Saturday, February 8, 2020

Daiva-Paddati


542
ఇంటియింటిలోని ఈశ్వరునెఱుగక అంటిచూడలేక అడవులందు నుండగోర దైవము ఉండనీయడువాని , వి. వే.

ఇంటియింటిలోని ఈశ్వరునెఱుగక
అంటిచూడలేక అడవులందు
నుండగోర దైవము ఉండనీయడువాని,
వి. వే.

తామనెడి ఇంటిలో పరమాత్మ ఉండగా , అతనికై అడవులకు పోనేల? దీనిని తెలియని ఆవివేకులకు దేవుడు జ్ఞానము నంటనీయడు

When the creator is within oneself, why go to forests in search of him? God will not provide enlightenment to those who don't know that.

543
ఈయనతనిచేత నిప్పించు ధనప్రాప్తి ఇచ్చువానిచేత నీయనీదు ఇయ్యగైకొనంగ ఈశ్వరుడే కర్త, వి. వే.

ఈయనతనిచేత నిప్పించు ధనప్రాప్తి
ఇచ్చువానిచేత
నీయనీదు ఇయ్యగైకొనంగ ఈశ్వరుడే
కర్త, వి. వే

మనకు ప్రాప్తమున్నయెడల ఇయ్యనివాడైనను ఇచ్చును . ప్రాప్తము లేనిచో ఇచ్చువాడైనను ఈయడు . అంతటికీ భగవంతుడే కర్త . మనలో ఏమియు లేదు

If we are deserving we can benefit from one who normally won't offer. If not, we can't benefit from one who normally offers. God is the master.

544
ఇష్ట లింగమేది ? యిల శిల లింగంబె ?నిష్ఠమీఱ మెడకు నీల్గగట్టి కష్టపడుటగాని కలుగదు దైవము, వి. వే.

ఇష్ట లింగమేది ? యిల శిల
లింగంబె ?నిష్ఠమీఱ మెడకు
నీల్గగట్టి కష్టపడుటగాని
కలుగదు దైవము, వి. వే.

కొందరు "ఇష్ట లింగ" మనుచు రాతి లింగమును మెడలో కట్టుకొని కష్టపడుదురు . జ్ఞానమువల్లనేగాని యిట్టిదానివలన దైవమును తెలిసికొనలేము .

Some people wear phallic symbol around the neck claiming it is their favorite deity. One can understand god with true knowledge only.

545
ఈనినట్టి పులిని బూని చంపగవచ్చు మనసు మర్మమరసి కనగవచ్చు దైవమాయ తెలియ దనకసాధ్యంబగు , వి. వే.

ఈనినట్టి పులిని బూని చంపగవచ్చు
మనసు మర్మమరసి
కనగవచ్చు దైవమాయ తెలియ దనకసాధ్యంబగు,
వి. వే.

ఈనిన పులిని చంపుట , మనస్సులోని మర్మ మెరుగుట సాధ్యము కావచ్చునేమోకాని దైవమాయ నెరుగుట సాధ్యము కాదు

One may kill a tigress who delivered a cub or read another person's thoughts, but still won't understand the illusion in front of God.

546
ఉదకమందు పాచి యున్నది చూడరా మదినినున్న మాయ వుట్టుపడక సదనమందు బ్రహ్మ సాక్షిగా నెంచుము , వి. వే.

ఉదకమందు పాచి యున్నది చూడరా
మదినినున్న మాయ వుట్టుపడక
సదనమందు బ్రహ్మ సాక్షిగా
నెంచుము , వి. వే.

నీటిమీది పాచి దానిని అంటుకొనదు . అట్లే మనస్సులోని మాయ నంటక బ్రహ్మమును వుండునని గుర్తించుము .

The moss on the surface won't stick to the water. One has to overcome the illusion in the mind, and gain knowledge about the creator.

547
ఉన్నవార లెవరొ ఛన్నవారెవ్వరొ కన్నవారలెవరొ కానరారు ఉన్న ఛన్న కన్న నొక్కడే చూడరా! వి. వే.

ఉన్నవార లెవరొ ఛన్నవారెవ్వరొ
కన్నవారలెవరొ కానరారు
ఉన్న ఛన్న కన్న నొక్కడే
చూడరా! వి. వే.

ఆజ్ఞతవల్ల "వీరున్నారు , వారు పోయినారు , వారు కన్నారు " అని భ్రాంతి పొందుదుము . ఉన్నది, ఛన్నది , కన్నది ఒక్క బ్రహ్మమే !

Ignorance makes one claim someone is alive or dead. All things are embodiment of the creator regardless of their existence.

548
ఊరుకాడు తిరిగి యున్నది కనలేక పోరి గురుల ౦గనక పొందుపడక తాఱుమాఱుగాను తత్తఱపడనేల ? వి. వే.

ఊరుకాడు తిరిగి యున్నది
కనలేక పోరి గురుల ౦గనక
పొందుపడక తాఱుమాఱుగాను
తత్తఱపడనేల ? వి. వే.

తగిన గురువులను చేరి తత్త్వమును తెలిసికొనలేక అజ్ఞానముతో ఊళ్ళు , అడవులు తిరిగి బాధపడుట వ్యర్థము .

One has to find a virtuous guru and obtain true knowledge from him. Ignorant people roam around forests and suffer without a guru.

549
ఎచటనుండి వచ్చు ఎచటికి దాబోవు ? నిద్రచంద మెఱుగ నేర్చెనేని ఆత్మరాకపోక లతడెపో శివయోగి , వి. వే.

ఎచటనుండి వచ్చు ఎచటికి దాబోవు?
నిద్రచంద మెఱుగ నేర్చెనేని
ఆత్మరాకపోక లతడెపో
శివయోగి , వి. వే.

జీవుడు ఎక్కడినుండి వచ్చి ఎచటికి పోవునో , నిద్రయననేమో, ఆత్మ రాకపోకలేవో తెలిసికొన్నవాడే యోగి

A true yogi is one who knows where from life originates and where to it departs; where from aatma comes and where does it recede to.

550
ఎంత వింత మదికి నేమేమి తోచిన చింత సేయరాదు చిక్కులెట్టు వింతలోని గుట్టు వివరింపదానగు , వి. వే.

ఎంత వింత మదికి నేమేమి తోచిన
చింత సేయరాదు చిక్కులెట్టు
వింతలోని గుట్టు
వివరింపదానగు , వి. వే.

మనస్సునకు ఏ వింత తోచినను దానిని గూర్చి ఆలోచింపరాదు . అందలి రహస్యమును గుర్తించి తత్త్వమును తెలిసికొనదగును .

One should not indulge in all the fleeting thoughts in the mind. One has to recognize the secret behind thoughts with true knowledge.

551
ఎన్ని భూములు గని యేపాటు పడినను అంటనీక శనియు వెంట దిరుగు భూమి క్రొత్తయైన భోక్తులు క్రొత్తలా? వి. వే.

ఎన్ని భూములు గని యేపాటు పడినను
అంటనీక శనియు వెంట దిరుగు
భూమి క్రొత్తయైన భోక్తులు
క్రొత్తలా? వి. వే.

ఒకచోట కలిసిరాకున్న , మరొకచోట కలిసివచ్చునని భ్రాంతిపడి జనులు స్థలమును మార్చుదురు . శని వెంట వచ్చుచున్నపుడు ఎక్కడికి పోయిన నొక్కటే . ప్రదేశము క్రొత్తయేకాని వ్యక్తి క్రొత్తయా?

People roam around looking for fortune without staying in one place. When the ill-effects of saturn are prevalent, there is no place to hide. A place could be new, but not the person seeking it.

552
ఎఱుక గలుగునాత డేయూర నుండక తిరుగనేల?తనకు దివ్యమైన పండుపండ వెనుక భక్షింపకుండునా? వి. వే.

ఎఱుక గలుగునాత డేయూర నుండక
తిరుగనేల?తనకు దివ్యమైన
పండుపండ వెనుక భక్షింపకుండునా?
వి. వే.

జ్ఞానము కలవాడు ఎక్కడికిని పోనక్కరలేదు . అతడున్నచోటకే అన్నియు వచ్చును . పండు పండిన భక్షింపకుందురా?జ్ఞానిని అందరును చేరి జ్ఞానఫలమనుభవింతురు

A knowledgeable person need not go anywhere. All things fall into his lap. Won't people eat a ripe fruit? People flock around a knowledgeable person to seek his wisdom.

553
ఎవ్వరెఱుగకుండ నెప్పుడు పోవునో పోవు జీవమకట! బొంది విడిచి అంతమాత్రమునకె అపకీర్తి గనలేక విరుగబడును నరుడు వెఱ్ఱి వేమ !

ఎవ్వరెఱుగకుండ నెప్పుడు పోవునో
పోవు జీవమకట! బొంది విడిచి అంతమాత్రమునకె
అపకీర్తి గనలేక విరుగబడును
నరుడు వెఱ్ఱి వేమ

బొంది విడిచి ప్రాణమెప్పుడు పోవునో ఎవ్వరికిని తెలియదు . దీనిని నమ్మి మూర్ఖుడు అపకీర్తి నెంచక గర్వించును .

When the life departs from the body is not known to any one. A foolish person disregards bad reputation by claiming with pride it is not so.

554
ఏడ్వ మది నోవ ఫలమేమి ? యెవరు నిన్ను దిట్టగానేమి లేక నుతింపనేమి ? కలుగు భువి లాభలోభముల్ కాలమహిమ ననుచు సరిపెట్టుకోరాడె యరయ వేమ!

ఏడ్వ మది నోవ ఫలమేమి ? యెవరు నిన్ను
దిట్టగానేమి లేక నుతింపనేమి ?
కలుగు భువి లాభలోభముల్ కాలమహిమ
ననుచు సరిపెట్టుకోరాడె యరయ వేమ

ఒకరు తిట్టినను , పొగడినను లెక్కచేయరాదు . కాలాను సారముగా మంచిచెడ్డలు , కష్టసుఖములు కలుగునని తెలిసికొనవలెను .

