Sunday, February 9, 2020

Vemana-Daambhika


92
అల్ల బోడి తలలు తెల్లని గొంగళ్లు ఒడల బూతి పూసి యుందురెపుడు ఇట్టి వేషములు ఇల పొట్టకూటికె సుమీ , వి. వే.

అల్ల బోడి తలలు తెల్లని గొంగళ్లు
ఒడల బూతి పూసి యుందురెపుడు
ఇట్టి వేషములు ఇల పొట్టకూటికె
సుమీ , వి. వే

కొందరు తలలు గొరిగించికొని , తెల్ల కంబళ్ళు కప్పుకొని విభూది పూసికొని భక్తులవలె నటి౦తురు . ఇట్టి వేషములు తిండి కొరకే . వారు నిజమైన భక్తులు కారు .

Some people tonsure their heads, cover themselves with white blankets and smear ash all over the body. All of these disguises are for livelihood. They are not real devotees.

93
అక్షమాల పూని అలసట చెందక కుక్షి నింపుకొనుట కొదువగాదు పక్షి కొంగ రీతి పైచూపు లేదొకో , వి. వే.

అక్షమాల పూని అలసట చెందక
కుక్షి నింపుకొనుట కొదువగాదు
పక్షి కొంగ రీతి పైచూపు
లేదొకో , వి. వే

చేపలను తినుటకు కొంగ మీదుగా చూచుచు జపము చేయు రీతిని ఉన్నట్లు, కొందరు జపమాల ధరించి జపమును ఎడతెగక చేయుచున్నట్లు ఉండుట కేవలము తమ పొట్టల కొరకే గాని వేరుకాదు .

A crane is known to put its head to hide among feathers as though it is doing meditation. This is to fool their prey like fish. Similarly, some people carry a rosary fooling people for the sake of livelihood.

94
అక్షరాశి వెంట అడవుల వెంటను కొండరాల గోడు గుడువనేల? హృదయమందు శివుడు ఉండుట తెలియదా? వి. వే.

అక్షరాశి వెంట అడవుల వెంటను
కొండరాల గోడు గుడువనేల?
హృదయమందు శివుడు
ఉండుట తెలియదా? వి. వే

కొందరు తమలోనే భగవంతుడు ఉన్నాడని తెలిసికొనలేక అతనికై జపము చేయుచు , అడవులకు పోవుచు , కొండ లెక్కుచు నానా కష్టములు పడెదరు . అది వ్యర్థము .

Some people without realizing that God is within themselves, pray for him, roam around forests and climb mountains and suffer as a result. This is not the right way.

95
ఆకటికి తొలగు ఆచార విధులెల్ల చీకటికి తొలగు చిత్తశుద్ధి వేకటికి తొలగు వెనుకటి బిగియెల్ల , వి. వే.

ఆకటికి తొలగు ఆచార విధులెల్ల
చీకటికి తొలగు చిత్తశుద్ధి
వేకటికి తొలగు వెనుకటి
బిగియెల్ల , వి. వే.

గర్భిణికి వెనుకటి మేను బిగువు పోవునట్లు దాంభికునకు ఆకలి వేసినప్పుడు ఆచారములు ఉండవు . రాత్రి పడగా మనస్సు చలించి స్త్రీపై అభిలాష కలుగును.

A pompous person does not do any rituals when hungry just as a pregnant woman loses her former charm. He fondly seeks a woman when at night.

96
ఆకులెల్ల తిన్న మేకపోతులకేల కాకపోయెనయ్య కాయసిద్ధి లోకులెల్ల వెఱ్ఱి పోకిళ్ళ బోదురు , వి. వే.

ఆకులెల్ల తిన్న మేకపోతులకేల
కాకపోయెనయ్య కాయసిద్ధి
లోకులెల్ల వెఱ్ఱి పోకిళ్ళ
బోదురు , వి. వే.

వనమూలికలు, ఆకులు తినిన కాయసిద్ధి కలుగునని దాంభికులు జనులను మోసగింతురు. అది వట్టి భ్రమ . ఆకులు తిన్న మేకలకు కాయసిద్ధి ఏల కలుగలేదు ?

Some people fool people by saying consumption of herbs and medicinal leaves will enable salvation by attaining healthy bodies. They are delusional. Because goats do the same but won't attain salvation.

97
ఆ చరాచారముల నంగాల లింగాలు సరణి తెలియనట్టి శైవమేల ? అష్టతనుమయుండు హరుడు అవుట తెలియరు , వి. వే .

ఆ చరాచారముల నంగాల లింగాలు
సరణి తెలియనట్టి శైవమేల?
అష్టతనుమయుండు హరుడు అవుట
తెలియరు , వి. వే

కొందరు శైవులు తాము శివభక్తులమని చర, స్థిర లింగములను మేన ధరింతురు . పంచ భూతములు , సూర్యచంద్రులు, యజమానుడు అను ఎనిమిది శివుని శరీరములని వారు తెలిసికొనలేకున్నారు .

Some devotees of Lord Siva wear on their bodies Lord Siva's phallic symbols. They don't realize that Lord Siva has eight forms: 5 bhootas (earth, air, water, space, fire), sun, moon and yajamaana (the ritual patron, on whose behalf a religious ritual or a yajna is performed by a priest)

98
ఆడుదాని జూడ అర్థ ౦బు చూడగా బమ్మకైన పుట్టు దిమ్మ తెగులు బ్రహ్మ ఆలి త్రాడు బండిరేవున త్రెంప , వి. వే.

ఆడుదాని జూడ అర్థ ౦బు చూడగా
బమ్మకైన పుట్టు దిమ్మ తెగులు
బ్రహ్మ ఆలి త్రాడు బండిరేవున
త్రెంప , వి. వే.

కామినిని, కనకమును చూచినయెడల బ్రహ్మకయినను ఆశ పుట్టును . వాని పెండ్లాము త్రాడు బండ్ల రేవులో తెగ! (తిట్టు) బ్రహ్మ కూడ తన పుత్రికను - సరస్వతిని మోహించెను .

Even Lord Brahma will fall in love with a buxom lady and be tempted by gold. He fell for his own creation: Goddess Saraswati.

100
ఆఱు మతములు యందు అధికమైన మతంబు లింగ మతముకన్న లేదు భువిని లింగధార్లకన్న దొంగలు లేరయా ! వి. వే.

ఆఱు మతములు యందు అధికమైన
మతంబు లింగ మతముకన్న లేదు
భువిని లింగధార్లకన్న
దొంగలు లేరయా ! వి. వే.

శైవ , వైష్ణవ, శాక్తేయాదులగు ఆరు మతములలో లింగము ధరించు శైవుల మాత్రమే గొప్పది ! (ఆక్షేపణ ) లింగమును ధరించిన వారందరును మోసాగా౦డ్రే

Among the six sects: saiva (Lord Siva), vaishnava (Lord Vishnu), Saakteya (Shakti), etc. saiva's think they are superior. Such people are deceiving us.

101
ఆసనములు పన్ని యంగ౦బు బిగియించి యొడలు విఱిచికొనెడి యోగులెల్ల బెట్టి సాముకన్న చింతాకు తక్కువ , వి. వే.

ఆసనములు పన్ని యంగ౦బు బిగియించి
యొడలు విఱిచికొనెడి
యోగులెల్ల బెట్టి సాముకన్న
చింతాకు తక్కువ , వి. వే

దాంభికులు తాము యోగులమనుచు , ఆసనముల వేసి దేహము విరుచుకొందురు . అట్టివారు సాముచేయు జెట్టీలకంటే ఒక వాసి తక్కువ. (సమానులనుట)

Pompous people profess they are yogis by performing yoga asanas (postures by twisting their bodies). Such people are like wrestlers.

102
ఇచ్ఛవచ్చు నరునకెచ్చు వైష్ణవమిచ్చి ద్విజులకన్న దొడ్డతీరటంచు నెల్లవారునల్ల పల్లాండు పాడరా ! వి. వే.

ఇచ్ఛవచ్చు నరునకెచ్చు వైష్ణవమిచ్చి
ద్విజులకన్న దొడ్డతీరటంచు
నెల్లవారునల్ల
పల్లాండు పాడరా ! వి. వే

దాంభికులగు వైష్ణవులు తాము కోరిన నీచునకు అయినను వైష్ణవమతమును ఇచ్చి , వాడే బ్రాహ్మణులకంటెను గొప్పవాడని చెప్పుచు "పల్లా౦డు పల్లా౦డు పల్లాయి రత్తా౦డు "అను పాటను పాడుదురు . (ఇది వైష్ణవుల ముఖ్య గేయము ).

