Saturday, February 8, 2020

Sajjana-Paddati


451
అంతరాత్మను గుర్తించి ఆశలుడిగి చింతలను ద్రొక్కి మదియందు సిద్ధమగును వింతలను జూచి బ్రమయండు వెఱ్ఱివలెను సందుగొందుల పూర్ణతనందు వేమ!

అంతరాత్మను గుర్తించి ఆశలుడిగి చింతలను
ద్రొక్కి మదియందు సిద్ధమగును
వింతలను జూచి బ్రమయండు వెఱ్ఱివలెను
సందుగొందుల పూర్ణతనందు వేమ

సజ్జనుడు అంతరాత్మను గుర్తించి , ఆశలు విడిచి , విచారములు విడిచి సిద్ధుడగును . వింతలను చూచి వెర్రివానివలె భ్రాంతి పొందడు . పరిపూర్ణత్వము పొందియుండును .

A virtuous man realizes the aatma, gives up greed and sorrow and becomes a sage. He won't be influenced by the wonders of the world. He will be a perfect being.

452
అంతరాత్మానుభవమంది యార్యమతిని సంతతార్చన మది నిష్ఠసలుపుగోరి వంతుకెక్కినవాడె పోవరుడనంగ వానికెవ్వడు సరికాడుగాన వేమ!

అంతరాత్మానుభవమంది యార్యమతిని
సంతతార్చన మది నిష్ఠసలుపుగోరి
వంతుకెక్కినవాడె పోవరుడనంగ
వానికెవ్వడు సరికాడుగాన వేమ

సజ్జనుడు ఉత్తమబుద్ధి కల్గి , నిష్ఠతో భగవంతుని మనస్సులోనే పూజించి పేరు పొందును . అట్టివాడే ఉత్తముడు .

A virtuous man by having a good mind and by virtue of always praying to God, achieves fame. Such a person is the most excellent man.

453
అతులవైరాగ్యబోధోపరతుల నెఱిగి సతుల వలపున జిక్కక సత్యమెఱి౦గి మతిని చెదరక పట్టుట మాన్యరీతి ఇద్దికుదిరిన సజ్జనుండు ఇలను వేమ!

అతులవైరాగ్యబోధోపరతుల నెఱిగి సతుల
వలపున జిక్కక సత్యమెఱి౦గి మతిని
చెదరక పట్టుట మాన్యరీతి ఇద్దికుదిరిన
సజ్జనుండు ఇలను వేమ

వైరాగ్య పద్ధతులను గ్రహించి , యువతుల ప్రేమకు లొంగక , సత్యమెరిగి , మనస్సును చెదరనీయక నిలిపినవాడే సజ్జనుడనబడును

A virtuous person is one who learns about renunciation, understands truth, does not yield to romantic overtures of young girls, and keeps an unwavering mind.

454
అతిహితమగునట్టు ఆడిన మాటకు సంతసింతు రెల్ల సత్పురుషులు అధికభాషణంబు లాయాసద౦బులు , వి. వే.

అతిహితమగునట్టు ఆడిన మాటకు
సంతసింతు రెల్ల సత్పురుషులు
అధికభాషణంబు లాయాసద౦బులు,
వి. వే.

ఉత్తములు మిక్కిలి హితముగా మాటలాడిన సంతసింతురు . అధిక ప్రసంగములు కంఠశోష . వానిని సజ్జనులు మెచ్చరు

Excellent men appreciate those who speak sparingly. Too much talk is painful on the throat. Virtuous men won't appreciate it.

455
అనల మించుకైన గనలి మండునుగాని చనువుగాని యెఱుక మనికి నిడదు తనువు మఱుచువాడె తత్త్వజ్ఞుడగునయా ! వి. వే.

అనల మించుకైన గనలి మండునుగాని
చనువుగాని యెఱుక మనికి
నిడదు తనువు మఱుచువాడె తత్త్వజ్ఞుడగునయా!
వి. వే.

అగ్ని కణముగా నున్నను రాజి మండును . జ్ఞానము అనుభవముచే వృద్ధి నొందును . తత్త్వము నెరిగి శరీరములపై ఆశ లేనివాడే సజ్జనుడు

Even an ember can rage into big fire. Similarly knowledge grows exponentially with experience. The one who knows this and has no desire for the body is virtuous.

456
అనువుగానిచోట అధికుల మనరాదు కొంచెముండుటెల్ల కొదువకాదు కొండ యద్ధమందు కొంచెమైయుండదా? వి. వే.

అనువుగానిచోట అధికుల మనరాదు
కొంచెముండుటెల్ల కొదువకాదు
కొండ యద్ధమందు
కొంచెమైయుండదా? వి. వే

తగనచోట సజ్జనులు తాము గొప్పవారమని చెప్పరాదు . కొంచెపువారైన మాత్రాన హాని లేదు . పెద్ద కొండ అద్దములో చిన్నదిగా కానవచ్చును గదా!

In an unfriendly place a virtuous man should not claim to be great. There is no harm in being humble. A huge mountain fits into a small mirror's reflection.

457
అన్యులకును వచ్చు ఆపద తనదిగా నెన్నువాడు భువిని ఉన్నవాడు ఎన్ని దానిలోన ఇహపరంబులు లెస్స గన్నవాడు మిగుల ఘనుడు వేమ !

అన్యులకును వచ్చు ఆపద తనదిగా
నెన్నువాడు భువిని ఉన్నవాడు ఎన్ని
దానిలోన ఇహపరంబులు లెస్స
గన్నవాడు మిగుల ఘనుడు వేమ

ఇతరులకు కల్గిన ఆపద తనదిగా భావించినవాడే ఉత్తముడు . ఇట్లే ఇహపరములు తత్త్వమెరిగినవాడు చాల గొప్పవాడు

A virtuous man reacts to the harm done to others such as his own. Thus the one who gains the knowledge about earthly life and nether world is great.

458
అమలమైన పలుకు అభిషేక వారిధి తనువు దేవళంబు తాల్మి నొంది ఆత్మ శివునిజేర్చు నాతడే శివయోగి , వి. వే.

అమలమైన పలుకు అభిషేక వారిధి
తనువు దేవళంబు తాల్మి
నొంది ఆత్మ శివునిజేర్చు
నాతడే శివయోగి , వి. వే.

తన శరీరమే గుడియని , తన ఆత్మయే శివుడని , పరిశుద్ధమైన మాటయే అభిషేకజలమని తలచి , సాధనచేసి కృతార్థుడైనవాడే శివయోగి యగును . లేనిచో కాడు .

A Siva yogi is one who considers his own body as a temple, his aatma as Lord Siva, good speech as water for ablution of Lord Siva, and achieves success with perseverance.

459
అలలులేని జలధివలెనుండి మదిలోన తెలివిగూడి తన్ను తెలియునతడె తలప సజ్జనుడని ధర జెప్పదగుజుమీ ! వి. వే.

అలలులేని జలధివలెనుండి మదిలోన
తెలివిగూడి తన్ను తెలియునతడె
తలప సజ్జనుడని ధర
జెప్పదగుజుమీ ! వి. వే.

జ్ఞానియై, కలతలేని సముద్రమువలె శాంతుడై , తనలోనున్న పరమాత్మను గుర్తించినవాడే సజ్జనుడు

One who is a seer, peaceful as a calm sea, and recognizes the universal spirit within himself is a virtuous man. .

460
అల్పుడెన్ని పల్కులలయక పల్కిన అధికు డూరకుండు అదరిపడక కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా ? వి. వే.

అల్పుడెన్ని పల్కులలయక పల్కిన
అధికు డూరకుండు అదరిపడక
కంచు మ్రోగునట్లు కనకంబు
మ్రోగునా ? వి. వే.

అల్పుడు వదరుచు తన్నె౦త నిందించినను సజ్జనుడు మారు పల్కక ఊరకయుండును . కంచు ధ్వనించినట్లు బంగారు ధ్వనింపదు .