One should not inflate with ego when someone praises or go into sorrow when someone curses. Good and bad, happiness and sorrow, happen over a period of time.

555
ఏది కులము నీకు? ఏది మతంబురా ? పాదుకొనుము మదిని పక్వమెఱి౦గి యాదరించు దాని యంతయు తెలియుము , వి. వే.

ఏది కులము నీకు? ఏది మతంబురా?
పాదుకొనుము మదిని పక్వమెఱి౦గి
యాదరించు దాని యంతయు
తెలియుము , వి. వే.

మనస్సులో బాగుగా ఆలోచించినయెడల కుల, మత భేదములను లెక్కింపరాదని బాగుగా తెలియును .

A thoughtful person does not care for the differences because of religion and caste.

556
ఒకరికీడు వేఱకొక్కరి కీయడు ఒకరి మేలు వేఱయొకనికీడు కీడు మేలు వారు పోడిమిదెలియరు , వి. వే.

ఒకరికీడు వేఱకొక్కరి కీయడు
ఒకరి మేలు వేఱయొకనికీడు
కీడు మేలు వారు పోడిమిదెలియరు,
వి. వే.

వారివారి కర్మలనుబట్టియే మేలు కీళ్ళు కలుగుచుండును . దేవుడు ఒకరి కీడి౦కొకనికి , ఒకని మేలి౦కొకనికిని ఈయడు . దీనిని మూర్ఖులు తెలిసికొనలేరు .

God won't assign one's bad fortune to another and one's good fortune to another. The good and bad happen because of law of karma

557
కంకుభట్టనంగ కాషాయములు కట్టి కొలిచె ధర్మరాజు కోరి విరటు కాలకర్మగతులు కనిపెట్టవలెనయా ! వి. వే.

కంకుభట్టనంగ కాషాయములు కట్టి
కొలిచె ధర్మరాజు కోరి
విరటు కాలకర్మగతులు కనిపెట్టవలెనయా!
వి. వే.

కాలము కర్మము వక్రింపగా , ధర్మరాజ౦తటివాడు కావి గుడ్డలు కట్టి కంకుభట్టయి విరటుని సేవించెను . కాన గర్వము తగదు .

Because of bad karma, Pandava King Dharma Raj wore saffron clothes and served King Virat. So there is no need for ego.

558
కట్టెపైననున్న కట్టెకు ఫలమేమి ? చెట్టుపైన ఘనము చేరగలడె ? కట్టె చెట్టు రెండు కలిసే దైవంబులో , వి. వే.

కట్టెపైననున్న కట్టెకు ఫలమేమి?
చెట్టుపైన ఘనము చేరగలడె?
కట్టె చెట్టు రెండు
కలిసే దైవంబులో , వి. వే.

కట్టెపై కూర్చున్నను , చెట్టుపై నున్నను ఒక్కటియే ! భేదము లేదు . ఈ రెండును దైవములో చేరినవే అని గ్రహించవలెను . అన్నింటను సమానమైన దృష్టి యుండవలెను .

Sitting atop a tree or on the funeral pyre are the same. There is no difference because both of them recede into the creator. One has to be equanimous.

559
కట్టెయందు నిప్పుగానని చంద మీ తనువునందు ఆత్మ తగిలియు౦డు మఱుగుతెలిసి పిదప మార్కొనవలెనయా ! వి. వే.

కట్టెయందు నిప్పుగానని చంద
మీ తనువునందు ఆత్మ తగిలియు౦డు
మఱుగుతెలిసి పిదప
మార్కొనవలెనయా ! వి. వే.

రెండు కట్టెల యొరపిడివలన నిప్పు రాలును . కట్టెలో కానరాని నిప్పు ఉన్నట్లే దేహములో ఆత్మ యుండును . ఈ రహస్యము తెలిసి ఆత్మను గ్రహించుటకు యత్నింపవలెను

Fire comes by rubbing kindle. Like fire that is hidden in the wood, aatma is resident in body.

560
కడగ అఖిలములకు నడినాళమందున్న వేగు చుక్కవంటి వెలుగు దిక్కు వెలుగుకన్న దిక్కు వేఱెవ్వరున్నారు ? వి. వే.

కడగ అఖిలములకు నడినాళమందున్న
వేగు చుక్కవంటి వెలుగు దిక్కు
వెలుగుకన్న దిక్కు వేఱెవ్వరున్నారు?
వి. వే.

ప్రపంచమున కాధారమై బ్రహ్మనాళమునంటి దేవుడున్నాడు . వేగుజుక్కవలె వెలుగుచున్నాడు . ఆయనకంటె వేరే దిక్కు మనకు లేదు

The creator is resident in universe's stalk. He is resplendent as morning star. There is no one but him who can help us.

561
కడగి పట్టియాస కడతేర నీయదు ఇడుమలందుబట్టి యీడ్చుగాని పుడమిజనల భక్తి పొడమంగ నీయదు , వి. వే.

కడగి పట్టియాస కడతేర నీయదు
ఇడుమలందుబట్టి యీడ్చుగాని
పుడమిజనల భక్తి పొడమంగ
నీయదు , వి. వే.

ఆశ చెడ్డది . అది కష్టములకు ఈడ్చును . బాధ కలిగించును . భక్తి భావము కలుగనీయదు

Greed is bad by dragging one into difficulties, causing pain, and preventing devotion to God.

562
కడుపుకేల మనస , కళవళం పడియెదు కడుపుకేడ తృప్తి కలుగుచుండు ? కడపరాతిలోని కప్పకుకలుగదా ? వి. వే.

కడుపుకేల మనస , కళవళం పడియెదు
కడుపుకేడ తృప్తి కలుగుచుండు?
కడపరాతిలోని
కప్పకుకలుగదా ? వి. వే.

ఎంత తిన్నను తృప్తియుండని కడుపునుగూర్చి విచారమేల ? రాతిలోని కప్పకు తిండిపెట్టి దేవుడే రక్షించును

Why fret over the stomach that is not satiated by food? God provides sustenance to a frog trapped within stone and protects it.

563
కనకమృగము భువిని కలుగద౦ చెఱుగడా రాముడెఱుక కల్గు రాజుకాడొ ? చేటుకాలమునకు చెడుబుద్ధి పుట్టెడు , వి. వే.

కనకమృగము భువిని కలుగద౦ చెఱుగడా
రాముడెఱుక కల్గు రాజుకాడొ?
చేటుకాలమునకు చెడుబుద్ధి
పుట్టెడు , వి. వే.

లోకమున బంగారు జింక యుండదని రాముడు ఎరుగడా? తెలివి లేదా?కష్టకాలము వచ్చునపుడు ఎట్టివారికిని చెడుబుద్ధి పుట్టును. కావుననే రాముడు మోసపోయెను

Didn't Lord Rama know there is nothing like a golden deer? Isn't he conscious? When difficult time arises, mind will be deluding. Hence Lord Rama faltered.

564
కలియుగమున బుట్టి కడతేరగాలేక యొడలు బడలజేసి యుగ్రతపము తమరుచేసి యేమి తత్త్వంబుగనలేరు , వి. వే.

కలియుగమున బుట్టి కడతేరగాలేక
యొడలు బడలజేసి యుగ్రతపము
తమరుచేసి యేమి తత్త్వంబుగనలేరు,
వి. వే.

ఆలోచన లేనివారు మనస్సును నిలుపలేక శరీరమును కృశింపజేసి ఘోరతపస్సు చేయుదురు . అంతమాత్రాన తత్త్వము తెలియదు .

Thoughtless people unable to control their minds perform meditation by denying themselves food and water. One can't gain true knowledge this way.

565
కసవు పసికిజేసి గాలి ఫణికిజేసి మన్నెఱలకుజేసె మఱువకేట్లొ కుంభినీజనులకు గూడట్లు చేసెరా ! వి. వే.

కసవు పసికిజేసి గాలి ఫణికిజేసి
మన్నెఱలకుజేసె మఱువకేట్లొ
కుంభినీజనులకు గూడట్లు
చేసెరా ! వి. వే.

దేవుడు పశువులకు గడ్డిని , పాములకు గాలిని , ఎర్రలకు మట్టిని ఆహారముగా చేసినట్లే మనుష్యుల కన్నమును గూర్చెను . తిండికై ఆయాసపడ నక్కరలేదు

God provided grass to cattle, air to snakes and soil for the earthworms. Similarly he provided food to men. There is no need to worry over food.

566
కాగల పనులెల్ల కాకెట్లు పోవును ? కానిపనులు కానెకావు భువిని మహిమ వేఱగలదు మనతోడనున్నదా ? వి. వే.

కాగల పనులెల్ల కాకెట్లు పోవును?
కానిపనులు కానెకావు
భువిని మహిమ వేఱగలదు
మనతోడనున్నదా ? వి. వే.

కావలసిన పనులు అవే యగును . కానిపనులు కానేకావు . మనలో ఏమియు లేదు . అంతయు భగవదధీనము

Required tasks will get done and unrequired ones never happen. We are not in control of them. Only god has control over them.

567
కానలేడు నుదురు కర్ణముల్ వీపును నెఱులు కానలేడు నెత్తిమీద తన్నె కానలేడు దైవము నెఱుగునా ? వి. వే.

కానలేడు నుదురు కర్ణముల్
వీపును నెఱులు కానలేడు నెత్తిమీద
తన్నె కానలేడు దైవము
నెఱుగునా ? వి. వే.

మానవుడు తన నుదురు , చెవులు, వీపు తాను చూడలేడు . తలపై నున్న వెండ్రుకలను చూడలేడు . అట్టిచో భగవంతుని చూడగలనని తలచుట భ్రాంతికాక యేమగును ?

