Saturday, February 8, 2020

Vemana-Vidwat


183
ఆత్మలోని సొమ్ము అంజనమున జూచి యంటి తిరుగునట్టి అతడు యోగి పుంజు గూటనుండి ప్రొద్దు ఎఱి౦గియె కూయు, వి. వే.

ఆత్మలోని సొమ్ము అంజనమున జూచి
యంటి తిరుగునట్టి అతడు యోగి
పుంజు గూటనుండి ప్రొద్దు
ఎఱి౦గియె కూయు, వి. వే.

విద్వాంసుడు తన ధనమగు ఆత్మను విజ్ఞానమను కాటుకతో (అంజనము) చూచుచున్నాడు . కోడిపుంజు తన గూటిలో ఉండియే వేళను గుర్తించి కూయును గదా !

A scholar views his aatma through the eyes of his knowledge. A cock crows early in the morning while still in its enclosure.

184
ఆర్యులయిన ఘనులు కార్య హీనులు కారు శౌర్య ధైర్యములను సంతరించి పూర్ణభావ మరయ పొందుచునుందురు , వి. వే.

ఆర్యులయిన ఘనులు కార్య హీనులు
కారు శౌర్య ధైర్యములను
సంతరించి పూర్ణభావ మరయ పొందుచునుందురు,
వి. వే.

ఉత్తమ విద్వాంసులు వ్యర్థముగా కాలము గడపరు . శౌర్యమును ధైర్యమును కూర్చుకొని తమ జ్ఞానమున సంపూర్ణత్వమును పొందుదురు .

Erudite scholars don't waste their time. By emboldening themselves they try to attain perfect knowledge.

185
ఇంటిలోని జ్యోతి ఎంతయు వెలుగగా పొరుగువారి అగ్గి కరుగరెపుడు తాను దైవమాయె దైవము కొలుచునా ? వి. వే.

ఇంటిలోని జ్యోతి ఎంతయు వెలుగగా
పొరుగువారి అగ్గి కరుగరెపుడు
తాను దైవమాయె దైవము
కొలుచునా ? వి. వే.

మన ఇంటిలో జ్యోతి వెలుగుచుండగా , నిప్పునకై పొరుగు వారి ఇంటికి పోనక్కరలేదు . అట్లే విద్వాంసుడు తనలోనే దేవుడున్నాడనిగ్రహించి , ఇతర దైవములను కొలువడు .

When the oil lamp is shining at home, there is no need to seek kindle form the neighbor. So is a scholar who realizes God is within himself and doesn't worship other Gods.

186
ఇసుక బొగ్గురాయి యి నుమును స్వర్ణ౦బు కసవు పోచవలెను గనుచునుండి పరమపదము గాంచు పరిణామమందున , వి. వే.

ఇసుక బొగ్గురాయి యి నుమును
స్వర్ణ౦బు కసవు పోచవలెను
గనుచునుండి పరమపదము గాంచు
పరిణామమందున , వి. వే.

విద్వా౦సుడు ఇసుక , బొగ్గు , రాయి, ఇనుము, బంగారము అన్నిటిని గడ్డి పోచవలెనే లెక్కచేయక చివరకు ముక్తి పొందగలడు .

A scholar attains salvation by deeming sand, coal, stone, iron and gold as valuable as a blade of grass.

187
ఈది దాటగల్గు ఏసాగరంబయిన సాధువృత్తితోడ సమయమందు పాదుకొనుచు మనసు పరిపూర్ణమొందును , వి. వే.

ఈది దాటగల్గు ఏసాగరంబయిన
సాధువృత్తితోడ సమయమందు
పాదుకొనుచు మనసు పరిపూర్ణమొందును,
వి. వే.

విద్వాంసుడు ధీరుడై ఏ సముద్రమనయిన ఈది దాటగలడు . అనగా తన సాధువృత్తి వలన మనసును నిలిపి పరిపూర్ణత్వము పొందగలడు .

A scholar is like a swimmer who can swim across any body of water. By renunciation he attains perfect knowledge.

188
ఈశ్వరుని దలప నేడుపాళ్ళుగజేసి తనదు మూర్తినెల్ల ధారపోసి నిత్యకర్మములను నిలుచురా నెరయోగి , వి. వే.

ఈశ్వరుని దలప నేడుపాళ్ళుగజేసి
తనదు మూర్తినెల్ల ధారపోసి
నిత్యకర్మములను నిలుచురా
నెరయోగి , వి. వే.

ఎనిమిది శరీరములుగల ఈశ్వరుని ఏడు భాగములు చేసి ఎనిమిదవ భాగముగా చేసికొని తన్ను శివరూపునిగా నెంచి కర్మలను ఆచరించువాడే విజ్ఞుడైన యోగి .

Lord Siva has eight alter-bodies. One who performs karma by dividing Lord Siva's personality into 7 parts and making himself the 8th part, thus considering himself as an incarnation of Lord Siva, is the most learned one.

189
ఉత్తమ శివయోగి ఊహించి మది మించి సత్తమమునుబోరి సరకు గొనడు పొత్తు మఱచి ఉండు పూర్ణ భావంబున , వి. వే.

ఉత్తమ శివయోగి ఊహించి మది
మించి సత్తమమునుబోరి సరకు
గొనడు పొత్తు మఱచి ఉండు
పూర్ణ భావంబున , వి. వే.

ఉత్తముడు ఇతరులను లెక్కింపక తానే స్వయముగా విచారించి తెలిసికొని తమమును విడి నిస్సంగుడు అయి పూర్ణ బ్రహ్మ పదార్థమై ప్రకాశించును .

A perfect being, without taking into account others' opinions, determines facts for himself. Leaving aside laziness and the world, he shines as the creator's (brahma's) embodiment.

190
ఉదరపోషణ కొఱకన్న నుబ్బరాదు మదిని లోగుట్టు విడువకే మర్మమూను సదయ హృదయుండు శివయోగి శాశ్వతుండు ఉపము సాధించి మించెడు నుర్వి వేమ !

ఉదరపోషణ కొఱకన్న నుబ్బరాదు మదిని
లోగుట్టు విడువకే మర్మమూను సదయ
హృదయుండు శివయోగి శాశ్వతుండు ఉపము
సాధించి మించెడు నుర్వి వేమ

పండితుడు మూర్ఖునివలె పొట్ట నింపుకొను వస్తువులకు ఆశపడడు . సహృదయుడై తన మనస్సులోని గుట్టు విడువక మర్మములు గ్రహించి సదయుడై శాశ్వతమగు కైవల్యమునకు ప్రయత్నించును .

A scholar won't desire things that offer livelihood like a foolish person. He strives for salvation with a kind heart and without unraveling his desire by seeking the secrets behind creation.

191
ఉద్దరింపగల్గు ఉత్తముండు కులంబు మధ్యముండు దానిమాట గనడు అధముడైన వాడు అడంగించు నొక్కట , వి. వే.

ఉద్దరింపగల్గు ఉత్తముండు
కులంబు మధ్యముండు దానిమాట
గనడు అధముడైన వాడు అడంగించు
నొక్కట , వి. వే.

ఉత్తముడు కులమును ఉద్దరించును . మధ్యముడు ఉపేక్షించును . అధముడు నశింపజేయును

A good person uplifts his caste. An intermediate person hesitates to do anything for his caste. A low-life destroys his caste.

192
ఉప్పుకప్పురంబు ఒక్క పోలీకనుండు జూడ జూడ రుచుల జాడ వేఱు పురుషులందు పుణ్య పురుషులు వేరయా , వి. వే.

ఉప్పుకప్పురంబు ఒక్క పోలీకనుండు
జూడ జూడ రుచుల జాడ
వేఱు పురుషులందు పుణ్య పురుషులు
వేరయా , వి. వే.