Pompous Lord Vishnu's devotees go to the extent of offering membership into their sect to useless people just to spite the brahmins. They declare them as superior to brahmins and rejoice with songs.

103
ఇల్లునాలిని విడిచి ఇనుప కచ్చలు కట్టి వంటకంబు నీటి వాంఛ లుడిగి ఒంటినున్నయంత నోదవునా తత్త్వ౦బు ? వి. వే.

ఇల్లునాలిని విడిచి ఇనుప కచ్చలు
కట్టి వంటకంబు నీటి వాంఛ
లుడిగి ఒంటినున్నయంత నోదవునా
తత్త్వ౦బు ? వి. వే.

ఇల్లు , వాకిలి , భార్యలను విడిచి , ఆకలిదప్పులు విడిచి , గోచి కట్టుకొని ఒంటరిగా అడవిలో ఉన్నంతమాత్రమున తత్త్వము బోధపడదు . ఇది వేషము మాత్రమే!

By wearing a skimpy cloth, renouncing worldly bonds (family and karma) and roaming alone in forests one cannot gain pure knowledge. Such acts are just to fool us.

104
ఇహమునందు సుఖము లీడేరగా లేదు పరమునందు ఎట్లు పడయవచ్చు ? మొదలులేని చింత తుదిని ఎట్లు వచ్చురా? వి. వే.

ఇహమునందు సుఖము లీడేరగా లేదు
పరమునందు ఎట్లు పడయవచ్చు?
మొదలులేని చింత తుదిని
ఎట్లు వచ్చురా? వి. వే

దాంభికులు యాగాదులు చేసి పైలోకమున సుఖములు పొంద తలతురు . ఇక్కడలేని సుఖము అక్కడమాత్ర మెట్లు కలుగును ? మొదట లేనిది తుదనెట్లు వచ్చును? ఇక్కడనే సుఖమును అనుభవించవచ్చును .

Pompous people by performing rituals (yagna) think they will attain heaven after death. When there is no happiness on earth, there is no guarantee that it exists in the heaven either. When there is no beginning where is the ending (and rebirth)? One can attain happiness in this life itself.

105
ఉపవసించుచుండి యొగినీళ్ళ మునిగియు కూడువండి వేల్పు గుడువుమనుచు దాని నోరుకట్టి తామె తి౦దురుకదా ! వి. వే.

ఉపవసించుచుండి యొగినీళ్ళ మునిగియు
కూడువండి వేల్పు గుడువుమనుచు
దాని నోరుకట్టి
తామె తి౦దురుకదా ! వి. వే

దాంభికుడు భక్తి నటించి ఉపవాసములు చేయుచు , స్నానములు చేయుచు , దేవతకు నైవేద్యము పెట్టి , ఆ కూడు తామే తినివేయుదురు .

A pompous person pretending to be a devotee performs fasting and takes baths. He eats the food offered to God (there is no use in such rituals)

106
ఉపవసించినంత నూ ఱబందిగ పుట్టు తపసియై దరిద్రతను వహించు శిలకు మ్రొక్కనగునె జీవముగల బొమ్మ ? వి. వే.

ఉపవసించినంత నూ ఱబందిగ పుట్టు
తపసియై దరిద్రతను వహించు
శిలకు మ్రొక్కనగునె
జీవముగల బొమ్మ ? వి. వే

ప్రాణము గల మనుష్యుడు జీవము లేని బొమ్మకు మ్రొక్కిన ఫలమేమి? ఉపవాసముచేసిన ఊర పందిగా పుట్టును . తపసిగా ఉండిన లేమిని అనుభవించును . దీనివలన ప్రయోజనమేమి ?

What is the benefit of a living embodiment such as a human performing rituals to a lifeless image? When one fasts, he will be reborn as a pig. Being a sage, one lacks worldly comforts. What is the use of these?

107
ఊరబంది ఎఱుగ ఉత్తమ వస్తువుల్ చెడ్డనరకము ఎల్లజె ౦దుగాని సాధ్వి మహిమ మెట్లు స్వైరిణి యెఱుగురా ? వి. వే .

ఊరబంది ఎఱుగ ఉత్తమ వస్తువుల్
చెడ్డనరకము ఎల్లజె ౦దుగాని
సాధ్వి మహిమ మెట్లు స్వైరిణి
యెఱుగురా ? వి. వే

నీచునికి మంచి తెలియదు . ఊర పందికి ఉత్తమ వస్తువు అక్కరలేదు . మురికికూపమే దానికి ఇష్టము . ఉత్తమురాలి గొప్పతనము జారిణికి తెలియదు గదా !

A low-life won't understand kindliness. A pig likes dirt. A prostitute won't know the character of a chaste woman.

108
ఊరి నడిమి బావి ఉదకంబు కొని తెచ్చి పాద తీర్థమనుచు బ్రమయ్యజేయ పాద తీర్థమన్న ఫలమేమి కద్దురా ? వి. వే.

ఊరి నడిమి బావి ఉదకంబు కొని
తెచ్చి పాద తీర్థమనుచు
బ్రమయ్యజేయ పాద తీర్థమన్న
ఫలమేమి కద్దురా ? వి. వే

దాంభికులు ఊరిబావి నీరు తెచ్చి దేవుని పాద తీర్థమని భ్రాంతిగొలిపి ఇత్తురు . పాదతీర్థము అన్నంత మాత్రమున కలిగిన ప్రయోజన మేమో తెలియదు .

Pompous people bring well-water and offer it to lay people by claiming it as holy water that was used to perform rituals on God's idols. It is not clear why such water has any use.

109
ఊరులు పల్లెలు మానుక వారక అడవుల జారి౦చు వాడరుదె౦చున్ వేరులు కూరలు మెశలెడు వీఱిడి కెట మోక్షపదవి ? వినూరా వేమా !

ఊరులు పల్లెలు మానుక వారక అడవుల
జారి౦చు వాడరుదె౦చున్ వేరులు
కూరలు మెశలెడు వీఱిడి కెట
మోక్షపదవి ? వినూరా వేమా

వంచకులు "ఇల్లు వాకిలి విడిచి అడవులకు పోయి మూలములు , కూరలు తినిన మోక్షము అబ్బు " నందురు . అట్లు౦డు మూర్ఖునకు మోక్షము ఎట్లు కలుగును !

Deceptive people claim one can attain salvation by renouncing worldly bonds, eating roots and vegetables while roaming in forests. How can such a foolish act result in salvation?

110
ఎంగిలి ఎంగిలి అనుచు నీ నోటితోడనే వేదములను చదువు వెఱ్రులారా ! ఎంచి చూడ అదియు ఎంగిలి కాదొకో ! వి. వే.

ఎంగిలి ఎంగిలి అనుచు నీ నోటితోడనే
వేదములను చదువు వెఱ్రులారా!
ఎంచి చూడ అదియు
ఎంగిలి కాదొకో ! వి. వే

వేదములను చదువు దాంభికులు కొందరు "ఎంగిలి ఎంగిలి" అని ఇతరులను ఆక్షేపి౦తురు . వారు వేదము చదువునపుడు నోటి తుంపరలు పడిన అవి ఎంగిలి కాదా?

After reading vedas some claim food offered to them is contaminated with saliva and unfit for consumption. Isn't it true that when they are reading vedas, the saliva drips out?

111
ఎంబెరు మతమని యొసగి మాంసము తిని మాఱ్రుపేర్లు పెట్టి మధువు త్రాగి వావి వరస తప్పి వర్తించి చెడుదురు , వి. వే

ఎంబెరు మతమని యొసగి మాంసము తిని
మాఱ్రుపేర్లు పెట్టి మధువు
త్రాగి వావి వరస తప్పి
వర్తించి చెడుదురు , వి. వ

కొందరు "మాది ఎంబెరు మతము ; తప్పు లేదు " అని మాంసము తినదురు . కొందరు మారు పేర్లతో కల్లు త్రాగుదురు . కొందరు వావి వరసలు లేక తప్పుగా ప్రవర్తింతురు . ఈ పద్ధతులు సరి అయినవి కావు.

Some believing in their sect eat meat, consume alcohol and behave indiscriminately. Such behavior is not appropriate.

112
ఏమి అయినది పరతత్త్వ మెఱుగలేక సోమయాజులు పశువుల సృక్కడించి సామమేర్పడ చదివిన జావదేల? బాధక౦బైన దుర్గుణ పంక్తి వేమ !

ఏమి అయినది పరతత్త్వ మెఱుగలేక
సోమయాజులు పశువుల సృక్కడించి
సామమేర్పడ చదివిన జావదేల? బాధక౦బైన
దుర్గుణ పంక్తి వేమ

యాగము చేయు దాంభికులు పరతత్త్వము ఎఱుగక పుణ్యమునకై నోరు లేని పశువులను చంపుదురు . సామము చదివిన పాపము పోవునా ? దుర్గుణములు నశించునా ?