No matter how much a low-life abuses him a virtuous man remains calm without retort. Gold does not make as much noise as bronze.

461
అసువినాశమైన ఆనంద సుఖకేళి సత్యనిష్ఠపరుని సంతరించు సత్యనిష్ఠ చూడ సజ్జనభావంబు , వి. వే.

అసువినాశమైన ఆనంద సుఖకేళి
సత్యనిష్ఠపరుని సంతరించు
సత్యనిష్ఠ చూడ సజ్జనభావంబు,
వి. వే.

సత్యమునే పలుకువానికి ప్రాణములు పోయినను సంతోషమే . కాని , సత్యనిష్ఠను విడువడు . అట్టివాడే సజ్జనుడు

One who always speaks the truth would rather give up his life to uphold his principle. Such a person is virtuous.

462
ఆత్మనున్నవాని అనుదినంబును జూచి అతని మహిమవలన అతనుదెలియ అతడు సజ్జనుడగు అవనీతలంబున , వి. వే.

ఆత్మనున్నవాని అనుదినంబును
జూచి అతని మహిమవలన అతనుదెలియ
అతడు సజ్జనుడగు
అవనీతలంబున , వి. వే.

తన మనస్సులో ఉన్న పరమాత్మను అతని మహిమను బట్టి అనంతుడగు దేవుని తెలిసికొన్నవాడే సజ్జనుడు

One who realizes the god within himself and the miracle of his infinite external presence is virtuous.

463
ఆత్మశుద్ధికలిగి అధికులమనబోరు ధీరవృత్తి కలిగి తిరుగబోరు రూపుకుదురనుంచి రూఢిగావింతురు , వి. వే.

ఆత్మశుద్ధికలిగి అధికులమనబోరు
ధీరవృత్తి కలిగి తిరుగబోరు
రూపుకుదురనుంచి రూఢిగావింతురు,
వి. వే.

సజ్జనులు ఆత్మశుద్ధి కల్గియు గొప్పవార మనుకొనరు . ధీరులైయున్నను తిరుగరు . భగవంతుని రూపమును మనస్సున నిలిపి కృతార్థులగుదురు

Virtuous men with pure minds don't consider themselves as great. Even though they could be very learned, they remain humble. By fixating God in their minds they succeed in their spiritual life.

464
ఆదిశక్తిగూడి అనుభవ మొందును వేదవిద్యమరగి విడువబోడు సాధువృత్తి నిలను స్థైర్యముబొందును , వి. వే.

ఆదిశక్తిగూడి అనుభవ మొందును
వేదవిద్యమరగి విడువబోడు
సాధువృత్తి నిలను స్థైర్యముబొందును,
వి. వే.

సజ్జనుడు స్వశక్తివలన అనుభవమును సంపాదించి వేద సారమును గ్రహించి సాధువృత్తి నవలంబించి స్థిరత్వమును పొందును

A virtuous man gains experience with his own efforts, grasps the essence of vedas and adopts the life of a sage to remain firm in his conviction.

465
ఆర్యులైనవారలు అనుభవరూఢిని తెలియజెప్పుచుంద్రు తేటపడగ గుఱుతుగననివాడు గుఱియొప్పుజెప్పునా ? వి. వే.

ఆర్యులైనవారలు అనుభవరూఢిని
తెలియజెప్పుచుంద్రు తేటపడగ
గుఱుతుగననివాడు గుఱియొప్పుజెప్పునా?
వి. వే.

సజ్జనులు తమ అనుభవములను స్పష్టముగా చెప్పగలరు . ఇతరులు చెప్పలేరు . గురుతు తెలియనివాడు గురిని తెలుపుట సాధ్యము కాదుగదా

A virtuous man can explain his experiences in clear terms. Others can't do the same.

466
ఆడి తప్పువారల అభిమాన హీనులు గోడెఱుగనివారు కొద్దివారు కూడి కీడుసేయు క్రూరు౦డు తలపోయు , వి. వే.

ఆడి తప్పువారల అభిమాన హీనులు
గోడెఱుగనివారు కొద్దివారు
కూడి కీడుసేయు క్రూరు౦డు
తలపోయు , వి. వే.

కొందరు సజ్జనులవలె నటింతురు . వారు ఆత్మగౌరవమును విడిచి , అసత్యములు పల్కి మంచిచెడ్డలు తెలియక నీచముగా ప్రవర్తింతురు . ఇతరులను బాధించుటే వారి పని . క్రూరుని స్వభావ మిట్టిది

Some cruel people pretend to be virtuous. By giving up self-respect they speak lies and without knowing pros and cons they behave like low-lives. Their main goal is to hurt others.

467
ఇల్లు కొల్లజేయు రిహపరముల జూచి దీనవృత్తిచేత తిరుగుచుంద్రు భక్తికలిగియుండి ప్రాజ్ఞులౌ సజ్జనుల్ , వి. వే.

ఇల్లు కొల్లజేయు రిహపరముల జూచి
దీనవృత్తిచేత తిరుగుచుంద్రు
భక్తికలిగియుండి ప్రాజ్ఞులౌ
సజ్జనుల్ , వి. వే.

విజ్ఞులైన సజ్జనులు ఇహపరములను గమనించుచు గృహస్థాశ్రమముననే యుండి భక్తిని, నిగర్వమును ప్రకటింతురు

The learned virtuous men strive to be aware of life on earth and nether world while remaining committed to a family way of life without arrogance.

468
ఋషులు కానిపింత్రు హీనులయట్టుల వారిబోధ పెద్ద మేరువంత లోననున్నయట్టి జ్ఞానంబు మహిమరా , వి. వే.

ఋషులు కానిపింత్రు హీనులయట్టుల
వారిబోధ పెద్ద మేరువంత
లోననున్నయట్టి జ్ఞానంబు
మహిమరా , వి. వే.

ఉత్తమ మునలు హీనులవలె కనబడుదురేకాని వారి బోధ మేరువంత గొప్పది. దానికి వారి జ్ఞానమహిమయే కారణము .

Virtuous sages may look like low-lives. But their discourse is as great as the Meru mountain. It is because of their amazing knowledge.

469
ఎండచీకటులకు నిమ్మయి యుండెడు నిండుకుండలోన నిద్రమఱచి దండిగాను పరమతత్వంబు దెలియును , వి. వే.

ఎండచీకటులకు నిమ్మయి యుండెడు
నిండుకుండలోన నిద్రమఱచి
దండిగాను పరమతత్వంబు
దెలియును , వి. వే.

సజ్జనుడు సుఖదుఃఖములకు స్థానమై పాంచభౌతికమైన ఈ దేహమున అస్థ విడిచి , అజ్ఞానము పోగొట్టుకొని పరతత్వమును తెలిసికొనును

A virtuous man gives up his body that is subject to sorrow and comfort and composed of 5 elements (earth, fire, air, water and space) to dispel ignorance and learn true knowledge.

470
ఏకమైన వర్ణమెఱిగిన యోగికి పరమ మెఱి౦గి చూడ భావమొ౦దు నాకృతులనుజేరి అన్నిట తానౌను , వి. వే.

ఏకమైన వర్ణమెఱిగిన యోగికి
పరమ మెఱి౦గి చూడ భావమొ౦దు
నాకృతులనుజేరి అన్నిట
తానౌను , వి. వే.

సజ్జనుడైన యోగికి వర్ణభేదము లేదు . పరతత్వమును తెలిసికొని , తానే బ్రహ్మమను జ్ఞానము పొంది, అన్నింటను తాను ఉన్నట్లు భావించును .

A virtuous yogi has no caste-based discrimination. He feels he is everywhere by learning true knowledge and considering himself same as the creator.

