Saturday, February 29, 2020

Vemana-Brahma-Swaroopa-Paddati


1278
అతి సూక్ష్మదృష్టిలోనను మతికింపుగ శివుని గూర్చి మఱియొకటెనన్ ప్రతిలేని మోక్షమదె యగు సతతపు నిర్వాణపదవి సాక్ష్యము వేమా!

అతి సూక్ష్మదృష్టిలోనను మతికింపుగ
శివుని గూర్చి మఱియొకటెనన్
ప్రతిలేని మోక్షమదె యగు సతతపు
నిర్వాణపదవి సాక్ష్యము వేమా

సూక్ష్మదృష్టితో భగవత్స్వరూపమును దర్శించుచు నిశ్చల మనస్సుతో నున్నయెడల ముక్తి చేకూరును . మోక్ష పదవికి ఇదియే సులభమైన మార్గము

One can achieve salvation by visualizing god with the inner eye and an unwavering mind.

1279
అందరాని పండడవి వెన్నెలనుండు నుండుజూడ దొడ్డ నుండుగాని పండుపడిన జెట్టు పట్టంగలేరయా , వి. వే.

అందరాని పండడవి వెన్నెలనుండు
నుండుజూడ దొడ్డ నుండుగాని
పండుపడిన జెట్టు
పట్టంగలేరయా , వి. వే.

బ్రహ్మ మందరాని పండువంటిది . అది చిదానందాకాశము నంటియుండును . అది సాక్షాత్కరించిన సంసార వృక్షము ఛేదింపబడినదగును

Brahmam is like unreachable fruit that can be found in chid-ananada-aakaasamu. Once deified it will destroy the bondage.

1280
అది యిది యని మదిదోచెడు సదనము గుర్తించిలోన సాధించినచో గుదురును బ్రహ్మానందము కదిసిన మదిజేర నొక్కి కనవలె వేమా!

అది యిది యని మదిదోచెడు సదనము
గుర్తించిలోన సాధించినచో గుదురును
బ్రహ్మానందము కదిసిన
మదిజేర నొక్కి కనవలె వేమా

అది , ఇదియని వస్తునిరూపణభావమును గుర్తించి , దానిని లోబరుచుకున్నచో చంచల స్వభావము నశించి బ్రహ్మానంద మనుభవ గోచరమగును

One should control the mental distractions that chase after objects to experience the brahmam.

1281
అందు నిందు ననక యన్నిటియందును విష్ణువమరియుండు వెలయ భువిని , వెనుక జక్రి తిరుగు విష్ణుచక్రంబుతో , వి. వే.

అందు నిందు ననక యన్నిటియందును
విష్ణువమరియుండు వెలయ భువిని,
వెనుక జక్రి తిరుగు
విష్ణుచక్రంబుతో , వి. వే.

విష్ణు విక్కడ , అక్కడ అనక అన్నిచోట్లయందు నున్నాడు . అతడే పరతత్త్వము . ప్రకృతి ననుసరించి యతడే చక్రధారియై ప్రవర్తించును

Lord Vishnu is everywhere. He is para-tattva. Following prakruti (nature) he carries a chakra to rule the world.

1282
అన ననాహితమున నది లెస్సగాజూచి యికను దాన వాయువీహజేసి కడమవాయువందు గదలకుండినవాడు చెప్పనేల వాడె శివుడు వేమ !

అన ననాహితమున నది లెస్సగాజూచి
యికను దాన వాయువీహజేసి కడమవాయువందు
గదలకుండినవాడు చెప్పనేల
వాడె శివుడు వేమ

అనాహత చక్రమున దృష్టిని స్థిరముగా నిలిపి ఉదాన వాయువు ననుసరించి మిగిలిన ప్రాణ, అపాన, వ్యాన, సమాన వాయువుల ననుగమించి చూచువాడే పరమాత్మయని చెప్పవచ్చును

One who concentrates his mind on anahita chakra and controls his breath, can be called a paramaatma.

1283
అన్నదానమునకు నధిక సంపదగల్గి యమరలోక పూజ్యుడగును మీఱు అన్నమగును బ్రహ్మమది కనలేరయా , వి. వే.

అన్నదానమునకు నధిక సంపదగల్గి
యమరలోక పూజ్యుడగును
మీఱు అన్నమగును బ్రహ్మమది
కనలేరయా , వి. వే.

అన్నదానమును మించిన దానములేదు . దానివల్ల దేవలోక పూజ్యుడగును . అన్నము పరబ్రహ్మ స్వరూపము

There is no other bigger charitable act than offering food. One becomes a revered person in the deva-loka. Food is the manifestation of para-brahma.

1284
అన్నము నమృతంబు నంటుయంటంచును బరిహరింత్రు తెలియబడక ద్విజులు అన్నమమృత మిదియ హరిహరబ్రహ్మలు అంటవన్న వానికంటు వేమ!

అన్నము నమృతంబు నంటుయంటంచును
బరిహరింత్రు తెలియబడక ద్విజులు
అన్నమమృత మిదియ హరిహరబ్రహ్మలు
అంటవన్న వానికంటు వేమ

అన్న మమృత స్వరూపము . అంటు , అంటు అని దానిని నిరసింపరాదు . బ్రాహ్మణులు దీని నంటందురు . త్రిమూర్తులు అమృత స్వరూపులు . వారి కంటులేదు . అంటు అన్నవారికే అంటుకలదు

Food is like amrita. One should not deprecate it. Brahmins call it 'antu' in a deprecating way. The tri-moortis (Lord Vishnu, Lord Brahma, Lord Siva) are forms of amrita. They don't have 'antu'

1285
అమల మవ్యయ చింతన మసి పదంబు గోరి జీవేశ్వరైక్యంబు గూర్చినంత నవిరతంబగు పరిపూర్ణ మమరునయ్య వాదులాడగ జిక్కగరాదు వేమ!

అమల మవ్యయ చింతన మసి పదంబు గోరి
జీవేశ్వరైక్యంబు గూర్చినంత
నవిరతంబగు పరిపూర్ణ మమరునయ్య
వాదులాడగ జిక్కగరాదు వేమ

పరిశుద్ధము , నాశరహితము నగు జీవేశ్వరైక్యము "తత్త్వమసి" పదఘటితము . ఆ యైక్యమును కూర్చినచో పరిపూర్ణుడవగుదువు . వాదముల వలన ప్రయోజనము లేదు

The union between jiva and Iswara is pure and indestructible. It embodies the phrase in the vedas “I am that”; One becomes complete (pari-poorna) with such union.

1286
ఐదు వర్ణములనె యఖిలంబు తెలిసిన నయిదు నుండు ముక్తి యమరియుండు నయిదులోననున్న యతడెపో యఖిలము , వి. వే.

ఐదు వర్ణములనె యఖిలంబు తెలిసిన
నయిదు నుండు ముక్తి
యమరియుండు నయిదులోననున్న
యతడెపో యఖిలము , వి. వే.

పంచాక్షరి స్వరూపమను బాగుగా ఎరిగినచో ముక్తి అందే ఇమిడియున్నదని తెలియును . ఈ అయిదక్షరములలో నున్నవాడే సర్వవ్యాప్తియగు భగవంతుడు

If one understands panchaakshari (om-namah-si-vaa-ya) well, he will realize that salvation is achievable with it. God is the embodiment of these 5 sounds and is everywhere.

1287
అర్థ యంకణమున కాధారమైనట్టి యొంటి మేడ గుంజు నొనరనిల్పె , నింటి కొక మగడె యిల్లా౦డ్రు నేడ్గురు , వి. వే.

అర్థ యంకణమున కాధారమైనట్టి
యొంటి మేడ గుంజు నొనరనిల్పె,
నింటి కొక మగడె యిల్లా౦డ్రు
నేడ్గురు , వి. వే.

దేహము వంటి స్తంభపు యింటివంటిది . దీనికి జీవుడొకడే యజమానుడు . కాని యిల్లాండ్రు మాత్రము ఏడుగురు . వారే సప్తప్రకృతులు

Body is like a house on a pillar. The jiva is its owner. There are 7 house wives called “sapta-prakriti” (7 natural things)

1288
అష్టదళములకును నాధారమైనట్టి యాదిదేవు డొకడె యఖిల జగము త్రయము దాటువాడు తానెపో బ్రహ్మంబు , వి. వే.

అష్టదళములకును నాధారమైనట్టి
యాదిదేవు డొకడె యఖిల జగము
త్రయము దాటువాడు తానెపో
బ్రహ్మంబు , వి. వే.

అష్టదళములకును ఆధారమైనవాడు దేవుడొక్కడే ! అతడే ప్రపంచాతీతుడును , బ్రహ్మమును , అతడే త్రిగుణములను అతిక్రమించి యున్నవాడు

God is the basis for “ashta-dalas”. He is the brahmam and beyond the universe by over-coming 3 gunas (sattva-calm, rajas-active, tamas-indolence)

1289
ఆకలి జంపిన రాదది యాకుల దిని యడవులందె యలసిన నైనన్ జీకటికోనం జిక్కదు ఏకాకృతి మదిని నిల్పి యెఱుగుము వేమా!

ఆకలి జంపిన రాదది యాకుల దిని
యడవులందె యలసిన నైనన్ జీకటికోనం
జిక్కదు ఏకాకృతి మదిని
నిల్పి యెఱుగుము వేమా

ఆకలిని చంపినను , ఆకులను తినుచు అడవిలో శ్రమ పడినను బ్రహ్మసాక్షాత్కారము లభించదు. చీకటి కోనలో కూర్చున్నను అది రాదు . దానికి నిరంతర ధ్యానమే కావలెను

Brahmam won't appear when one stays in the forest by fasting or by eating leaves. One has to constantly pray to him.

1290
ఆకాశంబున వాయువు మరాకున దావాగ్ని యటుల మానసమందా యేకా కారుడు జగమున జోకై తను దానె వెల్గు సుమ్ముర వేమా!

ఆకాశంబున వాయువు మరాకున దావాగ్ని
యటుల మానసమందా యేకా
కారుడు జగమున జోకై తను దానె
వెల్గు సుమ్ముర వేమా

ఆకాశమునందు గాలి, మ్రానిలో అగ్ని ఎట్లణగియుందునో అట్లే ఏకాకారముగల దైవము జగములన్నియు నిండి స్వయంప్రకాశమై యుండును

Just as air is in between space and the earth, fire is hidden in a tree trunk, the single-form of god is all over the universe with resplendence

1291
ఆకు వక్క సున్నా మది మూడు వన్నెలు నేకమైనచోట దాకు నెఱుపు సోకి త్రిగుణమట్లు శోభించు పరమాత్మ , వి. వే.

ఆకు వక్క సున్నా మది మూడు
వన్నెలు నేకమైనచోట దాకు నెఱుపు
సోకి త్రిగుణమట్లు శోభించు
పరమాత్మ , వి. వే.

వేర్వేరు రంగులు ఆకు, వక్క, సున్నములు కలిపిన ఎట్లు ఎర్రరంగు కల్గునో , అట్లే త్రిగుణముల సంపర్కమువల్ల పరమాత్మ శోభిల్లున

Just as mixing beetle leaves, beetle nuts and calcium give raise to red color, by the admixture of trigunas (sattva-calm, rajas-active, tamas-indolence) paramaatma is resplendent

1292
ఆకులేని కొమ్మ యభ్రమెల్లను నిండె మ్రాకు మొదలు దుదయు మహినిలేదు ఏకమైన పండు నింపొందుచుండును , వి. వే.

ఆకులేని కొమ్మ యభ్రమెల్లను
నిండె మ్రాకు మొదలు దుదయు
మహినిలేదు ఏకమైన పండు నింపొందుచుండును,
వి. వే.

ప్రకృతి యను మహా వృక్షమునకు ఆకులు, కొమ్మలు లేవు . కాని అది ప్రపంచమంతయు వ్యాపించియున్నది . దానికి మొదలు, తుద లేవు. అది బ్రహ్మానందమను ఫలము నిచ్చుచున్నది

The huge tree called prakriti (nature) has no branches and leaves. It has spread all over the universe. It has no beginning or end. Its fruits are ultimate bliss.

1293
ఆకృతి నరయగ నిరాకృతి యనదగు నాకృతి నొనిదగు నిరాకృతిట్టు లవియు రెండులేక యపురూపమై యుండు, వి. వే.

ఆకృతి నరయగ నిరాకృతి యనదగు
నాకృతి నొనిదగు నిరాకృతిట్టు
లవియు రెండులేక యపురూపమై
యుండు, వి. వే.

బ్రహ్మ మెట్టి యాకారమున ఉండును? అని ఆలోచించిన కొలది నిరాకారత్వమే తెలియును . నిరాకారత ఆకారముగా పరిణమించును . కావున ఈ రెండును లేనిది బ్రహ్మమని గ్రహింపవలెను

What is the form of the creator? The more one thinks about it, the more one comes to the conclusion that he is formless. Form emanates from formlessness. So the creator has neither form nor formlessness

1294
ఆదిజూచుచుండ నన్నిటతానుండు నాది జూడ నొకరి కలవికాదు ఆది ముక్తి తెరువ దాత్మనే యుండును , వి. వే.

ఆదిజూచుచుండ నన్నిటతానుండు
నాది జూడ నొకరి కలవికాదు
ఆది ముక్తి తెరువ దాత్మనే
యుండును , వి. వే.

ప్రపంచమూలమేది యని చూడగా పరమాత్మయే కన్పి౦చును . ఆ యాత్మ యసాధ్యమై ముక్తికి మార్గమై యుండును

When one asks what is the basis for the world, the answer is paramaatma which is hard to grasp and whose knowledge is essential for salvation

1295
ఆది నెవరు పుట్టి అవనికి దొరలైరి వారె బ్రహ్మ విష్ణు పరశివులన గనగ మాయశక్తి ఘనతేజ మందఱు, వి. వే.

ఆది నెవరు పుట్టి అవనికి
దొరలైరి వారె బ్రహ్మ విష్ణు
పరశివులన గనగ మాయశక్తి
ఘనతేజ మందఱు, వి. వే.

ప్రపంచమున తొలుత వెలసి దానిని పాలించువారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు . వారు మాయాస్వరూపులు

Lord Brahma, Lord Vishnu and Lord Maheswara have been there since the beginning. They are manifestations of maaya

1296
ఆఱు దూలములకు నాధారమైనట్టి యొంటి కంబ మింటి కొనర నిల్పి ఇంటి కొకండు కర్తయై పారుచుండును , వి. వే.

ఆఱు దూలములకు నాధారమైనట్టి
యొంటి కంబ మింటి కొనర నిల్పి
ఇంటి కొకండు కర్తయై
పారుచుండును , వి. వే.

షట్చక్రమలతో గూడిన యీ శరీరమున ఇంటికి బ్రహ్మదండమను (వెన్నెముక) ఒంటి కంబమును నిలిపి ఈశ్వరుడు జీవరూపమున గృహయాజమానుడై యున్నాడు

The body has 6 chakras (moolaadhara, swaadhistaana, manipoora, anaahita, visudha, agnaa) supported by the spine. Ishwara is residing in it as jiva.

1297
ఉనికి మేరు శిఖరమున్మత్తతను జూచి కనియుగాన బోవుగల దదియు వినియు వినవు దాని విమలాంతరంగము , వి. వే.

ఉనికి మేరు శిఖరమున్మత్తతను
జూచి కనియుగాన బోవుగల
దదియు వినియు వినవు దాని
విమలాంతరంగము , వి. వే.

మేరు శిఖరమున నిలిచియున్నను , కన్పించియు కానరానిదై , వినియు విననిదై ఉండునదే బ్రహ్మము (మేరుఒక యోగ సాధనము-కొండ కాదు )

By a process called “meru”, the brahmam is visible yet unseen, audible yet not being heard.

1298
ఉప్పునీరు నట్టు లూహించి చూచిన గప్పురంబు జ్యోతి గలిసినట్టు లుప్పతిల్లు మదిని నొప్పుగా శివుడుండు , వి. వే.

ఉప్పునీరు నట్టు లూహించి చూచిన
గప్పురంబు జ్యోతి గలిసినట్టు
లుప్పతిల్లు మదిని నొప్పుగా
శివుడుండు , వి. వే.

నీటిలో ఉప్పు కలియునట్లును , మంటలో కర్పూరము కలిసిపోయినట్లును , దేవుడు అదృశ్యాకారమున మనస్సులో ఉండును .

Like salt dissolves in water, camphor burns with flame, the formless god is residing in one's mind.

1299
ఉబ్బి గుర్తుచూచి యూహను రెట్టించి నిబ్బరపడువాడు నిర్మలుండు అబ్బరాని బయలునందును పొందును , వి. వే.

ఉబ్బి గుర్తుచూచి యూహను రెట్టించి
నిబ్బరపడువాడు నిర్మలుండు
అబ్బరాని బయలునందును
పొందును , వి. వే.

ఉచ్ఛ్వాస నిశ్వాసములను బిగించి ఈశ్వర సంకేతమును గుర్తించి మనస్సున చిక్కబట్టి ఓరిమి వహించినవాడు బ్రహ్మత్వమును పొందును

By controlling breath, watching for signs from Iswara, harnessing mind, when one is patient he will gain the knowledge about brahmam

1300
ఉర్విజనులు పరమ యోగీశ్వరుని జూచి తెగడువారెకాని తెలియలేరు అమృతపు రుచులను హస్తమెట్లెఱుగును ? వి. వే.

ఉర్విజనులు పరమ యోగీశ్వరుని
జూచి తెగడువారెకాని తెలియలేరు
అమృతపు రుచులను హస్తమెట్లెఱుగును?
వి. వే.

అమృతపు రుచిని హస్తమెరుగని విధమున సామాన్య జనులు మహాయోగిని చూచి పరిహసింతురేకాని అతని గొప్పతనము నెరుగజాలరు

Just as the taste of amrita (elixir of life) is not known to an elephant, ordinary people make fun of yogis without realizing their greatness

1301
ఊకొన జెప్పిన వినదది ప్రాకటముగ లోకములను బాలించెడి యా పాకము మదిలో బయలని యేకాకృతి నవిరతముగ నెన్నుము వేమా!

ఊకొన జెప్పిన వినదది ప్రాకటముగ
లోకములను బాలించెడి యా
పాకము మదిలో బయలని యేకాకృతి
నవిరతముగ నెన్నుము వేమా

చూచుటకును , వినుటకును , మాటలాడుటకును శక్యము కాక ఎల్లయెడల నిండి ఆకాశమే బ్రహ్మమని , అదియే లోకములను పాలించుచున్నదని తెలిసికొనుము

Brahmam is unseen, inaudible and incommunicable yet present all over the universe and is ruling the world.

1302
ఎక్కువెట్టి గుఱుతి కేకమైనంతట సొక్కిసోలియుండు సూత్రముగను ముక్కు చెవులు లేని మూలమే పరమాత్మ, వి. వే.

ఎక్కువెట్టి గుఱుతి కేకమైనంతట
సొక్కిసోలియుండు సూత్రముగను
ముక్కు చెవులు లేని
మూలమే పరమాత్మ, వి. వే.

సమాధి పొంది లక్ష్యమును చిత్తులో కలిపి తర్వాత కలిగెడి అనిర్వచనీయమగు మూలమే పరమాత్మయని గ్రహింపవలెను

After attaining samaadhi and dissolving the goal in mind, one acquires indescribable state. The basis for it is paramaatma

1303
ఎఱుక దోడ్కొని తత్త్వంబు నెఱుగటెట్లు? ఎఱుక తొలగిన తత్త్వము నెంచరాదు ఎఱుక మఱపుల కందని యిరువుగనుము ఎఱుగుచుండెడి దానినె యెంచి వేమ

ఎఱుక దోడ్కొని తత్త్వంబు నెఱుగటెట్లు?
ఎఱుక తొలగిన తత్త్వము నెంచరాదు
ఎఱుక మఱపుల కందని యిరువుగనుము
ఎఱుగుచుండెడి దానినె యెంచి వేమ

జాగ్రదావస్థలోనూ , జ్ఞానశూన్యస్థితిలోను తత్త్వము ననుసందిత సాధ్యము కాదు . జాగ్రత్ సుషుప్త్యవస్థల కతీతమైనది బ్రహ్మము

It is not possible to meditate on tattva in wakeful state and in ignorance. Brahmam is beyond wakeful state and deep sleep.

1304
ఎఱుకను బుట్టును తనువులు ముఱికిని దామరుగుచుండు మోయుట గాదా యెఱుక గల తనువు నొందిన మఱియును జన్మించుటెట్లు మహిలో వేమా!

ఎఱుకను బుట్టును తనువులు ముఱికిని
దామరుగుచుండు మోయుట గాదా
యెఱుక గల తనువు నొందిన మఱియును
జన్మించుటెట్లు మహిలో వేమా

శరీరము లజ్ఞానమున పుట్టి మురికిలో మునిగి తేలుచు నుండును. జ్ఞానము తోడి శరీరమును పొందినయెడల మరల మరల జన్మము లెత్తవలసిన పనియుండదు

Body is begotten by ignorance and is made of dirt. One can put an end to birth-death cycle by acquiring spiritual knowledge.

1305
ఎఱుకనెంచి చూడ నెఱిగించు చుండును బరముదాకిచూడ బట్టువడును గుఱికి బయలుచేర గుణరహితంబురా , వి. వే.

ఎఱుకనెంచి చూడ నెఱిగించు
చుండును బరముదాకిచూడ బట్టువడును
గుఱికి బయలుచేర
గుణరహితంబురా , వి. వే.

జ్ఞానము సమస్తమును తెలుపుచు పరమాత్మను పొందునట్లు చేయును. లక్ష్యము తప్పిపోయినచో ప్రయోజనము లేదు

Spiritual knowledge helps in finding the paramaatma. There is no use in losing sight of the goal

1306
ఎఱుక మఱపులుగానిది యెఱుగలేరు పరుగు పరిపూర్ణసుఖమూని పట్టలేరు ఉరము బెదరని గుఱిగని యుండలేరు నిరుపమానంద సంతృప్తి నిలుపు వేమ!

ఎఱుక మఱపులుగానిది యెఱుగలేరు పరుగు
పరిపూర్ణసుఖమూని పట్టలేరు ఉరము
బెదరని గుఱిగని యుండలేరు నిరుపమానంద
సంతృప్తి నిలుపు వేమ

జాగ్రత్ స్వప్నావస్థలు లేనిది , పరిపూర్ణ సుఖ స్వరూపము కలదియు నగు బ్రహ్మమును తెలిసికొనుట మిగుల కష్టము

It is hard to find out brahmam which has no wakeful and sleepy state and is the embodiment of bliss.

1307
ఎఱుకమాలు జీవి యెంత కాలంబున్న చచ్చిపుట్టుచుండు సహజముగను ఎఱుక మఱచు చోటు నెఱుగుట బ్రహ్మము, వి. వే.

ఎఱుకమాలు జీవి యెంత కాలంబున్న
చచ్చిపుట్టుచుండు సహజముగను
ఎఱుక మఱచు చోటు నెఱుగుట
బ్రహ్మము, వి. వే.

జ్ఞానశూన్యుడు ఎన్నియో మారులు జననమరణములను పొందుచుండును . జ్ఞానము నార్జించి , జ్ఞానాతీతమగు బ్రహ్మపదమును సాధింపవలెను

The ignorant one is caught in birth-death cycle. One has to acquire spiritual knowledge and seek brahma-pada which is beyond knowledge

1308
ఎఱుక మఱపులందు నేమేమి తోచిన సరికి గుఱియెకాదు సత్యమునకు పరమ నిర్గుణంబు బాటించి కనవలె , వి. వే.

ఎఱుక మఱపులందు నేమేమి తోచిన
సరికి గుఱియెకాదు సత్యమునకు
పరమ నిర్గుణంబు బాటించి
కనవలె , వి. వే.

జాగృత్సుషుప్తులలో ఎట్టి రీతులు కానవచ్చినను లెక్కచేయక నిర్గుణస్వరూపమునే ప్రయత్నముచే చూడవలెను

No matter what distractions arise in wakeful and deep sleep states one has to over-come and meditate on the form without the 3 gunas (sattva-calm, rajas-active, tamas-indolence)

1309
ఎఱుకయుండువాని కెఱుకయేయుండును ఎఱుకలేనివాని కెఱుకలేదు ఎఱుకలేని యెఱుక నెఱుగుట తత్త్వము, వి. వే.

ఎఱుకయుండువాని కెఱుకయేయుండును
ఎఱుకలేనివాని కెఱుకలేదు
ఎఱుకలేని యెఱుక నెఱుగుట
తత్త్వము, వి. వే.

జ్ఞానహీనునికి ప్రపంచజ్ఞానము ఎన్నటికిని కలుగదు . జ్ఞాని కన్నివిషయములు తెలియగలవు . ఆ ఉత్తమజ్ఞానము నెరుగుటయే తత్త్వజ్ఞానము

The ignorant one has no knowledge about the world. A gnaani knows everything. Acquiring superior knowledge is the knowledge about tattva

1310
ఎవరికెవరు గారికెవ్వరుగాబోరు గవయగోరు హంసగదియు నొక్కి శివుని రూపమూని సేవింపదొరకును, వి. వే.

ఎవరికెవరు గారికెవ్వరుగాబోరు
గవయగోరు హంసగదియు
నొక్కి శివుని రూపమూని సేవింపదొరకును,
వి. వే.

ఈ ప్రపంచమున ఒకరినొకరు తోడుపడలేరు . హంసను బిగబట్టి మోహమును నశింపజేసి భగవంతుని సేవింపబూనుటయే ఉత్తమము

It is not possible to help each other in the world in a steadfast manner. It is better to do praanayaam and control desires and serve the god.

1311
ఎవ్వడజ్ఞానతిమిరంబు నేపుమాపి జ్ఞానమను వెన్నెల౦ దొప్ప బూనునేని చంద్రున్ బోలిన గురునండ సాధకముగ కూడిననుగాని తీరదు కోర్కి వేమా!

ఎవ్వడజ్ఞానతిమిరంబు నేపుమాపి జ్ఞానమను
వెన్నెల౦ దొప్ప బూనునేని చంద్రున్
బోలిన గురునండ సాధకముగ
కూడిననుగాని తీరదు కోర్కి వేమా

అజ్ఞానాంధకారమున నశింపజేసికొని జ్ఞానతేజమును వెలయించు నేర్పుగల గురుని సహాయమున్న నేగాని బ్రహ్మము నొందలేము. గురుసేవవల్లగాని కోరిక నెరవేరదు

It is not possible to realize brahmam without the help of a guru who destroys ignorance and plants the seeds of knowledge. The wish is fulfilled by serving a guru.

1312
ఎవ్వడేమెఱుంగు నింపైన వస్తువు దేహమేమెఱుంగు దివ్యబోధ విధము దెలియగోరి వేదాంత మెఱుగుడీ , వి. వే.

ఎవ్వడేమెఱుంగు నింపైన వస్తువు
దేహమేమెఱుంగు దివ్యబోధ
విధము దెలియగోరి వేదాంత
మెఱుగుడీ , వి. వే.

ఇంపైన వస్తువేదో ఆజ్ఞులకు తెలియదు . మంచియేదో చెడ్డయేదో వారికి తెలియదు . జ్ఞానము సంపాదించి ఉపనిషత్తులు తెల్పు దివ్యబోధనుబట్టియే తత్త్వము తెలియును

Ignorant people don't know a perfect object when they see one. Nor do they know good and bad. One can know the tattva by acquiring knowledge and learning the teachings of upanishads.

1313
ఐదునైదునారు నెన్మిది నొక్కటి యోడలోననుండి యోరసిల్లు నోడ యెక్కి తిరుగు నొడయడే తత్త్వంబు , వి. వే.

ఐదునైదునారు నెన్మిది నొక్కటి
యోడలోననుండి యోరసిల్లు
నోడ యెక్కి తిరుగు నొడయడే
తత్త్వంబు , వి. వే.

ఇరువదియైదు తత్త్వములతో కూడిన యీ శరీరమునకు అధిష్ఠాతమైయున్నవాడే పరమాత్మ. అతడే తత్త్వము

Paramaatma is residing in the body made of 25 tattvas

1314
ఏడు మార్గములను నేకా౦తమునజేరి యాడిపాడి ముక్తిగూడి వేడి జాడలోన బయలు సాధించి కనవలె , వి. వే.

ఏడు మార్గములను నేకా౦తమునజేరి
యాడిపాడి ముక్తిగూడి
వేడి జాడలోన బయలు సాధించి
కనవలె , వి. వే.

సప్తస్రోతస్సులను కదియజేర్చి , మనస్సును తన్మయతను పొందించి , ధ్యానించి బ్రహ్మమును సాక్షాత్కరింప జేసికొనుటే ముక్తి

By acquiring sapta-srotas (7 srotas) and meditation one can visualize the brahmam.

1315
ఏడెయక్షరముల నీయంద మొందిన నందునిందు ముక్తి యలరుచుండు అందు నిందు తెలియ నదియపో బ్రహ్మంబు , వి. వే.

ఏడెయక్షరముల నీయంద మొందిన
నందునిందు ముక్తి యలరుచుండు
అందు నిందు తెలియ నదియపో
బ్రహ్మంబు , వి. వే.

సప్తాక్షర ప్రకృతియందున్న ఈశ్వరరూపమును గుర్తించిన యెడల ఇహము, పరము కలుగును . ఇట్లిహపరములను రెంటిని సాధించుటయే ముక్తినొందుట - బ్రహ్మసాక్షాత్కారము

By visualizing the form of Iswara in prakriti made of sapta-akshara (7 letters) one can understand this and nether world. It leads to salvation.

1316
ఏపు మీఱ మదిని నెంచి మించుచు గుర్తు రూపపుభ్రమ లడచి రూఢి పడక కాపురంబు చేరి కడగండ్లు మానుము, వి. వే.

ఏపు మీఱ మదిని నెంచి మించుచు
గుర్తు రూపపుభ్రమ లడచి
రూఢి పడక కాపురంబు చేరి కడగండ్లు
మానుము, వి. వే.

యోగాభ్యాసమువలన స్థిరముగా నుంచిన చూడ్కికి యున్నయెడల ఐహికములగు కడగండ్లు తీరిపోవును

By practicing yoga, one can overcome miseries in this world

1317
ఏరూప మెచట జూచిన నీరూపమె తానెఱింగిన ధారుణిలో నీశ్వరుండు తానగు వేమా!

ఏరూప మెచట జూచిన నీరూపమె
తానెఱింగిన
ధారుణిలో నీశ్వరుండు
తానగు వేమా

నిశ్చల సమాధిలోనుండి ఏ రూపమును చూడదలిచినను దేవుడా రూపముననే ప్రత్యక్షమగుచుండును . ఇట్లీశ్వర స్వరూపము చూచుటయే భగవత్సాక్షారము

While staying in unwavering samaadhi (deep meditative state), one can see the god in any form one wishes. Such vision is the deification of god.

1318
ఏరూపున నారూపము లోరూపున జూచుచుండ లోకారాధ్యు౦డేరూపు జూచువారికి నారూపయి కానిపించు నభవుడు వేమా!

ఏరూపున నారూపము లోరూపున
జూచుచుండ లోకారాధ్యు౦డేరూపు
జూచువారికి నారూపయి
కానిపించు నభవుడు వేమా

“దేవు డిట్టి రూపము కలవాడని " మనస్సులో అనుకొంటిమేని లోకపూజ్యుడగు ఆ యీశ్వరుడు స్మరణానురూపమగు ఆకారముతో భక్తులకు కానవచ్చును

God will appear in the form a devotee wishes for in the mind during meditation

1319
ఒకటిరెంట మూట యోగీంద్రులను గూడి యుదయ పర్వతంబు మొదలి గిరుల క్రమ మెఱింగి కాంచు గాన పట్టణంబుల వీరుడొక్కడేలు వినురవేమ

ఒకటిరెంట మూట యోగీంద్రులను గూడి
యుదయ పర్వతంబు మొదలి గిరుల
క్రమ మెఱింగి కాంచు గాన పట్టణంబుల
వీరుడొక్కడేలు వినురవేమ

జాగ్రత్ స్వప్న సుషుప్తులను మూడవస్థలయందును యోగీశ్వరుల సన్నిధిని చేరి క్రమముగా ఉపాసన చేయువారు విశ్వ ప్రపంచమును పాలించు భగవంతుని చూడగలుగుదురు

One who meditates in all 3 avasthas (jaagrit-wakeful, swapna-dream, sushupta-deep-sleep) under the tutelage of proper yogis, can see the god, the ruler of the world

1320
ఏరూపు మదినగోరిన నారూపే తోచు భ్రమలనౌ గాదనమింధారాళముగను బ్రహ్మము కోరికలను మించి చూడగుదురును వేమా!

ఏరూపు మదినగోరిన నారూపే తోచు
భ్రమలనౌ గాదనమింధారాళముగను
బ్రహ్మము కోరికలను
మించి చూడగుదురును వేమా

మనస్సును ఇచ్చవచ్చినట్లు పోనిచ్చినచో అది ఎన్నో భ్రమలను కలుగజేయును . కోరికల నణచుకొని ప్రవర్తించినయెడల సాధకునకు బ్రహ్మము సాక్షాత్కరించును

When one does not control his mind it will lead to delusion. Brahmam will deify when desires are suppressed.

1321
ఒక్క ఘటములోన బెక్కు రూపులు నిల్చు నెన్ని యెన్ని రూపు లెసగుచుండు నవియుదొలగెనేని అన్నియు బైకొను నాత్మతత్త్వమిట్లులౌర వేమ!

ఒక్క ఘటములోన బెక్కు రూపులు నిల్చు
నెన్ని యెన్ని రూపు లెసగుచుండు
నవియుదొలగెనేని అన్నియు బైకొను
నాత్మతత్త్వమిట్లులౌర వేమ

కుండలో నీరున్నచో ఆ నీటిలో అనేక వస్తువులు ప్రతిబింబములు కన్పడును . నీటిని తీసివేసిన యెడల ఏమియు కానరావు . అట్లే జీవుడొక్కడే పెక్కు శరీరములు ధరించి కన్పడుచున్నాడు . దేహసంబంధము లేనిచో జీవుడు దేవునిలో ఐక్యమగును

One can see reflections from the water held in a pot. If water is removed there are no more reflections. Similarly a jeeva is born in many bodies. Without a bondage with his body, a jeeva will merge with god.

1322
ఒంటికంబమందు నొనరజూచెడు జ్ఞప్తి కూడి యాడి పాడి కోర్కెదీర మేడ దాటి చూడ మితిమీఱుచుండురా , వి. వే.

ఒంటికంబమందు నొనరజూచెడు జ్ఞప్తి
కూడి యాడి పాడి కోర్కెదీర
మేడ దాటి చూడ మితిమీఱుచుండురా,
వి. వే.

అద్వైత స్వరూపుడగు బ్రహ్మమును తెలిసికొని, ఆ పరమాత్మను మనసార కొనియాడి ఉత్తమమైన వేదాంత జ్ఞానమును సంపాదించుకొలది , ఆ పరబ్రహ్మ వైభవములు మితిమీరి కానవచ్చును . పరబ్రహ్మలీలలు ఆధ్యాత్యవిద్య కతీతములై యుండును

One can visualize the glory of brahmam by realizing that he is non-dualistic and by reading vedas. The miracles of brahmam rise above spiritual knowledge.

1323
కడక నింద్రియముల గట్టివేయగలేక చావు వచ్చనప్పుడు సన్న్యసించు నాత్మ జితముగామి నందునా మోక్షము? వి. వే.

కడక నింద్రియముల గట్టివేయగలేక
చావు వచ్చనప్పుడు సన్న్యసించు
నాత్మ జితముగామి
నందునా మోక్షము? వి. వే.

ఆవివేకులు కొందరు ఇంద్రియములను లొంగదీసికొనలేక మరణించుటకు కొంచెము ముందు సన్న్యాసమును స్వీకరి౦తురు . ఇంద్రియములను జయింపలేనివానికి మోక్షములేదు

Foolish people unable to control their 5 senses, seek renunciation just before death. There is no salvation to one who cannot control his senses.

1324
కడుపులోని మనము కష్టమైయుండగా నన్నమేమి కీడొ యనుచుదలచి యుపమెఱుగక మనుజు లుపవాసముందురు , వి. వే.

కడుపులోని మనము కష్టమైయుండగా
నన్నమేమి కీడొ యనుచుదలచి
యుపమెఱుగక మనుజు లుపవాసముందురు,
వి. వే.

ఇవ గలిగించు మలము శరీరములో ఉన్నను సహించి , జనులు పరిశుద్ధతకయి ఉపవాసముందురు . అన్నము చేసిన పాపమేమో తెలియకున్నది . ఉపవాసము చేయువారు జ్ఞానశూన్యులని చెప్పవలెను

Men fast for purity despite having toxins in their bodies. Those who fast are ignorant.

1325
అక్షరపుట మిట్టి యరదంబులో గూర్చి యమర నొక్కరవము ననుభవించు నతని కొఱకు ముక్తి యక్షయమైయుండు , వి. వే.

అక్షరపుట మిట్టి యరదంబులో
గూర్చి యమర నొక్కరవము ననుభవించు
నతని కొఱకు ముక్తి
యక్షయమైయుండు , వి. వే.

బీజాక్షర సమూహామను రథమున హృదయమును స్థిరముగా నుంచి సమాధిలో ఉన్నచో ఓంకారధ్వని గంభీరముగా వినవచ్చును . దానిని వినువారికి ముక్తి కలుగును

By fixing the mind in a chariot called beeja-akshara and entering samaadhi (deep meditative state), one can hear “aum”. Such people attain salvation.

1326
ఆత్మతేజ మూని యనుభవించుట ముక్తి ఆత్మ తత్త్వ మెఱుగునతడె యోగి ఎఱిగి మఱగినంత నేకమై తోచురా , వి. వే.

ఆత్మతేజ మూని యనుభవించుట
ముక్తి ఆత్మ తత్త్వ మెఱుగునతడె
యోగి ఎఱిగి మఱగినంత
నేకమై తోచురా , వి. వే.

ఆత్మరూపము పొంది సౌఖ్యమనుభవించుటయే ముక్తి . దానిని పొందిన యోగికి అంతయు ఈశ్వర రూపమున కన్పడును

Salvation is knowing about aatma and enjoying bliss from such knowledge. Such a yogi will see Iswara in all places.

1327
ఆత్మయందె తలపు ననువుగా నొనరించి నిశ్చలముగ దృష్టి నిలిపెనేని అతడు నీవెసుమ్మి యనుమాన మేలరా , వి. వే.

ఆత్మయందె తలపు ననువుగా నొనరించి
నిశ్చలముగ దృష్టి నిలిపెనేని
అతడు నీవెసుమ్మి
యనుమాన మేలరా , వి. వే.

మనస్సున ఆత్మయందే తలపునుంచి నిశ్చలదృష్టితో చూచుచున్నయెడల ఈశ్వర స్వరూపము గోచరించును . అప్పుడు నిస్సంశయముగా నీవే యీశ్వరుడ వగుదువు

One can see the form of Iswara by meditating about aatma with an unwavering mind. Eventually one becomes Iswara with such meditation.

1328
ఆత్మలోని శివుని ననువుగా శోధించి నిశ్చలముగ భక్తి నిలిపెనేని సర్వముక్తుడగును సర్వంబు తానగు , వి. వే.

ఆత్మలోని శివుని ననువుగా శోధించి
నిశ్చలముగ భక్తి నిలిపెనేని
సర్వముక్తుడగును
సర్వంబు తానగు , వి. వే.

హృదయమును శోధించి అందున్న దేవునయెడ నిశ్చలభక్తి కలిగియున్నయెడల తాను ముక్తుడై సర్వము తానేయగును

By seeking the god residing in one's body, and with steadfast devotion one can attain salvation and manifest in everything

1329
ఆత్మనాత్మ వివేకము స్వాత్యనుగని యంత మీద స్వచ్ఛ౦ద గతిన్ ఆత్మకు లోవెలి నెగడు మహాత్ముని బొగడంగ వశమె హరునకు వేమా!

ఆత్మనాత్మ వివేకము స్వాత్యనుగని
యంత మీద స్వచ్ఛ౦ద గతిన్
ఆత్మకు లోవెలి నెగడు మహాత్ముని
బొగడంగ వశమె హరునకు వేమా

ఆత్మకు, అనాత్మకు గల సంబంధమును గుర్తించి స్వతంత్ర బుద్ధివలన పరబ్రహ్మరూపమును దర్శించుటకు యత్నింపుము . దర్శించినచో నీవే బ్రహ్మము కాగలవు

One has to realize the form of brahmam by meditating over the relationship between aatma-anaatma with an independent mind. Once the form of brahmam is seen, one becomes him.

1330
ఆదిమూల విద్య నానందభరితుడై వేదతుల్యమనుచు విడక పూని పాదుకొనిన వాడు పడయును మోక్షంబు , వి. వే.

ఆదిమూల విద్య నానందభరితుడై
వేదతుల్యమనుచు విడక పూని
పాదుకొనిన వాడు పడయును
మోక్షంబు , వి. వే.

తత్త్వవిద్యయగు వేదాంతము నెరిగి , ఆనందభరితుడై దానిని వేదతుల్యమని నమ్మి పట్టువిడవక ధ్యానించుచుండువాడు మోక్షమును పొందును

One attains salvation by learning vedas and steadfastly meditating over them with bliss.

1331
ఆదిశక్తి దొడరి యలమట చెందక ప్రాణపంచకంబు పట్టు నెఱిగి అంతరిక్షమునందు నభినుతించుట ముక్తి, వి. వే.

ఆదిశక్తి దొడరి యలమట చెందక
ప్రాణపంచకంబు పట్టు నెఱిగి
అంతరిక్షమునందు నభినుతించుట
ముక్తి, వి. వే.

భగవంతుని గూర్చిన చర్చ అసాధ్యమని అనుకొనక సర్వదా ప్రాణపంచకమును (పాన, అపాన, వ్యాన, ఉదాన, సమాన) నియమించి ఆకాశ తత్త్వరూపమగు భగవంతుని కనుగొనుటయే ముక్తి

Salvation is obtained when one realizes that discussing about god is futile and focuses on 5 pranas (paana, apaana, vyaana, udaana, samaana) to seek the god who is manifest everywhere

1332
ఆశ విడక కాని పాశముక్తుడు కాదు కాడు ముక్తుడైనగాని మృతుడు మృతుని బడయకున్న క్షితి మోహమూడదు , వి. వే.

ఆశ విడక కాని పాశముక్తుడు
కాదు కాడు ముక్తుడైనగాని
మృతుడు మృతుని బడయకున్న క్షితి
మోహమూడదు , వి. వే.

ఆశను విడిచిననేకాని నరుడు ముక్తి పొందలేడు . ఆశ విడిచిననేకాని విషయములనుండి మనస్సు మళ్ళదు . మరణించిననేగాని ఆశవలని మోహము విడువదు

One cannot attain salvation without renouncing greed. Without such renunciation mind cannot be freed from worldly matters and lust.

1333
ఉత్తమా౦శబూనియు మహిలో జేరి మత్తుమించినట్లు మరగిరాక సత్తమంబు మీటి సాధింప ముక్తిరా , వి. వే.

ఉత్తమా౦శబూనియు మహిలో జేరి
మత్తుమించినట్లు మరగిరాక
సత్తమంబు మీటి సాధింప
ముక్తిరా , వి. వే.

దైవాంశయున్నను మానవులు భూమిపై పుట్టుటచే అజ్ఞులై మత్తులై యుందురేకాని , అజ్ఞానకారణమైన తమోగుణమును విడువలేరు . తమోగుణము లేకున్ననే ముక్తి లభించును

Even though there is god's grace, men are ignorant and indolent for having been born on earth. Salvation is possible only when one overcomes the ignorance of indolence.

1334
ఉదకము లోపలి తత్త్వము వెదికియు దానగుట తెలిసి వేగమె మదిలో నుదకమువలె దా దత్త్వము మది దెలిసిన వాడె తత్త్వమయుడౌ వేమా!

ఉదకము లోపలి తత్త్వము వెదికియు
దానగుట తెలిసి వేగమె మదిలో
నుదకమువలె దా దత్త్వము మది దెలిసిన
వాడె తత్త్వమయుడౌ వేమా

నీటిలోని నీడచూచి తానేయని తలపుగొన్నట్టు శరీరము నాశ్రయించిన జీవుడే పరమాత్ముడని ఎఱిగినవాడే మోక్షము పొందును. నీటిలోని నీడ తనన్నది భ్రమ. తానే ఈశ్వరుడన్నది తత్త్వము

Just as one realizes the reflection in water is self, one has to realize that the jeeva residing in the body is same as paramaatma to attain salvation. The reflection is illusion. But the realization that one is same as Iswara is tattva

1335
ఉన్న నిర్వాణ నిజచర్యగన్నవాడు తన్ను తనలోన జూచెడి తత్త్వమెఱిగి సన్నుతించును పరమాత్మ సమత మతిని గన్ను గాననివాడేమి గాంచు వేమ?

ఉన్న నిర్వాణ నిజచర్యగన్నవాడు తన్ను
తనలోన జూచెడి తత్త్వమెఱిగి
సన్నుతించును పరమాత్మ సమత మతిని
గన్ను గాననివాడేమి గాంచు వేమ

ఆత్మరూపమును హృదయమందు కనుగొని ధ్యానించుటయే పరమాత్మ సమ్మతమగు మార్గము . అజ్ఞానమున అంధుడైన వాడు దీనిని కనుగొనలేడు

The God approved path is to meditate over the form of aatma in the mind. One who is blind with ignorance cannot realize this.

1336
ఎచట జూడ్మి నిలిపి యెంతగ జూచిన నచట దోచు కళల నందరాదు అచలమైన వ్యక్తి నందుట మోంబు , వి. వే.

ఎచట జూడ్మి నిలిపి యెంతగ
జూచిన నచట దోచు కళల నందరాదు
అచలమైన వ్యక్తి
నందుట మోంబు , వి. వే.

నిశ్చలమైన ధ్యానమున నిలుకడతో కాంచినచో కళలు గోచరించును . అవి యనుభవమునకు వచ్చిన పిమ్మట ఈశ్వర సాక్షాత్కారము కలుగును

One can experience kalas by meditating with an unwavering mind. Once they are experienced, the deification of Iswara is possible.

1337
ఎన్ని తనువులైన మృతికి నడ్డముగావు మృతిని గెలువలేక యెఱుకలేక దొంగరీతికాగ దొరకునా మోక్షంబు? వి. వే.

ఎన్ని తనువులైన మృతికి నడ్డముగావు
మృతిని గెలువలేక
యెఱుకలేక దొంగరీతికాగ దొరకునా
మోక్షంబు? వి. వే.

ఎన్ని జన్మము లెత్తినను , అవి మృత్యువును జయింపలేవు . మృత్యువును జయింపలేక దొంగవలె లొంగిపోయినవానికి మోక్షము లభింపదు

One cannot escape death no matter how many times he is born. The one who yields to death will not attain salvation.

1338
ఏకబ్రహ్మము నిత్యము వైకృతములన౦గ దగిన వస్తువు లెల్లన్ ఏకత్వంబని యెఱింగిన శోకము లేనట్టి ముక్తి సులభము వేమా!

ఏకబ్రహ్మము నిత్యము వైకృతములన౦గ
దగిన వస్తువు లెల్లన్
ఏకత్వంబని యెఱింగిన శోకము లేనట్టి
ముక్తి సులభము వేమా

బ్రహ్మ మొక్కటే నిత్యమైనది . వికృతి స్వభావము గల వస్తువులన్నియు బ్రహ్మమయములని యెరుగుటచే విచారములేని ముక్తి సులభముగా లభించును

Brahmam is the only reality. The knowledge that brahmam has manifested in all things will lead to salvation.

1339
ఏకమునను జూడ నెఱుక యేక౦బౌను భువిని సతిని గూడు పురుషుమాడ్కి లోకకాంతునట్టు లోపల వెలుగును, వి. వే

ఏకమునను జూడ నెఱుక యేక౦బౌను
భువిని సతిని గూడు పురుషుమాడ్కి
లోకకాంతునట్టు
లోపల వెలుగును, వి. వే

ఐక్యబుద్ధితో చూచినయెడల దాంపత్యమువలె బ్రహ్మము ప్రపంచముతో నైక్యము పొందియున్నట్లు స్పష్టమగును

When seen with a non-dualistic mind, brahma is manifest in all things like in marriage two persons are united.

1340
ఏమి చదివి యేమి? యెఱుకలేకుండిన చదువులందు బరమసౌఖ్యమేది ? మానసైక్యముననె మఱిముక్తి కలుగురా , వి. వే.

ఏమి చదివి యేమి? యెఱుకలేకుండిన
చదువులందు బరమసౌఖ్యమేది?
మానసైక్యముననె మఱిముక్తి
కలుగురా , వి. వే.

ఎన్ని చదువులు చదివినను , పరమ సౌఖ్యపదమగు జ్ఞానము నీయని చదువు వ్యర్థము . మనస్సును బ్రహ్మముతో ఐక్యమును పొందించు విద్యయే విద్య. అదే ముక్తినిచ్చును

The education without spiritual knowledge is useless. The real education teaches how to merge with brahmam. It will only lead to salvation.

1341
ఒకటి లోనగొట్టి యొకటి లోననెపెట్టి మొకటి లోనచూడు మొకటె చూపు ఒకటియందె చూడ నొనరంగ ముక్తిరా , వి. వే.

ఒకటి లోనగొట్టి యొకటి లోననెపెట్టి
మొకటి లోనచూడు మొకటె
చూపు ఒకటియందె చూడ నొనరంగ
ముక్తిరా , వి. వే.

అజ్ఞానమును మనస్సుననే పోగొట్టి జ్ఞానమునందు లీనముచేసి నిర్మలదృష్టితో చూచినయెడల కళలగుపడును . పిదప బ్రహ్మస్వరూపము గోచరించును

When one over-comes ignorance and observes the world with clear mind, the kala's will be visible along with the form of brahmam.

1342
కలుషమెన్ను కొనగ గౌరవహానియే నరయ దత్త్వమెన్న నాత్మఘటిక తెలిసి తాను పిదప స్థిరుడు కావలెనయా , వి. వే.

కలుషమెన్ను కొనగ గౌరవహానియే
నరయ దత్త్వమెన్న నాత్మఘటిక
తెలిసి తాను పిదప స్థిరుడు
కావలెనయా , వి. వే.

పాపమెన్నిన గౌరవహానియేకాని ఫలములేదు . తత్త్వమెన్నుకొని శాశ్వతుడగుటకు యత్నింపవలెను . దాని నెరిగినచో స్థిరుడగు విజ్ఞాని కావచ్చును

When one elects sinful path, it leads to loss of honor. So one has to choose the path of tattva and strive to become immortal.

1343
కష్టమైన మనసు కాంక్షించు యోగికి జ్ఞానదీప శిఖయు దానటింప గానవచ్చు నాత్మ క్రమమైన జ్ఞప్తితో , వి. వే.

కష్టమైన మనసు కాంక్షించు యోగికి
జ్ఞానదీప శిఖయు దానటింప
గానవచ్చు నాత్మ క్రమమైన
జ్ఞప్తితో , వి. వే.

మనస్సును నిర్బంధమున ఉంచగల యోగికి జ్ఞానదీప వెలుగు కాన్పించును . ఆత్మస్వరూపము క్రమముగా గోచరించును

To a yogi who can make mind still, the light of knowledge will be visible. Gradually the form of aatma will be discernible.

1344
కష్టమైన మలము కడుపులో నుండగ నంతకంటె జెడెనె యన్న రసము, ఉపములేని జనము లుపవాసముందురు , వి. వే.