A man can't see his forehead, ears and back. He can't even see the hair on his head. If that is so, the desire to see god's form is nothing but delusion.

568
కానలేరుగాని కలియుగంబుననున్న మనుజులు అందఱికిని మానమొకటె దారx ఢ్యమున్నయెడల దైవంబుజూచును , వి. వే.

కానలేరుగాని కలియుగంబుననున్న
మనుజులు అందఱికిని మానమొకటె
దారx ఢ్యమున్నయెడల
దైవంబుజూచును , వి. వే.

ఈ యుగములోని జనులందరికి మానాభిమానములు సమానమే . అందరొక్కటే!శక్తియున్నవాడే దైవమును చూడగలడు

In Kali yug men are equal in terms of character and pride. The person endowed with true knowledge can see god.

569
కాలచక్ర మెఱుగగాలేక యెప్పుడు సంధ్యజపముచేయు జాణులార !సంధ్యజపములోని జాడలెట్లు౦డును? వి. వే.

కాలచక్ర మెఱుగగాలేక యెప్పుడు
సంధ్యజపముచేయు జాణులార!
సంధ్యజపములోని జాడలెట్లు౦డును?
వి. వే.

సమయము వ్యర్థమగుచున్నదని గ్రహింపక సంధ్యావందనములోని మర్మమును తెలియక దానిని చేసిన ప్రయోజనము లేదు .

People who don't know the meaning behind sun worship waste their time. There is no use in performing karma without knowledge.

570
కాలచక్రమట్లు గలవారి మనసెల్ల సాగి తిరుగుచుండు చంచలించి చక్రగతిని విడువ స్తంభించు మనసప్డు , వి. వే.

కాలచక్రమట్లు గలవారి మనసెల్ల
సాగి తిరుగుచుండు చంచలించి
చక్రగతిని విడువ స్తంభించు
మనసప్డు , వి. వే.

కాలచక్రము తిరుగుచున్నట్లు శ్రీమంతుల మనస్సు చలించుచునే యుండును . ఆ చాంచల్యమును విడిచిననే మనస్సు నిలుచును

Like the wheel of time that never stops spinning, rich people's mind will always be wavering.

571
కాలమధికమైన గడచిపోవగరాదు ధర్మరాజు కొల్చె తగనిచోట కంకుభట్టనంగ కటకటా !యేమ ౦దు ? వి. వే.

కాలమధికమైన గడచిపోవగరాదు
ధర్మరాజు కొల్చె తగనిచోట
కంకుభట్టనంగ కటకటా!
యేమ ౦దు ? వి. వే.

కాలగతిని తప్పించుకొనలేము . ధర్మరాజంతవాడు కంకుభట్టు అను పేరుతో తక్కువవానిని సేవింపవలసివచ్చెను

One cannot defeat time. King Dharma Raj served a vassal after donning the name Kanku Bhattu.

572
కాళ్ళముందఱేరు కడ కీదగా లేక ముగ్గురు ఈతగా౦డ్రు మునిగినారు నరుడు ఈదునన్న నగుబాటు కాదొకో , వి. వే.

కాళ్ళముందఱేరు కడ కీదగా లేక
ముగ్గురు ఈతగా౦డ్రు మునిగినారు
నరుడు ఈదునన్న నగుబాటు
కాదొకో , వి. వే.

త్రిమూర్తులును సంసార ప్రవాహమును దాటలేక అందులో మునిగిపోగా , మానవమాత్రుడు దాటగలననుట నవ్వుబాటు కాదా ?

When the triumverate (Lord Siva, Lord Vishnu and Lord Brahma) could not cross the ocean of bondage, the claim of a puny human that he can is ludicrous.

573
కీలకములడించి బైలెఱి౦గినవాడు సింధుపుత్రిమాయజిక్కెనతడు శౌరియంతవాడె జనులకు శక్యమా , వి. వే.

కీలకములడించి బైలెఱి౦గినవాడు
సింధుపుత్రిమాయజిక్కెనతడు
శౌరియంతవాడె జనులకు
శక్యమా , వి. వే.

అన్ని మర్మములను అతిక్రమించి తత్త్వమెరిగిన విష్ణువే లక్ష్మీదేవి మాయలో పడగా , మానవమాత్రుల లెక్కయేమి?

When Lord Vishnu knowing fully well about the creation, fell in love with Goddess Lakshmi, can ordinary men overcome the delusion of bondage?

574
కుక్క యేమెఱు౦గు గురులింగజంగంబు ? పిక్కబట్టి యొడసి పీకుగాక సంతపాకతొత్తు సన్యాసి నెఱుగునా ? వి. వే.

కుక్క యేమెఱు౦గు గురులింగజంగంబు?
పిక్కబట్టి యొడసి
పీకుగాక సంతపాకతొత్తు సన్యాసి
నెఱుగునా ? వి. వే.

కుక్క జంగమగురుని పిక్క పట్టుకొని కరచునేగాని , అతని గొప్పతనము ఎరుగలేదు . నీచమైనదానికి సన్న్యాసి గొప్పతనము ఎట్లు తెలియగలదు ?

A dog bites the leader of Jangama caste without knowing his greatness. How can a low-life know the greatness of a hermit?

575
కూటవాసియగుచు గుణముల బచరించి నీట నీడవలెను నిలిచియుండు నుదక ఘటమునందు నుపరి సూర్యునిబోలె , వి. వే.

కూటవాసియగుచు గుణముల బచరించి
నీట నీడవలెను నిలిచియుండు
నుదక ఘటమునందు నుపరి
సూర్యునిబోలె , వి. వే.

సర్వవ్యాపి యగు భగవంతుడు గుణరహితుడైనను గుణములు కల్గి నీటిలోని నీడవలె నుండును . సూర్యుడు ఘటాదులలోని జలములలో భిన్నుడైనను ఒక్కడే గదా !అట్లే భిన్నుడై ఒక్కడై యుండును

The omnipresent god, even though free from gunas, acquires them, and resides in us like shadow in the water. The light in open water and in a pot of water is from the same source: our sun. Thus in multiplicity there is unity.

576
కొండదండి మామ కొండికూతురె యాలు కొండ మేటివిల్లు కొండయిల్లు కొండవంటిదొరయు గుండయిపోయెరా , వి. వే.

కొండదండి మామ కొండికూతురె
యాలు కొండ మేటివిల్లు కొండయిల్లు
కొండవంటిదొరయు
గుండయిపోయెరా , వి. వే.

పాషాణ లింగరూపుడైన శివుని మామ హిమవంతుడు భార్య ఆ కొండ కూతురు . విల్లు మేరు పర్వతము . నివాసము కైలాస పర్వతము . కొండవంటి గొప్ప దొర కఠినుడుకా కెట్లు౦డును ?

Assuming a hard stone form Siva is the son-in-law of Himavanta (Himalaya). His wife is the daughter of that mountain. His bow is Meru mountain. He lives in mountain Kailasa. Affiliated with so many mountains, no wonder his heart is hard as stone.

577
కొండరాళ్ళదెచ్చి కోరికగట్టిన గుళ్ళలోన దిరిగి కుళ్ళనేల ?పాయరాని శివుడు ప్రాణమైయుండ౦గ , వి. వే.

కొండరాళ్ళదెచ్చి కోరికగట్టిన
గుళ్ళలోన దిరిగి కుళ్ళనేల?
పాయరాని శివుడు ప్రాణమైయుండ౦గ,
వి. వే.

విడువరాని దేవుడు మనలోనే యుండగా , రాళ్ళతో కట్టిన గుళ్ళలో అతనిని వెదుకుచు బాధపడనక్కరలేదు

God is ever-resident in our bodies. There is no need to look for him in temples built with stone.

578
కొడుకును బ్రతికించుకొనలేడు శంభు౦డు కొడుకును బ్రతికించుకొనడు శౌరి దైవబలములెల్ల దాననే కనిపించె , వి. వే.

కొడుకును బ్రతికించుకొనలేడు
శంభు౦డు కొడుకును బ్రతికించుకొనడు
శౌరి దైవబలములెల్ల
దాననే కనిపించె , వి. వే.

శివుడు , విష్ణువు తమ పుత్రులనే బ్రతికించుకోలేకపోయిరి . దైవబలమెట్టిదో దీనివల్లనే తెలియుచున్నది . విధి బలీయము

Lord Siva and Lord Vishnu could not save their children from the jaws of death. One can't surmise the strength of God. Fate is very powerful.

579
కోరిదృపదుపట్టి కొప్పుపట్టీడ్చిన సింహబలుని చావు జెప్పదరమె ? ముగియు కాలమునకు మొనగాడు నీల్గడా ? వి. వే.

కోరిదృపదుపట్టి కొప్పుపట్టీడ్చిన
సింహబలుని చావు జెప్పదరమె?
ముగియు కాలమునకు మొనగాడు
నీల్గడా ? వి. వే.

కాలము కూడినచో ఎట్టి బలవంతునికిని చావు తప్పదు . ద్రౌపదిని బాలాత్కరించిన కీచకునకు చావు తప్పలేదు కదా!

When time comes, even a person of great strength meets with death. The demon Keechaka who molested Queen Draupadi met with death in the hands of her husband Bheema.

580
గతము చేసినట్టి కర్మబంధములెల్ల బరిసిపోవు సత్యగురుని వలన కుమ్మరి కొకయేడు గుదియకు నొకనాడు , వి. వే.

గతము చేసినట్టి కర్మబంధములెల్ల
బరిసిపోవు సత్యగురుని
వలన కుమ్మరి కొకయేడు గుదియకు
నొకనాడు , వి. వే.