After performing rituals (yajna) pompous people sacrifice animals without proper knowledge. Will reciting vedas absolve one from sin? Will it destroy bad qualities?

113
ఐనదానికింక కానిదానికినైన ఆడువారి మాటలాడుచున్న సాహసమున పెక్కు ఊహలు పనుతురు , వి. వే.

ఐనదానికింక కానిదానికినైన
ఆడువారి మాటలాడుచున్న
సాహసమున పెక్కు ఊహలు
పనుతురు , వి. వే.

పిరికివారు కొందరు బడాయి నటించి , ప్రతిదానిని ఆడువారి మాట ప్రకారము చేయుదురు . ఎట్టి సాహసమునకైనను సిద్ధపడుదురు .

Coward people fake bravery and do everything as their women tell them. They seems to be prepared for every kind of adventure.

114
ఓడలు బూదిపూసి జడలు ధరించిన నొడయడగను ముక్తి బడయలేడు తడక బిఱ్ఱుపెట్ట తలుపుతో సరియవున ? వి. వే.

ఓడలు బూదిపూసి జడలు ధరించిన
నొడయడగను ముక్తి బడయలేడు
తడక బిఱ్ఱుపెట్ట తలుపుతో
సరియవున ? వి. వే

బూడిద పూసికొని జడలు ధరించినచో భీకరముగా నుండును. అంతమాత్రమున ముక్తి రాదు . తడకకు బిర్రుపెట్టి మూసిన , అది తలుపుతో సమానము కాలేదు కదా!

When a person smears ash on his body and grows matted her, he will be scary to look at. But he won't achieve salvation. A make-shift door made of bamboo is not the same as a door made with solid wood.

115
ఒడ్డు పొడుగు కలిగి గడ్డము పొడవైన దానగుణము లేక దాత అగునె ?ఏనుము గొప్పదైన ఏనుగు పోలూనా? వి. వే .

ఒడ్డు పొడుగు కలిగి గడ్డము
పొడవైన దానగుణము లేక దాత
అగునె ?ఏనుము గొప్పదైన
ఏనుగు పోలూనా? వి. వే

ఒడ్డు పొడుగు కలిగి , గడ్డము పెంచినంత మాత్రాన వ్యక్తి దాత కాడు . దానము చేసిననే దాత అగును . దున్నపోతు ఎంత పెద్దది అయినను ఏనుగునకు సాటి కానే కాదు .

A robust person, with height and girth, when growing a beard doesn't mean he is charitable. One who gives alms is the real charitable person. A bull may grow to any size but it won't be the same as an elephant.

116
కడుపు బోరగించి కన్నులు ముకుళించి బిఱ్ఱబిగిసికొన్న బీదయోగి యముణిబారిబాఱ్రె అతడేమి చేయురా ? వి. వే.

కడుపు బోరగించి కన్నులు ముకుళించి
బిఱ్ఱబిగిసికొన్న
బీదయోగి యముణిబారిబాఱ్రె
అతడేమి చేయురా ? వి. వే

కొందరు దాంభికులు యోగులమని అనిపించు కొనుటకు పొట్ట ఉబ్బించి కనులు మూసి , బిర్రబిగిసి ఉందురు. వారును ఇతరులవలె మరణించవలసినవారే !

Some pompous people control breath to inflate their stomach, close their eyes and remain rigid so as to be called yogis. They meet with death like everyone else.

117
క౦బళములగట్టిగంతల గజ్జల బోడితలల సొంపు పొలుపుమీఱ గడుపు కొఱకు తిరుగ ఘణులవుదురా వారు? వి. వే.

క౦బళములగట్టిగంతల గజ్జల
బోడితలల సొంపు పొలుపుమీఱ
గడుపు కొఱకు తిరుగ ఘణులవుదురా
వారు? వి. వే

కొందరు క౦బ ళముల కట్టి గంతలు కప్పుకొని గజ్జలు కట్టుకొని తలలు గొరిగించుకొ౦ దురు . ఇవి కడుపుకోసము పడే పాట్లు. వారు గొప్పవారు కాలేరు .

Some cover themselves with blankets, cover their eyes with cloth and tonsure their heads. Such people do it for the sake of livelihood. They can't be great.

118
కావిపంచె కట్టి కడు యోగివలెనుండి వెలికి కోర్కెలెల్ల విడిచిపెట్టి తొరగి తిరుగువాడు దొంగ సన్యాసిరా ! వి. వే.

కావిపంచె కట్టి కడు యోగివలెనుండి
వెలికి కోర్కెలెల్ల విడిచిపెట్టి
తొరగి తిరుగువాడు
దొంగ సన్యాసిరా ! వి. వే.

దాంభికుడు యోగి వేషము వేసి, కావిగుడ్డ కట్టి కోరికలు లేనట్లు నటించినంత మాత్రమున కోరికలు లేకుండునా ? అట్టివాడు కపట సన్యాసియే అగును .

When a pompous person masquerades in a yogi's attire by wearing saffron clothes and pretending to be without any desires, do you believe in him? Such a person is a fake yogi.

119
కుక్కుట మననంబు కొక్కెరధ్యానంబు యతులనొసట నొసరునట్లు వ్రాసె తొల్లి సేసినట్టి దోషంబు తగిలెనో ! వి. వే.

కుక్కుట మననంబు కొక్కెరధ్యానంబు
యతులనొసట నొసరునట్లు
వ్రాసె తొల్లి సేసినట్టి
దోషంబు తగిలెనో ! వి. వే

కోడి మననము , కొంగ జపము చేయు బడాయి సన్యాసులు వారి పూర్వజన్మము నందలి పాపముల ఫలముగా సన్యాసులు అయినట్లు తోచుచున్నది .

Like hen and cranes that seem to be meditating, pompous bachelors (sanyasi) are born because of their sins in the previous life,

120
కులము నీఱుచేసి గురువును వధియింప పొసగ ఏనుగంత బొంకు బొంకె పేరు ధర్మరాజు పెనువేప విత్తయా ! వి. వే.

కులము నీఱుచేసి గురువును
వధియింప పొసగ ఏనుగంత బొంకు
బొంకె పేరు ధర్మరాజు పెనువేప
విత్తయా ! వి. వే

పేరునుబట్టి నమ్మ వీలులేదు . ధర్మరాజు వంశ గౌరవము నశింపజేసి పెద్ద బొంకు బొంకి , గురువైన ద్రోణునే చంపెను . పేరు ధర్మరాజు . చూడగా విషపు విత్తు .

A name is misleading. Pandava king Dharma Raja slayed his guru Drona in the Mahabharata war by lying to him. By name he is a king following dharma. In reality he is a poisonous seed.

121
గుహలు పదివేలు సొచ్చిన గుణము పోదు నియత గురుభక్తికావలె నేర్పు మీఱ మహిత పరతత్త్వ భావంబు మధురమగును దాని సాధింపనే మఱి పూను వేమ!

గుహలు పదివేలు సొచ్చిన గుణము పోదు
నియత గురుభక్తికావలె నేర్పు మీఱ
మహిత పరతత్త్వ భావంబు మధురమగును
దాని సాధింపనే మఱి పూను వేమ

గుహలలో దూరి కూర్చున్న౦తనే విషయాభిలాషి పోదు . స్థిరమైన భక్తి , నిగ్రహము కావలెను . అవి ఉన్నప్పుడే తత్త్వమును తెలిసికొన వీలగును .

One can't turn the mind off of worldly distractions by entering caves. One needs to be steadfastly devoted and self-restrained to attain pure knowledge.

122
గూబవలె గ్రుడ్లు త్రిప్పిన గుణము పోదు లోభ మోహము లుడుగంగ లాభమగును దేబెలయి భిక్షము ఎత్తుట తీర్పదెపుడు డాబుచేసిన లక్ష్యమడుగు వేమ!

గూబవలె గ్రుడ్లు త్రిప్పిన గుణము
పోదు లోభ మోహము లుడుగంగ లాభమగును
దేబెలయి భిక్షము ఎత్తుట తీర్పదెపుడు
డాబుచేసిన లక్ష్యమడుగు వేమ

గుడ్లగూబవలె గ్రుడ్లు తిప్పి డాబు చేసి , బిచ్చమెత్తిన అంతనే గొప్ప యోగి కాడు . లోభమును , మోహమును విడిచినపుడే ప్రయోజనము ఉండును .