కష్టమైన మలము కడుపులో నుండగ
నంతకంటె జెడెనె యన్న
రసము, ఉపములేని జనము లుపవాసముందురు,
వి. వే.

పాపరూపమగు మలము తమ కడుపులో నుండినను నరులు మూఢులై ఉపవాసము చేయుదురు . అన్నము తినుట తప్పుకాదు . ఉపవాసమున పరతత్త్వము తెలియదు

With toxins in the body, foolish people go on fasting. It is not a sin to eat. Fasting will not help in seeking tattva

1345
కష్టలోభివాని కలిమికి నాశి౦చి బడుగువాడు తిరిగి పరిణమించు దగరు వెంట నక్క తగిలిన చందము, వి. వే.

కష్టలోభివాని కలిమికి నాశి౦చి
బడుగువాడు తిరిగి పరిణమించు
దగరు వెంట నక్క
తగిలిన చందము, వి. వే.

పాపియగు లోభిసంపద నాశి౦చిన దరిద్రుడు నక్క నిరుపయోగముగ గొర్రె వెంట తిరుగునట్లు తిరుగుచుండును

A pauper seeking the wealth of a sinful covetous person, is like a fox following a goat.

1346
కాయగాయ గాల్చి కనకము జూడరా కాయమనగ బ్రహ్మకాయమండ్రు కాయదెలియు నతడె కౌస్తుభధరుడగు , వి. వే.

కాయగాయ గాల్చి కనకము జూడరా
కాయమనగ బ్రహ్మకాయమండ్రు
కాయదెలియు నతడె కౌస్తుభధరుడగు,
వి. వే.

సంసార వృక్ష ఫలములను నశింపజేసి గొప్ప తేజస్సును చూడవలెను . ఇట్లు బ్రహ్మ స్వరూపమును దర్శించువాడు సాక్షాత్తు విష్ణువనియే చెప్పవలెను

By destroying the fruits of bondage one has to visualize the great resplendence of brahmam. The one who sees the brahmam is indeed Lord Vishnu's incarnation.

1347
కాయమున గడగియు గనక యావలనున్న కాయమును విడిచినగాడు యోగి కాయమందు ముక్తిగతి కేగవలయురా , వి. వే.

కాయమున గడగియు గనక యావలనున్న
కాయమును విడిచినగాడు
యోగి కాయమందు ముక్తిగతి
కేగవలయురా , వి. వే.

శరీరమును శోధించి తనలోనున్న ఆత్మస్వరూపమును చూడక దేహమును విడిచినవాడు యోగి కానేరడు . శరీరమున్నపుడే ముక్తికి యత్నింపవలెను

One is not a yogi who has not researched his body to discover the aatma before meeting with death. One has to try for salvation while the body is still alive.

1348
కాయధర్మ మెఱిగి కపట వృత్తులు మాని ఆలుబిడ్డలందు నాశ వదలి మేలుగాను శివుని మేల్కొని చూడరా, వి. వే.

కాయధర్మ మెఱిగి కపట వృత్తులు
మాని ఆలుబిడ్డలందు నాశ
వదలి మేలుగాను శివుని మేల్కొని
చూడరా, వి. వే.

కాలస్వభావమును కనిపెట్టి కపట మోహములు విడిచి ఆలుబిడ్డలపై ఆశను విడిచి జ్ఞానియైనచో పరముని చూడవచ్చును

By keeping an eye on the world, overcoming deceitful ways, giving up hope on family, one becomes wise and can see the nether world.

1349
కాశియాత్ర జేసి గాసిపడుటె కాని మోసమగును గాన ముక్తిలేదు పాశముడుగబూను ఫలమెయాకాశిరా , వి. వే.

కాశియాత్ర జేసి గాసిపడుటె
కాని మోసమగును గాన ముక్తిలేదు
పాశముడుగబూను ఫలమెయాకాశిరా,
వి. వే.

కాశి మున్నగు చోట్లకు యాత్రకుపోవుట శ్రమయే గాని ఫలము లేదు. ముక్తి కలుగుననుట భ్రాంతి. ఆశాపాశమునకు కట్టువడని వాడే ముక్తిని పొందును

Going on a pilgrimage to holy places like Kaasi is stressful but won't result in salvation. The one who does not seek anything attains salvation.

1350
కూడి పరవశంపు కోర్కెలు లేకుండ నాటవలెను బుద్ధి నయముగాను చోటు గనని వెలుగు జొచ్చుటే మోక్షము , వి. వే.

కూడి పరవశంపు కోర్కెలు లేకుండ
నాటవలెను బుద్ధి నయముగాను
చోటు గనని వెలుగు జొచ్చుటే
మోక్షము , వి. వే.

లేనిపోని కోరికలు లేకుండా మనస్సును లోబరుచుకొని దానిని దేవునిపైనే నిలిపి, ఆత్మతేజస్సులో కలసిపోవుటయే మోక్షము

When one without desires controls his mind and focuses on god, he will merge with the resplendence of aatma. This is the way to attain salvation.

1351
కోటులు సంపాదించిన గూటికె సరిపోయె బ్రతుకు గుంపులు కూలెన్ నీ సంసారము చోటున నిను గన్న నాడె సుదినము వేమా!

కోటులు సంపాదించిన గూటికె సరిపోయె
బ్రతుకు గుంపులు కూలెన్
నీ సంసారము చోటున నిను
గన్న నాడె సుదినము వేమా

కోట్లకొలది ధనము సంపాదించినను అది తిండికే సరిపోవును . అందరికి చావు తప్పదు . ఈ సంసారమేల ?భగవంతుని రూపము చూచిన దినమే సుదినము

Earning millions is only good for eating food. Everyone has to die. So why bondage? The day one sees God is the holy day.

1352
కోపమునను నరక కూపము జెందును కోపమునను గుణము కొఱతపడును కోపమునను బ్రతుకు కొంచమై పోవును, వి. వే.

కోపమునను నరక కూపము జెందును
కోపమునను గుణము కొఱతపడును
కోపమునను బ్రతుకు
కొంచమై పోవును, వి. వే.

కోపమువల్ల నరకము ప్రాప్తించును . మేలి గుణములు నశించును . కోపమువల్ల బ్రతుకు క్షీణించును . కాన కోప మెంతమాత్రము తగదు

One ends up in hell with anger. Good qualities are destroyed by anger and life will become weak. Hence anger should be given up.

1353
గంగా యమునల నడుమను బంగారపు బొమ్మఓలె బాలిక యుండున్ సంగతిగ జెలిమి చేసిన భంగము లేకుండ ముక్తి పరమగు వేమా!

గంగా యమునల నడుమను బంగారపు
బొమ్మఓలె బాలిక యుండున్ సంగతిగ
జెలిమి చేసిన భంగము
లేకుండ ముక్తి పరమగు వేమా

ఇడ, పింగళ అను నాడుల మధ్య కుండలినీ శక్తి ప్రకాశించుచుండును . యోగాభ్యాసమూలమున లోబరచుకొన్నయెడల ముక్తిని పొందవచ్చును

Kundalini resides between ida and pingali nerves. When one controls it with yoga practice, salvation is possible.

1354
గంగాధరుడె దైవము సంగీతమె చెవులకింపు సర్వజ్ఞులకున్ బంగారమె ఉపభోగం బంగజుడే మృత్యుహేతు వరయగ వేమా!

గంగాధరుడె దైవము సంగీతమె
చెవులకింపు సర్వజ్ఞులకున్
బంగారమె ఉపభోగం బంగజుడే
మృత్యుహేతు వరయగ వేమా

మహేశ్వరుడే దైవము . చెవులకు ఇంపును గల్గి౦చునది సంగీతము మాత్రమే . బంగారమే భోగముల నిచ్చును . మన్మథుడే మృత్యువునకు కారణము . సర్వజ్ఞులు దీని నెరుగుదురు

Lord Siva is the god. Only music can regale the ears. Gold alone gives wealth. Cupid Manmatha is responsible for death.

1355
గమ్యమగు జ్ఞానమందుట గగనవిద్య జ్ఞానముదయించి మించ బ్రజ్ఞాన మమరు బరగు ప్రజ్ఞానమందుటే బ్రహ్మపదవి పరమశివుడగునది యంద ధరను వేమా!

గమ్యమగు జ్ఞానమందుట గగనవిద్య జ్ఞానముదయించి
మించ బ్రజ్ఞాన మమరు
బరగు ప్రజ్ఞానమందుటే బ్రహ్మపదవి
పరమశివుడగునది యంద ధరను వేమా

గమ్యమైన జ్ఞానమొందుటయే విద్య . దానివలన ప్రజ్ఞానమున పొందుట బ్రహ్మపదవి . దానిని పొందినచో భగవదైక్యమును పొందవచ్చును

Gaining knowledge with purpose is the real education. The attainment of brahmam is because of such knowledge. If one succeeds, it will be possible to merge with god.

1356
గీము విడిచిపెట్టి గిక్కురు మనకుండ జీవముడుగు వేళ శివుని దలచు మనసు గొల్పకయును మాయచేబొరలెడు పాపజనుల కెచటి పరము వేమ?

గీము విడిచిపెట్టి గిక్కురు మనకుండ
జీవముడుగు వేళ శివుని దలచు
మనసు గొల్పకయును మాయచేబొరలెడు
పాపజనుల కెచటి పరము వేమ

బ్రతికి యున్నంతకాలము ఇచ్ఛవచ్చినట్లు తిరిగి , చివరికాలమందైనను దైవమును తలపక మాయలో పడియుండు పాపాత్ములకు ముక్తి యెట్లు కలుగును?

How can a sinner who has led a life of free will without thinking about god even in old age and living under delusion, attain salvation?

1357
చిత్రదీపమువలె జింతను దిగద్రొక్కి మిత్రముగను మనసు మెలకు వెఱిగి శత్రుగుణములెల్ల సాధించుటయే ముక్తి, వి. వే.

చిత్రదీపమువలె జింతను దిగద్రొక్కి
మిత్రముగను మనసు మెలకు
వెఱిగి శత్రుగుణములెల్ల సాధించుటయే
ముక్తి, వి. వే.

దీపము చీకటిని పోగొట్టు రీతిని జ్ఞానముచే అజ్ఞానమును నశింపజేసి, మనస్సును మిత్రునివలె సహాయము చేసికొని కామక్రోధాది శత్రువులను జయించుటయే ముక్తి

Like light dispels darkness, one has to destroy ignorance with knowledge and make his mind a friend to overcome lust and anger. This is the way for salvation.

1358
చక్కగాను మదిని చర్చించి కనవలె ముక్కు తుదను మించి మురిపెముగను దృక్కు బ్రహ్మమనుచు మ్రొక్కినంతనె ముక్తి, వి. వే.

చక్కగాను మదిని చర్చించి కనవలె
ముక్కు తుదను మించి మురిపెముగను
దృక్కు బ్రహ్మమనుచు మ్రొక్కినంతనె
ముక్తి, వి. వే.

మనస్సును బాగుగా విమర్శించి , నాసాగ్రమున దృష్టినిలిపి, ఆ దృక్కే బ్రహ్మమని భావించి ఆనందించుటయే ముక్తి

One who can analyze his mind, focus his vision at the tip of the nose, and realize the seer is the brahmam, can attain salvation.

1359
చందమామ నీడ జక్కగా దనలోని నుండజూచి కేలసూదిపట్టి వెన్నెల బయలందు వెదకినంతనె ముక్తి, వి. వే.

చందమామ నీడ జక్కగా దనలోని
నుండజూచి కేలసూదిపట్టి
వెన్నెల బయలందు వెదకినంతనె
ముక్తి, వి. వే.

చంద్రుని ప్రతిబింబమును హృదయమున ప్రతిఫలింపజేసికొని వెదకిన ముక్తి వెన్నెల బయలునుండి లభ్యమగును

When one reflects on the moon in one's mind, it is possible to attain salvation from the resplendence of moonlight.

1360
చదువులందులేదు శాస్త్రంబులను లేదు వేదములను లేదు వాదములను బయలునందు ముక్తి పాటించి చూడరా, వి. వే.

చదువులందులేదు శాస్త్రంబులను
లేదు వేదములను లేదు వాదములను
బయలునందు ముక్తి
పాటించి చూడరా, వి. వే.

ముక్తి చదువులోగాని , శాస్త్రములలోగాని , వేదములోగాని , వాదములలోగాని లేదు. బ్రహ్మమునందే కలదు. దానిని కనినచో ముక్తి కలుగును

There is no salvation in education, scripture, vedas or debates. It is available in brahmam only. If one can see brahmam, salvation is possible.

1361
జీవనమునకునాత్మ స్థిరతముగానక తిరుగునస్థిరమును గుఱిగ నమ్మి స్థిరము నస్థిరమును దెలియ జీవికి ముక్తి, వి. వే.

జీవనమునకునాత్మ స్థిరతముగానక
తిరుగునస్థిరమును గుఱిగ నమ్మి
స్థిరము నస్థిరమును దెలియ
జీవికి ముక్తి, వి. వే.

మూఢుడు తన దేహమునందుండు ఆత్మ స్థిరమైనదని తెలియక అస్థిర వస్తువులను ఈశ్వరబుద్ధితో నమ్ముచుండును . స్థిరాస్థిర వస్తు వివేకమువల్లనే జీవికి ముక్తి లభించును

A foolish person without realizing that the aatma in his body is permanent, believes in impermanent things with a mind focused on Iswara. Salvation is possible only when one can discriminate between permanent and impermanent objects.

1362
జీవాధారుడు రుద్రుడు దేవార్చన పరుడు నగుచు స్థిరమతి వెలుగున్ భావాతీతపరంబుగ గావించుము మనసు బయలు ఘనముగ వేమా!

జీవాధారుడు రుద్రుడు దేవార్చన
పరుడు నగుచు స్థిరమతి వెలుగున్
భావాతీతపరంబుగ గావించుము
మనసు బయలు ఘనముగ వేమా

సర్వదేవతలకు మూలమగు ఈశ్వరుడు స్థిరమతిని సర్వదా వెలుగుచునే యుండును . అట్టి ఈశ్వరుని సేవించి ముక్తుడవగుటకు భావాతీతుడవై హృదయము బయలు గావింపుము

The lord of all devas, Iswara, is always resplendent with a still mind. One has to try to serve Iswara and search for him in mind without prejudice to attain salvation

1363
జీవుని దెలియకయె వేఱుగ దేవుని భ్రమ దిరుగుచుండు , దేవుడు తలపన్ జీవుడని వివరించిన భావింపగ ముక్తి బట్టబయలగు వేమా!

జీవుని దెలియకయె వేఱుగ దేవుని
భ్రమ దిరుగుచుండు , దేవుడు
తలపన్ జీవుడని వివరించిన భావింపగ
ముక్తి బట్టబయలగు వేమా

జీవుని ప్రభావమును తెలిసికొనలేక నరుడు దేవునకై వెదకుచుండును . జీవుడు, దేవుడు ఒకటే యని తెలిసికొనుట ముక్తి.

A man will be searching for god without realizing the power of jiva. Salvation is possible when one realizes that jeeva and deva are one and the same.

1364
జీవిలోన నుండు స్థిరమును గానక తిరుగు నస్థిరమునె నరుడు నమ్మి స్థిరము నస్థిరమును దెలియ జీవికిముక్తి , వి. వే.

జీవిలోన నుండు స్థిరమును గానక
తిరుగు నస్థిరమునె నరుడు నమ్మి
స్థిరము నస్థిరమును దెలియ
జీవికిముక్తి , వి. వే.

నరుడు ప్రాణిలోని ఆత్మను గుర్తెరుగ లేక అస్థిర వస్తువులనే నమ్మి తిరుగుచుండును . ఏది స్థిరమో , ఏది అస్థిరమో తెలిసికొన్నప్పుడే జీవికి ముక్తి కలుగును

Man without realizing the aatma residing in jiva believes in impermanent things. A jiva will attain salvation when he learns the difference between permanent and impermanent things.

1365
జీవులెల్లముందు జీవాత్మ పరమాత్మ జతలెఱు౦గ బాపజలధి బడరు నావ నడుపువాడు నట్టేట మునుగునా? , వి. వే.

జీవులెల్లముందు జీవాత్మ పరమాత్మ
జతలెఱు౦గ బాపజలధి
బడరు నావ నడుపువాడు నట్టేట
మునుగునా? , వి. వే.

జీవులు జీవాత్మ పరమాత్మల భేదమును ముందుగనే యెరిగినచో పాపములు నశించి తరింతురు . నావ నడుపువాడు ఏటి నడుమ మునిగిపోక నదిని దాటగలడు

When one learns the differences between jiva, aatma and paramaatma, he will prosper with the sins destroyed. A person rowing a boat will cross the river without sinking in the middle.

1366
జెండా వేయగవచ్చును కొండల పెకలింపవచ్చు గుదిరిన మదిలో నిండారంగ బరిపూర్ణము జెండాడగ ముక్తిత్రోవ జెలగును వేమా!

జెండా వేయగవచ్చును కొండల పెకలింపవచ్చు
గుదిరిన మదిలో నిండారంగ
బరిపూర్ణము జెండాడగ
ముక్తిత్రోవ జెలగును వేమా

అజ్ఞానముతో నిండిన ఆవివేకమును చెండాడిన యెడల ముక్తి మార్గము సులభము. ఇట్లు గట్టిగా చెప్పవచ్చును . ముక్తి మార్గము నెరిగిన కొండలనైన పెకలించవచ్చును

The path to salvation is easier when ignorance is overcome. One can move mountains by knowing the path to salvation.

1367
జ్ఞానికి కర్మబేటికి జ్ఞానికి గర్మ౦బు కలుగజాలదు చూడన్ జ్ఞానమె కర్మంబైనను మానవలకు గర్మముక్తి మహిలో వేమా!

జ్ఞానికి కర్మబేటికి జ్ఞానికి
గర్మ౦బు కలుగజాలదు చూడన్
జ్ఞానమె కర్మంబైనను మానవలకు
గర్మముక్తి మహిలో వేమా

జ్ఞానికి కర్మ మక్కరలేదు . జ్ఞాని కర్మము చేయడు . అతనికి జ్ఞానమే కర్మము. అతడు కర్మము లేకున్ననే ముక్తి పొందును

A learned person need not perform karma. His karma is his knowledge. He will attain salvation without performing karma

1368
తనదు దేహమందు దనకున్న పరివార మందఱిని బిగించి హర్షమెసగ నెల్లచావు లెఱిగి యిందందు యోజించి నడవ మేటి వర్తనముర వేమ!

తనదు దేహమందు దనకున్న పరివార
మందఱిని బిగించి హర్షమెసగ నెల్లచావు
లెఱిగి యిందందు యోజించి
నడవ మేటి వర్తనముర వేమ

దేహములోని యింద్రియములను బిగియగట్టి , ధ్యానము జేసి పరమాత్మను వెదకుటయే ఉత్తమ ప్రవర్తనమును , బ్రహ్మప్రాప్తికై సాధనమును అగును

Seeking paramaatma by controlling senses and meditating is the best way to attain brahmam

1369
తను దానై బయలందుచు ననుమనము లేక తానె యచలు౦డగుచున్ వినయవిధేయత లొందిన మనమే యానందరూప మయమగు వేమా!

తను దానై బయలందుచు ననుమనము
లేక తానె యచలు౦డగుచున్
వినయవిధేయత లొందిన మనమే
యానందరూప మయమగు వేమా

సందేహము లేక జీవుడే బ్రహ్మమగుచు స్థిరుడై సాధన చేసి మనస్సును ఆనందమయా మొనర్చుకొనుటయే మేలు

It is better to remain doubtless that jiva is the brahmam and make one's mind blissful with such knowledge.

1370
తఱచు దమము పాసి తనువులు మఱచియు బరమునందు మనసు బయలుపఱచి కదియనున్న యట్టి ఘనులెందఱున్నారో , వి. వే.

తఱచు దమము పాసి తనువులు మఱచియు
బరమునందు మనసు బయలుపఱచి
కదియనున్న యట్టి ఘనులెందఱున్నారో,
వి. వే.

అజ్ఞానము విడిచి, శరీరములు మరచి , మనస్సును పరమాత్మయందే లగ్నము చేసి , ఆనంద మనుభవించువారు కొలదిగానే ఉందురు

The men who overcome ignorance, forget their bodies, focus their minds on paramaatma and enjoy bliss are far and few.

1371
తలచిన దత్త్వ౦బుగునే తలపక తానూఱకున్న దత్త్వంబగునే తలచుట తలపమి రెండును తలపక తా నుండెనేని తత్త్వము వేమా!

తలచిన దత్త్వ౦బుగునే తలపక తానూఱకున్న
దత్త్వంబగునే తలచుట
తలపమి రెండును తలపక తా
నుండెనేని తత్త్వము వేమా

మననము చేయుటయు , చేయకుండుటయు తత్త్వము కాదు. వాని ప్రసక్తిలేక స్థైర్యము కలిగియుండుటే తత్త్వము.

Repeating mantra or not is not applicable to tattva. Tattva is remaining bold without such encumbrances

1372
తా ననగ నెన్నడయ్యెనో యేనన నెవ్వ౦డు గలడౌ యెఱుకగుదానిన్ దానని మనమున నెఱుగక పూనెడు జీవు౦డు జడుడు బొంకరి వేమా!

తా ననగ నెన్నడయ్యెనో యేనన నెవ్వ౦డు
గలడౌ యెఱుకగుదానిన్
దానని మనమున నెఱుగక పూనెడు
జీవు౦డు జడుడు బొంకరి వేమా

పరుడెప్పు డేర్పడెనో , జీవుడెప్పుడు వేరయ్యెనో , ఎపుడు పరునిలో కలియునో తెలిసికొని దైవమును ధ్యానించి వాడు ఉత్తముడు. ఇతరుడు జడుడు, బొంకులాడు నగును

A person is of good character who contemplates on when paramaatma was born, when jiva got separated from paramaatma, when jiva will reunite with paramaatma and constantly meditates on the god. Asking others for answers can result in falsity.

1373
తాను సకలమౌట దనలోని సకలంబు తనదులోని వెలుగు దానె యెఱిగి యున్న మానవునకు నొనరును ముక్తిరా, వి. వే.

తాను సకలమౌట దనలోని సకలంబు
తనదులోని వెలుగు దానె
యెఱిగి యున్న మానవునకు నొనరును
ముక్తిరా, వి. వే.

తానే సర్వమని, సమస్త వస్తువులలో వెలుగును తానేయని తెలిసికొను మానవునకే ముక్తి కలుగును

A man who knows he is everything and the resplendence in all objects is his can attain salvation

1374
తాను సంకల్ప రూపుడై తమకమందు తాను సంకల్ప రహితుడై తగులు ముక్తి ముక్తియన జిత్తశూన్యంబు మోక్షమదియ దీని నిక్కంబుగను వాడె మౌని వేమ!

తాను సంకల్ప రూపుడై తమకమందు తాను
సంకల్ప రహితుడై తగులు ముక్తి ముక్తియన
జిత్తశూన్యంబు మోక్షమదియ
దీని నిక్కంబుగను వాడె మౌని వేమ

తమకముతో తాను వేరు చింతనలు లేకయుండవలెను . అట్టి నిర్మల మనస్సుతో భగవద్ధ్యానము చేయుటయే ముక్తి. అది శూన్య భావమున నుండుటయే , దీని తత్త్వమును తెలిసినవాడే యోగి.

One has to be eager without worries. Performing meditation on god with a pure heart is the path to salvation. It is like remaining without expectations. Such knowledge is known to yogi.

1375
ధ్వని పుట్టిన నాలించుచు ధ్వని మధ్యము నందుజేరి ధ్వని తానై తా గనిపించున౦త దన హ్రుద్వనజంబున జూడ ముక్తి వశమగు వేమా!

ధ్వని పుట్టిన నాలించుచు ధ్వని
మధ్యము నందుజేరి ధ్వని తానై
తా గనిపించున౦త దన హ్రుద్వనజంబున
జూడ ముక్తి వశమగు వేమా

నిర్వికల్ప సమాధిలో ఉన్నప్పుడు గొప్ప నాదము పుట్టి, దాని మధ్య నుండి ధ్వని స్వరూపుడగు బ్రహ్మము కానవచ్చును. ఆ బ్రహ్మమును చూచుటయే ముక్తి

In an undisturbed samaadhi (deep meditative state), a great naada (aum) will emanate from which the brahmam in the form of sound will appear. Salvation is viewing such brahmam.

1376
నాకు నెవరు దిక్కు నదినాళములలోను వేగుజుక్కవంటి వెలుగు దిక్కు వెలుగుకంటె దిక్కు వెలయంగ లేదయా, వి. వే.

నాకు నెవరు దిక్కు నదినాళములలోను
వేగుజుక్కవంటి వెలుగు
దిక్కు వెలుగుకంటె దిక్కు
వెలయంగ లేదయా, వి. వే.

సుషుమ్నా నాడికి నడుమ నున్న తేజస్సే నాకు దిక్కు . వేరే దిక్కు లేదు . వేగుచుక్కవంటి ఆ తేజస్సే నన్ను తరింపజేయును . దానికి సాటియగు తేజస్సు లేదు

The resplendence in the sushumna nerve is the only recourse. It is like the morning star that uplifts one. No other resplendence can match it.

1377
నాదు నాదు చూడ నాతుల యందు౦డు నాదు లేనియట్టి నరులె వేరు భేదముడిగి దీని బ్రియపడి కనరయ్య, వి. వే.

నాదు నాదు చూడ నాతుల యందు౦డు
నాదు లేనియట్టి నరులె
వేరు భేదముడిగి దీని బ్రియపడి
కనరయ్య, వి. వే.

స్త్రీ పురుష భేదము లేక నాదమందరియందును కలదు . భేదబుద్ధిమాని ప్రియముతో దానిని గాంచినచో ముక్తి కల్గును

naada (aum) is in everyone regardless of gender. Salvation is possible when one sees it with love and without a discriminating mind.

1378
నిజము కళల మీఱి నిత్యు౦డు కావలె బలుకులోని పలుకు పదిలపఱచి వేడుకలర ముక్తి నెన్న౦టి యుండురా , వి. వే.

నిజము కళల మీఱి నిత్యు౦డు
కావలె బలుకులోని పలుకు పదిలపఱచి
వేడుకలర ముక్తి నెన్న౦టి
యుండురా , వి. వే.

నిత్యమును యోచించి , కళలను మీరి, ధ్యానించుచు నిత్యత్వము పొందిన, వేడుకతో ముక్తి తన వెనుకనే వచ్చును

Salvation is possible when one thinks every day about it and meditates by going beyond kalas.

1379
నేననగ మేను గానని మానసమున నెఱుగకున్న మనుజులకెల్లన్ స్వానుభవ సిద్ధి దొరకదు తానగు పరమాత్మ నెఱుగ దరమా వేమా!

నేననగ మేను గానని మానసమున నెఱుగకున్న
మనుజులకెల్లన్ స్వానుభవ
సిద్ధి దొరకదు తానగు
పరమాత్మ నెఱుగ దరమా వేమా

“నేను" అనగా శరీరము కాదు , ఆత్మ. ఈ సంగతి తెలియని నరునకు స్వానుభవసిద్ధి కల్గి , తానే పరమాత్మ అనుట తెలియదు

The reference to self does not mean body but aatma. One who does not know this cannot see the aatma in oneself and paramaatma

1380
నేనను వచనంబు నీవనగా వచ్చు నీవు నే ననబడు నిష దెలియ నేను నీవె నీవె నే ననవచ్చురా , వి. వే.

నేనను వచనంబు నీవనగా వచ్చు
నీవు నే ననబడు నిష
దెలియ నేను నీవె నీవె నే
ననవచ్చురా , వి. వే.

“అహం బ్రహ్మోస్మి" అను వాక్యార్థమును గుర్తించినచో "నేను వీవే, నీవే నేను" అను అభేద భావము మనకు కలుగును

Veda's quotation “aham brahmosmi” means “thou art I and I art thou” without any differences between men.

1381
నేను నీ వనియెడు నెత్తంపు మాటలు మానియుండువాడె మానవిదుడు తాను నేననియెడి తమకంబు మానరా, వి. వే.

నేను నీ వనియెడు నెత్తంపు
మాటలు మానియుండువాడె మానవిదుడు
తాను నేననియెడి
తమకంబు మానరా, వి. వే.

“నేను-నీవు" అను భేదబుద్ధిని విడిచినవాడే ముక్తుడగును . భేదబుద్ధిని విడిచియుండుట ఉత్తమ ధర్మము

One has to give up the difference between self and other to attain salvation. Living without such discrimination is superior dharma.

1382
పంచతత్త్వములకు బ్రహ్మల కొకసొడ్డు వారి తండ్రినెత్తివైతు సొడ్డు నంతరంగమెల్ల నాదిశక్తి యెఱు౦గు , వి. వే.

పంచతత్త్వములకు బ్రహ్మల కొకసొడ్డు
వారి తండ్రినెత్తివైతు
సొడ్డు నంతరంగమెల్ల నాదిశక్తి
యెఱు౦గు , వి. వే.

పంచతత్త్వములు , బ్రహ్మ విష్ణువులు ముక్తికి కారణములని కొంద రందురు . కాని హృదయమును పాలించునది ఆదిశక్తియే

Some say the 5 tattvas and Lord Brahma and Lord Vishnu can help us attain salvation. The ruler of mind is “aadi-sakti” (primordial energy)

1383
పంచ మహాభూతములెల్ల పంచ శరీరములు కలిగి బ్రహ్మాండంబై పంచావస్థలు దాటి నటించుట పరిపూర్తి జెందు టెంకిర వేమా!

పంచ మహాభూతములెల్ల పంచ శరీరములు
కలిగి బ్రహ్మాండంబై పంచావస్థలు
దాటి నటించుట పరిపూర్తి
జెందు టెంకిర వేమా

పంచమహాభూత స్వరూపమును పొంది, శరీరాకారమును పరిణతి చెంది బ్రహ్మాండమున నుండు పంచవస్థలను దాటి నటించువాడే పరిపూర్ణుడు . అతడే ముక్తుడు

A pari-poorna is one who by using the body made of pancha-bhootas (earth, water, air, fire, space), crosses the pancha-avasthas. He is eligible for salvation.

1384
పంచ శత్రువులను పంచ బాణుని గెల్చి పంచ వర్ణములను పఠన చేసి పంచ వక్త్రములను ప్రతిఫలించెడువాని పంచ జేరువాడె పరుడు వేమా!

పంచ శత్రువులను పంచ బాణుని గెల్చి
పంచ వర్ణములను పఠన చేసి పంచ
వక్త్రములను ప్రతిఫలించెడువాని
పంచ జేరువాడె పరుడు వేమా

పంచేంద్రియములను , మన్మథుని గెలిచి "నమశ్శివాయ" మంత్రము పఠించుచు పంచముఖుడగు శివుని ధ్యానించువాడు తప్పక ముక్తిని పొందును

One who overcomes the 5 senses, stays away from cupid, recites the panchaakshari (aum-namah-si-va-ya) and meditates on the pancha-mukha (5 faced) Lord Siva will attain salvation.

1385
పంచాక్షరి జప మందిన సంచిత కర్మములు పాయు సాకల్యముగా మించును పరమ జ్ఞానము ద్రుంచును దుర్భ్రమల మదిని రూఢిగ వేమా!

పంచాక్షరి జప మందిన సంచిత కర్మములు
పాయు సాకల్యముగా మించును
పరమ జ్ఞానము ద్రుంచును దుర్భ్రమల
మదిని రూఢిగ వేమా

పంచాక్షరి జపమువలన కర్మములు నశించి సంపూర్ణ జ్ఞానము కలుగును. అజ్ఞానము, దుర్భ్రమలు నశించును

By meditating on pancha-akshari (aum-namah-si-va-ya) , the karma will be destroyed and one attains complete knowledge; ignorance will be removed and delusions will be banished

1386
పడి పడి మ్రొక్కగ నేటికి గుడిలో గల కఠిన శిలల గుణములు చెడునా గుడి దేహ మాత్మ దేవుడు చెడుఱాళ్ళకు వట్టిపూజ చేయకు వేమా!

పడి పడి మ్రొక్కగ నేటికి గుడిలో
గల కఠిన శిలల గుణములు చెడునా
గుడి దేహ మాత్మ దేవుడు చెడుఱాళ్ళకు
వట్టిపూజ చేయకు వేమా

మన శరీరమే గుడి. ఆత్మయే దేవుడు . దీనిని గ్రహించి గుడిలోని విగ్రహమునకు పూజచేసి మ్రొక్కుట నిరర్ధకము

One's body is the temple and aatma is the god. It is futile to pray to the stone idols in temples.

1387
పదునుకల్గ మ్రాను పచ్చనై యుండును ఈవికల్గ లంజె యింటనుండు తలపు కల్గ హరియు దన వద్దనేయుండు , వి. వే.

పదునుకల్గ మ్రాను పచ్చనై
యుండును ఈవికల్గ లంజె యింటనుండు
తలపు కల్గ హరియు దన
వద్దనేయుండు , వి. వే.

పదనున్న చెట్టు పచ్చగా ఉండును. ధన మిచ్చిన లంజె తనవద్ద నుండును. అట్లే మనస్సున ధ్యానించిన దేవుడు తనయొద్దనే యుండును

A tree near a lake will be green. A prostitute will stick for as long money is given. When one meditates on god he will remain with one.

1388
పరము కోరనట్టి పామర జనులకు స్థిరముగాను బుద్ధి చిక్కబోదు తరముగాని పరము దలపోతయగురోత , వి. వే.

పరము కోరనట్టి పామర జనులకు
స్థిరముగాను బుద్ధి చిక్కబోదు
తరముగాని పరము
దలపోతయగురోత , వి. వే.

భగవంతునియెడ ఆసక్తిలేని పామరులు బుద్ధి స్థిరముగా నుండదు. వారికి దేవుని తలచుట రోతగా నుండును

Ignorant people have no interest in god because their minds are fleeting. They think of meditating on god boring.

1389
పరమాత్ముని వివరింపగ నరుదా ? అణు రేణువందు నతిసూక్ష్మగతిన్ పరికింప నన్ని రూపుల గురుడై తా వెలుగుచుండు గుఱుతుగ వేమా!

పరమాత్ముని వివరింపగ నరుదా ?
అణు రేణువందు నతిసూక్ష్మగతిన్
పరికింప నన్ని రూపుల గురుడై
తా వెలుగుచుండు గుఱుతుగ వేమా

పరమాత్మ ఆణువుకంటె సూక్ష్మముగా నుండి అన్నింటను వ్యాపించి యుండును. అన్నింటికంటెను పెద్దయై యుండును

Paramaatma is subtler than an atom. He is also bigger than everything.

1390
పరము పరమటంచు జలుకుడు రందఱు పరమునందు నేమి ప్రబలముండు పరమునందు నిందు పరిపూర్ణుడే , వి. వే.

పరము పరమటంచు జలుకుడు రందఱు
పరమునందు నేమి ప్రబలముండు
పరమునందు నిందు
పరిపూర్ణుడే , వి. వే.

అవివేకులు పరమునందేమో యున్నదని భ్రాంతి పడుదురు . ఇహమునను , పరమును ఉన్నది పరమాత్మ ఒక్కడే

Ignorant people hallucinate about what is in the nether world. Only paramaatma will be there here and thither.

1391
పాదమున నడచు నరుడట లేదనగా భూమి దిరుగు లెస్సగ దనకే యేదైన హాని వచ్చిన సాధనమగు పదము నడత జరుగదు వేమా!

పాదమున నడచు నరుడట లేదనగా
భూమి దిరుగు లెస్సగ దనకే
యేదైన హాని వచ్చిన సాధనమగు
పదము నడత జరుగదు వేమా

తన కాలు తీసికొనుపోవురీతినే నరుడు ప్రపంచమున తిరుగుచుండును . తిరుగునపుడు వచ్చెడి పాపము తనదేకాని కాలికి రాదు . కాలు కదలకుండ దానిని తన స్వాధీనమున ఉంచవలెను

When one roams around the world with legs that lead the way, the accumulated sin belong to him rather than to the legs. One has to keep in check the wanderlust.

1392
గగన మమర జూడ్కి కనుబాట నిక్కించు నిలిపిచూడ జూడ నిలుచు సుఖము సుఖములోని వరుస సూత్రింప బ్రహ్మము, వి. వే.

గగన మమర జూడ్కి కనుబాట నిక్కించు
నిలిపిచూడ జూడ నిలుచు
సుఖము సుఖములోని వరుస సూత్రింప
బ్రహ్మము, వి. వే.

చూపును స్థిరముగా నిలిపి ప్రార్ధి౦చినచో సుఖము కల్గును . ఆ సుఖ క్రమమును పరిశీలించినచో బ్రహ్మమే యగును . కాన సాధకుడు ముందు చూపును మిక్కిలి స్థిరముగా ఉంచుకొనవలెను

When one meditates with an unwavering vision, one attains bliss. Such bliss is because of brahmam. A practitioner of yoga, therefore, should keep his vision firm.

1393
ఘనసారమగ్ని దొరకొన ఘనసారం బగునుగాదె కారణ విద్యా ఘన సారమున విద్యాగ్నికి ఘనసారమె కంటకంబు కలుగుర వేమా!

ఘనసారమగ్ని దొరకొన ఘనసారం
బగునుగాదె కారణ విద్యా ఘన
సారమున విద్యాగ్నికి ఘనసారమె
కంటకంబు కలుగుర వేమా

కర్పూర మగ్నిని తాకిన జ్వలించినట్లు కారణ విద్య అవిద్యాగ్నిని మండింపజేసి నశింపజేయును

Just as camphor lights up when brought in contact with fire, spiritual knowledge will burn away avidya (ignorance) and destroy it.

1394
చంద్ర సూర్యాగ్ను లేర్పడ్డ చంద్రశాల జేరి పరశివు నాత్మతో జింతచేసి , చిన్మయానందమున జేర దన్మయంబు ముక్తిమూలంబిదే జన్మములకు వేమ !

చంద్ర సూర్యాగ్ను లేర్పడ్డ చంద్రశాల
జేరి పరశివు నాత్మతో జింతచేసి,
చిన్మయానందమున జేర దన్మయంబు
ముక్తిమూలంబిదే జన్మములకు వేమ

చంద్ర సూర్య సంచారము గల సభసత్త్వమున మనస్సును చేర్చి దేవుని ధ్యానించి చిన్మయానందమున తన్మయుండగుటయే ముక్తి

Salvation is when one focuses the mind on the space where the sun and the moon move about, while meditating on god resulting in bliss.

1395
చంద్రునీడ గునిచి చక్కగా రవిమీద నుండజూచి కొఱతనుండజేరి వెన్నెల గదియుటయె వెలయంగ ముక్తిరా, వి. వే.

చంద్రునీడ గునిచి చక్కగా
రవిమీద నుండజూచి కొఱతనుండజేరి
వెన్నెల గదియుటయె వెలయంగ
ముక్తిరా, వి. వే.

యోగానుభవమున మనోదృష్టికి కానవచ్చు సూర్యచంద్రాదుల నతిక్రమించు కళలను చూచి ఆ కాంతి సమూహమున భావమును లీనము కావించుటయే ముక్తి

With the experience of yoga, when one meditates over the kalas that are beyond the sun and the moon discernible in mind's eye, their resplendence will dissolve the thoughts resulting in salvation.

1396
చిత్తరువు ప్రతిమ కైవడి చిత్తమును గల్చమడచి చిరతర బుద్ధిన్ జిత్తున దెలిసిన వాడే యెత్తిన సుజ్ఞానియందు రిహమున వేమా!

చిత్తరువు ప్రతిమ కైవడి చిత్తమును
గల్చమడచి చిరతర బుద్ధిన్
జిత్తున దెలిసిన వాడే యెత్తిన
సుజ్ఞానియందు రిహమున వేమా

హృదయమును చిత్తరువువలెజేసి ఇతరాలోచనలు మాని చలింపని మనస్సుతో చిత్స్వరూపము నెరిగినవాడే జ్ఞానియని పేరు పొందును

One who turns his mind into a painting, shuns other thoughts, and with an unwavering mind visualizes the inner form, is a learned gnani.

1397
చోరులకు జిక్కిపోయిన తీరె యగుట నోట గుణియించు మంత్రము నీటగలియు మాటలందును బరమాత్మ మరగి రాడు చిత్తమున స్వస్థతయు లేమి జెడును వేమ!

చోరులకు జిక్కిపోయిన తీరె యగుట నోట
గుణియించు మంత్రము నీటగలియు మాటలందును
బరమాత్మ మరగి రాడు చిత్తమున
స్వస్థతయు లేమి జెడును వేమ

ఆత్మశుద్ధి లేనివాడు నోట నుచ్చరించిన మంత్రము వ్యర్థమగును . మాటలతో పరమాత్మ లొంగడు . మనస్సు స్థిరముగానున్ననే పరమాత్మను కాంచవచ్చును

The mantra uttered with an impure mind is waste. Paramaatma won't yield to mere words. With an unwavering mind one can see paramaatma

1398
చిత్తము మనమును బుద్ధియు హత్తు నహంకార గుణము నాత్మకు లోగా మొత్తము జేయగ నేరని మత్తులకును ముక్తిలేదు మహిలో వేమా!

చిత్తము మనమును బుద్ధియు హత్తు
నహంకార గుణము నాత్మకు లోగా
మొత్తము జేయగ నేరని మత్తులకును
ముక్తిలేదు మహిలో వేమా

మనస్సు, బుద్ధి, అహంకారము లోనగువానిని హృదయమున లయింపజేయని పిచ్చివాడు మోక్షమును పొందజాలడు

One who yields to the vagaries of mind, intellect and ego can't attain salvation.

1399
చన్నుగవరీతి సంపద కొన్నాళ్ళకు వ్రేగుజూపి గొబ్బున వ్రాలున్ వెన్నెల చీకటి సరియగు నన్నా ! శివలింగ మాయాలన్నియు వేమా!

చన్నుగవరీతి సంపద కొన్నాళ్ళకు
వ్రేగుజూపి గొబ్బున వ్రాలున్
వెన్నెల చీకటి సరియగు నన్నా!
శివలింగ మాయాలన్నియు వేమా

సంపదలు నిలుకడలేనివి . జనరా౦డ్ర గుబ్బల గట్టితనము కొన్నాళ్ళే యుండి పిదప పోవునట్లు భగవన్మాయ వలన సంపదలు నశించును . ఇవి వెన్నెల, చీకాటులతో సమానములు

Wealth is evanescent. A lady's bosom will remain attractive for a limited time. Wealth will be destroyed by the maaya of god. They are like darkness and moonlight.

1400
చూపు చెదరని వృత్తిలో జూడ్కినంటి ఏపు మీఱినమదినందు రూపు చూపి తన్నుదా గాన్చుచుండును తత్త్వవేత్త నిర్వికారుడు నా భువి నెగడు వేమ!

చూపు చెదరని వృత్తిలో జూడ్కినంటి
ఏపు మీఱినమదినందు రూపు చూపి తన్నుదా
గాన్చుచుండును తత్త్వవేత్త
నిర్వికారుడు నా భువి నెగడు వేమ

నిశ్చల వృత్తితో ధ్యానించి , హృదయమున భగవంతుని నెలకొల్పి తత్త్వవేత్త ఆత్మరూపమును నిర్వికారుడై పరికించుచుండును

A practitioner of tattva meditates with unwavering mind, implants god in his heart and visualizes the aatma without emotions.

1401
చావు వచ్చునపుడు సన్న్యసించునదెల్ల గడకు మొదటి కులము చెడునుగాదె పాపమొప్పు ; వేఱఫలముండబోదయా, వి. వే.

చావు వచ్చునపుడు సన్న్యసించునదెల్ల
గడకు మొదటి కులము
చెడునుగాదె పాపమొప్పు ;
వేఱఫలముండబోదయా, వి. వే.

చచ్చుటకు ముందు అతుర సన్న్యాసమును తీసికొనుటవల్ల పాపమేకాని ఫలములేదు . దీనివల్ల మొదట కులము నశించును . ఏలయన సన్న్యాసికి కులము లేదు

When one renounces and seeks sannyaasa before death there is no use. His caste will be depleted because a sannyasi has no caste.

1402
చూపులోని చూపు సుజ్ఞానదాయిని మనసులోని మనసు మాయ దగులు ఎఱుకలోని యెఱుక నెఱుగుమురా మూర్ఖ , వి. వే.

చూపులోని చూపు సుజ్ఞానదాయిని
మనసులోని మనసు మాయ దగులు
ఎఱుకలోని యెఱుక నెఱుగుమురా
మూర్ఖ , వి. వే.

ధృక్కును , దృశ్యమును పరిశీలించినయెడల జ్ఞానము కల్గును . కేవలము ధ్యానమువలన అజ్ఞానము నశించదు . కావున వివేకముతో జ్ఞానమును సంపాదించుము

One accrues knowledge by analyzing the seen-seer-sight. Meditation alone cannot destroy ignorance. Hence one should acquire knowledge with intelligence.

1403
చూపులోని చూపు జూడ నేర్చినవాడు చూపులోననుండి చూచువాడు చూడజూడ దన్ను జూచును నిక్కము, వి. వే.

చూపులోని చూపు జూడ నేర్చినవాడు
చూపులోననుండి చూచువాడు
చూడజూడ దన్ను జూచును
నిక్కము, వి. వే.

అంతరంగమైన మనోదృష్టి కలిగియున్నవాడే తనలోనున్న ఆత్మను చూచువాడును , పరమాత్మను దర్శించువాడును అగును .

One with the mind's eye can observe the aatma residing in him and then paramaatma

1404
జంగమాఖ్య భక్తి సంధివేఱుగలేదు సగుణభావ మిదియ శాస్త్ర విధియ నిర్గుణంబు వీడునెరవేది యోగము, వి. వే.

జంగమాఖ్య భక్తి సంధివేఱుగలేదు
సగుణభావ మిదియ శాస్త్ర
విధియ నిర్గుణంబు వీడునెరవేది
యోగము, వి. వే.

విధిప్రకార మాలోచించిన యెడల జంగమమే సగుణోపాసమార్గము . యోగపద్ధతి సగుణోపాసమార్గమునను తెలియును

When one analyzes jangama is the path to meditation with the 3 gunas (sattva-calm, rajas-active, tamas-indolence). The yoga method involves the 3 gunas.

1405
జన్మ మరణాద్యవస్థల జూడ మీఱి మన్మయంబగు పరిపూర్తి మఱుగజేరి తన్మయాకృతి నొందుటే తత్పరంబు నిర్వికారుని కిదికల్గు నుర్వి వేమ!

జన్మ మరణాద్యవస్థల జూడ మీఱి మన్మయంబగు
పరిపూర్తి మఱుగజేరి తన్మయాకృతి
నొందుటే తత్పరంబు నిర్వికారుని
కిదికల్గు నుర్వి వేమ

జననము, చావు మున్నగు అవస్థలు లేనిదియు , చిత్స్వరూపమున నిండియుండినదియు , తన్మయత్వమును పొందించు నదియు ముక్తి . ఇది నిర్వికారునికి మాత్రమే కల్గును

The salvation without rebirth, devoid of avasthas (jaagrit-wakeful, swapna-dream, sushupta-deep-sleep), with subtle body and giving bliss is only possible for a yogi with an immutable mind

1406
జపములు చేసిన జిక్కదు విపినముల౦ దన్నుగాని విడుచునె భ్రమ లా జపమంత్రమూల సిద్ధికి నెపమెన్నని మోక్షపదవి నిలుచుర వేమా!

జపములు చేసిన జిక్కదు విపినముల౦
దన్నుగాని విడుచునె భ్రమ లా
జపమంత్రమూల సిద్ధికి నెపమెన్నని
మోక్షపదవి నిలుచుర వేమా

జపములను చేసినను , అడవులలో నివసించినను ముక్తి కల్గునన్నది భ్రమ . దానివల్ల ముక్తి లభింపదు . ఆ జపాదులతో సంబంధములేని మోక్షమును పొందుటకు నిశ్చల ధ్యానముతో యత్నించుట మేలు

The belief that performing pooja or living in forests will lead to salvation is false. To attain salvation one has to meditate with an unwavering mind.

1407
జయము భయము దాటి చలపట్టి యుండును దయకు బాత్రుడగును ధర్మపరుడు నయముగాను గురుని నమ్మి నెమ్మది వేడు, వి. వే.

జయము భయము దాటి చలపట్టి యుండును
దయకు బాత్రుడగును ధర్మపరుడు
నయముగాను గురుని నమ్మి
నెమ్మది వేడు, వి. వే.

ధర్మమున ఆసక్తి కలవాడు జయమును, భయమును విడిచి పట్టుదలతో గురుని యనుగ్రహమునకు పాత్రుడైన కృతకృత్యుడగును . గురువునే నమ్మినచో ముక్తినిపొందవచ్చును

A person following dharam will transcend success and fear and with determination will serve the guru. It is possible to attain salvation by following a proper guru.

1408
జిహ్వరసము వల్ల జీవంబు పోషించు బ్రహ్మ మన్నరసము బడయలేరు , రసము ద్రాగనట్టి రాజులు చావరే? వి. వే.

జిహ్వరసము వల్ల జీవంబు పోషించు
బ్రహ్మ మన్నరసము బడయలేరు,
రసము ద్రాగనట్టి
రాజులు చావరే? వి. వే.

అన్నరసమే ప్రాణాధారము . కావున జనులు దానికై ప్రాకులాడుచుందురు . కాని ఇహమునుండి తరింపజేయు బ్రహ్మమను రసమునకు యత్నింపవలెను . రాజులు త్రాగుడులేకున్న చత్తుమని తలతురు . గాని ఈశ్వరవిచారము కావింపరు

Food is required for praana. Hence people crave for it. But one has to seek the brahmam to prosper in this world. Kings fear death by staying as teetotalers. They don't think about Iswara.

1409
జీవగుణము గలుగు జీవంబు బ్రహ్మంబు సాటి వచ్చుటెట్లు సరవిదెలియ ? నూరికుక్క సింగ మొక్కటి యగునొక్కొ ? వి. వే.

జీవగుణము గలుగు జీవంబు బ్రహ్మంబు
సాటి వచ్చుటెట్లు సరవిదెలియ?
నూరికుక్క సింగ మొక్కటి
యగునొక్కొ ? వి. వే.

జీవగుణము లున్నంతవరకును జీవము బ్రహ్మము కాజాలదు . ఊరికుక్క ఎంత మాత్రము సింహము కాజాలదు

For as long as one has jiva attributes, brahmam will be hard to attain. A stray dog can't be the lion.

1410
జీవనము దెలిసిన జెలగి మది చలించు దైవ మగుపడినను దగులు బుద్ధి దీప్త భానునిగని తిమిరంబు నిలుచునా? వి. వే.

జీవనము దెలిసిన జెలగి మది చలించు
దైవ మగుపడినను దగులు
బుద్ధి దీప్త భానునిగని తిమిరంబు
నిలుచునా? వి. వే.

తనకెంత ఆయువు కలదో తెలిసినయెడల మనస్సు సంచలించును . దైవము సాక్షాత్కరించిన బుద్ధి దానిపైలగ్నమై యుండును. సూర్యుని చీకటివలె , జ్ఞానిని మాయ ఆవరింపజాలదు

Mind will waver if one knows for how long he will live. When god deifies intellect will remain steadfast. Just as darkness is dispelled by sun light, maaya (illusion) won't affect the gnaani.

1411
జీవము శాశ్వత రూపము భావమునను నిలిచి లోనె పరుడై యుండున్ కేవల నిర్గుణ మదెయగు గావరమును గడకు ద్రోసి కనవలె వేమా!