ఎన్ని జన్మముల పాపములు , బంధములైనను ఉత్తమ గురువు నాశ్రయించిన నశించును . కుమ్మరి చాలకాలము కష్టపడి కుండచేయగా, క్షణములో గుదియదెబ్బకు అది పగిలిపోవును కదా!

Tutelage under a virtuous guru will wipe out all the sin and bondage. A pot-maker spends inordinate time to make a pot. But it takes a split second to break it.

581
గతము జూతమన్న గలగన్న యర్థ౦బు నడచుకాలమేని నమ్మరాదు క్షణములోని బ్రతుకు సంసారవిభ్రాంతి , వి. వే.

గతము జూతమన్న గలగన్న యర్థ౦బు
నడచుకాలమేని నమ్మరాదు
క్షణములోని బ్రతుకు సంసారవిభ్రాంతి,
వి. వే.

బ్రతుకు క్షణికము . సంసారము భ్రాంతి . కడచిన కాలము కలవలెనే కనరానిది . వర్తమానకాలమును నమ్మలేము . రాబోవు కాలము ఎట్లు౦డునో తెలియదు . కావున జీవితమును నమ్మరాదు

Time is fleeting. Bondage is illusory. Past is like a dream. Present cannot be trusted. Future is uncertain. Hence there is no need to put too much faith on life. 582
చక్రధరుని వేడి జలధి దాటగవచ్చు వికృతమైన బుద్ధి వెతలుబెట్టు నక్రమెన్న గజము నయమార భక్షించు , వి. వే.

చక్రధరుని వేడి జలధి దాటగవచ్చు
వికృతమైన బుద్ధి వెతలుబెట్టు
నక్రమెన్న గజము నయమార
భక్షించు , వి. వే.

బుద్ధి వికారము చిక్కులు పెట్టును . బుద్ధి సరిగానున్న దైవమును వేడి , సంసార సముద్రమును దాటవచ్చును . పరధ్యానమను మొసలి ఏనుగంత బుద్ధిని లొంగదీసికొని నశింపజేయును .

Mind is fleeting and can land one in trouble. When mind is calm, one can pray to God and cross the ocean of bondage. The crocodile of a distracted mind defeats the elephant of wisdom. 583
చర్మమునకు స్పర్శ చక్కగా తెలియదు కర్మముల్ పొసగుట గానగలడె ? చర్మకర్మలుండు జగతిని నరులకు , వి. వే.

చర్మమునకు స్పర్శ చక్కగా
తెలియదు కర్మముల్ పొసగుట
గానగలడె ? చర్మకర్మలుండు
జగతిని నరులకు , వి. వే.

నరులకు చర్మము , కర్మలు ఉండును . చర్మమునకు స్పర్శజ్ఞానము కలదు . కాని,పూర్వజన్మ కర్మల జ్ఞానము నరులకు ఉండదు . జ్ఞానము కలదు అనుకొనుట భ్రాంతియే

Men are covered with skin and ordained to perform karma. Skin has perception of touch. But men can't remember the karma of previous lives. So the claim of knowing everything is an illusion

587
చేయదగినవేళ జేసిన కార్యంబు వేగపడి యొనర్ప విషము మగును బుడమకాయ చేదు ముదిసిన తీపగు , వి. వే.

చేయదగినవేళ జేసిన కార్యంబు
వేగపడి యొనర్ప విషము
మగును బుడమకాయ చేదు ముదిసిన
తీపగు , వి. వే.

సమయము చూచియే తగినట్లు పని చేయవలెను . తొందరపడి చేసిన విపరీతమగును . బుడమకాయ చేదుగా ఉండును . అదియే పండినచో తియ్యగా ఉండును .

One has to wait for an opportune time to perform a task. Haste is waste. A raw guard is bitter to taste. But it turns sweet when ripe.

588
చుట్టు గోడబెట్టి చెట్టు చేమయుగొట్టి యిట్టునట్టు పెద్ద యిల్లుకట్టి మిట్టిపడును మీద పట్టేల యెఱుగడో , వి. వే.

చుట్టు గోడబెట్టి చెట్టు చేమయుగొట్టి
యిట్టునట్టు పెద్ద
యిల్లుకట్టి మిట్టిపడును మీద
పట్టేల యెఱుగడో , వి. వే.

చెట్టు చేమ కొట్టి , ప్రాకారముతో పెద్ద యిల్లు కట్టి అదే శాశ్వతమనీ జను డనుకొనును . కాని, జీవితము శాశ్వతము కాదని గ్రహింపకున్నాడు .

By cutting trees one builds a palatial home thinking it will be permanent. But he is not able to realize that life is impermanent.

589
చూపు కొంచెమైన జుక్కలు కాన్పించు ప్రాపు వెలుగులేదు పరువుగాదు జ్ఞాన దీపమువలె గన్నులకును దోచు , వి. వే.

చూపు కొంచెమైన జుక్కలు కాన్పించు
ప్రాపు వెలుగులేదు పరువుగాదు
జ్ఞాన దీపమువలె గన్నులకును
దోచు , వి. వే.

పద్మాసనమున కూర్చుండి , ఏకాగ్రదృష్టితో చూచి, హంస మంత్రము జపించుచున్న , ఎట్టి వెలుగు అక్కరలేకయే చుక్కలవంటి నాద బిందువులు గోచరించి , జ్ఞాన దీపమును కానవచ్చును

When one sits in Padma (lotus) aaasana and meditates over the hamsa (swan) mantra, without any external light, he can see stars from Om and visualize the lamp of universal spirit.

590
జ్ఞానవంతుజూచు సరికర్మబద్ధులు వెఱ్ఱియండ్రు ప్రకృతి విడువలేక వెఱ్ఱికనని బ్రకృతి వెదకిన గల్గునా ? వి. వే.

జ్ఞానవంతుజూచు సరికర్మబద్ధులు
వెఱ్ఱియండ్రు ప్రకృతి విడువలేక
వెఱ్ఱికనని బ్రకృతి
వెదకిన గల్గునా ? వి. వే.

కర్మబద్ధులు జ్ఞానులను చూచి నిజము తెలిసికొనలేక వెర్రివారని యందురు . అట్టి వెర్రివారు చూడని ప్రకృతి లేదు

Followers of karma consider learned people as foolish. There is nothing the learned people can't see in the nature.

591
జ్ఞానులమని ఎంచి చపలాత్ములగువారు తెలివిలేమి దమ్ము తెలియలేక కష్టగహనమందు గట్టిగా జిక్కిరి , వి. వే.

జ్ఞానులమని ఎంచి చపలాత్ములగువారు
తెలివిలేమి దమ్ము
తెలియలేక కష్టగహనమందు గట్టిగా
జిక్కిరి , వి. వే.

తెలివిలేక , చపలాత్ములైన కొందరు తాము జ్ఞానులమని గర్వించి , తుదకెన్నో కష్టములకు లోబడుదురు

With ignorance and fleeting thoughts some people consider themselves as learned with pride. They meet with several difficulties.

592
తనకు లేనినాడు దైవము దూఱును తనకు కలిగెనేని దైవమేల ?తనకు దైవమునకు దగులాటమే శాంతి , వి. వే.

తనకు లేనినాడు దైవము దూఱును
తనకు కలిగెనేని దైవమేల?
తనకు దైవమునకు దగులాటమే
శాంతి , వి. వే.

తనకును దైవమునకును సంబంధమున్ననే శాంతి లభించును . గర్వి దీనిని గ్రహింపక ఉన్నపుడు తనదే ప్రభావమనును . లేనప్పుడు దైవమును నిందించును . ఇది సరికాదు

When one co-opts with god, there is peace. A proud man thinks he is responsible for all of his accomplishments and blames god when he is met with failure.

593
తనకు ప్రాప్తిలేమి దాత లీయకున్న దోషబుద్ధిచేత దూఱుటెల్ల ముక్కువంక చూచి ముకురంబు దూఱుట , వి. వే.

తనకు ప్రాప్తిలేమి దాత లీయకున్న
దోషబుద్ధిచేత దూఱుటెల్ల
ముక్కువంక చూచి ముకురంబు
దూఱుట , వి. వే.

తనకు ప్రాప్తి లేనపుడు దాతలను నిందించి ప్రయోజనము లేదు . తన ముక్కు వంకరగా ఉండగా చూచుకొని అద్దమును నిందించుట సరికాదు

When one is not deserving, there is no use in blaming donors. One can't blame the mirror for showing a crooked nose in the reflection.

594
తనదు మనసుచేత తర్కించి జ్యోతిష మెంతచేసె ననునదె౦చి చూడ తన అదృష్టమెల్ల దైవంబు యెఱుగును , వి. వే.

తనదు మనసుచేత తర్కించి జ్యోతిష
మెంతచేసె ననునదె౦చి
చూడ తన అదృష్టమెల్ల దైవంబు
యెఱుగును , వి. వే.

తానే యోచించి ముహూర్తము నిర్ణయించి పని ప్రారంభించి , అది కాకపోగా జ్యోతిష్యమును నిందించుట తగదు . తన అదృష్టమట్లున్నది . తనకు తెలియకున్నను దైవమునకు తెలియును

When one starts a task after consulting astrologers and fails in accomplishing it, there is no use in blaming astrology. Once fortune is like that. Even if one is ignorant of one's fortune, God will know.

595
తనువు తనువటంచు తపియి౦త్రు జనులార ! తనువులు అస్థిరమని తలపరాదె ? తనువు కానబడమి దలగునా మోక్షంబు ? వి. వే.

తనువు తనువటంచు తపియి౦త్రు
జనులార ! తనువులు అస్థిరమని
తలపరాదె ? తనువు కానబడమి దలగునా
మోక్షంబు ? వి. వే.

అస్థిరములైన దేహములనుగూర్చి తాపత్రయమేల ? తనువు లేనియెడల మోక్షము లేకపోవునా ?