471
ఒకటిక్రింద నొక్కటొగి గుణకము బెట్టి సరగున గుణీయింప వరుస బెరుగు అట్టిరీతి గుణులు నరయ సజ్జనులిల , వి. వే.

ఒకటిక్రింద నొక్కటొగి గుణకము
బెట్టి సరగున గుణీయింప వరుస
బెరుగు అట్టిరీతి గుణులు
నరయ సజ్జనులిల , వి. వే.

అంకెక్రింద అంకెపెట్టి గుణించిన వృద్ధియగునట్లు సజ్జనుల గుణములు వృద్ధిని పొందును . తగ్గవు .

Like numbers that grow exponentially when multiplied with one another, a virtuous man's qualities grow exponentially.

472
ఒక్క మనముతోడ నున్నది సకలము తిక్కబట్టి నరులు తిరుగుచుందు రిక్కయెఱిగి నడువ నొక్కడె చాలదా? వి. వే.

ఒక్క మనముతోడ నున్నది సకలము
తిక్కబట్టి నరులు తిరుగుచుందు
రిక్కయెఱిగి నడువ
నొక్కడె చాలదా? వి. వే.

మానవులు పెక్కు త్రోవలబట్టి భ్రష్టులై తిరుగుచుందురు . గమ్యస్థానము చేర్చ ఒక్కమార్గము చాలును . అదే ముక్తి మార్గము.

Men seek salvation through multiple paths and some become morally bankrupt in that process. It is enough if we can find one good path. That is the path to salvation.

473
ఓగుబుద్ధి విడిచి యోగి గావలెజుమీ భోగమమరు యుక్తి బూనరాదు సద్గుణంబు మొదల చవిగొనిచూడరా , వి. వే.

ఓగుబుద్ధి విడిచి యోగి గావలెజుమీ
భోగమమరు యుక్తి
బూనరాదు సద్గుణంబు మొదల
చవిగొనిచూడరా , వి. వే.

భోగములు కావలెనను చెడ్డబుద్ధి విడిచి యోగి కావలెను . ఉత్తమ గుణమునకే యత్నింపవలెను . అట్టివాడే సజ్జనుడు .

One has to give up the covetousness, become a yogi, and strive for good qualities. Such a person will be considered virtuous.

474
ఓర్పులేని భార్యయున్న ఫల౦బేమి ? బుద్ధిలేని బిడ్డ పుట్టి యేమి ?సద్గుణంబులేని చదువది యేలరా ? వి. వే.

ఓర్పులేని భార్యయున్న ఫల౦బేమి?
బుద్ధిలేని బిడ్డ పుట్టి
యేమి ?సద్గుణంబులేని
చదువది యేలరా ? వి. వే.

ఓర్పులేని భార్య , బుద్ధిలేని పుత్రుడు , గుణములేని చదువు నిరుపయోగములు

A wife without patience, a son without good qualities and knowledge without virtue are useless.

475
కంటి దృష్టిచేత గనులెల్ల విశ్వము దర్పణంబుగల్గు దన్ను గనును ఆత్మ తత్త్వ మార్గ మారీతి గనవలె , వి. వే.

కంటి దృష్టిచేత గనులెల్ల విశ్వము
దర్పణంబుగల్గు దన్ను
గనును ఆత్మ తత్త్వ మార్గ
మారీతి గనవలె , వి. వే.

కంటితో అన్నిటిని చూడగలము . అద్దములో మనలను చూచుకొనగలము . అట్లే ఆత్మ తత్త్వమును ప్రయత్నమున చూడగలము

We can see all with eye. We can see our reflection in the mirror. Similarly we can realize the knowledge about aatma with practice.

476
కంటిలోన మిన్ను కలయక తగు ముక్తి నంటి తిరుగువాడె యమలు డగును వంటకంబు కొఱకు వాగ్ధాటి జూపడు , వి. వే.

కంటిలోన మిన్ను కలయక తగు ముక్తి
నంటి తిరుగువాడె యమలు
డగును వంటకంబు కొఱకు వాగ్ధాటి
జూపడు , వి. వే.

కంటితో పరతత్త్వమును చూచుచు ధ్యానించువాడే ముక్తి పొందును . అట్టివాడు మంచి తిండిని ఆశింపడు

One who can visualize the knowledge about the netherworld and meditate on it attains salvation. One who seeks true knowledge with observation and meditation is eligible for salvation. He has no need for food.

477
కంటిలోనివాని గఱకంఠు నెఱుగుము కంటిలోనివాని మింటజూడు కన్ను మిన్ను హృదయకమలమందెఱుగుము , వి. వే.

కంటిలోనివాని గఱకంఠు నెఱుగుము
కంటిలోనివాని మింటజూడు
కన్ను మిన్ను హృదయకమలమందెఱుగుము,
వి. వే.

సజ్జనుడా!కంటికి కానవచ్చు పరముడైన శివుని గుర్తించి, హృదయ కమలమున పరమాత్మను చూడుము

A virtuous man should be able to see Lord Siva embedded in the body near the heart. He is the universal spirit.

478
కడగి గాలిలేని గగనంబు భంగిని బలు తఱగులులేని జలధి మాడ్కి నిర్వికారమునను నిశ్చలుడై యుండు , వి. వే.

కడగి గాలిలేని గగనంబు భంగిని
బలు తఱగులులేని జలధి
మాడ్కి నిర్వికారమునను నిశ్చలుడై
యుండు , వి. వే.

సజ్జనుడా!గాలిలేని ఆకాశమువలె , అలలులేని సముద్రమువలె నిర్వికారముగా నిశ్ఛలుడవై యుండిన ముక్తి కల్గును

A virtuous man by remaining still like wind-less sky and wave-less sea can attain salvation.

479
కడుపు చిచ్చుచేత గామానలముచేత క్రోధవహ్ని చేత గుతిలపడక యుక్తమనసుతోడ నుండును సుజనుడు , వి. వే.

కడుపు చిచ్చుచేత గామానలముచేత
క్రోధవహ్ని చేత గుతిలపడక
యుక్తమనసుతోడ నుండును
సుజనుడు , వి. వే.

సుజనుడు జఠరాగ్నికి , కామాగ్నికి , క్రోధాగ్నికి లొంగి బాధపడక, మంచి మనస్సుతో నిర్మలుడై యుండును .

A virtuous man by not yielding to hunger, lust and anger , remains pious and sorrow-free.

480
కడుపుకేల మీరు కళవలపడెదరు ?కడుపు చల్లబడగ కలదు భుక్తి కడకు రాతిలోని కప్పకు లేదొకో ? వి. వే.

కడుపుకేల మీరు కళవలపడెదరు?
కడుపు చల్లబడగ కలదు
భుక్తి కడకు రాతిలోని కప్పకు
లేదొకో ? వి. వే.

తిండికై శ్రమపడనక్కరలేదు . రాతిలోని కప్పకు ఆహారమిచ్చు దేవుడే మీకు ఆహార మిచ్చును . దేవునినే నమ్ముకొనవలెను

One need not worry about food. The god who provides sustenance to the frog trapped inside a stone will take care of it. One has to believe in God.

481
కనులు పోవువాడు కాళ్ళు పోయినవాడు ఉభయులరయగూడి యుండునట్లు పేదపేదగూడి పేనగొని యుండును , వి. వే.

కనులు పోవువాడు కాళ్ళు పోయినవాడు
ఉభయులరయగూడి యుండునట్లు
పేదపేదగూడి పేనగొని
యుండును , వి. వే.

కుంటి , గ్రుడ్డి పరస్పరము సాయపడినట్లు బీదవానికి బీదవాడే సాయపడును . సజ్జనుడు సజ్జనునే చేరును .

A lame man and a blind man cooperate with each other. A poor man cooperates with another poor man. Similarly a virtuous man cooperates with another.

482
కప్పువీడి మనసు కాంక్షింప దెద్దియు జ్ఞానతపము మాని కదలకుండు మెచ్చునాత్మక్రమము మిన్నంటి యుండును , వి. వే.

