెల్చి రచ్చ నిల గెల్వవలెనయా , వి. వే.

    బంటుతనముగాదు బలముతో గట్టగా
    వెంటనుండి మనసు వెతలబఱచు
    ఇంటగెల్చి రచ్చ నిల
    గెల్వవలెనయా , వి. వే.

    వెంట నుండినట్లుండియే మనస్సు చిక్కులు పెట్టును . దానిని బలముతో కట్టిపెట్ట సాధ్యము కాదు . ఇంట గెల్చినగాని రచ్చను గెలువలేము . మన మనస్సునే నిల్పలేనప్పుడు ఇతరులకెట్లు చెప్పగలము?

    Mind, following the senses, creates impediments. It is impossible to tie it down. One can't win over the world without being a victor at home. When one can't control his mind, how can he advise others?

    817
    బోనులోని ఎలుక పోజూచునట్టుల జ్ఞానమొంద ఎఱుక చనును మీద గాన మేను మఱచి ఘనతత్త్వమందరా , వి. వే.

    బోనులోని ఎలుక పోజూచునట్టుల
    జ్ఞానమొంద ఎఱుక చనును
    మీద గాన మేను మఱచి ఘనతత్త్వమందరా,
    వి. వే.

    బోనులో పడిన ఎలుక తప్పించుకొనజూచినట్లు జ్ఞానమొంద దలప మనస్సు పరిపరి విధముల పోవును . దానిని కట్టి , మేను మరచి తత్త్వ మెరుగుటకే ధైర్యముతో యత్నింపవలెను

    Like a rodent caught in the cage trying to escape, mind in search of knowledge gets diffused. One has to control the wavering mind and seek salvation with courage.

    818
    (xxx ) నుంటి మింటి సంధి మన్నవారెందఱో ఎన్నగాను దరమె యేరికైన ? ఉన్నవారు చావనున్నవారే సుమీ, వి. వే.

    (xxx ) నుంటి మింటి సంధి మన్నవారెందఱో
    ఎన్నగాను దరమె
    యేరికైన ? ఉన్నవారు చావనున్నవారే
    సుమీ, వి. వే.

    భూమ్యాకాశముల నడుమగల వారెందరో లెక్క పెట్టలేము . ఉన్న వారందరికిని మరణము కలదు . కాన ధర్మబుద్ధి కలిగి యుండవలెను .

    It is impossible to count all living beings living under the sky on the earth. One thing is sure: they all perish. So it is better to follow dharma (path of rectitude)

    819
    మట్టు వెట్టి కోర్కి మది నిల్పిచూచిన గుట్టుమిగుల దానిగుణము దొరకు నట్టునిట్టు చెదర నమరదు తత్త్వంబు , వి. వే.

    మట్టు వెట్టి కోర్కి మది నిల్పిచూచిన
    గుట్టుమిగుల దానిగుణము
    దొరకు నట్టునిట్టు చెదర
    నమరదు తత్త్వంబు , వి. వే.

    కోర్కెలను అణచి , మనస్సును కట్టిపెట్టి పరికించిన బ్రహ్మస్వరూపము తెలియును . మనస్సు చెదిరినచో తెలిసికొనలేము

    By controlling desires and mind, one can visualize the creator's form. With a distracted mind it is impossible.

    820
    మత్సరంబు మదము మమకారమనియెడి వ్యసనములను దగిలి మసలబోక పరులకుపకరించి పరముండవగు xxx మ్ము , వి. వే.

    మత్సరంబు మదము మమకారమనియెడి
    వ్యసనములను దగిలి మసలబోక
    పరులకుపకరించి పరముండవగు
    xxx మ్ము , వి. వే.

    మమకార మద మాత్సర్యములను విడిచి , వ్యసనములకు లొంగక పరుల కుపకారము చేసిన బ్రహ్మస్వరూపుడవు కావచ్చును

    By renouncing affection, arrogance, malice, and bad habits, and by doing good deeds one can attain the creator.

    821
    మత్తచిత్తుల కల మర్మంబు తెలియక చిత్తచలనమంది చెడిరి భువిని చిత్తమచటలేక చిక్కునా పరమాత్మ ? వి. వే.

    మత్తచిత్తుల కల మర్మంబు తెలియక
    చిత్తచలనమంది చెడిరి
    భువిని చిత్తమచటలేక చిక్కునా
    పరమాత్మ ? వి. వే.

    దురహంకారులు మర్మ మెరుగక మనశ్చా౦చల్యమున పరమాత్మను దక్కించుకొనక చెడిరి . మనస్సు నిలుకడగా లేనిచో అది కుదరదు

    People with evil pride failed to realize the creator by not knowing the technique to find him because of their wavering minds. Without a fixated mind, it is impossible to realize the creator.

    822
    మదిని గాంచవచ్చు మఱి బ్రహ్మమూర్తిని మదిని గన్నయతడె మహితుడగును మదిని గన్నయతడె మహితుడగును వెదకి తనువులోన వేడ్కతో నరసిన అతని యోగివరుడటండ్రు వేమ

    మదిని గాంచవచ్చు మఱి బ్రహ్మమూర్తిని
    మదిని గన్నయతడె మహితుడగును మదిని గన్నయతడె
    మహితుడగును వెదకి తనువులోన వేడ్కతో
    నరసిన అతని యోగివరుడటండ్రు వేమ

    బ్రహ్మస్వరూపామును మనస్సులో చూచినవాడే గొప్పవాడు . అతనిని చూచినవాడే గొప్ప యోగి

    One who can visualizes in the mind's eye the form of the creator is a truly great yogi.

    823
    మనన వృత్తి బూని మౌనసమాధిలో తనదు జ్ఞప్తి మఱచి తాల్మితోడ బెంపు చెందువాడె ప్రియభక్తుడగునయా , వి. వే.

    మనన వృత్తి బూని మౌనసమాధిలో
    తనదు జ్ఞప్తి మఱచి తాల్మితోడ
    బెంపు చెందువాడె ప్రియభక్తుడగునయా,
    వి. వే.

    మౌన సమాధిలో తన్ను తాను మరచి ధైర్యముతో మననము చేయువాడే గొప్ప దైవభక్తుడు

    A truly great devotee is one who practices silence, not aware of his body, and meditates without fear,

    824
    మనసునంటి నిలిచి మనసున సుఖియింప కడకు మోక్షపదవిగనకపోదు చెట్టు బెట్ట ఫలము చేకూరకుండునా , వి. వే.