Why get attached to the ephemeral body? Can't salvation be achieved without a perfect body?

596
తన్నుదానెఱుగడు తానెవ్వరికి నేర్పు ? ప్రాలుమాలి తిరుగు పశువుకొడుకు కాసులకొఱకైన కర్మముల్ గట్టునా ? వి. వే .

తన్నుదానెఱుగడు తానెవ్వరికి
నేర్పు ? ప్రాలుమాలి తిరుగు
పశువుకొడుకు కాసులకొఱకైన కర్మముల్
గట్టునా ? వి. వే .

పశువులవంటి మూర్ఖులు ధనాశచే , తమ్ముతామెరుగకున్నను ఇతరులకు బోధించుటకు తిరుగుదురు . ధనాపేక్షతో చేసిన బోధలు కర్మబంధములను తప్పింపగలవా ?

Foolish people as obstinate as cattle, out of greed, preach to others even when they don't apply the preaching to themselves. Can teachings done with greed break the bonds from karma?

597
తలప వశముకాదు దైవంబు బ్రహ్మంబు తెలియరాదు బ్రహ్మదేవునకును ఇసుక బావిత్రవ్వ ఎవ్వరివశమయా , వి. వే.

తలప వశముకాదు దైవంబు బ్రహ్మంబు
తెలియరాదు బ్రహ్మదేవునకును
ఇసుక బావిత్రవ్వ
ఎవ్వరివశమయా , వి. వే.

దైవరూపమగు పరబ్రహ్మను తెలిసికొనుటకు బ్రహ్మకును శక్యము కాదు . ఇసుకలో బావి త్రవ్వుట ఎవరికి సాధ్యమగును ?

Even Lord Brahma cannot fully understand the God. Who can dig a well in the desert?

598
తల్లితండ్రి పూజదారిగనక కొంత పాపకూపమందు పడుటయేల ? దానధర్మములకు దైవంబు తానాయె , వి. వే.

తల్లితండ్రి పూజదారిగనక
కొంత పాపకూపమందు పడుటయేల?
దానధర్మములకు దైవంబు
తానాయె , వి. వే.

దాన ధర్మములకు దైవమే కారణము . ఆ దైవ స్వరూపులగు తల్లితండ్రులను పూజింపనివాడు పాపకూపమున పడును

One's ability to give alms is because of God. One has to worship his parents like God to avoid going to hell.

599
తాను నిలుచుచోట దైవంబులేడని పామరజనులు తిరుపతుల కరుగ జోగిజేయు జేతిసొమ్మెల్ల బోజేయు , వి. వే.

తాను నిలుచుచోట దైవంబులేడని
పామరజనులు తిరుపతుల
కరుగ జోగిజేయు జేతిసొమ్మెల్ల
బోజేయు , వి. వే.

తమలోనే దైవమున్న సంగతి తెలియక మూర్ఖులు తిరుపతికి పోవుదురు . దానివలన ధననష్టమేకాని ప్రయోజనము లేదు

Ignorant people go on pilgrimage without knowing that God is resident in everyone's body. It will cost them money without proper result.

600
దశరథు౦డు రామధరణీసు పట్టంబు గట్టజేయ దలప గట్టె జడలు తలపు మనదికాని దైవిక మాదివేరు , వి. వే.

దశరథు౦డు రామధరణీసు పట్టంబు
గట్టజేయ దలప గట్టె
జడలు తలపు మనదికాని దైవిక
మాదివేరు , వి. వే.

తానొకటి తలప దైవ మొకటి తలచును . దశరథుడు రామునకు పట్టముకట్ట నెంచగా , దైవ మతనిని అడవులకు పంపెను

Man proposes and God disposes. King Dasaratha wanted to coronate Lord Rama. But God had sent Lord Rama to live in forests.

601
దాచిన ధనమునకు దానును కొడుకులు వాంఛపడుట కావె వట్టి భ్రమలు భాగ్యహీనునకును ఫలము లభించునా ? వి. వే.

దాచిన ధనమునకు దానును కొడుకులు
వాంఛపడుట కావె వట్టి
భ్రమలు భాగ్యహీనునకును
ఫలము లభించునా ? వి. వే.

తండ్రికొడుకులు మునుముందు అనుభవించుటకు ధనము దాచుకొందురు . కాని అదృష్టము లేనిచో వారి ధనమే వారికి దక్కదు

A family tries to save money to enjoy in the future. With ill-luck there is a possibility that they will lose their savings.

602
దాన ధర్మములకు దగు రేపురేపని కాల వ్యయము చేయు కష్టజనుడు తానునేమియౌనొ ? తన బ్రతుకేమౌనొ ? వి. వే .

దాన ధర్మములకు దగు రేపురేపని
కాల వ్యయము చేయు కష్టజనుడు
తానునేమియౌనొ ? తన
బ్రతుకేమౌనొ ? వి. వే .

మూఢులు దాన ధర్మములకు "రేపు రేపు " అని కాలము వ్యర్థము చేయుదురు . రేపు తాను ౦డునో లేదో ? చేయదలచినచో దాన ధర్మములను వెంట వెంటనే చేయవలెను

People postpone when it comes to giving alms. Do they know if they will be alive the next day? When one is committed to giving alms, he should do it immediately.

603
దైవమతులు నరులు తమవంటివారని యరసి రూఢతత్త్వ మెఱుగలేక ఇల్లు మూయబడిన నెట్లు మర్మమెఱు౦గు? వి. వే.

దైవమతులు నరులు తమవంటివారని
యరసి రూఢతత్త్వ మెఱుగలేక
ఇల్లు మూయబడిన నెట్లు
మర్మమెఱు౦గు? వి. వే.

మూఢులు తత్త్వవేత్తలను తమవంటివారినిగా భావించి తత్త్వము నెరుగలేకున్నారు . అజ్ఞానులై యున్నప్పుడు తత్త్వము నెట్లు తెలిసికొనగలరు?

Foolish people consider themselves as equivalent to knowledgeable people. As a result they are unable to acquire true knowledge. When one is ignorant, how can he understand true knowledge?

604
ధనమదంబుచేత దైవంబు నెఱుగరు కుటిలభావమొ౦ది క్రూరజనులు మదము మించినంత మన్ననలేదయా ! వి. వే.

ధనమదంబుచేత దైవంబు నెఱుగరు
కుటిలభావమొ౦ది క్రూరజనులు
మదము మించినంత
మన్ననలేదయా ! వి. వే.

ధన గర్వమున్నవారికి దైవము కానరాడు . అట్టి గర్వము గల క్రూరులకు గౌరవము లేదు

When one is proud of his wealth, the thought of god won't cross his mind. Such people if they are cruel deserve no respect.

605
ధరగ్రహములు రాశి జరియించుచుండిన మంచిచెడుగు గానిపించుచున్న పురుషయత్న మనుచు బొంగుదురేలరా ! వి. వే.

ధరగ్రహములు రాశి జరియించుచుండిన
మంచిచెడుగు గానిపించుచున్న
పురుషయత్న మనుచు
బొంగుదురేలరా ! వి. వే.

ఆయా రాశులయందు గ్రహములు తిరుగుచు మంచి చెడ్డలకు కారణము లగుచుండగా , తానే కారణమని , తన ప్రయత్నమువల్లనే జరుగుచుండునని మూఢుడు తలచును .

When planets are revolving in the constellations a foolish person thinks it is because of his efforts.

606
దైవమంటకుండు ధనముచే గర్వించి సకలసంపదలకు జాల దనిసి కడకు దాను మేలుగానక చెడిపోవు , వి. వే.

దైవమంటకుండు ధనముచే గర్వించి
సకలసంపదలకు జాల దనిసి
కడకు దాను మేలుగానక
చెడిపోవు , వి. వే.

మూఢుడు ధనము౦డుటచే గర్వించి ఎంతో తృప్తి చెంది మేలుగానక దైవబలము లేమిచే చెడిపోవును

A wealthy but foolish person out of pride neither sees the benefit nor feels satisfied; he will perish without help from God.

607
ధర్మబుద్ధిచేత దైవంబు తెలిసిన కాలుడేమి చేయగలడు ప్రజల ?ధర్మమంటివెంట దైవంబుగా నుండు , వి. వే.

ధర్మబుద్ధిచేత దైవంబు తెలిసిన
కాలుడేమి చేయగలడు
ప్రజల ?ధర్మమంటివెంట దైవంబుగా
నుండు , వి. వే.

దైవమును నమ్మి ధర్మముగా ప్రవర్తించువానిని యముడును ఏమియు చేయలేడు . ధర్మమే అతనిని దైవమై రక్షించును

One who performs dharma with complete belief in God can't be harmed by Yama, the lord of death. Dharm will protect him like God.

608
నక్కనోటికండ నదిలోని మీనుకై తిక్కపట్టి విడిచి మొక్కుచెడద ? మక్కువపడి గ్రద్ద మాంసమెత్తుకుపోవు , వి. వే.

నక్కనోటికండ నదిలోని మీనుకై
తిక్కపట్టి విడిచి మొక్కుచెడద?
మక్కువపడి గ్రద్ద మాంసమెత్తుకుపోవు,
వి. వే.

దైవమెట్లు తలచునో తెలియదు . నక్క నోటిలోని మాంసము నొడ్డున ఉంచి నదిలోని చేపకొరకు పోగా , గ్రద్ద ఆ మాంసమును తన్నుకొని పోయెను. చేపయు చిక్కలేదు

How God functions is a mystery. A fox holding meat in its mouth, being desirous of a fish, leaves it on the river bank. A passing eagle steals the meat. The fox couldn't catch the fish either.

609
నీళ్ళమీద నోడ నిలిచి తిన్నగసాగు బైట మూరెడైన బ్రాకలేదు నెలవుదప్పుచోట నేర్పరి కొఱగాడు , వి. వే.

