Saturday, February 29, 2020

Vemana-Yoga-Paddati


1064
అవని నొక్కబిడ్డ యరయబుట్టిన తండ్రి నట్టెయేలె జగము లగణితముగ తల్లిలేక పుట్టి ధాత్రి యెట్లేలరా ? వి. వే.

అవని నొక్కబిడ్డ యరయబుట్టిన
తండ్రి నట్టెయేలె జగము లగణితముగ
తల్లిలేక పుట్టి ధాత్రి
యెట్లేలరా ? వి. వే.

మాయ దేవునివల్ల పుట్టి తండ్రిని లోకములను ఆవరించినది . తల్లియగు ప్రకృతిసంభందములేక ఎట్లు పుట్టెనో ఎట్లు లోకము పాలించేనో ?

Maaya (delusion) emanated from God without any relationship with prakruti (nature) and spread around the universe. How was it born and reign over the universe?

1065
అష్టదళములందు నాత్మను సేవించి నిష్ఠబూని మిగుల నేర్పుతోడ దృష్టియందె దృష్టి తెమలక చూడరా! వి. వే.

అష్టదళములందు నాత్మను సేవించి
నిష్ఠబూని మిగుల నేర్పుతోడ
దృష్టియందె దృష్టి
తెమలక చూడరా! వి. వే.

హృదిలోన అష్టదళ పద్మమందలి బ్రహ్మమును సేవించుచు , నిష్ఠతో నేర్పుతో అచంచల దృష్టితో చూచిన బ్రహ్మమును చూడవచ్చును

Brahma (creator) resides near the heart as 8 petal lotus flower. One can visualize him by dedication, skill and unwavering concentration.

1066
అసి పదాంతమునను బుద్ధి నమరనొక్కి కూటపఱ చిన్మయంబున గొలువుతీరి ఆటలపాటల నణగింప నందె ముక్తి విశ్రుతంబుగ విధమిది వినర వేమ !

అసి పదాంతమునను బుద్ధి నమరనొక్కి
కూటపఱ చిన్మయంబున గొలువుతీరి
ఆటలపాటల నణగింప నందె ముక్తి విశ్రుతంబుగ
విధమిది వినర వేమ !

“తత్త్వమసి" అను సూత్రము చొప్పున భగవత్ స్వరూపము నెరిగి, జ్ఞానము కలిగి , ఇంద్రియచాపల్యము నణచినచో ముక్తి లభించును . ముక్తిమార్గమిదియే యని తెలిసికొనుము

The upanishad said “You are the creator(brahman)” . By being aware of the form of God, possessing spiritual knowledge and suppressing the five senses, one can attain salvation

1067
అక్షరపుటడవి జొరబడి అక్షరములు వేలు లక్షలరయగ నేలా? ఈ క్షితి "శివ" యనియెడి రెండక్షరములె పరిఢవిల్లు నరయుము వేమా!

అక్షరపుటడవి జొరబడి అక్షరములు
వేలు లక్షలరయగ నేలా? ఈ క్షితి
"శివ" యనియెడి రెండక్షరములె
పరిఢవిల్లు నరయుము వేమా!

అక్షరారణ్యములో పడి పెక్కు గ్రంధములు చదివిన లాభ మేమి? నిర్మలమనస్సుతో "శివ" అను రెండక్షరములు ఉచ్చరించిన చాలును

There is no benefit in reading several holy books. It is enough to chant “siva” [to attain salvation]

1068
అక్షరాత్మకంబు సమృతపానమునకు రక్షకత్వమునకు రాజహంస దీక్షలోని దీక్ష తెలివంటి చూడరా! వి. వే.

అక్షరాత్మకంబు సమృతపానమునకు
రక్షకత్వమునకు రాజహంస
దీక్షలోని దీక్ష తెలివంటి
చూడరా! వి. వే.

అక్షరస్వరూపుడు మోక్షమిచ్చువాడునగు పరమాత్మపై దృష్టినుంచిన నీకు మోక్షము లభించును

By concentrating on the paramaatma (supreme soul) one can attain salvation. He is the embodiment of holy books.

1069
ఆకు చాటునదగు నన్ని లోకంబులు కొమ్మ కానరాదు బ్రహ్మకైన కొమ్మకానబడిన కొనియాడవచ్చురా , వి. వే.

ఆకు చాటునదగు నన్ని లోకంబులు
కొమ్మ కానరాదు బ్రహ్మకైన
కొమ్మకానబడిన కొనియాడవచ్చురా,
వి. వే.

బ్రహ్మస్వరూపమగు మహావృక్షశాఖలు అజ్ఞులకు కనబడవు . ఆకులు చాటుననే అన్ని లోకములుండుట సామాన్యులెరుగరు

The creator is like the branches of a great banyan tree which can't be seen by the ignorant. Ordinary people cannot realize that its leaves are the various regions of the nether world.

1070
ఆకసంబుమీద నాడు దొమ్మరిపాప చూపులొకటిగాని సుఖములేదు ఆకసమను వీధి హంసను జూడరా , వి. వే.

ఆకసంబుమీద నాడు దొమ్మరిపాప
చూపులొకటిగాని సుఖములేదు
ఆకసమను వీధి హంసను
జూడరా , వి. వే.

తీగపై ఆడు దొమ్మరిపాప దృష్టి స్థిరమైనదేకాని అది యోగదృష్టికాదు . ఆ పాపవలె నీ చూపును స్థిరముగా నుంచినచో పరబ్రహ్మమును చూడవచ్చును

The acrobat walking on a rope has great focus but it is not same as yoga. When one concentrates with such a focus, one can visualize the creator

1071
ఆ కారణ విధ మెఱుగుచు జేకొని యా మూలధనము జెందుచు నున్నన్ ఆకల్పాంతమును సదా యేకాలము పిన్నవయసు నిహమున వేమా!

ఆ కారణ విధ మెఱుగుచు జేకొని
యా మూలధనము జెందుచు నున్నన్
ఆకల్పాంతమును సదా యేకాలము
పిన్నవయసు నిహమున వేమా!

సర్వమునకు కారణమగు మూలప్రకృతిని విచారించి యోగదృష్టిని పరమాత్మను దర్శించినచో సాధకుడు కల్పాంతమువరకును యువకుడుగానే కానవచ్చును

A yogi can remain young until the universe devolves by contemplating about the prakriti (creation) and visualizing the paramaatma (creator) with a yogic vision.

1072
ఆగడంబు చేత అందెందు బొందెడు సాగద్రోలి మనసు సైపనేర్చి మ్రోగుప్రణవరవము మూలంబు గానరో , వి. వే.

ఆగడంబు చేత అందెందు బొందెడు
సాగద్రోలి మనసు సైపనేర్చి
మ్రోగుప్రణవరవము మూలంబు
గానరో , వి. వే.

ఆర్భాటమున ప్రయోజనము లేదు . మనస్సును నిల్పి హృదయమున మ్రోగు ఓంకార నాదమును గుర్తించిన తత్త్వము గోచరించును

There is no use in exaggeration. One can obtain tattva (spiritual knowledge) by focusing on the mind and listening to the “aum” (omkaram) sound.

1073
ఆత్మతేజము గమకించ యభినుతించి కీలకబ్రహ్మ తన్మయకేళి మరగి నిత్యపరిపూర్ణమందుట నిరతిశయము సత్యసంపన్నులకు నిది సాగు వేమ!

ఆత్మతేజము గమకించ యభినుతించి కీలకబ్రహ్మ
తన్మయకేళి మరగి నిత్యపరిపూర్ణమందుట
నిరతిశయము సత్యసంపన్నులకు
నిది సాగు వేమ!

బ్రహ్మస్వరూపామును గుర్తించి బ్రహ్మానందమున ఓలలాడుచుండుట ముక్తి . సత్యసంపన్నులకే అది లభ్యమగును

Salvation means realizing the form of the creator and reveling in the joy of such realization. It is possible for only truthful yogis.

1074
ఆత్మ దేహమందు నతి సూక్ష్మముగ చూచి దేహమాత్మయందు తేటపఱచి ఆత్మయందు చూడ నతడెపో ఘనయోగి, వి. వే.

ఆత్మ దేహమందు నతి సూక్ష్మముగ
చూచి దేహమాత్మయందు
తేటపఱచి ఆత్మయందు చూడ నతడెపో
ఘనయోగి, వి. వే.

సూక్ష్మమై , దేహముననున్న ఆత్మస్వరూపామును చూచి, జ్ఞానము నార్జించిన యతడే గొప్ప యోగి

A true yogi is one who realizes the subtle body and visualizes the aatma (soul).

1075
ఆత్మలోన నాద మాలించి యాలించి ఆశలందు చిక్కడాదియోగి ఆత్మలోని కళల నంటునా తత్త్వము? వి. వే.

ఆత్మలోన నాద మాలించి యాలించి
ఆశలందు చిక్కడాదియోగి
ఆత్మలోని కళల నంటునా
తత్త్వము? వి. వే.

హృదయమున మ్రోగు ఓంకారధ్వనులను వినుచు , ఆశలకు చపలతకు లొంగనివాడే యోగి . తత్త్వము నాదబిందుకళలకు అతీతము

A true yogi is one who can listen to the “aum” (omkaaram) sound in the mind while unyielding to the distraction by senses and greed. Spiritual knowledge transcends naada-bindu-kalas.

1076
ఆత్మసూక్ష్మమైన యానందమెఱుగక మదితొలగి చదివి మగ్నుడయ్యె అతి రహస్యమెల్ల నా యోగి యెఱుగును , వి. వే.

ఆత్మసూక్ష్మమైన యానందమెఱుగక
మదితొలగి చదివి మగ్నుడయ్యె
అతి రహస్యమెల్ల నా యోగి
యెఱుగును , వి. వే.

అతి సూక్ష్మమగు ఆత్మవలని సంతోషము నెరుగక జనులు వృధాగా చదివి మందులగుచున్నారు . మోక్షరహస్యమును యోగులేగాని పుస్తకములు పఠించువా రెరుగరు

Without experiencing happiness by visualizing the aatma (soul) , people are becoming dunces after reading books. The secret of salvation is known only to yogis but not for the rest by reading books.

1077
ఆది తుదయులేక యనుభవగమ్యమై వేదతుల్యముగను వెలయుచుండు వాదభేదముడిగి వరియించు శివయోగి , వి. వే.

ఆది తుదయులేక యనుభవగమ్యమై
వేదతుల్యముగను వెలయుచుండు
వాదభేదముడిగి వరియించు
శివయోగి , వి. వే.

ఆద్యంతములు లేక అనుభవవేద్యమై బ్రహ్మము వేద ప్రామాణ్యమున ఉన్నది. వాదోపవాదములులేక దీని నెరిగినవాడే యోగి .

Without a beginning and an end, the creator who can only be experienced, has been described in the vedas. Without further argumentation, the one who realizes such a creator, is a true yogi.

1078
ఆధారంబులటాఱును మోదముగా నలరుచుండు ముఖ్యముగాగన్ లేదన నేటికి తెలియక సాధకమున జూడవయ్య చయ్యన వేమా!

ఆధారంబులటాఱును మోదముగా నలరుచుండు
ముఖ్యముగాగన్ లేదన
నేటికి తెలియక సాధకమున
జూడవయ్య చయ్యన వేమా!

మోక్షము కోరువాడు షడాధారములను ముఖ్యముగా గ్రహింపవలెను . దీనిని గూర్చి వాదోపవాదములతో పనిలేదు

The one who seeks salvation should grasp the six supports (shadaa-dhara) without further ado.

1079
ఆఱుగురినిజేర నత్యంత దుఃఖంబు ఏడుగురిని గూడ నేడుపయ్యె వడిగ వీరి పొందు విఢుచుట యోగంబు , వి. వే.

ఆఱుగురినిజేర నత్యంత దుఃఖంబు
ఏడుగురిని గూడ నేడుపయ్యె
వడిగ వీరి పొందు విఢుచుట
యోగంబు , వి. వే.

బ్రహ్మతత్త్వము నెరుగగోరు యోగి కామము మున్నగు (అరిషడ్వర్గములు) ఆర్గురు శత్రువులను , సప్తవ్యసనములను విడువవలెను

The seven sins have been described as: 1. వ్యభిచరించడం (prostitution), 2. సురాపానం (alcoholism), 3. జూదం (gambling), 4. వేటాడటం(hunting), 5. పర ధనం కోసం ప్రయత్నించడం (usurping others' wealth), 6. ధనార్జన తృష్ణ (greed for money), 7. కోపం వల్ల జనించే వాక్పారుష్య, దండ పారుష్యాలు (anger).

The six pitfalls are కామ (lust), క్రోధ (anger), లోభ (covetousness), మోహ (desire), మద (ego), మాత్సర్యాలు (temper).

A yogi desirous of learning about the creator should give up these.

1080
ఆఱుగురిని జంపి హరిమీద ధ్యానంబు నిలిపి నిశ్చలముగ నెగడి యాత్మ గతులెఱుగుచుండ్రు ఘనులగు యోగులు , వి. వే.

ఆఱుగురిని జంపి హరిమీద ధ్యానంబు
నిలిపి నిశ్చలముగ నెగడి
యాత్మ గతులెఱుగుచుండ్రు
ఘనులగు యోగులు , వి. వే.

గొప్ప యోగులు అరిషడ్వర్గమును జయించి , దేవుని ధ్యానించుచు , మనస్సు నిలిపి ఆత్మతత్త్వము నెరుగుచుందురు

Great yogis overcome the the six pitfalls కామ (lust), క్రోధ (anger), లోభ (covetousness), మోహ (desire), మద (ego), మాత్సర్యాలు (temper). and meditate over the creator, to realize the soul.

1081
ఆఱు మూడు కట్టి యలమట జెందక పోరి గుణము లడచి పూని మిగుల తేరు శిఖరమెక్కి తెలివంట జూడరా , వి. వే.

ఆఱు మూడు కట్టి యలమట జెందక
పోరి గుణము లడచి పూని
మిగుల తేరు శిఖరమెక్కి తెలివంట
జూడరా , వి. వే.

అరిషడ్వర్గమును , త్రికరణములను లోబరుచకొని ఇతరాయాసములకు లోనుగాక , సత్త్వరజస్తమోగుణములను విడిచి , సహస్రారమున కుండలినీశక్తిని చొన్పుటయే యోగము


Yogam means to overcome the the six pitfalls కామ (lust), క్రోధ (anger), లోభ (covetousness), మోహ (desire), మద (ego), మాత్సర్యాలు (temper), to control the trikaranas (thought, word and deed), to raise above the 3-gunas (sattva-calm, rajas-active, tamas-indolence), and to move the kundalini from moolaadhara chakra to the head chakra (sahasraaram)

1082
ఆర్గురు దొంగల బట్టుక మార్గమునన్ కొట్టి యొకని మన్నింపదగున్ దుర్గమమిది తెలియంగా నిర్గుణ రూపంబు తెలియు నిజముగ వేమా

ఆర్గురు దొంగల బట్టుక మార్గమునన్
కొట్టి యొకని మన్నింపదగున్
దుర్గమమిది తెలియంగా నిర్గుణ
రూపంబు తెలియు నిజముగ వేమా

కామక్రోధాది శత్రువులను పట్టుకొని , అందు కామమును పరబ్రహ్మపరముగా చేసిన బ్రహ్మము సిద్ధించును . ఇది అందరు ఎరుగరు .

One attains the creator by realizing the six pitfalls కామ (lust), క్రోధ (anger), లోభ (covetousness), మోహ (desire), మద (ego), మాత్సర్యాలు (temper), and directing the kaama (lust) towards the creator.

1083
ఆలుబిడ్డకల్గి యధిక సంపదగల్గి భజనసేయ నీశు భక్తిలేక భజన సేయునతడు భక్తు౦డు కాడయా , వి. వే.

ఆలుబిడ్డకల్గి యధిక సంపదగల్గి
భజనసేయ నీశు భక్తిలేక
భజన సేయునతడు భక్తు౦డు
కాడయా , వి. వే.

జను లాలుబిడ్డలతో , సంపదలతో సుఖముగానుండి భక్తితో దేవుని సేవింపరు . భక్తిలేని సేవ చేయువారు భక్తుడు కాడు .

Some people surrounded by family and wealth and leading a comfortable life, don't serve the god. One is not a devotee without devotion.

1084
ఆశ పాపజాతి యైహికములలోన నాశచేత నెవరు మోసపోరు చూచి విడుచువారు శుద్ధాత్ము లగుదురు , వి. వే.

ఆశ పాపజాతి యైహికములలోన
నాశచేత నెవరు మోసపోరు చూచి
విడుచువారు శుద్ధాత్ము
లగుదురు , వి. వే.

ఈ లోకమున ఆశవల్లనే పాపములు వచ్చును . దానికి లొంగరాదు . ఆశను విడుచువాడే పరిశుద్ధమైన ఆత్మకలవాడు

One accrues sin by being covetous and greedy. One should not yield to them. One who gives up these is the pure soul.

1085
ఇడపింగళినాడులకు న్నడుమ సుషుమ్నయు వెలుగు నడయాడంగా గడు దుస్తరమని గననా నడుమనె చంద్రహారు నగరము వేమా !

ఇడపింగళినాడులకు న్నడుమ సుషుమ్నయు
వెలుగు నడయాడంగా
గడు దుస్తరమని గననా నడుమనె
చంద్రహారు నగరము వేమా !

ఇడపింగళనాడుల మధ్య సుషుమ్న యున్నది . అచట సూర్యచంద్రాగ్ని మండలములు వెలుగొందుచుండును . దీనిని తెలిసికొనుట చాల కష్టము

The sushumna naadi (nerve) is between ida and pingali naadis (nerves). The resplendence of the sun and the moon are reflected by it.

1086
ఇంద్రజాలమట్టు లీ జగత్భ్రాంతులు చంద్రకళలు దాటి సఖ్యపడెడు రంధ్రమందుజేరి రహిమీఱగాంచు దేవేంద్రపూర్ణపదవి విడక వేమ !

ఇంద్రజాలమట్టు లీ జగత్భ్రాంతులు
చంద్రకళలు దాటి సఖ్యపడెడు
రంధ్రమందుజేరి రహిమీఱగాంచు దేవేంద్రపూర్ణపదవి
విడక వేమ !

మమకారము ఇంద్రజాలము వంటిది . నాదబిందుకళలను దాటినగాని జ్ఞానదృష్టికి నిశ్చల బ్రహ్మస్వరూపము కానరాదు . అది గోచరించిన గాని సాధకునకు మోక్షము లభింపదు .

The bondage is like magic. Without raising above the naada-bindu kalas one cannot visualize the unwavering creator. Without such revelation it is not possible to attain salvation

1087
ఇంద్రలోకమైన చంద్రలోకమైన నంది చూడవచ్చు పొందుగాను నందిమీదనెక్కి నాయముగ చూడరా, వి. వే.

ఇంద్రలోకమైన చంద్రలోకమైన
నంది చూడవచ్చు పొందుగాను
నందిమీదనెక్కి నాయముగ
చూడరా, వి. వే.

సహస్రారమును చేరుటకు బుద్ధియను నందినెక్కి ప్రయాణము సాగించిన ఇంద్రలోకముగాని చంద్రలోకమునుగాని చేరగలవు . (ముక్తి పొందగలవు )

To reach the head chakra (sahasraaram) one has to use budhi(mind). That is the way to attain salvation

1088
ఇల్లు విడిచినట్లె యిల్లాలి మదిరోసి తల్లడంబుమాని తలపునిలిపి మొదలుమరచి యోగ ముల్లసిట్లెడునట్టి వాడె పరమగురుడు వసుధ వేమ!