    మనసునంటి నిలిచి మనసున సుఖియింప
    కడకు మోక్షపదవిగనకపోదు
    చెట్టు బెట్ట ఫలము
    చేకూరకుండునా , వి. వే.

    భగవంతుని తన మనస్సులో స్థిరముగా నుంచగా ఎప్పటికైనను ముక్తి లభించును . చెట్టు నాటగా పండ్లు లభింపకుండునా ?

    When the thought of God is permanently implanted in one's mind, one can surely attain salvation. Won't we receive fruit after planting a tree over a period of time?

    825
    మనసులోననున్న మర్మమంత ఎఱింగి స్థిరము చేసి యాత్మ తేటపఱచి ఘటము నిల్పవలయు , ఘనతలింకేటికి ? వి. వే.

    మనసులోననున్న మర్మమంత ఎఱింగి
    స్థిరము చేసి యాత్మ తేటపఱచి
    ఘటము నిల్పవలయు ,
    ఘనతలింకేటికి ? వి. వే.

    మర్మములు తెలిసికొని మనస్సును స్థిరపరచి ఆత్మను తెలిసికొన్నవానికి ఇతర గౌరవములు అక్కరయే లేదు

    By knowing the secrets of life, firmly fixing the mind and learning about aatma, one need not crave for reverance by others.

    826
    మర్మమంత గనక మనసైక్యమందక పరమగూఢ మింత బయలుపడదు పడిన మాత్రమెన్న బయలుపడిన యంతె , వి. వే.

    మర్మమంత గనక మనసైక్యమందక
    పరమగూఢ మింత బయలుపడదు
    పడిన మాత్రమెన్న బయలుపడిన
    యంతె , వి. వే.

    మర్మము తెలియక , మనస్సు నిలువక , ముక్తి రహస్యము తెలియదు. కొంచెము తెలిసినను బ్రహ్మపదార్థము మరుగుగనే ఉండును

    Without proper technique and a fixed mind, one can't find the secret of salvation. Even if one knows a little, the creator is still invisible.

    827
    మాయపోవు విధము మనుజు౦డు తలచిన మంచిమార్గమబ్బు మానవులకు మాయదాటలేని మనుజు౦డు వ్యర్థు౦డు , వి. వే.

    మాయపోవు విధము మనుజు౦డు తలచిన
    మంచిమార్గమబ్బు మానవులకు
    మాయదాటలేని మనుజు౦డు
    వ్యర్థు౦డు , వి. వే.

    మాయ నశింపవలెనని తలచినవానికి మంచి మార్గము దొరకును . మాయ నతిక్రమింపలేనివాడు అప్రయోజకుడు

    A person who wishes to destroy the illusion can find a better path to salvation. To the contrary, a person who can't see through the illusion will be useless.

    828
    మాయ మామకారముల ద్రుంచి మరగినంత కర్మకడగండ్ల జెప్పను కాలు డెఱుగు దీనిగని మెలగెడివాడు ధీరుడరయ మాయగనకున్న గతులెల్ల మాయు వేమ!

    మాయ మామకారముల ద్రుంచి మరగినంత
    కర్మకడగండ్ల జెప్పను కాలు డెఱుగు
    దీనిగని మెలగెడివాడు ధీరుడరయ
    మాయగనకున్న గతులెల్ల మాయు వేమ

    మాయామమకారములను గుర్తెరిగిన , కర్మములు తమంతనే నశించును . అట్టివాడే ధీరుడు . మాయకు లొంగిన ఉత్తమగతులు౦డవు

    After one discovers illusion and bondage, one's karma will diminish. Such a person is truly a brave man. There is no salvation when one is controlled by illusion.

    829
    మాయల సంసారముకై మాయలనే తిరుగుచుండు మనుజుడు లోనై మాయలదెలిసినయ౦తట మాయలనే ముక్తి కలుగు మహిలో, వేమా !

    మాయల సంసారముకై మాయలనే తిరుగుచుండు
    మనుజుడు లోనై మాయలదెలిసినయ౦తట
    మాయలనే ముక్తి
    కలుగు మహిలో, వేమా

    అజ్ఞాని సంసార మాయలో పడి తిరుగుచుండును . ఇది మాయ అని గుర్తించినచో ఆ మాయయందే ముక్తి లభింపగలదు

    An ignorant person lives with bondage. Once he realizes that family and friends are an illusion, he can attain salvation.

    830
    మాయభయములేని మనుజుడే మనుజుండు మాయలో మునుగ మనుజుడగునె ?కాయముడుగునపుడె మాయయు నుడుగును, వి. వే.

    మాయభయములేని మనుజుడే మనుజుండు
    మాయలో మునుగ మనుజుడగునె?
    కాయముడుగునపుడె మాయయు
    నుడుగును, వి. వే.

    మాయ వలన భయము లేనివాడే మనుష్యుడు ; మాయలో మునిగినవాడు కానే కాడు . శరీరము నశించినపుడే మాయయు నశించును . ఈ లోగా నశించదు

    A learned man is one who is not afraid of illusory world. He will not be caught by illusion. The illusion will fade when his body disintegrates.

    831
    మింట నంటియున్న మినుకు జూడగబోయి అంటలేక కొండయవధిబడిరి కంటినంటుజ్యోతి గానగలేరయా ! వి. వే.

    మింట నంటియున్న మినుకు
    జూడగబోయి అంటలేక కొండయవధిబడిరి
    కంటినంటుజ్యోతి
    గానగలేరయా ! వి. వే.

    ఎక్కడో ఆకాశముపైనున్న జ్యోతిని కానలేక జనులు కష్టములపాలైరి . వారు కంటి కనపడు వెలుగును సైతము కానలేకున్నారు

    Men fell into misery by not being able to see the (God's) resplendence. They are not able to see the light within the reach of their vision.

    832
    ముదిత వలపుజూడ మోహింత్రు వారల చెంత చేరగానె చెడును మనసు నింత భ్రమగుణంబు కాంతజూచిన చాలు , వి. వే.

