Sunday, February 9, 2020

Artha-Paddati


269
ఆపాదందుజూడు మారయ బంధులు భయమువేళ జూడు బంటుతనము పేదపడ్డ వెనుక పెండ్లము మతిజూడు , వి. వే.

ఆపాదందుజూడు మారయ బంధులు
భయమువేళ జూడు బంటుతనము
పేదపడ్డ వెనుక పెండ్లము
మతిజూడు , వి. వే.

ఆపదలందు సాయపడువారే బంధువులు . భయ సమయమున పరాక్రమించువాడే వీరుడు . లేమి కల్గినపుడు గౌరవించినదియే సరియైన భార్య .

Those who help in time of need are real relatives; the one who shows valor in fearful circumstances is the real hero; the wife who respects at times of need is the real wife.

270
ఆశచేత ధనమును ఆర్జింపగా ఏల ? మట్టిక్రిందబెట్టి మఱువనేల ? ధనము పోవువెనుక ధర్మంబదేలరా ? వి. వే.

ఆశచేత ధనమును ఆర్జింపగా ఏల?
మట్టిక్రిందబెట్టి మఱువనేల?
ధనము పోవువెనుక
ధర్మంబదేలరా ? వి. వే.

కొందరు ఆశతో ధనమును సంపాదించి , దానిని నేలలో కప్పివేసి మరచిపోవుదురు . ధనము పోయిన వెనుకనే వారికి ధర్మము చేయు బుద్ధి పుట్టును .

Some people out of greed store money underground and forget about it. They feel like performing charitable acts after they lose their money.

271
ఇంటిలోని ధనము నిది నాది యనుచును మంటిలోనదాచు మంకుజీవి కొంచుబోడు వెంట గుల్లకాసునురాదు , వి. వే.

ఇంటిలోని ధనము నిది నాది
యనుచును మంటిలోనదాచు మంకుజీవి
కొంచుబోడు వెంట గుల్లకాసునురాదు,
వి. వే.

మూర్ఖుడు ఇంటిలో సోదరులతో తగవులాడి వంతు తీసికొని ఆ ధనమును నేలలో దాచును . ఇట్లఎందుకు చేయునో ? తాను చచ్చినపుడు తన వెంట చిల్ల గవ్వ అయినను తీసికొనిపోడు .

A foolish person fights with his siblings over inheritance and buries the money under ground. Why does he do this? One can't take anything to nether world after death.

272
ఇరుగుపొరుగు వారికెనయు సంపదజూచి తనకు లేదటన్న ధర్మమేమి ? ధర్మమన్న దొల్లి తన్నుక చచ్చిరి , వి. వే

ఇరుగుపొరుగు వారికెనయు సంపదజూచి
తనకు లేదటన్న ధర్మమేమి?
ధర్మమన్న దొల్లి తన్నుక
చచ్చిరి , వి. వే

ఇరుగు పొరుగులవారికి ధనమున్నదని , తనకు లేదని దుఃఖింపరాదు . వెనుక జన్మలో ధర్మము చేసిననే ఇప్పుడు సంపద వచ్చును . అపుడు ధర్మము చేయలేదు . కాన ఇప్పుడు ధనము రాలేదు .

One should not regret that neighbors have more money. If one performed charitable acts in the previous births, one would have had enough money. Since he did not perform charitable acts in previous life, he is suffering now.

273
ఇహమునందుజాల ఇడుమలబడినను బడుగు పొందగలడె పరమపదవి ? పేదకనువుపడునె పృధివిపై భాగ్యంబు ? వి. వే.

ఇహమునందుజాల ఇడుమలబడినను
బడుగు పొందగలడె పరమపదవి?
పేదకనువుపడునె పృధివిపై
భాగ్యంబు ? వి. వే.

ఇప్పుడు నిర్భాగ్యుడు ధనమునకై ఎంత శ్రమపడినను అది లభింపదు . పూర్వ కర్మమునుబట్టి దరిద్రుడుగా పుట్టినవానికి ధనమెట్లు లభించును ?

