Saturday, February 29, 2020

Prapancha-Swabhaava-Paddati


2000
అండములను బుట్టు నలరు ప్రాణులు కొన్ని బుద్భుదములు బుట్టు బురుగులెల్ల స్వేదములను బుట్టు జీవులు కొన్నిరా, వి. వే.

అండములను బుట్టు నలరు ప్రాణులు
కొన్ని బుద్భుదములు బుట్టు
బురుగులెల్ల స్వేదములను బుట్టు
జీవులు కొన్నిరా, వి. వే.

కొన్ని ప్రాణులు (పక్షులు)గ్రుడ్లనుండి పుట్టును. కొన్ని చెమటనుండి పుట్టును. కొన్ని మాంసపిండములనుండి జనించును

Some life forms are born from eggs (andaja). Some are born from sweat (swEdaja). And some are born from mother's womb (budhbuja).

2005
ఆలి నొంచలేక యధమత నొందుచు వెనుక నుంటి ననుట వెఱ్ఱితనము చెట్టు ముదురునేని చిదిమిన బోవునా? వి. వే.

ఆలి నొంచలేక యధమత నొందుచు
వెనుక నుంటి ననుట వెఱ్ఱితనము
చెట్టు ముదురునేని చిదిమిన
బోవునా? వి. వే.

భార్యను లొంగదీసికొనలేక వెనుకపడుట బుద్ధిహీనతయే . తొలుతనే ఆమెను స్వాధీనమున ఉంచవలెను . తర్వాత సాధ్యము కాదు . చెట్టు ముదిరినచో దానిని వంచుట సాధ్యమా?

It is foolish for not controlling one's wife. One has to control his wife early on. Is it possible to bend a tree once it grows up fully?

2006
ఆలు రంభయైన నతిశీల వతియైన జారపురుషుడేల జాడ మాను? మాలవాడ కుక్క మఱగిన విడుచునా ? వి. వే.

ఆలు రంభయైన నతిశీల వతియైన
జారపురుషుడేల జాడ మాను?
మాలవాడ కుక్క మఱగిన
విడుచునా ? వి. వే.

తన భార్య అందకత్తెయైనను , గుణవతియైనను జారుని మనస్సు పరస్త్రీలపైనే యుండును . మాలవాడలో మాంసము తినమరిగిన కుక్క ఆ వాడను విడువదు

A debauchee will go after other women, even though his wife is beautiful and of good character. It is like a dog that is used to eating meat in slums.

2007
ఇచ్చు పుచ్చుకొన్న హితులను మనుషులు తగ్గులేక యల్లు తామరవలె కాచి పూచి పండి కడు రమ్యమైయుండు , వి. వే.

ఇచ్చు పుచ్చుకొన్న హితులను
మనుషులు తగ్గులేక యల్లు
తామరవలె కాచి పూచి పండి కడు
రమ్యమైయుండు , వి. వే.

పరస్పర, సంబంధమువలన బంధువులు తగ్గుదలలేక తామరతీగ యల్లుకొన్నట్లు వృద్ధిపొందుచునే యుందురు

Due to mutual interests the number of friends and relatives keeps on growing like the lotus in a pond.

2008
ఇలను శూద్రులౌట నెఱుగరు మొదలను మనసు నతని మీద మరలుకొల్పి కొల్వగారొద్విజులు కోటానుకోట్లుగా , వి. వే.

ఇలను శూద్రులౌట నెఱుగరు మొదలను
మనసు నతని మీద మరలుకొల్పి
కొల్వగారొద్విజులు కోటానుకోట్లుగా,
వి. వే.

లోకులు ద్విజులగుటకు పెనుగులాడ నక్కరలేదు. దైవముపై నిజమైన భక్తిగల వారందరును బ్రాహ్మణులే ! బ్రాహ్మణులు సైతము ఉపనయనమునకు ముందు శూద్రులే కదా!

There is no need to struggle to become brahmins. Those who have unwavering devotion for god are all brahmins. Even those born in the brahmin caste are of low-caste until the thread ceremony.

2009
ఈకెలంటజేసె దోకలంటగజేసె గోక లంటజేసె లోకమునకు మానరక్షణంబు మర్యాదయని తెల్ప , వి. వే.

ఈకెలంటజేసె దోకలంటగజేసె
గోక లంటజేసె లోకమునకు
మానరక్షణంబు మర్యాదయని
తెల్ప , వి. వే.

మానరక్షణమే మర్యాదయని తెల్పుటకు దేవుడు పశుపక్షులకు ఈకెలను , తోకలను , మానవులకు కోకలను ఏర్పరచెను

God intended for life forms to cover their genitals in civility by providing feathers to birds, tails to animals and clothes for humans.

2010
ఈ ఘనసూత్ర మెఱు౦గుము నీ ఘటమున శివుడుచేరి యిరవు కొనంగా నే ఘట పటముల కందక తా ఘనుడై యాడుచుండు తథ్యము వేమా

ఈ ఘనసూత్ర మెఱు౦గుము నీ ఘటమున
శివుడుచేరి యిరవు కొనంగా
నే ఘట పటముల కందక తా ఘనుడై
యాడుచుండు తథ్యము వేమా

దేవుడు నీ శరీరమును స్థానముగా చేసికొని లేనిపోని వాదములకు దూరమై వెలయుచున్నాడు . ఇది నిజమని నమ్ముము

God is residing in one's body to distance himself from meaningless arguments.

2011
ఈ చెవి గొరికిన నొల్లరు వాచవులకు విందు మన్న వాక్యంబులచే బూచనుబడుచులు వెఱచిన నా చందములాయె జగములన్నియు వేమా

ఈ చెవి గొరికిన నొల్లరు వాచవులకు
విందు మన్న వాక్యంబులచే
బూచనుబడుచులు వెఱచిన నా చందములాయె
జగములన్నియు వేమా

కలహప్రియులు ఇతరులపై కొండెములు వినుటకు చెవులు నిత్తురుగాని చెవి కొరుకుటకు సమ్మతింపరు . బాలికలు సంగమమునకు భయపడినట్లు బుద్ధిమంతులు కొండెములకు భయపడుదురు

Bellicose people like to offer their ears to hear slander rather than let their ears be bitten. Like girls who are afraid of intercourse, men of good character fear slander.

2012
ఈ తనువునందు జూచిన నే తనువుల కింత యనుచు నెదిరిని తన్ను౦జూతురు లోగా జూపున నాతురముగ దపసు లెల్లన మరగ వేమా

ఈ తనువునందు జూచిన నే తనువుల
కింత యనుచు నెదిరిని తన్ను౦జూతురు
లోగా జూపున నాతురముగ
దపసు లెల్లన మరగ వేమా

తన దేహమందువలెనే అన్ని దేహములందును బ్రహ్మముండునని తెలిసి యోగులు అందరిని తమతో సమానముగా చూచెదరు

Knowing that brahmam resides in all the bodies including theirs, yogis treat all men as equals.

2013
ఉత్తమోత్తముడగు నుర్వి తత్త్వజ్ఞుడు మహిమ జూపువాడు మధ్యముండు వేషధారి యుదర పోషకుండధముండు , వి. వే.

ఉత్తమోత్తముడగు నుర్వి తత్త్వజ్ఞుడు
మహిమ జూపువాడు
మధ్యముండు వేషధారి యుదర
పోషకుండధముండు , వి. వే.

తత్త్వజ్ఞుడు ఉత్తము డనియు , మహిమ జూపువాడు మధ్యము డనియు , పొట్టకయి వేషము వేయు దాంభికుడు అధముండనియు నెరుగవలెను

The man who know tattva is the best of all. The one who shows his greatness is next best. The one who is pompous and wearing a garb is the lowest.

2014
ఉదకమందు మొసలి యుబ్బి యేనుగుబట్టు మతకమేమొ బయల మసలబోదు ఎఱుక మఱుగుదెలిసి యేకమై యట్లుండు, వి. వే.

ఉదకమందు మొసలి యుబ్బి యేనుగుబట్టు
మతకమేమొ బయల మసలబోదు
ఎఱుక మఱుగుదెలిసి యేకమై
యట్లుండు, వి. వే.

మొసలి నీటియందున్నప్పుడు ఏనుగునైనా పట్టుకొనగలదు . అట్లే విజ్ఞానమువల్ల మనస్సును పట్టి, ఐక్యము నొందింపవలెను. బయటనున్న మొసలివలె ఎరుగలేని నీ బ్రతుకు వ్యర్థము

A crocodile can capture even an elephant when inside water. One has to capture mind using knowledge and seek union with it. Like the beached crocodile, not knowing tattva is a waste of life.

2015
అనయ మీసు బాపి యనలంబు చల్లార్చి గోచి బిగియగట్టి కోపమడచి యాశ విడిచెనేని అతడు తా యోగియౌ , వి. వే.

అనయ మీసు బాపి యనలంబు చల్లార్చి
గోచి బిగియగట్టి కోపమడచి
యాశ విడిచెనేని అతడు
తా యోగియౌ , వి. వే.

యోగి కాదలచినవాడు అసూయను, ఆకలిని విడిచి కోపమును చేరనీయక , కామాధులకు లోనుగాక యుండవలెను . ఆశను పూర్తిగా విడువవలెను

One who wants to become a yogi should give up jealousy, hunger, anger, and lust. He has to give up covetousness entirely.

2016
అన్నము తినువేళ నాత్మ రుచులగోరు నదియు నాల్క చెప్ప నడుగుచుండు నాత్మకు దృణమైన నయ్యయో యనరాదు, వి. వే.

అన్నము తినువేళ నాత్మ రుచులగోరు
నదియు నాల్క చెప్ప
నడుగుచుండు నాత్మకు దృణమైన
నయ్యయో యనరాదు, వి. వే.

అనుభవించినకొలది భోగములపై ఆశ వృద్ధి యగును. మనస్సుపై దయ చూపరాదు . ఆత్మ తృణమైనను కోరదు

The more one experiences luxuries, the greedier he gets. One should not sympathize with mind. Aatma doesn't need even a blade of grass.

2017
ఆసకన్న దుఃఖ మతిశయింపగలేదు చూపు నిలుపకున్న సుఖములేదు మనసు నిలుపకున్న మఱి ముక్తిలేదయా , వి. వే.

ఆసకన్న దుఃఖ మతిశయింపగలేదు
చూపు నిలుపకున్న సుఖములేదు
మనసు నిలుపకున్న మఱి
ముక్తిలేదయా , వి. వే.

ఆశకంటె పెద్ద దుఃఖములేదు . చూపు నిలుపకున్నచో బాxకునకు సుఖము కలుగదు . మనస్సు నిలుపలేని వానికి మోక్షము లేదు

There is no bigger sorrow than greed. Without fixating vision on the goal there is no comfort. There is no salvation to one who cannot control his mind.

2018
ఆశ గననివాని ఆశ్రయింపగరాదు ఆశ తీర్చువాని నడుగవలయు ఆశ కలుగునంత కమలుండు కాడయా , వి. వే.

ఆశ గననివాని ఆశ్రయింపగరాదు
ఆశ తీర్చువాని నడుగవలయు
ఆశ కలుగునంత కమలుండు
కాడయా , వి. వే.

కోరిక తీర్చనివాని నాశ్రయింపరాదు . కోరిక తీర్చగల వానినే అడుగవలెను . అయినను , ఆశలు లేనివాడే పరిశుద్ధుడు

One should not associate with a person who can't fulfill his wish. He should ask one who is generous to grant his wish. However, one without a wish has superior character.

2019
ఆశచేత మనుజు లాయువు గలవాళ్ళు తిరుగుచుండ్రు భ్రమలు త్రిప్పలేక ముఱికి భాండమందు ముసురు నీగలవలె , వి. వే.

ఆశచేత మనుజు లాయువు గలవాళ్ళు
తిరుగుచుండ్రు భ్రమలు త్రిప్పలేక
ముఱికి భాండమందు
ముసురు నీగలవలె , వి. వే.

మనుజుడు కోరికలతో బ్రతికియున్నన్ని నాళ్ళును మురికితో నిండిన కుండనై ఈగలు వ్రాలినట్లుందురు . ఆశ కలవాడు భ్రమలను విడిచిపెట్టలేడు

A man with multitude wishes for as long as he lives is like flies buzzing around an unclean pot. The one with greed cannot give up delusions.

2020
ఆశను విడువని జీవికి క్లేశము విడిపింపదరమె కేశవునకు నా యా సాపాశము లెల్లను రోసిన క్లేశంబు విడుచు రూఢిగ వేమా

ఆశను విడువని జీవికి క్లేశము
విడిపింపదరమె కేశవునకు నా
యా సాపాశము లెల్లను రోసిన క్లేశంబు
విడుచు రూఢిగ వేమా

ఆశను విడువనివానికి మోక్ష మిచ్చుటకు కేశవునకైనను సాధ్యముకాదు . క్లేశభూయిష్టమైన ఆశను విడుచుటయే మేలు

Even god cannot grant salvation to one who does not overcome greed. One has to give up greed that lands one in many difficulties.

2021
ఆశ పాపజాతి యన్నిటికంటె నా యాశచేత యతులె మోసపోరె ? చూచి విడుచువారు శుద్దాత్ము లెవరైన , వి. వే.

ఆశ పాపజాతి యన్నిటికంటె నా
యాశచేత యతులె మోసపోరె?
చూచి విడుచువారు శుద్దాత్ము
లెవరైన , వి. వే.

ఆశ మిక్కిలి చెడ్డది . కావున మోసపోక తత్త్వ మెరిగి ఆశను విడుచువారు పరిశుద్ధులు . ఆశవలన మునులే మోసపోయిరి

Greed is evil. The one who is not gullible , knows tattva and gives up greed is the one with superior character. Even sages were misled by greed.

2022
ఆశ పాశము మొదలంటంగా దెగగోసి పాఱవేయకున్న ఫలము గలదె?కొక్కు బోనులోన జిక్కిన చందము , వి. వే.

ఆశ పాశము మొదలంటంగా దెగగోసి
పాఱవేయకున్న ఫలము
గలదె?కొక్కు బోనులోన జిక్కిన
చందము , వి. వే.

ఆశ బంధమువంటిది కావున దానిని పూర్తిగా నశింపజేయవలెను . లేనిచో బోనులోని పందికొక్కునకు వలె విడుదల లేదు

Greed is like bondage. Hence one should destroy it entirely. Otherwise one is like a bandicoot trapped in a cage.

2023
ఆశపాశమెల్ల గోసి వేసినవాని చిత్త మెపుడు గురుని జేరియుండు మోహపాశమున్న మోక్ష మెక్కడదియా , వి. వే.

ఆశపాశమెల్ల గోసి వేసినవాని
చిత్త మెపుడు గురుని జేరియుండు
మోహపాశమున్న మోక్ష
మెక్కడదియా , వి. వే.

ఆశలను విడిచి గురువు నాశ్రయించినచో ముక్తి కలుగును. చిత్తశుద్ధి కలుగును . మోహమున్నచో మోక్షమే లేదు

Giving up greed, if one approaches a guru salvation is possible. One's heart will be cleansed. Without giving up lust, there is no salvation.

2024
ఆశయనెడు దాని గోసివేయగలేక మోహబుద్ధివలన మునుగువారు కాశివాసులైన గనబోరు మోక్షము , వి. వే.

ఆశయనెడు దాని గోసివేయగలేక
మోహబుద్ధివలన మునుగువారు
కాశివాసులైన గనబోరు
మోక్షము , వి. వే.

ఆశకు లొంగి మోహమున పడినవారు కాశిలో నివశించినను ముక్తిని పొందలేరు

One who has yielded to greed and lust, even when living in a holy place like kaasi, cannot attain salvation.

2025
ఆశయె యుహపరసౌఖ్య వినాశము భవబంధములకు , నయముగ దానే యీశుని గనుగొన నీయదు ఆశ వినాశంబె పరమ మవనిని వేమా

ఆశయె యుహపరసౌఖ్య వినాశము
భవబంధములకు , నయముగ దానే
యీశుని గనుగొన నీయదు ఆశ వినాశంబె
పరమ మవనిని వేమా

ఆదిత్యములగు ఇహ , పరలోక సుఖములు లేకుండ జేయుటకు ఆశయే కారణము . మానవుని నశింపజేయుటకును పరుని సన్నిధికి పోవుటకు ఆశను విడుచుట ముఖ్యము

Greed is responsible for not providing comfort in this and after life. To seek communion with nether world one has to give up greed.

2026
ఆశయనెడి త్రాళ్ళ నఖిల జనంబులు కట్టువడుచు ముక్తి గానరైరి జ్ఞాన ఖడ్గమునను ఖండింపరాదొకో , వి. వే.

ఆశయనెడి త్రాళ్ళ నఖిల జనంబులు
కట్టువడుచు ముక్తి
గానరైరి జ్ఞాన ఖడ్గమునను
ఖండింపరాదొకో , వి. వే.

ఆశాపాశములచే కట్టబడి జనులందరును మోక్షమును గాంచలేకున్నారు . ఆశను మొదలంట కోయుటకు జ్ఞాన ఖడ్గము కావలెను. కావున జ్ఞానము నార్జింపవలెను

Men are not able to attain salvation by being tied with greed. One needs knowledge like a sword to cut the greed at its root. Hence one needs to become knowledgeable.

2027
ఆశలుడుగగానె పాశముక్తుడు కాడు ముక్తుడైన గాని మునియుగాడు మునియునైనగాని మోహంబు లుడుగవు , వి. వే.

ఆశలుడుగగానె పాశముక్తుడు
కాడు ముక్తుడైన గాని మునియుగాడు
మునియునైనగాని మోహంబు
లుడుగవు , వి. వే.

ఆశ పూర్తిగా పోయిననే గాని పాపము నశింపదు . పాపములు నశించినగాని ముని కాజాలడు . మునియైననే గాని అజ్ఞానము నశింపదు

Without giving up greed, the sins cannot be washed away. A person can't become a sage without absolving all of his sins. Ignorance won't go away without one becoming a sage.

2028
ఇంత వగవనేల? ఏకాంత బుద్ధిని హరిహరాదులందు నాసలుడిగి వాసన తెలిసినవాడె పోబ్రహ్మము , వి. వే.

ఇంత వగవనేల? ఏకాంత బుద్ధిని
హరిహరాదులందు నాసలుడిగి
వాసన తెలిసినవాడె
పోబ్రహ్మము , వి. వే.

ఇంత ఆలోచన యేల? హరిహరాదులందు భేదబుద్ధిని విడిచిపెట్టి, పూర్వవాదుల తత్త్వము నెరిగిన యెడలనే బ్రహ్మత్వము సిద్ధించును

One has to give up discriminating between Lord Siva and Lord Vishnu, and know the tattva of poorva-vaadi to attain brahmam. [A poorva-vaadi has these attributes: 1. పంచలక్షణి (panchalakshiNi), 2. వ్యధికరణము (vyadhi karaNamu), 3. సిద్ధాంత లక్షణము (siddhanta lakshaNamu), 4. అవచ్ఛేదకత్వనిరుక్తి (avachchEdakatva nirukti), 5. పక్షత (pakshata). Basically a poorva-vaadi carries out rational argumentation.]

2029
ఇంద్రపదవి గోరియింపుగా యజ్ఞముల్ కలిమిచేత జేసి కాములైరి పరమయోగమూని పట్టగలేమిని , వి. వే.

ఇంద్రపదవి గోరియింపుగా
యజ్ఞముల్ కలిమిచేత జేసి
కాములైరి పరమయోగమూని పట్టగలేమిని,
వి. వే.

యోగమువలన పరమును సాధించలేని యవివేకులు స్వర్గమునుకోరి యాగములు చేయుదురు . వారికి కోరికలు నశింపలేరు . వారు కలిమియున్నందుకు కామసుఖములనే కోరుదురు

The foolish people who can't attain salvation by becoming yogis, perform rituals (yaaga) hoping to reach heaven. They can't suppress their desires. Being wealthy, one craves to fulfill his lust.

2030
ఇది నాకు జాలదనుచును మదిలో దా నెపుడు తలచి మమతగను మతిం బొదలుచు విడువం జాలని దదియే సంసార బీజ మనబడు వేమా

ఇది నాకు జాలదనుచును మదిలో
దా నెపుడు తలచి మమతగను మతిం
బొదలుచు విడువం జాలని దదియే
సంసార బీజ మనబడు వేమా

ఉన్నదానితో తృప్తిపడక "చాలదు చాల" దని అసంతృప్తితో ఉండుటయే సంసారమునకు కారణము

The reason for bondage is when one is not satisfied with what one has and lives with the sorrow that “not enough” has been garnered.

2031
ఇదియె పరమటంచు మదికి దోచినజాలు మనసు చెదరు కోర్కె మట్టుపఱచి సుదను గ్రోలువాడు సుడిబడి చచ్చునా? వి. వే.

ఇదియె పరమటంచు మదికి దోచినజాలు
మనసు చెదరు కోర్కె మట్టుపఱచి
సుదను గ్రోలువాడు
సుడిబడి చచ్చునా? వి. వే.

తాననుభవించునదియే ఉత్తమమనుకొని మనస్సును చెదరనీయక ఆత్మబోధామృతమును క్రోలువానికి మరణమే లేదు

The one who thinks of what he experiences is good, doesn't let his mind wander and always craves for aatma-bodha (teachings about aatma) amritam (elixir that makes one immortal), has no death.

2032
ఎక్కుడైన యాస వినుమడియై యుండ దిక్కుపట్టి నరుడు తిరుగుచుండు కుక్కవంటి యాశ కూర్చుండనీయదు , వి. వే.

ఎక్కుడైన యాస వినుమడియై యుండ
దిక్కుపట్టి నరుడు తిరుగుచుండు
కుక్కవంటి యాశ
కూర్చుండనీయదు , వి. వే.

ఒక కోరికపై ఇంకొకటి వృద్ధియగుచు మనుజుని తిప్పలు పెట్టుచుండును . కుక్కవంటి యీ ఆశ ఒక చోట నుండనీయదు

Wishes one after another confuse a man. Like a dog an unfulfilled wish makes one not remain still.

2033
కన్నెల నవలోకింపగ జన్నులపై దృష్టి పాఱు సహజం బిలలో కన్నుల కింపగు దృష్టిని తన్నెఱుగుట ముక్తికిరవు తగునిది వేమా

కన్నెల నవలోకింపగ జన్నులపై దృష్టి
పాఱు సహజం బిలలో కన్నుల
కింపగు దృష్టిని తన్నెఱుగుట
ముక్తికిరవు తగునిది వేమా

నరుని చూపులు యువతుల చన్నులపైనే ప్రసరించును . అట్లు కాక మనస్సును తనలోనున్న పరముని పైకి పోనిచ్చిన , ముక్తి కల్గును

A man gazes at the bosom of a young woman. Instead if he directs his mind to the god within, he can attain salvation.

2034
కన్నెవరుడు చేరి కదియంగ నొక్కప్పు డుచ్చయందు బిండ ముద్భవించు హెచ్చుకులజు డెవడు హీను డెవండురా ? వి. వే.

కన్నెవరుడు చేరి కదియంగ నొక్కప్పు
డుచ్చయందు బిండ ముద్భవించు
హెచ్చుకులజు డెవడు
హీను డెవండురా ? వి. వే.

యువతీయువకులు సంగమించిన పుత్రుడు కలుగును. ఇది అందరికిని సమానమే . ఇట్టి స్థితిలో ఒక డెక్కువ , ఒకడు తక్కువ అని చెప్పుట అవివేకము

When a couple has intercourse they give birth to a child. To this extent all are equal. It is not possible to say one is superior and one is inferior.

2035
కమల భవుడు చేయు కడు సృష్టియందురు హరి భరించు జంపు హరుడటండ్రు మూర్తు లెందఱైన మూలమొక్కటియెరా, వి. వే.

కమల భవుడు చేయు కడు సృష్టియందురు
హరి భరించు జంపు హరుడటండ్రు
మూర్తు లెందఱైన
మూలమొక్కటియెరా, వి. వే.

బ్రహ్మ సృష్టిచేయునని, విష్ణువు పోషించునని, శివుడు నశింపజేయునని అందురు. ఈ మువ్వురికీని మూలమైన పరబ్రహ్మ మొక్కటే! ఈ తత్త్వమును తెలిసికొనుము

People say Lord Brahma creates the world, Lord Vishnu sustains/rules it, Lord Siva destroys it. One has to learn the tattva that there is parabrahmam at the root of these three.

2036
కల్యమారగించి కన్నులు ముకుళించి బిఱ్ఱ బిగిసియుండు బీదయోగి మేకపోతువలెను మెఱ మెచ్చులకునయి , వి. వే.

కల్యమారగించి కన్నులు ముకుళించి
బిఱ్ఱ బిగిసియుండు
బీదయోగి మేకపోతువలెను మెఱ
మెచ్చులకునయి , వి. వే.

కొందరు చలిదియన్నము మెక్కి మైకమున కనులు మూసుకొని మేకపోతులవలె బలిసి తాము యోగులమని నటింతురు

Some eat large quantities of food, become obese like fattened animals and claim they are yogis.

2037
కలిగినట్టులుండు గలుగక యుండును మఱియు లేకయుండు మఱియు గలుగు నాశకొలదిని శివు డందించుచుండును , వి. వే.

కలిగినట్టులుండు గలుగక యుండును
మఱియు లేకయుండు మఱియు
గలుగు నాశకొలదిని శివు డందించుచుండును,
వి. వే.

