Saturday, February 29, 2020

Swabhaava-Paddati


2275
ఇంతి తనదు పేరె యెల్ల కాలంబున ప్రజలు తలచునట్లు ప్రతిభగాంచె నింతికి పతిభక్తి యెంతన వచ్చును? వి. వే.

ఇంతి తనదు పేరె యెల్ల కాలంబున
ప్రజలు తలచునట్లు ప్రతిభగాంచె
నింతికి పతిభక్తి
యెంతన వచ్చును? వి. వే.

ఆడుది తన పేరు శాశ్వతముగా నిలుచునట్లు సంతానరూపమున నెలకొనుచున్నది . తన పతిభక్తిని చూపి ప్రతిభను గాన్చుచున్నది

A woman is made immortal by the offspring she is able to deliver. She is gaining fame from her devotion toward husband.

2276
ఇహ పరంబులందు నింతులపై నాశ సహజవృత్తి దగిలి సమయుచుండు రహిత మమరు భక్తి రాణింపదేలకో ? వి. వే.

ఇహ పరంబులందు నింతులపై నాశ
సహజవృత్తి దగిలి సమయుచుండు
రహిత మమరు భక్తి
రాణింపదేలకో ? వి. వే.

స్త్రీల యెడ గల కోరికచేతనే జనులు ఐహికా ముష్మికములను నశింపజేసికొనుచున్నారు . ఇది సహజము. విషయాదులు ప్రసక్తము కాని దైవభక్తి ఏల కలుగదో?

Because of the lust for women, men are not contemplating about the nether world. It is natural. There is no devotion toward god because of the involvement in worldly matters.

2277
ఈత వచ్చినపుడు లోతని పించునా? ప్రాత దోసి కెపుడు భయములేదు క్రోతి కొమ్మ కెక్కి కుప్పించి దూకదా ? వి. వే.

ఈత వచ్చినపుడు లోతని పించునా?
ప్రాత దోసి కెపుడు భయములేదు
క్రోతి కొమ్మ కెక్కి కుప్పించి
దూకదా ? వి. వే.

ఈత వచ్చిన వానికి లోతనిపించదు . ప్రాతనేరగానికి భయముండదు . ఒక కొమ్మనుండి మరియొక కొమ్మమీదికి దుముకుటకు కోతి జంకదు

For one who knows swimming, depth of water doesn't matter. An old criminal has no fear. A monkey won't hesitate to jump from one branch to another.

2278
ఎట్టి జీవికైన నిల కాంత భ్రాంతియే తెలియరయ్య యెపుడు తేటగాను మనసు శుద్ధిగన్న మఱియొక్క టగునయా , వి. వే.

ఎట్టి జీవికైన నిల కాంత భ్రాంతియే
తెలియరయ్య యెపుడు
తేటగాను మనసు శుద్ధిగన్న మఱియొక్క
టగునయా , వి. వే.

ఎట్టివారికైనను స్త్రీలపయి వ్యామోహముండక తప్పదు. మనశ్సుద్ధికలవారు మాత్రము దీనికి లొంగరు .

Many men have lust for women. The ones with a pure mind don't yield to such lust.

2279
ఎట్టి స్త్రీల గనిన నింతింత యనరాదు కామమహ్ని లక్క గరిగినట్లు ఇట్టి గాఢ మోహమెంతైన జేయురా, వి. వే.

ఎట్టి స్త్రీల గనిన నింతింత
యనరాదు కామమహ్ని లక్క
గరిగినట్లు ఇట్టి గాఢ మోహమెంతైన
జేయురా, వి. వే.

స్త్రీ వ్యామోహము చాల చెడ్డది . పురుషులు స్త్రీల పయి వ్యామోహము పొందగా - అట్టి వ్యామోహము ఎటువంటి పనులనైనను చేయించును

The carnal desire for women is very bad. As men develop such desire for women, it can make them do any kind of (bad) act.

2280
ఒడలు శిథిలమైన నోరుపు గల సతి గుణము మేల్మిబట్టి కోటిసేయు ప్రాత యెనుము పాలు రోత ననవచ్చునా ? వి. వే.

ఒడలు శిథిలమైన నోరుపు గల సతి
గుణము మేల్మిబట్టి కోటిసేయు
ప్రాత యెనుము పాలు
రోత ననవచ్చునా ? వి. వే.

శరీరము శిథిలమైయున్నను శాంతముగల యువతి తన గుణమునుబట్టి కోటి చేయును. ఎనుము ప్రాతదేయైనను దాని పాలు రోతగా ఉండునా? గుణమే ప్రధానము

Even though body has become feeble with age, a patient woman can still help anyone. Will the milk of an old cow be nauseating? Character is paramount.

2281
ఔర! యాడుదాని నా బ్రహ్మ సృష్టించె పురుషు పాలిటి పెను భూతమట్లు దానివలన చిక్కగాని వా డుండునే? వి. వే.

ఔర! యాడుదాని నా బ్రహ్మ సృష్టించె
పురుషు పాలిటి పెను
భూతమట్లు దానివలన చిక్కగాని
వా డుండునే? వి. వే.

బ్రహ్మదేవుడు పురుషులపాలిటి పెనుభూతముగా స్త్రీని సృజించెను . ఆమె వలలో చిక్కుకొననివాడు లేడు

Lord Brahma has created women to haunt men. There is no one who escaped their entrapment.

2282
కాకిగూట నాడుకోకిల తన గ్రుడ్ల బెట్టి పెనుపుజేయు గుట్టెఱుగుడి! ఆడువారి మోస మపుడైన దెలియదో ? వి. వే.

కాకిగూట నాడుకోకిల తన గ్రుడ్ల
బెట్టి పెనుపుజేయు గుట్టెఱుగుడి!
ఆడువారి మోస మపుడైన
దెలియదో ? వి. వే.

ఆడుకోకిల తన గ్రుడ్లను పొదగలేక కాకి గూటిలో నుంచును. కాకి తన గ్రుడ్లను భ్రాంతితో పొదుగును . స్త్రీల నేర్పరితన మిట్లుండును

A female cuckoo, being not capable of incubating its eggs, places them in a crow's nest. The crow incubates the eggs thinking they are its own. Such is the skill of females.

2283
కాంతమేను చూచి కలవరపడెదరు కడుపులోని రోత గానలేక ఇంత రోత గల్గు నీ దేహ మేలరా ? వి. వే.

కాంతమేను చూచి కలవరపడెదరు
కడుపులోని రోత గానలేక
ఇంత రోత గల్గు నీ
దేహ మేలరా ? వి. వే.

పురుషులు స్త్రీ శరీర సౌందర్యము చూచి భ్రాంతి పడెదరు . కాని శరీరమందలి రోతను గమనింపరు . ఇంత రోతయైన శరీరముపై ఎట్లు వ్యామోహము కలుగునో?

Men see the outer beauty of women and fall into delusion. They don't see their repulsive bodies. How can one develop carnal pleasure from such repugnant body?

2284
కూటికి నెడబాసి కూర్చున్న మనుజుడు వెలదుల గనుగొన్న వెతల బడును చెలగి యగ్ని జూచు శలభంబు చాడ్పున , వి. వే.

కూటికి నెడబాసి కూర్చున్న మనుజుడు
వెలదుల గనుగొన్న వెతల
బడును చెలగి యగ్ని జూచు
శలభంబు చాడ్పున , వి. వే.

ఆ పూట కూటికి లేక కష్టపడు దరిద్రునకుకూడ స్త్రీని చూడగనే వాంఛ కలుగును. అగ్ని౦జూసి దానిలో పడిన మిడుతవలె హానికే పాలగును

A poor man who doesn't have food to eat will develop desire when he sees a woman. Like the fire fly that self-immolates in fire, he will meet with danger.

2285
కూడు చీర బాసి గుళ్ళ పంచల బడునట్టు వ్రాసె బ్రహ్మయతుల నొసల దోయజాక్షి జేర దోసంబు లంటురా , వి. వే.

కూడు చీర బాసి గుళ్ళ పంచల
బడునట్టు వ్రాసె బ్రహ్మయతుల
నొసల దోయజాక్షి జేర దోసంబు
లంటురా , వి. వే.

కూడు , గుడ్డ లేక, గుడుల పంచలలో పడియుండమని బ్రహ్మయోగుల నుదుట వ్రాసెను . విరక్తులగు ఆ యతుల స్త్రీలను చేరుట పాపము

Lord Brahma has ordained brahma yogi's to live without food and clothes in the patronage of temples. As ones who are free from passions or affections, they should not seek women.

2286
కైకపుట్టి చెఱిచెగా రాము పట్టంబు సీత పుట్టి లంక జెఱిచె గాదె కౌరవులను జెఱిచె గద ద్రౌపదియు గూడ, వి. వే.

కైకపుట్టి చెఱిచెగా రాము పట్టంబు
సీత పుట్టి లంక జెఱిచె
గాదె కౌరవులను జెఱిచె గద
ద్రౌపదియు గూడ, వి. వే.

కైక రాముని పట్టాభిషేకమును , సీత లంకను చెరిచిరి . ద్రౌపది కౌరవులను నశింపజేసెను . స్త్రీల సామర్థ్యము చెప్పనలవి కానిది

Kaikeya has disrupted Lord Rama's coronation. Sita got Lanka destroyed. Draupadi indirectly caused the destruction of Kauravas. It is impossible to describe the capabilities of women.

2287
కొప్పు సొగసు గన్న కుచకుంభముల గన్న చెప్పరాని తావు చెలింగన్న ముప్పిరి గొనుచుండు మునికైన మోహము , వి. వే.

కొప్పు సొగసు గన్న కుచకుంభముల
గన్న చెప్పరాని తావు చెలింగన్న
ముప్పిరి గొనుచుండు
మునికైన మోహము , వి. వే.

స్త్రీలకొప్పు, అవయవముల చక్కదనము చూచిన యెడల మునులకైనను మోహ మెక్కువగా కలుగును

Even a sage develops desire for women after seeing their hair tied in a tuft and their beautiful body.

2288
చక్కనైన వాని మక్కువ గన్నంత తక్కువగను జూచు తనదు విభుని ఆడు బుద్ధికంటె నపరబుద్ధి కయేది ? వి. వే.

చక్కనైన వాని మక్కువ గన్నంత
తక్కువగను జూచు తనదు విభుని
ఆడు బుద్ధికంటె నపరబుద్ధి
కయేది ? వి. వే.

ఆడుదాని బుద్ధి చాల చెడ్డది. ఆమెకు చక్కనివాడు కనబడగనే అతనిపై మనసు పోవును. మగనిని చాల చులకనగా చూచును

A woman's mind is impure. If she sees a handsome man her mind will become fickle. She will treat her husband with scorn.

2289
చదువులెల్ల జదివి సర్వజ్ఞులైయుండి బ్రహ్మవిద్య లెల్ల బదట గలిపి పడతి దలచినంత పరమ యోగము మాను, వి. వే.

చదువులెల్ల జదివి సర్వజ్ఞులైయుండి
బ్రహ్మవిద్య లెల్ల
బదట గలిపి పడతి దలచినంత
పరమ యోగము మాను, వి. వే.

మనుష్యుడు ఎన్ని విద్యలు నేర్చి విద్వాంసుడైనను, తుదకు బ్రహ్మ విద్యను నేర్చి యోగసాధనలో ఉన్నను స్త్రీపయి మనస్సు పోగానే సర్వము నశించును

No matter how much learning a man undertakes to become a scholar, to realize brahmam, to practice yoga, all is destroyed when his mind goes after women.

2290
గుణపతి గల గృహము గోము నొందించును చీకటింట దివ్వె చెలగునట్లు దేబెయున్న కొంప దివ్వె మల్పినయట్లు, వి. వే.

గుణపతి గల గృహము గోము నొందించును
చీకటింట దివ్వె చెలగునట్లు
దేబెయున్న కొంప దివ్వె
మల్పినయట్లు, వి. వే.

గుణవంతురాలైన యువతి గృహమునకు శోభను కల్గించును. ఆమె చీకటింటిలో దీపమున్నట్లు ప్రకాశించును. దేబెయున్న యిల్లు దీపములేని గృహమువలె ఉండును

A woman of character will bring radiance to a house. She will shine like the lamp in a dark house. A wretched woman's house will be like a house without light.

2291
జిత్తులమారు లనందగు తొత్తులతో గూడ నేమి తుష్టి కలుగురా? చిత్తమున బ్రహ్మ మరయుము సత్తత నీ కప్పు డొప్పజాలును వేమా

జిత్తులమారు లనందగు తొత్తులతో
గూడ నేమి తుష్టి కలుగురా? చిత్తమున
బ్రహ్మ మరయుము సత్తత
నీ కప్పు డొప్పజాలును వేమా

మోసకత్తెలగు నీచస్త్రీలను కూడిన సంతృప్తి కలుగదు. నీ మనస్సులో పరమాత్మ నుంచుకొని పరిశీలింపుము. మనస్సు నాతనిని ధ్యానమునందే ప్రవర్తింప జేయును

There is no satisfaction in befriending deceitful women of low-life. One has to fixate the mind on paramaatma and meditate on him.

2292
జిలిబిలి మాటలు పలికెడు కులటల నమ్మంగరాదు కుహనయ తగురా, తెలివితొ నవమానించుచు తొలి ప్రియమును చూపకుండ దొలగుము వేమా

జిలిబిలి మాటలు పలికెడు కులటల
నమ్మంగరాదు కుహనయ తగురా, తెలివితొ
నవమానించుచు తొలి ప్రియమును
చూపకుండ దొలగుము వేమా

ఇంపైన మాటలు పల్కి వలలో వేసికొను కులటలను నమ్మరాదు. నమ్మి లొంగినచో వారు నేర్పుతో మోసగింతురు . తొలుత చూపిన ప్రేమను ఆ తర్వాత ఎంతమాత్రము చూపక నిరసింతురు

With their sweet talk an unchaste woman tries to entrap a man. If a man trusts her and yields to her, she will cheat on him. The love she shows at the beginning will not be there later on. He will end up being rejected by her.

2293
జాఱు చనుదోయి పైకెత్తి జీర బిగియ గంచుకముకట్టి కామినీ కపటవేష ధారిణుల వలబడి నీవు తగులు కొనకు తలగు మది నరకము చేర్చు దారి వేమ

జాఱు చనుదోయి పైకెత్తి జీర బిగియ
గంచుకముకట్టి కామినీ కపటవేష ధారిణుల
వలబడి నీవు తగులు కొనకు తలగు
మది నరకము చేర్చు దారి వేమ

వయస్సు మీరినను స్త్రీలు జారిపోవు స్తనముల నెత్తి కట్టి కంచుకము బిగించి యువతివలె వేషమువేసి పురుషులను వశము చేసికొందురు . లొంగినచో నరకమును చేర్చెదరు .

Even though they are past the prime of youth, women wrap their bosom in a tight jacket and wear make up to look younger so that they can enslave men. If one is willing to be befriended by them, he will end up in hell.

2294
జాలలోన నుండి స్త్రీలు వీధులవంక జూడనీయరాదు సుమ్ము, వినక చేతురేని యట్లు చేటులు మూడురా , వి. వే.

జాలలోన నుండి స్త్రీలు వీధులవంక
జూడనీయరాదు సుమ్ము,
వినక చేతురేని యట్లు చేటులు
మూడురా , వి. వే.

యువతులు కిటికీలలోనుండి వీధిలోనికి చూచుచుందురు . అట్లు చూడనీయరాదు . వారు మీ మాటలు వినక చూచుచున్న యెడల చేటు కలుగును

Young women hang around windows overlooking streets. One should not allow such a thing. If they keep looking ignoring one's words, there will be misfortune.

2295
జగడమునకు బోదు జారిణి యెప్పుడు మాయచేసి పురుషు మమత బెట్టు కాని మాటలాడు గయ్యాళి సతతము , వి. వే.

జగడమునకు బోదు జారిణి యెప్పుడు
మాయచేసి పురుషు మమత
బెట్టు కాని మాటలాడు గయ్యాళి
సతతము , వి. వే.

జార స్త్రీ మగనితో ఎంతమాత్రము జగడము లాడదు. మోసముచేసి యతనియెడ ప్రేమను నటించును. గయ్యాళి యెల్లప్పుడును కాని మాట లాడుచుండును

A whore will never fight with her husband. She will pretend love towards him and cheat behind him. A vixen says insulting words all the time.

2296
జ్ఞాతయైనవాని నేతగా భావించి నీతు లెఱుగవలయు నియతి గలిగి జ్ఞానులున్న లాభమూనునే తెలియమి , వి. వే.

జ్ఞాతయైనవాని నేతగా భావించి
నీతు లెఱుగవలయు నియతి
గలిగి జ్ఞానులున్న లాభమూనునే
తెలియమి , వి. వే.

జ్ఞానమున్నవానిని తమ నాయకునగా భావించి అతని వలన నీతులను గ్రహింపవలెను . జ్ఞానమున్నను దానివలన తగిన లాభము లేనిచో ఆ జ్ఞానమువల్ల ప్రయోజనమేమి ?

One has to consider a knowledgeable person as the leader and learn morals from him. Even if one has knowledge, if there is no benefit from it, there is no use.

2297
తేనె పంచదార తియ్య మామిడిపండు తిన్నగాని తీపి తెలియరాదు కన్న నింపు పట్టు కామిని యధరంబు , వి. వే.

తేనె పంచదార తియ్య మామిడిపండు
తిన్నగాని తీపి తెలియరాదు
కన్న నింపు పట్టు కామిని
యధరంబు , వి. వే.

తీనె , పంచదార, తియ్య మామిడిపండులను భుజించిన తర్వాతనే వాని మాధుర్యము తెలియును. కాని యువతి యధరము చూచినంతనే యింపు కల్గించును

One will know the pleasantness of honey, sugar and mangoes after tasting them. Whereas a young woman's lip will be pleasant on sight.

2298
తొడల మెఱుపు చూడ దొడ్డ చనుల జూడ వగలుచూడ వానివన్నె చూడ నయ్యల కెపుడైన నాసలు పుట్టావా ? వి. వే.

తొడల మెఱుపు చూడ దొడ్డ చనుల
జూడ వగలుచూడ వానివన్నె
చూడ నయ్యల కెపుడైన నాసలు
పుట్టావా ? వి. వే.

తొడల తళుకు , బిగువైన స్తనములు , స్త్రీల వన్నెలు, వగలు చూడగా యోగులైనవారికి కూడ యువతులపై ఆశలు కలుగక మానవు

Even a yogi when he sees the thighs, bosom, and romantic overtures of a woman is distracted and desirous of her.

2299
తొమ్మిది క్ర౦తల తిత్తికి నిమ్మగు సొమ్ములను కులుకు లేటికి జెపుమా నమ్మకు దేహము నా దని నెమ్మది బ్రహ్మంబు తెలియనేనని వేమా

తొమ్మిది క్ర౦తల తిత్తికి నిమ్మగు
సొమ్ములను కులుకు లేటికి జెపుమా
నమ్మకు దేహము నా దని నెమ్మది
బ్రహ్మంబు తెలియనేనని వేమా

శరీరము నవరంధ్రములు తిత్తి. దీనికి కులుకులు వగలు ఏల? ఈ దేహము నాది అనక , బ్రహ్మమే నేనని గ్రహింపుము

Body is a bag with 9 holes. There is no need for romantic acts. One should not claim this body is self and instead consider himself as brahmam.

2300
దేహభావమెల్ల తెలియంగ జూచిన నఖిలహేయములకు నాలయంబు పరసతి గమనంబు ప్రత్యక్షనాశము , వి. వే.

దేహభావమెల్ల తెలియంగ జూచిన
నఖిలహేయములకు నాలయంబు
పరసతి గమనంబు ప్రత్యక్షనాశము,
వి. వే.