ఇల్లు విడిచినట్లె యిల్లాలి మదిరోసి
తల్లడంబుమాని తలపునిలిపి
మొదలుమరచి యోగ ముల్లసిట్లెడునట్టి
వాడె పరమగురుడు వసుధ వేమ!

ఆలుబిడ్డలను విడిచి తత్తరపడక , బుద్ధిని నిలుకడగా ఉంచి తన్ను తాను మరచి బ్రహ్మానందము పొందువాడే గురువు

A true guru is one who gives up family, controls the mind and contemplates over the creator

1089
ఇష్ట సిద్ధిగోరి కష్టమొందగలేరు నిష్ఠ నెఱిగినంత నిష్ఠలోన అష్ట సిద్ధులందు నమరుట గానరు , వి. వే.

ఇష్ట సిద్ధిగోరి కష్టమొందగలేరు
నిష్ఠ నెఱిగినంత నిష్ఠలోన
అష్ట సిద్ధులందు
నమరుట గానరు , వి. వే.

ఫలసిద్ధికి శ్రమలనోర్చి నియముననున్నచో అష్టసిద్ధులను పొందవచ్చును . అట్లులేనినాడు కోరిక నెరవేరదు

To receive the fruits one has to endure the hardship. This is the way to attain ashta sidhis. Without such dedication it is not possible to fulfill one's desire for salvation.

1090
ఇహపర శౌఖ్యము లొల్లక దహరమునను గుఱినిడించి దత్తముగాగన్ కుహరములో వెలిబయలున మహదాకాశంబుజేరు మహిలో వేమా!

ఇహపర శౌఖ్యము లొల్లక దహరమునను
గుఱినిడించి దత్తముగాగన్
కుహరములో వెలిబయలున మహదాకాశంబుజేరు
మహిలో వేమా!

ఇహపరసుఖములు కోరక మహదాకాశమున మనస్సును చేర్చినచో హృదయకుహరమునను , బహిర్ ప్రదేశమునను మహదాకాశమును సందర్శింప సాధ్యమగును

Without aspiring for comforts, when one focuses mind on the (mahaa-daakaasamu) sky and heart, it is possible to see them.

1091
ఈకెలనుచుగొన్ని తోకలనుచుగొన్ని కోకలనుచగొన్ని గోచులనుచ గొన్ని యయ్యెనున్న గుఱుతును మూయగా , వి. వే.

ఈకెలనుచుగొన్ని తోకలనుచుగొన్ని
కోకలనుచగొన్ని గోచులనుచ
గొన్ని యయ్యెనున్న గుఱుతును
మూయగా , వి. వే.

మర్మాంగము కప్పుటకే ఈకలు, తోకలు , బట్టలు , గోచులు ఏర్పడినవి . అవి సిగ్గుదాచుకొనుటకు ఉపయోగించునవి మాత్రమే

Feathers, tails, clothes are required to cover the genitals. They are only useful for hiding shame.

1092
ఈతెఱిగినవారైనను లోతైనటువంటి నూత బడిపోరా ? ఈతలు నేర్చిన యోగము చేతిరుగకయున్న నేమిచేయుదు వేమా?

ఈతెఱిగినవారైనను లోతైనటువంటి
నూత బడిపోరా ? ఈతలు
నేర్చిన యోగము చేతిరుగకయున్న
నేమిచేయుదు వేమా?

ఈతయెఱిగినను లోతుబావిలో పడిన చావు తప్పదు . యోగము నెఱిగియున్నను మనస్సు నిలుపనిచో లాభమేమి ?

Despite having the ability to swim, one can die by jumping into a deep well. Similarly having known the yogic method, if one does not concentrate the mind, there is no use.

1093
ఈ దేహ మెన్నిభంగుల బ్రోది యొనర్చినను నేలబోవును గాదే ! మీదెఱిగి మురికి గడుగుచు భేదంబులు మాని ముక్తి బెరయును వేమా!

ఈ దేహ మెన్నిభంగుల బ్రోది యొనర్చినను
నేలబోవును గాదే ! మీదెఱిగి
మురికి గడుగుచు భేదంబులు
మాని ముక్తి బెరయును వేమా!

ఎంత కాపాడినను దేహము మట్టిలో కలియవలసినదే . తత్త్వమెరిగి భేదబుద్ధిని మాని, మాలిన్యము లేనిచో ముక్తి లభించును .

No matter how much care one takes for the body, it has to die one day. By knowing the spiritual knowledge, avoiding discrimination and being pious, one can attain salvation

1094
ఈనినట్టి పులిని బూని చంపగవచ్చు మనసు మర్మ మరసి కనగవచ్చు తారకంబు మరగి తగులుట సాధ్యమా ? వి. వే.

ఈనినట్టి పులిని బూని చంపగవచ్చు
మనసు మర్మ మరసి కనగవచ్చు
తారకంబు మరగి తగులుట
సాధ్యమా ? వి. వే.

ఈనిన పులిని చంపుట , మనస్సు మర్మమెరుగుట చాల కష్టము . వానినైన సాధింప వచ్చునుగాని తారకయోగమున మెలగుట చాల కష్టము

It is hard to kill a female tiger that has just given birth. Similarly it is difficult to know the secret of mind. One may achieve it, but one finds it hard to know (taaraka) yoga.

1095
ఈ స్వరంబులన్ని యేడు పాళ్ళుగజేసి ఏడుమూర్తుల కవి యిచ్చివేసి నిత్యకర్మమునను నిలుచురా నెఱయోగి , వి. వే.

ఈ స్వరంబులన్ని యేడు పాళ్ళుగజేసి
ఏడుమూర్తుల కవి యిచ్చివేసి
నిత్యకర్మమునను నిలుచురా
నెఱయోగి , వి. వే.

గొప్పయోగి సప్తస్వరములను గుర్తించి , వాని నొక్కొక్కటిగా సప్తమూర్తులకు నిచ్చి , తాను నిత్యము సత్కర్మలాచరించును

A great yogi recognizes the seven notes of the music (sa-ri-ga-ma-pa-da-ni) and dedicates one each to the 7 moortis. He also performs good deeds every day.

1096
ఉక్కు కళ్ళుతిన్న నొగి తేటగానుండు ఉక్కుకళ్ళు దిన్న నుడుగు వ్యాధి ఉక్కు కళ్ళకన్న నుర్వికల్పము లేదు , వి. వే.

ఉక్కు కళ్ళుతిన్న నొగి తేటగానుండు
ఉక్కుకళ్ళు దిన్న నుడుగు
వ్యాధి ఉక్కు కళ్ళకన్న నుర్వికల్పము
లేదు , వి. వే.

శుద్ధిచేసిన లోహచూర్ణము తిన్న ఒడలు మెరుగెక్కును . వ్యాధి నశించును . దానికంటె మేలైన కల్పచికిత్స లేదు .

Ayurveda makes one free from disease and makes the body healthy.

1097
ఉక్కు శుద్ధిచేసి యుంచి తినెడివాడు ఉక్కు దిటవు వలెనె యుండు జగతి ఉక్కు చూర్ణము దినుటొప్పుగ కల్పంబు , వి. వే.

ఉక్కు శుద్ధిచేసి యుంచి తినెడివాడు
ఉక్కు దిటవు వలెనె యుండు
జగతి ఉక్కు చూర్ణము దినుటొప్పుగ
కల్పంబు , వి. వే.

ఉక్కు శుద్ధిచేసి తిన్నచో ఉక్కువంటి శరీరమగును . కావున లోహచూర్ణమును భుజించుట మేలు .

If one eats ayurvedic medicine prepared with iron, one achieves a strong body like iron. So it is better to consume ayurvedic medicine prepared with iron.

1098
ఉజ్జ్వలంబుగ పరిపూర్ణ మొందగానె కుంభగత దీపశోభా నికుంభలీల కుంభకంబున మదిజేర్చి కూడవలెను గాక గాంభీర్య మూనిన గలదె వేమ!

ఉజ్జ్వలంబుగ పరిపూర్ణ మొందగానె
కుంభగత దీపశోభా నికుంభలీల కుంభకంబున
మదిజేర్చి కూడవలెను గాక
గాంభీర్య మూనిన గలదె వేమ!

మనః ప్రాణములను హంసతో లీనముచేసి , కుండలోన దీపమువలె బుద్ధిని కట్టివేసి, అంతఃకుంభ బహిఃకుంభములతో వాయువు నుపయోగించినయెడల ముక్తి పొందవచ్చును . వృధాగా గంభీరముగా చూచిన ప్రయోజనము లేదు

One can attain salvation by merging mind and praana (breath) with hamsa, by performing yogic pranayamas that merge the praana with external air.

1099
ఉతకలోని తలుపు నూగించి నెట్టెడి పదునెఱింగి లోనబట్టుపట్టు మతినిగూడి మించి మర్మంబు గనుమయా , వి. వే.

ఉతకలోని తలుపు నూగించి నెట్టెడి
పదునెఱింగి లోనబట్టుపట్టు
మతినిగూడి మించి మర్మంబు
గనుమయా , వి. వే.

తలుపుగొడిసె నూగించి తలుపును త్రోసెడురీతిని మనస్సును పురికొల్ప బ్రహ్మమును కాంచవలెను

Just as one opens a door by holding on its handle, one can encourage the mind to open the door to the creator

1100
ఉదయమందు శివుని నూహించి చూచిన సుధయుబుట్టి పరముజూపుగాక ముదముమించి మనసు ముప్పిరిగొనకున్న చేదుపుట్టి మనసు జెఱచు వేమ!

ఉదయమందు శివుని నూహించి చూచిన
సుధయుబుట్టి పరముజూపుగాక ముదముమించి
మనసు ముప్పిరిగొనకున్న
చేదుపుట్టి మనసు జెఱచు వేమ!

ఉదయముననే లేచి శివుని ధ్యానించిన , అమృత స్వరూపుడగు అతడు నీకు మోక్షమును చూపును . ఐహికముల కాశపడి అతనిని ధ్యానింపవేని విషమించి నిన్నధోగతిపాలు చేయును

Lord Siva will show the path to salvation when one meditates on him first thing in the day. Whereas one meets with defeat when one is greedy and expects boons from him.

1101
ఉరిదిగాను గాలి యున్నతిగను మింట దురితముగను వచ్చి తొలగుచుండు పుడమినిపైని నిల్చి పూనిక జూడరా , వి. వే.

ఉరిదిగాను గాలి యున్నతిగను
మింట దురితముగను వచ్చి తొలగుచుండు
పుడమినిపైని నిల్చి
పూనిక జూడరా , వి. వే.

మహదాకాశమున వ్యాపించు గాలి ఉచ్ఛ్వాసనిశ్వాసములకే ఉపయోగించును . ఆ వాయువును రేచక పూరక కుంభకాది సాధనములతో ఉపయోగించి సాధకుడు యత్నింపవలెను

The air around us is for inhaling and exhaling. A yogi should try to do pranayamas with it.

1102
ఊడిగంబు చేసి యుబ్బించి గురువును కూడిపొందవలెను కోర్కెలడచి వేడి పరమపదవి వెలయంగ జూడరా , వి. వే.

ఊడిగంబు చేసి యుబ్బించి గురువును
కూడిపొందవలెను కోర్కెలడచి
వేడి పరమపదవి వెలయంగ
జూడరా , వి. వే.

గురువును సేవించి , అతని దయ సంపాదించి , పరబ్రహ్మస్థతి నెరిగి , ముక్తి మార్గమును తెలిసికొనుము

One has to serve a guru, receive his blessing, and learn about the creator and salvation.

1103
ఊఱకుంట తెలియ నుత్తమయోగంబు మానసంపు కలిమి మధ్యమంబు ఆసనాదివిధులు నధమయోగంబులు , వి. వే.

ఊఱకుంట తెలియ నుత్తమయోగంబు
మానసంపు కలిమి మధ్యమంబు
ఆసనాదివిధులు నధమయోగంబులు,
వి. వే.

నేనే బ్రహ్మనని నిశ్చల బ్రహ్మోపాసన చేయుట ఉత్తమ యోగము . మనస్సున ధ్యానించుట మధ్యమయోగము. ఆసనాదులతో అవస్థపడుట అధమయోగము

Meditating on the creator with the realization that self is none other than the creator is the best approach. Meditating silently in mind is the middle approach. Performing yogic aasanas (postures) is the lowest.

1104
ఊర్ధ్వలోకమందు నుచితక్రమంబున రూపమేమిలేక రూఢినుండు పరమయోగిచూచు పరమాత్మడితడని , వి. వే.

ఊర్ధ్వలోకమందు నుచితక్రమంబున
రూపమేమిలేక రూఢినుండు
పరమయోగిచూచు పరమాత్మడితడని,
వి. వే.

పరమాత్మ ఊర్ధ్వలోకమున నామరూపాములు లేక యుండును. అతని నుత్తముడగు యోగితప్ప ఇతరులు చూడలేరు

God is without name and form in the nether worlds. One cannot see him unless one is a superior yogi.

1105
ఊర్జితానంద పరిపూర్ణయుక్తియందు స్వార్జితంబగు గురుభక్తి సంతరించి దుర్జయ౦బగు తొలగంగ ద్రోలునేని కర్జముగ ముక్తి లభియించు గదర వేమ!

ఊర్జితానంద పరిపూర్ణయుక్తియందు స్వార్జితంబగు
గురుభక్తి సంతరించి
దుర్జయ౦బగు తొలగంగ ద్రోలునేని కర్జముగ
ముక్తి లభియించు గదర వేమ!

సాధకుడైహికచింతలు మాని సంతోషముతోనుండి భక్తితో గురూపదేశము నాధారము చేసికొని అరిషడ్వర్గమును జయింపగలిగినచో ముక్తి లభించును

One has to give up worries, be happy and receive teachings from a guru and then overcome the 6 evils (kaama-lust, krodha-anger, lobha-covetousness, moha-greed, mada-ego, matsara-temper), to attain salvation

1106
ఊరు చేరియున్న నొగిసంతసింతురు అడవిచేరియున్న నడలుచుండ్రు ఊరు నడవి రెండు నొకటిగా జూచిన నారితేరు యోగి యతడు వేమ !

ఊరు చేరియున్న నొగిసంతసింతురు
అడవిచేరియున్న నడలుచుండ్రు
ఊరు నడవి రెండు నొకటిగా జూచిన
నారితేరు యోగి యతడు వేమ !

ఊరుచేరిన సంతోషము , అడవిని చేరిన భయము కల్గుట సహజము. ఆ రెండింటిని సమానముగా చూచు నిర్వికల్పుడే యోగి

One is happy to arrive at his domicile. And has fear while roaming in a forest. These are natural feelings. When one handles them equanimously, he is a true yogi.

1107
ఋగ్యజుస్సు లెఱిగి యోగ్యత లేకున్న విప్రుడైన నెట్లు విహితుడగును ?భర్తకలిగి యన్యుభావించు సతివలె , వి. వే.

ఋగ్యజుస్సు లెఱిగి యోగ్యత లేకున్న
విప్రుడైన నెట్లు విహితుడగును?
భర్తకలిగి యన్యుభావించు
సతివలె , వి. వే.

వేదములు చదివినను యోగ్యతలేని బ్రాహ్మణుడు , భర్త యెడ భక్తి యున్నను పరపురుషునిగోరు స్త్రీవలె విడువదగియుండును

A brahmin who is not deserving despite reading vedas is like a married woman who lusts for a man other than her husband

1108
ఎగువదిగువ చూడకేప్రొద్దుమదిలోన తగవులేని తలపు తలచి వలచి నీల్గిచూచుటెల్ల నెఱజాణ విద్యారా! వి. వే.

ఎగువదిగువ చూడకేప్రొద్దుమదిలోన
తగవులేని తలపు తలచి
వలచి నీల్గిచూచుటెల్ల నెఱజాణ
విద్యారా! వి. వే.

క్రిందు మీదు చూడక సందేహములేని ఆధ్యాత్మిక సిద్ధాంతములు ననుసరించి బ్రహ్మస్వరూపము కనుగొన యత్నించుటే యోగము

One who follows spiritual knowledge, that is unambiguous, and strives to find out the creator is a true yogi

1109
ఎచ్చటజూచిన నచ్చట నేమితోచు నచటి దృశ్యము ధృక్కుగా నంటిపట్టి రచ్చ చేయుట ముక్తికి రాజపథము సచ్చిదానంద మపుడొప్పజాలు వేమ!

ఎచ్చటజూచిన నచ్చట నేమితోచు నచటి
దృశ్యము ధృక్కుగా నంటిపట్టి
రచ్చ చేయుట ముక్తికి రాజపథము సచ్చిదానంద
మపుడొప్పజాలు వేమ!

ఆయా విషయముల నెరుగు పంచేంద్రియములు దృశ్యములు. వీనిని నియోగించువాడు ధృక్కు నెరిగి ఆ ధృక్కును బ్రహ్మస్వరూపాముగా గుర్తించుట ముక్తికి రాజమార్గము . ఆ మార్గముననే సచ్చిదానంద స్వరూపామును కనుగొనవచ్చును

The 5 senses bring us visions. The one who controls them is the seer. One who realizes the seen is the creator, is on a superior path to salvation. It is possible to find out about the eternal happiness in that path

1110
ఎచ్చటినుండి వచ్చు నెచటికి దాబోవు నిద్రచంద మెఱుగ నేర్చెనేని అచలమైన వ్యక్తి నచ్చట నందుము , వి. వే.

ఎచ్చటినుండి వచ్చు నెచటికి
దాబోవు నిద్రచంద మెఱుగ నేర్చెనేని
అచలమైన వ్యక్తి
నచ్చట నందుము , వి. వే.

నిద్ర యెచటనుండి వచ్చి యెచటికి పోవునో పూర్తిగా తెలిసికొన్నచో నీకు నిశ్చలమగు వ్యక్తిత్వము లభించును . ప్రయత్నమవసరము

Where from deep sleep comes and goes, is the key to attaining unwavering mind

1111
ఎంత భాగ్యమున్న నంతకష్టపు చింత చింతచేత మనసు చివుకుమనును చింతలేకయుంట చెడిపోని సంపద , వి. వే.

ఎంత భాగ్యమున్న నంతకష్టపు
చింత చింతచేత మనసు చివుకుమనును
చింతలేకయుంట చెడిపోని
సంపద , వి. వే.

సంపద యెక్కువ గల కొలది విచారమధికమగుచుండును . చింతవలన మనస్సు చెడిపోవును . ఆ విచారము లేకయుండుటయే స్థిరమైన సంపద

With increased wealth comes worry. The mind will be wavering with worries. One who has no worries is truly wealthy.

1112
ఎన్ని ఎన్ని పూజ లెచట జేసిననేమి ?భక్తిలేనిపూజ ఫలములేదు భక్తిగల్గుపూజ బహుళ కారణమగు , వి. వే.

ఎన్ని ఎన్ని పూజ లెచట జేసిననేమి?
భక్తిలేనిపూజ ఫలములేదు
భక్తిగల్గుపూజ బహుళ
కారణమగు , వి. వే.

అన్ని పూజలకును భక్తియే ముఖ్యము . భక్తిలేని పూజ నిరుపయోగము . భక్తితో పూజించిన ముక్తిని పొందవచ్చును

To perform a pooja devotion is necessary. The pooja performed without devotion is meaningless. It is possible to attain salvation by performing pooja with total devotion

1113
ఏకమనెడి యుక్తిపాకంబు గమనించి సోకియుండుటెల్ల సూటియగును తాకితాకి మిగిలి తళుకొత్తవలెనయా ! వి. వే.

ఏకమనెడి యుక్తిపాకంబు గమనించి
సోకియుండుటెల్ల సూటియగును
తాకితాకి మిగిలి తళుకొత్తవలెనయా!
వి. వే.