No matter how hard an unfortunate person works, he won't be rich. When the karma from previous birth made him a pauper, how can he earn money in this birth?

274
ఇహమున సుఖియింప హేమకారక విద్య పరమున సుఖియింప బ్రహ్మ విద్య కడమ విద్యలెల్ల కల్ల మూఢులకురా , వి. వే.

ఇహమున సుఖియింప హేమకారక విద్య
పరమున సుఖియింప బ్రహ్మ
విద్య కడమ విద్యలెల్ల కల్ల
మూఢులకురా , వి. వే.

ఐహిక సుఖములకు కావలసిన బంగారు చేయు విద్య కావలెను . పరలోక సుఖమునకు బ్రహ్మ విద్య అవసరము . తక్కిన విద్యలన్నియు నిరుపయోగములు . అవి మూఢులకే తగును

To enjoy comforts on the earth one needs the knowledge to make gold; for comforts in nether world after death one needs the knowledge about the creator (brahma). The rest of the knowledge is useless.

275
ఇహమునందు సుఖము లింపారలేవట పరమునందు సుఖము బడయుట ఎట్లు ? ధనములేక సుఖము తనకెట్లు కలుగురా ? వి. వే.

ఇహమునందు సుఖము లింపారలేవట
పరమునందు సుఖము బడయుట ఎట్లు?
ధనములేక సుఖము తనకెట్లు
కలుగురా ? వి. వే.

ధనమున్న ఈ లోకమున సుఖింపవచ్చును . జ్ఞాన ధనమున్న పరలోకమున సుఖింపవచ్చును . ఈ రెండను లేనివానికి ఏ సుఖమును లేదు .

If one has wealth, he can enjoy life on the earth. When one has knowledge, then he can enjoy in nether world after death. The one who lacks either of them has no comfort.

276
ఈతకన్న లోతు నెంచ౦గ పనిలేదు చావుకన్న కీడు జగతిలేదు గోచిపాతకన్న కొంచెంబింకను లేదు , వి. వే.

ఈతకన్న లోతు నెంచ౦గ పనిలేదు
చావుకన్న కీడు జగతిలేదు
గోచిపాతకన్న కొంచెంబింకను
లేదు , వి. వే.

ఈదేవాడు లోతును చూడనక్కరలేదు . చావుకంటె కీడు లేదు . గోచీపాతకంటె తక్కువ లేమి లేదు .

The one who knows swimming need not worry about the depth of water. There is no bigger misery than death. A loin cloth is the least possible garment.

277
ఉచితవంతుడైన ఉద్యోగపరుడైన సంపదమరియున్న సమయముననె పరులకు ఉపకరించు పాలింపగల్గును , వి. వే .

ఉచితవంతుడైన ఉద్యోగపరుడైన
సంపదమరియున్న సమయముననె
పరులకు ఉపకరించు పాలింపగల్గును,
వి. వే .

ఔచిత్య మెరిగిన గొప్ప ఉద్యోగియైనను తన వద్ద ధనమున్నప్పుడే ఇతరులకు సాయపడగలడు . లేనిచో చేయలేడు .

A fit and able employee can help others only when he has money. Without money he can't do anything for others

278
ఉన్నయంత మనుజుడుపకారి కాలేక కన్ను కానడంచు ఘనుని పలుకు దీనుడైన తనకు దిక్కెవ్వరు అగుదురు ? వి. వే.

ఉన్నయంత మనుజుడుపకారి కాలేక
కన్ను కానడంచు ఘనుని పలుకు
దీనుడైన తనకు దిక్కెవ్వరు
అగుదురు ? వి. వే.

తనకు ధనము ఉన్నప్పుడు ఇతరులకు ఉపకారము చేయక తత్ఫలముగా జనుడు దరిద్రుడై పుట్టును . ఈ జన్మలో తాను యాచకుడై ఇతరులు ఈయకపోగా వారిని నిందించును .

One is born as a pauper because he refused to part with his money for the less-fortune in the previous life. In this birth by being a mendicant he abuses others who don't give him alms.

