2484
తత్త్వ మెఱుగువాడు దైవంబు నెఱుగును సర్వసారములను జావజేయు కదళి మ్రింగునట్టె గరళంబు మ్రింగును , వి. వే.
తత్త్వ మెఱుగువాడు దైవంబు
నెఱుగును సర్వసారములను జావజేయు
కదళి మ్రింగునట్టె గరళంబు
మ్రింగును , వి. వే.
తత్త్వవేత్త యగువాడు దైవమును తెలిసికొనును. సమస్త సంసారమును రూపు మాపగలుగును . అరటిపండును మ్రింగినట్లే గరళమును మ్రింగగలుగును
One who is knowledgeable about tattva is also knowledgeable about god. He will renounce bondage. He can swallow toxins in his life like a banana
2485
తనదు దేహమందు తత్త్వార్థమెన్నుచు మందబుద్ధి కాక మహితుడగుచు లోని గుట్టు తెలిసి లోకములో నుండు, వి. వే.
తనదు దేహమందు తత్త్వార్థమెన్నుచు
మందబుద్ధి కాక మహితుడగుచు
లోని గుట్టు తెలిసి
లోకములో నుండు, వి. వే.
తన శరీరమున నున్న జీవ తత్త్వమును ఎన్నుచు మాంద్యమును విడిచి జ్ఞానియై మహితుడై ఆత్మానుభవమును పొందువాడే అన్ని విధముల ధన్యుడు
One who realizes that jeeva is within onself, gives up apathy, becomes knowledgeable and experiences aatma can attain salvation
2486
తనువు లస్థిరమని ధనము నస్థిరమని తెలుప నేర్చి తాను తెలియనేర్చి పాత్రుడైన యోగి పరమాత్మయే సుమీ, వి. వే.
తనువు లస్థిరమని ధనము నస్థిరమని
తెలుప నేర్చి తాను తెలియనేర్చి
పాత్రుడైన యోగి
పరమాత్మయే సుమీ, వి. వే.
శరీరము లస్థిరమని , ధన మశాశ్వతమని తాను గ్రహించుటయేకాక ఇతరులకు తెలియజెప్పి తిరుగువాడే నిజమైన యోగి . అతడే పరమాత్మ స్వరూపుడు
One who not only realizes that life and wealth are not permanent, but also teaches to others is a real yogi. He is a form of paramaatma.
2487
తన్ను దా తెలిసిన దైవంబు మఱి లేదు తానె దైవమంచు తత్త్వయోగి తలచుచుండు నెపుడు ధరలోన నరయుము , వి. వే.
తన్ను దా తెలిసిన దైవంబు మఱి
లేదు తానె దైవమంచు తత్త్వయోగి
తలచుచుండు నెపుడు
ధరలోన నరయుము , వి. వే.
“అహం బ్రహ్మోస్మి " అనుదానిని అనుభవపూర్వకముగా తెలిసికొన్నవానికి వేరే దైవముతో పనిలేదు. అతడు తానే దైవమని గ్రహించును
One who realizes he is same as brahmam from experience, has no need for another god. He comprehends that his self is the god.
2488
తన్ను వెదకి చూడ దానెయౌ జీవుడు తత్త్వమరయ నగును తానే యాత్మ మన్ను మిన్ను లేదు మాయయు లేదయా, వి. వే.
తన్ను వెదకి చూడ దానెయౌ జీవుడు
తత్త్వమరయ నగును తానే
యాత్మ మన్ను మిన్ను లేదు
మాయయు లేదయా, వి. వే.
తాను పరికించి చూచిన యెడల తానే జీవుడు. తానే తత్త్వము , తానే పరమాత్మయై యుండుట తెలియును. ఇందులో మిన్ను మన్ను వెదికిన మాయయు మర్మమును లేదు
When one analyzes self one realizes that self is jiva, self is tattva and self is paramaatma. There is no illusion in this.
2489
తన్నెఱుంగువాడు తాను తానై యుండు తన్నెఱుగనివాడు తాను తానె తనదు లోనివాడు తానె తా నవునయా , వి. వే.