జీవము శాశ్వత రూపము భావమునను
నిలిచి లోనె పరుడై యుండున్
కేవల నిర్గుణ మదెయగు గావరమును
గడకు ద్రోసి కనవలె వేమా

ఆత్మ శాశ్వతమను భావమును మనస్సులో ఉంచి ధ్యానించినయెడల , కావరమును పోగొట్టి అదియే నిర్గుణమగును

When one meditates with the belief that aatma is immortal it will erase his ego and transcend the 3 gunas (sattva-calm, rajas-active, tamas-indolence)

1412
జీవుడనగ మీరు చిక్కులు పడనేల? వాయు వాకసంబు వహ్నిగూడి దేహియనగ నొట్టె దేహంబులం దొప్పి , వి. వే.

జీవుడనగ మీరు చిక్కులు పడనేల?
వాయు వాకసంబు వహ్నిగూడి
దేహియనగ నొట్టె దేహంబులం
దొప్పి , వి. వే.

జీవుడు పంచభూతములతో కూడియున్నవాడే ! అతని౦ గూర్చి లేనిపోని ఆలోచన అక్కరలేదు

A jiva is made of 5 bhootas (earth, water, fire, air, space). There is no use in analyzing a jiva.

1413
జీవుడెయగసావి క్షితిలోన దెలియంగ భావమైన తానె పరమ శివుడు వాయువనెడి యతడె వసుధ బ్రహ్మముకాదె , వి. వే.

జీవుడెయగసావి క్షితిలోన దెలియంగ
భావమైన తానె పరమ శివుడు
వాయువనెడి యతడె వసుధ
బ్రహ్మముకాదె , వి. వే.

జీవుడు చిత్రములగు నగలుచేయు అగసాలివంటివాడు . ఈశ్వరుడు భావముల నెరిగిన జ్ఞానస్వరూపుడు . బ్రహ్మము వాయువువలె సర్వత్ర వ్యాపించి యుండువాడు

A jiva is like an artisan who can make golden jewelry . Iswara is an embodiment of knowledge who can find out the thoughts. Brahmam is spread all over the universe.

1414
జ్ఞానముద్ర చేత గనగ వచ్చెడి తళ్కు కదియె మదికి శ్రేష్ఠమనుచు మునులు పలికి రదియె తీయ బారమార్థమగునయా, వి. వే.

జ్ఞానముద్ర చేత గనగ వచ్చెడి
తళ్కు కదియె మదికి శ్రేష్ఠమనుచు
మునులు పలికి రదియె తీయ
బారమార్థమగునయా, వి. వే.

జ్ఞానముద్రా వశమున ఉన్నప్పుడు కానవచ్చు తేజస్సు ఉత్తమమైనదని మునులు చెప్పుదురు . అదియే పరమార్థమని తెలిసికొనుము

Sages say the resplendence visible when one is in gnaana-mudra is superior to anything else. That is like heaven.

1415
జ్ఞానసుజ్ఞాన గతు లొప్పు జాడ లెఱు౦గు నగును దైవజ్ఞులగు వార లరసిరేని , బాలు నీరును భేదింప బరగు హంస లట్టి సామర్థ్య మొప్పు వా రవని వేమ.

జ్ఞానసుజ్ఞాన గతు లొప్పు జాడ లెఱు౦గు
నగును దైవజ్ఞులగు వార లరసిరేని,
బాలు నీరును భేదింప బరగు హంస లట్టి
సామర్థ్య మొప్పు వా రవని వేమ.

జ్ఞాన, విజ్ఞానము పద్ధతులు నెరిగినవారు దైవము నెరిగినవారేకాని సామాన్యులు కారు . వారు నీరు, క్షీరములను వేరు చేయు హంసలవంటి వారనుట నిశ్చయము

The one who knows the ways of gnaana and vignana is aware of God and is not an ordinary man. He is like the mythological swan that can separate water from milk.

1416
టెక్కెమెత్తి చెప్పు మొక్కుడే దేవుడు నిక్కముగను లోననిలిచి యుండు జక్క జూచునతని సంతోషమున ముంచు , వి. వే.

టెక్కెమెత్తి చెప్పు మొక్కుడే
దేవుడు నిక్కముగను లోననిలిచి
యుండు జక్క జూచునతని
సంతోషమున ముంచు , వి. వే.

దైవమొక్కడే అని, పెక్కుమంది లేదని జెండా యెత్తి గట్టిగా చెప్పవచ్చును . ఆ దేవుడు మన మనస్సులోనే ఉన్నాడు . అతనిని తెలిసికొన్న పరమానందము కలుగును

There is only one God and there are not many gods. Many people are skeptical about the God resident in our hearts. One enjoys bliss by knowing him.

1417
తత్పదము నెన్న బ్ర్యత్యగాత్మమ్ము సుమ్మి త్యపదంబున బ్రహ్మ రూపమ్మె కదర! అసి పద్మమున లక్ష్యమ్ము నైక్యముగన సోహమేర్పడు దెలియంగ జూడువేమ

తత్పదము నెన్న బ్ర్యత్యగాత్మమ్ము
సుమ్మి త్యపదంబున బ్రహ్మ రూపమ్మె
కదర! అసి పద్మమున లక్ష్యమ్ము నైక్యముగన
సోహమేర్పడు దెలియంగ జూడువేమ

“తత్త్వమసి" అనుదానిలోని "తత్ " పదము ప్రత్యగాత్మను , “త్వం" పదము బ్రహ్మమును , “అసి" పదము రెండిటికిని గల ఐక్యమును తెలుపుచున్నవి . పరిశీలించి "నేనే ఈశ్వరుడ" నని ఎరుగుము

In the vedic quote “tattva masi”, tat refers to the individual soul, tvam signifies brahmam and asi connects the two. With such analysis realize that “self is iswara”

1418
తథ్యమైన పూర్ణతత్త్వము నీలోన మిధ్య నరయగానే మిత్రమగును సత్య నిత్య కర్మసాక్షి బ్రహ్మంబురా వి. వే.

తథ్యమైన పూర్ణతత్త్వము నీలోన
మిధ్య నరయగానే మిత్రమగును
సత్య నిత్య కర్మసాక్షి
బ్రహ్మంబురా వి. వే.

యధార్థమైన పూర్ణతత్త్వమును మనస్సులో ధ్యానించి , లోకము మిథ్యయని భావించిన ఆత్మ కానిపించును . సత్య నిత్య కర్మలకు సాక్షి బ్రహ్మమే అని తెలిసికొనుము

Meditating on the actual poorna-tattva, and believing that the world is ephemeral will reveal the aatma. For the faithfully discharged daily karma brahmam is the witness.

1419
తనదు రూపమెల్ల దనలోన జూచియు మనసు దీపమునను మమత విడిచి అను దినమును గాంచు నతడె పోబ్రహ్మము , వి. వే.

తనదు రూపమెల్ల దనలోన జూచియు
మనసు దీపమునను మమత విడిచి
అను దినమును గాంచు నతడె
పోబ్రహ్మము , వి. వే.

ఆత్మ స్వరూపమును తన ఆత్మలో చూచి సమస్తమును ఆత్మాకృతిగా చూచినవాడు బ్రహ్మమున ఐక్యమును పొందును

By witnessing the form of aatma within oneself and considering all things as manifestation of aatma, one attains unity with brahmam.

1420
తన గుణము తనకు నుండగ నెనయంగా నొరుని గుణము నెంచును మదిలో దన గుణము తెలియ కన్యుని బనిగొని దూషించువాడు వ్యర్థుడు, వేమా!

తన గుణము తనకు నుండగ నెనయంగా నొరుని
గుణము నెంచును మదిలో దన
గుణము తెలియ కన్యుని బనిగొని
దూషించువాడు వ్యర్థుడు, వేమా

మంచివో చెడ్డవో , తన గుణములను తాను చూడక ఇతరుల గుణముల వెన్నుట , తన్ను తాను గమనింపక ఇతరులను దూషించుట తగదు . అట్లు చేసినవాడు వ్యర్థుడు

Regardless of good or bad, one who without knowing his characteristics, criticizes others' characteristics is a foolish person.

1421
తనదు రూపమెల్ల దనలోన జూచియు మనసు దీపముగను మమత విడిచి యను దినమును , గాంచు నతడె పోబ్రహ్మంబు , వి. వే.

తనదు రూపమెల్ల దనలోన జూచియు
మనసు దీపముగను మమత విడిచి
యను దినమును , గాంచు నతడె
పోబ్రహ్మంబు , వి. వే.

మమత్వమును వదలి , తన మనస్సను దీపముతో తనలోని తత్త్వమును తెలిసికొని ప్రతిదినము అంతర్హృదయమును చూచువాడే బ్రహ్మస్వరూపుడు

By giving up possessive self, discovering one's tattva with the light of the mind, one who reflects inward every moment is the form of brahmam.

1422
తన్నుదాదెలిసిన దానె పోబ్రహ్మంబు తనువులోని ముక్తి దగిలియుండు తన్నెఱు౦గని వాడు తానెట్టి బ్రహ్మంబు? వి. వే.

తన్నుదాదెలిసిన దానె పోబ్రహ్మంబు
తనువులోని ముక్తి దగిలియుండు
తన్నెఱు౦గని వాడు తానెట్టి
బ్రహ్మంబు? వి. వే.

తన్ను తాను తెలిసికొనుటే బ్రహ్మమగును , ఇట్లు తెలియనివాడు బ్రహ్మము కాజాలడు . ముక్తి దేహమునందే ఇమిడియున్నది గాని వేరొకచోట లేదు

Discovering oneself is brahmam. One not doing this cannot be brahmam. Salvation is within the body but not elsewhere.

1423
తన్ను వెదకి చూడదానెయౌ జీవుడు తత్త్వమరయ నగును దానెయాత్మ మన్ను మిన్ను లేదు మాయము లేదయా, వి. వే.

తన్ను వెదకి చూడదానెయౌ జీవుడు
తత్త్వమరయ నగును దానెయాత్మ
మన్ను మిన్ను లేదు
మాయము లేదయా, వి. వే.

ఆత్మ రూపమును వెదకినయెడల తానే (బ్రహ్మమే) ఆత్మస్వరూపము చెంది కనబడునేకాని ఇతరము కానబడదు . మాయయు తొలగిపోవును

When one searches for the form of aatma, one realizes that the self is the brahmam. The maaya (illusion) will be dispelled.

1424
తపములేల ? యరయ ధాత్రిజనులకెల్ల నొనర శివుని జూడ నుపముగలదు మనసు చెదరనీక మహిలోన జూడరా , వి. వే.

తపములేల ? యరయ ధాత్రిజనులకెల్ల
నొనర శివుని జూడ
నుపముగలదు మనసు చెదరనీక
మహిలోన జూడరా , వి. వే.

జనులు తపస్సులుచేసి కృశించుట వ్యర్థము. భగవంతుని చూచుట కిది మార్గముకాదు . మనస్సును చెదరనీయక స్థిరముగా నుంచి ధ్యానించినచో దేవుని చూడవచ్చును

People fasting while performing meditation in search of god are wasting their time. This is not the way to seek god. When one meditates with an unwavering mind it is possible to deify god.

1425
తఱుచు తనువుబాసి తఱితోదను మఱచి తాను నేననదగు తలపు మఱచి యుండునాతడు గద యుత్తమ యోగియౌ , వి. వే.

తఱుచు తనువుబాసి తఱితోదను
మఱచి తాను నేననదగు తలపు
మఱచి యుండునాతడు గద యుత్తమ
యోగియౌ , వి. వే.

శరీరముపై మమత విడిచి, తన్ను తాను మరిచి స్వపర భేదము మాని యుండువాడే ఉత్తమయోగి యగును.

A superior yogi is one who gives up attachment with body, forgets self and does not discriminate between self and others.

1426
తలపు మఱపులు లేవందు దాకినపుడె తాను బ్రహ్మంబులోజేరి తలగకుండు తత్పదంబున మఱగిన తానె బ్రహ్మ జ్ఞానమిద్ది యెఱి౦గిన ఘనత వేమా!

తలపు మఱపులు లేవందు దాకినపుడె తాను
బ్రహ్మంబులోజేరి తలగకుండు
తత్పదంబున మఱగిన తానె బ్రహ్మ జ్ఞానమిద్ది
యెఱి౦గిన ఘనత వేమా

తలపు మాయావృతము కాకుండ , జీవునియందే నిలుపగల్గినచో బ్రహ్మానుభవము కలుగును. ఆ యనుభవము కలవాడే బ్రహ్మము. దీని నెరుగుటయే ఘనత

Brahmam can be experienced by focusing mind on jiva without being distracted by illusory maaya. The one with such an experience is brahmam. Knowing this is greatness.

1427
తాను జన్మమెత్తి దానధర్మము లీయ కర్మగతిని యముడు కష్టపఱచు కర్మ ధర్మములను గడద్రోయు బ్రహ్మము, వి. వే.

తాను జన్మమెత్తి దానధర్మము
లీయ కర్మగతిని యముడు కష్టపఱచు
కర్మ ధర్మములను గడద్రోయు
బ్రహ్మము, వి. వే.

తాను దానధర్మములు చేయుచున్నను , కర్మములవల్ల కలుగు యమబాధలు తప్పవు . కావున కర్మములను , ధర్మములను తప్పించుకొని యుండినపుడే బ్రహ్మభావము కలుగును

Even though one is giving alms, one cannot escapes sorrows emanating from karma. The one with brahma-bhaava will have to avoid dharma and karma.

1428
తాననెడి యహంకారము మానక తను దానె చెఱుచు మైమఱపించున్ నేనని పలికెడి వారికి మానునె దుష్కర్మ ఫలము మహిలోవేమా

తాననెడి యహంకారము మానక తను
దానె చెఱుచు మైమఱపించున్ నేనని
పలికెడి వారికి మానునె
దుష్కర్మ ఫలము మహిలోవేమా

“నేను" అను అహంభావమును విడిచిననే దుష్కర్మ ఫలములు కలుగకుండును . అహంకారమే నశించుటకు కారణము

The bad karma can be avoided by giving up ego. Men perish because of inflated ego.

1429
తానౌట దెలిసి మదినొక తానును లేకుండు టెల్ల౦దను దానెయన దా నెఱిగి పరిణమించిన మానవులకు ముక్తిగలదు మహిలో వేమా!

తానౌట దెలిసి మదినొక తానును
లేకుండు టెల్ల౦దను దానెయన
దా నెఱిగి పరిణమించిన మానవులకు
ముక్తిగలదు మహిలో వేమా

తానే బ్రహ్మమని , వేరొకడు లేడని , జీవుడే ఈశ్వరుడని , ఈశ్వరుడే జీవుడని తెలిసికొన్న వానికి ముక్తి లభించును

One who realizes self is brahmam, jiva is Iswara and Iswara is same as java, can attain salvation.

1430
తానున నేనని వేఱుగ మనమున దలంచునట్టి మానవుడెటులు౦ గానగ నేఱడు తత్త్వము మౌనులతో దిరిగియైన మహిలో వేమా

తానున నేనని వేఱుగ మనమున దలంచునట్టి
మానవుడెటులు౦ గానగ
నేఱడు తత్త్వము మౌనులతో
దిరిగియైన మహిలో వేమా

బేధబుద్ధితో తనవాడు, పరుడు అని తలుచువాడు మునులతో కలసిమెలసి యున్నను , ఈశ్వరతత్త్వమును ఎన్నటికిని గుర్తింపజాలడు

The one who discriminates between self and others, despite mingling with sages, will not understand the tattva of Iswara.

1431
తానును నేర్పరియైనను దానకముల దన్ను దానె తప్పించుకొనం దానెన్ని విధములను మఱి తానే పరమాత్మయనుచు దలపర వేమా!

తానును నేర్పరియైనను దానకముల
దన్ను దానె తప్పించుకొనం
దానెన్ని విధములను మఱి తానే
పరమాత్మయనుచు దలపర వేమా

నేర్పుగలవాడు జ్ఞానమూలముగా మాయను తప్పించుకొని వివిదోపాయములచే తనలోనున్న జీవుడే ఈశ్వరుడని తెలిసికొనగలడు

A skillful person will avoid maaya (illusion) and realize that the jiva in his body is same as Iswara.

1432
తానుబుట్టుచోటు తాజూచి పలికిన దాను దిరుగు బుద్ధి ధరణిలోన దాను బుట్టు చోటు తత్త్వంబు తలపోయ , వి. వే.

తానుబుట్టుచోటు తాజూచి పలికిన
దాను దిరుగు బుద్ధి ధరణిలోన
దాను బుట్టు చోటు తత్త్వంబు
తలపోయ , వి. వే.

పంచభూతవివేచన చేసి తన జన్మకారణమును , జన్మ స్థలమును తెలిసికొన్న యెడల , తన బుద్ధి మారిపోయి , విరక్తి కలిగి పరతత్త్వమునందు ఆసక్తి కలుగును

By understanding pancha-bhootas (earth, water, fire, air, space), when one contemplates on the reason for his birth and his birth-place, one's character will change and one will renounce all attachment and show interest in spiritual matters.

1433
తామసంబంటు బుద్ధిని దగులబెట్టి నియమనిష్ఠలు మదియందు నిగుడజేసి కామవర్గము జయమంద గలుగు ముక్తి ఆ మహాత్ముని సేవింప నగుర వేమ

తామసంబంటు బుద్ధిని దగులబెట్టి
నియమనిష్ఠలు మదియందు నిగుడజేసి
కామవర్గము జయమంద గలుగు ముక్తి
ఆ మహాత్ముని సేవింప నగుర వేమ

తమోగుణ ప్రధానమగు బుద్ధిని విడిచి , నియమ నిష్ఠల యందు మనస్సునుంచి , కామాదులను విడిచిన వారికి , మోక్షము కలుగును. అట్టి మహాత్మునే సేవించుట మేలు

By renouncing indolence and lust, when one leads a principled life, salvation is possible. It is better to serve the one who knows this.

1434
తిరిగి తిరిగి నరుడు మరల కొనుటే గాక అందువలన నేమి యాశ గలుగు? నంతరాత్మ నతడె పోబ్రహ్మంబు , వి. వే.

తిరిగి తిరిగి నరుడు మరల
కొనుటే గాక అందువలన నేమి
యాశ గలుగు? నంతరాత్మ నతడె
పోబ్రహ్మంబు , వి. వే.

నరుడు తీర్థయాత్రలలో మునిగి తేలుచున్నందున ప్రయోజనము లేదు . హృదయమును నిల్పిననే బ్రహ్మస్వరూప మవగతమగును

There is no use in going on pilgrimage. Only meditation helps in realizing the form of brahmam.

1435
తిట్టికొట్టిరేని తిరిగి మాటాడక యూరకున్న జూడ నుర్విమీద వాడగు పరమాత్మ వర్ణింప శక్యమా? వి. వే.

తిట్టికొట్టిరేని తిరిగి
మాటాడక యూరకున్న జూడ నుర్విమీద
వాడగు పరమాత్మ వర్ణింప
శక్యమా? వి. వే.

ఇతరుల దూషణభూషణములను లెక్కింపక ఊరక యున్నవాడు పరమాత్మ యనియే చెప్పవచ్చును

One who ignores the disparagement from others and remains quiet is a paramaatma

1436
తిరిగి తిరిగి నరుడు త్రిమ్మరి కాగానే అందువల్లనేమి యధిక మొప్పు ? అంతరంగ మెఱిగినప్పుడే శివుడౌను , వి. వే.

తిరిగి తిరిగి నరుడు త్రిమ్మరి
కాగానే అందువల్లనేమి యధిక
మొప్పు ? అంతరంగ మెఱిగినప్పుడే
శివుడౌను , వి. వే.

తీర్థయాత్రలకు పోవుచుండుటవల్ల శ్రమయేగాని ఫలము లేదు. అంతరంగమును గ్రహించినప్పుడే బ్రహ్మము సిద్ధించును

Going on pilgrimage is a toil that won't result in anything fruitful. One who understands self will realize brahmam

1437
తెరువు ముక్కు చాయదే గలిగిన మీద నందు గనబడు నదె యరయ వేరె ? అరసి చూడ బయలె ; యల్లదె; ముక్తిరా , వి. వే.

తెరువు ముక్కు చాయదే గలిగిన
మీద నందు గనబడు నదె యరయ
వేరె ? అరసి చూడ బయలె ; యల్లదె;
ముక్తిరా , వి. వే.

ముక్కుకొనను దృష్టినుంచి ధ్యానించినచో కన్పట్టు బయలే ముక్తియని సులభముగా తెలిసికొనవచ్చును

One who meditates with vision focused on the tip of the nose, can achieve salvation.

1438
తెలుపువాడెవ౦డు ? తెలియువా డెవ్వ౦డు? గుట్టెఱు౦గునంత బట్టబయలు సొరది భాండమందు సూర్యుని చందంబు , వి. వే.

తెలుపువాడెవ౦డు ? తెలియువా
డెవ్వ౦డు? గుట్టెఱు౦గునంత
బట్టబయలు సొరది భాండమందు సూర్యుని
చందంబు , వి. వే.

ఈశ్వర తత్త్వము ఒకరు తెలుపగా ఇంకొకరు తెలిసికొనునది కాదు . నీటికుండలో సూర్యుని రీతిని తన దేహములోనే ఉన్న ఈశ్వరరూపము గోచరించును

The knowledge about Iswara is discovered by oneself but not learnt from others. Just as sun light reflects from a pot with water, once own self will reveal the form of Iswara.

1439
తేకు వమర బుద్ధి దెల్లముగా నిల్పి తాక నది ప్రవణపు ధ్యానమగును సోకిమించువాడె సురలోకమును బొందు , వి. వే.

తేకు వమర బుద్ధి దెల్లముగా
నిల్పి తాక నది ప్రవణపు ధ్యానమగును
సోకిమించువాడె సురలోకమును
బొందు , వి. వే.

బుద్ధిని స్థిరముగా నిల్పి, ప్రణవమును ధ్యానించుచు చిత్కళల నంటినయెడల సురలోకమును పొందును. అనగా ముక్తిని పొందును

When one meditates with an unwavering mind on “aum” and experiences kalas, he will achieve salvation.

1440
దానమమరజేయ దరి జేర్చు నయ్యది మనమెనమ్మెనేని మాయముంచు జ్ఞానకలిక నమ్మ జంపురా వైరుల , వి. వే.

దానమమరజేయ దరి జేర్చు నయ్యది
మనమెనమ్మెనేని మాయముంచు
జ్ఞానకలిక నమ్మ జంపురా
వైరుల , వి. వే.

దానముచేసిన ముక్తి సమీపించును . మనస్సును నమ్మిన మాయ నశించును. జ్ఞానమును నమ్మిన అంతర్విరోధులు నశింతురు

By giving alms one moves closer to salvation. By trusting one's mind, illusory maaya will be destroyed. By keeping faith on knowledge, the inner demons will be vanquished.

1441
దృక్కునకు దృశ్యమునకును మక్కువతో భేదమెంచ మఱి లేదు సుమీ! దృక్కునకు దృక్కు బ్రహ్మమె నిక్కము నీయందు నిండి నెగుడును వేమా!

దృక్కునకు దృశ్యమునకును మక్కువతో
భేదమెంచ మఱి లేదు సుమీ! దృక్కునకు
దృక్కు బ్రహ్మమె నిక్కము
నీయందు నిండి నెగుడును వేమా

దృక్కునకను, దృశ్యమునకును భేదములేదు . ఈ రెండును బ్రహ్మమున నిండియున్నవి . అవి నీయందును గలవు

There is no difference between the seer and the seen. Both are manifestation of brahmam.

1442
దూలములను బోలు దరవస్థలని యెల్ల రోసి యాసలన్ని కోసివైచి వాసన ద్యజించు వాడె పోబ్రహ్మంబు , వి. వే.

దూలములను బోలు దరవస్థలని
యెల్ల రోసి యాసలన్ని కోసివైచి
వాసన ద్యజించు వాడె
పోబ్రహ్మంబు , వి. వే.

దూలములవలె కర్మబంధములు మీదపడి దురవస్థలు కలగుచున్నను , వానిని తొలగించి ఐహికముగ ఆశలను శోసి , వాసనలను విడిచినవాడే బ్రహ్మము కాగలడు

Despite the bondage of karma tormenting one like a beam of timber falling on one's back, one who overcomes them and renounces greed and associations from previous births, can become brahmam.

1443
దేహియు జ్ఞానా నలమున దాహంబై దేహమెల్లదల్లడ పడగా దేహములో బొర్లాడుచు మోహము విడ శివుని జూడు ముక్తికి వేమా

దేహియు జ్ఞానా నలమున దాహంబై
దేహమెల్లదల్లడ పడగా దేహములో
బొర్లాడుచు మోహము విడ శివుని
జూడు ముక్తికి వేమా

దేహము జ్ఞానాగ్ని చేత దగ్ధమై తల్లడపడునెప్పుడైనను మోహమును విడిచి భగవంతుని చూడుము . అదియే ముక్తి మార్గమని తెలిసికొనుము

When worried after body is burnt in the fire of knowledge, one has to give up desires and seek God. This is the path to salvation.

1444
దైవఘటన లేక దైవసుజ్ఞానంబ దేలవచ్చు? రెంటి కెఱుకపడక ఎఱుక నెఱుగువాని కెఱుకలో గన్పించు , వి. వే.

దైవఘటన లేక దైవసుజ్ఞానంబ
దేలవచ్చు? రెంటి కెఱుకపడక
ఎఱుక నెఱుగువాని కెఱుకలో
గన్పించు , వి. వే.

భగవంతుని ప్రేరణ లేక జ్ఞానము కలుగదు . ఆ ప్రేరణయున్నచో మానవునకు జ్ఞానము సులభముగానే కలుగును

Without God's will one cannot acquire knowledge. When there is divine help it is easy to gain knowledge.

1445
దొడ్డవాండ్ర మనుచు ద్రోవడొంకలు కొట్టి యడ్డమైన జనుల నంటగట్టి దోచుకొన్న యట్టి దోషమెక్కడ బోవు? వి. వే.

దొడ్డవాండ్ర మనుచు ద్రోవడొంకలు
కొట్టి యడ్డమైన జనుల
నంటగట్టి దోచుకొన్న యట్టి
దోషమెక్కడ బోవు? వి. వే.

మానవులు దౌర్జన్యముతో దారులుకాచి దోచుకొని అడ్డుపడినవారిని చెట్లకు కట్టిన పాపము ఎక్కడికి పోవును? దానిని అనభవించితీరవలసినదే

Some men resort to dacoity and tie up their victims to trees. They have to absolve their sins. And experience karma.

1446
ధూమాదుల నావృతమై వ్యోమంబున కేగని కలియు నుపములు తనలో శ్రీమించు శివుని జేరును గామాదుల గలియడతడు ఘనముగ వేమా!

ధూమాదుల నావృతమై వ్యోమంబున
కేగని కలియు నుపములు తనలో శ్రీమించు
శివుని జేరును గామాదుల
గలియడతడు ఘనముగ వేమా

భూమిపై ఏర్పడిన పొగ మెల్లగా ఆకాశమున కలియుచున్నది . అటులనే మానవునిలోనున్న జీవుడు ఈశ్వరునితో కలిసికొనును . అట్టియెడ జీవునకు కామాది వికారములుండవు

Smoke rises from earth to sky. Similarly the jiva merges with Iswara without desires. He will not lust or desire as a result.

1447
ధరను దేవళముల తగులు వీడినవాడు తనువు గుడిగ జేసి తన్ను నిలిపి లోక బుద్ధి విడిచి లోజూపు చూడరా, వి. వే.

ధరను దేవళముల తగులు వీడినవాడు
తనువు గుడిగ జేసి తన్ను
నిలిపి లోక బుద్ధి విడిచి
లోజూపు చూడరా, వి. వే.

విగ్రహారాధనమును విడిచి , తన శరీరమునే గుడిగా భావించి , తానే దైవమని తలచుకొని లోకసాధారణమైన దృష్టిని విడిచననే ముక్తిని పొందవచ్చును

One can attain salvation by not worshiping idols, considering one's body as the temple and self as the divine.

1448
నాదము బ్రహ్మంబనుచును వేదములను జదువవచ్చు వినికనినంతన్ నాదంబులేని బయలున నాదా౦తమె పూర్ణ పదవి నయముగ వేమా

నాదము బ్రహ్మంబనుచును వేదములను
జదువవచ్చు వినికనినంతన్
నాదంబులేని బయలున నాదా౦తమె
పూర్ణ పదవి నయముగ వేమా

నాదమే బ్రహ్మమని వేదములవల్ల తెలిసికొనవచ్చును . ఇట్లు సర్వదా మననము చేయుచున్న యెడల నాదా౦తమే పూర్ణమైన ముక్తిపదవి యని తెలియును

Naada (aum) is brahmam as per Vedas. The end of naada for one who is meditating on it is the salvation.

1449
నాదము ముక్తికి దెరువగు వాదుల తెలియంగ నగును పరిపక్వముతో భేదంబు మాని మదిలో వేదికపైజేరి వినుము విసువక వేమా

నాదము ముక్తికి దెరువగు వాదుల
తెలియంగ నగును పరిపక్వముతో
భేదంబు మాని మదిలో వేదికపైజేరి
వినుము విసువక వేమా

నాదమే ముక్తికి మార్గము . కావున నాదతత్త్వమును పరతత్త్వమును బుద్ధితో మెలుగుటకు మాని మనస్సులో వేదికపై చేరి ముక్తికి యత్నింపుము

Naadam (aum) leads to salvation. So naada tattva and Para Tattva (meaning “Supreme Truth,” as studied, realized, worshiped and revealed by the saints of Vedic tradition) are not much different.

1450
నిండిన మతమున వెదకిన నుండెడి యే వస్తువైన నుపము దలిర్పన్ దండిగ నిండిన పిమ్మట ఖండించిన వెలితిగాదు గదరా వేమా

నిండిన మతమున వెదకిన నుండెడి
యే వస్తువైన నుపము దలిర్పన్
దండిగ నిండిన పిమ్మట ఖండించిన
వెలితిగాదు గదరా వేమా

మతస్థాపకులగు ఆచార్యులచే నెలకొల్పబడిన మతములలో బాగుగా ప్రదేశము కల్గించుకొని యోచించినచో తరించు మార్గములు చాలా తోచును . ఆ రహస్యములను అవగతము చేసికొన్ననాడు మత ధర్మములు నాక్షేపింపడు

The religions founded by religious gurus provide several paths to salvation. So there is no reason to criticize them.

1451
నిన్ను జూచెనేని తన్ను దామఱచును దన్ను జూచెనేని నిన్ను మఱచు నే విధమన మనుజుడెఱుగు నిన్ను నదన్ను వి. వే.

నిన్ను జూచెనేని తన్ను దామఱచును
దన్ను జూచెనేని నిన్ను
మఱచు నే విధమన మనుజుడెఱుగు
నిన్ను నదన్ను వి. వే.

బ్రహ్మమును చూచినచో తన్నుదామరచును. తన్ను చూచినచో బ్రహ్మమును మరచును . ఇట్టి స్థితిలో ఉభయమును తెలిసికొనగలుగుట మిక్కిలి కష్టము

One forgets self when seeing brahmam and vice-versa. It is difficult to observe self and brahmam at the same time.

1452
నిమిషమైనను మది నిల్పి నిర్మలముగ లింగ జీవేశులను గాంచి భంగపడక పూజ మదియందు జేరుట పూర్ణపదవి పరము గోరిన నిది చేయు బాగు వేమ

నిమిషమైనను మది నిల్పి నిర్మలముగ
లింగ జీవేశులను గాంచి భంగపడక
పూజ మదియందు జేరుట పూర్ణపదవి పరము
గోరిన నిది చేయు బాగు వేమ

తనకెన్నియో పనులున్నను , క్షణకాలమైనను తీరికి చేసుకొని నిర్మలమైన మనస్సుతో లింగజీవాత్మ పరమాత్మములను నిశ్చలబుద్ధితో చూచి పూజించినచో పూర్ణపదవి సిద్ధించును . మోక్షము కోరువారికి ఇది అవసరము

However busy one is, if he prays to paramaaatma with an unchangeable mind even for a few seconds every day, he will attain salvation.

1453
నియత వృత్తి మీఱి నిట దుర్గముజేరి భయములేకయుండు బ్రహ్మవేత్త జయము కల్గి ముక్తి జవిచూచుచుండురా , వి. వే.

నియత వృత్తి మీఱి నిట దుర్గముజేరి
భయములేకయుండు బ్రహ్మవేత్త
జయము కల్గి ముక్తి
జవిచూచుచుండురా , వి. వే.

సంసారపు నియమ పద్ధతులు విడిచి, దృక్చత్తిని నిటలమునందుచేర్చి నిర్భయముగా వర్తించువాడే బ్రహ్మవేత్త . అతనే ముక్తిని చవిచూడగలడు

One who gives up bondage and focuses the vision on the forehead is called brahma-vEtta (one who knows everything about brahmam)

1454
నిరతం బెడ తెగకుండన్ పరిపూర్ణ బ్రహ్మ మాత్మపదమున నుండున్ నిరవద్యమైన యడవిని జరియించును జగమెఱుగ సత్యము వేమా

నిరతం బెడ తెగకుండన్ పరిపూర్ణ
బ్రహ్మ మాత్మపదమున నుండున్
నిరవద్యమైన యడవిని జరియించును
జగమెఱుగ సత్యము వేమా

ఎల్లపుడును ఆవిఛ్ఛన్నముగా పరిపూర్ణమగు బ్రహ్మము హృదయమున ఉండగా , అవివేకులగు మానవులు అడవులం బట్టి అచటనేమో యున్నదని వెదకుచుండురు

When brahmam is present in one's heart relentlessly, foolish people go to forests in search of brahmam.

1455
నిహతి పుట్టువులకు నెల విహమందురు కుహరలోకమందు గుతుక మేది? దహరమందు జూడ దగులును తత్త్వంబు , వి. వే.

నిహతి పుట్టువులకు నెల విహమందురు
కుహరలోకమందు గుతుక
మేది? దహరమందు జూడ దగులును
తత్త్వంబు , వి. వే.

జనన మరణములకు ఇహమే కారణమందురు . కాని గుహలాంటి ఈ లోకమున కుతకము కానరాదు . దాహరము నుండు చూచినయెడల తత్త్వము అవగతమగును

Sages say birth and death are found only in this world. In spite of that in this cave-like world one is desirous of things one can't experience. When one realizes this in the subtle body, one will understand the tattva.

1456
నిర్గుణాంశము మదినెన్ని నేర్పు మీఱ స్వర్గమని యెంచుచుండిన శాశ్వతంబు భర్గుడై తాను బాముల బాపునయ్య దుర్గణభ్రమలను బాయు దొసగు వేమ

నిర్గుణాంశము మదినెన్ని నేర్పు మీఱ
స్వర్గమని యెంచుచుండిన శాశ్వతంబు
భర్గుడై తాను బాముల బాపునయ్య
దుర్గణభ్రమలను బాయు దొసగు వేమ

నేర్పుతో నిర్గుణమైన అంశమును ధ్యానించును . దానియందు స్థిమితబుద్ధి కలిగియున్నచో బ్రహ్మతత్త్వమును పొందినచో పాపములు నశించును. భ్రమలు తొలగును

If one meditates on a subject devoid of gunas (sattva-calm, rajas-active, tamas-indolent) with unperturbed mind, one can attain brahma tattva. He will be free of sins and delusions.

1457
నిష్ఠయందును దృఢమైన దృష్టింబూని కష్టయోగంబులను మించి కాంక్షతీఱ వ్యష్టి పరిపూర్ణమందుట వదలకున్న స్పష్టమపుడౌను సంతోష సరణి వేమ

నిష్ఠయందును దృఢమైన దృష్టింబూని
కష్టయోగంబులను మించి కాంక్షతీఱ
వ్యష్టి పరిపూర్ణమందుట వదలకున్న
స్పష్టమపుడౌను సంతోష సరణి వేమ

నియమనిష్ఠలందు దృష్టినుంచి , కష్టములైన యోగములను విడిచివేసి జ్ఞానపరిపూర్ణత్వము నొందుటకు ప్రయత్నము చేసినచో బ్రహ్మానందము పొందవచ్చును

When one follows a principled life without carrying out difficult yoga practices and strives to acquire knowledge, then one will enjoy the bliss of knowing brahmam

1458
నీరను బుట్టిన దుప్పగు క్షారము నీరాయె , నీరు క్షారము నొకటే ఈ రీతి శివుని జీవుని వారక మది నెఱు౦గనగును వసుధను వేమా

నీరను బుట్టిన దుప్పగు క్షారము
నీరాయె , నీరు క్షారము నొకటే
ఈ రీతి శివుని జీవుని వారక
మది నెఱు౦గనగును వసుధను వేమా

ఉప్పు నీరునుండి పుట్టును. ఉప్పు నీరుగా మారును . ఇట్లే జీవునకును భగవంతునకును గల వ్యత్యాసములేని తాదాత్మ్యమును ఊహింపవలెను

Salt can be made from (sea) water. And it can be dissolved in water. Similarly jiva and god have a symbiotic relationship without any difference.

1459
నీవాడిన నేనాడును నీవుండిన నేనునుందు నిర్వణ్ణు౦డవై నీవు దలచిన దలపుదు నీవు నగిన నేను నగుదు నిజముగ వేమా

నీవాడిన నేనాడును నీవుండిన
నేనునుందు నిర్వణ్ణు౦డవై నీవు
దలచిన దలపుదు నీవు నగిన
నేను నగుదు నిజముగ వేమా

ఓ దేవా! నే నస్వతంత్రుడను . నీవు పల్కిన నేను పలుకుచున్నాను . నీవున్ననే నేను ఉందును . నీవు తలచిన నేను తలచుచున్నాను . నీవు నవ్విన నేను నవ్వుదును . నా పనులన్నియు నీ లీలలేకదా!

God, I am dependent on you. When you speak, I talk. If you exist, I do so. When you think, I do the same. When you laugh, I too laugh. All of my actions are because of you.

1460
నీవు నెఱిగినను లోకంబు నీకు దోచు నీవు మఱిగిన తోడ్తోడ నెందు బోయె ననెడి యెఱుకను విడనా డయ్య యోగి దాన పరమార్థ మెఱుగంగ నౌను వేమ

నీవు నెఱిగినను లోకంబు నీకు దోచు
నీవు మఱిగిన తోడ్తోడ నెందు బోయె
ననెడి యెఱుకను విడనా డయ్య యోగి
దాన పరమార్థ మెఱుగంగ నౌను వేమ

“నీవు కనుగొనుచో లోకము నీకు కానవచ్చును . నీవాత్మ దర్శనము నుండి లోకమును కాంచలేని నీకు లోకమే లేదు " అను యోగి యంశమును గమనించి పరమార్థమును గ్రహింప వీలగును

If one sets out to discover the external world, it will reveal itself to one. On the other hand, if one looks inward and visualizes self (aatma), one doesn't feel the world.

1461
నేజొచ్చిన తోడనె మఱి తాజచ్చును నపుడె పంచ తత్త్వము లొకటౌ రాజత్ స్వరూపమునందు దాజితుడై నిలిచియుండు తధ్యము వేమా

నేజొచ్చిన తోడనె మఱి తాజచ్చును
నపుడె పంచ తత్త్వము లొకటౌ
రాజత్ స్వరూపమునందు దాజితుడై
నిలిచియుండు తధ్యము వేమా

అహంకారము నశించినంతనే "తా" నను బుద్ధియు పోవును. పంచతత్త్వము లప్పుడేకమై పరమాత్మ స్వరూపము నిలిచియుండును

One will not think about self when his ego is destroyed. Then the pancha-tattvas: 1. గురు తత్త్వం, (guru) 2. మంత్ర తత్త్వం, (mantra) 3. మనస్తత్త్వం, (mind) 4. దేవ తత్త్వం, (god) 5. ధ్యాన తత్త్వం.(meditation) will unify as paramaatma

1462
పంచభూతములను బరగి యుండెడివాడు పంచలింగములను ప్రబలియుండు పంచబీజములను భావింపదానయా , వి. వే.

పంచభూతములను బరగి యుండెడివాడు
పంచలింగములను ప్రబలియుండు
పంచబీజములను
భావింపదానయా , వి. వే.

పంచభూతములు, పంచేంద్రియములు , పంచబీజములును పరమాత్మ రూపాములే

Pancha-bhoota (earth, water, fire, air, space), pancha-indriya (5 senses eye, ear, skin, nose, tongue), pancha-beeja (5 seeds) are manifestations of paramaatma

1463
పంచభూతములను బరగ నింద్రియముల సంచరించినపుడు జగము కలుగు సంచరింపకున్న జగమెట్టు కలుగురా? వి. వే

పంచభూతములను బరగ నింద్రియముల
సంచరించినపుడు జగము
కలుగు సంచరింపకున్న జగమెట్టు
కలుగురా? వి. వే

పంచభూతములు కలయికవలన ఇంద్రియము చరించిన యెడల జగములు పుట్టును . అవి సంచరింపకున్నచో ఉత్పత్తి కార్యము నిలిచిపోవును

World is born and sustained by the interaction of indriya (eye, nose, ear, tongue, skin) and pancha-bhoota (earth, water, air, space, fire). If there is no interaction between them, then the world will stop expanding.

1464
పటిమ మీఱ మనసు పాటించిచూడక కిటుకు తెలియరాదు కెరలుటకును జటిల వేషమేల జైత్రుడై సాధింప, వి. వే.

పటిమ మీఱ మనసు పాటించిచూడక
కిటుకు తెలియరాదు కెరలుటకును
జటిల వేషమేల జైత్రుడై
సాధింప, వి. వే.

మనస్సును స్థిరముగా నిలుపనియెడల అందలి కిటుకు తెలియదు . జడలుదాల్చి వేషమువేసిన ప్రయోజనము లేదు. మోక్షమునకు యోగివేష మక్కరలేదు

One has to have an unwavering mind. There is no use with matted hair. There is no need for a yogi garb to attain salvation

1465
ప౦తము విడకయె నెమ్మది చింతనమున గుర్తుతెలిసి చిన్మయమందన్ వింతలడగున మానస మింతి౦తని చెప్పరాని దెఱుగుము వేమా

ప౦తము విడకయె నెమ్మది చింతనమున
గుర్తుతెలిసి చిన్మయమందన్
వింతలడగున మానస మింతి౦తని
చెప్పరాని దెఱుగుము వేమా

పట్టినపట్టు విడువక ధ్యానించుచున్నయెడల చిత్స్వరూపమును పొందవచ్చును . భ్రాంతులు తొలగిపోవును . బ్రహ్మముకూడ గోచరింపగలదు

With a firm determination when one meditates one can acquire sookshma (miniature) body (3-bodies : sthoola-gross, kaarana-causal, sookshma-miniature). One will lose delusions. It is possible to see brahmam.

1466
పనితొడవుల వేఱు బంగారు వొక్కటి పలు ఘటములు వేఱు ప్రాణమొకటి అరయదిండ్లు వేఱటాకలి యొక్కటి, వి. వే.

పనితొడవుల వేఱు బంగారు వొక్కటి
పలు ఘటములు వేఱు ప్రాణమొకటి
అరయదిండ్లు వేఱటాకలి
యొక్కటి, వి. వే.

నగలు వేరైనను వాని లోని బంగారమొక్కటే . దేహములు వేరైనను ప్రాణమొక్కటే . ఆహారములు వేరైననూ ఆకలి యొక్కటే . మాయవలన రూపములు వేరైనను పరమాత్మ ఒక్కడే .

From gold different ornaments are made. The praana (breath) is the same in different bodies. Hunger is the same despite various types of food. Similarly even though the forms are different because of maaya (illusion), there is only one paramaatma

1467
పరధనంబులకును బారుగా జేసాచి సత్యమింతలేని చట్టు ద్విజులు ద్విజులమంచు నెంత్రు తేజమింతయు లేక, వి. వే.

పరధనంబులకును బారుగా జేసాచి
సత్యమింతలేని చట్టు ద్విజులు
ద్విజులమంచు నెంత్రు
తేజమింతయు లేక, వి. వే.

పరుల సొమ్ము నాశించుచు , అసత్యములు పల్కుచు , తేజస్సు లేకయు బ్రాహ్మణులమని చెప్పుకొనువారు బ్రాహ్మణులెట్లగుదురు ?

Coveting others' wealth, telling lies, without aura, some people claim they are brahmins.

1468
పరగ బ్రహ్మగ్రుడ్డు పరికించి చూచిన కులములన్ని యందె కూడి పుట్టె అందఱొకట గలియు నన్నదములె కదా? వి. వే.

పరగ బ్రహ్మగ్రుడ్డు పరికించి
చూచిన కులములన్ని యందె
కూడి పుట్టె అందఱొకట గలియు
నన్నదములె కదా? వి. వే.

జాతులన్నియు బ్రహ్మాండమున ఒకటిగా పుట్టినందున అందరును సోదరులే ! జాతిభేదమును పాటించుట తగదు

Various races in the world are born the same. Hence people of all races are equal. There should not be racial differences.

1469
పరులను నీవని తలచెడి పరబుద్ధిని మీఱకీవు పదరక యున్నన్ సిరి వేతృతందు దోచెను పరిపూర్ణమై బట్టబయలు బాగుగ వేమా

పరులను నీవని తలచెడి పరబుద్ధిని
మీఱకీవు పదరక యున్నన్
సిరి వేతృతందు దోచెను పరిపూర్ణమై
బట్టబయలు బాగుగ వేమా

“తాను, పైవాడు" అను భేదబుద్ధిని విడిచి సమత్వము కల్గినచో బ్రహ్మస్వరూపము పరిపూర్ణముగా బట్టబయలై ముక్తి లభించును

When one gives up the discrimination between self and others and practices equality, then brahmam will be revealed resulting in salvation.

1470
పలుగు ఱాళ్ళదెచ్చి పరగ గుడులు కట్టి చెలగి శిలల సేవ చేయనేల? శిలల సేవజేయ ఫలమేమి గల్గురా? వి. వే.

పలుగు ఱాళ్ళదెచ్చి పరగ గుడులు
కట్టి చెలగి శిలల సేవ
చేయనేల? శిలల సేవజేయ ఫలమేమి
గల్గురా? వి. వే.

రాళ్ళతో గుడులుకట్టి , రాతివిగ్రహాల నందుంచి పూజించనేల ? రాళ్ళను పూజించుటవలన ప్రయోజనములేదు

Why do people build temples with stones and worship stone idols? There is no use in idol worship.

1471
పాలు త్రాగినపుడు ప్రాణంబు రక్షించు పాలు త్రాగకున్న బడలికౌను పాలవలన ముక్తి ఫలమందగా లేక చాల రోగపడును జగతి వేమ

పాలు త్రాగినపుడు ప్రాణంబు రక్షించు
పాలు త్రాగకున్న బడలికౌను
పాలవలన ముక్తి ఫలమందగా
లేక చాల రోగపడును జగతి వేమ

పాలు త్రాగిన ప్రాణము నిలుచును . పాలు త్రాగనిచో బడలిక కలుగును. పాలువలన రోగ విముక్తి కలుగునని తెలియక చాలమంది అవి త్రాగక రోగమువల్ల బాధపడుచుందురు

Milk supports life. Without milk one can feel weakness. Milk can help in preventing diseases. A lot of people don't know these facts and suffer from diseases without consuming milk.

1472
పాలు పెరుగు వెన్న పరగు నన్నము తిని స్త్రీల గననివాడు శీలవంతు డొక్కడైన వాడె యుత్తమ శివుడయా , వి. వే.

పాలు పెరుగు వెన్న పరగు నన్నము
తిని స్త్రీల గననివాడు
శీలవంతు డొక్కడైన వాడె యుత్తమ
శివుడయా , వి. వే.

పాలు పెరుగు వెన్నలు తిన్నచో స్త్రీలపై వాంఛ కలుగక తప్పదు. ఆ వాంఛ లేనివాడు ఉత్తమశీలుడు . అతడే శివస్వరూపుడు

When one drinks milk, consumes yogurt (curd) and cream of milk, his mind turns to women. One without such diversion is of superior character. He is the incarnation of Lord Siva.

1473
పిండ మండమందు బెనగుచు నున్నట్టి తండ్రిబిందు నాదు దనర గూడి అండమై నిలిచిన యపుడు గర్భమటందు రవని జనములప్పుడరయ వేమ

పిండ మండమందు బెనగుచు నున్నట్టి
తండ్రిబిందు నాదు దనర గూడి
అండమై నిలిచిన యపుడు గర్భమటందు
రవని జనములప్పుడరయ వేమ

పిండము గర్భకోసమునందు చేరి బిందు నాదములను పొంది అండరూపమున నిలిచినయెడల గర్భమని చెప్పుచుందురు

When fetus is formed in the womb from egg and acquires bindu-naadaa, then a woman is said to be pregnant.

1474
అండపిండమునడి బిందు వాత్మజ్యోతి యర్కుజ్యోతి సరసి జాండమందు నాదబిందువులకు నడుమ నద్భుతజ్యోతి, వి. వే.

అండపిండమునడి బిందు వాత్మజ్యోతి
యర్కుజ్యోతి సరసి జాండమందు
నాదబిందువులకు నడుమ
నద్భుతజ్యోతి, వి. వే.

పిండా౦డముల నడుమ బిందువును సరసిజండము బ్రహ్మాండమున సూర్యుని జ్యోతియు , నాదబిందువులు నడుమ పరమాత్మయును గొప్ప కాంతితో వెలుగుచుండును

At the center of fetus there is a bindu called sarasija that shines with great light like the world is lit up by the brightness of sun. At the center of naada-bindu, paramaatma shines with resplendence.

1475
పిడుగు పడిన తావు దడదడగా నుండు పిడుగు పడిన గొంప నడికి గూలు పిడుగు పడిన వాని ప్రేత మేమనవచ్చు వి. వే.

పిడుగు పడిన తావు దడదడగా నుండు
పిడుగు పడిన గొంప నడికి
గూలు పిడుగు పడిన వాని
ప్రేత మేమనవచ్చు వి. వే.

పిడుగుపడినచోటు కంపించి పోవును. అది ఇంటిపై పడిన ఇల్లు కూలపోవును . మనుష్యునిపై పడిన అతడు రూపు లేకుండ నశించును

When lightning strikes, the objects stuck will feel the tremor. If it strikes the house, then the house will be destroyed. A man stuck by lightning will perish.

1476
పిన్నవాండ్ర స్వేఛ్ఛ మన్నన జెఱచును ఆడువా౦డ్ర స్వేఛ్ఛ గోడొనర్చు పురుషవరుని స్వేఛ్ఛ భూతిని గూర్చురా , వి. వే.

పిన్నవాండ్ర స్వేఛ్ఛ మన్నన జెఱచును
ఆడువా౦డ్ర స్వేఛ్ఛ గోడొనర్చు
పురుషవరుని స్వేఛ్ఛ
భూతిని గూర్చురా , వి. వే.

పిల్లలకు స్వేఛ్ఛయున్న అడకువ నశించును . ఆడు వారికి స్వేఛ్ఛయున్న కీడు కల్గును . పురుషుల స్వేఛ్ఛయే మేలైనది

Children with too much freedom will not be obedient. Bad things happen when women are given too much freedom. So it is better that only men have the freedom.