    ముదిత వలపుజూడ మోహింత్రు
    వారల చెంత చేరగానె చెడును
    మనసు నింత భ్రమగుణంబు కాంతజూచిన
    చాలు , వి. వే.

    స్త్రీలు వలపునకు లొంగి పెక్కురు పురుషులా స్త్రీలు చెంత చేరగానే చలించుచుందురు . ఆజ్ఞులకు కాంతనుజూడగా మోహము కలుగుచున్నది

    By submitting to women, several men lost their balance. The sight of a woman makes ignorant people lust over her.

    833
    మరగి తిరిగి నరుడు మరులుకొన్ననుగాక అందువలన నేమి యాశ కలుగు ? అంతరాత్మ నిలుపు నతడెపో తానగు , వి. వే.

    మరగి తిరిగి నరుడు మరులుకొన్ననుగాక
    అందువలన నేమి యాశ
    కలుగు ? అంతరాత్మ నిలుపు
    నతడెపో తానగు , వి. వే.

    మనుజుడు విషయాసక్తుడై , స్త్రీల వెంట తిరిగిన లాభమేమి ? మనస్సున అంతరాత్మను నిలుపువాడే ముక్తుడగును

    What is gained by a man who is enamored by women? The one who fixates aatma within his mind will attain salvation

    834
    మూడు గుణములందు ముఖ్య గుణంబును తెలియలేనివాడు వెలయునెట్లు? భ్రమలబడినవాడు బలువెఱ్ఱియగు ధర, వి. వే.

    మూడు గుణములందు ముఖ్య గుణంబును
    తెలియలేనివాడు వెలయునెట్లు?
    భ్రమలబడినవాడు బలువెఱ్ఱియగు
    ధర, వి. వే.

    సత్త్వ, రాజా, స్తమో గుణములలో ముఖ్యమైన సత్త్వము నెరిగినవాడే ఉత్తముడు . భ్రాంతికి లొంగినవాడు పెద్ద మూర్ఖుడు

    The one who adopts sattva among the 3 gunas (sattva=calmness, rajas=activity, tamas=letheargy) is wise. The one who succumbs to delusion is a fool.

    835
    మూడు గుణమూలంటు మూలంబు గనవలె వీలుగాను త్రిపుటి వెలయనొక్కి త్రాడు త్రొక్కి పాము దలచిన చందమౌ , వి. వే.

    మూడు గుణమూలంటు మూలంబు గనవలె
    వీలుగాను త్రిపుటి వెలయనొక్కి
    త్రాడు త్రొక్కి పాము
    దలచిన చందమౌ , వి. వే.

    సత్త్వరజస్తమో గుణముల మూలమును కనిపెట్టి , ధృక్కు దృశ్యము , ద్రష్ట అను త్రిపుటిని విహితపరచుకొనవలెను . లేకున్న రజ్జు సర్ప భ్రాంతి కలిగిన రీతి నుండును

    One has to, by being aware of three gunas (sattva, rajas, tamas), has to understand these 3 aspects: the seer, the seen and the sight. Otherwise they delude that a rope is a snake and vice-versa.

    836
    మూఢాత్ములైన జనములు గూఢంబున తెలియలేక గురిగనలేరా ? గాఢాంధకారదూరుని రూఢిగజేరగ గలుగు రూఢము వేమా!

    మూఢాత్ములైన జనములు గూఢంబున
    తెలియలేక గురిగనలేరా?
    గాఢాంధకారదూరుని రూఢిగజేరగ
    గలుగు రూఢము వేమా

    మూఢులు గూఢముగానున్న పరుని గుర్తింపలేరు . నిర్వికల్పుడును , తేజోరాశియగు అతనిని గుర్తించుటయే ముక్తి

    Foolish people cannot see the subtle aspects of the creator. Salvation is when one realizes that the creator transcends the universe and full of resplendence.

    837
    మూడు లోకములను మొనసి యొక్కటిచేసి యారు తావరముల నంటగూర్చి స్థిరముగానెయుండు శివమూర్తి గురుడయా , వి. వే.

    మూడు లోకములను మొనసి యొక్కటిచేసి
    యారు తావరముల నంటగూర్చి
    స్థిరముగానెయుండు శివమూర్తి
    గురుడయా , వి. వే.

    ముల్లోకముల నొక్కటిగా జేసి ; మంత్ర, పద , వర్ణ , తత్త్వ , భువన , కళాధ్వముల వివరము గ్రహించి , మనస్సు చలింపకయుండువాడే శివయోగి . అతడే లోకగురువు

    A Siva Yogi is one who see the 3 worlds as one. And one who remains with a still mind after knowing mantra, language, essential spiritual knowledge, the nether world, the 5 branches of knowledge: చిత్ర (chitra), పద (pada), వర్ణ (varna), తత్త్వ(tattva), భువన(bhuvana) Such a yogi is the guru for the world.

    838
    మూడువేళలందు ముందముతో శివునాత్మ పూజ చేయువాడు పుణ్యమూర్తి పూజలేక మోక్షభోగంబు దొరకునా? వి. వే.

    మూడువేళలందు ముందముతో శివునాత్మ
    పూజ చేయువాడు పుణ్యమూర్తి
    పూజలేక మోక్షభోగంబు
    దొరకునా? వి. వే.

    త్రికాలములందు శివుని మనస్సులో నిల్పి పూజింపవలెను . అట్లు పూజింపనియెడల మోక్షము లభింపదు

    One has to perform pooja to Lord Siva 3 times a day (morning, afternoon and evening). There is no salvation without such devotion.

    839
    మొదట నతడు జ్ఞాన ముద్రా౦కితుడుగాక ఆ విధమును దెలియు నజ్ఞుడగును నడుమ జ్ఞానమొదవ నగుబాటుకాదయా , వి. వే.

    మొదట నతడు జ్ఞాన ముద్రా౦కితుడుగాక
    ఆ విధమును దెలియు
    నజ్ఞుడగును నడుమ జ్ఞానమొదవ
    నగుబాటుకాదయా , వి. వే.

    నరుడు తొలుతనే జ్ఞానియై యుండవలెను . తొలుత అజ్ఞానియైయుండి తర్వాత జ్ఞానము సంపాదింపవలెనన్న కుదరదు

    A man has to be knowledgeable early on in his life. After leading a life of ignorance it is not possible to attain knowledge late in life.

