Saturday, February 29, 2020

Veman-Guru-Bhakti-Paddati


1805
ఇహమునందు గురుని కీ దేహమిచ్చిన పరము జూపి గురుతు బట్టి యిచ్చు స్థిరముగాను బుద్ధి చెడనీక చూడరా, వి. వే.

ఇహమునందు గురుని కీ దేహమిచ్చిన
పరము జూపి గురుతు బట్టి
యిచ్చు స్థిరముగాను బుద్ధి
చెడనీక చూడరా, వి. వే.

ఈ లోకమున గురువునకు శుశ్రూష చేయువానికి ఆ గురువు పరము నెరుగు నుపాయమును చూపును. నిశ్చలబుద్ధితో దానిని కనుగొని ఆత్మతత్త్వమున ఆనందింపవచ్చును

When one serves his guru, he will reveal the secret to know brahmam. One can find it with an unwavering mind and enjoy the tattva of aatma.

1806
ఇహమునందు నేమి యిడుమల బడినను పరమ సాధరార్థ పథము గాదు గురుని యుక్తిమీఱి గుర్తించి చూడరా, వి. వే.

ఇహమునందు నేమి యిడుమల బడినను
పరమ సాధరార్థ పథము గాదు
గురుని యుక్తిమీఱి గుర్తించి
చూడరా, వి. వే.

ఈ లోకమున నెన్ని శ్రమలు పడినను , అవి పరమునకు సాధనములు కాలేవు. కావున వానిని విడిచి గురువును సేవించి బ్రహ్మమును సందర్శించుటకు ప్రయత్నింపుము

No matter how much hardship one faces (however much karma) in this life, they are not useful in the nether world. One should serve a guru and try to visualize the brahmam.

1807
ఇహము విడిచి ఫలము లింపుగ గలవని మహిని బల్కు వారికి వారి మాట కల్ల ఇహములోనె పరము నెసగుట కానరా, వి. వే.

ఇహము విడిచి ఫలము లింపుగ గలవని
మహిని బల్కు వారికి వారి
మాట కల్ల ఇహములోనె పరము
నెసగుట కానరా, వి. వే.

పరమునందే ఫలము కలదని, ఈ లోకమును విడువవలెనని చెప్పెడివారి మాటలు నమ్మవద్దు . ఈ లోకమునందే పరమును గూర్చి గట్టిగా ప్రయత్నింపవలెను

One should not believe the words of people who say the fruit of karma is in nether world after leaving this world. One has to try hard to achieve nether world while still alive in this world.

1808
ఈ ఘటమునందు జూచియు నే ఘటమున నింతె యనుచు నెఱుగక మదిలో నే ఘటము మీద వాంఛయు మేఘుంబని పొనగవలయు ముఖ్యము వేమా

ఈ ఘటమునందు జూచియు నే ఘటమున
నింతె యనుచు నెఱుగక మదిలో
నే ఘటము మీద వాంఛయు మేఘుంబని
పొనగవలయు ముఖ్యము వేమా

తన పోలిక ననుసరించి అన్ని శరీరములు ఇట్లే యుండునని నిశ్చయించుకొనవలెను. ఇతరులపై మమత్వము , వాంఛ వ్యర్థమని వాని విడిచి పెట్టవలెను . ఇది చాల ముఖ్యము

By comparing oneself with others one should come to the conclusion that we are all the same. The bondage with others and desires are a waste and should be left alone.

1809
మీదవచ్చు నేరు బాధలేకుండనే యాదిగురువులేక యందరాదు సోది చెప్పుటేల? చొక్కిన మది జూడు, వి. వే.

మీదవచ్చు నేరు బాధలేకుండనే
యాదిగురువులేక యందరాదు
సోది చెప్పుటేల? చొక్కిన
మది జూడు, వి. వే.

శ్రమలేక అపారమైన సముద్రమునైన ఈదవచ్చునే గాని గురూపదేశము లేనిదే బ్రహ్మజ్ఞానము కలగదు. ఈ సోదియేల? జ్ఞానదృష్టితో చూచిన ఇవి తెలియును

One can swim in an ocean effortlessly but cannot attain brahmam without a guru's advice.

1810
ఈషణాదులు నన్నిటి నీడ్చిపట్టి మోసపోకయు మదిలోన గాసిపడక గోసి బయలున జేయుట వాసి యగును ఇట్టులగు నాత డెన్నికకెక్కు వేమ

ఈషణాదులు నన్నిటి నీడ్చిపట్టి
మోసపోకయు మదిలోన గాసిపడక గోసి
బయలున జేయుట వాసి యగును ఇట్టులగు
నాత డెన్నికకెక్కు వేమ

ధన - దార - పుత్రేషణుల నంటియుండి కష్టముల పాలు కావద్దు. విరక్తి చెంది విజ్ఞానమువలన ముక్తి నార్జించుట ముఖ్యము . ఇట్టివాడే పేరుపొందును

One should not land in trouble by craving for wealth, wife and children. It is better to renounce them and attain salvation by gaining knowledge. Such a person will achieve fame.

1811
ఉచితాహారము వల్లనె యుచితంబుగ బుద్ధి స్థిరతనొప్పు , నటులనే ఉచితముగ బోధవల్లనే సుచరితుడై పరముగాంచు సుమ్ముర వేమా

ఉచితాహారము వల్లనె యుచితంబుగ
బుద్ధి స్థిరతనొప్పు , నటులనే
ఉచితముగ బోధవల్లనే సుచరితుడై
పరముగాంచు సుమ్ముర వేమా

సాత్త్వికాహారమును భుజించుటవల్లనే సాత్త్విక గుణమబ్బును . అనుకూలుడగు గురువు నాశ్రయించినయెడల మోక్షము లభించును

When one eats mild food, one will attain sattva guna (being calm and contemplative). One can attain salvation by serving a suitable guru.

1812
ఉందు నందు జ్ఞాని యుగములు చనినను ప్రాణహానిలేదు ప్రళయమునను ప్రాణహానియైన బరమాత్ము గలియురా , వి. వే.

ఉందు నందు జ్ఞాని యుగములు
చనినను ప్రాణహానిలేదు ప్రళయమునను
ప్రాణహానియైన బరమాత్ము
గలియురా , వి. వే.

ఎంతకాలము గడుచుచున్నను చలింపక జ్ఞానియగు వాడుండును . అతనికి హాని లేదు. ప్రాణముపోవు స్థితి వచ్చుచో అతడు పరమాత్మలో ఐక్యము చెందును

A gnaani will stay still for however long it takes. He has nothing to lose. At the time of death he will unify with paramaatma.

1813
ఉడుగక క్రతువుల దపముల నడవుల తీర్థముల దిరిగినంతనె ధరలో నొడయని గను గొన జాలడు కడుధీరత గురుడు చెప్పగలడిది వేమా

ఉడుగక క్రతువుల దపముల నడవుల
తీర్థముల దిరిగినంతనె ధరలో
నొడయని గను గొన జాలడు కడుధీరత
గురుడు చెప్పగలడిది వేమా

విరామము విసుగులేక యాగములు, తపస్సులు చేసినను, అడవులకు పోయినను, తీర్థములు సేవించినను ముక్తి చేకూరదు . గురూపదేశమున పట్టుదలతో ప్రయత్నించిననే ముక్తి లభించును

One cannot attain salvation by doing rituals and penance or going to forests and holy places. It is only possible by trying hard with determination after receiving guidance from a guru.

1814
ఉత్తమ జ్ఞాన నిలయమౌ నుపముచేత భక్తి సాధించి పూర్ణత బడయవచ్చు ముక్తి కిరవగు గురునాజ్ఞ మొదటి దయ్యు నది లభించిన సర్వంబు నబ్బు వేమ

ఉత్తమ జ్ఞాన నిలయమౌ నుపముచేత భక్తి
సాధించి పూర్ణత బడయవచ్చు ముక్తి
కిరవగు గురునాజ్ఞ మొదటి దయ్యు
నది లభించిన సర్వంబు నబ్బు వేమ

పరిపూర్ణముగా భక్తిని సాధించి గురువు చెప్పిన రీతిన నడుచుకొనుచున్న యెడల ముక్తిని పొందును . దానికి జ్ఞానమవసరము

One can attain salvation by following the advice of one's guru with complete devotion. One needs knowledge for this.

1815
ఉదధి లంఘించి దాటిన యుత్తమందు మదినిరామాజ్ఞ మీఱక మాయలడచి హృదయమందున రాముని బదిలపఱచె నౌర! మారుతి తత్త్వజ్ఞుడౌట వేమ

ఉదధి లంఘించి దాటిన యుత్తమందు
మదినిరామాజ్ఞ మీఱక మాయలడచి హృదయమందున
రాముని బదిలపఱచె నౌర!
మారుతి తత్త్వజ్ఞుడౌట వేమ

హనుమంతుడు సముద్రమును దాటి, రామాజ్ఞనతిక్రమింపక తత్త్వజ్ఞుడగుట రామునే గురువుగా భావించి, ధ్యానించి గొప్ప కీర్తిని పొందెను గదా!

Lord Hanuman crossed the sea following Lord Rama's orders. By considering him as his guru, he gained great fame.

1816
ఉన్నదన్న దెఱుకనూహను రెట్టించి మన్ను మిన్ను నడుమ మాఱులేక ఉన్నవాడె పరము గన్నవాడగునురా , వి. వే.

ఉన్నదన్న దెఱుకనూహను రెట్టించి
మన్ను మిన్ను నడుమ
మాఱులేక ఉన్నవాడె పరము గన్నవాడగునురా,
వి. వే.

సర్వమునకు కారకుడైన భగవంతు డొకడు కలడని తలచి హృదయమందలి సహస్రారమున మనోదృష్టిని చేర్చి జ్యోతిర్మండలమును దర్శింపగల ధన్యుడే పరమాత్మను చూడగలడు

After coming to the conclusion that there is someone responsible for all the world around and focusing one's mind's eye on the sahasraara( head chakra) if one is able to visualize jyotir-mandala, then he can attain paramaatma

1817
ఉపముచేతను గురుని దపమున జూడక జపము చేయువాడు చపలుడగును నెపమువడక మించి నేర్పున జూడరా , వి. వే.

ఉపముచేతను గురుని దపమున
జూడక జపము చేయువాడు చపలుడగును
నెపమువడక మించి నేర్పున
జూడరా , వి. వే.

బ్రహ్మస్వరూపమును గురూపదేశానుసారము యుక్తిచే కనుగొనవలెనేగాని జపము, తపము మున్నగువాని వల్ల ప్రయోజనము లేదు. అవివేకముచే తత్త్వమును గనలేదను చెడ్డపేరు తెచ్చుకొనక నేర్పుతో విజ్ఞుడవై ప్రవర్తింపుము

One can attain brahmam by following one's guru's advice with skill rather than perform rituals and penance that are futile. One has to skillfully gain the knowledge rather than be unsuccessful in gaining tattva.

1818
ఉపము గలుగు నాత డూఱకుండగరాదు గురునితోడ బొందు కూడవలయు గురుడు చెప్పు రీతి గుఱి మీఱ రాదయా , వి. వే.

ఉపము గలుగు నాత డూఱకుండగరాదు
గురునితోడ బొందు కూడవలయు
గురుడు చెప్పు రీతి గుఱి
మీఱ రాదయా , వి. వే.

యుక్తికలవాడూరక కాలము గడపక గురుని సేవించుచు , అతడు చెప్పిన రీతిని నడుచుకొని , గురుని యానతి మీరక - కృతార్థుడవగుటకు యత్నింపవలెను

A person with goal will not waste time. He will serve a guru, follow guru's advice, and always implement guru's orders. Thus one succeeds in attaining salvation.

1819
ఉపముతోడ గురుని నొప్పుగా సేవించి జపము హృదిని చేయు జాడ లెఱిగి తపము చేయువాడు తత్త్వజ్ఞుడగు యోగి, వి. వే.

ఉపముతోడ గురుని నొప్పుగా సేవించి
జపము హృదిని చేయు జాడ
లెఱిగి తపము చేయువాడు తత్త్వజ్ఞుడగు
యోగి, వి. వే.

గురువు చెప్పినట్లు యుక్తిగా మననము చేయుచు ధ్యానించువాడు , తపము చేయువాడును తత్త్వజ్ఞుడగును

One who skillfully performs meditation by focusing his mind and does penance as advised by the guru will become a great person knowing tattva.

1820
ఉపము దోపనట్టి యుపవాసముల లేదు తపముచేయనైన దగులరాదు జపములోన గురుని జావదాటకుండరా , వి. వే.

ఉపము దోపనట్టి యుపవాసముల
లేదు తపముచేయనైన దగులరాదు
జపములోన గురుని జావదాటకుండరా,
వి. వే.

శ్రద్ధలేని ఉపవాసములు , తపములు ఎన్ని చేసినను ప్రయోజనము లేదు. గురుని యాజ్ఞ జవదాటకుండ మెలగ వలెను

There is no use in fasting without concentration and penance without focus. One has to conduct oneself by not disregarding one's guru's orders.

1821
ఉర్వి గురుని వేడి యబ్బురపడు వాడు దబ్బ ఱాడబోడు తత్తఱమున నిబ్బరంపు మదిని నిర్విణ్ణతను గాంచు , వి. వే.

ఉర్వి గురుని వేడి యబ్బురపడు
వాడు దబ్బ ఱాడబోడు తత్తఱమున
నిబ్బరంపు మదిని నిర్విణ్ణతను
గాంచు , వి. వే.

సంతుష్టుడై గురుని ప్రార్థించి ధ్యానము చేయువాడు తన్మయుడగును గాని, ఐహికములకు లోనై కల్లలాడువాడు కాడు

One who happily prays to guru and performs meditation will enjoy bliss. He will never yield to the worldly temptations and will never be deceitful.

1822
ఉసురు లేని తిత్తి యిసుమంత నూగిన పంచ లోహములును భస్మమగును పెద్ద లుసురుమన్న పెనుమంట లెగయవా? వి. వే.

ఉసురు లేని తిత్తి యిసుమంత
నూగిన పంచ లోహములును భస్మమగును
పెద్ద లుసురుమన్న
పెనుమంట లెగయవా? వి. వే.

ప్రాణము లేని కొలిమితిత్తి ఊదినంతమాత్రాన అగ్నిలో నుంచిన లోహములు భస్మమగును . బ్రహ్మస్వరూప మెరిగిన పెద్దలు ఉస్సురని బాధపడినచో లోకములే మండిపోవును

When a furnace devoid of life is fed air by the pumping action of a bellows, any metal can be melted. The world will be set afire by the frustration of elders who know the form of brahmam.

1823
ఎక్కడ వెదకి దానయి మ్రొక్కును దా వెందులేక మూలము తానై చక్కగ నిర్భయుండగుచును నిక్కము నిన్నంటియుండు నిజముగ వేమా

ఎక్కడ వెదకి దానయి మ్రొక్కును
దా వెందులేక మూలము తానై చక్కగ
నిర్భయుండగుచును నిక్కము
నిన్నంటియుండు నిజముగ వేమా

ఎక్కడ చూచినను పరమాత్మ నిండియుండి నీ వెనువెంటనే సంచరించుచుండును . కాన, ధీరుడవై తత్త్వమును కనుగొనుటకు బ్రహ్మస్వరూపమును గాంచుటకు యత్నింపుము

Paramaatma is omnipresent and follows one everywhere. Hence one has to be bold and strive to learn tattva and visualize the form of brahmam.

1824
ఎక్కు పెట్టిన రూపము చిక్కువెట్టి నిక్కబట్టుము నిజమని సొక్కిముట్టి చిక్కగను పూర్ణమందుము చిక్కవెందు గురునిబడయ నుపాయంబు కుదురు వేమ

ఎక్కు పెట్టిన రూపము చిక్కువెట్టి
నిక్కబట్టుము నిజమని సొక్కిముట్టి
చిక్కగను పూర్ణమందుము చిక్కవెందు
గురునిబడయ నుపాయంబు కుదురు వేమ

ధ్యానమున నిల్చిన పరరూపమునే చెదరనీయక యుంచి పూర్ణరూపుడవై గురుని సాయమున కేవలుడు నగుటకై యత్నింపుము . గురుని యనుగ్రహమున కార్యసిద్ధి యగును

One has to become a supreme spirit by meditating with utmost focus and not allowing any distractions and taking the help of a guru. A guru's blessing will make one successful in his actions.

1825
ఎట్టి మంత్రమైన నెంగిలి గాకుండ పలుక వశముకాదు బ్రహ్మకైన ఎంగి లెంగిలందు రీ నాటితోడనే , వి. వే.

ఎట్టి మంత్రమైన నెంగిలి
గాకుండ పలుక వశముకాదు బ్రహ్మకైన
ఎంగి లెంగిలందు
రీ నాటితోడనే , వి. వే.

ఎట్టి మంత్రమునైనను నోటితో ఉచ్చరింపవలెను గాన, ఎంగిలిలేని మంత్రము లోకముననే లేదు. అందువలన ఎంగిలి , ఎంగిలి యని నిందింపరాదు

One has to recite any mantra with mouth that is full of saliva (engili). There is no mantra without engili. Hence one should not censure others for engili.

1826
ఎడపక క్రతువులు తపములు నడవుల వాసంబు తీర్థ యాత్రల చేయన్ ఓడయని గనుగొన జాలడు కడువడి గురు నిష్ఠపరుడు కావలె వేమా

ఎడపక క్రతువులు తపములు నడవుల
వాసంబు తీర్థ యాత్రల చేయన్
ఓడయని గనుగొన జాలడు కడువడి గురు
నిష్ఠపరుడు కావలె వేమా

ఎడతెగక యజ్ఞములు, తపములు, అరణ్యవాసములు, తీర్థయాత్రలు చేయుచున్నంత మాత్రమున భగవంతుడు ముక్తినీయడు . ముక్తికి గురువు చెప్పిన నియమము కావలెను

God won't grant salvation even if one performs rituals and penance, goes to forests and pilgrimage. For salvation one has to lead a principled life under a guru.

1827
ఏ పాపమైన జక్కగ బాపును గురు మర్మ ఘటిక బహుజన్మతతిన్ జూపట్టి యడగ ద్రొక్కుచు కాపయి మదిలోన వెలుగు ఘనముగ వేమా

ఏ పాపమైన జక్కగ బాపును గురు
మర్మ ఘటిక బహుజన్మతతిన్ జూపట్టి
యడగ ద్రొక్కుచు కాపయి
మదిలోన వెలుగు ఘనముగ వేమా

గురుభక్తి యెట్టి పాపములనైనను పోగొట్టి జన్మ దుఃఖములను తొలగించి పరతత్త్వమును సాక్షాత్కరింపజేయును . అంతేగాక తోడునీడయై హృదయమున ఎప్పుడును వెలుగుచుండును

Devotion to guru will cleanse all sins, remove all sorrows and help acquire the spiritual knowledge. It will protect one at all times by glowing in the heart.

1828
కపటముడిగి గురునికై దండ యొనరించి యపముతోడ భక్తి నునికిజేసి తప మెఱి౦గినంత ధన్యత పొడమును, వి. వే.

కపటముడిగి గురునికై దండ యొనరించి
యపముతోడ భక్తి నునికిజేసి
తప మెఱి౦గినంత
ధన్యత పొడమును, వి. వే.

సాధకుడు కపటమును విడిచి గురుని సహాయమును పొంది అతని సేవచేసి తపస్సు యొక్క తత్త్వమును యెరుగ గలగినచో ధన్యతను పొందవచ్చును

A seeker should give up deceit, take the help of a guru, serve the guru well and learn the tattva behind penance to attain salvation.