1477
పిరిగొను హంసను మదిలో బరబర గుంభించి పట్టి బిత్తర వోకన్ స్థిరభావసిద్ధి గైకొని పరిపూర్ణ సమాగమమును బడయుము వేమా

పిరిగొను హంసను మదిలో బరబర గుంభించి
పట్టి బిత్తర వోకన్
స్థిరభావసిద్ధి గైకొని పరిపూర్ణ
సమాగమమును బడయుము వేమా

హంసకళను మనస్సులో కుదురుపరచి , భయము వీడి స్థిరుడైనచో పరిపూర్ణ బ్రహ్మ సమాగమమును పొందవచ్చును

By planting hamsa-kala in the mind and giving up fear, it is possible to unify with brahmam

1478
పిండము పృధివిని బడగా నండనె తగు మంత్రసాని యది దెల్పును దా మెండుగ మగవాడంచును దండిగ నీ జనము లెఱుగ ధరలో వేమా

పిండము పృధివిని బడగా నండనె
తగు మంత్రసాని యది దెల్పును
దా మెండుగ మగవాడంచును దండిగ
నీ జనము లెఱుగ ధరలో వేమా

తల్లి గర్భమునుండి శిశువు భూమిపై పడగానే మంత్రసాని చూచి, మగ బిడ్డయో , ఆడు బిడ్డయో తెలుపు చున్నది. పిదప లోకులకు తెలియును. ఇట్లే తత్త్వమును విజ్ఞులే తెలుపవలెను

When a fetus is delivered, the mid-wife who assisted the mother, knows its gender first. Then the relatives and friends will know about it. Similarly learned people should preach tattva.

1479
పిడుగును నరచేత బిగబట్టి యందులో కల్మషంబులెల్ల కడకు దీసి కడమ కరముచేత కలి జనములబ్రోచు కర్మకర్త నెఱుగ గదర వేమ

పిడుగును నరచేత బిగబట్టి యందులో
కల్మషంబులెల్ల కడకు దీసి
కడమ కరముచేత కలి జనములబ్రోచు
కర్మకర్త నెఱుగ గదర వేమ

దైవము మహిమ చెప్ప సాధ్యముకానిది . పిడుగునైన అరచేత పట్టుకొని పాపములను పోగొట్టి ఆప్తులను , ఆశ్రితులను రక్షించును . సమస్త కర్మలకును దైవమే సాక్షి

It is impossible to describe the greatness of god. He can capture lightning and save his devotees and worshipers. He is the witness to all karma (actions).

1480
పిలిచిన పలుకును దేవుడు పలుకుననే నిండియున్న ప్రభువైయుండున్ వెలుగున వెలుగై మించెడు వెలుగే పరమాత్మ బయలు విడకది వేమా

పిలిచిన పలుకును దేవుడు పలుకుననే
నిండియున్న ప్రభువైయుండున్
వెలుగున వెలుగై మించెడు వెలుగే
పరమాత్మ బయలు విడకది వేమా

పరమాత్మ మానవుల హృదయములో నున్నను, పలుకులోన ఇమిడియున్నను పిలిచిన పలుకును . హృదయమున ఉన్న జ్ఞానజ్యోతియే పరమాత్మ . ఈ యంశమును మాత్రము మరిచిపోవొద్దు

paramaatma will respond when beckoned because he resides in our hearts and mind. The resplendence near the heart is paramaatma.

1481
పిసిని వానియింట బీనుగు వెడలిన గట్టె కోలలకును గాసు లిచ్చి వెచ్చమాయనంచు వెక్కివెక్కి మారేడ్చు , వి. వే.

పిసిని వానియింట బీనుగు వెడలిన
గట్టె కోలలకును గాసు లిచ్చి
వెచ్చమాయనంచు వెక్కివెక్కి
మారేడ్చు , వి. వే.

లోభివానియింట ఎవరైన చచ్చిన పాడెకట్టెకు డబ్బులిచ్చి డబ్బు ఖర్చయిపోయిందని దుఃఖించును . లోభి మిక్కిలి నీచుడు

A miser will cry if he has to part with money to pay for funeral. A miser is a low-life.

1482
పుక్కిటి సతివాని బూజింప దోషంబు యురము సుదతి వాని యూహ లెస్స నెత్తియు విదవాని బత్తియే వరమిచ్చు , వి. వే.

పుక్కిటి సతివాని బూజింప దోషంబు
యురము సుదతి వాని యూహ
లెస్స నెత్తియు విదవాని బత్తియే
వరమిచ్చు , వి. వే.

బ్రహ్మను పూజింపనేరాదు . విష్ణు పూజ కొంత మేలు . శివుని పూజించుటయే ఉత్తమము. శివభక్తియే భక్తి.

One should not worship Lord Brahma. It is better to worship Lord Vishnu. The best of all is worshiping Lord Siva.

1483
పుట్టలోని తేనె పుట్టిన రీతిని గట్టుమీద మఱియు బుట్టునట్లు కట్టేలోన నగ్ని పుట్టిన విధమున బుట్టిమెట్టవలెను భువిని వేమ

పుట్టలోని తేనె పుట్టిన రీతిని
గట్టుమీద మఱియు బుట్టునట్లు కట్టేలోన
నగ్ని పుట్టిన విధమున
బుట్టిమెట్టవలెను భువిని వేమ

పుట్టలో తేనె లభించునట్లు , కొండగనులలో మణులు దొరికినట్లును , కట్టెలో అగ్ని లభించినట్లును మానవుడు ఘనతను పొందవలెను. ఘనుని జన్మమే జన్మము

Like honey is available in comb, precious stones are found in the mines, fire can be made from wood, one should achieve greatness.

1484
పుట్టి చచ్చు నరుడు పూర్వమే మెఱుగక బట్టబయలనుండి బ్రమసియైన తెలివి విడిచి భూమి తిరుగంగ నేటికి? వి. వే.

పుట్టి చచ్చు నరుడు పూర్వమే
మెఱుగక బట్టబయలనుండి బ్రమసియైన
తెలివి విడిచి భూమి
తిరుగంగ నేటికి? వి. వే.

మానవుడు జననమరణములను చూచి, ప్రపంచమంతయు భ్రాంతిమూలమని ఎరిగియు తెలివిలేక విషయలోలుడై ప్రపంచమంతయు తిరుగుచున్నాడు

Men see the cycle of birth-death, know that world is not real and yet roam around the world by getting caught up in trivialities.

1485
పుట్టినదియు మొదలు పురుషుడేర్పడు దాక మంత్రసాని గూడు మరగి యంత పోయెరావెయనుచు బుత్తురు సెలవిచ్చి , వి. వే.

పుట్టినదియు మొదలు పురుషుడేర్పడు
దాక మంత్రసాని గూడు మరగి
యంత పోయెరావెయనుచు బుత్తురు
సెలవిచ్చి , వి. వే.

ప్రసవమై తల్లినుండి బిడ్డ వేరుపడువరకు మంత్రశానిని మిక్కిలి మర్యాదగా చూచి, ప్రసవమైన వెంటనే లెక్కచేయరు . అట్లే కార్యవాదులు తమ పని తీరిపోగానే ఇతరులను లెక్క చేయరు

Until a women delivers the baby, the mid-wife will be treated with respect. Once the baby is delivered, no one pays attention to the mid-wife. Similarly people who focus on getting things done, ignore the persons who carried out the tasks.

1486
పుట్టినపుడె బొడ్డుపట్టి కోయుచు నుండ నప్పుడు గురుముద్ర లానతిపడె ముద్రలేనివారు ముజ్జగంబుల లేరు, వి. వే.

పుట్టినపుడె బొడ్డుపట్టి కోయుచు
నుండ నప్పుడు గురుముద్ర
లానతిపడె ముద్రలేనివారు
ముజ్జగంబుల లేరు, వి. వే.

బిడ్డపుట్టగా బొడ్డుకోయునపుడే గురుముద్రలు పడినవి. కాన, వేరే ముద్ర లక్కరలేదు . గురు ముద్రలేనివారు లోక మందున లేరు.

When the umbilical cord is cut guru-mudra will be implanted on the new born. There is no need for other mudra. There is no one without a guru-mudra.

1487
పుట్టినప్పుడు లెచ్ఛనే పుడమి విడిచి గిట్టునప్పుడు కొనునొకో యట్టి ధనము ? నడుమ నీయాజ్ఞ వచ్చె ద్రినయన యనుచు నర్థికిని నీయడేమందు వ్యర్థు వేమ

పుట్టినప్పుడు లెచ్ఛనే పుడమి విడిచి
గిట్టునప్పుడు కొనునొకో యట్టి ధనము?
నడుమ నీయాజ్ఞ వచ్చె ద్రినయన యనుచు
నర్థికిని నీయడేమందు వ్యర్థు వేమ

లోభి వ్యర్థుడు . అతడు పుట్టినపుడు ధనముతో రాలేదు. పోవునపుడు వెంట తీసికొని పోలేడు . అయినను ఇతరుల కిచ్చుటకు బుద్ధి పుట్టనే పుట్టదు . అట్టివాని నేమందుము ?

A miser is worthless. He was not born with money. He cannot take it with him to the nether world after death. In spite of that he has no inclination to share his wealth with others.

1488
పుట్టువార లెవరు? పుట్టకుందు రెవరు ? పుట్టిగిట్టనట్టి పురుషులెవరు? పుట్టిపుట్టనట్టు బోధించి చూడరా , వి. వే.

పుట్టువార లెవరు? పుట్టకుందు
రెవరు ? పుట్టిగిట్టనట్టి పురుషులెవరు?
పుట్టిపుట్టనట్టు
బోధించి చూడరా , వి. వే.

కర్మానుభవమునకు జనన మరణములు కలుగుచునే యుండును. పుట్టినవారిలో చావనివారు లేరు. పుట్టువు వలని కష్టములేని మార్గమును జ్ఞానముచే తెలిసికొనవలెను

As per the law of karma, birth and death will repeat. All the men born will die one day. One has to free oneself from life and death cycle with gnaana.

1489
పుట్టుశక్తు లైదు పుడమి నటింపంగ విప్రులెల్ల వేదవేత్తలండ్రు శక్తి పుత్రకులము జగతి నెఱు౦గరో , వి. వే.

పుట్టుశక్తు లైదు పుడమి నటింపంగ
విప్రులెల్ల వేదవేత్తలండ్రు
శక్తి పుత్రకులము
జగతి నెఱు౦గరో , వి. వే.

పుట్టుకకు పంచ శక్తులే కారణము. అందరు శక్తి పుత్రులే ఒకే కులము. బ్రాహ్మణులు తాము వేదవేత్తలమని విర్రవీగుట తగదు

It has been said that pancha-sakti (ఉమ (uma), అంబిక (ambika), గణేశ్వరి(ganEswari), ఈశ్వరి (eeswari), మనోన్మని(manOnmani) are responsible for birth. So all of us are of the same sakti caste. It is unbecoming of brahmins who are egoistic about their knowledge of vedas.

1490
పుడమిని గల నడ జీవులు బడబాగ్నియు దీవులకును భానుని యెడలన్ జడమును గూడిన యప్పుడె వెడలని ప్రళయంబులకు విధమిది వేమా

పుడమిని గల నడ జీవులు బడబాగ్నియు
దీవులకును భానుని యెడలన్
జడమును గూడిన యప్పుడె వెడలని
ప్రళయంబులకు విధమిది వేమా

భూమిపై ప్రాణులు , సముద్రమందలి బడబాగ్ని చేత , సూర్యునిచేత కాగిన సముద్రజలము ఏకమైపోయినపుడే ప్రళయము సంభవించును

The world will be destroyed and all life forms perish due to the fire burning under the oceans and sea water that boils because of sun's rays.

1491
పుడమిలోన నరులు పుత్రుల గనగోరి యడాలుచుందు రనుపమాశచేత కొడుకు గలిగనంత కులముద్ధరించునా? , వి. వే.

పుడమిలోన నరులు పుత్రుల గనగోరి
యడాలుచుందు రనుపమాశచేత
కొడుకు గలిగనంత కులముద్ధరించునా?,
వి. వే.

లోకములోని జనులు పుత్రులు కావలెనని తహతహ పడుచుందురు . పుట్టిన పుత్రుడు మాత్రము తన్ను కులమును ఉద్ధరించునా?

People will be craving for a son. Will all sons look after the parents and bring honor to the caste?

1492
పుత్రసంతులేక పురుషుడు జగతిలో పుణ్యలోకమెట్లు పొందగలడు పుత్రహీనునకును పుణ్యంబు కలదెట్లు , వి. వే.

పుత్రసంతులేక పురుషుడు జగతిలో
పుణ్యలోకమెట్లు పొందగలడు
పుత్రహీనునకును పుణ్యంబు
కలదెట్లు , వి. వే.

పుత్రులు లేనియెడల పుణ్యలోకములు లేవు. కాన పురుషునకు పుత్ర సంతానము కావలెను

Without a son a man's soul won't ascend to the heaven. Hence a man needs to have a son.

1493
పురములు నాటిపైనొక పురమందున మూలశక్తి బూనిక గనుమా , యురమున గురి గనినంతట పరిపూర్ణపు బ్రహ్మరూపు బయలగు, వేమా

పురములు నాటిపైనొక పురమందున
మూలశక్తి బూనిక గనుమా , యురమున
గురి గనినంతట పరిపూర్ణపు
బ్రహ్మరూపు బయలగు, వేమా

షట్ చక్రములకును పయినున్న సహస్రారమునందలి మూలశక్తిని లక్ష్య దృష్టితో తిలకించుటకు అభ్యసింపవలెను . అపుడే పరిపూర్ణమగు బ్రహ్మస్వరూపము గోచరించును

One has to meditate to visualize the sakti of sahasraara which is above the 6 chakras (moolaadhara, swadishtaana, anaahita, manipoora, visudda, agnaa) . Then only the wholesome brahmam will be attained.

1494
పురహరునకు నేత పురువు తా నేసిన స్థిరము కల్గు జ్ఞాన జీవమయ్యె నేతకేమివచ్చె నిజభక్తి హేతువు, వి. వే.

పురహరునకు నేత పురువు తా నేసిన
స్థిరము కల్గు జ్ఞాన
జీవమయ్యె నేతకేమివచ్చె నిజభక్తి
హేతువు, వి. వే.

సాలె పురుగు శివునకు బట్ట నేసిన మాత్రమున జ్ఞానము పొంది ముక్తి సంపాదించెను . అది ముక్తి నొందుటకు దానికి గల భక్తియే కారణము

In scripture it was revealed that a spider weaved a cloth for Lord Siva and received knowledge that helped it attain salvation. It is the devotion that is the basis for salvation.

1495
పునుగుపిల్లి యేల పుట్టించు వాసనల్ ? దాని మహిమ లేమి ధరణిలోన ? బ్రహ్మ చేత లెల్ల పాడైన చేతలు, వి. వే.

పునుగుపిల్లి యేల పుట్టించు
వాసనల్ ? దాని మహిమ లేమి
ధరణిలోన ? బ్రహ్మ చేత లెల్ల
పాడైన చేతలు, వి. వే.

బ్రహ్మ చేసిన నిర్మాణములను వర్ణింప సాధ్యము కాదు. పుణుగు పిల్లి చేసిన పుణ్యమేమో కాని దానికి గొప్ప సువాసన గల పునుగేర్పడెను

It is hard to discern Lord Brahma's creation. A punugu (civet) cat has great aroma in its punugu. No one knows what good karma it has done in its previous lives.

1496
పురుషు భాగ్యముననె పుణ్యవతి దొరకు పుణ్యవతికి నట్టె పుట్టు సుఖము నిరువు రనుభవింప హితులును పుత్రులు నష్టభోగములును అమరు వేమ

పురుషు భాగ్యముననె పుణ్యవతి దొరకు
పుణ్యవతికి నట్టె పుట్టు సుఖము
నిరువు రనుభవింప హితులును పుత్రులు
నష్టభోగములును అమరు వేమ

మగని యదృష్టము కొలది ఉత్తమ భార్య దొరకును. స్త్రీ అదృష్టము కొలది మంచి భర్త లభించును . ఇద్దరి అదృష్టమును బట్టి పుత్రులు, హితులు, అష్టయిశ్వర్యములు లభించును

A man's luck will bring a good wife. Based on a woman's luck she will get a virtuous husband. When both man and wife are lucky they get good children, friends and wealth.

1497
పూజసేయ జేయు బూజారి తానాయె పూజ్యవస్తు వెన్న భువిని తానె ఏడ పూజసేయ నెల్ల దిక్కులు తానె . తాను నేను నేను తానె వేమ

పూజసేయ జేయు బూజారి తానాయె పూజ్యవస్తు
వెన్న భువిని తానె ఏడ
పూజసేయ నెల్ల దిక్కులు తానె.
తాను నేను నేను తానె వేమ

దేవుని పూజించిన పూజారి యగును . తానే పూజ్యుడగు దేవుడైన ఎవనిని పూజించుట? సర్వత్ర తానే బ్రహ్మ స్వరూపుడై ఉండగా ఇతర పూజలవలన ఫలముండదు . పూజ లక్కరలేదు

A priest performs pooja for gods. If one is a god, then whom will he worship? When one is an incarnation of brahma manifest every where, there is no need to perform pooja.

1498
పూని సుఖ దుఃఖముల మీఱి మేనజేరి తాను తానగు తత్త్వంబు దాకి తాకి పోరి పరిపూర్తి నొందుట పుణ్యమయ్య ఇట్లు కాకున్న గడతేఱు టెట్లు వేమ

పూని సుఖ దుఃఖముల మీఱి మేనజేరి తాను
తానగు తత్త్వంబు దాకి తాకి పోరి
పరిపూర్తి నొందుట పుణ్యమయ్య ఇట్లు
కాకున్న గడతేఱు టెట్లు వేమ

సుఖ దుఃఖములను లెక్క చేయక తానే బ్రహ్మము అను తత్త్వమును గ్రహించి ధ్యానించి పూర్ణ స్వరూపమును పొందుటే గొప్ప పుణ్యము. లేకున్నచో ముక్తి లేదు

Without bothered by the comforts and sorrows, and realizing that self is brahmam, by meditating, it is possible to garner good karma. There is no salvation without good karma.

1499
పూర్ణమగు యుక్తి యోగికి పూర్ణము సాధనము సపరిపూర్ణము సంసా రార్ణవ తారకగోచర పూర్ణము పరిపూర్తి జెంద బూనుము వేమా

పూర్ణమగు యుక్తి యోగికి పూర్ణము
సాధనము సపరిపూర్ణము సంసా
రార్ణవ తారకగోచర పూర్ణము పరిపూర్తి
జెంద బూనుము వేమా

యోగములకు తగిన యుక్తులు యోగికి అవసరము . పిదప సంసార సాగరమును తరించుటకు తగిన పరిపూర్ణతను సంపాదించుటకు యత్నింపవలెను

A yogi should have the skills of a yoga. Then he should strive to be successful in managing his family and friends (samsaara) to attain wholeness.

1500
పెక్కు చదువులేల ? చిక్కువాదములేల ? ఒక్క మనసుతోడ నూఱకున్న సర్వసిద్ధుడగును సర్వంబు దానగు , వి. వే.

పెక్కు చదువులేల ? చిక్కువాదములేల?
ఒక్క మనసుతోడ నూఱకున్న
సర్వసిద్ధుడగును
సర్వంబు దానగు , వి. వే.

పెక్కు చదువులు చదివి వాదముల చేయుట కంటె స్థిరమైన మనస్సుతో నివేచన చేసిన యెడల తానే సర్వసిద్ధుడగు పరుడని తెలియును

It is better to analyze in mind and come to the conclusion that one is a manifestation of paramaatma rather than study scripture and perform debates.

1501
పెట్టువారలెవరు ? పెట్టకుండ్రెవరు పెట్టి పెట్టి నట్టి దిట్ట లెవరు? పట్టు దప్పకుండ భావించి చూడరా , వి. వే.

పెట్టువారలెవరు ? పెట్టకుండ్రెవరు
పెట్టి పెట్టి నట్టి
దిట్ట లెవరు? పట్టు దప్పకుండ
భావించి చూడరా , వి. వే.

పెట్టువాడు లేడు . పెట్టని వాడును లేడు . పెట్టియు పెట్టనివాడును లేడు . పెట్టినను పెట్టకున్నను జీవునకు ఈశ్వరుడే కర్త కావున అతనినే ధ్యానింపవలెను

There is no one who donates. There is no one who does not donate. There is no one who donates and doesn't donate. Regardless of donating or not donating, one should pray to Iswara.

1502
పెట్టిపోయువాడు కట్టడి గలదాత తిట్టి పోయువాడు తుట్టె పరువు రట్టు సేయువాడు రాణింపునకు రాడు, వి. వే.

పెట్టిపోయువాడు కట్టడి గలదాత
తిట్టి పోయువాడు తుట్టె
పరువు రట్టు సేయువాడు రాణింపునకు
రాడు, వి. వే.

బీద సాదలకు సంతోషముతో ఇచ్చువాడు గొప్పదాత . పెట్టియు తిట్టువాడు తుట్టెవాడు . తాను పెట్టితినని ఆర్భాటము చేయువాడు దాతల లెక్కలోనికి రాడు

One who gives alms to the poor is a great donor. One who donates and curses is a low life. One who advertises about his alms, will not be considered as a donor.

1503
పెరటజెట్టు పెట్టి పరికింపకుండిన వెలుగు దాటి తీగ వెడలబాఱు ఆడుదాని గుణము నటువలె నుండురా, వి. వే.

పెరటజెట్టు పెట్టి పరికింపకుండిన
వెలుగు దాటి తీగ
వెడలబాఱు ఆడుదాని గుణము నటువలె
నుండురా, వి. వే.

పెరటిలో మొక్క నాటినను, పెరటికి వెలుగులేనిచో తీగలు బయటికి పోవును. అట్లే ఆడుదియు అదుపులో ఉండని యెడల బయటికి పోయి చెడిపోవును

When one plants a seed in the backyard without sunlight, then the plant will find a way to seek sun light by crossing his property if necessary. Similarly if a woman is not controlled she will become a tramp and spoil her character.

1504
పొట్టివాడు కీడు పొడల పురుగు కీడు వట్టి యాస కీడు పఱడు కీడు పొట్టి చేయ కాలు పొసగుట కీడురా, వి. వే.

పొట్టివాడు కీడు పొడల పురుగు
కీడు వట్టి యాస కీడు పఱడు
కీడు పొట్టి చేయ కాలు
పొసగుట కీడురా, వి. వే.

పొట్టివాని వల్ల , పొడల పాము వల్ల కీడు కలుగును . వ్యర్థమైన కోరికయు , వరడును కీడు కల్గించును . పొట్టికాళ్ళు , పొట్టి చేతులు ఉన్న వాని వల్ల కూడ కీడే కలుగును .

One will face difficulties with a dwarf and a snake. Similarly a useless wish. Bad will happen because of one with short limbs.

1505
పొందుము హృది గురి దగు నానందము సద సద్వివేక నాదము పైగా నిందించు భ్రమల నెల్లను సందియని బలయు చేరు సాక్షిగ వేమా


పొందుము హృది గురి దగు నానందము
సద సద్వివేక నాదము పైగా నిందించు
భ్రమల నెల్లను సందియని బలయు
చేరు సాక్షిగ వేమా

మంచి చెడ్డల వివేకము ఓం కారము నాలకించిన ఆనందము కలుగును . ఆ యానందానుభవము పొందుచు భ్రమలను విడిచినచో బ్రహ్మమును పొందవచ్చును

When one listens to “aum” one will receive the ability to discriminate between good and bad and the resulting bliss. Thus, one by experiencing bliss, renouncing delusions can attain brahmam.

1506
ప్రణవమంత్ర మహిమ భావింప లింగంబె మూడు మూర్తులందు మొనసియుండు మాన్యు లెఱిగి కొలువ మనుజుల శక్యమా? వి. వే.

ప్రణవమంత్ర మహిమ భావింప లింగంబె
మూడు మూర్తులందు మొనసియుండు
మాన్యు లెఱిగి కొలువ
మనుజుల శక్యమా? వి. వే.

ఓంకార మహిమను గమనించినచో త్రిమూర్తి ఆత్మకమై ప్రకాశించును . దీని నెరిగి సేవించుట గొప్పవారికే (జ్ఞానులకే) కాని సామాన్యులకు సాధ్యము కాదు

When one meditates on “aum” one can visualize the trimurti (Lord Brahma, Lord Vishnu, Lord Siva). It is possible for great yogis but not common people.

1507
ప్రత్యక్షము రవిచంద్రులు ప్రత్యక్షము వాయు వగ్ని పానీయంబుల్ ప్రత్యక్షము భూదేవత ప్రత్యక్షము విశ్వమొల్ల బరగెడి వేమా

ప్రత్యక్షము రవిచంద్రులు ప్రత్యక్షము
వాయు వగ్ని పానీయంబుల్
ప్రత్యక్షము భూదేవత ప్రత్యక్షము
విశ్వమొల్ల బరగెడి వేమా

శివుని అష్ట మూర్తులలో సూర్యుడు, చంద్రుడు , వాయువు, అగ్ని, నీరు, భూమి, ఆకాశము ప్రత్యక్షముగా కానవచ్చుచున్నారు . ఎనిమిదవ మూర్తియగు బయలు పరతత్త్వమును కనుగొనుము

Among Lord Siva's 8 murtis: sun, moon, air, fire, water, earth, space are visible readily. One has to discover knowledge about nether world to realize the 8th murti.

1508
ప్రణవ మెఱుగనతడు భక్తుడు తాగాడు జ్యోతి జూడ నతడు జోగి కాడు నిత్యమెఱుగనతడు నిర్వాణి కాడయా, వి. వే.

ప్రణవ మెఱుగనతడు భక్తుడు
తాగాడు జ్యోతి జూడ నతడు జోగి
కాడు నిత్యమెఱుగనతడు
నిర్వాణి కాడయా, వి. వే.

ప్రణవ మెరుగనిచో భక్తుడు కాడు. తేజస్సు చూడనిచో యోగి కాడు. నిత్య స్వరూపు నెరుగనిచో ముక్తుడు కాడు

One is not a devotee without knowing “aum”. One is not a yogi if he can't experience aura. One cannot attain salvation without visualizing aatma.

1509
ప్రత్యక్షమగుము శివయని నిత్యము మదిలోన దలచి నిలిచిన యపుడే సత్యమగు జ్యోతి కనబడు నిత్యము దృప్తిజెంది నెరయుము వేమా

ప్రత్యక్షమగుము శివయని నిత్యము
మదిలోన దలచి నిలిచిన యపుడే
సత్యమగు జ్యోతి కనబడు నిత్యము
దృప్తిజెంది నెరయుము వేమా

“ఓ శివుడా! నాకు ప్రత్యక్ష మగుము" అని ప్రతిదినము ధ్యానించు చుండినచో నిజముగా జ్యోతి రూపమగు బ్రహ్మము కనబడును. ఆ జ్యోతిని చూచి సంతృప్తిచెందవలెను

If one prays intensely to Lord Siva to deify, one day the bright form of brahmam will appear. One has to be satisfied with that bright light.

1510
ప్రథమమున మాతృదేవత పదపడి జనకుండుటగును బరికింప నికన్ కుదిరిన సదమల గురుడే తుది దైవము పెరలు వేఱు తోరము వేమా

ప్రథమమున మాతృదేవత పదపడి జనకుండుటగును
బరికింప నికన్ కుదిరిన
సదమల గురుడే తుది దైవము
పెరలు వేఱు తోరము వేమా

తల్లియే మొదటి దైవము . తర్వాత తండ్రి . తర్వాత గురువు . ఈ ముగ్గురికంటే వేరే దైవము లేడని తెలిసికొనవలెను

Mother is foremost god. Then comes father. Guru is next. There is no other god.

1511
ప్రభుల కిచ్చునట్లు రహి పేదలకు నీరు వనిత కిచ్చునట్లు వటుల కీరు సురకు నిచ్చునట్లు సుధకును నీయరు , వి. వే.

ప్రభుల కిచ్చునట్లు రహి పేదలకు
నీరు వనిత కిచ్చునట్లు
వటుల కీరు సురకు నిచ్చునట్లు
సుధకును నీయరు , వి. వే.

అవివేకులగు జనులు రాజులకు అపరాధములు చెల్లింతురు గాని బీదల కీయరు . జారులు స్త్రీలకు ధనమిత్తురుగాని విద్యార్థుల కీయరు. త్రాగుబోతులు కల్లుకాని త్రాగుదురే కాని పాలకు సొమ్ము వెచ్చించరు . ఇది లోక స్వభావము

Foolish people pay taxes to kings but not give alms to the poor. Jons give money to prostitutes but not to students. Drunkards rather buy liquor than milk. This is the way world operates.

1512
ప్రవర యున్న పేరు పరిఢ విల్లిననేమి ? దానియందు నేపు తగ్గె మీకు నిజము దెలియ మీరు నిత్యము పూజ్యులై యుండగ ౦డ్రు జగతి నొనన వేమ

ప్రవర యున్న పేరు పరిఢ విల్లిననేమి?
దానియందు నేపు తగ్గె మీకు
నిజము దెలియ మీరు నిత్యము పూజ్యులై
యుండగ ౦డ్రు జగతి నొనన వేమ

బ్రాహ్మణులకు ప్రవర యున్నది . ఋషుల సంప్రదాయములోని వారు, వారు. అయినను కుల గౌరవములందు విశ్వాసము లేదు. జ్ఞానానుభవము కావలెను . అది యున్ననే వారు పూజ్యులగుదురు

Brahmins have pravara (also known as Gotram or lineage). They are born in the tradition of sages. Despite that they don't respect the honor of their caste. They don't have loyalty. They should experience spiritual knowledge. Then only they are fit for worship.

1513
ప్రాకటముగ నింత లోకమందున గుంటు పల్లెముత్తడెన్న పరమగుణుడు అన్నదానమునను హరిపూజచేతను హరునిలోన గలిమి కతడె వేమ

ప్రాకటముగ నింత లోకమందున గుంటు
పల్లెముత్తడెన్న పరమగుణుడు
అన్నదానమునను హరిపూజచేతను
హరునిలోన గలిమి కతడె వేమ

ప్రపంచములోని దాతలందరికంటె గుంటుపల్లి ముత్తనామాత్యుడే గొప్పవాడు . అన్నదానమందు , హరిపూజయందు , భగవత్సాక్షాత్కారమందును అతనిని మించినవారు లేరు

Among all donors a person by the name of Guntupalli Muttana is the greatest. There is no one who beats him in giving alms, praying to Lord Vishnu and visualizing god.

1514
ప్రాణ బంధములను బంట కా పెరుగునా ? ఎఱుక కలుగు జ్ఞాని యెఱుగు గాక! ముద్రల౦దు లేదు మూలమందే కాక, వి. వే.

ప్రాణ బంధములను బంట కా పెరుగునా?
ఎఱుక కలుగు జ్ఞాని
యెఱుగు గాక! ముద్రల౦దు లేదు
మూలమందే కాక, వి. వే.

ప్రాణ బంధములు యోగికి గాని పంటకాపున కెట్లు తెలియును. ముక్తి ముద్రలలో లేదు. మూలమునందే ఉన్నది

The various types of praanaa is known to a yogi but not a farmer. There is no salvation in yoga postures. It is at the root of devotion.

1515
ప్రాణమగును గాలి బ్రహ్మాండమగు మేను మిత్ర చంద్ర సిఖులు నేత్రచయము మఱియు దేవుడి కనుమహిమీదనెవరాయా ? వి. వే.

ప్రాణమగును గాలి బ్రహ్మాండమగు
మేను మిత్ర చంద్ర సిఖులు
నేత్రచయము మఱియు దేవుడి కనుమహిమీదనెవరాయా?
వి. వే.

ప్రపంచమే విరాట్పురుషుడు , సూర్యచంద్రాగ్నులే అతని కన్నులు, గాలియే ప్రాణము , బ్రహ్మాండమే శరీరము

The virat purush mentioned in the vedas is the world. Sun and the moon are his eyes. Air is his praana. Universe is his body.

1516
ప్రాణ మిలను లేక పరమందగా రాదు ప్రాణముండగానె పరము కలదు ప్రాణి పరము గనుటె భావింపనేరరే , వి. వే.

ప్రాణ మిలను లేక పరమందగా
రాదు ప్రాణముండగానె పరము
కలదు ప్రాణి పరము గనుటె
భావింపనేరరే , వి. వే.

ప్రాణమున్నప్పుడే పరముని పొందవచ్చును . ప్రాణము లేనిచో పొందలేరు . ప్రాణి పరముని చూచు పద్దతిని జ్ఞానులే తెలుపవలెను

While one has praana he can attain nether world. Without praana that is not possible. Learned sages should show how one can visualize the nether world.

1517
ప్రాణ రక్షణ కిల పరమశివుని మీద ధ్యాన మమర లేమి దగిలి నరుడు పుట్టి చచ్చుచుండు బుడిమిలోపల బుట్టు చెదలుగాను వాడు చెడును వేమ

ప్రాణ రక్షణ కిల పరమశివుని మీద
ధ్యాన మమర లేమి దగిలి నరుడు పుట్టి
చచ్చుచుండు బుడిమిలోపల బుట్టు
చెదలుగాను వాడు చెడును వేమ

తన్నుతా నుద్ధరించు కొనుటకు తన్నుతానే ప్రోత్సహించుకొని ధ్యానమునకు యత్నింపవలెను . చెదలు పురుగులు వలె మాటి మాటికి పుట్టుచు, చచ్చుచు , నిష్ప్రయోజనమూగ ఉన్నచో లాభమేమి? దీనిని బాగుగ గ్రహింపవలెను

One has to reform oneself and carry on self-encouragement to meditate constantly. What is the use in living and dying like termites?

1518
ప్రాణి చేరునాడు పరగ దేహమునకు హాని లేకయుండు నరయనంట ప్రాణి పోయినపుడు పనికి రా దీదేహి మనుచ బలుకుదురిల జనులు వేమ

ప్రాణి చేరునాడు పరగ దేహమునకు
హాని లేకయుండు నరయనంట ప్రాణి
పోయినపుడు పనికి రా దీదేహి
మనుచ బలుకుదురిల జనులు వేమ

ప్రాణమున్నంతవరకే దేహమున కెట్టి హానియు లేకుండును . ప్రాణము పోయిన పిదప ఈ దేహము ఎందుకును పనికి రాదని జను లెరిగియే యుందురు

It is possible to protect one's body while one has praana. The body is useless when praana leaves it.

1519
పృధివి వారికెల్ల బెట్టును నొక గిన్నె పొత్తుకుడిచి కులము బొలియజేయు తలను చెయపెట్టి తగ నమ్మ జెప్పును, వి. వే.

పృధివి వారికెల్ల బెట్టును నొక
గిన్నె పొత్తుకుడిచి కులము
బొలియజేయు తలను చెయపెట్టి
తగ నమ్మ జెప్పును, వి. వే.

లోకములోని జనుల కందరికిని ఒక్క కంచములోనే అన్నము పెట్టినట్లు కుల భేదము పాటించకుండునట్లు ప్రతిజ్ఞ చేయుము

One has to take an oath so that all people eat from the same receptacle and give up discriminating one another.

1520
ప్రొద్దు పొడుచుచోటు ప్రొద్దు నిలుచుచోటు ప్రొద్దు గ్రు౦కుచోటు పొసగు జూచి ప్రొద్దెఱిగిన వాడు పాలుపైన యోగిరా , వి. వే.

ప్రొద్దు పొడుచుచోటు ప్రొద్దు
నిలుచుచోటు ప్రొద్దు గ్రు౦కుచోటు
పొసగు జూచి ప్రొద్దెఱిగిన వాడు
పాలుపైన యోగిరా , వి. వే.

సూర్యోదయా స్థమయముల తత్త్వ మెరిగి ప్రవర్తించి జ్ఞానము నార్జించిన వాడే గొప్ప యోగి

One is a great yogi if he gains knowledge about sun rise and sun set.

1521
ప్రియములేని విందు పిండి వంటలచేటు భక్తిలేని పూజ పత్రిచేటు ఓజమాలు నాల దోలి మాడల చేటు , వి. వే.

ప్రియములేని విందు పిండి
వంటలచేటు భక్తిలేని పూజ
పత్రిచేటు ఓజమాలు నాల దోలి
మాడల చేటు , వి. వే.

ప్రేమలేని విందు భోజనము, భక్తి లేని పూజ, పతి భక్తిలేని భార్య ఉపయోగము లేనట్లు తెలియవలెను

The feast performed without love, the pooja performed without devotion and a woman who has no devotion towards her husband are useless.

1522
ప్రొద్దుపొడుచు టెఱిగి ప్రొద్దునడ యెఱి౦గి ప్రొద్దు క్రుంకునట్టి పోలికెఱిగి ప్రొద్దు దెలియ నతడె పాలుపొంద బ్రహ్మంబు , వి. వే.

ప్రొద్దుపొడుచు టెఱిగి ప్రొద్దునడ
యెఱి౦గి ప్రొద్దు క్రుంకునట్టి
పోలికెఱిగి ప్రొద్దు దెలియ నతడె
పాలుపొంద బ్రహ్మంబు , వి. వే.

సూర్యుడుదయించుటకు , అస్తమించుటకు కల కారణములు తెలిసికొని, వానిని తన జీవితముతో పోల్చుకొని దైవరూపుడగు సూర్యుని తత్త్వము నెరిగిన వాడే బ్రహ్మ స్వరూపుడు

One has to gain the knowledge about sun rise and sun set, apply it to his life and learn the tattva of the sun. Then only he will attain the form of brahmam.

1523
ఫణితి తెలిసి మాఱు పల్కుటే యుక్తము గణనకెక్కునట్టి ఘనుడె యెపుడు గుణములేక యున్న గుదురునే యవవహాలు, వి. వే.

ఫణితి తెలిసి మాఱు పల్కుటే
యుక్తము గణనకెక్కునట్టి ఘనుడె
యెపుడు గుణములేక యున్న గుదురునే
యవవహాలు, వి. వే.

న్యాయముగ మాటలాడు ఉత్తముడు సమయమును గ్రహించి తెలియబలుకును . గుణశాలి కానివాడు సత్యము నెరిగి తెలిపినను లోకులు దానిని గౌరవించరు

The man of good character has the presence of mind to speak justly. The one without character, even if he says the truth, people won't respect him.

1524
ఫలక మెడను చేతబట్టి ఖడ్గంబూన బంటు తనమురాదు ప్రతిభలేమి? వీధిలోన దిరుగు వెలది పురుషుడౌనే, వి. వే.

ఫలక మెడను చేతబట్టి ఖడ్గంబూన
బంటు తనమురాదు ప్రతిభలేమి?
వీధిలోన దిరుగు వెలది
పురుషుడౌనే, వి. వే.

ఎడమ చేతితో డాలు పట్టుకొన్న మాత్రాన , కట్టి పట్టిన మాత్రాన పరాక్రమము లేక వీరత్వము రాదు . పురుషునివలె స్వేఛ్ఛగా తిరిగినంత మాత్రాన స్త్రీ పురుషుడు కాలేదు కదా

Merely carrying a shield, will not make one a warrior. Even though a woman conducts herself freely as a man, she can't be like a real man.

1525
ఫలములేని కార్యములు సేయ నొల్లరు కల జనంబులెల్ల నిల నిజంబు ఫలము మంచిదైన బరమందు ముదముండు , వి. వే.

ఫలములేని కార్యములు సేయ నొల్లరు
కల జనంబులెల్ల నిల
నిజంబు ఫలము మంచిదైన బరమందు
ముదముండు , వి. వే.

ప్రయోజనము లేని పని నెవ్వరు తలపెట్టరు . ఆ ఫలము మేలైన దయినచో ఇహమున పరమున కూడ సుఖము నిచ్చును

No one starts a task that does not yield fruit. If the task is good, then it will bring comfort in this and nether worlds.

1526
ఫాలనేత్రుడైన బావింపలేడయా ఆలి మీఱబెట్టి యాది మఱవ గోలయనుచు నమ్మకూడదు వెఱ్ఱియై , వి. వే.

ఫాలనేత్రుడైన బావింపలేడయా
ఆలి మీఱబెట్టి యాది
మఱవ గోలయనుచు నమ్మకూడదు
వెఱ్ఱియై , వి. వే.

స్త్రీకి స్వాతంత్ర్యమిచ్చినచో శివుడైనను ఆమె ప్రవర్తనను గుర్తింపలేడు. తెలివిమాలి స్త్రీ నెన్నటికిని నమ్మరాదు

If a woman is given unfettered freedom, even Lord Siva won't be able to recognize her. A woman without intellect should not be trusted.

1527
బంగిత్రాగి తిరిగిబకము చాడ్పున నుండ సంగ్రహింపరాదు చంద్రకళలు , బ్రు౦గిమదినిలోగి మిన్నంది యుండురా, వి. వే.

బంగిత్రాగి తిరిగిబకము చాడ్పున
నుండ సంగ్రహింపరాదు చంద్రకళలు,
బ్రు౦గిమదినిలోగి
మిన్నంది యుండురా, వి. వే.

బంగిని త్రాగి యోగినని కొంగ జపము చేసినంత మాత్రాన చంద్రకళలబ్బవు . మనస్సును లొంగదీసికొని విజ్ఞాన దృష్టితో చూచిననే అవి కానవచ్చును

After consuming liquor and performing fake meditation, one can't acquire chandra-kala. They will be visible when mind is controlled and applied rationally.

1528
బట్టత్రాళ్ళతోను బంధించి కట్టగా లింగ మెవరిసొమ్ము దొంగలింప? ఆత్మలోని లింగ మటువలె నుండునే , వి. వే.

బట్టత్రాళ్ళతోను బంధించి కట్టగా
లింగ మెవరిసొమ్ము దొంగలింప?
ఆత్మలోని లింగ మటువలె
నుండునే , వి. వే.

లింగధారులు తమ మెడలోని లింగము పోకుండ బట్టతోను , త్రాళ్ళతోను, గట్టిగా కట్టుకొందురు . దానిని దొంగ అపహరింప లేడు కాని ప్రయోజనమేమి? హృదయముననే శివుడున్నాడు గదా! ఆతనికిట్టి బంధములు లేవే! అది ముఖ్యము

Lord Siva's devotees wear his phallic symbols around their necks with rope so that thieves cannot steal them. What is their use? Lord Siva is in their hearts. And he is not fettered.

1529
బంగి త్రాగువాడు భావము నందడు నింగికెగయ కైపు నిల్వలేడు లింగ మమర బంగి లీలను చెందునా? వి. వే.

బంగి త్రాగువాడు భావము నందడు
నింగికెగయ కైపు నిల్వలేడు
లింగ మమర బంగి లీలను
చెందునా? వి. వే.

బంగి త్రాగువాడు మత్తెక్కి పడిపోవునే గాని యోగానుభవమునకు అనుకూలుడై యుండడు . బంగి వలన బ్రహ్మ స్వరూపము నెరుగుటకు సాధ్యము కాదు

One who consumes liquor will fall with intoxication but never be conducive to experience yoga. With liquor it is not possible to visualize the form of brahmam.

1530
బట్ట బయలందు శ్వాసము ముట్టుచు నెగరోజి పట్టి మూలమునందే నెట్టుచు విడుచుచు నుండిన గుట్టు పరబ్రహ్మమంచు గూడుము వేమా

బట్ట బయలందు శ్వాసము ముట్టుచు
నెగరోజి పట్టి మూలమునందే నెట్టుచు
విడుచుచు నుండిన గుట్టు
పరబ్రహ్మమంచు గూడుము వేమా

రేచక-పూరక-కుంభకాదుల నియమముల ననుసరించి వాయువును పీల్చ్చుచు , విడుచుచు , లోన ఇముడ్చ్చుకొనుచు నుండడానికి పరబ్రహ్మ స్వరూపమున గల రహస్యము తెలియును

By performing breathing exercises like “rEchaka-pooraka-kumbhaka” one can learn the secrets of brahmam.

1531
బట్ట బయలైన తత్త్వమే బ్రహ్మ మనగ నిట్ట నిలువున మదిజేర్చి నెగడవలెను దట్టి గట్టిన జయమున్నె జెట్టివలెను గట్టులో గుట్టు పరమంబు గూడు వేమ

బట్ట బయలైన తత్త్వమే బ్రహ్మ మనగ నిట్ట
నిలువున మదిజేర్చి నెగడవలెను
దట్టి గట్టిన జయమున్నె జెట్టివలెను
గట్టులో గుట్టు పరమంబు గూడు వేమ

బ్రహ్మము బహిరంగమైన తత్వమే! మనస్సు స్థిరముగా నుంచిన బ్రహ్మమును దర్శింపవచ్చును . దట్టికట్టి వీరునివలె తిరిగిన లాభము లేదు. ఈ రహస్య మెరిగిన, పరమును బోధపడును

Brahmam is all over the universe. One can visualize it by controlling mind. There is no use in wearing a tight belt and roaming around like warrior. One can know the god, by knowing this secret.

1532
బట్టబయలైన బ్రహ్మము గుట్టును మదినెంచి లోన గుణము పడినచో దిట్టముగ జగము గిట్టును దిట్టరివై యెఱుక మఱచి తిరుగుము వేమా

బట్టబయలైన బ్రహ్మము గుట్టును
మదినెంచి లోన గుణము పడినచో దిట్టముగ
జగము గిట్టును దిట్టరివై
యెఱుక మఱచి తిరుగుము వేమా

బట్టబయలుగా ఉన్న బ్రహ్మము తత్త్వము నెరిగినచో ఈ జగత్త౦తయు మిధ్యయని తెలియును . అపుడు నీవు నేర్పరివై వేరే తలపు లేక బ్రహ్మ సాక్షాత్కారము పొందగలవు

When one knows about the tattva of omnipresent brahmam, it will dawn in mind that the world is an illusion. Then one has to remove all the other thoughts with skill to visualize brahmam.

1533
పటువుగాను బుద్ధి పరికించి నొక్కుచు కుటిల గుణములన్ని కూలద్రొక్కి పటుతరంబుగాను బలపడ జూడరా , వి. వే.

పటువుగాను బుద్ధి పరికించి
నొక్కుచు కుటిల గుణములన్ని
కూలద్రొక్కి పటుతరంబుగాను
బలపడ జూడరా , వి. వే.

బుద్ధిని స్థిరముగా నుంచి, కుటిల గుణములను విడిచి బ్రహ్మమును చూచుటకు ప్రయత్నింపుము

One has to keep the mind steady, and overcome evil thoughts, to visualize brahmam.

1534
బండదానికేల బంగరు మొలత్రాడు విధవరాలికేల వెండి గొలుసు మ్రుచ్చు ముండకేల ముంజేతి కడియాలు, వి. వే.

బండదానికేల బంగరు మొలత్రాడు
విధవరాలికేల వెండి గొలుసు
మ్రుచ్చు ముండకేల ముంజేతి
కడియాలు, వి. వే.

బండదానికి బంగారు మొలత్రాడు , విధవకు వెండి గొలుసు, దొంగముండకు చేతి కడియాలు అక్కరలేనట్లు మూర్ఖునకు బ్రహ్మజ్ఞాన మక్కరలేదు

A lose woman has no use for gold. A widow does not need silver necklace. And a woman without character does not need bracelets. Similarly a foolish person doesn't need knowledge about brahmam.

1535
బంధముక్తులు రెంటిని పదిలముగను కోరరాకయ మదియందు గోర్కెలడచి చేయు పనులెల్ల బయటను జెనకి మించు వలయునది కూడు నీకె యావలను వేమ

బంధముక్తులు రెంటిని పదిలముగను
కోరరాకయ మదియందు గోర్కెలడచి చేయు
పనులెల్ల బయటను జెనకి మించు
వలయునది కూడు నీకె యావలను వేమ

బంధమును గాని, ముక్తిని గాని కోరక, మనస్సులో ఎట్టి కోరికలు లేక నిష్కామ కర్మలు చేయుచున్నచో కావలసినది లభించును. బ్రహ్మతత్త్వము సిద్ధించును

Without seeking bondage or salvation, devoid of wishes, when one performs work dispassionately, one gets what he desires. This is the way to gain tattva about brahmam.

1536
బంధుకోటి బాసి బయలును దెలియక సింధుపుత్రి మాయ జిక్కె కాదె! సార్జియంతవాడె జనులకు శక్యమా?, వి. వే.

బంధుకోటి బాసి బయలును దెలియక
సింధుపుత్రి మాయ జిక్కె
కాదె! సార్జియంతవాడె జనులకు
శక్యమా?, వి. వే.

విష్ణువంతటి వాడు భార్యయగు లక్ష్మి మాయలో చిక్కి తన వారినందరిని విడిచి అత్తవారింటనే యుండి పోయెను. భార్యకు లొంగకుండుట సామాన్యులకు శక్యమా!

Even Lord Vishnu got caught in the delusion of his wife Sri Lakshmi and left his people to stay with his in-laws. It is not possible not to yield to wives for ordinary people.

1537
బన్నవడగ గుఱిని పట్టులో పట్టుగా చిన్న బలము జేర్చి చింత విడిచి యున్నవాడె ముక్తిగన్నవాడగు సుమ్మి, వి. వే.

బన్నవడగ గుఱిని పట్టులో పట్టుగా
చిన్న బలము జేర్చి చింత
విడిచి యున్నవాడె ముక్తిగన్నవాడగు
సుమ్మి, వి. వే.

భంగపడక, పట్టిన పట్టు విడువక సూక్ష్మమైన ఆత్మను గుర్తించి చింతలేక యున్నవాడే ముక్తుడగును

One who is not disappointed, stays determined to understand the subtleness of aatma, free of worries will attain salvation.

1538
బయలందె బుట్టు సర్వము బయలందే లీనమగును బ్రహ్మాండంబుల్ బయలని మదిలో దెలిసిన బయలందే ముక్తి బట్టబయలగు వేమా

బయలందె బుట్టు సర్వము బయలందే
లీనమగును బ్రహ్మాండంబుల్
బయలని మదిలో దెలిసిన బయలందే
ముక్తి బట్టబయలగు వేమా

సమస్తము బయలు నందే పుట్టును. బ్రహ్మాండములు బయలులోనే అణుగును . బయలు స్వరూపమును బాగుగా గుర్తించిన యెడల అందే ముక్తి గోచరించును

Everything is born from space. The world devolves into space. When space is understood well, it will reveal the path to salvation.

1539
బయలున పుట్టిన బంధము బయలందే లీనమగును పరమాత్మునకున్ బయలున పుట్టెడి సంపద బయలుగ కలుపంగ ముక్తి బయలగు, వేమా

బయలున పుట్టిన బంధము బయలందే
లీనమగును పరమాత్మునకున్ బయలున
పుట్టెడి సంపద బయలుగ కలుపంగ
ముక్తి బయలగు, వేమా

బయలులో అన్నియు పుట్టినట్లే బంధము కూడ జనించి అందే లయమగుచున్నది . బయలులో పుట్టిన వానిని అందే లీనము చేయ గలిగినచో ముక్తి లభించును

Like all things born from space, bondage is born from space and devolves into space. One can attain salvation by seeking union with all things born in space.

1540
బయలు బయలుగాను పరికింప జాలక బయలులోని వారు బయటబడిరి బయలులోని చాలు పరికింప దత్త్వమౌ , వి. వే.

బయలు బయలుగాను పరికింప జాలక
బయలులోని వారు బయటబడిరి
బయలులోని చాలు పరికింప
దత్త్వమౌ , వి. వే.

సాధకులు బయలును బయలుగా గ్రహింప లేక భంగపాట్లు పొందిరి. బయలులోని సత్యమును పరికింపుము . అదే బ్రహ్మము

Yogis met with disappointment by not able to realize the space. One has to visualize truth about space. That is brahmam.

1541
బయలు నిల్లు కట్టి పరికింప నేఱక బ్రమసి తిరుగువాడె పామరుండు బయలుపడిన తానె బ్రహ్మమైపోవును , వి. వే.

బయలు నిల్లు కట్టి పరికింప
నేఱక బ్రమసి తిరుగువాడె
పామరుండు బయలుపడిన తానె బ్రహ్మమైపోవును,
వి. వే.