భగవంతుడు జనులకు వారివారి నిష్ఠలనుబట్టి కొందరికి ఉన్నట్లు తోచును. కొందరికి లేనట్లు తోచును. కొందరికి ఉండియు నుండనట్లు తోచును

Depending one one's disposition, god seems to be present, absent and in between.

2038
కావవలయు మగడు కాంత నెల్లప్పుడు కావలేనివాడు చావవలయు కాపులేనిదాని కాపురంబడుగనా, వి. వే.

కావవలయు మగడు కాంత నెల్లప్పుడు
కావలేనివాడు చావవలయు
కాపులేనిదాని కాపురంబడుగనా,
వి. వే.

మగడు భార్యనెప్పుడును భద్రముగా ఉంచవలెను. అట్లు చేయలేనప్పుడు చచ్చుట మేలు . అదుపులోలేని యాడుదాని కాపురము నడుగనక్కరలేదు

A man should protect his wife. If he can't do that he rather die. There is no need to talk about the life of an uncontrolled woman.

2039
కాశి మధుర కంచి గయ ప్రయాగల సేతు వాసతోడ వీని నాత్మజూచి వాసన నెఱుగమి వట్టి వెట్టి విధంబు, వి. వే.

కాశి మధుర కంచి గయ ప్రయాగల
సేతు వాసతోడ వీని నాత్మజూచి
వాసన నెఱుగమి వట్టి
వెట్టి విధంబు, వి. వే.

వాసనను గ్రహింపజాలని యెడల కాశి, మధుర, కంచి, గయ, ప్రయాగ, సేతువు మున్నగు పుణ్యక్షేత్రములకు పోయినను ప్రయోజనములేదు

If one doesn't understand the subconscious impressions which are stored up as a result of past experiences or actions , there is no need to go to holy places like Kaasi, Madhura, Kanchi, Gaya, Prayaaga, etc.

2040
కుక్క యే మెఱుగును గురులింగదేవర నక్కపోతెఱుగునే యొక్క ప్రొద్దు మొక్కడీ డికెపుడు మోక్షమొందగనౌను ? వి. వే.

కుక్క యే మెఱుగును గురులింగదేవర
నక్కపోతెఱుగునే యొక్క
ప్రొద్దు మొక్కడీ డికెపుడు
మోక్షమొందగనౌను ? వి. వే.

గురులింగదేవరను గూర్చి కుక్కకేమి తెలియును? ఉపవాసమును గూర్చి యెరుగునా? అల్పుడధికుని గూర్చి తెలిసి మోక్షమెట్లు పొందును?

What does a dog know about a person called Guru Linga Devara? Does it know about fasting? How can a low-life by merely knowing a superior person attain salvation?

2041
చిత్తమనెడి వేరు శిథిలమైనప్పుడే ప్రకృతియనెడి చెట్టు పడును పిదప గోర్కులనెడి పెద్ద కొమ్మ లెండును గదా, వి. వే.

చిత్తమనెడి వేరు శిథిలమైనప్పుడే
ప్రకృతియనెడి చెట్టు పడును
పిదప గోర్కులనెడి పెద్ద కొమ్మ
లెండును గదా, వి. వే.

మనస్సనెడి వేరు తెగిననేగాని మాయ యనెడి వృక్షము నశింపదు . అప్పుడే ఆశలనెడి కొమ్మ లెండిపోయి ముక్తిని పొంద వీలగును

Unless the root called mind is cut away from a tree of maaya (illusion), the tree won't die. That's when its branches called desires will be severed from the tree.

2042
చిత్తవృత్తులు మదియందు జేరనీక రిత్తబయలున గుఱి మించి రేయంబవలు ముక్తుడై యుండువాడె పో మాన్యుడరయ సత్త తెలిసియె దరిజేర సరవి వేమ

చిత్తవృత్తులు మదియందు జేరనీక రిత్తబయలున
గుఱి మించి రేయంబవలు ముక్తుడై
యుండువాడె పో మాన్యుడరయ
సత్త తెలిసియె దరిజేర సరవి వేమ

వికల్పములను మనస్సునందు పుట్టనీయక చిత్స్వరూపమును ధ్యానించుచుండువాడే ఉత్తమ యోగి. ఎదుటి వారి శక్తి తెలిసియే ఆశ్రయింపవలెను

Without giving raise to doubts in the mind, one who meditates on chit-swaroopa is a superior yogi. One has to know the strength of a person before approaching him.

2043
చక్కెఱ కలిపి తినంగా ముక్కిన తవుడైన లెస్స మోహము కదుర న్వెక్కుడు బానిసయైనన్ మక్కువ గను దివ్యభామ మహిలో వేమా

చక్కెఱ కలిపి తినంగా ముక్కిన
తవుడైన లెస్స మోహము కదుర న్వెక్కుడు
బానిసయైనన్ మక్కువ
గను దివ్యభామ మహిలో వేమా

చక్కెర కలిపినచో ముక్కిన తౌడుకూడ రుచిగా నుండునట్లు మోహము కల్గినచో దాసియు దివ్య స్త్రీవలె కానవచ్చును

With sugar even rice husk is tasty. Similarly when lust over-powers even a servant woman will look like a great lady.

2044
చదువులందు రాజ పదవులందును పాడి మొదవులం స్త్రీల పెదవులందు నాశలుడిగినట్టి యయ్యలు ముక్తులు, వి. వే.

చదువులందు రాజ పదవులందును
పాడి మొదవులం స్త్రీల పెదవులందు
నాశలుడిగినట్టి యయ్యలు
ముక్తులు, వి. వే.

చదువులందును , పదవులందును, పాడిపశువులందును, స్త్రీలయందును ఆశ విడిచినవారే ముక్తి పొందుదురు

One who gives up desires on education, positions of power, cattle and farming, and women can attain salvation.

2045
చనువా రెల్లను జనులం జనిపోయిన వారి పుణ్య సత్కతలెల్లన్ వినవలె గనవలె మనవలె నని ఋషులకు దెలుపగూడ దంత్యము వేమా

చనువా రెల్లను జనులం జనిపోయిన
వారి పుణ్య సత్కతలెల్లన్
వినవలె గనవలె మనవలె నని ఋషులకు
దెలుపగూడ దంత్యము వేమా

చనిపోయిన యుత్తముల చరిత్రలను శ్రద్ధగా విని , వారివలెనే నడచుకొనుచు ముక్తిని యత్నింపవలెను . తన యంత్యములను గూర్చి ఎవ్వరికిని తెలుపగూడదు

One has to read the biographies of people with superior character who have died and emulate them to try for salvation. One should never inform others how he would like to die.

2046
జననమునకు మున్ను జనని గర్భములోన మునుపు చేసినట్టు ముష్కరంబ ననుభవించి యునికి నాశలు విడువరు , వి. వే.

జననమునకు మున్ను జనని గర్భములోన
మునుపు చేసినట్టు ముష్కరంబ
ననుభవించి యునికి
నాశలు విడువరు , వి. వే.

తాను పుట్టుటకుముందు తల్లి గర్భములో తన కర్మ ఫలముల ననుభవించియు , పుట్టిన పిదప ఆశలను విడువకున్నారు

Even when one experiences the fruit of his karm while in mother's womb, once born he is unable to give up greed.

2047
జన్మము నెత్తిన మనుజుడు చిన్మయ పరిపూర్ణమహిమ చిత్తము నెఱుగన్ తన్మయత నొందనేర్చును చిన్మయ బరమేశు మదిని జేర్చును వేమా

జన్మము నెత్తిన మనుజుడు చిన్మయ
పరిపూర్ణమహిమ చిత్తము నెఱుగన్
తన్మయత నొందనేర్చును చిన్మయ
బరమేశు మదిని జేర్చును వేమా

మనుజుడు చిద్రూపమహిమ నెరిగిన యెడల తన్మయత్వమును పొంది పిదప ఈశ్వరుని చేరగలుగును

One who is aware of the greatness of chit-roopa will be blissful. He then can attain Iswara.

2048
జాతివారలెల్ల జాతి విద్యలునేర్చి జాణలైరి మీఱి జగతిలోన బ్రాహ్మణులను వారు బ్రహ్మము నెఱుగరు , వి. వే.

జాతివారలెల్ల జాతి విద్యలునేర్చి
జాణలైరి మీఱి జగతిలోన
బ్రాహ్మణులను వారు బ్రహ్మము
నెఱుగరు , వి. వే.

ఆయా జాతులవారు తమతమ జాతుల విద్యలను నేర్చి నేర్పరులగుచున్నారు . బ్రాహ్మణులు తమ జాతికి తగిన బ్రహ్మవిద్యలో కృతార్థులు కాలేకున్నారు

The people in various castes are able to transmit their trade to the offspring. Brahmins are unable to succeed in learning about brahmam.

2049
జిహ్వరుచుల గోరు జీవించు నంతకు సతియు బతియు గోరు సుతుల ధనము హవ్యవహుడు చూడనందఱగోరును , వి. వే.

జిహ్వరుచుల గోరు జీవించు
నంతకు సతియు బతియు గోరు
సుతుల ధనము హవ్యవహుడు చూడనందఱగోరును,
వి. వే.

బతికియున్నంతకాలము నాలుక రుచులను కోరుచుండును . భార్యాభర్తలు పుత్రులను సంపదలను కోరుదురు. అగ్ని అందరిని మ్రింగుటనే కోరుచుండును

For as long as one lives, the tongue craves for food. wife and children want wealth. And fire seeks to destroy everything in its path.

2050
జిహ్వలంపటంబు జీవనంబైయుండు జిహ్వలంపటంబె జీవపోష జిహ్వచేత నరులు చీకాకు పడిరయా , వి. వే.

జిహ్వలంపటంబు జీవనంబైయుండు
జిహ్వలంపటంబె జీవపోష
జిహ్వచేత నరులు చీకాకు
పడిరయా , వి. వే.

జిహ్వలంపటము పోగొట్టుకొన సాధ్యముకాదు . నరులు జిహ్వచాపల్యమునకు లోనై పెక్కు కష్టములు పడుచుందురు

It is not possible to give up tasty food. Men are being enslaved by their taste for food and landing in great difficulties.

2051
జీవము దెలిసిన జెలగి మది చలించు దైవ మగుపడినను దగులు బుద్ధి దీప్త భానుని గని తిమిరంబు నిలుచునా? వి. వే.

జీవము దెలిసిన జెలగి మది చలించు
దైవ మగుపడినను దగులు
బుద్ధి దీప్త భానుని గని తిమిరంబు
నిలుచునా? వి. వే.

జీవస్వరూపాము తెలిసినచో మనస్సు కుదుటబడును . పిదప దైవమగుపడును . ప్రకాశించు సూర్యుని యెదుట చీకటులు నిలువలేవు కదా!

If one understands the form of jiva, one's mind will be in peace. Then god will deify. There is no darkness when the bright sun shines.

2052
జీవాధారము నీరము జీవాధారంబు గాలి చెలగుచు నుండున్ కావలసిన నవి యొక్కరి ఈవినికోరకయె చిక్కు నిలలో వేమా

జీవాధారము నీరము జీవాధారంబు
గాలి చెలగుచు నుండున్ కావలసిన
నవి యొక్కరి ఈవినికోరకయె
చిక్కు నిలలో వేమా

సమస్త జీవులకును బ్రతుకుట కాధారములైన గాలి, నీరు ఇతరాపేక్ష లేకుండ లభించునట్లు భగవంతుడు చేసి యున్నాడు. అతని మహిమ వర్ణనానీతము

For all creatures to support life god has provided air and water. His glory is indescribable.

2053
ఎక్కడి సుతు లెక్కడి సతు లెక్కడి బంధులు సఖులు నెక్కడి భృత్యుల్ ? డొక్కు పడిపోవు వేళల జక్కటికిని నెవరురారు సహజము వేమా

ఎక్కడి సుతు లెక్కడి సతు లెక్కడి
బంధులు సఖులు నెక్కడి భృత్యుల్?
డొక్కు పడిపోవు వేళల జక్కటికిని
నెవరురారు సహజము వేమా

మరణించు సమయమున బంధువులుగాని , మిత్రులుగాని, భార్యాపుత్రులుగాని వెంటరారుగదా! ఇది సహజము. వీరిపై మమకారము పెట్టుకొనకూడదు

At the time of death the relatives, friends, wife and children don't follow. This is natural. One should not pin hopes on them.

2054
ఏది కులము నీకు? నేది స్థలంబురా? పాదుకొనుము మదిని పక్వమెఱి ౦గి యాదరించు దాని నవలీల ముట్టరా , వి. వే.

ఏది కులము నీకు? నేది స్థలంబురా?
పాదుకొనుము మదిని పక్వమెఱి
౦గి యాదరించు దాని
నవలీల ముట్టరా , వి. వే.

నికుల స్థలాదులను గూర్చి యోచింపక మనస్సును పరిపక్వము చేసికొని వైరాగ్యమును పొందుము. పిదప నీ వీశ్వరుని చేరగలుగుదువు

Without thinking about caste and domicile one should reform his mind and seek renunciation. Then he can attain Iswara.

2055
ఒక్క తనువు నకిలబెక్కు పాట్లను బడి పెక్కుదినము లెల్ల ప్రేలి ప్రేలి అగ్నిలోనబడునొ ? అల నక్కపాలౌనొ తెలియుమయ్య యికను దీని వేమ

ఒక్క తనువు నకిలబెక్కు పాట్లను బడి
పెక్కుదినము లెల్ల ప్రేలి ప్రేలి
అగ్నిలోనబడునొ ? అల నక్కపాలౌనొ
తెలియుమయ్య యికను దీని వేమ

ఈ తుచ్చ శరీరమునకై పడరానిపాట్లు పడి పెక్కు దినములు నోటికి వచ్చినట్లు ప్రేలుచు జనుడు తన గతి నెరుగకున్నాడు . చివరికా శరీరము నిప్పుపాలగునో నేలపాలగునో

One is facing travail in taking care of the body and abusing unfettered freedom of speech without knowing his path. At the end the body will be either burnt or buried under the earth.

2056
కచము కక్ష్యంబు నోరును గనులు వేమ నాభియను బాహుమూలంబు నాతికెపుడు నోర్వదగనట్టి గవులుతో నొప్పుచుండు నింతకే యేల నింతిపై భ్రాంతి వేమ

కచము కక్ష్యంబు నోరును గనులు వేమ
నాభియను బాహుమూలంబు నాతికెపుడు నోర్వదగనట్టి
గవులుతో నొప్పుచుండు
నింతకే యేల నింతిపై భ్రాంతి వేమ

నరులు మోహముచెంది యువతుల కచకచాదులను అందమైనవిగా భ్రాంతి పడుదురేకాని వారి చంకలు, నాభి మున్నగునవి దుర్గంధపూరితములని తెలియలేకున్నారు

Lustful men delude about women and only think about their beauty. They don't realize their armpits, navel, etc. are foul smelling.

2057
కండ లెముకలు నెత్తురు గలిగి తనువు మూత్ర మలములతో నుండు ముట్టరాక కాయజుని బాణమంచాస కల్గజెడును ఆశబాపెడి విధమును నరయ వేమ

కండ లెముకలు నెత్తురు గలిగి తనువు
మూత్ర మలములతో నుండు ముట్టరాక
కాయజుని బాణమంచాస కల్గజెడును
ఆశబాపెడి విధమును నరయ వేమ

కండలు, ఎముకలు, రక్తము, మలమూత్రములు మున్నగు వానితో నిండిన స్త్రీ శరీరము మన్మథుని బాణమని నరులు భ్రాంతి పడుదురు. ఆశను నశింపజేసికొనుటే మేలు

A woman's body is full of muscle, bones, blood and waste material. Under the influence of cupid (Manmatha) men are deluding about them. It is better to suppress the desires.

2058
కడుపులోని మలము కడమవి యెముకల కలదు మాంసమింత కప్పుతోలు మలము నెత్తిమీది మ్రానెట్టు కలుగురా ? వి. వే.

కడుపులోని మలము కడమవి యెముకల
కలదు మాంసమింత కప్పుతోలు
మలము నెత్తిమీది మ్రానెట్టు
కలుగురా ? వి. వే.

లోపల రక్తమాంసములు , ఎముకలు, మలము - పైని తోలు తప్ప శరీరమనగా ఏమున్నది? దీనిపై వలపెట్లు కలుగునో గదా! ఇట్టి దేహము నాశ్రయించియున్న వారికి ముక్తి యెట్లు కల్గును ?

With muscle, blood, bones and waste material the body is covered by skin, what else? How can one be enamored by it? How can men attached to their bodies attain salvation?

2059
కడుపులోని రోత కడు నోటి యెంగిలి కడుగవశమె బ్రహ్మ కొడుకునకును సత్యమున్న గొంతు జగతిపై సిద్ధించు , వి. వే.

కడుపులోని రోత కడు నోటి యెంగిలి
కడుగవశమె బ్రహ్మ కొడుకునకును
సత్యమున్న గొంతు జగతిపై
సిద్ధించు , వి. వే.

కడుపులో రోత కలిగించు మలమూత్రములు, నోటిలో ఎంగిలి . ఇట్టి శరీరము కాలవానికి ముక్తి యెట్లు కలుగును? అయినను సత్యము పలికినచో కొంత ఫలముండును

With body holding waste material in the gut and spittle in the mouth, how can one attain salvation? However, when one is truthful there could be hope.

2060
కన్నెదానిమేను కస్తూరి వాసన ముసలిదాని మేను మురికికంపు వయసుదాని మేను వర్ణింప శక్యమా , వి. వే.

కన్నెదానిమేను కస్తూరి వాసన
ముసలిదాని మేను మురికికంపు
వయసుదాని మేను వర్ణింప
శక్యమా , వి. వే.

విషయాసక్తులగు మానవులు కన్నె శరీరము కస్తూరి వాసన కలదని, ముసలిదాని యొడలు కంపు కొట్టునని, యువతీ దేహమును వర్ణింప శక్యము కాదనియు వర్ణింతురు

Men who are attached to the world claim a young woman's body smells like perfume, an old woman's body smells foul and a young woman's beauty is indescribable.

2061
కాలముల మహిమ తెలియక వాలాయము నిత్యమనుచు వరలుదు రింతే ఏలనొ కాలము దెలియరు వాలాయము జాటుమయ్య వసుమతి వేమా

కాలముల మహిమ తెలియక వాలాయము
నిత్యమనుచు వరలుదు రింతే
ఏలనొ కాలము దెలియరు వాలాయము
జాటుమయ్య వసుమతి వేమా

మనుజులు కాలగతి నెరుగక తామే శాశ్వతులమని తలచి దుర్విషయములకు చిక్కి మూర్ఖులై నశించుచుందురు

Men not realizing the relentless passage of time, think of themselves as immortal, get caught up in bad acts and die as fools.

2062
కాలవశము బట్టి కర్మజీవి గణంబు మత్తులగుచునుండి మఱచినారు మత్తులైన జనులు మనసేటి మనసయా ? వి. వే.

కాలవశము బట్టి కర్మజీవి
గణంబు మత్తులగుచునుండి మఱచినారు
మత్తులైన జనులు
మనసేటి మనసయా ? వి. వే.

కాలవశమున , కర్మవశమున పుట్టిన ప్రాణులందరును మదోన్మత్తులై తమ్ముతా మెరుగక చిక్కులు పడుచున్నారు. మదించియున్న వారి మనస్సు సరియైన మనస్సు కాదు

All life forms born in time and out of karma, are becoming egotists and landing in troubles without realizing who they are. An egotistic person's mind is not clam.

2063
కాలి సంకెల యగు గరిమతో దన భార్య చేతివిరిచికట్లు శిశువులెల్ల సరిపడ చెరసాల సంసార కూపంబు , వి. వే.

కాలి సంకెల యగు గరిమతో దన
భార్య చేతివిరిచికట్లు శిశువులెల్ల
సరిపడ చెరసాల
సంసార కూపంబు , వి. వే.

సంసారమున భార్య సంకెల, శిశువులు చేతులు విరిచి కట్టిన కట్లు . కూపమువంటి సంసారమే చెరసాల. ఈ సంసార బంధమును తొలగించుకొన యత్నింపవలెను

In bondage, wife is the shackles, children are the rope with which hands are tied, and living with them is a prison. One has to try to free himself from such bondage.

2064
కైపు వస్తువులను కాంక్షించి సేవింప కాని పనులొనర్చు మేనెఱుగక అట్లు పూను వారి నధముల టందురు , వి. వే.

కైపు వస్తువులను కాంక్షించి
సేవింప కాని పనులొనర్చు
మేనెఱుగక అట్లు పూను వారి
నధముల టందురు , వి. వే.

మత్తువస్తువులను తిన్నయెడల ఎట్టి అకృత్యములనైనను పాపకార్యములనైనను చేయవచ్చును. అట్లు చేయు వానిని అందరును అధముడని నిందింపక తప్పదు

When one indulges in intoxicating food, he will do any kind of sinful and unlawful acts. Everyone calls him a low-life.

2065
జన్మముల నికెన్ని జన్మంబు లెత్తురు? కర్మ ధర్మములకు గణనయెంతో ? కర్మ ధర్మములను గడతేఱ లేరయా! వి. వే.

జన్మముల నికెన్ని జన్మంబు
లెత్తురు? కర్మ ధర్మములకు
గణనయెంతో ? కర్మ ధర్మములను
గడతేఱ లేరయా! వి. వే.

మానవుడెన్ని జన్మము లెత్తవలెనో , తాను చేసిన కర్మముల ఫలమనుభవించుచుండ వలెనే కదా, కర్మములవల్ల నరుడు కడతేరడు

The birth-death cycle of one is based on one's karma that has to be carried out to fruition. A man won't attain salvation by performing karma.

2066
జన్మము వదలి వేరు జన్మంబు లెత్తగ కర్మ ధర్మములకు గణనకలదె ? కర్మ ధర్మములను కడతేఱ వచ్చునా? వి. వే.

జన్మము వదలి వేరు జన్మంబు
లెత్తగ కర్మ ధర్మములకు గణనకలదె?
కర్మ ధర్మములను
కడతేఱ వచ్చునా? వి. వే.

జీవుడు ఒక జన్మ విడిచి వేరొక జన్మము నెత్తుచు , ఆ జన్మయందును కర్మములు చేయుచునే యుండును. ఇట్లు కర్మములకు లెక్కయే లేదు . కర్మములనుండి కడతేరుట సాధ్యమా?

A jiva moves from one birth to another while doing karma during all of his lives. There is no limit to how much karma one has to do. Is it possible to free oneself from karma?

2067
ధనమెచ్చిన మదమెచ్చును మదమెచ్చిన దుర్గుణంబు మానకహెచ్చున్ ధనముడిగిన మదముడుగును మదముడిగిన దుర్గుణంబు మానును వేమా

ధనమెచ్చిన మదమెచ్చును మదమెచ్చిన
దుర్గుణంబు మానకహెచ్చున్
ధనముడిగిన మదముడుగును మదముడిగిన
దుర్గుణంబు మానును వేమా

ధనమధికమైన గర్వ మధికమగును , దుర్గుణము హెచ్చును . ధనము లేనిచో మదము, దానినిబట్టి దుర్గుణము నశించును

One becomes proud with wealth and develops a bad character. Without wealth one is not egotistical and one's bad qualities are destroyed.

2068
ధర విరక్తితోడ తలపుల విడువమి తనకు దగులునట్లు తత్త్వ మరయ తత్త్వమరయ తాను తానగు బ్రహ్మంబు , వి. వే.

ధర విరక్తితోడ తలపుల విడువమి
తనకు దగులునట్లు తత్త్వ
మరయ తత్త్వమరయ తాను తానగు
బ్రహ్మంబు , వి. వే.

విరక్తుడైనను కోరికలను విడువనియెడల తత్త్వము తెలియజాలదు . తత్త్వము నెరిగినపుడే ఆ తత్త్వము తానేయని గ్రహించి బ్రహ్మత్వమును పొందవీలగును

Even after renunciation if one does not leave behind desires, then he can't acquire tattva. One can attain brahmam by knowing tattva and realizing it is self.

2069
నడజీవులు స్థావరములు వడి చని పోవంగ నెఱిగి బావములోనన్ విడువక బ్రహ్మము తలపరు వడి చనిపోకుందరేమొ వసుధను వేమా

నడజీవులు స్థావరములు వడి చని
పోవంగ నెఱిగి బావములోనన్
విడువక బ్రహ్మము తలపరు వడి
చనిపోకుందరేమొ వసుధను వేమా

జంగమములు, స్థావరములును కాలవశమున వృద్ధిని క్షయమును పొందుచుండును . దీనిని కనులార చూచుచుండియు మానవులు తాము స్థిరులమనుకొని బ్రహ్మమును తలుపకున్నారు

Lives that are jangama (locomotion) and sthavara (fixed location) over time evolve and die. Even though men witness this, they think they are immortal and don't pray to brahmam.

2070
ధరగిరులు జలధులన్నియు బరికింపగ ప్రళయమునను భస్మములయ్యా సురలును మునులును జనగా నెఱయోధు లిటుండగలరె నేర్పున వేమా

ధరగిరులు జలధులన్నియు బరికింపగ
ప్రళయమునను భస్మములయ్యా సురలును
మునులును జనగా నెఱయోధు
లిటుండగలరె నేర్పున వేమా

ప్రళయకాలమున పర్వతములు, సముద్రములు నశించును . దేవతలు, మునులు నశింతురు. ఇక తక్కిన వారిమాట లెక్క యేమి? సర్వము అస్థిరమైనదే గదా!

When pralaya (the end of the world) occurs, mountains, oceans, gods and sages will be destroyed along with the rest of the creation. All things born are perishable.