పరిశీలించి చూడగా దేహము హేయపదార్థములకు నిలయమని తెలియును. కావున పరస్త్రీలను పొందుట హేయము. అది ఆత్మనాశమునకు కారణము

When one looks closer at one's body, it is a place for disgusting material. Hence falling for women is abominable. It will lead to the destruction of aatma.

2301
సతి చేసి పతిని వేడెడు సతి మర్మము కానవచ్చు సరసోక్తులనే మతి పోకలడచి పట్టిన సతి దుర్గతి వీడినదగు సత్యము వేమా

సతి చేసి పతిని వేడెడు సతి మర్మము
కానవచ్చు సరసోక్తులనే
మతి పోకలడచి పట్టిన సతి దుర్గతి
వీడినదగు సత్యము వేమా

మాటిమాటికిని విధేయతను చూపుచు మగనిని వేడుచుండు యువతి పరిహాస వాక్యములనుబట్టి దాని మర్మమును గ్రహింపవచ్చును . కనబడినవానిపై తలంపులుపోని యువతికి దుర్గతులు కలుగవు

One can learn the reason why a woman who shows obedience to her husband and beseeches him often, based on her satirical comments. A woman who can't forget every man she meets will meet with bad fate.

2302
నభమైన నందవచ్చును ఇభమును బట్టగవచ్చు నిమిడికగానే వ్యభిచారిణి మది నిలుపగ ప్రభువులకును సాధ్యపడదు పైకొన వేమా

నభమైన నందవచ్చును ఇభమును బట్టగవచ్చు
నిమిడికగానే వ్యభిచారిణి
మది నిలుపగ ప్రభువులకును
సాధ్యపడదు పైకొన వేమా

ఆకాశమునైన తాకవచ్చును . ఏనుగును నిలిపి బంధింపను వచ్చును. కాని, ఎట్టివారికైనను వ్యభిచరించు దాని మనస్సును నిలుపుట కష్టము

One can reach for the sky. An elephant can be trapped. But it is impossible to control the mind of a prostitute.

2303
నరుని బిందువు నను నాతి గర్భముదాల్చు రాతియుప్పచేత రసము దాల్చు బుద్ధి తెలివియున్న భువనంబు తాల్పదా? వి. వే.

నరుని బిందువు నను నాతి గర్భముదాల్చు
రాతియుప్పచేత రసము
దాల్చు బుద్ధి తెలివియున్న
భువనంబు తాల్పదా? వి. వే.

నరుని శుక్లబిందువువల్ల స్త్రీ గర్భము ధరించును . రాతి యుప్పుచేత పాదరసము కట్టబడుచున్నది . నరుడు బుద్ధిశాలి యైనచో లోకములను నిలుపవచ్చును

Because of man's seed, a woman gets pregnant. Mercury is reactive towards rock salt. If a man is intelligent it is possible to alter the course of the worlds.

2304
నా డెమైన చెడిపె నయ మెఱి౦గి తిరుగ విటుని గుస్తరించు వివర మెఱుంగ బానిసైన తొత్తు పాటింపరాదయా , వి. వే.

నా డెమైన చెడిపె నయ మెఱి౦గి
తిరుగ విటుని గుస్తరించు
వివర మెఱుంగ బానిసైన తొత్తు
పాటింపరాదయా , వి. వే.

నేర్పుగల రంకులాడి విటులను వలపించు పద్ధతి నెరిగి మెలకువగలిగి సంచరించును . దాసి మాత్రమట్లు చేయలేక విటుని బ్రతుకు బట్టబయలు చేయును

A skillful prostitute knows how to woo men and be alert. A servant maid cannot do the same and will reveal the secrets of the master.

2305
నాతిపైని ప్రేమ నానాటికిని రోత జ్యోతిపైని ప్రేమ చూడగాను మాతృ ప్రేమ యొకటె మర్యాద దల్చును, వి. వే.

నాతిపైని ప్రేమ నానాటికిని
రోత జ్యోతిపైని ప్రేమ చూడగాను
మాతృ ప్రేమ యొకటె
మర్యాద దల్చును, వి. వే.

నాతిపైని ప్రేమ నానాటికిని రోతగా తోచును. ఆత్మజ్యోతిపై ప్రేమ మేలైనది . అది మాతృప్రేమతో సమానము

Love for a woman wanes over a period. It is better to love the resplendent aatma. It is equivalent to motherly love.

2306
నాధుడున్నయట్టి ననబోడి యాతని దేవుడనుచు నెంచి సేవచేయ దగునుగాని యొరుని దానంటవచ్చునా? వి. వే.

నాధుడున్నయట్టి ననబోడి యాతని
దేవుడనుచు నెంచి సేవచేయ
దగునుగాని యొరుని
దానంటవచ్చునా? వి. వే

యువతి తన భర్తను దేవునిగా భావించి సేవించవలెను . పతివ్రత లిట్లుందురు . ఇతర పురుషుని ప్రేమించుట తప్పు. అతనిని తాకనైన రాదు

A woman should consider her husband as god and serve him accordingly. It is a sin to love other men. She shouldn't even touch another man.

2307
నీళ్ళమీద జూడు నెఱయ నోడల బల్మి బట్ట బయల జూడు బండి బలిమి ఆడుదాని బలిమి నాడనే చూడరా, వి. వే.

నీళ్ళమీద జూడు నెఱయ నోడల
బల్మి బట్ట బయల జూడు బండి
బలిమి ఆడుదాని బలిమి
నాడనే చూడరా, వి. వే.

ఓడల శక్తి నీళ్ళపైనే కానవచ్చును . అవి నేలపై నడువలేవు . బండ్లు నేలపైనేగాని నీటిపై నడువలేవు . ఆడుదాని ఘనత సంసారము చేయుటలోనే యున్నది. వేరెచ్చట పనికి రాదు

A ship can travel any distance on water. It can't move on land. A cart can travel anywhere on land but not in water. A woman's greatness is in managing her family. But not anywhere else.

2308
పలుకనేర్చు నపుడు బంగార మాసించు మాటలకు వలచుట మహిమగాదె ! కొఱక నేర్చు నదియు గోకిన జెప్పునా ? వి. వే.

పలుకనేర్చు నపుడు బంగార మాసించు
మాటలకు వలచుట మహిమగాదె!
కొఱక నేర్చు నదియు గోకిన
జెప్పునా ? వి. వే.

వేశ్య తన చమత్కారపు మాటలవల్లనే విటునిదగ్గర నుండి ధనము లాగగలదు . తాను చమత్కారపు మాటలకు లొంగదు . కొరికినగాని పలుకని దానిని గోకిన యెడల పలుకునా ?

A prostitute using words adroitly extracts money from men. She won't yield to praise from men. If something speaks only after biting it, will it respond if one scratches it?

2309
పతిని తిట్టరాదు పదివేలకైను పెట్టి చెప్పరాదు ప్రియముగాను పతిని మీఱరాదు సతి మానవతియేని, వి. వే.

పతిని తిట్టరాదు పదివేలకైను
పెట్టి చెప్పరాదు ప్రియముగాను
పతిని మీఱరాదు సతి
మానవతియేని, వి. వే.

స్త్రీ పతి నెప్పుడును నిందింపరాదు . అట్లే ఒకరికి పెట్టి, పెట్టితినని చాటరాదు . యువతి మానవంతురాలైనచో ఎంతమాత్రము భర్తను మీరరాదు

A woman should never blame her husband. She should not advertise when she gives alms to others. A modest woman should never cross the word of her husband.

2310
పతిని నిందచేసి పాటించి యెంచని సతుల కెట్లు ముక్తి సాధకమగు ? ఎట్లు కలుగు నియతి నెంచగా శక్యమా? వి. వే.

పతిని నిందచేసి పాటించి యెంచని
సతుల కెట్లు ముక్తి సాధకమగు?
ఎట్లు కలుగు నియతి
నెంచగా శక్యమా? వి. వే.

పతిని గౌరవింపక నిందించుచుండు పాపాత్మురాండ్రకు ముక్తి కలుగదు. వారికి ముక్తి కలుగు మార్గమును కూడ ఎవ్వరును చూపలేరు

A woman who disrespects and blames her husband is a sinner who will never attain salvation. No one can show her the way to salvation.

2311
పతిని భావమందు పరమాత్మగా నెంచు పడతి కమరు గతిని పరమటండ్రు పతిని దూఱునట్టి పడతికి దుర్గతి, వి. వే.

పతిని భావమందు పరమాత్మగా
నెంచు పడతి కమరు గతిని పరమటండ్రు
పతిని దూఱునట్టి
పడతికి దుర్గతి, వి. వే.

భర్తనే పరమాత్మగా భావించు స్త్రీకి ఉత్తమగతి లభించును. భర్తను నిందించు నామెకు కలుగునది దుర్గతియే

A woman who considers her husband as paramaatma will achieve a great after life. A woman who censures her husband will meet with bad fate.

2312
పర పురుషుని మీద ప్రాణంబు పెట్టుక మగువ చేయ జూచు మంచితనము అట్టి భంగి యోగి యాత్మను భావించు, వి. వే.

పర పురుషుని మీద ప్రాణంబు
పెట్టుక మగువ చేయ జూచు మంచితనము
అట్టి భంగి యోగి యాత్మను
భావించు, వి. వే.

జార యువతి పరపురుషునిపైనే మనస్సు నుంచుకొని భర్తకు మంచితనమున భ్రాంతి కల్గించును. అట్లే యోగి సంసారముపై భ్రాంతి చూపి మనస్సులో పరమాత్మనే భావించును

A whore will always seek men other than her husband and pretend to be in love with her husband. A yogi will think about paramaatma while pretending to like bondage.

2313
పరసతి గమనంబు ప్రత్యక్ష నరకంబు అరయు నిందకెల్ల నాలయంబు పురుషుడు విన జంపు భూపతి నొప్పించు, వి. వే.

పరసతి గమనంబు ప్రత్యక్ష నరకంబు
అరయు నిందకెల్ల నాలయంబు
పురుషుడు విన జంపు భూపతి
నొప్పించు, వి. వే.

పరస్త్రీ గమనము నరకము వంటిది. దానివలన జనుడు నిందల పాలగును. ఆమె భర్తకిది తెలిసిన చంపివేయును. రాజు శిక్షించును

Thinking about a married woman is hell. One gets blamed for it by people. If her husband knows about it, one will be killed. A king will punish one.

2314
పిచ్చివానికైన పేదవానికైన కుష్ఠురోగికైన కుంటికైన భామ కనుపింప బాముల పెట్టురా, వి. వే.

పిచ్చివానికైన పేదవానికైన
కుష్ఠురోగికైన కుంటికైన
భామ కనుపింప బాముల
పెట్టురా, వి. వే.

పిచ్చివాడైనను , పేదయైనను, కుష్ఠరోగియైనను, కుంటివాడైనను సరే; స్త్రీని చూడగానే ఆమెపై మనసు పడును

Whether a mad man, a poor man, a leper or a lame person, when he sees a woman he will desire her.

2315
బోటి యొకతె బ్రహ్మ నోటిమీదనె తన్నె కొమ్మ యొకతె విష్ణు రొమ్ము తన్నె సకియ యొకతె శివుని సగముగా జేసెను, వి. వే.

బోటి యొకతె బ్రహ్మ నోటిమీదనె
తన్నె కొమ్మ యొకతె విష్ణు రొమ్ము
తన్నె సకియ యొకతె శివుని
సగముగా జేసెను, వి. వే.

స్త్రీల వలన త్రిమూర్తులే అవమానింపబడిరి. సరస్వతి బ్రహ్మ నోటిపై తన్నినది . లక్ష్మి విష్ణువు గుండెలపై తన్నినది. పార్వతి శివుని సగముగా చేసినది

Because of women even tri-murti (Lords Brahma, Vishnu, Siva) were insulted. Goddess Saraswati hit on Lord Brahma's face. Goddess Lakshmi hit on Lord Vishnu's chest. Goddess Parvati took half of Lord Siva's body.

2316
బొల్లి మాటలాడు బోగముదానితో దొల్లి డుల్ల నిల్లు గుల్లజేసి వెళ్ళి రమ్మటంచు వెడలించు నింటిని, వి. వే.

బొల్లి మాటలాడు బోగముదానితో
దొల్లి డుల్ల నిల్లు గుల్లజేసి
వెళ్ళి రమ్మటంచు వెడలించు
నింటిని, వి. వే.

వేశ్య బొల్లిమాటలాడి విటుని ధనమును పూర్తిగా తీసికొని, దరిద్రునిచేసి పిదప పొమ్మని తన యింటినుండి తరుమును

A prostitute will tell cock-and-bull stories, take a man's wealth, make him a pauper and drive him out of the house.

2317
భాగ్యవంతురాలు పరుల యాకలిదప్పి తెలిసిపెట్ట నేర్చు తీర్ప నేర్చు తనదు దుష్ట భార్య తన యాకలినే గాని పరుని యాక లెఱుగబడదు వేమ

భాగ్యవంతురాలు పరుల యాకలిదప్పి
తెలిసిపెట్ట నేర్చు తీర్ప నేర్చు
తనదు దుష్ట భార్య తన యాకలినే
గాని పరుని యాక లెఱుగబడదు వేమ

భాగ్యవంతురాలు ఇతరుల యాకలిదప్పికలు నెరిగి వారికి కావలసినది పెట్టి తృప్తిపరుచును. దుష్టురాలగు భార్యకు తన యాకలియేకాని భర్త యాకలి తెలియదు

A house wife of good character will be aware of the needs of others and serve them food and water. An evil wife will only think of her needs, rather than serving food to her hungry husband.

2318
మగడు తప్పులేక మనసిచ్చి యున్నను సహజగుణము విడదు జారకాంత పిండి దిన్న కుక్క పీతి కాశింపదో? వి. వే.

మగడు తప్పులేక మనసిచ్చి యున్నను
సహజగుణము విడదు జారకాంత
పిండి దిన్న కుక్క
పీతి కాశింపదో? వి. వే.

తన భర్త ఎట్టి తప్పుచేయక మనసిచ్చి ప్రేమించినను జారిణి చెడ్డబుద్ధి మారదు. కుక్కకు రుచియైన పిండిని పెట్టుచున్నను దాని ధ్యానము పీతిపైనే యుండును

Even if her husband loves her, a lose woman won't change her immoral ways. A dog will seek street food, even if it is fed good food at home.

2319
మగడు మదనుడైన మంచి కాపురమైన సహజమేల మాను జారకాంత? పాలు ద్రావు కుక్క పరుగెత్తి పోవదా ? వి. వే.

మగడు మదనుడైన మంచి కాపురమైన
సహజమేల మాను జారకాంత?
పాలు ద్రావు కుక్క పరుగెత్తి
పోవదా ? వి. వే.

తన భర్త మన్మథునివంటి అందగాడైనను , కాపురము చక్కగానున్నను రంకుటాలి సహజగుణము మారదు. కుక్కకు పాలుపోసినను, ఎంగిలాకుల చప్పుడు విని పరుగెత్తి పోవును

Even if her husband is handsome and the married life is going well, a whore's natural tendency won't change. A dog will run away for street food, even when it is fed milk.

2320
మాట మిగులు నాలు మగనికి యమదూత యోరపడగ పాము కుద్దియగును తనకుగాని యాలు దానవురాలురా , వి. వే.

మాట మిగులు నాలు మగనికి
యమదూత యోరపడగ పాము కుద్దియగును
తనకుగాని యాలు
దానవురాలురా , వి. వే.

భర్త మాటను అతిక్రమించు భార్య యమదూత గాని భార్య కాదు . కాటువేయ సిద్ధముగా ఉన్న పాము వంటిది. భర్తకు ఉపకరించని ఆ భార్య రాక్షసురాలు

A woman who crosses her husband's word is not a wife but a messenger from the god of death. She is like a snake ready to bite. A woman who won't co-operate with her husband is a demon.

2321
మాన ధనము విడదు మఱి పుణ్యవతియైన పూని పతికి భక్తి పొసగజేయు లోన మెచ్చుచుండు లోగుట్టు గనవలె , వి. వే.

మాన ధనము విడదు మఱి పుణ్యవతియైన
పూని పతికి భక్తి పొసగజేయు
లోన మెచ్చుచుండు లోగుట్టు
గనవలె , వి. వే.

పుణ్యాత్మురాలగు స్త్రీ తన గౌరవమును కాపాడుకొనుచు భర్తను భక్తితో సేవించును. భర్తను మనస్సులో మెచ్చుచుండును . ఆమె మేలైన మనస్సును కనుగొననగును

A woman with morality serves her husband well while preserving her honor. She will be commending her husband in her mind. One has to try to read her mind.

2322
యోని లింగమందు నుద్భవమయ్యెను వాదులేల ? తనకు భేదమేల ? ఆది హరుడె తండ్రి ఆ హరియే తల్లి , వి. వే.

యోని లింగమందు నుద్భవమయ్యెను
వాదులేల ? తనకు భేదమేల?
ఆది హరుడె తండ్రి ఆ
హరియే తల్లి , వి. వే.

ఈ మాయా ప్రపంచము యోనిలింగమువలన నేర్పడెను . ఇందలి వారికి భేదములేదు. శివవిష్ణువులలో ఎవరు గొప్ప? అను వాదులాట యేల? శివుడే తండ్రి, విష్ణువే తల్లి

This delusional word originated from linga which has assumed the form of a woman's progenitor. There is no difference among the people. Who is the greatest: Lord Siva or Lord Vishnu? Why argue? Lord Siva is the father and Lord Vishnu is the mother.

2323
వరుడు చక్కనైన వజ్రాల గనియైన తళుకు మెఱుపువంటి తత్త్వమున్న నన్యపురుష వాంఛ యాడుదానికి నుండు, వి. వే.

వరుడు చక్కనైన వజ్రాల గనియైన
తళుకు మెఱుపువంటి తత్త్వమున్న
నన్యపురుష వాంఛ యాడుదానికి
నుండు, వి. వే.

తన భర్త అందగాడై గొప్ప ధనవంతుడైనను తత్త్వ మెరిగిన విద్వాంసుడైనను , ఆడుదానికి ఇతర పురుషునిపైనే కోరిక యుండును. ఇది విచిత్రము

A woman seeks another man even if her husband is handsome, rich and knowledgeable scholar of tattva.

2324
వల్లభునకు నిష్ట వస్తువు నందిచ్చి యతని మానసమున కతికియున్న యట్టి వనిత మంచి కట్టడి కలదగు , వి. వే.

వల్లభునకు నిష్ట వస్తువు
నందిచ్చి యతని మానసమున కతికియున్న
యట్టి వనిత మంచి
కట్టడి కలదగు , వి. వే.

భర్త మనస్సు ననుసరించి నడుచుకొనుచు నియమవతి యగు భార్య భర్త కిష్టములగు వస్తువులను సమకూర్చి యందిచ్చుచుండును

A chaste woman who understands her husband's mind and follows him, offers him the objects he likes and satisfies him.

2325
వశముకాని యాలి వైరమేమనవచ్చు? యశము జెఱుచుగాని యనుపుపడదు కొసరుటెల్ల దాని కోరికనే తీర్చు, వి. వే.

వశముకాని యాలి వైరమేమనవచ్చు?
యశము జెఱుచుగాని యనుపుపడదు
కొసరుటెల్ల దాని కోరికనే
తీర్చు, వి. వే.

తనకు వశముకాని భార్య గొప్పతనమే మనవచ్చును? ఆమెవల్ల కీర్తి నశించును. కొసరి కొసరి బుద్ధి చెప్పినను , ఆమె తన కోరికనే నెరవేర్చుకొనును

What can one say about the greatness of a wife who cannot be controlled by her husband? One will lose honor because of her. She will fulfill her own wishes even when one gives her good advice.