279
ఉప్పులేని కూర యొప్పదు రుచులకు పప్పులేని తిండి ఫలము లేదు అప్పులేనివాడె అధిక సంపన్నుడు , వి. వే .

ఉప్పులేని కూర యొప్పదు రుచులకు
పప్పులేని తిండి ఫలము
లేదు అప్పులేనివాడె అధిక
సంపన్నుడు , వి. వే .

ఉప్పులేని కూర , పప్పులేని భోజనము రుచింపవు . కాని అప్పులేనివాడే గొప్పవాడు .

A meal without salt and lentils is not tasty. A person without debts is the greatest

280
ఉర్వివారికెల్ల ఒక్క కంచము పెట్టి పొత్తుగుడిపి కులము పొలయుజేసి తలను చేయిపెట్ట తగనమ్మజెప్పరో ! వి. వే.

ఉర్వివారికెల్ల ఒక్క కంచము
పెట్టి పొత్తుగుడిపి కులము
పొలయుజేసి తలను చేయిపెట్ట
తగనమ్మజెప్పరో ! వి. వే.

అందరికి సహ పంక్తి భోజనములు ఏర్పరచి , జాతి భేదములను మాన్పించుట ధనికులు చేయదగిన పని . దీనికై వారు బద్ధకంకణులు కావలెను .

Rich people should feed others regardless of caste and set an example. They should be determined to do such charities.

281
ఋణమోసగునాతడినుడుగుదొలుదొల్త నదియు మఱల నడుగ యముడుగనుగు అప్పుచేసి తీర్పనరయనివారికి , వి. వే.

ఋణమోసగునాతడినుడుగుదొలుదొల్త
నదియు మఱల నడుగ యముడుగనుగు
అప్పుచేసి తీర్పనరయనివారికి,
వి. వే.

చేసిన అప్పు తీర్చలేనివానికి అప్పిచ్చువాడు లోక బాంధవుడు , తిరిగి అడిగినవాడు యముడు .

A person who can't repay his debtors, thinks of a new loaner to be the best relative. The debtor who demands payment is a yama (God of death)

282
ఎంత భూమితిరిగి యేపాటు పడుచున్న అంటనీక ప్రాప్తి వెంటదిరుగు భూమిక్రొత్తదైన భోక్తలు క్రొత్తలా , వి. వే.

ఎంత భూమితిరిగి యేపాటు పడుచున్న
అంటనీక ప్రాప్తి వెంటదిరుగు
భూమిక్రొత్తదైన భోక్తలు
క్రొత్తలా , వి. వే.

ఎన్ని దేశముల తిరిగి ఎంత శ్రమపడినను , తన దారిద్ర్యము తన వెంటనే ఉండును . స్థలము క్రొత్త కావచ్చును . కాని అనుభవించువాడు పాతవాడే కదా !

No matter how many places one visits and how hard one works, his indigence will follow him. A place may be new, but the experience is by the same person.

283
ఎద్దుమొద్దువాని కేల శాస్త్రంబులు ? ముద్దునాతి కేల ముసలిమగడు ? చద్దిమిగుల నిల్లు సంసారమేలరా ? వి. వే.

ఎద్దుమొద్దువాని కేల శాస్త్రంబులు?
ముద్దునాతి కేల ముసలిమగడు?
చద్దిమిగుల నిల్లు
సంసారమేలరా ? వి. వే.

మొద్దువానికి శాస్త్రములు అక్కరలేదు . పడుచుదానికి ముసలి మగడు కిట్టడు . అట్లే చద్ది యన్నము మిగిలియుండని ఇల్లుగల సంసారము సరియైనది కాదు .

A dunce doesn't need knowledge. A young woman has no use for an old groom. A house without breakfast is not suitable for a family.

284
ఓజమాలు మగువ ఓలిమాడలచేటు పాటులేని మగడు కూటిచేటు పనికిమాలు దాసి బత్తెంబు చేటురా ! వి. వే.

ఓజమాలు మగువ ఓలిమాడలచేటు
పాటులేని మగడు కూటిచేటు
పనికిమాలు దాసి బత్తెంబు
చేటురా ! వి. వే.