“నేనే బ్రహ్మ" మను మూలార్థమును గ్రహించి,బ్రహ్మముపై దృష్టినిలిపి , హృదయమును బ్రహ్మమునందు ఐక్యమొందించుటయే మోక్షము

Realising self is the creator, concentrating on the creator, merging mind with the creator is salvation

1114
ఏకమైనదాని నెక్కడ చూతురు పాకమెఱిగి చెప్పు పరుడెవ౦డు ? లోకమాయజూడ లోవెలినుండెరా , వి. వే.

ఏకమైనదాని నెక్కడ చూతురు
పాకమెఱిగి చెప్పు పరుడెవ౦డు?
లోకమాయజూడ లోవెలినుండెరా,
వి. వే.

మాయావృతమగు లోకమున బ్రహ్మము నెరుగుట చాల కష్టము . దానిని వివరించి చెప్పు గురువునాశ్రయించి తత్త్వము నెరుగుము

It is hard to find out about the creator in this illusory world. It is better to approach a guru to learn this spiritual knowledge.

1115
ఏ చూడ్కి నిలిచి యుండునొ నాచూడ్కిబట్టి మదినినౌగాదనకే రేచక పూరక కుంభక సూచన పరమనెడు బయలు చూడుము వేమా!

ఏ చూడ్కి నిలిచి యుండునొ నాచూడ్కిబట్టి
మదినినౌగాదనకే
రేచక పూరక కుంభక సూచన పరమనెడు
బయలు చూడుము వేమా!

మనస్సును నిల్పి , చూపును యోగమున నుంచి , రేచకాదులచే వాయునిరోధాదులు చేసి మహాకాశమును దర్శించుము

By focusing the mind on yoga, performing praanayaamas (breath control), one can visualize the infinite space.

1116
ఏరుదాటి మెట్టకేగిన పురుషు౦డు పుట్టి సరకు గొనక పోయినట్లు యోగపురుషుడేల యొడలు పాటించురా? వి. వే.

ఏరుదాటి మెట్టకేగిన పురుషు౦డు
పుట్టి సరకు గొనక పోయినట్లు
యోగపురుషుడేల యొడలు
పాటించురా? వి. వే.

పుట్టిలో ఏరు దాటినవాడు నేలచేరగానే పుట్టిని లెక్క చేయడు . అట్లే యోగమెరిగిన సంకల్పసిద్ధుడు శరీరమును లెక్కచేయడు

A person crossing the river on a boat has no use for the boat after reaching the destination. Similarly a yogi who uses his body as a means to attain salvation but has no use for it.

1117
ఐదు చక్రములను నాదిని బడవైచి ఐదుచక్రములకు నవల వెలసి నైదు చక్రములను నడవిబైలైతోచు , వి. వే.

ఐదు చక్రములను నాదిని బడవైచి
ఐదుచక్రములకు నవల
వెలసి నైదు చక్రములను నడవిబైలైతోచు,
వి. వే.

పంచభూత వివేచనచేసి , పంచభూతావృతమున కవ్వలనున్న ఈశ్వరుని రూపమును గుర్తింపవలెను

One has to meditate over the pancha (5) bhootas (earth, fire, air, sky and water) from which the world is made, and realize God beyond them.

1118
కడుపులోనివాణి గానగాలేరయా!కష్టపడుదురింతెకాని జనులు హీన మెఱుగ నాతడిది యేల యెఱుగును ? వి. వే.

కడుపులోనివాణి గానగాలేరయా!కష్టపడుదురింతెకాని
జనులు
హీన మెఱుగ నాతడిది యేల
యెఱుగును ? వి. వే.

హృదయములోనున్న దేవుని గుర్తింపలేక జనులు బాధపడుదురు . ఈ స్వల్పా౦శమునే తెలిసికొనలేనివారికి మోక్షమెట్లు కల్గును ?

God could be found in one's heart. People not realizing this suffer. How can one attain salvation without knowing this?

1119
కదలనీయకుండ గట్టిగా లింగంబు కట్టివేయనేమి ఘనతకలుగు?భావమందు శివుని భావించి కానరా, వి. వే.

కదలనీయకుండ గట్టిగా లింగంబు
కట్టివేయనేమి ఘనతకలుగు?భావమందు
శివుని భావించి
కానరా, వి. వే.

పెద్ద శివలింగమును కదలకుండ మెడలో కట్టుకొన్న లాభము లేదు . మనస్సులో శివుని భావించిన చాలును

There is no use in hanging a huge siva linga (phallic symbol) around one's neck. It is enough to meditate over Lord Siva in the mind.

1120
కదియబట్టి హంస కళలంట గమకించి సదయహృదయమందు సంతరించి విదితమైన బయల వెన్నంటి చూడరా, వి. వే.

కదియబట్టి హంస కళలంట గమకించి
సదయహృదయమందు సంతరించి
విదితమైన బయల వెన్నంటి
చూడరా, వి. వే.

బుద్ధిని బంధించి , హంసకళల నవలోకించి , వానిని హృదయమందు నిల్పి , మహాకాశమును కనుగొన నభ్యసింపుము

By focusing the mind, visualizing the hamsa kalas and planting them in the heart, one has to try to find out about the vast space.

1121
కనులచూపు నిలిపి కాంతిని గమనించి కాంచవలెను చిత్ కళలు దాటి కోటకొమ్మజేరి కోర్కులడంపరా , వి. వే.

కనులచూపు నిలిపి కాంతిని
గమనించి కాంచవలెను చిత్
కళలు దాటి కోటకొమ్మజేరి కోర్కులడంపరా,
వి. వే.

చూపుశక్తిని నిలుపుట నేర్చుకొని కళలను నిలకడగా చూడనేర్చి పిదప కనబడు జ్యోతిర్మూర్తిపై దృష్టినుంచి ఐహికములైన కోర్కెల నణచుకొన ప్రయత్నింపవలెను

By focusing the power of sight, learning keen observation one has to visualize the resulting resplendence to overcome the worldly desires.

1122
కనులరెంటినడుమ గాసంత నిలిపిన బొమల మీఱి చూడ్కి బొందజేయు క్రమమెఱింగి లోని కాంతిని పట్టుము , వి. వే.

కనులరెంటినడుమ గాసంత నిలిపిన
బొమల మీఱి చూడ్కి బొందజేయు
క్రమమెఱింగి లోని కాంతిని
పట్టుము , వి. వే.

చూపునునిల్పి భ్రూమధ్యమందలి మహాకాంతిపుంజము నవలోకింప నేర్చి , ఆ కాంతిని హృదయమున నిల్పుటకు యత్నింపుము

By focusing the sight between the eye-brows and visualizing the great resplendence of light, one has to strive to reflect on the light in one's heart

1123
కన్నుమిన్నుచేసి కాంతిని గమకించి తన్ను నిలిపి చూచి తలపు వదలి యున్నవాడు పరముగన్నవాడేయగు , వి. వే.

కన్నుమిన్నుచేసి కాంతిని గమకించి
తన్ను నిలిపి చూచి
తలపు వదలి యున్నవాడు పరముగన్నవాడేయగు,
వి. వే.

కన్ను మీదికి వ్యాపింపజేసి చిత్స్వరూపము గుర్తించి ధ్యానించిన తన్మయుడగును

One can attain bliss by visualizing subtle body during meditation

1124
కన్నెపడుచు జూచి కదలనీకుండిన యాసబట్టి యొక్క మూసబట్టి కరగబెట్టి దాని గడముట్టజేయురా , వి. వే.

కన్నెపడుచు జూచి కదలనీకుండిన
యాసబట్టి యొక్క మూసబట్టి
కరగబెట్టి దాని గడముట్టజేయురా,
వి. వే.

యువతులపై కోర్కెను మూసలో కరిగించినట్లు కరిగించి నశింపజేయుము . అప్పుడే మోక్షయత్నము సిద్ధించును

One has to give up the lust for young women while striving for salvation.

1125
కపటవేషమూని కడగండ్లు పడనేల ?విపినభూమి తిరిగి విసుగనేల ?యుపముతోనె ముక్తియున్నది చూడరా , వి. వే.

కపటవేషమూని కడగండ్లు పడనేల?
విపినభూమి తిరిగి విసుగనేల?
యుపముతోనె ముక్తియున్నది
చూడరా , వి. వే.

వేషములుచేసి చిక్కుపడుట , అడవులకుపోయి విసుగుట ఏల?ముక్తిని పొందుటకు సులభమార్గమే యున్నది

There is no use in getting into trouble by wearing garb and going to forests. There is an easy path to attain salvation.

1126
కరగ కరగ బుట్టు కనకంబునకు వన్నె పెనగ పెనగ బుట్టు ప్రేమ సతికి ముదియ ముదియబుట్టు మోహంబు లోభంబు , వి. వే.

కరగ కరగ బుట్టు కనకంబునకు వన్నె
పెనగ పెనగ బుట్టు ప్రేమ
సతికి ముదియ ముదియబుట్టు
మోహంబు లోభంబు , వి. వే.

కరగినకొద్దియు బంగారము వన్నెవచ్చును . పెనగినకొద్ది భార్యకు ప్రేమకల్గును . వయస్సు మళ్ళగా మోహము , లోభము ఎక్కువగును

With heat gold becomes lustrous. A wife loves her husband who works hard. As one ages lust and covetousness increase.

1127
కరతలంబునెత్తి కాలినదిమిపట్టి ఊర్ధ్వదృష్టిచేత నొనరనిల్పి సర్వమైతనరుట జాలనాయువు కల్గు , వి. వే.

కరతలంబునెత్తి కాలినదిమిపట్టి
ఊర్ధ్వదృష్టిచేత నొనరనిల్పి
సర్వమైతనరుట జాలనాయువు
కల్గు , వి. వే.

చేతులు పైకిచాచి కాలి నదిమిపట్టి చూపును మీదికి వ్యాపింపజేసి అవయవముల నన్ని౦టిని స్వాధీనమున ఉంచుకొనుట ఉత్తమయోగము. దీనివల్ల పూర్ణాయుస్సు కలుగును

By outstretching the hands, planting firmly on feet, spreading vision around, controlling all body parts, one can attain longevity.

1128
కల్పమనగ నగును కారణబీజంబు కల్పమనగ శివుని కల్పితంబు అల్పుడేమి యెఱుగు నానంద భోగంబు ? వి. వే.

కల్పమనగ నగును కారణబీజంబు
కల్పమనగ శివుని కల్పితంబు
అల్పుడేమి యెఱుగు నానంద
భోగంబు ? వి. వే.

శివకల్పితమగు కల్పకాలము బ్రహ్మకొక దినము ; సృష్టికి బీజము . వీనిని గడచిననో ఆనందము కల్గును . బ్రహ్మానందము కల్పకాలము నతిక్రమించునది

The duration of kalpa as decided by Lord Siva is equivalent to one day for Lord Brahma. This is the basis for the creation. One attains bliss by living through this duration. The knowledge about the creator exceeds such bliss.

1129
కలిగియు దినలేక కష్టించు రోగికి నాడువారిమీద నాశ కలదె? అన్నరసముతోనె యఖిలముదంబులు , వి. వే.

కలిగియు దినలేక కష్టించు
రోగికి నాడువారిమీద నాశ
కలదె? అన్నరసముతోనె యఖిలముదంబులు,
వి. వే.

ఉన్నను తినలేని రోగికి స్త్రీవాంఛ యుండదు . అన్నము తిన్ననే ఆశలన్నియు కల్గును . అన్నము మానిన ఆశలుండవు

A person with illness who cannot eat anything despite having access to food will not have lust for women. One's desires emanate after eating. By fasting one can over come such desires.

1130
కలిగినట్టె యుండు గలుగకయుండును మఱియులేకపోవు దిరిగి కలుగు కలిమినెచట జూడ గారడి యనవచ్చు , వి. వే.

కలిగినట్టె యుండు గలుగకయుండును
మఱియులేకపోవు దిరిగి
కలుగు కలిమినెచట జూడ గారడి
యనవచ్చు , వి. వే.

సంపద గారడివంటిది . ఉన్నట్లుండి పోవును . రానట్లే యుండి అనుకొనకుండ వచ్చును

Wealth is like black magic. All of a sudden it will disappear. And without one's expectation it manifests.

1131
కలిమిగల నరునకు గన్యక నిచ్చుచు మురియుచంద్రుగాదె మూఢజనులు పూజఫలమెగాని పూనికల్ నిల్చునా ? వి. వే.

కలిమిగల నరునకు గన్యక నిచ్చుచు
మురియుచంద్రుగాదె మూఢజనులు
పూజఫలమెగాని పూనికల్
నిల్చునా ? వి. వే.

మూఢులు పట్టుదలతో తమ కన్యలను ధనికులకే యిచ్చి పెండ్లిచేయుదురు . సంపద పూర్వసుకృతమువల్లనే కల్గును . వీరి గొప్పకాదు

Ignorant people offer their daughters in marriage to rich people. One attains wealth because of the good deeds done in the previous lives. It is not because of one's greatness.

1132
కలుగుచింతలన్ని కడకతో దాటగ వెలుగు చంద్రకాంతి వేడుకలర నివ్వటిల్లగోరు నిర్గుణ యోగులు , వి. వే.

కలుగుచింతలన్ని కడకతో దాటగ
వెలుగు చంద్రకాంతి వేడుకలర
నివ్వటిల్లగోరు నిర్గుణ
యోగులు , వి. వే.

చింతలనెడి చీకటిని దాటినచో జ్ఞానమనెడి వెన్నెల వెలుగు కానవచ్చును . నిర్గుణయోగులు దానినే కోరుదురు

One has to cross the darkness of worries to receive the moonlight of knowledge. The yogis who transcend the 3 gunas (sattva-calm, rajas-active, tamas-indolence) are desirous of such an experience

1133
కలుగు సుఖములెల్ల కల్లగా రోయుచు మెలగుచుండవలయు మిహుర పగిది తిరుగు నేర్పుచూడ ధీరుడే యగునయా , వి. వే.

కలుగు సుఖములెల్ల కల్లగా రోయుచు
మెలగుచుండవలయు మిహుర
పగిది తిరుగు నేర్పుచూడ ధీరుడే
యగునయా , వి. వే.

సుఖముల నన్నిటిని తేలికగా చూచి తిరస్కరించి జ్ఞానముపొంది సూర్యునివలె ప్రకాశించును . ఇట్లు మెలగునట్టి నేర్పుకలవాడే ధైర్యశాలి

A skillful person gives up comforts and attains spiritual knowledge to shine like the sun. Such a person is considered bold.

1134
కలుపుతీసి నరులు కాపాడి పైరులు పెంచుప్రేమవలెను బెనిచి మదిని దృశ్యములను ద్రుంచి తెంపుగానుండుము , వి. వే.

కలుపుతీసి నరులు కాపాడి పైరులు
పెంచుప్రేమవలెను బెనిచి
మదిని దృశ్యములను ద్రుంచి
తెంపుగానుండుము , వి. వే.

కర్షకులు కలుపుతీసి పైరును కాపాడి పెంచురీతిని మాయావృతమగు దృశ్యమును తిరస్కరించి ధైర్యముతో నుండుము

One has to be bold by rejecting the delusional sights just as farmers protect their crops by removing the weeds.

1135
కలుషమెల్ల దెలియ దలవంపులకు మూల మరయ దత్త్వమెల్ల నాత్మబుట్టు తెలిసినందునకును ధీరుడుకావలె , వి. వే.

కలుషమెల్ల దెలియ దలవంపులకు
మూల మరయ దత్త్వమెల్ల నాత్మబుట్టు
తెలిసినందునకును
ధీరుడుకావలె , వి. వే.

పాపకార్యములకు లోబడుట అవమానకరము . జ్ఞానము సంపాదించి తత్త్వ మెరుగుటకు ధీరుడై ఉండవలెను

It is shameful to live life like a sinner. One has to be courageous to acquire spiritual knowledge.

1136
కలుషయొక్కయింత కాన్పింపదెందును చూడనెవరికైన సొంపుమీఱ తామసం బడగ దావెల్గు జ్ఞానంబు , వి. వే.

కలుషయొక్కయింత కాన్పింపదెందును
చూడనెవరికైన సొంపుమీఱ
తామసం బడగ దావెల్గు
జ్ఞానంబు , వి. వే.

పుట్టుక పాపములను నిర్ణయింప నెవ్వరికిని శక్యము కాదు . కోపమొక్కటి లేకున్న జ్ఞానము పొందవచ్చును

No one can decide the birth and sins of a person. One can attain spiritual knowledge by giving up anger.

1137
కమ్మని వలపేల గజరాజమున కెన్న తనదు మదపుధార తావిగాక యోగికేల రంభయోగహర్షంబుండు ? వి. వే.

కమ్మని వలపేల గజరాజమున
కెన్న తనదు మదపుధార తావిగాక
యోగికేల రంభయోగహర్షంబుండు?
వి. వే.

ఏనుగునకు తన మదజల వాసన యిష్టముకాని , కమ్మని కస్తూరివాసన కిట్టదు . అట్లే యోగికి యోగమే సంతోషమిచ్చును . రంభ ఈయదు

An elephant revels in its own scent rather than in the perfume of kasturi. Similarly a yogi revels in his pursuit. No matter how many distractions he has from beautiful women, he is happy with his own self.

1138
కానరాని బయలు గానుటయే మోక్షంబు మేను మఱచి నిద్రమెలగిట్లు తాను తానుగాను దలంపు మఱవుదాటు , వి. వే.

కానరాని బయలు గానుటయే మోక్షంబు
మేను మఱచి నిద్రమెలగిట్లు
తాను తానుగాను దలంపు
మఱవుదాటు , వి. వే.

“నేను నీవు " అను భావము విడిచి తానే సర్వమని భావించి , మేనుమరచి నిద్రపోవురీతి బ్రహ్మానందమందుటే మోక్షము

Salvation is attained by rejecting the differences between self and others and by realizing that self is all that is around. It is similar to the deep sleep when one is unaware of his body.

1139
కానరానివాని గనుపించు వానితో కాపుసేయ నలుక కరుణతొడ కానరానివాని కరుణేమి కందురో ! వి. వే.

కానరానివాని గనుపించు వానితో
కాపుసేయ నలుక కరుణతొడ
కానరానివాని కరుణేమి
కందురో ! వి. వే.

కానరాని బ్రహ్మమును కనబడు మానవుని యందారోపించి , దేవుని దయను పొందిన అదృశ్యముగానున్న బ్రహ్మము కానవచ్చును

By projecting the invisible creator on the visible human, and receiving god's blessing, one can see the invisible creator.

1140
కామియైన జనుడు ఘనుడు కాడాయెనే కామికాడె కృష్ణసామి ముందు కామికాని జనుడు గణపతి కాడొకో , వి. వే.

కామియైన జనుడు ఘనుడు కాడాయెనే
కామికాడె కృష్ణసామి
ముందు కామికాని జనుడు గణపతి
కాడొకో , వి. వే.

తొలుత కామియైనను పిదప దానిని విడినవాడు ఘనుడగును . శ్రీకృష్ణుడు తొలుత కామి కాడా ? గణపతి యొక్కడే పుట్టు బ్రహ్మచారి

A person who gives up lust becomes great. Wasn't Lord Krishna a romantic person during his youth? Only Lord Vinayaka (elephant god) is the true bachelor

1141
కాయముదగగూడి కడగి యోగయిగనున్న కాయమిలనుబడిన ఘనుడు కాడు కాయమునను ముక్తి కడతేఱవలెనయా , వి. వే.