2326
వాడసత్యమెల్ల వడి సముద్రములోన బండి సత్యమెల్ల బట్టబయల నాడుదాని సత్యమేడను జెల్లదు , వి. వే.

వాడసత్యమెల్ల వడి సముద్రములోన
బండి సత్యమెల్ల బట్టబయల
నాడుదాని సత్యమేడను
జెల్లదు , వి. వే.

పడవయొక్క ఘనత చెలరేగిన సముద్రమున తెలియును. బండి వేగము నేలపై తెలియవలెను. ఆడుదాని ఘనతను ఎవ్వరును నిర్ణయింపలేరు

A ship's greatness will be known on high seas. A wagon's speed will be known on the land. No one can determine the greatness of a woman.

2327
వాదమాడి తిట్టువరుస నెవ్వరినైన జేరరాదటన్నజేటు తెచ్చు గడుసురాలు తెలియ వడిసెల బోలురా, వి. వే.

వాదమాడి తిట్టువరుస నెవ్వరినైన
జేరరాదటన్నజేటు తెచ్చు
గడుసురాలు తెలియ వడిసెల
బోలురా, వి. వే.

గయ్యాళి వడిసెలవలె ఇతరులను నొప్పించును . ఎవ్వరినైనను తగవులాటలో నోటికి వచ్చినట్లు తిట్టును. చేరదీయక పోయినను అపాయమునే కల్గించును

A shrew will pain others like a sling-shot. She will abuse anyone by drawing them into an argument. Even if she is not courted, she will cause danger.

2328
వెడగు వేత్తలగుచు వినగన రీ నరుల్ వేయి మార్గములను వేలుపజుడె అతడు సృష్టికర్త యంతకు గుఱుతెన్న , వి. వే.

వెడగు వేత్తలగుచు వినగన రీ
నరుల్ వేయి మార్గములను వేలుపజుడె
అతడు సృష్టికర్త యంతకు
గుఱుతెన్న , వి. వే.

మూర్ఖజనుల కెంత జెప్పినను తెలియకున్నది. పుట్టుక యనునది లేక శాశ్వతుడగు దేవుడే ప్రపంచమును సృజించు చున్నాడనునది ప్రత్యక్షముగా కానవచ్చుటలేదా ?

Foolish people are not realizing this: a god without birth and immortal has created this world that is apparent to one who can understand.

2329
వెతలు తీర్చువాడు వేదాంత వేద్యుడు రతుల నేలువాడు రమణుడగును సతిని బెనగువాడు సంసారయోగిరా, వి. వే.

వెతలు తీర్చువాడు వేదాంత
వేద్యుడు రతుల నేలువాడు
రమణుడగును సతిని బెనగువాడు
సంసారయోగిరా, వి. వే.

వేదాంతమును తెలిసినవాడే మనోబాధలను తొలగించును. భర్తయే యువతి రతులు తీర్చును. కులకాంతతో కూడి యోగము మరువానివాడే సంసారయోగి

A man who understands vedas can dispel one's mental problems. A husband can satisfy the romantic urges of a woman. A man who does not give up yoga while married is a samsaara-yogi.

2330
వెదక వెదక దొరకు వేదాంత వేద్యు౦డు వెదకువాని దాను వెదకుచుండు వెదుక నేర్చునట్టి వెఱవర్లు గలరొకో ? వి. వే.

వెదక వెదక దొరకు వేదాంత వేద్యు౦డు
వెదకువాని దాను వెదకుచుండు
వెదుక నేర్చునట్టి వెఱవర్లు
గలరొకో ? వి. వే.

ఎంతో వెదకగా వేదాంత వేద్యుడగు భగవంతుడు దొరుకును. తన్ను వెదకువాని నా భగవంతుడు వెదకు చుండును. ఆ భగవంతుని వెదకు నుపాయమును తెలిసినవారు మాత్రము చాల తక్కువగనే యుందురు

After much searching the god who knows all about vedas and mentioned in vedas can be found. God too will be seeking to find one who searches for him. The men who have the skill on how to search for God are far and few.

2331
ముద్దుగుమ్మకేల ముసలి మగడు మది వాసముగాక విటుని వలన జిక్కు వెఱ్ఱి మొద్దునకును వేదశాస్త్రములేల?

ముద్దుగుమ్మకేల ముసలి మగడు
మది వాసముగాక విటుని
వలన జిక్కు వెఱ్ఱి మొద్దునకును
వేదశాస్త్రములేల

యువతి భర్త ముసలివాడైనచో ఆమె యతనికి లొంగక విటునిపైనే దృష్టి నుంచును . అట్లే తెలివిలేని మూర్ఖునకు వేదశాస్త్రములు రుచించవు

If the husband is an old man, a woman won't yield to him and will divert her mind to other men. An ignorant and foolish person won't appreciate the vedas and scripture.

2332
సముదయంబునందు సర్వమొక్కటియైన వైర మొదవదేమి? వారలేమి? హెచ్చు తగ్గులందు నేర్పడనే హాని, వి. వే.

సముదయంబునందు సర్వమొక్కటియైన
వైర మొదవదేమి? వారలేమి?
హెచ్చు తగ్గులందు నేర్పడనే
హాని, వి. వే.

ప్రపంచములోని జాతులన్నియును ఒక్కటే అని తలచిన యెడల పరస్పర విరోధమునకు చోటు ఉండదు . హెచ్చుతగ్గుల వ్యత్యాసమున్నప్పుడే విరోధము , అపాయము కలుగును

When one considers all races are equal in this world, there is no room for mutual hatred. Enmity and danger will arise when there are differences among races as one is superior to others.

2333
సర్వకుల ధర్మమర్మముల్ సంతరించి సకల యోగంబులను మించి సమ్మతముగ బట్ట బయలందు జేరుటే బ్రహ్మ విద్య గుట్టిది యటంచు దెల్పురా గురుడు, వేమ

సర్వకుల ధర్మమర్మముల్ సంతరించి సకల
యోగంబులను మించి సమ్మతముగ బట్ట
బయలందు జేరుటే బ్రహ్మ విద్య గుట్టిది
యటంచు దెల్పురా గురుడు, వేమ

సమస్తమైన కులాచారములను విడిచివేసి సర్వసమత్వము కల్గి సమస్త యోగముల కనుకూలముగా మోక్షస్వరూపము నెరుగుటయే బ్రహ్మవిద్య . ఇది తెలిసినవాడే గురువు

The right spiritual knowledge is: leaving behind the rituals of caste, considering all are equal, and visualizing the form of salvation that is conducive to all yogas. The one who knows this is a guru.

2334
సాధు సజ్జనులను సంతరించినవాడు ప్రజల సంతసంబు పఱచువాడు కదిసి శాత్రవులను గరుణ జూచినవాడు పాదుకొన్న ముక్తిపరుడు వేమ

సాధు సజ్జనులను సంతరించినవాడు
ప్రజల సంతసంబు పఱచువాడు కదిసి
శాత్రవులను గరుణ జూచినవాడు
పాదుకొన్న ముక్తిపరుడు వేమ

సాధువులను, ఉత్తములను సంతోషపరుచువాడును , ప్రజారంజకుడును, తన్ను చంప వచ్చిన వానిని దయతలచి విడిచినవాడును ముక్తిని తప్పక పొందుదురు [sic ]

A man who makes sages and people of good character happy, one who pleases all people, and one who forgives an enemy trying to kill him, will definitely attain salvation.

2335
సిగ్గటంచనబడు సిగ్గదెచ్చోనుండు? నాయక లెచటనుండు నరయగాను దాగియున్న వానిదా నేల తెలియడో ? వి. వే.

సిగ్గటంచనబడు సిగ్గదెచ్చోనుండు?
నాయక లెచటనుండు నరయగాను
దాగియున్న వానిదా
నేల తెలియడో ? వి. వే.

సిగ్గు, ఆకలి అనునవి మనస్సులో పుట్టినవేకాని వేరైనవి కావు. ఈ రహస్యమును తెలిసికొనుటయే యోగాను భవమునకు ముఖ్యమైన ఫలము

Shame and hunger originate in the mind but nowhere else. Knowing this secret is the important fruit of yogic experience.

2336
సిగ్గు గల దటండ్రు సృష్టి లోపలివారు వెఱ్ఱి వేమన గని వెఱ్అగు పడిరి తనకు గలుగు సిగ్గు దైవ మెఱుంగడా ? వి. వే.

సిగ్గు గల దటండ్రు సృష్టి లోపలివారు
వెఱ్ఱి వేమన గని వెఱ్అగు
పడిరి తనకు గలుగు సిగ్గు
దైవ మెఱుంగడా ? వి. వే.

అవివేకులు తామే సిగ్గుగలవారమని తలచి, దిగంబరుడైన వేమనను [sic ] చూచి ఆశ్చర్యపడుచుందురు . తాము సిగ్గు కల్గించు అవయవమును కప్పినను, అది భగవంతునికి కానవచ్చును గదా!

Foolish people, while being ashamed about themselves, are surprised to see a naked yogi. Even if people cover the body parts they are ashamed of, god knows all about them.

2337
సిగ్గు దాగు నెచట చీకటి యెట దాగు నాకలేడ దాగు నాత్మలోన దాగియున్న నిద్ర దాగుట తెలియడీ , వి. వే.

సిగ్గు దాగు నెచట చీకటి యెట
దాగు నాకలేడ దాగు నాత్మలోన
దాగియున్న నిద్ర దాగుట
తెలియడీ , వి. వే.

శరీరమున సిగ్గెచట దాగునో , అజ్ఞానము , ఆకలి ఎచట దాగియున్నదో , నిద్ర ఎక్కడదాగియున్నదో యోగియగు వాడు ముందు తెలిసికొనవలెను

A yogi should find out where in the body hides the shame, and where in ignorance, hunger and sleepiness hide.

2338
సిగ్గు విడువకున్న శివ సౌఖ్యమే లేదు తగ్గి మొగ్గకున్న సిగ్గు విడదు సిగ్గు విడుచువాడె చిరకాల జీవిరా, వి. వే.

సిగ్గు విడువకున్న శివ సౌఖ్యమే
లేదు తగ్గి మొగ్గకున్న సిగ్గు
విడదు సిగ్గు విడుచువాడె
చిరకాల జీవిరా, వి. వే.

అజ్ఞానాభిమానములను విడిచిననేగాని మోక్షము లభింపదు. అహంకారాదులు విడిచినగాని సిగ్గు పోదు. సిగ్గు విడిచినవాడే మరణించియు బ్రతికియున్నవాడు

One cannot attain salvation without giving up ignorance and self. Until one overcomes ego he won't lose shame. One who gives up shame is alive even after death.

2339
శీలవ్రతముచేత శిష్యుల శిష్యులై తపసి కర్మములను ధారవోసి విశ్వకర్మ కులము వీటి బుచ్చిరి కదా, వి. వే.

శీలవ్రతముచేత శిష్యుల శిష్యులై
తపసి కర్మములను ధారవోసి
విశ్వకర్మ కులము వీటి
బుచ్చిరి కదా, వి. వే.

విశ్వకర్మ కులమున పుట్టినవారమనుకొను అహంకారులు శీలము, వ్రతము కాలవారమని , తామే గురువులు, శిష్యులు , ప్రశిష్యులయి , తపస్సు మున్నగువానిని విడిచి , తమ కులమునకే కళంకము తెచ్చుచుందురు

Some people born in the caste of viswa karma (the architect for gods) exhibit pride. They claim to have exceptional character and devotion to god. They gave up penance, after claiming themselves to be gurus and disciples of gurus, bringing bad name to their caste.

2340
సున్నమన్న నేదొ సూక్తిని దెలిసిన వన్నెగన్న యట్టి వారు గాక ఎన్నగలరె యొరులికెన్ని యోచించిన , వి. వే.

సున్నమన్న నేదొ సూక్తిని దెలిసిన
వన్నెగన్న యట్టి వారు
గాక ఎన్నగలరె యొరులికెన్ని
యోచించిన , వి. వే.

మానవుడు వస్తుస్వరూపమును అనుభవమును బట్టియే నిర్ణయింపవలెను . అనుభవము లేనిచో సామాన్యమైన సున్నమును సున్నమని తెలుసుకొనుటయు కష్టమే!

One knows about the form of things based on experience. Without experience one can't identify the ordinary lime from other things.

2341
సొమ్ముగన్న దనుక జ్యోతి వెలుగనవలె సొమ్ముగన్న వెనుక జ్యోతి యేల? దేవుడైన వెనుక దేహంబు చీకేల? వి. వే.

సొమ్ముగన్న దనుక జ్యోతి వెలుగనవలె
సొమ్ముగన్న వెనుక
జ్యోతి యేల? దేవుడైన వెనుక
దేహంబు చీకేల? వి. వే.

వస్తువులు కనబడువరకు దీపమవసరమే . కనబడిన పిదప దీప మక్కరలేదు . అట్లే జీవున కీశ్వర సాక్షాత్కార మగువరకును దేహమును ధరింపవలసినదే !

Until one finds the object he is seeking in darkness, he needs to use a lamp. Once the object is found, there is no need for the lamp. Jeeva has to dwell in his body until Iswara deifies.

2342
సొమ్ము లున్నచోట్ల శోధింప గలుగును సొమ్ము లేని చోట శోధ యేల? అంజనంబు లేక యా సొమ్ము తెలియదు, వి. వే.

సొమ్ము లున్నచోట్ల శోధింప
గలుగును సొమ్ము లేని చోట
శోధ యేల? అంజనంబు లేక యా
సొమ్ము తెలియదు, వి. వే.

వస్తువులున్నచోటనే పరిశోధింపవలెను . భూగర్భము లోని వస్తువులను చూచుటకు అంజనము కావలెను. అట్లే సాధకుడు తత్త్వమెచ్చట నున్నదో అచ్చటనే పరిశీలింపవలెను . గురువుల అనుగ్రహము లేక అది లభింపదు

One has to research where objects can be found. To visualize the objects buried under the earth, one uses anjanam (a procedure by which mystics find unknown and unseen objects). Similarly a seeker should seek where there is tattva. Without a guru's blessing it is impossible to do so.

2343
సోమయాజి ననుచు సొంపుగా వేషంబు గట్టి మాంసమెల్ల గాల్చి తినును ద్విజుడదా ననగ నధికమేమి కల్గును ? వి. వే.

సోమయాజి ననుచు సొంపుగా వేషంబు
గట్టి మాంసమెల్ల గాల్చి
తినును ద్విజుడదా ననగ నధికమేమి
కల్గును ? వి. వే.

కొందరు బ్రాహ్మణులు యాగములుచేసి మాంసములు కాల్చి తిని తామే ద్విజులమని గొప్పగా చెప్పుకొందురు . ఇట్టి వారి గొప్పతనమెట్లో తెలియకున్నది

Some brahmins perform rituals and eat meat and brag about their greatness.

2344
సోమ లతల రసము సోలల కొలదిని ద్రావనేల? తామే లటండ్రు క్రతు ఫలంబు కంఠ గతమగు కాబోలు, వి. వే.

సోమ లతల రసము సోలల కొలదిని
ద్రావనేల? తామే లటండ్రు
క్రతు ఫలంబు కంఠ గతమగు
కాబోలు, వి. వే.

యాగములు చేసి సోమరసము ఎంత త్రాగినను దాని వలన ప్రయోజనము లేదు. యాగమే గొప్ప ఫలము నిచ్చు ననుట పొరపాటు, ఎక్కువ సోమరసము త్రాగిన అది గొంతుకలోనికి వచ్చుచుండును [regurgitate ]. అదియే దక్కిన యాగ ఫలము

There is no use in performing fire rituals and drinking the soma-juice that is offered to the gods. It is a mistake to assume such rituals offer great things. When one drinks too much soma-juice it regurgitate into the throat. That is the result of their rituals.

2345
స్వప్న మనగనేమి? స్వాతంత్ర్యము కాడు స్వప్నమనగజీవసంకటంబు అల్ప నరుడు తెలియు టవనిలో నరుదయా, వి. వే.

స్వప్న మనగనేమి? స్వాతంత్ర్యము
కాడు స్వప్నమనగజీవసంకటంబు
అల్ప నరుడు తెలియు
టవనిలో నరుదయా, వి. వే.

స్వప్నమనునదిభ్రాంతి, స్వతంత్రమైనది కాదు . అజ్ఞానావృతుడైన జీవుడు కలలో కొట్టుకొనును . కావున జీవుడు సంకటపడును . దీని తత్త్వము సామాన్య నరునకు తెలియదు

A dream is a delusion. Not an independent entity. An ignorant jiva will struggle in his dream. So he will be distressed upon waking up.

2346
స్నాన మొనర జేసి సధ్ధర్మ మీయక నీళ్ళ మునుగ నగును నేర్పులేక నీళ్ళయందు కోడి నెలవుగా మునుగదా , వి. వే.

స్నాన మొనర జేసి సధ్ధర్మ మీయక
నీళ్ళ మునుగ నగును నేర్పులేక
నీళ్ళయందు కోడి నెలవుగా
మునుగదా , వి. వే.

ధర్మముచేయక నీటిలో చాలసార్లు మునిగినంత మాత్రమున జనులు గొప్పవారు కాలేరు. వీరివలెనే నీటికోడియే ఎల్లపుడు నీటిలో ముంగును గదా!

Without offering alms, there is no use in dipping in holy rivers. The water fowl do that constantly.

2347
స్నాన సంధ్య జపము జరియించు భుజియించు నిష్ఠ లెన్నియైన నెఱపుగాని ఒకని కీయడేమి సుకృతంబు కలుగునో? వి. వే.

స్నాన సంధ్య జపము జరియించు
భుజియించు నిష్ఠ లెన్నియైన
నెఱపుగాని ఒకని కీయడేమి సుకృతంబు
కలుగునో? వి. వే.

లోభి స్నానము చేయుచు సంధ్య నార్చుచు జప తపములు చేయునేగాని ఒక్క కాసైన ఇతరులకీయడు . ఒకని కీయని యెడల పుణ్యమెట్లు కలుగును?

A miser performs rituals to sun god after taking a bath and does penance and pooja. But he never gives alms to the poor. How can one accrue good karma when he doesn't offer anything to others?

2348
స్వానుభూతి లేక శాస్త్ర వాసనాలచే సంశయంబు విడదు సాధకునకు , చిత్ర దీపమునను చీకటి పోనట్లు, వి. వే.

స్వానుభూతి లేక శాస్త్ర వాసనాలచే
సంశయంబు విడదు సాధకునకు,
చిత్ర దీపమునను
చీకటి పోనట్లు, వి. వే.

శాస్త్రములను బాగుగా చదివినను స్వానుభవము లేనిచో అజ్ఞానము నశింపదు . బొమ్మలోని దీపమువలన చీకటి నశింపదు కదా!

In spite of reading vedas and scripture, without experience, ignorance won't be destroyed. The lamp in the picture can't dispel the darkness.

2349
స్త్రీల జూచి నరుడు చిత్తంబు నిలుకడ చేయలేక తాను చెడునుగాదె ఏటికట్ట మరాన దెందాక నిలుచురా? వి. వే.

స్త్రీల జూచి నరుడు చిత్తంబు
నిలుకడ చేయలేక తాను చెడునుగాదె
ఏటికట్ట మరాన దెందాక
నిలుచురా? వి. వే.

స్త్రీలను చూచిన మనస్సు చలించును. మనస్సు నిలుకడగా లేనిచో మానవుడు చెడును. ఏటిగట్టున ఉన్న చెట్టు ఎప్పుడు పడిపోవునో చెప్పలేము. దానికి నిలుకడలేదు

When a man looks at a woman his mind will waver. Without integrity a man will go bad. The tree on the banks of village lake can be uprooted at any time. It has no stability.