తన్నెఱుంగువాడు తాను తానై
యుండు తన్నెఱుగనివాడు తాను
తానె తనదు లోనివాడు తానె
తా నవునయా , వి. వే.
తన్ను తా నెరిగినవాడు ఈశ్వర స్వరూపుడై యుండును. తన్ను తా నెరుగనివాడజ్ఞానియే . తనలో నున్న వాడే యీశ్వరుడగునని గమనింపవలెను
One who knows his self will be the form of Iswara. Otherwise he is ignorant. One should realize that Iswara is within onself.
2490
తలపులోన గలుగు దా దైవ మేప్రొద్దు తలచి చూడ నదియు తత్త్వమగును . తలపులోని తలపు తలచుచు నుండుము, వి. వే.
తలపులోన గలుగు దా దైవ మేప్రొద్దు
తలచి చూడ నదియు తత్త్వమగును.
తలపులోని తలపు
తలచుచు నుండుము, వి. వే.
దైవము నిత్యమని మానవుని తలపులోనే ఉన్నాడు. అట్టి దైవమును గుర్తింపగలుగుటయే తత్త్వము. తలపులో నున్న యీశ్వరుని ధ్యానించి ముక్తిని పొందుటకు ప్రయత్నింపుము
One knows that god is forever within one's thoughts. Tattva is when one is able to realize it. One has to attain salvation by meditating on the Iswara in one's mind.
2491
తల్లి పార్వతి యగు తండ్రియౌ శంభుడు ప్రమథగణము లఖిల బంధువితతి తనకు పుట్టినిల్లు తనర కైలాసము , వి. వే.
తల్లి పార్వతి యగు తండ్రియౌ
శంభుడు ప్రమథగణము లఖిల బంధువితతి
తనకు పుట్టినిల్లు
తనర కైలాసము , వి. వే.
యోగానుభవ మార్జించిన విరాగికి పార్వతీపరమేశ్వరులే తల్లిదండ్రులు . ప్రమథగణము బంధువులు . పుట్టిన స్థలము కైలాసము
For a sannyaasi who experiences yoga, Lord Iswara and Goddess Paarvati are the parents; Lord Iswara's devotees are the realtives; Kailash is the birth place.
2492
తాను తానె యనెడి తత్త్వంబులోపల నన్వయంబు తెలయ డబ్బతోడు తాను తానెయైన తల్లడంబేలరా? వి. వే.
తాను తానె యనెడి తత్త్వంబులోపల
నన్వయంబు తెలయ
డబ్బతోడు తాను తానెయైన
తల్లడంబేలరా? వి. వే.
తానే యీశ్వరస్వరూపుడను తత్త్వససూక్తియొక్క భావమును సామాన్యులు గ్రహింపలేరు . అట్లు గ్రహించి తానీశ్వరత్వమును పొందినచో మోక్షమునకై తల్లడపడ నక్కరలేదు
Ordinary people cannot grasp the tattva that one's self is the form of Iswara. If it can be comprehended that self is the tattva of Iswara, one need not worry about salvation.
2493
తాను నింద్రియముల దనర జయించిన తత్త్వమరసి చూడ దానె యగును రాజయోగి యిట్లు తేజరిల్లగవలె , వి. వే.
తాను నింద్రియముల దనర జయించిన
తత్త్వమరసి చూడ దానె
యగును రాజయోగి యిట్లు
తేజరిల్లగవలె , వి. వే.
ఇంద్రియములను జయించినయెడల తత్త్వము తన కలవడును . అట్టివాడే రాజయోగి
One who overcomes the 5 senses can realize tattva. Such a person is the raaja-yogi.