A person with eyes imitating an owl's may show pomp and seek alms. He is not a great yogi. A true yogi is one who renounces: desire, anger, ego, jealousy, possessiveness and passion (కామ , క్రోధ , మద, మత్సర , లోభ, మోహ)

123
ఘటమును ఇంద్రియములు కత్తివేయగ లేక చావు వచ్చునపుడు సన్యసించు ఆత్మ శుద్ధిలేక అందునా మోక్షంబు ? వి. వే.

ఘటమును ఇంద్రియములు కత్తివేయగ
లేక చావు వచ్చునపుడు సన్యసించు
ఆత్మ శుద్ధిలేక అందునా
మోక్షంబు ? వి. వే

ఇంద్రియములను నిగ్రహింప శక్తి లేక కొందరు మరణము వచ్చు సమయమున సన్యాసము తీసికొ౦దురు . దానివల్ల ముక్తి కలుగదు . ముక్తికి ఆత్మ శుద్ధి , ఇంద్రియ నిగ్రహము కావలెను .

Some when nearing death seek to live the life of renunciation. They won't attain salvation. One needs purity of soul and control of 5 senses to attain salvation.

124
చిలుకనోరుగొట్టి చిత్తజుమెడగట్టి కచ్ఛడంబు బిగియగట్టికొన్న మనసు వాసముగాదె ? మహినేమి పాపమో ? వి. వే.

చిలుకనోరుగొట్టి చిత్తజుమెడగట్టి
కచ్ఛడంబు బిగియగట్టికొన్న
మనసు వాసముగాదె ?
మహినేమి పాపమో ? వి. వే

పలుకకుండ చిలుక నోరు నొక్కి , మన్మధుని నిగ్రహించి , గోచి బిగించినను , మనసు మన వశమున ఉండదు . ఇది ఏమి పాపమో తెలియదు .

Like stuffing a parrot's beak, controlling libido and living a disciplined life can still result in a fickle mind. Why is it so?

125
చక్కని సతియైన సరసురాలైనను మేను ఒరులను గాననీయకున్న సందెగ్రు౦కినంత సయ్యాటలాడదా ? వి. వే .

చక్కని సతియైన సరసురాలైనను
మేను ఒరులను గాననీయకున్న
సందెగ్రు౦కినంత సయ్యాటలాడదా?
వి. వే

“నేను చక్కనిదానను , సరసురాలను , ఇతరులకు కనబడను " అని దాంభికములు ఆడినను కొందరు స్త్రీలు సాయంకాలము కాగానే విహరింప బోవుదురు . వారిని నమ్మరాదు .

Some pompous women claiming themselves to be honorable and playful, like roaming when the night falls. One should not trust them.

126
చదువు చదువనేల ? సన్యాసి కానేల ? షణ్మతముల చిక్కి చావనేల ? అతని భజన చేసి ఆత్మలో తెలియుడీ , వి. వే.

చదువు చదువనేల ? సన్యాసి
కానేల ? షణ్మతముల చిక్కి
చావనేల ? అతని భజన చేసి ఆత్మలో
తెలియుడీ , వి. వే

వేదాంతము చదివి , సన్యాసి అయి , ఆరు మతములలో చిక్కి శ్రమపడుటకంటె , రూపములేని భగవంతుని సేవించి ఆత్మ తత్త్వమును తెలిసికొనుట మేలు .

Rather than study vedanta (upanishad), become a mendicant (sanyasi), get entrapped in religions, it is better to worship a form-less divine to attain pure knowledge.

127
చాలదయ్య ఇంక చార్వాక మత రీతి శక్తి శైవమనుచు చాల నమ్మి సరణి మిగిలి చెడును చండాల సేవచే , వి. వే.

చాలదయ్య ఇంక చార్వాక మత రీతి
శక్తి శైవమనుచు చాల
నమ్మి సరణి మిగిలి చెడును
చండాల సేవచే , వి. వే.

దేవుడు లేడను చార్వాక మతము తగదని , శాక్తేయ శైవ మతములను నమ్మరాదు . అవియు తప్పు మార్గములే!అవి నీచమైన సేవా పద్ధతులు . (మద్య, మాంసములు ఆ మతములలో కానవచ్చుననుట .)

Chaarvaakas (atheists) claim there is no God. That doesn't mean people worshiping Goddess Sakti and Lord Siva are trustworthy. Both are fraught with danger. Their service is the lowest of the lowest. (Followers of such religions partook in meat and alcohol)

128
జడలు కట్టనేల ? సన్యాసి కానేల ? ఒడలు విఱుచుకొనెడి యోగమేల ? ముక్తి కాంతబట్టి ముద్దు ఆడనే కదా ? వి. వే.

జడలు కట్టనేల ? సన్యాసి కానేల?
ఒడలు విఱుచుకొనెడి యోగమేల?
ముక్తి కాంతబట్టి ముద్దు
ఆడనే కదా ? వి. వే.

ముక్తికొరకు జడలు ధరించి సన్యాసి కానక్కరలేదు . శరీరమును విరుచుకొని యోగమును అభ్యసింపనక్కరలేదు . అంతకంటె సులభమైన మార్గమును అనుసరింపవలెను .

One need not grow matted hair or perform yoga asanas to attain salvation. One has to choose a simpler path.

129
జాతులయందు మిగుల జాతియేది ఎక్కువో? ఎఱుకలేక తిరుగ నేమిఫలము ? యెఱుక కలుగువాడె యె చ్చైన కులజుడు , వి. వే.

జాతులయందు మిగుల జాతియేది ఎక్కువో?
ఎఱుకలేక తిరుగ నేమిఫలము?
యెఱుక కలుగువాడె యె
చ్చైన కులజుడు , వి. వే

జాతులలో ఒకటి ఎక్కువ మరియొకటి తక్కువ కాదు . జ్ఞానము లేక కులమును పట్టుకొని తిరిగిన ప్రయోజనము లేదు . ఎవ్వడు జ్ఞానవంతుడో అతడే గొప్ప కులమువాడు . కులముకన్న జ్ఞానమే గొప్పది .

Among the sects there are no differences. Without knowledge there is no point on hanging on to one's caste. Anyone knowledgeable (gnana) about scripture is automatically of high caste. Knowledge transcends over the caste.

130
టిప్పణములుచేసి చప్పని మాటలు చెప్పుచుందురన్ని స్మృతులు శ్రుతులు విప్పి చెప్పరేల వేదాంతసారంబు ? వి. వే.

టిప్పణములుచేసి చప్పని మాటలు
చెప్పుచుందురన్ని స్మృతులు
శ్రుతులు విప్పి చెప్పరేల
వేదాంతసారంబు ? వి. వే.

దాంభికులు తమ పాండిత్యమును వెళ్ళబుచ్చుచు వేదములను, ధర్మ శాస్త్రములను , వ్యాఖ్యలను వివరింతురేగాని వేదాంతములోని సారమును చెప్పలేరు .

A pompous person might reveal his knowledge about vedas and dharma, but can't teach the essence of vedanta (upanishad).

131
టింగణాలు బలసి నింగికి ఎగిరిన చెట్టుచివరిపండు చేతబడునే ? పుస్తకములు చదువ పొందునా మోక్షంబు ? వి. వే.

టింగణాలు బలసి నింగికి ఎగిరిన
చెట్టుచివరిపండు చేతబడునే?
పుస్తకములు చదువ పొందునా
మోక్షంబు ? వి. వే.

పొట్టివారు ఎంత ఎగిరినను చెట్టు చివరనున్న పండు అందదు . అట్లే వేదాంత గ్రంథములను చదివిన మాత్రమున మోక్షము లభింపదు .

A short person may never reach a high hanging fruit of a tree. Similarly just by reading vedanta literature one can't attain salvation.

132
దగ్గఱకుము పాపదాంభికులము నీవు మోసపుత్తురయ్య దోసమనక క్రూరమృగములట్టివారురా నమ్మకు , వి. వే.

దగ్గఱకుము పాపదాంభికులము
నీవు మోసపుత్తురయ్య దోసమనక
క్రూరమృగములట్టివారురా
నమ్మకు , వి. వే.

పాపాత్ములగు దాంభికులను చేరకుము . వారు క్రూర జంతువులవంటివారు . పాపమని తలంపక వారు ఇతరులను మోసపుత్తురు

Don't trust a sinful pompous man. He is like a wild animal. He follows a sinful path of deceiving others.

133
తంత్రమంత్రములను తారక మబ్బునా ? యంత్రబలము గురుని మంత్రమూని చింతజేయునపుడె చిన్మయమందురా , వి. వే.

తంత్రమంత్రములను తారక మబ్బునా?
యంత్రబలము గురుని
మంత్రమూని చింతజేయునపుడె
చిన్మయమందురా , వి. వే.

తరింపజేయు బ్రహ్మమును పొందుటకు మంత్ర తంత్రములు పని చేయవు . గురుని మంత్ర ఉపదేశమును , యంత్రమును పొంది భగవద్ధ్యానము చేయవలెను .