1829
కారు కారు గురులు కా గుణితము చెప్ప శాస్త్ర పాఠములను చదివి చెప్ప ముక్తిదారి చూపు మూలము గురుడురా, వి. వే.

కారు కారు గురులు కా గుణితము
చెప్ప శాస్త్ర పాఠములను చదివి
చెప్ప ముక్తిదారి చూపు
మూలము గురుడురా, వి. వే.

అక్షరములు నేర్పి, కావ్యశాస్త్రములను బోధించినంత మాత్రాన గురువు కాదు. ముక్తి దారిని తెలిపినవాడే గురువు.

By merely teaching language and scripture one won't become a guru. The one who shows the path to salvation is the real guru.

1830
గుట్టు గురుభక్తితో ముట్టి మిట్టిపడక జెట్టివలె బోరి లోమర్మ మిట్టిదనుచు నట్టుపడ జూచి మించుట నాణెమరయ పిట్టకబురులచే నేమి గిట్టు వేమ?

గుట్టు గురుభక్తితో ముట్టి మిట్టిపడక
జెట్టివలె బోరి లోమర్మ మిట్టిదనుచు
నట్టుపడ జూచి మించుట నాణెమరయ
పిట్టకబురులచే నేమి గిట్టు వేమ

గురుభక్తిలోని గుట్టు తెలిసికొని గర్వింపక జెట్టివలె మాయతో పోరి కనిపెట్టి మోక్షమునకు ప్రయత్నింపవలెనే గాని, పిట్టకబుర్లు చెప్పుటవలన లాభములేదు

One has to learn the secret behind the devotion to guru and without pride fight with maaya (illusion) and try to attain salvation. There is no use a guru telling cock-and-bull stories.

1831
గురుచరణము బట్ట గుక్కల కఱచునా ? గురుచరణము విడువ గుక్క కఱచు గుక్కకున్న గుణము నరునకు లేదురా , వి. వే.

గురుచరణము బట్ట గుక్కల కఱచునా?
గురుచరణము విడువ గుక్క
కఱచు గుక్కకున్న గుణము
నరునకు లేదురా , వి. వే.

గురుని పాదములు పట్టియున్నంతకాలము మనలను మాయ చేరజాలదు . పాదములను విడిచిన అది ఆక్రమించును . గురువుకంటె మాయయే ఎక్కువ బలము కలది

For as long as one holds the feet of a guru (serves him), he will not succumb to maaya (illusion). Once one leaves guru's feet, maaya will take his place. Maaya is more powerful than guru.

1832
గుఱిగానలేక మర్త్యలు పరిచితశాస్త్రముల వాద పద్ధతి గనర గ్గురి గురువు జోతి నిచ్చును దరి తెలిసిన వాడె యోగి ధరలో వేమా

గుఱిగానలేక మర్త్యలు పరిచితశాస్త్రముల
వాద పద్ధతి గనర గ్గురి
గురువు జోతి నిచ్చును దరి
తెలిసిన వాడె యోగి ధరలో వేమా

మానవుడు లక్ష్యసిద్ధిని పొందలేక ఎంతకాలము శాస్త్రచర్చ చేసినను బ్రహ్మమును పొందలేడు . గురుని సేవించినచో , అతడు జ్ఞానజ్యోతిని చూపి కృతార్థుని చేయగలడు

One without reaching his goal, no matter how many debates he carries out about scripture, he cannot attain brahmam by himself. Once he starts serving a guru, the guru will show the light of knowledge and one will be able to reach his goal.

1833
గురుడగు నాత్ముడు శిష్యుడు పరగంగా జీవుడనుచు బరికించుచు నీ గురు శిష్య పరమయోగం బురుతరముగ గూర్చువాడు యోగిర వేమా

గురుడగు నాత్ముడు శిష్యుడు పరగంగా
జీవుడనుచు బరికించుచు
నీ గురు శిష్య పరమయోగం బురుతరముగ
గూర్చువాడు యోగిర వేమా

గురువు పరమాత్మ , శిష్యుడు జీవాత్మ అను మూలతత్త్వము తెలిసికొని , జీవాత్మను పరమాత్మలో చేర్చుటకు యత్నించిన ధన్యుడే యోగియగును

A guru is like paramaatma and a disciple is like jeeva-aatma. Knowing this simple principle one who strives to merge jiva-aatma with paramaatma will become a great yogi.

1834
గురుడనంగ ధేనువై తగు వరశిష్యుడు వత్సమగుచు వర్తింపంగా దరికలిగినప్పు డొసగును నిరుపమ లక్ష్యామృతంబు నిజముగ వేమా

గురుడనంగ ధేనువై తగు వరశిష్యుడు
వత్సమగుచు వర్తింపంగా దరికలిగినప్పు
డొసగును నిరుపమ
లక్ష్యామృతంబు నిజముగ వేమా

గురువు గోవు, శిష్యుడు దూడ; గోవు తగిన సమయమున పాలనిచ్చునట్లు గురువు జ్ఞానామృతమును అనుగ్రహించును

Guru is like a cow and the disciple is like its calf. Like a cow that produces milk periodically, a guru will teach his disciple over a period of time.

1835
గురుడనంగా బరమాత్ముడు పరగంగా శిష్యు డనగ బటు జీవుడగున్ గురు శిష్య జీవ సంపద గురుతరముగ గూర్చు నతడె గురువగు వేమా

గురుడనంగా బరమాత్ముడు పరగంగా
శిష్యు డనగ బటు జీవుడగున్ గురు
శిష్య జీవ సంపద గురుతరముగ
గూర్చు నతడె గురువగు వేమా

గురువు పరమాత్మ . శిష్యుడు జీవాత్మ . గురుశిష్య సంబంధమే జీవేశ్వరైక్యము . ఇదియే మోక్షము. ఇది గురుని యనుగ్రహమువలన గాని లభింపదు

A guru is paramaatma and a disciple is jeeva-aatma. The guru-disciple relationship is the unification of jeeva with Iswara. That is salvation. One can't understand this without guru's teaching.

1836
గురుడనగా మొదలంతకు గురు శిష్యుల నంగనెల్ల కొమ్మలు కానం గురువును గానక చూతురు దరలోపల మనుజులెల్ల దలపగ వేమా

గురుడనగా మొదలంతకు గురు శిష్యుల
నంగనెల్ల కొమ్మలు కానం
గురువును గానక చూతురు దరలోపల
మనుజులెల్ల దలపగ వేమా

గురువు మొదలు, శిష్యుడు కొమ్మలు, చెట్టు మొదలు లేనిదే శాఖలుండవు . కావున సాధకుడు గురువు నాశ్రయించిన ముక్తిని పొందగలడు

A guru is like the trunk of the tree and a disciple is like its branches. The branches cannot survive without the trunk. So a seeker can attain salvation if he surrenders to a guru.

1837
గురువు శిష్యు డనగ కొనలెట్టు మొదలెట్టు గురువు శిష్యు డనెడి గుఱుతు లెట్టు? గురున కుండదగిన పరువు లేకుండిన, వి. వే.

గురువు శిష్యు డనగ కొనలెట్టు
మొదలెట్టు గురువు శిష్యు డనెడి
గుఱుతు లెట్టు? గురున కుండదగిన
పరువు లేకుండిన, వి. వే.

గురుశిష్యుల సంబంధమెట్టిది? పరస్పర భేదమెట్టిది ? అను నంశము గురువు తా నుండవలసిన గౌరవస్థానమున ఉండినగాని తేటపడదు

What is guru-disciple relationship? What is the difference between guru-disciple? The answers to these questions will be available when a guru takes up the honorable status he was given.

1838
గుఱుతు గనుచు జెప్పు గురు నెవ్వడును లేడు గుఱుతెఱ౦గు శిష్యు నరుడు లేడు గురుడు శిష్యుడనుట గ్రుడ్డెద్దు చేనురా , వి. వే.

గుఱుతు గనుచు జెప్పు గురు నెవ్వడును
లేడు గుఱుతెఱ౦గు శిష్యు నరుడు
లేడు గురుడు శిష్యుడనుట గ్రుడ్డెద్దు
చేనురా , వి. వే.

శిష్యునకు జ్ఞానోపదేశము చేయు గురువుగాని , గురుని యానతి ననుసరించి ప్రవర్తించు శిష్యుడుగాని కానరాడు . వీరి పరస్పర సంబంధము దెబ్బతిని , గ్రుడ్డియెద్దు చేనిలో పడిన రీతి నున్నది

It is hard to find a guru who provides the essential knowledge to his disciple. Nor is it easy to find a disciple who follows the guru wholeheartedly. Their mutual relationship has deprecated like a blind ox entering a farm field.

1839
గురుని గూడు చేసి గుణము వర్తిలజేసి సర వికర్మ సమితి జమురు చేసి మూల నొక్క జ్యోతి ముట్టించి చూడరా , వి. వే.

గురుని గూడు చేసి గుణము వర్తిలజేసి
సర వికర్మ సమితి జమురు
చేసి మూల నొక్క జ్యోతి
ముట్టించి చూడరా , వి. వే.

గురువును గూడుగాను , గుణమును వత్తిగాను చేసి , తాను చేయు కర్మలను వత్తిగా చేసి సాధన చేసినచో గూటి వలన దివ్యజ్యోతి వెలువడి అజ్ఞానమును చీకటిని పోగొట్టును

If one considers a guru as the receptacle, guna (character) as the wick, karma as oil, and tries hard, the receptacle will spread great light all over and drive away ignorance.

1840
గుఱుల విధులవలన గులమెల్ల చెడిపోయె స్త్రీల నడతవలన సిగ్గువోయె నేహ్యపల్వలమున నిలయెల్ల జెడెనయా , వి. వే.

గుఱుల విధులవలన గులమెల్ల చెడిపోయె
స్త్రీల నడతవలన సిగ్గువోయె
నేహ్యపల్వలమున నిలయెల్ల
జెడెనయా , వి. వే.

గురుల విధులవల్ల కులము, స్త్రీలవలన సిగ్గు , అసహ్యమగు బురదగుంటలవల్ల భూమియు చెడినవి

Because of the bad ways of guru the caste has become unpopular. Due to women with bad character there is no shame. Just as a land's beauty is spoiled by cesspools.

1841
గురుని తోడ బొందు కూడియుండినవాడు చేరి బ్రహ్మమంటి చెలగియుండు మఱుగు తెలిసెనేని మర్మంబులేదయా , వి. వే.

గురుని తోడ బొందు కూడియుండినవాడు
చేరి బ్రహ్మమంటి చెలగియుండు
మఱుగు తెలిసెనేని
మర్మంబులేదయా , వి. వే.

గురునితో ఐక్యము చెందియుండుటే మోక్షము . ఈ మర్మము నెరిగినవాడే బ్రహ్మము. గురుబోధవల్ల మర్మము తెలిసెనా కష్టముండదు

Salvation is merging with guru. The one who knows this secret is brahmam. If this secret is learnt from the teachings of a guru, then there is no more hardship.

1842
గురుని నిందచేసి గుట్టెఱుగనివాడు యముని బాధనొందు గ్రమముగాను తేనెలోని యీగ తెఱగున నగునయా , వి. వే.

గురుని నిందచేసి గుట్టెఱుగనివాడు
యముని బాధనొందు గ్రమముగాను
తేనెలోని యీగ తెఱగున
నగునయా , వి. వే.

గురువును నిందించినవాడు తేనెలోపడ్డ ఈగవలె బాధ పడవలసినదే . వానికి విద్యామర్మములు తెలియవు

One who curses his guru is like a fly trapped in a honey pot. He will never learn the secrets of learning.

1843
గురుని పరమ గురుని గుఱుతుగా దెలియక గురువటంచు దలప గ్రుడ్డిరీతి గురునకు గురువైన గురుడు ప్రాణేశు౦డు, వి. వే.

గురుని పరమ గురుని గుఱుతుగా
దెలియక గురువటంచు దలప గ్రుడ్డిరీతి
గురునకు గురువైన గురుడు
ప్రాణేశు౦డు, వి. వే.

వివేకములేని జనుడు గురువెట్టివాడో , పరమగురు వెట్టివాడో తెలిసికొనలేక , కనబడిన వానినే గురువుగా తలచును. దానివల్ల మోసమే కలుగును. జ్ఞానమిచ్చువాడే గురువు. మోక్షము ననుగ్రహించు భగవంతుడే పరమగురువు

A foolish person does not know the difference between parama-guru and ordinary guru. He treats everyone as a guru. Because of that he will be always cheated. The real guru gives knowledge. God who grants salvation is the parama-guru.

1844
గురుని శిష్యుని యతి గురుతుగా మదిలోన కానలేడు భ్రాంతి మానలేడు గురుని శిష్యుడెంచు గుఱియదె యగునురా , వి. వే.

గురుని శిష్యుని యతి గురుతుగా
మదిలోన కానలేడు భ్రాంతి మానలేడు
గురుని శిష్యుడెంచు
గుఱియదె యగునురా , వి. వే.

అజ్ఞానముగల శిష్యుడు గురుశిష్యుల యంతరము గ్రహింపలేక చెడిపోవును . ఇందువల్లనే శిష్యుడు గురువు నాక్షేపించుట సంభవించును

An ignorant disciple goes bad without knowing the guru-disciple bonding. Because of that a disciple embarrasses his guru

1845
గురు పరంపర నీ విద్యగూడ మెఱింగి పరమ పరిపూర్ణ మందుట పరవశతర నిరుపమానంద సుఖకేళి నెఱపవలెను పరమశివుండన భాసిల్లవలెను వేమ

గురు పరంపర నీ విద్యగూడ మెఱింగి
పరమ పరిపూర్ణ మందుట పరవశతర
నిరుపమానంద సుఖకేళి నెఱపవలెను
పరమశివుండన భాసిల్లవలెను వేమ

గురుపరంపరవలన ఆత్మవిద్యలోని రహస్యమును తెలిసికొని పరిపూర్ణతను పొంది ఆనందమున పరవశత్వము పొంది పరమాత్మగా ప్రకాశింపవలెను

One has to learn the secrets about aatma from the succession of gurus, become well-rounded in knowledge, and enjoy the resulting bliss and shine as paramaatma

1846
గురువు తానయ్యును గుణమించుకయి లేక చందమామ కిచ్చె శాపమతడు గురుడు కోపమూన గూడ దెప్పటికైన , వి. వే.

గురువు తానయ్యును గుణమించుకయి
లేక చందమామ కిచ్చె
శాపమతడు గురుడు కోపమూన గూడ
దెప్పటికైన , వి. వే.

తాను గురువైనను ఓర్పునకు బదులు కోపముచెంది బృహస్పతి చంద్రుని శపించెను . గురువైనవాని కెన్నిటికిని కోపము తగదు

The great guru Bruhaspati cursed the moon god out of anger and losing his patience. A guru should never be angry.

1847
గురు ముఖంబున నెఱిగిన గుర్తు విడక నిస్తరంగ సముద్రంబు నియతి మనసు నిలిపి యపరోక్ష మొందుట నిర్గుణంబు దాన పరిపూర్ణ సంతోషమౌను వేమ

గురు ముఖంబున నెఱిగిన గుర్తు విడక
నిస్తరంగ సముద్రంబు నియతి మనసు
నిలిపి యపరోక్ష మొందుట నిర్గుణంబు
దాన పరిపూర్ణ సంతోషమౌను వేమ

గురువువల్ల విన్న విషయమును మరువక మనస్సును నిశ్చలసమాధిలో నిల్పి మోక్షము పొందుటే నిర్గుణోపాశనకు ఫలము. దానివలన శాశ్వతానందము లభించున

The fruit of nirguna (devoid of sattva-calm, rajas-action, tamas-indolence) meditation is the service to guru by way of not forgetting anything he taught, remaining in an unwavering meditation and attaining salvation. One receives permanent bliss as a result.

1848
గురువు కలుగు నాత్మ గుఱు తెఱింగెదమని కాలమెల్ల రిత్త గడపిరయ్య గురువు దొరకునపుడు కూలు నీ దేహంబు , వి. వే.

గురువు కలుగు నాత్మ గుఱు తెఱింగెదమని
కాలమెల్ల రిత్త గడపిరయ్య
గురువు దొరకునపుడు
కూలు నీ దేహంబు , వి. వే.

వంచకులు కొందరు గురువులువలె నటించి బోధ చేయుచు యుందురు . వారి వల్ల కాలము వ్యర్థమే యగును. తగిన గురువు లభించినగాని సంసార బంధము నశింపదు

Deceitful people, claiming themselves to be guru, spread their teachings around. Time is wasted because of them. When one finds a suitable guru the bondage with the world will be destroyed.

1849
గురువు చిల్ల గింజ కుంభ మీ దేహంబు ఆత్మ కలుషపంక మడుగు బట్టు తేఱి నిలిచెనేని దివ్యామృతమ్మురా , వి. వే.

గురువు చిల్ల గింజ కుంభ మీ
దేహంబు ఆత్మ కలుషపంక మడుగు
బట్టు తేఱి నిలిచెనేని దివ్యామృతమ్మురా,
వి. వే.

మన దేహము కుండ , సంసారబంధముతోడి ఆత్మ బురద నీరు. గురువనెడి చిల్లగింజవలన మురికి అడుగంటి అమృతమువంటి జ్ఞానము తేరును

One's body is the pot. The bondage is the clay mixed with water. The seed of guru will separate the dirty water from knowledge that is like amrita (elixir of life).

1850
గురువు తానయినను హరుని తా జూపును బ్రహ్మలోక మితడు పాఱజూపు శిష్యు నరసి తట్టి చీకటి బాపురా , వి. వే.

గురువు తానయినను హరుని తా
జూపును బ్రహ్మలోక మితడు పాఱజూపు
శిష్యు నరసి తట్టి
చీకటి బాపురా , వి. వే.

నిజమైన గురువు దేవుని చూపి బ్రహ్మలోకమును చూపగలడు . శిష్యుని హెచ్చరించి , బుజ్జగించి , అతని అజ్ఞానమును నశింపజేయును

A real guru will show the god and the world of brahmam. He will caution and cajole a disciple and destroy his ignorance.

1851
గురువునకును పుచ్చకూరైన నీయరు అరయ వేశ్యకిత్తు రర్థమెల్ల గురుడు వేశ్యకన్న గుణహీనుడగునొకో , వి. వే.

గురువునకును పుచ్చకూరైన నీయరు
అరయ వేశ్యకిత్తు రర్థమెల్ల
గురుడు వేశ్యకన్న గుణహీనుడగునొకో,
వి. వే.

జనులు గురువునకు పుచ్చకూరైన ఈయరుగాని , వేశ్యకు ఎంత ధనమైన నిత్తురు . గురువు వేశ్యకంటె అంత తక్కువా ?

People won't give a guru even a bitter melon but spread their wealth on prostitutes.

1852
గురువులేక విద్య గుఱుతుగా దొరకదు నృపతి లేక భూమి నియతిగాదు గురువు విద్యలేక గురుతర ద్విజుడౌనె , వి. వే.

గురువులేక విద్య గుఱుతుగా దొరకదు
నృపతి లేక భూమి నియతిగాదు
గురువు విద్యలేక గురుతర
ద్విజుడౌనె , వి. వే.