    840
    మౌని నిజకేళిలోపల మనసుద్రొక్కి పూని నంతట పరిపూర్తి పొందగలుగు వాని భక్తికి సాటిది వసుధగలదె?డాంభికములైన నడుమ నడగు వేమ!

    మౌని నిజకేళిలోపల మనసుద్రొక్కి
    పూని నంతట పరిపూర్తి పొందగలుగు
    వాని భక్తికి సాటిది వసుధగలదె?డాంభికములైన
    నడుమ నడగు వేమ

    మౌని పరబ్రహ్మ దర్శన సంతోషములో మునిగియున్నచో మోక్షము సులభము . అట్టివాని భక్తికి సాటిలేదు . బడాయిభక్తి నిలువక నడుమనే నశించును

    A sage who is focused on attaining bliss from the appearance of the creator can achieve salvation easily. His devotion will be unparalleled. False devotion won't stand the test of time.

    841
    యాత్రపోయినాత ఎన్నాళ్ళు తిరిగిన బాదమైన ముక్తి పదవి గనడు మనసు నిల్పునతడు మహనీయ మూర్తిరా , వి. వే.

    యాత్రపోయినాత ఎన్నాళ్ళు తిరిగిన
    బాదమైన ముక్తి పదవి
    గనడు మనసు నిల్పునతడు మహనీయ
    మూర్తిరా , వి. వే.

    స్థిరమైన మనస్సులేక ఎన్నాళ్ళు తీర్థయాత్రకు తిరిగినను ప్రయోజనము లేదు . స్థిరచిత్తము కలవాడే ఉత్తమోత్తముడు

    Without still mind, no matter how many pilgrimages a man performs there is no use. The one with an unwavering mind is the best of the best.

    రక్తిలేని పనులు రమ్యమై ఉండునా? రక్తికలిగెనేని రాజు మెచ్చు రాజు మెచ్చు రక్తి రమణులు మెత్తురు , వి. వే.

    ప్రీతిలేని పనులు ఇంపుగా ఉండవు . ప్రేమతోడి పనులను రాజు మెచ్చును . రాజుమెచ్చిన యువతులు మెత్తురు

    Joyless acts won't be pleasing. The acts done with much affection will be appreciated by the king. Young women in turn offer praise.

    రాముడొకడు పుట్టి రవికులం బీడేర్చె గురుపతియును పుట్టి కులముజెఱచె ఇల నధర్మధర్మములరీతి యిట్టుల , వి. వే.

    శ్రీరాముడు జన్మించి సూర్యవంశమునకు గొప్ప పేరు తేగా, దుర్యోధనుడు పుట్టి వంశమును నశింపజేసెను . లోకమున ధర్మాధర్మములు పరిస్థితి ఈ విధముగా యుండును

    Lord Rama achieved fame for his Surya dynasty. Whereas Duryodhana caused decimation of his Kaurava dynasty. Thus dharma prevails in the world.

    రాయి రాయి గూర్చి రాయగా రాయగా నున్ననైన యట్టు లన్ని పనులు పాటు చేసినంత పరిపాటి యగునయా , వి. వే.

    రాతిని రాతితోచేర్చి రాయగా నునుపెక్కునట్లు పరిశ్రమించి చేసిన పనులు సఫలమగును

    The surface of a stone can be made smooth by rubbing it with another stone. Thus by performing hard work, projects will succeed.

    845
    రూపు నడక చూడ దాప౦ బు పుట్టిన భ్రాంతిలంకురించు నంతలోనె బుద్ధిమఱలకున్న రద్దికి నెక్కురా , వి . వే.

    రూపు నడక చూడ దాప౦ బు పుట్టిన
    భ్రాంతిలంకురించు నంతలోనె
    బుద్ధిమఱలకున్న రద్దికి
    నెక్కురా , వి . వే.

    స్త్రీల రూపము , నడకల అందము చూడగా ఆవేశము కల్గి భ్రాంతి పుట్టును . అట్టి చెడ్డబుద్ధిని మరల్పకున్న హాని కల్గును .

    One is in delusion after seeing a woman's beauty and gait. If such a delusion is not overcome life will be miserable.

    846
    లగ్నచిత్తములోనైన లఘువు తెలిసి విలయమగు నిచ్చలోపలి విధముచూచి యున్నవాడగు ముక్తుడీ యుర్విలోన బాటుపడలేమి నెట్లబ్బు ఫలము వేమ!

    లగ్నచిత్తములోనైన లఘువు తెలిసి
    విలయమగు నిచ్చలోపలి విధముచూచి యున్నవాడగు
    ముక్తుడీ యుర్విలోన బాటుపడలేమి
    నెట్లబ్బు ఫలము వేమ

    మనస్సును యోగమున కూర్చి , చాంచల్యము నణచి , లోపలి పద్ధతిని తెలిసికొన్నవాడే ముక్తి పొందును . పాటుపడకున్నచో ఫలము లభింపదు

    A person can attain salvation by knowing the process of fixating the mind on yoga and remaining with an unwavering mind. There is no reward without hardwork.

    847
    లింగ మంగమునను లీలదెలియువెన్కమనసు లింగమందు మరులుకొనును మనసు నిల్పనందె మఱి లింగముండురా , వి. వే.

    లింగ మంగమునను లీలదెలియువెన్కమనసు
    లింగమందు మరులుకొనును
    మనసు నిల్పనందె మఱి
    లింగముండురా , వి. వే.

    లింగా౦గముల స్థితిగతులను తెలిసినచో మనస్సు లింగమున లగ్నమగును . మనస్సును నిల్పిన పరమేశ్వరునిరూపు ప్రత్యక్షమగును

    By knowing the essential knowledge behind the phallic symbol and fixating the mind over it , one can visualize the form of Lord Siva.

    848
    వార్తలోని వార్త వైభవ మరయక మిట్టిపడుదు రిలను మిడుతరీతి గట్టిచేసి నిలుపు ఘనుడెపో శివయోగి , వి. వే.

    వార్తలోని వార్త వైభవ మరయక
    మిట్టిపడుదు రిలను మిడుతరీతి
    గట్టిచేసి నిలుపు ఘనుడెపో
    శివయోగి , వి. వే.