ఉప్పు , కర్పూరము రెండును తెల్లగా ఒక్క రీతినే కనబడును . కాని వాని రుచులు వేర్వేరుగా ఉండును . అట్లే అందరును ఒక్క మాదిరిగానే కానవత్తురు . కాని వారి వారి గుణములనుబట్టి పుణ్యాత్ములు ఎవరో చెడ్డ వారెవరో తెలిసిపోవును .

Salt and camphor look like. The only way to discern them is by taste. Even though all men resemble to be the same, the noble ones outshine others with their superior character.

193
ఊగి యూగి లాగి యున్నది కనగోరు సాగలాగి పట్టు సాక్షిగాను యోగమమర ముక్తినొందును ప్రాజ్ఞు౦డు , వి. వే.

ఊగి యూగి లాగి యున్నది కనగోరు
సాగలాగి పట్టు సాక్షిగాను
యోగమమర ముక్తినొందును
ప్రాజ్ఞు౦డు , వి. వే.

ప్రాజ్ఞుడు ప్రాణాధార చక్రము నూపి యూపి , ఆత్మను చూడగోరును . దానిని సాక్షిగాను యోగమమర ముక్తి నొందును ప్రాజ్ఞు ౦డు

A noble person seeks to realize aatma (soul) by meditating over the chakras (moolaadhara, swaadhishtana, manipoora, anahita, visudha, agna, etc.). Thus attaining salvation.

194
ఊరు విడువకుండు నుత్తమ శివయోగి పోరిచూచు మదిని పూర్ణ సుఖము దారిలోని నక్క తలపెట్ట బోవునే ? వి. వే.

ఊరు విడువకుండు నుత్తమ శివయోగి
పోరిచూచు మదిని పూర్ణ
సుఖము దారిలోని నక్క తలపెట్ట
బోవునే ? వి. వే.

ప్రాజ్ఞుడు ఉన్నచోటు విడువక ఇంద్రియములతో పోరి , వానిని నిగ్రహించి పూర్ణసుఖమును పొందును . మూర్ఖుడు నక్క వంటివాడు . దారిన పోవు నక్కకు తత్త్వచింత అక్కరలేదు .

A true scholar without leaving his abode controls his senses and remains blissful. A foolish person is like a fox that doesn't entertain any thoughts about pure knowledge.

195
ఎండయనక తిరుగు నిరవెఱి౦గిన యోగి నీడ నున్నదాని జాడవలెనె , ఎండ నీడలున్నె యెఱకకు జూడడు , వి. వే.

ఎండయనక తిరుగు నిరవెఱి౦గిన
యోగి నీడ నున్నదాని జాడవలెనె,
ఎండ నీడలున్నె
యెఱకకు జూడడు , వి. వే.

జ్ఞానికి ఇది యెండ, ఇది వాన అను భేదము లేదు . అతడు శ్రమపడి తిరిగి తగిన స్థానమెరిగి , తన నీడవలెనున్న తనలోని తత్త్వము గ్రహించి ముక్తికి ప్రయత్నించును .

A scholar doesn't differentiate between sun shine and rain. He perseveres to understand the knowledge within that follows him like a shadow to attain salvation.

196
ఎందు నెఱుకవానికి ఇహపరంబులు లేవు ప్రాణహాని లేదు ప్రళయమునను ప్రళయకాలమైన పరమాత్మ గలియును , వి. వే.

ఎందు నెఱుకవానికి ఇహపరంబులు
లేవు ప్రాణహాని లేదు ప్రళయమునను
ప్రళయకాలమైన పరమాత్మ
గలియును , వి. వే.

జ్ఞానికి ఇహము, పరము అను భేదము లేదు. ప్రళయము వచ్చినను ప్రాణభయము కలుగదు . తత్త్వమెరిగిన ఆ జ్ఞాని ప్రళయము వచ్చినపుడు పరమాత్మలోనే కలిసిపోవును .

A scholar doesn't view earth and heaven as different. When calamity (pralaya) strikes he is not afraid for his life. Having perfect knowledge he unites with the creator when calamity strikes.

197
ఏ మహాత్మునందు నిజ్జగంబులు పుట్టు ఆ మహాత్ము భజన ననువు మీఱ నియమ నిష్ఠ నెఱపి నెమ్మది గనవలె , వి. వే .

ఏ మహాత్మునందు నిజ్జగంబులు
పుట్టు ఆ మహాత్ము భజన ననువు
మీఱ నియమ నిష్ఠ నెఱపి
నెమ్మది గనవలె , వి. వే .

ఏ మహాత్ముని వలన ఈ లోకములు పుట్టుచున్నవో , ఆ పరముని సేవించి , విద్వాంసుడు నియమ నిష్టలు కలిగి శాంతిని పొంద వలెను .

By worshiping the mahaatma (creator) who created the universe, a scholar with perseverance must attain peace.

198
ఒదిగి యొదిగి గురువు నొప్పుగా నొప్పించి మదిని నిల్పి జాతి మమత విడిచి కదియుచుండు అతడు కలకాల మొకరీతి , వి. వే.

ఒదిగి యొదిగి గురువు నొప్పుగా
నొప్పించి మదిని నిల్పి జాతి
మమత విడిచి కదియుచుండు అతడు
కలకాల మొకరీతి , వి. వే.

విజ్ఞుడు మిక్కిలి విధేయతతో గురువును సేవించి , నచ్చజేసి , మనస్సును స్థిరముగా నిల్పి , జాత్యభిమానమును విడిచి , కలకాలము భేదములేక ఒక్క రీతినే యుండును .

A noble person by serving his guru, controlling his mind, and renouncing caste affiliations, will remain steadfast for ever.

199
ఔచితింగన్న వాడెపుడు అర్హమైన గౌరవమ్మును పదవిని గనుచు నుండు సర్వజనులను పూజింప సంతసమును దండియౌ కీర్తి నార్జించు చుండు , వేమ

ఔచితింగన్న వాడెపుడు అర్హమైన గౌరవమ్మును
పదవిని గనుచు నుండు సర్వజనులను
పూజింప సంతసమును దండియౌ
కీర్తి నార్జించు చుండు , వేమ

ఔచిత్యము నెరిగినవాడు తగిన గౌరవమును , తగిన పదవిని పొందును . అతనిని అందరును పూజింతురు . అతనికి కీర్తియు , సంతోషమును కల్గుచుండును .

One who is qualified will be honored, put on a pedestal and worshiped. He attains fame and happiness.

200
కనగ సొమ్ము లెన్నొ కనకంబది ఒక్కటె పసుల వన్నె లెన్నొ పాలోకటియె పుష్పజాతులెన్నొ పూజ యొక్కటె సుమీ! వి. వే .

కనగ సొమ్ము లెన్నొ కనకంబది
ఒక్కటె పసుల వన్నె లెన్నొ పాలోకటియె
పుష్పజాతులెన్నొ పూజ
యొక్కటె సుమీ! వి. వే .

నగలు వేరైనను బంగార మొక్కటే . పశువుల రంగులు వేరైనను పాలొక్కటే , పూవులెన్ని ఉన్నను పూజ సమానమే . (పండితులు వేరైనను జ్ఞానము ఒక్కటే ).

Even though golden ornaments are many there is only one gold and cows are of different colors, their milk is the same. Thus no matter how many different flowers are offered, pooja ritual is the same. (even though there are many scholars in different fields, knowledge is the same).

201
కప్పురంపు మనసు కాంక్షించు యోగికి జ్ఞాన దీప శిఖయుందా నటించు గానవచ్చు ఆత్మ క్రమామూలమై యుండు , వి. వే.

కప్పురంపు మనసు కాంక్షించు
యోగికి జ్ఞాన దీప శిఖయుందా
నటించు గానవచ్చు ఆత్మ క్రమామూలమై
యుండు , వి. వే.

విద్వాంసుడగు యోగి మనస్సు మేలైన కర్పూరము , కావున జ్ఞానజ్వాల సులభముగా వెలుగును . క్రమముగా అతనికి ఆత్మజ్ఞానము గోచరించును .