2350
స్త్రీలు కల్గుచోట జెర్లాటములు కల్గు స్త్రీలు లేనిచోట చిన్నబోవు స్త్రీలచేత నరులు చిక్కుల బడుదురు , వి. వే.

స్త్రీలు కల్గుచోట జెర్లాటములు
కల్గు స్త్రీలు లేనిచోట చిన్నబోవు
స్త్రీలచేత నరులు చిక్కుల
బడుదురు , వి. వే.

స్త్రీలున్న చోట తగవులు కలుగును. అట్లని స్త్రీలు లేకున్నను శోభించదు . మరియు స్త్రీలవలన చిక్కులు కలుగును. వారి ప్రకృతి విచిత్రము

Where there are women, there will be quarrels. On the other hand, without women there is no splendor. One faces troubles because of women. Their nature is mysterious.

2351
అతి నిద్రావంతునకును నతి పానికి నిరశనునకు నతి కోపునకున్ ధృతిహీనున కపకృతునకు జత పడదీ బ్రహ్మ విద్య చాటర వేమా

అతి నిద్రావంతునకును నతి పానికి
నిరశనునకు నతి కోపునకున్
ధృతిహీనున కపకృతునకు జత పడదీ
బ్రహ్మ విద్య చాటర వేమా

అధికమైన నిద్ర, త్రాగుడు, ఆకలి, అధిక కోపము, అధైర్యము , పరోపకారము - అనునవి ఉన్నవారికి బ్రహ్మవిద్య ఎంత మాత్రము తలకెక్కదు

One who sleeps a lot, drinks too much liquor, cannot control food intake, harbors too much anger, is a coward, and has too much involvement in helping others, cannot understand the knowledge about brahmam.

2352
అదనెఱిగిన మగువ యనవెర్గు చనువెర్గు ముదము తోడి మగని మొహ మెఱుంగు విభుని శ్రేష్ఠ గుణము వేశ్య తానెఱుగురా , వి. వే.

అదనెఱిగిన మగువ యనవెర్గు చనువెర్గు
ముదము తోడి మగని మొహ మెఱుంగు
విభుని శ్రేష్ఠ గుణము
వేశ్య తానెఱుగురా , వి. వే.

యుక్తాయుక్త జ్ఞానముగల కులకాంత మగని మంచితనము, చనువు, వలపు తెలిసికొనగలుగును . ధనమును మాత్రమే ప్రేమించు వేశ్య విటుని మేలి గుణములను గ్రహింపలేదు

A woman of good character with discriminatory knowledge knows the goodness and romance of her husband. A prostitute who only loves money won't recognize the good qualities of her customers.

2353
అధిక జనులతోడ నాప్తుల తోడను పరువు గుఱు తెఱి౦గి పలుక కున్న వచ్చు చెడ్డ తనము హెచ్చుగా గాంభీర్య మహిమ హానిజెందు మహిని వేమ

అధిక జనులతోడ నాప్తుల తోడను పరువు
గుఱు తెఱి౦గి పలుక కున్న వచ్చు
చెడ్డ తనము హెచ్చుగా గాంభీర్య
మహిమ హానిజెందు మహిని వేమ

మర్యాద పద్దతిని తెలిసికొనియే గొప్పవారితోను , ఆప్తులతోను సంభాషింపవలెను . లేనియెడల కష్టములు వచ్చును. అన్నిచోట్లను గాంభీర్యము చూపుటయు మేలుకాదు

One has to conduct with respect when dealing with great people and loved ones. Otherwise he will face difficulties. It is not wise to display profundity at all places.

2354
అనగ ననగ రాగమతి రమ్యమై యుండు పెనగ పెనగ సతికి బ్రేమ పుట్టు తినగ తినగ వేము తియ్యనై యుండురా, వి. వే.

అనగ ననగ రాగమతి రమ్యమై యుండు
పెనగ పెనగ సతికి బ్రేమ
పుట్టు తినగ తినగ వేము తియ్యనై
యుండురా, వి. వే.

అభ్యసింపగా, అభ్యసింపగా రాగము ఇంపుగానుండును. కలిసిన కొద్దియు యువతికి ప్రేమ అధికమగును . తినగా, తినగా వేప చిగురును రుచికరమైయుండును

One can sing a song with much practice. Familiarity with a woman increases love for her. Even the bitter neem fruit will be tasty after repeated trials at eating it.

2355
అనువు గాని బంటు నల్పుడేలిన యెడ మాఱు మలయు నొండె మగుడు టొండె దూలమూత కోల దొరికిన చందము, వి. వే.

అనువు గాని బంటు నల్పుడేలిన
యెడ మాఱు మలయు నొండె
మగుడు టొండె దూలమూత కోల
దొరికిన చందము, వి. వే.

దూలమును చేతి కర్రగా తీసికొన్న ఏమి ఉపయోగము? అట్లే అనువుకాని సేవకునిగా ఉంచుకొన్న బలహీనునకి ఉపయోగము లేదు. ఆ సేవకుడెదిరించును ; కొట్టనైన వచ్చును

There is no use in carrying a big log as a supporting stick. One being weak cannot get help from a servant who shirks. That servant can rebel. Even harm his master.

2356
అప్పుదీయ రోత హరిహరాదులకైన మొప్పెతోడ మైత్రి మొదలె రోత తప్పు పలుక రోత తాకట్టిడిన రోత, వి. వే.

అప్పుదీయ రోత హరిహరాదులకైన
మొప్పెతోడ మైత్రి మొదలె
రోత తప్పు పలుక రోత తాకట్టిడిన
రోత, వి. వే.

హరిహరులకైన అప్పుతీయుట చేటు. అట్లే తాకట్టు పెట్టుట , చెడ్డవారి స్నేహము, తప్పు మాటలు పల్కుటయు చేటు

Even for Lords Shiva and Vishnu taking loans is bad. Pawning one's things, befriending bad people and talking lies leads to bad ends.

2357
అరయ లజ్జ చూడ నందఱ యందుండు లజ్జ లేనివాడు లాలితుండె లజ్జ గల్గువాని లాభంబు లేమయా! వి. వే.

అరయ లజ్జ చూడ నందఱ యందుండు
లజ్జ లేనివాడు లాలితుండె
లజ్జ గల్గువాని
లాభంబు లేమయా! వి. వే.

లజ్జ అందరికి గలదు . లజ్జ లేనివాడు మనుష్యులలో చేరడు . అయినను లజ్జవలన మాత్రము ప్రయోజనము మేమాత్రము కానరాదు

Everyone feels shame. There is no one among men who doesn't feel shame. Even then, there is no practical use for shame.

2358
అల్పుడైన వాని కాధికార మబ్బెనా దొడ్డ కొంచె మనక తూలబలుకు చెప్పు కొఱకు కుక్క చెఱకు నేమెఱుగురా? వి. వే.

అల్పుడైన వాని కాధికార మబ్బెనా
దొడ్డ కొంచె మనక తూలబలుకు
చెప్పు కొఱకు కుక్క చెఱకు
నేమెఱుగురా? వి. వే.

నీచునకు అధికారము లభించిన యెడల హెచ్చు తగ్గు భేదములులేక అందరిని తూలనాడును . చెప్పుకొరుకు కుక్కకు చెరకు రుచి యేమి తెలియును?

A low-life after assuming power censures everyone regardless of their status. A dog chewing on a shoe doesn't know the sweetness of sugar cane.

2359
అల్లుని కగు మృతికి నాత్మ చింతించును తనయు మృతికి తాను తల్లడిల్లు పుణ్య పురుషు మృతియు భూమికి మృతియగు , వి. వే.

అల్లుని కగు మృతికి నాత్మ చింతించును
తనయు మృతికి తాను తల్లడిల్లు
పుణ్య పురుషు మృతియు
భూమికి మృతియగు , వి. వే.

లోకులు, అల్లుడు మరణించిన లోలోపల దుఃఖింతురు . పుత్రుడు మరణించిన తల్లడిల్లుపోదురు . ఉత్తముడెవ్వడు మరణించిన తల్లిదండ్రులు కాక అందరును మిక్కిలి దుఃఖింతురు

Parents feel sad when a son-in-law dies. If their son dies they will grieve. When a man of good character dies, all people including parents will grieve.

2360
ఇంగలంబు తోడ నెల నల్పుతోడను పరుని యాలితోడ పతితుతోడ సరసమాడుటెల్ల చావుకు మూలము, వి. వే.

ఇంగలంబు తోడ నెల నల్పుతోడను
పరుని యాలితోడ పతితుతోడ
సరసమాడుటెల్ల చావుకు
మూలము, వి. వే.

నిప్పుతోను , నీచునితోను , పాపాత్మునితోను, పరస్త్రీతోను పరిహాసమాడుట తన ప్రాణమునకే హాని కలిగించును

One will put himself in danger by playing with fire, a low-life, a sinner and a woman.

2361
ఇచ్చకము భువి నవశ్యము కుచ్చిత మిహలోక నింద కోవిదునకు నీ తచ్చననె హాని వచ్చును మచ్చరమె తన్ను చెఱచు మహిలో వేమా

ఇచ్చకము భువి నవశ్యము కుచ్చిత
మిహలోక నింద కోవిదునకు నీ
తచ్చననె హాని వచ్చును మచ్చరమె
తన్ను చెఱచు మహిలో వేమా

ఇచ్ఛకములు పలుకుట , కుత్సితముగా మాటలాడుట , పరనింద మున్నగునవి ఎంత తెలిసినవారికైనను హానిని కలిగించును . మచ్చరము మిక్కిలి అపాయకరము

Flattery, vileness, blaming others will cause harm to all men. Malice is the most dangerous.

2362
ఇహము నందు బాధ లెన్నైన బడవచ్చు యముని బాధలేక యమరవలెను పరుని బాధలేక బ్రతుకుడు నరులార ! వి. వే.

ఇహము నందు బాధ లెన్నైన బడవచ్చు
యముని బాధలేక యమరవలెను
పరుని బాధలేక బ్రతుకుడు
నరులార ! వి. వే.

ఈ లోకమున ఎన్ని కష్టములనైనను పడవచ్చును గాని పరలోకములోని కష్టములు భరింపరానివి . యమునివలన బాధపడకుండుటకు గట్టిగా యత్నింపవలెను

One can tide over all difficulties in this world. The nether world is fraught with difficulties. One should strive hard to be spared by the god of death.

2363
ఈగ తల విషంబ దిముడదు నీలోన తేలు తోక విషము తెంపు జూపు పాము కోఱ విషము పట్టి చంపును గదా! వి. వే.

ఈగ తల విషంబ దిముడదు నీలోన
తేలు తోక విషము తెంపు
జూపు పాము కోఱ విషము పట్టి
చంపును గదా! వి. వే.

తలలో విషముగల ఈగవల్ల వాంతులు కలుగవచ్చును . తేలు తోకలోని విషము మిగుల బాధించును . పాము కోరలోని విషము ప్రాణములనే తీయును

A poisonous fly can make one vomit. The poison in the scorpion's sting will cause much pain. One could die from the poison in a snake's fangs.

2364
ఈగ తేనె రుచికి నింపుగా చచ్చును ఓగు కామ రుచికి నొదిగి చచ్చు త్యాగి కాని వాని ధర్మ మడ్గిన జచ్చు వి. వే.

ఈగ తేనె రుచికి నింపుగా చచ్చును
ఓగు కామ రుచికి నొదిగి
చచ్చు త్యాగి కాని వాని ధర్మ
మడ్గిన జచ్చు వి. వే.

తేనెను రుచిచూచుటకు వచ్చి యీగ చచ్చిపోవును . అవివేకి కామమునకు లొంగి చచ్చును. దాతకాని పెనులోభిని ధనమడిగిన వాని మీది ప్రాణములు మీదనే పోవును

A fly will die in a pot of honey unable to control its temptation for sweet things. A foolish person will die by yielding to his lust. When a miser is asked for alms, his praana will leave him.

2365
ఉక్కు చూర్ణముదిన నుడుగును కష్టంబు లుక్కు చూర్ణము దిన నుడుగు క్షయము నుక్కు చూర్ణము దిన నుడుగును కర్మముల్ , వి. వే.

ఉక్కు చూర్ణముదిన నుడుగును కష్టంబు
లుక్కు చూర్ణము దిన నుడుగు
క్షయము నుక్కు చూర్ణము దిన
నుడుగును కర్మముల్ , వి. వే.

లోహ భస్మమును తినిన క్షయ నశించును. కష్టములునుండవు . దానిని తిని కర్మబంధములను గూడ తొలగించుకొన వచ్చును

With ayurvedic medicine called lOha-bhasma one can be cured of ailments. One can also be freed from bondage by it.

2366
ఊపిరున్న యపుడె యుపదేశమందుము రూపు మాయు నెపుడో రూఢిగాను బాపడైన నేమి బడబాగ్ని మ్రింగునా , వి. వే.

ఊపిరున్న యపుడె యుపదేశమందుము
రూపు మాయు నెపుడో రూఢిగాను
బాపడైన నేమి బడబాగ్ని
మ్రింగునా , వి. వే.

ప్రాణమున్నప్పుడే గురూపదేశమును పొందవలెను. ప్రాణమున్నపుడే పరమునకై పాటుపడవలెను. నీవు బ్రాహ్మణుడవని దయతలచి మృత్యుదేవత నిన్ను విడువదు

One has to serve a guru while one is still alive. One has to try hard to attain salvation when he is active. The god of death won't spare even a brahmin.

2367
ఋణము పెంచి నరుని హీనుగా నొనరించి విడుచు తండ్రి వైరి వీరుడరయ అలవి గాని యట్టి యాలును నట్టులే , వి. వే.

ఋణము పెంచి నరుని హీనుగా నొనరించి
విడుచు తండ్రి వైరి
వీరుడరయ అలవి గాని యట్టి
యాలును నట్టులే , వి. వే.

అప్పులు పెంచి పుత్రుని హీనునిగా చేయు తండ్రి శత్రువువంటివాడు . తాను చెప్పిన మాటను వినని భార్యయు శత్రువు వంటిదే!

A father who takes loans and abuses his son is like an enemy. A wife who pays no attention to one is also an enemy.

2368
ఎంచి యెంచి పూజ లెన్ని చేసిన నేమి? భక్తి లేని పూజ ఫలము లేదు కాన పూజ సేయగారణ మెఱుగుడీ , వి. వే.

ఎంచి యెంచి పూజ లెన్ని చేసిన
నేమి? భక్తి లేని పూజ
ఫలము లేదు కాన పూజ సేయగారణ
మెఱుగుడీ , వి. వే.

ఎన్ని పూజలు చేసినను భక్తిలేనిచో అవి యన్నియును వ్యర్థములు. పూజకు పూలుకాక భక్తియే ప్రధానము

No matter how many kinds of pooja one does without devotion, they are all waste. Devotion is more important than flowers while performing pooja.

2369
ఎఱుక లేని దొరల నెన్నాళ్ళు కొలిచిన బ్రదుకు లేదు వట్టి భ్రాంతి కాని, గొడ్డు టావు పాలు కోరిన చేపునా? వి. వే.

ఎఱుక లేని దొరల నెన్నాళ్ళు కొలిచిన
బ్రదుకు లేదు వట్టి
భ్రాంతి కాని, గొడ్డు టావు పాలు
కోరిన చేపునా? వి. వే.

మూర్ఖులగు ప్రభువుల నెన్నాళ్ళు సేవించినను ఆ సేవ నిష్పలము . గొడ్డుటావును పిదికిన పాలు లభింపవుగదా!

Serving a foolish king is a waste. One can't get milk from a barren cow.

2370
ఏ గుణముల నాపదలగు నా గుణము లడంప వలయు నాసక్తుడై ఏ గుణములు మేలొనరుచు నా గుణముల ననుసరించి యలరుము వేమా!

ఏ గుణముల నాపదలగు నా గుణము
లడంప వలయు నాసక్తుడై ఏ గుణములు
మేలొనరుచు నా గుణముల
ననుసరించి యలరుము వేమా

ఆపదలను కలిగించు గుణములను విడిచి , మేలుకలిగించు గుణములనే అలవరచు కొనవలెను

One has to give up those qualities that cause danger. And promote those qualities that lead to good outcome.

2371
ఐకమత్య మెన్న నాల్మగలకు వాసి మగని బుద్ధు లెల్ల మగువ నేర్చు దాని రక్షణంబె వాని రక్షణమగు , వి. వే.

ఐకమత్య మెన్న నాల్మగలకు వాసి
మగని బుద్ధు లెల్ల మగువ
నేర్చు దాని రక్షణంబె
వాని రక్షణమగు , వి. వే.

ఆలుమగలు ఐకమత్యము మేలు కలిగించును. దానిని రక్షించుకొనుటయే వారి కాత్మరక్షణము . ఐకమత్యమున్ననే భర్త గుణములను భార్య నేర్చుకొనగలదు

When husband and wife are united positive things happen. Protecting such a bond is like protecting aatma. Being united, a wife can learn from the good qualities of her husband.

2372
ఐకమత్య మొక్క టావశ్యకం బెప్డు దాని బలిమి నెంతయైన గూడు గడ్డి వెంటబెట్టి కట్టరా యేనుంగు , వి. వే.

ఐకమత్య మొక్క టావశ్యకం బెప్డు
దాని బలిమి నెంతయైన
గూడు గడ్డి వెంటబెట్టి కట్టరా
యేనుంగు , వి. వే.

ఐకమత్యము మిక్కిలి ముఖ్యము. దాని బలము మిక్కిలి గొప్పది. గడ్డి పరకలను నెంటిగా పేని , దానితో ఏనుగును కూడ బంధింపవచ్చును

Unity is very important. The rope weaved from dry grass can be used to tie up an elephant.

2373
ఐదు వ్రేళ్ళ బలిమి హస్తంబు పనిచేయు నందొకటియు వీడ బొందిక చెడు స్వీయుండొకడు విడిన జెడు గదా పనిబల్మి , వి. వే.

ఐదు వ్రేళ్ళ బలిమి హస్తంబు పనిచేయు
నందొకటియు వీడ బొందిక
చెడు స్వీయుండొకడు విడిన జెడు
గదా పనిబల్మి , వి. వే.

ఐదు వ్రేళ్ళు ఉన్నప్పుడే చేతితో బాగుగా పనిచేయగలము . ఒక్క వ్రేలు లేకున్నను పని బాగుగా జరుగదు. అట్లే తన కాప్తుడు ఒకడు తన్ను విడిచిపోయినచో పని పాడగును

When all 5 fingers are present one can perform adroitly with his hand. Even if one finger is missing, the task will disrupted. When one's dear one leaves, there will be setback.

2374
ఐనవారలంచు నాప్తు లటంచును బందుగులను నమ్మ పాడిగాదు తనకు నైనవాడు తానొకడే యగు, వి. వే.

ఐనవారలంచు నాప్తు లటంచును
బందుగులను నమ్మ పాడిగాదు
తనకు నైనవాడు తానొకడే
యగు, వి. వే.

అయినవారిని బంధువులను ఆప్తులని నమ్మరాదు. తాను తన్ను మాత్రమే నమ్ముకొనవలెను

One should not trust those who share his blood, his relatives and his friends. One has to believe in oneself.

2375
ఔరనుండె నీకు వారసుండగు గాక! వేశ్యయందు పుట్టు వెధవ కొడుకు నీవు పోయి నపుడు నీరైన వదలునా ? వి. వే.

ఔరనుండె నీకు వారసుండగు గాక!
వేశ్యయందు పుట్టు వెధవ
కొడుకు నీవు పోయి నపుడు
నీరైన వదలునా ? వి. వే.

తనకు భార్య వలనగాక వేశ్యవలన కలిగిన కొడుకు తాను చనిపోయినపుడు తర్పణము విడుచుటకైనను తగడు

The son born with his wife, rather than the son born with a prostitute, is eligible for performing his last rites.