One can't attain brahma by reciting mantras. One needs to approach a guru, receive his tutelage and pray to God

134
తనువులు అస్థిరమని ధనములు అస్థిరమని తెలుపగలడు తాను తెలియలేడు చెప్పవచ్చు పనులు చేయుట కష్టమౌ , వి. వే.

తనువులు అస్థిరమని ధనములు
అస్థిరమని తెలుపగలడు తాను
తెలియలేడు చెప్పవచ్చు పనులు
చేయుట కష్టమౌ , వి. వే

దాంభికుడు శరీరము , ధనము ఆశాశ్వతములని ఇతరులకు చెప్పునేగాని , తాను తెలిసికొని ప్రవర్తింపలేడు . చెప్పవచ్చు కాని చేయుట కష్టము గదా!

A pompous person tells others riches won't last for ever while hanging on to his own. It is easier said than done.

135
తప్పువేశమూని ధరలోన తిరిగెడు చేతలెల్ల మిత్తి జేరుటకునె కడుపునింప నింత కష్టంబదేలరా ? వి. వే.

తప్పువేశమూని ధరలోన తిరిగెడు
చేతలెల్ల మిత్తి జేరుటకునె
కడుపునింప నింత
కష్టంబదేలరా ? వి. వే.

దాంభికులు పొట్ట నింపుకొనుటకే తప్పుడు వేషములు వేసి తిరిగి తిరిగి తుదకు చత్తురు . వారికి ఈ వేషములు ముక్తినీయలేవు .

Pompous people masquerade to attain livelihood and eventually die without achieving salvation.

136
తిరుపతికి బోవ దురక దాసరికాడు కాసికేగ పంది గజము కాదు కుక్క సింహము అగునె గోదవరికీబోవ , వి. వే.

తిరుపతికి బోవ దురక దాసరికాడు
కాసికేగ పంది గజము
కాదు కుక్క సింహము అగునె
గోదవరికీబోవ , వి. వే.

తురక తిరుపతికి పోయినను దాసరి కాలేడు . పంది కాశికి పోయినను ఏనుగు కాదు . కుక్క గోదావరిలో మునిగినను సింహము కాలేదు . అట్లే నీచుడు ఉత్తముడు కాలేడు .

A muslim won't become a hindu devotee by visiting Tirupati (Lord Venkateswara's temple). A pig can't transform into an elephant by worshiping in a holy place like Kasi. A dog won't turn into a lion after dipping in Godavari river. Thus, a low-life can never be an honorable person.

137
తోలుకడుపులోన దొడ్డవాడు ఉండగ రాతిగుళ్ళనేల రాశిదోయ రాయి దేవుడైన రాసులు మ్రింగడా , వి. వే.

తోలుకడుపులోన దొడ్డవాడు
ఉండగ రాతిగుళ్ళనేల రాశిదోయ
రాయి దేవుడైన రాసులు
మ్రింగడా , వి. వే

మన దేహములోనే ఆత్మ ఉండగా , రాతిలో ఆత్మ ఉన్నది ఆనుకొనుట భ్రాంతి . అందు దేవుడే ఉన్నయెడల మనము పెట్టిన నైవేద్యమును తానే తినును గదా!

When aatma (soul) is within us, we are deluding by ascribing soul to a stone. If there is divinity in the stone, then it must consume the offerings we make to it.

138
దేశదేశములను తిరుగంగ తిరుగంగ ఆత్మయందు ధ్యానము అంటుకొనునె ? కాసులకును తిరుగగల్గునా మోక్షంబు ? వి. వే.

దేశదేశములను తిరుగంగ తిరుగంగ
ఆత్మయందు ధ్యానము అంటుకొనునె?
కాసులకును తిరుగగల్గునా
మోక్షంబు ? వి. వే.

దాంభికులు డబ్బు సంపాదించుటకు భక్తులమని చెప్పి ఎన్నో దేశములు తిరుగుదురు . వారి మనస్సులో ధ్యానము అంటనే అంటదు . అట్టి వారికి ముక్తి ఎట్లు అబ్బును ?

To earn money, pompous people masquerading as devotees, roam around the land. Their minds never receive the benefit of meditation. How can they attain salvation?

139
దొంగమంత్రములకు దొరకునా మోక్షంబు చేతగానిచేత చెల్లదెపుడు గురువటండ్రె వాని గుణహీనుడనవలే , వి. వే.

దొంగమంత్రములకు దొరకునా మోక్షంబు
చేతగానిచేత చెల్లదెపుడు
గురువటండ్రె వాని
గుణహీనుడనవలే , వి. వే.

గురువునని చెప్పి నీచ మంత్రములు చెప్పి మోసగించు దాంభికులు గుణహీనులే అగుదురు . ఆత్మశుద్ధిలేనివారి మూలమున మోక్షము లభింపదు .

Pompous people claiming themselves as gurus deceive by providing inferior guidance resulting in loss of character. Without purity of soul, there is no salvation.

140
ద్వాదశతిరుమణుల్ తగినట్లు ధరియించు ద్రవిడ గ్రంథములను దనరజదివి అక్షయమగుపాత్ర మమరంగ దాల్తురు , వి. వే.

ద్వాదశతిరుమణుల్ తగినట్లు
ధరియించు ద్రవిడ గ్రంథములను
దనరజదివి అక్షయమగుపాత్ర
మమరంగ దాల్తురు , వి. వే.

దాంభికులగు వైష్ణవులు పన్నెండు పట్టె నామములు పెట్టుకొని , ద్రావిడ ప్రబంధములు చదువుచు , అక్షయ పాత్రను పట్టుకొని తిరుగుదురు . వీరు వేషధారులు మాత్రమే .

Pompous devotees of Lord Vishnu smear their faces with ash, read religious texts and carry begging bowls to wherever they go. They are merely masquerading.

141
నీళ్ళమునగానేల ? నిధులబెట్టగనేల ? మొనసి వేల్పులకును

నీళ్ళమునగానేల?
నిధులబెట్టగనేల?
మొనసి
వేల్పులకున
మ్రొక్కనేల ? కపట కల్మషములు కడుపులోనుండగా , వి. వే.

కపటము , కల్మషము కడుపులో పెట్టుకొని , స్నానములు చేసి , దానధర్మములకని డబ్బు నిలవచేసి , దేవునికి మ్రొక్కులు పెట్టినను ప్రయోజనము లేదు .

There is no use in praying to God with conceited mind despite dipping in holy places and hoarding money for alms

142
పట్టుబట్టగట్టి పట్ట్టెనామ ముబెట్టి వట్టి భ్రాంతిజెంది వైష్ణవుడయి లొట్టిద్రాగినతడు లోకులజెఱచురా , వి. వే.

పట్టుబట్టగట్టి పట్ట్టెనామ ముబెట్టి
వట్టి భ్రాంతిజెంది
వైష్ణవుడయి లొట్టిద్రాగినతడు
లోకులజెఱచురా , వి. వే.

కల్లు త్రాగుచు , దాంభికముగా పట్టుబట్ట కట్టుకొని తిరుమణి పెట్టుకొన్న మాత్రమున నిజమైన వైష్ణవుడు ఎట్లగును ? అట్టివాడు లోకులను మోసగించువాడే యగును .

How can one be a devotee of Lord Vishnu when he is drinking alcohol and wearing expensive silk clothes for pomp? Such a person is deceiving others.

143
పరగ ప్రతిమలకును ప్రాణప్రతిష్టలో ?ప్రాణమొసగ ప్రతిమ పలుకవలదె !మొదటివానిసృష్టి మూర్తిమంతంబు అయిన , వి. వే.

పరగ ప్రతిమలకును ప్రాణప్రతిష్టలో?
ప్రాణమొసగ ప్రతిమ పలుకవలదె!
మొదటివానిసృష్టి మూర్తిమంతంబు
అయిన , వి. వే.

దేవునికి రూపము లేదు. మనము ప్రతిమలకు ప్రాణ ప్రతిష్ట చేసి , ప్రాణము నిలిపినచో , ఆ విగ్రహము మాట్లాడవద్దా ? మాట్లాడలేదే .

God does not have a form. Despite praying to his images and deities, they won't talk back.

144
పరమయోగులమని పరము చేరగలేని మాయజనులకు ఎట్లు మంచి కలుగు ? వేషములను విడిచి విహరింప ముక్తియౌ , వి. వే.

పరమయోగులమని పరము చేరగలేని
మాయజనులకు ఎట్లు మంచి కలుగు?
వేషములను విడిచి విహరింప
ముక్తియౌ , వి. వే.