A scholarly yogi's mind is like pure camphor that lights up easily. He is fired up easily for knowledge sake. Gradually he discerns knowledge about aatma (soul).

202
కల్ల గారుడు గట్టు కర్మచయంబులు మధ్య గురుడు గట్టు మంత్రచయము ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యంబు, వి. వే.

కల్ల గారుడు గట్టు కర్మచయంబులు
మధ్య గురుడు గట్టు మంత్రచయము
ఉత్తముండు గట్టు యోగ
సామ్రాజ్యంబు, వి. వే.

మూర్ఖ గురువు కర్మ యోగమునే నమ్మును . మధ్యముడు మంత్రములను నమ్మును . ఉత్తమ గురువు యోగమును ఉపదేశించి తరింపజేయును

A foolish guru believes in action(karma) only. An intermediate guru performs rituals by reciting mantras. A superior guru teaches yoga and enriches his disciples.

203
కలుష మానసులకు గాన్పి౦పగారాదు అడుసు లోన భాను డడగినట్లు తేట నీరు పుణ్య దేహ మట్లు౦డురా , వి. వే.

కలుష మానసులకు గాన్పి౦పగారాదు
అడుసు లోన భాను డడగినట్లు
తేట నీరు పుణ్య దేహ
మట్లు౦డురా , వి. వే.

బురదలో సూర్యుని ప్రతిబింబము కనబడనట్లు , పాప బుద్ధులకు జ్ఞానము కానరాదు . తేట నీటిలో ప్రతిబింబమట్లు పుణ్యాత్ములకు జ్ఞానము గోచరించును .

Just as sun's image can't be viewed in muddy water, sinful people cannot receive divine knowledge. A noble person receives knowledge such as the sun's image can be seen in clear water.

204
కస్తూరి నాటు చూడ కాంతి నల్లగ నుండు పరిమళించు దాని పరిమళంబు గురువులైన వారి గుణము లీలాగురా ! వి. వే.

కస్తూరి నాటు చూడ కాంతి నల్లగ
నుండు పరిమళించు దాని
పరిమళంబు గురువులైన వారి
గుణము లీలాగురా ! వి. వే.

రంగు కంటె గుణమే గొప్పది . గురువు రూపవంతుడు కాకున్నను విజ్ఞాన గుణము గొప్పది . కస్తూరి నల్లగా నున్నాను దాని పరిమళము ఎల్లఎడల వ్యాపించునుగదా !

Character is superior to complexion. A guru even though is ugly can have superior knowledge. The kasturi that spreads great fragrance all around is black.

205
కాకి గూటిలోన కోకిల మనినట్లు భ్రమర మగుచు పురుగు బ్రతికినట్లు గురువు లౌదురిలను గుణులిట్లు వర్ణి౦తు , వి. వే.

కాకి గూటిలోన కోకిల మనినట్లు
భ్రమర మగుచు పురుగు బ్రతికినట్లు
గురువు లౌదురిలను గుణులిట్లు
వర్ణి౦తు , వి. వే.

గుణవంతులగు శిష్యులును గురువులు కాగలరు . తుమ్మెద గూటిలోని పురుగు తుమ్మెద కాలేదా ? కోకిల కాకి గూటిలో పెరగలేదా ?

A guru's disciples with character in turn become gurus. Didn't the wing-less creature turn into a bee? Didn't nightingales' chicks grow up in crows' nests?

206
కుండ కుంభ మన్న కొండ పర్వత మన్న నుప్పు లవణ మన్న నొకటె కాదె ? భాషలిట్లు వేఱు పరతత్వ మొక్కటే , వి. వే.

కుండ కుంభ మన్న కొండ పర్వత
మన్న నుప్పు లవణ మన్న నొకటె
కాదె ? భాషలిట్లు వేఱు
పరతత్వ మొక్కటే , వి. వే.

పద్ధతులు వేరైనను తెలిగియదగిన పరతత్వ మొక్కటే . భాషలు వేరైనను అవి తెలుపు వస్తువు వొక్కటే . కుండ-కుంభము ఒక్కటే . కొండ-పర్యవతము ఒక్కటే ; ఉప్పు-లవణము ఒక్కటే.

Even though rituals are different the knowledge is the same. Similarly different languages refer to the same objects with different words.

207
గాలి లేని దీపకళిక చందంబున నలలు సుళ్ళు లేని జలధి భంగి నిశ్చలాత్మ యొన్న నిర్వికారంబున నుండె నేని పండితుండు వేమ !

గాలి లేని దీపకళిక చందంబున నలలు
సుళ్ళు లేని జలధి భంగి నిశ్చలాత్మ
యొన్న నిర్వికారంబున
నుండె నేని పండితుండు వేమ

గాలి సోకని దీపమువలె , అలలు సుడులు లేని సముద్రము వలె నిశ్చలమైన మనస్సు వికారము లేకుండునట్లు ఉండువాడే పండితుడు .

Like an unwavering wick sans wind, an ocean without waves, a mind that is devoid of thoughts, a scholar remains steadfast.

208
చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు గొదువ కాదు విత్తనంబు మఱ్రి వృక్షంబునకు నెంత ? వి. వే.

చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
కొంచెమైన నదియు గొదువ
కాదు విత్తనంబు మఱ్రి వృక్షంబునకు
నెంత ? వి. వే.

శుద్ధమైన మనస్సుతో చేసిన పుణ్యము కొంచెమైనను గొప్పదే . పెద్ద మఱ్రి చెట్టు విత్తు ఎంత చిన్నదో చూడుడు .

Any little charitable act done with pure mind is great. The banyan tree's seed is minuscule to begin with.

209
చినుగు బట్టగాదు చీనాంబరముకాని ముఱికి యొడలు కాదు ముక్తికాని పరమ యోగి మహిమ పరికింప రిట్టులు , వి. వే.

చినుగు బట్టగాదు చీనాంబరముకాని
ముఱికి యొడలు కాదు ముక్తికాని
పరమ యోగి మహిమ పరికింప
రిట్టులు , వి. వే.

యోగము గల విజ్ఞునకు చినుగు బట్టయే చీనంబరము ; మురికి దేహమే ముక్తి మార్గము . అతని మహిమ తెలియక మూఢులాతనిని ఏవగింతురు .

The torn clothes are perfect and the soiled body is an instrument for salvation for a scholar with knowledge of yoga. Foolish people insult him.

210
చెఱకు తోటలోన చెత్త కుప్పుండిన కొంచెమైన దాని గుణము చెడదు ఎఱుక గలుగు చోట నెడ్డె వాడు ఉన్నట్లు , వి. వే.

చెఱకు తోటలోన చెత్త కుప్పుండిన
కొంచెమైన దాని గుణము చెడదు
ఎఱుక గలుగు చోట నెడ్డె
వాడు ఉన్నట్లు , వి. వే.

తీయని చెరుకు తోటలో చెత్తయున్నను దానికి నష్టమేమి ? చెరకు తీపి పోదు . అట్లే జ్ఞానుల గుంపులో మూర్ఖుడున్నను , వారి జ్ఞానమునకు లోపము లేదు .

What is there to lose when a field of sweet sugar cane contains some rubbish? A foolish person in a group of scholars won't affect them.

211
చదువరి మతి కన్న సాధకు మతి మేలు వేదములనులేదు వాదములను ఒడలు శుద్ధి చేసి యొడయని జూచేడు , వి. వే.

చదువరి మతి కన్న సాధకు మతి
మేలు వేదములనులేదు వాదములను
ఒడలు శుద్ధి చేసి యొడయని
జూచేడు , వి. వే.

వేదములు చదివి వాదములు చేయు విద్యావంతునికంటె సాధకుడే మేలు . అతడు శరీరమును శుద్ధిచేసి పరమాత్మను కనుగొనగలడు .

A seeker of knowledge is superior to scholars who after reading vedas indulge in arguments. He has to cleanse his body and pursue the knowledge of the creator.