కప్పువీడి మనసు కాంక్షింప దెద్దియు
జ్ఞానతపము మాని కదలకుండు
మెచ్చునాత్మక్రమము మిన్నంటి
యుండును , వి. వే.

అజ్ఞానము విడిచిన మనస్సు దేనిని కోరదు . నిశ్చలమై జ్ఞానము నొంది ఆత్మ తత్త్వ మెరిగి ముక్తిని పొందును .

If one gives up ignorance, mind does not wish for anything. By remaining still one can attain salvation using knowledge about aatma

483
కామమోహములను గలిగియుండు నరుడు ఇష్ట దేవగురుల నెఱుగలేడు ఇష్టు నెఱిగినతడె యిల సజ్జను ౦డగు , వి. వే.

కామమోహములను గలిగియుండు నరుడు
ఇష్ట దేవగురుల నెఱుగలేడు
ఇష్టు నెఱిగినతడె యిల
సజ్జను ౦డగు , వి. వే.

కామ, మోహములకు లోబడినవానికి హితులు, దైవము, గురువులు కానరారు . ఇష్టుని గుర్తించినవాడే సజ్జనుడు

One who succumbed to lust and greed, would not be aware of well-wishers, god and guru. A virtuous man is one who recognizes those who appreciate him.

484
కాలునకును జిక్కి కక్కసపడనేల ? మేలుగాను గురువు మెప్పుబడసి ప్రాలుమాలకుండ పరమార్థ మెఱుగుము , వి. వే.

కాలునకును జిక్కి కక్కసపడనేల?
మేలుగాను గురువు మెప్పుబడసి
ప్రాలుమాలకుండ పరమార్థ
మెఱుగుము , వి. వే.

గురువును సేవించి, అతనివలన పరమార్థమును తెలిసి కొన్నయెడల యమునకు చిక్కి శ్రమపడనక్కరలేదు

By serving a guru and learning about nether world, one can avoid strife from death in the hands of lord of death.

485
కూళకూళమెచ్చు గుణవంతు జెడనాడు అట్టి హీను మెచ్చ రెట్టివారు మ్రాని దూలమునకు జ్ఞానము తెలియునా ? వి. వే.

కూళకూళమెచ్చు గుణవంతు జెడనాడు
అట్టి హీను మెచ్చ రెట్టివారు
మ్రాని దూలమునకు జ్ఞానము
తెలియునా ? వి. వే.

దుర్జనుడు దుర్జనునే మెచ్చును . మంచివానిని మెచ్చడు . అట్టి హీను నెవ్వరును మెచ్చరు . మొద్దునకు జ్ఞానమెట్లు కలుగును ?

A low-life appreciates another low-life. He won't appreciate a virtuous person. All will not appreciate the low-lives. How can a dunce acquire knowledge?

486
కూళతొత్తు పొందు కులమునకేకాక సజ్జనునకుగాదు సమ్మతంబు పేడ తిన్న పురుగు బెల్లమే మెఱుగును ? వి. వే.

కూళతొత్తు పొందు కులమునకేకాక
సజ్జనునకుగాదు సమ్మతంబు
పేడ తిన్న పురుగు బెల్లమే
మెఱుగును ? వి. వే.

పేడ తినే పురుగునకు బెల్లము ఇష్టము కానట్లు దుష్టునకు మంచివారి స్నేహము ఇష్టపడదు . వానిని కులమువారును నిందింతురు .

A dung beetle can't appreciate the sweetness of jaggery. Similarly a low-life cannot appreciate the friendship with virtuous men. He will be cursed by people belonging to his own caste.

487
కూరయుడుకు వెనుక కూడునా కసవేర ? యెఱుకగల్గి మునుపె యేరవలయు స్థలము తప్పు వెనుక ధర్మంబు పుట్టునా ? వి. వే

కూరయుడుకు వెనుక కూడునా కసవేర?
యెఱుకగల్గి మునుపె యేరవలయు
స్థలము తప్పు వెనుక ధర్మంబు
పుట్టునా ? వి. వే

ఉడుకకముందే కూరలోని చెత్త తీసివేయవలెను . అట్లే సమయము తప్పిన యెడల ధర్మము చేయు సాధ్యము కాదు

One has to remove the dregs in cooking pot just in time before the food is fully cooked. When one misses the proper opportunity, it is not possible to donate or give alms.

488
కోటిదానమిచ్చి కోపంబు పొందుచో బాటిసేయ రతని ప్రజలు మెచ్చి సాత్త్విక గుణముల సజ్జను౦డగునయా ! వి. వే.

కోటిదానమిచ్చి కోపంబు పొందుచో
బాటిసేయ రతని ప్రజలు
మెచ్చి సాత్త్విక గుణముల
సజ్జను౦డగునయా ! వి. వే.

కోటి రూప్యములు దానమిచ్చి కోపించిన మనుష్యునెవ్వరును మెచ్చుకొనరు. సాత్త్విక గుణమున్ననే సజ్జనుడగును .

No one will appreciate a person who exhibits anger after donating a largess. Only with serenity one will become virtuous.

489
కొంపలోననున్న కోర్కులుభేదించి పరగ హృదయమట్టె పదిలపఱచి గృహము నిల్పువాడు బహుతత్త్వవేదిరా ! వి. వే.

కొంపలోననున్న కోర్కులుభేదించి
పరగ హృదయమట్టె పదిలపఱచి
గృహము నిల్పువాడు బహుతత్త్వవేదిరా!
వి. వే.

మనస్సులోని కోరికలను చంపుకొని , దానిని స్థిరముగా ఉంచవలెను . అట్లు౦చినవాడే గొప్ప తత్త్వవేత్త

One has to control the wish seeking mind and keep it still. Such a person is the seeker of true knowledge.

490
కోపమునను ఘనత కొంచెమైపోవును కోపమునను గుణము కొఱతపడును కోపమునను బ్రతుకు కొంచెమైపోవును , వి. వే.

కోపమునను ఘనత కొంచెమైపోవును
కోపమునను గుణము కొఱతపడును
కోపమునను బ్రతుకు కొంచెమైపోవును,
వి. వే.

కోపమువల్ల గొప్పతనము , గుణము తగ్గిపోవును . కోపమున్నవానికి జీవనము కష్టముగా ఉండును .

With anger one loses good qualities and greatness. Life will be difficult with anger.

ఖలులు తిట్టిరంచు కలవరపడనేల?వారు తిట్ల నేమి వాసి చెడును? సజ్జనుండు తిట్ల శాపంబదౌనయా ! వి. వే.

దుష్టులు తిట్టిన లెక్క చేయరాదు . దానివల్ల నష్టము లేదు . కాని సజ్జనుల తిట్టు శాపమువలె ఫలించును .

One shouldn't care if a low-life curses. They don't lose anything. But when cursed by a virtuous person, it will be realized in actuality.

493
గట్టి సాధువిద్య కాస౦తె యనుకొని గాఢవిద్య నేర్చి కనుము ఘనత సాధు సజ్జనముల సాంగత్య మెఱుగుము , వి. వే.

గట్టి సాధువిద్య కాస౦తె యనుకొని
గాఢవిద్య నేర్చి కనుము
ఘనత సాధు సజ్జనముల సాంగత్య
మెఱుగుము , వి. వే.

మంచి విద్య కొంచెమబ్బినను గొప్పగా భావించవలెను . సాధువుల,సజ్జనుల స్నేహము చేయుము. కీర్తి కలుగును

One should feel great even if a small amount of sacred knowledge is imparted. Righteous people should befriend virtuous people to achieve fame.

494
గుణగణంబులెల్ల గుచ్చితమును బొంద తగిలి భ్రమకుజిక్కి దండధరుని దోడ్ తెచ్చుగదర తొలగింపకున్నను , వి. వే.