మంచి లేని భార్య పెండ్లి ఖర్చు చేటు . పని చేయని భర్త తిండి చేటు . పనికిపాలిన దాసి కూలి చేటు .

It is loss of marriage expense when a wife is not of good character. A husband who is unemployed is a burden. The wage is a waste when a servant doesn't do her job

285
కట్టెపేరు లోలికట్టి చెప్పగరాదు కానరాకయున్నె కలిమితనము ?జంగమైనవాని జాతి కన్పడదొకో ! వి. వే.

కట్టెపేరు లోలికట్టి చెప్పగరాదు
కానరాకయున్నె కలిమితనము?
జంగమైనవాని జాతి
కన్పడదొకో ! వి. వే.

“వీడు జంగము" అని వేషముబట్టియే తెలియును . కట్టె పేరు చెప్పకయే అదేదో తెలియును . అట్లే సొత్తున్నది , లేనిది సులభముగనే తెలియును . ప్రదర్శనము అక్కరలేదు .

One can identify a devotee of Lord Siva by the phallic symbol he wears around his neck. The type of a piece of wood can easily be identified. Similarly an indigent person can be simply recognized. There is no need for a show

286
కడుపునిండ దవుడు గంపలో పెట్టిన చన్నుబట్టనీక తన్ను గేదె వారకాంత లెట్లు వలతురో యూరక ? వి. వే.

కడుపునిండ దవుడు గంపలో పెట్టిన
చన్నుబట్టనీక తన్ను
గేదె వారకాంత లెట్లు
వలతురో యూరక ? వి. వే.

కావలసినంత తవుడు గంపతో ముందు ఉంచినను గేదె చన్నును పట్టుకొన నీయదు . ఇట్లు౦డ ధన మీయకయే వేశ్య ఎట్లు వాలచును?

A cow can hit if its udder is held even when enough fodder has been placed before her. Will a prostitute oblige when not paid?

287
కనక పర్వతమున కాపురముండిన ననిమిషేశ్వరునకు ఆసపోదు కనకాకుండలములు కర్ణుని నడుగడా ? వి. వే.

కనక పర్వతమున కాపురముండిన
ననిమిషేశ్వరునకు ఆసపోదు
కనకాకుండలములు కర్ణుని
నడుగడా ? వి. వే.

తాను బంగారు కొండ యగు మేరువుపై నివసించుచున్నను , ఇంద్రునికి ఆశ తీరక కర్ణుని బంగారు కుండలములను యాచించెను . ఇక సామాన్యునికు ధనముపై ఆశ ఏల యుండదు ?

Even though Lord Indra was living on golden mountain (meru), he begged King Karna for his body armor out of avarice. How can a common man live without greed?

288
కనకమృగము భువిని కద్దు లేదనలేక తరుణి విడిచిపోడె దాశరథియు దైవమైన ధనము దలచుచుండునుగాదె? వి. వే.

కనకమృగము భువిని కద్దు లేదనలేక
తరుణి విడిచిపోడె
దాశరథియు దైవమైన ధనము దలచుచుండునుగాదె?
వి. వే.

దేవునికైనను ధనమున్న ఆశ యే ! “బంగారు లేడి ఉండునా ?” అనియైన ఆలోచింపక రాము నంతటివాడు భార్యను విడిచి , దానికై పరిగెత్తెను కదా!

Even a god is greedy about wealth. Lord Rama without thinking twice whether a golden deer could exist naturally, had left his wife behind in forest and chased after the deer.

289
కనకమున్నవాడు కాముడు భీముడు మిగుల తేజమలరి మెలగుచు౦డు విత్తహీనుడైన వెఱ్ఱులలో నేటు , వి. వే.

కనకమున్నవాడు కాముడు భీముడు
మిగుల తేజమలరి మెలగుచు౦డు
విత్తహీనుడైన వెఱ్ఱులలో
నేటు , వి. వే.

ధనమున్నవాడు కురూపియైనను అందగాడు . శక్తి లేకున్నను మహా బలవంతుడు . డబ్బు లేనిచో వెర్రివానిలోనే లెక్క .