2071
ధరబుట్టి భోగినైతిని పరమం దిచ్చనటుమాని పడతులకై నే తిరిగి యలసితిని ద్రవ్యము మఱియార్జింతిని కడకు మరణమె వేమా

ధరబుట్టి భోగినైతిని పరమం దిచ్చనటుమాని
పడతులకై నే తిరిగి
యలసితిని ద్రవ్యము మఱియార్జింతిని
కడకు మరణమె వేమా

పశ్చాత్తాపుడైన మానవుడు "నేను పుట్టి సుఖములు కోరి పడతులకై తిరిగితిని . పరమునుగూర్చి తలపనైనను లేదు. ఆశతో దనమార్జింతిని . మిగిలినది మరణమే" అని యనుకొనును

One repents over his desire for women, for not thinking about after life, and greed for wealth when all that is left is death.

2072
భుక్తిని మిక్కిలి విషయా సక్తత దా దిరుగుచుండు సత్రములందున్ భుక్తిని ముక్తి లభింపదు భక్తిని జీవునకు ముక్తి భద్రము వేమా

భుక్తిని మిక్కిలి విషయా సక్తత
దా దిరుగుచుండు సత్రములందున్ భుక్తిని
ముక్తి లభింపదు భక్తిని
జీవునకు ముక్తి భద్రము వేమా

మానవుడు తిండికై సత్రములకై తిరుగుచు విషయాసక్తుడై యుండుటవల్ల మోక్షము పొందలేకున్నాడు . భక్తి యున్ననే జీవునకు ముక్తి కలుగును

Man is immersed in worldly matters for the sake of food and a place to live. With such a preoccupation he is unable to attain salvation. A jiva will attain salvation when he is devotional toward god.

2073
భోగంబుల కాశింపక రాగద్వేషంబు లుడిగి రంగుగ దమలో వేగమె మోక్ష పదంబును రాగను నాతండు యోగిరాయుడు వేమా

భోగంబుల కాశింపక రాగద్వేషంబు
లుడిగి రంగుగ దమలో వేగమె
మోక్ష పదంబును రాగను
నాతండు యోగిరాయుడు వేమా

సుఖముల నాశి౦పక, రాగ ద్వేషాదులను విడిచిపెట్టిన వానికి శీఘ్రముగనే ముక్తి కలుగును . అట్టివాడే యోగీశ్వరుడని చెప్పదగును

One who doesn't desire luxuries and gives up love and hate, will attain salvation quickly. Such a person is considered the most exalted among the yogis.

2074
భోగ వాంఛచేత బొలుపేదొ యెఱుగక ద్రోహబుద్ధి నొరుల దూఱుచుండ సాహసించువాడు సర్వదా చెడునురా , వి. వే.

భోగ వాంఛచేత బొలుపేదొ యెఱుగక
ద్రోహబుద్ధి నొరుల దూఱుచుండ
సాహసించువాడు సర్వదా
చెడునురా , వి. వే.

భోగముల ననుభవింపవలెనను ఆశతో యుక్తాయుక్తము లాలోచింపక పరులకు ద్రోహము చేయనెంచుచు , ఇతరులను నిందించువాడు తానే సర్వవిధముల చెడిపోవును

One who is interested in luxurious life, too greedy to think of pros and cons, contemplating always to cheat others and curse them, will be disgraceful in all aspects.

2075
ముక్కు కోరును సద్గంధములను నట్లె చెవులు కరములు కన్నులు జిహ్వయడాల విన్ని యును గోరు నటువంటి యిల్లు రోసి తన్ను గనుగొని సుఖియింప దగును వేమ

ముక్కు కోరును సద్గంధములను నట్లె చెవులు
కరములు కన్నులు జిహ్వయడాల విన్ని
యును గోరు నటువంటి యిల్లు రోసి
తన్ను గనుగొని సుఖియింప దగును వేమ

ముక్కు మున్నగు ఇంద్రియములు విషయములనే కోరును . ఇది గ్రహించి నరుడు తన్ను తాను తెలిసికొని సుఖింపదగును

The 5 senses always seek worldly things. One has to understand this and realize one's self to lead a comfortable life.

2076
ముండమోపితోడ మునుగుచు దేలుచు నుండగానె మోహముండెగాక అండబాయు వెనుక నా యాశలే లేవు, వి. వే.

ముండమోపితోడ మునుగుచు దేలుచు
నుండగానె మోహముండెగాక
అండబాయు వెనుక నా
యాశలే లేవు, వి. వే.

ప్రియురాండ్రతో కలిసిమెలిసి యున్నంతకాలము మోహము వృద్ధి చెందును. స్త్రీ సంపర్గము , ఆమెను గూర్చిన తలపులు విడిచినచో ఆ మోహము నశించును

When one is in relationship with women, his lust for them increases. When one gives up consorting women and thinking about them, the lust will be destroyed.

2077
అతిథి రాక చూచి యదలించి పడవైచి కఠిన చిత్తులగుచు గానలేరు కర్మమునకు ముందు ధర్మము గానరో , వి. వే.

అతిథి రాక చూచి యదలించి
పడవైచి కఠిన చిత్తులగుచు
గానలేరు కర్మమునకు ముందు
ధర్మము గానరో , వి. వే.

అతిథి యింటికి రాగానే అతనిని అదలించి పొమ్మని చెప్పిన కఠినచిత్తులు ధర్మమును గుర్తింపరు . ధర్మము చేసిననే కర్మములు నశింపగలవు

One who drives away a guest with a stone heart won't know about dharma. Only when one discharges dharma, his karma will be destroyed.

2078
ఊరు నూరు తిరిగి యున్నది గనలేదు మోర యెత్తి చూచి మొనయలేరు పాఱజూచుటదియె పరముగా గాదొకో , వి. వే.

ఊరు నూరు తిరిగి యున్నది
గనలేదు మోర యెత్తి చూచి
మొనయలేరు పాఱజూచుటదియె పరముగా
గాదొకో , వి. వే.

విషయాశక్తులు ఊరూర తిరుగుచు , పరమును సాధించుటకు మోర యెత్తి చూచెదరు . తేరిపార చూచిననే గాని తత్త్వము కానరాదు

People roam around the land with curiosity about worldly things and look up to think about after life. One doesn't acquire tattva until one confronts this.

2079
ఎండిన మా నొక టడవిని నుండిన నం దగ్ని పుట్టి యూడ్చును చెట్లన్ దండి గల వంశమెల్లను చండాలుం డొకడు పుట్టి చదుపును వేమా

ఎండిన మా నొక టడవిని నుండిన నం
దగ్ని పుట్టి యూడ్చును చెట్లన్
దండి గల వంశమెల్లను చండాలుం
డొకడు పుట్టి చదుపును వేమా

ఎండిన మ్రాను అడవిలో ఉన్నచో అందు పుట్టిన యగ్ని వనమునంతటిని కాల్చును . వంశములో ఒక నీచుడు పుట్టి ఆ వంశమునంతను నశింపజేయును

When a dry tree in a forest catches fire, it will destroy the entire forest. Similarly a low-life born in a dynasty will destroy the entire dynasty.

2080
ఔ ననంగ వచ్చు నైననది కానిది యన్యుడెదుట నుండి యడుగడేని నిలిచి యడుగువాడు కలిగిన నిలువడు , వి. వే.

ఔ ననంగ వచ్చు నైననది కానిది
యన్యుడెదుట నుండి యడుగడేని
నిలిచి యడుగువాడు కలిగిన
నిలువడు , వి. వే.

తన యెదుట తన్నాక్షేపించువాడు లేనియెడల మూర్ఖుడు అయినదానిని కానిదానిని ఎదిరించి పలుకవచ్చనే గాని, ఎవడైన ఎదుట నిలిచి ప్రశ్నించినచో నిలువజాలాడు

A foolish person can criticize everything for as long as there is no one to confront him. When one raises questions about his opinions, he will remain quiet.

2081
కట్టుబట్ట జూచి ఘనత చెప్పగరాదు కానరాదు లోని ఘనతలెల్ల జంగమైన వాని జాతి నెంచగవచ్చు? వి. వే.

కట్టుబట్ట జూచి ఘనత చెప్పగరాదు
కానరాదు లోని ఘనతలెల్ల
జంగమైన వాని జాతి
నెంచగవచ్చు? వి. వే.

ఆర్భాటముగా వేసిన వేషమునుబట్టి జనుని యోగ్యునిగా చెప్పరాదు. బాగుగా విభూతిని పూసుకొన్నంత మాత్రమున సరియైన జంగమని చెప్పరాదు కదా !

Based on the pompous garb, one cannot determine if such a person is deserving. One can't say a person smearing himself with ash is a true jangama (devotee).

2082
కలలోని సంపదెల్లను కలగని మేల్కొనిన పిదప కనబడకేగున్ బలు భోగ భాగ్య గుణములు కల రీతిగ నమ్మవలెను ఘనముగ వేమా

కలలోని సంపదెల్లను కలగని మేల్కొనిన
పిదప కనబడకేగున్ బలు
భోగ భాగ్య గుణములు కల రీతిగ
నమ్మవలెను ఘనముగ వేమా

కలలో కనిపించిన సంపద మేల్కొనిన పిదప మాయమైనట్లు భోగ భాగ్యములు తమంతనే నశించును. వానిని కలలోని సంపదలనియే తెలిసికొనవలెను

Like in a dream where all the wealth one covets is given and all is lost when one wakes up, the wealth one has in the physical world will be taken away at one time. One has to realize that all of the wealth one has is like in a dream.

2083
కలిమి గల్గనేమి కరుణ లేకుండిన కలిమితగునె దుష్ట కర్మలకును ; తేనె గూర్ప నీగ తెరవున బోవదా , వి. వే.

కలిమి గల్గనేమి కరుణ లేకుండిన
కలిమితగునె దుష్ట కర్మలకును;
తేనె గూర్ప నీగ
తెరవున బోవదా , వి. వే.

సంపదయున్నను కరుణ యున్నది లేనిచో ఆ సంపద నశించును. తేనెటీగలు కూర్చిన తేనె ఆ ఈగలకు దక్కని రీతిని దుష్టుల సంపదలు వారికి దక్కవు

Despite having wealth, without compassion it will be gone. Like the honey made by the bees is taken away by others, the wealth of bad people won't last with them for ever.

2084
గతికి మతి యటంచు గమకించి నంతలో మతికి గతియు గల్గు మహితముగను సతికి సుతులు పుట్టి సంతుష్టు జేయరా? వి. వే.

గతికి మతి యటంచు గమకించి నంతలో
మతికి గతియు గల్గు మహితముగను
సతికి సుతులు పుట్టి
సంతుష్టు జేయరా? వి. వే.

అదృష్టమునకు మనస్సే ఆధారము. మంచి మనస్సున్నచో అదృష్టము కలుగును. సతికి పుత్రులు కల్గి సంతోషము కూర్చునట్లు అదృష్టము సంతోషమును కలిగించును

Mind is responsible for good luck. When one has a good character he will have good luck. Good luck makes one happy like a mother blessed with sons.

2085
జీవి జీవి జంపి జీవికి బెట్టంగ జీవితాన బలిసి చెలగుచుండు జీవ హింసకులకు జిక్కునా మోక్షంబు? వి. వే.

జీవి జీవి జంపి జీవికి బెట్టంగ
జీవితాన బలిసి చెలగుచుండు
జీవ హింసకులకు జిక్కునా
మోక్షంబు? వి. వే.

ఒక ప్రాణి మరియొక ప్రాణిని చంపి వేరొక ప్రాణికి పెట్టిన అది బలియునేగాని పెట్టినదానికేమి లాభము? జీవహింస కూడదు. దానివలన మోక్ష మెన్నటికిని రాదు

When one kills a life form and offers it as food to another one, then it is a sacrifice but not anything worthwhile. Violence on animals should not be carried out. One can't attain salvation this way.

2086
ఠీవి లేదటంచు డెందంబులో నెంచి జ్ఞాని మెఱుగలేని మానవుండు డాంబికునకు లొంగి డయ్యును గడపట , వి. వే.

ఠీవి లేదటంచు డెందంబులో నెంచి
జ్ఞాని మెఱుగలేని మానవుండు
డాంబికునకు లొంగి
డయ్యును గడపట , వి. వే.

అవివేకి జ్ఞానినిచూచి , ఆ జ్ఞానికి ఠీవి లేనియెడల గౌరవింపడు , బడాయిగల అజ్ఞానిని చూచి జ్ఞానియని భ్రాంతి పడి అతనిని సేవించి మోసపోవును

A foolish person won't respect a knowledgeable person if his personality is not attractive to him. Whereas he will delude about ignorant people and serve them only to be cheated.

2087
తత్త్వహీనులుండ్రు తఱచుగా భువిలోన తత్త్వమెఱుగువారు తఱచులేరు కలిగిరేని వారు కాన్పింప రారయా , వి. వే.

తత్త్వహీనులుండ్రు తఱచుగా
భువిలోన తత్త్వమెఱుగువారు
తఱచులేరు కలిగిరేని వారు కాన్పింప
రారయా , వి. వే.

లోకమున తత్త్వవేత్తలు తక్కువ. తత్త్వము తెలియనివారే ఎక్కువ. ఎక్కువ ఉన్నచో వారు కనబడుచునే యుందురు

There are fewer people who know tattva than those who don't know. If not so, one can meet the people knowing tattva more often.

2088
తనకు నొప్పి పుట్టి తను వెంట బడలిన కూళవిటుడు యువతి గూడు సుమ్మి పండ్లు పడినకుక్క పసరంబు గఱవదా ? వి. వే.

తనకు నొప్పి పుట్టి తను వెంట
బడలిన కూళవిటుడు యువతి గూడు
సుమ్మి పండ్లు పడినకుక్క
పసరంబు గఱవదా ? వి. వే.

నీచుడగు విటుడు తన వలపుకత్తె బాధతో ఉన్నను, ఆమెను విడువడు . సంగమించును. పండ్లూడిపోయినను కుక్క పశువులను కరుచుటకే యత్నించును

A low-life even when a prostitute is in distress will try to fulfill his wish. Even after losing its teeth a dog will try to bite/attack cattle.

2089
తన కులగోత్రములు లాకృతి తన సంపద కలిమి బలిమి తనకేలనయా ? తన వెంట రావు నిజమిది తన సత్యమె తోడవచ్చు దనతో వేమా

తన కులగోత్రములు లాకృతి తన
సంపద కలిమి బలిమి తనకేలనయా?
తన వెంట రావు నిజమిది తన
సత్యమె తోడవచ్చు దనతో వేమా

తన కులము, వంశము, రూపము, సంపద, బలము మున్నగునవి తాను చచ్చునపుడు వెంటరావు. సత్యమొక్కటే తనతో వచ్చును. గర్వమువీడి సత్యముగ ప్రవర్తింపవలెను

At the time of death one's caste, dynasty, good looks, wealth, strength, etc. won't follow him to the nether world. Only truth will accompany him. Hence one needs to give up pride and live a truthful life.

2090
తన కేనాడు సుభిక్షము తన కేనాడును భగంబు తనరవయ నంచును తన దశకై యెల్లెడ మనసందున జివుకుచుండు మహిలో వేమా

తన కేనాడు సుభిక్షము తన కేనాడును
భగంబు తనరవయ నంచును
తన దశకై యెల్లెడ మనసందున
జివుకుచుండు మహిలో వేమా

తన కెల్లపుడును సిరిసంపద లుండవలెనని , భోగ భాగ్యము లుండవలెనని నరుడు ఆశలోనే మనస్సునుంచి చివుకుచుండును . ఆశవల్ల మిగులునది బాధయే

When a man's mind is always preoccupied with greed for wealth and prosperity, then all he has left is sorrow.

2091
తన తల్లి లోప మెఱిగిన మనుజుడు చింతిల్లు నెపుడు మానస మందున్ మనుజుడు చింతిల్లు నెపుడు మానస మందున్ తన యాలి లోప మెఱిగిన ఘనుడైనను దాని విడుచు గదరా వేమా

తన తల్లి లోప మెఱిగిన మనుజుడు చింతిల్లు
నెపుడు మానస మందున్ మనుజుడు చింతిల్లు
నెపుడు మానస మందున్ తన యాలి లోప మెఱిగిన
ఘనుడైనను దాని విడుచు గదరా వేమా

మనుజుడు తన తల్లి చెడునడవడికలదని విన్నచో మిక్కిలి బాధపడును . కాని తన భార్య ప్రవర్తన సరిగ్గా లేదని విన్నను విననివానివలె ఉపేక్షించును

When one hears about the bad behavior of his mother, he will feel sorry. However, when his wife's behavior is bad, he pretends ignorance.

2092
తనదు భ్రాతృవరులు ధర నేలుచుండగా తనకు నుండునండ్రు వెనుకవారు తనదు కాలుగోయ దమ్ముడు నేడ్చునా ? వి. వే.

తనదు భ్రాతృవరులు ధర నేలుచుండగా
తనకు నుండునండ్రు వెనుకవారు
తనదు కాలుగోయ దమ్ముడు
నేడ్చునా ? వి. వే.

తన సోదరులు రాజ్యమేలుచుండగా మూర్ఖుడు తానే పాలించుచున్నట్లు మిగుల సంతసించును . ఇది సరికాదు . తన కాలు కోసినయెడల తమ్ముడేడ్వడు గదా!

A foolish person will be happy when his siblings are ruling the kingdom. This is not right. When one's leg is being operated, his siblings won't feel the pain.

2093
తన విపత్తు తెలియ దప్పి౦ చు కొన జూచు నెట్టి మనుజుడైన నెట్టులైన నరక బాధ వినుచు నరయ డా ధర్మము, వి. వే.

తన విపత్తు తెలియ దప్పి౦ చు
కొన జూచు నెట్టి మనుజుడైన
నెట్టులైన నరక బాధ వినుచు
నరయ డా ధర్మము, వి. వే.

తనకేదైన ఆపద కలుగునని తెలియదా నరుడు దానిని తప్పించుకొనుటకు గట్టిగా యత్నించును. కాని తనకు నరకబాధ కల్గునని తెలియునపుడు దానిని తప్పించుకొన యత్నింపడు

A man will try to figure out a way to escape when he is facing an immediate danger. But not when he knows it is inevitable that he has to end up in hell.

2094
తన వలచిన దా వలచును తను వలవక యున్న నెవడు తా వలవ డిలన్ తనదు పటా టోపంబులు తన మాయలు పనికిరావు ధరలో వేమా

తన వలచిన దా వలచును తను వలవక
యున్న నెవడు తా వలవ డిలన్
తనదు పటా టోపంబులు తన మాయలు
పనికిరావు ధరలో వేమా

తానితరులను ప్రేమించిన వారు తన్ను ప్రేమింతురు . తాను ప్రేమింపకున్న వారును ప్రేమింపరు. మాయలు పన్ని మోసములుచేసిన ఎవ్వరును ప్రేమింపరు

When one loves others the love is reciprocated. If he doesn't love them, vice-versa. No one loves a person who cheats others.

2095
తనువు తా ననుకొని తనకు వాసనబట్టి జనన మరణములను చక్క జిక్కి పొలుపున నెఱుగక పొర్లాడు చుండెడి , వి. వే.

తనువు తా ననుకొని తనకు వాసనబట్టి
జనన మరణములను చక్క
జిక్కి పొలుపున నెఱుగక పొర్లాడు
చుండెడి , వి. వే.

మానవుడు తన శరీరమే తాననుకొని ఈ లోకపు వాసనాలకు జిక్కి జననమరణాదులకు లోబడి ఆత్మస్వరూపమును తెలిసికొనలేకుండును . ఇట్టి వానికి పరమెట్లు లభించును

Man is attached to his body, addicted to the tantalizing world, and yielding to life-death cycle and not realizing his aatma. How can such a person attain salvation?

2096
తనవు పోవువేళ దనువును బాంధవుల్ వెంటరారు నిజము వెఱ్ఱు లార ! తనువు విడిచిపోక తనకు దోడౌ గుఱి, వి. వే.

తనవు పోవువేళ దనువును బాంధవుల్
వెంటరారు నిజము వెఱ్ఱు
లార ! తనువు విడిచిపోక తనకు
దోడౌ గుఱి, వి. వే.

ప్రాణము పోయిన పిదప తన దేహముగాని బంధుమిత్రులుగాని తన వెంటరారు . తన నమ్మిక మాత్రమే తనతో వచ్చును

After praana leaves the body, neither the body nor the relatives and friends follow one. Only the good deeds and faith will follow him.

2097
తనువు విడిచి తాను దరలిపోయెడి వేళ తనదు భార్య సుతులు తగినవారు నొక్కరైన నేగ రుసురు మాత్రమే కాని తనదు మంచి తోడు తనకు వేమ

తనువు విడిచి తాను దరలిపోయెడి వేళ
తనదు భార్య సుతులు తగినవారు
నొక్కరైన నేగ రుసురు మాత్రమే
కాని తనదు మంచి తోడు తనకు వేమ

తాను శరీరము విడిచినపుడు తన ప్రాణమొక్కటే పోవును. భార్య, సుతులు, ఆప్తులు - ఎవ్వరును తనతో మరణింపరు . తనకు తోడుగా వచ్చునది తన మంచితనము మాత్రమే

When one's praana leaves his body, none of wife, children, friends or relatives don't die. Only one's good karma follows him after death.

2098
తనకు గలుగు పెక్కు తప్పు లటుండగా నొరుల నేర మెంచు నోగి యెపుడు జక్కిలంబు చూచి జంతి కేరీనయట్లు , వి. వే.

తనకు గలుగు పెక్కు తప్పు లటుండగా
నొరుల నేర మెంచు నోగి
యెపుడు జక్కిలంబు చూచి జంతి
కేరీనయట్లు , వి. వే.

తన తప్పులను తెలిసికొనక యితరులు తప్పులునెన్నువాడు చక్కిలమును చూచి జంతికే ఆక్షేపించనట్లుండును

The one who doesn't realize his mistakes but picks on others is like one crunchy snack criticizing another.

2099
తరుణి యన్న గన్న తనయుని జూచిన మరుని కళలమించు మనసు పాఱు, పాప జాతి మనసు బట్టంగరాకుండు , వి. వే.

తరుణి యన్న గన్న తనయుని జూచిన
మరుని కళలమించు మనసు
పాఱు, పాప జాతి మనసు బట్టంగరాకుండు,
వి. వే.

స్త్రీ జాతి పాపజాతి . చపలచిత్తము కలది. తాను కనిన కుమారునిపయిగూడ వలపు కలుగుచుండును. మన్మథుని బాణములకు లొంగిపోవును

The race of women is sinful. It has fickle mind. A woman may get attracted to her own son. Thus, she yields to cupid's (Manmatha's ) arrow.

2100
తల్లి దండ్రి చావ తనయుండు తా నేడ్చు మగడు చావ నాలు వగచుచుండు కార్యవశమె కాని కలుగునా మోహము, వి. వే.

తల్లి దండ్రి చావ తనయుండు
తా నేడ్చు మగడు చావ నాలు
వగచుచుండు కార్యవశమె కాని
కలుగునా మోహము, వి. వే.

తల్లితండ్రులు చావగా పుత్రుడును, భర్త చావగా భార్యయు తమతమ ప్రయోజనములనుబట్టి ఏడ్చెదరు . అది నిజమైన దుఃఖము కాదు

When parents die a son cries;when a husband dies a woman cries, based on their advantages and disadvantages. It is not real sorrow.

2101
తల్లి దండ్రి హితులు తగిన చూట్టములెల్ల నేరి కోరి పోరు నెగవు చూచి పడుచు నిత్తు రింతె భాగ్య మీయంగలేరు, వి. వే.

తల్లి దండ్రి హితులు తగిన చూట్టములెల్ల
నేరి కోరి పోరు నెగవు
చూచి పడుచు నిత్తు రింతె
భాగ్య మీయంగలేరు, వి. వే.

తల్లిదండ్రులు , దగ్గరి బంధువులు - అమ్మాయి సుఖపడునని తగిన సంబంధము చూచి పెండ్లి చేయుదురు. ఆమె యదృష్టవంతురాలు కానిచో సుఖపడదు. అదృష్టమును వారెట్లీయగలరు

Parents and close relatives offer a daughter to a good groom hoping that the daughter will live happily. If she is not lucky she will not be happy. How can her parents provide good luck to her?

2102
తాను దినక తగిన ధర్మము చేయక కొడుకుల కని సొత్తు కూడబెట్టి తెలయు జెప్పలేక తీరిపోదురు వెన్క సొమ్ము పరుల జేరు జూడు వేమ

తాను దినక తగిన ధర్మము చేయక కొడుకుల
కని సొత్తు కూడబెట్టి తెలయు
జెప్పలేక తీరిపోదురు వెన్క
సొమ్ము పరుల జేరు జూడు వేమ

తాననుభవింపక, ధర్మముచేయక కొడుకులకొరకు ధనమును కూడ బెట్టి మరణించినప్పుడు ఆ సంగతి చెప్పుటకును నోరు రాదు . చివరికది పరులపాలగును

One who doesn't enjoy his wealth and donate to others, and accumulates it for his sons when at the time of death, he won't even have words to utter. At the end it will be taken away by others.

2103
తానును జను లే మనుకొన బూనుదురో దాని నరసి పొందిక జెడ నీ , రాని పథంబున నడిచిన దాననె ధర్మాత్ముడండ్రు తన్నిట , వి. వే.

తానును జను లే మనుకొన బూనుదురో
దాని నరసి పొందిక జెడ నీ , రాని
పథంబున నడిచిన దాననె ధర్మాత్ముడండ్రు
తన్నిట , వి. వే.