కాయముదగగూడి కడగి యోగయిగనున్న
కాయమిలనుబడిన ఘనుడు
కాడు కాయమునను ముక్తి
కడతేఱవలెనయా , వి. వే.

శరీరసాహాయ్యమున యోగము నభ్యసించువాడు శరీరమును విడిచినచో లాభము లేదు . శరీరమున్నప్పుడే ముక్తిని సాధించవలెను

One has to practice yoga while one still has body and is able. It is the only way to attain salvation.

1142
కాలుచేయిలేదు కంచుకంబు కలదు కొమ్ములేక యురికి చిమ్ములేగ గరిడిలేక చంపు గడు చోద్యమగునయా , వి. వే.

కాలుచేయిలేదు కంచుకంబు కలదు
కొమ్ములేక యురికి చిమ్ములేగ
గరిడిలేక చంపు గడు
చోద్యమగునయా , వి. వే.

మృతికి కాలుచేతులు లేవుకాని మాయ అను కంచుకమున్నది . కొమ్ము లేకున్నను కాలపాశమున చిమ్మును . సాము చేయకయే చంపును

Death has no limbs but is illusory. Without a stabbing horn it will make the body fall after some time. It will kill without a fight.

1143
కోటకోట తిరుగు కొమ్ములేనుగు కాదు త్రాటి పట్టె నందు తగిలియు౦డు పోటుబంటునైన బొర్లింపక విడడు , వి. వే.

కోటకోట తిరుగు కొమ్ములేనుగు
కాదు త్రాటి పట్టె నందు
తగిలియు౦డు పోటుబంటునైన బొర్లింపక
విడడు , వి. వే.

జీవుడు కళేబరమున కోటకోటకు తిరుగు ఏనుగువలె దేహమును ఈశ్వరుని అంటి తిరుగును . మాయావరణమును లోగొని ఎంతవానినైన జీవుడు వంచించును

A person is associated with Lord Siva with his body like an elephant that travels from kingdom to kingdom. A delusional person will undermine anyone.

1144
గగనచిత్త దృష్టి గద్దియపై జేర్చి యనువరైన యాత డచట మంటి యుజ్జ్వలాంశమందు నూహించు తత్త్వము , వి. వే.

గగనచిత్త దృష్టి గద్దియపై
జేర్చి యనువరైన యాత డచట మంటి
యుజ్జ్వలాంశమందు నూహించు
తత్త్వము , వి. వే.

దృగ్లక్ష్యమును ఆర్జించుటకు ముందుచూపు మహాదాకాశముపై నిలిపి, దానిని సహస్రారమున వ్యాపింపజేసి , అచలయోగము ననుసరించి ఆత్మస్వరూపము నూహించుటయే తత్త్వము

True knowledge is when one focuses his sight on infinite universe, spreading it over his head chakra (sahasraaram), remaining motionless and thinking about aatma (soul)

1145
గట్టుమీదనున్న గాన్పించు సర్వము తెలిసి తేటవడిన దెలియునెల్ల లోక విషయములును లోని రహస్యముల్ , వి. వే.

గట్టుమీదనున్న గాన్పించు సర్వము
తెలిసి తేటవడిన దెలియునెల్ల
లోక విషయములును లోని
రహస్యముల్ , వి. వే.

ఎత్తుకొండపై నెక్కిన సమస్త వస్తువులు క్రింద కాన్పించునట్లు జ్ఞానికి ప్రపంచ విషయములు , లోకరహస్యములును గోచరించును

When one is atop a mountain everything around is visible. Similarly a yogi knows about what transpires in the world and its secrets.

1146
గట్టుఱాళ్ళదెచ్చి కాళ్ళుచేతులు త్రొక్కి కాచి యులలుచేత గాసిజేసి మొఱకు ఱాళ్ళ కెఱగు మొప్పెల నేమందు ? వి. వే.

గట్టుఱాళ్ళదెచ్చి కాళ్ళుచేతులు
త్రొక్కి కాచి యులలుచేత
గాసిజేసి మొఱకు ఱాళ్ళ కెఱగు
మొప్పెల నేమందు ? వి. వే.

కొండరాళ్ళను విగ్రహములుగా చెక్కి వానికి నమస్కరించువారు మూర్ఖులు

It is ignorance that makes people worship idols chiseled from rocks.

1147
గర్వి యింద్రియముల గట్టివేయగలేక చావు వచ్చునపుడె సన్న్యసించు నాత్మజయములే , దికంటునా మోక్షంబు ? వి. వే.

గర్వి యింద్రియముల గట్టివేయగలేక
చావు వచ్చునపుడె సన్న్యసించు
నాత్మజయములే , దికంటునా
మోక్షంబు ? వి. వే.

సంసారలంపటుడు ఇంద్రియములు నిగ్రహింపలేక మరణసమయమునందే సన్న్యసించును . ఆత్మోన్నతి లేనివారికి సన్న్యసించినంతమాత్రమున మోక్షమబ్బునా ?

A person in bondage, having no control over the 5 senses, renounces the physical world in old age. Can he attain salvation without the knowledge about aatma (soul)?

1148
గాలి గాలి గలసె గగనంబు గగనంబు మన్ను మన్ను గలసె మంట మంట నీరు నీటగలసె నిర్మలమైయుండె , వి. వే.

గాలి గాలి గలసె గగనంబు గగనంబు
మన్ను మన్ను గలసె
మంట మంట నీరు నీటగలసె నిర్మలమైయుండె,
వి. వే.

జీవుడు పంచభూతాత్మకమగు దేహమును విడిచెనేని , ఆ దేహములోని పంచభూతములు పృధివ్యాదులలో కలసిపోయి అతడు నిర్మలుడై యుండును

A yogi leaves behind his body made of 5 elements (earth, water, fire, water and sky), and remains happy.

1149
గాలి ఫణికి జేసె గసవు పసికిజేసె మంటి నెఱకుజేసె మఱవ కిలను పుడమిని జనులకు బువ్వట్లు చేసెరా , వి. వే.

గాలి ఫణికి జేసె గసవు పసికిజేసె
మంటి నెఱకుజేసె మఱవ
కిలను పుడమిని జనులకు బువ్వట్లు
చేసెరా , వి. వే.

పాముకు గాలి , పశువుకు గడ్డి , ఎఱ్ఱకు మన్ను ఆహారముగా చేసినట్లు దేవుడు మనుష్యునకు అన్నము ఆహారముగా చేసెను . దానిని విడిచి జనుడు జీవించలేడు

God created food for humans like he provided air to snakes, grass to cows, sand to the earth worms. It is not possible for a man to live without food.

1150
గాలియందె పుట్టి గాలియందె పెరిగి గాలిదెలియలేరుగాదె నరులు గాలియందె యాత్మకల ; దదే తత్త్వంబు , వి. వే.

గాలియందె పుట్టి గాలియందె
పెరిగి గాలిదెలియలేరుగాదె
నరులు గాలియందె యాత్మకల ;
దదే తత్త్వంబు , వి. వే.

గాలిలో పుట్టి, అందే పెరిగిన జనులు గాలిశక్తి నెరుగలేకున్నారు . ఆత్మ అందే వ్యాపించియున్నది . అదే పరబ్రహ్మము

One is surrounded by air at all times and yet is not realizing the power of the air. The soul is spread out in the air and space thus merging with the creator.

1151
గుణవిహీన జనుని గుణ మెంచగానేల ? బుద్ధిలేనివాని పూజయేల ?మనసులేనివాని మంత్రంబు లేలయా ? వి. వే.

గుణవిహీన జనుని గుణ మెంచగానేల?
బుద్ధిలేనివాని పూజయేల?
మనసులేనివాని మంత్రంబు
లేలయా ? వి. వే.

జనులు గుణములేనివానిగూర్చి తలపరాదు . బుద్ధిలేని వానిని గౌరవింపరాదు . మనశుద్ధిలేనివాని మంత్రములను పాటింపరాదు

Men should not worry over people without character. They should not honor a foolish person. And not follow the mantras of a person with in impure mind.

1152
గురువుసేవచేసి గురితోడ భజియింప వలెనటంచు నరులు వాంఛతీర పలుకుచంద్రుగాని భావంబు కానరు , వి. వే.

గురువుసేవచేసి గురితోడ భజియింప
వలెనటంచు నరులు వాంఛతీర
పలుకుచంద్రుగాని భావంబు
కానరు , వి. వే.

గురువును సేవించి , వారి యుపదేశమును శ్రద్ధగా వినవలెనని జనులందురేకాని అట్టి శ్రద్ధ కానరాదు

People say one has to serve guru and listen to his teachings attentively. But it is not found anywhere.

1153
గుహలలోనజొచ్చి గురువుల వెదుకంగ క్రూరమృగ మొకండు తారసిలిన ముక్తిదారి యదియె ముందుగా జూపరా , వి. వే.

గుహలలోనజొచ్చి గురువుల వెదుకంగ
క్రూరమృగ మొకండు తారసిలిన
ముక్తిదారి యదియె ముందుగా
జూపరా , వి. వే.

గురువులు యోగులు మాత్రమే కారు . వారికై అడవులకు పోయిన క్రూరమృగములు మ్రింగివేయును . ఎటనైన బోధించువాడే గురువు

Gurus are not only yogis. When one goes to find them in forests, one can be attacked by wild animals. A guru is one who teaches anywhere.

1154
గెంటి యెఱుకను చిత్తము నంటగలిపి కంటికింపగు గురుశక్తి మింటజేర్చి జంటబాసిన ఘనుడె పో జాణుడరయ బంటుతన మది పరమందు బనికి , వి. వే.

గెంటి యెఱుకను చిత్తము నంటగలిపి కంటికింపగు
గురుశక్తి మింటజేర్చి
జంటబాసిన ఘనుడె పో జాణుడరయ బంటుతన
మది పరమందు బనికి , వి. వే.

తన పరిజ్ఞానమును ఆత్మజ్ఞానముగా మార్చి దృక్ శక్తిని మహదాకాశముపై చేర్చి సుఖదుఃఖముల నతిక్రమించినవాడే ఉత్తముడు . అతడే పరమును పొందగలడు

One who transforms his knowledge into knowledge about aatma (soul), focuses his vision on the vast space, overcomes joy and sorrow is the pious one. He only can attain nether world.

1155
గొఱ్ఱెలు పదివేలు కూడియుండినచోట తల్లినెఱిగివచ్చు దానికొదమ పరమయోగి నెరిగి భక్తు౦డు వచ్చురా , వి. వే.

గొఱ్ఱెలు పదివేలు కూడియుండినచోట
తల్లినెఱిగివచ్చు దానికొదమ
పరమయోగి నెరిగి భక్తు౦డు
వచ్చురా , వి. వే.

పదివేల గొర్రెలున్నను గొర్రెపిల్ల తన తల్లిని పోల్చుకొని వచ్చును . అట్లే భక్తుడు పరమయోగిని పోల్చి యతని వద్దకు వచ్చును

In spite of being surrounded by innumerable goats, a baby goat can recognize its mother. Similarly a devotee will find the yogi.

1156
ఘటపు జలములందు గగనము గాన్పించు ఘటము జలములేమి గగనమేది ?ఘటములోన జ్యోతి క్రమమున జూడరా , వి. వే.

ఘటపు జలములందు గగనము గాన్పించు
ఘటము జలములేమి గగనమేది?
ఘటములోన జ్యోతి క్రమమున
జూడరా , వి. వే.

కుండలో నీరున్నప్పుడే అందులో ఆకాశము కన్పించును . నీరు లేనిచో ఆకాశము కన్పించదు . అట్లే శరీరమున్నపుడే ఆత్మతత్త్వమును తెలిసికొనవచ్చును . ముక్తికి దేహము సాధనమగును

When a pot has water one can see the reflection of sky on its surface. Without water there is no reflection of sky. Similarly one can learn about aatma (soul) when one is embodied. Body is the means to attain salvation.

1157
చంద్ర సూర్యగతుల జర్చించి వేగమే రంధ్రమునను జొచ్చి రంగుమీఱ జంద్రశాల జేరి చైతన్యమందరా , వి. వే.

చంద్ర సూర్యగతుల జర్చించి
వేగమే రంధ్రమునను జొచ్చి
రంగుమీఱ జంద్రశాల జేరి
చైతన్యమందరా , వి. వే.

చంద్రసూర్యనాడులను గుర్తించి , భ్రూమధ్యమున దృష్టినిలిపి పరుని భజించి ముక్తి పొందుము

By recognizing chandra and surya nadis (nerves), focusing the vision between eye-brows, meditating over the creator, one can attain salvation.

1158
చపలచిత్తవృత్తి జయమొంద గమకించి నిపుణుడయ్యు యోగనియతి మీఱి తపము చేయువాడు తత్త్వాధికుండురా , వి. వే.

చపలచిత్తవృత్తి జయమొంద గమకించి
నిపుణుడయ్యు యోగనియతి
మీఱి తపము చేయువాడు తత్త్వాధికుండురా,
వి. వే.

మనస్సును నిలకడగానుంచి , యోగమునందు నేర్పుచూపి తపస్సు చేయువాడే తత్త్వవేత్త

The true yogi is one who controls the fleeting mind and meditates deeply.

1159
చర్మమెపుడు జీవసౌఖ్యంబుగోరును జీవి కర్మములను జేరుచుండు జీవి కర్మమెల్ల జెడరోయ దత్త్వమౌ , వి. వే.

చర్మమెపుడు జీవసౌఖ్యంబుగోరును
జీవి కర్మములను జేరుచుండు
జీవి కర్మమెల్ల జెడరోయ
దత్త్వమౌ , వి. వే.

దేహమెప్పుడును సౌఖ్యమునే కోరును . కావున జీవి కర్మములను చేయుచుండును . కర్మములను వీడినపుడే తత్త్వము తెలియును

Body always craves for comforts resulting in the actions one performs. The spiritual knowledge is attainable after one gives up karma.

1160
చిక్కిదక్కబోదు చిగిరించు మదిలోన నిక్కుబట్టి గుఱుతు నెఱయజూచి సొక్కియున్న ఘనులు సూత్రాత్ములగుదురు , వి. వే.

చిక్కిదక్కబోదు చిగిరించు మదిలోన
నిక్కుబట్టి గుఱుతు నెఱయజూచి
సొక్కియున్న ఘనులు సూత్రాత్ములగుదురు,
వి. వే.

ఆత్మతత్త్వము గోచరించి వెంటనే మాయమగును . నిశ్చల బుద్ధితో పట్టుదలతో యత్నించిననే అది నిలుచును

The knowledge about aatma (soul) is fleeting. One has to fixate on it with unwavering mind and determination

1161
చిత్తమందు శివుని జింతించ చూచిన హత్తుకొనును బదవి హానిలేక పొత్తు మఱవగానె పొందును సుఖములు , వి. వే.

చిత్తమందు శివుని జింతించ
చూచిన హత్తుకొనును బదవి హానిలేక
పొత్తు మఱవగానె పొందును
సుఖములు , వి. వే.

మనస్సులో భగవంతుని ధ్యానించిననే ఎట్టి చిక్కులేక భగవత్సాక్షాత్కారమగును . శరీర సంభందము విడిచినగాని బ్రహ్మానందము కలుగదు

When one meditates on God, eventually God will appear. Without giving up the body, there is no eternal bliss.

1162
చిత్తవాజినెక్కి శిక్షింపనేరక తత్తరపడినంత ధఱను నొక్కొ ? వారణాసి తనకు వైయాసి కాబోలు, వి. వే.

చిత్తవాజినెక్కి శిక్షింపనేరక
తత్తరపడినంత ధఱను
నొక్కొ ? వారణాసి తనకు వైయాసి
కాబోలు, వి. వే.

మనస్సు అను గుర్రమునెక్కి మానవుడను రౌతు సరిగా దానిని నడిపింపవలెను . భయపడినయెడల ప్రమాదము కలుగును . లేనిచో కాశికేగిన ప్రయోజనము లేదు

One has to steer his mind like a horse is steered by the rider. With fear comes danger. Otherwise, there is no use in going to a pilgrim place like Kaasi.

1163
చిన్నది యెల ప్రాయంబున గన్నది పతిలేక సుతుని గడుచిత్రముగా నెన్నడు రతిలవ మెఱుగదు చన్నీయక పెంచనౌర ! జగములవేమా!

చిన్నది యెల ప్రాయంబున గన్నది
పతిలేక సుతుని గడుచిత్రముగా
నెన్నడు రతిలవ మెఱుగదు చన్నీయక
పెంచనౌర ! జగములవేమా!

మాయయను చిన్నది భర్తలేకయే (ఈశ్వర సంభందము లేకయే) సంసారమను పుత్రుని కన్నది. వానిని పాలీయకయే పెంచినది. ఆమెకు (మాయకు)సంసారసుఖమే లేదు . ఇది చాల చిత్రము కదా

The illusion (maaya) without a husband has begotten a child called bondage. She nurtured it without providing milk. She has no happiness from it.

1164
చీకటింటబుట్టి చీకట బెరిగిన చీకటి మరుగుననె చిక్కనేల? చీకటి దెలిసిన సృష్టికాన్పింపదా ? వి. వే.

చీకటింటబుట్టి చీకట బెరిగిన
చీకటి మరుగుననె చిక్కనేల?
చీకటి దెలిసిన సృష్టికాన్పింపదా?
వి. వే.

నరుడు మాయలో పుట్టి, మాయలో పెరిగి , మాయలో చిక్కుకొనును . మాయను విడిచిననే సృష్టిరహస్యము తెలియును

A man is born in delusion, grows up in delusion and imprisoned in it. When one overcomes the delusion the secret of creation will reveal itself

1165
చెట్టునందు బుట్టి చెలరేగు గాయలు తనరు కాంతితోడ దగిలి పండ్లు, పండువాని దిండ్రు వర్ణంబు దెలియుడీ , వి. వే.

చెట్టునందు బుట్టి చెలరేగు గాయలు
తనరు కాంతితోడ దగిలి పండ్లు,
పండువాని దిండ్రు వర్ణంబు
దెలియుడీ , వి. వే.

బ్రహ్మాండము వృక్షము, జ్ఞానమే కాయలు. ఆ కాయలు పండిన మోక్షఫలము లభించును

Universe is like a great tree. Knowledge is its fruit. When the fruits ripen the salvation is attainable.

1166
చెవులలోనబుట్టు రవయె యాకాశంబు కన్నుల గనునదియె కళల జ్వాల ముక్కులోని గాలి ముక్తికి ద్రోవరా , వి. వే.

చెవులలోనబుట్టు రవయె యాకాశంబు
కన్నుల గనునదియె కళల జ్వాల
ముక్కులోని గాలి ముక్తికి
ద్రోవరా , వి. వే.

చెవిలో ధ్వనించు ప్రణవనాదమే మహాకాశము . కనులముందు కానవచ్చు కళలే వాని జ్వాలలు . ప్రాణాయామమే యోగ సాధనము . ఈ మూడిటివల్లనే ముక్తి లభించును .

The “aum” sound heard by the ears is the vast space. The kalas visible to the eyes are its flames. The means for yoga is praanayaamas (breath exercises). Salvation is attained with these three things.

1167
చెవుల విన్నయట్టి రవమును వివరించి మనసదెఱిగినపుడు మఱలుకొనును చెవులు శబ్దమునను జెడరోయ ముక్తిరా, వి. వే.

చెవుల విన్నయట్టి రవమును వివరించి
మనసదెఱిగినపుడు మఱలుకొనును
చెవులు శబ్దమునను జెడరోయ
ముక్తిరా, వి. వే.