నీళ్ళమీద నోడ నిలిచి తిన్నగసాగు
బైట మూరెడైన బ్రాకలేదు
నెలవుదప్పుచోట నేర్పరి
కొఱగాడు , వి. వే.

స్థానబలము గొప్పది . నీళ్ళపై ప్రయాణము చేయు ఓడ నేలపై మూరెడు దూరమైన పోలేదు

Where one is situated could be powerful. A ship that can travel fast on water is useless on land.

610
నీళ్ళలోని మొసలి నిగిడి యేనుగుబట్టు బయట కుక్కచేత భంగపడును స్థానబల్మికాని తన బల్మికాదయా ! వి. వే.

నీళ్ళలోని మొసలి నిగిడి యేనుగుబట్టు
బయట కుక్కచేత
భంగపడును స్థానబల్మికాని
తన బల్మికాదయా ! వి. వే.

స్థానము తప్పినచో తన శక్తి పనిచేయదు . నీటిలో ఉండి ఏనుగును పట్టగల మొసలి , బయట కుక్కచే పట్టుకొనబడును

When one is situated wrongly no power can alter the fate. A crocodile that can catch an elephant when in water, can be harmed by a dog on the land.

611
నొసట వ్రాయవాని నొసలు కొంచెముసేయు నొసటికంటె వాని నొసటివ్రాత నొసటిమీద వ్రాత నులిమిన చెదరునా ? వి. వే.

నొసట వ్రాయవాని నొసలు కొంచెముసేయు
నొసటికంటె వాని నొసటివ్రాత
నొసటిమీద వ్రాత నులిమిన
చెదరునా ? వి. వే.

నొసలు చిన్నివైనను , పెద్దవైనను లెక్కలేదు . నొసటి వ్రాతయే బలమైనది . అది తుడిచినను పోదు

A forehead can be small or big. If you believe the fate is written on the forehead, then it is all powerful and cannot be erased.

612
పరభృతమ్ము కాకపాలితమైనట్లు దారిజూపవలయు దద్ జ్ఞుడొకడు తొంటి జన్మఫలము తుదకెట్టు లొప్పిన , వి. వే.

పరభృతమ్ము కాకపాలితమైనట్లు
దారిజూపవలయు దద్ జ్ఞుడొకడు
తొంటి జన్మఫలము తుదకెట్టు
లొప్పిన , వి. వే.

పూర్వజన్మ ఫలమెట్లున్నను విజ్ఞుడు దారి చూపుట అవసరము . కోకిల గ్రుడ్లు పొదగలేకపోగా , కాకి వానిని పొదుగును .

Regardless of fruits of karma in previous lives, a guru is required to show the path to salvation. A cuckoo's eggs are incubated by a crow.

613
ప్రళయకాలమందు బ్రమథులచేతను నష్టమైరిగాదె నాటి జనులు తెలియనేరరైరి దేవుని ద్విజులెల్ల , వి. వే.

ప్రళయకాలమందు బ్రమథులచేతను
నష్టమైరిగాదె నాటి జనులు
తెలియనేరరైరి దేవుని
ద్విజులెల్ల , వి. వే.

దైవ సంకల్పము ఊహింపరానిది . ప్రళయకాలమున జనులు ప్రమథులచే నశింపచేయబడిరి. ద్విజులను దేవుని తెలియజాలకపోయిరి .

The ways of Gods are mysterious. When the creation devolved sinful people were decimated by Lord Siva's followers. Even brahmins could not seek refuge in God.

614
బల్లిపలుకులు విని ప్రజలెల్ల తమ పనుల్ సఫలములగు ననుచు సంతసించి కానిపనులకు తమ కర్మ మటందురు , వి. వే.

బల్లిపలుకులు విని ప్రజలెల్ల
తమ పనుల్ సఫలములగు ననుచు
సంతసించి కానిపనులకు తమ
కర్మ మటందురు , వి. వే.

మూర్ఖులు తమ ప్రయత్నము చేయక బల్లి పలుకువలన ఫలమును నిర్ణయింతురు . పనులు కాకపోగా తమ కర్మమనుకొందురు

Foolish people who believe lizards can talk, use it as an omen to determine the outcome of tasks. When their tasks won't succeed they blame karma.

615
మరణమన్న వెఱచి మది కలగగనేల? నిరుడు ముందటేడు నిన్న మొన్న తనువు విడిచి నతడు తనకన్న తక్కువా ? వి. వే.

మరణమన్న వెఱచి మది కలగగనేల?
నిరుడు ముందటేడు నిన్న
మొన్న తనువు విడిచి నతడు తనకన్న
తక్కువా ? వి. వే.

మరణమనిన భయమెందుకు ? మనకంటె గొప్పవారే ఎందరో యుగ యుగాలనుండి మరణించుచునే యున్నారు కదా!

Why fear death? Great people and forefathers have perished from time immemorial.

616
మఱియు దధినిఘృతము మ్రాకులందనలము సౌమ్యసుమముల౦దు సౌరభ౦బు తిలలతైలమట్లు తేజరిల్లు చిదాత్మ , వి. వే.

మఱియు దధినిఘృతము మ్రాకులందనలము
సౌమ్యసుమముల౦దు సౌరభ౦బు
తిలలతైలమట్లు తేజరిల్లు
చిదాత్మ , వి. వే.

పెరుగులో నేయి , కర్రలో నిప్పు,పూవులలో సువాసన , నూవులలో నూనె ఉన్నట్లు ఈశ్వరుడు జగదంతర్భూతుడై తేజరిల్లు చుండును .

Like butter in the milk, fire within wood, perfume inside flowers, oil in seeds, Lord Iswara is embedded in the universe and is resplendent.

617
మన్ను మెత్తికడిగి మఱి రూపుగావించి గుంటనిండ బూడ్చి గుఱుతునిల్పి మనుజులెల్ల గూడి మఱి దేవుడందురు , వి. వే.

మన్ను మెత్తికడిగి మఱి రూపుగావించి
గుంటనిండ బూడ్చి గుఱుతునిల్పి
మనుజులెల్ల గూడి
మఱి దేవుడందురు , వి. వే.

భగవంతుని ఆరాధించు భక్తులు తమకు తోచినరీతిని రూపము కల్పించి విగ్రహమును నిర్మింతురు . కాని దేవునికి రూపము లేదు .

The devotees create idols to suit their whims about the form of God. But God himself doesn't have a form.

618
మాయజగమటంచు మనుజుడెఱుగలేక మాయలోన దాను మగ్నుడయ్యె మాయదెలియు జనుని మర్మజ్ఞుడందురు , వి. వే.

మాయజగమటంచు మనుజుడెఱుగలేక
మాయలోన దాను మగ్నుడయ్యె
మాయదెలియు జనుని మర్మజ్ఞుడందురు,
వి. వే.

ఈ లోకమంతయు మాయ యని తెలియక జనులు అజ్ఞానములో పడుదురు . ఈ మాయ నెరిగినవాడే మర్మజ్ఞుడు

People are in ignorance about the illusory nature of the world.

619
ముద్రచేతబట్టి మొదలు తెలియలేక విశ్వకర్మబట్టి విడువలేక విశ్వకర్మదిట్టు వెఱ్ఱులు పడుదురు , వి. వే.

ముద్రచేతబట్టి మొదలు తెలియలేక
విశ్వకర్మబట్టి విడువలేక
విశ్వకర్మదిట్టు వెఱ్ఱులు
పడుదురు , వి. వే.

యోగము నవలంబించి మూలాధారుని కనుగొనలేక మూర్ఖులయి దైవమును నిందించువారు నశి ౦తురు

Foolish people who pursue Yoga when unable to find out the reason for the creation, curse the God.

620
మునిగి మునిగి మునిగి ముద్దయై ముద్దయై వనరి వనరి వనరి పక్కి పక్కి తిరిగి తిరిగి తిరిగి దిమ్మరైపోదురు , వి. వే.

మునిగి మునిగి మునిగి ముద్దయై
ముద్దయై వనరి వనరి వనరి పక్కి
పక్కి తిరిగి తిరిగి తిరిగి
దిమ్మరైపోదురు , వి. వే.

మూర్ఖులు తత్త్వము నెరుగక పుణ్యతీర్థములలో మునిగి, ఉపవాసములచే కృశించి , కాకులవలె తిరిగి ముక్తికి దూరమగుదురు

Foolish people, devoid of true knowledge, go on pilgrimage, fast vigorously and go around like crows, thus denying themselves salvation.

621
మొక్కజేసేడువాడును మేనుమఱవ నిద్రపోజేయువాడును నిఖిలగతుల జూపియిల బద్ధులనుజేయు సూక్ష్మరూపు డా మహాదేవుడేకదా యవని వేమ!

మొక్కజేసేడువాడును మేనుమఱవ నిద్రపోజేయువాడును
నిఖిలగతుల జూపియిల
బద్ధులనుజేయు సూక్ష్మరూపు
డా మహాదేవుడేకదా యవని వేమ

మనకి అన్నమిచ్చువాడును , సుఖముగా నిద్ర పొందించు వాడును , సంసారబద్ధులను చేయువాడును ఆ భగవంతుడే !

God alone provides us food, enables us to sleep well and provides us with family.

622
మెలత నడవినుంచి మృగమువెంటనెపోయె రామచంద్రుకన్న రసికుడేడి ?చేటుకాలమునకు చెడుబుద్ధిపుట్టును , వి. వే.

మెలత నడవినుంచి మృగమువెంటనెపోయె
రామచంద్రుకన్న రసికుడేడి?
చేటుకాలమునకు చెడుబుద్ధిపుట్టును,
వి. వే.

కష్టకాలము కలుగనుండగా చెడుబుద్ధి పుట్టును . రాము నంతటివాడు అడవిలో సీతను విడిచి జింకవెంట పరుగెత్తెను

When time is adverse, one entertains bad thoughts. A person as great as Lord Rama, left behind his wife Sita in the forest and went after a deer.