జనులు తన్ను నిందింపని రీతిని - తన ప్రవర్తనమును మెచ్చుకొనునట్లు ప్రవర్తించువాడే ధర్మాత్ముడు

A person following dharma behaves in such a way that he won't be blamed by others. He gets accolades for his good behavior.

2104
తిరిగి వచ్చువేళ మఱలిపోయెడి వేళ వెంటదేరు ధనము నంటబోరు తా నెటకు జనునొ ధనమెందు బోవునో? వి. వే.

తిరిగి వచ్చువేళ మఱలిపోయెడి
వేళ వెంటదేరు ధనము నంటబోరు
తా నెటకు జనునొ ధనమెందు
బోవునో? వి. వే.

జనులు పుట్టినపుడు తమతో ధనము తీసికొని రారు, మరణించినపుడు తన వెంటతీసికొని పోరు. తనకును ధనమునకును ఎట్టి సంబంధము లేదు . కాన ధనముపై కోరిక తగదు.

A person won't be born with wealth. Nor does he take it with him at the time of death. There is no relationship between self and wealth. Hence it is not good to covet wealth.

2105
దేహమనెడి యింటి దిన దినంబును నూడ్చి అలికి పూని మెత్తి యనువుపఱచి కాపు విడిచి పోవు గడపట నీ జీవి, వి. వే.

దేహమనెడి యింటి దిన దినంబును
నూడ్చి అలికి పూని మెత్తి
యనువుపఱచి కాపు విడిచి పోవు
గడపట నీ జీవి, వి. వే.

జీవుడు శరీరమను యింటిలో నివసించి దినదినము దానిని పరిశుభ్రము చేయుచు, తుదకు దానిని విడిచి పోవుచున్నాడు. జీవుడులేని ఆ శరీరగృహము పాడయి నశించును

The jiva who resides in one's body takes care of it, keeps it clean and healthy, and leaves it behind. A body without jiva will perish.

2106
దోపు నిచ్చువాడు తులలేని నెఱదాత దోచు కొన్నవాడు ద్రోహి యయ్యె ప్రాపు జూపువాడు పరమ పూజ్యు౦డట ప్రాపు జెఱచువాడు పశువు వేమ

దోపు నిచ్చువాడు తులలేని నెఱదాత
దోచు కొన్నవాడు ద్రోహి యయ్యె
ప్రాపు జూపువాడు పరమ పూజ్యు౦డట
ప్రాపు జెఱచువాడు పశువు వేమ

తన్ను దోచుకొన నిల్చినవాడు దాతయు , దోచుకొన్నవాడు ద్రోహియు అయినట్లే - రక్షణ చూపువాడు గొప్ప పూజ్యుడును, దానిని చెరచినవాడు పశువువంటివాడు నగును

The person whose money was stolen stands as a donor and the person who stole it stands as accused. Similarly one who provides security is revered and one who doesn't is considered to be an animal.

2107
ద్విజవరుండు చెడ్డ దిక్కులేకయు భూమి మనుజులెల్ల జెడుదు రనుట కేమి? కాలగతులు మాఱె గలియు , ధర్మము మాఱు, వి. వే.

ద్విజవరుండు చెడ్డ దిక్కులేకయు
భూమి మనుజులెల్ల జెడుదు రనుట
కేమి? కాలగతులు మాఱె గలియు,
ధర్మము మాఱు, వి. వే.

వర్ణాశ్రమ ధర్మములను కాపాడు బ్రాహ్మణుడు చెడినచో జనులందరును చెడుదురు . కాలగతులు మారినందున యుగ ధర్మములు మారును. కలియుగమున ధర్మము నశించును

When a brahmin who is supposed to protect varna-aashrama dharma (4 castes- brahmin, vysya (traders), kshatriya (warrior), sudra (common)) goes bad, all the people become morally bankrupt. Since the inexorable time has passed from one yuga to another, in the present kali yug dharma has no place.

2108
దాన ధర్మములను తా జేసి పుట్టమి కర్మ గతిని యముడు కష్టపఱచు కర్మ ధర్మములను కడవీడ బ్రహ్మంబు , వి. వే.

దాన ధర్మములను తా జేసి పుట్టమి
కర్మ గతిని యముడు కష్టపఱచు
కర్మ ధర్మములను కడవీడ
బ్రహ్మంబు , వి. వే.

తాను దానధర్మములు చేయనందున పరలోకమున యముడు కష్టపరుచును. వాని కతీతుడైనపుడే బ్రహ్మత్వము సిద్ధించును

The god of death will punish when one doesn't do charitable acts. One who transcends that can attain brahmam

2109
ధన విహీనుడయ్యు దండ్రి పుణ్యము చేయు భాగ్యమునను నరుడు పట్టి యగుచు బహుళ ధనము గూర్చు భద్ర మార్గంబున బరుల కిచ్చు కీర్తి బడయు వేమ

ధన విహీనుడయ్యు దండ్రి పుణ్యము చేయు
భాగ్యమునను నరుడు పట్టి యగుచు
బహుళ ధనము గూర్చు భద్ర మార్గంబున
బరుల కిచ్చు కీర్తి బడయు వేమ

ధనహీనుడయినను పుణ్యాత్ముడైయున్నచో అతని పుత్రుడు భాగ్యవంతుడగును. అతడు విశేషధనము సంపాదించి దాతయై కీర్తిని సంపాదించును

Even if a person of good karma is poor, his son could turn out to be rich. He will accumulate great wealth, provide to the needy and achieve fame.

2110
నది యుదకంబును ప్రియమగు మది నొదవెడి తత్త్వబుద్ధి మగ్నతనెన్న ౦ దుది పదవి గలిగె ఘనమగు ను దది బ్రవేశించు గంగయొప్పగు వేమా

నది యుదకంబును ప్రియమగు మది నొదవెడి
తత్త్వబుద్ధి మగ్నతనెన్న
౦ దుది పదవి గలిగె ఘనమగు ను దది
బ్రవేశించు గంగయొప్పగు వేమా

నదీజలము సముద్రమున గలసినచో పవిత్రమగునట్లు తత్త్వబుద్ధి ముక్తిని సాధించినచో సార్థకమగును

Like rivers flowing into seas are holy, the intellect with tattva when one attains salvation is considered to be great.

2111
నరకులమున దా బుట్టియు నరకులమను దాను పెరిగి నరుడయ్యును దా నరకులమును ఛీ ఛీ యని హరకులమున దిరుగునేని హరుడౌ వేమా

నరకులమున దా బుట్టియు నరకులమను
దాను పెరిగి నరుడయ్యును దా
నరకులమును ఛీ ఛీ యని హరకులమున
దిరుగునేని హరుడౌ వేమా

తాను మనుష్య జాతియందు పుట్టినను, అందే పెరిగినను యోగి మమకారమును విడిచి హృదయమున హరుని ధ్యానించినచో హరత్వమును పొందును

Even though a yogi is born in human race and grew up among men, if he leaves behind his pride and meditates on Lord Vishnu, then he will attain him.

2112
నరుడు జాగరమున నటియించు చుండును నరునికిలను జాగ్ర తరుదు సుమ్ము నరుడు జాగ్రతనుట ధరణిలో బరమాత్మ , వి. వే.

నరుడు జాగరమున నటియించు చుండును
నరునికిలను జాగ్ర తరుదు
సుమ్ము నరుడు జాగ్రతనుట
ధరణిలో బరమాత్మ , వి. వే.

ఎంత జాగ్రత్తగా నున్నను నరునకు యోగరూపమగు జాగ్రచ్ఛక్తి తక్కువ. ఆ శక్తి ఎక్కువగా ఉన్నచో అతనిని పరమాత్మగానే భావింపవచ్చును

No matter how careful a man is, as a yogi his wakeful state is weak. When it is strong, he can be considered to be paramaatma

2113
నీరు పైని పడిన నిప్పులు బొగ్గులౌ నిప్పుమీద కుండ నీరు పెట్ట కళ పెళనుచు గ్రాగు కడుచోద్య మిది గదా! వి. వే.

నీరు పైని పడిన నిప్పులు బొగ్గులౌ
నిప్పుమీద కుండ నీరు
పెట్ట కళ పెళనుచు గ్రాగు కడుచోద్య
మిది గదా! వి. వే.

నిప్పుపై నీరుపడిన ఆ నిప్పులు బొగ్గులగును . ఆ నిప్పు పైనే నీరుపోసిన ఆ నీరు తపించి కళపెళలాడును. ఎంత విచిత్రము

When water is poured on burning firewood, it will turn into coal. However when water is sprinkled on fire, water will evaporate.

2114
నీరు మొదలు పెట్ట నీరమే మొలకయ్యె మొలక విశ్వమగుచు మొనయుచుండు నీరు విశ్వమగుట నేర్పుతో దెలియుము, వి. వే.

నీరు మొదలు పెట్ట నీరమే మొలకయ్యె
మొలక విశ్వమగుచు మొనయుచుండు
నీరు విశ్వమగుట నేర్పుతో
దెలియుము, వి. వే.

నీరే మొదటి సృష్టి . ఆ నీటినుండియే ప్రపంచమంతయు సృజింపబడినది . వృక్షములు నీటివల్లనే ఏర్పడినవి . ఈ జలతత్త్వమెరిగిన ఉదకమే బ్రహ్మస్వరూపమని తెలియును

Water is created first. The whole world is created with water. Trees have sprung because of water. When one knows the tattva about water, one will realize water is a form of brahmam.

2115
నీళ్ళలోని మీను నిగిడి దూరము పాఱు బయలు మూరెడైన బాఱలేదు స్థానబలిమి కాని తన బల్మి కాదయా , వి. వే.

నీళ్ళలోని మీను నిగిడి దూరము
పాఱు బయలు మూరెడైన బాఱలేదు
స్థానబలిమి కాని తన
బల్మి కాదయా , వి. వే.

చేప నీటిలో ఉన్నచో ఎంతదూరమైనను పోవును. నేలపై మూరెడు దూరమైన పోలేదు. అట్లే ఎంతవారికైనను స్థానబలమును బట్టియే మాట చెల్లుచుండును

A fish can travel afar in water but not one foot on dry land. Similarly depending on one's location his words will have merit.

2116
నేయి లేని కూడు నీయాన కసవది కూరలేని తిండి కుక్కతిండి ప్రియములేని కూడు పిండపు గూడురా , వి. వే.

నేయి లేని కూడు నీయాన కసవది
కూరలేని తిండి కుక్కతిండి
ప్రియములేని కూడు పిండపు
గూడురా , వి. వే.

నేయిలేని భోజనము గడ్డివంటిది . కూరలేని తిండి రుచి లేని హీనాహారము . ప్రీతితో పెట్టని భోజనము పిండములతో సమానము

A meal without ghee is like grass. A meal without vegetable is tasteless. A meal not served with love is equivalent to throwing food at the crows so that they will carry it to the departed souls.

2117
నోరెరిగి తా మవేవియు నేరని జంతువుల జంపి నెమ్మది దిను నా క్రూరపు సంకర జాతుల మారణ మేమందు రింక మహిలో వేమా

నోరెరిగి తా మవేవియు నేరని
జంతువుల జంపి నెమ్మది దిను
నా క్రూరపు సంకర జాతుల మారణ
మేమందు రింక మహిలో వేమా

నోరెరుగనివియు , ఎదురు తిరుగలేనివియు యగు జంతువులను చంపి తినువానిని యముడు తప్పక తగినట్లు శిక్షించును

Those who kill and eat animals that are dumb and domesticated will be punished by the god of death.

2118
న్యాయశాస్త్ర మరయు సన్యాయ మొనరించు ధర్మశాస్త్ర మొసగు దుర్మతంబు జ్యోతిషంబు జనుల నీతి దప్పి౦చును, వి. వే.

న్యాయశాస్త్ర మరయు సన్యాయ మొనరించు
ధర్మశాస్త్ర మొసగు
దుర్మతంబు జ్యోతిషంబు జనుల
నీతి దప్పి౦చును, వి. వే.

శాస్త్ర జ్ఞానమువల్ల వివేకము నశించుచున్నది . న్యాయశాస్త్ర మన్యాయమునే చెప్పుచున్నది . ధర్మశాస్త్ర మధర్మముల బోధించుచున్నది . జ్యోతిషము జనులను నీతినుండి తప్పించుచున్నది

With saastra (vocational knowledge) men are losing intellect. The jurisprudence is teaching injustice. The dharma saastra is teaching adharma. Astrology is teaching men to deviate from moral path.

2119
పంకజాక్షి గన్న బంగరు బొడగన్న దిమ్మపట్టియుండు తెలివియొప్ప మనుజులకును తత్త్వ మహిమెట్లు కల్గురా ? వి. వే.

పంకజాక్షి గన్న బంగరు బొడగన్న
దిమ్మపట్టియుండు తెలివియొప్ప
మనుజులకును తత్త్వ మహిమెట్లు
కల్గురా ? వి. వే.

కాంతా, కనకముల యెడల ఎక్కువ ఆశగల మానవులకు తత్త్వమహిమ బోధపడజాలదు

Men who are attached to women and gold with greed cannot be taught the greatness of tattva

2120
పంచమ నిగమంబు భారతంబగునని పొగడిరేల జనులు బుద్ధిమాలి! హింస నెంచి చూడ నిష్టమెట్లయ్యెనో , వి. వే.

పంచమ నిగమంబు భారతంబగునని
పొగడిరేల జనులు బుద్ధిమాలి!
హింస నెంచి చూడ నిష్టమెట్లయ్యెనో,
వి. వే.

భారతము పంచమ వేదమని జనులు దానిని పొగడుదురు . కౌరవపాండవులు యుద్ధము తెల్పు అది ఎటు మేలైనదో కదా!

Some people claim Maha Bhaarata is the 5th veda. How can a war between cousins (kauravas and paandavas) be considered as moral?

2121
పచ్చదనము చూచి యిచ్చును కాముకుల్ చిచ్చులో బడుదురు క్షితితలమున ఇచ్ఛ కలుగుజేయు హెచ్చుగా మోహంబు , వి. వే.

పచ్చదనము చూచి యిచ్చును కాముకుల్
చిచ్చులో బడుదురు క్షితితలమున
ఇచ్ఛ కలుగుజేయు హెచ్చుగా
మోహంబు , వి. వే.

యువతుల పచ్చని దేహకాంతికి ముగ్దులై , దానికై ప్రాణములనైన నర్పింతురు . మోహము కోర్కెలను హెచ్చించును

Men are mesmerized by the skin color of a woman and are willing to die for her. Lust exaggerates desires.

2122
పచ్చ విల్తుచేత గ్రచ్చఱ జనులెల్ల డచ్చ నాడ నైరి ధరణిలోన గులజు డెవ్వడిందు గులహీనుడెవ్వండు ? వి. వే.

పచ్చ విల్తుచేత గ్రచ్చఱ జనులెల్ల
డచ్చ నాడ నైరి ధరణిలోన
గులజు డెవ్వడిందు గులహీనుడెవ్వండు?
వి. వే.

మన్మథుని చేతిలోని కీలుబొమ్మలవలె జనులు కామమునకు లోనై ఆడుచున్నారు . ఇందు కులజుడు , కులహీనుడు ననుబేధము కానరాదు

In the hands of cupid (Manmatha) people with lust are being played like puppets. There is no difference between caste and out-cast.

2123
పట్టకుండి యధిక భాగ్యంబు పట్టెనా దొడ్డవారి దిట్టి త్రుళ్ళిపడును అల్ప జాతి కుక్క యధికుల నెఱుగునా ? వి. వే.

పట్టకుండి యధిక భాగ్యంబు పట్టెనా
దొడ్డవారి దిట్టి త్రుళ్ళిపడును
అల్ప జాతి కుక్క
యధికుల నెఱుగునా ? వి. వే.

రాకరాక ఎక్కువ భాగ్యము వచ్చెనా , జనుడు మిడిసిపడి పెద్దవారిని తిట్టును . తక్కువజాతి కుక్కకు గొప్పతన మెట్లు తెలియును?

When one gets wealth after much waiting, he will be insolent and curse elders. A street dog doesn't know greatness.

2124
పచ్చి మలము తినుచు బండుటాకు నమిలి ఉచ్చ దప్పి తీర్చు యుడుకు కోర్చి కచ్చము బిగియింప గలుగునా మోక్షము? వి. వే.

పచ్చి మలము తినుచు బండుటాకు
నమిలి ఉచ్చ దప్పి తీర్చు యుడుకు
కోర్చి కచ్చము బిగియింప
గలుగునా మోక్షము? వి. వే.

సారములేని తిండి తిని, ఆకులు నమిలి, మురికినీట దప్పి తీర్చుకొని , ఎండలలో మాడి గోచికట్టినంత మాత్రమున ముక్తి రాదు . శుష్కశ్రమలచే ప్రయోజనము లేదు

By eating nutrition-less food, swallowing leaves, drinking off mud water, suffering under hot sun, even when wearing a loin cloth, one can't attain salvation. There is no use in karma that is done with emaciated body.

2125
పత్తములందు బతులకు సతులకు మోహ మెచ్చు దాన యూహ లెచ్చు ముక్తి మార్గమునకు యుక్తియే తెలియదు, వి. వే.

పత్తములందు బతులకు సతులకు
మోహ మెచ్చు దాన యూహ లెచ్చు
ముక్తి మార్గమునకు యుక్తియే
తెలియదు, వి. వే.

నగరములోని స్త్రీ పురుషులకు కామవికార మెక్కువ . వాని౦గూర్చిన తలపు లెక్కువ . వారికి ముక్తి సాధించు విధము తెలియదు

The men and woman in towns have too much lust. Their thoughts revolve around it. They don't know how to achieve salvation.

2126
పరదళముల జూచి ప్రాణంపు బ్రీతిచే నుఱుకు బిఱికివాడు టూ రిదాక యముడు వచ్చునేని యడ్డ మింకెవ్వరు? వి. వే.

పరదళముల జూచి ప్రాణంపు బ్రీతిచే
నుఱుకు బిఱికివాడు టూ
రిదాక యముడు వచ్చునేని యడ్డ
మింకెవ్వరు? వి. వే.

పిరికివాడు పోరలేక శతృసేనలను చూచి ప్రాణముల మీది ప్రీతిచే ఊరిదాక పారిపోవును. పారిపోయినంత మాత్రమున ప్రాణములు నిలుచునా? యమున కడ్డమేది?

A coward after seeing enemy soldiers will realize he can't fight them and run away because of his love for life. Will his praana remain even when he runs away? God of death can reach him anywhere.

2127
పరబలంబు చూచి ప్రాణరక్షణమున కుఱికి పాఱిపోవు పిఱికి నరుడు యముడు కుపితుడైన నడ్డ మెవ్వడు సుమీ, వి. వే.

పరబలంబు చూచి ప్రాణరక్షణమున
కుఱికి పాఱిపోవు పిఱికి
నరుడు యముడు కుపితుడైన నడ్డ
మెవ్వడు సుమీ, వి. వే.

శత్రుసేనను చూచి ప్రాణములు కాపాడుకొనుటకై పారిపోవు పిరికివానిపై యముడు కోపించినచో చావు తప్పదు

If god of death is angered by the coward who runs away from enemy soldiers to save his praana, he is sure to meet with death.

2128
పరమ భాగవతులు ప్రజలు సంతోషించు నాట పాట నేర్చి నీటుగాను కోట్లకొలది తెచ్చి కూటికి లేకుండ్రు , వి. వే.

పరమ భాగవతులు ప్రజలు సంతోషించు
నాట పాట నేర్చి నీటుగాను
కోట్లకొలది తెచ్చి కూటికి
లేకుండ్రు , వి. వే.

ఆటలు, పాటలు బాగుగా నేర్చిన వీధిభాగవతులు ప్రజలను మెప్పించి వారివలన అధికముగా ధనము సంపాదింతురేకాని ఆ ధనము నిలువదు. వారికి దారిద్ర్యము తప్పదు

The puppeteers who entertain the audience and earn lots of money, cannot hold on to the money for ever. Poverty is inevitable to them.

2129
పాతక సంసారార్ణవ మే తెఱగున దాటె దీవు హెచ్చరిక మెయిన్ చేతన మూర్తిని మదిలో ఖ్యాతిగ నెన్నంగ దగును ఘనముగ వేమా

పాతక సంసారార్ణవ మే తెఱగున దాటె
దీవు హెచ్చరిక మెయిన్ చేతన
మూర్తిని మదిలో ఖ్యాతిగ
నెన్నంగ దగును ఘనముగ వేమా

పాతకములతో నిండిన యీ సంసార సముద్రమును ఈది కడతేరుటకు మనస్సులో భగవంతునే సదా ధ్యానింపవలెను

One has to pray god always to swim across the ocean of bondage that is filled with sins.

2130
పాప జాతి నరుడు పరసతి గోరుట చేప జిహ్వ రుచికి జిక్కునట్లు తీపునంటి యీగ తెగువతో నీల్గదా ? వి. వే.

పాప జాతి నరుడు పరసతి గోరుట
చేప జిహ్వ రుచికి జిక్కునట్లు
తీపునంటి యీగ తెగువతో
నీల్గదా ? వి. వే.

పాపబుద్ధిగల నరుడు పరస్త్రీని కోరుట ముప్పునకే యగును . చేప ఎఱ్ఱకయి ఆశపడి గాలపుముల్లునకు చిక్కుకొనును . ఈగ తీపినాశించి తేనెలోపడి చచ్చును గదా!

A sinful man desiring a woman is asking for trouble. A fish is hooked when it tries to grab the bait. A fly desirous of sweet falls into a honey pot and dies.

2131
పాశ బంధుచేత బంధు వర్గములెల్ల జిక్క జూతు రరయ జీవము చన నొక్కడైన నేగు డుసురు మాత్రమె కాని, వి. వే.

పాశ బంధుచేత బంధు వర్గములెల్ల
జిక్క జూతు రరయ జీవము
చన నొక్కడైన నేగు డుసురు
మాత్రమె కాని, వి. వే.

తాను చచ్చునపుడు తనతో ప్రాణమొక్కటే వెన్నంటి వచ్చును. బంధువర్గములో ఒక్కడును రాడు. వెనుకకేవారు పోవుదురు

When one dies only praana follows him. No body from friends and relatives will come along. They retreat.

2132
భవము పూర్వకర్మ ఫలము ననుభవింప గలిగెననుచు మదిని గట్టి పఱచి కష్ట సుఖము లేవి కలిగిన దలపకు , వి. వే.

భవము పూర్వకర్మ ఫలము ననుభవింప
గలిగెననుచు మదిని గట్టి
పఱచి కష్ట సుఖము లేవి
కలిగిన దలపకు , వి. వే.

పూర్వజన్మ కర్మఫలము నీ జన్మమున అనుభవింపవలసివచ్చెనని తెలిసికొని కష్టసుఖములకు చలింపక యుండుము

Knowing that the current life is a result of karma performed in previous births, one has to remain calm despite facing sorrows and pleasures.

2133
భవము సాగరంబు భార్యయౌ మకరంబు చేప జలగలగును శిశువులెల్ల భవహరుం దలపక పారమందగలేడు , వి. వే.

భవము సాగరంబు భార్యయౌ మకరంబు
చేప జలగలగును శిశువులెల్ల
భవహరుం దలపక పారమందగలేడు,
వి. వే.

సంసారసాగరమున భార్య మొసలి, బిడ్డలు చేపలు, జలగలును. వీనినుండి తప్పించుకొని ఒడ్డు చేరుటకు జన్మరాహిత్యము కల్గించు భగవంతునే ధ్యానింపవలెను

In a sea called bondage , wife is the crocodile and children are fish and leeches. To escape them and reach the shore, one has to pray to god who can grant one salvation without needing to be born again.

2134
మంత్ర విద్యలెల్ల మాయల కొఱ కిల సృష్టియందు బ్రహ్మ సృష్టి చేసె మత్తుడైనవాడు మది నిల్పలేడయా , వి. వే.

మంత్ర విద్యలెల్ల మాయల కొఱ
కిల సృష్టియందు బ్రహ్మ సృష్టి
చేసె మత్తుడైనవాడు మది
నిల్పలేడయా , వి. వే.

ప్రజలను మోసగించుటకే బ్రహ్మ మంత్రవిద్యలను సృజించినట్లున్నది . వీనినెరిగి మదోన్మత్తులైనవారు మనస్సును నిలుపలేకున్నారు

The mantras are used to cheat people. The men are intoxicated with pride over these.

2135
మదము చేతలోక మాయలు తెలియరు మదముచేత తన్ను మఱచు నెపుడు బుద్ధిలేని పనుల పోలిక జెడుదురు , వి. వే.

మదము చేతలోక మాయలు తెలియరు
మదముచేత తన్ను మఱచు నెపుడు
బుద్ధిలేని పనుల పోలిక
జెడుదురు , వి. వే.

మానవులు మదముచే యుక్తాయుక్తముల నెరుగక లోకములోని మాయలు నమ్మి తమ్ముతాము తెలిసికొనలేక పశుప్రాయులై చెడిపోవుచున్నారు

Men with pride without being able to discriminate between good and bad, by believing in maaya (illusion) are getting destroyed by becoming like animals.