2376
కనరానిది పరవంచన వినరానిది గురుని నింద, విని కనియును తా వనరానిది పెద్దల మతి మనరానిది మానహాని మహిలో వేమా

కనరానిది పరవంచన వినరానిది
గురుని నింద, విని కనియును
తా వనరానిది పెద్దల మతి మనరానిది
మానహాని మహిలో వేమా

ఇతరుల వంచనను చూడరాదు . గురునిందను వినరాదు . వినియు కనియు పెద్దల నడత నాక్షేపింపరాదు . ఎన్నకటికిని మానహానిని పొందరాదు

One should not see the fraud committed on others. The slander about one's guru should not be heard. The conduct of elders should be beyond one's reproach. One should never lose honor.

2377
కఱకంఠిని కోపము వలె వర గౌతము శాపమట్లు వర్ణింపంగా జిర కష్ట జీవులై తగు నరులను మది నొచ్చి తిట్ట నాశము వేమా!

కఱకంఠిని కోపము వలె వర గౌతము
శాపమట్లు వర్ణింపంగా జిర
కష్ట జీవులై తగు నరులను మది
నొచ్చి తిట్ట నాశము వేమా

కష్టజీవులు సంతాపము పొంది తిట్టిన యెడల ఆ తిట్లు శివుని కోపమువలెను. గౌతముని శాపమువలెను వంశమునే నశింపజేయును

When hard workers feel resentful and curse their master, it will act like the anger of Lord Siva and sage Goutama's curse resulting in the destruction of the dynasty.

2378
కల్ల నిజము రెండు కఱకంఠు డెఱుగును నీరు పల్ల మెఱుగు నిజముగాను తనయుని జన్మంబు తల్లి తానెఱుగును , వి. వే.

కల్ల నిజము రెండు కఱకంఠు డెఱుగును
నీరు పల్ల మెఱుగు నిజముగాను
తనయుని జన్మంబు తల్లి
తానెఱుగును , వి. వే.

సత్యాసత్యములు దేవునికే యెరుక . నేల పల్లముగా నున్నది, లేనిది నీటికే తెలియును. బిడ్డనితండ్రి యెవ్వరో తల్లికే యెరుక

God only know the truth. Water knows if the surface is inclined or not. A child's father will be known to its mothers.

2379
ఖగము లందు జూడగా ముచ్చటగ నుండు తెగలు గన్ననైన తేట పడదె ? దేవు డీని సొగసు దేబె నీకేలరా ? వి. వే.

ఖగము లందు జూడగా ముచ్చటగ
నుండు తెగలు గన్ననైన తేట
పడదె ? దేవు డీని సొగసు
దేబె నీకేలరా ? వి. వే.

భగవంతుడు పక్షులకు సొగసైన ఈకలను , అందమైన రూపమును ఇచ్చియున్నాడు . పెక్కు తెగల పక్షులలో దేనికదియే అందముగ నుండును . మనుష్యులకును వివిధ రూపముల నిచ్చెను. లేని యందమును తెచ్చి పెట్టుకొన సాధ్యమా!

God has created birds with beautiful feathers and forms. Among the diverse varieties of birds, each is beautiful in its own way. Similarly god gave different bodily features to humans. It is not possible to borrow beauty.

2380
ఖలులతోడి పొందు కలుష౦బు గలిగించు మాన దెంత మేటి వానికైన వాని చేదదీయ వలవదు చెడుదువు, వి. వే.

ఖలులతోడి పొందు కలుష౦బు
గలిగించు మాన దెంత మేటి
వానికైన వాని చేదదీయ వలవదు
చెడుదువు, వి. వే.

దుష్టులతో సహవాసము ఎంతటివానికైనను కీడు కలిగించును. వానిని చేరదీయరాదు . చేరదీసిన హాని కలుగును

Befriending bad people will cause harm. One should not entertain such people. Otherwise there will be a huge retribution.

2381
చిక్కియున్న వేళ సింహంబునైనను బక్క కుక్కయైన బాధ సేయు బలిమి లేని వేళ పంతముల్ చెల్లవు, వి. వే.

చిక్కియున్న వేళ సింహంబునైనను
బక్క కుక్కయైన బాధ
సేయు బలిమి లేని వేళ పంతముల్
చెల్లవు, వి. వే.

ఎంత గొప్పవాడైనను బలహీనుడైనపుడు అల్పులకును లొంగును. చిక్కియున్న సింహమును బక్క కుక్కయైనను బాధింపగలదు

However great one is, when mentally or physically weak, even a low-life can take advantage. A starving lion could be harassed by a dog.

2382
చెప్పులోని రాయి చెవిలోని జోరీగ కంటిలోని నలుసు కాలిముల్లు ఇంటిలోని పోరు ఇంతింత కాదయా , వి. వే.

చెప్పులోని రాయి చెవిలోని
జోరీగ కంటిలోని నలుసు కాలిముల్లు
ఇంటిలోని పోరు
ఇంతింత కాదయా , వి. వే.

బాధలన్నియు ఒక్కసారియే కలుగుట లోక స్వభావము. చెప్పులో రాయి, చెవిలో జోరీగ , కంటిలో నలుసు, కాలిలో ముల్లు , చిన్నవనను వీని బాధ యెక్కువ . వీనికి తో డింటిలో పోరు

All troubles arriving at the same time is natural in this world. The stone in the shoe, the bee in the ear, the sty in the eye, the thorn in the foot, bother us more than anything else. Add to that the struggles at home.

2383
చక్కదనము లేల సంపద లేలను విద్య యేల? భూమి విరివి యేల ! పుత్ర పదవి కంటె బుట్టునె పదువులు , వి. వే.

చక్కదనము లేల సంపద లేలను
విద్య యేల? భూమి విరివి యేల!
పుత్ర పదవి కంటె బుట్టునె
పదువులు , వి. వే.

చక్కదనము, సంపద, విద్య, భూవసతి - వీని యన్నిటి కంటెను పుత్రుడను సంపదయే మిక్కిలి గొప్పది

Having a son trumps beauty, wealth, education and land

2384
చదివి నతని కన్న చాకలియే మేలు కులము వేల్పు కన్న కుక్క మేలు సకల సురుల కన్న జారభామిని మేలు, వి. వే.

చదివి నతని కన్న చాకలియే మేలు
కులము వేల్పు కన్న కుక్క
మేలు సకల సురుల కన్న
జారభామిని మేలు, వి. వే.

అవివేకియైన విద్వాంసుని కంటె ఎవ్వరెవ్వరి బట్టలో గుర్తుపట్టగల చాకలి మేలు. కోరిక నెరవేర్చని ఇలవేల్పు కంటె విశ్వాసముగల కుక్క దొడ్డది . వరమునిచ్చు దేవతల కంటె సౌఖ్యము నొసగు జారస్త్రీ మేలు

A washer who can sort the clothes by the customer is better than a dumb intellectual. A loyal dog is better than the goddess who won't fulfill one's wish. A prostitute who provides comfort is better than the gods who can grant boons.

2385
జంత్ర మంత్ర మహిమ జాత వేదుడెఱు౦గు మంత్రవాది యెఱుగు దంత్ర మహిమ తంత్రిణీక మహిమ దినువాడెఱు౦గును , వి. వే.

జంత్ర మంత్ర మహిమ జాత వేదుడెఱు౦గు
మంత్రవాది యెఱుగు దంత్ర
మహిమ తంత్రిణీక మహిమ దినువాడెఱు౦గును,
వి. వే.

యంత్రమంత్రము లెట్టివో హోమము చేయబడు అగ్నికి తెలియును . తంత్రముల శక్తి మంత్రవాదికి తెలియును. అట్లే చింతపండు రుచి తినువానికే తెలియును

The fire in a ritual knows the efficacy of mantra. A trickster who professes super natural powers knows the power of his tricks. The person eating tamarind knows its taste.

2386
జీవి తొలగ నపుడె జీవనౌషధ మిచ్చి జీవి నిలుప వలయు జీవనముగ జీవి తొలగె నేని జీవనౌషధ మేల? వి. వే.

జీవి తొలగ నపుడె జీవనౌషధ
మిచ్చి జీవి నిలుప వలయు
జీవనముగ జీవి తొలగె నేని
జీవనౌషధ మేల? వి. వే.

ప్రాణము పోకముందే వైద్యుడు తగిన మందీయవలెను . అప్పుడే జీవి బ్రతుకును. ప్రాణము పోయినపిదప ఔషధమువల్ల ప్రయోజనమేమి ? దేనికైనను ముందు జాగ్రత కావలెను

The doctor should give the medicine before one dies. Then only a jeeva can live. Once praana leaves the body, there is no use for the medicine. One needs forethought for all things.

2387
జన్నములను మఱియు జన్నియల ననేకముల నొనర్చియున్న ఫలము కానరాక యుండు నీతి లేకున్న మాత్రాన, వి. వే.

జన్నములను మఱియు జన్నియల
ననేకముల నొనర్చియున్న ఫలము
కానరాక యుండు నీతి లేకున్న
మాత్రాన, వి. వే.

నీతియనునది లేనిచో ఎన్ని యజ్ఞములు , ఎన్ని వ్రతములు చేసినను ప్రయోజనము లేదు

If there is no morality, it doesn't matter how many rituals one performs.

2388
ఝుషము నీరు వెడల జచ్చుటే సిద్ధము నీట నుండె నేని నిక్కి పడును అండ తొలగు నెడల నందఱ పని యట్లె , వి. వే.

ఝుషము నీరు వెడల జచ్చుటే సిద్ధము
నీట నుండె నేని నిక్కి
పడును అండ తొలగు నెడల
నందఱ పని యట్లె , వి. వే.

నీటినుండి బయటకు వచ్చినచో చేప చచ్చును . నీటిలో నున్నపుడు త్రుళ్ళి పడుచుండును . అట్లే మానవుడు తనకు తగిన సహాయమున్న మిడిసిపడును . లేనిచో చచ్చినట్లుండును

A fish out of water dies. So long it is inside the water it will frolic. One who has the requisite help will be arrogant. Once the support is removed he will be humble.

2389
డీకొనగ దగదు డెంద మెఱుంగక యడుగ వచ్చి కొంత యనిన వాని చెప్పునంత నినియు మెప్పుగా బలుకుమీ, వి. వే.

డీకొనగ దగదు డెంద మెఱుంగక
యడుగ వచ్చి కొంత యనిన వాని
చెప్పునంత నినియు మెప్పుగా
బలుకుమీ, వి. వే.

ఎదుటివారితో తగవులాడుట ఎన్నటికిని తగదు. ఏ విషయమైనను అడుగుటకు వచ్చిన యెడల చెప్పినది పూర్తిగా విని నెమ్మదిగా జవాబిచ్చుట ఉత్తమము

It is immoral to fight with people. If someone wants one's advice, he should listen to him patiently and reply humbly.

2390
తగవు తీర్చువేళ ధర్మంబు తప్పిన మానియుండు ధర్మమునె పలికిన దైవంబు తోడగు, వి. వే.

తగవు తీర్చువేళ ధర్మంబు
తప్పిన మానియుండు
ధర్మమునె పలికిన దైవంబు
తోడగు, వి. వే.

తగవులు తీర్చు సమయములో న్యాయము తప్పిన వానికి ముక్తి లభింపదు . న్యాయముగ ప్రవర్తించినవానికి దైవము తోడుపడును

While solving disputes, one who strays away from morality will never attain salvation. God will help those who act morally.

2391
తగిన కులజుడైన తన యెత్తు ధనమైన పరపురుషుని నేల పట్ట వచ్చు? పరమ సాధ్వి చూడ నోరులు నంటదు సుమా, వి. వే.

తగిన కులజుడైన తన యెత్తు ధనమైన
పరపురుషుని నేల పట్ట
వచ్చు? పరమ సాధ్వి చూడ నోరులు
నంటదు సుమా, వి. వే.

అతడు ఉత్తమ కులమున పుట్టినను, తన యెత్తు ధనము పోసినను సాధ్వియగు యువతి పరపురుషుని చేరదు . ఇతరుల శరీరమును ముట్టనైన ముట్టదు

A woman of good character won't be bought off by a man of immense wealth or of high caste. She won't touch a man unnecessarily.

2392
తండ్రి మాటలు విని తల్లిని తెగటార్చి పరశురాముడేమి ఫలము గనెను ? నిలువ నీడ లేక కుల గిరి జేరడా? వి. వే.

తండ్రి మాటలు విని తల్లిని
తెగటార్చి పరశురాముడేమి ఫలము
గనెను ? నిలువ నీడ లేక
కుల గిరి జేరడా? వి. వే.

తండ్రిమాట విని తల్లియగు రేణుకను చంపిన పరశురామునకేమి మేలు కలిగెను? చివరకు నిలువ నీడలేక మహేంద్ర పర్వతము పైకి పోవలసివచ్చెను

Parasuraama taking the advice of his father killed his mother. What did he achieve? He ended up a pauper to live on the Mountain Mahendra.

2393
తనయు దెవ్వడేని తా తండ్రి కంటెను పేరు తెచ్చునట్టి పెద్దయైన జనకు హీనుజేయ సాహసించిన జేటు మూడు నిహ పరముల మొనసి వేమ

తనయు దెవ్వడేని తా తండ్రి కంటెను
పేరు తెచ్చునట్టి పెద్దయైన
జనకు హీనుజేయ సాహసించిన జేటు
మూడు నిహ పరముల మొనసి వేమ

పుత్రుడు తండ్రి కంటెను గొప్పవాడై పేరుప్రతిష్ఠలు తెచ్చుకొనుచున్నను , తండ్రిని తక్కువగా చూడరాదు. తక్కువగా చూచిన చేటు కల్గును. ఇహపరములకు దూరమగును

Even though one becomes great and gains fame and fortune, he should not look down on his father. Salvation will unattainable for such a person.

2394
తన్ను గన్న యట్టి తల్లివంటిది సుమ్ము అన్య కాంత! న్యాయ మరసి చూడ కన్న దాని జనులు కానంగ లేరయా, వి. వే.

తన్ను గన్న యట్టి తల్లివంటిది
సుమ్ము అన్య కాంత! న్యాయ
మరసి చూడ కన్న దాని జనులు
కానంగ లేరయా, వి. వే.

పరస్త్రీ తల్లితో సమానురాలు. ఇది తెలిసినను జనులు పరస్త్రీని తల్లివలె చూచుట అరుదుగా నున్నది

A woman is equivalent to one's mother even if / especially when she is not related.

2395
తప్పు పలుకు పలికి తాటోట చేసిన కూడియున్న లక్ష్మి క్రుంగిపోవు నోటికుండ నీళ్ళు నొనరగా నిలుచునా? వి. వే.

తప్పు పలుకు పలికి తాటోట చేసిన
కూడియున్న లక్ష్మి క్రుంగిపోవు
నోటికుండ నీళ్ళు
నొనరగా నిలుచునా? వి. వే.

చిల్లి కుండలో నీరు నిలువని రీతిని, అసత్యములు పలుకువాని యింట లక్ష్మి యుండదు

Just as a leaky pot can't hold water, the goddess of wealth will leave one who lies.

2396
తరుణి పుణ్యవతిగ వరుని బట్టియై యగు పాపిని యగు మగని ప్రాపు వలన భర్త వర్తనంబె పడతుల యందుండు , వి. వే.

తరుణి పుణ్యవతిగ వరుని బట్టియై
యగు పాపిని యగు మగని
ప్రాపు వలన భర్త వర్తనంబె
పడతుల యందుండు , వి. వే.

మగనిని బట్టియే భార్య ఉత్తమురాలుగను , పాపాత్మురాలు గను అగును. భర్త మంచి చెడుగులే ఆమె మంచి చెడ్డలకు కారణము

Whether a wife is of good character or not depends on the husband. A husband's qualities are passed on to his wife.

2397
తల్లి దండ్రులయందు దారిద్ర్య యుతులందు నమ్మిన నిరుపేద నరుల యందు ప్రభుల యందు జూడ భయభక్తులుంచుము , వి. వే.

తల్లి దండ్రులయందు దారిద్ర్య
యుతులందు నమ్మిన నిరుపేద
నరుల యందు ప్రభుల యందు జూడ
భయభక్తులుంచుము , వి. వే.

తల్లిదండ్రులందును ప్రభువునందును భయభక్తులను చూపవలెను. బీదసాదల యెడ దయగలిగి యుండవలెను

One should have respect and fear for parents and kings. One should have sympathy for poor people.

2398
దళము కొని యొకప్డు దారిద్ర్య మేర్పడ హీన కార్యములు సహించి చేయ బరువు మాయ నింతె ఫల మింత చిక్కదు , వి. వే.

దళము కొని యొకప్డు దారిద్ర్య
మేర్పడ హీన కార్యములు సహించి
చేయ బరువు మాయ నింతె ఫల
మింత చిక్కదు , వి. వే.

ఎక్కువ దారిద్ర్యముతో ఉన్నప్పుడు తలపెట్టిన కార్యములు హీనముగానే పరిణమించును . వానివల్ల లాభము లేదు. దానివల్ల గౌరవము చెడును. ప్రతిఫల మింతే

When one is in penury, the tasks he embarks on turn out to be a failure. There is no use for it. One will lose honor. One has to live with the result.

2399
దాన ధర్మములను దయయు సత్యము నీతి వినయ ధైర్య శౌర్య వితరణములు రాజు పాలిటికివి రాజయోగంబులు , వి. వే.

దాన ధర్మములను దయయు సత్యము
నీతి వినయ ధైర్య శౌర్య
వితరణములు రాజు పాలిటికివి
రాజయోగంబులు , వి. వే.

దానధర్మములు, దయ, సత్యము, నీతి, వినయము, ధైర్యము, శౌర్యము, త్యాగము, ఇవి రాజుల కవశ్యము ఆదరింపదగినవి . ఇవి రాజునకు రాజయోగము నిచ్చును

Giving alms, kindness, truth, morality, humbleness, boldness, chivalry, sacrifice are all the qualities in kings that are welcomed. A king attains raaja-yoga with such qualities.

2400
దొంగతనము రంకు దొరసి యుండు జగతి రంకులాడి కింట శంకపుట్టు దొంగకన్న రేవెలుం గొప్పు కానట్లు, వి. వే.

దొంగతనము రంకు దొరసి యుండు
జగతి రంకులాడి కింట శంకపుట్టు
దొంగకన్న రేవెలుం
గొప్పు కానట్లు, వి. వే.

దొంగతనమునకు, రంకుతనమునకు దగ్గరి బంధుత్వము కలదు. రంకులాటికి కాపురము రుచించదు . దొంగకు వెన్నెల రుచించదు

There is a close relationship between thieves and and an adulteress. An adulteress won't like living with her husband. A thief won't like moon light (he operates under darkness)

2401
దొంగ మాటలాడు దొరకునె మోక్షము చేతగాని పలుకు చేటు దెచ్చు గురువు పద్దు కాదు గునహైన్య మది యగు, వి. వే

దొంగ మాటలాడు దొరకునె మోక్షము
చేతగాని పలుకు చేటు దెచ్చు
గురువు పద్దు కాదు గునహైన్య
మది యగు, వి. వే

గురువులమని చెప్పి దొంగ మాటలు చెప్పిన మాత్రాన ముక్తి దొరకదు. చేతగాని ఆ మాటలవల్ల చేటు కలుగును. హీన గుణములుండుట గురువు లక్షణము కాదు

Claiming oneself to be a guru when one talks bull there is no salvation for him. One gets bad karma from such talk. A guru should not have immoral qualities.

2402
దొమ్మ తెగులు చేత దూలిన గేదెకు వాత వేయ బ్రతికి వచ్చెనేని ప్రాత యెనుము పాలు రోతన వచ్చునా? వి. వే.