మహదాకాశమున దృష్టి ప్రసరింపజేసి పరికింప లేక భ్రాంతిని పొందువాడే పామరుడు. బయలు స్వరూపమును గుర్తించిన వాడే బ్రహ్మ స్వరూపుడు

An ignorant person is one who cannot extend his vision about space and lives in delusion. One is a form of brahmam if he can visualize the shape of the space.

1542
బయలనుచు బయలు పొడగన బయలున దన మనసు నిలిచి బాగుగ దనరున్ బయలని తలచెడి భ్రాంతియె బయలై తను దానె కాంచు బ్రహ్మము వేమా

బయలనుచు బయలు పొడగన బయలున దన
మనసు నిలిచి బాగుగ దనరున్ బయలని
తలచెడి భ్రాంతియె బయలై తను
దానె కాంచు బ్రహ్మము వేమా

బయలే ఆకాశమని భావించి మనస్సు నిలిపి చూచినచో బయలు సామాన్య ప్రదేశమనెడి భ్రాంతి పోయి బ్రహ్మ స్వరూపమును గ్రహించుటను సాధ్యమగును

By considering space as sky one will lose the delusion that space is ordinary and visualize the brahmam

1543
బయలున బంధము పుట్టును బయలున పరమాత్మునకును బంధము కలుగున్ బయలున బంధము గదిసెను బయలున బయలయ్యెడిదియె పరమగు వేమా

బయలున బంధము పుట్టును బయలున
పరమాత్మునకును బంధము కలుగున్
బయలున బంధము గదిసెను బయలున
బయలయ్యెడిదియె పరమగు వేమా

బయలుననే బంధము పుట్టుచున్నది . బయలువల్లనే పరమాత్మకును బంధము కలుగుచున్నది . బయలువలని బంధమును తొలగించుకొనినచో పరము స్పష్టముగా గోచరించును

Bondage is born out of space. Because of space even paramaatma lives in bondage. Once free of such bondage salvation is possible.

1544
బయలు బయలుగాను బలపడినప్పుడే తెగువతోడ నైక్యమగును మదిని, జ్ఞప్తియందు నెఱుకగనుటయే లేదయా, వి. వే.

బయలు బయలుగాను బలపడినప్పుడే
తెగువతోడ నైక్యమగును
మదిని, జ్ఞప్తియందు నెఱుకగనుటయే
లేదయా, వి. వే

బయలు బయలుగా బలపడినప్పుడే బ్రహ్మైక్యము కలుగును. ఇది జ్ఞప్తినుంచికొనినచో ఎరుకకు ప్రయత్నింపవలసిన యవసరమే యుండదు

One can unify with brahmam when one sees the space as itself.

1545
బయలు బ్రహ్మమనుచు బరికించు చుందురు బయలదేల తాను బ్రహ్మమగును? బ్రహ్మమైన బయలు పరికింప తత్త్వమే , వి. వే.

బయలు బ్రహ్మమనుచు బరికించు
చుందురు బయలదేల తాను బ్రహ్మమగును?
బ్రహ్మమైన బయలు పరికింప
తత్త్వమే , వి. వే.

బయలు బ్రహ్మమని చెప్పుదురు. కాని తానే బ్రహ్మమై యున్నప్పుడు దానిలో ఏమి ప్రయోజనము? బ్రహ్మ స్వరూపమగు బయలు నెరుగుటయే తత్త్వము

People say space is brahmam. What is the use when one is a brahmam? Tattva is about learning about the space which is a form of brahmam.

1546
బయలు రూపు తనకు బయలుగాజేసి యా బయలు రూపువంటి భ్రమయకుండి బయలులోని బయలు భావింప బరమాత్మ , వి. వే.

బయలు రూపు తనకు బయలుగాజేసి
యా బయలు రూపువంటి భ్రమయకుండి
బయలులోని బయలు భావింప
బరమాత్మ , వి. వే.

ఆకాశ తత్త్వమును ఆత్మాధారముగా నిలిపి దాని మూలముగా చూపును బ్రహ్మము నంటగా జేసి, భ్రాంతి పొందక భావించినచో పరమాత్మ సాక్షాత్కరించును

When the tattva about space is made to support aatma and extended to visualize brahmam without delusion, paramaatma will deify.

1547
బయలు రూపు రూపు బయలుగా జేసియు కంటిరూపు బయట గదియజేసి బయలు కాని బయలు పరికింప దత్త్వము , వి. వే.

బయలు రూపు రూపు బయలుగా జేసియు
కంటిరూపు బయట గదియజేసి
బయలు కాని బయలు పరికింప
దత్త్వము , వి. వే.

ఆకాశమున నిర్మలమగు దృష్టిని ప్రసరింపజేసి కంటి కగుపడు వస్తువుల యెడ దృష్టిని నిలుపక యుండినచో తత్త్వమగుపరమాత్మ తనంతనే కావచ్చును

By extending pure vision into sky/space and not focusing eyes on the objects around, one can become paramaatma by oneself.

1548
బయలు రూపులేని భావంబు లోనెంచి బయలురూపు బట్టి బయలుచేసి బ్రహ్మము బయలనుచు భావింప దత్త్వము, వి. వే.

బయలు రూపులేని భావంబు లోనెంచి
బయలురూపు బట్టి బయలుచేసి
బ్రహ్మము బయలనుచు భావింప
దత్త్వము, వి. వే.

తొలుత బయలును శూన్య స్థలముగా భావించి, పిదప సాకారముగా నిరూపించి , తర్వాత నిరాకారముగా తలచుచు, బ్రహ్మమును బయలుగా భావించుటయే ముక్తి

Salvation is achieved by considering space as vacuum, then proving that space has shape, then meditating the space as formless and equating brahmam with space.

1549
బయలులోనె పెనగి బయలులో మునిగియు బయలు తెలియ లేడె బంధకుండు బయలు బ్రహ్మమనుచు భావించి చూడరా, వి. వే.

బయలులోనె పెనగి బయలులో మునిగియు
బయలు తెలియ లేడె బంధకుండు
బయలు బ్రహ్మమనుచు
భావించి చూడరా, వి. వే.

బయలులోనే పెనగియు , మునిగియు, బయలనగా బ్రహ్మమని సంసారబద్ధుడు తెలియలేడు . ఆయనే బ్రహ్మమని భావించి చూడవలెను

A person in bondage does not know that he is surrounded by space, immersed in space and space is brahmam.

1550
బయలులోని బయలు పరికించి చూడక బయలు రూపు చూచి వలచు నౌర! మురికిదేహమందు మోహంబు విడదయా, వి. వే.

బయలులోని బయలు పరికించి
చూడక బయలు రూపు చూచి వలచు
నౌర! మురికిదేహమందు మోహంబు
విడదయా, వి. వే.

సామాన్యపు బయలునం దిమిడి యున్న ఆకాశతత్త్వమును తెలియలేక ఆకాశముగా చూచి జనులు భ్రాంతి పడుచున్నారు . మరియు మాలిన్య నిలయమగు దేహముపై వ్యామోహమును విడువలేకున్నారు

Men are deluding about sky which is embedded in the space. They are attached to their bodies full of toxins and not able to give up bondage.

1551
బయలైనది యెంతెంతయొ బయలు బ్రహ్మాండమునకు పట్టది యెంతో రయమున రవి తా నెంతో భయపడుదురు దాని జూడ బయలని వేమా

బయలైనది యెంతెంతయొ బయలు బ్రహ్మాండమునకు
పట్టది యెంతో
రయమున రవి తా నెంతో భయపడుదురు
దాని జూడ బయలని వేమా

ఆకాశ మెంత విశాలమైనదో , బ్రహ్మాండమున కాయాకాశమున గల స్థానమెంతయో సామాన్యులు గ్రహింపలేక వృధా భయములకు లోనై అది బట్టబయలని యుపేక్షింతురు

Ordinary people without realizing the vast expanse of sky and its place in the universe, subject themselves to fear and disregard it as same as space

1552
బఱ్ఱెలట్టు లఱవ ఫలమేమి కలదురా ? అందు సార్థకంబు చెందకున్న విన్నవారు వారి వెఱ్ఱులుగా నెంత్రు, వి. వే.

బఱ్ఱెలట్టు లఱవ ఫలమేమి కలదురా?
అందు సార్థకంబు చెందకున్న
విన్నవారు వారి వెఱ్ఱులుగా
నెంత్రు, వి. వే.

బఱ్ఱెలవలె అరచుచు వేదములు చదివిన ప్రయోజనము లేదు. వేదార్థమును తెలిసికొని అందు చెప్పినట్లు కృతకృత్యులు కావలెను. లేకున్న జనులు వెఱ్ఱివానిగా తలతురు

There is no use in reciting vedas like bleating cows. One has to understand their meaning and follow the teachings to be successful. Otherwise people think of him as a foolish person.

1553
బలము కొనగ గాలి బట్టి రేచించుచు గలియ బూరకంబు గడలుకొనగ విలయకుంభకంపు విదమంది చూడరా, వి. వే.

బలము కొనగ గాలి బట్టి రేచించుచు
గలియ బూరకంబు
గడలుకొనగ విలయకుంభకంపు విదమంది
చూడరా, వి. వే.

బలమైన శ్వాసమును నిరోధించుట, ఎగయించుట , పూరించుట అను మూడు పద్దతులను అభ్యసింపుము

One has to practice breathing exercises like rEchaka-pooraka-kumbhaka

1554
బలము చూపుటేల ? బలవంతముగరాదు కులము చూచి మెచ్చగుదర బోదు తలము ద్రొక్కియట్లు తలకొని విడరాదు , వి. వే.

బలము చూపుటేల ? బలవంతముగరాదు
కులము చూచి మెచ్చగుదర
బోదు తలము ద్రొక్కియట్లు తలకొని
విడరాదు , వి. వే.

బలము చూపినను, కులము చూపినను ఆత్మజ్ఞానము కలగబోదు . పట్టినపట్టు వీడక ప్రయత్నింపవలెను . అప్పుడే బ్రహ్మము గోచరింపగలదు

One cannot get knowledge about aatma with strength or caste. One has to try hard without giving up. Then only brahmam will be visible.

1555
బహువిధ వస్తువులందును మహి గలిగెడి యెల్లజాతి మనుజులయందున్ రహిమించు బ్రహ్మమని కధితము వేమా

బహువిధ వస్తువులందును మహి
గలిగెడి యెల్లజాతి మనుజులయందున్
రహిమించు బ్రహ్మమని
కధితము వేమా

ప్రపంచమందలి సమస్త వస్తువులందును , అన్ని జాతుల జనులయందును బ్రహ్మము ఉన్నట్లు గ్రహింపుము

Brahmam is present in every thing in this world and among all the men of various races.

1556
బాగుగాను ముక్తి బడయంగ ముందుగా యోగిగాగ గురున కేగి మ్రొక్కి వేగబుద్ధి నొక్కి విలయమొందుట తగు, వి. వే.

బాగుగాను ముక్తి బడయంగ ముందుగా
యోగిగాగ గురున కేగి మ్రొక్కి
వేగబుద్ధి నొక్కి
విలయమొందుట తగు, వి. వే.

మోక్షము పొందదలచినచో యోగము నెరిగిన గురువు నాశ్రయించి , బుద్ధిని స్థిరముగా నిల్పి ఐహికములనుండి తొలగవలయును

If one wishes for attaining salvation one has to approach a guru who has knowledge about yoga, concentrate his mind and stop thinking about the world.

1557
బయట తెలియకున్న బాహుదూరమై తోచు చోటు తెలియకున్న జూ పొనరదు కోటకొమ్మమీద గుదురుగ జూడరా, వి. వే.

బయట తెలియకున్న బాహుదూరమై
తోచు చోటు తెలియకున్న
జూ పొనరదు కోటకొమ్మమీద గుదురుగ
జూడరా, వి. వే.

మార్గము తెలియదేని గమ్యస్థానము దూరమని తోచును. చూడవలసినది తెలియకున్నచో చూపు ప్రవేశింపదు . కాన హృదయముననున్న బ్రహ్మమును దర్శింప యత్నించినచో కృతార్థుడవు కాగలవు

If one does not know the way to a place, then one will think it is too far away. When one doesn't know which place to visit, then there is no vision. Hence one will succeed in visualizing the brahmam in one's heart when one tries.

1558
బారెడేసిజడలు భస్మా౦గలేపముల్ మదనముదముతోడ మాఱు మలయ కోకలుడిగి యంగరేకులు బలిసెరా , వి. వే.

బారెడేసిజడలు భస్మా౦గలేపముల్
మదనముదముతోడ మాఱు
మలయ కోకలుడిగి యంగరేకులు
బలిసెరా , వి. వే.

చపలచిత్తులు తొలుత యోగులు కానెంచి , జడలు ధరించి బూడిద పూసికొందురు . పిదప స్త్రీలను చూచి మదన వికారమునకు లోనై వస్త్రాలంకారమూలను ధరింతురు.

People with fickle minds first try to become yogis with matted hair and ash smeared all over their bodies. Then after seeing women their minds undergo changes resulting in them wearing fashionable clothes.

1559
బాలప్రాయమునను ముక్తి బడయరాదు వయసునందున కామంబు వదలబోదు ముదిమియందున చింతలో ముక్తిలేదు చచ్చి సాధింప నగునేమి జగతి వేమ

బాలప్రాయమునను ముక్తి బడయరాదు
వయసునందున కామంబు వదలబోదు ముదిమియందున
చింతలో ముక్తిలేదు చచ్చి
సాధింప నగునేమి జగతి వేమ

బాల్యమునందు తెలియక, యౌవనమున కామము వలన, ముసలితనమున విచారమున ముక్తిని సాధింప వీలులేకున్నది . ఇక చచ్చిన పిదప సాధించునదేమి ?

One doesn't try for attaining salvation in childhood out of ignorance, in youth with lust and in old age full of sorrow. Then what can be achieved in death?

1560
బాలప్రాయమందె భ్రమల నడంపక మేలు పొందరెపుడు మేదినందు కీలు తెలిసి మదిని కీడ్పడకుండుము , వి. వే.

బాలప్రాయమందె భ్రమల నడంపక
మేలు పొందరెపుడు మేదినందు
కీలు తెలిసి మదిని కీడ్పడకుండుము,
వి. వే.

లేత వయస్సులోనే భ్రాంతులను విడువకున్నచో ఎట్టి వాడైనను పిదప మేలు పొందలేడు . ఈ రహస్య మెరిగి మనస్సును స్థిరముగానుంచి ముక్తికి యత్నింపుము

If one doesn't give up delusions in young age, then he can't achieve any good. One has to learn this secret, keep it firmly in mind and strive for salvation.

1561
బాల్యమందు స్వామిభక్తి లేకుండును యౌవనమున హరుని ఠేవగనరు వార్థకంబునందు వర్ణింపలేరిక , వి. వే.

బాల్యమందు స్వామిభక్తి లేకుండును
యౌవనమున హరుని
ఠేవగనరు వార్థకంబునందు వర్ణింపలేరిక,
వి. వే.

బాల్యమున అజ్ఞానమువలన భగవచ్చింత యుండదు . యౌవనమున స్త్రీ లోలతవలన తత్త్వచింత కుదరదు . ముసలితనమున రోగమువల్ల మోక్షమార్గము కనడు . ఇక ప్రయత్నించునదెప్పుడో తెలియదు

In childhood out of ignorance one doesn't think of god. In youth due to lust for women one doesn't think of tattva. In old age because of disease one doesn't see the path to salvation. It is not clear when a man will try for salvation.

1562
బాలుడవై యున్నప్పుడు చాలవు, యౌవనమునందు సంపదరూపుల్ మేళనమౌ , ముదిమియె యే వేళను కడతేర్చు , శివుని వెదకుర వేమా

బాలుడవై యున్నప్పుడు చాలవు,
యౌవనమునందు సంపదరూపుల్ మేళనమౌ,
ముదిమియె యే వేళను కడతేర్చు,
శివుని వెదకుర వేమా

బాల్యము భగవచ్చింతకు తగదు. యౌవనమున సంపదపైకి , రూపముపైకి మనస్సు పోవును. కావున ముదిమియే ముక్తి సాధనకు అనువైనది

Childhood is not appropriate for thinking about God. In youth mind is focused on accumulating wealth and lusting for women. Hence old age is suitable for attaining salvation.

1563
బిందు రక్తములను బెరసిన దేహము చందమెఱుంగక ద్విజశబ్ద మిడుచు నడచినన్ విడుచున నరకంబు మృత్యువు , వి. వే.

బిందు రక్తములను బెరసిన దేహము
చందమెఱుంగక ద్విజశబ్ద
మిడుచు నడచినన్ విడుచున నరకంబు
మృత్యువు , వి. వే.

దేహము బిందు రక్తములవలన ఏర్పడినదను పద్దతి నెరుగక బ్రాహ్మణులు గర్వించినచో మృత్యువు , నరకము తప్ప వేరేమియు కలుగవు

Body is made of bindu blood. If not knowing this brahmins are showing off pride, then death and hell are certain to them.

1564
బిందువనగమాయ బీజంబు శివుడయా అందు కనకమయ్యె నప్పులయ్యె సంధి వెలయ జగము సర్వంబు తానాయె , వి. వే.

బిందువనగమాయ బీజంబు శివుడయా
అందు కనకమయ్యె నప్పులయ్యె
సంధి వెలయ జగము సర్వంబు
తానాయె , వి. వే.

బిందు బీజములు , మాయ , ఈశ్వరుడు - వీని వల్లనే సమస్త ప్రపంచము సృజింపబడుచున్నది . వీరి సంధివల్ల ఏర్పడిన ప్రపంచ మీశ్వర రూపమైనదే!

World is created out of bindu seeds, maaya (illusion) and Iswara. The world is Iswara's form.

1565
బిందువందు పుట్టె బెంపైన నాదము నాదమందు పుట్టె నాదిశివుడు శివుని మధ్యమందు జెలగును సూక్ష్మంబు , వి. వే.

బిందువందు పుట్టె బెంపైన నాదము
నాదమందు పుట్టె నాదిశివుడు
శివుని మధ్యమందు జెలగును
సూక్ష్మంబు , వి. వే.

బిందువున నాదము, నాదమున బ్రహ్మము పుట్టెను. బ్రహ్మము మధ్యమున సూక్ష్మరూపమున ప్రకృతి గోచరించుచున్నది

In bindu naada originated and from naada brahmam took birth. In the middle of brahmam prakriti (nature) can be seen in its subtle form.

1566
బిందుసేవకుండు బీజమై యుండును సాధు సేవకుండు సర్వహితుడు తీర్థసేవకుడు తిరుగుచుండెడి గదా , వి. వే.

బిందుసేవకుండు బీజమై యుండును
సాధు సేవకుండు సర్వహితుడు
తీర్థసేవకుడు తిరుగుచుండెడి
గదా , వి. వే.

ఇంద్రియములకు వశమై , బీజమై జననాడులలో నరుడు మునిగి తేలుచుండును . సాధువులను సేవించువాడు సర్వజన హితుడగును . తీర్థములకు పోవువాడు కేవలము కాకివలె తిరుగువాడే!

Man is yielding to the senses and in sensual pleasures. The one who serves sages is a friend for one and all. The one who goes to pilgrimage is like a crow going everywhere.

1567
బొంది వేఱుకాని భువి ప్రాణమొక్కటి అన్నము లిల వేఱు అకలొకటి పుష్పము లిటు వేఱు పూజలొక్కటి సుమ్మ , వి. వే.

బొంది వేఱుకాని భువి ప్రాణమొక్కటి
అన్నము లిల వేఱు అకలొకటి
పుష్పము లిటు వేఱు పూజలొక్కటి
సుమ్మ , వి. వే.

శరీరములు వేరైనను ప్రాణమొక్కటే ! ఆహారములు వేరైనను ఆకలి యొక్కటేగదా! పూలువేరైనను పూజయొక్కటే !

Even though there are multiple bodies, praana is one and the same. Hunger is the same even if food items are different. Even though flowers are variegated, pooja is one and the same.

1568
బ్రహ్మ గుఱ్ఱమయ్యె భవుండు పల్లంబయ్యె నాదివిష్ణు వెన్న నంక మాయె నందుమీదనుండు నాడుదో మగవాడొ , వి. వే.

బ్రహ్మ గుఱ్ఱమయ్యె భవుండు
పల్లంబయ్యె నాదివిష్ణు వెన్న
నంక మాయె నందుమీదనుండు
నాడుదో మగవాడొ , వి. వే.

బ్రహ్మ గుఱ్ఱము, శివుడు దానిపైగల పల్లము, విష్ణువాపల్లమునకు అంకము , ఆ గుఱ్ఱముపై నున్నవారు ప్రకృతియో , పురుషుడో పరిశీలించి గుర్తింపవలెను

Lord Brahma is the horse. Lord Siva is the saddle on it. Lord Vishnu is the place on the saddle. It is to be seen if the person riding the horse is prakriti (nature) or purusha (man) [ this is an allusion to Saankhya philosophy]

1569
బ్రహ్మ జంపి విష్ణు భాగంబున గలిపి విష్ణు జంపి శివుని వీట గలిపి శివుని జంపి తాను శివయోగి కావలె, వి. వే.

బ్రహ్మ జంపి విష్ణు భాగంబున
గలిపి విష్ణు జంపి శివుని
వీట గలిపి శివుని జంపి తాను
శివయోగి కావలె, వి. వే.

తొలుత బ్రహ్మధ్యానము , పిదప దానిని విడిచి విష్ణు ధ్యానము . తర్వాత శివధ్యానము చేసి శివయోగి కావలెను (శివధ్యానమే ఉత్తమమైనదట )

First one should meditate on Lord Brahma. Later on one should meditate on Lord Vishnu. Then one should become a Siva Yogi by meditating on Lord Siva.

1570
బ్రహ్మ తన్మయ చింతన భవహరంబు బ్రహ్మమాత్మావలోకన ప్రముదితంబు బ్రహ్మ మందైక్యమగు నాత్మ పరవశంబు విమల మతి నెంచునపు డిదె విధము వేమ

బ్రహ్మ తన్మయ చింతన భవహరంబు బ్రహ్మమాత్మావలోకన
ప్రముదితంబు బ్రహ్మ
మందైక్యమగు నాత్మ పరవశంబు విమల
మతి నెంచునపు డిదె విధము వేమ

బ్రహ్మమును చింతించిన సంసారము నశించును. బ్రహ్మమాత్మావ లోకమున ఆనందమయము . బ్రహ్మమున ఆత్మ ఐక్యమైనచో సాధకునకు ఆత్మానందము కల్గును. దీనిని బాగుగా గ్రహింపవలెను

Bondage will be destroyed by focusing the mind on brahmam. In the world filled with brahmam the meditation on the aatma leads to happiness. When aatma merges with brahmam one will attain bliss.

1571
బ్రహ్మబ్రహ్మ యన్న బ్రహ్మ బదెట్టిదో వలసి తెలసి చూడ వద్దనుండు ముద్రలోననుండు ముద్రికగానరు , వి. వే.

బ్రహ్మబ్రహ్మ యన్న బ్రహ్మ
బదెట్టిదో వలసి తెలసి చూడ
వద్దనుండు ముద్రలోననుండు
ముద్రికగానరు , వి. వే.

బ్రహ్మ స్వరూపమును యోగాది సాధనముల మూలమున దర్శింపగలిగినయెడల సాధకునకు సిద్ధి కలుగును. సామాన్యులు హృదయములోనున్న బ్రహ్మమును గుర్తింపలేరు

When one visualizes brahmam with yoga, then one will attain salvation. Ordinary people cannot visualize the brahmam in their hearts.

1572
బ్రహ్మ మవల నున్న ప్రళయకాలంబైన నదియు బ్రహ్మచేత నందవచ్చు బ్రహ్మ మమరు జ్ఞప్తి పట్టులోకట్టురా , వి. వే.

బ్రహ్మ మవల నున్న ప్రళయకాలంబైన
నదియు బ్రహ్మచేత నందవచ్చు
బ్రహ్మ మమరు జ్ఞప్తి
పట్టులోకట్టురా , వి. వే.

బ్రహ్మమును కనుగొని కృతార్థుడైన వానికి - ప్రళయము సంభవించినను సరే - ముక్తి కలుగును. కావున బ్రహ్మమును మనస్సున నిలిపి ధ్యానించి కృతార్థుడగుటకు యత్నింపవలెను

One who succeeds in finding brahmam will survive the pralaya (final destruction of the world) and attain salvation. Hence it is better to try to keep brahmam in mind and meditate.

1573
బ్రహ్మమున్నచోట పరగంగ దెలియక యందొ వెదుక బ్రహ్మమేల కలుగు? నంజనంబు లేక యా సొమ్ము దొరకదు, వి. వే.

బ్రహ్మమున్నచోట పరగంగ దెలియక
యందొ వెదుక బ్రహ్మమేల
కలుగు? నంజనంబు లేక యా
సొమ్ము దొరకదు, వి. వే.

బ్రహ్మమున్న చోటు తెలియక వేరొకచోట వెదికిన లాభము లేదు . అంజనము లేక సొమ్మున్నచోటు కనుగొన సాధ్యము కాదు

Without knowing where brahmam is situated there is no use in searching everywhere. Without the magic ointment used for the purpose of discovering anything that is concealed it is not possible to discover the hiding place of gold.

1574
బ్రహ్మమును దెలియవు భావమం దుంచిన తనువు గుడిగ జేసి తన్ను నిలిపి లోకబుద్ధి విడిచి లోజూపు చూడరా, వి. వే.

బ్రహ్మమును దెలియవు భావమం దుంచిన
తనువు గుడిగ జేసి తన్ను
నిలిపి లోకబుద్ధి విడిచి
లోజూపు చూడరా, వి. వే.

మనస్సును కుదురుపరచి, అం దాత్మభావము నుంచి విభేదదృష్టిని విడిచినయెడల బ్రహ్మమును పొందవచ్చును

After calming one's mind and getting rid of thoughts unrelated to aatma, it is possible to attain brahmam.

1575
బ్రహ్మమెఱుగు జ్ఞప్తి పదిలంబుగా నుంచి తనువు మఱచి వేగ దన్ను తలచి లోకబుద్ధి మఱచి లోజూపు చూడరా, వి. వే.

బ్రహ్మమెఱుగు జ్ఞప్తి పదిలంబుగా
నుంచి తనువు మఱచి వేగ
దన్ను తలచి లోకబుద్ధి మఱచి
లోజూపు చూడరా, వి. వే.

బ్రహ్మమును తెలిసికొనదగు జ్ఞానము కలిగి, వేరే నిస్పృహుడై లోకమును మరచి హృదయాంతరమున వెదకిన బ్రహ్మము కానవచ్చును. ముక్తి లభించును

Having the knowledge to discover brahmam, forgetting the world around, when one searches within Brahmam will be visible. Salvation is attainable.

1576
బ్రహ్మ యెవనికొడుకు పరికింపగా భువి విష్ణు వెవనికొడుకు వెలయజూడ శివు డెవరికికొడుకు చిత్తమం దుంచరు , వి. వే.

బ్రహ్మ యెవనికొడుకు పరికింపగా
భువి విష్ణు వెవనికొడుకు
వెలయజూడ శివు డెవరికికొడుకు
చిత్తమం దుంచరు , వి. వే.

లోకులు మయావశులై త్రిమూర్తులయందే భక్తి చూపుదురు . కాని బ్రహ్మవిష్ణుమహేశ్వరు లెవరి పుత్రులో , వాని జనన హేతువగు తత్త్వస్వరూపమెట్టిదో తెలిసికొన యత్నింపరు

People succumbing to illusion (maaya) worship only the tri-murti (Lords Brahma, Vishnu, Iswara). They don't try to find out their parents and the reason for their birth.

1577
బ్రహ్మ వంశభవులు ప్రబలులై యుండగా నితర జాతులకును గతులుగలవె ? వనములోని కోతి వసుమతి నడపునా? వి. వే.

బ్రహ్మ వంశభవులు ప్రబలులై
యుండగా నితర జాతులకును గతులుగలవె?
వనములోని కోతి
వసుమతి నడపునా? వి. వే.

బ్రాహ్మణులు ప్రబలులై యున్నంతవరకును ఇతర జాతులకు గతులు లేవు. వనములోని కోతి భూపాలనము చేయలేనట్లు ఇతర జాతులు కార్యతంత్రములు నడుపలేరు

For as long as brahmins are dominating, other castes have no hope. Just as a wild monkey cannot rule the forest, other castes cannot run the show (don't know modus operandi).

1578
బ్రహ్మవాదులెల్ల బ్రహ్మంబనంగను వలసి తెలిసిచూడ వద్దనుండు ముందునున్నయట్టి ముద్రికగానరు , వి. వే.

బ్రహ్మవాదులెల్ల బ్రహ్మంబనంగను
వలసి తెలిసిచూడ వద్దనుండు
ముందునున్నయట్టి
ముద్రికగానరు , వి. వే.

బ్రహ్మవాదులు బ్రహ్మమని చెప్పెడుదానిని పరికించినచో నీ యొద్దనే యుండును. తమమందున్న బ్రహ్మమును లోకు లెరుగకున్నారు

If one analyzes what the people who talk about brahmam are saying, he is within oneself. People are not able to realize the brahmam in front of them.

1579
బ్రహ్మవిష్ణు శివుల భాగంబులను నిల్పి పరమ యోగియైన బ్రహ్మమగును బ్రహ్మమైన వాని భావింప శక్యమా ? వి. వే.

బ్రహ్మవిష్ణు శివుల భాగంబులను
నిల్పి పరమ యోగియైన బ్రహ్మమగును
బ్రహ్మమైన వాని
భావింప శక్యమా ? వి. వే.

త్రిమూర్తుల యంశములను తెలిసికొని యోగియైన యెడల బ్రహ్మస్వరూపమును పొందవచ్చును . అలా భావింప శక్యము కానిది. బ్రహ్మ మెరిగిన యోగి దైవస్వరూపుడు

If one is knowledgeable about tri-murti (Lords Brahma, Vishnu, Iswara) and then becomes a yogi, then it is possible to attain brahmam. The yogi who knows brahmam is a divine incarnation

1580
బ్రహ్మ వేత్తలమని పౌరుష మాడేరు బ్రహ్మమేమి ? దాని భావమేమి? తెలుపో నలుపో యెఱుపో తెలిసిన పలుకండీ , వి. వే.

బ్రహ్మ వేత్తలమని పౌరుష మాడేరు
బ్రహ్మమేమి ? దాని భావమేమి?
తెలుపో నలుపో యెఱుపో తెలిసిన
పలుకండీ , వి. వే.

కొందరు తాము బ్రహ్మవేత్తలమని ప్రగల్భములు పల్కుదురే కాని, బ్రహ్మమున నేదియో , అది తెలుపో , నలుపో , ఎరుపో తెలిసికొనలేరు . బ్రహ్మస్వరూపము నెరగనిచో దానిని వివరించియే యుందురు

Some people claim they are experts on brahmam but cannot tell if it is white, black or red. If they knew the form of brahmam they would know it.

1581
బ్రహ్మ సంతతి యన భక్తులై వెలసిరి ఋషుల జాతుల లెన్నో రీతులయ్యె రోతకెక్క వారి రోయక పిలుతురా? వి. వే.

బ్రహ్మ సంతతి యన భక్తులై వెలసిరి
ఋషుల జాతుల లెన్నో
రీతులయ్యె రోతకెక్క వారి
రోయక పిలుతురా? వి. వే.

బ్రాహ్మణులు బ్రహ్మ సంతతివారమని , భక్తులమని, ఋషుల సంప్రదాయముల వారమని పెక్కు విధముల చెప్పుకొందురు . వారు ఉత్తమమగు ఆత్మ విచారము చేసిననే గౌరవింప బడుదురు . లేనిచో గౌరవింపబడరు

Brahmins claim they are the descendants of Lord Brahma, devotees, carry on the traditions of ancient sages, and so on. If they analyze the aatma, then only they deserve respect. Otherwise they are not honorable.

1582
బ్రహ్మ సుఖతత్త్వ విజ్ఞాన పరముగోరి గురుకళా జాల నియతమౌ కోర్కి మిగిలి యోగనిర్ముక్త రూపుడై యున్న యెడల పరమ శివుడని భాసిల్లు ధరణి వేమ

బ్రహ్మ సుఖతత్త్వ విజ్ఞాన పరముగోరి
గురుకళా జాల నియతమౌ కోర్కి మిగిలి
యోగనిర్ముక్త రూపుడై యున్న యెడల
పరమ శివుడని భాసిల్లు ధరణి వేమ

బ్రహ్మానుభవము కోరి గురువు చెప్పిన చొప్పున కళలను గమనించి యోగనిరుతడైన , బంధవిముక్తుడై దైవత్వమును పొందును

One desirous of brahmam, will observe the kala taught by the guru. Then he will attain divinity by practicing yoga all the time and freeing himself from bondage.

1583
బ్రహ్మ విష్ణువులకు బరగగ రుద్రుడు సిగయ యగుట నెఱిగి సృష్టి జనుల రుద్రనిందజేసి రూఢి తప్పుదరయా , వి. వే.

బ్రహ్మ విష్ణువులకు బరగగ రుద్రుడు
సిగయ యగుట నెఱిగి
సృష్టి జనుల రుద్రనిందజేసి
రూఢి తప్పుదరయా , వి. వే.

బ్రహ్మవిష్ణువులకు శివుడు శిఖవంటివాడు . జనులు అట్టి పరాత్పరుని రూపము నెరుగలేక మాటావేశమున శివుని నిందించి దుర్గతి పాలగుచుందురు

Among the tri-murti (Lords Brahma, Vishnu, Siva), Siva is the ultimate. People not knowing such a supreme being, talk rashly and blame him resulting in hardship.

1584
బ్రహ్మ పరువు చెడును బ్రాహ్మణులా దొడ్డ బ్రహ్మవలనబుట్టి పరగిరనగ బ్రహ్మవేత్తయగును బ్రాహ్మణుడే యైన, వి. వే.

బ్రహ్మ పరువు చెడును బ్రాహ్మణులా
దొడ్డ బ్రహ్మవలనబుట్టి
పరగిరనగ బ్రహ్మవేత్తయగును
బ్రాహ్మణుడే యైన, వి. వే.

అవివేకులు తాము బ్రహ్మసంతతివారమని చెప్పు కొనుటవలన బ్రహ్మకే గౌరవహాని కలుగుచున్నది . జాతి మాత్రమున బ్రాహ్మణులు గొప్పవారు కారు. బ్రహ్మవేత్త లయినపుడే వారు గౌరవమునకు తగియుందురు

Lord Brahma is becoming dishonorable by the foolish people claiming themselves to be his descendants. Brahmins are not great because of their caste. They deserve respect only after knowing brahmam fully.

1585
అంగమందు లింగమమరంగ మర్ధించి జంగమందుబెట్టి యంగు పఱచి రంగుగాను వసుధ గ్రు౦గగ జూడరా, వి. వే.

అంగమందు లింగమమరంగ మర్ధించి
జంగమందుబెట్టి యంగు
పఱచి రంగుగాను వసుధ గ్రు౦గగ
జూడరా, వి. వే.

హృదయమున ఈశ్వర స్వరూపమును లీనముచేసికొని జంగమరూపుడగు దైవమును ధ్యానించుచు పంచభూతావృతమగు ప్రపంచమును శూన్యభావమున చూడ నభ్యసింపవలెను

One has to fixate Iswara in mind, pray to god who is omnipresent, and observe the world made of pancha-bhootas (earth, water, air, fire, space) dispassionately.

1586
అంచఘనాక్షర బిందువు పంచాక్షరి నాదమండ్రు పరమ మునీంద్రుల్ ప్రాంచితముగ నది తెలిసిన మంచాసన మెక్కువాడు మహిలో వేమా

అంచఘనాక్షర బిందువు పంచాక్షరి
నాదమండ్రు పరమ మునీంద్రుల్
ప్రాంచితముగ నది తెలిసిన మంచాసన
మెక్కువాడు మహిలో వేమా

హంసయే ఓంకార స్వరూపమని , పంచాక్షరికి సారమని ఉత్తమ మునులు చెప్పుదురు. ఈ విషయమును బాగుగా ఎరిగినవాడే యోగి యనబడును

Sages of good character say hamsa is the manifestation of aum, and the essence of panchaakshari (aum-namaha-si-va-ya). The one who knows this well is considered to be a yogi.

1587
అచర చర సమూహ మంగము లింగము సరణి దెలిసి యట్టి శైవ మేల అష్టతనువు లమర హరుడౌట నెఱుగరా ? వి. వే.

అచర చర సమూహ మంగము లింగము
సరణి దెలిసి యట్టి శైవ
మేల అష్టతనువు లమర హరుడౌట
నెఱుగరా ? వి. వే.

అచరలింగ , చరలింగముల పద్దతులుగల శైవుల మతము నిరర్థకము . శివుడష్ట మూర్తులు కలవాడు. సర్వవ్యాప్తి . అతడు లింగములో మాత్రమే యుండడు

The religion of devotees of Lord Siva who claim fixed linga (phallic symbol) and moving linga is meaningless. Lord Siva has 8 murti(forms). He is omnipresent. He won't be restricted to the linga.

1588
అందలమును మోయ నందఱపై నుండి పొంది వేడ్క మీఱు పూర్ణు డతడు అతని పూజ ఫలము నందగ జేయును, వి. వే.

అందలమును మోయ నందఱపై నుండి
పొంది వేడ్క మీఱు పూర్ణు
డతడు అతని పూజ ఫలము
నందగ జేయును, వి. వే.

భక్తులందరును పల్లకిపై నెక్కించి మోయుచుండగా , తన గొప్పతనమునకు గర్వింపక ఈశ్వర స్వరూపమను దర్శించువాడే పూర్ణుడు . అట్టి ధన్యుని పూజించిన మేలు కల్గును

Even though all the devotees carry one in a palanquin, if one is not full of pride and meditates on Iswara, he is to be considered as great. One who performs pooja to him will receive good karma.

1589
అనుచిత పురుషం డొక్కడు విను నిత్యా నిత్య మనెడి విధమెట్టి దనన్ తన సంకల్పమె బంధము తన సంకల్పంబె క్షయము తనరగ వేమా

అనుచిత పురుషం డొక్కడు విను నిత్యా
నిత్య మనెడి విధమెట్టి
దనన్ తన సంకల్పమె బంధము తన
సంకల్పంబె క్షయము తనరగ వేమా

అనుచితమగు జన్మము పొందిన మానవుడు నిత్యానిత్యములను గూర్చి యోచించుచో కర్మబంధమునకును , కర్మ క్షయమునకును తన సంకల్పమే కారణమని తెలిసికొనవలెను

If one received an unsuitable birth, and analyzed permanent and impermanent objects, he will realize that bondage and freedom from karma are in the control of one's own free will.

1590
అనుభవకేళికి లోనగు తనువులు మూడుడిగి లోని తథ్యముగనియ జననాంతర మమరంగను కనునదె బ్రహ్మంబు మదిని గట్టిగ వేమా

అనుభవకేళికి లోనగు తనువులు
మూడుడిగి లోని తథ్యముగనియ
జననాంతర మమరంగను కనునదె బ్రహ్మంబు
మదిని గట్టిగ వేమా

అనుభవమునకు లొంగిన స్థూల, సూక్ష్మ , కారణ శరీరములు మూడింటిని విడిచి, తత్త్వము నెరిగి , పుట్టినదాది చచ్చువరకు బ్రహ్మమును సందర్శించుటకు యత్నింపవలెను

After overcoming gross, subtle and causal bodies, learning tattva, one has to visualize brahmam from birth till death.

1591
అనువు మీఱ మదిని నానంద మందెడి నరుడు పరుడుగాడె నయముగాను మనసు నిలుపకున్న మఱిముక్తి లేదయా, వి. వే.

అనువు మీఱ మదిని నానంద మందెడి
నరుడు పరుడుగాడె నయముగాను
మనసు నిలుపకున్న మఱిముక్తి
లేదయా, వి. వే.

బాగుగా ఆలోచించినచో ఆనందము ననుభవించు పురుషుడే పరమాత్మయని తెలిసికొని, మనస్సును నిలిపి ముక్తిని పొంద యత్నింపవలెను

After analyzing and coming to the conclusion that the one who is blissful in the paramaatma, one has to focus his mind and strive to attain salvation.

1592
అన్యులుండని స్థలమందు నాత్మ విద్య చిత్తతిమిరమ్ము నణగించి చెంగలించి పండువెన్నెల కాంతిలో బ్రాకి చూడు మప్పు డానందమను బొంద నగును వేమా

అన్యులుండని స్థలమందు నాత్మ విద్య
చిత్తతిమిరమ్ము నణగించి చెంగలించి
పండువెన్నెల కాంతిలో బ్రాకి చూడు
మప్పు డానందమను బొంద నగును వేమా

ఇతరులులేని ఏకాంత ప్రదేశమున చేరి, అజ్ఞానము నంతటిని తొలగించుకొని మనస్సులోని జ్యోతి , స్వరూపమును దర్శించిన యెడల నిరవదికమగు ఆనందమును పొందవచ్చును

When one goes to a secluded place, removes all ignorance, and visualizes the light in his heart, then one can experience eternal happiness.

1593
అమల మవ్యయంబు నంతరాత్మకు లోన విమలదృష్టి బూని విడకమించి తెమలకున్నవాడు తెరబయల్ సేరును, వి. వే.

అమల మవ్యయంబు నంతరాత్మకు
లోన విమలదృష్టి బూని విడకమించి
తెమలకున్నవాడు తెరబయల్
సేరును, వి. వే.

నిర్మలము , నిత్యమునగు ఆత్మతేజస్సునే బ్రహ్మమని నమ్మినచో బ్రహ్మమును చేరి కృతార్థతను చెందవచ్చును

If one realizes that pure, ever present aura of aatma is brahmam, then he will succeed in reaching him.

1594
అభవుని మదిలో గాంచెడు శుభకరమగు చూడ్కినంది సొ౦ పలరంగా నభిముఖ దృష్టిని బూనుము రభసము లేనట్టి యెఱుక రాజిలు వేమా

అభవుని మదిలో గాంచెడు శుభకరమగు
చూడ్కినంది సొ౦ పలరంగా నభిముఖ
దృష్టిని బూనుము రభసము
లేనట్టి యెఱుక రాజిలు వేమా

దృక్ శక్తిని మనస్సులో కేంద్రీకరించి ఈశ్వరుని గాంచ నభిముఖుడైనచో తదనుకూలమగు జ్ఞానమును పొందుట నిశ్చయము

If one focuses the power of sight in the mind, and begins to observe Iswara, then it is possible to attain the necessary knowledge.

1595
ఐదు నైదు నైదింట జేకూడు మూడు మూట జేరి మరియు నొకటి మురిసిన సకలంబు మోహించి యుండురా, వి. వే.

ఐదు నైదు నైదింట జేకూడు
మూడు మూట జేరి మరియు నొకటి
మురిసిన సకలంబు మోహించి
యుండురా, వి. వే.

పంచభూతములకు , పంచేంద్రియములకు , పంచప్రాణములకు , పంచతన్మాత్రాలకు సంభందము కలదు. స్థూల , సూక్ష్మ, కారణ దేహముల తోడి కళేబరమునకు త్రిగుణములతోడి అడ్డు కలదు. వీనిని జ్ఞాన దృష్టిచే కనుగొని ముక్తిని పొందుము

Pancha-bhoota (earth, water, fire, air, space), pancha-indriya (ear, nose, skin, eye, tongue), pancha-praana (paana, apaana, vyaana, udaana, samaana), pancha-tanmaatra (sabda (sound), sparsa(touch), roopa(vision), rasa (taste), gandha(smell)) are all related. The gross, subtle and causal bodies have connection with 3 gunas (sattva-calm, rajas-action, tamas-indolence). One has to attain salvation by knowing these.

1596
ఐదు వర్ణములను నానంద మెఱిగిన నందె చూడ ముక్తి యలరుచుండు ఐదులోనదెలియు టదియె పో బ్రహ్మంబు , వి. వే.

ఐదు వర్ణములను నానంద మెఱిగిన
నందె చూడ ముక్తి యలరుచుండు
ఐదులోనదెలియు టదియె
పో బ్రహ్మంబు , వి. వే.

పంచాక్షరిలోని ఆనందమెరిగినచో అదే బ్రహ్మమని, అదే మోక్షమని చెప్పబడును . ఆయానంద మనుభవించుటయే ముక్తిని పొందుట

If one is blissful after reciting panchaakshari (aum-namha-si-va-ya), then it is brahmam. Such bliss is attaining salvation.

1597
అల్ప సుఖములెల్ల నాశించి మనుజుడు బహుళ దుఃఖములను బాధపడును పరసుఖంబు నొంది బ్రతుకగ నేఱడు , వి. వే.

అల్ప సుఖములెల్ల నాశించి
మనుజుడు బహుళ దుఃఖములను బాధపడును
పరసుఖంబు నొంది బ్రతుకగ
నేఱడు , వి. వే.

మానవుడు స్వల్పములగు ఇంద్రియ సుఖముల కాశపడి వివిధ దుఃఖములచే బాధపడును . దుఃఖనివారణ మార్గమగు మోక్షసౌఖ్యమును పొందుటకు ప్రయత్నించుట లేదు

Man desirous of fleeting temptations of senses suffers from sorrows. The attainment of salvation will put an end to all sorrows. But he is not trying for salvation.

1598
అక్షయమున టంక మండంబుతో గూర్చి యమర గుణవికార మనుభవించి యక్షయంబుగ నంట నక్షయంబైయుండు , వి. వే.

అక్షయమున టంక మండంబుతో గూర్చి
యమర గుణవికార మనుభవించి
యక్షయంబుగ నంట నక్షయంబైయుండు,
వి. వే.

శాశ్వతమగు మోక్షమున మనస్సుననెంచి గుణ వికారముల లోబడక అక్షయుడై బ్రహ్మమును పొందవలయును

One has to think of the permanent salvation in mind. Then without yielding to the 3 gunas (sattva-calm, rajas-action, tamas-indolence) one has to remain imperishable in seeking brahmam.

1599
అక్షర పదవికి బదివే లక్షరముల నఱపనేల యలశివయను రెండక్షరము లణంచు దురితము తక్షణమే పదవి కలుగు తథ్యము వేమా

అక్షర పదవికి బదివే లక్షరముల
నఱపనేల యలశివయను రెండక్షరము
లణంచు దురితము తక్షణమే
పదవి కలుగు తథ్యము వేమా

అక్షరరూపమగు బ్రహ్మత్వము పొందుటకు పదివేల మాటలు పల్కుటకంటే "శివ" అను రెండక్షరములు పలికిన చాలును. ఆ రెండక్షరములే సాయుజ్యమును చేకూర్చును

To gain the brahmam in the form of letter there is no need for thousands of names. Mere two letters “Si-Va” are enough. These two letters will absorb the essence into the deity.

1600
ఆకసంబు శూన్యమందు శబ్దము పుట్టె శబ్ద మధ్యమునను సరగ జూడ శబ్ద రహితమగుచు జెలగును బ్రహ్మంబు , వి. వే.

ఆకసంబు శూన్యమందు శబ్దము పుట్టె
శబ్ద మధ్యమునను సరగ
జూడ శబ్ద రహితమగుచు జెలగును
బ్రహ్మంబు , వి. వే.

శూన్యమగు ఆకాశమున శబ్దము పుట్టెను . ఆ శబ్దమందే బ్రహ్మము శబ్దరహితమగు స్పోటరూపమున వెలుగుచున్నది

Sound originated from vacuous space. In that sound brahmam is shining as sound-less source of meaning.

1601
ఆత్మతేజమూని యనువుగా శోధించి తేజమాత్మయందు దేట పఱచి మింటి మంటి నడుమ మిన్నంటి చూడరా, వి. వే.

ఆత్మతేజమూని యనువుగా శోధించి
తేజమాత్మయందు దేట
పఱచి మింటి మంటి నడుమ మిన్నంటి
చూడరా, వి. వే.

ఆత్మ తేజస్సుతో బ్రహ్మమును సంశోధించి , బ్రహ్మమున నాత్మతేజమును నెలకొల్పి దృక్చక్తిని పరంజ్యోతి స్వరూపముపై నెలకొల్పి చూచుటకు అభ్యసింపుము

One has to investigate brahmam with the aura of aatma, then fixate brahmam in it, and turn his power of vision on the resplendence out of this world.

1602
ఆదినుండి చూడ నలవికా దేరికి సోది చెప్పదరమె సుఖమెఱింగి వాదమేల బయలు వర్ణించి చూడరా, వి. వే.

ఆదినుండి చూడ నలవికా దేరికి
సోది చెప్పదరమె సుఖమెఱింగి
వాదమేల బయలు వర్ణించి
చూడరా, వి. వే.

అన్నిటికి మూలమగు ప్రకృతిని కనుగొన నెవ్వరికిని సాధ్యముకాదు. కాన , కేవల చిత్ స్వరూపమును ధ్యానింపుము . మూలమును చూచితిమనెడివారి మాట సత్యముకాదు .

The prakriti (nature) which is cause for everything is impossible to find. Hence one has to mediate on chit-swaroopa. Those who claim they have seen the root of creation are not truthful.

1603
ఆలుమగడు సుతుడు నందఱలో నాత్మ మేలుగానెయుండి మెఱయుచుండు వేఱు వేఱుగా వెలసె రూపాంబులై , వి. వే.

ఆలుమగడు సుతుడు నందఱలో నాత్మ
మేలుగానెయుండి మెఱయుచుండు
వేఱు వేఱుగా వెలసె
రూపాంబులై , వి. వే.

దార పుత్రాదులందు , సమస్తములందును ఒక్క రూపునే ఆత్మ ప్రకాశించుచున్నను ఘట భేదమునుబట్టి వేర్వేరుగా తోచును. ఆత్మ సంబంధమువలన మానవు లందరు నొక్కటే!

Even though aatma among the wife, children and everything else is of the same form, one sees differences among them based on their personalities. By the relationship of aatma, all men are equal.

1604
ఆశపాశము బట్టింతు రాలు సుతులు గాసిపడెదవు కూటీకేగడవరాదు శోకమందిన గాలుడు తాకి విడడు పాక మెఱింగిన బ్రహ్మంబు పరగు వేమ

ఆశపాశము బట్టింతు రాలు సుతులు
గాసిపడెదవు కూటీకేగడవరాదు శోకమందిన
గాలుడు తాకి విడడు పాక
మెఱింగిన బ్రహ్మంబు పరగు వేమ

ఆలుబిడ్డలవలన జనులకు ఆశాపాశము తప్ప సుఖము లేదు. సంసారికి కూడుగుడ్డలకు తన సంపాదన చాలదు . ఇట్టి సంసార దుఃఖముతో , గడించిన పాపములతో మరణించినచో యమయాతనలు తప్పవు. కావున తగిన రీతిని ప్రవర్తించుటకు యత్నింపవలెను

Because of wife and children, one has strife without happiness. The income of a man with family is barely enough for food and clothing. When he dies in such sorrow and out of accumulated sins, then hell is inevitable. Hence one should live in a proper way.

1605
ఇట్టి యౌవనమున నీశ్వరధ్యానంబు గలిగి చేయవలయ గడకతోడ చేయకున్న యెడల క్షితి సౌఖ్యమేదయా , వి. వే.

ఇట్టి యౌవనమున నీశ్వరధ్యానంబు
గలిగి చేయవలయ గడకతోడ
చేయకున్న యెడల క్షితి
సౌఖ్యమేదయా , వి. వే.

యౌవనమున్నప్పుడే పట్టుదలతో ఈశ్వరుని ధ్యానింప లేనిచో , ఎప్పటికిని సౌఖ్యముండదు

When youth and vigor are present if one does not pray to Lord Siva, he will never receive comfort.