గురువు లేనిచో విద్య లభింపదు . రాజు లేనిచో భూపాలనము జరుగదు . గురువు, విద్య- ఈ రెండును లేనిచో బ్రాహ్మణుడు కాడు

Without guru there is no knowledge. Without a king there is no law and order. A person without a guru and knowledge, is not a brahmin.

1853
గురుని శిక్షలేక గుఱుతెట్లు కల్గునో అజునకైన వాని యబ్బకైన తాళపుజెవిలేక తలుపెట్టు లూడునో , వి. వే.

గురుని శిక్షలేక గుఱుతెట్లు
కల్గునో అజునకైన వాని
యబ్బకైన తాళపుజెవిలేక తలుపెట్టు
లూడునో , వి. వే.

గురువు లేక విద్యను పొందుట బ్రహ్మకు, వాని యబ్బకును కూడ సాధ్యము కాదు. తాళపుచెవిలేక తలుపు తీయరాదు కదా!

Even for Lord Brahma it is impossible to gain knowledge without a guru. One can't open a locked door without a proper key.

1854
గురువు వచ్చుచున్న గూర్చుండి లేవని తుంటరులకు నెట్లు దొరకు ముక్తి? మగని లెక్కగొనని ముగుదకా గతిపట్టు , వి. వే.

గురువు వచ్చుచున్న గూర్చుండి
లేవని తుంటరులకు నెట్లు దొరకు
ముక్తి? మగని లెక్కగొనని
ముగుదకా గతిపట్టు , వి. వే.

తుంటరి విద్యార్థులు గురువు వచ్చినచో లేచి నిలువరు. అట్టివారికి విద్య అబ్బదు. దుర్గతియే కల్గును . మగనిని లెక్కింపని స్త్రీకిని దుర్గతియే కలుగును

Wicked students don't stand up when guru arrives. Such disciples can never acquire knowledge. Their fate is sealed in bad karma. Similarly a woman who disregards her husband will go bad.

1855
గురువు చెప్పిన యుక్తులు కూడి మిగిలి మఱపు లేదని నిజమాడి మహితుడగుచు నెఱపుచుండును శివయోగి నేర్పుతోడ పరము సాధింప నతని కేర్పడును వేమ

గురువు చెప్పిన యుక్తులు కూడి మిగిలి
మఱపు లేదని నిజమాడి మహితుడగుచు
నెఱపుచుండును శివయోగి నేర్పుతోడ
పరము సాధింప నతని కేర్పడును వేమ

గురువు చెప్పిన బోధనలను మరచిపోక, అతడు చెప్పిన పద్దతుల నాచరించుచు , వానిని గురువునకు వివరించుచు నున్నవాడే ఉత్తమయోగి. వానికే పరము పొంద సాధ్యమగును

One who never forgets his guru's teachings, performs the activities the guru had taught, and gives feedback to the guru, is a superior yogi. He is only capable of attaining salvation.

1856
ఘటములోననున్న గతులన్నియును ద్రె౦చి దిటవుచేసి మనసు తేటపఱచి ఘటము నిల్పువాడు ఘనతత్త్వ యోగిరా , వి. వే.

ఘటములోననున్న గతులన్నియును
ద్రె౦చి దిటవుచేసి మనసు తేటపఱచి
ఘటము నిల్పువాడు ఘనతత్త్వ
యోగిరా , వి. వే.

శరీరములోని గతులను పోగొట్టి మనస్సును గట్టిపరచి శరీరమున పరముని నిల్పుకొన్నవాడే తత్త్వవేత్త

A person of superior knowledge about tattva, is one who conquers his body, strengthens his mind and merges his body with the nether world.

1857
చపలచిత్తవృత్తి సాధించి నిలిపిన త్రిపుటిబిలముచేరు బెంపుకలగి జపములోని జపము జయాశీలతను మించు, వి. వే.

చపలచిత్తవృత్తి సాధించి నిలిపిన
త్రిపుటిబిలముచేరు
బెంపుకలగి జపములోని జపము జయాశీలతను
మించు, వి. వే.

చంచలమైన మనోవ్యాపారమును కట్టివేసి మనస్సును త్రిపుటియందు చేర్చి బ్రహ్మమును ధ్యానించుచుండవలెను . అట్లు చేసినయెడల తన జపము సఫలమగును

One has to put an end to fleeting temptations of the mind and concentrate on triputi and meditate on brahmam. [A triputi is a 3-valent group of words like:

  1. జ్ఞాత (knowledge seeker), జ్ఞానము (knowledge), జ్ఞేయము (the object whose knowledge is sought)
  2. ద్రష్ట (seer), దర్శనము (seen), దృశ్యము (sight)
  3. కర్త (actor), కారణము (reason), కార్యము (activity)
]

1858
చర్చమీఱిన జ్ఞానంబు సంతరించి మూర్ఛచెందినయట్లున్న ముక్తికలుగు గూర్చి మెచ్చడె గుఱిదాటి కోవిదు౦డు తీర్చు గురుదరిచేరగ దివిరి వేమ

చర్చమీఱిన జ్ఞానంబు సంతరించి మూర్ఛచెందినయట్లున్న
ముక్తికలుగు గూర్చి
మెచ్చడె గుఱిదాటి కోవిదు౦డు
తీర్చు గురుదరిచేరగ దివిరి వేమ

జ్ఞానమును సంపాదించి మూర్ఛపొందిన రీతిని తన్మయతను పొంది, లక్ష్యమును దాటి బ్రహ్మమును చేరుటకై పండితుడు యత్నించును . గురువు భ్రాంతిని తొలగించును

Like one swoons after becoming knowledgeable, a learned person will be blissful and tries to visualize brahmam after attaining his goal. A guru will dispel delusion.

1859
చెడుగుణంబులెల్ల జేపట్టి శిక్షించి పరమపదవి సిద్ధపడగ జూపు నట్టి గురుని వేడి యపరోక్షమందరా , వి. వే.

చెడుగుణంబులెల్ల జేపట్టి శిక్షించి
పరమపదవి సిద్ధపడగ
జూపు నట్టి గురుని వేడి
యపరోక్షమందరా , వి. వే.

దుర్గుణములను పోగొట్టి ఉత్తమపదవిని చూపు గురువును సేవించి ముక్తిని పొందుము

One has to attain salvation by serving a guru who removes bad qualities and shows a superior state of mind.

1860
చదువురాదటన్న సామాన్య తింకేల? బుద్ధి కుదురుకున్న పొందికేల? గురుని గూర్చి ముక్తి కరతలామలకమౌ , వి. వే.

చదువురాదటన్న సామాన్య తింకేల?
బుద్ధి కుదురుకున్న పొందికేల?
గురుని గూర్చి ముక్తి
కరతలామలకమౌ , వి. వే.

చదువు లేనివాని సమత్వము, బుద్ధి లేనివాని పొందికయు నిరర్థకములు . ఇక గురువు నాశ్రయించిననే ముక్తి సులభమగును

An uneducated person's impartiality and the harmony of a person without intellect are meaningless. By approaching a guru, one can attain salvation.

1861
చుట్టుకొనియున్న మాయను నెట్టుము గురుభక్తి మీఱి నియతాత్ముడవై మట్టుము తత్పరతను మన మట్టిట్టును చెందనీక మాన్యత వేమా

చుట్టుకొనియున్న మాయను నెట్టుము
గురుభక్తి మీఱి నియతాత్ముడవై
మట్టుము తత్పరతను మన మట్టిట్టును
చెందనీక మాన్యత వేమా

మనల నావరించియున్న మాయను నశింపజేసికొని గురుభక్తితో తత్పరుడవై మనస్సును చలింపనీయక బ్రహ్మమును సాధింపుము

One has to attain brahmam by removing the delusion in the mind with the help of a guru by working diligently and not allowing the mind to be distracted.

1862
చూచెడివఱకే సాధన చూచిన మదియందు దోచి సులభంబగునా తోచెడి మర్మము నీవని కాచుకొనియు గురునిగోరి కనవలె వేమా

చూచెడివఱకే సాధన చూచిన మదియందు
దోచి సులభంబగునా తోచెడి
మర్మము నీవని కాచుకొనియు
గురునిగోరి కనవలె వేమా

చూచునంతవరకే సాధన, మనస్సునందలి మర్మమును చూచి అంతయు ఆత్మమయమని తెలిసి మోక్షము పొందవలెను. దీనికై గురువుని విడువక అతడు చెప్పినట్లు యత్నింపుము

The education won't last for ever. One has to attain salvation by learning the secrets in the mind and realizing that aatma is omnipresent. One has to serve a guru without leaving him and try to do things as he taught.

1863
ఛాత్రధర్మమెఱిగి చక్కని భక్తితో గురుని సేవచేయ గుదిరినపుడె సర్వమర్మములును జక్కగా విడిపోవు, వి. వే.

ఛాత్రధర్మమెఱిగి చక్కని భక్తితో
గురుని సేవచేయ గుదిరినపుడె
సర్వమర్మములును జక్కగా
విడిపోవు, వి. వే.

గురుశిష్య పద్దతిని బాగుగా తెలిసికొని నిశ్చలభక్తితో గురువును సేవింపవలెను . అప్పుడే మనస్సులోని సందేహములు విడిపోవును . జ్ఞానసాధనకు గురుసేవ యావశ్యకము

One has to serve his guru steadfastly by learning about guru-disciple system of education. Then only the doubts in the mind will be cleared. To gain knowledge service to guru is very important.

1864
ఛాయనొసగుచెట్టు సాధువుబోధట్టు లడగి దరినిజేరి పడయవచ్చు నట్టు నిట్టు దాట నది పోవు నిది రాదు , వ. వే.

ఛాయనొసగుచెట్టు సాధువుబోధట్టు
లడగి దరినిజేరి పడయవచ్చు
నట్టు నిట్టు దాట నది
పోవు నిది రాదు , వ. వే.

నీడనిచ్చు వృక్షమును , సాధువయి బోధనొసగు గురువును సఫలుడై యుందురు. దరిచేరగానే చెట్టు నీడను, గురువు జ్ఞానమును ఇత్తురు. చెట్టు లేకున్న నీడ లేదు. గురువు లేకున్న జ్ఞానము లేదు.

The tree that gives shade and the patient guru who teaches are successful. As soon as one moves near a tree one gets shade. Moving closer to guru one can gain knowledge. Without tree there is no shade. And without guru there is no knowledge.

1865
జగమున గురు డుదయించిన జగమునగల జనులు శరణు శరణనరొక్కో జగమెఱిగి మ్రొక్కజూచెడి నిగమాగమ నిర్వికార నిపుణుడు వేమా

జగమున గురు డుదయించిన జగమునగల
జనులు శరణు శరణనరొక్కో జగమెఱిగి
మ్రొక్కజూచెడి నిగమాగమ
నిర్వికార నిపుణుడు వేమా

గురుడుదయించనచో మానవులాతనికి శరణాగతులై మ్రొక్కుదురు . ఆ గురువు లోకుల మ్రొక్కులను నిర్వికారముగా గ్రహించి అనుగ్రహించును

As soon as a guru arrives, people pay obeisance to him by surrendering themselves to him. The guru is unperturbed by the accolades he receives and blesses all.

1866
జనన మరణములన స్వప్నసుషుప్తులు జగములందు నరుడు జగమునంట నగుబాటు కాదొకో , వి. వే.

జనన మరణములన స్వప్నసుషుప్తులు
జగములందు నరుడు
జగమునంట నగుబాటు
కాదొకో , వి. వే.

చావు పుట్టుకలు స్వప్న సుషుప్తులు వంటివి . లోకములును ఎండమావు లలోని నీటివలె మిథ్యలు. వివేకియగు వాడు ఐహికములలో చిక్కి, తప్పించుకొనకుండుట నగుబాటు కదా!

Birth and death are like dreaming and falling in deep sleep. Like mirages in the deserts, these are illusory states. Isn't it a shame that an intelligent person gets caught up in this illusory world?

1867
జాగుసేయక గురుసేవ జరిపి దాన యోగయోగాంగముల నేర్చి యోగులగుచు నాశలను మానుటనుగాదె యచలతపము సిద్ధినొందును ముక్తికి జర్ప వేమ

జాగుసేయక గురుసేవ జరిపి దాన యోగయోగాంగముల
నేర్చి యోగులగుచు నాశలను
మానుటనుగాదె యచలతపము సిద్ధినొందును
ముక్తికి జర్ప వేమ

ఆలస్యము చేయక గురువును సేవించి యోగ యోగాంగముల నభ్యసించి యోగులయి ఆశలను మొదలంట గోయుటే నిశ్చలమగు తపస్సు. దానివలన ముక్తి లభించును

Without delay, when one serves a guru, learns yoga and cuts off desires at their source with penance, he will be a real yogi. One will attain salvation through this.

1868
జాణలమని యంద్రు చపలాత్ములగువారు తెలివిలేక తమ్ము తెలియలేరు కష్టమైన యడవి గాసిలుచున్నారు , వి. వే.

జాణలమని యంద్రు చపలాత్ములగువారు
తెలివిలేక తమ్ము తెలియలేరు
కష్టమైన యడవి గాసిలుచున్నారు,
వి. వే.

జనులు తాము జాణలమని యనుకొందురే కాని , తమ తెలివి లేమిని గ్రహింపజాలరు . అట్టివారు తపస్సు చేసికొనుచు సారమును గ్రహింపలేక అడవులలో నివసించుచు పెక్కు కష్టము లనుభవించుచుందురు

Men think of themselves as geniuses but don't contemplate over their ignorance. They experience great difficulties by doing penance in forests without realizing the essence of knowledge.

1869
జ్ఞానమెన్న గురువు జ్ఞానహైన్యము బుద్ధి రెంటిసందు రిమ్మరేచునపుడు రిమ్మతెలిసెనేని రెండొక రూపురా , వి. వే.

జ్ఞానమెన్న గురువు జ్ఞానహైన్యము
బుద్ధి రెంటిసందు రిమ్మరేచునపుడు
రిమ్మతెలిసెనేని
రెండొక రూపురా , వి. వే.

జ్ఞానము గురువు. జ్ఞానశూన్యత అజ్ఞానము. చెంచలమైన మనస్సు జ్ఞానాజ్ఞానముల నడుమ భ్రమల నొందుచుండును . ఈ భ్రమలను కట్టివేసినగాని మోక్షము లభింపదు

Knowledge is guru. Ignorance is lack of knowledge. A wavering mind will delude by jumping between knowledge and ignorance. Until one resolves such delusion, salvation cannot be attained.

1870
జ్ఞానవంతుని కడు కర్మసంభ౦ధ్ధులు వెఱ్ఱియండ్రు ప్రకృతి విడువలేక వెఱ్ఱికనని ప్రకృతి వెదికిన గల్గునా? వి. వే.

జ్ఞానవంతుని కడు కర్మసంభ౦ధ్ధులు
వెఱ్ఱియండ్రు ప్రకృతి విడువలేక
వెఱ్ఱికనని ప్రకృతి
వెదికిన గల్గునా? వి. వే.

జ్ఞానులు పైకి వెర్రివారివలె కానరాగా జనులు వారిని వెర్రివారిని గానే భావింతురు . కాని ఆ వెర్రి తెలియని వేద్య మేదియును లేదని గ్రహింపలేకున్నారు

Knowledgeable persons look ordinary and people think of them as foolish. People are not able to realize there is nothing that the knowledgeable person doesn't know.

1871
జ్ఞానియనెడివాడు ఘనతేజమందురు పూని సుఖముజెందు పుట్టబోడు తానె తానటయ్యు దనలోనె వెల్గును , వి. వే.

జ్ఞానియనెడివాడు ఘనతేజమందురు
పూని సుఖముజెందు పుట్టబోడు
తానె తానటయ్యు దనలోనె
వెల్గును , వి. వే.

జ్ఞాని ఉత్తముడై ప్రతిభ గలిగి గౌరవమును పొందును. అతనికి మరి జన్మము లేదు. ఆత్మస్వరూపమగు బ్రహ్మముతో ఐక్యము పొంది ఆనంద మనుభవించును

A knowledgeable person will become a man of good character and receive honor. He won't be born again. He will enjoy bliss by unifying with the brahmam.

1872
టీకా వ్రాసిన ట్లనేకులు పెద్దలు లొకమందు జెప్పి రేకమంచు కాకులట్టి జనులు కాన రీ మర్మము, వి. వే.

టీకా వ్రాసిన ట్లనేకులు పెద్దలు
లొకమందు జెప్పి రేకమంచు
కాకులట్టి జనులు
కాన రీ మర్మము, వి. వే.

ఎందరో పెద్దలు ప్రపంచ మర్మములను వ్యాఖ్య వ్రాసినట్టు వివరముగా చెప్పుదురు . తెలివిలేని జనులు దేవుడొక్కడే యనువారి వివరణను గ్రహింపలేకున్నారు

Many great people explain in detail the secrets of the world. Foolish people are not able to follow their teaching that there is only one god.

1873
తత్త్వమెఱుగువాడు దైవంబు నెఱుగును సర్వసారములను చావజేయు కదళి మ్రింగువాడు గరళంబు మ్రింగడు , వి. వే.

తత్త్వమెఱుగువాడు దైవంబు నెఱుగును
సర్వసారములను చావజేయు
కదళి మ్రింగువాడు గరళంబు
మ్రింగడు , వి. వే.

తత్త్వవేత్త దైవము నెరుగును. అన్ని విషయములను కూడ తెలిసికొనగలడు . అరటిపండును మ్రింగుట గరళమునే మ్రింగువానికి కష్టము కాదు గదా!

A man knowing tattva knows about god. He can learn about all things. One who can swallow poison (Lord Siva) can easily swallow a banana.

1874
తనదు మనసు చేత దర్కించి జ్యోతిష మెంత చేసె ననుచు నెంచి చూచు తన యదృష్టమంత దైవ మెఱుంగడా? వి. వే.

తనదు మనసు చేత దర్కించి జ్యోతిష
మెంత చేసె ననుచు
నెంచి చూచు తన యదృష్టమంత
దైవ మెఱుంగడా? వి. వే.

మూర్ఖుడు తన యత్నములు విఫలమైనప్పుడు గ్రహములు వక్రించినవని నిందించునేగాని , తన యదృష్టమునుబట్టి దైవమే యట్లు చేసెనని గ్రహింపడు

A foolish person curses the planets when his plans go astray rather than realize that god had caused it based on his luck.

1875
తన విరక్తి యనెడి దాసి చేతను జిక్కి మిగిలి వెడలలేక మిణుకుచున్న నరుని కేడ ముక్తి వరలెడి చెప్పుడి , వి. వే.

తన విరక్తి యనెడి దాసి చేతను
జిక్కి మిగిలి వెడలలేక మిణుకుచున్న
నరుని కేడ ముక్తి
వరలెడి చెప్పుడి , వి. వే.

విరక్తి యనెడి దాసి దాని వలలో చిక్కుకొని దాని నుండి తప్పించుకొనలేక అశక్తుడగువానికి ఏ విధముగా చూచినను ముక్తి లభింపజాలదు

One captured in the net of the servant maid called disinterest, will be incapable of escaping and becomes powerless. He can't attain salvation.

1876
తనివితీఱ గురుని ధ్యానించి మదిలోన దనువు మఱచి గురుని దాకి నపుడె తనరుచుండు బ్రహ్మ తత్త్వమందురు దాని, వి. వే.

తనివితీఱ గురుని ధ్యానించి మదిలోన
దనువు మఱచి గురుని దాకి
నపుడె తనరుచుండు బ్రహ్మ తత్త్వమందురు
దాని, వి. వే.