దొమ్మ తెగులు చేత దూలిన గేదెకు
వాత వేయ బ్రతికి వచ్చెనేని
ప్రాత యెనుము పాలు
రోతన వచ్చునా? వి. వే.

దొమ్మ తగిలిన గేదెకు వాతవేసిన, అది బ్రతుక వచ్చును. దానితో రోగము పోవును. పిదప దాని పాలు స్వీకరింపదగినవే

A cow afflicted with disease when treated it can recover and continue to live. Then its milk can be consumed.

2403
ద్విజకులంబు నందు దేజరిల్లుచు బుట్టి తాదరించి యొరుల దాటజేయ లేని యాతడున్న లేకున్న నొక్కటే , వి. వే.

ద్విజకులంబు నందు దేజరిల్లుచు
బుట్టి తాదరించి యొరుల
దాటజేయ లేని యాతడున్న లేకున్న
నొక్కటే , వి. వే.

బ్రాహ్మణుడై పుట్టినందుకు తాను తరించి ఇతరులను తరింపజేయవలెను . లేనిచో వాడున్నను లేకున్నను ఒక్కటే !

When one is born as a brahmin, he should try to attain salvation and help others do the same. One who doesn't follow this could rather die.

2404
ద్విజుల ఖేద వెట్టి తిట్టి దొడగు వాడు మృతిని పొంది తాన వెతల బడగ గాలు దరిని చేరుగడ తేఱ లేడయా , వి. వే.

ద్విజుల ఖేద వెట్టి తిట్టి
దొడగు వాడు మృతిని పొంది తాన
వెతల బడగ గాలు దరిని చేరుగడ
తేఱ లేడయా , వి. వే.

నిష్కారణముగ బ్రాహ్మణులను తిట్టుచు , దుఃఖపెట్టు వాడు పరలోకమున మిక్కిలి బాధలు పొందును. అతడెన్నటికిని కడతేరలేడు

One who curses and causes grief to brahmins without a reason or rhyme, will suffer in the nether world. He can never attain salvation.

2405
దోసకారియైన దూసరి కాడైన పతితుడైన వేద బాహ్యుడైన వట్టి లేని వేద వానికీ దగు నీవి, వి. వే.

దోసకారియైన దూసరి కాడైన
పతితుడైన వేద బాహ్యుడైన
వట్టి లేని వేద వానికీ
దగు నీవి, వి. వే.

పేదరికముతో బాధపడుచున్నవాడు దోషములు చేసినను, తగవులమారియైనను , పతితుడైనను , వేదబాహ్యుడైననుసరే వారికి ధనమీయవలసిందే

One should help a poor man whether he sins, he is quarrelsome, he is immoral or he has knowledge of vedas.

2406
నందనుండు పెఱిగి పెద్దల కందఱకు విధేయుడైన నానంద ముగున్ పొందికచెడి సత్పురుషుల నిందను బడ జింత కలుగు నిక్కము, వేమా!

నందనుండు పెఱిగి పెద్దల కందఱకు
విధేయుడైన నానంద ముగున్ పొందికచెడి
సత్పురుషుల నిందను బడ
జింత కలుగు నిక్కము, వేమా

పుత్రుడు పెరిగి పెద్దవాడై అందరికిని విధేయుడై యున్నచో ఆనందము కలుగును. పొందిక లేక సత్పుఋషులచే నిందింపబడునేని దుఃఖము కలుగును

When a grown-up son behaves well with all, the parents will rejoice. On the other hand if he is unstable and getting rebuke from men of good character, the parents grieve.

2407
నలుగురు కల చోటను దా దల చూపుచు మెలగు చుండి ధన్యత గనగా దలచెడి యాతడు నిచ్చలు గల మాటలె పలుకు చుండగా దగు వేమా

నలుగురు కల చోటను దా దల చూపుచు
మెలగు చుండి ధన్యత గనగా
దలచెడి యాతడు నిచ్చలు గల మాటలె
పలుకు చుండగా దగు వేమా

నలుగురిలోను మర్యాదగా తిరుగదలచినవాడు ఎల్లప్పుడును యధార్థమునె పలుకుచుండవలెను . అప్పుడే యాతని నందరును గౌరవింతురు

One who wants to socialize with others, must always tell the truth. Then only he gets respect.

2408
నాగుబాము గన్న నంబి బ్రాహ్మణు గన్న చెవుల పిల్లిగన్న చేటు వచ్చు; గరుడిని గనుకొన్న కలుగును కోరికల్ , వి. వే.

నాగుబాము గన్న నంబి బ్రాహ్మణు
గన్న చెవుల పిల్లిగన్న చేటు
వచ్చు; గరుడిని గనుకొన్న
కలుగును కోరికల్ , వి. వే.

నాగుపాము , నంబిబ్రాహ్మణుడు , చెవుల పిల్లులు వీనిని చూచిన చేటు కలుగును. ఇవి మంచి శకునములు కావు. కార్యము చెడును . గరుడపక్షిని చూచిన కార్యము సిద్ధించును

These are bad omens: snake, brahmin who worships Lord Vishnua and hare. One gets bad karma because of them. The task he embarks on will be unfinished. When one sees an eagle, one's task will be successful.

2409
నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు తళుకు బెళుకు రాలు తట్టెడేల ! చదువ పద్య మరయ జాలదా యొక్కటి, వి. వే.

నిక్కమైన మంచి నీల మొక్కటి
చాలు తళుకు బెళుకు రాలు
తట్టెడేల ! చదువ పద్య మరయ
జాలదా యొక్కటి, వి. వే.

విలువైన నీలమణి ఒకటి యున్న చాలును, విలువలేని మెరుగు రాళ్ళు తట్టెడున్నను ప్రయోజనమేమి ? అట్లే చెత్త పద్యములు వేలున్నను ఏల? రసవంతమైన పద్య మొకటి చాలు

If one has the most valuable blue diamond, there is no need for any number of shiny stones. Why have uncountable number of bad poems, when one that was written well is enough?

2410
నిజము లాడు వాని నిందించు జగమెల్ల నిజము బల్కరాదు నీచుల కడ నిజ మహాత్ము గూడ నిజమాడ వలయురా , వి. వే.

నిజము లాడు వాని నిందించు
జగమెల్ల నిజము బల్కరాదు నీచుల
కడ నిజ మహాత్ము గూడ
నిజమాడ వలయురా , వి. వే.

నీచులతో నిజము పలుకరాదు . వారు నిజము పలుకు వానిని నిందింతురు . ఉత్తములతో మాత్రము నిజము పలుకవలెను

One should not tell the truth to low-lives. They resent people who talk truthfully. One should tell the truth to people of good character.

2411
నీతి జ్యోతిలేక నిర్మలంబుగ నేది; ఎట్లు కలగు బర , మదెంతయైన ? ధనము గలిగియున్న దైవంబు గలుగదు , వి. వే.

నీతి జ్యోతిలేక నిర్మలంబుగ
నేది; ఎట్లు కలగు బర , మదెంతయైన?
ధనము గలిగియున్న
దైవంబు గలుగదు , వి. వే.

నీతియను దీపము సహాయము లేకున్నచో అజ్ఞానాంధకారము నశింపదు. అది లేకున్న బ్రహ్మ స్వరూపము గోచరించదు . ధనమున్న మాత్రమున ప్రయోజనము లేదు

Without morality like a lamp, the darkness called ignorance in our minds won't be dispelled. There is no salvation or realization of brahmam because of the ignorance. There is no use in having plenty of wealth.

2412
నీతి దెలియ జెప్ప నిజముగ వేమన పాతకముల నెల్ల బాఱ బట్టి లోతు తత్త్వ మరసి లోకులకును జెప్పె , వి. వే.

నీతి దెలియ జెప్ప నిజముగ వేమన
పాతకముల నెల్ల బాఱ బట్టి
లోతు తత్త్వ మరసి లోకులకును
జెప్పె , వి. వే.

వేమన నీతులను వివరముగా చెప్పి పాపములను పోగొట్టుచున్నాడు . ఆత్మతత్త్వమును తెలిసికొను లోకులకు వివరించుచున్నాడు

Vemana is driving away sins by sharing his morality in great length with others. He is sharing his tattva about aatma with all the people.

2413
పగయుడుగు గోపముడిగిన పగయుడుగన్ కోర్కులుడుగు బర జన్మంపుం దగులుడుగు భేదముడిగిన త్రిగుణము లుడుగంగ ముక్తి స్థిరమగు వేమా

పగయుడుగు గోపముడిగిన పగయుడుగన్
కోర్కులుడుగు బర జన్మంపుం దగులుడుగు
భేదముడిగిన త్రిగుణము లుడుగంగ
ముక్తి స్థిరమగు వేమా

కోపము నశించిన పగ నశించును. పగ నశించినచో కోరికలు నశించును . భేదభావము లేనియెడల మరియొక జన్మము లేదు. త్రిగుణములు నశించినచో ముక్తి స్థిరముగా లభించును

When anger subsides, one's plans for revenge will be destroyed. When revenge subsides, one's desires will be destroyed. When there is no discrimination, there is no rebirth. When the 3 gunas (sattva-calm, rajas-action, tamas-indolence) are destroyed, one is guaranteed salvation.

2414
పట్టి విడువరాదు పది లక్షలకు నైన బెట్టి దెప్పరాదు పేదకైన వెట్టి గొలువరాదు విభు డెట్టి ఘనుడైన, వి. వే.

పట్టి విడువరాదు పది లక్షలకు
నైన బెట్టి దెప్పరాదు పేదకైన
వెట్టి గొలువరాదు విభు
డెట్టి ఘనుడైన, వి. వే.

విడిచినచో తన కెంత లాభమున్నను సరే అభయ మిచ్చిన వానిని విడువరాదు. పేదవానికి పెట్టి, పెట్టి తినని చెప్పకూడదు. యాజమాను డెంత మంచివాడైనను వెట్టిపని చేయరాదు

One should not forsake his word to protect a person. One should not slander after giving alms to a poor person. No matter how nice a person the master is, one should not be his bonded laborer/slave.

2415
పటుతరంబుగ తన యాత్మ భావమంది నిటల దుర్గముపై నున్న నియతి మీఱి ఘటము మఱచిన వాడు పో ఘనుడు సుమ్మి కుటిల కర్ముల కిదియెట్టు కూడు వేమ

పటుతరంబుగ తన యాత్మ భావమంది నిటల
దుర్గముపై నున్న నియతి మీఱి ఘటము
మఱచిన వాడు పో ఘనుడు సుమ్మి కుటిల
కర్ముల కిదియెట్టు కూడు వేమ

నిశ్చల హృదయమున పరమాత్మను ధ్యానించుచు, తలపును నిటలమున హత్తించి , తన్నుతామరచి, సమాధిలో ఉన్నవాడే ఉత్తముడు. పాపుల కిది సాధ్యపడదు

One who prays paramaatma with an unwavering mind, focuses his mind on the forehead and enjoys samadhi (deep meditative state) is a man of good character. It is not possible to do the same for sinners.

2416
పడుచు నిచ్చి నతనె బత్తె మిచ్చిన వాని కడుపు చల్ల జేసి ఘనత నిడుచు నడుప నేఱ నతడు నాలి ముచ్చే గదా! వి. వే.

పడుచు నిచ్చి నతనె బత్తె మిచ్చిన
వాని కడుపు చల్ల జేసి
ఘనత నిడుచు నడుప నేఱ నతడు
నాలి ముచ్చే గదా! వి. వే.

కన్య నిచ్చిన వానిని, అన్నము పెట్టిన వానిని ఎల్లప్పుడును గౌరవముతో చూడవలెను. అట్లు గౌరవింపనివాడు కుత్సితుడు

One should treat with respect his in-laws and one who donated him food. One who doesn't do that is a low-life.

2417
పతక మందు నొప్పు పలు రత్నముల పెంపు బంగరందు కూర్ప బరువు గనును గాని యితరలోహమైన హీనము గాదె ! వి. వే.

పతక మందు నొప్పు పలు రత్నముల
పెంపు బంగరందు కూర్ప బరువు
గనును గాని యితరలోహమైన
హీనము గాదె ! వి. వే.

రత్నములో యందము బంగరు పతకములో పొదిగి యున్నపుడే తెలియును. ఇతర లోహములలో పొదిగిన హీనముగ ఉండును. దుర్జన సజ్జనుల పద్దతియు నిట్టిదె

A diamond's value is enhanced when it is made into golden jewelry. Any metal other than gold will decrease its value. This is the same situation with men of good and bad character.

2418
పత్తనముల గలరు ప్రౌఢాంగనలు వారు పల్లెలందు నిలిచి బ్రతుక గలరె? సుఖులు పరము దారి శోభింప జాలరు, వి. వే.

పత్తనముల గలరు ప్రౌఢాంగనలు
వారు పల్లెలందు నిలిచి బ్రతుక
గలరె? సుఖులు పరము దారి
శోభింప జాలరు, వి. వే.

పట్టణములలో ఉండ నాలవాటుపడిన ప్రౌఢ స్త్రీలు పల్లెలో నివసించలేరు. అట్లే సుఖపడుట కలవాటు పడిన వారు మోక్షమార్గమున ప్రవర్తింపలేరు

Women living in towns cannot return to villages. One who is accustomed to luxuries cannot attain salvation.

2419
పంది పిల్లలీను పదునైదు నొకటిని కుంజరంబదీను గొదమ నొకటి ఉత్తమ పురుషుడటు లొక్కడు చాలడా? వి. వే.

పంది పిల్లలీను పదునైదు నొకటిని
కుంజరంబదీను గొదమ
నొకటి ఉత్తమ పురుషుడటు
లొక్కడు చాలడా? వి. వే.

నీచు లెక్కువగా ఉందురు. ఉత్తముడు ఒక్కడే కానవచ్చును. పందిపదునైదు పిల్లల నీనును. ఏనుగు మాత్ర మొక్క పిల్లనే పెట్టును

The low-lives out number good men. A pig delivers a litter of piglets. Whereas an elephant delivers one calf at a time.

2420
పదుగురాడు మాట పాటియై ధరజెల్లు నొక్కడాడు మాట యొక్కదెందు ఊఱకుండు వాని కూరెల్ల నోపదు , వి. వే.

పదుగురాడు మాట పాటియై ధరజెల్లు
నొక్కడాడు మాట యొక్కదెందు
ఊఱకుండు వాని కూరెల్ల
నోపదు , వి. వే.

పదిమంది చెప్పిన మాట అసత్యమైనను దానినే నమ్ముదురు. ఒక్కడు సత్యము చెప్పినను దానిని నమ్మరు. వాదులాట జరిగిన స్థితిలో ఊరక యున్నవాడే ఉత్తముడు

When a lie is repeated by several men, it becomes the fact. Even one telling the truth won't change it. When men are arguing, the one who shuts his mouth is a good man.

2421
పనస తొనల కన్న పంచదారల కన్న జుంటి తేనె కన్న జున్ను కన్న చెఱకు రసము కన్న చెలుల మాటలె తీపి, వి. వే.

పనస తొనల కన్న పంచదారల కన్న
జుంటి తేనె కన్న జున్ను
కన్న చెఱకు రసము కన్న చెలుల
మాటలె తీపి, వి. వే.

పనస తొనలు, చక్కెర , తేనె , జున్ను – వీని యన్నింటి కంటెను యువతుల మాటలే మిక్కిలి మధుర మైనవి

A young woman's words are sweeter than jack fruit, sugar, honey or the pudding made from cow's milk (especially after it delivers a calf).

2422

పప్పులేని భోజనంబు పసలేనిది . అప్పులేనివాడే గొప్ప వాడు. ఐహికములగు విషయముల యెడ ఆశలేని వాడే జ్ఞాని

A meal without lentils is not worth it. A man without loans is great. A knowledgeable person is one who doesn't concern himself with earthly matters.

2423
పరగ రాజకులులు పాతిన ధనమెల్ల భటుల పాలొ కవుల పాలొ తలప నొనర హీన జనుని ధనము దాయాదుల పాలొ జారకాంత పాలొ వేమ

పరగ రాజకులులు పాతిన ధనమెల్ల
భటుల పాలొ కవుల పాలొ తలప
నొనర హీన జనుని ధనము దాయాదుల
పాలొ జారకాంత పాలొ వేమ

రాజులు కూడబెట్టిన ధనము భటులు, కవులు మున్నగువారి పాలగును. హీనులగువారి ధనము దాయాదుల పాలగును. లేదా వేశ్యలపాలగును

The treasures accumulated by kings eventually goes to the soldiers and poets. The wealth of a low-life will go to his kinsman. Or else to the prostitutes.

2424
పరుల దత్తమొప్పి పాలన చేసిన నిల స్వదత్తమునకు నినుమడియగు నవని పరుల దత్త మపహరింపగరాదు , వి. వే.

పరుల దత్తమొప్పి పాలన చేసిన
నిల స్వదత్తమునకు నినుమడియగు
నవని పరుల దత్త
మపహరింపగరాదు , వి. వే.

పరులిచ్చిన దానము సక్రమముగ జరుగునట్లు చూచిన తానిచ్చుటకంటె రెండు రెట్లధికము . పరులిచ్చినదాని నపహరింపరాదు

One should utilize well the alms he received from others. One should not steal from others.

2425
పరుల మేలు చూచి పలుగాకి వలె నెప్డు వట్టి మాటలాడు వాడధముడు అట్టివాని బ్రతుకు టదియేల మంటికా ? వి. వే.

పరుల మేలు చూచి పలుగాకి వలె
నెప్డు వట్టి మాటలాడు వాడధముడు
అట్టివాని బ్రతుకు
టదియేల మంటికా ? వి. వే.

పరుల మేలు చూచి ఓర్వలేనివాడు అధముడు. ఇతరుల శ్రేయస్సున కానందింపవలెను . అట్లకాక అసూయపడువాని బ్రతుకు నిష్ప్రయోజనము

One who is jealous of others' fortune is a low-life. One should feel happy for other's good fortune. The one who feels jealousy at them leads a decrepit life.

2426
పలుగు వాని కేల పరసమృద్ధి దలంప బలుకు వరుస వాని బలిమి తప్ప చలము వానికేల సాత్త్విక ధర్మము, వి. వే.

పలుగు వాని కేల పరసమృద్ధి
దలంప బలుకు వరుస వాని బలిమి
తప్ప చలము వానికేల సాత్త్విక
ధర్మము, వి. వే.

ఓర్పులేనివానికి పరుల సంపదలు రుచింపవు. అతడు తన గొప్పతనమునకే ఆనందించును . పట్టుదలతో తన పనిని నెగ్గింపదలచువానికి శాంతము రుచింపదు

The impatient man doesn't want others to be wealthy. He only feels happy at his own greatness. One who is determined to succeed won't like peace of mind.

2427
పలుతెఱగులు గాను బగయుండు చోటుల చిటుకు మనగ ప్రియము చెప్పవలయు కాల్ప దగిన కట్టె కడకతో మ్రింగదా ? వి. వే.

పలుతెఱగులు గాను బగయుండు చోటుల
చిటుకు మనగ ప్రియము చెప్పవలయు
కాల్ప దగిన కట్టె
కడకతో మ్రింగదా ? వి. వే.

పలువిధములుగా విరోధమున్నను ప్రియమును వెంటనే తెలుపవలెను. కట్టె అగ్నిలోపడి రూపు మాయునట్లు శాంత గుణమువలన తగవు నశించును

One should compliment even an enemy when things are done right. Just as wood thrown into the fires loses its form, the enmity will be destroyed by serenity.

2428
పాడిగాదు జగతి పంచాంగములు చెప్పి కొంచెమైన బుద్ధి నొంచులేక బ్రహ్మ మెఱుంగు కిట్లు పౌరోహితము చేయ, వి. వే.