1606
ఇట్టి లింగమందు నీరేడు జగములు పుట్టి బ్రదుక నరులు భువిని వెలసి గట్టిగా యమునికి గానుకలైయుండ్రు , వి. వే.

ఇట్టి లింగమందు నీరేడు జగములు
పుట్టి బ్రదుక నరులు భువిని
వెలసి గట్టిగా యమునికి
గానుకలైయుండ్రు , వి. వే.

ప్రకృతివలన పదునాల్గు లోకములు పుట్టినవి . నరులు భూమిపై పుట్టి అభివృద్ధి పొంది చివరకు మరణము పొందు చుందురు . వారు శాశ్వతులు కారు

From prakriti (nature) 14 worlds have formed. Men born on earth, grow up and die. They are impermanent.

1607
ఇతర చింతలన్ని వెతలని మది నెంచి జతుక మంటు రీతి జగము మఱచి సతత మాత్మయందె సయ్యాటలాడరా , వి. వే.

ఇతర చింతలన్ని వెతలని మది
నెంచి జతుక మంటు రీతి
జగము మఱచి సతత మాత్మయందె
సయ్యాటలాడరా , వి. వే.

కష్టములు కల్గించు ఐహిక చింతలను విడిచి, ఆశను విడనాడి ఆత్మను ధ్యానించినచో , లక్క యితర వస్తువుల నంటునట్లు ఆత్మయందే మనస్సు లగ్నమగును

By giving up worldly sorrows that cause hardship, desires, and meditating on aatma, like lac attaches to all substances, mind will be permanently attached to aatma.

1608
ఇది యది కానిది మదిలో చెదరని గుఱితోడ జూచి చేపట్టి కనన్ గదలక మెదలక తోచెడు విదితం బే దందు బెనగి వెలయుము వేమా

ఇది యది కానిది మదిలో చెదరని
గుఱితోడ జూచి చేపట్టి కనన్
గదలక మెదలక తోచెడు విదితం బే
దందు బెనగి వెలయుము వేమా

ఇట్టిదని వివరింపరాని బ్రహ్మ స్వరూపమును స్థిర బుద్ధితో దర్శించిన , అది కానవచ్చును . దానిని నీ బుద్ధియందు లీనము చేసినచో కృతార్థుడవు కాగలవు

If one fixates the indescribable brahmam with a firm mind, then it will be visible. When he unifies it with intellect, then one will be successful.

1609
ఇది రాజమార్గ భావము సుధయై జగములకునెల్ల సూక్ష్మాకృతియై సదమలమతియై తోచెడు నదియే పరమైన బయల నందగు వేమా

ఇది రాజమార్గ భావము సుధయై
జగములకునెల్ల సూక్ష్మాకృతియై
సదమలమతియై తోచెడు నదియే
పరమైన బయల నందగు వేమా

సూక్ష్మాకారమున ఉన్న బ్రహ్మ స్వరూపమున స్థిరమైన మనసు చూచి మోక్షానుభూతిని పొందుటే సాధకునకు రాజమార్గము , అమృత ప్రాయము

If the brahmam in subtle form is visualized with unwavering mind, one can experience salvation in a royal path. It is imperishable.

1610
ఇది లేక జరుగదనుచును మదిలోనే వస్తువైన మమత దగు మతిం గదిసి విడిచి పోజాలని దదెపో సంసారబీజ మనబడు వేమా

ఇది లేక జరుగదనుచును మదిలోనే
వస్తువైన మమత దగు మతిం
గదిసి విడిచి పోజాలని దదెపో
సంసారబీజ మనబడు వేమా

“ఈ వస్తువు లేక జరుగ" దని ఏ వస్తువుపై నేని మమకారము పొంది దానిని విడువక దానికి లొంగుటయే సంసార బీజము

Bondage is when one considers life is impossible without a particular thing and attaches to it and yields to it.

1611
ఇంద్రియ పరువశు డధముండింద్రియపరవశుడె భక్తియెడ మధ్యముండౌ డింద్రియ జయుడుత్తముండు జితేంద్రియసమధికుడు విన మహేశుండు వేమా

ఇంద్రియ పరువశు డధముండింద్రియపరవశుడె
భక్తియెడ మధ్యముండౌ డింద్రియ
జయుడుత్తముండు జితేంద్రియసమధికుడు
విన మహేశుండు వేమా

ఇంద్రియములకు లొంగిన వాడధముడు . ఇంద్రియ వశుడైనను భక్తియున్నచో మధ్యముడగును . ఇంద్రియములకు లొంగని వాడు ఉత్తముడు. ఈశ్వర స్వరూపుడు

One who yields to senses is of the lowest form. One who yields to senses but has devotion is in the middle. One who never yields to senses is the most superior. He is the incarnation of Iswara.

1612
ఇరుమూడక్షర సాధన పరుడగ నిర్వాత దీప పద్ధతి మదిలో గుఱి మీఱి బయలు దేరిన నిరుపమ సానందమూర్తి నిత్యుడు వేమా

ఇరుమూడక్షర సాధన పరుడగ నిర్వాత
దీప పద్ధతి మదిలో గుఱి
మీఱి బయలు దేరిన నిరుపమ సానందమూర్తి
నిత్యుడు వేమా

పంచాక్షరీ మంత్ర సాధన చేసినవాడు గాలిలేని చోటగల దీపమువలె నిశ్చలుడై ఆనందమూర్తియగు బ్రహ్మము నొందును

One who recites panchaakshari (aum-namaha-si-va-ya), like a candle glowing in still air, he will attain the blissful brahmam

1613
ఈ జగమున ముక్తి కిరుమూటి కవ్వల రాజమార్గ మమరు రంగుగాను తేజమూని నొక్కి తెంపుగా జూడరా, వి. వే.

ఈ జగమున ముక్తి కిరుమూటి
కవ్వల రాజమార్గ మమరు రంగుగాను
తేజమూని నొక్కి తెంపుగా
జూడరా, వి. వే.

పంచ తత్త్వములను చర్చించినచో వానిలో ముక్తి కలదని తెలియును. బ్రహ్మ తేజము నార్జించి మనస్సు లోబరుచుకొని ముక్తికై యత్నింపుము

When contemplating over pancha-tattva, one will realize there is salvation among them. One has to obtain the resplendence of brahmam and control his mind to attain salvation.

1614
ఈడుకాని దాని తోడుకు బాల్పడి జోడుకూడరాదు సూటిగాను కూడి తప్పేనేని గుణములు కొంచెమౌ , వి. వే.

ఈడుకాని దాని తోడుకు బాల్పడి
జోడుకూడరాదు సూటిగాను
కూడి తప్పేనేని గుణములు
కొంచెమౌ , వి. వే.

తగని యువతితో పొందు తగదు. కొంతకాలము కలిసి యుండి పిదప అది తన్ను విడిచినచో తనకున్న గౌరవము కూడ నశించును

One should not consort with an undeserving woman. If after some time of co-habiting she leaves, one's honor will be destroyed.

1615
ఉత్తమమగు జ్ఞప్తికినై సత్తమ నిజరూప భావ సాదృశ్యములో బొత్తున బారంగతుడై హత్తెడు నధ్యాత్మ విద్య ననువుగ వేమా

ఉత్తమమగు జ్ఞప్తికినై సత్తమ
నిజరూప భావ సాదృశ్యములో బొత్తున
బారంగతుడై హత్తెడు నధ్యాత్మ
విద్య ననువుగ వేమా

ఉత్తమ జ్ఞానముతో తాదాత్మ్యము సిద్ధించుటకై రూప భావ సామ్యముల పెరిగి ప్రయత్నింపుము . అదే ఆధ్యాత్మ విద్య

To attain the bliss of great knowledge, one has to gain understanding of form, meaning and equality. That is the spiritual knowledge.

1616
ఉదయాద్రికి బై నుండెడు సదయుని మది నిల్పిచూడ శక్యముకాగా గుదురుపడు జ్ఞాపి నిలిచిన నదియే పరిపూర్ణ సౌఖ్య మందెడు వేమా

ఉదయాద్రికి బై నుండెడు సదయుని
మది నిల్పిచూడ శక్యముకాగా గుదురుపడు
జ్ఞాపి నిలిచిన నదియే
పరిపూర్ణ సౌఖ్య మందెడు వేమా

ఉదయ పర్వతమున కవతల నుండు సూర్య బింబమున విష్ణువు నిలిచి యున్నాడు . ఆ విష్ణు స్వరూపమును దర్శింప గల్గిన జ్ఞానము కుదురును. ఇందు నిశ్చయ బుద్ధి కలిగిన మోక్ష సౌఖ్యము తనంతనే లభించును .

In the sun rising behind the mountain, Lord Vishnu is situated. If one sees him, then he will gain spiritual knowledge. When one is of firm mind on this, salvation arrives by itself.

1617
ఊ కొన జెప్పిన విననది ప్రాకటముగ లోకములను బాలించెడు నా పాకము మదిలో బయలని యేకాకృతి నవిరతముగ నెన్నుము వేమా

ఊ కొన జెప్పిన విననది ప్రాకటముగ
లోకములను బాలించెడు నా
పాకము మదిలో బయలని యేకాకృతి
నవిరతముగ నెన్నుము వేమా

బ్రహ్మస్వరూపము చెప్పినను, వినినను బోధపడనిది , స్థిరముగా ధ్యానించిననే అది తెలియును . అదియే బయలు, సమస్త లోకములను పాలించునది అదియే

Brahmam is beyond words. It is revealed by unwavering meditation. It is space and ruler of all the worlds.

1618
చేకొని వినగా వచ్చును ప్రాకటముగ గథల నెల్లు బలువిధములుగా నేకీభావము నుందును సోకుట దుర్లభము మదికి సుడివడు వేమా

చేకొని వినగా వచ్చును ప్రాకటముగ
గథల నెల్లు బలువిధములుగా
నేకీభావము నుందును సోకుట దుర్లభము
మదికి సుడివడు వేమా

ఎన్ని మాటలనైన వినవచ్చును . కథల నెరుగ వచ్చును . కాని, బ్రహ్మమునందు ఐక్యమును పొందుట చాల దుర్లభము

One can listen to many words and stories about brahmam. It is very difficult to merge with brahmam.

1619
ఊపిరి లోనికి లాగుచు బ్రాపుగ లోవిలువజూచి పనుపుగ విడుచున్ చూపోర్వని బయలందుచు గాపుగ నీలోన నిన్నె కనవలె వేమా

ఊపిరి లోనికి లాగుచు బ్రాపుగ
లోవిలువజూచి పనుపుగ విడుచున్
చూపోర్వని బయలందుచు గాపుగ
నీలోన నిన్నె కనవలె వేమా

శ్వాసమును పీల్చుచు , బిగియబట్టుచు , విడుచుచు , మనస్సును నిశ్చలముగా ఉంచుచు బయలున వున్న ఆత్మ రూపమును రేచక, పూరక, కుంభకములచే దర్శింపుము

One has to visualize the form of aatma with breathing exercises like rEchaka-pooraka-kumbhaka.

1620
ఊపిరున్నంతవఱకును గాపురంబు చేసి కడతేరలేకయే చిక్కువడరె పాపలో చూపు మించుటే పావనంబు దాని మార్గంబె తెలియగాదగును వేమా

ఊపిరున్నంతవఱకును గాపురంబు చేసి
కడతేరలేకయే చిక్కువడరె పాపలో
చూపు మించుటే పావనంబు దాని
మార్గంబె తెలియగాదగును వేమా

మానవులు ఊపిరున్నంతవరకు సంసారములో మునిగి తేలుచుందురు . దానిని తొలగించుకొనుటకు కనుపాపలయందలి తత్త్వమును గ్రహించుట అవసరము. ఆ మార్గము నెరుగవలెను .

Men for as long as praana is moving in their bodies will revel in bondage. To overcome it, one has to gain the tattva in the pupil of the eye.

1621
ఎక్కు పెట్టి పరము నేకాంతమును గోరి ముక్కుకొనను చూడ్కి మొనయ నిలపి సొక్కియుండుటదియె సోx హస్వరూపము , వి. వే.

ఎక్కు పెట్టి పరము నేకాంతమును
గోరి ముక్కుకొనను చూడ్కి
మొనయ నిలపి సొక్కియుండుటదియె
సోx హస్వరూపము , వి. వే.

మనస్సును నిశ్చలముగా నుంచి , దృష్టిని నాసాగ్రమున నిల్పి తత్పరుడై యున్నచో "సో x హం" జ్ఞానము కలుగును

When one is still and focusing on the tip of the nose, then one will obtain the revelation that one is the ultimate ego or God.

1622
ఎక్కుపెట్టి మనసు నేకాంతమున జేర్చి మ్రొక్కువాడె పరము దక్కువాడు నిక్కి చూచునపుడె నిర్ఘాతమబ్బురా , వి. వే.

ఎక్కుపెట్టి మనసు నేకాంతమున
జేర్చి మ్రొక్కువాడె పరము
దక్కువాడు నిక్కి చూచునపుడె
నిర్ఘాతమబ్బురా , వి. వే.

దేవునిపై మనస్సును లగ్నముచేసి దైవమును చూచి మ్రొక్కువాడే ముక్తినందగల్గును . అచ్చెరుపడి చూచిన ఏమియు గానరాదు

One who meditates on god in his mind and pays obeisance when deified is suitable for salvation. Merely watching god will not help.

1623
ఎక్కుపెట్టి మనుజుడేకాంతమందగా దక్కగోరుచుండు ధన్యుడరయ ప్రక్కనుండు నెఱుక పరిపూర్ణమందురా వి. వే.

ఎక్కుపెట్టి మనుజుడేకాంతమందగా
దక్కగోరుచుండు ధన్యుడరయ
ప్రక్కనుండు నెఱుక
పరిపూర్ణమందురా వి. వే.

జ్ఞానము సమీపమందే కలదు. దృక్ఛక్తిని కేంద్రీకరించి ఏకాంతమున ఈశ్వరరూపమున దానివల్ల కనుగొనవచ్చును . దానికై యత్నించి కృతార్థుడవగుము

Knowledge is within reach. One can discover it by focusing the power of vision on Iswara in seclusion. One has to try and succeed in that practice.

1624
ఎచ్చుకచ్చులు నుడివిన నేమి ఫలము మ్రుచ్చువేషంబు పూనిన మూల మేది? అచ్చుపడ దన్నెఱింగిన యతడె యోగి సచ్చిదానంద పూర్ణుడౌ జగతి వేమా

ఎచ్చుకచ్చులు నుడివిన నేమి ఫలము
మ్రుచ్చువేషంబు పూనిన మూల మేది?
అచ్చుపడ దన్నెఱింగిన యతడె యోగి
సచ్చిదానంద పూర్ణుడౌ జగతి వేమా

ఊరక డంబములు పలికినను , దొంగ సన్న్యాసి వేషము వేసినను ప్రయోజనము లేదు. ఆత్మజ్ఞానియే యోగి; సచ్చిదానంద స్వరూపుడు

There is no use in pompous words by wearing the garb of a sannyaasi. One who knows about aatma is yogi and the ever blissful form.

1625
ఎండమావులు చాడ్పుననుండు జనము లుండు బరమాత్మయందును దండిగాను నిండు మదిలోన శోధించి నెగడవలెను మిథ్యయను నమ్మకము నీవు మీఱి వేమా

ఎండమావులు చాడ్పుననుండు జనము లుండు
బరమాత్మయందును దండిగాను నిండు
మదిలోన శోధించి నెగడవలెను మిథ్యయను
నమ్మకము నీవు మీఱి వేమా

ఎండమావులవంటి లోకములు ఆత్మత్త్వమగు బ్రహ్మాండమున నిలుకడలేక యున్నవి. పరిశుద్ధ మనస్సున తత్త్వమును విచారించి "లోకము మిథ్య , భగవంతుడు నిత్యుడు" అని తెలిసికొనుము

The various worlds are like mirages that are constantly changing in the universe based on aatma tattva. With a pure heart one has to analyze tattva to come to the conclusion that the world is an illusion and god is the ultimate reality.

1626
ఎంత కడుగ నోటి యెంగిలి పోవునె ? ఎల్లకాలమందు నెంగిలి తగు ననుదినంబు చూడ ననృతమాడెడు నోరు, వి. వే

ఎంత కడుగ నోటి యెంగిలి పోవునె?
ఎల్లకాలమందు నెంగిలి
తగు ననుదినంబు చూడ ననృతమాడెడు
నోరు, వి. వే

ప్రతిదినము అసత్యములు పలుకు నీనోరు అపరిశుద్ధము , ఎంగిలియై యున్నది. నోరున్నంతకాలము ఎంగిలి యుండును

The mouth that utters lies every day is impure and laden with spittle. For as long as the mouth is there, spittle also will be there.

1627
ఎదుట కాన్పించు దానినే యెంచరాదు మదిని గుఱితొంది యుండుట మానిత౦బు సదయహృదయత సాక్షిగా సంతరించు హృదయరంజక మాపుడగు నెన్నవేమ

ఎదుట కాన్పించు దానినే యెంచరాదు
మదిని గుఱితొంది యుండుట మానిత౦బు
సదయహృదయత సాక్షిగా సంతరించు
హృదయరంజక మాపుడగు నెన్నవేమ

బ్రహ్మమెదుట కన్పడుచున్నను దాని నెరుగుట అసాధ్యము . ఆ బ్రహ్మ స్వరూపమును మనస్సాక్షిగా సతతము గ్రహించిన శాశ్వతమగు ఆనందము కలుగును

Even if brahmam is visible it is hard to understand it. If one grasps its essence with aatma as the witness one can attain permanent bliss.

1628
ఎందున తలపగలే౦డట పొందుగ బరమాత్మనికను బొందుట యెట్లో ; ముందుగ దను దా తెలిసిన నందే పరమాత్మ తెలియునవనిని వేమా

ఎందున తలపగలే౦డట పొందుగ బరమాత్మనికను
బొందుట యెట్లో ;
ముందుగ దను దా తెలిసిన నందే
పరమాత్మ తెలియునవనిని వేమా

పరమాత్మ నిత్యమై తోచదని , దానిని పొందుట ఎట్లో ? అని కొందరు తలంతురు . సాధకుడు తొలుతనే దీనిని చర్చించి గ్రహించిన, ఆ తలపుననే పరమాత్మ కానవచ్చును

One wonders paramaatma is not in grasp every day and how to obtain it. If a yogi realizes this in the beginning, then he can visualize the paramaatma.

1629
ఎదుట నిల్పిన చూపులో నేక మమర నెఱిగి మరగిన తోడనే యెంచరాదు మదికి లోవెలి బయలగు మఱుగుజేరు స్థిరత చిత్తంబునకు గూర్పదివురు వేమా

ఎదుట నిల్పిన చూపులో నేక మమర నెఱిగి
మరగిన తోడనే యెంచరాదు మదికి
లోవెలి బయలగు మఱుగుజేరు స్థిరత
చిత్తంబునకు గూర్పదివురు వేమా

ఎదుటి వస్తువుపై చూపు నిలిపి , దానిపై మనస్సు లగ్నమైన పిదప ఆ చిత్ స్వరూపమును పొందుటకు యత్నింపుము

One has to focus vision on the object in the front and after mind is engaged with it one has to try to obtain the chit-swaroopa

1630
ఎనిమిదక్షరముల నేర్పడ నెఱిగియు వినియు గనగరాక వెలయువాని తనువు మఱచి తెలియదత్వాత్ముడగునురా వి. వే.

ఎనిమిదక్షరముల నేర్పడ నెఱిగియు
వినియు గనగరాక వెలయువాని
తనువు మఱచి తెలియదత్వాత్ముడగునురా
వి. వే.

మనుజుడు అష్టాక్షరముల యందు ఇమిడియున్న భగవత్స్వరూపము నెరుగగలిగినచో తత్త్వస్వరూపుడు కాగలడు . దానికి యత్నించువాడు తన శరీరమునే మరిచిపోవలెను

If one is aware of the divinity in the 8-lettered ashta-akshara, then he can become the epitome of tattva. The one trying to seek it must forget his own body.


1631
ఎనిమిది దిక్కులు బయలై ఎనిమిదిటికి నారి కెన్న నెక్కుడు బయలై వినరాని బయల నడచిన గనదా యచ్చోట నన్ను గలసియు వేమా

ఎనిమిది దిక్కులు బయలై ఎనిమిదిటికి
నారి కెన్న నెక్కుడు
బయలై వినరాని బయల నడచిన గనదా
యచ్చోట నన్ను గలసియు వేమా

అష్టదిక్కులును ఆకాశరూపమున అనంతముగ నుండి, షన్మార్గముల కతీతమై అనిర్వాచ్యమగు తత్త్వమును తెలిసికొనుము

One has to learn the indescribable tattva by being above the world with 8 directions covered by the sky and the shan-maargas (6-paths) .

1632
ఎన్ని విద్యలు నేర్చిన నెఱుగరాదు తన్ను నిర్గుణమున జ్ఞప్తితాకవలెను 'నిర్ణయోనాస్తి' యన్నది నిండియుండు గురుని బోధకు నన్యమే కొలది వేమా

ఎన్ని విద్యలు నేర్చిన నెఱుగరాదు తన్ను
నిర్గుణమున జ్ఞప్తితాకవలెను
'నిర్ణయోనాస్తి' యన్నది నిండియుండు
గురుని బోధకు నన్యమే కొలది వేమా

ఎన్ని విద్యలు నేర్చినను ఆత్మస్వరూపమును గుర్తించుట కష్టము. పరమాత్మ నిర్గుణుడన్న భావము తనంతనే కలుగవలెను . కాని నిర్ణయింప సాధ్యము కాదు . “నిర్ణయోనాస్తి" అని యున్నది కదా!

No matter how much knowledge one possesses, it is very hard to visualize the form of aatma. One has to realize by one self that paramaatma is free from gunas (sattva-calm, rajas-action, tamas-indolence). But one can't decide on it.

1633
ఎనుబదినాలుగు లక్షల టనబరగిన జీవరాసులందును మును దా జనియించు విధము తెలిసిన మునుజుడెపో దారిగాంచు మహిలోవేమా

ఎనుబదినాలుగు లక్షల టనబరగిన
జీవరాసులందును మును దా జనియించు
విధము తెలిసిన మునుజుడెపో
దారిగాంచు మహిలోవేమా

ఎనుబదినాల్గు లక్షల ప్రాణికోటిలో తన పూర్వజన్మమును తెలిసికొన్నవాడే ముక్తిమార్గము నెరగగలడు

Among the millions of life forms, the one who knows about his earlier births can know about the path to salvation.

1634
ఎల్లినేడు నిన్న ఏలాగుననుగాని మనసు నిలుపువాడు మంచివాడు శివుడు భర్తకర్త చింతింపనేలరా? వి. వే.

ఎల్లినేడు నిన్న ఏలాగుననుగాని
మనసు నిలుపువాడు మంచివాడు
శివుడు భర్తకర్త
చింతింపనేలరా? వి. వే.

ఎప్పటికిని మనస్సు నిలుపువాడు ఉత్తముడు . కాన భగవంతునియందు మనస్సు నిలిపి , అతడే సర్వమునకు ఆధారమని భావించి, ఇతర చింతలు మాని, అతనినే ధ్యానింపుము

One who can control his mind is superior to others. Hence one has to focus the mind on god, realize that he is the root of all things, give up sorrow and meditate on god.

1635
ఎవ్వరెవరన నేనను నేమెఱింగియొ తా నెవడని యెఱుంగని మానవు౦డు అడిగినపుడైన లక్ష్యంబు నమరజేయు కొంత తెలిసెడిగాదె యీ చింత వేమ

ఎవ్వరెవరన నేనను నేమెఱింగియొ తా
నెవడని యెఱుంగని మానవు౦డు అడిగినపుడైన
లక్ష్యంబు నమరజేయు కొంత
తెలిసెడిగాదె యీ చింత వేమ

తానెవడో గ్రహింపలేని మానవుడు, ఎవడవు నీవని ప్రశ్నించిన "నేన" ని బదులు చెప్పును . ఎదుటివాడట్లు ప్రశ్నించినపుడు అందలి అంతరార్థమును లక్ష్యమందుంచుకొన్నచో తానెవ్వడో గుర్తింప వీలగును

The one who doesn't know his real self, when questioned by others “who are you?” will answer with “I”. If one understands the meaning behind the question, then it is possible to realize who one really is.

1636
ఎవ్వరెఱుగని తత్త్వంబు నెఱుగుటెట్లు ? లోను చూడంగజూడంగ లోకమగును తలపు మరపులు దాటుటే తన్మయంబు నిత్యపూర్ణత సానందనిరతి వేమ

ఎవ్వరెఱుగని తత్త్వంబు నెఱుగుటెట్లు?
లోను చూడంగజూడంగ లోకమగును
తలపు మరపులు దాటుటే తన్మయంబు
నిత్యపూర్ణత సానందనిరతి వేమ

ఎవ్వరు నెరుగని తత్త్వమును తానెరుగుట కష్టము. సర్వాంతర్యామియగు భగవంతుని ధ్యానించి , తలపు మరపులను అతిక్రమించి తన్మయత్వమును పొందవలెను

The tattva that is unknown to others is very hard to grasp. One has to pray to the omnipresent god and overcome will to attain bliss.

1637
ఏకాంత మిరపు గన్గొని లోకాంతము చేరబోయి లోబయలగు నా పాకంబుబూని మించిన నీకింపగు చిత్పరంబు నెలవగు వేమా

ఏకాంత మిరపు గన్గొని లోకాంతము
చేరబోయి లోబయలగు నా పాకంబుబూని
మించిన నీకింపగు
చిత్పరంబు నెలవగు వేమా

ఏకాంత స్థలమున కూర్చుండి , నిత్యానిత్యముల పరిశీలించుచు ఆకాశతత్త్వము నెరిగినచో చిత్స్వరూపము పొందగలవు

By sitting in a secluded place, analyzing permanent and impermanent things, learning about the tattva of sky, one can attain chit-swaroopa

1638
ఏకాంత మిరవు గన్గొని శ్రీకాంతుని బ్రహ్మమయుని జిన్మయు బరునిన్ సాకారరూపు సాక్షిని రాకారమె పరమపదవి యారయ వేమా

ఏకాంత మిరవు గన్గొని శ్రీకాంతుని
బ్రహ్మమయుని జిన్మయు బరునిన్
సాకారరూపు సాక్షిని
రాకారమె పరమపదవి యారయ వేమా

ఏకాంత స్థలమున విష్ణువు , బ్రహ్మస్వరూపుడు , జ్ఞాన మయుడు , పరాత్పరుడు , సాకారరూపుడునగు భగవంతుని నిరాకారమే పరమమగు పదవియని తెలిసికొనుము

In a secluded place realize that Lord Vishnu is a form of brahmam, knowledgeable, a supreme being, and a manifestation of god's formlessness.

1639
ఏకంబ్రహ్మమనంగా వైకల్పికమై జగంబువారల కెల్లన్ సాకారత్వము లుడిగిన శోకము మోహంబులేదు శుభమగు వేమా

ఏకంబ్రహ్మమనంగా వైకల్పికమై
జగంబువారల కెల్లన్ సాకారత్వము
లుడిగిన శోకము
మోహంబులేదు శుభమగు వేమా

బ్రహ్మస్వరూప మొక్కటియేయని భావించి, లోకుల కట్లే తెలియజేయుచు , సాకారనిరాకార వాదములు విడిచినవానికి శోక మోహములు నశించి మోక్షము కలుగును

By understanding that there is only one brahmam and teaching people about it, by giving up arguments on brahmam about saakara (with form) and niraakaara (without form) one can overcome sorrows and desires to attain salvation.

1640
ఏచిన పంచేంద్రియ సుఖ నీచవ్యాపార ముడిగి నిజముగదానై లోచూపుచూడ నొల్లక నాచాబ్రహ్మంబు పదల వలదుర వేమా

ఏచిన పంచేంద్రియ సుఖ నీచవ్యాపార
ముడిగి నిజముగదానై
లోచూపుచూడ నొల్లక నాచాబ్రహ్మంబు
పదల వలదుర వేమా

చెలరేగు పంచేంద్రియ విషయ సుఖములు విడిచి , ఆత్మజ్ఞానమును సంపాదించి వ్యామోహము కల్గించు వస్తువులను చూడక వాగ్గోచరమగు బ్రహ్మమును సందర్శింప యత్నింపుము

By giving up raging thoughts about worldly matters, and by gaining knowledge about aatma, one should not see objects of lust and attempt to see brahmam that is not amenable to speech.

1641
ఏక సమయమునందు నెఱుక కల్గిన యోగి పరులెఱింగి చూడ భావమందు ఆశలేక మించియన్నిట దానగు వి. వే.

ఏక సమయమునందు నెఱుక కల్గిన
యోగి పరులెఱింగి చూడ
భావమందు ఆశలేక మించియన్నిట
దానగు వి. వే.

జ్ఞానసంపూర్ణుడగు యోగి ఇతర విషయములలో జోక్యము కల్గించుకొనక నిశ్చలుడై యుండును. పరులకా ఉత్తముడు ఆశలకు దూరుడై కానవచ్చుచుండును

One who is a great knowledgeable yogi won't interfere in others' matters and remains equanimous. Others view him as though he is not desirous of anything.

1642
ఏ జనుడు గుణకదంబము నీ జగమునబట్ట నేర్చు నిమిడిక పడగా ఆ జనుడె ముక్తి కర్హుడు రాజిత పరిపూర్ణహృదయ రంజక వేమా

ఏ జనుడు గుణకదంబము నీ జగమునబట్ట
నేర్చు నిమిడిక పడగా ఆ
జనుడె ముక్తి కర్హుడు రాజిత
పరిపూర్ణహృదయ రంజక వేమా

ఎవ్వడు గుణములను లోబరుచుకొని స్వేఛ్ఛగా సంచరింపగల్గునో అతడే మోక్షమున కర్హుడు . ఇది సత్యము

One who controls his gunas (sattva-calm, rajas-action, tamas-indolence) and moves freely, is eligible for salvation.

1643
ఏ తత్త్వ మమర గోరెదొ ఆ తత్త్వము సరిగనడవు మారసి స్వరముల్ ఖ్యాతిగ వర్ణము లెన్నక యాతురత న్నిలుపు మదిని ననువుగ వేమా

ఏ తత్త్వ మమర గోరెదొ ఆ తత్త్వము
సరిగనడవు మారసి స్వరముల్ ఖ్యాతిగ
వర్ణము లెన్నక యాతురత
న్నిలుపు మదిని ననువుగ వేమా

జాతికుల భేదములకు లోనుగాక వాంఛితమగు తత్త్వముపై మనస్సు౦చి అనుకూల స్వరములు తెలిసికొని మనస్సును శ్రద్ధతోను , విశ్వాసముతోను నిలిపి కృతార్ధుడవు కమ్ము

Without yielding to racial and caste differences, by focusing the mind on tattva with dedication of mind and faith, one has to be successful.

1644
ఏది తినకయు బ్రతికిన నేమి కలదు? వాదునకు జిక్కదక్కని వరుసగనుము భేదబుద్ధిని జూచిన బెనగబోదు సమత కలవాడె యోగ్యుడీ జగతి వేమ

ఏది తినకయు బ్రతికిన నేమి కలదు?
వాదునకు జిక్కదక్కని వరుసగనుము
భేదబుద్ధిని జూచిన బెనగబోదు
సమత కలవాడె యోగ్యుడీ జగతి వేమ

ఆహారమును మానుటవల్లగాని , వాదనవాదములవల్లగాని, భేదబుద్ధివల్లగాని ప్రయోజనము లేదు. సర్వసమత్వము కల్గియుండుము .

There is no use in fasting, arguments and discriminatory mind. One has to practice equanimity.

1645
ఏదియోదని మదిలోని పాదు తెలిసి కాదుకాదని పరికించి కనులు తెఱచి ఆదిమూలముగను చుండు నాత్మవేత్త దాననే పరమానందమాను వేమ

ఏదియోదని మదిలోని పాదు తెలిసి
కాదుకాదని పరికించి కనులు తెఱచి
ఆదిమూలముగను చుండు నాత్మవేత్త
దాననే పరమానందమాను వేమ

సర్వదా భగవంతునియందే ధ్యానముంచి భ్రమల పాలుగాక పరమహంస స్వరూపమును కనుగొను ఆత్మవేత్త దానివల్లనే పరమానందమును పొందును

By always meditating on god, without yielding to temptations, one who tries to glimpse the form of the ascetic of highest order will enjoy the ultimate bliss.

1646
ఏమికానిదాని నెఱుగుట లక్ష్యంబు సాము చేసినట్లు సాధ్యపఱచి నియమనిష్ఠవదలి నిర్ణయమందరా , వి. వే.

ఏమికానిదాని నెఱుగుట లక్ష్యంబు
సాము చేసినట్లు సాధ్యపఱచి
నియమనిష్ఠవదలి
నిర్ణయమందరా , వి. వే.

ఇది యిట్టిదని నిరూపింపరాని బ్రహ్మస్వరూపమును సాము నేర్చినటుల నేర్పుతో చూడనేర్చి లక్ష్యమునుంచి నియమనిష్ఠలను వదలి మోక్షము పొందుము

The form of brahmam is indescribable. One has to practice like a wrestler to see him. Eventually one has to give up the rules and principles of life to attain salvation.

1647
ఏమి సాధనముల నందనేమి ఫలము? తామసాన్వితమగునుక్తి దగులబెట్టి నియమనిష్ఠలు మదియందు నెఱపవలెను మనసు నిలుకడ గనునట్లు మనగ వేమా

ఏమి సాధనముల నందనేమి ఫలము? తామసాన్వితమగునుక్తి
దగులబెట్టి నియమనిష్ఠలు
మదియందు నెఱపవలెను మనసు
నిలుకడ గనునట్లు మనగ వేమా

ఇతర సాధనముల నెన్నిటి నవలంబించినను లాభము లేదు. తన్ను తానుద్ధరించుకొనదలచినయెడల తమో గుణమును విడిచి , మనస్సును స్థిరపరచి నియమనిష్ఠల నవలంబింపవలెను

If one is desirous of reforming oneself, then one has to give up indolence, fixate the mind and live a principled life. There is no use in other methods.

1648
ఏరిక దక్కిన చిన్మయ దారికి దోడ్పడుట నెఱుక తనలో దానై పోరుచు బైకొనుచుండును సారెకు సమయింపజూడు సరసత వేమా

ఏరిక దక్కిన చిన్మయ దారికి
దోడ్పడుట నెఱుక తనలో దానై
పోరుచు బైకొనుచుండును సారెకు
సమయింపజూడు సరసత వేమా

ఎట్టివారికిని సాధ్యుడుకాని చిత్స్వరూపుని జ్ఞానము వల్ల హృదయముననే చూచి తన్మయత్వమొందినచో అజ్ఞానము నశించును

One's ignorance will be destroyed when one sees the chit-swaroopa of god – who is not visible to every one – in heart with bliss

1649
ఏవంక మనసు కలిగిన నావంకనె యింద్రియంబు లన్నియు నేగు న్నీ వంక మనసు కలిగిన నేవంకకు నింద్రియంబు లేగవు వేమా

ఏవంక మనసు కలిగిన నావంకనె యింద్రియంబు
లన్నియు నేగు న్నీ
వంక మనసు కలిగిన నేవంకకు
నింద్రియంబు లేగవు వేమా

మనస్సే దిక్కునకు పోయిన ఇంద్రియము లా దిక్కుకే పోవును. ఇంద్రియములకు లొంగక మనస్సును భగవంతుని పైకి త్రిప్పుము. అప్పుడింద్రియము లీశ్వరునియందే లీనమగును

The senses will go to wherever the mind goes. One should not yield to the senses and turn the mind towards god. Then the senses will merge with Iswara.

1650
ఒకటని రెండని యెన్నెచు బ్రకటితముగ లెక్క పెట్ట బైకొనుచుండున్ నికరముగ నెఱుక దాటిన సకాలేశుని గాంచుటదియె సరసము వేమా

ఒకటని రెండని యెన్నెచు బ్రకటితముగ
లెక్క పెట్ట బైకొనుచుండున్
నికరముగ నెఱుక దాటిన సకాలేశుని
గాంచుటదియె సరసము వేమా

జపమాలను ధరించి గురువుపదేశించిన మంత్రమును జపమాలను లెక్కతో త్రిప్పుచు జపించి జ్ఞానము సంపాదింపుము . ఆ జ్ఞానమున కతీతమగు ఈశ్వరసాక్షాత్కారము కలుగును

One has to wear a rosary and recite the mantra given by guru while counting on the rosary to gain knowledge. Then Iswara beyond that knowledge will deify.

1651
ఒంటరిగా నున్నప్పుడు కంటికి మింటికిని నాడుమ గాపురముగ నీ యింటను గన్గొని పిమ్మట జంటించు చిదాత్మమయుని జపమున వేమా

ఒంటరిగా నున్నప్పుడు కంటికి మింటికిని
నాడుమ గాపురముగ నీ
యింటను గన్గొని పిమ్మట జంటించు
చిదాత్మమయుని జపమున వేమా

ఏకాంతముగా నున్నప్పుడు దృష్టికి , ఆకాశమునకు మధ్య నెలకొనియున్న ఈశ్వర స్వరూపమును మనస్సులో నెలకొల్పి చిదాత్మమయుడగు బ్రహ్మముతో లీనమగుటకు యత్నింపుము

While in solitude, one has to fixate the form of Iswara between vision and sky in the mind and try to unify with brahmam that is chid-aatma

1652
వంటికంబమందు నొనర సంకణమౌను ఆరు నంకణముల నమర నిల్పి ఆవల నిక చూడ నమరును తత్త్వము, వేమా

వంటికంబమందు నొనర సంకణమౌను
ఆరు నంకణముల నమర
నిల్పి ఆవల నిక చూడ నమరును
తత్త్వము, వేమా

శరీరమను ఒంటికంబపు మేడకు ఆరాంకణముల ఆధారములు. వీనిని దాటి ఆ పైనున్న బ్రహ్మమును దర్శింపుము

Body is like a building with a single pillar with 6 apartments. One has to go beyond them to visualize brahmam.

1653
ఒంటిమేడలోన నొనరంగ జూచిన మంటి మింటి నడుమ మహితమగును కంటిజ్యోతి మిగిలి కలియ నెక్కుము హంస, వి. వే.

ఒంటిమేడలోన నొనరంగ జూచిన
మంటి మింటి నడుమ మహితమగును
కంటిజ్యోతి మిగిలి కలియ
నెక్కుము హంస, వి. వే.

నిశ్చల ధ్యానమున ఒంటి స్థంబపు మేడలో చూచినచో గొప్ప తేజస్సు కానబడును . దానిని పొందుటకు హంసము నెక్కవలెను . అనగా ప్రాణయామ సాధన చేయవలెను

With unwavering meditation if one sees in the building with a single pillar, a great resplendence can be seen. To possess it one has to use a swan (has to practice breathing).

1654
కడక తోడ నరుడు కామంబు గట్టిన జిత్తమున చికిలి చిత్రరూపు కైవడి నిల నుండు ఘనుడాతడే సుమీ, వి. వే.

కడక తోడ నరుడు కామంబు గట్టిన
జిత్తమున చికిలి చిత్రరూపు
కైవడి నిల నుండు
ఘనుడాతడే సుమీ, వి. వే.

నరుడు కామమును జయించి మనస్సును నిలిపి చిత్రములోని బొమ్మవలె విషయములకు లొంగక యుండిన వాడే ఆత్మస్వరూపుడగును

One has to overcome desires and fixate mind without yielding to worldly matters. Then only he realizes aatma.

1655
కడలేని యాది కాలం బెడబడకుండగును జ్ఞాన మెఱుగక యున్న విడువడు జడమతులను మఱి నడువుడి ఘనులెల్ల ముక్తినట్టుగ వేమా

కడలేని యాది కాలం బెడబడకుండగును
జ్ఞాన మెఱుగక యున్న విడువడు
జడమతులను మఱి నడువుడి ఘనులెల్ల
ముక్తినట్టుగ వేమా

జీవితకాలమంతయు విషయములకు లోనై జ్ఞానము లేని మందమతులతో స్నేహము మాని ముక్తిమార్గమును వెదకి యోగ్యుడు సౌఖ్యమును పొందును

Instead of spending life with distraction and friendship with ignorant fools, one has to seek the path to salvation and attain qualification to receive ultimate bliss.

1656
కడుపునిండ సుధను క్రమముతో ద్రావిన పాలమీద నేల పాఱు మనసు? తత్త్వమెఱుగు వెనుక తన్వ ౦గులేటికి ? వి. వే.

కడుపునిండ సుధను క్రమముతో
ద్రావిన పాలమీద నేల పాఱు మనసు?
తత్త్వమెఱుగు వెనుక తన్వ
౦గులేటికి ? వి. వే.

తృప్తిగా అమృతము త్రాగినవానికి పాలక్కరలేదు . అట్లే తత్త్వమెరిగినవాని మనస్సు స్త్రీలపైకి పోదు

One who drinks the elixir of life (amrita) has no need for milk. Similarly to the one who knows tattva, there is no use for women.

1657
కదలకుండగు మదినిల్పి కదిసి వట్టి నిదురలో నిద్ర చూచుచు నేర్పు మిగిలి పదరకుండెడివాడెపో బ్రహ్మనిభుడు నిదియె సంతోషములకెల్ల నిజము వేమ

కదలకుండగు మదినిల్పి కదిసి వట్టి
నిదురలో నిద్ర చూచుచు నేర్పు మిగిలి
పదరకుండెడివాడెపో బ్రహ్మనిభుడు
నిదియె సంతోషములకెల్ల నిజము వేమ

మనస్సున కదలనీయక సమాధిలో నుండి నదురలోని తత్త్వమును గ్రహించి లేనిపోని దంభములు పలుకక జాగ్రత్తగా నుండవలెను . అప్పుడు బ్రహ్మమును పొందవచ్చును . ఆ బ్రహ్మమే సంతోషములకెల్ల నిలయము

By keeping the mind unwavering, one has to remain in samaadhi (deep meditative state). Then one has to learn about the tattva in the forehead and not indulge in pompous talk. Then he will be eligible to see brahmam which is the source of all bliss.

1658
కదలని జీవములందును తుది మొదలుగ నాఱు రుచులు తొలగక యుందున్ కదలెడి జీవములందును వదలపు కష్టంబు సుఖము వసుధను వేమా

కదలని జీవములందును తుది మొదలుగ
నాఱు రుచులు తొలగక యుందున్
కదలెడి జీవములందును వదలపు
కష్టంబు సుఖము వసుధను వేమా

కదలలేని ముసలివారికిని జిహ్వచాపల్యము నశించదు . కదులుచు స్వసహాయమున వర్తించువారికి జిహ్వచాపల్యముతో పాటు కష్టసుఖములను వదలవు

An immobile old man has the temptation for food. A healthy individual has temptation for food as well as comforts and sorrows.

1659
కనుచాటు తప్పకాగుఱి మననంబునజేరి నొక్కి మార్కొనినంతన్ వినుచుండు ప్రణవరవమును గనిదాటున నిర్గుణంబుగతి యగు వేమా

కనుచాటు తప్పకాగుఱి మననంబునజేరి
నొక్కి మార్కొనినంతన్ వినుచుండు
ప్రణవరవమును గనిదాటున
నిర్గుణంబుగతి యగు వేమా

కనురెప్పపాటినైన అడ్డము రానీయక లక్ష్యమును చూచినయెడల బాగుగా ప్రణవరవము వినబడును. దానిని దాటితిమేని నిర్గుణ స్వరూపమైన బ్రహ్మము గోచరించును

Without a hair's width of separation when one looks at the objective, the pranava (aum) will be audible. When one crosses it the brahmam without gunas (sattva-calm, rajas-action, tamas-indolence) will be visible.

1660
కనుల చూడ్కిని చెదరక కట్టి నొక్కి తనువుపై నాశ విడిచిన తావుబట్టి యున్న మనుజుడె శివుండయా యుర్విలోన నతని కేటికి సుఖదుఃఖ వితతి వేమ

కనుల చూడ్కిని చెదరక కట్టి నొక్కి
తనువుపై నాశ విడిచిన తావుబట్టి
యున్న మనుజుడె శివుండయా యుర్విలోన
నతని కేటికి సుఖదుఃఖ వితతి వేమ

దృష్టిని స్థిరముగానుంచి శరీరము మరచి, భగవంతుని యందు మనస్సు లగ్నముచేసినవారికి ఆత్మసిద్ధి కల్గును. అతనికి సుఖదుఃఖములు ఉండవు

By focusing the vision firmly, meditating on god, one will attain aatma sidhi (fulfillment). He won't feel comforts and sorrows.

1661
కనుల జూడబడని కలుష విదూరిని మనమునందుజేర్చి మరులు కొనక తనకు ముక్తిలేదు తలంపులు మెండైన , వి. వే.

కనుల జూడబడని కలుష విదూరిని
మనమునందుజేర్చి మరులు
కొనక తనకు ముక్తిలేదు తలంపులు
మెండైన , వి. వే.

దృష్టికి గోచరింపని భగవంతుని మనస్సున నిల్పి కోరికలు విడిచియుండక పెక్కు తలపులతో ఉండినచో ముక్తి లభింపదు

If one focuses his mind on invisible god and doesn't give up desires and is full of multitude thoughts, he can't achieve salvation.

1662
కప్పయు పామును బోరం గప్పను సర్పంబు మ్రింగుకైపడి మెఱయం గప్పను వెడలం ద్రోసెడి యొప్పున నా చొప్పు తెలిసియుండర వేమా

కప్పయు పామును బోరం గప్పను సర్పంబు
మ్రింగుకైపడి మెఱయం గప్పను
వెడలం ద్రోసెడి యొప్పున
నా చొప్పు తెలిసియుండర వేమా

కప్ప, పాము పోరునపుడు పాము కప్పను మ్రింగివేయును . సమర్థుడైనచో కప్పను విడిపించును . అట్లే జీవుని మాయ మ్రింగునపుడు తగిన గురువు విజ్ఞుడై జీవుని మాయనుండి విడిపించును

When the snake and frog fight, the snake will swallow the frog. One who is capable will free the frog. Similarly when a jiva is being swallowed by maaya (illusion) a guru will free him from its clutches.

1663
కపటమైన పనులు కడబెట్టి చూడక తత్త్వమెట్లు తనకు దగులు పడును తగులు పడినగాని దన్యత నొందడు వి. వే.

కపటమైన పనులు కడబెట్టి చూడక
తత్త్వమెట్లు తనకు దగులు
పడును తగులు పడినగాని
దన్యత నొందడు వి. వే.

ఇతరులను మోసగించు చెడ్డబుద్ధిని విడిచిపెట్టిననే గాని తత్త్వము గోచరింపదు . తత్త్వము గోచరించినగాని మానవుడు కృతార్థుడు కాలేడు

One cannot gain tattva until one gives up deceitful ways of cheating others. Without tattva one cannot be successful as a yogi.

1664
కంబమునను జొచ్చి కడతేఱి పోయెడి తెరువెఱుగక యుండె దిరిగి వచ్చి తెరువు తెలసి దాట దేవుడందురు కదా! వి. వే.

కంబమునను జొచ్చి కడతేఱి పోయెడి
తెరువెఱుగక యుండె దిరిగి
వచ్చి తెరువు తెలసి దాట
దేవుడందురు కదా! వి. వే.

జీవుడు శరీరములో ప్రవేశించి తిరిగిపోవుచుండు నవస్థలను తెలిసికొని, వీని కతీతుడగుటయే ఈశ్వరతత్వము పొందుట. ఆ ఈశ్వరత్వము పొందినవాడే భగవంతుడు

One who understands the process of jiva entering and leaving the body and remains transcendental to it is gaining the tattva of Iswara. One who gains such understanding is the god.

1665
కర్మజ్ఞానేంద్రియములు నిర్మల హృదయమునజేర్చి నిర్గుణమతితో ధర్మంబని వివరించుట మర్మం బధ్యాత్మ యోగిమహిమము వేమా

కర్మజ్ఞానేంద్రియములు నిర్మల
హృదయమునజేర్చి నిర్గుణమతితో
ధర్మంబని వివరించుట మర్మం
బధ్యాత్మ యోగిమహిమము వేమా

కర్మేంద్రియ , జ్ఞానేంద్రియములను ఈశ్వర విచారమునకు ఉపయోగించుచు , హృదయము నిర్గుణమొనర్చి ధర్మాధర్మ వివేచన చేయుచు ఉండుటయే ఆధ్యాత్మిక యోగము

One has to employ the karma-indriya (hands, legs, etc.), gnaana-indriya (eye, ear, etc.) for thinking about Iswara, make heart without gunas (sattva-calm, rajas-action, tamas-indolence) and analyze dharma and adharma. This is spiritual yoga.

1666
కల్లనిజము తెలిసి గాలి భూతము రోసి యింటిమీద నాశ యేల విడరొ ? నీటి మీద బుగ్గ నిలుకడ కాదయా, వి. వే.

కల్లనిజము తెలిసి గాలి భూతము
రోసి యింటిమీద నాశ యేల
విడరొ ? నీటి మీద బుగ్గ
నిలుకడ కాదయా, వి. వే.

మానవ శరీరమునకు గల స్థిరత్వాస్థిరత్వములను తెలిసికొని, ప్రాణవాయువు మిక్కిలి చంచలమైనదని గుర్తించియు జనులు దేహముపై మోహమును విడువలేకున్నారు . నీటిబుగ్గవంటి దేహములకు నిలుకడలేదు కదా!

Even though men are aware of the impermanence of their bodies and praana is evanescent, they are unable to give up their attachment with their bodies. Body is like an air bubble without permanence.

1667
కలుషములనెల్ల ఖండించు గతి నెఱింగి చిన్మయానంద పట్టాభిషిక్తుడైన వాని నెన్నగదరమె యీ వసుధయందు పరమశివుడని వర్ణింపబడును వేమ

కలుషములనెల్ల ఖండించు గతి నెఱింగి
చిన్మయానంద పట్టాభిషిక్తుడైన
వాని నెన్నగదరమె యీ వసుధయందు
పరమశివుడని వర్ణింపబడును వేమ

పాపకార్యములు నన్నిటిని విడిచి చిన్మయానంద రాజ్యమున పట్టాభిషిక్తుడగు మహాత్ముని వర్ణించుట అశక్యము . అతడు కేవలము భగవత్ స్వరూపుడే

A great man who has given up sins and is always blissful is hard to describe. He is of divine form.

1668
కాంతపైని ప్రేమ స్వాంతము రంజించు జింత తీఱ దరుణి చిక్కునపుడె వింతయమరబోదు విశ్వసాక్షిని గూడ, వి. వే.

కాంతపైని ప్రేమ స్వాంతము రంజించు
జింత తీఱ దరుణి చిక్కునపుడె
వింతయమరబోదు విశ్వసాక్షిని
గూడ, వి. వే.

స్త్రీని ప్రేమించినపుడు మనస్సున కానందముగానుండును. ఆమె చేతికి చిక్కెనేని చింతలన్నియు తీరిపోవును . కాని పరమేశ్వరునిలో లీనమైన శాశ్వతానందమే కల్గును. తుఛ్ఛ సుఖముపై ఆశయుండదు

When one loves a woman, he feels happiness. Once he marries her all of his worries will be solved. But when one unifies with Iswara, it is possible to obtain permanent happiness. One won't desire lowly pleasures.