A wealthy person even though ugly will be considered as handsome. Even when he lacks strength he would be praised as strong. A person is considered foolish when he has no money

290
ఉన్న ఘనతబట్టి మన్ని౦తురేకాని పిన్న పెద్దతనము నెన్నబోరు వాసుదేవువిడిచి వసుదేవు నెంతురా ? వి. వే.

ఉన్న ఘనతబట్టి మన్ని౦తురేకాని
పిన్న పెద్దతనము నెన్నబోరు
వాసుదేవువిడిచి వసుదేవు
నెంతురా ? వి. వే.

గొప్పతనము బట్టియే గౌరవము . దానికి వయస్సుతో పనిలేదు . జనులు వసుదేవుని విడిచి శ్రీకృష్ణునే గౌరవించుట లేదా ?

Honor is based on greatness. It doesn't depend on the age. Don't people worship Lord Krishna and ignore his father Vasudeva?

291
కనియుగానకుండు కదలింపడానోరు వినియు వినక యుండు విస్మయ౦బు సంపదగలవాని సన్నిపాతంబిది , వి. వే.

కనియుగానకుండు కదలింపడానోరు
వినియు వినక యుండు
విస్మయ౦బు సంపదగలవాని సన్నిపాతంబిది,
వి. వే.

ధనవంతుడు సన్నిపాత జ్వరము వచ్చినవానివలె చూచియు చూడనట్లు ఉండును . వినియు విననట్లు ఉండును . నోరు తెరవడు . దీనికి ధన గర్వమే కారణము .

A rich person evades eye contact like a person suffering from fever. He pretends to be deaf even though he could hear. He feigns muteness. These are because he is egoistic about his wealth.

292
కన్నెమీద యాస కనకంబుపై నాస లేనివాడు పుడమి లేనివాడు కలిగెనేని వాడు కానగబడడయా ! వి. వే.

కన్నెమీద యాస కనకంబుపై
నాస లేనివాడు పుడమి లేనివాడు
కలిగెనేని వాడు
కానగబడడయా ! వి. వే.

కాంతా కనకములపై ఆశ లేనివాడు లోకములో లేనే లేడు . ఉన్నయెడల కనబడడు కదా !

A person who doesn't covet gold and a girl is hard to find. If so, he could not be found either.

293
కమ్మరీని దుడుకు కార్యవిహీనంబు వడ్లవాని దుడుకు వాల పిడుగు కాసెవాని దుడుకు కాకుత్ స్థబాణంబు , వి. వే.

కమ్మరీని దుడుకు కార్యవిహీనంబు
వడ్లవాని దుడుకు వాల పిడుగు
కాసెవాని దుడుకు కాకుత్
స్థబాణంబు , వి. వే.

కమ్మరిగాని , వడ్రంగిగాని కోపించి తమ పనులు చేసికొననిచో వారికే నష్టము . కాని , రాజుగారి దాసి కొడుకు కోపించినచో అది రామబాణమువలె పనిచేయును

A skilled person who gets angry and stops working suffers losses. Whereas when a royal servant maid's son gets miffed everyone pays attention and it works like Lord Rama's arrow.

294
కర్ణుడు ఒకడె కాని ఘనుడు ఎవ్వడును లేడు దానశీలుడంచు తలపబడెను తలపధనము కర్ణుదాతజేసెను సుమీ , వి. వే.

కర్ణుడు ఒకడె కాని ఘనుడు ఎవ్వడును
లేడు దానశీలుడంచు
తలపబడెను తలపధనము కర్ణుదాతజేసెను
సుమీ , వి. వే.

కర్ణునివంటి దాత లోకములో లేడని ప్రసిద్ధి . అతనికి అట్టి కీర్తి ధనము వల్లనే కలిగెను కదా !

King Karna was famous around the world as the greatest donor. He earned that fame because of his wealth.

295
కలిగిన మనుజుడు కాముడై సోముడై మిగుల తేజమునను మెఱయుచుండు విత్తహీనుడైన నుత్త సన్యాసిరా ! వి. వే.