మనస్సులో గురువును ధ్యానించుచు తన్ను దామరచి బ్రహ్మానందము పొందుచు ధ్యానములో గురుస్వరూపమును దర్శింపగలుగుటయే బ్రహ్మతత్త్వము

Meditating one one's guru, enjoying bliss by forgetting one's self and visualizing the guru in meditation is the tattva of brahmam.

1877
తలపులోన గలుగు దా దైవమే ప్రొద్దు తలచి చూడ నతడు తత్త్వమగును ఊఱకుండ నేర్వ నుత్తమ యోగిరా, వి. వే.

తలపులోన గలుగు దా దైవమే ప్రొద్దు
తలచి చూడ నతడు తత్త్వమగును
ఊఱకుండ నేర్వ
నుత్తమ యోగిరా, వి. వే.

భగవంతుడు మన హృదయముననే నివసించి యున్నాడు. చిత్తశుద్ధితో చూచినచో అతడు కానవచ్చును . ఎట్టి వికారమును పొందక ఆ తత్త్వమును కాంచువాడే యోగి

God is residing in one's heart. One can see him with clear conscience. A yogi is one who is unperturbed by this and understands the tattva behind it.

1878
తలపులోన మరులు తలపు లెఱు౦గక తలలు బోడులైన ధన్యులేమి ? తలపులోని తలపు తత్త్వము నెఱుగుము , వి. వే.

తలపులోన మరులు తలపు లెఱు౦గక
తలలు బోడులైన ధన్యులేమి?
తలపులోని తలపు తత్త్వము
నెఱుగుము , వి. వే.

మనస్సులోని మర్మము నెరుగలేక తలలు గొరిగించుకున్న మాత్రాన లాభమేమి ? తత్త్వము గ్రహింపక యోగి కాజాలడు

Without knowing the secrets of mind, what is the use in tonsuring the heads? One can't be a yogi without understanding the tattva.

1879
తల వరులకైన నెప్పుడు ధర్మమొప్పు సామి యానతి జేయుచు దా మెఱుగమి గురుల హితబోధ మీ ఱెడి కూళలకును నరకకూపంబె శరణమౌ నరయ వేమ

తల వరులకైన నెప్పుడు ధర్మమొప్పు
సామి యానతి జేయుచు దా మెఱుగమి
గురుల హితబోధ మీ ఱెడి కూళలకును
నరకకూపంబె శరణమౌ నరయ వేమ

తలవరులు రాజాజ్ఞచే వధ్యులను చంపుదురు. అది వారికి ధర్మమే . గురుని యాజ్ఞమీరిన చెడ్డ శిష్యులు ధర్మము మీరినందున వారికి నరకమే సంభవించును

Hangmen carry out the sentence under king's orders. That is their dharma. The disciples who disregard the guru's orders end up in hell for violating the dharma.

1880
తల్లి తండ్రిమీద దయలేని పుత్రుండు పుట్టనేమి ? వాడు గిట్టనేమి ? పుట్టలోని జేదలు పుట్టదా గిట్టదా ? వి. వే.

తల్లి తండ్రిమీద దయలేని పుత్రుండు
పుట్టనేమి ? వాడు గిట్టనేమి?
పుట్టలోని జేదలు
పుట్టదా గిట్టదా ? వి. వే.

తల్లిదండ్రులపై అభిమానములేని పుత్రుడు ఉన్నను చచ్చినను ఒక్కటే. వాడు పుట్టలోపుట్టి నశించు చెదలవంటివాడు

A son who has no affection for his parents should rather die than live. He is like the termites that live and die.

1881
తల్లి దండ్రు లెన్నదగు తొలి గురువులు పార్వతీభవు లిల బరమగురులు కూలివా౦డ్ర జగతి గురులన ద్రోహము, వి. వే.

తల్లి దండ్రు లెన్నదగు తొలి
గురువులు పార్వతీభవు లిల
బరమగురులు కూలివా౦డ్ర జగతి
గురులన ద్రోహము, వి. వే.

మనకు తల్లిదండ్రులు మొదటి గురువులు. పార్వతీ పరమేశ్వరులు పరమ గురువులు . డబ్బు తీసికొని బోధించు వారు గురువులు కారు

One's mother and father are the first gurus. Lord Siva and Goddess Parvati are next. The ones who teach by accepting money are not gurus.

1882
తల్లి బిడ్డలకును తగవు పుట్టించెడి ధనము సుఖము గూర్చు నని గడింత్రు కాని యెల్ల యెడల ఘన దుఃఖకరమది , వి. వే.

తల్లి బిడ్డలకును తగవు పుట్టించెడి
ధనము సుఖము గూర్చు
నని గడింత్రు కాని యెల్ల యెడల
ఘన దుఃఖకరమది , వి. వే.

ధనమువల్ల సుఖము కల్గునని దానిని గడింతురేకాని, అది ఎల్లప్పుడు దుఃఖమే కల్గి౦చును . తల్లి బిడ్డలకును విరోధము తెచ్చును

People think of money as synonymous with comforts but it actually lands one in sorrow. It can bring enmity between mother and her children.

1883
తల్లి యాలు నయ్యె దగ గోడలును నయ్యె కోడలనగననగ గూతురాయె మాయవిడుక ముక్తి మహి నింక గల్గదు , వి. వే.

తల్లి యాలు నయ్యె దగ గోడలును
నయ్యె కోడలనగననగ గూతురాయె
మాయవిడుక ముక్తి మహి
నింక గల్గదు , వి. వే.

మానవులు పెక్కు జన్మములు పొందుటవలన తల్లియే భార్యగాను, కోడలుగాను , కూతురుగాను పుట్టుట సంభవించును . ఇది మాయ . దీనిని దాటిననేగాని ముక్తిలేదు

Because men have many lives, mother will be related to one as wife, daughter-in-law, and daughter in several births. This is maaya (illusion). Until one overcomes it there is no salvation.

1884
తాను నిర్మలుడుగ తనదు గుణములన్ని చేయలేని గురుడు చెడుగురుండు గ్రుడ్డి గుఱ్ఱ మెక్కి గుణికినట్లుండురా , వి. వే.

తాను నిర్మలుడుగ తనదు గుణములన్ని
చేయలేని గురుడు చెడుగురుండు
గ్రుడ్డి గుఱ్ఱ మెక్కి
గుణికినట్లుండురా , వి. వే.

తాను నిర్మలుడై తన గుణములు శుద్ధములుగా చేసికోలేని గురువు చెడ్డవాడు . అట్టివాని నాశ్రయించిన గ్రుడ్డి గుర్రముపై కూర్చుండి స్వారి చేసినవాని గతి పట్టును

A guru who can't be of clear conscience and good qualities is bad. Learning from him is like riding on a blind horse.

1885
తాను విమలుడైన తన గుణమంతయు శివుని కీని గురువు చెడుగు గురువు గ్రుడ్డి గుఱ్ఱమెక్కి గుడి జుట్టినట్లగు , వి. వే.

తాను విమలుడైన తన గుణమంతయు శివుని
కీని గురువు చెడుగు గురువు
గ్రుడ్డి గుఱ్ఱమెక్కి గుడి
జుట్టినట్లగు , వి. వే.

తాను విమలుడైనను , తన గుణములు లోకమున నుపయోగించని గురువు చెడ్డవాడు . అట్టివాని నాశ్రయించుట గ్రుడ్డి గుర్రమునెక్కి గుడిచుట్టును తిరుగుటవంటిది

Even though his character is spotless, if the qualities are not conducive to the world, such a guru is bad. Accepting his teaching is like riding on a blind horse and circling the temples.

1886
తామసించి చేయదగ దెట్టి కార్యంబు వేగరింప నదియు విషమమగును పచ్చి కాయ దెచ్చి పడవేయ ఫలమౌనె ? , వి. వే.

తామసించి చేయదగ దెట్టి కార్యంబు
వేగరింప నదియు విషమమగును
పచ్చి కాయ దెచ్చి పడవేయ
ఫలమౌనె ? , వి. వే.

తొందరపడి ఏ పనిని చేయరాదు. తొందరపాటువల్ల కార్యము విషమించును . పచ్చికాయను తెచ్చి మగ్గపెట్టిన పండగునా ?

One should not hasten to do things. Because of haste the act will be a waste. Will a raw fruit become ripe over-night?

1887
తిత్తిలోని శివుని స్థిరముగా దెలియక తిక్కపట్టి జనుడు తిరుగుచుండు తిక్కదీర్ప గురుడి కొక్కడే దిక్కురా, వి. వే.

తిత్తిలోని శివుని స్థిరముగా
దెలియక తిక్కపట్టి జనుడు తిరుగుచుండు
తిక్కదీర్ప గురుడి
కొక్కడే దిక్కురా, వి. వే.

తనలోనున్న పరమాత్మను తెలిసికోలేక జనుడు తిక్కబట్టి తిరుగుచుండును . ఆ తిక్క తీర్చి సరిచేయువాడు గురుడొక్కడే !

Some men roam around the world like mad-men without being able to discover the paramaatma within themselves. Only a guru can cure such madness and mend their ways.

1888
తిరిగి తిరిగి నరుడు మరులు కొనుటెకాక అందువలన నేమి యధికమగును? నంతరంగ మెఱుగునప్పుడు శివుడగు , వి. వే.

తిరిగి తిరిగి నరుడు మరులు
కొనుటెకాక అందువలన నేమి యధికమగును?
నంతరంగ మెఱుగునప్పుడు
శివుడగు , వి. వే.

దేశములు ప్రీతితో తిరిగినంతమాత్రమున మేలు కలుగదు. మనస్సును నిల్పి తత్త్వమును గ్రహించినపుడే ఐక్యత సిద్ధించును

There is no use in wander-lust. Grasping the tattva with a still mind will result in unification with brahmam.

1889
తొత్తుతోడి పొందు తొఱ్ఱి పెసలమూట ముచ్చుతోడి పొందు తెచ్చు నింద తలవరిదగు పొందు తలతోనె తీరురా , వి. వే.

తొత్తుతోడి పొందు తొఱ్ఱి పెసలమూట
ముచ్చుతోడి పొందు తెచ్చు
నింద తలవరిదగు పొందు
తలతోనె తీరురా , వి. వే.

దాసిదానితోడి పొందు తప్పక బయలుపడును . ముచ్చుదాని పొందువల్ల నింద వచ్చును. తలవరి భార్యతోడి పొందు ప్రాణహానిని కలిగించును

An illicit relationship with a servant maid will be discovered. One gets blame for consorting with a thief. The relationship with a hangman's wife will put one's life in danger.

1890
తొల్లి చేసిన పాపంబు తొలగు కొఱకె పుట్టి చచ్చును మఱలను పుట్టుచుండ్రు గురుని జేరియువేడి తా గొలుచునేని పుట్టు దుఃఖము పాడయిపోవు వేమ

తొల్లి చేసిన పాపంబు తొలగు కొఱకె
పుట్టి చచ్చును మఱలను పుట్టుచుండ్రు
గురుని జేరియువేడి తా గొలుచునేని
పుట్టు దుఃఖము పాడయిపోవు వేమ

వెనుకటి జన్మములోని పాపములు పోవుటకయి తిరిగి జనన మరణములు కలుగుచుండును . గురునాశ్రయించి యతని బోధలను వినిన రీతిని నడుచుకున్నచో దుఃఖరహితమగు మోక్షము కలుగును

Birth-death cycle is happening because of accumulated sins from the previous lives. If one approaches a guru, learns from his teachings, conducts himself appropriately, one can enjoy blissful salvation.

1891
త్రాడు మెడకు వేసి తనకు శూద్రత్వము పోయె ననెడి దెల్ల బుద్ధి లేమి మది నిలుపక త్రాడు మఱి వన్నె దెచ్చునా? వి. వే.

త్రాడు మెడకు వేసి తనకు శూద్రత్వము
పోయె ననెడి దెల్ల బుద్ధి
లేమి మది నిలుపక త్రాడు మఱి
వన్నె దెచ్చునా? వి. వే.

మెడలో జందెము వేసికొని తనకు శూద్రత్వము పోయి బ్రాహ్మణత్వము వచ్చినదనుట బుద్ధిలేమి. మనస్సు నిలుపలేక జందెము వేసికొన్న మాత్రాన కృతార్థుడు కాలేడు

Wearing sacred thread around torso and claiming one has been promoted from a low-caste to brahmanism is foolishness. One cannot attain salvation without controlling the mind even by wearing the sacred thread.

1892
దగ్గఱున్నవాడు తప్పక దక్షుడు ఎడమ పడినవాడు దుడుకు గడుసు అనుసరించు వారి కయ్యెడు కార్యముల్ , వి. వే.

దగ్గఱున్నవాడు తప్పక దక్షుడు
ఎడమ పడినవాడు దుడుకు గడుసు
అనుసరించు వారి కయ్యెడు
కార్యముల్ , వి. వే.

ఎట్టి నేర్పరికైనను ఇతరుల ఆశ్రయము లేనిదే పని జరగదు. ఆశ్రయించినచో పని జరుగును. దూరముగ నున్నచో జరుగదు. ఆశ్రయమువల్లనే కార్య సిద్ధి. కాన మోక్షసిద్ధికి గురువును ఆశ్రయింపవలసి యున్నది

Any skillful person needs help from others to carry out tasks. If the person is afar, the task may not be done. Proximity is the key to success. Hence for attaining salvation one has to live closely with a guru.

1893
దశగలారినెల్ల దమ బంధువు లటండ్రు దశయలేమి నెంత్రు తక్కువగను దశయన గను ధన దశ యొక్కటే దశ, వి. వే.

దశగలారినెల్ల దమ బంధువు లటండ్రు
దశయలేమి నెంత్రు
తక్కువగను దశయన గను ధన
దశ యొక్కటే దశ, వి. వే.

జనులు ధనవంతులైనచో తమ బంధువులని , లేనివారు తమవారు కారని అందురు. ధనమే విలువైనది . దశయున్న వాడన్న , ధనమున్న వాడనియే అర్థము

If one is rich, people will call one their relatives. Otherwise the disown them. Wealth is supreme. A man is in ascendance means he is rich.

1894
దర్శనంబునందు ధర షణ్మతములందు వర్ణమాశ్రమమును వదలు కెపుడు తిరుగుచున్నవాడు ధరలోన నజ్ఞాని , వి. వే.

దర్శనంబునందు ధర షణ్మతములందు
వర్ణమాశ్రమమును వదలు
కెపుడు తిరుగుచున్నవాడు ధరలోన
నజ్ఞాని , వి. వే.

శాస్త్రములు , షణ్మతములు, వర్ణాశ్రమములు ముఖ్యములని వానిని పట్టుకొని దేవులాడి తిరుగువాడు అజ్ఞాని కాని జ్ఞాని కాడు. స్వతంత్రబుద్ధి కలవాడే జ్ఞాని

The person who hangs on to scripture, religious texts, caste-system, is an ignorant one. A knowledgeable person has to have independent views.

1895
దాతలేని కొంప దయ్యాల పెనువాడ నీతిలేని మాట రాతివేట ప్రీతిలేని లంజె ప్రేత వాహనమయా , వి. వే.

దాతలేని కొంప దయ్యాల పెనువాడ
నీతిలేని మాట రాతివేట
ప్రీతిలేని లంజె ప్రేత
వాహనమయా , వి. వే.

దాతలేని యిల్లు దయ్యాలకొంప, నీతిలేని మాట రాతితో వాదులాట వలె నిష్ప్రయోజనము . ప్రేమలేని వలపులాడి శవమును మోయుటవంటిది

A house without a donor is like a haunted house. A word that has no morality is like arguing with a stone. Even a beautiful woman without love is like a corpse.

1896
దాసరనగవచ్చు వేసార్లకైనను జంగమనగవచ్చు లింగమున్న బాపడనగరాదు పదివేలకైనను , వి. వే.

దాసరనగవచ్చు వేసార్లకైనను
జంగమనగవచ్చు లింగమున్న
బాపడనగరాదు పదివేలకైనను,
వి. వే.

నామము పెట్టుకున్నచో దాసరి యనవచ్చును . లింగము కట్టుకొన్నచో జంగమనవచ్చును . కాని జందెము వేసికొన్నను జ్ఞానము లేనివానిని బ్రాహ్మణుడని చెప్పరాదు

One wearing a naamam (the upright mark worn on the fore-head by Vaishnavites ) can be called a daasari. One wearing a linga (phallic symbol) can be called a jangama. But one wearing a sacred thread without knowledge is not a brahmin.

1897
దినములు వ్యర్థము పుచ్చక కనుచుండిమి యాత్మ నెపుడు ఘన గురుబోధన్ నిను నీ వెఱుగక యున్నను గొనకొని మది చెఱచు నిన్ను గొబ్బున వేమా

దినములు వ్యర్థము పుచ్చక కనుచుండిమి
యాత్మ నెపుడు ఘన గురుబోధన్
నిను నీ వెఱుగక యున్నను గొనకొని
మది చెఱచు నిన్ను గొబ్బున వేమా

కాలము వ్యర్థముచేయక గురుని బోధ ననుసరించి తనలో నున్న ఆత్మస్వరూపమును తెలిసికొనుటకు యత్నింపవలెను . నిన్ను నీవు తెలిసికొనకున్నచో నీ మనస్సు నిన్ను చెరచును

One should strive to visualize the form of aatma in one self without wasting time and following the teachings of his guru. If one doesn't know about himself his mind will play tricks.

1898
దురితముల నెల్ల ఖండించు గురుని జేరి పరమ నిర్గుణ మననంబు ప్రాకినంత గురుతరంబుగ గుణములుకొట్టువడును పరమ శివుడన భాసిల్లు ధరను వేమ

దురితముల నెల్ల ఖండించు గురుని జేరి
పరమ నిర్గుణ మననంబు ప్రాకినంత
గురుతరంబుగ గుణములుకొట్టువడును
పరమ శివుడన భాసిల్లు ధరను వేమ

పాపములు పోగొట్టు గురువు నాశ్రయించి విధ్యుక్తముగా నిర్గుణోపాసన చేసినయెడల దుర్గుణములు నశించును. పిదప భగవత్స్వరూపము పొంది ధన్యుడవు కాగలవు

One has to approach a guru who can absolve one's sins and pray without the 3 gunas (sattva-calm, rajas-action, tamas-indolence) as ordained by the guru, then one's bad qualities will be removed. Then one can visualize god and attain salvation.

1899
దివ్య పరతత్త్వమును జ్ఞప్తి ధీజయుండు మఱలి పుట్టని గురుభక్తి మహిమతోడ నక్ష యాత్మక పరమంది యమలు డగును ఏ మలిన మాతనికి నంట దెపుడు వేమ

దివ్య పరతత్త్వమును జ్ఞప్తి ధీజయుండు
మఱలి పుట్టని గురుభక్తి మహిమతోడ
నక్ష యాత్మక పరమంది యమలు డగును
ఏ మలిన మాతనికి నంట దెపుడు వేమ

బుద్ధిమంతుడు గురుభక్తి మూలమున దివ్యమైన పరతత్త్వజ్ఞానమును సంపాదించి పరిశుద్ధుడై అక్షయముగ ఆత్మతత్త్వమున ముక్తి పొందును

A man of good character, because of his devotion to a guru, will learn the knowledge about paramaatma. His mind will be cleansed and he will acquire the tattva about aatma and attain salvation.