1669
కించిన్మాత్రమును మదికి జంఛలమును బుట్టనీక జాగ్రతతోనౌ నంచితమగు గురుభక్తిని మించిన పరిపూర్ణమూని మెలగుము వేమా

కించిన్మాత్రమును మదికి జంఛలమును
బుట్టనీక జాగ్రతతోనౌ నంచితమగు
గురుభక్తిని మించిన
పరిపూర్ణమూని మెలగుము వేమా

కొంచెమైనను మనస్సును చలింపనీయక మెలకువతో గురువు చెప్పిన రీతిని పరమాత్మను ధ్యానించుటయే ముక్తికి మార్గము

With an unwavering mind, one who meditates as per the teachings of his guru, can attain salvation.

1670
కీలు తెలిసి మదిని గేవలాత్మనుగూడి భావమందు సొక్కి బయలుదాకి చేరియుంట ముక్తి చెందంగ బూనరా, వి. వే.

కీలు తెలిసి మదిని గేవలాత్మనుగూడి
భావమందు సొక్కి
బయలుదాకి చేరియుంట ముక్తి
చెందంగ బూనరా, వి. వే.

వేదాంత విద్యారహస్యమును గ్రహించి, హృదయ మాత్మయందు చేర్చి తన్మయత్వమున చిత్స్వరూపమును చేరుటయే ముక్తిని చెందుట

Learning the secrets of vedas, unifying heart with aatma and being blissful to reach the chit-swaroopa is salvation.

1671
కుండలి యోగము తెలిసిన బండాలము యోగికేల బాలిక బొందం దండిగ నా తను వందునె మెండుగ నిల ముక్తికాంత మెలగుర వేమా

కుండలి యోగము తెలిసిన బండాలము
యోగికేల బాలిక బొందం దండిగ
నా తను వందునె మెండుగ నిల
ముక్తికాంత మెలగుర వేమా

కుండలియోగమును నెరిగిన ఉత్తమయోగికి స్త్రీ సంగమముపై కోరికయుండదు . అట్టి యోగి హృదయమున ముక్తికాంత మెలగుచుండును . ఇక ఇతర కాంతతో పనియేమి ?

The one who knows kundalini yoga will not seek union with women. The light of salvation will be shining in his heart. Where is the necessity of other forms of light?

1672
కేవలాంతరాత్మ జీవుండు నిజమని పట్టివాదులాడువారి ద్రొక్కి త్రొక్కిపట్టి నాల్కతుదిగోయ పాపమా? వి. వే.

కేవలాంతరాత్మ జీవుండు నిజమని
పట్టివాదులాడువారి ద్రొక్కి
త్రొక్కిపట్టి నాల్కతుదిగోయ
పాపమా? వి. వే.

కొంద రవివేకులు అంతరాత్మ జీవుడు స్థిరుడన వాదించుచుందురు. అట్టి మిథ్యావాదులు జుట్టు పట్టి త్రొక్కి బట్టి నాలుక కోసినను పాపము లేదు

Some foolish people argue that the jiva within one's body is permanent.

1673
కొండమీద జ్యోతి కొమరు దీపింపగా నిండిపూర్ణముండు నిబిడముగను అండ జేరకున్న నంటంగ రాదయా , వి. వే.

కొండమీద జ్యోతి కొమరు దీపింపగా
నిండిపూర్ణముండు
నిబిడముగను అండ జేరకున్న
నంటంగ రాదయా , వి. వే.

హృదయమందలి సహస్రారకమలమున సంపూర్ణ ప్రకాశము కలదు. ఆ జ్యోతిస్వరూపము నాశ్రయింపకున్న ముక్తి లభింపదు

The sahasraara lotus in the heart has exceptional resplendence. Without surrendering to it there is no salvation.

1674
కోరి మదిని గురుని కొలువు చేయుట మేలు గారవమునదెలుపు గహనవిద్య దూరదృష్టి నిలిపి తొడరుట మోక్షంబు , వి. వే.

కోరి మదిని గురుని కొలువు చేయుట
మేలు గారవమునదెలుపు గహనవిద్య
దూరదృష్టి నిలిపి తొడరుట
మోక్షంబు , వి. వే.

గురువును ప్రార్థించి కోరుకున్నచో అతడు సంతోషముతో ఆధ్యాత్మవిద్యను ఇచ్చును. దాని నార్జించి దూరదృష్టితో మెలగుదు వేని మోక్షము పొందగలవు

If one serves his guru well, he will grant him knowledge about aatma . After acquiring such knowledge if one thinks in long-term, one can attain salvation.

1675
క్రమమున దేహత్రయమును విమల జ్ఞానంబుచేత వివరించినచో నమలంబగు నస్తోకము కొమరొప్పగ జాగ్రతందు గూడును వేమా

క్రమమున దేహత్రయమును విమల
జ్ఞానంబుచేత వివరించినచో
నమలంబగు నస్తోకము కొమరొప్పగ
జాగ్రతందు గూడును వేమా

జ్ఞానదృష్టితవో చూచి, స్థూల, సూక్ష్మ, కారణ , శరీరములు మూడింటిని పరిశీలించినచో అందు పరిశుద్ధమగు జ్యోతిస్సు పరమాత్మరూపము కానవచ్చును

If one sees the subtle, causal and gross bodies with the eye of knowledge, one can see the pure, resplendent, form of paramaatma

1676
ఖండ పరశువు బూజింప దండిదౌవి భూతినిచ్చును గావున నీతిగలిగి శివుని ప్రార్థించుతరి ననుభవము నొంద జేయునైశ్వర్య మిచ్చుట చేత వేమ

ఖండ పరశువు బూజింప దండిదౌవి భూతినిచ్చును
గావున నీతిగలిగి శివుని
ప్రార్థించుతరి ననుభవము నొంద
జేయునైశ్వర్య మిచ్చుట చేత వేమ

శివుని పూజించిన సమస్త సంపదలు కలుగును. యోగాద్యనుభవములచే శివుని ప్రార్థించినచో ఆ దేవుడు అణిమాదులగు అష్టైశ్వర్యములచే సాధకుని తృప్తినొందించును

One can gain a lot of wealth by praying to Lord Siva. When one prays to him with experience in yoga, he will grant all the boons and satisfy him.

1677
గట్టురాచూలి పతియైన గంగధరుని గుట్టు మతిలోన దెలిసిన బట్టు విడక చట్టువలె మనమందుట శాశ్వతంబు దిట్ట యగునట్టి యాతడె తెలియ వేమా

గట్టురాచూలి పతియైన గంగధరుని గుట్టు
మతిలోన దెలిసిన బట్టు విడక
చట్టువలె మనమందుట శాశ్వతంబు దిట్ట
యగునట్టి యాతడె తెలియ వేమా

పార్వతీపతియైన గంగాధరుని మనస్సులో ఉంచి నిరంతరము ధ్యానించినచో నిశ్చలుడై మానవుడు తన్మయత్వము పొందును . ఆ స్థితిని పొందినవాడే ముక్తుడు

If one prays to the husband of Parvati and one who wears Ganga in his head (Lord Siva), one can enjoy bliss. Such a person has attained salvation.

1678
గగనగోచర నిర్గుణ గమ్యమూని తమము మీఱిన ధ్యానింప తత్పరమున దెమలకందుట మోక్షంబు తెరువు కాదె విమల సుజ్ఞాన మబ్బిన వెలయు వేమ

గగనగోచర నిర్గుణ గమ్యమూని తమము
మీఱిన ధ్యానింప తత్పరమున దెమలకందుట
మోక్షంబు తెరువు కాదె విమల
సుజ్ఞాన మబ్బిన వెలయు వేమ

నిర్గుణ తత్త్వమును పొంది అజ్ఞానమును పోగొట్టుకొని నిరంతరము ధ్యానించిన ముక్తి కల్గును. అది జ్ఞానికి మాత్రమే లభించును . ఇతరులకు లభింపదు

One has to acquire tattva without gunas (sattva-calm, rajas-action, tamas-indolence), overcome ignorance and meditate always to attain salvation.

1679
గమనగమ్యని రామయగతిని మనసు సమరసత్వంబు గానెంచి సాక్షియగుచు భ్రమలడంచిన బ్రహ్మంబు బట్టబయలు క్రమమెఱుంగమి లోనెల్ల తమమె వేమ

గమనగమ్యని రామయగతిని మనసు సమరసత్వంబు
గానెంచి సాక్షియగుచు భ్రమలడంచిన
బ్రహ్మంబు బట్టబయలు క్రమమెఱుంగమి
లోనెల్ల తమమె వేమ

హృదయమును చిత్స్వరూపమున నిర్విచారముగా ఉంచి తాను సాక్షియై భ్రాంతులను తొలగించుకొన్నయెడల బ్రహ్మము బట్టబయలగును . లేనిచో లోన అజ్ఞాన తమస్సు నశింపదు

Brahmam will be apparent to one who observes the subtle body without sorrow , becomes a witness and removes all delusion. Without such a practice, one cannot overcome the indolence and ignorance within self.

1680
గగన గోప్య నిరాలయ ఘట్టమందు విమల నిర్మలనిష్కళ వేది జేరి తన్ను గనిచింత చేయుటే తత్పదంబు గురు కటాక్షము లభియింప గుదురు వేమ

గగన గోప్య నిరాలయ ఘట్టమందు విమల
నిర్మలనిష్కళ వేది జేరి తన్ను
గనిచింత చేయుటే తత్పదంబు గురు
కటాక్షము లభియింప గుదురు వేమ

చిద్గోప్యము , నిర్మలము, నిష్కళంకమునగు పరమాత్ముని చింతయే తత్పదము . అది గురుకటాక్షమును పొందగలిగినవారికే లభ్యమగును

Brahmam has to be contemplated within oneself, with a clear mind and without blemish of character. It is possible with the help of a guru.

1681
గుడులు దేవతలని గుర్తులు కావింత్రు ముష్టిబాపలనుచు మూల్గనేల ? మొప్పెలకును దారి మురి యగ జూపిరి , వి. వే.

గుడులు దేవతలని గుర్తులు కావింత్రు
ముష్టిబాపలనుచు మూల్గనేల?
మొప్పెలకును దారి
మురి యగ జూపిరి , వి. వే.

గుడులు కట్టించి దేవతలను పూజించు బ్రాహ్మణులను నిందింపనేల? మూర్ఖులు బ్రహ్మమును పొందుట కివి మార్గములని తెలిసికొనవలెను

Why blame brahmins for being priests when people build temples and worship idols?

1682
గుణికి జ్ఞానమహిమ గోరంత చెప్పిన గొండయగును వాని గుణముచేత గుణ విహీనుకెట్లు కుదురు నా రీతిగ , వి. వే.

గుణికి జ్ఞానమహిమ గోరంత చెప్పిన
గొండయగును వాని గుణముచేత
గుణ విహీనుకెట్లు కుదురు
నా రీతిగ , వి. వే.

గుణవంతునికి కొలదగి చెప్పినను జ్ఞాన మహిమ బోధపడును . గుణహీనుని కెంత చెప్పినను బోధపడదు

A man of good character can be told briefly about the tattva for him to realize the greatness of spiritual knowledge. A man without character will not understand any amount of teaching.

1683
గురువులేక విద్య గుఱుతుగా దొరకదు నృపతి లేక భూమి తృప్తిగాదు గురువు విద్యలేక గురుతర ద్విజుడౌనె ? వి. వే.

గురువులేక విద్య గుఱుతుగా దొరకదు
నృపతి లేక భూమి తృప్తిగాదు
గురువు విద్యలేక గురుతర
ద్విజుడౌనె ? వి. వే.

గురువు లేనిదే విద్య లభింపదు . రాజు లేనిచో రాజ్యము సాగదు . గురువు, విద్య ఈ రెండును లేనివాడు బ్రాహ్మణుడు కాజాలడు

Without guru knowledge cannot be accumulated. Without a king a nation cannot conduct itself. One cannot become a brahmin without a guru and education.

1684
ఘనచిదా కాశమైనట్టి గతి నెఱింగి యనిలరేచక పూరకం బనువు గాను బనుపడగ లాగి కుంభించి పాటుపడర మనెదు సుజ్ఞాన మమర నేమఱక వేమ

ఘనచిదా కాశమైనట్టి గతి నెఱింగి
యనిలరేచక పూరకం బనువు గాను బనుపడగ
లాగి కుంభించి పాటుపడర
మనెదు సుజ్ఞాన మమర నేమఱక వేమ

బ్రహ్మస్వరూపమై చిదాకాశమున విషయమును గ్రహించి, రేచక , పూరక, కుంభాకాదులచే ప్రాణవాయువును ప్రవర్తింపజేయుచు పాటుపడినచో జ్ఞానియై కృతార్థుడు కాగలడు

One can become a gnaani (knowledgeable person) by realizing that chidaakaasam (సర్వాధారమునూ, ఆకాశం వలెనే నిర్లేపం ఐన చిత్తు, శుద్ధ బ్రహ్మం; అరువు బయలు; వృత్తుల, శబ్దాది విషయముల సంధులతో ప్రకాశించే (వెల్లడి అయ్యే) ఆత్మ; స్వస్వరూపం)) is the brahmam and by performing breathing exercises like rEchaka-pooraka-kumbhaka, etc.

1685
చింతమానుకొనను జేరిన నలకాంత వింత చూపి చనును విడువరాదు పంతగించి దాని బట్టిననే మేలు, వి. వే.

చింతమానుకొనను జేరిన నలకాంత
వింత చూపి చనును విడువరాదు
పంతగించి దాని బట్టిననే
మేలు, వి. వే.

మనస్సును నమ్మిన, అది తప్పుదారుల కీడ్చుకొని పోవును. ఇచ్ఛవచ్చినట్లు పోనీయక మనస్సును స్థిరముగా ఉంచవలెను

Mind can take one to wrong paths when one trusts it entirely. One has to control his mind without letting it wander.

1686
చిన్మయానందపురినడిసీమ చేరి తన్మయు౦డైన పరశివ తత్త్వవేత్త మన్మయంబగు రాజ్యంబు మరగియుండు జన్మరాహిత్యమందు నిజమ్ము వేమ

చిన్మయానందపురినడిసీమ చేరి తన్మయు౦డైన
పరశివ తత్త్వవేత్త మన్మయంబగు
రాజ్యంబు మరగియుండు
జన్మరాహిత్యమందు నిజమ్ము వేమ

పరతత్త్వవేత్తయగువాడు చిన్మయానందము పొంది మనోరాజ్యమును పాలించుచు జన్మరహితుడై ఉండగలడు

The person knowing tattva revels in happiness, rules his mind and will not be born again.

1687
చెప్పియు జూపగరానిది మెప్పుగ మదిలోన జూచి మెలకువతోడన్ త్రిప్పులు వడకయ చూచిన నొప్పగ జగమెల్ల నిండియుండును వేమా

చెప్పియు జూపగరానిది మెప్పుగ
మదిలోన జూచి మెలకువతోడన్ త్రిప్పులు
వడకయ చూచిన నొప్పగ
జగమెల్ల నిండియుండును వేమా

పరబ్రహ్మ స్వరూపము చెప్పుటకును , చూపుటకును సాధ్యము కానిది . భ్రాంతిలేని అంతర్దృష్టితో చూచినచో లోకములందు నిండియున్న ఆ స్వరూపము కానవచ్చును

It is impossible to describe or show the form of brahmam. If one strives to see with inner eye and without delusion, one can find the brahmam all around.

1688
చెలిమితోడ ముందు చింతించి గగనంబు బలముతోడ బ్రాకి భావమూని ఫలహీనమైన భావచిన్మయ మంది విలయమొందువాడు విభుడు వేమ

చెలిమితోడ ముందు చింతించి గగనంబు
బలముతోడ బ్రాకి భావమూని
ఫలహీనమైన భావచిన్మయ మంది
విలయమొందువాడు విభుడు వేమ

మొదట పొందికతో చిదాకాశమును సందర్శింప నభ్యసించి , పిదప నిశ్చలమైన దృష్టితో చూచి ఫలాపేక్ష లేక , జ్ఞాన స్వరూపమును కనుగొని దేహము విడుచువాడే ఉత్తమోత్తముడు

Chidaakaasam supports all things and space. (సర్వాధారమునూ, ఆకాశం వలెనే నిర్లేపం ఐన చిత్తు, శుద్ధ బ్రహ్మం; అరువు బయలు; వృత్తుల, శబ్దాది విషయముల సంధులతో ప్రకాశించే (వెల్లడి అయ్యే) ఆత్మ; స్వస్వరూపం) One can has to learn about it first. Then with unwavering mind, without expecting anything in return, one has to gain spiritual knowledge. Such a person leaving his physical body behind is the ultimate yogi.

1689
చక్కగాను మదిని సాధించి కనవలె నిక్కి చూచు నెఱుక నేర్పు మీఱ ముక్కు తుదిని చూపు ముదమంద జూడరా , వి. వే.

చక్కగాను మదిని సాధించి కనవలె
నిక్కి చూచు నెఱుక నేర్పు
మీఱ ముక్కు తుదిని చూపు
ముదమంద జూడరా , వి. వే.

ముక్కు చివఱ దృష్టిని నిల్పు పద్ధతిని బాగుగా నభ్యసించి పిదప బ్రహ్మమును సంతోషముతో కనుగొన యత్నింపుము

One has to learn how to focus on the tip of the nose to enjoy the bliss of knowing brahmam.

1690
చక్కజేసి మదిని సాధింపనేరమి ముక్కు మీద దృష్టి మొనయుటరుదు నిక్కమైన జ్యోతి నిన్నంటి యుండురా, వి. వే.

చక్కజేసి మదిని సాధింపనేరమి
ముక్కు మీద దృష్టి మొనయుటరుదు
నిక్కమైన జ్యోతి నిన్నంటి
యుండురా, వి. వే.

మనస్సును స్థిరముగా ఉంచుకొననంతవరకు ముక్కు చివఱ దృష్టి నిల్పుట కష్టము . నిలిచెనా బ్రహ్మము నీలోనుండుట తెలియును

It is hard to focus on the tip of the nose by keeping the mind still. If one succeeds, it dawns that brahmam is within one's self.

1691
చక్కని పూనిక తోడను ముక్కు తుదనిలిపి మనసు మూలము గనమి౦ దక్కదు నిత్య వినోదము దృక్కగు నాబయలు చేర దృఢమగు వేమా

చక్కని పూనిక తోడను ముక్కు తుదనిలిపి
మనసు మూలము గనమి౦
దక్కదు నిత్య వినోదము దృక్కగు
నాబయలు చేర దృఢమగు వేమా

దృఢమైన ప్రయత్నమున ముక్కు చివఱ దృష్టిని నిలిపి, అందు పటుతరముగా మూలము చేర్చినచో బ్రహ్మ స్వరూపము బయలుపడును

In a determined way if one focuses his vision on the tip of the nose, it is possible to visualize the form of brahmam.

1692
చందమామ వెలుగు జక్కగా పరికించు వెన్నెలందలరెడి వెలయు బయల దాని రూపు తెలియగానె ముక్తి ఘటిల్లు , వి. వే.

చందమామ వెలుగు జక్కగా పరికించు
వెన్నెలందలరెడి వెలయు
బయల దాని రూపు తెలియగానె
ముక్తి ఘటిల్లు , వి. వే.

చంద్రబింబమునందు కల వెలుగును బాగుగా పరికించి, పిదప వెన్నెలలోని వెలుగును పరికించిన యెడల బయలు గోచరించును . దాని తత్త్వమును గ్రహించిన ముక్తి లభించును

The space is attainable by studying the face of the moon and the reflected moon light. One receives salvation by realizing such tattva.

1693
చదువులందు లేదు శాస్త్రంబులను లేదు వాదములను దైవ భేదములను బయల నున్న ముక్తి బాటించి చూడరా , వి. వే.

చదువులందు లేదు శాస్త్రంబులను
లేదు వాదములను దైవ భేదములను
బయల నున్న ముక్తి
బాటించి చూడరా , వి. వే.

ముక్తి చదువులలోను , శాస్త్రములలోను , వాదములలోను , వేర్వేరు దేవతలలోను లేదు. విలక్షణమై బయలుననే ఉన్న ముక్తిని కనుగొనుము

Salvation is not to be found in vocational knowledge, scripture, arguments and the pantheon of gods. The elegant salvation is available outside them.

1694
చదువులన్ని చదివి చాల వివేకియై మగిడి తన్నెఱుగక మంద జనుడు విసుగు చద వటంచు వెఱ్ఱియై చెడిపోవు, వి. వే.

చదువులన్ని చదివి చాల వివేకియై
మగిడి తన్నెఱుగక మంద
జనుడు విసుగు చద వటంచు వెఱ్ఱియై
చెడిపోవు, వి. వే.

మానవుడు విద్యలన్నిటిని శ్రద్ధగా చదివియు ఆత్మతత్త్వము నెరుగనిచో అవి నిష్ఫలములు . అట్టి చదువులు చదివి విసిగి కాలము వ్యర్థమైనదని విచారించుకంటే తత్త్వమునకు యత్నించుట మేలు

When a man acquires vocational knowledge without learning about aatma, then such knowledge is useless. Instead of learning them and complaining that time is wasted, it is better to reflect on tattva.

1695
చాయలోని చాయ జక్కగా గుర్తించి కోయవలెను భ్రమల గొంకులేక మాయమాయమౌను మహిదత్త్వమందురా , వి. వే.

చాయలోని చాయ జక్కగా గుర్తించి
కోయవలెను భ్రమల గొంకులేక
మాయమాయమౌను మహిదత్త్వమందురా,
వి. వే.

జ్యోతియందు జ్యోతి స్వరూపమైయున్న బ్రహ్మమును కనుగొని, భ్రమలను పోగొట్టుకొనవలెను . అప్పుడు మాయ నశించి తత్త్వమును పొంద వీలగును

One has to discover the resplendent brahmam in jyoti (light), and give up delusions. Then maaya (illusion) can be overcome resulting in the acquisition of tattva.

1696
చూపు రూపుల రెంటిని జూచి దాని నిఱుకు తెలియంగ మదినుంచ నేర్పుగనుచు గాపురంబగు కైవల్య కార్యమౌను నిర్మల జ్ఞాని పనిబూని నిజము వేమ

చూపు రూపుల రెంటిని జూచి దాని నిఱుకు
తెలియంగ మదినుంచ నేర్పుగనుచు
గాపురంబగు కైవల్య కార్యమౌను నిర్మల
జ్ఞాని పనిబూని నిజము వేమ

చూపును, రూపును ఏకముచేసి , మనస్సును వాని కాయత్తపరచి , అందలి రహస్యములను కనిపెట్టుచు మోక్షమును పొందుటకై యత్నింపవలెను

By unifying vision and form, dedicating mind to meditate over god, one has to try for attaining salvation.

1697
చూపు రూపుల రెంటిని జూచి దాని నన్నియును గాక తన్ను దాగన్న దాని నిర్మలంబుగ మదినెంచు నిర్మలుండు నిర్గుణబ్రహ్మ మఱచేత నిలుపు వేమ

చూపు రూపుల రెంటిని జూచి దాని నన్నియును
గాక తన్ను దాగన్న దాని నిర్మలంబుగ
మదినెంచు నిర్మలుండు నిర్గుణబ్రహ్మ
మఱచేత నిలుపు వేమ

చూపును, రూపమును బాగుగా విమర్శించి వాని యందలి లక్ష్యమును వదలి, భగవంతునిపై విశ్వాసమునుంచి నిర్మలమైన మనస్సుతో వర్తించువానికి బ్రహ్మము సులభముగా లభించును

After analyzing vision and form, renouncing their goals, when one keeps faith in god with clear consciousness, brahmam can be realized.

1698
జగమునందు లేదు జలములందు లేదు నిజమవేద్యమైన నిజపదంబు సగుణ నిర్గుణముల సాధించి చూడరా , వి. వే.

జగమునందు లేదు జలములందు
లేదు నిజమవేద్యమైన నిజపదంబు
సగుణ నిర్గుణముల సాధించి
చూడరా , వి. వే.

బ్రహ్మము వేదములవల్లనే తెలియదగినది. లోకములో గాని, జలములోగాని లేదు . సగుణ , నిర్గుణములు బాగుగా చర్చించినయెడల అది అవగతమగును

Brahmam is realized through vedas. It is not on the land or in water. When one analyzes the gunas (sattva-calm, rajas-action, tamas-indolence) as manifest and unmanifest, brahmam will be revealed.

1699
జతుకమంటు రీతి జాబిల్లి వెలుగంది ప్రతిఫలింప గురిని పరిణమించి వెదుకవలెను మదిని వేదాంత మర్మము, వి. వే.

జతుకమంటు రీతి జాబిల్లి వెలుగంది
ప్రతిఫలింప గురిని
పరిణమించి వెదుకవలెను మదిని
వేదాంత మర్మము, వి. వే.

లక్క కరిగి యితర వస్తువుల నంటికొన్నట్లు మనస్సును కళాసాక్షాత్కారమున కానవచ్చు . వెన్నెలలో లీనము చేసి వెదకిన యెడల వేదాంత మర్మమగు బ్రహ్మము కాన వచ్చును

Molten lac sticks to all things. Similarly mind binds to all things. One can visualize the deification of kalas in one's mind. One can find brahmam described in vedas by seeking union with moon light and searching for him.

1700
జనన మరణవేళ స్వాతంత్ర్యమా లేదు తేను లేదు మున్ను పోనులేదు నడుమగర్తననుట నగుబాటు కాదటే , వి. వే.

జనన మరణవేళ స్వాతంత్ర్యమా
లేదు తేను లేదు మున్ను
పోనులేదు నడుమగర్తననుట నగుబాటు
కాదటే , వి. వే.

నరునకు జననమరణములలో స్వాతంత్ర్యము లేదు. ధనమును తాను తీసికొని రాలేదు; తనతో తీసికొనిపోడు . మేమే అన్నిటికిని కర్తలమని అవివేకులు అనుకొందురు

Men don't have freedom to decide birth or death. One does not bring wealth at the time of birth. Nor does he take wealth with him at the time of death. Foolish people think they are the masters of their lives.

1701
జాతి, కులములంచు జనులెల్ల బద్ధులై భావ పరమునందు బ్రాలుమాలి చచ్చి పుట్టు చంద్రు జడమతులై భువి, వి. వే.

జాతి, కులములంచు జనులెల్ల
బద్ధులై భావ పరమునందు బ్రాలుమాలి
చచ్చి పుట్టు చంద్రు
జడమతులై భువి, వి. వే.

జాతియని , కులమని అవివేకులు వానికి లొంగి, బద్ధులై వివేచన చేయక మూఢులై జననమరణములను పొందుచుందురు

Foolish people are caught up in birth-death cycle by yielding to race and caste and not realizing their futility.

1702
జాతి, మతము విడిచి చని యోగి కామేలు జాతితోనె యున్న నీతి వలదె ? మతము బట్టి జాతి మానకుంట కొఱ ౦త , వి. వే.

జాతి, మతము విడిచి చని యోగి
కామేలు జాతితోనె యున్న నీతి
వలదె ? మతము బట్టి జాతి మానకుంట
కొఱ ౦త , వి. వే.

యోగి కాదలచినవాడు జాతిమతములను విడువవలెను . జాతి నాశ్రయించినను నీతిని విడువరాదు . ఏ జాతి వాడైనను దూరాచారములను విడువకుండుట తప్పు

One who aspires to be a yogi, must give up race and religious discrimination. Even if one sticks to the race, he should not give up path of rectitude. A person of any race must give up bad practices.

1703
జీవభావ మెఱుగజెడ నెన్నటికి మతి దైవమును నెఱు౦గ దనరు బుద్ధి తేజ ముదయమందు దిమిరంబు నిల్వదు , వి. వే.

జీవభావ మెఱుగజెడ నెన్నటికి
మతి దైవమును నెఱు౦గ దనరు
బుద్ధి తేజ ముదయమందు దిమిరంబు
నిల్వదు , వి. వే.

జీవమర్మమును తెలిసికొనియున్నచో - తేజస్సు ఎదుట తిమిరము నిలువలేని రీతిని విఘ్నములు నశించును . బ్రహ్మత్వము కల్గును

Once the secrets of jiva are known—just as darkness cannot prevail over light—all obstacles will be removed. One can attain brahmam.

1704
జీవవశము రీతి జన్మాత్రతను మించి భావమమత నమరు పట్టుబట్టి కలియు హంస మదిని కర్మ సన్న్యాసియై, వి. వే.

జీవవశము రీతి జన్మాత్రతను
మించి భావమమత నమరు పట్టుబట్టి
కలియు హంస మదిని కర్మ
సన్న్యాసియై, వి. వే.

జీవునికి వశమైన చిన్మాత్రత నతిక్రమించి , భావమును బ్రహ్మముపైనుంచి హంసను కలిసిన కర్మసన్న్యాసియై తరింపవచ్చును

By transcending the spiritual body that is in the control of jiva, focusing on the brahmam, when met with hamsa one can attain karma sannyasa

1705
జవదాటనేల గురిగా భవహరమగు భక్తి బూని పరిపక్వముగా ధృవమైన బయలు చేరగ శివమన్మయ చిన్మయంబు చేకురు , వేమా

జవదాటనేల గురిగా భవహరమగు భక్తి
బూని పరిపక్వముగా ధృవమైన
బయలు చేరగ శివమన్మయ
చిన్మయంబు చేకురు , వేమా

లక్ష్యమును విడువక పాపములను పోగొట్టుకొని పరునియందు భక్తి కలిగియున్న , కర్మము పరిపక్వమై చిత్స్వరూపమును పొందవచ్చును

Without losing sight of the goal, by absolving for the sins, when one keeps faith on the brahmam, once karma is fruitioned it is possible to attain subtle form.

1706
జాలినొందరాదు జవదాటి కనరాదు ఆది మూలమైన ఆత్మ మఱు౦గు పోరి చేరి పొంది పూర్ణము నందురా, వి. వే.

జాలినొందరాదు జవదాటి కనరాదు
ఆది మూలమైన ఆత్మ మఱు౦గు
పోరి చేరి పొంది పూర్ణము
నందురా, వి. వే.

ఆత్మరహస్యమునకు గల మూలతత్వమును చూడ లేకపోతిమని విచారపడినను , యోగ నియమముల విడిచినను లాభములేదు. ఇంద్రియములను జయించి ఈశ్వర తత్త్వము పొందవలెను

There is no use in feeling sorrow for not learning the secrets of aatma tattva and giving up the practice of yoga. One has to overcome 5 senses to attain tattva about Iswara.

1707
జ్ఞాన నిష్ఠ బూని మేను మఱచువాడు కామి కాడు మోక్ష కామి గాని నియమ నిష్ఠ లుడిపి నిర్గుణ మందురా, వి. వే.

జ్ఞాన నిష్ఠ బూని మేను మఱచువాడు
కామి కాడు మోక్ష కామి
గాని నియమ నిష్ఠ లుడిపి
నిర్గుణ మందురా, వి. వే.

జ్ఞాననిష్ఠను పూని శరీరమును మరచినవాడు మోక్షమును కోరునేకాని కామమును కోరడు . నియమనిష్ఠలను విడిచి నిర్గుణ పరబ్రహ్మమును పొందుము

One who lives a principled life, wishes for attaining salvation than worldly things. One has to give up all principles and attain brahmam devoid of gunas (sattva-calm, rajas-action, tamas-indolence)

1708
తక్రముతోనుధ్భవమై తక్రమ్మున దేలు వెన్న తరబడి సంసారక్రమమున బుట్టియు మన చక్రము గుర్తింపనగును జతురత వేమా

తక్రముతోనుధ్భవమై తక్రమ్మున
దేలు వెన్న తరబడి సంసారక్రమమున
బుట్టియు మన చక్రము
గుర్తింపనగును జతురత వేమా

మజ్జిగనుండి పుట్టి, దానికంటే వేరై కానబడు వెన్నవలె సంసారమున పుట్టియు , ఆ సంసారమునుండి వేరైన జ్ఞానము ఏర్పడవలెను

Just as butter is made out of fermented milk and appears differently, even though one is born out of bondage one has to acquire knowledge that is different from bondage.

1709
తన నిజ రూపము చూడ గను తగు మార్గంబు తెలియగావలె నన్నన్ ఘన గురుని యండ జేరక యొనగూడునె సాముచేయు నుర్విని వేమా

తన నిజ రూపము చూడ గను తగు మార్గంబు
తెలియగావలె నన్నన్
ఘన గురుని యండ జేరక యొనగూడునె
సాముచేయు నుర్విని వేమా

ఆత్మరూపమును తెలిసికొనవలెనను కోరికయున్నచో గురువు చెంత చేరి ఆ మార్గము తెలిసికొనవలెను . లేనిచో ఎంతటివానికైనను అది గోచరము కాదు

To learn about aatma one has to approach a guru. Otherwise it is not easy to comprehend.

1710
తన లోపల సకలంబును దనరం దా నగుట నెఱిగి తారక మాత్మ౦ గనుగొనుచు బరిణమించిన మనుజునకు ముక్తి కలదు మహిలో వేమా

తన లోపల సకలంబును దనరం దా నగుట
నెఱిగి తారక మాత్మ౦ గనుగొనుచు
బరిణమించిన మనుజునకు
ముక్తి కలదు మహిలో వేమా

సర్వమును తనలోనే చూచి, తానే సమస్త స్వరూపుడనని గ్రహించి తారకమును బాగుగా గుర్తించి సమత్వము నొందినవానికి ముక్తి తప్పక కలుగును

One who sees everything in oneself, realizes he is the form of everything and recognizes the greatness of aum, can certainly attain salvation.

1711
తనలో సర్వంబుండగ ధన లోపల మెదుకలేక ధర వెదకెడి యీ తనువుల మోసెడి యెద్దుల మనములదెల్ప౦గ వశమె మెహిలో వేమా

తనలో సర్వంబుండగ ధన లోపల మెదుకలేక
ధర వెదకెడి యీ తనువుల
మోసెడి యెద్దుల మనములదెల్ప౦గ
వశమె మెహిలో వేమా

తత్త్వమంతయు తనలోనే యుండగా, ఎచటనో కలదని వెదకు అవివేకులు దేహము బరువు మోసెడి ఎద్దుల వంటివారు . వారికి తత్త్వమును బోధపరచుట సాధ్యముకాని పని

When all tattva is within oneself one who is searching for it outside is like a bull that carries its weight. It is impossible to teach them the tattva.

1712
తన మతమును తా నెఱుగడె మనమున దలపోయు నెవని మార్గంబగునో అనయము నీ జాలంబును గని మెలగుట ముక్తికిరవు గదరా వేమా

తన మతమును తా నెఱుగడె మనమున
దలపోయు నెవని మార్గంబగునో
అనయము నీ జాలంబును గని మెలగుట
ముక్తికిరవు గదరా వేమా

మోక్షమును గోరి తానవలంబించవలసిన మతమేదో తానే మార్గము నాదర్శముగా ఉంచుకొనవలెనో అను అంశముల రహస్యమును గుర్తించుట మోక్షసాధన కారణము

Seeking salvation, when one contemplates on the religion to adopt and the path to choose, then such secrets enable its attainment.

1713
తన దా దెలియుట తత్త్వము తన కన్యులు బోధసేయ ధరలో గలరా? తను దా దెలియక యుండిన తన కెవరును తెలుపలేరు తథ్యము వేమా

తన దా దెలియుట తత్త్వము తన కన్యులు
బోధసేయ ధరలో గలరా? తను
దా దెలియక యుండిన తన కెవరును
తెలుపలేరు తథ్యము వేమా

తన్ను తాను తెలిసికొనుటయే తత్త్వము . దీనిని దృష్టాంతముతో ఎవరును వివరింపలేరు . స్వయముగా గ్రహింపజాలనివారికిని ఎవ్వరును బోధింపలేరు

To realize oneself is tattva. No one can provide an example. No one can teach one who doesn't grasp this.

1714
తావు లేనిచోట తావు తానైయుండు తావు గలుగుచోట తాను లేడు తావు తానెయైన దత్త్వంబు తెలియునా? వి. వే.

తావు లేనిచోట తావు తానైయుండు
తావు గలుగుచోట తాను
లేడు తావు తానెయైన దత్త్వంబు
తెలియునా? వి. వే.

శూన్యమునందు పూర్ణుడై , పూర్ణమున శూన్యుడై పరమాత్మ చిత్రముగా మెలగుచుండును . తావు, తత్త్వమునయి యున్న భగవంతుని మహిమను తెలిసికొనుము

Paramaatma is wholesome in vacuum and vacuous in wholeness. One should learn this tattva about god to realize his greatness.

1715
తొమ్మిది తొఱ్ఱల తిత్తిది నమ్మి శివుని దలపలేక నశియింతువు నీ విమ్మహి గ్రుధ్రచయంబులు సమ్మతిగా నన్ను దినును చక్కగా వేమా

తొమ్మిది తొఱ్ఱల తిత్తిది నమ్మి
శివుని దలపలేక నశియింతువు నీ
విమ్మహి గ్రుధ్రచయంబులు సమ్మతిగా
నన్ను దినును చక్కగా వేమా

నవరంధ్రములు కల దేహమును నమ్మి భగవంతుని సేవింపనిచో చెడిపోవుదురు . ఈ శరీరము తుదకు గ్రద్దల పాలగుచున్నది

When one doesn't pray to god with the body containing 9 holes, one will lose good character. In the end the body is destroyed.

1716
త్రాడు పామటంచు దా జూచి భయపడు దెలిసి త్రాడటన్న దీరు భయము భయము తీరినపుడె బ్రహ్మంబు తానగు, వి. వే.

త్రాడు పామటంచు దా జూచి భయపడు
దెలిసి త్రాడటన్న దీరు
భయము భయము తీరినపుడె బ్రహ్మంబు
తానగు, వి. వే.

త్రాడును చూచి పామని భ్రాంతిపడి నరుడు భయపడును. అట్టి భ్రాంతి నశించెనా ఆనందము కలుగును. అట్లే సంసారము భ్రాంతియని తెలిసినచో ఆనందమయమగు బ్రహ్మము లభించును

One is afraid when he sees a rope and thinks it is a snake. Once his delusion is cleared he will feel happy. Similarly if bondage is realized as delusion, one can gain the blissful brahmam.

1717
దర్పణంబున దనరూపు తగిలినట్లు నేర్పు గలిగిన మదిలోన నీదురూప మర్పణంబుగ నెఱుకలో నడచి చూడ నోర్పు కలవాడె నేర్చు తా నొనర వేమ

దర్పణంబున దనరూపు తగిలినట్లు నేర్పు
గలిగిన మదిలోన నీదురూప మర్పణంబుగ
నెఱుకలో నడచి చూడ నోర్పు
కలవాడె నేర్చు తా నొనర వేమ

అద్దములో తన రూపమున చూచిన రీతి , హృదయములో భగవంతుని రూపు చూడగల్గి జ్ఞానశాలివై యుండువేని మోక్షము నీకు సులభసాధ్యమగును .

Just as one sees oneself in the mirror, one should see god in self and remain as a knowledgeable person to attain salvation.

1718
దాపున నున్నది యుద్ధము రూపున నీ రూపు చూచి రూఢిగగని యా పాపకులోనగు చూపున బ్రాపయి శివుడుండు గనుము పనుపడి వేమా

దాపున నున్నది యుద్ధము రూపున
నీ రూపు చూచి రూఢిగగని యా
పాపకులోనగు చూపున బ్రాపయి శివుడుండు
గనుము పనుపడి వేమా

జ్ఞానమను అద్దము నీకు దగ్గరనే యున్నది . అందు నీ యాత్మతత్త్వమును గుర్తించి చూచి అంతర్దృష్టిలో నిలిచి యున్న ఈశ్వర స్వరూపమును తిలకింప ప్రయత్నింపుము

The mirror called gnaana (knowledge) is within oneself. One has to see the reflection of tattva of aatma in it and visualize Iswara with inner eye.

1719
దూరయోచనలకు దూరమౌ దైవము తనువు దూరమైన దగులునపుడు జీవి దివ్వు జేయ దేవుడై నిలుచును వి. వే.

దూరయోచనలకు దూరమౌ దైవము
తనువు దూరమైన దగులునపుడు
జీవి దివ్వు జేయ దేవుడై
నిలుచును వి. వే.

ఆలోచనలతో కాలము గడిపిన దైవము దూరమగును . ఆలోచనలను దేహమునకు దూరము గావించినయెడల బ్రహ్మము దగ్గరగును . ఆలోచనలు నశించినగాని ఈశ్వరత్వము సిద్ధించదు

When one spends time thinking, god will distance himself. Brahmam will get closer when one gives up needless thinking and renounces attachment to body. Until thoughts are destroyed it is not possible to gain tattva of Iswara.

1720
దేహమూలమందు దేహి దేవుదటంచు దెలిసియున్న బుధులు తీర్థయాత్ర లరయ బోరు జగతి నాత్మ తామై యాన్ని , వి. వే.

దేహమూలమందు దేహి దేవుదటంచు
దెలిసియున్న బుధులు తీర్థయాత్ర
లరయ బోరు జగతి నాత్మ
తామై యాన్ని , వి. వే.

దేహములో నున్న జీవియే ఈశ్వరుడని యెఱిగిన జ్ఞానులు దైవస్వరూపులు. కావున వారు తీర్థయాత్రలకు పోరు. తామే ఈశ్వర స్వరూపులమని గ్రహింతురు

The learned people who realize that the jeevi inside their bodies is Iswara are godly. Hence they don't go on pilgrimage to holy places. They realize their selves are forms of Iswara.

1721
దొమ్మ మాయ కొఱకు నమ్మవారికి వేట లిమ్మటండ్రి దేమి దొమ్మ తెగులొ ? అమ్మవారి పేర నందఱు తినుటకా? వి. వే.

దొమ్మ మాయ కొఱకు నమ్మవారికి
వేట లిమ్మటండ్రి దేమి దొమ్మ
తెగులొ ? అమ్మవారి పేర
నందఱు తినుటకా? వి. వే.

గ్రామీణులు వ్యాధులు పోవుటకై అమ్మవారికి జంతు బలులిచ్చుచుందురు . ఇది తప్పు. అమ్మవారి పేరు చెప్పి తాము వానిని తినుటకే జంతువులను చంపుదురు

Village people offer animal sacrifices to local deities. This is sinful. In the pretext of worshiping the deities, they eat the animals.

1722
ధాత్రి జనులకెల్ల దగ నెఱిగించెద నొనర హరు నెఱు౦గ నుపము యొకటి మనసు చెదరనీక మహిమతో జూచుటే , వి. వే.

ధాత్రి జనులకెల్ల దగ నెఱిగించెద
నొనర హరు నెఱు౦గ నుపము
యొకటి మనసు చెదరనీక
మహిమతో జూచుటే , వి. వే.

జనులందరకిని తెలియునట్లు దేవుని తెలిసికొను విధమును చెప్పెదను. మనస్సును నిర్మలముగను , స్థిరముగను ఉంచిననే భగవంతుడు చూడవచ్చును

When mind is pure and remains still, it is possible to see god.

1723
నాదము తెలిసిన యోగియె వేదాంతములోని నున్న విధి తెలుపు మది న్నాదంబె ముక్తిపదమని యాదరమున జనులతోడ నానారా వేమా

నాదము తెలిసిన యోగియె వేదాంతములోని
నున్న విధి తెలుపు మది
న్నాదంబె ముక్తిపదమని యాదరమున
జనులతోడ నానారా వేమా

ప్రణవనాద రహస్యము నెరిగిన యోగియే వేదాంతతత్త్వము నెరగగలడు . ఇతరులకు తెలుపగలడు . ప్రణవనాదమే ముక్తి పదమని యనుభవజ్ఞులు లోకమున చాటగలరు

The yogi who understands the secret of pranava (aum), can understand vedas. And he can teach others. Yogis can teach others that pranava is the threshold to attain salvation.

1724
నాదు నాదు గూడి నామరూపంబైన నాదులోన నాదు నాటి యుండు వాదు చేయువారు వర్ణింపలేరయా, వి. వే.

నాదు నాదు గూడి నామరూపంబైన
నాదులోన నాదు నాటి
యుండు వాదు చేయువారు వర్ణింపలేరయా,
వి. వే.

శబ్దము శబ్దముతో చేరి నామరూపములు పొంది ప్రపంచమంతటను వ్యాపించియుండును . ఈ విషయములను మూర్ఖులు తెలిసికొనలేరు

Sound assumes the form and name of things and spreads all over the world.

1725
నాలుగు వీధుల మధ్యను మేలుగ బ్రహ్మంబునుండు మెలకువతోడన్ జాలగ గురుమూలంబున వీలుగ బొందంగననగును వినూరా వేమా

నాలుగు వీధుల మధ్యను మేలుగ
బ్రహ్మంబునుండు మెలకువతోడన్
జాలగ గురుమూలంబున వీలుగ
బొందంగననగును వినూరా వేమా

నాలుగు తత్త్వములతో కూడుకొని బ్రహ్మము జాగ్రత నవస్థ నొందియుండును. గురుని సహాయమున ప్రయత్నము చేసి బ్రహ్మమును పొందుటకు శక్తికొలది ప్రయత్ని౦పవలసి యుండును

Brahmam made of 4 tattvas will be in wakeful state. Taking the help of a guru, one has to try hard to realize such brahmam.

1726
నిజము వరుస నెఱిగి నిర్గుణత్వంబంద బలుకులోని శబ్ద మలర దెలియ బలుకకుండు వాడె పరమాత్ముడందురు , వి. వే.

నిజము వరుస నెఱిగి నిర్గుణత్వంబంద
బలుకులోని శబ్ద మలర
దెలియ బలుకకుండు వాడె పరమాత్ముడందురు,
వి. వే.

సత్యమును గ్రహించి నిర్గుణ స్వరూపమగు బ్రహ్మము నుపాసించి ప్రణవనాదమును భక్తిశ్రద్ధలతో నాలించి యానందించు ధన్యుడు పరమాత్మతో సమానము

One who realizes truth, meditates on brahmam without gunas (sattva-calm, rajas-action, tamas-indolence), listens to aum with devotion, remains blissful is equivalent to paramaatma

1727
నిత్య సత్యనిరామయ నిర్గుణంబు మృత్యు సమదృష్టిలో నెంచి మిన్నకుండి భృత్యభృత్యానురాగుడై భృకుటినంటి నృత్యమాడుచు నుండుటే నియతి వేమ

నిత్య సత్యనిరామయ నిర్గుణంబు మృత్యు
సమదృష్టిలో నెంచి మిన్నకుండి
భృత్యభృత్యానురాగుడై భృకుటినంటి
నృత్యమాడుచు నుండుటే నియతి వేమ

నిత్యము, సత్యము , నిరామయము, నిర్గుణమునగు బ్రహ్మమును, మృత్యువును, సమాన దృష్టితో చూచుచు విషయాదులను విడిచి, పరిజనమును ప్రేమించుచు భృకుటిజ్యోతి నందియుండుటయే యోగనియమము

Ever present, truthful, blissful, devoid of gunas (sattva-calm, rajas-action, tamas-indolence) brahmam has to be viewed with the same attitude as one sees death. And giving up worldly matters, loving all people, and concentrating on the resplendent light between eye-brows is the way of yogis.

1728
నిత్య సత్య వ్రతాచారనిపుణుండవయి పరమ ధర్మార్థములనెల్ల బట్టి చూచి సిద్ధి పొందెడి పరిపూర్ణచింత బూను మప్పుడానంద మమిమౌనయ్య వేమ

నిత్య సత్య వ్రతాచారనిపుణుండవయి
పరమ ధర్మార్థములనెల్ల బట్టి చూచి
సిద్ధి పొందెడి పరిపూర్ణచింత
బూను మప్పుడానంద మమిమౌనయ్య వేమ

సత్యనియమము కలిగి, ఉత్తమ ధర్మముల నభ్యసించి, సిద్ధినొందుటకు సర్వదా ప్రయత్నింపుము . అందువలన ఆనందము అమితముగా లభించును

One should be truthful, learn about good dharma, to attain salvation. One will gain bliss along the way.

1729
నిత్యానంద వివేకము సత్యంబుగ తెలియకున్న శక్యంబగునా ముత్యము సరి గురు మర్మము భృత్యుడవై మది నెఱు౦గ బెంపగు వేమా

నిత్యానంద వివేకము సత్యంబుగ
తెలియకున్న శక్యంబగునా ముత్యము
సరి గురు మర్మము భృత్యుడవై
మది నెఱు౦గ బెంపగు వేమా

నిత్యానందమగు మోక్షము, ఆ మోక్షజ్ఞానములేని వారికి లభింపదు. ఉత్తమ గురుని సేవించి భృత్య భావముతో బ్రహ్మవిద్య నభ్యసింపుము

The blissful salvation will not be attainable by those who don't have its knowledge. One should learn about brahmam by approaching a guru and serving him with dedication.

1730
నిద్రమేలు తెలిసి నిలుపుడీ మీలోని ప్రాణిమేలు తెలిసి పాయకుండు ప్రాణి నిదురనందు పరమాత్ముడుండును , వి. వే.

నిద్రమేలు తెలిసి నిలుపుడీ
మీలోని ప్రాణిమేలు తెలిసి పాయకుండు
ప్రాణి నిదురనందు పరమాత్ముడుండును,
వి. వే.

జాగ్రదవస్థలోని మేలి గుణము గ్రహించి, దాని నవలంబించిన జీవికి మేలు కలుగును. ప్రాణికి , సమాధికి మధ్య పరమాత్ముడుండుటను గ్రహింపవలెను

One will prosper by knowing the wakeful state. Paramaatma is in between a jiva and samaadhi (deep meditative state).

1731
నిను నీ వెఱుగగ నెంచిన మనమున సంకల్పములను మానగవలెరా అనుమానరహితముగ గుఱి వినయంబున గురుని బట్టి వెదకుము వేమా

నిను నీ వెఱుగగ నెంచిన మనమున
సంకల్పములను మానగవలెరా అనుమానరహితముగ
గుఱి వినయంబున
గురుని బట్టి వెదకుము వేమా

ఆత్మతత్త్వము పెరుగదలచినచో ఇతర సంకల్పములనన్నిటిని మానుకోవలెను . సందేహములు లేకుండుటకై గురి గల గురువు నాశ్రయించి సేవచేసి కృతార్థతను పొందవలెను

If one wants to learn more about the tattva of aatma, one has to give up all other thoughts. To clear doubts, one should approach a guru and serve him and succeed.

1732
నిన్ను జూచుచుండ నిండును తత్త్వంబు తన్ను జూచుచుండ దగులు మాయ నిన్ను నెఱిగినపుడె తన్ను దానెఱుగును , వి. వే.

నిన్ను జూచుచుండ నిండును తత్త్వంబు
తన్ను జూచుచుండ దగులు
మాయ నిన్ను నెఱిగినపుడె తన్ను
దానెఱుగును , వి. వే.

ఆత్మను చూడగల్గినయెడల తత్త్వము లభించును . నిన్ను నీవు చూచుకొన్నచో మాయలో చిక్కుకొందువు . ఆత్మతత్త్వము నెరుగుదువేని బ్రహ్మము నీలోనే కన్పించును

One gains knowledge by visualizing aatma. When one sees oneself he will get caught up in maaya (illusion). When aatma is visualized brahmam will be self-evident.

1733
నిర్మలాత్మ విద్య నిత్య సత్యజ్ఞాన నిరతుడైనవాడు నేర్పు మీఱ ననుభవింపగోరా నలసట బొందును , వి. వే.

నిర్మలాత్మ విద్య నిత్య సత్యజ్ఞాన
నిరతుడైనవాడు నేర్పు
మీఱ ననుభవింపగోరా
నలసట బొందును , వి. వే.

నిత్యసత్యనియమము కలవాడు ఎన్ని కష్టముల కోర్చి యైనను నిర్మలమగు ఆత్మవిద్య నభ్యసించి అనుభవింప గోరునే కాని విడిచిపెట్టడు

One who practices truth all the time will strive to learn about aatma no matter the obstacles and tries to gain experience without giving up.