పాడిగాదు జగతి పంచాంగములు చెప్పి
కొంచెమైన బుద్ధి నొంచులేక
బ్రహ్మ మెఱుంగు కిట్లు
పౌరోహితము చేయ, వి. వే.

బ్రాహ్మణుడు బ్రహ్మము నుపాసింపక పంచాంగము చెప్పుట , పౌరోహిత్యము చేయుట మంచిదికాదు . బ్రాహ్మణుడై యున్న౦దుకు బ్రహ్మమును తెలిసికొనవలెను

A brahmin who doesn't seek brahmam but instead reads the almanac and performs the job of a priest is no good. Being a brahmin one should realize brahmam.

2429
పాపరాశిబుట్టి పాపంబు దెలియక పాప బుద్ధి చేత బరగి యుండు భక్తి కలిగి యున్న బాపంబు లేదయా, వి. వే.

పాపరాశిబుట్టి పాపంబు దెలియక
పాప బుద్ధి చేత బరగి
యుండు భక్తి కలిగి యున్న
బాపంబు లేదయా, వి. వే.

మానవుడు పాపజాతిలో పుట్టియు పాపమననేమో తెలిసికొనలేక పాపబుద్ధితోనే యుండును. భక్తి యున్న యెడల పాపబుద్ధి నశించును

A sinner born in a sinful caste, is unable to discern a sinful act and always wallowing in sinful ways. When one has devotion for god his sins will be wiped out.

2430
పాలపక్షి శకున ఫలమిచ్చు నందురు పాల పక్షి కేమి ఫలము తెలియు? తనదు మేలు కీళ్ళు తోడనుండగా , వి. వే.

పాలపక్షి శకున ఫలమిచ్చు నందురు
పాల పక్షి కేమి ఫలము
తెలియు? తనదు మేలు కీళ్ళు
తోడనుండగా , వి. వే.

పాలపక్షి శకునము మంచి ఫలమిచ్చునందురే కాని ఆ పక్షికి ఫలముగూర్చి యేమి తెలియును? తన మంచి చెడ్డలు తనతోనే యుండును గదా! దానికి పక్షి యేమి చేయును

A bird is considered a good omen, even though the bird doesn't care. What does the bird know about one's activities? One's good karma and bad karma will stay with oneself. What can a bird do?

2431
అన్న మధికమైన నరయ మృత్యువు నిజం బన్న మంటకున్న నాత్మనొచ్చు చంప బెంప బువ్వ

అన్న మధికమైన నరయ మృత్యువు
నిజం బన్న
మంటకున్న నాత్మనొచ్చు
చంప బెంప బువ్
చాలదావేయేల ? వి. వే.

అన్నమును మిక్కిలి ఎక్కువగా తిన్నచో ప్రాణాపాయము . అన్నమును ముట్టక ఉపవాసమున్నను ప్రాణాపాయము . మానవుని పెంచుటకు, చంపుటకును అన్నమే కారణము

When one is a glutton it will lead to disease. One's life will be endangered without food such as when one is fasting. Food is responsible for survival or death.

2432
అన్న మిడుట కన్న నధిక దానంబుల నెన్నిచేయ నేమి ; యెన్న బోరు అన్న మెన్న జీవనాధార మగునయా , వి. వే.

అన్న మిడుట కన్న నధిక దానంబుల
నెన్నిచేయ నేమి ; యెన్న
బోరు అన్న మెన్న జీవనాధార
మగునయా , వి. వే.

ఎన్ని దానము లిచ్చినను తృప్తి యుండదు . అన్నము పెట్టిననే తృప్తి కలుగును. జీవనమునకు అన్నమే ముఖ్యాధారమని తెలిసికొనవలెను

No matter how many alms one gives, there is no satisfaction. When one donates food, then it will lead to utmost satisfaction. Food is an indispensable resource.

2433
ఆఱుగురిని జంపి హరిమీద ధ్యానంబు నిలిపి నిశ్చయముగ నెగడియాత్మ గతి నెఱు౦గు చుండు ఘనుడగు యోగిరా, వి. వే.

ఆఱుగురిని జంపి హరిమీద ధ్యానంబు
నిలిపి నిశ్చయముగ నెగడియాత్మ
గతి నెఱు౦గు చుండు
ఘనుడగు యోగిరా, వి. వే.

అరిషడ్వర్గమును చంపి మనస్సున భగవంతుని నిలిపి ధ్యానము చేయుచు ముక్తికి యత్నించు వాడే ఆత్మ శుద్ధి కల వాడని తెలిసికొనుము

One should destroy the 6 bad qualities: kaama (desire), krodha (anger), lobha (miserly), moha (lust), mada (ego), maatsarya(pride), and meditate by focusing the mind on god and try for salvation. Such a person is of pure aatma.

2434
ఇన్ని ఫలము లందు నే ఫలం బెక్కువ అన్న ఫలము కంటె నధిక మేది? కన్నది కననది కాన్పించునా రూపు, వి. వే.

ఇన్ని ఫలము లందు నే ఫలం బెక్కువ
అన్న ఫలము కంటె నధిక
మేది? కన్నది కననది కాన్పించునా
రూపు, వి. వే.

పుణ్యము లన్నిటికంటెను గొప్పదియు , ఆన్నదాన ఫలముకంటె గొప్పదియు ఏదని చర్చించుచో దృశ్యాదృశ్యములను చూడగల ఆత్మజ్ఞానమే గొప్పదని తెలియును

The knowledge about aatma, that can discern the known and unknown, is more superior than good karma or donation of food.

2435
ఊక యందు బుట్టి యున్నది యన్న౦బు మ్రాకు నందు ఫలము మానిత మగు సోగు గాలి పట్టి శోధించు చుందురా, వి. వే.

ఊక యందు బుట్టి యున్నది యన్న౦బు
మ్రాకు నందు ఫలము మానిత
మగు సోగు గాలి పట్టి శోధించు
చుందురా, వి. వే.

ఊక గల ధాన్యమునుండి అన్నము, చెట్లవలన ఫలములును లభించుచున్నవి . వాయువు వీచి మానవదేహములను శోధించి శుద్ధి చేయుచున్నది

From grain one's food is made. Fruits are had from trees. The blowing wind is bringing happiness to all.

2436
భయమంతయు దేహమునకె భయ ముడిగిన నిశ్చయంబు పరమాత్మునికే లయమంతయు జీవునకే జయ మాత్మకు ననుచు జగతి జాటుర వేమా

భయమంతయు దేహమునకె భయ ముడిగిన
నిశ్చయంబు పరమాత్మునికే
లయమంతయు జీవునకే జయ మాత్మకు
ననుచు జగతి జాటుర వేమా

సంశయ భయాదులు దేహమునకే . ఆ భయమును విడిచిన యెడల ఆత్మ సాక్షాత్కారమగును . లయము పొందు నది జీవుడే. ఆత్మ నిత్యము, దాని కెప్పుడును జయమే!

Fear and doubt is confined to the body only. When one sheds fear, his aatma will deify. Jeeva may perish but the aatma is immortal.

2437
భావ మరసి తన్ను భార్య సేవించిన ఇంటికైన నగును నీశ్వరుండు అదియు లేక బ్రతుకు టధమము భువిలోన, వి. వే.

భావ మరసి తన్ను భార్య సేవించిన
ఇంటికైన నగును నీశ్వరుండు
అదియు లేక బ్రతుకు
టధమము భువిలోన, వి. వే.

భర్త మనస్సు నెరిగి భార్య అతనిని సేవించిన యెడల దేవుడు ఆమెకు సదా సన్నిహితుడై యుండును. అది లేని సంసారి బ్రతుకు అధమమైనది

God will assist a wife who serves her husband well and knows his mind. Without that a husband will suffer.

2438
భూపతి కృప నమ్మి భూమి చెఱచు వాడు ప్రజల యుసురు తాకి పడును పిదప ఎగుర వేయు బంతి యెందాక నిలుచురా? వి. వే.

భూపతి కృప నమ్మి భూమి చెఱచు
వాడు ప్రజల యుసురు తాకి పడును
పిదప ఎగుర వేయు బంతి
యెందాక నిలుచురా? వి. వే.

రాజుల దయ నమ్మి ప్రజల భూముల నపహరించు వాడు ప్రజల యుసురు తగిలి పిదప హానిని పొందును. ఎగుర వేసిన బంతి ఎంతకాలము మీద నుండగలదు ?

If one under the patronage of kings, steals land from subjects he will one day face harm from the condemnation of his victims. For how long can a ball thrown up will stay up?

2439
భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు దాన హీను జూచి ధనము నవ్వు, కదన భీతు జూచి కాలుడు నవ్వును, వి. వే.

భూమి నాది యనిన భూమి ఫక్కున
నవ్వు దాన హీను జూచి ధనము
నవ్వు, కదన భీతు జూచి
కాలుడు నవ్వును, వి. వే.

అస్థిర జీవుడగు మానవుడు "ఈ భూమి" నాది అనియనగా భూమికి నవ్వు వచ్చును. దాన హీనుని చూచి ధనము వాని బుద్ధిహీనతకు నవ్వును. పోరలేని పిరికిపందను చూచిన యమునకే నవ్వు కలుగును

The earth goddess will laugh at a puny human without immortality who claims the rights to land. The goddess of wealth will laugh at the miser's lack of intellect. The god of death will laugh at a coward who retreats from war.

2440
భూమి పేరు వల్ల పుణ్యతీర్థము లాయె వెలయ ఱాళ్ళ వల్ల వేల్పులాయె నీళ్ళ పేరు వల్ల నిఖిల తీర్థము లాయె, వి. వే.

భూమి పేరు వల్ల పుణ్యతీర్థము
లాయె వెలయ ఱాళ్ళ వల్ల వేల్పులాయె
నీళ్ళ పేరు వల్ల నిఖిల
తీర్థము లాయె, వి. వే.

భూప్రదేశముల వల్లనే పుణ్యక్షేత్రములకును , రాళ్ళ మూలముననే విగ్రహములకును , నీళ్ళవల్లనే తీర్థములకును నామరూపము లేర్పడుచున్ననేగాని వాని విశేషము వేరు

Because of location is to holy places, stones is to idol, water is to holy river, there is an association between name and form.

2441
మగని మీద భక్తి మానకుండిన కాంత మూడు లోకములను ముక్తి గనును మగువ లందఱకును మగలె దేవతలయా, వి. వే.

మగని మీద భక్తి మానకుండిన
కాంత మూడు లోకములను ముక్తి
గనును మగువ లందఱకును
మగలె దేవతలయా, వి. వే.

భర్తను ఎక్కువ భక్తితో సేవించు స్త్రీలకి ముక్తి కల్గును. ముల్లోకములందును కీర్తి వచ్చును. మగువకు భర్తయే దేవుడు

The wife who serves husband with devotion will attain salvation. She will be famous in the nether world. Husband is the god for a wife.

2442
మనసు తెలిసి యొకని మాటకు బ్రతి చెప్ప సంతసించు నతడు చాల మెచ్చు మనసు దెలియ గునియుచు ననునేదొ , వి. వే.

మనసు తెలిసి యొకని మాటకు బ్రతి
చెప్ప సంతసించు నతడు
చాల మెచ్చు మనసు దెలియ గునియుచు
ననునేదొ , వి. వే.

మనస్సు కనిపెట్టి పలికినచో ఎంతటివారైనను మెచ్చుకొందురు . ఎదుటివారి మనస్సు గుర్తించక ఏదియో పలికినచో అతడు గునియును . వ్యతిరేకముగానైన పలుకును

If one can read the mind of his listeners and control his speech, everyone will appreciate him. If one doesn't read the mind and talks rubbish, he will face opposition.

2443
మనుట లెల్ల కల్ల మనసులు దొంగలిం కేటి ప్రాణ మింక నేటి బ్రతుకు! మాట సత్యమైన మఱి శతాయుష్యంబు , వి. వే.

మనుట లెల్ల కల్ల మనసులు దొంగలిం
కేటి ప్రాణ మింక నేటి
బ్రతుకు! మాట సత్యమైన మఱి
శతాయుష్యంబు , వి. వే.

బ్రతుకులు అసత్యములు, మనస్సు దొంగ వంటిది. ఇట్టి స్థితిలో నూరే౦డ్లు జీవించవలెనని కోరినచో మనము పలికెడు మాటలు సత్యములై యుండవలెను

Life is a lie. Mind is like a thief. Under these circumstances, if one wants to live for hundred years, then he should speak truth all the time.

2444
మైల కోకతోడ మాసిన తల తోడ ఒడలి మురికి తోడ నుండెనేని అధిక కులజునైన నట్టిట్టు పిలువరు, వి. వే.

మైల కోకతోడ మాసిన తల తోడ
ఒడలి మురికి తోడ నుండెనేని
అధిక కులజునైన నట్టిట్టు
పిలువరు, వి. వే.

మురికి బట్టలు కట్టి, మాసిన తలతో నుండి, దేహమున మురికి నిండియుండునట్టి ఉత్తమ కులమువానిని కూడ ఎవ్వరును గౌరవింపరు

One who wears soiled clothes, keeps his hair unkempt, stops taking care of his body, even if is of higher caste, no one will respect him.

2445
మాట జెప్ప వినని మనుజుడు మూర్ఖుడు మాట విన్న నరుడు మానుడగును మాట వినగ జెప్ప మానుట కూడదు, వి. వే.

మాట జెప్ప వినని మనుజుడు
మూర్ఖుడు మాట విన్న నరుడు
మానుడగును మాట వినగ జెప్ప
మానుట కూడదు, వి. వే.

ఎదుటివాడు చెప్పు మాటలోని మంచి చెడ్డలను తెలిసికొనలేనివాడు మూర్ఖుడు. మాట వినువాడు ఉత్తముడు. ఎదుటివారి మాటలను వినిన పిదప మంచి చెడ్డ లాలోచించి సమాధానము చెప్పకుండుటయు తగదు

A person is a fool who can't understand the pros and cons of someone speaking to him. A person hearing patiently is superior. After hearing, and analyzing pros and cons, if one doesn't reply back, then it is not right.

2446
మా యిల్లని మా పొలమని కాయము తన సొమ్మటంచు గామాతురుడై మాయని పదవిని గోరక దాయాదుల పాలు చేయ దగదుర వేమా

మా యిల్లని మా పొలమని కాయము
తన సొమ్మటంచు గామాతురుడై
మాయని పదవిని గోరక దాయాదుల
పాలు చేయ దగదుర వేమా

“ఇది మా ఇల్లు", “ఇది మా పొలము" అనుకొనుచు దేహము నిత్యమనుకొనుచు , మూఢుడై స్థిరమైన పదవినికోరక తన సొత్తు దాయాదులపాలు చేయుట తగదు

A foolish person claiming the house and farm as his own, thinking the body will live forever, and not seeking a permanent place, passes on his money to his kith and kin which is not right.

2447
మాల మాల కాడు మహి మీద నేప్రొద్దు మాట తిరుగు వాడె మాల గాక వాని మాల యన్న వాడె పో పెనుమాల, వి. వే.

మాల మాల కాడు మహి మీద నేప్రొద్దు
మాట తిరుగు వాడె
మాల గాక వాని మాల యన్న వాడె
పో పెనుమాల, వి. వే.

జాతివల్ల మాలయైనవాడు మాలకాడు. ఆడి తప్పిన వాడే చండాలుడు . జాతి చండాలుని చండాలుడని నిరసించినవాడు చండాలుడు

Based on caste an untouchable is not really untouchable. The one who lies is a low-life. One who condemns the lowest-caste person is also a low-life.

2448
మేడి పండు చూడ మేలిమై యుండును పొట్ట విప్పి చూడ బురుగు లుండు పిరికి వాని మదిని బింక మీ లాగురా, వి. వే.

మేడి పండు చూడ మేలిమై యుండును
పొట్ట విప్పి చూడ బురుగు
లుండు పిరికి వాని మదిని
బింక మీ లాగురా, వి. వే.

మేడిపండు చూచుటకు అందముగా నుండును. కాని పొట్ట విప్పి చూడగా ఎన్నో పురుగు లుండును. అట్లే పిరికివాడు బయటికి బాగుగా కనబడును. బింకము మాత్రము సున్న

The fruit of Medi will look wholesome from outside. When one cuts it, one can see umpteen insects inside. Similarly a coward looks fine on the outside and has no pride inside.

2449
రజ్జు లాడరాదు రణభూమి లోపల బుజ్జగింప రాదు బొంకు వాని నొజ్జతోడ వాడు లోనరంగ మానరా, వి. వే.

రజ్జు లాడరాదు రణభూమి లోపల
బుజ్జగింప రాదు బొంకు
వాని నొజ్జతోడ వాడు
లోనరంగ మానరా, వి. వే.

యుద్ధ భూమిలో తమలో తాము తగవులాడరాదు . అసత్యములు పలుకువానికి మర్యాద చూపకూడదు . గురువుతో వాదులాడుటయు తప్పు

In a war zone there shouldn't be infighting among the soldiers. One should not respect a person who speaks lies. It is a sin to argue with one's guru.

2450
లక్ష్మీ యేలినట్టి లంకాధిపతి పురి పిల్లకోతి పౌజు కొల్ల బెట్టె కలసి వచ్చు వేళ ఘనులౌదు రల్పులు , వి. వే.

లక్ష్మీ యేలినట్టి లంకాధిపతి
పురి పిల్లకోతి పౌజు కొల్ల
బెట్టె కలసి వచ్చు వేళ ఘనులౌదు
రల్పులు , వి. వే.

సిరి సంపాదలతో తులతూగుతున్న లంకను కోతిపిల్ల యగు హనుమంతుడు ధ్వంసము చేసెను. మంచి కాలము వచ్చినపుడు అల్పుడు కూడ అధికడగును

Lord Hanuman, as a monkey child, destroyed the mighty Lanka laden with wealth. When the time is right, even a weakling can be mighty.

2451
వావి వర్త నలుసు వరుసలు మర్యాద తప్పి నడచె నేని తగులు కీడు, వదలు దపుడు తాకు వందుర దప్పదు , వి. వే.

వావి వర్త నలుసు వరుసలు మర్యాద
తప్పి నడచె నేని తగులు
కీడు, వదలు దపుడు తాకు
వందుర దప్పదు , వి. వే.

వావి వరసలను , మర్యాదను అతిక్రమించి నడచిన యెడల కీడు కలుగును. ఎప్పుడో యొకప్పుడు కీడు కలిగియే తీరును

If one forgets his limits and violates protocol, he will meet with harm one day.

2452
విద్య గలిగి యుండి వినయము లేకున్న నైదు వలకు మేలియైన మణుల సొమ్ములుండి కంఠి సూత్రము లేనట్లు, వి. వే.

విద్య గలిగి యుండి వినయము
లేకున్న నైదు వలకు మేలియైన
మణుల సొమ్ములుండి కంఠి సూత్రము
లేనట్లు, వి. వే.

విద్య యున్నను వినయము లేనియెడల , ముత్తయిదువలు కెన్ని నగలున్నను , మంగళసూత్రము లేనియట్లు నిష్పలము

One who has knowledge but not humble is like a house wife with lot of jewelry but without the sacred symbol of marriage.

2453
విద్యల లోపల నీతియు వాద్యంబులలోన వీణ వరరసికులకున్ హృద్యంబై విలసిల్లును విద్యలలో బ్రహ్మ విద్య విద్యర వేమా

విద్యల లోపల నీతియు వాద్యంబులలోన
వీణ వరరసికులకున్ హృద్యంబై
విలసిల్లును విద్యలలో
బ్రహ్మ విద్య విద్యర వేమా

విద్యలలో నీతి విద్య, బ్రహ్మ విద్యయు , వాద్యములలో వీణ మిక్కిలి ప్రధానమైనవి

Among all faculties, the knowledge about morality and knowledge about brahmam are important. Among musical instruments, veena is paramount.