1900
దివ్యమైనట్టి పరశివ తేజమూని భవ్యమగు యుక్తి మదిలోన భద్రపఱచి సేవ్యుడై యుండుటే ముక్తి స్థిరముగాను కావ్యములరాదు గురు బోధ కలదు వేమ

దివ్యమైనట్టి పరశివ తేజమూని భవ్యమగు
యుక్తి మదిలోన భద్రపఱచి సేవ్యుడై
యుండుటే ముక్తి స్థిరముగాను
కావ్యములరాదు గురు బోధ కలదు వేమ

దివ్యమైన ఆత్మతేజస్సును మనస్సున ఉంచుకొని నియమానుసారముగ ధ్యానించుచున్న యెడల ముక్తి లభించును. గురుసేవవలన ముక్తి లభించునుగాని గ్రంధములను పఠించుట వలన లభింపదు

By keeping the great resplendent aatma in mind, if one meditate as per the teachings of a guru, he will attain salvation. One gets salvation by serving a guru rather than by reading books.

1901
దేవభూములయందు దేవాలయముల౦దు దేవుడనుచు మ్రొక్కి తెలియలేక తిరుగుచుండు వాడు దేవాది దేవుడా?

దేవభూములయందు దేవాలయముల౦దు
దేవుడనుచు మ్రొక్కి
తెలియలేక తిరుగుచుండు
వాడు దేవాది దేవుడా

పుణ్యస్థలములందును , గుడులయందును దేవుడున్నాడని కొందరు తలచి మ్రొక్కులర్పింతురు . ఇది బుద్ధిలేని పని. ఇట్టివారు దైవస్వరూపమును , ముక్తిని పొందలేరు

People perform rituals at holy places and temples where they believe gods are residing. This is foolishness. They can't attain the form of God or salvation.

1902
దేహ మాత్మ రూపు తేట తెల్లము చేసి యవలి దూపు జూచు నతడె గురువు భ్రమరము తన రూపు క్రిముల కిచ్చిన రీతి, వి. వే.

దేహ మాత్మ రూపు తేట తెల్లము
చేసి యవలి దూపు జూచు నతడె గురువు
భ్రమరము తన రూపు క్రిముల
కిచ్చిన రీతి, వి. వే.

తుమ్మెద తనగూటిలో నుంచిన పురుగునకు భ్రమరత్వ మిచ్చినట్లు గురువు శిష్యునకు ఆత్మస్వరూపమును బోధించి భ్రాంతిని పోగొట్టి బ్రహ్మత్వము కలిగించును

Like a dragon fly that passes on its attributes to the insect placed in its nest, a guru teaches his disciple the form of atmaa and dispel delusion to attain salvation.

1903
దేహ మాత్మలు వేఱని తెలియలేక మోహమున జిక్కి నిద్రలో మునుగుటేల ? సాహసంబున గురుభక్తి సలుపవలెను వివరమాతండు తెలిపెడి వేగ వేమ

దేహ మాత్మలు వేఱని తెలియలేక మోహమున
జిక్కి నిద్రలో మునుగుటేల?
సాహసంబున గురుభక్తి సలుపవలెను
వివరమాతండు తెలిపెడి వేగ వేమ

శరీరము , ఆత్మ వేర్వేరని తెలియక ఆజ్ఞులు మోహనిద్రలో మునిగి తేలుచు , ఆ రెండు నొకటియే అనుకొందురు . గురువును భక్తితో సేవించినయెడల ఆయన తత్త్వమును తెల్పును

Ignorant people don't realize that body and aatma are different and wallow in their ignorance. They think of the two as same in their delusion. If a guru is served with devotion, he will reveal the tattva.

1904
ధర్మమునకు గీడు తలచిన వాండు తా దుష్టు డగుచు దుదకు ద్రోవయెచెడు గురువు పత్ని గవయ గోరెడు నీచుండు మొదలు చెడడె ముప్పుమూడి వేమ

ధర్మమునకు గీడు తలచిన వాండు తా
దుష్టు డగుచు దుదకు ద్రోవయెచెడు
గురువు పత్ని గవయ గోరెడు నీచుండు
మొదలు చెడడె ముప్పుమూడి వేమ

ధర్మము తప్పిన నీచుడు తప్పక నశించును. గొప్పతనము పోవును. ధర్మము తప్పి గురుపత్నిని గూడిన చంద్రుడు గొప్పతనము కోలుపోయి హీనతను పొందెను గదా!

A low-life who violates dharma will perish. Such a person will never be great. The moon god consorted with his guru's wife, thus violating dharma, and lost his greatness

1905
నిజగురూపదేశ నిశ్చయాత్మక విద్య రక్షకంబటండ్రు రాజవీధి మధ్య మార్గమాందు మాన్యత జూడరా , వి. వే.

నిజగురూపదేశ నిశ్చయాత్మక
విద్య రక్షకంబటండ్రు రాజవీధి
మధ్య మార్గమాందు మాన్యత
జూడరా , వి. వే.

గురూపదేశమును నిశ్చయాత్మక విద్య రాజమార్గము వలె సాధకుని తరింపజేయును

A guru's teachings about aatma will serve as a royal road to the seeker to attain salvation.

1906
నిజముకల్ల రెండు నీలకంఠు డెఱుగు నిజములాడకున్న నీతి దప్పు నిజము లాడునపుడు నీ రూప మనవచ్చు , వి. వే.

నిజముకల్ల రెండు నీలకంఠు డెఱుగు
నిజములాడకున్న నీతి
దప్పు నిజము లాడునపుడు నీ
రూప మనవచ్చు , వి. వే.

సత్యాసత్యములను దేవుడే యెరుగును . కావున నిజమునే పలుకుము. నీతిని విడువకుము . నిజము పలుకువాడు ఈశ్వరస్వరూపుడే యనదగును

God only knows the truth and lies. One has to always speak truth. And never leave morality. One who speaks truth always is a form of Iswara.

1907
నిందించు భ్రమల జెందక పొందిన మదిజేర నొక్కి పొడిమితో నీ వందుకొని గురు రహస్యము సందీయక పూర్ణుడగును సరగున వేమా

నిందించు భ్రమల జెందక పొందిన
మదిజేర నొక్కి పొడిమితో నీ
వందుకొని గురు రహస్యము సందీయక
పూర్ణుడగును సరగున వేమా

నిందను, భ్రమము విడిచి మనస్సును చిక్కబట్టి గురూపదేశము ననుసరించి ధ్యానించి పూర్ణుడవగుము

One should ignore censure and delusion, focus the mind, follow a guru's advice and attain wholesomeness by meditation.

1908
నూటెనిమిగళ్ళ నోముల పుణ్యాలు కలవు జీవులకును గణనలేదు చెడిన నీళ్ళు నదుల జేరెడునట్లయా , వి. వే.

నూటెనిమిగళ్ళ నోముల పుణ్యాలు
కలవు జీవులకును గణనలేదు
చెడిన నీళ్ళు నదుల
జేరెడునట్లయా , వి. వే.

అష్టోత్తరశత గాయత్రివల్లను , ఇతర జపములవల్లెను కొంచెమైనను లాభము లేదు. ఈ జపములు మురికి నీరు ఏట గలసినట్లు వ్యర్థములు

By reciting mantra and performing rituals there is no use. They are like water from gutter mixing with the sea.

1909
నోరు పలుకవచ్చు నుడి వ్రాయగారాదు వ్రాతకన్న సాక్షి వలవదన్న వరగలేని వ్రాత భంగ పాటుందెచ్చు , వి. వే.

నోరు పలుకవచ్చు నుడి వ్రాయగారాదు
వ్రాతకన్న సాక్షి
వలవదన్న వరగలేని వ్రాత భంగ
పాటుందెచ్చు , వి. వే.

ఎన్ని మాటలైన పలుకవచ్చును గాని, వ్రాయునపుడు జాగ్రత్తగా ఉండవలెను. మాటకన్న వ్రాతయే గొప్ప సాక్షి. లేనిదానిని కల్పించి వ్రాసినయెడల , దానివల్ల మోసమే కలుగును

One can say many words, but must be careful in writing. Writing is better than speech. It is a great witness. If one writes about things that are fictional, one is cheating others.

1910
నేర్చినడతునన్న నేరమి తావచ్చు నోర్చి నడతునన్న నోర్పురాదు కూర్చి నడతున్న కూడగనీయదు , వి. వే.

నేర్చినడతునన్న నేరమి తావచ్చు
నోర్చి నడతునన్న నోర్పురాదు
కూర్చి నడతున్న
కూడగనీయదు , వి. వే.

మంచి నడత నేర్చుకొని , మంచిగా నడువదలచిన తప్పే వచ్చును. ఓర్చియుండవలె ననుకొన్న మాత్రాన ఓర్పు రాదు. మంచి గుణములు కూర్చుకొని , ఆ రీతిని నడుచుకొన దలచిన , అవి కలసిరావు. ఇట్టివి ప్రయత్నమున గాక సహజముగానే అలువడవలెను

When one decides to follow a moral path, one can encounter difficulties. One who thinks he can be patient, sometimes fails to be patient. One who wants to perform good deeds always, may not be able to do so. Such activities should come naturally rather than by practices.

1911
పట్టుగొమ్మవదిలి పలవింపనేటికి ? ఇట్టెగురుని వేడి గుట్టు నెఱిగి నిట్టనిలువు గాంచి నిర్గుణ మందరా , వి. వే.

పట్టుగొమ్మవదిలి పలవింపనేటికి?
ఇట్టెగురుని వేడి గుట్టు
నెఱిగి నిట్టనిలువు గాంచి
నిర్గుణ మందరా , వి. వే.

ఆధారము లేదని విచారించుటకంటె , గురువు నాశ్రయించి సేవచేసి తత్త్వము నెరిగి నిర్గుణత్వము పొందుట మేలు

Instead of worrying about lack of support, one has to serve a guru, learn the tattva and attain nirguna (devoid of sattva-calm, rajas-action, tamas-indolence).

1912
పడతి మోసె నొకడు పడతి మేసె నొకండు పడతి నూరము జేర్చి బ్రతికె నొకడు పడతికొఱకె పెక్కు పాట్లను బడిరయా , వి. వే.

పడతి మోసె నొకడు పడతి మేసె నొకండు
పడతి నూరము జేర్చి బ్రతికె
నొకడు పడతికొఱకె పెక్కు
పాట్లను బడిరయా , వి. వే.

లోకము స్త్రీలకై పెక్కుపాట్లు పడుచున్నది . త్రిమూర్తులే కష్టపడుచున్నారు . శివుడు గంగాదేవిని తలపై నెక్కించుకొనెను . బ్రహ్మ నోటిలో సరస్వతి నుంచుకొనెను . విష్ణువు లక్ష్మిని రొమ్ముపై నెక్కించుకొనెను

This world is under strife because of women. Even tri-murti are suffering. Lord Siva carries Ganga on his head. Lord Brahma keeps Goddess Saraswati in his mouth. Goddess Lakshmi resides on Lord Vishnu's chest.

1913
పడుచు మాటలాడి పరితపింపగలనేల ? వెడగు చర్యలడచి వేడి గురుని యడుగులంటి మ్రొక్కి యాసను విడద్రొక్కు , వి. వే.

పడుచు మాటలాడి పరితపింపగలనేల?
వెడగు చర్యలడచి వేడి గురుని
యడుగులంటి మ్రొక్కి యాసను
విడద్రొక్కు , వి. వే.

దురుసు మాటలాడి వెనుక విచారించుటకంటె ముందుగనే గురువుల పాదములపై పడి ప్రార్థించి , చెడునడతను విడిచి ముక్తుడవగుటకు యత్నింపుము

Instead of talking rashly and repenting, one should seek a guru, fall on his feet, pray to him and become liberated from bad ways to attain salvation.

1914
పడుచు నూఱకేలబాఱచూచెదరొక్కొ ఎంత వారలైన భ్రాంతి చెంది లోన మీఱు కాము లొంగజేయగలేక , వి. వే.

పడుచు నూఱకేలబాఱచూచెదరొక్కొ
ఎంత వారలైన భ్రాంతి
చెంది లోన మీఱు కాము
లొంగజేయగలేక , వి. వే.

ఎంతవారైనను కామవికారములకు లోనై భ్రాంతిని విడువలేక యువతులు కానరాగానే వారిని తేరిపార చూచుచుందురు

However great a person is, he is yielding to his lust. Unable to give up delusions he stares at young women.

1915
పరగ దేవుజేసి ప్రజలను మ్రొక్కించి తొక్కు భూమికెల్ల దరను జేసి మనుజ వరులను నిల మాంగల్యమును జేసి యాజ్ఞచేసి యేలేనతడు వేమ

పరగ దేవుజేసి ప్రజలను మ్రొక్కించి
తొక్కు భూమికెల్ల దరను జేసి
మనుజ వరులను నిల మాంగల్యమును
జేసి యాజ్ఞచేసి యేలేనతడు వేమ

శిల్పి దేవుని విగ్రహముచెక్కి దానినే ప్రభువుగా చేయుచున్నాడు. ప్రజలచే మ్రొక్కించుచున్నాడు . దాంపత్య సంబంధము తెగకుండుటకు మంగళసూత్రములు తయారు చేయుచున్నారు . శిల్పియే మనలను పాలించునట్లగుచున్నది

A sculptor by chiseling away stone is making an idol out of it; to which people pay obeisance. To keep the couple united in a marriage for ever he has created the managala-sutra (necklace). It seems a sculptor is ruling the world.

1916
పరగ నింత దనుక పడిన పాటెరుగడో ఘనత నొప్పు మనుజుడనగ బుట్టి కీడు మేలెఱుగక క్రిందగు చిత్రము , వి. వే.

పరగ నింత దనుక పడిన పాటెరుగడో
ఘనత నొప్పు మనుజుడనగ
బుట్టి కీడు మేలెఱుగక క్రిందగు
చిత్రము , వి. వే.

నరుడు తానెన్నో జన్మములందు పడినపాట్ల నన్నింటిని మరచిపోయి తిరిగి క్రిందుమీదు లగుచున్నాడు. ఎంత వింత!

One is forgetting all the travail he had faced in previous birth and repeating all the mistakes.

1917
పరధనంబులకును ప్రాణములిచ్చును సత్యమింతలేక జారుడగును ద్విజులమంచు నెంత్రుతేజ మించుకలేదు , వి. వే.

పరధనంబులకును ప్రాణములిచ్చును
సత్యమింతలేక జారుడగును
ద్విజులమంచు నెంత్రుతేజ
మించుకలేదు , వి. వే.

ఈ కాలపుద్విజులు పరులధనమున కాశించి , ప్రాణముల కంటె దానములే ఘనములని యెంచుచున్నారు . తేజస్సు లేకున్నను, తామే గొప్పవారమని భ్రాంతి పడుచున్నారు

The brahmins desirous of others' wealth, are saying a donation is more important than praana. They are deluding they are great even despite not having the aura.

1918
పరపురుషునిమీద ప్రాణంబు వెట్టుక మగువసేయుచుండు మంచి తనము అట్టి భంగియోగి యాత్మ భావించును, వి. వే.

పరపురుషునిమీద ప్రాణంబు వెట్టుక
మగువసేయుచుండు మంచి
తనము అట్టి భంగియోగి యాత్మ
భావించును, వి. వే.

జార స్త్రీ మగనిపై ప్రేమ నటించి , మనస్సును పర పురుషునిపైనే ఉంచును. అట్లే యోగి ఆత్మసిద్ధికి శరీరమును పోషించుచు ముక్తికై యత్నించును

A lose woman pretends to be in love with her husband but secretly wishes for other men. Similarly a yogi tries for salvation by taking care of his body to serve the aatma.

1919
పరమాత్ముని చింతనలో దఱచుగ నుండటయె తగును ధరనొక్కటికిన్ దిరిపము నెత్తి భుజించుచు దొరవలె గృహవేదికందు తొంగుము వేమా

పరమాత్ముని చింతనలో దఱచుగ నుండటయె
తగును ధరనొక్కటికిన్ దిరిపము
నెత్తి భుజించుచు దొరవలె
గృహవేదికందు తొంగుము వేమా

పరమాత్ముని చింతయే తరచు మనస్సులో నుంచి , కోరికలు విడిచి , భిక్షాన్నము తినుచు, ఇండ్ల యరుగులపై పరుండి కాలము గడుపుము

One may have to constantly think about paramaatma, give up desires, eat food given as alms, and sleep on street.

1920
పరిపక్వ మొప్ప శిష్యున కుర మందలి బయలు చూపి యుద్ధతి మీఱన్ పరిపూర్ణమందజేసెడు గురుడు పరబ్రహ్మమైన గుణనిధి వేమా

పరిపక్వ మొప్ప శిష్యున కుర మందలి
బయలు చూపి యుద్ధతి మీఱన్
పరిపూర్ణమందజేసెడు గురుడు
పరబ్రహ్మమైన గుణనిధి వేమా

శిష్యుని కర్మము పరిపక్వ ముంచుటకు హృదయాకారమును చూసి, జ్ఞాన పరిపూర్ణునిగా చేయు మహనీయుడే గురువు. అతనిని పరబ్రహ్మగానే భావించవలెను

To fruition a disciple's karma, a great guru will make him a man of immense knowledge. Such guru has to be considered as brahmam.

1921
పరులవిత్తమందు భ్రాంతి వాసిన యట్టి పురుషుడవనిలోన పుణ్యమూర్తి పరులవిత్తమరయ పాపసంచితమగు , వి. వే.

పరులవిత్తమందు భ్రాంతి వాసిన
యట్టి పురుషుడవనిలోన
పుణ్యమూర్తి పరులవిత్తమరయ
పాపసంచితమగు , వి. వే.

పరుల ధనముపై ఆశలేని యతడే పురుషులలో ఉత్తముడు. పరుల ధనము తీసికొన్న , అది పాపమువలన సంపాదించినదే యగును. అట్టివానికి ముక్తిలేదు

One who is not desirous of others' wealth is a man of good character. When one takes other's money, it will be considered as an immoral act. There is no salvation from it.

1922
పక్షిజాతిబట్టి పరగ హింసలు పెట్టి గుళ్ళుగట్టి యందుగదురబెట్టి యుంచు వారి కట్టి వంచనరాదొకో , వి. వే.

పక్షిజాతిబట్టి పరగ హింసలు
పెట్టి గుళ్ళుగట్టి యందుగదురబెట్టి
యుంచు వారి కట్టి
వంచనరాదొకో , వి. వే.

పరుల కపకారము చేయని పక్షులను పట్టుకొని పంజరములో బంధించువారికిని అట్టి గతియే పట్టును

Men who trap birds, that won't hurt anyone, and keep them in cages suffer the same fate.

1923
పాదుకొని హృదయమందున సాధారణ వృత్తులడంచి సన్నుతిగను జీవాధారచక్రమందును మోదంబున విఘ్నపతికి మ్రొక్కుము వేమా

పాదుకొని హృదయమందున సాధారణ
వృత్తులడంచి సన్నుతిగను జీవాధారచక్రమందును
మోదంబున విఘ్నపతికి
మ్రొక్కుము వేమా

హృదయమును ఆవరించియున్న లౌకికములగు సాధారణ వృత్తులను విడిచివేసి ఆ జీవాధార చక్రముపై నున్న విఘ్నపతికి నమస్కరించి తరించుటకు ప్రయత్నింపుము

One has to give up vocational knowledge that is engulfing the heart, pay obeisance to the elephant god who resides in jeevaa-dhara-chakra, and try for salvation.

1924
పాలగతియు నీరు పాలెయై రాజిల్లు గురునివలన నట్లు కోవిదుడగు సాధుసజ్జనముల సంగతులిట్లురా , వి. వే.