2136
మరణము దాపగుచున్నది స్థిరబుద్ధిని పరము గన్న జిక్కును మోక్షం బరయుచు బురిలో మించిన పరమార్థమె బట్ట బయలు ప్రాకుము వేమా

మరణము దాపగుచున్నది స్థిరబుద్ధిని
పరము గన్న జిక్కును మోక్షం
బరయుచు బురిలో మించిన పరమార్థమె
బట్ట బయలు ప్రాకుము వేమా

మరణము సమీపించినదని తెలిసికొని పరమార్థమును గ్రహించుచు మోక్షమును వెదుకవలెను . స్థిరబుద్ధితో చూచిన యెడల తత్త్వము తెలియును . పిదప భగవంతునిలో ఐక్యమును పొందవచ్చును

When one is near the throes of death, one has to try for salvation. If one sees with an unwavering mind, tattva will be revealed. Then one can seek communion with the god.

2137
మాట మఱుగు సిగ్గు మనుజ లోకంబెల్ల చీరె మరుగు సిగ్గు చెప్పనేల ? బయట నింటి సిగ్గు బండ సంసారంబు , వి. వే.

మాట మఱుగు సిగ్గు మనుజ లోకంబెల్ల
చీరె మరుగు సిగ్గు చెప్పనేల?
బయట నింటి సిగ్గు
బండ సంసారంబు , వి. వే.

మనుష్యుడు తన లజ్జను మాటల మరుగున దాచుకొనుచున్నాడు . స్త్రీలు చీరచెరగున సిగ్గు దాచెదరు . ఎదుటి యింటివాని సిగ్గును లక్ష్యముచేయక అందరిని బైటవేయుటకు సిద్ధపడుదురు

Man hides his shame behind his words. Women do it behind their saris. The neighbors disregard their shame and wash dirty laundry in public.

2138
మాయయె చెఱసాల మనసె యోచింపంగ పెద్ద శృంఖలంబు భేదములను ఇట్లు బధ్ధనరుని కెన్నడు మోక్షము, వి. వే.

మాయయె చెఱసాల మనసె యోచింపంగ
పెద్ద శృంఖలంబు భేదములను
ఇట్లు బధ్ధనరుని కెన్నడు
మోక్షము, వి. వే.

మాయయే చెరసాల. మనస్సే సంకెల . ఇట్లు బద్ధుడైన వాని కెన్నటికిని మోక్షము కలుగదు

Maaya (illusion) is the prison. Mind is shackles. One who is trapped by them will never attain salvation.

2139
ముఖము జూచినంత మోహంబు ఘనమౌను దిసమొలను గనంగ దీరు నద్ది కూడిన వలపెల్ల కుస్తరింపగరాదె , వి. వే.

ముఖము జూచినంత మోహంబు ఘనమౌను
దిసమొలను గనంగ దీరు
నద్ది కూడిన వలపెల్ల కుస్తరింపగరాదె,
వి. వే.

స్త్రీల ముఖమును చూచినంతనే మోహము కలుగును. దిసమొలను చూడగనే ఏవకలిగి మోహము నశించును. వలపు పోవును. విరక్తి కలుగును

One feels attracted to a woman's face. When he sees her naked, he will feel repulsion. The lust will be gone. He will reject her.

2140
మొగము జూచినపుడె మోహంబు ఘనమౌను ధనము జూచినపుడె తగులు మనసు కూలి నష్టమైన గొరునే కొఱగామి , వి. వే.

మొగము జూచినపుడె మోహంబు ఘనమౌను
ధనము జూచినపుడె తగులు
మనసు కూలి నష్టమైన గొరునే
కొఱగామి , వి. వే.

స్త్రీల ముఖము చూడగనే మోహమధికమగును . ధనము చూడగానే మనస్సు దానిపై పడును. వీనివలన కలుగు సుఖము స్వల్పమే! కూలిపాటువంటి యీ సుఖము నాశింపక ముక్తికై పాటుపడవలెను

One's lust will increase after seeing a woman's face. When one sees money, he will feel desire. The comfort enjoyed with them is impermanent. So one has to strive for attaining salvation.

2141
మొండివానికేల ముంజేతి కడియాలు తొఱ్ఱి వానికేల కఱ్ఱపండ్లు గాడిదలకునేల గడ్డముల్ మీసముల్ , వి. వే.

మొండివానికేల ముంజేతి కడియాలు
తొఱ్ఱి వానికేల కఱ్ఱపండ్లు
గాడిదలకునేల గడ్డముల్
మీసముల్ , వి. వే.

మొండివానికి చేతి కడియాలు, తొర్రి వానికి కట్టుడు పండ్లు, పేదవానికి గడ్డములు, మీసములు నిరుపయోగములు

A man without hands doesn't need bracelets. A man with a defective mouth does not need dental implants. A poor man does not need mustache and beard.

2142
మొదట నాశపెట్టి తుదిలేదు పొమ్మను పరమ లోభులైన పాపులకును వారి యుసురుతాకి వగచెడిపోవురా, వి. వే.

మొదట నాశపెట్టి తుదిలేదు
పొమ్మను పరమ లోభులైన పాపులకును
వారి యుసురుతాకి
వగచెడిపోవురా, వి. వే.

ఇచ్చెదనని తొలుత ఆశపెట్టి తర్వాత లేదు పొమ్మను లోభి పాపాత్ముడు . అవతలివారి యుసురు తగిలి ఆ లోభి తప్పక చెడిపోవును

A miser who promises first but breaks his promise will endure bad karma for disappointing the alms seeker.

2143
మృగమదమ్ము చూడ మీద నల్లగనుండు బరిఢవిల్లు దాని పరిమళంబు గురువులైన వారి గుణము లీలాగురా , వి. వే.

మృగమదమ్ము చూడ మీద నల్లగనుండు
బరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైన వారి గుణము
లీలాగురా , వి. వే.

కస్తూరి నల్లగా నున్నను దాని సువాసన గొప్పది. అట్లే బయటికి ఆడంబరములేని గురువులు గొప్ప శక్తికలవారై ప్రకాశింతురు

Even though kasturi is black its fragrance is great. Similarly the gurus who are not pompous are resplendent with great powers.

2144
రాజసంబు గోరి రాజ్య భారమునందు నోర్పులేని యీత డుభయతజెడు నీటిపైని గుండు నిలుచునా మునుగక , వి. వే.

రాజసంబు గోరి రాజ్య భారమునందు
నోర్పులేని యీత డుభయతజెడు
నీటిపైని గుండు నిలుచునా
మునుగక , వి. వే.

రజోగుణము మూలమున రాజ్యమును పాలింపలేని రాజు ఇహమునకు, పరమునకు కూడ చెడును. నీటిపై వేసిన రాయి మునుగునేగాని తేలదు

If a king driven by rajas (action) is unable to rule his kingdom, he is unfit for this and nether worlds. A stone thrown in water sinks but doesn't float.

2145
రాతి బసవని గని రంగుగా మ్రొక్కుచు రూఢి బసవుగాల రుద్దుచంద్రు బసవ భక్తులెల్ల పాపులు తలపోయ , వి. వే.

రాతి బసవని గని రంగుగా మ్రొక్కుచు
రూఢి బసవుగాల రుద్దుచంద్రు
బసవ భక్తులెల్ల
పాపులు తలపోయ , వి. వే.

బసవని భక్తులు రాతిబసవని పూజించి జీవములోనున్న ఎద్దులను ( బసవలను ) హింసింతురు . ఆ భక్తులు పాపాత్ములు

The devotees of Basava torture oxen after praying to his stone idol. Such devotees are sinners.

2146
రాతిప్రతిమ దెచ్చి రాజసంబుగ నుంచి పూజసేయు నరుడు బుద్ధిమాలి భావమందు నరుడు భావింప నేఱడు , వి. వే.

రాతిప్రతిమ దెచ్చి రాజసంబుగ
నుంచి పూజసేయు నరుడు బుద్ధిమాలి
భావమందు నరుడు
భావింప నేఱడు , వి. వే.

భగవంతుడు తనలోనే ఉన్నట్లు తెలియక బుద్ధిలేని వారు రాతిని దేవవిగ్రహముగా మలిచి , వానికి గొప్పగా పూజలు చేయుదురు

Without realizing that god is within us, foolish people carve out idol from stone and perform pooja to it.

2147
రాతి లింగమునకు రాజులు మొదలుగా పూజ సేయుదురిల పూలతోడ ఆత్మ లింగమునను నానంద మొందరు, వి. వే.

రాతి లింగమునకు రాజులు
మొదలుగా పూజ సేయుదురిల
పూలతోడ ఆత్మ లింగమునను
నానంద మొందరు, వి. వే.

రారాజు మొదలుగా అందరును రాతిలింగమునకు పూలతో పూజచేయుదురేకాని తమలోనున్న (ఆత్మలింగము) పరుని గాంచి ఆనందము పొందలేకున్నారు

A king ascending on the throne prays to a stone linga (phallic symbol) rather than pray to the aatma linga to attain happiness.

2148
రామ భక్తులమని రాతి బొమ్మకు మ్రొక్కి భజన సేయనేల భక్తిలేక భక్తి నిల్ప నతడు, భజనను చేయునా? వి. వే.

రామ భక్తులమని రాతి బొమ్మకు
మ్రొక్కి భజన సేయనేల భక్తిలేక
భక్తి నిల్ప నతడు,
భజనను చేయునా? వి. వే.

రామభక్తులని చెప్పుకొనువారు రాతిబొమ్మకు మ్రొక్కి దానియెదుట భజనచేయుదురు . నిజముగా దైవభక్తి కలవాడు భజనచేయక దేవుని ధ్యానించుచునే యుండును

People claiming to be Lord Rama's devotees worship his stone idol and perform bhajan in front of it. Real devotees don't perform bhajan but meditate on god in their minds.

2149
రూపులేని వనిత రూఢి పతివ్రత నీటు లేనివాడు పోటు బంటు తెలుపవచ్చు నెట్లు దేవరబంటుం , వి. వే.

రూపులేని వనిత రూఢి పతివ్రత
నీటు లేనివాడు పోటు
బంటు తెలుపవచ్చు నెట్లు
దేవరబంటుం , వి. వే.

కురూపియగు స్త్రీ పతివ్రత. ధైర్యము లేనివాడే వీరుడు అగుచున్నాడు . నిజమైన దైవభక్తిని తెలిసికొనుట కష్టము

An ugly woman is becoming a virtuous wife and one without boldness is being praised as a hero. It is hard to find out real devotion.

2150
రూపువంక పేరు రూఢిగా నిలుచును పేరువంక క్రియలు పెనగుచుండు నాశమౌను తుదకు నామరూపక్రియల్ , వి. వే.

రూపువంక పేరు రూఢిగా నిలుచును
పేరువంక క్రియలు పెనగుచుండు
నాశమౌను తుదకు నామరూపక్రియల్,
వి. వే.

మానసిక ధ్యానమువలన దివ్యతత్త్వమును పొందవచ్చును . కాని ఏదో ఒక రూపము నిర్మించి పేరు పెట్టి, ఆర్భాటముగా పూజలు చేసినయెడల లాభములేదు

It is possible to attain tattva by praying and meditating with mind. So there is no use in making an idol, giving it a name and performing pooja to it.

2151
రూపు వివరమొకటి రూఢిగాదా గన్న తలచునప్పుడెల్ల మెలగు మదిని అట్లు మెలపికోరు మా గురురూపుని , వి. వే.

రూపు వివరమొకటి రూఢిగాదా
గన్న తలచునప్పుడెల్ల మెలగు
మదిని అట్లు మెలపికోరు
మా గురురూపుని , వి. వే.

ఒక యాకారమును హృదయమున నిలిపి ధ్యానించిన అవి స్పష్టముగా కాన్పించును . అట్లే గురుస్వరూపమును మనస్సులో నిలిపినయెడల తరింపవచ్చును

It is possible to meditate over a form implanted in mind to see it clearly. If one fixates such a form of a guru, one can attain his goal.

2152
లవణమెంత?దాని లాభంబు గననెంత? కొద్ది దనుచు గూడునయ్య? భోగమేటికి ? నుపభోగంబె లెక్కగు, వి. వే.

లవణమెంత?దాని లాభంబు గననెంత?
కొద్ది దనుచు గూడునయ్య?
భోగమేటికి ? నుపభోగంబె
లెక్కగు, వి. వే.

ఉపయోగమువలననే వస్తువునకు గొప్పతనము వచ్చును. కాని స్వరూపమున రాదు . ఉప్పు స్వల్పమై , సాధారణమైనను విలువ ఎక్కువ. అది లేని ఆహారవస్తువు లేదుకదా!

A thing receives greatness by its utility rather than the form. Even though salt is ordinary it has great value. There is no food item without it.

2153
లోభమోహములను ప్రాభవముల తప్పు తలచిన పనులెల్ల తప్పి చనును తా నొకటి దలచిన దైవమొండగుచుండు , వి. వే.

లోభమోహములను ప్రాభవముల తప్పు
తలచిన పనులెల్ల తప్పి
చనును తా నొకటి దలచిన దైవమొండగుచుండు,
వి. వే.

లోభము , మోహము కలవారికి గొప్పతనము దక్కదు . అట్టివారు తలచిన పనులు జరగవు . తానొకటి తలచిన, దైవమొకటి తలచుననుట అందరును ఎరిగినదే

One who is a miser and greedy cannot achieve greatness. He can't execute the tasks he intends to. Everyone knows : man proposes, god disposes.

2154
లోభి వానికల్మి లోలత నాశించు బడుగువాడు తిరుగు, పరిణమించు తగరు వెంటనక్క తగిలిన చందము, వి. వే.

లోభి వానికల్మి లోలత నాశించు
బడుగువాడు తిరుగు,
పరిణమించు తగరు వెంటనక్క
తగిలిన చందము, వి. వే.

లోభివాని ధనమున కాశించి అవివేకి వానివెంట తిరుగునేకాని ప్రయోజనము లేదు. అది పొట్టేలువెంట నక్క ఆశతో వ్యర్థముగా తిరిగినట్లే యగును

A foolish person follows a miser seeking he wealth. There is no use. It's like a fox following a goat.

2155
లోభి దాతయైన లోకంబులోపల పరుల నడుగబోడు ప్రాలు మాలి ఒకని కీనివాడె యోచింప బెనులోభి , వి. వే.

లోభి దాతయైన లోకంబులోపల
పరుల నడుగబోడు ప్రాలు మాలి
ఒకని కీనివాడె యోచింప
బెనులోభి , వి. వే.

లోభి ఇతరులకు కొంచెమైనను ఈయనే యీయడు . లోభు వేదాతలైనయెడల ఈ లోకములో యాచకులు ఉండనే ఉండరు

A miser will not give a small amount of money to others. If misers all become donors, then there won't be any beggars.

2156
లోభివాని జంప లోకంబు లోపల మందు వేరు వలదు, మతమె కలదు పైకమడుగ నతడు భగ్గురుమని చచ్చు, వి. వే.

లోభివాని జంప లోకంబు లోపల
మందు వేరు వలదు, మతమె
కలదు పైకమడుగ నతడు భగ్గురుమని
చచ్చు, వి. వే.

లోభివానిని చంపుటకు వేరే మందక్కరలేదు . ఎవరైనను ధనమడిగిన చాలును. వాని ప్రాణము లెగిరిపోవును

There is no need for a poison to kill a miser. His praanaa will leave him when someone asks for his money.

2157
వనము బిలములందు పరయోగి తా నుండు పనియె యిందు ననక పాటుపడును తనివితీఱ మదిని దలకొని చూచును, వి. వే.

వనము బిలములందు పరయోగి తా
నుండు పనియె యిందు ననక పాటుపడును
తనివితీఱ మదిని
దలకొని చూచును, వి. వే.

యోగి అడవులందును , కొండ గుహలయందును నివసించును. ఎల్లపుడును ఈశ్వరునే మనస్సున నిలుపుకొని మోక్షమునకే యత్నించుచుండును . ప్రయత్నించి తృప్తితీర ఆత్మస్వరూపమును చూచును

A yogi will be constantly trying to attain salvation by living in forests, mountain caves and always meditating on god. Then he will visualize the form of aatma to utmost satisfaction.

2158
వరలు రత్నసమితివలె గూర్చు ధాన్యంబు చక్కదంచి వండి మిక్కుటముగ సుష్టు భోజనముల జూఱగా నిడువాడు చెప్పనేల వాడు శివుడు వేమ

వరలు రత్నసమితివలె గూర్చు ధాన్యంబు
చక్కదంచి వండి మిక్కుటముగ
సుష్టు భోజనముల జూఱగా నిడువాడు
చెప్పనేల వాడు శివుడు వేమ

రత్నమువలె ధాన్యమును ప్రోగుచేసి దంచి, వండి, ఇతరులకు తృప్తిగా భోజనము పెట్టువాడు దైవము వంటివాడు

The one who gathers paddy like precious stones, shears and extracts rice from it, then cooks the rice and serves it to his guests is like god.

2159
వలపు గలిగెనేని వనజాక్షి యధరంబు పంచదారకుప్ప పాలకోవ చూత ఫలరసంబు జున్నుసమానము , వి. వే.

వలపు గలిగెనేని వనజాక్షి
యధరంబు పంచదారకుప్ప
పాలకోవ చూత ఫలరసంబు జున్నుసమానము,
వి. వే.

ప్రేమయున్నచో యువతీ యధరము పంచదార తోను , పాలకోవాతోను, మామిడిపండురసముతోను , జున్నుతోను సమానమైయుండును

If a man loves a woman her lips taste like sugar, sweet made with cream of milk, mango juice and the milk given by a cow during the first few days after calving coagulated by heat.

2160
వలపు తీరెనేని వనజాక్షి యధరంబు ములక పంటి గిజరు ముష్టిరసము చింత పొంత యగును జీడి సమానమౌ , వి. వే.

వలపు తీరెనేని వనజాక్షి యధరంబు
ములక పంటి గిజరు ముష్టిరసము
చింత పొంత యగును
జీడి సమానమౌ , వి. వే.

ప్రీతిలేని యెడల యువతీ పెదవి తీయగాకాక ములకపండు గుజ్జువలె , ముష్టి రసమువలెను , చింతపండువలెను, జీడివలెను మిక్కిలి వెగటుగా నుండును

If one has no love for a woman, her lips tastes like a bitter fruit (The plant called Solanum, or Nightshade. నేలములక Solanum jacquini తెల్లములకSolanum indicum బృహతి.) , mushti-rasa (The Nux vomica or poisonous nut.), tamarind and cashew fruit.

2161
వల్ల వైపు లేక వాగ్ధత్తమటు చేసి అదిగొ యిదిగొ యనుచు నాసపెట్టి గడువుపెట్టి రేపు గడియ గానిమ్మను , వి. వే.

వల్ల వైపు లేక వాగ్ధత్తమటు
చేసి అదిగొ యిదిగొ యనుచు నాసపెట్టి
గడువుపెట్టి రేపు
గడియ గానిమ్మను , వి. వే.

లోభులు విధిలేక వాగ్దానముచేసి, ధనమీయక "అదిగో , యిదిగో" అనుచు, గడువు పెట్టుచు , “రేపు చూచెదనులే" అనుచు కాలము గడుపుదురు . యాచకుడు విసిగి తిరిగి రాడు

Misers without a choice promise money, but won't part with it. Instead they say they will give the next day or at another time. Thus they keep on postponing. The seeker of his money will get frustrated and won't return.

2162
వాడు వా డనంగ వానికేమిరలోటు?వాడట! నరదేవవర్యు నెపుడు వాడు కాక యదియె వాడనదప్పేమి ? వి. వే.

వాడు వా డనంగ వానికేమిరలోటు?వాడట!
నరదేవవర్యు
నెపుడు వాడు కాక యదియె
వాడనదప్పేమి ? వి. వే.

“వాడు, వాడు" అని దేవుని తిరస్కారముగా చూచిన దేవునకు లోటేమియు లేదు. అతడు సర్వలోక పూజ్యుడు, అతడు పురుషుడు గదా! “వాడు" కాక "అది" ఎట్లగును ?

When one refers to god as “he” in a deprecating tone, god won't feel a thing. He is a supreme being worshiped by all. Besides he is a man. So he won't be referred to as “she”.

2163
వాతగుణముచేత వగగన్న మగవాడు లొట్టకనుల దాని లోలలతకును బుట్టి జగతి నిలుచు బునరుద్భవించును , వి. వే.

వాతగుణముచేత వగగన్న మగవాడు
లొట్టకనుల దాని లోలలతకును
బుట్టి జగతి నిలుచు బునరుద్భవించును,
వి. వే.

లేవలేని వాతరోగి కామమునకు లోనై లొట్టకన్నుల దానిని పెండ్లాడి , తానే దానికి బిడ్డడై పుట్టును. ఇట్లంతము లేని జన్మము లెత్తుచుండును

A diseased person yielding to his lust marries a squinted woman and is born again as her son. Thus he lives unendingly.

2164
వాన భయముచేత వడిదూరెదరులోన నెంత కెంతయైన నెండి చరతు రేల లోక జనులు మే లోర్వకుందురు ? వి. వే.

వాన భయముచేత వడిదూరెదరులోన
నెంత కెంతయైన నెండి
చరతు రేల లోక జనులు మే లోర్వకుందురు?
వి. వే.

జనులకు మేలు పనికిరాదు. చల్లని వాన వచ్చినపుడు దానిని తప్పించుకొన నిండ్లలో దూరుదురు . భరింపలేని ఎండలో స్వేఛ్ఛగా తిరుగుదురు

Men don't seek safety. When there is a cold shower, men run into houses to seek refuge. When the sun is too hot, they are out roaming on the streets.

2165
విజయుడైనవాడు విల్లంది నంతనే కుజనులెల్ల వారు కూలిరి గద ! భజనచేయు నతడు విజయము గాంచడా ? వి. వే.

విజయుడైనవాడు విల్లంది నంతనే
కుజనులెల్ల వారు కూలిరి
గద ! భజనచేయు నతడు విజయము
గాంచడా ? వి. వే.

విష్ణు భక్తుడగు అర్జునుడు విల్లమ్ములు ధరింపగానే దురాత్ములగు కౌరవులందరును నశించిరి. భగవంతుని సేవించు వానికి తప్పక విజయము కలుగును

King Arjuna who is a devotee of Lord Vishnu destroyed kauravas, his cousins, in the Maha Bhaarata war using his bow and arrows. The one who serves god will always be the victor.

2166
విటుని గన్న వలపు విశదమై యుండును బోటి చూపునకును సాటి గలదె? కరిటిలోని పాప కుంటెన కాడయా, వి. వే.

విటుని గన్న వలపు విశదమై
యుండును బోటి చూపునకును
సాటి గలదె? కరిటిలోని పాప
కుంటెన కాడయా, వి. వే.

విటుని చూడగానే స్త్రీలు చూపులతోనే వలపును వెల్లడింతురు . ఆ చూపులకు సాటియే లేదు. వారి కంటి పాపయే తార్పుగానివలె పనిచేయును

Women express love in their eyes when they see a handsome man. There is no parallel to such eyes. Their eye pupils act as the connection between themselves and the men.

2167
విటుల కనులకెంతో విభ్రమమై తోచు సాటిలేని పొలతి చక్కదనము కంటిలోని పాప కుంటెన తనమె కా, వి. వే.

విటుల కనులకెంతో విభ్రమమై
తోచు సాటిలేని పొలతి చక్కదనము
కంటిలోని పాప కుంటెన
తనమె కా, వి. వే.

విటుల కంటికి యువతుల చక్కదనము విభ్రమము కల్గించును . కంటిలోని పాపయే తార్పుడు పనిని చేయును

To the debauchee a woman's beauty is tantalizing. The pupils in his eyes function as the bridge between him and the woman.

2168
విడువవలయు నూరు విశ్రాంతి గాకున్న విడువవలయు నాలి విధము చెడిన , విడువవలయు రాజు వితరణి గాకున్న, వి. వే.

విడువవలయు నూరు విశ్రాంతి గాకున్న
విడువవలయు నాలి విధము
చెడిన , విడువవలయు రాజు
వితరణి గాకున్న, వి. వే.

విశ్రాంతి లేని గ్రామమును, చెడునడతగల భార్యను, త్యాగ బుద్ధిలేని రాజును విడువవలెను

One should leave villagers who don't take rest, a wife with bad behavior and a king who can't sacrifice.

2169
విడువ ముడువ లేక కుడువగట్టగ లేక వెఱపులేక విద్య విధములేక వెడలలేని వాని నడిపీను గనరొకో , వి. వే.

విడువ ముడువ లేక కుడువగట్టగ
లేక వెఱపులేక విద్య విధములేక
వెడలలేని వాని నడిపీను
గనరొకో , వి. వే.

పట్టుటకు , ఇతరులకు పెట్టుటకు కావలసిన ధనమార్జింపలేనివారు , విద్యావివేకములు లేనివారు, నలుగురిలోనికి పోలేనివారు నడుచుచున్న పీనుగల (నడపీనుగుల)వంటివారు

One who cannot earn enough money to help others, the one without education and common sense, the one who can't mingle with a crowd, are like zombies.

2170
విత్త హీనమైన వేళలందును తల్లి తనయు లాలు సుహృద లనెడివార లెల్ల శత్రులగుదు రెండైన నిజమిది, వి. వే.

విత్త హీనమైన వేళలందును తల్లి
తనయు లాలు సుహృద లనెడివార
లెల్ల శత్రులగుదు రెండైన
నిజమిది, వి. వే.

ఉన్న ధనము నశింపగా తల్లి , కొడుకు, భార్య, మిత్రుడు - వీరందరును శత్రువు లగుదురు

When one loses all of his wealth, mother, son, wife and friend will become his enemies.

2171
విత్తు మ్రగ్గెనేని వృద్ధి కానేఱదు విత్తు మ్రగ్గకున్న వృద్ధియగును విత్తు విశ్వమునకు వివరింపనేదియో , వి. వే.