గుణగణంబులెల్ల గుచ్చితమును
బొంద తగిలి భ్రమకుజిక్కి
దండధరుని దోడ్ తెచ్చుగదర తొలగింపకున్నను,
వి. వే.

దుష్టగుణములు, మోసపుచ్చుట మున్నగువానివలన అపాయము , పాపము సంభవించును . అట్టి చెడుగుణములను తొలగించు కొనవలెను . (లేకుండ చేసికొనవలెను )

Evil thoughts and deceitfulness will bring danger to one. One becomes a sinner. One should eradicate such bad qualities.

495
గుణములుగలవాని కుల మెంచగానేల ? గుణము కలిగెనేని కోటిసేయు గుణము లేకయున్న గ్రుడ్డిగవ్వయు లేదు, వి. వే.

గుణములుగలవాని కుల మెంచగానేల?
గుణము కలిగెనేని కోటిసేయు
గుణము లేకయున్న గ్రుడ్డిగవ్వయు
లేదు, వి. వే.

గుణము ముఖ్యము . గుణమున్నచో కులమును లెక్కింప కూడదు . గుణములేనివాడు గ్రుడ్డిగవ్వపాటియు చేయడు .

Character is important. One should not consider caste because character trumps it. A man without character is worthless.

496
గుణము కల్గియున్న కులసతి నెవ్వారు నింద చేయలేరు నీతిజూచి గుణము లేకయున్న గులహీనురాలయా ! వి. వే.

గుణము కల్గియున్న కులసతి
నెవ్వారు నింద చేయలేరు నీతిజూచి
గుణము లేకయున్న
గులహీనురాలయా ! వి. వే.

గుణవంతురాలగు స్త్రీని ఎవ్వరును నిందింపలేరు . గుణము లేని యువతి గొప్ప కులమున పుట్టినను కులహీనురాలే యగును . గుణమే ముఖ్యము

No one can blame a woman with character. A woman without character even if born in a superior caste will be considered as caste-less. Character is the utmost.

497
గుణయుతునకు మేలు గోరంత చేసిన కొండయగును వాని గుణము చేత

గుణయుతునకు మేలు
గోరంత చేసిన
కొండయగును వాని
గుణము చేత
కొండయంత మేలు గుణహీను డెఱుగునా ? వి. వే.

గుణవంతుడు కొద్ది మేలును గొప్పగా భావించును . గుణహీనుడు తనక చేసిన గొప్ప మేలైనను లెక్కింపడు . కృతఘ్నుడగును

A man with character will appreciate a lot even if a small favor is done to him. A characterless man won't appreciate a big favor done to him. He will turn into ingrate.

498
గుణము తీరులేక కులమెల్ల జెడిపోయె స్త్రీల నడతవలన సిగ్గుపోయె చవిటి నేలవలన జలమెల్ల చెడిపోయె , వి. వే.

గుణము తీరులేక కులమెల్ల జెడిపోయె
స్త్రీల నడతవలన సిగ్గుపోయె
చవిటి నేలవలన జలమెల్ల
చెడిపోయె , వి. వే.

చవిటి నేలలోని నీరు ఉప్పైనట్లు గుణహీనులగు స్త్రీ పురుషులవల్ల వంశము చెడి , అవమానము పాలగును

Like the ground water is salty in some barren lands, the dynasty will be insulted and destroyed by characterless men and women.

499
గురువు వచ్చుచున్న గూర్చుండి లేవని తుంటరులకు నెట్లు దొరకు ముక్తి? మగని లెక్కగొనని మగువకు గతియున్నె ? వి. వే.

గురువు వచ్చుచున్న గూర్చుండి
లేవని తుంటరులకు నెట్లు దొరకు
ముక్తి? మగని లెక్కగొనని
మగువకు గతియున్నె ? వి. వే.

భర్తను లెక్కచేయని భార్యకు ఉత్తమ గతి లేనట్లు గురువును గౌరవింపక అవమానించు తుంటరికి ముక్తి లభించదు

Like a wife who doesn't care for her husband cannot achieve greatness, a truant who insults his guru has no salvation.

500
గువ్వకొఱకు మేను కోసియా శిబిరాజు వార్త విడువరాక కీర్తి కెక్కె ఓగునెంచబోవ రుపకారి నెంతురు , వి. వే.

గువ్వకొఱకు మేను కోసియా శిబిరాజు
వార్త విడువరాక కీర్తి
కెక్కె ఓగునెంచబోవ రుపకారి
నెంతురు , వి. వే.

పావురమును కాపాడుటకు శిబి తన దేహమునే యిచ్చి కీర్తి గాంచెను . లోకమున ఉపకారి నెంతురు . చెడ్డవారిని ఎంచరు .

King Sibi offered his own flesh to save a pigeon and achieved greatness. This world recognizes a virtuous person but not a low-life.

501
చిత్తశుద్ధి యొకటి శ్రేష్ఠలాంఛనమగు నిఖిల పుణ్యకార్య నిర్వహణము నద్దిలేక చేయ ననువుగా దేరికి ? వి. వే.

చిత్తశుద్ధి యొకటి శ్రేష్ఠలాంఛనమగు
నిఖిల పుణ్యకార్య
నిర్వహణము నద్దిలేక చేయ ననువుగా
దేరికి ? వి. వే.

చిత్తశుద్ధి యున్నచో తలచిన కార్యములు సఫలమగును . మనశుద్ధిలేక చేసిన కార్యము నెరవేరదు

With a pure mind anything can be achieved. With an impure mind even a simple task becomes impossible.

502
చిన్నెలంతెకాని సృష్టి లౌకికమగు నందువల్లనేమి యాసకద్దు ? ఒక్కడైనవాడె ఉత్తమ పురుషు౦డు , వి. వే.

చిన్నెలంతెకాని సృష్టి లౌకికమగు
నందువల్లనేమి యాసకద్దు?
ఒక్కడైనవాడె ఉత్తమ
పురుషు౦డు , వి. వే.

లౌకికమగు వేషములవల్ల ఏమియు ప్రయోజనము లేదు . లోకమంతయు ఏకదృష్టితో చూడవలెను . అట్టివాడే సజ్జనుడు

With a business like appearance there is no use. One has to look at the whole world with a single vision. Such a person is virtuous.

503
చెడ్డవాని మిగుల జెఱచును దైవంబు అడ్డుపడడు వాని కాపదైన చెడ్డ చేను చూచి రెడ్డి తా మెచ్చునా ? వి. వే.

చెడ్డవాని మిగుల జెఱచును దైవంబు
అడ్డుపడడు వాని కాపదైన
చెడ్డ చేను చూచి రెడ్డి
తా మెచ్చునా ? వి. వే.

చెడ్డవారికి దైవము సాయపడడు . ఆపద కడ్డుపడడు . చేను చెడిపోయినచో రెడ్డి మెచ్చుకొనునా ?

God won't help a low-life. He won't protect him when bad happens. Will the landlord appreciate if the field turns barren?

504
చెడిన మానవులను చేపట్టి రక్షించి కడకు జేర్చునట్టి ఘనులు తలప విబుధ జనుల గా౦త్రు విశ్వేసు సన్నిధి , వి. వే.

చెడిన మానవులను చేపట్టి రక్షించి
కడకు జేర్చునట్టి ఘనులు
తలప విబుధ జనుల గా౦త్రు విశ్వేసు
సన్నిధి , వి. వే.

చెడ్డవారిని చేరదీసి , రక్షించి , మంచివారినిగా చేయు ఘనులు భగవత్సాన్నిధ్యమును పొందుదురు

Those who protect low-lives from destroying themselves and transform them into virtuous persons will attain salvation.

505
చేకొనుచును తమకు చేసా చినంతలో చెడిన ప్రజల రక్ష చేయకున్న తమది సాగుటేమి ? తమ తను వదియేమి ? వి. వే.