    ఉపదేశములోని తత్త్వమెరుగక మూర్ఖులు తమ్ముతామే స్తుతించుకొని గర్వించుచుందురు . అట్లుగాక మనస్సును స్థిరము చేసి బ్రహ్మస్వరూపమును నెరిగినవాడే ముక్తి పొందును

    A foolish person without knowing the essential knowledge behind scripture, praises himself. On the contrary, by focusing the mind on the creator, one can attain salvation

    849
    వితరణంపు జూడ్కి విశ్వరూపము జూచి మతిని కడకుద్రొక్కి మౌనమూని సతత మెన్నువాడు సరసుడీయిలలోన , వి. వే.

    వితరణంపు జూడ్కి విశ్వరూపము
    జూచి మతిని కడకుద్రొక్కి
    మౌనమూని సతత మెన్నువాడు
    సరసుడీయిలలోన , వి. వే.

    విశాల దృష్టితో ప్రపంచమును పరీక్షించి , మనస్సును లొంగతీసి , మౌనము వహించి , ఎల్లప్పుడును పరమేశ్వరుని ధ్యానించువాడే సరసుడని చెప్పబడును

    A perfect gentleman is one who evaluates the world with a broad mind, controls his mind, practices silence and always meditates on Lord Siva.

    850
    విదితంబగు ఘట మలిసిన నుదితంబగు నాకసంబు నుప్పర మొకటౌ నదెవిధమున దేహంబును సదమల కైవల్య పదవి సంపద వేమా!

    విదితంబగు ఘట మలిసిన నుదితంబగు
    నాకసంబు నుప్పర మొకటౌ
    నదెవిధమున దేహంబును సదమల
    కైవల్య పదవి సంపద వేమా

    ఘటాకాశము , ఘటము పగులగా మహాకాశమున కలసి పోవునట్లు దేహములోని ఆత్మ దేహనాశమున పరమాత్మలో కలియును . అదియే మోక్షము.

    The space inside a pot is same as the space surrounding the earth. When the pot breaks, the space within it merges with the universal space. Similarly after death the aatma merges with the universal spirit.

    851
    వీరశైవధర్మ విధము లెఱింగియు బ్రహ్మవిద్యమీద బరగెనేని చెలగి పులికి బంటు సింగ౦పు బిల్లయౌ , వి. వే.

    వీరశైవధర్మ విధము లెఱింగియు
    బ్రహ్మవిద్యమీద బరగెనేని
    చెలగి పులికి బంటు సింగ౦పు
    బిల్లయౌ , వి. వే.

    వీరశైవ ధర్మ మెరిగిన పిదప బ్రహ్మవిద్యపై ఆసక్తి కలిగినచో అది సులభముగా సిద్ధించును . అది పులికి సింహపు పిల్లను బంటుగా చేసినట్లు౦డును

    By learning the dharma behind the belief that Lord Siva is the creator, when one is desirous of the creator's knowledge, one can easily attain it. It is like making a lion's cub (the ruler of animal kingdom) a servant of a tiger.

    852
    వేడుచున్నయట్టె విషయంబు జూపుచు గోత దింపుసుమ్ము కొండెగాడు చేర్చరాదు వాని జెఱచును తుదినెట్లొ , వి. వే.

    వేడుచున్నయట్టె విషయంబు జూపుచు
    గోత దింపుసుమ్ము కొండెగాడు
    చేర్చరాదు వాని జెఱచును
    తుదినెట్లొ , వి. వే.

    కొండెగాడు వినయమును చూపుచునే గోతిలో త్రోయును . వానిని దగ్గర చేర్చినచో తప్పక హాని కలుగును

    A deceitful person cheats by feigning obedience. One gets into trouble by befriending him

    853
    వేయి క్రతువులు పనిలేదు వేడ్కమీఱ జేయుక్రియలెల్ల గురుభక్తి చిత్తమందు బాయకుండుట ముక్తికి బయట యగును న్యాయమగు మార్గ మిద్దియౌ నవని వేమ!

    వేయి క్రతువులు పనిలేదు వేడ్కమీఱ జేయుక్రియలెల్ల
    గురుభక్తి చిత్తమందు
    బాయకుండుట ముక్తికి బయట యగును న్యాయమగు
    మార్గ మిద్దియౌ నవని వేమ

    వేలకొలది యాగములు , క్రియలు అక్కరలేదు . శుద్ధమైన గురుభక్తియున్న చాలును. అదియే ముక్తికి న్యాయమైన మార్గము

    There is no use in performing thousands of rituals. It is enough if one has unwavering devotion for his guru. It is the path to salvation.

    854
    వేము చెక్కదిన్న విషరోగములు పాయు దేహకాంతి కలుగు ధృఢము కలుగు దినగా తినగ నదియె తీయగా నుండును , వి. వే.

    వేము చెక్కదిన్న విషరోగములు
    పాయు దేహకాంతి కలుగు ధృఢము
    కలుగు దినగా తినగ నదియె
    తీయగా నుండును , వి. వే.

    దుస్సాధ్యమగు బ్రహ్మోపాసన అభ్యాసమున సుసాధ్యమగును . వేపచెక్కేను తిన్నచో విషరోగములు పోయి , ఆరోగ్యము , దేహకాంతి కల్గును. మొదట అనిష్టముగా ఉన్నను, తుదికదియే ఇంపుగా తోచును

    The difficult process of worshipping the creator will become easy with practice. When one eats the bitter fruit of neem, one gets cured of deadly diseases and acquires health and aura. Even though it is bitter in the beginning, over time it becomes sweet.

    855
    వ్యాధి వచ్చునపుడు వైద్యునిచే మందు తీసి తినకేకాని తీరదెందు మందువంటి మనసు మనుజుండు కనవలె , వి. వే.

    వ్యాధి వచ్చునపుడు వైద్యునిచే
    మందు తీసి తినకేకాని
    తీరదెందు మందువంటి మనసు మనుజుండు
    కనవలె , వి. వే.

    వ్యాధి వచ్చినపుడు వైద్యుడిచ్చిన మందు తీసికొనినగాని అది కుదరదు . అట్లే ముక్తికి ప్రయత్న మావశ్యకము

    One cannot get cured of disease without ingesting the medicine prescribed by the doctor. Similarly consistent trials are required to attain salvation.