కలిగిన మనుజుడు కాముడై సోముడై
మిగుల తేజమునను మెఱయుచుండు
విత్తహీనుడైన నుత్త
సన్యాసిరా ! వి. వే.

ధనమున్నవాడు మన్మథునివలె , చంద్రునివలె ప్రకాశించును . లేనివాడు బోడి సన్యాసియే .

A rich person will be considered handsome no matter what. A poor person is just a mendicant even when he is handsome.

296
కలిగి ధర్మామీయగాననివారును కలిగి తినక చాలగ్రాగువారు కలిమి నెచటజూడ గానక చెడుదురు , వి. వే.

కలిగి ధర్మామీయగాననివారును
కలిగి తినక చాలగ్రాగువారు
కలిమి నెచటజూడ గానక
చెడుదురు , వి. వే.

ఈ జన్మములో ధనముండి ఇతరుల కీయక, తాను అనుభవించక ఉండువారికి మరుజన్మలో సంపద అబ్బదు

A rich person who doesn't enjoy his wealth and offer alms to others will not have any money in the next birth.

297
కలిమి యున్నవానిగని పట్టి నిచ్చిన మనువు పొంగి పాలు మరిగినట్లు లోని నిగిరి కలిమి లొట్టుపోయేడునొకో , వి . వే .

కలిమి యున్నవానిగని పట్టి నిచ్చిన
మనువు పొంగి పాలు మరిగినట్లు
లోని నిగిరి కలిమి లొట్టుపోయేడునొకో,
వి . వే .

సంపద యున్నవానిని చూచి పిల్ల నిచ్చినచో , పాలు పొంగినట్లు మనువు వృద్ధి పొందునేగాని కుండలోని పాలిగిరిపోయినట్లు క్షీణించదు . (సంపద వృద్ధియగును )

When a daughter is offered in marriage to a rich person, the wealth will multiply like milk that rises when boiled. This is unlike milk that evaporates when left in a pot.

298
కలిమి కలిగియుండి కఠినభావము చెంది తెలియలేరు ప్రజలు తెలివిలేక కలిమి వెన్నెలగతి గానలేరాయా! వి. వే.

కలిమి కలిగియుండి కఠినభావము
చెంది తెలియలేరు ప్రజలు
తెలివిలేక కలిమి వెన్నెలగతి
గానలేరాయా! వి. వే.

సంపద కలిగినపుడు కొందరు కఠినులై తెలివిలేక సంచరింతురు . కలిమి వెన్నెలవలె అస్థిరమైనదని వారు గ్రహింపలేరు .

Some people when they become rich become stone-hearted and behave irrationally. They don't realize wealth is as transient as the moon light.

299
కలిమి కలిగెనేని గాముగాజూతురు లేమిచేత చిక్కలేరు లధిపు మదనువంటివాని మాలగా జూతురు , వి. వే.

కలిమి కలిగెనేని గాముగాజూతురు
లేమిచేత చిక్కలేరు
లధిపు మదనువంటివాని మాలగా
జూతురు , వి. వే.

స్త్రీలు సంపద యున్నప్పుడు భర్త వికారముగా ఉన్నను మన్మథునిగా ఎంతురు . ధనము లేనిచో మన్మథునివంటి భర్తనైనను హీనునిగా చూతురు .

A woman considers her rich husband as handsome even when he is not. She treats her poor husband lowly even when he is handsome.

300
కలిమి గలుగ సకల కులములకెక్కువ కలిమి భోగభాగ్యములకు నెలవు కలిమి లేనివాని కులమేమి కులమయా ? వి. వే.

కలిమి గలుగ సకల కులములకెక్కువ
కలిమి భోగభాగ్యములకు
నెలవు కలిమి లేనివాని కులమేమి
కులమయా ? వి. వే.

సంపద గలవాడు హీనకులుడైనను గొప్ప కులమువాడే . సంపద యున్ననే భోగభాగ్యము లుండును . అది లేనిచో గొప్పకులము వాడైనను హీనకులుడే !