పాలగతియు నీరు పాలెయై రాజిల్లు
గురునివలన నట్లు కోవిదుడగు
సాధుసజ్జనముల సంగతులిట్లురా,
వి. వే.

పాలతో కలిసిన నీటికిని పాలరంగు , రుచియు కలుగును. ఇట్లే గురువు మూలమున విద్వాంసుడవు కావచ్చును . మంచివారితో చేరిన మంచి గుణములే యబ్బును

The water poured into milk acquires the color and taste of milk. Similarly one can become a great learned man because of a guru. If one befriends good people, then he will be good too.

1925
పాలనీటి కలత పరహంస మెఱుగును నీరు పాలు నెట్లు నేర్చు నెమలి? ఆజ్ఞుడైన హీనుడల శివు నెఱుగునా ? వి. వే.

పాలనీటి కలత పరహంస మెఱుగును
నీరు పాలు నెట్లు నేర్చు
నెమలి? ఆజ్ఞుడైన హీనుడల
శివు నెఱుగునా ? వి. వే.

పాలు, నీరు వేరుచేయుటను హంస యెరుగునుగాని, నెమలి యెట్లెరుగును ? జ్ఞానియగు ఉత్తముడే పరతత్త్వ మెరుగునుగాని మూర్ఖుడగు హీనుడెరుగజాలడు

A mythical swan can separate water from milk, but not a peacock. A person of great knowledge and morality will know about nether world but not a foolish low-life.

1926
పాలప్రియముచేత బరగ నేడ్చెడిబిడ్డ క్షుత్తు తప్పుట కిల శోకపడగ తల్లి పనులు తీర్చి తనయుని ముద్దాడు , వి. వే.

పాలప్రియముచేత బరగ నేడ్చెడిబిడ్డ
క్షుత్తు తప్పుట కిల
శోకపడగ తల్లి పనులు తీర్చి
తనయుని ముద్దాడు , వి. వే.

బిడ్డ పాలకై ఏడ్చుచున్నప్పుడు , తల్లి పనులు తీర్చుకొనివచ్చి బిడ్డను ముద్దాడి పాలిచ్చును. ఆ రీతినే గురువు శిష్యుని బుజ్జగించి బోధించి ముక్తి కలుగచేయును

When her child is crying, the mother will first finish her tasks, pacify the child and give it milk. Similarly a guru will cajole his disciple and teach him the knowledge to attain salvation.

1927
పాలరాళ్ళదెచ్చి పరాగంగ గుడికట్టి చెలగి శిలలు పూజ చేయుచుండ్రు శిలల బూజచేయ చిక్కునదేమిటి ? వి. వే.

పాలరాళ్ళదెచ్చి పరాగంగ గుడికట్టి
చెలగి శిలలు పూజ
చేయుచుండ్రు శిలల బూజచేయ
చిక్కునదేమిటి ? వి. వే.

పాలరాళ్ళతో అందముగా గుడులుకట్టి వానిలో విగ్రహము నుంచి పూజింతురు . రాళ్ళను పూజించుటవలన కలుగు ప్రయోజనమేమో తెలియదు

People build great temples with marble stone and erect idols in them to worship. It is not clear what benefit one gets by worshiping stones.

1928
పాలు పెరుగు వెన్న పాయసంబును నేయి జున్ను లెన్నియైన జూడపాలె పాలవంటికులము బ్రహ్మంబు కానరో , వి. వే.

పాలు పెరుగు వెన్న పాయసంబును
నేయి జున్ను లెన్నియైన
జూడపాలె పాలవంటికులము బ్రహ్మంబు
కానరో , వి. వే.

పాలు, పెరుగు, వెన్న, పాయసము, నేయి, జున్ను, అన్నియు పాల వికారములే ! అట్లే ఇన్ని వర్ణములుండగా బ్రాహ్మణులే గొప్పయని యెట్లు చెప్పవచ్చును?

Milk, yogurt(curd), butter, ghee, etc. are all various forms of milk. So when there are so many castes, why should brahmins be considered as members of the superior caste?

1929
కల్లలాడుకంటె కష్టంబు మఱిలేదు కష్టమెపుడొ కీడు కలుగజేయు ద్విజుడననుట చూడ త్రిమ్మరి తనమురా , వి. వే.

కల్లలాడుకంటె కష్టంబు మఱిలేదు
కష్టమెపుడొ కీడు కలుగజేయు
ద్విజుడననుట చూడ త్రిమ్మరి
తనమురా , వి. వే.

అసత్యమాడుటకంటె చెడ్డ వేరొకటి లేదు. అది యెప్పటకైనను కీడు కలిగించును. కల్లలాడువాడు ద్విజుడైనను చెడ్డవాడే యగును

There is no bigger immorality than lying. It will one day land one in trouble. Even if a lying person is a brahmin, he will be considered as an immoral man.

1930
కల్లుద్రాగువానిని కల్లు మ్రుచ్చనరాదు కల్లలాడువాడె కల్లుమ్రుచ్చు కల్లుత్రాగుకంటె కల్లలాడుట కీడు, వి. వే.

కల్లుద్రాగువానిని కల్లు మ్రుచ్చనరాదు
కల్లలాడువాడె కల్లుమ్రుచ్చు
కల్లుత్రాగుకంటె
కల్లలాడుట కీడు, వి. వే.

కల్లు త్రాగువానిని కల్లు మ్రుచ్చ౦దురుగాని , ఆలోచించి చూచినచో కల్లలాడువాడే కల్లుమ్రుచ్చు . త్రాగువానికే కల్లు కష్టము కల్గించును . అసత్యమందరికిని కష్టము కలిగించును

One who drinks liquor is considered to be low-life. By reflection one should know a lying person is actually the low-life. Liquor will spoil the health of the drunkard. But a lie affects everyone.

1931
నిజములాడునతడు నిర్మలుడైయుండు నిజమునాడు నతడు నీతిపరుడు నిజము పల్కకున్న నీచచండాలుడు , వి. వే.

నిజములాడునతడు నిర్మలుడైయుండు
నిజమునాడు నతడు నీతిపరుడు
నిజము పల్కకున్న
నీచచండాలుడు , వి. వే.

నిజము పలుకువాడు పరిశుద్ధుడు . అతడే నీతి కాలవాడై యుండును. నిజము చెప్పనివాడే చండాలుడు . కాని జాతిచే చెండాలుడైనవాడు చండాలుడు కాదు

A man who speaks truth always is pure. He will be also morally upright. A liar is a low-life. However a low-life based on caste is different from him.


1932
పగలుడగు నాసలుడుగును వగపుడుగం గోర్కెలుడుగు వడి జన్మంబుల్ తగులుడుగ భోగముడిగిన త్రిగుణంబును నుడుగ ముక్తితెరువగు వేమా

పగలుడగు నాసలుడుగును వగపుడుగం
గోర్కెలుడుగు వడి జన్మంబుల్ తగులుడుగ
భోగముడిగిన త్రిగుణంబును
నుడుగ ముక్తితెరువగు వేమా

నిరోధములు నశించిన ఆశలు నశించును . విచారము లేకున్న కోరికలును నశించును . భోగములు నశించిన జన్మములు నశించును. త్రిగుణములు నశించిననేకాని ముక్తి కలుగదు

If impediments are removed desires will subside; if there is no sorrow wishes will be destroyed; if luxuries are destroyed, there is no need for multiple lives. Without overcoming the 3 gunas (sattva-calm, rajas-action, tamas-indolence), it is not possible to attain salvation.

1933
పుట్టు పుట్టలేదె పుడమిని జనులెల్ల పుట్టగిట్టలేదె పూర్వులెవరు పుట్టిగిట్టుటెల్ల వట్టి భ్రాంతులుసుమీ , వి. వే.

పుట్టు పుట్టలేదె పుడమిని జనులెల్ల
పుట్టగిట్టలేదె పూర్వులెవరు
పుట్టిగిట్టుటెల్ల వట్టి
భ్రాంతులుసుమీ , వి. వే.

పుట్టినవారికి చావు తప్పదు. పుట్టినవారు చావక బ్రతికియున్నవారు లేరు. చావు, పుట్టువులు భ్రాంతులు. పుట్టినవాడు చచ్చునట్లే చచ్చినవాడును తిరిగి పుట్టుచున్నాడు

All things born must die. There is no one who after being born did not die. Both birth and death are illusory. Like one is dying after birth, one is being born again after death.

1934
పూసపోగు పసిడి పుష్పంబు మొదలగు సంపదగలవాడు జగతియందు హీనకులజుడైన హెచ్చని యందురు , వి. వే.

పూసపోగు పసిడి పుష్పంబు
మొదలగు సంపదగలవాడు జగతియందు
హీనకులజుడైన హెచ్చని
యందురు , వి. వే.

ఆభరణములు, బంగారము మున్నగు సంపాదలున్న వాడు హీనజాతివాడైనను , వానిని గొప్పగా చూచుట స్వభావము

People look up to a person with gold and wealth as great even if he is of low-caste.

1935
పెట్టిపోయలేని వట్టిదేబెలు భూమి బుట్టిరేమివారు గిట్టరేమి ? పుట్టలోన జెదలు పుట్టదా గిట్టదా ? వి. వే.

పెట్టిపోయలేని వట్టిదేబెలు
భూమి బుట్టిరేమివారు గిట్టరేమి?
పుట్టలోన జెదలు పుట్టదా
గిట్టదా ? వి. వే.

ఇచ్చి, పోషింపలేని పిసినిగొట్టులు బ్రతికియున్నను చచ్చినను ఒక్కటే! పుట్టలో చెదలు పుట్టుచు, అణగి పోవుచును ఉండును . పిసిని గొట్టులును అట్టివారే

A miser, who can't give or share with others, would rather be dead. Termites are being born and dying again and again. Similarly the misers.

1936
పొత్తు గుడవవచ్చు పుత్రుడేవయసైన దొత్తుకొడుకు నెంగిలెత్తుకొండ్రె కాని వాని జోలికాన రీ రీతిగా , వి. వే.

పొత్తు గుడవవచ్చు పుత్రుడేవయసైన
దొత్తుకొడుకు నెంగిలెత్తుకొండ్రె
కాని వాని జోలికాన
రీ రీతిగా , వి. వే.

కొడుకు ఏ వయస్సువాడైనను , వానిని పంక్తిలో కూర్చుండబెట్టుకొని భుజింతురు . దాసి కొడుకుతో కలిసి భుజింపరు . ఇష్టము లేనివానిని ఇట్లే జనులు తిరస్కరింతురు

Regardless of age, one will eat along side his own son, but not with the son of a servant maid. People refuse to accept those they don't like.

1937
ప్రభువు క్రోతియైన ప్రగ్గడ పందియౌ సైనికుండు పక్కి సేన పనులు ఏన్గులశ్వములను నెలుకలు పిల్లులు, వి. వే.

ప్రభువు క్రోతియైన ప్రగ్గడ
పందియౌ సైనికుండు పక్కి సేన
పనులు ఏన్గులశ్వములను నెలుకలు
పిల్లులు, వి. వే.

రాజు క్రోతివలె చపలుడైన మంత్రి తిండిపోతగును . సేనాధిపతి ఎగురుచుండును . సైనికులు పశువులవలె ఉందురు. ఏనుగులు, గుర్రములు , ఎలుకలు, పిల్లులువలె నిరుపయోగములగును

If a king is fickle minded like a monkey, his prime minister will be a glutton; his defense minister will be hallucinating; and his soldiers will behave like cattle. The elephants, horses in his cavalry are useless like rats and cats.

1938
ఫణికి గోరలుండ భయమొందునట్టులే వెఱతురయ్య దుష్టువిభవమునకు కోఱలూడ ద్రాచు మీఱునా దుష్టత , వి. వే.

ఫణికి గోరలుండ భయమొందునట్టులే
వెఱతురయ్య దుష్టువిభవమునకు
కోఱలూడ ద్రాచు మీఱునా
దుష్టత , వి. వే.

దుష్టునకు సంపద కల్గినచో, కోరలున్న పామును చూచి భయపడినట్లు , వానిని చూచి అందరును భయపడుదురు . సంపద లేనిచో కోరలు లేని పామును చూచి భయపడని రీతి , భయపడరు

When a man of immoral character accrues wealth, people will fear him like a venomous snake. If he has no wealth they don't fear him like a fang-less snake.

1939
బాపడనగనేమి? భక్తుడనగనేమి ? జోగీయనగనేమి? స్రుక్కనేమి? ఇన్నియేల వెన్కని నజు౦డు పని తీర్చు, వి. వే.

బాపడనగనేమి? భక్తుడనగనేమి?
జోగీయనగనేమి? స్రుక్కనేమి?
ఇన్నియేల వెన్కని నజు౦డు
పని తీర్చు, వి. వే.

వీడు బ్రాహ్మణుడు , వీడు భక్తుడు, వీడు యోగి అను నిట్టి భేదములను చూడక యముడు వారివారి పాపములకు తగినట్లు శిక్షించునేగాని, పక్షపాతము చూపడు

The god of death doesn't care whether one is a brahmin or a devotee or a yogi. He will punish them based on their sins without partiality.

1940
బాలచనుల బూలబంతుల బోల్తురు ప్రాలుమాలినట్టి భ్రాంతులవని మాంసఖండమందు మఱియేమి యున్నది! వి. వే.

బాలచనుల బూలబంతుల బోల్తురు
ప్రాలుమాలినట్టి భ్రాంతులవని
మాంసఖండమందు మఱియేమి
యున్నది! వి. వే.

అందమైన యువతీ స్తనములను పూలగుత్తులతో పోల్చి జనులు భ్రాంతి పొందుదురు . అవి మాంసఖండములే గదా! ఇట్టి భ్రాంతులను విడువవలెను

Men compare the bosom of beautiful women with bunches of flowers and fall into delusion. After all, they are made of muscle and flesh. One has to give up such delusions.

1941
బాల్యమందు తాను బాహువిధములబట్టి చప్పపఱచినట్టి స్తనములకును మోహమింతయేల మూఢాత్మ తెలియరా, వి. వే.

బాల్యమందు తాను బాహువిధములబట్టి
చప్పపఱచినట్టి స్తనములకును
మోహమింతయేల మూఢాత్మ
తెలియరా, వి. వే.

పసితనమున తాను పాలకై చప్పరించినవే యివి అని తలపక మానవుడు ఆ స్తనములను చూచి మోహము చెందును

A lustful man will not think about the bosom of his mother that fed him milk when he was a child—when he is deluding about a woman's bosom.

1942
బూతులేని లంజే భూతంబు కూతురు ప్రీతిలేనిపాటు చేతచేటు దాతలేని యూరు దయ్యాలపేటరా , వి. వే.

బూతులేని లంజే భూతంబు కూతురు
ప్రీతిలేనిపాటు
చేతచేటు దాతలేని యూరు దయ్యాలపేటరా,
వి. వే.

విటుల కోరిక తీర్చని యుంపుడుకత్తె పిశాచము. ప్రీతితో చేయని పని దండగ . దాతలేని యూరు దయ్యాల పేట.

A prostitute who cannot satisfy her customer is a devil; a task done without love is waste; a village without a donor is haunted.

1943
బ్రాహ్మణునకు మ్రొక్క బహుదీవనల నొస౦గు నాత్మశుద్ధి కలుగు నాతడైన కలుగు నన్ని కామికంఠశోషయె సుమీ, వి. వే.

బ్రాహ్మణునకు మ్రొక్క బహుదీవనల
నొస౦గు నాత్మశుద్ధి కలుగు
నాతడైన కలుగు నన్ని కామికంఠశోషయె
సుమీ, వి. వే.

ఆత్మశుద్ధి కల బ్రాహ్మణునకు నమస్కరించినచో అతడు దీవించిన మేలగును. లేనివానికి మ్రొక్కిన ప్రయోజనము లేదు

A brahmin with pure aatma deserves to be paid obeisance. If he blesses one, there will be prosperity. There is no use in paying obeisance to a brahmin who is not pure.

1944
భక్తికి మూలము జ్ఞానము రక్తిగ గురుచెంతజేరి రక్కొనినంతన్ యుక్తిగ నెఱుకయి తోచును ముక్తికి నిలయమగు దారి మునుకొని వేమా

భక్తికి మూలము జ్ఞానము రక్తిగ
గురుచెంతజేరి రక్కొనినంతన్ యుక్తిగ
నెఱుకయి తోచును ముక్తికి
నిలయమగు దారి మునుకొని వేమా

జ్ఞానము భక్తివలన లభించును గాన, గురువును భక్తితో సేవించి జ్ఞానమును సంపాదించవలెను

Since knowledge is acquired by devotion, it is better to serve a guru and acquire knowledge.

1945
బత్తిలేక లంజె పలుమాఱు పిలిచిన బత్తికాదు లయపు మిత్తిగాని దుత్తి చొరగనిల్లు మ్రింగకపోవునా ? వి. వే.

బత్తిలేక లంజె పలుమాఱు పిలిచిన
బత్తికాదు లయపు మిత్తిగాని
దుత్తి చొరగనిల్లు
మ్రింగకపోవునా ? వి. వే.

భక్తి లేనియెడల ఎంత పిలిచినను లంజె దగ్గరకు రాదు . ప్రీతిలేని యా వేశ్య మృత్యువు వంటిది . మృత్యువు కడతేర్చినట్లే ఇదియు ధనము తీసికొని మనుష్యుని కడతేర్చును

Without devotion a prostitute will not respond however many times she is beckoned. She is like death. Like death that releases one of his body, she will empty his pockets of his wealth.

1946
భక్తి ముక్తి కలుగు భాగ్యంబు కలుగును చిత్తమెఱుగు పడతి చెంత బతికి చిత్తమెఱుగని సతి జేరంగరాదురా, వి. వే.

భక్తి ముక్తి కలుగు భాగ్యంబు
కలుగును చిత్తమెఱుగు పడతి
చెంత బతికి చిత్తమెఱుగని
సతి జేరంగరాదురా, వి. వే.

భార్య అనుకూలురాలై మనస్సు ననుసరించి మెలగినచో భక్తి, ముక్తి, భాగ్యము కలుగును . మనస్సెరిగి ప్రవర్తింపని యువతిని చేరదీయరాదు

If a wife is obedient and acts according to the wishes of her husband, then devotion, salvation and prosperity can be had. One should not consort with a woman who won't understand one's mind.

1947
భక్తియున్న చోట బరమేశ్వరు౦ డుండు భక్తిలేనిచోట పాపముండు భక్తి కలుగువాడు పరమాత్ముడగునయా , వి. వే.

భక్తియున్న చోట బరమేశ్వరు౦
డుండు భక్తిలేనిచోట పాపముండు
భక్తి కలుగువాడు పరమాత్ముడగునయా,
వి. వే.

భక్తిగలచోట దేవుడుండును . భక్తిగలవాడు పరమాత్మ సమానుడు. భక్తిలేని చోట పాపమే యుండును

Where there is devotion, there will be god. A man with devotion is equal to paramaatma. Where there is no bhakti, everything will be immoral.

1948
భల్లుకములోని ప్రాజ్ఞులు నిల్లోకమునందు గురుని నెఱు౦గరు తమలో ముల్లోకము లెఱుగునటుల గొల్లున బొగడుకాను చుండ్రు గొనకొని వేమా

భల్లుకములోని ప్రాజ్ఞులు నిల్లోకమునందు
గురుని నెఱు౦గరు తమలో ముల్లోకము
లెఱుగునటుల గొల్లున బొగడుకాను
చుండ్రు గొనకొని వేమా

ఎలుగుబంట్లవలె నుండు మూర్ఖులు గురువుల నెరుగక తామే గొప్పవారమని పొగడుకొనుచుందురు

Foolish people resembling mountain bears without serving gurus trumpet their own selves as superior.