212
చూపుల చూపై తోచెడి రూపములకు రూప మదియె రూపముగాకే దాపై లోపల వెలుపల గాపగు పరిపూర్ణ మూర్తి గనవలె వేమా !

చూపుల చూపై తోచెడి రూపములకు
రూప మదియె రూపముగాకే దాపై
లోపల వెలుపల గాపగు పరిపూర్ణ
మూర్తి గనవలె వేమా

పరమాత్మ రూపములకు రూపము . చూపులకు చూపు . దగ్గరను లోపల వెలుపల నుండును . అతనిని తెలిసికొనవలెను .

God transcends form and sight. He is near, inside and outside at the same time. One needs to gain knowledge about him.

213
జాతి నీతి వేఱు జన్మం బదొక్కటి అరయు దిండ్లు వేఱె యౌనుగాక దర్శనములు వేఱు దైవమౌ నొక్కటి , వి. వే .

జాతి నీతి వేఱు జన్మం బదొక్కటి
అరయు దిండ్లు వేఱె
యౌనుగాక దర్శనములు వేఱు దైవమౌ
నొక్కటి , వి. వే .

జాతులు , పద్ధతులు , ఆహారములు వేరైనను మానవ జాతి మాత్ర మొక్కటే . అట్లే దైవమును తెలుపు శాస్త్రములు వేరైనను దైవ మొక్కటే .

Castes, rituals and food can be different. But humanity is one. Thus, even if sources of knowledge about God are different, there is only one God.

214
జీవ భేద మెఱి౦గి చెడిపోని వారలు బ్రహ్మ భావ మొ ౦ది పరగు చుంద్రు నీరు ముత్యమైన నీరుగా మాఱునా ? వి. వే.

జీవ భేద మెఱి౦గి చెడిపోని
వారలు బ్రహ్మ భావ మొ ౦ది పరగు
చుంద్రు నీరు ముత్యమైన
నీరుగా మాఱునా ? వి. వే.

నీటి బిందువు ముత్యముగా మారిన పిదప తిరుగ నీరుగా మారదు . అట్లే జీవి బ్రహ్మభావమును పొంది మరల జీవత్వమును పొందడు .

The process of water turning into a pearl is irreversible. Thus a scholar will never be an ordinary person after attainment of creator's knowledge.

215
జీవి యందు భ్రమలు చేరియుండుట కద్దు జీవి భ్రమల యందె చిక్కడెపుడు జీవి జీవియైన జిన్మాత్రమగు బయల్ , వి. వే.

జీవి యందు భ్రమలు చేరియుండుట
కద్దు జీవి భ్రమల యందె చిక్కడెపుడు
జీవి జీవియైన జిన్మాత్రమగు
బయల్ , వి. వే.

జీవులలో భ్రమలున్నను , తెలివిగల జీవి మాత్రము భ్రమలకు లోబడడు . జీవి తానొక జీవరూప ధరుడనని తెలిసికొన్నచో జ్ఞానరూపమగు బ్రహ్మము బయలుపడును .

Ordinary people have delusions. An intelligent person won't succumb to delusions. When a person realizes that his body is not permanent, he will realize the creator who is an embodiment of knowledge.

216
తత్త్వవాదులుండ్రు ధర నేందఱైనను తత్త్వవేది జూడ ధరణి లేడు కలిగెనేని వాడు కానగబడడయా ! వి. వే .

తత్త్వవాదులుండ్రు ధర నేందఱైనను
తత్త్వవేది జూడ ధరణి
లేడు కలిగెనేని వాడు
కానగబడడయా ! వి. వే .

తత్త్వమును గూర్చి వాదించువారేకాని , దాని నెరిగినవారు లేరు. ఒకవేళ ఉన్నను వారు కనబడుట మిక్కిలి కష్టము .

There are people who argue about perfect knowledge without knowing what it is. Even if there is one, it is very hard to find him.

217
తనువులోన వెదకి దైవంబు మొడజేసి ముందు కర్మములను మూలద్రోసి మనసు నిజముజేసి మమతలన్నియు రోయు , వి. వే.

తనువులోన వెదకి దైవంబు మొడజేసి
ముందు కర్మములను మూలద్రోసి
మనసు నిజముజేసి మమతలన్నియు
రోయు , వి. వే.

విద్వాంసుడు తనలోని దైవమును వెదకి తెలిసికొనును . ఆ దైవము నారాధన చేసికొని కర్మములను విడిచి , మనస్సు నిలకడ చేసి, మమతలు విడిచిపెట్టును .

A scholar realizes that God is within after much perseverance. He then worships the God, renounces karma, makes mind unwavering and breaks all physical bonds.

218
తనువులోని ఆత్మ తత్త్వ మెఱు ౦గక వేఱె కలడటంచు వెదుక దెపుడు , భానుడు౦డ దివ్వె పట్టుక వెదకునా ? వి. వే.

తనువులోని ఆత్మ తత్త్వ మెఱు
౦గక వేఱె కలడటంచు వెదుక
దెపుడు , భానుడు౦డ దివ్వె
పట్టుక వెదకునా ? వి. వే.

విద్వాంసుడు తనలోనే దేవుడున్నాడని గ్రహించును . కాన పైచోట వెదుకడు . సూర్యుడుండగా దీపము పట్టుకొని వస్తువులను వెదుకరుగదా !

A scholar realizes that God is within him. He won't seek God outside. One doesn't use a lamp to find an object when the sun is shining.

219
తన్న్నెఱు౦గని వాడు తానె తానై యుండు తన్నెఱు౦గు వాడు తానె తాను తనువు లేనివాడు తానె తానవు సుమ్మి ! వి. వే.

తన్న్నెఱు౦గని వాడు తానె తానై
యుండు తన్నెఱు౦గు వాడు తానె
తాను తనువు లేనివాడు తానె
తానవు సుమ్మి ! వి. వే.

తానెవ్వరో తెలిసికొనలేని పామరుడు తాను తానుగానే యుండును . తన్నెరిగిన విద్వాంసుడు తాను జ్ఞాన స్వరూపుడని తెలిసి కొనును . శరీరములేని ఆత్మ స్వరూపుడగును .

A lay person only thinks within the bounds of his body. A scholar thinks of himself as a manifestation of knowledge. He will become disembodied aatma (soul).

220
తప్పు నొప్పు తెలిసి దైవ సంకీర్తనల్ చేయువారు హరికి సేవకాళి నీతెఱుగక వారి నిందింపబోకుము , వి. వే.

తప్పు నొప్పు తెలిసి దైవ
సంకీర్తనల్ చేయువారు హరికి
సేవకాళి నీతెఱుగక వారి
నిందింపబోకుము , వి. వే.

మంచి చెడ్డలు తెలిసిన విద్వాంసులు దైవమును కీర్తించు హరి సేవకులు . తెలియకుండ వారిని నిందింపకూడదు .

Scholars who know the difference between good and bad are in the servitude of God with praises to him. One should not insult them.

221
తరువ దరువ పుట్టు దరువున దనలంబు తరువ దరువ బుట్టు దధిని వెన్న తలప దలప బుట్టు దనువున తత్త్వంబు , వి. వే.

తరువ దరువ పుట్టు దరువున దనలంబు
తరువ దరువ బుట్టు దధిని
వెన్న తలప దలప బుట్టు దనువున
తత్త్వంబు , వి. వే.

మధింపగా మధింపగా కర్రనుండి నిప్పు , పెరుగునుండి వెన్న పుట్టుచున్నవి . అట్లే మననము చేయగా చేయగా ఆత్మ తత్త్వము తెలియును .

By persevering fire can be started with sticks, and butter can be separated from fermented milk. Similarly by constant meditation one can discern the knowledge about aatma (soul).

222
తాను నేననియెడు తత్త్వ బేధంబును మాని యల వివేక మహిమ దనరీ యూరకుండు జ్ఞాని ఉత్తమోత్తముడగు , వి. వే.