2494
తా నొకటి దెలియ నన్నది తాను మెయిన్ లేక యెల్ల తావులు తానై తా నెఱిగి పరిణమించిన మానవుడిల ముక్తు డతడె మాన్యుడు వేమా
తా నొకటి దెలియ నన్నది తాను మెయిన్
లేక యెల్ల తావులు తానై
తా నెఱిగి పరిణమించిన మానవుడిల
ముక్తు డతడె మాన్యుడు వేమా
తా నొక్కటియు ఎరుగునని తలచుచు , దేహాభిమానము విడిచి సర్వవస్తువులందలి ఆత్మ స్వరూపమును గుర్తించి మెలగు మానవుడే ముక్తుడగును. అతడే మాన్యుడు
One who gives up attachment with one's body and realizes aatma in all things, can attain salvation. Such a person will be considered as honorable.
2495
తారుమారుగాక తత్త్వదర్శనమూని మేరుశిఖర మెక్కి మెలగువాడు కేరి యెఱుకలోన గీడణగించును , వి. వే.
తారుమారుగాక తత్త్వదర్శనమూని
మేరుశిఖర మెక్కి మెలగువాడు
కేరి యెఱుకలోన
గీడణగించును , వి. వే.
తత్తరపడక సహస్రార కమలమున భగవత్స్వరూపమగు ప్రకాశమును గాంచి ఆనందించువాడు జ్ఞానియై ఐహికములగు అడ్డులను అన్నింటిని తొలగించుకొనగలడు
Without perplexion one who sees the resplendance of god in the sahasraara chakra (at the top of head) and experiences its bliss, becomes knowledgeable and overcomes the hurdles in this world.
2496
తిరిగి తిరిగి యింక తిరుగంగ తిరుగంగ తిరుగు గలదె యెంత తెలివి యున్న తిరుగునట్టి త్రోవ దిరుగు మెల్లప్పుడు , వి. వే.
తిరిగి తిరిగి యింక తిరుగంగ తిరుగంగ
తిరుగు గలదె యెంత తెలివి
యున్న తిరుగునట్టి త్రోవ దిరుగు
మెల్లప్పుడు , వి. వే.
పుణ్యక్షేత్రములకు , దేశ దేశములకు పోయినను ప్రయోజనము లేదు. ఎంత తెలివియున్నను తిరుగుట వ్యర్థమే . తిరిగి శ్రమ పడక ముక్తికయి యత్నింపవలెను
There is no use in roaming around holy places and countries. No matter how much intelligence one has, roaming around is waste. One has to try for salvation, whereever one is at, without much effort.
2497
నిక్కమగు జ్ఞాననిష్ఠలో నేర్పు మీఱ సొక్కి సోలియు బ్రమయక సూక్ష్మమంది చిక్కువడకుండ వాడె పో చిన్మయుండు తక్కువగ వాని గనలేరు ధరను వేమ
నిక్కమగు జ్ఞాననిష్ఠలో నేర్పు మీఱ
సొక్కి సోలియు బ్రమయక సూక్ష్మమంది
చిక్కువడకుండ వాడె పో చిన్మయుండు
తక్కువగ వాని గనలేరు ధరను వేమ
జ్ఞానానందము వలన తన్మయత్వము పొందుచు, మాయా వికారములకు లొంగక బ్రహ్మ స్వరూపమును దర్శించును . మోసములకు లొంగనివాడే జ్ఞాని యగును
One who revels in his knowledge, forgets self, not yields to maaya (illusion), can visualize the brahmam. A knowledgeable person is one who does not yield to deceit.
2498
నిజము తెలిసియున్న సుజను డా నిజమునె పలుకవలయుగాని పరులకొఱకు దాపగూడ దింక నోప దన్యము పల్క , వి. వే.
నిజము తెలిసియున్న సుజను
డా నిజమునె పలుకవలయుగాని
పరులకొఱకు దాపగూడ దింక నోప
దన్యము పల్క , వి. వే.
తనకు యధార్థము తెలిసి యున్నచో సుజనుడు దానినే చెప్పవలెను. కాని అసత్యము చెప్పరాదు. నిజము నెంతమాత్రము దాచకూడదు
A man of good character must tell only the truth. Never should he utter lies. One should never hide the truth.
No comments:
Post a Comment