ప్రణవనాదమును విని , దానిని మనస్సున నిల్పుకొని చిన్మయతపొంది యితర శబ్దములను వినకుండ స్థితియే ముక్తి

Listening to “aum” and fixating in mind without hearing other sounds is the salvation

1168
చదివి చదివి చదివి చావంగ నేటికి ?చావులేని చదువు చదువవలయు చదువులేక కోటి జనులు చచ్చిరికదా, వి. వే.

చదివి చదివి చదివి చావంగ నేటికి?
చావులేని చదువు చదువవలయు
చదువులేక కోటి జనులు
చచ్చిరికదా, వి. వే.

ఎంతో చదివి శ్రమపడుటకంటె తత్త్వవిద్యను చదువుట మేలు. ఈ వేదాంతవిద్య నెరుగనివారే శ్రమలతో మరణింతురు

It is better to acquire spiritual knowledge than gather vocational knowledge. The people without the knowledge about vedas die with stress.

1169
చనగ చనగ దాకు చనుద్రోవలో గాశి వినగ వినగ ప్రణవ విభవరవళి కనగ కనగ బుట్టు కారణమదియెరా , వి. వే.

చనగ చనగ దాకు చనుద్రోవలో
గాశి వినగ వినగ ప్రణవ విభవరవళి
కనగ కనగ బుట్టు
కారణమదియెరా , వి. వే.

ఎంతో దూరము పోగా పోగా కాశి కనబడునట్లు ఎంతో సాధించి వినగా ప్రణవనాదము వినవచ్చును . ప్రపంచ దృశ్యములను చూచి చూచి విరక్తినొందిననే బ్రహ్మమును కాంచవచ్చును

The pilgrim place Kaasi is found after traveling afar. The “aum” sound can be heard after much persistence. The creator is visible after renouncing the world.

1170
చలము పట్టి మదిని జనియించు గుణముల సతిని ద్రుంచి వేగ దమక ముడిగి సతముగాను బుద్ధి సవరింపనదె ముక్తి, వి. వే.

చలము పట్టి మదిని జనియించు గుణముల
సతిని ద్రుంచి వేగ దమక
ముడిగి సతముగాను బుద్ధి సవరింపనదె
ముక్తి, వి. వే.

పట్టుదలతో , మనస్సులో పుట్టి సత్వాది గుణములను తమకమును విడిచి బుద్ధిని సరిచేసికొని ముక్తిని పొందవలెను

With determination one has to give up the thoughts resulting from the 3 gunas (sattva-calm, rajas-active, tamas-indolence) and mold his mind to attain salvation

1171
చావుదెలయువాడు సన్న్యసించునదెట్లు ?కడపలందు ఘనత గదురునెట్లు?పాపమొకటె ; మీద ఫలమేమి లేదురా, వి. వే.

చావుదెలయువాడు సన్న్యసించునదెట్లు?
కడపలందు ఘనత గదురునెట్లు?పాపమొకటె;
మీద
ఫలమేమి లేదురా, వి. వే.

తన ఆయుఃప్రమాణము తెలిసినవాడు చివరికాలమునందు సన్న్యసించిన , ఆ స్వల్పకాలమున ముక్తిని సాధింపలేడు . అతనికి మిగులునది పాపమొక్కటియే . అట్టి సన్న్యాసమువలన ఫలములేదు

When one renounces the world in the old age, despite knowing his longevity, it is not possible to attain salvation. All he has left is sin. There is no use in such renunciation.

1172
చూపులోని చూపు జూడంగ , జూడంగ డెలివిలోని తెలివి వెలుగుచుండు , నిద్రలోని నిద్ర నిజమని తెలియరా , వి. వే.

చూపులోని చూపు జూడంగ , జూడంగ
డెలివిలోని తెలివి వెలుగుచుండు,
నిద్రలోని నిద్ర నిజమని
తెలియరా , వి. వే.

ఈ ప్రపంచమును చూచి , లోనిచూపును హృదయ కమలమున చూచిన , కళలుదయించును . పిదప బ్రహ్మమును చూడవచ్చును

Kalas arise when one sees the world around and reflects the inner eye on the lotus near the heart. Then he can see the creator.

1173
చూపులోని చూపు సూక్ష్మమౌ దెలియంగ చూపులోని చూపు శుభ్రమగును చూపులోని చూపు సురవరగమ్యంబు , వి. వే.

చూపులోని చూపు సూక్ష్మమౌ
దెలియంగ చూపులోని చూపు శుభ్రమగును
చూపులోని చూపు
సురవరగమ్యంబు , వి. వే.

పరముపై ఆసక్తి యున్నయెడల దృష్టిని ముక్కు చివర నిల్పి పట్టుదలతో చూచుచున్నయెడల బ్రహ్మస్వరూపము సులభముగ గోచరించును

When one is interested in after life, one has to focus the eyes on the tip of the nose. Such a practice will help to see the creator easily.

1174
చొక్కమైన పరము చుఱకరివై చూడ్కి ముక్కుతుదనుగూర్చి ముదముతోడ దక్క చూచినంత దగ్గరై యుండురా , వి. వే.

చొక్కమైన పరము చుఱకరివై చూడ్కి
ముక్కుతుదనుగూర్చి
ముదముతోడ దక్క చూచినంత దగ్గరై
యుండురా , వి. వే.

దృష్టిని ముక్కు చివర నిల్పి తదేకచిత్తముతో ఉపాసించినచో బ్రహ్మస్వరూపము కానవచ్చును

One can see the creator by focusing his eyes on the tip of the nose and meditating.

1175
చురికతోడగోయ జొప్పడునేకాని దానిపిడినిగోయ దరమె నీకు?తెలివిలేనిమేని బలమేమి చేయును? వి. వే.

చురికతోడగోయ జొప్పడునేకాని
దానిపిడినిగోయ దరమె
నీకు?తెలివిలేనిమేని బలమేమి
చేయును? వి. వే.

దేనినైన కత్తితో కోయగలముగాని కత్తిపిడితో కోయలేనట్లు తెలివిలేని దేహబలముతో ఏ పనిని చేయజాలము

One can cut things with the blade rather than the handle of a knife. Without intelligence it is not possible to do anything by mere strength of the body.

1176
జనన మరణములిల జంగమములు సుమ్మి జనని జనకు లిలను జలధిరీతి వినుతిచేసి గురుని వెన్నంటి చూడరా , వి. వే.

జనన మరణములిల జంగమములు సుమ్మి
జనని జనకు లిలను జలధిరీతి
వినుతిచేసి గురుని వెన్నంటి
చూడరా , వి. వే.

జనన మరణములు , తల్లితండ్రులు చక్రము తిరుగుచునుండును . కాన గురువు నాశ్రయించి పరతత్త్వము తెలిసికొనుము

The cycle of birth and death and parenting is unending. Hence one has to attain spiritual knowledge by approaching a guru.

1177
జపము బాహ్యపూజ జాలగా జేసియు గపటము విడలేక కష్టనరులు ముక్తినొందలేక మునిగిరి తమమున , వి. వే.

జపము బాహ్యపూజ జాలగా జేసియు
గపటము విడలేక కష్టనరులు
ముక్తినొందలేక మునిగిరి
తమమున , వి. వే.

బయటి పూజ , జపములు ఎక్కువగా చేసి, కపటము విడువక బాధపడుచు నరులు అజ్ఞానమువల్ల ముక్తిని పొందలేకున్నారు

By performing pooja, and meditating with mantra, and without giving up deceit ignorant men are unable to attain salvation

1178
జాగ్రతనగనేమి?జన్మమనగనేమి ?జన్మమునకు నరయ జాగ్రతాయె జన్మజాగ్రతలను సాధింపరా ముక్తి , వి. వే.

జాగ్రతనగనేమి?జన్మమనగనేమి?
జన్మమునకు నరయ జాగ్రతాయె
జన్మజాగ్రతలను సాధింపరా
ముక్తి , వి. వే.

జాగ్రత అననేమో , జన్మమననేమో , వీనికిగల సంబంధమేమో సామాన్యులెరుగరు . వీనికిగల సంబంధమును గుర్తింపగలిగిన ముక్తి మార్గము తెలియును

Ordinary people don't know what is caution (or wakeful state), birth and their relationship. One who is aware of the relationship can see the path to salvation

1179
జాతి వేఱులేక జన్మక్రమంబున నెమ్మదిని నభవుని నిలిపెనేని అఖిలజనులలోన నతడు ఘనుండయా , వి. వే.

జాతి వేఱులేక జన్మక్రమంబున
నెమ్మదిని నభవుని నిలిపెనేని
అఖిలజనులలోన నతడు
ఘనుండయా , వి. వే.

జాతి భేదములు , మతవైషమ్యములు లెక్కింపక మానవజాతి ఒక్కటే అని తలచి, దేవుని ధ్యానించువాడే ఉత్తముడు

By rejecting racial and religious differences , by considering humanity as one, one who mediates on the god is superior.

1180
జాతులందు నెట్టిజాతి ముఖ్యమొ చూడు మెఱుకలేక తిరుగు నేమిఫలము ? ఎఱుకకల్గ మనుజుడేజాతి కలవాడొ , వి. వే.

జాతులందు నెట్టిజాతి ముఖ్యమొ
చూడు మెఱుకలేక తిరుగు నేమిఫలము?
ఎఱుకకల్గ మనుజుడేజాతి
కలవాడొ , వి. వే.

జాతులలో ఏది గొప్పది అను వృధా చర్చయేల?జ్ఞానము గలవాడే ఉత్తమజాతివాడని తెలిసికొనవలెను

It is futile to contemplate over the question of which race is superior to others. The person with spiritual knowledge is the one who is of superior race

1181
జారపురుషుమీద సద్భక్తి నిలుపుచు బతికి నిచ్చకముగ బరగు భంగి బరము కొఱకు యోగి పాటించు దేహంబు , వి. వే.

జారపురుషుమీద సద్భక్తి నిలుపుచు
బతికి నిచ్చకముగ బరగు
భంగి బరము కొఱకు యోగి పాటించు
దేహంబు , వి. వే.

ఇచ్ఛకముగా భర్తను సేవించుచు పరమపురుషుని కోరు స్త్రీవలె యోగి పరమపురుషుని కొరకు తన దేహమును కాపాడును

Like a married woman who lusts over a man other than her husband, yogi preserves his body for the creator

1182
జీవ లింగపూజ చేసినవారికి శిలల రూపమందు జింతయేల?చెలగి మధువు గ్రోలు జేదు రుచించునా? వి. వే.

జీవ లింగపూజ చేసినవారికి
శిలల రూపమందు జింతయేల?చెలగి
మధువు గ్రోలు జేదు
రుచించునా? వి. వే.

జీవునే లింగముగా ఎంచి పూజించువారికి లింగపూజ అక్కరలేదు . తీపి తినిన నోటికి చేదు రుచింపదు కదా

There is no need to perform pooja to a phallic symbol when men are considered the image of Lord Siva. One does not like bitter taste after eating sweet things.

1183
జీవి జంపుటెల్ల శివభక్తి తప్పుటే జీవు నరసి కనుడు శివుడె యగును జీవుడు శివుడనుట సిద్ధంబు తెలియురా , వి. వే.

జీవి జంపుటెల్ల శివభక్తి తప్పుటే
జీవు నరసి కనుడు శివుడె
యగును జీవుడు శివుడనుట సిద్ధంబు
తెలియురా , వి. వే.

జీవహత్య చేయుట శివుని చంపుటయే యగును . జీవుడే శివుడు . కాన జీవుని హీనముగా చూడరాదు

Killing a living being is like killing Lord Siva. A living being is Lord Siva. So one should not under-estimate a living being.

1184
జ్యోతియందు పుట్టె సొంపైన నాదము బిందువమరె నాదమందు దెలియ బిందువందుబుట్టె పృధివి యాకాశమున్ , వి. వే.

జ్యోతియందు పుట్టె సొంపైన
నాదము బిందువమరె నాదమందు దెలియ
బిందువందుబుట్టె పృధివి
యాకాశమున్ , వి. వే.

జ్యోతియందు నాదము , నాదమున బిందువు , అందులోనే పృధివ్యాది పంచభూతములు పుట్టెనని తెలియవలెను

From the eternal fire came “aum” and from “aum” came binduvu and from binduvu came 5 elements (earth, water, fire, space, air).

1185
టక్కుయోగి యెంత టాటోకు చేసిన వివరమరసినంత వెగటుగల్గు పరము సున్నా, నరకబాధయు సిద్ధంబు , వి. వే.

టక్కుయోగి యెంత టాటోకు చేసిన
వివరమరసినంత వెగటుగల్గు
పరము సున్నా, నరకబాధయు
సిద్ధంబు , వి. వే.

దొంగ యోగులు జనుల నెన్నియో విధముల మోసగింతురు . వివరములు తెలిసినపిమ్మట వారిపై రోత కలుగును . వారివల్ల పరము కలుగదు సరికదా , నరకబాధలును తప్పవు

Spurious yogis deceive people in many ways. One gives up on them after knowing the truth. There is no comfortable after life by worshiping them. On the other hand, one ends up in hell.

1186
టక్కుమాటలాడి చిక్కులబెట్టిన నిక్కమెఱుగు నతడు నిర్వహించు జక్కనైన జ్ఞానసారంబు తెలియురా, వి. వే.

టక్కుమాటలాడి చిక్కులబెట్టిన
నిక్కమెఱుగు నతడు నిర్వహించు
జక్కనైన జ్ఞానసారంబు
తెలియురా, వి. వే.

కపటపు యోగి మోసపు మాటల చిక్కులలో పడక జ్ఞానము కలవాడు స్వకార్యమును నిర్వర్తించుకొనును . కావున వంచకుల మాయలకు చిక్కుకుండుటకై యత్నింపవలెను

A person with knowledge will not listen to spurious yogis and attains his goal. Hence it is preferable not to listen to the fake yogis.

1187
ఠేవలేకయున్న డిల్లపోడెన్నడు నిక్కమైన జ్ఞాని నిలుకడగను ఎంతలాపదలు నికెన్నడు నెన్నడు , వి. వే.

ఠేవలేకయున్న డిల్లపోడెన్నడు
నిక్కమైన జ్ఞాని నిలుకడగను
ఎంతలాపదలు నికెన్నడు
నెన్నడు , వి. వే.

ఆడంబరములు లేనంతమాత్రమున జ్ఞాని గౌరవార్హుడు కాడు . అతడు స్థిరుడై ఎట్టి యాపదలనైనను లెక్కచేయకుండ ఉండవలెను

A knowledgeable person, despite not having ornaments, is not unworthy of honor. He has to remain steadfast and over come all dangers.

1188
డాగుపడిన పండు బాగులే దందురు అట్టి డాగు తమది యరయలేరు తమ్ము నెంచువారు తమ డాగు కనరు, వి. వే.

డాగుపడిన పండు బాగులే దందురు
అట్టి డాగు తమది యరయలేరు
తమ్ము నెంచువారు
తమ డాగు కనరు, వి. వే.

పండు పైభాగమున చిన్న డాగున్నను అది మంచిది కాదందురు . తాము గొప్పవారమనుకొనువారికి తమ డాగెట్లు కానరాదో

A fruit with slight imperfection is rejected. The people deluding they are great are not seeing their own imperfections.

1189
తంత్రవాదులెన్న దఱచుగ నున్నారు మంత్రవాదులరయ మహినిలేరు జంత్రగాని బొమ్మ చందము చూచిన, వి. వే.

తంత్రవాదులెన్న దఱచుగ నున్నారు
మంత్రవాదులరయ మహినిలేరు
జంత్రగాని బొమ్మ
చందము చూచిన, వి. వే.

తంత్రములతో పని జరుపుకొనువారే ఎక్కువ. ఆలోచించి చేయువారు లేరు . ఈ తంత్రపు జనులు గారడివాని బొమ్మలవంటివారు మాత్రమే

People using ritualistic tantra to accomplish tasks are in greater number. The thoughtful people are fewer. The people performing rituals are like the puppets of a puppeteer.

1190
తనకు భాగ్యమున్న దక్కువ లేకుండ కలుగు భాగ్యమెల్ల కల్లయనుచు నమ్మకముగ జూచు నరుడగు యోగిరా, వి. వే.

తనకు భాగ్యమున్న దక్కువ లేకుండ
కలుగు భాగ్యమెల్ల కల్లయనుచు
నమ్మకముగ జూచు నరుడగు
యోగిరా, వి. వే.

తక్కువకాని సంపద తనకున్నను , అది అస్థిరమని లెక్కచేయనివాడే యోగి.

A person having great wealth and realizing that it is impermanent is a true yogi.

1191
తనుభరించునతని దన యాయుధమ్ముల నగ్ని నింక బరుని యాలినెన్న సరసమునకు గొనగ జావె సిద్ధించును , వి. వే.

తనుభరించునతని దన యాయుధమ్ముల
నగ్ని నింక బరుని యాలినెన్న
సరసమునకు గొనగ జావె
సిద్ధించును , వి. వే.

యజమానితోను , ఆయుధములతోను , అగ్నితోను, పరస్త్రీతోను సరసమాడినచో చావు సంభవించును . కాన జాగ్రత్తగా ఉండుము

One meets with death by toying with the master, weapons, fire and a woman

1192
తఱచు చదువ జదువ తర్కవాదమె కాని దివ్యమైన తెలివితేట పడదు పసిరికాయ పురుగు పగిదిని జెడిపోవు, వి. వే.

తఱచు చదువ జదువ తర్కవాదమె
కాని దివ్యమైన తెలివితేట
పడదు పసిరికాయ పురుగు పగిదిని
జెడిపోవు, వి. వే.

చదివినకొలది కుతర్కములే తోచునుగాని సరియైన జ్ఞానము కలుగదు . పసిరికాయలోని పురుగువలె అది ఆ కుతర్కవాదికే హానిని కలిగించును

The more one studies vocational books, the less one's spiritual knowledge. Like the worm caught in a silk worm's cocoon (pasiri), it is self-defeating.

1193
తలపు నెదిలేక భేదంబు తలపనీక జోలలందును నర్థియై జోలలాడు చున్న యోగీ౦ద్రుడని చెప్ప నుచితమగును వేమననియెడు యోగిని వెలయ వేమ !

తలపు నెదిలేక భేదంబు తలపనీక జోలలందును
నర్థియై జోలలాడు చున్న
యోగీ౦ద్రుడని చెప్ప నుచితమగును
వేమననియెడు యోగిని వెలయ వేమ !

మనస్సున ఎట్టి కోరికయు లేక ప్రణవనాదమునే ఆశించుచు ఇతర లోక వ్యవహారములను విడిచిపెట్టినవాడే గొప్ప యోగి . అట్టివారిలో వేమన యొకడు

A true yogi is one who is without any desire other than for the “aum” sound and renounces worldly things. Vemana is one among them.

1194
తల్లిగన్న తల్లి తన పినతల్లి తండ్రిగన్న తల్లి , తాత తల్లి ఎల్ల శూద్రులైరి యేటి బ్రాహ్మణుడిక ? వి. వే.

తల్లిగన్న తల్లి తన పినతల్లి
తండ్రిగన్న తల్లి , తాత
తల్లి ఎల్ల శూద్రులైరి యేటి
బ్రాహ్మణుడిక ? వి. వే.

బ్రహ్మవద్దనుండి చూడగా బ్రాహ్మణ వంశము శూద్రవంశముగానే చెప్పవలెను . ఇట్లు శూద్రుడైన బ్రాహ్మణుని గొప్పయేమి? (దీనివల్ల జాతిభేదమును లెక్కింపరాదని తెలిసికోవలెను )

When one views from the angle of the creator, the brahmin race is like that of lower classes. What is the greatness of brahmins?

1195
తాను నింద్రియముల దనరజయించిన తత్త్వమరసి చూడ దాన యగును రాజయోగి యిట్లు తేజరిల్లుచునుండు , వి. వే.