దాంభికులు యోగివేషమువల్ల ముక్తి పొందలేరు . అట్టి మోసగాండ్రకు మంచి లేనేలేదు . ఇట్టి వేషములు విడిచి తగినట్లు ప్రవర్తించిన ముక్తి పొందగలరు .

Pompous people can't attain salvation by masquerading as yogis. Such deceitful people can't do any good. They can attain salvation only by behaving properly.

145
పరుల మోసపుచ్చి పరధనము ఆర్జించి కడుపు నింపుకొనుట కానిపద్దు ఋణముచేయు మనుజుడు ఎక్కువ కెక్కునా ? వి. వే.

పరుల మోసపుచ్చి పరధనము ఆర్జించి
కడుపు నింపుకొనుట కానిపద్దు
ఋణముచేయు మనుజుడు ఎక్కువ
కెక్కునా ? వి. వే.

అప్పు చేయువానికి గౌరవము ఎట్లు౦డదో , పరులను మోసగించి , వారి ధనము అపహరించి పొట్ట నింపుకొన్న వానికిని గౌరవము లేదు . అది చాల చెడ్డ పని .

Some people are devoid of honor by taking loans from others. They are like people who cheat others and appropriate their money. Such acts are sinful

146
పిండములనుజేసి పితరుల దలపోసి కాకులకును బెట్టు ఖలుడు దినము పెంట తినెడు కాకి పితయెట్టులయ్యెనో ? వి. వే.

పిండములనుజేసి పితరుల దలపోసి
కాకులకును బెట్టు ఖలుడు
దినము పెంట తినెడు కాకి పితయెట్టులయ్యెనో?
వి. వే.

పెద్దలను తలచుకొని , వారి పేర్లతో కాకులకు మూర్ఖ దాంభికుడు పిండములు వేయును . పెంట తినెడి కాకి పితృదేవత ఎటుల అగునో తెలియకున్నది .

Pompous people offer food to crows so as to appease the departed souls of their families. It is not apparent why crows that normally feed on waste can be equivalent to departed souls.

147
పేరు సోమయాజి పెనుసింహ బలుడాయె మేకపోతుబట్టి మెడను విరువ గాక క్రతువువలన కలుగునా మోక్షంబు ? వి. వే.

పేరు సోమయాజి పెనుసింహ బలుడాయె
మేకపోతుబట్టి మెడను
విరువ గాక క్రతువువలన కలుగునా
మోక్షంబు ? వి. వే.

దాంభికుడు సోమయాజినని పేరు పెట్టుకొని మేకను చంపు మహా బలవంతుడు అగును . ఇట్టి యాగమువలన ముక్తి కలుగనేరదు. జీవ హింస మాత్రము మిగులును .

Pompous people perform rituals (yagna) and sacrifice animals to make themselves stronger. One cannot attain salvation by such acts. They are only accruing sin by killing animals.

148
బందెత్రాళ్ళదెచ్చి బంధించ కట్టంగ లింగడేమి దొంగలించినాడొ ? ఆత్మలింగమునకు అర్చింపనేరరో ? వి. వే.

బందెత్రాళ్ళదెచ్చి బంధించ
కట్టంగ లింగడేమి దొంగలించినాడొ?
ఆత్మలింగమునకు
అర్చింపనేరరో ? వి. వే.

లింగధారులు శివలింగమును త్రాళ్ళతో బంధించి మెడలో కట్టుకొందురు . బంధింపగా శివుడేమయిన దొంగలించెనా ? వీరు తమలోని ఆత్మలింగమును పూజింపరాదా ?

Devotees of Lord Siva tie phallic symbols to threads and wear them around their necks. Did Lord Siva steal anything to be imprisoned that way? Why can't they worship the Lord Siva within themselves?

149
బ్రాహ్మణులమటండ్రు బ్రహ్మత్వమదిలేని బ్రఃమ్యమద్దియేల ? బ్రాహ్మణుడటె ? బొమ్మవలెనువాడు దిమ్మపై కూర్చుండ , వి. వే.

బ్రాహ్మణులమటండ్రు బ్రహ్మత్వమదిలేని
బ్రఃమ్యమద్దియేల ? బ్రాహ్మణుడటె?
బొమ్మవలెనువాడు
దిమ్మపై కూర్చుండ , వి. వే.

బ్రహ్మ జ్ఞానము లేనివాడు బ్రాహ్మణుడు కానేకాడు . వాడు దిమ్మపై కూర్చున్న బొమ్మ మాత్రమే అగును .

Without the knowledge of the creator (brahma) one cannot be a brahmin. He is like an idol placed on a pedestal for worship.

150
భాగవతుల మనుచు బరగంగనెవ్వరు వారి నెఱుగలేరు వరుసతోడ ఆడిపాడు వార లరయ భాగవతులా ? వి. వే.

భాగవతుల మనుచు బరగంగనెవ్వరు
వారి నెఱుగలేరు వరుసతోడ
ఆడిపాడు వార లరయ
భాగవతులా ? వి. వే.

భగవద్భక్తులే భాగవతులు . కాని , పాటలు పాడుచు గంతులు వేయువారు కారు .

True devotees don't sing and prance around. Still they worship the God.

151
భూతి దేహమందు బూసిన నయ్యెనా ? నిష్టశివునియందు నిలుపవలయు గాక బూడ్డెయందు గాడిద పొరలదా ? వి. వే.

భూతి దేహమందు బూసిన నయ్యెనా?
నిష్టశివునియందు నిలుపవలయు
గాక బూడ్డెయందు
గాడిద పొరలదా ? వి. వే.

శివునియెడల నిష్ట లేక కేవలము విభూతి పూసికొన్నంత మాత్రమున ఏమి లాభము ? గాడిదయు బూడిదలో దొర్లిన , దాని యొడలు బూడిద పూసికొనును గదా !

What is the use by merely smearing the bodies with ash without meditating on Lord Siva? Even a donkey can cover itself with ash by rolling on ash.

152
విభూతి పూసి నీవు ప్రాతభూతంబుల వెడలగొట్టబోవ దెఱ్రివనుచు నిన్నెగాంచి భీతి నిలువక పారరొ ? వి. వే.

విభూతి పూసి నీవు ప్రాతభూతంబుల
వెడలగొట్టబోవ దెఱ్రివనుచు
నిన్నెగాంచి భీతి
నిలువక పారరొ ? వి. వే.

బడాయిగా విభూతి పూసికొని , భూతములను తరిమి వేయుదునని నీవన్నచో , నిన్ను వెర్రివానినిగా భావించి , భయపడి జనులు పారిపోవుదురు .

If one claims pompously he can drive away evil spirits, people fear him and run away.

153
మతపు వేషధారులు మహిమీద పదివేలు మూఢజనుల గలప మూగచున్ ఉందురు . కొంగలు గుమికూడి కొఱకవా బోదెలు ? వి. వే.

మతపు వేషధారులు మహిమీద పదివేలు
మూఢజనుల గలప మూగచున్
ఉందురు . కొంగలు గుమికూడి
కొఱకవా బోదెలు ? వి. వే.

దాంభికులు వేర్వేరు మత ప్రచారకుల వేషమున మూఢ జనులను మోసగింతురు . వారు కొంగలు గుంపుగా చేరి పంటచేల బోదెలను కోరుకూచున్నట్లు ఉందురు .

Pompous people cheat lay people by acting like priests to spread their religion. They are like a flock of cranes eating the crops.

154
మనసున దయలేని మాలకొడుకునొద్ద జేరియున్న ప్రజకు చేటు నిజము పెద్దతనములు ఎంచ బెంకెల చందమౌ , వి. వే.

మనసున దయలేని మాలకొడుకునొద్ద
జేరియున్న ప్రజకు చేటు
నిజము పెద్దతనములు ఎంచ
బెంకెల చందమౌ , వి. వే.

దయలేని నీచుని ఆశ్రయించినవానికి చేటు కలుగును . పెద్దవారిని మర్యాదగా సమీపింప పెంకెవారుగానే అగుదురు .

One who seeks help from a merciless low-life will end up with harm. One has to seek the refuge of kind elderly people.

155
మాల మేలు గుణము మంచిది కలిగిన మాలకూడు గుడుచు మనుజుక౦టె గుణము మేలుకాని కులమేమి మేలురా ? వి. వే.

మాల మేలు గుణము మంచిది కలిగిన
మాలకూడు గుడుచు మనుజుక౦టె
గుణము మేలుకాని కులమేమి
మేలురా ? వి. వే.

మంచిగుణ మున్నప్పుడు మాలవాడైనను మేలు . మాలకూడు తిన్న పెద్దజాతివాణికంటె అ మాలయే ఉత్తముడు. గుణము ప్రధానము కాని, కులము కాదు .