2454
విశ్వనాధు నందు విప్రులు యందును విభుని యందు వేద విధుల యందు భక్తి లేనివాడు పాపాత్ముడిలలోన , వి. వే.

విశ్వనాధు నందు విప్రులు యందును
విభుని యందు వేద విధుల
యందు భక్తి లేనివాడు పాపాత్ముడిలలోన,
వి. వే.

శివునియందు , బ్రాహ్మణులయందు , ప్రభువుల యెడ , నైతిక ధర్మముల యెడల భక్తిలేనివాడు పాపాత్ముడు

A sinner is one who has no devotion for Lord Siva, brahmins, kings, and dharma.

2455
కాననంబు చేరి కడుశ్రమ లొండిన యానలుండు రాజ్యమందె మఱల , కష్టములకు నోర్ప గల్గును సుఖములు, వి. వే.

కాననంబు చేరి కడుశ్రమ లొండిన
యానలుండు రాజ్యమందె
మఱల , కష్టములకు నోర్ప గల్గును
సుఖములు, వి. వే.

నలచక్రవర్తి అడవులకుపోయి ఎన్నో కష్టములు పడినను చివరకు రాజ్యమును సంపాదింప గల్గెను. తొలుత కష్టములు కోర్చినయెడల పిదప సుఖములు కలుగగలవు

The emperor Nala went to forests and suffered a great deal before regaining his kingdom. When one endures difficulties, it is possible to attain comforts later on.

2456
కాశి నీళ్ళు మోసి కాళ్ళు మొగము వాచి ఎందు సుఖము లేక యెండి యుండి చచ్చి వెనుక ముక్తి సాధింప గలరొకో , వి. వే.

కాశి నీళ్ళు మోసి కాళ్ళు మొగము
వాచి ఎందు సుఖము లేక యెండి
యుండి చచ్చి వెనుక ముక్తి
సాధింప గలరొకో , వి. వే.

కాశికిపోయి గంగ బిందెలు మోసికొని వచ్చునప్పుడు మొగము కాళ్ళు వాచి చచ్చిన పిదప మోక్షము రాదు. దానికై ముందే యత్నింపవలెను

If one brings the water of river Ganga from Kaasi, his head and legs will be swollen but he won't attain salvation.

2457
కాశి యాత్ర చేసి గాసి నొందగ నేల? రోయు గుణ వికార రూప మడచు మోసపోక యెఱుక మూలంబు గనుచుండు , వి. వే.

కాశి యాత్ర చేసి గాసి నొందగ
నేల? రోయు గుణ వికార రూప
మడచు మోసపోక యెఱుక మూలంబు
గనుచుండు , వి. వే.

ఎన్నో శ్రమలు పడి కాశీయాత్ర చేసి బాధపడనేల? త్రిగుణముల వికారములను నశింపజేసి బ్రహ్మస్వరూపమును తెలిసికొన్నచో ధన్యత కలుగును

What is the point in going to holy places like Kaasi enduring great travail? If one destroys the emotions from 3 gunas (sattva-calm, rajas-action, tamas-indolence) and visualizes the form of brahmam he will attain salvation.

2458
కుండ పగిలెనేని కొత్తది కొనవచ్చు భూతలంబు నందు పొందుగాను కూలబడిన నరుడు కుదురుట యరుదయా , వి. వే.

కుండ పగిలెనేని కొత్తది కొనవచ్చు
భూతలంబు నందు పొందుగాను
కూలబడిన నరుడు కుదురుట
యరుదయా , వి. వే.

కుండ పగిలిపోయినచో మరియొక కుండను కొని తేవచ్చును. కాని మనుష్యుడు కూలబడినయెడల మంచి స్థితికి వచ్చుట కష్టము

If a pot broke, it is replaceable. When a man collapses due to ill health, it is hard to recuperate.

2459
గొడ్డుటావు బిదుక గుండ చేకొని పోవ బండు లూడ దన్ను పాల నిడదు లోభివాని నడుగ లాభంబు లేదయా, వి. వే.

గొడ్డుటావు బిదుక గుండ చేకొని
పోవ బండు లూడ దన్ను
పాల నిడదు లోభివాని నడుగ
లాభంబు లేదయా, వి. వే.

గొడ్డుటావును పాలు పితుకుటకు దగ్గరకు పోయిన పండ్లు రాలునట్లు తన్నునే కాని పాలీయదు . అట్లే లోభి వద్దకు ధనమునకై పోయిన లాభము లేదు

If one goes near a barren cow to milch, he will be hit by the cow with its legs. There is no use in asking a miser for money.

2460
చీము గారు పంట జెదలు పట్టెడి యింట బురుగు పట్టు గుంట బుసులు కంట బిడ్డ చీకు చంట బిగియుండ నేర్చునా? వి. వే.

చీము గారు పంట జెదలు పట్టెడి
యింట బురుగు పట్టు గుంట బుసులు
కంట బిడ్డ చీకు చంట బిగియుండ
నేర్చునా? వి. వే.

చీము కారు పంటికి, చెదలు పట్టిన యింటికి, పురుగు పట్టిన మడుగుకు , పుసి కారు కంటికి, బిడ్డ పాలు చీకుచంటికి గట్టితన ముండదు

An infected tooth, a termite infested house, a crop attacked by insects, boogers (rheum) in the eyes, a bosom feeding an infant, won't have hardness.

2461
ఛత్రమున్న దకిన ఛాయయేర్పడి యుండు శాస్త్ర మెఱుగ దగిన జ్ఞాన మొదవు అబ్బయున్నవాని కండ యున్నట్టులే , వి. వే.

ఛత్రమున్న దకిన ఛాయయేర్పడి
యుండు శాస్త్ర మెఱుగ దగిన జ్ఞాన
మొదవు అబ్బయున్నవాని కండ
యున్నట్టులే , వి. వే.

గొడుగు వలన నీడ కలుగును. శాస్త్ర మెరిగిన జ్ఞానము కలుగును. తండ్రి జీవించియున్నవానికి గొప్ప ఆధారమున్నట్లే యగును

An umbrella gives shade. If one knows vedas and scripture, one is knowledgeable. For as long as one's father lives, he will get great support.

2462
తావు తెలిసినతడు తా వీలువెంబడి నేవిధముననైన నిరవు సేరు భావమెఱుగకున్న బరమెఱుంగుట యెట్లు? వి. వే.

తావు తెలిసినతడు తా వీలువెంబడి
నేవిధముననైన నిరవు
సేరు భావమెఱుగకున్న బరమెఱుంగుట
యెట్లు? వి. వే.

చేరవలసిన చోట తెలిసినచో ఎట్లయినను వీలును బట్టి ఆ చోట చేరవచ్చును. అట్లే భావమెరిగిననే పరేశ్వరుని ఎరిగి అతనిని చేరవచ్చును

If one knows the destination, he can somehow go there. Similarly if one is knowledgeable he can attain Iswara.

2463
తావు తప్పకుండదన మనంబును నిల్పి తావుజేరునట్లు తంత్రపరచి తాను తావుజేర తావు తానేకమౌ , వి. వే.

తావు తప్పకుండదన మనంబును
నిల్పి తావుజేరునట్లు తంత్రపరచి
తాను తావుజేర తావు
తానేకమౌ , వి. వే.

హృదయమును విషయాదులపైకి పోకుండ నిలిపి, దానిని ముక్తిపై పదిలము చేసి బ్రహ్మ స్వరూపమును గాంచగల్గినచో తానే యా బ్రహ్మముతో కలిసిపోవచ్చును

Without getting the mind mixed up with worldly matter, if one turns it towards salvation and visualizes the form of brahmam, then he can attain union with brahmam.

2464
దున్నపోతు మడక దురుతుగా సాగదు ఎద్దు మడక కంటె హెచ్చుకాదు ముద్దరాలి మగడు ముదుసలి మెచ్చనా? వి. వే.

దున్నపోతు మడక దురుతుగా సాగదు
ఎద్దు మడక కంటె హెచ్చుకాదు
ముద్దరాలి మగడు ముదుసలి
మెచ్చనా? వి. వే.

దున్నపోతు మడకతో సాగు చేసిన పని కాదు. ఎద్దు మడకయే చాల మేలైనది . పడుచువాడు ముసలిదానిని మెచ్చనట్లు రైతు దున్నపోతు మడకను మెచ్చడు

The tilling of soil by a male buffalo is not as good as that of an ox. Just as a young man won't appreciate an old woman, a farmer doesn't like a male buffalo's tilling.

2465
నోటిపుప్పికెల్ల నొప్పి లేకుంటకు ఆకుపోక సున్న మౌషధముగ బెట్టకుండనేని పెనురోత వేయురా , వి. వే.

నోటిపుప్పికెల్ల నొప్పి
లేకుంటకు ఆకుపోక సున్న మౌషధముగ
బెట్టకుండనేని పెనురోత
వేయురా , వి. వే.

నోటి పుప్పి నొప్పి పోవుటకై తాంబూలమే తగిన మందు. అది లేనిచో రోత పుట్టించును

When one has a rotten tooth, chewing beetle leaves will help. Without them the pain will be unbearable.

2466
నేర్పుగలుగువాడు నెఱతనము గలాడు విద్యచేత విఱ్ఱవీగువాడు పసిడి గలుగువారి బానిస కొడుకులు, వి. వే.

నేర్పుగలుగువాడు నెఱతనము
గలాడు విద్యచేత విఱ్ఱవీగువాడు
పసిడి గలుగువారి బానిస
కొడుకులు, వి. వే.

అన్నింటను నేర్పరి, వ్యవహారముల నెరిగినవాడు, విద్వాంసుడు ధనవంతుని ముందు ఎందుకును పనికిరారు

One who is adroit in everything, one who knows how to conduct business, and one who is well educated are not comparable to a wealthy man.

2467
పట్టువస్త్రములను పరగ భూషణముల కుదువ లిడుటయెల్ల కొదువపద్ధు అనుభవింపగూడ డతడెట్టివాడైన , వి. వే.

పట్టువస్త్రములను పరగ భూషణముల
కుదువ లిడుటయెల్ల కొదువపద్ధు
అనుభవింపగూడ డతడెట్టివాడైన,
వి. వే.

పట్టు వస్త్రములనుగాని, నగలనుకాని తాకట్టు పెట్టుట తగనిది . వానిని కుదువ పెట్టినను ఋణదాత తానెంత వాడైనను వానిని ఉపయోగింపకూడదు

One should not pawn silk robes and jewelry. If for some reason they were pawned, the creditor should not use them for personal purpose.

2468
పరుల కుపకరించి పరుసొమ్ము పరునకు పరగ నిచ్చెనేని ఫలము కలుగు, పరముకన్న నేమి పావనమా సొమ్ము? వి. వే.

పరుల కుపకరించి పరుసొమ్ము
పరునకు పరగ నిచ్చెనేని ఫలము
కలుగు, పరముకన్న నేమి
పావనమా సొమ్ము? వి. వే.

ఇతరులకు ఉపకరించి , ఏ విధముగనైనను వారి సొమ్ము తనకు స్వాధీనమైనచో , దానిని వారి కిచ్చిన యెడల పరము లభించును. మనకు లభించు పరముకంటె ఆ ధనమెంత మాత్రము పవిత్రము కాదు

If one earns money somehow, he should use it to help others. This will enable one to attain salvation. Money in this world is no more valuable than that of nether world.

2469
పరుల మోసపుచ్చి పరధన మార్జించి కడుపునింపుకొనుట కాని పద్దు ఋణముచేయు మనుజుడెక్కువ కెక్కునా ? వి. వే.

పరుల మోసపుచ్చి పరధన మార్జించి
కడుపునింపుకొనుట కాని
పద్దు ఋణముచేయు మనుజుడెక్కువ
కెక్కునా ? వి. వే.

ఇతరులను మోసగించి ధనామార్జి౦చి పొట్ట నింపుకొనుటయు , ఱుణము చేయుటయు తగని పనులు. మోసగించిన నింద వచ్చును. అప్పు చేసిన గౌరవము నశించును

One should not cheat others for money and take a loan. Cheats get reproach. And taking loans makes one lose honor.

2470
పరులు చదువుజూచి నిరసనబుద్ధితో వట్టి మాటలాడ వ్యర్థుడగును అట్టివాని బ్రతుకు లరయగా నేటికి? వి. వే.

పరులు చదువుజూచి నిరసనబుద్ధితో
వట్టి మాటలాడ వ్యర్థుడగును
అట్టివాని బ్రతుకు
లరయగా నేటికి? వి. వే.

ఇతరులు చదువుకొని విద్వాంసులు కాగా, వారిని నిరసించుచు వట్టి మాటలు పలుకువాడు వ్యర్థుడు . అట్టి నీచుని బ్రతుకు నిరుపయోగమైనది

When people are struggling to educate themselves and acquire knowledge, one who censures them with empty words is a low-life. His life is useless.

2471
మాటలాడగలుగు మర్మము లెఱిగిన పిన్న పెద్దతనము లెన్నవలదు . పిన్నచేతిదివ్వె పెద్దగా వెలుగదా ? వి. వే.

మాటలాడగలుగు మర్మము లెఱిగిన
పిన్న పెద్దతనము లెన్నవలదు.
పిన్నచేతిదివ్వె పెద్దగా
వెలుగదా ? వి. వే.

మాటలాడుటలోని రహస్య మెరిగినచో పిన్నవానినైనను గౌరవింపవలెను . పిన్న, పెద్ద వ్యత్యాసమును చూపరాదు . చిన్నవాని చేతిలో నున్న దీపము పెద్దదిగా వెలుగుచుండుట లేదా?

If one understands the technique of speech, one should respect a younger person. One should not show discrimination by age. The lamp held by a younger person glows the same regardless of his age.

2472
మాటలాడవచ్చు మనసు నిల్పగలేడు తెలుపవచ్చు దన్ను తెలియలేడు సురియ బట్టవచ్చు శూరుడు కాలేడు, వి. వే.

మాటలాడవచ్చు మనసు నిల్పగలేడు
తెలుపవచ్చు దన్ను తెలియలేడు
సురియ బట్టవచ్చు
శూరుడు కాలేడు, వి. వే.

మానవుడు మాటల నెన్నిటినైన చెప్పగలడుగాని తాను చెప్పినట్లు మనస్సును నిల్పలేడు . ఒకరికి చెప్ప వచ్చు గాని తన్ను తా దెలిసికొనలేడు . ఆయుధమును పట్టిన మాత్రమున శూరుడు కాలేడు కదా!

A man can boast off but will not able be able to keep his mind still. It is easier said than done. Just because one carries a weapon does not mean he is a great warrior.

2473
మాటవినని యాలు మగనికి బందాలు దానిజేర మానప్రాణహాని అట్టి యాలి విడిచి యడవినుండుట మేలు, వి. వే.

మాటవినని యాలు మగనికి బందాలు
దానిజేర మానప్రాణహాని
అట్టి యాలి విడిచి యడవినుండుట
మేలు, వి. వే.

మాట వినని భార్య, సంకెల వంటిది . దానివల్ల మానము, ప్రాణము కూడ పోవును . అట్టి భార్యను విడిచి అడవికి పోవుట మేలు

A wife who doesn't follow orders is like shackles. One will lose honor and life because of her. It is better to leave her and move into a forest.

2474
మాలకన్నియలను మంచిరూపంబున్న ముట్టెనే త్రిశంకు పట్టినాడు కానిపనులు చేయ ఘనులాసపడుదురా ? వి. వే.

మాలకన్నియలను మంచిరూపంబున్న
ముట్టెనే త్రిశంకు పట్టినాడు
కానిపనులు చేయ ఘనులాసపడుదురా?
వి. వే.

మాల కన్యకలు ఎంత అందముగా నున్నను పూర్వం హరిశ్చంద్రుడు వారిని పెండ్లాడుటకు తిరస్కరించెను గదా! గొప్పవారు కానిపనులు చేయ సిద్ధపడరు

King Harischandra refused to marry an outcast woman even though she was very beautiful. Great people won't do unacceptable deeds.

2475
రాజయోగమూని తేజమందుట ముక్తి తేజమందకున్న దేబె లరయ మర్మరహితగురుని మహిజేరవలెనయా , వి. వే.

రాజయోగమూని తేజమందుట ముక్తి
తేజమందకున్న దేబె
లరయ మర్మరహితగురుని మహిజేరవలెనయా,
వి. వే.

రాజయోగమును అవలంబించి ముక్తిని పొందవలెను. అట్లు చేయనివారు అవివేకులు. దానికై మర్మములు లేని గురువు నాశ్రయింపవలెను

One should adopt raaja-yoga and try to attain salvation. People who don't do so are foolish. One should seek an honest guru.

2476
విటుడు డాగుచేసి విడిచిపెట్టిన యది పేద పెనిమిటిగని ప్రియముచేయు కుప్పలోని చెప్పు గుక్కతిన్నట్లయా , వి. వే.

విటుడు డాగుచేసి విడిచిపెట్టిన
యది పేద పెనిమిటిగని ప్రియముచేయు
కుప్పలోని చెప్పు
గుక్కతిన్నట్లయా , వి. వే.

విటుడు చెరచి విడిచిపెట్టిన యువతి తన పేద భర్త వద్దకు పోయి ప్రియములు పల్కుట చెత్తకుప్పలో ఉన్న చెప్పును కుక్క కొరికినట్లుండును

A whore who was left behind by her fiancee going to her poor husband and talking sweetly is like a dog that chews on a shoe thrown in garbage.

2477
వేషభాష లింక గాషాయ వస్త్రముల్ బోడినెత్తు లొప్ప బొరయుచుంద్రు తలలు బోడులైన దలపులు బోడులా? వి. వే.

వేషభాష లింక గాషాయ వస్త్రముల్
బోడినెత్తు లొప్ప బొరయుచుంద్రు
తలలు బోడులైన
దలపులు బోడులా? వి. వే.

యతులు వేష భాషలు చూపుచు , కావి గుడ్డలు ధరించుచు , బోడి తలలతో ఉందురే కాని మనస్సు పరిపక్వము కాదు. తలలు బోడులైనంత మాత్రమున తలపు లెక్కడికి పోవును?

Sages who flaunt their garb, wear saffron clothes, tonsure their heads, don't have a mature mind. Even if hair is removed, what about the thoughts racing in one's mind?

2478
సతుల గవయుటయును సుతుల బడసెదమని వెతలబడుట యెంతో వెఱ్ఱితనము నేలనున్న రాయి నెత్తికెత్తిన యట్లు, వి. వే.

సతుల గవయుటయును సుతుల బడసెదమని
వెతలబడుట యెంతో వెఱ్ఱితనము
నేలనున్న రాయి నెత్తికెత్తిన
యట్లు, వి. వే.

పెండ్లి చేసికుని సతులను గూడి, పుత్రులను కని పుణ్యలోకములను సంపాదింతుననుట భ్రాంతి. ఇది నేలపై నున్న రాతని నెత్తిపై పెట్టుకొన్నట్లుండును

One planning to get married, beget children and then attain salvation is delusional. It is like carrying a stone on one's head.

2479
హాని కలుగబోదు హరిమది నెంచెడు వాని కబ్బు పరము వసుధయందు పూని నిష్టమీఱి పొదలక యుండుము, వి. వే.

హాని కలుగబోదు హరిమది నెంచెడు
వాని కబ్బు పరము వసుధయందు
పూని నిష్టమీఱి
పొదలక యుండుము, వి. వే.

భగవంతుని మనస్సులో ధ్యానించుచున్నవానికి హాని కలుగనే కలుగదు . అతనికి తప్పక ముక్తి లభించును . కావున నిష్ఠతో దేవుని ధ్యానించుచు నిశ్చలుడై యుండుము

The one who prays to god will never meet with harm. He will attain salvation. One has to remain stable by praying to god with an unwavering mind.

No comments:

Post a Comment