తాను నింద్రియముల దనరజయించిన
తత్త్వమరసి చూడ దాన యగును
రాజయోగి యిట్లు తేజరిల్లుచునుండు,
వి. వే.

ఇంద్రియములను జయించి తత్త్వమెరిగి , తానే ఆ తత్త్వమని గ్రహించువాడే రాజయోగి

A raaja yogi is one who overpowers his 5 senses and attains spiritual knowledge.

1196
తానె తత్త్వమయ్యు దన్నెఱుగలేక మాయ తత్త్వమనుచు మఱగుచుండు ధర్మ కర్మములను దారోయ తత్త్వము, వి. వే.

తానె తత్త్వమయ్యు దన్నెఱుగలేక
మాయ తత్త్వమనుచు మఱగుచుండు
ధర్మ కర్మములను దారోయ
తత్త్వము, వి. వే.

తానే పరతత్త్వమని తెలియక మాయనే తత్త్వముగా మనుష్యుదెంచుచున్నాడు . ధర్మకర్మములను విడుచుటయే తత్త్వము

Men consider the illusory world as the truth without realizing that they are the embodiment of spiritual knowledge. The one who renounces dharma and karma (action) is the true yogi.

1197
తిన్నగ ద్రిపుటిని గురిగని యున్నను నాదంబు వినగ నూహింపుము లో మిన్ను గని నిన్ను మఱతువు వెన్నెలలో బయలుసేరి వెలయుము వేమా!

తిన్నగ ద్రిపుటిని గురిగని యున్నను
నాదంబు వినగ నూహింపుము లో
మిన్ను గని నిన్ను మఱతువు వెన్నెలలో
బయలుసేరి వెలయుము వేమా!

ద్రష్ట , దృశ్యము , దర్శనము అను త్రిపుటియందు దృష్టిని లగ్నము కావించి ప్రణవనాదము వినుము . తేజస్సును గాంచి అందు లీనమగును

By focusing on the seer, seen and sight, one has to listen to the “aum” sound. One merges with the resulting resplendence

1198
తిరిగి తిరిగి తిరిగి ద్రిమ్మరి గానేల?తీర్థయాత్ర కనుచు దెలివిమాలి తెలివిలోని గురిని దెఱపిగా జూడరా , వి. వే.

తిరిగి తిరిగి తిరిగి ద్రిమ్మరి
గానేల?తీర్థయాత్ర కనుచు
దెలివిమాలి తెలివిలోని గురిని
దెఱపిగా జూడరా , వి. వే.

తెలివిలేక తీర్థయాత్రలకు పోయిపోయి శ్రమపడనేల ? బుద్ధి కలిగి యీశ్వరుని ధ్యానించినచో ముక్తి కలుగును

What is the point in going on pilgrimage with great effort? One can attain salvation with a pure mind and meditating over Lord Siva.

1199
తెలుపు మాయజేసి దిట్టతనంబున దెలుపు భస్మముగను దేటపఱచు విధముకన్న బరుసవేదియు లేదురా , వి. వే.

తెలుపు మాయజేసి దిట్టతనంబున
దెలుపు భస్మముగను దేటపఱచు
విధముకన్న బరుసవేదియు
లేదురా , వి. వే.

పాదరసములోని తెలుపును పోగొట్టి దానిని భస్మము చేసి దాని సాయమున బంగారము చేయవచ్చును . దీనికంటె మేలైన పరుసవేది లేదు

It is possible to convert mercury into gold. There is no other greater method.

1200
తొఱ్ఱిమ్రానులోని తొఱట జీవులనెల్ల మొల్లలేక చంపు మదముతోడ నగ్నిలేని మంట యదియేమి చోద్యమో , వి. వే.

తొఱ్ఱిమ్రానులోని తొఱట జీవులనెల్ల
మొల్లలేక చంపు మదముతోడ
నగ్నిలేని మంట యదియేమి
చోద్యమో , వి. వే.

సారహీనమగు దేహము నాశ్రయించియున్న అల్పప్రాణులను మృత్యుదేవత నశింపజేయుచున్నది . మృత్యుదేవత కృత్యములు అగ్నిలేని మంటలవంటివి

The low lives living without bodies of mettle are being dealt with by the lord of death. His acts are like flames without fire.

1201
తోలుతిత్తిలోన దొలుత పుట్టినతాను వెనుక దెలియవలయు వివర మరసి వెనుక దెలియలేమి వెఱ్ఱియై చెడిపోవు, వి. వే.

తోలుతిత్తిలోన దొలుత పుట్టినతాను
వెనుక దెలియవలయు వివర
మరసి వెనుక దెలియలేమి వెఱ్ఱియై
చెడిపోవు, వి. వే.

తాను తోలుతిత్తిలో పుట్టి వివిధావస్థలు పొందితినని తెలిసికోలేక మానవుడు గర్వాహంకారములతో మూఢుడై యుండును

Without realizing that he is born in a sack covered by skin and grew up with such a body, a man is foolish with ego.

1202
త్రిపుటికి జూడ్కిని పైనిడి యుపజిహ్వకు సూటిచేసియు మదిలోన తపమొనరించెడు భక్తుడు నిపుణుడై వెలుగులోనె నేర్పున వేమా !

త్రిపుటికి జూడ్కిని పైనిడి యుపజిహ్వకు
సూటిచేసియు మదిలోన
తపమొనరించెడు భక్తుడు నిపుణుడై
వెలుగులోనె నేర్పున వేమా !

చూపును త్రిపుటికి పైనుంచి ఉపజిహ్వకు సూటిచేసి తపస్సుచేయుచు భక్తుడు నేర్పుచూపుచు బ్రహ్మసాక్షాత్కారమును పొందును

By focusing the gaze above the seen-seer-sight in a straight line with soft-palate/uvula and meditating a devotee can see the creator.

1203
తనియు బిండమునను దగిలిన మనుజుండు పుట్టలేడు వాడు పుడమిలోన నట్టి పుట్టుక గాన నవనిలో లేదయా! వి. వే.

తనియు బిండమునను దగిలిన మనుజుండు
పుట్టలేడు వాడు పుడమిలోన
నట్టి పుట్టుక గాన
నవనిలో లేదయా! వి. వే.

గర్భములో పిండాకారమున నున్న జీవుడు పూర్వస్మృతిలో ఆనందించుచు మరల జనించి మాయావృతుడై స్మృతిని కోల్పోవుచున్నాడు . మాయకు లొంగక పూర్వజన్మస్మృతిగల జనుడీ లోకమున లేడు

When one is in the womb one is contemplating over the earlier lives. After being born he loses all memories of previous lives. There is no one who is not delusional and aware of earlier lives.

1204
దాతయైనవాడు తానె మున్నిచ్చెడు గాని వాడొసగునె కానియైన జలము దప్పిదీర్చు మలమెట్లు తీర్చును , వి. వే.

దాతయైనవాడు తానె మున్నిచ్చెడు
గాని వాడొసగునె కానియైన
జలము దప్పిదీర్చు మలమెట్లు
తీర్చును , వి. వే.

దాత ఇతరులతో పోటీ పెట్టుకొనక ముందుగానే తోచినదిచ్చును . లోభి కాసైన నీయడు . నీరు దప్పిక తీర్చునుగాని, మలము తీర్చునా?యాచకుని కోరికను దాతయే తీర్చును

A donor without competing with others gives alms. A miser won't part with his money. One has to drink pure water to quench his thirst, not waste water. A donor only can fulfill the wish of an alms seeker.

1205
దారబందిగము తనయులు సంకెలల్ బంధువర్గమెల్ల ప్రహరిగోడ మోహమెఱుగలేడు మొక్కలికాడయా , వి. వే.

దారబందిగము తనయులు సంకెలల్
బంధువర్గమెల్ల ప్రహరిగోడ
మోహమెఱుగలేడు మొక్కలికాడయా,
వి. వే.

భార్యయే చెరసాల , కొడుకులే సంకెళ్ళు , బంధువులు చెర ప్రహరిగోడ . అజ్ఞానమువలన నరుడీ విషయములు నెరుగక మోహమునకు లొంగుచున్నాడు

One's wife is his prison. His sons are his shackles. His relatives are walls surrounding the prison. Out of ignorance a person doesn't realize these and yields to lust.

1206
దేవభూమూలందు దేవాలయములందు దేవుడనుచు మ్రొక్కి సేవచేసి తెలియ విశ్వకర్మ దేవాదిదేవుడౌ , వి. వే.

దేవభూమూలందు దేవాలయములందు
దేవుడనుచు మ్రొక్కి సేవచేసి
తెలియ విశ్వకర్మ దేవాదిదేవుడౌ,
వి. వే.

దేవాలయములలోని విగ్రహములే దేవునిగా భావించి , మూఢులు సేవించి మ్రొక్కుచున్నారు . విగ్రహమే దేవుడైనచో దానిని నిర్మించిన శిల్పి దేవాదిదేవుడగును కదా

Ignorant people are worshiping the idols in temples as though they are real gods. If an idol is god then the one who chiseled the idol from a rock is above god.

1207
దొడ్డివాడు పెద్ద తోడేలునైనను మట్టుచూచి దాని మర్మమెఱిగి గొడ్డుగొఱ్ఱె అయినను గొని చననీయడు , వి. వే.

దొడ్డివాడు పెద్ద తోడేలునైనను
మట్టుచూచి దాని మర్మమెఱిగి
గొడ్డుగొఱ్ఱె అయినను
గొని చననీయడు , వి. వే.

మర్మమెరిగిన తత్త్వము తెలియును . పసులకాపరి మర్మ మెరిగి తోడేలునైనను చంపి పశువులను , గొర్రెలను కాపాడుకొనును

A cow-herder protects his cows from the predators. Similarly when one knows the secrets of life, one attains spiritual knowledge.

1208
దొమ్మరాటవాని దోర్బలమెల్లను బొమ్మ కూటికొఱకె పుట్టినదగు నదియె యోగికమర నానందమందడా ? వి. వే.

దొమ్మరాటవాని దోర్బలమెల్లను
బొమ్మ కూటికొఱకె పుట్టినదగు
నదియె యోగికమర
నానందమందడా ? వి. వే.

దొమ్మరి జీవికకొరకు తన నేర్పునంతను చూపును . అట్టి నేర్పు యోగికున్నయెడల సాధన చేసి అతడు బ్రహ్మానందమును అనుభవింపగలడు

A puppeteer performs with skill for livelihood. If a yogi has such a skill then with persistence he can attain bliss.

1209
దోసముల్లువంటి తుర్యమందాత్మను జూచి యాసలనుట స్రుక్కజేసి వాసన తెలిసినవాడెపో బ్రహ్మము , వి. వే.

దోసముల్లువంటి తుర్యమందాత్మను
జూచి యాసలనుట స్రుక్కజేసి
వాసన తెలిసినవాడెపో
బ్రహ్మము , వి. వే.

దోసముల్లువలె అతి సూక్ష్మమగు పరమునందు ఆత్మను చూచి , ఆశల నన్నింటిని నశింపజేసి పరమాత్మయందు ఐక్యము చెందినవాడే పరబ్రహ్మస్వరూపుడు

One who is aware of aatma as subtle as a rose thorn, gives up his desires and merges with the creator, is the embodiment of the creator.

1210
ద్వారబంధమునకు దలుపులు గడియలు వలెనె నోటికొప్పుగల నియతులు ధర్మమెఱిగి పలుక ధన్యు౦డౌ భువిలోన , వి. వే.

ద్వారబంధమునకు దలుపులు గడియలు
వలెనె నోటికొప్పుగల నియతులు
ధర్మమెఱిగి పలుక ధన్యు౦డౌ
భువిలోన , వి. వే.

ద్వారమునకు తలుపులు , గడియలు ఉన్నట్లే మాటకును నియమములు రక్షణలై గలవు . ధర్మమెరిగి తగినట్లు మాటలాడినవాడే ధన్యుడు , ఉత్తముడు నగును

Just as a house is protected with doors and locks, there are restraints on the speech. When one speaks with dharma, he is considered as superior.

1211
నచ్చుసేయరాదు నమ్మి నైక్యమునకు మ్రుచ్చెఱుకను మ్రి౦గి ముదముగాంచి చొచ్చి బయలుదేఱి సొమ్మసిల్లును యోగి, వి. వే.

నచ్చుసేయరాదు నమ్మి నైక్యమునకు
మ్రుచ్చెఱుకను మ్రి౦గి ముదముగాంచి
చొచ్చి బయలుదేఱి సొమ్మసిల్లును
యోగి, వి. వే.

యోగి తాను నమ్మిన జీవేశ్వరైక్యమున సందేహపడడు . అజ్ఞానమును నశింపజేసి , జ్యోతిఃస్వరూపమగు బ్రహ్మమును సందర్శించి తన్మయుడగుచుండును

A yogi is not skeptical about the merger of one with the creator. By removing his ignorance and visualizing the eternal spirit he is blissful.

1212
నయదృష్టి మీఱ నడవడి గుర్తించి భయములేక నొక్కి బయలుపడక స్వయము జ్యోతినంటి సౌభాగ్యమందురా , వి. వే.

నయదృష్టి మీఱ నడవడి గుర్తించి
భయములేక నొక్కి బయలుపడక
స్వయము జ్యోతినంటి సౌభాగ్యమందురా,
వి. వే.

ధృచ్ఛక్తి నుపయోగించి షట్కమలములను గుర్తించి భయములేక స్వయంజ్యోతివంటి మోక్షము పొందుటకు ప్రయత్నింపవలెను

By using the power to see the 6 kamalas without fear, one has to strive to attain salvation that is self-illuminating.

1213
నలుగురు దొంగల బట్టుక తల బట్టగవలయు నొకని దగదండింపన్ వలెనా మువ్వురి దీర్చుమి యిలలోపల నెఱుక ఫలమె యిదియగు వేమా!

నలుగురు దొంగల బట్టుక తల బట్టగవలయు
నొకని దగదండింపన్ వలెనా
మువ్వురి దీర్చుమి యిలలోపల
నెఱుక ఫలమె యిదియగు వేమా!

ధర్మార్ధకామ మోక్షములలో ఒకటియగు మోక్షము గ్రహించి , మిగిలిన ధర్మార్ధకామములను విడిచిపెట్టుటయే జ్ఞానమున్నందుకు తగిన ఫలము

Among the 4 aspects of life : dharma, artha (money), kaama(desire) and moksha (salvation), one has to renounce the first three. It is the deserving fruit of having spiritual knowledge.

1214
నలుగురు దొంగల బట్టుక తల ద్రు౦పకయున్న యట్టి తామసికేలా కలుగును జ్ఞానము ధర నిశ్చల పావన మాత్మసుఖము తత్త్వము వేమా!

నలుగురు దొంగల బట్టుక తల ద్రు౦పకయున్న
యట్టి తామసికేలా కలుగును
జ్ఞానము ధర నిశ్చల పావన
మాత్మసుఖము తత్త్వము వేమా!

ధర్మార్ధ కామమోక్షములను పట్టుకొని వానియందలి కోరిక విడువనివాడు అజ్ఞాని . జ్ఞానము పొందినగాని నిర్వికల్ప సమాధిలో ఆత్మతత్త్వము తెలియదు . ఆత్మసుఖము కలుగదు

An ignorant person is one who clings to kaama (desire) among the purushaartha: dharma, artha (wealth), kaama (desire), moksha(salvation). Without spiritual knowledge there is no deep meditational stage and awareness about aatma.

1215
నాటుము గురువర మంత్రము దీటుగ మదియందు జేర్చి ధీరుడ వగుచున్ దాటుము నినుగను చోటికి గోటికి పడగెత్తనేమి కుదురుర వేమా!

నాటుము గురువర మంత్రము దీటుగ
మదియందు జేర్చి ధీరుడ వగుచున్
దాటుము నినుగను చోటికి గోటికి
పడగెత్తనేమి కుదురుర వేమా!

సంపదల నాసి౦చి కోటికి పడగెత్తవలెనని తలంపక గురువు ఉపదేశించిన మంత్రమును జపించుచు మనస్సును పునశ్చరణ చేయుచు ధైర్యముతో పరతత్త్వ మెరుగుటకు యత్నింపుము

Without seeking wealth, one has to boldly pursue spiritual knowledge by receiving mantra from his guru and meditating over it.

1216
నాడెమైన లంజె నగవుమేలు నెఱుగు విటుని గుస్తరించు వివరమెఱుగు బానిసైన దాని పాటి గోరగరాదు , వి. వే.

నాడెమైన లంజె నగవుమేలు నెఱుగు
విటుని గుస్తరించు వివరమెఱుగు
బానిసైన దాని పాటి
గోరగరాదు , వి. వే.

యువకులను మోసగించు లంజెకత్తె తన నవ్వుతోనే మోహము కలిగించును . మాయోపాయములతో విటుని మోసపుచ్చును . కామమునకు బానిసలగు లంజెలకు లోబడకుము

A prostitute attracts young men with her happy face. She then cheats them. One should not yield to women who are lusting.

1217
నయముగాను దృక్కునాళంబులోనుంచి భయముమాని వట్టి భ్రమలద్రొక్కి స్వయముగాను బుద్ధి సాధించి చూడుము, వి. వే.

నయముగాను దృక్కునాళంబులోనుంచి
భయముమాని వట్టి భ్రమలద్రొక్కి
స్వయముగాను బుద్ధి
సాధించి చూడుము, వి. వే.

లోద్రుష్టిని సూర్యచంద్రాది నాడులనుండి సహస్రారమును చేర్చి భయభ్రాంతులను విడిచి స్వబుద్ధితో సాధన సాగించినయెడల ఆత్మసాక్షాత్కారమును పొందవచ్చును

One can see aatma (soul) by inwardly focusing the vision on the nadi (nerves) and traversing to the head chakra (sahasraaram) without fear and by such meditation.

1218
నరుడెయైన లేక నారాయణుడైన తత్త్వబుద్ధుడైన ధరణి నరయ మరణమున్నదనుచు మదిని నమ్మగవలె , వి. వే.

నరుడెయైన లేక నారాయణుడైన
తత్త్వబుద్ధుడైన ధరణి
నరయ మరణమున్నదనుచు మదిని
నమ్మగవలె , వి. వే.

మానవుడైననేమి , మాధవుడైననేమి , తత్త్వవేత్తయైననేమి , ఎవ్వరైనను సరే , శరీరధారికి మరణము తప్పదని గ్రహింపవలెను

Whether a human, an incarnation of god or a seer, one meets with death without a doubt.

1219
నాడీచక్రము చూడగ నాడులు పది ముఖ్యమెల్ల నాడులలోనన్ గూడ వినాసిక కుడియెడ మూడును నిళపింగళాఖ్యములదగ వేమా!

నాడీచక్రము చూడగ నాడులు పది
ముఖ్యమెల్ల నాడులలోనన్ గూడ
వినాసిక కుడియెడ మూడును
నిళపింగళాఖ్యములదగ వేమా!

నాడీచక్రములో నున్నవానిలో దశవిధ ప్రాణములు ముఖ్యములు . వీని కుండలి నాసిక. అందు ముఖ్యమైనవి ఇడ, పింగళ , సుషుమ్న అనునవి

The 10 praanas are important for one contemplating over the naadi (nerves). The important ones among them are ida, pingala and sushumna.

1220
నాదబిందు కళల నయమొంది యాత్మయందంది చపలచిత్త మమర నిల్పి బ్రహ్మ రంధ్రమునను ప్రబలిన యోగియౌ , వి. వే.

నాదబిందు కళల నయమొంది యాత్మయందంది
చపలచిత్త మమర నిల్పి
బ్రహ్మ రంధ్రమునను ప్రబలిన
యోగియౌ , వి. వే.