    856
    శ్వాసలాగి విడిచి సాధింప నేర్చిన మోసపోక ముక్తి మూటగట్టు దోసకారి గుణము గాసి చెందకపోదు , వి. వే.

    శ్వాసలాగి విడిచి సాధింప
    నేర్చిన మోసపోక ముక్తి మూటగట్టు
    దోసకారి గుణము గాసి
    చెందకపోదు , వి. వే.

    రేచక పూరక కుంభకాదులచే శ్వాసమును పట్టి ధ్యాన ధారణాదులచే బ్రహ్మము నుపాసించిన ముక్తి కలుగును. ఆ మార్గమున లోపము చేసినచో బాధయే కలుగును

    With breath control (రేచక (rechaka), పూరక (pooraka), కుంభకాదు(kumbhaka)) when one worships the creator one can attain salvation. One encounter disappointment when not done right.

    857
    షోడశాక్షరముల శోధించి మదినెంచి గూఢభావమూని కుదియబట్టి వేడుకలర ముక్తి విన్నంది చూడరా! వి. వే.

    షోడశాక్షరముల శోధించి మదినెంచి
    గూఢభావమూని కుదియబట్టి
    వేడుకలర ముక్తి విన్నంది
    చూడరా! వి. వే.

    షోడశాక్షరములను పరికించి , మనస్సులో ధ్యానించి , ఇంద్రియములను కట్టి యత్నించిన ముక్తి కలుగును

    By observing the 16 mantras, meditating over them and controlling the senses, with persistence one can attain salvation.

    858
    సకల జీవములను సమముగా నుండెడి యతని క్రమము తెలియు నతడె యోగి అతడు నీవెయనుట నన్యు౦డు కాడయా! వి. వే.

    సకల జీవములను సమముగా నుండెడి
    యతని క్రమము తెలియు నతడె
    యోగి అతడు నీవెయనుట నన్యు౦డు
    కాడయా! వి. వే.

    సర్వప్రాణులను సమానముగా చూచువాని పద్ధతిని అనుసరించినవాడే యోగి. అతడే బ్రహ్మము . ఆ బ్రహ్మమే నీవని నమ్ముము

    A yogi is one who follows the principle of all of the life-forms are equal. He is the true embodiment of the creator. Believe that you are also the embodiment of the creator.

    సకల విద్యలగని సంతోషపడవచ్చు చేయిచాచి కాసు నీయలేడు చెలగి యొరులకైన జెప్పవచ్చునుకాని తాను చేయలేడు ధరణి వేమ !

    విద్యలు చూచి సంతోషించునేకాని , లోభి ఒక కాసైన దానము చేయడు . దానము మేలని చెప్పవచ్చునేకాని చేయుట కష్టము

    After witnessing the performances by learned people, a greedy person won't donate even a single coin. It is easy to say donation is righteous but it is hard to part with one's wealth.

    సకల విద్యల౦దు సంపన్నులైయున్న నట్టివారు పరిచయమున జౌక పెరటిచెట్టు (backyard)ముందు పరికింప మెచ్చరు , వి. వే.

    పెరటిచెట్టు మేలేయైనను మందునకు పనికిరానట్లు , మహా విద్వాంసుడైనను , పరిచయమువలన తేలికయగును

    The tree in the backyard is good to have but not useful as medicine. Even though one is a great learned man, he requires to be befriended.

    శక్తి గలుగు పనులు చక్కగా నెఱవేఱు భక్తి గలుగు పూజ ఫలము నిచ్చు యుక్తి గలుగు మాట యొప్పునురా భువి, వి. వే.

    ఆసక్తి యుండినచో పనులు నెరవేరును . భక్తితో పూజించిన ఫలము లభించును . యుక్తితో మాటాడిననే అది తగినట్లుండును

    With keenness one can accomplish tasks. One can receive the fruit of devotion. When one talks with skill, it will be well received.

    862
    సంతలోని సరకు సరసతగొనవచ్చు వింతలంది పొంద వివిరమేల ? చింత తీర్చి చూడ జిన్మయజ్యోతిరా , వి. వే.

    సంతలోని సరకు సరసతగొనవచ్చు
    వింతలంది పొంద వివిరమేల?
    చింత తీర్చి చూడ జిన్మయజ్యోతిరా,
    వి. వే.

    సంతలో మేలువస్తువులు కొన్నట్లు గురుని అనుగ్రహమున చిత్ర విచిత్రములగు తత్త్వరూపములను వింతదక్కిచూచి వైరాగ్యము పొందవలె

    One can buy several things in a shopping mall. Similarly with a guru's grace one can acquire fancy and subtle knowledge . At the end one has to renounce. ను

    863
    సరవితోడ గూడు స్వాధిష్టచక్రంబు ప్రాణపవనములను బందుచేసి వెదకుచుండువాడె వేదాంత వేత్తయౌ , వి. వే.

    సరవితోడ గూడు స్వాధిష్టచక్రంబు
    ప్రాణపవనములను బందుచేసి
    వెదకుచుండువాడె వేదాంత
    వేత్తయౌ , వి. వే.

    పంచప్రాణములను స్వాధిష్టాన చక్రమున నిలిపి, నిర్మలుడై బ్రహ్మమును వేదకువాడే నిజమైన వేదాంతవేత్త

    One who fixates the 5 praanas (paana, apaana, vyaana, udaana, samaana) in the Swaadishtaana chakra (one of the invisible chakras that are in human body like moolaadhaara, anaahita, visudha, agnaa, etc.) and meditates with a pure mind on the creator, is the true seeker of Vedas and Upanishads.

    864
    సవతితల్లి చూడ సాకులు నెఱపును స్వంత తల్లివలెను సైప దెపుడు వింతలడచి లోని విజ్ఞానమందరా , వి. వే.

    సవతితల్లి చూడ సాకులు నెఱపును
    స్వంత తల్లివలెను సైప
    దెపుడు వింతలడచి లోని
    విజ్ఞానమందరా , వి. వే.

    తల్లికున్న ప్రేమ సవతితల్లికి లేదు . విజ్ఞానము తల్లివంటిది . సవతితల్లివంటిదే మాయ. మాయను విడచి విజ్ఞానమును పొందుటకు యత్నింపవలెను

    A step mother won't have the same love and affection as the birth mother towards a child. True knowledge is like birth mother . Illusion is like step mother. One has to give up illusion and seek true knowledge.