విత్తు మ్రగ్గెనేని వృద్ధి కానేఱదు
విత్తు మ్రగ్గకున్న వృద్ధియగును
విత్తు విశ్వమునకు
వివరింపనేదియో , వి. వే.

విత్తనము మ్రగ్గినచో మొలకెత్తదు . మ్రగ్గకయున్న యెడల మొలకయెత్తి వృద్ధిపొందును . ఈ ప్రపంచ వృక్షమునకును మొలక కలదు. అదే పరమాత్మ స్వరూపము

If a seed is dead, then it can't sprout. If alive, a seed will grow into a tree. There is a seed for the tree of the world. That is paramaatma's form.

2172
విధిలేక జరుగదనుచును మదిలో నే వస్తువైన మనసున గూడన్ బాదలుచు విడువగ జాలని యదియే సంసార బీజ మనబడు వేమా

విధిలేక జరుగదనుచును మదిలో
నే వస్తువైన మనసున గూడన్
బాదలుచు విడువగ జాలని యదియే
సంసార బీజ మనబడు వేమా

ఏ వస్తువుపయి మనస్సుపోయినను, అట్లు పోనిచ్చి విధియే ఆ రీతిగా చేయుచున్నట్లు చెప్పి, ఆ మమతను విడువ లేకుండుటయే సంసారమునకు మూలము

Bondage is when one desires an object, claims fate is making him seek it, and won't give up his liking for it.

2173
విన్నవానికన్న కన్నవా డధికుండు కన్నవానికన్న గలియువాడు ఉన్నతోన్నతుడయి యుర్విలోపలనుండు , వి. వే.

విన్నవానికన్న కన్నవా డధికుండు
కన్నవానికన్న గలియువాడు
ఉన్నతోన్నతుడయి యుర్విలోపలనుండు,
వి. వే.

భగవంతునిగూర్చి విన్నవానికంటె అతనిని కనుగొన్న వాడు గొప్పవాడు . భగవదైక్యము పొందినవా డంతకంటెను గొప్పవాడు. అతడు గొప్పవారిలో అధికుడు

A man who has seen god is superior to a man who has heard about him. The person who unified with god is the greatest.

2174
వినియు వినకయుండు కనియు గానకయుండు తలచి తలపకుండు తాను యోగి మనుజపరులచేత మఱి పూజ గొనుచుండు , వి. వే.

వినియు వినకయుండు కనియు గానకయుండు
తలచి తలపకుండు తాను
యోగి మనుజపరులచేత మఱి
పూజ గొనుచుండు , వి. వే.

జ్ఞాని, మోక్ష ధర్మములు వినియు విననట్లును, తత్త్వమును చూచియు చూడనట్లును, దేవుని తలచియు తలపనట్లును ఉండును. అట్టి జ్ఞాని నందరును పూజింతురు

One who is learned will behave as though he has heard about salvation and may be not; he has seen tattva and may be not; he has prayed to God and may be not. People worship such a man.

2175
విప్రునెంగిలాకు వీధి కుక్కల పాలు మాలపుల్లె యైన మానితంబు మంతుకెక్కు నాకు మాలపుల్లె యటండ్రు , వి. వే.

విప్రునెంగిలాకు వీధి కుక్కల
పాలు మాలపుల్లె యైన మానితంబు
మంతుకెక్కు నాకు మాలపుల్లె
యటండ్రు , వి. వే.

బ్రాహ్మణులందరు విస్తళ్ళలో భుజింతురుకాన, వారి యెంగిలాకులు వీధులలో ఎక్కువగా కానవచ్చును . వానిని కుక్కలు పీకుచుండును. అది చూచుట కసహ్యముగా నుండును. మాలపల్లెలో ఎక్కడోగాని ఆకులలో తినుటలేదు . కాన ఎంగిలాకులు తక్కువ

Brahmins throw away the leaves from which they eat food on the streets. Stray dogs can be found feeding on them. Such a sight is ugly. In the colony of untouchables people are not eating on leaves. So one can't find them on the streets.

2176
విశ్వమందు పరుని వివరంబు గానక పరమహంస నెట్లు పట్టవచ్చు? మానసమున నిష్ట బూనగవలె గాని, వి. వే.

విశ్వమందు పరుని వివరంబు
గానక పరమహంస నెట్లు పట్టవచ్చు?
మానసమున నిష్ట బూనగవలె
గాని, వి. వే.

లోకములో పరాత్పరుని వివరములు తెలియనివారు పరమహంసను పట్టలేరు . మనోనిష్ఠను వహించి పరమహంసను కనుగొన యత్నింపవలెను

One who does not know the supreme being of the world, cannot understand parama-hamsa. One has to control mind and meditate over parama-hamsa and try to find out about it.

2177
విశ్వమందు బ్రహ్మ విస్తరించుట గాక వేఱె బ్రహ్మమనుచు వెదుకనేల? తగిలి యుండుగాదె తనలోన బ్రహ్మము, వి. వే.

విశ్వమందు బ్రహ్మ విస్తరించుట
గాక వేఱె బ్రహ్మమనుచు
వెదుకనేల? తగిలి యుండుగాదె
తనలోన బ్రహ్మము, వి. వే.

ప్రపంచమంతటను బ్రహ్మము వ్యాపించియుండగా వేరేచోట ఎందుకు వెదకుట ? ఆ బ్రహ్మము తనలోనేయున్న సంగతి గుర్తింపవలెను

When brahmam is omnipresent why search for it? One has to recognize brahmam within oneself.

2178
విశ్వము నడుపంగ విశ్వేశ్వరుం డుండ బ్రాహ్మణులకు నేల పట్టుదలలు? వనములోని క్రోతి వసుమతి నడపునా? వి. వే.

విశ్వము నడుపంగ విశ్వేశ్వరుం
డుండ బ్రాహ్మణులకు నేల
పట్టుదలలు? వనములోని క్రోతి
వసుమతి నడపునా? వి. వే.

ప్రపంచమంతటిని నడుపుటకు భగవంతుడుండగా బ్రాహ్మణులు తమతోనే యున్నదని పట్టుపట్టి పల్కుట అజ్ఞానమే! వనములోని క్రోతి రాజ్యమును పాలింపగలదా?

When god is ruling the world, brahmins claiming themselves to be running it is foolishness. Can a monkey in the forest rule the kingdom?

2179
కాని కులముడైన కంటికింపై నప్డు విటుడు తలచెనేని విడువలేడు మరగి గ్రుడ్డి కుక్క మలమును దిన్నట్లు, వి. వే.

కాని కులముడైన కంటికింపై నప్డు
విటుడు తలచెనేని విడువలేడు
మరగి గ్రుడ్డి కుక్క మలమును
దిన్నట్లు, వి. వే.

నీచకులమున పుట్టినదైనను సరే, అందమైన యువతిని విటుడు విడిచిపెట్టడు . గ్రుడ్డి కుక్క మలమును విడిచిపెట్టదు గదా!

Even if a beautiful woman is born in low-caste a debauchee won't leave her. A blind dog won't leave the food thrown on the street.

2180
విశ్వసింపదగిన వేషంబు మఱిలేదు కుడవ గూడులేదు కోకలేదు విశ్వమయుడె యైన విభునేల తెలియరో ? వి. వే.

విశ్వసింపదగిన వేషంబు మఱిలేదు
కుడవ గూడులేదు కోకలేదు
విశ్వమయుడె యైన విభునేల
తెలియరో ? వి. వే.

సాధారణ జనులు వేషపుటార్భాటము లేకున్నను, తిన తిండి , కట్ట గుడ్డ లేకున్నను - లేవని బాధపడుదురే కాని భగవంతుని స్మరింపరు

Ordinary people despite not having food to eat and clothes to wear, feel sorrow but not pray to God.

2181
విష్ణుభక్తులిలను వీభూతి పాలైరి శివుని భక్తులెల్ల సిద్ధులైరి భక్తులెల్ల జీవిపాటిని దప్పిరి , వి. వే.

విష్ణుభక్తులిలను వీభూతి పాలైరి
శివుని భక్తులెల్ల సిద్ధులైరి
భక్తులెల్ల జీవిపాటిని
దప్పిరి , వి. వే.

వైష్ణవులు శైవులుగాను , శైవులు సిద్ధులుగాను మారిపోవుచున్నారు . భక్తులలో స్థిరమైన నమ్మకము, కట్టుబాటు కానరాదు

Worshipers of Lord Vishnu are converting to worshipers of Lord Siva who in turn are becoming Sidhus. It seems devotees don't have a firm mind and steadfast principles.

2182
వీడవలయు వాని గూడిన నెగ్గగు వీటివాడలందు వెలయువాడు వాడు చేయు పనులు పరిపాటియే గదా, వి. వే.

వీడవలయు వాని గూడిన నెగ్గగు
వీటివాడలందు వెలయువాడు
వాడు చేయు పనులు పరిపాటియే
గదా, వి. వే.

చేరదగనవానితో స్నేహము చేయరాదు. నలుగురి లోను మసలవలసినవానికి నీచులతోడి చెలిమి తగదు. చెలిమి చేసిన అవమానమే కలుగును. నీచుల చేష్టలందరు ఎరిగినవే

One should not befriend undeserving people. One who likes to socialize should not befriend a deceitful person. Otherwise he will face insults. People know the acts of deceitful people.

2183
విడుచు దాని పొందు విడువజాలనివాడు చచ్చుదాక మోయు చాప గుడిసె భాగవతుల పట్టు బాపంగ నోపడు , వి. వే.

విడుచు దాని పొందు విడువజాలనివాడు
చచ్చుదాక మోయు
చాప గుడిసె భాగవతుల పట్టు
బాపంగ నోపడు , వి. వే.

విడువదగిన కులటతోడి పొందకూడదు . కులటతో కూడినవాడు తాను చచ్చుదాక - వీధి భాగవతులవలె దాని చాప , గుడిసెలను మోయవలసినదే

One should not stay with a prostitute. If one does stay with her, he has to take care of her bed and house for the rest of his life like a servant.

2184
వెదకి కానలేడు వేదాంత వేద్యుని తత్త్వవేత్త లేడు ధరణిలోన , కలిగెనే నతండు కానంగరాడయా , వి. వే.

వెదకి కానలేడు వేదాంత వేద్యుని
తత్త్వవేత్త లేడు
ధరణిలోన , కలిగెనే నతండు
కానంగరాడయా , వి. వే.

పరమేశ్వరుని వెదకి కన్నులతో చూచినవాడు లేడు. నిజమైన తత్త్వవేత్తలు కానరారు . తత్త్వవేత్త యున్నచో సామాన్య జనులకు కనబడడు

There is no one who saw Iswara with his own eyes. The real people who know the tattva are not to be found. If there is one, he won't be within the reach of ordinary people.

2185
వెదకి వెదకి వెదకి వేసారి వేసారి తిరిగి తిరిగి తిరిగి దిమ్మదిరిగి బొమ్మలాట జూచి పోబడి గంటిరా, వి. వే.

వెదకి వెదకి వెదకి వేసారి వేసారి
తిరిగి తిరిగి తిరిగి
దిమ్మదిరిగి బొమ్మలాట జూచి
పోబడి గంటిరా, వి. వే.

మూఢులారా ! మీరు పరమాత్మను చూడగోరి , అతనిని వెదకి వెదకి శ్రమపడి, క్షేత్రములకు తిరిగి తిరిగిరి. ఈ లోకము బొమ్మలాటవంటిది . దీనిం గాంచియు మృత్యువు దగ్గరగా నున్నదని తెలియలేకున్నారు . భగవంతునే సదా ధ్యానింపుడు

Foolish people desirous of seeing god go on pilgrimage to all the holy places. This world is like a stage for puppeteers. One is not able to realize the proximity of death. One has to always pray to god.

2186
వెన్న చేతబట్టి వివరంబు తెలియక ఘృతము కోరునట్టి యతని భంగి తాను దైవమయ్యు దైవంబు దలచును , వి. వే.

వెన్న చేతబట్టి వివరంబు తెలియక
ఘృతము కోరునట్టి యతని
భంగి తాను దైవమయ్యు దైవంబు
దలచును , వి. వే.

వెన్నను చేతితో పట్టుకొని నేయి చేయు విధము తెలియక నేతికై బాధపడువానివలె , జనుడు తనలోనే భగవంతుడున్నాడని తెలిసికొనలేక , అతడెక్కడో ఉన్నాడని, అతనికై వెదకుచు తికమక పడుచుందురు

Holding butter in one's hand, when one is not sure how to make ghee is like people who get confused by looking for god everywhere even though he is within them.

2187
వెనుక జూతమన్న వెసను కష్టపుగుంట ముందు జూతమన్న మురికిగుంట వెలది జూచియేల వేడుక పడుదురు , వి. వే.

వెనుక జూతమన్న వెసను కష్టపుగుంట
ముందు జూతమన్న మురికిగుంట
వెలది జూచియేల వేడుక
పడుదురు , వి. వే.

స్త్రీ రూపము ఏహ్యమైనది , ముందు చూచిన మురికిగుంటవలె నుండును. వెనుక చూచిన వెగటుగా ఉండును . ఇట్టి యువతిపై ఆశ ఎట్లు కలుగుచున్నదో తెలియకున్నది

A woman's form is a turn off. In the front it will be like a cess pool. In the rear it is repulsive. How one can desire such women is unknown.

2188
వెఱ్ఱివానికైన వేషధారికైన రోగికైన పరమయోగికైన స్త్రీల జూచినపుడు చిత్తము రంజిల్లు, వి. వే.

వెఱ్ఱివానికైన వేషధారికైన
రోగికైన పరమయోగికైన
స్త్రీల జూచినపుడు చిత్తము
రంజిల్లు, వి. వే.

వెర్రివానికైనను , వేషగానికైన , రోగముతో బాధపడుచున్న వానికైనను , యోగికైనను సరే ; అందమైన స్త్రీని చూడగా మనస్సు చలించి అభిలాష జనించును

Whether a foolish person, an actor, a diseased, or a yogi, when they see a beautiful woman their minds weaken and desires will spring forth.

2189
వెలది సొంపు చూచి విఱ్ఱవీగగరాదు కలికి గుణమె కాదె కారణంబు చపల చిత్త వృత్తి జారిణి కుండదా , వి. వే.

వెలది సొంపు చూచి విఱ్ఱవీగగరాదు
కలికి గుణమె కాదె కారణంబు
చపల చిత్త వృత్తి
జారిణి కుండదా , వి. వే.

స్త్రీకి గుణము ముఖ్యము, అందము ముఖ్యము కాదు . జార స్త్రీ చాలచక్కగా ఉండవచ్చును . కాని దాని మనస్సు చపలము. ఆమెను అందరు ఏవగించుకొందురు

Beauty is not as important as character for a woman. A prostitute can be very beautiful but her mind is fickle. Everyone debases her.

2190
వేదములను జదివి వెరవేమి గాంచిరి? యరిగి తిరిగి వత్తు రందరు కద! బ్రహ్మమేమొ తెలిసి బ్రతుకుట నిజమయా , వి. వే.

వేదములను జదివి వెరవేమి గాంచిరి?
యరిగి తిరిగి వత్తు రందరు
కద! బ్రహ్మమేమొ తెలిసి
బ్రతుకుట నిజమయా , వి. వే.

వేదములను చదివితిమని బ్రాహ్మణులు గర్వించిన ప్రయోజనమేమి? వాని ఉపయోగమేమి? బ్రహ్మమును తెలిసికొన్నప్పుడే అతనికి బ్రాహ్మణత్వము సిద్ధించును

What is the use when brahmins express pride in studying vedas? What is its utility? When one discovers brahman then he will attain the status of brahmin.

2191
వేద విద్యలెల్ల వేశ్యల వంటివి భ్రమల బెట్ట ఏటపడగనీవు గుప్త విద్య యొకటె కులకాంత వంటిది, వి. వే.

వేద విద్యలెల్ల వేశ్యల వంటివి
భ్రమల బెట్ట ఏటపడగనీవు
గుప్త విద్య యొకటె కులకాంత
వంటిది, వి. వే.

వేదవిద్యలు వేశ్యలవలె భ్రమలుపెట్టి తత్త్వము తెలియనీయవు . బ్రహ్మమును తెలిసికొను విద్యయొక్కటే కులస్త్రీవలె ఉత్తమమై కీర్తి కలిగించి తరింపజేయును

The various schools of vedic thought tantalize one like a prostitute without revealing the tattva. The education that teaches brahmam is like a chaste woman will bring fame to one.

2192
వేదశాస్త్రములను విరివిగా దా నేర్చి వాదమాడువాడు వట్టివాడు సారమైన గుఱుతు సాక్షిగా నెంచుము , వి. వే.

వేదశాస్త్రములను విరివిగా
దా నేర్చి వాదమాడువాడు వట్టివాడు
సారమైన గుఱుతు సాక్షిగా
నెంచుము , వి. వే.

వేదశాస్త్రములను నేర్చినందుకు ఫలము వాద వివాదములు కావు. వాదించువాడు నిష్ప్రయోజకుడు . సర్వసాక్షియగు భగవంతుని తెలిసికొని తరించుటే విద్యకు ఫలము

The result of learning vedas is not to debate and argue over them. A person arguing is useless. The fruit of any education is learning about the god who witnesses everything and attaining salvation.

2193
వేదాంతుల మని కొందఱు వాదమునకు నడుముగట్టి వత్తురు వారల్ సాధులు కారని చెప్పగ భేదగుణం బొకటి గుఱుతు పెద్దది వేమా

వేదాంతుల మని కొందఱు వాదమునకు
నడుముగట్టి వత్తురు వారల్
సాధులు కారని చెప్పగ భేదగుణం
బొకటి గుఱుతు పెద్దది వేమా

కొందరు వేదాంతులమని చెప్పుకొనుచు వాదోపవాదములు చేయుచుందురు. వారు సాధువులు కారని చెప్పుటకు వారి భేదబుద్ధియే తార్కాణమగుచున్నది

Some people claiming themselves to be knowledgeable about vedas debate with one another. To conclude that they are not eminent their discriminatory nature is evident.

2194
వేషధారి నెపుడు విశ్వసింపగరాదు వేష దోషము లొక విధమె యగును రట్టుకాదె మునుపు రావణు వేషంబు, వి. వే.

వేషధారి నెపుడు విశ్వసింపగరాదు
వేష దోషము లొక విధమె
యగును రట్టుకాదె మునుపు
రావణు వేషంబు, వి. వే.

వేషధారి మోసగాడు . వానిని నమ్మరాదు. వేషము, దోషము సమానములే! రావణుడు వేషమువేసి , సీత నపహరించి దోషమునకును, అపకీర్తి పాలయ్యెను

One wearing a garb is deceitful. One should not trust him. Both garb and deceit are one and the same. King Ravana wore a garb and kidnapped Sita and fell into disgrace.

2195
వేష మొనర గట్టి వెఱ్ఱి శూద్రత్వంబు తనకు లేదనుకొని ధరణి ద్విజుడు అరిది గిట్టువేళ నడగు ద్విజత్వంబు , వి. వే.

వేష మొనర గట్టి వెఱ్ఱి శూద్రత్వంబు
తనకు లేదనుకొని ధరణి
ద్విజుడు అరిది గిట్టువేళ నడగు
ద్విజత్వంబు , వి. వే.

వెర్రివాడగు బ్రాహ్మణుడు జందెము ధరించి తనకు శూద్రత్వము పోయి బ్రాహ్మణత్వము సిద్ధించినదని విర్రవీగు చుండును. చచ్చిన సమయమున బ్రాహ్మణ చిహ్నములు తీసివేయగా శూద్రత్వము రాదా? బ్రాహ్మణత్వ మెట్లుండును ?

A foolish brahmin after thread ceremony feels proud that his low-caste status has been changed to highest-caste status. At the time of death won't he revert back to lower-caste after removing all signs of Brahmanism on his body?

2196
వ్యాధి నెఱుగలేని వైద్య మదేలరా ? కొదవ తెలియలేని కోర్కులేల? మనసు తెలియలేని మర్మజ్ఞు లేటికి? వి. వే.

వ్యాధి నెఱుగలేని వైద్య మదేలరా?
కొదవ తెలియలేని కోర్కులేల?
మనసు తెలియలేని మర్మజ్ఞు
లేటికి? వి. వే.

రోగ మెరుగని వైద్యుడు, కొదువ తెలియని కోరికలు, మనస్సు నెరుగని మర్మజ్ఞుడు నిరుపయోగులు

The doctor who has no diagnosis, one with an unlimited number of wishes, and one who doesn't understand a person's mind are useless.

2197
వ్రతము లాచరింప వట్టి కష్టమె గాని బ్రతుకు మీద నాశపడుటలేదు వ్రతముచేత పరుని వెతుకంగ లేరయా? వి. వే.

వ్రతము లాచరింప వట్టి కష్టమె
గాని బ్రతుకు మీద నాశపడుటలేదు
వ్రతముచేత పరుని
వెతుకంగ లేరయా? వి. వే.

వ్రతములు చేయుటవలన శ్రమలేకాని వేరే ప్రయోజనము లేదు. బ్రతుకుపై ఆశతో వ్రతములు చేయుటలేదు. వ్రతమువల్ల పరుని కనుగొనలేము

Performing rituals is stressful but not useful. One is not doing rituals out of desire for life. One can't discover god with rituals.

2198
వ్రతము లెన్నియైన వట్టి చిక్కులెకాని ఆత్మ చిక్కుగావ నలవికాదు ఆత్మ చిక్కు బాపునతడె పో ఘనయోగి , వి. వే.

వ్రతము లెన్నియైన వట్టి చిక్కులెకాని
ఆత్మ చిక్కుగావ
నలవికాదు ఆత్మ చిక్కు బాపునతడె
పో ఘనయోగి , వి. వే.

వ్రతములు చేసిన చిక్కులు పడుటేకాని, వానివల్ల ఆత్మకు సంబంధించిన చిక్కు విడదు. ఆత్మను గూర్చిన సంశయములు తీర్చి కడతేర్చునాతడే గొప్ప యోగి

By performing rituals one falls into greater travail and can't unravel the knots about aatma. A great yogi is one who dispels the doubts about aatma.

2199
శాంతమె జనులను జయము నొందించును శాంతముననె గురుని జాడ తెలియు శాంత భావమహిమ జర్చింపలేమయా , వి. వే.

శాంతమె జనులను జయము నొందించును
శాంతముననె గురుని
జాడ తెలియు శాంత భావమహిమ
జర్చింపలేమయా , వి. వే.

శాంతమున్న దేనినైన సాధింపవచ్చును . శాంతము వల్లనే గురువులు గొప్పవారైరి . శాంతగుణము యొక్క మహిమను వర్ణింప తరముకాదు

With patience it is possible to achieve all things. Gurus have become famous with patience. There are no words to describe patience.

2200
శిలను ప్రతిమజేసి చీకటిలోబెట్టి మ్రొక్కవలవదికను మూఢులార ! ఉల్లమందు బ్రహ్మముండుట దెలియుడీ , వి. వే.

శిలను ప్రతిమజేసి చీకటిలోబెట్టి
మ్రొక్కవలవదికను మూఢులార!
ఉల్లమందు బ్రహ్మముండుట
దెలియుడీ , వి. వే.

రాతిప్రతిమను చీకటి గుడిలోనుంచి మ్రొక్కుట వలన ప్రయోజనము లేదు. భగవంతుడు మీలోనే యుండుటను తెలిసికొనుడు

There is no use in worshiping a stone idol in a dark temple. God is within us.

2201
శిలలు జూచి నరులు శివుడని భావింత్రు శిలలు శిలలెకాని శివుడు కాడు తనదులోని శివుని దానేల తెలియడో , వి. వే.

శిలలు జూచి నరులు శివుడని భావింత్రు
శిలలు శిలలెకాని శివుడు
కాడు తనదులోని శివుని
దానేల తెలియడో , వి. వే.

రాతి విగ్రహములను చూచి అవే దేవతలని భావించుట వెర్రితనము . అవి రాళ్ళు మాత్రమే . దానిలో దేవుడు లేడు . దేవుడు మనలోనే యుండుటను తెలిసికొనవలెను

Claiming stone idols are gods is foolishness. They are stones only. There is no god in them. One has to know that god is within us.

2202
శివుడు బ్రహ్మమనుచు స్మృతులెల్ల బలికిన పరులనేల గొల్చు బ్రాహ్మణుండు ?హరుని భక్తులెల్ల నరయగా నరుదె కా, వి. వే.

శివుడు బ్రహ్మమనుచు స్మృతులెల్ల
బలికిన పరులనేల గొల్చు బ్రాహ్మణుండు?
హరుని భక్తులెల్ల
నరయగా నరుదె కా, వి. వే.

శివుడే బ్రహ్మమని స్మృతులు చెప్పుచుండగా బ్రాహ్మణులితరదేవతలను ఎందుకు సేవించుచున్నారో తెలియకున్నది. ఇపుడు శివభక్తులు అరుదైపోయిరి

When scripture is saying Lord Siva is brahmam, brahmins are worshiping other gods. The number of devotees of Lord Siva has dwindled.

2203
శిష్య వర్గమునకు శివు జూప నేఱక కాని మతములోన గలుపునట్టి గురుని నరసిచూడ గ్రుడ్డెద్దు చేనురా, వి. వే.

శిష్య వర్గమునకు శివు జూప
నేఱక కాని మతములోన గలుపునట్టి
గురుని నరసిచూడ గ్రుడ్డెద్దు
చేనురా, వి. వే.