తాను నేననియెడు తత్త్వ బేధంబును
మాని యల వివేక మహిమ
దనరీ యూరకుండు జ్ఞాని ఉత్తమోత్తముడగు,
వి. వే.

"అతడు వేరు నేను వేరు" అను భేదబుద్ధిలేక వివేకము పొంది తనకు తాను సాక్షియై ఊరకుండు జ్ఞానియే ఉత్తమోత్తముడగను .

A scholar who does not consider others as different from him, thus attaining wisdom, becomes noblest among the noble and remains as a self-witness.

223
తిట్టి కొట్టిరేని తిరిగి మాటాడక అట్టు నిట్టు చూచి అదరి పడక తన్నుగానియట్లు తత్త్వజ్ఞుడు ఉండును , వి. వే.

తిట్టి కొట్టిరేని తిరిగి మాటాడక
అట్టు నిట్టు చూచి అదరి
పడక తన్నుగానియట్లు తత్త్వజ్ఞుడు
ఉండును , వి. వే.

తత్త్వజ్ఞుడు తన్ను కొట్టినను తిట్టినను మారుమాటాడడు . అటు నిటు చూచి అదిరిపడక తన్ను కానట్లు ఉండును .

A true scholar won't react even when others curse him and attack him physically.

224
వెఱ్రివాని మిగుల విసిగింపగా రాదు వెఱ్రివాని మాట వినగ రాదు వెఱ్రి కుక్క బట్టి వేటాడగా రాదు , వి. వే .

వెఱ్రివాని మిగుల విసిగింపగా
రాదు వెఱ్రివాని మాట వినగ
రాదు వెఱ్రి కుక్క బట్టి
వేటాడగా రాదు , వి. వే .

మూర్ఖునితో చర్చించి విసిగింపకూడదు . వెఱ్రివాని మాటను లెక్క చేయకూడదు . వెఱ్రి కుక్క సహాయముతో వేటకు పోగూడదు .

There is no point in discussing with a foolish person. One should not care for a foolish person's words. One should not go for hunting with a foolish dog.

225
దేవపూజ చేయు దివ్య భోగములందు తత్త్వ మెఱుగ గలడు దైవసముడు ఏమి లేని నరునకేగతి లేదురా, వి. వే.

దేవపూజ చేయు దివ్య భోగములందు
తత్త్వ మెఱుగ గలడు
దైవసముడు ఏమి లేని నరునకేగతి
లేదురా, వి. వే.

తత్త్వమును తెలిసికొన్నవాడు దేవతలను పూజించి దివ్య సుఖములు పొందును . అతడు దైవసమానుడు . ఏమియు లేనివానికి ఎట్టి గతియును లేదు .

One who has superior knowledge, worships God and attains heaven. He is equivalent to God. One who has no knowledge remains outside the heaven.

226
దేహగుణము లెల్ల దెలిసిన శివయోగి మోహమందు దనివి మోసపోడు ఇంద్రజాలకు౦ డతెందును జిక్కడు , వి. వే.

దేహగుణము లెల్ల దెలిసిన
శివయోగి మోహమందు దనివి మోసపోడు
ఇంద్రజాలకు౦ డతెందును
జిక్కడు , వి. వే.

గారడివాడు ఇతరులను మోహింపజేయునుగాని తాను భ్రాంతిలో చిక్కుకొనడు . అట్లే అనిత్యమగు దేహతత్త్వము ఎరిగిన యోగి మోహములో పడడు .

A magician tricks his audience. But he never falls into a trance. Similarly a yogi will not succumb to desires by realizing that his body is impermanent.

227
ధ్యాని వలెనె యుండు మౌని వలెనె యుండు భోగి వలెనె యుండు రోగి వలెనె సకలమును దెలిసిన సర్వజ్ఞుడై యుండు , వి. వే.

ధ్యాని వలెనె యుండు మౌని వలెనె
యుండు భోగి వలెనె యుండు రోగి
వలెనె సకలమును దెలిసిన సర్వజ్ఞుడై
యుండు , వి. వే.

విద్వాంసుని తెలిసికొనుట కష్టము . అతడు ఒకపుడు ధ్యానివలె , ఒకప్పుడు యోగివలె , ఇంకొకపుడు భోగివలె , మరియొకప్పుడు దేవుడై కాన్పించు

It is difficult to discern a scholar. At times he resembles a devotee, a yogi or a materialistic person. And at other times he appears like God.

228
నందు డగుచు జ్ఞాని యిందు నందనకుండ అన్ని తావులందు హరుని వలెనె తెలియువారికెల్ల దేవుడై కాన్పించు , వి. వే.

నందు డగుచు జ్ఞాని యిందు నందనకుండ
అన్ని తావులందు హరుని
వలెనె తెలియువారికెల్ల దేవుడై
కాన్పించు , వి. వే.

జ్ఞాని ఆనందమయుడై ఇక్కడ అక్కడనక దేవునివలె అన్ని చోట్ల నుండును . తెలిసికొన్నవారికి దేవుడుగా నుండును .

A perfect scholar by being blissful is omnipresent like God. Those who know him think of him as God himself.

229
పగలు రేయి మఱచి భావంబు మఱచియు తాను నేననియెడి తలపు మఱచి యుండు వాని నెంచ ఉత్తమ యోగిరా! వి. వే.

పగలు రేయి మఱచి భావంబు మఱచియు
తాను నేననియెడి తలపు
మఱచి యుండు వాని నెంచ
ఉత్తమ యోగిరా! వి. వే.

ఉత్తమయోగికి ఇది రాత్రి , ఇది పగలను భేదము లేదు . నీవు నేను అను భావముగాని , ఎట్టి ఆలోచనగాని ఉండదు . అట్టి యోగియే విద్వాంసుడు .

A perfect yogi does not differentiate between night and day. And he does not discriminate between self and others. Such a yogi is the true scholar.

230
పరగిన గాలి నభంబున నెఱయంగా భూమి యందు నీరుడు గదా! దారిదాపుల వేఱొక్కటి యిరువుకొను౦దేజ మిట్లె యెల్లెడ వేమా !

పరగిన గాలి నభంబున నెఱయంగా
భూమి యందు నీరుడు గదా! దారిదాపుల
వేఱొక్కటి యిరువుకొను౦దేజ
మిట్లె యెల్లెడ వేమా

గాలి ఆకాశమంతటను వ్యాపించి యుండును . జలము భూమిపై వ్యాపించి ఉండును . అట్లే జ్ఞాని యెల్లయెడల ప్రకాశించుచు ఉండును .

Air fills the space. Water is all over the earth. So is a true scholar who shines all over.

231
పరుస మినుము సోక బంగారమైనట్లు కప్పురంబు జ్యోతి గలిసినట్లు పుష్పమందు దాని పొలనట్లగు ముక్తి , వి. వే.

పరుస మినుము సోక బంగారమైనట్లు
కప్పురంబు జ్యోతి గలిసినట్లు
పుష్పమందు దాని పొలనట్లగు
ముక్తి , వి. వే.

విద్వాంసులు జ్ఞానోపదేశమున కలుగు ముక్తి పరుసవేది వలన ఇనుము బంగారమైనట్లు , కర్పూరము జ్యోతిలో కలసి పోయినట్లు , పూవులో వాసన యున్నట్లు ఉండును .

The salvation attained from the advice of scholars resembles the process of converting iron to gold, transforming camphor to light and experiencing fragrance of a flower.

232
పాలలోన బులుసు లీలతో గలిసిన విఱిగి తునకలగును విరివిగాను తెలియు xxxl లోన దివ్య తత్త్వము తేట , వి. వే.

పాలలోన బులుసు లీలతో గలిసిన
విఱిగి తునకలగును విరివిగాను
తెలియు xxxl లోన దివ్య
తత్త్వము తేట , వి. వే.

చెడ్డ సంపర్కమున చెడుగు , మంచిదాని వల్ల మంచి కల్గును . పాలలో పులుసు పడిన ఆ పాలు విరిగి ముక్కలు ముక్కలుగా అగును . జ్ఞాన సంపర్కమునందు వివేకము కల్గును .