1949
భవుడు చిత్రముగను భార్యను మోయును అట్టు మోయగలుగు దిట్టమైన నతనివలెనె బూది యలదిన మెఱుగగు , వి. వే.

భవుడు చిత్రముగను భార్యను
మోయును అట్టు మోయగలుగు దిట్టమైన
నతనివలెనె బూది యలదిన
మెఱుగగు , వి. వే.

శివుడు ప్రేమవలన భార్యను మోసెను . అట్లే నరుడును ప్రేమతో భార్యను మోసినయెడల శివునివలెనే బూడిద పూసికొని విరక్తుడై సన్న్యాసి కావలసి వచ్చును

Lord Siva carried his wife out of love. If a man does the same, he will have to smear ash all over his body, renounce all and become a sannyasi.

1950
భోగభాగ్యంపు సుఖముల బొందవచ్చు రాగవైషుమ్యములనెడి తీగత్రెంచి వేగమదియందు గురుభక్తి సాగనిమ్ము యోగివరులకు దీటుగా నందు వేమా

భోగభాగ్యంపు సుఖముల బొందవచ్చు రాగవైషుమ్యములనెడి
తీగత్రెంచి వేగమదియందు
గురుభక్తి సాగనిమ్ము
యోగివరులకు దీటుగా నందు వేమా

రాగద్వేషాదులు విడిచి గురువును భక్తితో సేవించినచో సమస్త భోగ భాగ్యములను అనుభవింపవచ్చును . గురు భక్తి యున్నయెడల యోగులకు సాటిగా నుండవచ్చును

It is possible to enjoy all the comforts if one can serve a guru without attachment or hatred. One can be on the equal footing as a yogi if he is devoted to his guru.

1951
భ్రాంతిచేతను మర్త్యులు భక్తి విడువ భయదమౌ పుట్టుచావులు ప్రాప్తములగు నిట్టినరులకు కష్టంబు లెట్లు తీరు? గురుని సన్నిధి తీర్చు నా కొఱత వేమ

భ్రాంతిచేతను మర్త్యులు భక్తి విడువ
భయదమౌ పుట్టుచావులు ప్రాప్తములగు నిట్టినరులకు
కష్టంబు లెట్లు తీరు? గురుని
సన్నిధి తీర్చు నా కొఱత వేమ

మానవులు భ్రాంతులై గురుభక్తిలేక జనన, మరణములను పొందుచుందురు . అట్టివారు ఎన్నటికిని ముక్తిని పొందలేరు . గురువును చేరినచో అతడే లోపములు తీర్చి ముక్తికి దారి చూపును

People living in delusion are caught up in birth-death cycle. They can never attain salvation. If they approach a guru, he will rectify them and show the path to salvation.

1952
మంటలోహములను మ్రాను చీలలయందు పటము గోడలందు బరగనిసుక చెట్టునంటునట్లు జెలగు దేహము జీవి , వి. వే.

మంటలోహములను మ్రాను చీలలయందు
పటము గోడలందు బరగనిసుక
చెట్టునంటునట్లు జెలగు
దేహము జీవి , వి. వే.

లోహముల కగ్ని , కర్రకు చీలలు, గోడలకు పటములు, చెట్టునకు ఇసుక - అంటియున్నట్లు కానవచ్చి అంటకయున్నట్లు జీవీయు దేహమును అంటియు నంటకుండునట్లుండును

Like fire to metals, nail to wood, frames to wall, sand to tree—all things that seems to be sticking with each other but are distinct—jeeva and his body remain in contact and out of touch.

1953
మంటిలోనబుట్టి మంటిలోన బెరిగి మంటిలోనె దిరిగి మనుజుడాయె మన్నుమంటి గలువ మనుజుడే తత్త్వము, వి. వే.

మంటిలోనబుట్టి మంటిలోన బెరిగి
మంటిలోనె దిరిగి మనుజుడాయె
మన్నుమంటి గలువ మనుజుడే
తత్త్వము, వి. వే.

మనుష్యుడు మంటిలో పుట్టి మంటిలోనే పెరిగి, మంటిలోనే తిరిగి మంటిలోనే కలిసిపోవుచున్నాడు . అతడు మంటగలియగా మిగిలిన జీవుడు దేవుడు

A man is born in earth, brought up with earth and ends up in earth. What is left after he devolves into earth is called god.

1954
మఠములోని యోగి మాయాలన్నియు గోసి ఘటములోన నున్న ఘనుని దెలిసి మాటమాటకు గురు మరువక తెలుపురా , వి. వే.

మఠములోని యోగి మాయాలన్నియు
గోసి ఘటములోన నున్న ఘనుని
దెలిసి మాటమాటకు గురు మరువక
తెలుపురా , వి. వే.

నిజమగుయోగి గ్రామములోనుండక మఠములో నివసించుచు మాయల కతీతుడై గురువాక్యమున భగవంతునే ధ్యానించుచుండును

A real yogi will live in a choultry , remain indifferent to maaya (illusion), and meditates on god based on his guru's advice.

1955
మంత్ర మొకటి చెప్పి మఱి దేవతార్చన చేసి తమకు గరుణ చెందినదని వేదపఠన చేసి వెఱ్ఱులైపోదురు , వి. వే

మంత్ర మొకటి చెప్పి మఱి దేవతార్చన
చేసి తమకు గరుణ
చెందినదని వేదపఠన చేసి వెఱ్ఱులైపోదురు,
వి. వే

మనుజులు మంత్రములు చదివి దేవతలను పూజించుచు తాము దాయాళురమైతిమని వెఱ్ఱులై తలంతురు . నిజమైన కరుణాళురు ఇట్లు విర్రవీగరు

Some priests claim they have become daayaaLu by reciting mantra in front of divine idols. The real compassionate priests are never egotistical.

1956
మతినిగానలేరు మఱి బ్రహ్మమూర్తిని మదిని గన్నవారు మహిని లేరు వెదకి తనువులోన వేడ్కతో నెఱిగిన నతడె యోగి వర్యుడండ్రు వేమ

మతినిగానలేరు మఱి బ్రహ్మమూర్తిని
మదిని గన్నవారు మహిని లేరు
వెదకి తనువులోన వేడ్కతో నెఱిగిన
నతడె యోగి వర్యుడండ్రు వేమ

మాటలు చెప్పుదురేకాని తమలోని బ్రహ్మమును గనుకొన్నవారు లేరు. ఎవరేని పరిశీలించి ఈశ్వరు నెరుగ గలుగుదురేని వారు యోగులే అగుదురు

Men make speeches but are unable to find the brahmam within themselves. Anyone who examines well and finds Iswara will be a true yogi.

1957
మదమువలన గలుగు మాటలు మఱి పల్కి మ్రుచ్చు సుద్దలు నొగి మోసపుచ్చి కాసురాబెనగెడు కష్టుండు గురుడౌనె ?

మదమువలన గలుగు మాటలు మఱి
పల్కి మ్రుచ్చు సుద్దలు నొగి
మోసపుచ్చి కాసురాబెనగెడు
కష్టుండు గురుడౌనె

క్రొవ్విలేనిపోని మాటలు పలుకుచు , ఇతరులను తమ మాటలచే మోసగించుచు ధనము నార్జించు దుష్టబుద్ధి ఎన్నటికిని గురువు కాడు

An immoral person who is obese, talks loosely, earns money by cheating others can never be a guru.

1958
మది గలిగిన పూజ మదనారి మెచ్చును మనసు నిల్పినంత మహితుడగును మనసు లేని పూజ మట్టి సమానము, వి. వే.

మది గలిగిన పూజ మదనారి మెచ్చును
మనసు నిల్పినంత మహితుడగును
మనసు లేని పూజ
మట్టి సమానము, వి. వే.

మనశుద్ధితో పూజించినచో దేవుడు మెచ్చి తరింపజేయును . అట్లు లేనియెడల ఆ పూజ నిరర్ధకము. నిలుకడతోడి మనస్సు కలవాడే పేరు పొందును

When one prays to god with a pure mind, god will reward him. Otherwise, such a prayer is meaningless. A man with a firm mind receives great fame.

1959
మనసులోన బుట్టు మది కోర్కులన్నియు గోర్కులందు ముక్తి కుదురు పడదు మనము బ్రహ్మమనుచు మది నెఱు౦గగలేరు , వి. వే.

మనసులోన బుట్టు మది కోర్కులన్నియు
గోర్కులందు ముక్తి కుదురు
పడదు మనము బ్రహ్మమనుచు
మది నెఱు౦గగలేరు , వి. వే.

మనస్సులోని కోరిక లన్నింటిని నశింపజేసినగాని ముక్తిని పొందలేము . అట్లయిననే బ్రహ్మమును కనుగొనగలము . సామాన్య మానవుడు బ్రహ్మమును ఎరుగలేడు

One cannot attain salvation without giving up all the desires in his mind. Only then one can find brahmam. An ordinary person cannot know brahmam.

1960
మనసునందు ముక్తి మఱియెఱు౦గగలేక మనసు చేత దగిలి మాయమైరి మనసుతానెయైన మర్మజ్ఞుడగు యోగి, వి. వే.

మనసునందు ముక్తి మఱియెఱు౦గగలేక
మనసు చేత దగిలి మాయమైరి
మనసుతానెయైన మర్మజ్ఞుడగు
యోగి, వి. వే.

తమ మనస్సులోనే ఉన్న ముక్తి నెరుగలేక చాల మంది మోసపోయిరి. మనస్సు, తాను ఏకమైనయెడల మర్మము బాగుగా తెలియును. ఆ రీతి తెలిసికొన్నవాడే యోగి

Many men are deceived by not knowing that their own minds have the key to salvation. When one knows his mind well then one knows the method to harness it. Such a person is called a yogi.

1961
మనసులోని వాని మనసులోనె కలిసి మనసులోనె వాని మగ్నమంది మనసు దెలియువాడు మర్మజ్ఞుడైయుండు , వి. వే.

మనసులోని వాని మనసులోనె కలిసి
మనసులోనె వాని మగ్నమంది
మనసు దెలియువాడు మర్మజ్ఞుడైయుండు,
వి. వే.

మనస్సులోనున్న దేవుని మనస్సుననే కలిసికొని, తన్మయుడై తత్త్వము నెరిగినవాడే బ్రహ్మము నొందగలుగును . వాడే మర్మజ్ఞుడు

One who meets the god in his mind, revels in its bliss, thus learns tattva, is suitable to attain brahmam. He is the one knowing the method.

1962
మనసులోనె పుట్టె మాయ సంసారము మనసు విరిగెనేని మాయ తొలగు మనసు నిల్పెనేని మహితానె బ్రహ్మము, వి. వే.

మనసులోనె పుట్టె మాయ సంసారము
మనసు విరిగెనేని మాయ
తొలగు మనసు నిల్పెనేని మహితానె
బ్రహ్మము, వి. వే.

ఈ మాయ సంసారము మనస్సులోనె పుట్టినది. మనస్సు విరిగిన సంసారపు మాయ విరుగును . మనస్సును స్థిరముగా నిల్పుటవల్లనే మానవుడు బ్రహ్మత్వమును పొందుచున్నాడు

The bondage of maaya originates in one's mind. With mind one can renounce the bondage. One is able to attain brahmam by controlling the mind.

1963
మన్నుకుప్పజేసి మంటిలో గోరాడి మంటి కుండనంటి మఱగి తిరిగి మన్ను మంట గలియు మఱియెందుబోయెనో , వి. వే.

మన్నుకుప్పజేసి మంటిలో గోరాడి
మంటి కుండనంటి మఱగి
తిరిగి మన్ను మంట గలియు మఱియెందుబోయెనో,
వి. వే.

దేవుడు మంటికుప్పవలన దేహములను సృజించగా , అజ్ఞానియగు మానవుడు వేరొక మంటి బొమ్మ కంటువడి తిరుగుచున్నాడు . మన్ను మనస్సులో కలిసినపుడు మమకారమెచటికి పోవునో?

1964
మనియుండెడి జగమెల్లను చనిపోయిన వారి పుణ్యసత్కథ వెలమిన్ వినవలె మనవలె జనవలె ననిమిషులకునైన తెలియ దంత్యము వేమా

మనియుండెడి జగమెల్లను చనిపోయిన
వారి పుణ్యసత్కథ వెలమిన్
వినవలె మనవలె జనవలె ననిమిషులకునైన
తెలియ దంత్యము వేమా

బ్రతికియున్న వారందరును చనిపోయిన గొప్పవారి చరిత్రలను విని, ఆ రీతినే నడచుకొని , వారివలనే మరణింపవలెను . మృత్యు వెప్పుడువచ్చునో తెలియదు. కావున పుణ్యమార్జింపవలయును

One has to listen to the biographies of great men who preceded him, live according to the example set by them and die like them. No one knows when death will strike. One has to perform good karma.

1965
మనస్సువాక్కుకర్మ మఱి యేమిలేకాయె రాక పోక లేని రాజవీధి పరగహాని కలదె పరతత్త్వయోగికి, వి. వే.

మనస్సువాక్కుకర్మ మఱి యేమిలేకాయె
రాక పోక లేని
రాజవీధి పరగహాని కలదె పరతత్త్వయోగికి,
వి. వే.

మనోవాక్కర్మములకు లోబడక ప్రవృత్తి నివృత్తి శూన్యుడగు పరమాత్మతో ఐక్యము చెందిన యోగికి హానిలేదు

There is no harm to a yogi who is not yielding to mind-speech-karma and seeks to merge with paramaatma who has neither pravritti (path of action) nor nivritti (path of knowledge)

1966
మనసే మాయా మృగమౌ మననేమిటి పైకిగాని మఱిపోనీకా మనసున మనసున జంపిన మనసందే ముక్తి గలదు మహిలో వేమా

మనసే మాయా మృగమౌ మననేమిటి
పైకిగాని మఱిపోనీకా మనసున
మనసున జంపిన మనసందే
ముక్తి గలదు మహిలో వేమా

మనస్సే మాయమృగము . మనస్సును దేనిపైకి పోనీయక, మనోవికారములను మనస్సునందే అణచిన యోగికి ముక్తి మనస్సునందే సమకూరును

Mind is a beast of maaya (illusion). One has to control it and devolve all emotions into itself. That way a yogi can attain salvation with mind alone.

1967
మన్ను పాఱబట్ట మనకేమి లాభము ? ధాన్యమట్లు చేయదగును గాని ఘనునిలోపమెన్నగారాదు విడువుము , వి. వే.

మన్ను పాఱబట్ట మనకేమి లాభము?
ధాన్యమట్లు చేయదగును
గాని ఘనునిలోపమెన్నగారాదు
విడువుము , వి. వే.

ధాన్యము పారబట్టిన లాభముండును. మన్ను పారబట్టిన లాభమేమి ? ప్రపంచబంధములు విడువని వానిని విమర్శింపవలెను గాని, యోగిని విమర్శించిన ప్రయోజనము లేదు.

If paddy is harvested there will be profit. But not if it is sand. One has to criticize a person who can't release himself from bondage rather than a yogi.

1968
మన్నుమిన్నునంటి మహిమీద నొక కోట కొమ్ము లమరియందు గొనలు మిగిలి దివ్వెలేని వెలుగు తేజరిల్లుచు నుండు, వి. వే.

మన్నుమిన్నునంటి మహిమీద నొక
కోట కొమ్ము లమరియందు గొనలు
మిగిలి దివ్వెలేని వెలుగు తేజరిల్లుచు
నుండు, వి. వే.

భూమ్యాకాశములు నిండి మహదాకృతితో సమస్త వస్తువులందును బ్రహ్మము వ్యాపించియున్నది . అది దీపములేని వెలుగుగా జ్యోతిర్మయమై ప్రకాశించుచున్నది

Brahmam is everywhere between the sky and earth and in all things. It is resplendent like light without a lamp.

1969
మాటల మాటలు వచ్చును మాటలనే కలుగుచుండు మణిమంత్రంబుల్ మాటల పొందిక తెలిసిన మాటలనే ముక్తికలుగు మహిలో వేమా

మాటల మాటలు వచ్చును మాటలనే
కలుగుచుండు మణిమంత్రంబుల్
మాటల పొందిక తెలిసిన మాటలనే
ముక్తికలుగు మహిలో వేమా

మానవులాడే మాటలే నిందను , మంత్రసిద్ధిని కలిగించును. పొందికగా మాటలాడిన , ఆ మాటలవల్ల ముక్తియు చేకూరును

A man's speech can be a censure or a powerful mantra. One who talks modestly will attain salvation.

1970
మాదిగయనగనె మఱి తక్కువందురు మాదికయిలసురుల మామ గాదె మాదిగకును బిడ్డ మన యరుంధతి గదా, వి. వే.

మాదిగయనగనె మఱి తక్కువందురు
మాదికయిలసురుల మామ
గాదె మాదిగకును బిడ్డ మన
యరుంధతి గదా, వి. వే.

మాదిగజాతి వానిని హీనునిగా చూచెదరుగాని మాదిగ దేవతకు మామకాడా ? మాదిగ బిడ్డయగు అరుంధతిని వశిష్ష్ఠ మహాముని వివాహమాడెను కదా

A cobbler is looked down by men. Isn't a cobbler a god's father-in-law? The sage Vasishtha married Arundhati who was born to a cobbler.

1971
మాయనరకమనుచు మాయ రోయక సాటి సమముగ నరదేవ సభలయందు నందఱు ఘనులైన హరునకుదావేది ? వి. వే.

మాయనరకమనుచు మాయ రోయక
సాటి సమముగ నరదేవ సభలయందు
నందఱు ఘనులైన హరునకుదావేది?
వి. వే.

మాయ నరకమని పల్కుచునే జనులా మాయలోనే పడుచున్నారు . అట్లు వారు మాయకు వశులుకాక యున్న యెడల అందరును శివస్వరూపులై కైలాసమునకు పోయిన యెడల అచట శివునకును నిలుచుటకు చోటు లేకుండ పోవును

Even though they know maaya (illusion) is hell, men are falling for it. Because of maaya, they will be incarnations of Lord Siva and go to his abode Kailash. Then the real Lord Siva won't even have a foot hold in his own abode.

1972
మోదమునను గురు ముఖ్యుల కరుణచే తొమ్మిది స్థలముల దొడ్డు వాయ సర్వజీవుడాయె సర్వంబుతానాయె , వి. వే.

మోదమునను గురు ముఖ్యుల కరుణచే
తొమ్మిది స్థలముల దొడ్డు
వాయ సర్వజీవుడాయె సర్వంబుతానాయె,
వి. వే.

సంతోషముతో గురువును చేరి, అతని యనుగ్రహము సంపాదించి , నవరంధ్రములతో నీచమైన దేహసంబంధమును విడిచి సర్వజీవునితో ఐక్యమందిన , తానే సర్వము నగును

One has to approach a guru happily, seek his blessing, leave behind the body with 9 holes, and disassociate oneself from the bondage with body, and merge with sarva-jeeva. Then he will be everything there is.

1973
మోహజలధిలోన మునిగిచచ్చుటె కాని హరి పారాయణత్వమమరబోదు ముట్టి గురుని పాదమూలము నొందుము , వి. వే.