గ్రుడ్డి యెద్దు చేనులోపడిన రీతినున్న గురువులు కొందరు శిష్యులకు శివుని తత్త్వమును తెలుపజాలక తప్పు మార్గములను పట్టించుచున్నారు

Like a blind ox that entered a farm, some gurus are misleading their disciples without teaching the tattva of Lord Siva.

2204
శీలము గల సుందరి తన యాలైనను స్వర్గమేల నైహిక సుఖమే శీలము లేనిది చూడగ గాలునిపటుదూత యగును గదరా వేమా

శీలము గల సుందరి తన యాలైనను
స్వర్గమేల నైహిక సుఖమే
శీలము లేనిది చూడగ గాలునిపటుదూత
యగును గదరా వేమా

శీలము గల యువతి తనకు భార్యగా లభించినచో ఐహిక సుఖములకు లోపములేదు. శీలములేని స్త్రీ యముని దూతతో సమానురాలు

If one's wife is a lady of character, then he can enjoy all the comforts in this life. A wife without character is like the god of death.

2205
శూద్రతనము పోయె శూద్రుడగానని ద్విజు డనుకొనుటెల్ల దెలివిలేమి ఇత్తడెసగు పసిడి కీడనవచ్చునా ? వి. వే.

శూద్రతనము పోయె శూద్రుడగానని
ద్విజు డనుకొనుటెల్ల దెలివిలేమి
ఇత్తడెసగు పసిడి
కీడనవచ్చునా ? వి. వే.

శిఖా , యజ్ఞోపవీతములు దాల్చి తనకు శూద్రత్వము పోయి బ్రాహ్మణత్వము వచ్చెనని ద్విజుడు సంతసింపరాదు. ఇత్తడి ఎపుడును బంగారమునకు సాటికాదు

After wearing a tuft of hair and undergoing thread ceremony a brahmin should not be contended that his lower-caste status has been changed to a highest-caste status. Brass can never be gold

2206
శూద్ర యువతి కొడుకు శుద్ధాంతరంగుడై వేద వేద్యమైన పాదు దెలిసి బ్రహ్మపదవి గన్న బ్రాహ్మణుడే గదా! వి. వే.

శూద్ర యువతి కొడుకు శుద్ధాంతరంగుడై
వేద వేద్యమైన పాదు
దెలిసి బ్రహ్మపదవి గన్న
బ్రాహ్మణుడే గదా! వి. వే.

శూద్రుడయినను గురూపదేశమును వేదములందు చెప్పబడు తత్త్వము నెరిగిన యెడల , అతడు బ్రాహ్మణుడే యగును. బ్రహ్మ పదవిని పొందును

Even if a person is of low-caste, after receiving education from a guru and learning the tattva in vedas, he can be called a brahmin. He will achieve the position of Lord Brahma.

2207
శూద్రులనుచు భువిని శూద్రుల బోనాడు మాలకన్నదుడుకు మహిని లేదు నరకమునకు నేగు నష్టమైన వెనుక, వి. వే.

శూద్రులనుచు భువిని శూద్రుల
బోనాడు మాలకన్నదుడుకు
మహిని లేదు నరకమునకు నేగు
నష్టమైన వెనుక, వి. వే.

శూద్రులు నీచజాతివారని , ఆ శూద్రులను నిందించు వాడు మాలవానికంటెను నీచుడు. ప్రాణములు పోయిన పిదప వాడు నరకమునకే పోవును

One calling a sudra a low-life and abusing a sudra, is worse than an untouchable. After death he will ascend to hell.

2208
సకల జాతి పురుష సాంకర్యమునకును సతుల నిచ్చి తాము సమ్మతింత్రె ఉంకునె కనలేని యోగులు బాపలా? వి. వే.

సకల జాతి పురుష సాంకర్యమునకును
సతుల నిచ్చి తాము సమ్మతింత్రె
ఉంకునె కనలేని
యోగులు బాపలా? వి. వే.

తమ భార్యలు చెడిపెలయి పురుషులందరితోను స్వేచ్ఛగా తిరుగుచుండుగా , ఉపేక్ష వహించిన జోగులు తాము బ్రాహ్మణులమని ఎట్లు చెప్పుకొందురో ?

How can a hermit whose wife has lost her character and moves freely with other men call himself a brahmin after all is lost because of his hesitation?

2209
సకలము నాకలికొఱకే నికరంబుగ బెట్టె మనకు నీచపు గుణముల్ సకలంబందు వసించెడి యకలంకుడె యేమి వింతో యరయర వేమా

సకలము నాకలికొఱకే నికరంబుగ
బెట్టె మనకు నీచపు గుణముల్
సకలంబందు వసించెడి యకలంకుడె
యేమి వింతో యరయర వేమా

తిండిని సంపాదించుకొరకే భగవంతుడు మనకి మంచి గుణములను , నీచగుణములను కల్పించెను . ఆ పరాత్పరుని యిట్టి సృష్టి చాల వింతయైనది కదా!

God has given good and bad characters to earn livelihood. The supreme being operates in mysterious ways.

2210
సకలరూప మాత్మ సాక్షిలో నెంచుట నికరమైన బయలు నిర్ణయంబు వికల మింతలేక వెలుగును తత్త్వంబు, వి. వే.

సకలరూప మాత్మ సాక్షిలో నెంచుట
నికరమైన బయలు నిర్ణయంబు
వికల మింతలేక వెలుగును
తత్త్వంబు, వి. వే.

సకల లోకస్వరూపమును ఆత్మలో ఎంచుచు వికలత్వము పొందక చిత్ స్వరూపమును గాంచుటే తత్త్వము

By viewing the form of all the world in aatma, and without being agitated when one visualizes chit-swaroopa that is called tattva.

2211
సకల విద్య లెఱిగి చచ్చి బ్రతుకు విద్య యొకటి నేరమనుచు నుర్వి జనులు కటకట బడుదురె ! కడహాని దెలియరు , వి. వే.

సకల విద్య లెఱిగి చచ్చి బ్రతుకు
విద్య యొకటి నేరమనుచు నుర్వి
జనులు కటకట బడుదురె !
కడహాని దెలియరు , వి. వే.

అన్ని విద్యలను ఎరిగినను చచ్చిన పిదప బ్రతుకుట తెల్పు విద్యను నేర్వలేదని జనులు విచారింతురు . కాని తమ చావును గూర్చి తాము తెలిసికొనలేకున్నారు

Despite gaining a wealth of knowledge, men are disappointed that the life after death is beyond their reach. They are unable to find out about their own death.

2212
సకల శాస్త్రములను జదివియు వ్రాసియు తెలియగలరు చావు తెలియలేరు చావు దెలియలేని చదువుల వేలరా ? వి. వే.

సకల శాస్త్రములను జదివియు
వ్రాసియు తెలియగలరు చావు
తెలియలేరు చావు దెలియలేని
చదువుల వేలరా ? వి. వే.

శాస్త్రముల నన్నింటిని చదివియు , వ్రాసియు , చావును గూర్చి తెలిసికొన లేనిచో ఆ చదువు వ్యర్థము

Learning all of the veda and scripture, writing books on them, if one does not learn about his death, then such learning is useless.

2213
సకల శాస్త్రములను సంపుటంబులు వ్రాసి చదువ నేర్చియైన జా వెఱుగదు ఛాయావెఱుగని చదువు చదువంగ నేలనో? వి. వే.

సకల శాస్త్రములను సంపుటంబులు
వ్రాసి చదువ నేర్చియైన జా
వెఱుగదు ఛాయావెఱుగని చదువు
చదువంగ నేలనో? వి. వే.

అన్ని శాస్త్రములను సంపుటములుగా వ్రాసి చదివినను తన చావును గూర్చి పండితుడైనను తెలిసికొనలేకున్నాడు . ఆ చావును గూర్చి తెలియని చదువు వ్యర్థము

Even if one writes a tome and learns all of the vocational knowledge, he is, even if a scholar, unable to know about his death. The education that does not dwell on death is useless.

2214
సతత మాత్మ రూపు సాధించి శోదించి యుతముగాను బుద్ధి నూని నొక్కి గతినిగోరి ముక్తి గనుటయే లాభంబు , వి. వే.

సతత మాత్మ రూపు సాధించి శోదించి
యుతముగాను బుద్ధి నూని
నొక్కి గతినిగోరి ముక్తి
గనుటయే లాభంబు , వి. వే.

ఆత్మ శరీరమును గనుగొనుటకు గాఢముగా ప్రయత్నించి , మనస్సును శోధించి బుద్ధిని లోబరచుకొని సద్గతిని కోరి బ్రహ్మస్వరూపము నొందుటే ముక్తి

One has to attain salvation by trying hard to discover the form of aatma, meditating in mind, controlling intellect and being desirous of a better after life.

2215
సంతబసివి పొందు చలిపందిలి జలంబు త్రోవ నమ్ము తోడు తొత్తునంట రచ్చ సభల నిద్ర రాజుల మెత్తురా? వి. వే.

సంతబసివి పొందు చలిపందిలి
జలంబు త్రోవ నమ్ము తోడు తొత్తునంట
రచ్చ సభల నిద్ర
రాజుల మెత్తురా? వి. వే.

చెడిపెతో కలియుట, చలివేంద్రపు నీరు త్రాగుట , దారిని పోవువారిని నమ్ముట, దాసిదాని పొందు, కొలువు కూటములో నిద్రించుట చాలా నింద్యములు

The following are prohibitive and deserving of censure: meeting with a prostitute, drinking water in the middle of a journey at an unknown location, believing in fellow travelers, the relationship with a servant and sleeping in the king's court.

2216
సత్యమనగ వేఱె జగమున గన లేదు నిత్యమగుచు నాత్మ నెగడియుండు నిత్యవస్తు వెఱుగ నీవె పో బ్రహ్మంబు , వి. వే.

సత్యమనగ వేఱె జగమున గన లేదు
నిత్యమగుచు నాత్మ నెగడియుండు
నిత్యవస్తు వెఱుగ నీవె
పో బ్రహ్మంబు , వి. వే.

సత్యము వేరేలేదు . నిత్యమై తన ఆత్మలోనున్న బ్రహ్మమే సత్యము. బ్రహ్మస్వరూపము నెరుగుటే సత్యము నెరుగుట

Truth is nothing but the brahmam in one's aatma that is forever. Knowing the form of brahmam is knowing the truth.

2217
సత్యవంతులయెడ సరసమాడగరాదు పేదదారితోడ బెనగరాదు కలిమి కలుగు వారి గలియనే రాదయా , వి. వే.

సత్యవంతులయెడ సరసమాడగరాదు
పేదదారితోడ బెనగరాదు
కలిమి కలుగు వారి గలియనే
రాదయా , వి. వే.

సత్యము చెప్పువారితో హాస్యమాడుట , పేదవారితో తగవులాడుట , ధనవంతులతో స్నేహము చేయుట తగని పనులు

These acts better be avoided: to joke around with those who speak the truth; to quarrel with poor people; to befriend wealthy people

2218
సతికి బతికినైన సంపదే సంపద పుత్ర సంపదయును భువిని మేలు సరగ ముదిసి బ్రతుకు సంపదే సంపద , వి. వే.

సతికి బతికినైన సంపదే సంపద
పుత్ర సంపదయును భువిని
మేలు సరగ ముదిసి బ్రతుకు
సంపదే సంపద , వి. వే.

భార్యాభర్త అనురాగముతో ఉండుటయు , తగిన పుత్రుని పొందుటయు , ముసలితనమున అనుకూల భార్యతో, సంపదతో ఉండుటయు మేలైన సంపదలు

The following are treasures: wife and husband being a happy couple; begetting a good son; to spend old age in comfort with a cooperative wife.

2219
సతి యొనర్చు చెడుగు పతి కవశ్యము వచ్చు పతి యొనర్చు మంచి సతికి సగము పతి యొనర్చు చెడుగు సతికేల రాదురా? వి. వే.

సతి యొనర్చు చెడుగు పతి కవశ్యము
వచ్చు పతి యొనర్చు మంచి
సతికి సగము పతి యొనర్చు చెడుగు
సతికేల రాదురా? వి. వే.

భార్యచేయు చెడుగు భర్తకును సంక్రమించును . భర్తచేయు మంచి భార్యకును సంక్రమించును . కాని భర్త చేయు చెడుగు భార్యకు సంక్రమింపదు . ఇది విచిత్రము

A wife's bad acts are inherited by the husband. A husband's good acts are inherited by the wife. However, a husband's bad acts are not inherited by the wife.

2220
సతుల మాయ నమ్మి సౌఖ్యంబు గలదని మతి విహీనులైరి మనుజులెల్ల గతులు సతులవలన గానగలేరయా, వి. వే.

సతుల మాయ నమ్మి సౌఖ్యంబు
గలదని మతి విహీనులైరి
మనుజులెల్ల గతులు సతులవలన
గానగలేరయా, వి. వే.

స్త్రీలవలన సౌఖ్యము కలదని, వారి మాయలు నమ్మి మానవులు చెడిపోవుదురు . సతులవలన ఉత్తమ గతులు కలుగునని భ్రాంతిపడువారు అవివేకులు

Men believe comfort can be had from women and believe in their maaya (delusion) only to be cheated. One who believes the after life will be comfortable because of wife is in delusion.

2221
సంద్రమునకు జూడ సరి యేదియును లేదు అట్టి జలదినీర మనువుగాదు అనువుగాని నీరె యది యేమి చేయును? వి. వే.

సంద్రమునకు జూడ సరి యేదియును
లేదు అట్టి జలదినీర మనువుగాదు
అనువుగాని నీరె యది
యేమి చేయును? వి. వే.

సముద్రము నీరు మిక్కిలి సమృద్ధిగా ఉన్నను త్రాగుటకుపయోగింపదు . అట్లే లోభివానివద్ద ఎంత ధనమున్నను ఎవ్వరికిని ఉపయోగింపనందున అది నిరర్ధకము

Even though there is plenty of sea water it is useless for drinking. No matter how much money a miser has, it is useless. It is not useful for anyone.

2222
సదసునందు వేశ్య సైగలు కనుపింప ముదితమీద నాశ ముడి వడంగ ముదిని బ్రమయ కెపుడు మార్కొని చూడరా, వి. వే.

సదసునందు వేశ్య సైగలు కనుపింప
ముదితమీద నాశ ముడి వడంగ
ముదిని బ్రమయ కెపుడు
మార్కొని చూడరా, వి. వే.

వేశ్యలు సభలలో నాట్యమాడుచు అభినయముతో పాటు సైగలు చేయుదురు. వానివల్ల మనస్సు చలించును. కాని, వారిపై ఆశపడక , భ్రాంతి పొందక ఉండవలెను . వారి నన్నియు నటనలే ! ప్రీతి ఏమాత్రమును ఉండదు

Prostitutes who dance in king's courts send signals between their dance postures. One's heart will be filled with lust at such signals. But one has to be not desirous of them and remain steadfast without delusion. All of their signals are acts. There is no love.

2223
సతిని జూచి చూచి సౌఖ్యంబు గోరును గతిని కానలేడు కర్మజీవి గతులు సతులవలన గానగలేరాయా , వి. వే.

సతిని జూచి చూచి సౌఖ్యంబు
గోరును గతిని కానలేడు
కర్మజీవి గతులు సతులవలన
గానగలేరాయా , వి. వే.

వరుడు స్త్రీలను జూచి సౌఖ్యము కల్గునని ఆశపడునే గాని తను తరించుగతిని తెలిసికొనలేడు . సతులవలన ఎప్పటికిని ఉత్తమగతులు కలుగవు

A groom when seeing a woman will think of the comfort he can enjoy but not about his after life. One cannot achieve a better after life because of wife.

2224
సాటి చెప్పనగునె సాధు సజ్జనునకు గొప్ప చదువు చదివి యెప్పుననుచు వాదులాడు నతని వదరుట లేలరా ? వి. వే.

సాటి చెప్పనగునె సాధు సజ్జనునకు
గొప్ప చదువు చదివి
యెప్పుననుచు వాదులాడు నతని
వదరుట లేలరా ? వి. వే.

సజ్జనులు, సాధువులునగు విద్వాంసులు వాదులాడుచుండగా , వారికి నచ్చచెప్పుట సాధ్యము కాని పని. చెప్పినను ప్రయోజనము లేదు

Educated men of good character and eminence when they argue with one another, it is not possible to subdue them. There is no use in convincing them.

2225
సాటి చేయవచ్చు జదివి వాదములాడు చదువరులను జెట్టి సముదయమును పోరి పోరి గెల్చు , నోరు నోవనివాడు , వి. వే.

సాటి చేయవచ్చు జదివి వాదములాడు
చదువరులను జెట్టి సముదయమును
పోరి పోరి గెల్చు ,
నోరు నోవనివాడు , వి. వే.

బాగుగా చదువులు చదివియు వాదులాటకు దిగిన వారిని జెట్టులతో సరిపోల్చవచ్చును . ఈ వాదులాటలో నోరు నొవ్వనివాడే జయించునని చెప్పవచ్చును

After getting educated, those who argue with one another are like wrestlers. In their debates one whose voice has not cracked up is the winner.

2226
సాటి యెవరు లేరు సాంబమూర్తికి బోల్ప దీటులేని గొప్ప దేవుడతడె ధాటి కలుగు నతని ధ్యానించువానికి, వి. వే.

సాటి యెవరు లేరు సాంబమూర్తికి
బోల్ప దీటులేని గొప్ప
దేవుడతడె ధాటి కలుగు నతని
ధ్యానించువానికి, వి. వే.

సాంబమూర్తియే సాటిలేని గొప్పదేవుడు . స్థిరమైన మనస్సును అతనిని ధ్యానించువాడే గొప్పవాడు

Saamba Murti (Lord Siva) is the greatest god. One who meditates on him with an unwavering mind will be famous.

2227
సాధనంబు లేక సమకూడదేదియు బోధలేని విద్య పొందెపుడు పాదుకొల్పి మదిని భావించి చూడరా , వి. వే.

సాధనంబు లేక సమకూడదేదియు
బోధలేని విద్య పొందెపుడు
పాదుకొల్పి మదిని భావించి
చూడరా , వి. వే.

సాధనము లేక పని సాగదు . బోధన లేకుండ విద్య లభింపదు . దేవుని మదిలో పాదుకొల్పి ధ్యానించిననే అతనిని కాంచవచ్చును

Without concerted effort a task cannot be completed. Without teaching education is not possible. When one meditates on god established in his mind, then it is possible to see him.

2228
సాధుజనుల చెలిమి చాలింపగా రాదు ప్రకృతి విడకయున్న బరము లేదు పిందెగోసి చూడ బీజంబు కలుగునా? వి. వే.

సాధుజనుల చెలిమి చాలింపగా
రాదు ప్రకృతి విడకయున్న
బరము లేదు పిందెగోసి చూడ
బీజంబు కలుగునా? వి. వే.

మంచివారి స్నేహమును విడువరాదు. ఐహికములను విడిచిననేగాని ముక్తి లభింపదు . ఫలములో బీజము లుండునుగాని, పిందెను కోసి చూడగా అవి కానవచ్చునా?

One should not leave friendship with good people. It is not possible to attain salvation until one renounces the bonds in this world. A fully grown fruit has seeds inside but not when it is just formed.

2229
సాధుజనుల బట్టి సంతాప మొందింప కుల వినాశమొందు క్రూరజనుడు సాధుజనుల పూజ సాయుజ్య మిచ్చురా, వి. వే.

సాధుజనుల బట్టి సంతాప మొందింప
కుల వినాశమొందు క్రూరజనుడు
సాధుజనుల పూజ సాయుజ్య
మిచ్చురా, వి. వే.

మంచివారిని హింసించిన క్రూరుని వంశము నశించును. వారిని గౌరవించువాడు భాగవత్సాన్నిధ్యమును పొందును

When an evil person tortures good people, his dynasty will be destroyed. On the other hand one who respects good people, reaches god's proximity.

2230
సారము గల యుక్తి సమముగా మది నిల్పి నిత్యమైన ముక్తి నెల నెఱింగి భక్తి యుక్తి మీఱి బయలంది యుండుము, వి. వే.

సారము గల యుక్తి సమముగా మది
నిల్పి నిత్యమైన ముక్తి నెల
నెఱింగి భక్తి యుక్తి మీఱి
బయలంది యుండుము, వి. వే.

సారముగల యోగవిద్య నభ్యసించి , మనస్సును ముక్తి యందే నిలిపి భక్తి యోగమును సాధనముగా చేసికొని యెడ బ్రహ్మత్వమును సాధింపవచ్చును

One has to learn meaningful yoga, keep the mind focused on salvation, make bhakti yoga as a means to attain brahmam.

2231
సిద్ధులైన వారి చిత్తము రంజిల్లు నొడలి మెఱుగు లెక్క కిడరుగాన పనసపండు ఘనత పైనేమి కలదురా ? వి. వే.

సిద్ధులైన వారి చిత్తము రంజిల్లు
నొడలి మెఱుగు లెక్క
కిడరుగాన పనసపండు ఘనత
పైనేమి కలదురా ? వి. వే.

సిద్ధులు శరీర మెటున్నను మమకారము పెట్టుకొనరు . శరీరమును లెక్కచేయరు . వారి మనస్సు లానంద పూర్ణములై యుండును. పనసపండు పైకి ముండ్లతోనున్నట్లు కానవచ్చినను లోని తొనలు చాల మధురముగా ఉండును

Sidhas don't have attachment to their bodies. They don't care for their bodies. Their hearts are full of joy. A jack-fruit has a rough exterior but core inside it is very tasty.

2232
సుగుణ వంతురాలు సుదతియై యుండిన బుద్ధిమంతులగుచు బుత్త్రులోపప

సుగుణ వంతురాలు సుదతియై
యుండిన బుద్ధిమంతులగుచు

బుత్త్రులోపప
స్వర్గ మేటికయ్య సంసారి కింకను, వి. వే.

భార్య గుణవతియైనచో , పుత్రులు బుద్ధిమంతులైనచో సంసారి కదియే స్వర్గము. వేరే స్వర్గమక్కరలేదు

If wife is of good character and children are well behaved, it is like heaven for a man. There is no need for another heaven.

2233
సుతులు సతులు మాయ సుఖదుఃఖములు మాయ సంస్కృతియును మాయ జాలి మాయ మాయబ్రతుకును కని మాయ కల్పించెరా , వి. వే.

సుతులు సతులు మాయ సుఖదుఃఖములు
మాయ సంస్కృతియును మాయ జాలి
మాయ మాయబ్రతుకును కని
మాయ కల్పించెరా , వి. వే.

ఈ సంసారములో భార్యపుత్రులు , సుఖదుఃఖములు , సంస్కృతి, జాలి అన్నియు మాయయే, అన్నియు నస్థిరములే! అస్థిరమైన బ్రతుకునకు దేవుడిట్లు మాయ కల్పించెను

In bondage, wife and children, sorrow and happiness, culture, compassion are all maaya (illusion). They are all impermanent. God has created maaya for the impermanent life.

2234
సురలు మౌను లెపుడు సరవి వర్తింతురు ధర్మమార్గ మొకటి తారకముగ అట్లు కాని వార లసురులై చచ్చిరి, వి. వే.

సురలు మౌను లెపుడు సరవి వర్తింతురు
ధర్మమార్గ మొకటి
తారకముగ అట్లు కాని వార లసురులై
చచ్చిరి, వి. వే.

ధర్మమార్గమే తరింపజేయునదని దేవతలు, మునులు దానినే అనుసరింతురు . ధర్మమార్గమును తప్పినవారే అసురులు వారికి చావు తప్పదు

The path of dharma will uplift. Gods and sages follow dharma. The ones who don't follow dharma are demons. They can't escape death.

2235
సూక్ష్మమరయ నీకు సుఖతత్త్వ భావంబు పుట్టు చావులేని పురపుదారి మానసంబునంటి మఱువక చూడరా, వి. వే.

సూక్ష్మమరయ నీకు సుఖతత్త్వ
భావంబు పుట్టు చావులేని
పురపుదారి మానసంబునంటి
మఱువక చూడరా, వి. వే.

సుఖకరమగు తత్త్వము నెరుగు సూక్ష్మబుద్ధివల్లనే చావు, పుట్టుకలు లేకుండ చేసికొనవచ్చును. దీనిని బాగుగా యోచింపుము

One should acquire the tattva with a keen mind to put an end to birth-death cycle and lead a comfortable life.

2236
అడుగకర్థ మిచ్చునతడు బ్రహ్మజ్ఞాని అడుగనర్థ మిచ్చు నతడు త్యాగి అడుగ నీయలేని యతడు పెనులోభి , వి. వే.

అడుగకర్థ మిచ్చునతడు బ్రహ్మజ్ఞాని
అడుగనర్థ మిచ్చు
నతడు త్యాగి అడుగ నీయలేని
యతడు పెనులోభి , వి. వే.

అడుగకయే ధనమిచ్చువాడు బ్రహ్మజ్ఞాని , అడిగిన పిదప ఇచ్చువాడు త్యాగి. అడిగినను ఈయనివాడు పిసినిగొట్టు

One who donates without asking is one who knows brahmam. The one who donates after someone asks him is performing sacrifice. The one who never donates is a miser.

2237
అడుగందగువారి నడుగుట ఇడినయెడల గొసరకుంట యీలేననగా గడుసై వేడక యుండుట యడిగెడి వారలకు నీతియగురా వేమా

అడుగందగువారి నడుగుట ఇడినయెడల
గొసరకుంట యీలేననగా గడుసై
వేడక యుండుట యడిగెడి
వారలకు నీతియగురా వేమా

అడుగదగినవారినే అడుగుట , ఇచ్చినచో కొసరక యిచ్చుట , ఈయలేననువారిని తిరిగి అడుగకుండుట - అడుగువారు పాటించవలసిన ధర్మములు

The seekers of alms have this code of conduct: ask only the deserving donors; when giving alms not shirk; not to bother those who say they can't donate.