నాదబిందుకళల నభ్యసించి , చపలత లేకుండ మనస్సును నిలిపి బ్రహ్యమరంధ్రమున కానవచ్చు జ్యోతిర్మండలమున దృష్టిని లీనము చేసినవాడే యోగి.

By meditating over naada-bindu kalas and without greed, one can see the brahma-randhra. A true yogi is one who can see jyotir-mandala

1221
నాదము బిందువు బిందువు నాదముగా జేసి కళను నాదును బిందున్ నాదుగజేసియు నీ యొక నాదంబును జూచు యోగి నాధుడు వేమా!

నాదము బిందువు బిందువు నాదముగా
జేసి కళను నాదును బిందున్
నాదుగజేసియు నీ యొక నాదంబును
జూచు యోగి నాధుడు వేమా!

మనశ్శాంతితో నాదబిందు కళలను సందర్శించుటేకాక బిందువును నాదముగను , నాదమును బిందువుగను చేసి కళాదులను అనులోమ విలోలమములుగా మార్చుచు , నాదమునందే ముప్పదియెనుమది చిత్కళలను చూచుట యోగికే సాధ్యమగును

With a peaceful mind a person who visualizes naada-bindu-kalas, realizes a bindu is naada and a naada is bindu in ascending and descending orders and discovers the 38 chit-kalas is only possible for a yogi.

1222
నాదమలరజేసి నాదము బొంగించి భేదమింతలేక పెనగినపుడు పాఱు కాల్వవలెను పాఱురా యీ నాదు , వి. వే.

నాదమలరజేసి నాదము బొంగించి
భేదమింతలేక పెనగినపుడు
పాఱు కాల్వవలెను పాఱురా
యీ నాదు , వి. వే.

ప్రాణవాయువుల సంచారము వలన పుట్టు నాదమును ఆలకించుచు , ఆనందించుచు తన్మయతను పొందినయెడల హృదయాకాశమున ఆ ధ్వని విశేషముగా ప్రవహించును

By listening to the naada emanating from the 5 praanas (paana-apaana-vyaana-udaana-samaana) and being blissful, one can enhance its flow in the heart.

1223
నాసికందు దృష్టి నయనించు యోగికి వాసి వన్నెలేల వసుధలోన కాశినాధుడతడె గనుతింపలేరయా, వి. వే.

నాసికందు దృష్టి నయనించు
యోగికి వాసి వన్నెలేల
వసుధలోన కాశినాధుడతడె గనుతింపలేరయా,
వి. వే.

నాసిక చివర దృష్టిని నిల్పి యోగము నభ్యసించు యోగిని గూర్చి చర్చయేల? అతడు సాక్షాత్తుగా శివుడే యగును

There is no discussion about a yogi who can focus his eyes on the tip of his nose. He is Lord Siva by himself.

1224
నాసికాగ్రమందు నయముగా గుఱినిల్పి వాసిగాను జూడ వశ్యమగును గాశికంచుల గన గడగండ్లు పడనేల? వి. వే.

నాసికాగ్రమందు నయముగా గుఱినిల్పి
వాసిగాను జూడ వశ్యమగును
గాశికంచుల గన గడగండ్లు
పడనేల? వి. వే.

చూడ్కిని ముక్కు చివర నిలిపి నిశ్చలముగా చూచినయెడల సమస్త ప్రపంచము కానవచ్చును . ఈ యోగము సిద్ధించినచో కాశికి , కంచికి యాత్రకు పోయి శ్రమపడనక్కరలేదు

By focusing the sight on the tip of nose and remaining steadfast, one can see the whole world. With the attainment of such yoga, there is no need to go on pilgrimage to holy places.

1225
నాసికాగ్రమ౦దు నయమున జేర్చుక మూసి మూయక కనుమూలలందు జూచి చూడ నతడె శుకయోగియగు; దన్ను బాయకున్ననాడె పరము వేమ !

నాసికాగ్రమ౦దు నయమున జేర్చుక
మూసి మూయక కనుమూలలందు జూచి
చూడ నతడె శుకయోగియగు; దన్ను
బాయకున్ననాడె పరము వేమ !

చూపును ముక్కు చివర చేర్చి కనులు సగము మూసి , కనుగొలుకులతో చూచియు చూడనట్లు సర్వమును దర్శించు యోగి శుకయోగియే యనవచ్చును

A true yogi is one who can focus on the tip of his nose, and observe everything around even though it is not apparent.

1226
నివురు గప్పినట్లు నిశ్చలభక్తితో దగిలియుండ ముక్తి తానె వచ్చు , జగతి నొప్పజెప్ప జాణడు లేడయా, వి. వే.

నివురు గప్పినట్లు నిశ్చలభక్తితో
దగిలియుండ ముక్తి తానె
వచ్చు , జగతి నొప్పజెప్ప
జాణడు లేడయా, వి. వే.

తనకు తెలిసిన యోగములను నిశ్చలమైన భక్తితో అభ్యసించును ఆడంబరము లేక నివురుకప్పిన నిప్పువలె నుండువాడు ముక్తిని కాంచును . దీని నందరికిని తెలుపుట అసాధ్యము

One who practices the yoga knows with steadfast devotion and without fanfare like a burning coal covered by ash, will attain salvation.

1227
నిజగురు లక్ష్యం బుంచక యజపాది క్రియల మీఱి యలమటపడకే నిజవిమలాంత స్స౦దిన సుజనుని నెన్న౦గదరమె సూటిగ వేమా!

నిజగురు లక్ష్యం బుంచక యజపాది
క్రియల మీఱి యలమటపడకే నిజవిమలాంత
స్స౦దిన సుజనుని
నెన్న౦గదరమె సూటిగ వేమా!

గురువు ఉపదేశించిన మార్గమున పోవుచు , భక్తితో తికమక పడక హృదయమందలి బ్రహ్మస్వరూపము నెరిగినవాడు ధన్యుడు

One who follows the path taught by his guru, not confused by his devotion and realizes the creator in his heart, is holy.

1228
నిటల దుర్గములో నున్న నిజమెఱింగి పటుతరంబుగ మదినిల్పి ప్రబల యోగి యంటి ముట్టును నిర్గుణంబట్టె మదిని గెంటువాడదెప్డు తెలియు నీకిటుకు వేమ!

నిటల దుర్గములో నున్న నిజమెఱింగి పటుతరంబుగ
మదినిల్పి ప్రబల యోగి యంటి
ముట్టును నిర్గుణంబట్టె మదిని గెంటువాడదెప్డు
తెలియు నీకిటుకు వేమ!

భ్రూమధ్యమున దృష్టిని ప్రసరింపజేసి , విషయములనుండి మనస్సును మళ్ళించి నిలిపిన యోగికి నిర్గుణస్వరూపమబ్బును . ఈ రహస్య మెరుగుట కష్టము

By focusing the vision between eye-brows, turning the mind away from worldly things, a yogi can over-come the 3 gunas (sattva-calm, rajas-active, tamas-indolence).

1229
నిటల దుర్గమెక్కి నిక్కి చూడంగనె కుటిల రూపకళల గూల్చు నెఱుక పటుతరంబుగాను బట్టి సాధింపుడు , వి. వే.

నిటల దుర్గమెక్కి నిక్కి చూడంగనె
కుటిల రూపకళల గూల్చు
నెఱుక పటుతరంబుగాను బట్టి
సాధింపుడు , వి. వే.

కనుబొమల నడుమ చూపును సారించినపుడు వికార దృశ్యములు కానవచ్చును . చూపును నిలిపి వానిని జ్ఞానముచే సాధించిననే గాని ఫలితము లభించదు

When one focuses his eyes between eye-brows, in the beginning, he experiences strange images. One has to over-come them with spiritual knowledge.

1230
నిద్రలోని నిద్ర నిజముగా దెలిసిన భద్రమగును మిగులు బ్రహ్మవిద్య నిద్ర తెలియువాడు నిర్మలయోగిరా, వి. వే.

నిద్రలోని నిద్ర నిజముగా దెలిసిన
భద్రమగును మిగులు బ్రహ్మవిద్య
నిద్ర తెలియువాడు
నిర్మలయోగిరా, వి. వే.

సమాధిలో మనోవికారములంటవు . సమాధియే నిద్ర . అందు అచంచలుడవగుదువేని బ్రహ్మము సాక్షాత్కరించును . ఆ సమాధి నెరిగినవాడే నిజమగు యోగి

In Samaadhi one has no thoughts. It is deep sleep. If one is able to achieve it without distractions, one can see the creator. A true yogi is one who knows about samaadhi.

1231
నిద్రలోన మనసు నిలుపుచు లోకముల్ భద్రముగను జూపి భ్రమయజేసి పొత్తు విడువకుండు పొసగగ నీలోన , వి. వే.

నిద్రలోన మనసు నిలుపుచు లోకముల్
భద్రముగను జూపి భ్రమయజేసి
పొత్తు విడువకుండు
పొసగగ నీలోన , వి. వే.

మనస్సును సమాధిలో మగ్నము కావించుచు స్వల్ప వికారములకు లోబడక సంకల్పము సిద్ధించువరకు సమాధి సంబంధము విడువకున్నచో కోరిక సిద్ధించును

One who attains samaadhi (deep meditative state), does not react to distractions and remains in it for as long as he is desirous. Thus, he will fulfill his wish.

1232
నెనరుగలుగ గురుడు నిటల దుర్గము జూపు గనుల చూడ్కి మఱుగు గవయజూపు జెనకి యాత్మరూపు చేసేత జూపురా, వి. వే.

నెనరుగలుగ గురుడు నిటల దుర్గము
జూపు గనుల చూడ్కి మఱుగు
గవయజూపు జెనకి యాత్మరూపు
చేసేత జూపురా, వి. వే.

వాత్సల్యముగల గురువు చూపును లలాటమున చేర్చు విధము, చూపును అంతస్సును ప్రవేశింపజేయు రీతినేగాక అజ్ఞానము పోగొట్టి ఆత్మ స్వరూపామునుకూడ చూపును

A friendly guru will show how to focus between eye-brows besides removing ignorance and realizing aatma (soul)

1233
పంచ తత్త్వఫలము భావించి కడమించి కొంచెమైన మదిని గోలుపోక యెంచి మించువాడ యేర్పడ్డ యోగిరా , వి. వే.

పంచ తత్త్వఫలము భావించి కడమించి
కొంచెమైన మదిని గోలుపోక
యెంచి మించువాడ యేర్పడ్డ
యోగిరా , వి. వే.

తత్త్వపంచకమును గుర్తించి , ఫలమెరిగి , మనోవికారములకు లోబడక ఆత్మస్వరూపామును గుర్తెరిగినవాడే నిజమైన యోగి

A true yogi is one who attains spiritual knowledge, knows about its fruit, transcends distractions from mind, and can see the aatma (soul)

1234
పచ్చజూచువారు పచ్చ మెచ్చెడువారు పచ్చమీద వాంఛపడినవారు పచ్చ విడుచువాని బ్రభునిగా జూతురు, వి. వే.

పచ్చజూచువారు పచ్చ మెచ్చెడువారు
పచ్చమీద వాంఛపడినవారు
పచ్చ విడుచువాని బ్రభునిగా
జూతురు, వి. వే.

రత్నములలో విలువైనది పచ్చ . అట్టి పచ్చను చూచి సంతసించువారు , దానిని కోరువారు మిక్కిలి మూర్ఖులు . దానిపై ఆశను విడిచి పచ్చను తృణముగా చూచువాడే యోగులలో మిక్కిలి ఉత్తముడు

Foolish people are desirous of precious stones. A true yogi is one who is not desirous of such fantasies and treats them like a blade of grass.

1235
పంచభూతములను నెంచుచు మదిలోన మించి యందవలెను మిత్తి గొంగ నంచు దెలియువాడె యఖిలజ్ఞుడగు యోగి, వి. వే.

పంచభూతములను నెంచుచు మదిలోన
మించి యందవలెను మిత్తి
గొంగ నంచు దెలియువాడె యఖిలజ్ఞుడగు
యోగి, వి. వే.

పంచభూతములను చర్చించుచు మనస్సు నీశ్వరునిపై లగ్నము చేయువాడే సర్వజ్ఞుడు . అట్టి వివేకి యోగీశ్వరుడనబడును

By contemplating over 5 elements (earth, sky, water, fire, air) and focusing the mind on Lord Siva one becomes omnipotent. Such a person is the king of yogis.

1236
పట్టువిడక లోనిగుట్టును గమనించి ముట్టుటదియె యెఱుకమూల మగును బట్టబయలునందు బాటింప నెఱుకేది ? వి. వే.

పట్టువిడక లోనిగుట్టును గమనించి
ముట్టుటదియె యెఱుకమూల
మగును బట్టబయలునందు బాటింప
నెఱుకేది ? వి. వే.

పట్టుదల విడువక యోగాభ్యాసము చేసి బ్రహ్మ స్వరూపామును గుర్తింపగలుగుటయే జ్ఞానము. కేవల మహదాకాశమును చూచుచున్నచో జ్ఞానమువల్ల ప్రయోజనము కలుగదు

Pursuing yoga with determination and recognizing the creator is the true knowledge. There is no use of knowledge that can only feel the infinite space.

1237
పండువలన బుట్టె బరగ ప్రపంచము పండువలన బుట్టె పరము నిహము పండు మేలెఱింగె బ్రహ్లాదుడిలలోన , వి. వే.

పండువలన బుట్టె బరగ ప్రపంచము
పండువలన బుట్టె పరము
నిహము పండు మేలెఱింగె బ్రహ్లాదుడిలలోన,
వి. వే.

ప్రకృతివలన భగవంతుడు , వానివలన ఇహ పరలోకములు జనించినవి . ప్రపంచమును నిర్మించిన దేవుని గొప్పతనమును పరమభక్తుడగు ప్రహ్లాదుడే యెరుగును

God was born from prakriti (nature). From God came the various worlds. The great devotee Prahlada knows the greatness of God.

1238
పతగ మితరజంతు వితతికంతకు మేటి యగునె ఱెక్కలుండి యెగుఱకున్న వట్టి యోగి యిట్టి వైఖరివాడయా, వి. వే.

పతగ మితరజంతు వితతికంతకు
మేటి యగునె ఱెక్కలుండి యెగుఱకున్న
వట్టి యోగి యిట్టి
వైఖరివాడయా, వి. వే.

రెక్కలున్నను ఎగురలేకున్నచో తక్కిన జంగములలో పక్షి గొప్పయేమి? అట్లే యోగరహస్య మెరుగకున్నచో యోగికూడ సామాన్య జనునివంటివాడే యగును

Where is the superiority of a bird if it can't fly despite having wings? A yogi is ordinary if he does not know the secret knowledge about yoga.

1239
పతనమందునట్టి పక్వఫలంబును బట్టి తినగలాడు ; పచ్చికాయ కాసపడని రీతి నైహికముండును , వి. వే.

పతనమందునట్టి పక్వఫలంబును
బట్టి తినగలాడు ; పచ్చికాయ
కాసపడని రీతి నైహికముండును,
వి. వే.

జనులు బాగుగా పండి నేలబడిన పండు తిందురుగాని పచ్చికాయలు తినరు . అట్లే యోగి ఐహికముల నాశి౦పడు

People eat ripe fruit only but not the raw ones. Similarly a true yogi is not desirous of worldly pleasures.

1240
పతిని విడువరాదు పదివేలకైనను బెట్టి చెప్పరాదు పెద్దకైన పతిని తిట్టరాదు సతి రూపవతియైన, వి. వే.

పతిని విడువరాదు పదివేలకైనను
బెట్టి చెప్పరాదు పెద్దకైన
పతిని తిట్టరాదు సతి
రూపవతియైన, వి. వే.

భార్య ఎంత అందకత్తెయైనను భర్తను వీడరాదు . అతనిని తప్పున్నను నిందింపరాదు . ఇతరులకేమైన పెట్టినను నలుగురిలోను చాటుకొనరాదు

No matter how beautiful a woman is, she should not leave her husband. She should not curse him even if he erred. She should not exaggerate her charity.

1241
పరమ పదవి గోరు భక్తు౦డు నిత్యము రాజు కోరుచుండు రణజయంబు మూర్ఖుడెపుడు కోరు ముదితలతో బొందు , వి. వే.

పరమ పదవి గోరు భక్తు౦డు నిత్యము
రాజు కోరుచుండు రణజయంబు
మూర్ఖుడెపుడు కోరు ముదితలతో
బొందు , వి. వే.

భక్తుడెప్పుడును దేవుని పరమపదము కోరును . రాజు యుద్ధమున విజయమునే కోరును. మూర్ఖుడు స్త్రీల పొందునే కోరుచుండును

A devotee aspires for God's blessing. A king wants victory in a war. A foolish person lusts for women.

1242
పవలు రేయు జూడ భావంబు లోపల తాను నేన టనెడి తలపు మఱచి యున్నయట్టి యతడె యుత్తమ యోగిరా, వి. వే.

పవలు రేయు జూడ భావంబు లోపల
తాను నేన టనెడి తలపు
మఱచి యున్నయట్టి యతడె యుత్తమ
యోగిరా, వి. వే.

రాత్రింబవళ్ళు అను భేదము చూపక జీవమును ఆత్మను ఏకముగా తలచియున్నవాడే - నేనే వాడనుకొనువాడే నిజమైన యోగి

Without making a distinction between day and night, one who sees the unification of life and aatma (soul) and realizes that he is same as the creator, is a true yogi.

1243
పాద పాయువులను పరగ దేహము మోయ దేహి జీవములను దెలియ మోయు ధరణి వీని రెంటి దానేల మోయునో ? వి. వే.

పాద పాయువులను పరగ దేహము
మోయ దేహి జీవములను దెలియ
మోయు ధరణి వీని రెంటి దానేల
మోయునో ? వి. వే.

పాద, పాయువులను దేహము మోయును . దేహమును ప్రాణము మోయుచున్నది . దేహ ప్రాణములను జీవాత్మ ఏల మోయుచున్నదో తెలియకున్నది

One's body is supported by organs like feet and praana. It is not apparent how the life is being carried out by the body and praana.

1244
పితృ పతికిని జిక్కి పెనుత్రోవ గానక వెతల జిక్కువాడు వెఱ్ఱివాడు సతుల వాలల జిక్కి సంతాప పడనేల ? వి. వే.

పితృ పతికిని జిక్కి పెనుత్రోవ
గానక వెతల జిక్కువాడు
వెఱ్ఱివాడు సతుల వాలల జిక్కి
సంతాప పడనేల ? వి. వే.

యముని బారినపడి నరకబాధలు పొందువాడు మూఢుడు . స్త్రీల వలలకు చిక్కకున్నచో నరునికెట్టి బాధలు ఉండవు

A foolish person suffers in hell. Without falling for the women, a man overcomes travail.

1245
పిల్లి ఎలుకబట్టు ప్రియమున నుండగ నదియె కోడిబట్ట ననుగమించు మమత విడువకున్న మానునా మోహంబు , వి. వే.

పిల్లి ఎలుకబట్టు ప్రియమున
నుండగ నదియె కోడిబట్ట ననుగమించు
మమత విడువకున్న మానునా
మోహంబు , వి. వే.

పిల్లి యెలుకనుబట్టి తృప్తిపడక , కోడి కానవచ్చిన దానిని కూడ పట్టబోవును . మామకారమునకు అంతములేదు . అది మోహమును వృద్ధిపరుచును

A cat not satisfied after capturing a mouse will go after a hen when it sees one. There is no end to bondage. It multiplies desire.