A person of untouchable caste with good character is more preferable than a higher caste person with mean character. Character trumps over caste.

156
ముక్కు కన్నులు చెవులంటి మూయనేల ? తెలిసి తెరగంటి లోపల దేటపఱచి తిరుగ నేర్చినవాడె పోధీజితు౦డు ఊఱకయు మూయడంబంబులోరి వేమ !

ముక్కు కన్నులు చెవులంటి మూయనేల?
తెలిసి తెరగంటి లోపల దేటపఱచి
తిరుగ నేర్చినవాడె పోధీజితు౦డు
ఊఱకయు మూయడంబంబులోరి వేమ

దాంభికులయిన యోగులు ముక్కు, కన్నులు, చెవులు మూసికొని కూర్చుందురు . మనస్సును స్థిరముగా ఉంచి ధ్యానము చేయవలెను . బడాయివల్ల ప్రయోజనము లేదు .

Pompous people block their noses, eyes and ears pretending to be yogis. One has to meditate by controlling the mind. There is no use in being pompous.

157
ముద్రయున్ననేమొ ? మురిసెద రయ్యయో భద్రముగను మనసు పరగకున్న వెఱ్ఱి చేష్టలగును వివరింప ముద్రలు , వి. వే.

ముద్రయున్ననేమొ ? మురిసెద
రయ్యయో భద్రముగను మనసు పరగకున్న
వెఱ్ఱి చేష్టలగును వివరింప
ముద్రలు , వి. వే.

ముద్రలను తలచి దాంభికులు మురిసిపోదురు . మనస్సు స్థిరముగా లేనప్పుడీ ముద్రలు పిచ్చి చేష్టలే అగును .

Pompous people rejoice by showing various gestures with hands (mudra). When mind is fleeting, such acts are insane.

158
మొనసి ఇంద్రియముల మొదట నిలపగలేక సమసిపోవు వేళ సన్యసింతురు ఆత్మశుద్ధిలేక అంటునా మోక్షంబు ? వి. వే.

మొనసి ఇంద్రియముల మొదట నిలపగలేక
సమసిపోవు వేళ సన్యసింతురు
ఆత్మశుద్ధిలేక అంటునా
మోక్షంబు ? వి. వే.

కొందరు దాంభికులు మనస్సును స్థిరముగా నిలుపలేక మరణ సమయమున సన్యాసము స్వీకరించెదరు . ఆత్మశుద్ధి లేక కేవల సన్యాసము వలన మోక్షము కలుగదు .

Some pompous people without being able to control their mind renounce bonds when they are nearing death. Without purity of soul, one cannot attain salvation even after such a renunciation.

159
మోసమునను దనదు మొదటి ముఖ్యత హాని మోసమునను దనదు మురుపు తప్పు మోసమునను దనదు మోక్షము తప్పురా, వి. వే .

మోసమునను దనదు మొదటి ముఖ్యత
హాని మోసమునను దనదు మురుపు
తప్పు మోసమునను దనదు మోక్షము
తప్పురా, వి. వే .

ఇతరులను మోసగించిన తనకు హాని కలుగును. గౌరవము నశించును . ముక్తి లభించదు .

When one cheats others, one is self-inflicting sin. Such people lose honor. They don't attain salvation.

160
మృచ్చు గుడికి పోయి ముడి విప్పునేకాని పొసగ స్వామిజూడ బోడతండు కుక్క ఇల్లు సొచ్చి కుండలు వెతుకదా ? వి. వే .

మృచ్చు గుడికి పోయి ముడి విప్పునేకాని
పొసగ స్వామిజూడ
బోడతండు కుక్క ఇల్లు సొచ్చి
కుండలు వెతుకదా ? వి. వే

దొంగ సొమ్మపహరించుటకే గుడిలో ప్రవేశించును . దేవుని చూచుటకు కాదు . ఎట్లన, కుక్క కుండలు వెతుకుటకే ఇండ్లలో దూరును .

Like dogs seeking food in the houses, a robber goes to temple to steal; not to worship.

161
యజ్ఞ యాగములవి యెన్ని చేసినగాని ఆత్మ యజ్ఞ మగునె యంటి చూడ ?క్రతువు చేయువారు కానగ దొంగలు , వి. వే.

యజ్ఞ యాగములవి యెన్ని చేసినగాని
ఆత్మ యజ్ఞ మగునె యంటి
చూడ ?క్రతువు చేయువారు
కానగ దొంగలు , వి. వే.

యాగములెన్ని చేసినను అవి ఆత్మబోధ అను యాగమునకు సరి కావు. యాగములు చేయువా౦డ్రు మోసగాండ్రు

No matter how many rituals (yagna) one performs, they won't outweigh the knowledge about soul. He is a cheat.

162
రాతిబొమ్మకేల రంగయిన వలువలు ? గుళ్ళు గోపురములు కుంభములును కూడు గుడ్డ తాను గోరునా దేవుండు , వ. వే.

రాతిబొమ్మకేల రంగయిన వలువలు?
గుళ్ళు గోపురములు కుంభములును
కూడు గుడ్డ తాను
గోరునా దేవుండు , వ. వే.

దాంభికులు రాతి విగ్రహములకు విలువైన బట్టలు కట్టుదురు . దేవుడు గుళ్ళను , గోపురములను , కుంభములను , కూడు గుడ్డలను కోరనేలేదు .

Pompous people adorn stone deities with expensive clothes. God didn't ask for temples, rituals, food and clothes (asked only devotion).

163
రాయియయ్యె దేవరాయాడు భూవిలోన భక్తి మ్రొక్కువారు బండాలెకద !దేవునంతవారు భావింప భక్తులా ? వి. వే.

రాయియయ్యె దేవరాయాడు భూవిలోన
భక్తి మ్రొక్కువారు
బండాలెకద !దేవునంతవారు భావింప
భక్తులా ? వి. వే.

దేవతలకును రాజైన దేవుడు రాయియైనచో , ఆ రాతికి మ్రొక్కువారును బండలే కదా ! ఈ ఆజ్ఞులు దేవునంతవారు కాగలరా?

If the ruler of gods turns into stone, people worshiping such stones are stones themselves. Can they become gods?

164
లోన పదిలపఱచి లోవికారం బెల్ల తరుగుకున్నవాడు తపసికాడు వెలి వికారమెల్ల విధిపాలి కోర్కులే , వి. వే.

లోన పదిలపఱచి లోవికారం బెల్ల
తరుగుకున్నవాడు తపసికాడు
వెలి వికారమెల్ల విధిపాలి
కోర్కులే , వి. వే.

లోపల వికారమును అణపకున్న యోగులు యోగులు కారు ; దాంభికులు . వీరు లోని కోర్కెలు నాపజాలరు . అవి వెల్లడి అగుణచునే ఉండును .

Yogis who can't control the storms raging within, are pompous. They cannot control their desires either that manifest in their actions.

165
వడుగు ద్విజులకెల్ల కడు ముఖ్యమందురు వడుగు చేసేదమని వదరుచుంద్రు కడుగు త్రాగి కాకి కఱ్ఱు కఱ్ఱన్నట్లు , వి. వే.

వడుగు ద్విజులకెల్ల కడు ముఖ్యమందురు
వడుగు చేసేదమని వదరుచుంద్రు
కడుగు త్రాగి కాకి కఱ్ఱు
కఱ్ఱన్నట్లు , వి. వే.

బ్రాహ్మణులు దాంభి కముగా తమ బాలురకు వడుగు ముఖ్యమని, దానిని చేయుదుమని అరచుదురు. ఇది వ్యర్థము . అర్థము లేనిది . ఇట్టివారు అరచుచున్న కాకులవంటి వారు .

Brahmins claim thread-marriage is very important and perform thread-marriages in a pompous way. It is a waste. It has no use. They are like crows crowing out loudly.

166
విన్నశుద్ధి కొంత వినని శుద్ధులు కొన్ని వింత శుద్ధులెన్నొ వినగ జెప్పు తాను కన్నయెట్లె దాంభికుడెప్పుడు , వి. వే .

విన్నశుద్ధి కొంత వినని శుద్ధులు
కొన్ని వింత శుద్ధులెన్నొ
వినగ జెప్పు తాను కన్నయెట్లె
దాంభికుడెప్పుడు , వి. వే

దాంభికుడు తాను బాగుగా ఎరిగినట్లే నటించి , విన్నవి కొన్ని , విననివి కొన్ని వింతయైనవి కొన్ని , నీతులు చెప్పును

A pompous person claiming superior knowledge, mixes experience with fanciful imagination. He teaches aphorisms.

167
విప్రవరులు మనుచు వేదంబు చదువక బ్రాకృతులను జూచి పరిహసించు ధరణిసురులకన్న దాసరి మతమెచ్చు , వి. వే.