చేకొనుచును తమకు చేసా చినంతలో
చెడిన ప్రజల రక్ష చేయకున్న
తమది సాగుటేమి ? తమ
తను వదియేమి ? వి. వే.

తమ్ము గ్రహించి కాపాడవలెనని కోరినచో కష్టములో నున్నవారిని రక్షింపవలెను . అట్లు లేనివాని జన్మ వ్యర్థము .

One has to come to the rescue of others who are in trouble and seek help. Without such generosity one's life is a waste.

506
చచ్చువాని జూచి చావని పుట్టని తత్త్వమెల్ల నాత్మ దలపుచేసి యరసి చూచునట్టి యతడె పో సుజనుండు , వి. వే.

చచ్చువాని జూచి చావని పుట్టని
తత్త్వమెల్ల నాత్మ దలపుచేసి
యరసి చూచునట్టి యతడె
పో సుజనుండు , వి. వే.

చచ్చిపోవు వారిజూచి దేహములు అనిత్యమని గ్రహించి ఆత్మతత్త్వమును తెలిసికొన్నవాడే సజ్జనుడు

A virtuous man after observing death realizes that the physical body is impermanent and focuses on the permanent aatma.

507
చదివినయ్యకన్న చాకలియే మేలు గృహము వేల్పుకన్న గేదెమేలు బాపనయ్యకన్న బైనీడు మేలయా ! వి. వే.

చదివినయ్యకన్న చాకలియే
మేలు గృహము వేల్పుకన్న
గేదెమేలు బాపనయ్యకన్న బైనీడు
మేలయా ! వి. వే.

సుజనుడు కాని విద్వాంసునికంటె చాకలి మేలు , వరమీయని యింటి వేల్పుకన్న గేదె మేలైనట్లు సజ్జనుడుకాని బ్రాహ్మణునికంటె నీచ జాతి బైనీడు మేలు

A low-caste clothes washer is better than a non-virtuous high-caste pundit. A buffalo is better than a demi-god who doesn't offer a boon. Any low-caste person is better than a non-virtuous brahmin.

508
చదువులన్ని చదివి చాల వివేకియౌ కపటికెన్నడైన గలదెముక్తి ?నిర్మలాత్మకునకె నశ్చలంపు సమాధి , వి. వే.

చదువులన్ని చదివి చాల వివేకియౌ
కపటికెన్నడైన గలదెముక్తి?
నిర్మలాత్మకునకె నశ్చలంపు
సమాధి , వి. వే.

విద్వాంసుడై వివేకియైనను కపటముగా ఉన్నవానికి ముక్తి లేదు . నిర్మలముగా ఉన్నవాడే సమాధినిష్టుడై ముక్తి నందును

Whether a wise person or a learned man, if he is deceitful, there is no salvation. One who is pure in mind and meditative is eligible for salvation.

509
చంపదగినయట్టి శత్రువు తనచేత జిక్కెనేని కీడు చేయరాదు పొసగ మేలుచేసి పొమ్మనుటే చాలు , వి. వే.

చంపదగినయట్టి శత్రువు తనచేత
జిక్కెనేని కీడు చేయరాదు
పొసగ మేలుచేసి పొమ్మనుటే
చాలు , వి. వే

చంపదగిన విరోధి తనకు చేజిక్కినను , వానికి అపకారము చేయక మేలు చేసి పొమ్మనుట సజ్జనుని లక్షణము

Even when an enemy unworthy of life is caught, a virtuous man will set him free without doing any harm

510
చూఱుగొనుము దొరకు సుజ్ఞానమెల్లను పారవేయు మెల్ల పాపగుణము దారితెలియ బుధులు దాపున మెలగుము , వి. వే.

చూఱుగొనుము దొరకు సుజ్ఞానమెల్లను
పారవేయు మెల్ల పాపగుణము
దారితెలియ బుధులు
దాపున మెలగుము , వి. వే.

లభించినంతవరకు మంచి జ్ఞానము సంపాదించుము . పాపమును తరిమి వేసి,మంచి మార్గము తెల్పు విద్వాంసులను చేరుము

One has to acquire virtuous knowledge as far as possible. And seek the tutelage of learned men who absolve from sins and show a good path.

511
చెదులుభంగి గంద్రు సాధువు మూఢులు తాను వారినెట్లు కాననగును దీనికెంత దవ్వొ దానికి నిదియంతె , వి. వే.

చెదులుభంగి గంద్రు సాధువు
మూఢులు తాను వారినెట్లు కాననగును
దీనికెంత దవ్వొ దానికి
నిదియంతె , వి. వే.

మంచివానిని మూర్ఖులు చెదలవలె చూచెదరు . ఇతడును వారి నట్లే చూడవలెను . సజ్జనుడు దుష్టుని కెట్లో దుష్టుడును సజ్జనున కట్టివాడే అగును .

A virtuous man will be viewed as a termite by the foolish people. The virtuous man should respond in kind.

512
ఛాయ నొసగుజెట్లు సాధువు బోధలు అడిగి దరినజేర బడయవచ్చు అట్టునిట్టదాట నదిపోవు నిదిరాదు , వి. వే.

ఛాయ నొసగుజెట్లు సాధువు బోధలు
అడిగి దరినజేర బడయవచ్చు
అట్టునిట్టదాట నదిపోవు
నిదిరాదు , వి. వే.

దగ్గర చేరినవారికి చెట్లు నీడనిచ్చును . సాధువులు మంచి బోధలను ఇత్తురు. అటు నిటు తప్పిపోయిన ఆ నీడ లభించదు . ఆ బోధలును తెలియవు

A tree provides shade to those who come near it. Similarly virtuous people preach good things to others. When one strays away from the tree, the benefit of shade won't be there. So does when one disregards the preaching of virtuous people.

513
జఠరమందు జ్యోతి చాల దేదీప్యము కానలేని నరులు కలుషమతులు కన్నువిచ్చి చూచు ఘనుడగు సుజనుండు , వి. వే

జఠరమందు జ్యోతి చాల దేదీప్యము
కానలేని నరులు కలుషమతులు
కన్నువిచ్చి చూచు ఘనుడగు
సుజనుండు , వి. వే

మనలోనే ఉన్న ఆత్మజ్యోతి దేదీప్యమానమై వెలుగుచుండగా దుష్టులు దానిని చూడలేరు . సుజనులు చూడగలరు

A low-life can't visualize the bright light of aatma in the body near the heart that can be visualized by virtuous men.

514
జనుడు తెలివినొంద సంచలింపదు మది దయయు నీతి గలుగు దగులు బుద్ధి తివురు భానుజూచి తిమిరంబు నిల్చునా? వి. వే.

జనుడు తెలివినొంద సంచలింపదు
మది దయయు నీతి గలుగు దగులు
బుద్ధి తివురు భానుజూచి తిమిరంబు
నిల్చునా? వి. వే.

జనుడు జ్ఞానియైనచో మనస్సు చలింపదు . బుద్ధి నీతి యందును , దయ యందును లగ్నమగును . సూర్యుడున్నచోట చీకటి యుండదు కదా!

When one is learned, the mind will be still. And mind will focus on morals and kindness. There is no darkness where the sun shines.

515
జక్కి నెక్కి వీధిజక్కగా వెలువడ గుక్క విన్నివెంట కూయదొడగు ఘనున కోర్వలేని కాపురుషులు నిట్లె , వి. వే.

జక్కి నెక్కి వీధిజక్కగా వెలువడ
గుక్క విన్నివెంట కూయదొడగు
ఘనున కోర్వలేని కాపురుషులు
నిట్లె , వి. వే.

గుర్రము నెక్కి పోవుచుండగా వెనుక కుక్కలు మొరిగిన హాని యేమి? సజ్జనుని చూచి దుర్జనులు అసూయపడుట అట్లు౦డును

When one is riding on a horse, there is no need to worry about barking dogs. Such is the nature of virtuous men when confronted by low-lives.