623
మ్రాను తగినదైన మహితమౌ వస్తువు గాననర్తు అట్లుగాకయున్న కాల్తురట్లెకాదె

మ్రాను తగినదైన మహితమౌ
వస్తువు గాననర్తు
అట్లుగాకయున్న
కాల్తురట్లెకాద
కర్ములకును పాట్లు , వి. వే.

మ్రాను తిన్నగానున్న మంచి వస్తువులు చేయుదురు . వంకరైనచో కాల్చుటకు ఉపయోగింతురు . సత్కర్ములకు మంచి ఫలము దుష్కర్ములకు చెడ్డఫలము లభించును .

When wood is straight it will be used to make furniture. When it is crooked it will be used to start a fire. Good actions result in good karma and bad actions bad karma.

624
మృగములకు నరులకు మేలుగా పశువులు తినగ దున్న బాలుకొనగ బుట్టి కష్టపడును వాని కర్మ మీడేరదే , వి. వే.

మృగములకు నరులకు మేలుగా పశువులు
తినగ దున్న బాలుకొనగ
బుట్టి కష్టపడును వాని
కర్మ మీడేరదే , వి. వే.

తిర్యక్కులకును కర్మానుభవము తప్పదు . పశువులు క్రూరమృగములకు ఆహారమగుచు , జనుల పాడిపంటలకు ఉపయోగించుచు కష్టపడుచున్నవి

Even animals with horizontal spines have karma. Cattle are hunted down by wild animals and are used to plough agricultural land resulting in strife.

625
రాళ్ళు పూజచేసి రాజ్యముల్ తిరిగియు కానలేరు ముక్తికాంత నెపుడు తానయుండుచోట దైవంబు నుండడా ? వి. వే.

రాళ్ళు పూజచేసి రాజ్యముల్
తిరిగియు కానలేరు ముక్తికాంత
నెపుడు తానయుండుచోట
దైవంబు నుండడా ? వి. వే.

మూర్ఖులు విగ్రహములను పూజించి , దేశములు తిరిగి మోక్షము నొందగోరుదురు . తామున్న చోటనే దైవమున్నట్లు తెలిసికొనలేకున్నారు

Foolish people worship idols and go around on pilgrimage in search of salvation. They don't realize god is situated within themselves.

626
లంకపోవునాడు లంకాధిపతి రాజ్య మంత కీశసేన లాక్రమించె చేటు కాలమైన జెఱుప అల్పుడె చాలు , వి. వే.

లంకపోవునాడు లంకాధిపతి రాజ్య
మంత కీశసేన లాక్రమించె
చేటు కాలమైన జెఱుప అల్పుడె
చాలు , వి. వే.

చేటుకాలము వచ్చునపుడు అల్పుడే చెరుపగలడు . కోతి మూకలు లంకారాజ్యము నాక్రమించి రావణుని చెరచినవి గదా!

When bad time arrives, low-lives take control. Didn't monkeys occupy Lanka and dethrone King Ravana?

627
వద్దనంగబోదు వలెనానగారాదు తాను చేసినట్టి దానఫలము ఉల్లమందు వగవకుండటే యోగంబు , వి. వే.

వద్దనంగబోదు వలెనానగారాదు
తాను చేసినట్టి దానఫలము
ఉల్లమందు వగవకుండటే
యోగంబు , వి. వే.

తాను చేసిన దానముయొక్క ఫలము తన కిష్టమున్నను లేకున్నను వచ్చియే తీరును . కాన ఫలమునుగూర్చి ఆలోచన అక్కరలేదు

One's donation whether he likes it or not will result as a fruit of karma. So there is no need to worry about fruit of one's action.

628
విత్త మొకరికిచ్చి వితరణగుణమును చిత్త మొకనికిచ్చి చెఱిచినాడు బ్రహ్మచేతలన్ని పాడైన చేతలు , వి. వే.

విత్త మొకరికిచ్చి వితరణగుణమును
చిత్త మొకనికిచ్చి
చెఱిచినాడు బ్రహ్మచేతలన్ని
పాడైన చేతలు , వి. వే.

బ్రహ్మ చేతలను నిర్ణయింపలేము . ఒకరికి ధనమిచ్చి ఒకరికి దాన ఫలమిచ్చును . ఒకరికి మనసిచ్చి , ఒకనికి విచారము కూర్చును

It is not possible to judge the actions of Lord Brahma. He gives wealth to some and fruit of gift to others; happiness to some and sorrow to others.

629
విప్రవరుముహూర్తభవము నమ్ముచు పెద్దల నొగిగూర్చి పెండ్లిచేయు నువిద ముండయౌ ముహూర్తము నిజమెట్లు ? వి. వే.

విప్రవరుముహూర్తభవము నమ్ముచు
పెద్దల నొగిగూర్చి పెండ్లిచేయు
నువిద ముండయౌ ముహూర్తము
నిజమెట్లు ? వి. వే.

మానవుల యూహలు సరిగా పని చేయవు . మంచి ముహూర్తము చూచి, పెద్దలు చేరి పెండ్లి చేయగా వధువు ముండ మోయును .

The plans of men won't work out some times. When a marriage is performed at an auspicious time, it is possible that the groom will meet with sudden death.

630
వెళ్ళివచ్చువాడు వెళ్ళిపోయెడువాడు తేనులేడు కొంచు బోనులేడు తా నదేడపోనొ ధనమేడపోవునో , వి. వే.

వెళ్ళివచ్చువాడు వెళ్ళిపోయెడువాడు
తేనులేడు కొంచు
బోనులేడు తా నదేడపోనొ
ధనమేడపోవునో , వి. వే.

నరుడు పుట్టినపుడు ధనము తేలేదు . పోవునపుడు తీసికొని పోలేడు. అతనికిని ధనమునకును సంభందమే లేదు .

A man is not born with money. Nor can he take it with him to the nether world at the time of death. There is no permanent relationship between wealth and a soul.

631
వీరుడైన లేదు విద్యనేర్చినలేదు సత్కులమున లేదు సటలలేదు జన్మఫలమెకాని జపియి ౦చిననురాదు , వి. వే.

వీరుడైన లేదు విద్యనేర్చినలేదు
సత్కులమున లేదు సటలలేదు
జన్మఫలమెకాని జపియి
౦చిననురాదు , వి. వే.

భోగ భాగ్యములు జన్మాంతర ఫలములే . వీరుడైనను విద్వాంసుడైనను సరే . కులముతోను , తపస్సుతోను , జడలతోను పని లేదు

Riches are a result of karm in previous lives. Whether a warrior or a learned man, this is true. There is no relationship with caste, ascetic life or matted hair.

632
వెండి కొండ పసిడికొండయు దనకుండ దేవుడేల పోయు తిరిపెమెత్తె ? దైవబలముకాని తన బల్మి కాదయా ! వి. వే.

వెండి కొండ పసిడికొండయు దనకుండ
దేవుడేల పోయు తిరిపెమెత్తె?
దైవబలముకాని తన
బల్మి కాదయా ! వి. వే.

దేవునకును విధిని దాటు సాధ్యము కాదు . బంగారు, వెండి కొండలు తనకున్నను శివుడు బిచ్చమెత్తవలసి వచ్చెను

Even gods have to obey the fate. Even though Lord Siva was in possession of golden and silver mountains, he still had to beg.

633
వేలకొలది భువిని వేషముల్ దాల్తురు ప్రాలుమాలి బువ్వఫలముకొఱకు మేలు కాదు మదిని మిన్నందియుండుము , వి. వే.

వేలకొలది భువిని వేషముల్ దాల్తురు
ప్రాలుమాలి బువ్వఫలముకొఱకు
మేలు కాదు మదిని మిన్నందియుండుము,
వి. వే.

తిండికొరకే జనులు వేలకొలది వేషములు వేయుదురు . అది మంచిది కాదు . మదిలో సంతృప్తిచెంది యుండుము .

Men wear different garbs for the sake of livelihood. That is not good. One has to feel satisfied with what one has.

634
వ్యాధి పీడితంబు వ్యసన సంతాపంబు దుఃఖసంభవమున దొడరు భయము లేనివారలుండ రేనాటికైనను , వి. వే.

వ్యాధి పీడితంబు వ్యసన
సంతాపంబు దుఃఖసంభవమున దొడరు
భయము లేనివారలుండ
రేనాటికైనను , వి. వే.

రోగము లేనివారు , వ్యసనముచే బాధపడువారు , దుఃఖించువారు , భయము లేనివారు ఏనాడును లేరు .

Men always had disease, bad habits, sorrow and fear.

635
శాంతమానసమున జల్లనై శీతల భాతినున్నవాడు పరమయోగి అట్టివాడు ముక్తి నతివేగగైకొను , వి. వే.

శాంతమానసమున జల్లనై శీతల
భాతినున్నవాడు పరమయోగి
అట్టివాడు ముక్తి నతివేగగైకొను,
వి. వే.

కోపతాపములేక శాంతుడై , చల్లని మనస్సు కలిగియున్నవాడు పరమయోగి . అతడు సులభముగా ముక్తి గాంచును .

A true yogi is one beyond anger and always in peace with a sound mind. He can easily attain salvation.

636
శిలలు దేవతలని స్థిరముగా రూపించి మంటిపాలెయైన మనుజులెల్ల మంటిలోని రాళ్ళ మదిలోనదెలియరు , వి. వే.

శిలలు దేవతలని స్థిరముగా
రూపించి మంటిపాలెయైన మనుజులెల్ల
మంటిలోని రాళ్ళ మదిలోనదెలియరు,
వి. వే.