One receives negativity by befriending sinful people and experiences positivity by befriending good people. When tamarind falls into a pot of milk, the milk curdles. Thus association with knowledge provides wisdom.

233
పికము వనములోన బెల్లుగా బలికిన భంగి ప్రాజ్ఞజనులు పలుకు లుండు కాకి కూతబోలె కర్మబద్ధుల కూత, వి. వే.

పికము వనములోన బెల్లుగా బలికిన
భంగి ప్రాజ్ఞజనులు పలుకు
లుండు కాకి కూతబోలె
కర్మబద్ధుల కూత, వి. వే.

విద్వాంసులగు జ్ఞానుల పలుకులు కోకిల ధ్వనివలె ఇంపుగా నుండును . కర్మబద్ధులగు మూఢుల పలుకులు కాకియరపువలె కఠోరముగా ఉండును .

The words of scholars sound like the calls of a nightingale. The karma bound foolish person's words are torturous like crow's calls.

234
పుడమి దిరిగి పడయు పుణ్యంబులెల్లను కలుగు సాధు జనుల గన్న యపుడె వాడిని నీరు నదిని కడు తేటయై యుండు , వి. వే.

పుడమి దిరిగి పడయు పుణ్యంబులెల్లను
కలుగు సాధు జనుల గన్న
యపుడె వాడిని నీరు నదిని
కడు తేటయై యుండు , వి. వే.

పుణ్యక్షేత్రములకు పోయి సంపాదించు పుణ్యము విద్వాంసుని చూచినంతనే కల్గును . నిలువ నీటికంటె నదిలోప్రవహించు నీరు మిగుల తేటగా ఉండును కదా!

The sight of a scholar is equivalent to pilgrimage to holy places. The water flowing in a river is clearer than the stagnant water.

235
పైరు నిడిన వాని ఫల మదే సఫలంబు పైరు నిడని వాడు ఫలము గనునె ? పైరు నిడిన వాడు బహు సౌఖ్య వంతుడౌ , వి. వే.

పైరు నిడిన వాని ఫల మదే సఫలంబు
పైరు నిడని వాడు ఫలము
గనునె ? పైరు నిడిన వాడు బహు
సౌఖ్య వంతుడౌ , వి. వే.

చదివినవానికైనను ప్రయత్నింపనిదే జ్ఞానము లభింపదు . పైరు వేసి, దానిని శ్రద్ధగా చూచినవానికే పంట లభించును . పైరు వేయక ఊరకయున్నవానికి పంట యేది ?

Even the scholars won't attain perfect knowledge without perseverance. A farmer who constantly takes care of his field receives bountiful harvest. The farmer who does not plant the seeds, won't have anything to harvest.

236
ప్రజా లఱు౦గ బ్రతుకు బట్ట భద్రుడు కాడు పై గిరీట ముండు బ్రహ్మ కాడు ఓగు తెలిసి పలుకు యోగీశ్వరుడు వాడు , వి. వే.

ప్రజా లఱు౦గ బ్రతుకు బట్ట భద్రుడు
కాడు పై గిరీట ముండు బ్రహ్మ
కాడు ఓగు తెలిసి పలుకు
యోగీశ్వరుడు వాడు , వి. వే.

విజ్ఞుడగు యోగి చెడ్డ తెలిసికొని ప్రజలకు మంచిని , జ్ఞానమును బోధించును . రాజువలె ప్రజాదరము సంపాదించును . బ్రహ్మ వలె అతడు తేజః కిరీటమును ధరించును .

A scholarly yogi by knowing negativity teaches good and imparts true knowledge to people. He receives the respect of a king from people. Like the creator (brahma) he outshines all.

237
బంటు వలెనె లేవ బండితమ్మన్యుండు సాధు పండితు౦డు శాంతుడగును కుక్క కూయ నేమి గుఱ్రమునకు లెక్క ? వి. వే .

బంటు వలెనె లేవ బండితమ్మన్యుండు
సాధు పండితు౦డు శాంతుడగును
కుక్క కూయ నేమి గుఱ్రమునకు
లెక్క ? వి. వే .

పండితుడనని తలచు మూర్ఖుడు ఎదుట వీరునివలె నిలిచినను , నిజమైన పండితుడు శాంతముగా ఉండును. తన యెదుట కుక్క మొరిగిన గుఱ్రమున కేమి లెక్క ?

A foolish person might question a scholar with great valor. Despite, the scholar remains calm. A horse does not care when a dog barks in front of it.

238
బహుళ కావ్యములను పరికింపగా వచ్చు బహుళ శబ్ద చయము పలుక వచ్చు సహన మొక్కటబ్బ జాల కష్టంబురా , వి. వే.

బహుళ కావ్యములను పరికింపగా
వచ్చు బహుళ శబ్ద చయము పలుక
వచ్చు సహన మొక్కటబ్బ
జాల కష్టంబురా , వి. వే.

ఎన్ని కావ్యములు చదివినను , ఎన్ని శబ్దములను చర్చించినను సహన గుణము అలవడుట కష్టము . అది కలవాడే విద్వాంసుడు .

No matter how many books one reads and however many discussions one has about grammar, it is hard to attain tolerance. The one with tolerance is a true scholar.

239
బాపలన్న దొడ్డ పరువున జూడరు కాని పనులు చేయు గడలు కొనరు కులము లెక్క యేమి?గుణమే ప్రధానము , వి. వే.

బాపలన్న దొడ్డ పరువున జూడరు
కాని పనులు చేయు గడలు
కొనరు కులము లెక్క యేమి?గుణమే
ప్రధానము , వి. వే.

విద్వాంసులు జాతి మాత్రమున బ్రాహ్మణుని గౌరవింపరు . గుణమునే ప్రధానముగా చూచెదరు . చెడ్డ పనులు చేయబూనుకొనరు .

Scholars don't honor a brahmin by birth. They look at his character. They don't initiate bad acts.

240
బ్రాహ్మణునకు సకల భాగ్యంబు లీవచ్చు గౌరవింప వచ్చు గలియ వచ్చు జ్ఞాన మొసగి జనుల కడతేర్చి నట్లయిన , వి. వే.

బ్రాహ్మణునకు సకల భాగ్యంబు
లీవచ్చు గౌరవింప వచ్చు గలియ
వచ్చు జ్ఞాన మొసగి జనుల కడతేర్చి
నట్లయిన , వి. వే.

జనులకు జ్ఞానము నొసగి వారిని తరింపజేసినచో బ్రాహ్మణుని గౌరవించి , ధనముల నీయవచ్చును . అతనితో కలిసి తిరుగవచ్చును .

It is alright to honor a brahmin who imparts knowledge to ordinary people and elevates them. Befriending such a brahmin is also fruitful.

241
మఠము లోన నున్న మమత లన్నియు గోసి ఘటములోన నున్న ఘనుని దెలిసి ఘనత నిల్పుచుండ ఘన తత్త్వ యోగియౌ , వి. వే.

మఠము లోన నున్న మమత లన్నియు
గోసి ఘటములోన నున్న ఘనుని
దెలిసి ఘనత నిల్పుచుండ ఘన
తత్త్వ యోగియౌ , వి. వే.

గొప్ప తత్త్వము నెరిగిన యోగి ఆయా పీఠములవారి మతములను లెక్కింపక , తనలో నున్న పరమాత్మను తెలిసికొని తన గొప్పతనమును నిలుపుకొనును .

The yogi with perfect knowledge visualizes the paramaatma (creator) within himself and does not care about religious heads.

242
మనం వృత్తి లోని మహిమ నెఱు౦గుచు మనసు నందె పూజ మహిమ గనుచు మానకుండ వాడె మర్మజ్ఞుడగు యోగి, వి. వే.