1734






నీతియు భక్తియు జ్ఞానము రీతుల వర్తించు మదిని రేవెలుఁగగుచున్ జ్యోతిని నాదగు బ్రహ్మము భూతాత్ముడు నిన్ను బొందబొడంగను వేమా

నీతి, భక్తి, జ్ఞానములతో మెలగుచు హృదయములోని జ్యోతిస్వరూపములో లీనుడగువ అందలి ప్రణవనాద బ్రహ్మములో కలిసిపోవుటకు ప్రయత్నింపుము

Living in a principled, devotional, knowledgeable life, one should strive to seek union with brahmam who is resplendent with pranava (aum)

1735
నీలోని యెఱుక యనునది నీలోననె పెరిగి పెరిగి నీలో నడగున్ నీలోని చిత్ర మడచిన నాలోనను బ్రహ్మ బయలునందును వేమా

నీలోని యెఱుక యనునది నీలోననె
పెరిగి పెరిగి నీలో నడగున్
నీలోని చిత్ర మడచిన నాలోనను
బ్రహ్మ బయలునందును వేమా

హృదయమునందలి జ్ఞానము పెరిగి పెరిగి యందే అణగును . నీలోని చిత్రములను పరికించి అణచినచో , అట్టి వారికి బ్రహ్మము బహిరంగమై గోచరించును

Knowledge will grow bigger in the mind and devolve into it. When one analyzes the wonder of his mind and controls it, he can see brahmam.

1736
నీళ్ళ మునగనేల? నిధుల మెట్టగనేల ? మెనసి వేల్పులకును మ్రొక్కనేల? కపట కల్మషములు కడుపులో నుండగా, వి. వే.

నీళ్ళ మునగనేల? నిధుల మెట్టగనేల?
మెనసి వేల్పులకును
మ్రొక్కనేల? కపట కల్మషములు
కడుపులో నుండగా, వి. వే.

పాపవర్తనము , కల్మషము, ఉన్నంతవరకును పుణ్య తీర్థములలో మునుగుచు , నిధులపై తిరిగి, వేల్పులకు మ్రొక్కుచున్నను ఏమియు ప్రయోజనములేదు

Going on pilgrimage to holy places and worship gods is futile when one's sinning and harboring bad thoughts.

1737
నీవనినను నేననినను భావమ్మున నెఱుకయొక్క పద్ధతియగునా ? భావంబు దెలిసి మదినిర్భావముగా నిన్ను గనుట పరమగు వేమా

నీవనినను నేననినను భావమ్మున
నెఱుకయొక్క పద్ధతియగునా ?
భావంబు దెలిసి మదినిర్భావముగా
నిన్ను గనుట పరమగు వేమా

“నీవు, నేను" అని వాదులాడుట జ్ఞానుల పద్ధతి కాదు. భగవంతుని తత్త్వమెరిగి నిర్భావముగా ధ్యానము చేయుటయే పరము నొందుటకు తగిన సాధనము

Learned people don't discriminate between self and others. To attain salvation one has to know the tattva of god and meditating on him without other thoughts.

1738
నీవు నిలిచి యుందు నిఖిలంబు నిలువదు నిలిచియుండు నెంద నీరు వలెను నీవు నిశ్చయంబుగ నిఖిలంబు మాయయౌ , వి. వే.

నీవు నిలిచి యుందు నిఖిలంబు
నిలువదు నిలిచియుండు నెంద
నీరు వలెను నీవు నిశ్చయంబుగ
నిఖిలంబు మాయయౌ , వి. వే.

ఓ దేవా! నీవే స్థిరముగా నిలిచియుందువు . ఇతరము లన్నియు కొలది కాలములో నశించునవియే . నీవల్లనే వెలుగుచుండు సూర్యుని తేజము కూడ నీరువలె మారిపోవును . నీఒక్కడివే సత్యస్వరూపుడవు . లోకమంతయు మాయ

God stands firmly when all things perish over time. The sun created by the god will not shine if he does not will. He is the ultimate reality and everything else in the world is delusional.

1739
నీవు పలుకుచున్న నిత్య పూజితుడౌను నీవు పలుకకున్న నిదురపోవు నీవు పలుక బలుక నిర్మలుండగునయా , వి. వే.

నీవు పలుకుచున్న నిత్య పూజితుడౌను
నీవు పలుకకున్న నిదురపోవు
నీవు పలుక బలుక నిర్మలుండగునయా,
వి. వే.

దేవా! నీవు హృదయములో ప్రవేశించి పలుకునపుడే మానవుడు పూజ్యుడగును . నీవు పలుకవేని అతడు చనిపోయినట్లే . నీవు ప్రేరించిన పలుకువాడు పాపరహితుడగును .

When god enters the heart of a speaker, the speaker will become holy. If God does not enter the speaker, the speaker is practically dead. The one who speaks with God's presence will be free from sins.

1740
నీవు విన, గనొకటి నిలిచి యుండగలేదు నిలువ నెండ మావి జలము లట్లె నీవు నిన్నెఱుగుట నిశ్చయం బాయెరా , వి. వే.

నీవు విన, గనొకటి నిలిచి యుండగలేదు
నిలువ నెండ మావి జలము
లట్లె నీవు నిన్నెఱుగుట
నిశ్చయం బాయెరా , వి. వే.

ఓ దేవా! నీవు లేక లోకమున నిలుచు పదార్థమొక్కటియు లేదు. ఇతరములు ఎండమావులలోని నీటివలె భ్రాంతిని కల్గించునవే కాని స్థిరములు కావు. నీ ప్రభావమును నీవు తప్ప ఇతరులేవ్వరును ఎరుగజాలరు. ఇది సత్యము

God is responsible for all of the physical world. All the things are cause of illusion like mirages but not permanent. Only he knows his influence.

1741
నేయి వెన్న కాచి నీడనే యుంచిన బేరి గట్టి పడును పెరుగురీతి పోరి పోరి మదిని పోనీక పట్టుము, వేమా

నేయి వెన్న కాచి నీడనే యుంచిన
బేరి గట్టి పడును పెరుగురీతి
పోరి పోరి మదిని
పోనీక పట్టుము, వేమా

వెన్న కాచి , నేతిని చేసి, దానిని నీడలో ఉంచిన పేరుకొనును . పెరుగువలె గట్టిపడును . మనస్సు పరిపక్వమైనను కొంచెముపేక్షించిన లోబడదు . దానిని లోబరుచుకొన యత్నింపుము

By melting butter ghee is formed. When it is cooled down it will solidify like yogurt (curd). Even though mind is ripe, if one delays, it can't be controlled.

1742
పంచభూతములను పరగ వలను బట్టి సంచరింపకుండు సరణి తెలిసి వేటలాడి బెస్తవాటంబు నెఱుగుము , వి. వే.

పంచభూతములను పరగ వలను బట్టి
సంచరింపకుండు సరణి తెలిసి
వేటలాడి బెస్తవాటంబు
నెఱుగుము , వి. వే.

జ్ఞానమును వలతో పంచభూతములనుబట్టి , కదలకుండ కట్టివేసి వేటకానింబోలె వానిని వశపరచుకొనవలెను

One should capture the pancha-bhoota (earth, water, space, fire, air) with a net like knowledge, tie them up and conquer them like a hunter.

1743
పంచఋషులు భువిని పరమ పవిత్రులు మించి లోకమునకు మేలుకొఱకు సంచితార్థములను సమసింపజేయరా , వి. వే.

పంచఋషులు భువిని పరమ పవిత్రులు
మించి లోకమునకు మేలుకొఱకు
సంచితార్థములను
సమసింపజేయరా , వి. వే.

ఐదుగురు ఋషులు మాత్రము లోకముల నుద్ధరించుటకే పుట్టియున్నారు. వారు సమస్త పాపములను పోగొట్ట గలవారు . వారిని సేవించి సంచితకర్మములను పోగొట్టుకొనుము

The 5 sages are born to uplift the world. They can destroy all the sins. One should pray to them to remove the sanchita (accumulated) karma.

1744
పంచముఖములందు బంచాక్షరి జనించె పంచవరములను ప్రబలె జగము పంచముఖుని మీరు ప్రస్తుతి చేయుడీ , వి. వే.

పంచముఖములందు బంచాక్షరి జనించె
పంచవరములను ప్రబలె
జగము పంచముఖుని మీరు ప్రస్తుతి
చేయుడీ , వి. వే.

శివుని యైదు ముఖములనుండియు పంచాక్షరి జనించెను . పంచాక్షరిలోని అయిదక్షరములనుండియే ప్రపంచము పుట్టెను . ఆ శివునే మీరందరు స్తుతింపుడు

Panchaakshari (om-namah-si-va-ya) emanated from the 5 faces of Lord Siva. From it the world is born.

1745
పంచవర్ణ మెఱుగ పరము నెఱు౦గును పరము నెఱుగ నిఛ్ఛ ప్రజ్వరిల్లు ప్రజ్వరిల్లువాడు పరము తానగునయా , వి. వే.

పంచవర్ణ మెఱుగ పరము నెఱు౦గును
పరము నెఱుగ నిఛ్ఛ ప్రజ్వరిల్లు
ప్రజ్వరిల్లువాడు
పరము తానగునయా , వి. వే.

పంచాక్షరి మంత్రత్వమును తెలిసికొన్నచో పరుని కూడ తెలిసికొనవచ్చును . ఆ తెలిసికొన్నవాడు పరుడును కాగలడు

When one knows the tattva of panchaakshari (aum-namah-si-va-ya) he can know about the god. He can also become god.

1746
పడయంగ రానిది పూర్ణము తడబడకల మనమునందు దలపడినంతం జిడిముడిలేకటు నిల్చిన విడనాడగ బట్టబయలె వెలయును వేమా

పడయంగ రానిది పూర్ణము తడబడకల
మనమునందు దలపడినంతం జిడిముడిలేకటు
నిల్చిన విడనాడగ
బట్టబయలె వెలయును వేమా

సామాన్య జనులకు లభ్యముకాని పరమాత్మ సంపూర్ణ స్వరూపమును తత్తరపాటు లేని మనస్సున మననము చేసినచో బ్రహ్మము గోచరించును . అదే బట్టబయలు

Brahmam, not attainable by ordinary people, can be realized by knowing the full form of paramaatma and focusing with unperturbed mind.

1747
పనుపడి నిర్గుణ మనునది తన కెద్దియు దోపబోదు తత్త్వమెఱుంగ , కే మననాంతరంగమందును వినయంబగు బయలుచేరి వెలయుము, వేమా

పనుపడి నిర్గుణ మనునది తన కెద్దియు
దోపబోదు తత్త్వమెఱుంగ,
కే మననాంతరంగమందును వినయంబగు
బయలుచేరి వెలయుము, వేమా

తత్త్వమెరుగనంతవరకును నిర్గుణమనునది బాహ్య చక్షుస్సునకు గోచరింపదు. మనస్సు ద్యానానుకూలమైనచో చిత్స్వరూపమును చేరవచ్చును

Until tattva is mastered, nirguna (without sattva-calm, rajas-action, tamas-indolence) cannot be mastered. When mind is focused on meditation subtle form can be realized.

1748
పరమసిద్ధికొఱకు బాపలనిడిగించి శ్రవణ మననవృత్తి సంగ్రహించి యెఱుక మఱచువాడె యేకాగ్ర చిత్తుడు, వి. వే.

పరమసిద్ధికొఱకు బాపలనిడిగించి
శ్రవణ మననవృత్తి సంగ్రహించి
యెఱుక మఱచువాడె యేకాగ్ర
చిత్తుడు, వి. వే.

పరమాత్మసిద్ధికై దృష్టి నిగిడించి శ్రవణ మననముల నొనర్చుచు ఏకాగ్రచిత్తుడై ఐహికములను విడుచువాడు ముక్తుడగును

By focusing mind on paramaatma, by hearing and meditating on him, by being of single mind about him, by renouncing physical world, one will attain salvation.

1749
పరమాత్ముని చింతనలో దఱచుగ నుండెటయె తగును ధరనకటికిం దిరిపము నెత్తి భుజించుచు దొరవలె గృహవేదికండు తొంగుము వేమా

పరమాత్ముని చింతనలో దఱచుగ నుండెటయె
తగును ధరనకటికిం దిరిపము
నెత్తి భుజించుచు దొరవలె
గృహవేదికండు తొంగుము వేమా

దైవచింతనతో కాలము గడుపుచు , భిక్షాన్నముతో ఆకలి తీర్చుకొనుచు , నిదురవచ్చినపుడే కన్నుమూయుచు కాలము గడుపుట యోగి పరమధర్మము

Spending time with prayer to god, eating food given as alms, sleeping only when tired are the dharma of yogi.

1750
పరిశీలించిన జ్ఞప్తిని గుఱి నెవ్వడు భక్తిచేత గోర్కులడంగెడిన్ స్థిరరూప మంది పొందెడు పరిపూర్ణ సమాగమంబు బడయుము వేమా

పరిశీలించిన జ్ఞప్తిని గుఱి నెవ్వడు
భక్తిచేత గోర్కులడంగెడిన్
స్థిరరూప మంది పొందెడు పరిపూర్ణ
సమాగమంబు బడయుము వేమా

జ్ఞానమును సాధనముగా చేసికొని ఈశ్వరతత్త్వమును గుర్తింపగల్గినచో కోరికలన్నియు నశించును. పిదప స్థిరమైన మోక్షమును పొందుటకు యత్నింపుము

One's desires will be destroyed when knowledge is used as a means to learn about the tattva of Iswara. One should then try to attain salvation.

1751
పలుకులోని పలుకు బరగంగ జూచిన బలుకునందు బ్రహ్మపదము గలుగు పలుకు గానలేక పరువు దప్పిరి జనుల్ , వి. వే.

పలుకులోని పలుకు బరగంగ జూచిన
బలుకునందు బ్రహ్మపదము
గలుగు పలుకు గానలేక పరువు
దప్పిరి జనుల్ , వి. వే.

ప్రణవమునందలి తత్త్వమును విమర్శించి చూచిన, అందు బ్రహ్మము నెలకొనియుండుట తెలియును. మూర్ఖులు దానిని తెలిసికొనలేక చెడిపోవుచున్నారు

One should analyze the tattva of aum, and discover the brahmam established in it. Foolish people are not able to realize this.

1752
పలుకులోని బిందు వలరంగ గావలె పలుకులోని దాని పదిలపఱచి వేడుకైన దాని విత బెట్టుకుందురు , వి. వే.

పలుకులోని బిందు వలరంగ గావలె
పలుకులోని దాని పదిలపఱచి
వేడుకైన దాని విత బెట్టుకుందురు,
వి. వే.

నాదమునందు బిందువువలె తానీశ్వరతత్త్వమున గలియుటకు ప్రయత్నించుచు , ప్రణవనాదమును పలుకుల యందే లగ్నముచేసి, వినోదమునకై బ్రహ్మానుభవమును వదలక యుండినవాడే యోగి

As a bindu (point) within naada (aum), one should strive to seek union with the tattva of Iswara. One should meditate on aum and experience the joy of brahmam. Such a person is called a yogi.

1753
పాశమునను జూడబరంగ దేహమునకు హాని వచ్చుగాన నదియు జూచి జ్ఞానదీపకళిక కడకొత్త వలెనయా , వి. వే.

పాశమునను జూడబరంగ దేహమునకు
హాని వచ్చుగాన నదియు
జూచి జ్ఞానదీపకళిక కడకొత్త
వలెనయా , వి. వే.

ఆశ, మోహము మున్నగునవి పాశములు. వానికి లోబడినచో మానవుడు బద్దుడై హాని చెందును. హృదయమున జ్ఞానదీపమును ప్రజ్వలింపజేసిన పాశములు విడిపోవును

Greed, lust, etc. are bondage. Being controlled by them is perilous. When one acquires knowledge, the bondage will vanish.

1754
ప్రాణమందు శివుని భావించి తేఱక ముద్రలనుచు బడెడి మూఢులార ! ముద్రలందు లేదు మూలమందే కాక, వి. వే.

ప్రాణమందు శివుని భావించి
తేఱక ముద్రలనుచు బడెడి
మూఢులార ! ముద్రలందు లేదు
మూలమందే కాక, వి. వే.

ప్రాణమునందున్న దేవుని తెలిసికొనలేక జనులు ముద్రలడుగుచుందురు . దైవమున్నది మూలమందేకాని ముద్రల యందు కాదు

Without realizing that god is responsible for praana, people vainly seek approval of yogis. God is at the root of all things.

1755
భగవంతుడైన దేవుడు జగముల దనలోనబెంచి జాలము జూపున్ దగురీతిని దా నన్నిట నగణితుడై వెలయుచుండు ననువుగ వేమా

భగవంతుడైన దేవుడు జగముల దనలోనబెంచి
జాలము జూపున్ దగురీతిని
దా నన్నిట నగణితుడై
వెలయుచుండు ననువుగ వేమా

షడ్గునైశ్వర్యసంపన్నుడగు దేవుడు లోకమును తనలోనే పెంచి మాయచేసి , తానా లోకము లన్నింటిలోను నిండి వర్ణింపరాని విధమున వెలుగుచుండును

The god is a manifestation of 6 gunas (sandhi, vigraha, etc.). He evolves the worlds within himself and with maaya (illusion) he is omnipresent and beyond words.

1756
భగవంతుని ప్రతిబింబం బగు నీశుం డొరసి మాయనగు లోకమునన్ దగ భోజ్యమునగు జీవుం డొగి భోక్తయై విద్యగూడి యొప్పుగ వేమా

భగవంతుని ప్రతిబింబం బగు నీశుం
డొరసి మాయనగు లోకమునన్ దగ
భోజ్యమునగు జీవుం డొగి భోక్తయై
విద్యగూడి యొప్పుగ వేమా

భగవంతుని ప్రతిబింబమగు ఈశ్వరుడు జీవుడై జ్ఞానియై యుండుటవల్ల మాయావృతమగు సమస్తమును భోజ్యముగా చేసికొని తాను భోక్తయై విలసిల్లును

Iswara being a reflection of god, becomes a jiva. He consumes all things emanating from maaya (illusion), and remains as their ruler.

1757
భద్రమైన మనసు బలపడినంతట వద్దదగును పరమ వశముగాను నిద్రలోని నిద్ర నిలుపుకొనుచు జూడు , వి. వే.

భద్రమైన మనసు బలపడినంతట
వద్దదగును పరమ వశముగాను
నిద్రలోని నిద్ర నిలుపుకొనుచు
జూడు , వి. వే.

మనస్సును జాగ్రత్తగా బలపరచినచో సమాధి యలవడి ఆ పై ధ్యానమువల్ల ఈశ్వరతత్త్వము బోధపడును

When one controls the mind and reinforces it, samaadhi (deep meditative state) will be possible. Then with prayer the tattva of Iswara can be grasped.

1758
భయము సుమీ యజ్ఞానము భయ ముడిగిన నిశ్చయంబు పరమార్త౦బౌ లయము సుమీ యీ దేహము జయము సుమీ జీవుడనుచు చాటర వేమా

భయము సుమీ యజ్ఞానము భయ ముడిగిన
నిశ్చయంబు పరమార్త౦బౌ
లయము సుమీ యీ దేహము జయము
సుమీ జీవుడనుచు చాటర వేమా

అజ్ఞానమే భయము. అది పోయినచో పరమార్థము స్పష్టమగును . శరీర మెప్పుడైనను లయమగునదేయనియు , జీవుడు స్థిరముగా నుండుననియు గట్టిగా తెలిసికొనుము

Ignorance is fear. Once ignorance is overcome, the highest truth will be clear. Body will perish and jiva is forever.

1759
భానుసోమ వహ్నిభవ్యలోచన మది దలపకున్న ఫలము గలుగబోదు ఇహపరంబులకు మహేశ్వరు డతడౌట , వి. వే.

భానుసోమ వహ్నిభవ్యలోచన
మది దలపకున్న ఫలము గలుగబోదు
ఇహపరంబులకు మహేశ్వరు
డతడౌట , వి. వే.

సూర్యచంద్రాగ్నులు నేత్రములుగా నున్న శివుని ధ్యానించనివారికి ఇహమునను, పరమునను సుఖములేదు. మోక్షము లభింపదు. ఇహపరములకు శివుడే కారకుడు

One who does not worship the Lord Siva with the sun and the moon as his eyes, he has no happiness in this and nether worlds. He won't attain salvation. Lord Siva is responsible for this and nether worlds.

1760
భార్యమీద నాశ పరగు పురుషునకు మగనిమీద నాశ మగువకుండు శివునిమీద నాశ సిద్ధున కుండురా , వి. వే.

భార్యమీద నాశ పరగు పురుషునకు
మగనిమీద నాశ మగువకుండు
శివునిమీద నాశ సిద్ధున
కుండురా , వి. వే.

భార్యపై భర్తకు, భర్తపై భార్యకును ప్రేమ యున్నట్లే సిద్ధునకు భగవంతుడగు ఈశ్వరునియెడ ప్రేమ తప్పక యుండును

Just as a wife has affection for her husband and vice-versa, a yogi has love for the Iswara.

1761
భావమరయ వేఱె పరదేశమున లేదు తాను జేయు పనుల దగిలియుండు భావమందు శివుని బరికింపుచుండుము , వి. వే.

భావమరయ వేఱె పరదేశమున లేదు
తాను జేయు పనుల దగిలియుండు
భావమందు శివుని బరికింపుచుండుము,
వి. వే.

భావమనునది వేరే చోట లేదు, తాను చేయు పనులనంటియే యున్నది. తన భావమును తాను పరీక్షించినచో తనయందే దేవు డంతర్యామియై యుండుట తెలియును

The mind is within one's acts. When one analyzes the mind he will know that god is all over the self.

1762
భావాభావము లంటక సేవించెడు బట్టబయలు స్థిరమతిలోనన్ కేవలము శివధ్యానము తావరమును గన్నవాడె ధన్యుడు వేమా

భావాభావము లంటక సేవించెడు
బట్టబయలు స్థిరమతిలోనన్ కేవలము
శివధ్యానము తావరమును
గన్నవాడె ధన్యుడు వేమా

భావాభావముల నంటుకొనక బట్టబయలు చిత్స్వరూపమై , హృదయస్థమై యున్నది. ఈశ్వరధ్యానము చేయు వాడు ఆ మహత్ స్వరూపమును చూడగలడు

The world manifesting outside is in subtle form within self without contacting one's thoughts. One who meditates on Iswara can know this.

1763
భాషలెన్నిటిలో నైన భావమొకటె వేషములలోన జిక్కని విధమెఱుంగు పోషకుండని తలంచుట పొందుగాదు దోషమున్న నెఱు౦గుము తొలుత వేమ

భాషలెన్నిటిలో నైన భావమొకటె వేషములలోన
జిక్కని విధమెఱుంగు
పోషకుండని తలంచుట పొందుగాదు దోషమున్న
నెఱు౦గుము తొలుత వేమ

భావము నెదుటివాడు గ్రహించుటకు పెక్కు భాషలుపయోగింపబడును . అట్లే దేవుడొక్కడేయైనను సర్వజన సాధ్యుడు కాకుండుటకు పెక్కు వేషములతో ఉన్నాడు . అందరినీ పోషించు దేవుడు నన్ను రక్షింపడా ? అని యనరాదు . తన తప్పు నెరుగనివానిని ఈశ్వరుడు కాపాడడు

There are multiple languages to express one's thoughts. Similarly god is in many forms. One should not say when god saves many people, he should also be saved. Iswara won't protect a sinner who does not repent.

1764
భువనాకారుని మదిలో ప్రవిమల శుభమూర్తిగాను పరికించినచో భవనాశ మగును పూర్ణుడు శివదేవుడు చిన్మయుండు స్థిరుడగు వేమా

భువనాకారుని మదిలో ప్రవిమల శుభమూర్తిగాను
పరికించినచో భవనాశ
మగును పూర్ణుడు శివదేవుడు
చిన్మయుండు స్థిరుడగు వేమా

ప్రపంచాకారుడగు దేవుని శుభమూర్తిగా నెంచి చూచినచో జ్ఞానమయుడగు నా దేవుడు స్థిరముగా హృదయస్థుడై గోచరించుచునే యుండును

When one sees the god in the form of this world as auspicious, the god who is permanent and a gnaani (omniscient) will be visible in the heart.

1765
మంట లోహమందు మ్రాకుల శిలలందు పటములందు గోడప్రతిమలందు తన్ను దెలియు కొఱకు దగులదా పరమాత్మ , వి. వే.

మంట లోహమందు మ్రాకుల శిలలందు
పటములందు గోడప్రతిమలందు
తన్ను దెలియు కొఱకు దగులదా
పరమాత్మ , వి. వే.

మంట , లోహము, చెట్లు , రాళ్ళు , పటములు, ప్రతిమలు మున్నగువాని యందన్నిటను పరమాత్మ నిండియే యుండును . అటులనే నీయందును నిండియుండును

Paramaatma is within fire, metal, trees, stone, pictures and idols. Similarly he is within us.

1766
మంటికుండవంటి మాయ శరీరంబు చచ్చు నెన్నడైన , చావదాత్మ ఘటములెన్నియైన గగనమొక్కటె కదా, వి. వే.

మంటికుండవంటి మాయ శరీరంబు
చచ్చు నెన్నడైన , చావదాత్మ
ఘటములెన్నియైన గగనమొక్కటె
కదా, వి. వే.

మంటికుండవంటి యీ దేహమెప్పుడో ఒకప్పుడు నశించును గాని ఆత్మ నశింపదు . ఆకాశముతో నిండిన కుండలు నశించినను, ఆకాశమునకు నాశము లేదు కదా!

The body is like a pot that will perish one day. But aatma is for ever. Pots with space inside can break. But the space above will last for ever.

1767
మడియు వాడెవడు మడియని దెవ్వడు పాటు చేసిచూడ బట్టబయలు సొరిది జలఘటమున సూర్యుని చందమౌ , వి. వే.

మడియు వాడెవడు మడియని దెవ్వడు
పాటు చేసిచూడ బట్టబయలు
సొరిది జలఘటమున సూర్యుని
చందమౌ , వి. వే.

నీటికుండలో సూర్యుని ప్రతిబింబమువలె నీ ప్రపంచమున్నది . ఇది అందరికిని తెలిసినదే . ఇట్టి ప్రపంచమున స్థిరుడెవ్వడు?గతించువాడెవ్వడు ? అంతయు మిధ్య

This world is like the reflection in a pot with water. Everyone should know this. Who is permanent? Who is impermanent? All is an illusion.

1768
మది నెఱింగిన వాని మహిగాన మెందును మది నెఱు౦ గు వాడె మహి మనుజుడు వెదకి తనువులోన వేడ్కతో నిను జూచు, వి. వే.

మది నెఱింగిన వాని మహిగాన మెందును
మది నెఱు౦ గు వాడె మహి
మనుజుడు వెదకి తనువులోన వేడ్కతో
నిను జూచు, వి. వే.

మనస్తత్వమును బాగుగా ఎరిగినవారు తక్కువగా నుందురు. మనస్సు నెరిగినవాడే మనుష్యుడు . అతడు తన హృదయమును శోధించి , అందుగల ఈశ్వరుని చూడగలడు

The people who know about the tattva of mind are far and few. One who knows about his mind is the real man. He can search in his heart and visualize the Iswara within.

1769
మనము జూచి గెల్చి మనములో సుఖియింప గడకు మోక్ష పదము గను నచటనె చెట్టుబెట్ట ఫలము చేకూరదా తాన , వి. వే.

మనము జూచి గెల్చి మనములో సుఖియింప
గడకు మోక్ష పదము
గను నచటనె చెట్టుబెట్ట ఫలము
చేకూరదా తాన , వి. వే.

మనస్తత్వము నెరిగి దానిని జయించినవారికి మోక్షతత్త్వము బాగుగా తెలియగలదు . మొక్కను నాటి పోషించినచో దాని ఫలము తప్పక లభించును గదా

The people who control their minds can know the tattva about salvation. When one plants a seed, it is possible to reap the fruit.

1770
మనసునందు ముక్తి మలయుచు నుండగా మనసు నెఱుగలేని మనుజులెల్ల మనసు నంటలేక మాయమైపోయిరి , వి. వే.

మనసునందు ముక్తి మలయుచు
నుండగా మనసు నెఱుగలేని
మనుజులెల్ల మనసు నంటలేక
మాయమైపోయిరి , వి. వే.

మనస్సులోనే ముక్తియుండగా , మూర్ఖులు ఆ మనస్సు తత్త్వము నెరుగక నశింతురు

Without knowing the secret to salvation is within self, foolish people are dying.

1771
మనసు ముక్తి యనుచు మది నెఱుగగ లేరు మనసుచేత దగిలి మాయమైరి మనసు తానయైన మర్మజ్ఞుడగు యోగి, వి. వే.

మనసు ముక్తి యనుచు మది నెఱుగగ
లేరు మనసుచేత దగిలి
మాయమైరి మనసు తానయైన మర్మజ్ఞుడగు
యోగి, వి. వే.

మనస్సే మోక్ష సాధనమని సామాన్యులకు తెలియదు . అట్టివారు మనశ్చేష్టలకు లోనై నశించుచున్నారు . మనస్తత్వమును గుర్తించి దానిని లోబరచుకొన్న ధన్యుడై మర్మము తెలిసిన యోగీశ్వరుడని చెప్పబడును

Ordinary people don't know that mind is the means to attain salvation. They are dying by being controlled by their minds. A true yogi is one who knows the tattva about mind and can control his mind.

1772
మనసులోని శివుని మానక నిల్పిన యోగియగు నతండె యుర్విలోన శివుని దలపలేని చిత్తబదేలనో , వి. వే.

మనసులోని శివుని మానక నిల్పిన
యోగియగు నతండె యుర్విలోన
శివుని దలపలేని
చిత్తబదేలనో , వి. వే.

హృదయమున దేవుని నిల్పి ధ్యానించువాడు యోగి యగును. ఆ రీతిని దేవుని ధ్యానింపలేనివారికి మనస్సున్నను లేకున్నను ఒక్కటే

A yogi is one who prays to god within self. To the one who doesn't know this it doesn't matter whether he has mind or not.

1773
మాయరూపు రూపు మాయగా జేసియు మాయరూపును పెనుమాయ చేసి మాయలోని మాయ మఱి పరంజ్యోతిరా , వి. వే.

మాయరూపు రూపు మాయగా జేసియు
మాయరూపును పెనుమాయ
చేసి మాయలోని మాయ మఱి పరంజ్యోతిరా,
వి. వే.

అజ్ఞానావరణమును జ్ఞానసాధనమున తొలగించుకొని , మాయయే ప్రకృతి స్వరూపమనే రహస్యమును గ్రహించి జ్యోతిః స్వరూపామున నున్న బ్రహ్మమును దర్శింప యత్నింపుము

One has to overcome ignorance by gaining a wealth of knowledge, realize that maaya (illusion) is the prakriti (nature), and try to visualize the resplendent brahmam.

1774
ముగురిలోన వెన్క ముందు గానగలేక నరకమునకు బోవు నరులు గలరు ముగురికందనట్టి మూలమూర్తి యొకండు , వి. వే.

ముగురిలోన వెన్క ముందు గానగలేక
నరకమునకు బోవు నరులు
గలరు ముగురికందనట్టి మూలమూర్తి
యొకండు , వి. వే.

జనులు త్రిమూర్తులలో ఎవరు గొప్పవారని చర్చించబోయి తెలియక నరకమున పడుచుందురు . అంతేకాని త్రిమూర్తులను మించిన ఆదిమూర్తిని ఎరుగ యత్నింపరు

Men debate over who is the greatest among the tri-murti (Lords Brahma, Vishnu, Siva) and end up in hell. They don't know aadi-murti who is the precursor to the tri-murti.

1775
ముగురు మూర్తులున్న మూలభావమెఱి౦గి మూలవానితోడ ముచ్చటాడి సత్తుచిత్తులోని సారంబు తెలియురా , వి. వే.

ముగురు మూర్తులున్న మూలభావమెఱి౦గి
మూలవానితోడ ముచ్చటాడి
సత్తుచిత్తులోని సారంబు
తెలియురా , వి. వే.

త్రిమూర్తులున్న స్థలమును తెలిసి , వారిని దర్శించి సత్తుచిత్తుల సారమును తెలిసికొన్నచో ముక్తి లభించును

One should know the domicile of tri-murti (Lords Brahma, Vishnu and Siva), visualize them and grasp the essence of sat (world) and chit (mind) to attain salvation.

1776
మూఢజనుల కెల్ల మూలమై తగు యోగి తారకంబుగాను దైవరూపు బట్టబయలు చేసి పరమాత్ము జూపడో , వి. వే.

మూఢజనుల కెల్ల మూలమై తగు
యోగి తారకంబుగాను దైవరూపు
బట్టబయలు చేసి పరమాత్ము
జూపడో , వి. వే.

మూఢజనులను తరింపజేయువాడై సజ్జనుడగు యోగి దైవరూపము నెరిగించి మనుజులను ధన్యులను చేయుచుండును . కావున గురువు నాశ్రయించుట యుక్తము

To reform foolish people a good yogi familiarizes them to the form of god thus saving them. So it is better to approach a guru.

1777
మేక జంకబెట్టి మెలగుచు మందలో బ్రమసి తిరుగు గొల్ల పగిదిగాను దేవునెఱుగక పఱదేవతలదలచు , వి. వే.

మేక జంకబెట్టి మెలగుచు మందలో
బ్రమసి తిరుగు గొల్ల
పగిదిగాను దేవునెఱుగక
పఱదేవతలదలచు , వి. వే.

మేకను చంకలో పెట్టుకొని దానికై మందయంతయు వెదకు గొల్లవానివలె హృదయములో నున్న దేవుని గుర్తింప లేక జనులు ఇతర దేవతలను సేవింపదలతురు

Men worship external gods, without realizing that god is within themselves. This is like a shepherd searching for a sheep that he is holding in his hands and being unaware of it.

1778
మ్రాను గాలవేసి మహిమీద నొక జాణ పూని తిరుగుచుండె బొందుగాను కాలివేయు మ్రాను కడురమ్యమై యుండు, వి. వే.

మ్రాను గాలవేసి మహిమీద నొక
జాణ పూని తిరుగుచుండె బొందుగాను
కాలివేయు మ్రాను కడురమ్యమై
యుండు, వి. వే.

పరమాత్మయను నేర్పరి సంసారమను బండకొయ్యను కాలికి కట్టుకొని లోకవ్యాపారమును బాగుగా జరుపును. కాలికి దగిలించుకొన్న సంసారపు బండకొయ్య మనోహరముగా అనుకూలముగా నున్నది. పరమాత్మకు దుఃఖకరముగా లేదు

The skillful paramaatma will conduct the business of the world effectively by tying to his foot the lug called samsaara (bondage). The lug is enjoyable to him. He is not immersed in sorrow.

1779
మ్రాకున ననల బుండును మ్రాకున నాయనలమువలె మనుజులలోనన్ డీకొని తా రాజిల్లుచు నేకంబగు బ్రహ్మమందు నెప్పుడు వేమా

మ్రాకున ననల బుండును మ్రాకున
నాయనలమువలె మనుజులలోనన్ డీకొని
తా రాజిల్లుచు నేకంబగు
బ్రహ్మమందు నెప్పుడు వేమా

మ్రానిలో అగ్ని అణగియున్నట్లు పరమాత్మయు సమస్త మానవుల హృదయములలోను ఏకరూపమున ప్రకాశించుచున్నాడు . అతడే బ్రహ్మము

Like the fire that is within wood, paramaatma is resplendent in all of men's hearts in a single form. He is the brahmam.

1780
రతి యొనర్పబూని సతిని వేడిన యట్టి మతిని వేడి పరము మఱుగు దెలిసి గతిని గోరుచుంద్రు ఘనయోగు నిలలోన , వి. వే.

రతి యొనర్పబూని సతిని వేడిన
యట్టి మతిని వేడి పరము మఱుగు
దెలిసి గతిని గోరుచుంద్రు
ఘనయోగు నిలలోన , వి. వే.

పురుషుడు తనప్రేయసిని రతికొరకు ప్రార్థించునట్లు పరమాత్మను మోక్షము కొరకు ప్రార్థించి తత్త్వమునెరిగి సదా కైవల్యమును కోరుచుండువాడే యోగి యనబడును

Like the man who beseeches affection from his fiancee, one has to pray to god for salvation. A true yogi is one who knows the tattva and constantly prays for salvation.

1781
రమ్యమైన మనసు రాజని యెంచుచు గమ్యముగను దాని గట్టు లెఱింగి మఱగి పూర్ణపదవి మహిలోన గానరా, వి. వే.

రమ్యమైన మనసు రాజని యెంచుచు
గమ్యముగను దాని గట్టు
లెఱింగి మఱగి పూర్ణపదవి
మహిలోన గానరా, వి. వే.

సాధకుడా! నీ మనస్సును చదరంగములోని రాజుగా భావించి దానిని కట్టు విధమును తెలిసికొని మోక్షమును పొందుటకు ప్రయత్నింపుము

One has to think of his mind as the king in the game of chess and then know how to check-mate it and strive for salvation.

1782
రూపమడంగ జీవరూపంబు గనారాదు అట్టి రూపమడప నలవికాదు బ్రహ్మ మడగకున్న బ్రహ్మంబు కనరాదు, వి. వే.

రూపమడంగ జీవరూపంబు గనారాదు
అట్టి రూపమడప నలవికాదు
బ్రహ్మ మడగకున్న బ్రహ్మంబు
కనరాదు, వి. వే.

మానవుడు రూపమణగి మరణించినచో భగవతత్త్వమగు జీవుని కనుగొన వీలుండదు . నరుడు చచ్చినను జీవునికి మృతి లేదు. అతడు నిత్యుడు . ఆ నిత్యస్వరూపమగు బ్రహ్మము నెరుగుటకు బ్రహ్మకులమున పుట్టుట సాధ్యము కాదు .

Man cannot discover the jiva that is an incarnation of god after death. Jiva is immortal and eternal. To learn about the eternal brahmam it is not possible to be born in his caste.

1783
రూపవంతులట్లు రూపులు ముగ్గురు వారి వారి నెఱిగి గారవింప మొదల తానె యుండి మోక్షంబు గల్గురా , వి. వే.

రూపవంతులట్లు రూపులు ముగ్గురు
వారి వారి నెఱిగి గారవింప
మొదల తానె యుండి మోక్షంబు
గల్గురా , వి. వే.

త్రిమూర్తులు రూపవంతులు, వారు ముగ్గురి నెరిగి గౌరవింపదలచినయెడల ముందుగా ఆత్మతత్త్వము నెరుగవలెను . పిమ్మట మోక్షమును పొందవచ్చును

Before learning about and worshiping Trimurti (Lords Brahma, Vishnu, Siva), one has to be aware of the tattva of aatma. Later on one can receive salvation.

1784
రూపుజూచి మెచ్చి రూపింప నేఱక వేదశాస్త్రములను వెదకుటేల ? దాపుగానె యున్న దర్పణమట్టుల శివుడు భావమందు జెలగు వేమ

రూపుజూచి మెచ్చి రూపింప నేఱక
వేదశాస్త్రములను వెదకుటేల ?
దాపుగానె యున్న దర్పణమట్టుల
శివుడు భావమందు జెలగు వేమ

బ్రహ్మస్వరూపము తన హృదయములోనున్నను అది యిట్టిదని నిరూపింపలేక దానికై వ్యర్థముగా వేదశాస్త్రములను వెదకిన లాభములేదు. మూర్ఖులు భావములోని పరముని చూడజాలరు

Even though brahmam is within, people unable to prove it search vedas and scripture for it. Foolish people cannot visualize nether world hidden in the meaning.

1785
లలిత శివతత్త్వ పదమున గలిసిన శివయోగి యేల కలియు జగములన్ జల బిందువు ముత్తియమై కలియునె తొల్లింటి నీట గనరా వేమా

లలిత శివతత్త్వ పదమున గలిసిన
శివయోగి యేల కలియు జగములన్
జల బిందువు ముత్తియమై కలియునె
తొల్లింటి నీట గనరా వేమా

ముక్తుడైనవాడు మరల నెప్పటికి లోకములో కలియక ముత్యముగా మారిన నీటిబిందువు తిరిగి నీటిబిందువు కానట్లు నాశము లేకయు , వికారములేకయు నుండును

The one who attained salvation will not be associated with the world, like the water drop that creates an oyster will not return to the form of droplet. He will be eternal and free of emotions.

1786
లేదు జగతినంచు వాదు సేయగవచ్చు సోది చెప్పరాదు సూక్ష్మమెఱిగి పాదుకొల్పి బుద్ధి పరికించి చూడరా, వి. వే.

లేదు జగతినంచు వాదు సేయగవచ్చు
సోది చెప్పరాదు సూక్ష్మమెఱిగి
పాదుకొల్పి బుద్ధి
పరికించి చూడరా, వి. వే.

“భగవంతుడు లేనేలేడు, ఇది సత్యము" అని వాదింపవచ్చును . కాని యిట్టి సోది పనికిరాదు. నీ వాదశూకమువలె అతి సూక్ష్మమైన పరమాత్మ నెరుగుటయు సులభము కాదు . బుద్ధిని లోబరచుకొని చూచినగాని పరమాత్మ స్వరూపము గోచరింపదు

One can argue there is no god. But it is futile. The subtle paramaatma cannot be grasped with argumentation. One has to control his mind to visualize the form of paramaatma

1787
లోకములయందు వెలియైన లోతు చూడ బూని వర్తించి పరిపూర్తి బొందువాడు వున్నవాడౌను ముక్తుడై యున్నవాడు పరమ సంతోష నిలయుడై పరగు వేమ

లోకములయందు వెలియైన లోతు చూడ బూని
వర్తించి పరిపూర్తి బొందువాడు
వున్నవాడౌను ముక్తుడై యున్నవాడు
పరమ సంతోష నిలయుడై పరగు వేమ

లోకాతిరిక్తమగు బ్రహ్మస్వరూపమును చూచి జ్ఞానపూర్ణుడై వాడొక్కడే ప్రపంచములో స్థిరుడు. అతడు ముక్తుడై శాశ్వత సుఖములను పొందగలుగును

The one who sees the form of brahma that provides source of happiness to the world and remains as a fully knowledgeable person, is permanently footed in this world. He will attain salvation and experience unlimited comforts.

1788
బ్రదుకు వార లెవరు? బ్రదుకకుందు రెవరు? బ్రదికి బ్రతుకలేని ప్రాణులెవరు? క్షితిని శోధిచేసి స్థిరముగా జూడరా, వి. వే.

బ్రదుకు వార లెవరు? బ్రదుకకుందు
రెవరు? బ్రదికి బ్రతుకలేని
ప్రాణులెవరు? క్షితిని శోధిచేసి
స్థిరముగా జూడరా, వి. వే.

బాగుగా ఆలోచించి చూచినచో ఈ ప్రపంచమున బ్రదుకువారు , బ్రతుకగలవారు, బ్రదుకలేనివారు ఎవ్వరెవ్వరో తేటపడును. అందరును అస్థిరులే

When one analyzes, those who exist, can exist and can't exist in the world will be revealed. All are impermanent.

1789
వాడు వాడు కాడు వానిలోపలనుండు వాడె వాడు వాడు వాడు కాడు వాడు వాని గూర్చు వాడె పో బ్రహ్మంబు , వి. వే.

వాడు వాడు కాడు వానిలోపలనుండు
వాడె వాడు వాడు వాడు కాడు
వాడు వాని గూర్చు వాడె
పో బ్రహ్మంబు , వి. వే.

మానవు డీశ్వరుడు కాడు; మానవదేహములో నున్న ఆత్మయే ఈశ్వరుడు ; మానవు నీశ్వరునిగా తలపరాదు; ఆత్మను పరమాత్మలో జతపరుచువాడే బ్రహ్మమగును

Man is not Iswara. The aatma residing in one's body is Iswara. One should not treat a man like Iswara. One becomes brahmam by the union of his aatma with paramaatma

1790
వినవలె నాదము తనలో గనవలె బ్రహ్మంబు విడక కౌతుక మొప్పన్ గనవలె సోహం భావము తను దానై పరమునందు తగులక వేమా

వినవలె నాదము తనలో గనవలె బ్రహ్మంబు
విడక కౌతుక మొప్పన్
గనవలె సోహం భావము తను దానై
పరమునందు తగులక వేమా

ప్రణవమును విని దానియందు ధ్వనించుచున్న నాదమును తెలిసి "సోహమస్మి" అను మహావాక్యార్థమును గ్రహించి కైవల్యమును పొందవలెను

One has to listen to “aum” and grasp the meaning of vedic quote “i am he” to attain salvation.

1791
విన్నవా డెవండో కన్నవా డెవ్వడొ విన్న కన్నవాని వివరమేవె అరసి చూడవలయు నంబుధి నైనను , వి. వే.

విన్నవా డెవండో కన్నవా డెవ్వడొ
విన్న కన్నవాని
వివరమేవె అరసి చూడవలయు నంబుధి
నైనను , వి. వే.

ఈ ప్రపంచమును గూర్చి విన్నవాడు , దీనిని చూచినవాడు నెవ్వడో , అతని (బ్రహ్మముయొక్క) వివరములను సముద్రములను గాలించియైనను గమనించి తెలిసికొనవలెను

Brahmam is the one who knows about the universe and is aware of it. One has to search for him in all places including the oceans.

1792
విమల దృష్టి బూని విజ్ఞాన మందమి తమము బాయ నగునె తథ్యమగును తమము మీఱినంత తత్త్వజ్ఞుడగునయా , వి. వే.

విమల దృష్టి బూని విజ్ఞాన
మందమి తమము బాయ నగునె తథ్యమగును
తమము మీఱినంత తత్త్వజ్ఞుడగునయా,
వి. వే.

నిర్మలదృష్టితో చూచి విజ్ఞానము పొందకున్నంత వరకును అజ్ఞానము నశింపదు . క్రమముగా అజ్ఞానమడగినచో , అతడు పరమునితత్త్వము నెరిగినవాడగును

Until one gains knowledge with clear vision, the ignorance won't be destroyed. When the ignorance is dispelled gradually, he will grasp the tattva of god.

1793
వేద గీతంబులను మించి వెలయువాని నాద బిందువు కళలంటి నయముగాను సాధకంబున జొచ్చుటే సన్మతంబు జన్మ సార్థక మపుడే చనును వేమ

వేద గీతంబులను మించి వెలయువాని
నాద బిందువు కళలంటి నయముగాను
సాధకంబున జొచ్చుటే సన్మతంబు
జన్మ సార్థక మపుడే చనును వేమ

వేదముల కతీతుడును , నాదబిందు స్వరూపుడును అగు బ్రహ్మమును సాధనసంపత్తిచే కలియుటయే తన్మయత్వమనబడును . అది కలిగినపుడే జన్మము సార్థకమయ్యెనని తెలిసికొనవలెను

Brahmam transcends vedas and has a form of naada-bindu. One who meets him with meditation will enjoy the real bliss. One's life is fulfilled by such a meeting.

1794
వేదము జాదివియు విఱ్ఱవీగుటె గాని యధమగతిని బడిరి యయ, లెల్ల బ్రహ్మ మహిమ తెలిసి బ్రదికిన బ్రదుకయా , వి. వే.

వేదము జాదివియు విఱ్ఱవీగుటె
గాని యధమగతిని బడిరి యయ, లెల్ల
బ్రహ్మ మహిమ తెలిసి బ్రదికిన
బ్రదుకయా , వి. వే.

“మేము బ్రాహ్మణులము ; వేదములు చదివితిమి " అని విర్రవీగి , బ్రహ్మము మహిమను తెలిసికొనలేక మూఢు లధోగతి పాలగుదురు . బ్రహ్మము నెరిగినవారి జీవనమే జీవనము

The brahmins who claim pompously they know vedas don't know the miracles of brahmam and are foolish. Those who know about brahmam are the real people.

1795
వేదవిప్రులెల్ల విశ్వోపకారులు సాక్షి యున్నవాడు జగతిలోన నట్టివారినరులు నరయ రిదేలకో ? వి. వే.

వేదవిప్రులెల్ల విశ్వోపకారులు
సాక్షి యున్నవాడు
జగతిలోన నట్టివారినరులు
నరయ రిదేలకో ? వి. వే.

వేదములు చదివిన బ్రాహ్మణులు లోకమున కుపకారులు . దీనికి దైవమే సాక్షి. అట్టివారిని లోకులు గమనింపనైనను గమనింపకున్నారు

The brahmins who recite vedas are performing good acts in this world. God is the witness of this. People are not able to understand this.

1796
వేదశాస్త్ర పురాణముల్ వెదుకనేల? అదితుదియను లేకయే యచల మగును సార మిది మించి వెలిగెడి సత్యమగును వాదముల గానరాకుండి వారలు వేమ

వేదశాస్త్ర పురాణముల్ వెదుకనేల?
అదితుదియను లేకయే యచల మగును సార
మిది మించి వెలిగెడి సత్యమగును
వాదముల గానరాకుండి వారలు వేమ

వేద, శాస్త్ర, పురాణములను వెదుకనక్కరలేదు . ఆద్యంతములు లేక స్థిరుడైయున్న సర్వవ్యాప్తియగు బ్రహ్మమును కోరినచోట చూడవచ్చును . వాదములను దిగిన అతడు కానరాడు

There is no reason to search from brahmam in the vedas and scripture. One can visualize brahmam who has no beginning and end everywhere. He won't deify to those who argue.

1797
వెన్ను దగిలియుండు కన్నుగాననివాడు చిన్ననాటి నుండి చెలిమి జూపు అన్నదమ్ములకును నాప్తులై యుండును, వి. వే.

వెన్ను దగిలియుండు కన్నుగాననివాడు
చిన్ననాటి నుండి చెలిమి
జూపు అన్నదమ్ములకును నాప్తులై
యుండును, వి. వే.

కన్నులు తెరవని పసిపాపలమై యున్నపుడును దైవము మన వెన్నంటియుడి, మిక్కిలి స్నేహమును చూపును. సోదరులవలె మిక్కిలి ఆప్తుడైయుండును

God shows great love and friendship starting from our childhood. He remains with us as a brother with great affection.

1798
వేదసారమెల్ల వెదకి తా జూచియు లీనమైన బ్రహ్మరీతి తెలిసి పరము గనెడి వాడు పరమాత్ముడగునయా , వి. వే.

వేదసారమెల్ల వెదకి తా జూచియు
లీనమైన బ్రహ్మరీతి తెలిసి
పరము గనెడి వాడు పరమాత్ముడగునయా,
వి. వే.

వేదముల సారమునంతను వెదకి అందు లీనుడైయున్న పరమాత్మను తెలిసికొన్నవాడే పరమాత్ముడు కాగలడు

One who can grasp the essence of vedas and discern the paramaatma in them, becomes paramaatma himself.

1799
వేదాంతసార గుణ సంవాదితుడగు గురుని వేడి పరిపూర్ణుడవై మోదంబున గుఱి నుంచుము సాధనలో ముక్తికలుగు సత్యము వేమా

వేదాంతసార గుణ సంవాదితుడగు
గురుని వేడి పరిపూర్ణుడవై మోదంబున
గుఱి నుంచుము సాధనలో
ముక్తికలుగు సత్యము వేమా

ఉపనిషత్సారము నెరిగిన గురువును ప్రార్థించి పరిపూర్ణభావముతో అతని యుపదేశమున లక్ష్యముంచి సాధన చేసినచో ముక్తి కలుగును

One can attain salvation by following a guru who has grasped the essence of vedas and serves him with complete dedication.

No comments:

Post a Comment