1246
పుట్టిన జనులెల్ల భూమిపై మనియున్న పుట్టునే జగములు పట్టవెపుడు యముని లెక్క హెచ్చు నవల తగ్గుచునుండు , వి. వే.

పుట్టిన జనులెల్ల భూమిపై మనియున్న
పుట్టునే జగములు పట్టవెపుడు
యముని లెక్క హెచ్చు నవల
తగ్గుచునుండు , వి. వే.

పుట్టినవారు చావకయేయున్న లోకములు పట్టవు . జనన మరణములనుబట్టియే యముని లెక్కలు హెచ్చుచు , తగ్గుచు నుండును

If no one dies, there will be no place to live in this world. The lord of death keeps track of number of births and deaths.

1247
పుట్టినది మొదలుగ పురుషుడే కాలంబు పాపమెఱిగి శుద్ధ పశువుగాక ముదిసి యోగికరణి ముదమొప్ప గావలె , వి. వే.

పుట్టినది మొదలుగ పురుషుడే
కాలంబు పాపమెఱిగి శుద్ధ పశువుగాక
ముదిసి యోగికరణి ముదమొప్ప
గావలె , వి. వే.

నరుడు పుట్టిన దాది ఏ పాపము చేయక , అజ్ఞానమున పడక , వృద్ధుడైన పిదప యోగిరీతినుండి ఆనందమును పొందవలెను

A man should commit no sin and not be ignorant and revel in yoga during old age.

1248
పుట్టు దుఃఖమునను బొరలు దుఃఖమునను గిట్టు దుఃఖమునను గ్రి౦దుపడును మనుజు దుఃఖమువలె మఱిలేదు దుఃఖంబు , వి. వే.

పుట్టు దుఃఖమునను బొరలు దుఃఖమునను
గిట్టు దుఃఖమునను గ్రి౦దుపడును
మనుజు దుఃఖమువలె మఱిలేదు
దుఃఖంబు , వి. వే.

దుఃఖముతో పుట్టి , దుఃఖముతో పెరిగి , దుఃఖముతోనే చచ్చు నరుని దుఃఖముతో ఇతర దుఃఖమేదియు సాటికాదు

No other sorrow is greater than a man born in sorrow, brought up by sadness and dying in grief.

1249
పుట్టు బ్రహ్మలైదు పుడమిని నడుపగా చేత బ్రాహ్మడేల శ్రేష్ఠమగును? ఏల విగ్రహముల ఎత్తుకో దినుటకా , వి. వే.

పుట్టు బ్రహ్మలైదు పుడమిని
నడుపగా చేత బ్రాహ్మడేల శ్రేష్ఠమగును?
ఏల విగ్రహముల ఎత్తుకో
దినుటకా , వి. వే.

ఈశ్వరాజ్ఞచే పంచభూతమయ ప్రపంచము నడుచుచుండుగా విగ్రహముల నేల పూజింపవలెను ? బ్రహ్మయే ప్రపంచమును నడుపుచుండగా బ్రాహ్మణుడెట్లు గొప్పవాడగును ?

When under the command of Lord Siva the creation is operating, why should people worship idols? When the creator is running the world why should the priestly brahmins be considered superior?

1250
పుడమి యుప్పరంబు బురికొనె జగముల రక్ష చేయగల్గు రాజు లెవరు ? మహిపతి యనుపేరు మనుజున కేడదో ? వి. వే.

పుడమి యుప్పరంబు బురికొనె
జగముల రక్ష చేయగల్గు రాజు
లెవరు ? మహిపతి యనుపేరు
మనుజున కేడదో ? వి. వే.

భూమ్యాకాశములతో నిండి విశాలమైన యీ ప్రపంచము నేలు రాజు దేవుడే! మానవమాత్రుడు రాజనుట పొసగదు

A king is a god because he is taking care of the kingdom wrapped between the sky and the earth. A common man should not claim to be a king.

1251
పువ్వుచన్నుగలుగు భూమెల్ల వెలసేయు కొదమ చన్నులుగన కోటి సేయు కొదమ చన్నులుగన దయ్యాలు నొల్లవు , వి. వే.

పువ్వుచన్నుగలుగు భూమెల్ల
వెలసేయు కొదమ చన్నులుగన కోటి
సేయు కొదమ చన్నులుగన దయ్యాలు
నొల్లవు , వి. వే.

విటుడు పూగుత్తులవంటి యువతి చన్నులకు భూమినే వెలకట్టును . గబ్బి చన్నలకు కోటి రూకలు వెలకట్టును . వాలు చన్నులు విలువలేనివి . వానిని దయ్యములుకూడ వొల్లవు

A john will offer land for the bosom of a woman that resembles flowers. He will offer millions for a big bosom. He will not offer anything for others.

1252

తాను పెట్టకున్నను , ఇతరులు పెట్టునపుడు అడ్డు పడకుండుట పెండ్లి చేసినంత గొప్ప ఫలము నిచ్చును

A man who does not prevent others from giving alms when he can't do the same receives the blessing of performing a marriage.

1253
ప్రాణులందు శివుని భావింపనేఱక యోగమందురేల నోగులార యోగమందు గలదె భోగమందున్నట్లు ? వి. వే.

ప్రాణులందు శివుని భావింపనేఱక
యోగమందురేల నోగులార
యోగమందు గలదె భోగమందున్నట్లు?
వి. వే.

మూర్ఖులారా! ప్రాణులలోని దేవుని ధ్యానింపలేక యోగము కావలెనని అందురేల! భోగముల ననుభవించుచునే ముక్తిని పొందు అవకాశము మీకున్నది కదా

Foolish people crave for yoga without realizing the god among the living beings. There is an opportunity to enjoy the luxuries of life while trying for salvation.

1254
పృధివిబుట్టె మొలక పృధివిలో గలసెను మఱల నదియె పుట్టు మగడె సుతుడు ధరణి జనులకెల్ల తల్లియౌ బె౦డ్లము , వి. వే.

పృధివిబుట్టె మొలక పృధివిలో
గలసెను మఱల నదియె పుట్టు మగడె
సుతుడు ధరణి జనులకెల్ల తల్లియౌ
బె౦డ్లము , వి. వే.

పృధివీ, బీజస్వరూపులగు స్త్రీపురుషులు తొలుత పుట్టిరి . క్రమముగ ప్రజాసృష్టి వృద్ధియయ్యెను . తండ్రియే పుత్రుడుగా జనించును . కాన పురుషునకు భార్యయే తల్లి అగుచున్నది

Earth, man and woman were born first. Gradually the creation expanded. A father will be born as a son. A wife can become one's mother.

1255
బడుగు నెఱుగలేని ప్రాభవం బదియేల? యోగ మెఱుగలేని యోగియేల? వ్యాధి నెఱుగలేని వైద్యుడు నేలయా! వి. వే.

బడుగు నెఱుగలేని ప్రాభవం బదియేల?
యోగ మెఱుగలేని యోగియేల?
వ్యాధి నెఱుగలేని వైద్యుడు
నేలయా! వి. వే.

దీనులను గుర్తెరుగనివారి అధికార మెందుకు ? అట్లే యోగ మెరుగని యోగి, రోగమెరుగని వైద్యుడు వ్యర్థులు

A person should not be in a powerful position if he cannot help desperate people. Similarly a yogi without true knowledge about yoga and a doctor who cannot diagnose are useless .

1256
బాల్యమందు శివుని బరికింపగా లేరు యౌవనంబునందు నరయలేరు ముదిమియందుగూడ మోసమేకందురు , వి. వే.

బాల్యమందు శివుని బరికింపగా
లేరు యౌవనంబునందు నరయలేరు
ముదిమియందుగూడ మోసమేకందురు,
వి. వే.

చిన్నపుడే దేవుని తెలిసికొననివారు యౌవనమున తెలిసికోలేరు . ముసలితనమున అంతకంటెను తెలిసికొనజాలరు

If one does not pray to god at a young age, he will not pray to him in youth or in old age.

1257
బిగియు దృష్టినెపుడు బింబమందు౦చిన మననమందు నెఱుక మగ్నమగును లగ్నచిత్త మమర రక్షించుచుండురా, వి. వే.

బిగియు దృష్టినెపుడు బింబమందు౦చిన
మననమందు నెఱుక మగ్నమగును
లగ్నచిత్త మమర రక్షించుచుండురా,
వి. వే.

దృష్టిని చిక్కబట్టి మననము చేసినప్పుడే జ్ఞానము లభించును . మనస్సున జ్ఞానము స్థిరముగా హత్తుకొన్నచో కోరిక నెరవేరును . కాన మననము ముఖ్యము

By focusing the mind and meditating knowledge can be attained. If the knowledge is deep-rooted one can attain his desires. Hence meditation is important.

1258
బిందునాదుచేసి ప్రియమొప్పగా నల్ల నాదుబిందుచేసి నయముగాను బిందునాదునందు భేదించి చూడుము , వి. వే.

బిందునాదుచేసి ప్రియమొప్పగా
నల్ల నాదుబిందుచేసి నయముగాను
బిందునాదునందు భేదించి
చూడుము , వి. వే.

ప్రణవమును ఉచ్చరించుచు , అందే మనస్సును నిలిపి నాదబిందు మధ్యమును పరిశీలింపవలెను

By reciting “aum”, focusing mind on it one has to inspect the middle of naada-bindu.

1259
బుద్ధియుతునకేల పొసగని సఖ్యము కార్యవాదికేల కడు చలంబు కుత్సితునకు నేల గురుదేవభక్తి? వి. వే.

బుద్ధియుతునకేల పొసగని సఖ్యము
కార్యవాదికేల కడు
చలంబు కుత్సితునకు నేల గురుదేవభక్తి?
వి. వే.

బుద్ధిమంతునికి కుదరని స్నేహము , కార్యవాదికి పట్టుదల, కుత్సితునకు గురువుయెడ భక్తి ఉండవు

A man of character will always receive friendship and one with determination will reach his goal. A low life has no devotion towards his guru.

1260
బూటకంబుచేత బుడమిలో నొకకొన్ని నాటకంబు లాడి నయముచూపి దీటులేక తాము తిరుగుచునుందురు , వి. వే.

బూటకంబుచేత బుడమిలో నొకకొన్ని
నాటకంబు లాడి నయముచూపి
దీటులేక తాము తిరుగుచునుందురు,
వి. వే.

మూర్ఖులు కపటనాటకము లాడుచు , లోకులను మోసగించుచు , తమ కెదురులేదని గర్వించి తిరుగుదురు . వారు బయటికి యోగ్యులవలెనే కానవత్తురు

Foolish people perform dirty tricks, cheat people and are proud that no one can oppose them. They appear to be good on the outside.

1261
బూదిపూతలెన్న బుజముల పొంకాలు వ్రాలు లింగములును వరుస మతము లిక్కడ తగుగాక యెక్కడ తగునట్లు ? వి. వే.

బూదిపూతలెన్న బుజముల పొంకాలు
వ్రాలు లింగములును వరుస
మతము లిక్కడ తగుగాక యెక్కడ
తగునట్లు ? వి. వే.

బూడిదెపూతలు , భుజాములపై ముద్రలు , మెడలో లింగములు లోకులను వంచించుటకై ఉపయోగించును . ఇవి మోక్షసాధనము లెంతమాత్రము కావు

Covering body with ash, wearing symbols on shoulders, hanging phallic symbols around necks is done to cheat people. They are not the means to attain salvation.

1262
బేసికంటివాని బెంపార మదిజేర్చి పూజ చేయవలెను బుద్ధినిలిపి ఆత్మ పూజకంటె నదనంబు లేదయా , వి. వే.

బేసికంటివాని బెంపార మదిజేర్చి
పూజ చేయవలెను బుద్ధినిలిపి
ఆత్మ పూజకంటె నదనంబు
లేదయా , వి. వే.

శివుని సర్వదా మనస్సున నిలిపి పూజించవలెను . ఆత్మ పూజకంటె మేలైన పూజలేదు

One has to pray to Lord Siva always in the mind. There is no greater pooja than the one performed within.

1263
బొంది యెవరి సొమ్ము పోషింపబలుమారు ప్రాణ మెవరి సొమ్ము భక్తిసేయ ధనమదెవరిసొమ్ము ధర్మమె తన సొమ్ము , వి. వే.

బొంది యెవరి సొమ్ము పోషింపబలుమారు
ప్రాణ మెవరి సొమ్ము
భక్తిసేయ ధనమదెవరిసొమ్ము ధర్మమె
తన సొమ్ము , వి. వే.

ఎన్నో విధముల పోషించు ఈ శరీరము శాశ్వతము కాదు. ప్రాణము నిలుచునది కాదు . ధనము నిత్యము కాదు . చేసిన ధర్మమే శాశ్వతమైనది . కాన ధర్మబుద్ధి కలిగి యుండవలెను

One's body is not permanent. The praana(life) will end at one time. Wealth is evanescent. Only dharma is permanent. So one has to have the dharma outlook.

1264
బొమ్మలాటవాడు బొమ్మలనాడించు భువిని జనులు చూడ బొలుపుమీఱ దాను మఱిగియుండి దైవము నాడించు , వి. వే.

బొమ్మలాటవాడు బొమ్మలనాడించు
భువిని జనులు చూడ బొలుపుమీఱ
దాను మఱిగియుండి దైవము
నాడించు , వి. వే.

బొమ్మలాటవాడు తనకు తోచిన రీతిని బొమ్మల నాడించగా జనులు సంతోషముతో చూచుచుందురు . భగవంతుడారీతిని జనులు లాడించును .

People watch in glee when a puppeteer puts on a show with his puppets. The god is like a puppeteer and toys with people.

1265
బొమల నడుమ గుర్తు బొందింప జాలక విమల దృష్టి మదిని వెలుగబోదు తమము తీరినంత తత్త్వంబు తానగు , వి. వే.

బొమల నడుమ గుర్తు బొందింప
జాలక విమల దృష్టి మదిని వెలుగబోదు
తమము తీరినంత తత్త్వంబు
తానగు , వి. వే.

కనుబొమల నడుమ దృష్టిని నిల్పనిదే యోగదృష్టి కుదిరి జ్యోతిర్మయమగు తత్త్వము అజ్ఞానము పోయి తెలియదు .

Unless one can focus his eyes between eye-brows, there is no salvation and spiritual knowledge to dispel ignorance.

1266
బొంది నమ్మి బోషి౦చి పలుమాఱు ప్రాణి విడుచుటెల్ల బాతకంటె తనదులోన భక్తి దనరుటే మోక్షము , వి. వే.

బొంది నమ్మి బోషి౦చి పలుమాఱు
ప్రాణి విడుచుటెల్ల బాతకంటె
తనదులోన భక్తి దనరుటే
మోక్షము , వి. వే.

ఈ శరీరమును నమ్మి బాగుగా పోషించి - పిదప ఉపవాసములచే శుష్కింప జేసికొని మరణించుట పాపము . హృదయమున భక్తిని నిలిపిన ముక్తి లభింపగలదు

It is a sin for taking care of the body, and then denying it by fasting, and ending up dead. One can attain salvation by fixing devotion in mind.

1267
బోడితలల జడల బూడిద పూటలా భాషణాసనముల వేషములను యోగులైరె లోన బాగు గాకుండిన , వి. వే.

బోడితలల జడల బూడిద పూటలా
భాషణాసనముల వేషములను
యోగులైరె లోన బాగు
గాకుండిన , వి. వే.

మనస్సు పరిశుద్ధముగా లేని యోగి తలలు గొరిగించుకొని , బూడిద పూసికొని , వేదాంతపు మాటలు పలుకుచు ఎన్ని వేషములు వేసినను ప్రయోజనము లేదు

A yogi with an impure heart has no use even if he tonsures his head, smears ash over his body and quotes veda in his speeches.

1268
బ్రతుకు నిత్యమనుచు బదరుచు వగమీఱ విఱ్ఱవీగువాడు వెఱ్ఱివాడు ప్రాణులెల్ల యముని బారికి గొఱ్ఱెలు , వి. వే.

బ్రతుకు నిత్యమనుచు బదరుచు
వగమీఱ విఱ్ఱవీగువాడు వెఱ్ఱివాడు
ప్రాణులెల్ల యముని బారికి
గొఱ్ఱెలు , వి. వే.

ఈ జీవితము శాశ్వతమని భ్రాంతిపడి గర్వించి తిరుగువాడు మూర్ఖుడు . జీవులందరును ఎప్పుడో ఒకప్పుడు చావవలసినదేయని తెలిసికొనవలెను

A foolish person is one who thinks the life is permanent.

1269
బ్రహ్మమనగ నెటనొ పరదేశమున లేదు బ్రహ్మమనగ దానె బట్టబయలు తన్నుదా నెఱిగిన దానెపో బ్రహ్మంబు , వి. వే.

బ్రహ్మమనగ నెటనొ పరదేశమున
లేదు బ్రహ్మమనగ దానె బట్టబయలు
తన్నుదా నెఱిగిన దానెపో
బ్రహ్మంబు , వి. వే.

బ్రహ్మము వేరేలేదు . తానే బ్రహ్మమని తెలిసి , దానిని సాధనరూపాముగ నిశ్చయించుకొని తృప్తిపొందవలెను

The creator is not apart from us. One will be satisfied by realizing that he is same as the creator and decides to meditate on it.

1270
బ్రహ్మమేడ ననుచు బాలుమాఱు నాడేరు వెఱ్ఱిమూర్ఖ జనులు విధముచూడ బ్రహ్మ మన్నిట దగు పరిపూర్ణమై యుండ, వి. వే.

బ్రహ్మమేడ ననుచు బాలుమాఱు నాడేరు
వెఱ్ఱిమూర్ఖ జనులు విధముచూడ
బ్రహ్మ మన్నిట దగు పరిపూర్ణమై
యుండ, వి. వే.

మూర్ఖులు బ్రహ్మమెక్కడ నున్నదని పలుమారు తర్కి౦తురు . అది పరిపూర్ణమై సర్వత్ర వ్యాపించి యుండును

Foolish people argue over the location of the creator. He is everywhere.

1271
బ్రహ్మఘటము మేను ప్రాణంబు తగగాలి మిత్రచంద్ర శిఖులు నేత్రచయము మరియు బ్రహ్మమనగ మహిమీద లేదయా, వి. వే.

బ్రహ్మఘటము మేను ప్రాణంబు
తగగాలి మిత్రచంద్ర శిఖులు
నేత్రచయము మరియు బ్రహ్మమనగ
మహిమీద లేదయా, వి. వే.

బ్రహ్మము వేరుగా లేదు . మానవదేహము బ్రహ్మస్వరూపము , వాయువే ప్రాణము , సూర్యచంద్రాగ్నులే నేత్రములు . మానవుడే బ్రహ్మమని సాధనవలన తెలిసికొనవలెను

There is no creator apart from us. A human body is an embodiment of the creator. Air is praana. The sun and the moon are the eyes. One has to learn from practice that a man is same as the creator.

1272
యోగిననుచు గొంత యోగము గూర్చక జగమునెల్ల బట్టి చంపి తినుచు ధనము కొఱకు వాడు తగవాడుచుండిన యోగికాడు వాడె యోగు వేమ!

యోగిననుచు గొంత యోగము గూర్చక
జగమునెల్ల బట్టి చంపి తినుచు
ధనము కొఱకు వాడు తగవాడుచుండిన
యోగికాడు వాడె యోగు వేమ!

తాను యోగినని పేరుపెట్టుకొని లోకులను పీకికొని తినువాడు యోగి కానేకాదు . కాని ఓగు - అనగా పనికిమాలినవాడు మాత్రమగును

A person who exploits men by calling himself a yogi is not a real yogi. He is useless for anyone.

No comments:

Post a Comment