516
దాగుపడని వెనుక దాగు నశక్యము అరసి చేయుమయ్య అన్ని పనులు తెలియకున్న అడుగు తెలిసినవారిని , వి. వే.

దాగుపడని వెనుక దాగు నశక్యము
అరసి చేయుమయ్య అన్ని
పనులు తెలియకున్న అడుగు తెలిసినవారిని,
వి. వే.

ఏ పనినైనను బాగుగా గమనించి చేయవలెను . తెలియనిచో ఇతరులను అడిగి తెలిసికొనవలెను . మచ్చఏర్పడిన, అది దాగుట కష్టము .

One has to observe carefully before embarking on a task. When one doesn't know how to do a task he has to ask those who know. A blemish is hard to hide.

517
తట్టునెక్కి తిరుగునట్టె వేటయ్యెనా ? ఎపుడొ క్రిందబడిన నేదొ విరుగు చెల్లియుండి యోర్పుజెందిన భూషింత్రు , వి. వే.

తట్టునెక్కి తిరుగునట్టె వేటయ్యెనా?
ఎపుడొ క్రిందబడిన నేదొ
విరుగు చెల్లియుండి యోర్పుజెందిన
భూషింత్రు , వి. వే.

గుర్రమెక్కినంతమాత్రాన వేట యగునా ? ఎప్పుడో ఒకప్పుడు నేలపై పడక తప్పదు . శక్తి యుండియు ఓరిమి కలవానినే అందరును మెచ్చుకొందురు

Is mounting a horse equivalent to going for a hunt? One is sure to fall on the ground one time or other. A person who has the patience over strength will be appreciated.

518
తండ్రికన్న సుగుణి తనయుడై యొప్పెనా పిన్న పెద్దతనము లెన్నరెవరు వాసుదేవు విడిచి వసుదేవు నెంతురా , వి. వే.

తండ్రికన్న సుగుణి తనయుడై యొప్పెనా
పిన్న పెద్దతనము లెన్నరెవరు
వాసుదేవు విడిచి వసుదేవు
నెంతురా , వి. వే.

తండ్రికంటె పుత్రుడు ఘనుడైనచో చిన్న , పెద్ద భేదమును లెక్కింపరు . వసుదేవుని విడిచి శ్రీ కృష్ణునే అందరును గౌరవించుటలేదా ?

When a son excels over his father, people don't discriminate by age. Don't the hindus worship Lord Krishna more than his father Vasudeva?

519
తనసతి నపథమున దనుదానె చొనుపగా సాటి పూరుషు౦డు సరగ దెల్ప నెఱుగలేని నరుడు నరమాత్రుడేకాడు , వి. వే.

తనసతి నపథమున దనుదానె చొనుపగా
సాటి పూరుషు౦డు సరగ
దెల్ప నెఱుగలేని నరుడు నరమాత్రుడేకాడు,
వి. వే.

తన భార్యను తానే చెడ్డ మార్గమున ప్రవేశపెట్టి , అది తగదని సాటివారు చెప్పినను వినని నరుడు పశువే యగును

When one spoils his wife and ignores the rebukes from others, he is as obstinate as cattle.

520
తనకుబోలె నవియు ధరబుట్టినను కావొ పరగదన్ను బోలి బ్రతుకుగాదె జ్ఞానిప్రాణి జంప కారణమేమయా ? వి. వే.

తనకుబోలె నవియు ధరబుట్టినను
కావొ పరగదన్ను బోలి బ్రతుకుగాదె
జ్ఞానిప్రాణి జంప
కారణమేమయా ? వి. వే.

తక్కిన ప్రాణులను తనవలెనే భావించవలెనేకాని హింస చేయరాదు . ఇది తెలియక దుర్జనులు జీవహింస చేయుదురు

One has to show kindness to all life forms and not be violent towards them. Without knowing this, low-lives show cruelty to animals.

521
తప్పులెన్నువారు తండోపతండము లుర్వి జనులకెల్ల నుండుదప్పు తప్పులెన్నువారు తమ తప్పు లెఱుగరు , వి. వే .

తప్పులెన్నువారు తండోపతండము
లుర్వి జనులకెల్ల నుండుదప్పు
తప్పులెన్నువారు తమ
తప్పు లెఱుగరు , వి. వే .

లోకములో తప్పు చేయనివారు లేరు. అయినను ఇతరుల తప్పు లెన్నువారు లెక్కలేనంతమంది . వారు తమ తప్పులు నెరుగరు .

There is no one without a sin. But the ones who point out sins among others are plentiful. They don't realize their own short-comings.

522
తల్లి నెదురుకొనుట తండ్రి నెదురుకొనుట అన్న నదురుకొనుట యనెడి మూడు పాతకముల నెఱిగి వర్తింపగావలె , వి. వే.

తల్లి నెదురుకొనుట తండ్రి
నెదురుకొనుట అన్న నదురుకొనుట
యనెడి మూడు పాతకముల నెఱిగి
వర్తింపగావలె , వి. వే.

తల్లిని, తండ్రిని, అన్నను ఎదిరించి పల్కుటలు మూడు పాతకములు . వీనినెరిగి జాగ్రత్తగా ప్రవర్తింపవలెను .

One who disrespects his mother, father and brother is committing a sin.

523
తివిరిలేని యింటి దెరువరేమెఱుగును ? మొఱ్ఱపెట్టి నెత్తి మొత్తుగాని ప్రథితధర్మ మధమ భట్టు లెర్గుదురకో ? వి. వే.

తివిరిలేని యింటి దెరువరేమెఱుగును?
మొఱ్ఱపెట్టి నెత్తి
మొత్తుగాని ప్రథితధర్మ మధమ భట్టు
లెర్గుదురకో ? వి. వే.

ఉత్తమ ధర్మములను సజ్జను లెరుగుదురుగాని అధములెరుగుదురా ? అది లేని యిల్లని దారి బోవు అతిథి కెట్లు తెలియును?

Virtuous people know about dharma rather than a low-life. How can a wayward traveler know to whom the house belongs?

524
తేనె తెరలజాడ తేనెటీగ యెఱు౦గు సమరసంబుజాడ భ్రమరమెఱుగు పరమయోగిజాడ భక్తుడెఱు౦గును , వి. వే.

తేనె తెరలజాడ తేనెటీగ యెఱు౦గు
సమరసంబుజాడ భ్రమరమెఱుగు
పరమయోగిజాడ భక్తుడెఱు౦గును,
వి. వే.

తేనెతెట్టెలోని పొరలగూర్చి తేనెటీగకు, ఆయా పూలలోని తేనెను గూర్చియు తుమ్మెదకు తెలియును . పరమ యోగిని భక్తుడే తెలిసికొనగలుడు

A honeybee knows the geometry of the hive and the honey found in a variety of flowers. Similarly a supreme yogi will be discovered by his devotees.

525
దూలముల నటెక్కి దొమ్మరిగడనెక్కి జాలుదు ననడెప్డు సజ్జనుండు వీలుమానుపనుల వెఱ్ఱియై చేయునా ? వి. వే.

దూలముల నటెక్కి దొమ్మరిగడనెక్కి
జాలుదు ననడెప్డు సజ్జనుండు
వీలుమానుపనుల వెఱ్ఱియై
చేయునా ? వి. వే.

దూలము నెక్కగల్గిన సజ్జనుడు దొమ్మరివాని గడ నెక్కగలనని అనడు . యత్నింపడు . వీలు మాలిన పని నెన్నడును చేయడు .

A virtuous man who can climb atop the house won't claim he can do the same on the pole carried by Lord Vishnu's devotees. He will never do an impossible task.

526
దేవతార్చన జపతప స్తీర్థయాత్ర దానాధర్మక్రతువులను దలచిచూడ పుణ్యసాధన వృత్తులు పుడమిలోన కల్మషములేని హృదయము కలుగ వేమ!

