Saturday, February 29, 2020

Phala-Sruti


2499
అరయ వేమన్న చెప్పిన యాత్మ విధము తెలియలేనట్టి యజ్ఞాని దేబె లెల్ల తలను వీడిన వెంట్రుకదారివలెను భుక్తి ముక్తుల బొసగగా బోరు వేమ

అరయ వేమన్న చెప్పిన యాత్మ విధము
తెలియలేనట్టి యజ్ఞాని దేబె లెల్ల
తలను వీడిన వెంట్రుకదారివలెను భుక్తి
ముక్తుల బొసగగా బోరు వేమ

తలనుండి తీసివేసిన పిదప వెంట్రుక ఉపయోగపడదు . అట్లే వేమన చెప్పిన యీ ఆత్మ పద్ధతిని తెలియలేని అజ్ఞులకు భుక్తియు, ముక్తియు ఉండవు

When hair is removed from one's scalp, it has no use. One who does not know the aatma tattva taught by Yogi Vemana cannot attain salvation.

2500
ఇహపరంబులకును నిది సాధనంబని వ్రాసి చదివి విన్నవారికెల్ల మంగళంబు లొనరు మహిలోన నిజమిది వి. వే.

ఇహపరంబులకును నిది సాధనంబని
వ్రాసి చదివి విన్నవారికెల్ల
మంగళంబు లొనరు మహిలోన
నిజమిది వి. వే.

ఇహపరములకు సాధనముగా చెప్పబడిన దీనిని వ్రాసినను, చదివినను, వినినను శుభములు కలుగును. ఇది సత్యము

The knowledge given by Yogi Vemana is meant for this world and nether world. One who writes it or listens to it, will be blessed and lucky.

2501
ఒక పద్యంబును మది నిడి ప్రకటితమగు గుట్టు తెలిసి పరికించినచో సకలంబును శ్రుత్యర్థము నికటంబుగ నిట రహస్య నిలయము వేమా


ఒక పద్యంబును మది నిడి ప్రకటితమగు
గుట్టు తెలిసి పరికించినచో సకలంబును
శ్రుత్యర్థము నికటంబుగ
నిట రహస్య నిలయము వేమా

ఒక్కొక్క పద్యమును చదివి , దానియందలి రహస్యమును గ్రహించినచో వేదార్థమంతయు ఇందులోనే ఇమిడి యున్నదని తెలియగలదు

When one reads every verse and grasps the secrets in it, one realizes that the essence of veda is in these verses.

2502
ముక్తిమార్గమునకు మూలమై తగునట్టి గ్రంధమంత జనులు గడగి చదువ విన్నవారికెల్ల విభవముల్ కలవయా

ముక్తిమార్గమునకు మూలమై
తగునట్టి గ్రంధమంత జనులు
గడగి చదువ విన్నవారికెల్ల
విభవముల్ కలవయా

ఈ గ్రంథము ముక్తిమార్గమునకు మూలము. దీనిని చదివినను వినినను సమస్త సంపదలు కలుగును

The Yogi Vemana verses are instruments for attaining salvation. One will become fortunate by reading or listening to them.

2503
వేమన చెప్పిన కల్పంబే మానవుడైనగాని యెద నూహింపన్ తామస మేటికి గల్గును ? వేమనయే సిద్ధుడరయ విధమిది వేమా

వేమన చెప్పిన కల్పంబే మానవుడైనగాని
యెద నూహింపన్ తామస
మేటికి గల్గును ? వేమనయే
సిద్ధుడరయ విధమిది వేమా

వేమన చెప్పిన యీ గ్రంథమును చదివి యిందిలి విషయము నాలోచించువానికి తామసము నశించును . ఏలయన వేమన సిద్ధుడు

One who reads Yogi Vemana's poems and analyzes the meaning in them, will overcome indolence. Because Yogi Vemana is a sidha.

2504
వేమన చెప్పిన మాటలు సామంబున సకల వేదసారంబు గదా! సామెత పంచాక్షరితో నీ మహిమలు తెలిసియుంట యింపుగ వేమా

వేమన చెప్పిన మాటలు సామంబున
సకల వేదసారంబు గదా! సామెత
పంచాక్షరితో నీ మహిమలు
తెలిసియుంట యింపుగ వేమా

వేమన చెప్పిన మాటలు సకల వేదముల సారము. పంచాక్షరీ మంత్రముతో సమానము. దీని మహిమలు చూచినచో ఇంపుగా నుండును

Yogi Vemana's verses are the essence of Vedas and reading or listening to them is equivalent of reciting panchaakshari (om-namaha-si-vaa-ya). The miracles done by them are impressive.

2505
వేమనిట్లు చెప్పె వేల పద్యంబులు తప్పు లెన్నియున్న నొప్పి యుండు తత్తఱపడకందు జిత్తము నిల్పుము , విశ్వధాభిరామ! వినురవేమ!

వేమనిట్లు చెప్పె వేల పద్యంబులు
తప్పు లెన్నియున్న నొప్పి యుండు
తత్తఱపడకందు జిత్తము నిల్పుము,
విశ్వధాభిరామ! వినురవేమ

వేలకొలది పద్యముల నిట్లు వేమన చెప్పెను. వీనిలో తప్పులున్నను ఒప్పులుగా నెంచి తత్తరపడకుండ మనస్సున నిల్పి చదువవలసి యుండును

Yogi Vemana wrote thousands of such verses. One has to be not perplexed by them even when they are beautiful or contain mistakes, and read them by concentrating the mind.

2506
వేమన పద్యముల లెల్లను సామముతో జదివినట్టి సజ్జనులెల్లన్ సోమన తలగల యాతని సామీప్యము నొందగలరు సత్యము వేమా

వేమన పద్యముల లెల్లను సామముతో
జదివినట్టి సజ్జనులెల్లన్
సోమన తలగల యాతని సామీప్యము
నొందగలరు సత్యము వేమా

ఈ వేమన పద్యముల నన్నింటిని శాంతముగా చదివిన తత్పురుషులు శివ సాయుజ్యమును పొందగలరు

One who reads these verses in peace with a good character can attain Lord Siva

No comments:

Post a Comment