మనం వృత్తి లోని మహిమ నెఱు౦గుచు
మనసు నందె పూజ మహిమ
గనుచు మానకుండ వాడె మర్మజ్ఞుడగు
యోగి, వి. వే.

మర్మమెరిగిన యోగి ఎల్లప్పుడు మననము చేయుచు , మనస్సునందే దేవుని పూజించును . ఎప్పుడు ఈ పద్ధతిని విడువకయే ఉండును .

The yogi knowing the secret of creation, always meditates with that knowledge and worships God within. He steadfastly stays on that track.

243
మనసు గుప్త పఱచి మాన్యుడౌ విబుధుడు తఱచు పలుకకుంట ధర్మ మండ్రు తఱచు మాటచేత తత్త్వంబు చెడిపోవు , వి. వే.

మనసు గుప్త పఱచి మాన్యుడౌ విబుధుడు
తఱచు పలుకకుంట ధర్మ
మండ్రు తఱచు మాటచేత తత్త్వంబు
చెడిపోవు , వి. వే.

ఉత్తముడగు విద్వాంసుడు తన మనస్సును దిట్టపరచుకొని మితభాషియై ఉండును. అధికముగా మాటలాడుట వలన తత్త్వమే చెడును .

A good scholar speaks little (reticent) by disciplining his mind. Talkativeness dilutes the effect of true knowledge.

244
మనసు నిల్పి నట్టి మాన్యులౌ విబుధులే గరిమ మోక్ష పదవి గన్నవారు చెట్టు బెట్టి ఫలము చేకొన కుందురా ? వి. వే.

మనసు నిల్పి నట్టి మాన్యులౌ
విబుధులే గరిమ మోక్ష పదవి
గన్నవారు చెట్టు బెట్టి ఫలము
చేకొన కుందురా ? వి. వే.

మనస్సును స్థిరముగా నుంచగల్గిన విద్వాంసుడే ముక్తిని పొందగల్గును . చెట్టువేసి పెంచినచో తప్పక ఫలము లభించును .

The one who has unwavering mind attains salvation. Just as it is certain to receive fruits from a tree when one plants the seed.

245
మరణ కాలమందు మది నిల్పు సుజ్ఞాని పరము బ్రతిభచేత బట్టు విడక వెనుక కోర్కెలకును విలపించు అజ్ఞాని , వి. వే.

మరణ కాలమందు మది నిల్పు సుజ్ఞాని
పరము బ్రతిభచేత బట్టు
విడక వెనుక కోర్కెలకును విలపించు
అజ్ఞాని , వి. వే.

జ్ఞాని, మరణ సమయమందు వేరు చింతలేక పరమాత్మనే ధ్యానించుచుండును . అజ్ఞాని వేదన సహింపలేక, కోరికలు తీరక దుఃఖించుచుండును

A true scholar thinks of God at the time of death without an unwavering mind. A foolish person with unfulfilled desires suffers when at the throes of death.

246
మర్మవిదుడుగాని మర్మంబు గనలేడు కర్మజీవిగాని కానలేడు నీరు చొరక లోతు నిజములు తెలియునా ? వి. వే.

మర్మవిదుడుగాని మర్మంబు గనలేడు
కర్మజీవిగాని కానలేడు
నీరు చొరక లోతు నిజములు
తెలియునా ? వి. వే.

విద్వాంసుడే విద్వాంసుని జ్ఞానమును తెలిసికొనగలడు . కర్మజీవిని కర్మజీవియే తెలిసికొనగలడు . నీళ్ళ లోతు , నీటిలో దిగినవానికి మాత్రమే తెలియును .

A scholar only can judge another scholar. A person following karm can only recognize another one performing karma. Thus, a person inside a pool of water only knows about the depth of the pool.

247
మాటలాడవచ్చు మనసు దెల్పగలేడు తెలుప వచ్చు దన్ను తెలియలేడు సురియ బట్ట వచ్చు శూరుడు కాలేడు , వి. వే.

మాటలాడవచ్చు మనసు దెల్పగలేడు
తెలుప వచ్చు దన్ను తెలియలేడు
సురియ బట్ట వచ్చు
శూరుడు కాలేడు , వి. వే.

ఇతరులతో మాటలాడుట సులభమే కాని మనస్సును తెలుపుట కష్టము. చెప్పవచ్చును గాని తాను చేయుట కష్టము . కత్తి పట్ట వచ్చును గాని సూరుడగుట కష్టము . విద్వాంసునివలె నటింపవచ్చును గాని, మూర్ఖుడు జ్ఞాని యగుట కష్టము .

It is easy to engage in conversation with others but it is hard to share all of the thoughts. It is easier said than done. It is possible to wield a sword but it is hard to become a great swordsman. Thus a foolish person may masquerade as a scholar without being one truly.

248
ముక్తికానలేని మూర్ఖజనులకెల్ల బట్టబయలు చేసి పరమ పదము దారిజూపు బుధుడు దైవంబు కాడొకో , వి. వే.

ముక్తికానలేని మూర్ఖజనులకెల్ల
బట్టబయలు చేసి పరమ
పదము దారిజూపు బుధుడు దైవంబు
కాడొకో , వి. వే.

విద్వాంసుడు ముక్తి పొందజాలని మూర్ఖునకు బాగుగ బోధించి మోక్ష మార్గమును చూపును. అతడు దైవము వంటివాడు .

A scholar shows the way to salvation to a foolish person who otherwise cannot achieve by himself. Such a person is like God himself.

249
మున్ను నిన్ను గన్న ముఖ్యులెవ్వరొ , వారి సన్నుతించి పిదప సంతతమును జ్ఞాన దాత గొల్వు ఘనతచే విబుధుని , వి. వే.

మున్ను నిన్ను గన్న ముఖ్యులెవ్వరొ,
వారి సన్నుతించి పిదప
సంతతమును జ్ఞాన దాత గొల్వు
ఘనతచే విబుధుని , వి. వే.

ఉదయమునే తొలుత తల్లితండ్రులను పూజించి , పిదప జ్ఞానమును ఇచ్చిన విద్వాంసుని సేవింపవలెను .

One has to serve a scholar who imparts knowledge after worshiping his parents at the beginning of the day.

250
మెలగి జ్ఞానమయుడు మితిమీఱుచుండడు ఉనికి విడడు తాను నుపమునొందు తనువు మఱచి మించి తత్త్వజ్ఞుడుండును , వి. వే.

మెలగి జ్ఞానమయుడు మితిమీఱుచుండడు
ఉనికి విడడు తాను నుపమునొందు
తనువు మఱచి మించి తత్త్వజ్ఞుడుండును,
వి. వే.

జ్ఞానము గల విద్వాంసుడు , హద్దుమీరి నడువక , ఉన్న చోటు విడువక పరముని తెలిసికొనును . తెలిసికొని తన శరీరమునే మరచును .

The perfect scholar does not exceed his bounds and won't leave his abode and realizes the after life. He forgets about his own body during the realization.

251
మొదటను మతమున్ వదలక తుద నెవ్వరి మతమునయిన దూషింపక తా పడిలుడు అయి కోర్కె గోరక ముదమున జరియించు బుధుడు ముఖ్యుడు వేమా!

మొదటను మతమున్ వదలక తుద నెవ్వరి
మతమునయిన దూషింపక తా పడిలుడు
అయి కోర్కె గోరక ముదమున జరియించు
బుధుడు ముఖ్యుడు వేమా

విద్వాంసుడు తన మతమును విడువడు . ఇతర మతములను దూషింపడు . ఎట్టి కోరికలు కోరడు . ఎల్లప్పుడును సంతోషముతోనే ఉండును .

A scholar won't abandon his religion. He won't insult other religions. He won't hold desires and is always blissful.

252
రాజవరుల కెపుడు రణరంగముల చింత పరమ మునుల కెల్ల పరము చింత అల్పనరులకెల్ల అతివలపై చింత , వి. వే.