దేవతార్చన జపతప స్తీర్థయాత్ర
దానాధర్మక్రతువులను దలచిచూడ పుణ్యసాధన
వృత్తులు పుడమిలోన కల్మషములేని
హృదయము కలుగ వేమ

దేవతార్చన , జపతపములు , తీర్థయాత్ర , దానధర్మములు , యాగములు పుణ్య సాధనములు . వీనిని పరిశుద్ధమగు మనస్సుతో ఆచరింపవలెను .

Pooja, meditation, pilgrimage, charity, rituals, etc. are spiritual ways. One has to perform them with a pure mind.

527
దోషరాశిబుట్టి దోషంబు తెలియక దూషణములు చేయు దుష్టజనులు నరకకూపమందు నాటియుండుదురయా , వి. వే.

దోషరాశిబుట్టి దోషంబు తెలియక
దూషణములు చేయు దుష్టజనులు
నరకకూపమందు నాటియుండుదురయా,
వి. వే.

దుష్టులు దోషములలో పుట్టి , ఆ సంగతి తెలియక ఇతరులను దూషింతురు . అట్టివారు నరక కూపములోనే పడుదురు

Low-lives are born with defects. Without being self-aware they blame others. Such people will be relegated to hell.

528
ధార్మికునకుగాని ధర్మంబు కనరాదు కష్టజీవికెట్లు కానబడును ? నీరుచొరమి లోతు నిజముగా తెలియదు , వి. వే.

ధార్మికునకుగాని ధర్మంబు కనరాదు
కష్టజీవికెట్లు కానబడును?
నీరుచొరమి లోతు నిజముగా
తెలియదు , వి. వే.

దిగినగాని నీటిలోతు తెలియదు . ధర్మముగూర్చి ధార్మికునకే గాని యితరులకు తెలియదు .

One who is inside a body of water knows how deep it is. Similarly dharma is known to a virtuous person.

529
నీచగుణములెల్ల నిర్మూలమైపోవు కొదువలేదు సుజనగోష్ఠివలన గంధమందు మేనిక పడగినయట్లు , వి. వే.

నీచగుణములెల్ల నిర్మూలమైపోవు
కొదువలేదు సుజనగోష్ఠివలన
గంధమందు మేనిక
పడగినయట్లు , వి. వే.

సజ్జనులు గోష్ఠివలన చెడ్డ గుణము , గంధము పూసికొనగా శరీరపు కంపు నశించునట్లు నశించును

Like sandalwood paste that masks the body odor, the discourse by virtuous people will drive away bad qualities.

530
నేరనన్నవాడు నెఱజాణ మహిలోన నేర్తునన్నవాడు వార్తకాడు ఊఱకున్నవాడె ఉత్తమోత్తముడయా ! వి. వే.

నేరనన్నవాడు నెఱజాణ మహిలోన
నేర్తునన్నవాడు వార్తకాడు
ఊఱకున్నవాడె ఉత్తమోత్తముడయా!
వి. వే.

“తెలియదు" అన్నవాడు ఉత్తముడు . తెలియునన్నవాడు మాటలప్రోగు మాత్రమే . ఊరకున్నవాడు ఉత్తమోత్తముడు .

The one who says “I don't know” is a good person. The one who claims to know all is being loquacious. The one who remains silent is virtuous.

531
పరగ ఋషులు భువిని పరమపవిత్రులై మించి లోకమునకు మేలుచేయ సంచితార్థములను సమసింప జేయుటే , వి. వే.

పరగ ఋషులు భువిని పరమపవిత్రులై
మించి లోకమునకు మేలుచేయ
సంచితార్థములను సమసింప
జేయుటే , వి. వే.

మిక్కిలి పవిత్రులైన మునులు లోకమునకు మేలు చేయదలచినచో , జను లిదివరలో కూడబెట్టుకున్న పాపములు పోవు మార్గమును చూపవలెను

The most pious sages, if they want to help the rest of us, must show us a way to wash our sins.

532
పట్టరానిపట్టు పట్టియుండినవాడు పుడమిలోన కీర్తి పొందలేడు సుగుణి లక్షణముల సుజ్ఞానియౌనయా , వి. వే.

పట్టరానిపట్టు పట్టియుండినవాడు
పుడమిలోన కీర్తి పొందలేడు
సుగుణి లక్షణముల సుజ్ఞానియౌనయా,
వి. వే.

పట్టకూడని మూర్ఖపు పట్టుదల కూడదు . దాని వల్ల కీర్తి రాదు . ఉత్తమ లక్షణములున్ననే జ్ఞానమును పొందవచ్చును

One should not hold on to foolish things firmly. No greatness is achieved. Only virtue can bring about knowledge.

533
పదిలపడగ మనసు పట్టనేరనివాడు కదియబోడు పూర్ణకవితుడుగను గుదురుకొనెడివాడు కోవిదుడగునయా ! వి. వే.

పదిలపడగ మనసు పట్టనేరనివాడు
కదియబోడు పూర్ణకవితుడుగను
గుదురుకొనెడివాడు
కోవిదుడగునయా ! వి. వే.

మనస్సును కుదుటపరచినవాడే బ్రహ్మభావమును పొందగలడు . కుదుటపరపలేనివాడు నిష్పలప్రయత్నుడగును

One realizes the creator when one's mind is still.

534
పాలు పెరుగు నేయి పరగు నన్నముతిని స్త్రీలగననివాడు శీలవంతు ఒక్కడైనవాడె ఉత్తమ శివుడయా , వి. వే.

పాలు పెరుగు నేయి పరగు నన్నముతిని
స్త్రీలగననివాడు
శీలవంతు ఒక్కడైనవాడె ఉత్తమ
శివుడయా , వి. వే.

పాలు, పెరుగు,నేతులతోడి అన్నము భుజించు వానికి స్త్రీల ఆపేక్ష యుండును . ఆ ఆపేక్షలేనివాడే ఉత్తమ శీలుడు . అతడొక్కడే పరమాత్మలో ఐక్యము పొందును .

One who savors milk, yogurt and ghee with food, is enamored with women. A virtuous person is one who avoids such substances. He will be eligible to merge with the creator.

535
ఫక్కితెలిసి పలుక నొక్కవాక్యమె చాలు పెక్కులేల వట్టి ప్రేల్పులేల ?దిక్కుకలిగి మ్రొక్క నొక్కటి చాలదా ? వి. వే.

ఫక్కితెలిసి పలుక నొక్కవాక్యమె
చాలు పెక్కులేల వట్టి ప్రేల్పులేల?
దిక్కుకలిగి మ్రొక్క
నొక్కటి చాలదా ? వి. వే.

పెక్కు ప్రేలుడు మాటలకంటె సరియైన మాట ఒకటి పలికిన చాలును . భక్తితో దేవునకొక్క మ్రొక్కు మ్రొక్కిన చాలును . భక్తిలేని మ్రొక్కులెన్నయినను ప్రయోజనము లేదు .

One punch line is better than tons of words. One wish asked with devotion is enough. There is no use in seeking multiple wishes without devotion.

536
మఱతునేమొ యనుచు మది సుజను౦డెప్డు నెనరొనర్చు మేలదెంతయైన మాఱుమేలుచేసి మర్యాదగాంచును , వి. వే.

మఱతునేమొ యనుచు మది సుజను౦డెప్డు
నెనరొనర్చు మేలదెంతయైన
మాఱుమేలుచేసి మర్యాదగాంచును,
వి. వే.

సుజనుడు తనకు ఇతరులు చేసిన మేలు మరపునకు రాకుండగనే వేగముగ ప్రత్యుపకారమొనర్చి గౌరవము పొందును

A virtuous person responds in kind instantaneously when someone performs a favor to him.

No comments:

Post a Comment