విప్రవరులు మనుచు వేదంబు
చదువక బ్రాకృతులను జూచి పరిహసించు
ధరణిసురులకన్న దాసరి
మతమెచ్చు , వి. వే.

బ్రాహ్మణుడు వేదము చదువవలెను . అట్లు చదువకయే దాంభికుడు తక్కువవారిని హేళన చేయును . ఇట్టి బ్రాహ్మణులకన్న దాసరియే మేలు . అతని మతమే గొప్పది .

A brahmin must recite vedas. Without reading vedas when they pompously insult others, a low-caste devotee is better than such brahmins.

168
పొడవు గల్గు జడలు పులితోలు భూతియు కక్షపాలలు పది లక్షలైన మోత చేటె కాని మోక్షంబు లేదయా! వి. వే.

పొడవు గల్గు జడలు పులితోలు
భూతియు కక్షపాలలు పది
లక్షలైన మోత చేటె కాని మోక్షంబు
లేదయా! వి. వే.

దాంభికులు పెద్ద జడలు , పులితోలు ధరించి , విభూతి పూసికొని, పెద్ద సంచి ధరించి , శివభక్తునివలె నటించును . ఇవన్నియు మోతచేటుకాని ముక్తినీయవు .

Some pompous people pretend to be devotees of Lord Siva by growing matted hair, wearing the skin of a tiger, smearing themselves with ash and carrying a big bag. All such things cannot give them salvation.

169
వెఱ్ఱిబట్టువాని వినయములు అధిక్యముల్ చెడ్డముండ ముసుగు చెలగుచుండు చెడిపెకొడుకు మిగులజేయు నాచారంబు , వి. వే

వెఱ్ఱిబట్టువాని వినయములు అధిక్యముల్
చెడ్డముండ ముసుగు
చెలగుచుండు చెడిపెకొడుకు మిగులజేయు
నాచారంబు , వి. వే

చెడిన ముండ పెద్ద ముసుగు వేసికొనును . చెడిపెకొడుకు ఆచారము ఎక్కువ . అట్లే దాంభికునకు వినయము ఎక్కువ .

A pompous person is overly courteous like a characterless woman and a person with bad character performing rituals.

170
వేనవేలు చేరి వెఱ్ఱి కుక్కలవలె అర్థహీన వేద మఱచుచుంద్రు కంఠశోషకంటె కలిగెడి ఫలమేమి ? వి. వే .

వేనవేలు చేరి వెఱ్ఱి కుక్కలవలె
అర్థహీన వేద మఱచుచుంద్రు
కంఠశోషకంటె కలిగెడి
ఫలమేమి ? వి. వే .

వేలకొలది గుంపుగా చేరి వెర్రికుక్కలు అరచినట్లు అర్థము లేని వేదమును చదువుచుందురు . వీరికి కంఠశోషయే మిగులును . ఈ బడాయివలన ఫలము లేదు .

Some people recite vedas in groups, like dogs in a pack barking together. They only get pain in their necks. There is no positive result from such pompous acts.

171
శీలమనుచు నరుడు సిగ్గి౦తయునులేక పరుల సొమ్ములెల్ల పరిహరించి వేషభాష వలన మోసంబు చేయును , వి. వే .

శీలమనుచు నరుడు సిగ్గి౦తయునులేక
పరుల సొమ్ములెల్ల
పరిహరించి వేషభాష వలన మోసంబు
చేయును , వి. వే .

దాంభికుడు శీలము గలవాడననుచు సిగ్గులేక ఇతరుల సొమ్మును అపహరించును . తన వేషము వలన , మాటల వలన ఇతరులను మోసపుచ్చును .

A pompous person shamelessly steals money from others by claiming to be a person of good character. He deceives others with his appearance and smooth talk.

172
సకల తీర్థములను సకల యజ్ఞ ౦బుల తలలు గొరుగకున్న ఫలము కలదె ? మంత్రజలము కంటె మంగలి జల మెచ్చు , వి. వే.

సకల తీర్థములను సకల యజ్ఞ ౦బుల
తలలు గొరుగకున్న ఫలము
కలదె ? మంత్రజలము కంటె మంగలి
జల మెచ్చు , వి. వే.

దాంభికులు తీర్థములయందు యజ్ఞములయందు పవిత్రత కొరకు తలలు గొరిగించుకొందురు . మంత్రజలము కంటె మంగలి నీరే వారికి పవిత్రమైనది .

Pompous people visit holy places and perform rituals (yagna) so as to look holy and tonsure their heads. The water used by a barber is holier than the water used to perform rituals.

173
సతుల జపతపములు సల్ప ౦గ సాగిన పురుషులేల నికను పుడమిలోన పాప మెంచవద్దు పట్టి శిక్షింపుడీ ! వి. వే .

సతుల జపతపములు సల్ప ౦గ సాగిన
పురుషులేల నికను పుడమిలోన
పాప మెంచవద్దు పట్టి
శిక్షింపుడీ ! వి. వే .

స్త్రీలు బడాయికొరకు జపము , తపము చేయ ప్రారంభించినచో, పురుషులకు పనియే లేదు . కాన జపాదులు చేయు స్త్రీలను దండింపవలెను .

If women perform rituals like pooja and meditation, then men will be jobless. Such women should be rebuked.

174
సంధ్యవార్వనేమి ? జపము చేయగనేమి ?వేద శాస్త్రములను వెలయనేమి ? పరము గననివాడు బాపడు కాడురా ! వి. వే .

సంధ్యవార్వనేమి ? జపము చేయగనేమి?
వేద శాస్త్రములను
వెలయనేమి ? పరము గననివాడు
బాపడు కాడురా ! వి. వే .

బ్రాహ్మణుడు సంధ్య వార్చినను , జపము చేసినను , వేదశాస్త్రములను చదివినను బడాయిగానుండి పరము గూర్చి యత్నింపనిచో బ్రాహ్మణుడు కానేకాడు .

A brahmin performing sun worship, meditation and vedic chants, if doesn't think of after-life, then he is not a real brahmin.

175
సోమయాజిననుచు సొంపైన శాలువల్ మకర కుండలములు మనసుదీర దా ధరించు మనకు తానేమి లాభించు ? వి. వే.

సోమయాజిననుచు సొంపైన శాలువల్
మకర కుండలములు మనసుదీర
దా ధరించు మనకు తానేమి
లాభించు ? వి. వే.

సోమయాజి మేలైన శాలువలు , కుండలములు ధరించి బడాయిగా తిరుగును . దానివల్ల ఇతరులకేమి లాభము ? (ఇతరులకు ఉపయోగించు రీతిని ప్రవర్తింపవలెను గదా !)

A performer of yagna adorns himself with expensive silk clothes and ear rings. What is the point of wearing such things, without being useful to others?

176
హీన జాతివాని కెచ్చు వైష్ణవమిచ్చి ద్విజుని కన్న దొడ్డ తీరట౦ద్రు కల్లుకడవ కడిగి గంగ నించిన రీతి , వి. వే .

హీన జాతివాని కెచ్చు వైష్ణవమిచ్చి
ద్విజుని కన్న దొడ్డ
తీరట౦ద్రు కల్లుకడవ కడిగి గంగ
నించిన రీతి , వి. వే .

మోసాగా ౦డ్రగు దాంభిక గురువులు హీనజాతి వానికి వైష్ణవ మతము ఇచ్చి , విప్రులకంటె వాడు గొప్పవాడు అందురు . అది కల్లు కుండలో గంగాజలము పోసినట్లు ఉండును .

Deceitful pompous gurus by accepting entry to low-caste people into their religion worshiping Lord Vishnu, claim they are superior to the brahmins. It is like pouring holy Ganga river water in a pot holding liquor.

177
హృదయము పదిలంబైనను గుదికొను , సన్యాసమునకు కొమ్ములు కలవా ? యిది ఎఱుగరు చదువరు లట మది ముక్తికి నాస్పదంబు మహిలో వేమా!

హృదయము పదిలంబైనను గుదికొను ,
సన్యాసమునకు కొమ్ములు కలవా ? యిది
ఎఱుగరు చదువరు లట మది ముక్తికి
నాస్పదంబు మహిలో వేమా

దాంభికులు సన్యాసము గొప్పదని చెప్పుదురు . దానికి కొమ్ములు లేవు గదా!మనస్సు నిలకడగా ఉన్న సన్యాసము అక్కరలేదు . ముక్తిని పొంద వచ్చును .

Pompous people claim renunciation is superior. It doesn't have horns. When one has an un-wavering mind, then one doesn't need to renounce anything. It is possible to attain salvation.

No comments:

Post a Comment