    865
    సాధు సాంగత్యమమరిన శాంతమమరు శాంతమమరిన చిత్తంబు శక్యపడును శక్యపడినమనంబె యోసగు బరము పరముగాంచిన శివుడనబరగు వేమ!

    సాధు సాంగత్యమమరిన శాంతమమరు
    శాంతమమరిన చిత్తంబు శక్యపడును
    శక్యపడినమనంబె యోసగు బరము
    పరముగాంచిన శివుడనబరగు వేమ

    మంచివారి స్నేహమున శాంతము , శాంతము వల్ల మనోనిశ్చలత కలుగును . మనోనిశ్చలతవల్ల పరసాన్నిధ్యము , దానివల్ల ముక్తి కల్గును

    Friendship with good people provides peace of mind. With peace, mind will be still. With a still mind, one can feel the creator in proximity and attain salvation.

    866
    సాముచేసి జెట్టి సాహసియై యుండు సాము చేయకున్న సరణి గనడు సాము చేయువాడు చావక యుండును , వి. వే.

    సాముచేసి జెట్టి సాహసియై
    యుండు సాము చేయకున్న సరణి
    గనడు సాము చేయువాడు చావక
    యుండును , వి. వే.

    సాము చేసిననే జెట్టికి ధైర్యసాహసములు కలుగును. అట్లే సామువంటి ప్రయత్నముననే చావులేని మోక్షమబ్బును

    A wrestler is confident and bold with practice. Similarly one has to strive for death-free salvation.

    867
    సాహసమునైన సత్యముచేనైన మోహబుద్ధివిడిచి ముక్తినెఱిగి చేర్చి మదినిగురిని జెలఱేగి యుండురా! వి. వే.

    సాహసమునైన సత్యముచేనైన మోహబుద్ధివిడిచి
    ముక్తినెఱిగి
    చేర్చి మదినిగురిని జెలఱేగి
    యుండురా! వి. వే.

    సాహసముచేగాని, సత్యముచేగాని మోహమును విడిచి ముక్తిని గుర్తించి , మనస్సు నిల్పి బ్రహ్మమును పొందుము

    With courage or righteousness, one has to give up attachments and strive to realize the creator for salvation.

    868
    సుఖము లెల్ల దెలిసి చూడగ దుఃఖముల్ పుణ్యములను పాపపూర్వకములె కొఱతవేయు దొంగ కోరిన చందమౌ , వి. వే.

    సుఖము లెల్ల దెలిసి చూడగ
    దుఃఖముల్ పుణ్యములను పాపపూర్వకములె
    కొఱతవేయు దొంగ
    కోరిన చందమౌ , వి. వే.

    సుఖములు దుఃఖముతో చేరియే యుండును . పాపములు పుణ్యముల నంటియుండును . కాన పుణ్య , సుఖములను కోరరాదు . కోరినచో దొంగ కోరి కొరతవేయ గోరినట్లుండును

    Sorrow follows comforts closely. Sin and righteousness co-exist. One should not ask for comforts and righteousness explicitly.

    869
    గురుని సేవచేసి స్థిరభావ మందెడు త్రోవనంటి జ్ఞప్తి దొలగనీక భావమందె బరము బరికించి చూడరా , వి. వే.

    గురుని సేవచేసి స్థిరభావ
    మందెడు త్రోవనంటి జ్ఞప్తి
    దొలగనీక భావమందె బరము బరికించి
    చూడరా , వి. వే.

    గురుసేవ చేసి స్థిరత్వము కలిగించు మార్గమునంటి జ్ఞప్తిని పోగొట్టుకొనక పరమును పరికించుట ముక్తి సాధనము

    By performing service to guru one has to attain a life of rectitude. And by not losing memory one has to analyze the nether world to attain salvation.

    870
    స్వాత్మ తన్మయ మననంబు సంగ్రహించి నిర్గుణ బ్రహ్మ పదవికి నెఱయ బుద్ధి నొక్కి నిర్భయమందుటే నుడువుటండ్రు వేదవేదాంతసారార్థ విదులు వేమ!

    స్వాత్మ తన్మయ మననంబు సంగ్రహించి
    నిర్గుణ బ్రహ్మ పదవికి నెఱయ బుద్ధి
    నొక్కి నిర్భయమందుటే నుడువుటండ్రు
    వేదవేదాంతసారార్థ విదులు వేమ

    స్వాత్మను తన్మయము నొందించి మననము చేసి , బుద్ధిని బ్రహ్మమార్గమునకు మరల్చి భయములేకయుండుటయే బ్రహ్మభావము నొందుట అను ఉపనిషద్వాక్య మెరిగినవారే బ్రహ్మవిదులు

    The Veda/Upanishad says the process of attaining bliss by meditating over one's aatma and focusing the mind on the creator is essential to attain salvation.

    871
    స్త్రీల మాయచేత జిక్కుదా గొన్నాళ్ళు తగులుగోరునట్లు తగిలిపోవు దనిసి సొనిసి తుదను దైవంబుచేజెడు , వి. వే.

    స్త్రీల మాయచేత జిక్కుదా గొన్నాళ్ళు
    తగులుగోరునట్లు తగిలిపోవు
    దనిసి సొనిసి తుదను
    దైవంబుచేజెడు , వి. వే.

    మూర్ఖుడు స్త్రీల వలలో చిక్కి కొన్నాళ్ళు తగులుపాటు పొందియుండి చివరకు తత్ఫలముగా దైవప్రేరణచే చెడుచున్నాడు

    A foolish person gets into trouble by befriending (flippant) women and receives punishment from God as a consequence thereby spoiling his reputation.

    872
    హయమదరి పరువులిడుగతి రయమున బాఱెడిని మనసు ప్రతికూలముగా నయమో భయమో చూపుచు బయనము సాగింపనీక పట్టర వేమా!

    హయమదరి పరువులిడుగతి రయమున
    బాఱెడిని మనసు ప్రతికూలముగా
    నయమో భయమో చూపుచు బయనము
    సాగింపనీక పట్టర వేమా

    గుర్రము బెదరి పరుగులిడునపుడు నయముననో భయముననో దానిని కుదురుపరచునట్లు చంచలమైన మనస్సును ఇటునటు పోనీయక ధైర్యముతో నిలుపవలెను

    When a horse struts side ways, one can set it straight with a whip or by a command. One has to control the mind with courage.