మోహజలధిలోన మునిగిచచ్చుటె
కాని హరి పారాయణత్వమమరబోదు
ముట్టి గురుని పాదమూలము
నొందుము , వి. వే.

మానవు లెన్నివిధముల శ్రమపడినను సంసారమోహ సముద్రమున పడుదురే కాని భగవత్పరాయణులు కారు. వారిని తరింపజేయువాడు గురువే! అతని పాదములనే ఆశ్రయింపవలెను

Men, no matter how hard they try, can't be real devotees because of their bondage. Only a guru can save them. One has to hold a guru's feet to be rescued.

1974
మోహమనెడి బుద్ధి మూలంబు నెఱిగి తా మోహరించి గురుని మోము చూచి మోహమందు ముక్తి ముక్కొను నిక్కము , వి. వే.

మోహమనెడి బుద్ధి మూలంబు నెఱిగి
తా మోహరించి గురుని మోము
చూచి మోహమందు ముక్తి ముక్కొను
నిక్కము , వి. వే.

మోహమనెడి బుద్ధిమూలమును తెలిసికొని గురుని సేవించి ముక్తి నొందుటకు మోహమునే సాధనముగా చేసికొనుము

One should explore the root cause of lust and serve a guru to attain salvation by utilizing the lust as the means.

1975
యోనియందు బుట్టి యుత్తమ కులజుడై బ్రహ్మకులమునందు బ్రతుకు చుండ్రు బ్రహ్మమెఱుగలేక పడిచత్తరిదె వింత, వి. వే.

యోనియందు బుట్టి యుత్తమ కులజుడై
బ్రహ్మకులమునందు బ్రతుకు
చుండ్రు బ్రహ్మమెఱుగలేక
పడిచత్తరిదె వింత, వి. వే.

అందరివలె తల్లి గర్భమునుండియే పుట్టినను తానుత్తమ కులజుడనని బ్రాహ్మణుడు విర్రవీగుట వింతగా నున్నది

A brahmin claiming to be of highest caste and harboring pride is born to a mother like everyone else.

1976
రద్దిమాని మనసు రాపాడి ధ్వనిజూపి ముద్దుగులుకు నాత్మమూల మంది సద్దుసేయకున్న సంసారి యోగియా ? వి. వే.

రద్దిమాని మనసు రాపాడి ధ్వనిజూపి
ముద్దుగులుకు నాత్మమూల
మంది సద్దుసేయకున్న
సంసారి యోగియా ? వి. వే.

లేనిపోని యార్భాటములు చేయక మనస్సును చిక్కబట్టి ఆత్మమూలమును పొంది యోగి కావలెను . సంసారి కాత్మచిక్కదు

Without pomposity, one has to control mind and learn the root of aatma to become a yogi. A person in bondage cannot realize aatma.

1977
రాకపోకలడచు రాజమార్గముబూని నాక మనెడి గుర్తు వీక నెఱిగి సోకిమించ బయలు సూత్రంబు కాదొకో , వి. వే.

రాకపోకలడచు రాజమార్గముబూని
నాక మనెడి గుర్తు వీక
నెఱిగి సోకిమించ బయలు సూత్రంబు
కాదొకో , వి. వే.

మనస్సుయొక్క ప్రవేశ నిర్గమనములను యోచించి స్వర్గము గుర్తు తెలిసికొని ధ్యానించిన బ్రహ్మసాక్షాత్కారము కలుగును. మోక్షము సాధించుట కిదే రాజమార్గము

One has to analyze how mind enters and exits, and meditate on heaven to see brahmam deify. This is the path of kings.

1978
రాకపోకలేని రాజ మార్గములోన నేకరూపుదలచి యెన్నుటరుదు సోకి సోకి మాయ సొక్కించుటరుదురా , వి. వే.

రాకపోకలేని రాజ మార్గములోన
నేకరూపుదలచి యెన్నుటరుదు
సోకి సోకి మాయ సొక్కించుటరుదురా,
వి. వే.

ప్రవృత్తి నివృత్తులు లేని పద్ధతిలో బ్రహ్మమును ధ్యానించుచు మాయకు లోబడక ప్రవర్తింపవలెను

One has to pray to brahmam without pravritti (path of action) and nivritti (path of knowledge) and by not yielding to maaya (illusion).

1979
రాజయోగమూని తేజమందుట ముక్తి తేజమందుకున్న దేబెలె కద మర్మమింతలేక మహిగురు జూడుము, వి. వే.

రాజయోగమూని తేజమందుట ముక్తి
తేజమందుకున్న దేబెలె
కద మర్మమింతలేక మహిగురు
జూడుము, వి. వే.

రాజయోగము నవలంబించిన యెడల తేజస్సు కలుగును . అదియే ముక్తి. అట్లు తేజస్సు పొందలేనివాడు మూర్ఖుడు . గురువుల నాశ్రయించి యా పద్ధతి తెలిసికొని ముక్తుడవగుము

When one follows raja yoga, one gets aura. That is salvation. One who doesn't have aura is foolish. One has to approach a guru and learn from him.

1980
రాజయోగమునను రాజత్వమును బొందు రాజరాజు దొడ్డ రాజనంగ రాజయోగముననె రాజశేఖరుడాయ్యె , వి. వే.

రాజయోగమునను రాజత్వమును
బొందు రాజరాజు దొడ్డ రాజనంగ
రాజయోగముననె రాజశేఖరుడాయ్యె,
వి. వే.

రాజయోగమువల్లనే రాజరాజు చక్రవర్తియయ్యెను . దానివల్లనే శివుడు రాజశేఖరుడయ్యెను

Because of yoga of king, a king's king is called a chakravarti (emperor). Lord Siva is called Raaja-Sekhara because of that reason.

1981
రాజ్యసంబుచేత రాజ్యభారం బందు నోర్పులేని యాత డుభయతజెడు నీటిపైన గుండు నిలుచునా ముంగక, వి. వే.

రాజ్యసంబుచేత రాజ్యభారం
బందు నోర్పులేని యాత డుభయతజెడు
నీటిపైన గుండు నిలుచునా
ముంగక, వి. వే.

రాజసమువల్ల రాజ్యాధికారము కలుగును. రాజై శాంతము లేనిచో రాజ్యము, మోక్షము కూడ చెడును. నీటిపై రాతి నుంచినచో అది మునుగును గాని తేలదుకదా!

Because of one's royal blood, one will be made a king. If a king is restless his kingdom will suffer and his salvation will be beyond reach. A stone sinks in water but never floats.

1982
రాజసంబు చెంది రమణుల పొందాస పడెడువాడు గురుని ప్రాపెఱుగునె ? విటుల మరుగు యువతి విభుభక్తి యెఱుగునా ?

రాజసంబు చెంది రమణుల పొందాస
పడెడువాడు గురుని ప్రాపెఱుగునె?
విటుల మరుగు యువతి
విభుభక్తి యెఱుగునా

రాజసమున్న వాడైనను , స్త్రీ లోలుడైన యెడల గురువు అనుగ్రహమును పొందలేడు . విటుల వెంట తిరుగు యువతికి పతిభక్తి అబ్బదు కదా!

Even one with royal blood, if he is lusting for women, he can't get the blessing of a guru. A lose woman running around men can't have devotion for her husband.

1983
రూఢిగాను భక్తి రూపించి చెప్పిన వాడె పరమ గురుడు వసుధలోన వేడి పరము గనుటె వేదాంత వేద్యము , వి. వే.

రూఢిగాను భక్తి రూపించి చెప్పిన
వాడె పరమ గురుడు వసుధలోన
వేడి పరము గనుటె వేదాంత
వేద్యము , వి. వే.

భక్తిమార్గమును వివరముగా తెలిసినవాడే గొప్ప గురువు. ఆ గురువును ప్రార్థించి ముక్తిని పొందుము. వేదాంత మెరిగినందుకు మోక్షము పొందుటే ఫలము

A guru who knows the path of devotion is a great guru. One has to pray to such a guru and attain salvation. The fruit of knowing vedas is salvation.

1984
రూఢిమదిని మించి రొద వినజాలక కాడు చేరనేమి ఘనము కలుగు? వీటిలోన రవము విన్నంద వినుచుండు , వి. వే.

రూఢిమదిని మించి రొద వినజాలక
కాడు చేరనేమి ఘనము కలుగు?
వీటిలోన రవము విన్నంద
వినుచుండు , వి. వే.

మనస్సును నిలిపి నాదమును కనిపెట్టవలెను . అట్లు చేయలేక అడవుల దిరిగి మాత్రమున యోగి కాజాలడు . నాదమును ఆనింపగలిగెనేని మహదాకాశము నెరుగవచ్చును

One has to hear the naadam (aum) with a concentrated mind. There is no use roaming around forests without concentrating one's mind. If one can listen to the naadam, one can realize the vastness of space.

1985
రోగియైనవాడు రోగి నెఱు౦గును రోగి నరసి చూచి రూఢిగాను రోగికిడినవాని రాగి బంగారమౌ , వి. వే.

రోగియైనవాడు రోగి నెఱు౦గును
రోగి నరసి చూచి రూఢిగాను
రోగికిడినవాని రాగి
బంగారమౌ , వి. వే.

రోగి తత్త్వము రోగియైనవాడే గ్రహింపగలడు . సరిగా రోగమును కనిపెట్టి యిచ్చిన తామ్రభస్మము స్వర్ణభస్మముగా పనిచేయును. అట్లే తగినవాని కిచ్చిన బోధ సఫలమగును

A sick person's travail is only known to another sick person. Once the diagnosis for sickness is made, appropriate treatment can be provided. When a guru imparts knowledge to a suitable disciple, his teachings will be successful.

1986
లజ్జలజ్జయనుచు లలనల మీదికి లజ్జ విడిచి తిరుగు లావరియయి లజ్జ తెలిసె నేని లలనల దాకునా? వి. వే.

లజ్జలజ్జయనుచు లలనల మీదికి
లజ్జ విడిచి తిరుగు లావరియయి
లజ్జ తెలిసె నేని
లలనల దాకునా? వి. వే.

కొందరు పైకి సిగ్గు సిగ్గని సిగ్గు నటించుచు లజ్జ విడిచి తిరుగుచుందురు . నిజముగా సిగ్గున్న యెడల యువతులవైపు పోనే పోరు

Some men pretend to be shameful. Yet they conduct themselves shamelessly. If they have shame they would never go near young women.

1987
లేడు లేడనినను లేడు లేనేలేడు కాడు కాడటన్నగానె కాడు తోడు తోడన్నను తోడనే తోడగు , వి. వే.

లేడు లేడనినను లేడు లేనేలేడు
కాడు కాడటన్నగానె
కాడు తోడు తోడన్నను తోడనే
తోడగు , వి. వే.

లేడనుకొన్నవానికి దేవుడు లేడు. కాదనువానికి కాక యుండును. “తోడు" అను వారికి తోడై యుండును

For a non-believer there is no god. For a disbeliever God will be hidden. God is a friend for one who believes in him.

1988
లోకమందుబుట్టి లోకమందె పెరిగి లోక విభవమోర్వలేక జనుడు లోకమందు జనికిలోబడి చెడిపోవును , వి. వే.

లోకమందుబుట్టి లోకమందె పెరిగి
లోక విభవమోర్వలేక
జనుడు లోకమందు జనికిలోబడి
చెడిపోవును , వి. వే.

జనులు లోకములో పుట్టి అందే పెరిగియు లోక మందలి ఇతరుల సంపద కోర్వలేక చెడిపోవును . ఓర్పు ముఖ్యము

Men born in this world, grow up and get jealous of others' wealth. As a result they lose their character. Patience is required.

1989
లోకములకు గురువు లోకులకును గురు వదియు దెలిసి మోక్షమందగోరి గురునిగనక నరక కూపము జెందును, వి. వే.

లోకములకు గురువు లోకులకును
గురు వదియు దెలిసి మోక్షమందగోరి
గురునిగనక నరక
కూపము జెందును, వి. వే.

లోకములకును లోకులకును గురువే ఆధారము. ఈ విషయము గ్రహించి , ముక్తిని పొంద దలచినవాడు గురువు నాశ్రయింపవలెను . లేనిచో నరకకూపమున పడును

Guru is the support for worlds and their denizens. One who knows this has to approach a guru for salvation. Otherwise, one will be banished to hell.

1990
లోనుజూచినతడు లోకంబు లెఱుగును బయలజూచినతడు పరమయోగి తన్ను జూచినతడు తానౌను సర్వము, వి. వే.

లోనుజూచినతడు లోకంబు లెఱుగును
బయలజూచినతడు పరమయోగి
తన్ను జూచినతడు తానౌను
సర్వము, వి. వే.

అంతస్సును కనిపెట్టినవాడు సమస్తమును కనిపెట్టగలడు . బయలు కనిపెట్టినవాడే గొప్ప యోగి. తనలోని తత్త్వమును కనిపెట్టిన యాతడే ఆత్మజ్ఞుడగును

One who understands mind will know everything. The one who understands space is a great yogi. The one who knows about aatma is one who explores the tattva within oneself.

1991
వంచన చేసెడియెఱుకను మించిన పరతత్త్వమమరు మేలిమిగన నాశించును గన్గొని యుండిన సంచారము లేని బయలు సరగున వేమా

వంచన చేసెడియెఱుకను మించిన
పరతత్త్వమమరు మేలిమిగన నాశించును
గన్గొని యుండిన సంచారము
లేని బయలు సరగున వేమా

జ్ఞానము సామాన్యుల కందక వారిని వంచించును . అట్టి జ్ఞానము నార్జించినవాని కాత్మ తత్త్వము తెలియును . దానివలన నిర్గుణ తత్త్వమగు బ్రహ్మ స్వరూపము గోచరించును

Knowledge is beyond the reach of ordinary people and undermines them. One who learns such knowledge will know the tattva of aatma. Then, one will visualize the form of brahmam without gunas (sattva-calm, rajas-action, tamas-indolence)

1992
వట్టి మమత జిక్కి వావివారుసలంచు దిక్కపట్టి నరుడు తిరుగుగాని ఎక్కడి తలిదండ్రు? లేమియు దనకేల, వి. వే.

వట్టి మమత జిక్కి వావివారుసలంచు
దిక్కపట్టి నరుడు తిరుగుగాని
ఎక్కడి తలిదండ్రు?
లేమియు దనకేల, వి. వే.

వట్టి మమతలకు లోబడి వావివరుసలు చూచునే గాని మూర్ఖుడు జననీజనకుల గొప్పతనము నెరుగలేడు

A foolish person will seek emotional relationships rather than realize the greatness of his parents.

1993
వక్షమందు గురుని వర్ణించి చూడరా రక్షకత్వమునకు రాచబాట అక్షమాల జపమె యవని దొంగలరీతి, వి. వే.

వక్షమందు గురుని వర్ణించి
చూడరా రక్షకత్వమునకు
రాచబాట అక్షమాల జపమె యవని
దొంగలరీతి, వి. వే.

నిశ్చలమైన మనస్సులో బ్రహ్మస్వరూపమును చూచుటకు యత్నించుట ఆత్మోధ్ధరణకు మార్గము . రుద్రాక్షమాల త్రిప్పుచు జపముచేయుటవల్లనే ప్రయోజనము లేదు

To attain one's aatma the only way is to meditate with an unwavering mind to see the form of brahmam. There is no use in reciting mantra by turning a rosary.

1994
వాక్కువలన గలుగు పరమగు మోక్షంబు వాక్కువలన గలుగు వరలు ఘనత వాక్కువలన గలుగు నెక్కుడైశ్వర్యంబు , వి. వే.

వాక్కువలన గలుగు పరమగు మోక్షంబు
వాక్కువలన గలుగు వరలు
ఘనత వాక్కువలన గలుగు నెక్కుడైశ్వర్యంబు,
వి. వే.

మోక్షము, గౌరవము , ఐశ్వర్యము మాటను బట్టియే కలుగును. యుక్తముగ మాటలాడుటను నేర్చుకొనవలెను

Salvation, honor and wealth are accrued by speech. One has to be modest in speech.

1995
వాక్కునందు గురువు వక్తృతను గురువు చీకటి నటు గురుడు చిక్కియుండు అఖిలమునకు గురువె యాధారమైయుండు , వి. వే.

వాక్కునందు గురువు వక్తృతను
గురువు చీకటి నటు గురుడు చిక్కియుండు
అఖిలమునకు గురువె
యాధారమైయుండు , వి. వే.

వాక్కునకు, వక్తృత్వమునకు , అంధకారమునకు దానిని పోగొట్టుటకును కూడ గురువే ఆధారము

A guru is the source for speech, eloquence, and dispelling ignorance.

1996
వారకాంతలెల్ల వలపించి వత్తురు బుద్ధులెల్ల తొలగబుచ్చు కొఱకు మాట రూఢిగాగ మగలెల్ల వత్తురు, వి. వే.

వారకాంతలెల్ల వలపించి వత్తురు
బుద్ధులెల్ల తొలగబుచ్చు
కొఱకు మాట రూఢిగాగ మగలెల్ల
వత్తురు, వి. వే.

పురుషుల బుద్ధులను చెరచి వారి ధనముల నపహరించుటకు వలపులు నటించి చామత్కారముగా మాటలాడుదురు . పురుషులు వారి మాటలకు లొంగిపోవుదురు

A prostitute will sully a man's character and try to steal his wealth by pretending romance and with sweet talk. Men surrender to her words.

1997
విటునిజేర గోరి వీధిని మదినుంచు పడతిరీతి పరమ బ్రాకనగును గుణములన్ని మఱచి గుర్తించి చూడరా, వి. వే.

విటునిజేర గోరి వీధిని మదినుంచు
పడతిరీతి పరమ బ్రాకనగును
గుణములన్ని మఱచి గుర్తించి
చూడరా, వి. వే.

కులట విటునకై వీధిలోనే నిలిచియుండునట్లు గుణములను లెక్కచేయక పరమును పొందుటకు యత్నింపుము

Just like a prostitute who waits for customers, one has to disregard character and strive to attain salvation.

1998
విటుల జూడగానె మటు మాయచేయును కిటికియందు జేరి కేక వినుచు పటిమ మీఱ స్త్రీల బరికింపలేరయా , వి. వే.

విటుల జూడగానె మటు మాయచేయును
కిటికియందు జేరి కేక
వినుచు పటిమ మీఱ స్త్రీల
బరికింపలేరయా , వి. వే.

స్త్రీలు పురుషులను మోసగించుట కెన్నో రీతుల యత్నింతురు. కిటికీలో చేరి, వలపుచూపులతో చూచుచుందురు . వారి మాయోపాయము లెరుగరానివి

Women try to attract men with deceit in many ways. They stand near the windows and cast cupid eye on men. One cannot know their deceitful ways.

1999
వెఱపు లేక గురుని వేడుచు వేసారి స్థిరముగాను పూజ చేసి చేసి పరము గన్నవాడు పరిపూర్ణ యోగిరా, వి. వే.

వెఱపు లేక గురుని వేడుచు
వేసారి స్థిరముగాను పూజ చేసి
చేసి పరము గన్నవాడు పరిపూర్ణ
యోగిరా, వి. వే.

భయమును విడిచి గురువును పూజించుచు మోక్ష రహస్యములు తెలుపవలెనని ప్రార్థించుచు గురూపదేశము ననుసరించి పరము గన్నవాడే జ్ఞానపూర్ణుడగు యోగి

Leaving behind fear one has to serve a guru and seek the secrets of salvation and live according to the teachings of the guru. Such a person will be a great knowledgeable yogi

No comments:

Post a Comment