2238
అరుదుగా నడిగిన యత డర్థికాబోడు తఱచుగా నొసగక దాత కాడు దాత కర్థికింత తారతమ్యము సుమా, వి. వే.

అరుదుగా నడిగిన యత డర్థికాబోడు
తఱచుగా నొసగక దాత
కాడు దాత కర్థికింత తారతమ్యము
సుమా, వి. వే.

ఎప్పుడో ఒకసారి అడిగినవాడు యాచకుడు కాడు. తరచుగా ఇయ్యనిచో దాత కాడు. ఇచ్చువానికి , పుచ్చుకొనువానికి ఇట్టి భేదమున్నది

The man who asks once in a blue moon is not a beggar. The one who doesn't perform charitable acts often enough is not a good donor. Thus there is a difference between a seeker and a donor.

2239
అల్పుడైన వాని కధిక భాగ్యము కల్గ దొడ్డవారి దిట్టి తొలగద్రోలు అల్పజాతివార లధికుల నెఱుగునా ? వి. వే.

అల్పుడైన వాని కధిక భాగ్యము
కల్గ దొడ్డవారి దిట్టి
తొలగద్రోలు అల్పజాతివార లధికుల
నెఱుగునా ? వి. వే.

అల్పునకు ఎక్కువ సంపద కలిగినయెడల ఉత్తములను తిట్టి పనులనుండి తొలగించును . హీనబుద్ధులకు ఉత్తముల గొప్పతనము తెలియదు

When a low-life has too much wealth, he will curse men with good character and remove them from their jobs. The low-lives don't know the greatness of men with good character.

2240
ఇచ్చి నొచ్చుటేల యిల భోగ భాగ్యముల్ ఇచ్చి పోవుచుండు నిచ్చతీఱ చచ్చినట్లు నరుడు శత్రుడై సాధించు, వి. వే.

ఇచ్చి నొచ్చుటేల యిల భోగ భాగ్యముల్
ఇచ్చి పోవుచుండు
నిచ్చతీఱ చచ్చినట్లు నరుడు
శత్రుడై సాధించు, వి. వే

యాచకుల కిచ్చి పిదప విచారింపరాదు . సంపదలు స్థిరములు కావు. మానవుడు మిక్కిలి శ్రమపడి శత్రువును సాధించినట్లు వానిని సాధించినను సరే, అవి నిలువవు

One should not regret after giving alms to beggars. Wealth is not permanent. Like a man who defeated his enemies with hard work, even when a person earns his wealth, it won't last for ever.

2241
ఇచ్చెడి వారల సంపద హెచ్చెడినేగాని లేమి యెట్లు కలుగురా నిచ్చెలమనీటి జల్లిన విచ్చలవిడి నూరుచుండు వినరా వేమా

ఇచ్చెడి వారల సంపద హెచ్చెడినేగాని
లేమి యెట్లు కలుగురా
నిచ్చెలమనీటి జల్లిన విచ్చలవిడి
నూరుచుండు వినరా వేమా

ఒకరి కిచ్చినచో సంపద వృద్ధిపొందును . లేమి యుండదు. చెలమలో నీరూరినట్లు ఊరుచుండును

When one donates to others, his wealth will multiply. It is like the water that is oozing out of earth into lakes and wells.

2242
ఇచ్చువానియొద్ద నీని వా డుండిన చచ్చుగాని యీవి సాగనీడు కల్పతరువు క్రింద గ్రచ్చ చెట్లున్నట్లు , వి. వే.

ఇచ్చువానియొద్ద నీని వా డుండిన
చచ్చుగాని యీవి సాగనీడు
కల్పతరువు క్రింద గ్రచ్చ
చెట్లున్నట్లు , వి. వే.

దాతదగ్గర లోభి చేరియున్నచో , చచ్చినట్లు ఎవ్వరికిని ఏమియు ఈయనీయడు . వాడు కల్పవృక్షము క్రింద ముండ్లతోడి గ్రచ్చపొదయున్న రీతినుండును

When a covetous person is with a donor, he won't let him donate anything. He is like a thorny shrub under kalpa tree (the mythological tree that keeps on giving).

2243
ఇంచుకంతలోన మీశ్వరార్పణమన్న పుణ్యలోకములకు బోవు నరుడు అన్నదానమునకు నధిక దానము లేదు, వి. వే.

ఇంచుకంతలోన మీశ్వరార్పణమన్న
పుణ్యలోకములకు బోవు
నరుడు అన్నదానమునకు నధిక
దానము లేదు, వి. వే.

“ఈశ్వరార్పణము" అనుచు కొంచె మన్నమును పెట్టినను, పుణ్యలోక ప్రాప్తి కలుగును. దానము లన్నింటను అన్నదానమే గొప్పది

One who donates to another person as though he is offering it to Iswara, even when offers a little food, he will go to heaven. Among all donations, food donation is the ultimate.

2244
డంబములు పలుకువాని నిజంబుగ దా నమ్మునట్టి జానుడరయగ జ్ఞానం బిసుమంతయు లేని మృగంబని యెంచుటకు నడ్డులేదుర వేమా

డంబములు పలుకువాని నిజంబుగ
దా నమ్మునట్టి జానుడరయగ జ్ఞానం
బిసుమంతయు లేని మృగంబని
యెంచుటకు నడ్డులేదుర వేమా

డంబములు పలుకువాడు పల్కు మాటలన్నియు యదార్థములు కావు. అవి నిజములని నమ్మినవాడు జ్ఞానము లేనివాడని , మృగప్రాయుడని చెప్పవచ్చును . సందేహము లేదు

One who is pompous can utter many things but they are not true. One who believes such a person is truthful, is foolish and is like a dumb animal.

2245
తండ్రి సొమ్మదైన దాయాది సొమ్మైన పరుల సొమ్ములైన ప్రాప్త ధనము దయను దీనులకును దానము నిచ్చును, వి. వే.

తండ్రి సొమ్మదైన దాయాది సొమ్మైన
పరుల సొమ్ములైన ప్రాప్త
ధనము దయను దీనులకును
దానము నిచ్చును, వి. వే.

తండ్రి, దాయాదులు , ఇతరులు అను వీరందరివాల్లను లభించిన సొమ్మును ఇతరులకు దానము చేయవలెను . దాతయని పేరువచ్చును

The money obtained from one's father and family should be donated to others. One will gain fame as a charitable person.

2246
తనదు దాన మరయ తన బిడ్డ సమమగు తండ్రి దానమెల్ల తనకు దోడు అన్యు లిచ్చు దాన మది తల్లివంటిది, వి. వే.

తనదు దాన మరయ తన బిడ్డ సమమగు
తండ్రి దానమెల్ల తనకు
దోడు అన్యు లిచ్చు దాన మది
తల్లివంటిది, వి. వే.

తాను చేసిన దానము పుత్రునివలె తోడ్పడును . తండ్రి చేసిన దానము తోబుట్టువువలె సాయపడును. ఇతరులు తన కిచ్చనది తల్లి దానముచేసి నట్లుండును . అదే ఉత్తమమైనది

One's charitable acts help him like a son. The charitable act done by one's father will serve him like a sister. The one who gets charitable gifts from others is like being helped by his mother which is the best way.

2247
తనదు కర్మచేత దాను లోకములోన తనదు తల్లి గర్భముననె పుట్టె తన్ను మఱచి యింక దగనివి చేయునా? వి. వే.

తనదు కర్మచేత దాను లోకములోన
తనదు తల్లి గర్భముననె
పుట్టె తన్ను మఱచి యింక
దగనివి చేయునా? వి. వే.

తన పూర్వజన్మ కర్మములవలన మానవుడు తల్లి గర్భమున జనించును. అట్లే పూర్వకర్మములవలన మరల మరల అట్లే పుట్టుచుండును. ఇట్టి తన జన్మప్రవృత్తిని తెలిసికొని, ఈ జన్మములకు [sic] కర్మముల నుండి తప్పించుకొనవలెను

One is born again and again based on karma. Knowing this one has to put an end to the birth-death cycle.

2248
తనదు బాగుగోరి ధర్మంబు చెప్పిన దిట్టుచుండు నధము డెట్టయెదుట గడ్డి వేయ బోట్ల కొమ్మాడించు , వి. వే.

తనదు బాగుగోరి ధర్మంబు చెప్పిన
దిట్టుచుండు నధము డెట్టయెదుట
గడ్డి వేయ బోట్ల
కొమ్మాడించు , వి. వే.

దయతో గడ్డి వేయగా పోట్ల గొడ్డు తల యాడించునట్లు , నరుడు తన మేలు కోరి హితము చెప్పువారిని తిట్టును

Like the bull that threatens with its horns when offered food, a man will abuse those who try to give him a good advice.

2249
తల్లి గర్భమందు తా బుట్టినప్పుడు నఱుత లింగమున్నె యరయుమయ్య నడుమ లింగమూన నగుబాటు కాదొకో , వి. వే.

తల్లి గర్భమందు తా బుట్టినప్పుడు
నఱుత లింగమున్నె
యరయుమయ్య నడుమ లింగమూన నగుబాటు
కాదొకో , వి. వే.

తల్లి గర్భమునుండి తాను పుట్టినపుడు నరుడు లింగముతో రాలేదు. పోయినపుడు తీసికొని పోడు. జీవితకాలమున మెడలో లింగమును ధరించుట యేలనో తెలియకున్నది

One is not born with linga (phallic symbol). He can't take it with him at the time of death. It is not apparent why one is attached to the linga he wears around his neck.

2250
తల్లి దండ్రు లాత్మ తనయు లన్నలు తమ్ము లెలమి బంధు భృత్యులెల్ల జనులు గలిగి వర్ధిలంగ ఘనతతో నుండుము, వి. వే.

తల్లి దండ్రు లాత్మ తనయు లన్నలు
తమ్ము లెలమి బంధు భృత్యులెల్ల
జనులు గలిగి వర్ధిలంగ
ఘనతతో నుండుము, వి. వే.

మానవుడు తల్లిదండ్రులతోను, పుత్రులు, సోదరులు, బంధువులు, సేవకులతోను సుఖముగా నుండి వంశము వృద్ధి పొందుచున్నపుడే , అతనికి ఘనత కలుగును

A man will achieve fame by living comfortably with parents, children, siblings, relatives and servants while growing his wealth.

2251
తాత గన్న తల్లి తండ్రిని గను తల్లి తన్ను గన్న తల్లి తల్లి తల్లి శూద్రురాలు తానెట్లు బాపడు ?, వి. వే.

తాత గన్న తల్లి తండ్రిని గను
తల్లి తన్ను గన్న తల్లి
తల్లి తల్లి శూద్రురాలు తానెట్లు
బాపడు ?, వి. వే.

తాతకు తల్లి , పితామహి , తన తల్లి , అమ్మమ్మ వీరందరును శూద్రులైనపుడు (ఉపనీతులు కానప్పుడు) తాను బ్రాహ్మణు డెట్లగును?

When all of the matriarchy in a person's dynasty haven't had thread ceremonies, how can one be a brahmin?

2252
తాను తాను పటంచు దప్పుచు బలికిన మోహ వార్థిలోన మునుగకున్నె ? కాన తా ననునది కానంగ లేడయా, వి. వే.

తాను తాను పటంచు దప్పుచు
బలికిన మోహ వార్థిలోన మునుగకున్నె?
కాన తా ననునది
కానంగ లేడయా, వి. వే.

తన శరీరమే తానని భ్రమపడి తప్పుగా పలుకుచు అజ్ఞాన సముద్రమున మునుగుచున్న మానవుడు బ్రహ్మమే తానని తెలిసికొనలేకున్నాడు

A foolish person by identifying himself with his body is in ignorance. A man has to realize his self is brahmam.

2253
తాము గడనసేయు ధనమెల్ల తమదని నమ్మియుండ్రు వెఱ్ఱి నరులు భవుని తా మొరుల కొసంగ తమకును నది కల్గు , వి. వే.

తాము గడనసేయు ధనమెల్ల తమదని
నమ్మియుండ్రు వెఱ్ఱి నరులు
భవుని తా మొరుల కొసంగ తమకును
నది కల్గు , వి. వే.

తాము సంపాదించిన ధనమంతయును తనదేయని తలచువారు మూర్ఖులు . తాము మొదట ఇతరులకు దానము చేయుటవల్లనే ఇప్పుడు తమకు లభించెనని తెలియలేకున్నారు

Foolish people think all the wealth they have gathered is theirs. They don't realize that they led a charitable life in previous births deserving wealth in the current life.

2254
తా మొరులకు బెట్ట తమకును గలుగును అడుగ నిడన దాము నడుగ గలరు ఇందు నీనివాని కెందును గలుగదు , వి. వే.

తా మొరులకు బెట్ట తమకును
గలుగును అడుగ నిడన దాము నడుగ
గలరు ఇందు నీనివాని కెందును
గలుగదు , వి. వే.

అడుగకుండననే తామితరులకు పెట్టిన దైవము తిరిగి తమకిచ్చును . అడిగిన పిదపనే తామిచ్చిన , దైవము అడిగిననే యిచ్చును - ఇతరులు నడిగియే జీవింపవలసివచ్చును . ఈ లోకమున దానము చేయనివానికి ఏ లోకమునను ఏమియు లభింపదు

One who donates even without others asking him, will be rewarded by god. One who donates after others seek, believing that god will provide after asking, has to depend on others. One who never donates will not gain anything.

2255
తీర్ప నార్పలేని తీర్పరితనమును కూర్ప విప్పలేని నేర్పు పనులు పెట్టి పోయలేని బిరముల్ వ్యర్థముల్ , వి. వే.

తీర్ప నార్పలేని తీర్పరితనమును
కూర్ప విప్పలేని నేర్పు
పనులు పెట్టి పోయలేని బిరముల్
వ్యర్థముల్ , వి. వే.

తగవు తీర్చి న్యాయము కల్గింపనివాని న్యాయాధిపత్యము, ఒక యోచన చెప్పి చిక్కు తీర్పనివాని నేర్పరితనము , పెట్టి పోయలేనివాని ప్రగల్భములు నిష్ప్రయోజనములు

One who does not provide justice by resolving a dispute is not a judge. One who provides an advice but won't help when difficulties arise while implementing it is not a good adviser. The pompous remarks of one who doesn't offer anything are useless.

2256
దాత కానివాని దఱచుగా వేడిన వాడు దాతయగునె వసుధ నెందు నవురు దర్భయగునె యభ్ధిని ముంచిన, వి. వే.

దాత కానివాని దఱచుగా వేడిన
వాడు దాతయగునె వసుధ నెందు
నవురు దర్భయగునె యభ్ధిని
ముంచిన, వి. వే.

దాత కానివానిని ఎన్ని విధముల వేడినను వాడు దానము చేయడు. సముద్రమున ముంచినను ఆవురుగడ్డి ఎంత మాత్రము దర్భకాజాలదు కదా! లోభి దాతకాడనుట స్పష్టము

No matter how many times one begs an uncharitable person, nothing will come through. The common grass will not turn into darbha (grass used in yagna and other rituals) no matter how many times it is washed in the sea. A covetous person can never be a donor.

2257
దాన మడుగువాడు ధరలోన నధముండు దాన మడుగ నతడు దైవసముడు దాన మీనివాడు ధన్యుడు కాడయా, వి. వే.

దాన మడుగువాడు ధరలోన నధముండు
దాన మడుగ నతడు దైవసముడు
దాన మీనివాడు ధన్యుడు
కాడయా, వి. వే.

ఒకరిని యాచించువా డధముడు . ఇతరులను యాచింపని వాడు దైవసమానుడు . ఉండియు ఇతరుల కీయనివాడు ఎంతమాత్రము కృతార్థుడు కాజాలడు

The one who begs is a low-life. One who doesn't beg others is like god. The one who has wealth but won't give to others will never succeed in spiritual life.

2258
దానములను జేసి దరిజేరు నొకవంక మనసు నొకటి నమ్మ మాయ దగులు జ్ఞానమెపుడు నమ్మగడతేర్చు గడగండ్లు , వి. వే.

దానములను జేసి దరిజేరు నొకవంక
మనసు నొకటి నమ్మ మాయ దగులు
జ్ఞానమెపుడు నమ్మగడతేర్చు
గడగండ్లు , వి. వే.

తనకున్నంతలో ఇతరుల కిచ్చువాడు కృతార్థుడగును . మనస్సున ఒకటి నమ్మి యోగాదులవలన మాయను దాటవచ్చును. జ్ఞానమును నమ్మిన యెడల తరింపవచ్చును

When one donates a little bit of what one has, he will be considered as a successful person. It is possible to overcome maaya (illusion) by following yoga. By trusting knowledge, one can attain salvation.

2259
దానములను జేసి ధర కీర్తి నొందంగ బహు ధనముల నొసగి భక్తిలేక తుదకు నరుడు ఎడును గద కడగండ్లురా , వి. వే.

దానములను జేసి ధర కీర్తి నొందంగ
బహు ధనముల నొసగి భక్తిలేక
తుదకు నరుడు ఎడును
గద కడగండ్లురా , వి. వే.

దాతయను పేరు తెచ్చుకొనుటకై కొందరు చేతనున్న ధనమును ఇతరులకు దానముచేసి , పిదప కుటుంబమునకే జరుగక మిక్కిలి శ్రమపడుదురు . ఇట్టివారు మూర్ఖులు కదా!

To gain fame as a donor, some people donate all of their wealth without thinking about their family and themselves. Such people are foolish.

2260
దానములను నన్నదానమె దొడ్డది గానములను సామగాన మెచ్చు ధ్యానములను శివుని ధ్యానమే శ్రేష్ఠంబు , వి. వే.

దానములను నన్నదానమె దొడ్డది
గానములను సామగాన మెచ్చు
ధ్యానములను శివుని ధ్యానమే
శ్రేష్ఠంబు , వి. వే.

దానములలో అన్నదానము, గానములలో సామవేద గానము, ధ్యానములలో శివధ్యానము గొప్పవి

Among all the charitable deeds donating food is supreme. Among all the songs, the recital of saama veda is the epitome. Among all the meditations, the meditation on Lord Siva is paramount.

2261
ధనము చాల గూర్చి తను దాన ధర్మముల్ పొనరుపకయ యిచ్చు తనయులకును తేనెకూర్చు నీగ తెరువరులకు నీదె , వి. వే.

ధనము చాల గూర్చి తను దాన ధర్మముల్
పొనరుపకయ యిచ్చు తనయులకును
తేనెకూర్చు నీగ తెరువరులకు
నీదె , వి. వే.

ధనవంతుడు తాను శ్రమపడి సంపాదించిన ధనమును దానధర్మముల కుపయోగింపక దాచిపుత్రులకే దక్కజేయును. తేనెటీగ కూడబెట్టిన తేనె యితరుల పాలగుచున్నది కదా!

A wealthy man likes to bequeath his wealth to his children rather than donate it to others. The honey accumulated by bees is being enjoyed by others.

2262
ధనము లేమి యనెడి దావానలం బది తన్ను జెఱుచు మీఱి తావు చెఱుచు ధనము లేమి మదిని దలచిన పాపము, వి. వే.

ధనము లేమి యనెడి దావానలం
బది తన్ను జెఱుచు మీఱి తావు
చెఱుచు ధనము లేమి మదిని
దలచిన పాపము, వి. వే.

లేమిని తలచుకొన్న పాపము వచ్చును. అది కారు చిచ్చువలె తన్ను చెరచుటయే కాక తానున్న స్థలమును చెరచును

When one thinks about poverty, it is sinful. It is like fire that not only destroys one but also the surroundings.

2263
ధనము గూడబెట్టి ధర్మంబు చేయక యూరకుండ్రు పాపు లూహలేక ధనము వెంటరాదు ధర్మంబు సేయుడీ , వి. వే.

ధనము గూడబెట్టి ధర్మంబు
చేయక యూరకుండ్రు పాపు లూహలేక
ధనము వెంటరాదు ధర్మంబు
సేయుడీ , వి. వే.

పాపబుద్ధులాలోచింపక తాము కూడబెట్టిన ధనమును దానధర్మముల కుపయోగింపక ఉపేక్షింతురు . తనతో వచ్చునది ధర్మమే కాని ధనము కాదు

Sinful people don't donate the wealth they have garnered and show hesitation. At the time of death one's dharma comes to the nether world but not his wealth.

2264
ధర్మ కంటకుండు ధనముచే గర్వించి సకల సంపదలను సరగగనియు కడకు తాను మేలు గానక చెడిపోవు , వి. వే.

ధర్మ కంటకుండు ధనముచే గర్వించి
సకల సంపదలను సరగగనియు
కడకు తాను మేలు గానక
చెడిపోవు , వి. వే.

ధనికుడు ధర్మము చేయుట కిష్టపడక , సమస్త సంపదలు తనకున్నవని గర్వించి , తుదకా సంపదవలన తాను కూడ మేలు పొందలేక చెడిపోవుచున్నాడు

A wealthy man without donating his wealth, feeling proud that he has so much wealth, in the end will garner bad karma without enjoying his wealth.

2265
ధర్మ మన్న వినరు తనువు నమ్మిన నరుల్ యముని వారు వచ్చి యడల జేసి చొచ్చి కట్ట దఱుముచో బాఱగలరొకో, వి. వే.

ధర్మ మన్న వినరు తనువు నమ్మిన
నరుల్ యముని వారు వచ్చి
యడల జేసి చొచ్చి కట్ట దఱుముచో
బాఱగలరొకో, వి. వే.

తమ శరీరము శాశ్వతమని నమ్మిన మూఢులు ధర్మము మాటను వినరు. ఆ లోభులు మరణ సమయమున యమ కింకరులు వచ్చి బాధలు పెట్టుచున్నప్పుడు ఎట్లు తప్పించుకొందురో ? ఎచటికి పారిపోగలరో తెలియకున్నది

The foolish people who consider their bodies as permanent, don't care for dharma. Such covetous persons, when at the throes of death, how will they escape the punishment given by god of death? Where can they run and hide?

2266
ధనలక్ష్మిని సేవించిన ధన మార్జింపగవచ్చు ధర్మముగానే ధన హీనులకు నొసగెడు ధనమే మూలంబు ముక్తిదారికి వేమా

ధనలక్ష్మిని సేవించిన ధన మార్జింపగవచ్చు
ధర్మముగానే
ధన హీనులకు నొసగెడు ధనమే మూలంబు
ముక్తిదారికి వేమా

ధనలక్ష్మిని సేవించిన యెడల ఆమె విరివిగా ధనమొసగును . అట్టి ధనమును విరివిగా దానముచేసిన యెడల ముక్తి లభించును. ముక్తికిని ధనమే మూలము

When one prays goddess of wealth Sri Lakshmi, one's wish will be fulfilled. If he donates the wealth thus obtained, he will attain salvation. Even for salvation, wealth is important.

2267
ధర్మ పరుడైన పరిపూర్ణ దాతయగును దాన మొనరించు నంతట దత్త్వమమరు , తాను దానగు మననంబు దాకగనగు దాన సార్థక్యమపుడటు తనరు వేమ

ధర్మ పరుడైన పరిపూర్ణ దాతయగును
దాన మొనరించు నంతట దత్త్వమమరు,
తాను దానగు మననంబు దాకగనగు
దాన సార్థక్యమపుడటు తనరు వేమ

మానవుడు ధర్మపరుడై , దాతయైనచో తత్త్వవిదుడగును . తత్త్వము తెలిసినచో ఆత్మ సందర్శనము కలుగును. దానివలన జన్మ సార్థకమయి అతడు తరించును

When a man follows dharma, if he is charitable he will gain tattva. By knowing tattva one can visualize aatma. And lead a fulfilled life.

2268
ధర్మమరసి పూని ధర్మరాజాదులు నిర్మలంపు ప్రౌఢి నిల్పికొనిరి ధర్మమే నృపులకు దారక యోగంబు, వి. వే.

ధర్మమరసి పూని ధర్మరాజాదులు
నిర్మలంపు ప్రౌఢి నిల్పికొనిరి
ధర్మమే నృపులకు
దారక యోగంబు, వి. వే.

రాజులకు ధర్మమే తారకము. పూర్వము ధర్మరాజు మున్నగువారు తాము పలుకష్టములు పొందియు ధర్మమును విడువక శాశ్వత యశస్సు సంపాదింపగల్గిరి

Kings are bound by dharma. The king Dharma Raja in Maha Bharatam, never gave up dharma despite losing his kingdom and facing a lot of strife.

2269
నమొ నమ యనవచ్చు నారాయణవచ్చు మేలువారి జూచి మెచ్చవచ్చు కొంగు కాసు నడుగ గొబ్బున నీలేరు , వి. వే.

నమొ నమ యనవచ్చు నారాయణవచ్చు
మేలువారి జూచి మెచ్చవచ్చు
కొంగు కాసు నడుగ గొబ్బున
నీలేరు , వి. వే.

భక్తులమని చెప్పువారు "నారాయణాయ నమః" అని ఉచ్ఛరించుచు మంచివారిని మెచ్చుకొనుచుండవచ్చునేకాని, తాము తమ కొంగు ముడి విప్పి ఒక కాసైన నితరుల కీయరు

Claiming themselves to be devotees of Lord Vishnu, some people praise others but never give alms.

No comments:

Post a Comment