రాళ్ళను దేవతలని నిరూపించినవారును మట్టిలోనే కలిసిపోవుచున్నారు కదా! తాము అనుకొన్న దేవతలు మంటిలోని రాళ్ళే కాని వేరు కాదని తెలుసుకొనలేకున్నారే

Even people who proved stones are gods have perished. They are unable to realize the gods they have dreamed of are none but hard stones.

637
శివునుయనుభవ౦బు సృష్టిలోపల లేక సంశయంబుడుగదు సాధకులకు చెలగు దివ్వెలేక చీకటి వాయదు , వి. వే.

శివునుయనుభవ౦బు సృష్టిలోపల
లేక సంశయంబుడుగదు సాధకులకు
చెలగు దివ్వెలేక
చీకటి వాయదు , వి. వే.

దీపము లేకున్నచో చీకటి పోదు . అట్లే భగవత్తత్త్వము నెరుగనిచో సంశయము పోదు. మంచి సాధన అవసరము

Without lamp, darkness won't recede. With the divine knowledge it is possible to dispel all doubts. One needs to work hard at it.

638
శుద్ధదృష్టిలేక శుక్రునంతటివాడు పట్టలేక మనసు పారవిడిచి కన్నుపోవ పిదప కాకి చందంబున , వి. వే.

శుద్ధదృష్టిలేక శుక్రునంతటివాడు
పట్టలేక మనసు పారవిడిచి
కన్నుపోవ పిదప కాకి
చందంబున , వి. వే.

ఉదారభావము౦డవలెను . అట్టి భావములేక బలిచక్రవర్తిని దాన మీయవద్దని అడ్డగించిన శుక్రునకు కాకివలె ఒక కన్ను పోయినది కదా!

One has to be charitable. The guru of asuras (demons) Sukra dissuaded King Bali from giving alms to the Lord Vishnu in the Vamana avatar. As a result he lost an eye.

639
శూలినెంచి మదిని శుద్దా౦తరంగుడై కాలకర్మములను కాలద్రొక్కి మేలు పూర్ణపదవి మెచ్చను శివయోగి , వి. వే.

శూలినెంచి మదిని శుద్దా౦తరంగుడై
కాలకర్మములను కాలద్రొక్కి
మేలు పూర్ణపదవి మెచ్చను
శివయోగి , వి. వే.

ఉత్తమయోగి నిర్మల హృదయమున శివుని నిల్పి, కాల కర్మములను లెక్కింపక పరమాత్మను గ్రహించి సంతృప్తిని పొందును

A virtuous yogi worships Lord Siva with a pure mind and realizes God in him without mindful of time and diurnal duties.

640
సకల తనువులెత్తి సంచరించును జీవి కలిమి బలిమి తగిలి కలవరించు ఆత్మతేజమూని యచ్చుగా జూడరా! వి. వే.

సకల తనువులెత్తి సంచరించును
జీవి కలిమి బలిమి తగిలి
కలవరించు ఆత్మతేజమూని
యచ్చుగా జూడరా! వి. వే.

ప్రాణి ఎన్నో జన్మములెత్తి కలిమిలేములు , కష్టసుఖములు పొంది కలతపడుచుండును . జన్మము లేకుండుటకగాను ఆత్మతేజస్సును గాంచి ముక్తిపొంద యత్ని౦పవలెను.

One has many past lives where he experienced happiness and sadness resulting in strife. To prevent rebirth one has to realize aatma and strive for salvation.

641
సకల వస్తువులను సంతత తనువుల వుసరికేడ పంచభూతములను దానిదానిచేత తగు భూషణము చేయు, వి. వే.

సకల వస్తువులను సంతత తనువుల
వుసరికేడ పంచభూతములను
దానిదానిచేత తగు
భూషణము చేయు, వి. వే.

అన్ని వస్తువులకును పెక్కు శరీరము లగునపుడు స్థిరముగా ఉసురు౦డు టెట్లు ? శరీరమును పంచభూతములలో కలిపి ముక్తి నొందుటకు యత్నించుటయే మేలు కదా!

When all beings have multiple bodies , why suffer? One has to merge his body with the 5 elements (earth, water, fire, air, space) and try to attain salvation.

642
సగరుదుర్వి రాజచక్రవర్తియునయ్యు పరుల తన్ను పొగడ బ్రతుకుచుండె ఇట్టి ఘనత వీని కెందులకయ్యెరా , వి. వే.

సగరుదుర్వి రాజచక్రవర్తియునయ్యు
పరుల తన్ను పొగడ బ్రతుకుచుండె
ఇట్టి ఘనత వీని
కెందులకయ్యెరా , వి. వే.

ఎందరో రాజులు ఉండగా సగరుడే చక్రవర్తియై , అందరి మెప్పులను పొందుటకు దైవకృపయే కారణము

When there are many eligible kings, King Sagara was chosen as the emperor because of God's will.

643
సర్వమొకటగూడు సమకూరు ధ్రువంబు రెప్పవేయబోకు రేయి పగలు పగలులోని పగలు పరమాత్మ భావంబు , వి. వే.

సర్వమొకటగూడు సమకూరు ధ్రువంబు
రెప్పవేయబోకు రేయి
పగలు పగలులోని పగలు పరమాత్మ
భావంబు , వి. వే.

రాత్రింబవళ్ళు జాగరూకతతో యత్నించిన పగటికి పగలై వెలుగు పరమాత్మ భావమును పొందవచ్చును . ఇది నిశ్చయము

When one observes carefully day and night, one realizes that god is the light of the day.

644
సాటివారు నిన్ను సాధింపగాలేరు దైవమెపుడు నీకు దప్పకున్న భారతంబులోని పరమార్థమిదె కదా!వి. వే.

సాటివారు నిన్ను సాధింపగాలేరు
దైవమెపుడు నీకు దప్పకున్న
భారతంబులోని పరమార్థమిదె
కదా!వి. వే.

దైవము నీ పక్షమున ఉన్నయెడల నిన్నెవ్వరును జయి౦పలేరు . భారతములోని పరమార్థ మిదే ! (పాండవ పక్షమున దైవమున్నది)

When god is on your side, no one can claim victory. This is the essence of the hindu scripture Maha Bharatha.

645
సౌఖ్యమరయునట్లె సౌఖ్యంబు కలుగును హరునికృపను సౌఖ్యమమరియుండు సుఖమొ దుఃఖమొ యిల శూలి కారణమగు , వి. వే.

సౌఖ్యమరయునట్లె సౌఖ్యంబు కలుగును
హరునికృపను సౌఖ్యమమరియుండు
సుఖమొ దుఃఖమొ యిల
శూలి కారణమగు , వి. వే.

భగవదనుగ్రహమున్న యత్నింపకయే సుఖము కల్గును . సుఖమునకుగాని దుఃఖమునకుగాని దైవమే కారణము

When one is blessed by God, he will live a life of comfort without trying. God is responsible for both happiness and sadness.

646
సూదినంటు రాయి సూత్రముగా నాత్మ సాధనంబు మీఱి సంతరించి పాదుకొల్పు నరులు పరమాత్మ రూపులు , వి. వే.

సూదినంటు రాయి సూత్రముగా
నాత్మ సాధనంబు మీఱి సంతరించి
పాదుకొల్పు నరులు పరమాత్మ
రూపులు , వి. వే.

సూదంటురాయి పద్ధతి ననుసరించి సాధన చేసిన నరులు పరమాత్మ స్వరూపులగుదురు

Like a magnet, if one meditates hard, he can achieve the status of the creator.

647
స్వాతి మెఱుపుజూచి సంతోషపడుదురు స్వాతి మెఱుపులేమి సఫలమన్న మెఱుపు నుఱుములేక మేఘంబుగురియునా ?వి. వే.

స్వాతి మెఱుపుజూచి సంతోషపడుదురు
స్వాతి మెఱుపులేమి
సఫలమన్న మెఱుపు నుఱుములేక
మేఘంబుగురియునా ?వి. వే.

స్వాతికార్తెలో మెరుపులు చూచి వాన పడగలదని జనులు సంతోషింతురు . అంతమాత్రాన లాభమేమి ?ఉరుములుకూడ ఉండవలెను . అట్లే ప్రయత్నము లేక ఫలము లభించదు

In monsoon season lightning brings happiness to people. But what is the use without thunder? Similarly without hard work, there is no fruit to gain.

648
హరికి దొరకెనందు రా సిరి యప్పుడే దొరకెగాదె విషము హరుని కరయ ఎవరికెట్టులగునొ ఎవ్వరెఱుగుదురు ? వి. వే.

హరికి దొరకెనందు రా సిరి యప్పుడే
దొరకెగాదె విషము హరుని
కరయ ఎవరికెట్టులగునొ ఎవ్వరెఱుగుదురు?
వి. వే.

హరికి లక్ష్మి దొరకగా హరునకు విషము దొరకెను . ఎవ్వరి కేది ప్రాప్తమో ఎవ్వరెరుగుదురు ?

Lord Vishnu was able to marry the Goddess of wealth Sri Maha Lakshmi. Whereas Lord Siva was given poison that came out of churning the milky ocean by the gods and demons in search of elixir amruta. Who knows what one gets in life?

649
క్షితి వెలదికి దగు శృంగారములనున్న విభుని కరుణలేక వెలయునట్లు దైవకృపలులేక తలపులు చెల్లవు , వి. వే.

క్షితి వెలదికి దగు శృంగారములనున్న
విభుని కరుణలేక
వెలయునట్లు దైవకృపలులేక తలపులు
చెల్లవు , వి. వే.

భర్తకు ఇష్టము లేనపుడు స్త్రీయొక్క శృంగారములు రాణింపవు . అట్లే దైవకృప లేనిచో తలపులు సఫలములు కావు

When the husband is uninterested the romantic overtures of a wife won't help. Similarly without the blessing of god, ideas won't materialize.

No comments:

Post a Comment