    873
    హరుడు గురుడు గాడె ? అఖిలంబు తాగాడె అనుభవింపరాదె ?హరుని గూర్చి యతికినంతలోన అంధకారంబేల? వి. వే.

    హరుడు గురుడు గాడె ? అఖిలంబు
    తాగాడె అనుభవింపరాదె?
    హరుని గూర్చి యతికినంతలోన
    అంధకారంబేల? వి. వే.

    శివుడే గురువు . మోక్షమునకై అతనిని గూర్చి జపతపము లొనర్పవలెను . అతనిపై మనస్సున్నచో అజ్ఞానము నశించును

    Lord Siva is the ultimate guru. One has to pray him with devotion to attain salvation. All ignorance will be destroyed by praying to him

    874
    స్థూలమగును గ్రుడ్డు ; సూక్ష్మమౌ గన్ పాప పాపలోని జ్యోతి పరమపదము మాపురేపు నాక మదినంటి చూడరా , వి. వే.

    స్థూలమగును గ్రుడ్డు ; సూక్ష్మమౌ
    గన్ పాప పాపలోని జ్యోతి
    పరమపదము మాపురేపు నాక
    మదినంటి చూడరా , వి. వే.

    కనుగ్రుడ్డు స్థూలము. కనుపాప సూక్ష్మము . అందలి జ్యోతి మోక్షసాధనము . దాని సాయమున నిరంతరము చూచిన బ్రహ్మము కానవచ్చును

    The eye ball is a gross object when compared with the pupil. The light within the pupils will help attain salvation. With such light by practice one can see the creator.

    875
    హరిహరాదులందు నాశను దిగనాడి శాంతిబుద్ధిగూడి సగుణమందు చింతమాని పిదప చిన్మయమందరా , వి. వే.

    హరిహరాదులందు నాశను దిగనాడి
    శాంతిబుద్ధిగూడి సగుణమందు
    చింతమాని పిదప
    చిన్మయమందరా , వి. వే.

    సగుణులగు హరిహరాదులయెడ ప్రత్యభిజ్ఞ విడిచి శాంతబుద్ధితో నిర్గుణ బ్రహ్మమును వీక్షింపుము

    Pratyabhijna is formed from prati- ("re-") + abhi (preposition meaning "closely") + *jñā ("to know"). So, the meaning is direct knowledge of one's self, "recognition". One has to give up Pratyabhijna and meditate over Lord Siva and Lord Vishnu who are endowed with gunas to realize the guna-less creator.

    876
    హానిచేతగల్గు అధిక దుఃఖంబులు హానిచేత దప్పు నరయ సుఖము హానిచేత కొంత యలమట గలుగురా , వి. వే.

    హానిచేతగల్గు అధిక దుఃఖంబులు
    హానిచేత దప్పు నరయ
    సుఖము హానిచేత కొంత యలమట
    గలుగురా , వి. వే.

    ధైర్యహాని వలన దుఃఖములు కలుగును . సుఖము నశించును . శ్రమ కలుగును కాన , ధైర్యమును విడువక యత్నించిన ముక్తి కల్గును

    With loss of courage, one encounters sorrow, loses comfort and faces strife in life. There is no salvation without courage and hard work.

    877
    హేమకార విద్య నెఱిగిన వారెల్ల వెతలబడియనట్లు విద్యచేత తత్త్వమెఱుగు వెనుక తనకు చింతేలరా , వి. వే.

    హేమకార విద్య నెఱిగిన వారెల్ల
    వెతలబడియనట్లు విద్యచేత
    తత్త్వమెఱుగు వెనుక తనకు
    చింతేలరా , వి. వే.

    స్వర్ణము చేయు విద్య నెరిగినవారు శ్రమ పొందక సుఖించునట్లు ఆత్మవిద్యవలన తత్త్వమెరిగినచో ఎట్టి విచారము ఉండదు

    Those who know alchemy live in comfort without sorrow. So are those who know the aatma and true knowledge.

    878
    హృదయమందు శివుని చెదరక నిల్పిన పదిలుడగును xxx వుడు ప్రాపుగాను గదిసి నొక్కి మదిని గ్రక్కున చూడరా, వి. వే.

    హృదయమందు శివుని చెదరక నిల్పిన
    పదిలుడగును xxx వుడు ప్రాపుగాను
    గదిసి నొక్కి మదిని
    గ్రక్కున చూడరా, వి. వే.

    హృదయమునందు శివుని నిలిపి కొల్వగా అతడు రక్షణ నిచ్చును . మనస్సులో అతనిని నిలిపి వీక్షింపుము

    Lord Siva will provide protection when one fixates him in the mind and prays to him.

    879
    క్షమగలట్టి యతడు సాధువై శోభించు ఓర్పుబోలునట్టి దుర్విగలదె ?వన్నెవచ్చు ; మేలులెన్నియైనను గూడు , వి. వే.

    క్షమగలట్టి యతడు సాధువై శోభించు
    ఓర్పుబోలునట్టి దుర్విగలదె?
    వన్నెవచ్చు ; మేలులెన్నియైనను
    గూడు , వి. వే.

    శాంతము గలవాడే సాధువు . శాంతమును పోలిన గుణము వేరే లేదు . అదే వన్నె గూర్చును . ఎన్నో మేళ్ళు కలుగును

    A true mendicant is one in peace. There is no equivalent quality for peace which provides positive attributes and makes life prosperous.

    880
    క్షుత్తు దప్పి నిద్ర క్షుభితములైయుండు రిత్తలోక మాయరీతిగాదె ? సత్తు పూర్ణసుప్తి సాధింపవలెనయా , వి. వే.

    క్షుత్తు దప్పి నిద్ర క్షుభితములైయుండు
    రిత్తలోక మాయరీతిగాదె?
    సత్తు పూర్ణసుప్తి
    సాధింపవలెనయా , వి. వే.

    ఆకలి దప్పులు , నిద్ర శ్రమనే కల్గి౦చుచుండును . సత్తును పూర్ణసుప్తితో సాధించిన కైవల్యమును పొందును

    Hunger, thirst and laziness create problems.One attains salvation by understanding the essence of deep sleep.

  • No comments:

    Post a Comment