రాజవరుల కెపుడు రణరంగముల
చింత పరమ మునుల కెల్ల పరము
చింత అల్పనరులకెల్ల
అతివలపై చింత , వి. వే.

రాజులకు యుద్ధములపైనే ఆలోచన . అల్పులకు స్త్రీల గూర్చియే చింత . మునులకు పరమాత్మను గూర్చియే చింత.

Kings always worry about wars. Low lives constantly think about women. Sages always think of creator.

253
లోన పదిలపఱచి లోని వికారముల్ తలచి మెట్టువారు తెలియువారు ఆకసమున వేడ్క నరుగంగ నుందురు , వి. వే.

లోన పదిలపఱచి లోని వికారముల్
తలచి మెట్టువారు తెలియువారు
ఆకసమున వేడ్క నరుగంగ
నుందురు , వి. వే.

మనస్సులోని వికారములను అణచివేసి తత్త్వమును తెలియువారు ఆకాశ మార్గమున పోగలరు (ముక్తి నందుదురనుట ).

The one who controls mind and realizes perfect knowledge can easily attain salvation.

254
వలయునన్న రాదు వద్దన్న పోదది తాను జేసీయున్న ధర్మమనుచు ఉల్లమందు

వలయునన్న రాదు వద్దన్న
పోదది తాను
జేసీయున్న ధర్మమనుచు
ఉల్లమందు
దలప ఉత్తమ విబుధు౦డు , వి. వే.

తాను చేసికొన్న కర్మ తన్ను వెంబడించుచునే ఉండునని , కోరినచో రాదని, కోరినచో పోదని విద్వాంసుడు తెలిసికొనును . దానిని గురించి ఆలోచింపడు .

A scholar realizes that one's own karma remains with him always, cannot be had by desire and cannot be avoided. So he doesn't think about it.

255
వాదమాడడెపుడు వరుస నెవ్వరితోడ జేరరాడు తాను చేటుదేడు జ్ఞాని యగుచు బుధుడు ఘనతబొందగజూచు , వి. వే.

వాదమాడడెపుడు వరుస నెవ్వరితోడ
జేరరాడు తాను చేటుదేడు
జ్ఞాని యగుచు బుధుడు
ఘనతబొందగజూచు , వి. వే.

జ్ఞానియగు విద్వాంసుడు ఎవ్వరితోను వాదింపడు . ఎవరితోను చేరడు . ఎవరికిని కీడు కలిగింపడు . గౌరవమును పొందుటకే చూచును .

A true scholar doesn't argue with anyone. He won't befriend anyone. Nor does he do bad acts towards others. He always strives to receive respect.

256
విద్యలేనివాడు విద్వాంసు చేరువ నుండగానె పండితుండు కాడు కొలని హంసల కడ కొక్కెరలున్నట్లు , వి. వే.

విద్యలేనివాడు విద్వాంసు
చేరువ నుండగానె పండితుండు
కాడు కొలని హంసల కడ కొక్కెరలున్నట్లు,
వి. వే.

విద్వాంసుని దగ్గర విద్యాహీనుడు ఉండినను విద్వాంసుడు కాలేడు . కొలనులో హంసలతో కూడ కొంగలున్నను అవి హంసలు కాలేవు .

An illiterate befriending a scholar won't become a scholar automatically. Just as the cranes sharing a lake with swans won't transform into swans.

257
విద్యలేకయున్న విత్తము లేకున్న మూఢుడైన తుదకు మూగయైన ఇష్టబంధువైన కష్టమే కల్గును , వి. వే.

విద్యలేకయున్న విత్తము
లేకున్న మూఢుడైన తుదకు
మూగయైన ఇష్టబంధువైన కష్టమే
కల్గును , వి. వే.

విద్యగాని ధనముగాని లేకున్నను , మూఢుడైనను , మూగవాడైనను బంధువైయున్నయెడల వాని వల్ల కష్టమే కల్గును .

One who has neither knowledge nor wealth, one who is a fool or a dumb person, even if he is a relative, can only bring hardship.

258
విప్రవరులయందు విబుద్ధులయందును నీతినుంచువాడె నిర్మలుండు భక్తి కలుగువాడె పరమార్థపరుడయా ! వి. వే.

విప్రవరులయందు విబుద్ధులయందును
నీతినుంచువాడె నిర్మలుండు
భక్తి కలుగువాడె పరమార్థపరుడయా!
వి. వే.

బ్రాహ్మణుల యెడల , పండితుల యెడల ఉత్తముడు నీతిగా ప్రవర్తించుచు భక్తిని చూపును . అతడే పరమార్థపరుడు .

A noble person follows a path of rectitude and shows devotion towards brahmins and scholars. He is the true seeker of knowledge.

259
విశ్వమనగనేమొ వివరించి చూచును విశ్వమైదుగతుల వెలయగనును విశ్వము మదిలోన వెదకుచు విబుధు౦డు , వి. వే.

విశ్వమనగనేమొ వివరించి చూచును
విశ్వమైదుగతుల వెలయగనును
విశ్వము మదిలోన వెదకుచు
విబుధు౦డు , వి. వే.

విద్వాంసుడు పంచ భూతాత్మకమగు విశ్వమును గమనించి విశ్వమే దేవుడని గ్రహించును .

A scholar sees the universe as made of 5 elements (water, fire, space, earth and air). He realizes that universe is identical to God.

260
వీరుడైన రావు విబుధుల గుణములు చదువులందరావు సటలరావు జన్మపాకముననె సఫలమవు నరునకు , వి. వే.

వీరుడైన రావు విబుధుల గుణములు
చదువులందరావు సటలరావు
జన్మపాకముననె సఫలమవు
నరునకు , వి. వే.

విద్వాంసులు గుణములు మనుష్యునకు జన్మపరిపాకము వల్లనే కల్గును . కాని వీరుడైనన్త మాత్రాన , విద్య వలన , జడలు పెంచుట వలనను రావు .

The characteristics of a scholar are attained with perfection but not by valor, knowledge and matted hair.

261
వెదకి కానలేరు వేదాంత వేద్యుని ఉత్తముండె కాంచు ఉర్వి మీద కలిగెనే అతనిని కానగలేరయా , వి. వే .

వెదకి కానలేరు వేదాంత వేద్యుని
ఉత్తముండె కాంచు
ఉర్వి మీద కలిగెనే అతనిని
కానగలేరయా , వి. వే .

వేదాంత వేద్యుడగు దేవుని వెదకియు కాంచుట కష్టము . చూచినచో ఉత్తముడే చూడగలడు . అట్టి వాడు అరుదుగా నుండును .

It is very hard to find God who was mentioned in vedanta (upanishad). It is only possible for a noble soul. And such people are rare.

262
వ్యాధి కలిగెనేని వైద్యుని చేతను మందు తినకకాని మానదెందు చెంత దీపమిడక చీకటి పాయునా ? వి. వే.

వ్యాధి కలిగెనేని వైద్యుని
చేతను మందు తినకకాని
మానదెందు చెంత దీపమిడక చీకటి
పాయునా ? వి. వే.

మందు తినినగాని రోగము కుదురదు . దీపము లేకున్న చీకటిని పోగొట్టలేము . జ్ఞానము లేకున్నచో విద్వాంసుడు కాడు .

Only medicine can relieve disease. Just as light can dispel darkness. Without knowledge one is not a scholar.

263
స్వానుభూతియందు శాస్త్రవాసనలందు సంశయములు లేని సాధనముల చెలగు దీపమట్లు చిత్ స్వరూపమునంటు , వి. వే.

స్వానుభూతియందు శాస్త్రవాసనలందు
సంశయములు లేని సాధనముల
చెలగు దీపమట్లు చిత్
స్వరూపమునంటు , వి. వే.

భగవంతుని చిత్ స్వరూపము అనుభవము , శాస్త్ర పరిచయము , సంశయము లేని సాధనముల వల్ల కాంచవచ్చును .

It is possible to see the true form of God with experience, scripture and doubt-free perseverance.

No comments:

Post a Comment