A rich person, even when he is of low caste, is considered as worthy. All luxuries are possible with money only. Without wealth a high caste person will be considered lowly.

301
కలిమిజూచియీయ గాయమిచ్చినయట్లు సమున కీయ నదియు సరసతనము పేదకిచ్చు మనువు పెనవేసినట్లుండు , వి. వే.

కలిమిజూచియీయ గాయమిచ్చినయట్లు
సమున కీయ నదియు సరసతనము
పేదకిచ్చు మనువు పెనవేసినట్లుండు,
వి. వే.

తనకంటె ధనికునికి పిల్ల నిచ్చినచో , శరీరము కోసి యిచ్చినట్లుండును . శ్రమలే కల్గును . సమానునికి ఇచ్చుట కొంత మేలు . పేదవాని కిచ్చినచో మిక్కిలి పొత్తు కలిగి యుండును .

When a poor person offers his daughter in marriage to a rich person, it is like offering his flesh. It leads to strife. It is better to offer to a groom of equal status. The best thing to do is to offer to a poor person which will lead to strong bonds.

302
కలిమినాడు మగని గామించి చూచును లేమిజిక్కునాడు లేవకుండు మనిన మగనినైన మడియంగజూచును , వి. వే.

కలిమినాడు మగని గామించి
చూచును లేమిజిక్కునాడు
లేవకుండు మనిన మగనినైన మడియంగజూచును,
వి. వే.

స్త్రీ సంపదగలప్పుడు మగనిని ప్రేమతో చూచి గౌరవించును . లేమి కల్గినపుడు లేవనైన లేవదు . “ఇట్టివాడు మరణించినను మేలు " అనియు , ఆమె తలచును .

A woman will treat her husband with respect when he has wealth. She will ignore him if he has no money. She thinks he should rather be dead.

303
కాంచనంబుపైన గాంతులపైనను బమ్మకైనబుట్టు దిమ్మతెగులు తోయజాక్షి విడుచు దొరయెవ్వడునులేడు , వి. వే.

కాంచనంబుపైన గాంతులపైనను
బమ్మకైనబుట్టు దిమ్మతెగులు
తోయజాక్షి విడుచు దొరయెవ్వడునులేడు,
వి. వే.

బంగారముపైని , యువతిపైని బ్రహ్మకయినను విపరీతపు కోరిక ఉండును . యువతి అక్కరలేనివా డెవ్వడును లేడు .

Even the creator (brahma) covets gold and a young girl. There is no one who dislikes a young girl.

304
కాంచనంబుమీది కాంక్షమోహమటండ్రు విడువలేరు దాని విబుధులైన కాంక్ష లేనివారు కానగరారయా ! వి. వే .

కాంచనంబుమీది కాంక్షమోహమటండ్రు
విడువలేరు దాని విబుధులైన
కాంక్ష లేనివారు
కానగరారయా ! వి. వే

ధనముపై ఆశనే మోహమందురు . ఆ ధన కాంక్షను విద్వాంసులును విడువలేరు . ధనముపై ఆశలేనివారు లోకములో ఎచ్చటను కానరారు .

The greed for wealth is called avarice. Even learned people can't overcome avarice. One can't find anywhere in the world a person who doesn't want money.

305
కావవలయు ధనము గాంత నెల్లప్పుడు కావలేనివాడు చావవలయు కాపులేనిదాని కాపుర మడుగునా ? వి. వే.

కావవలయు ధనము గాంత నెల్లప్పుడు
కావలేనివాడు చావవలయు
కాపులేనిదాని కాపుర
మడుగునా ? వి. వే.

ధనమును , స్త్రీని భద్రముగా కాపాడుకొనలేనివాడు చచ్చుటయే మేలు. అట్లు కాపుదల లేని కాపురము చెడిపోవును .

A person who can't safeguard his wealth and women better be dead. A family without such safeguard will perish.

306
కుడువ గూడులేక కూడబెట్టగలేక విడువ ముడువలేక గడనలేక నడువ సాగకున్న నడపీనుగందురు , వి. వే.

కుడువ గూడులేక కూడబెట్టగలేక
విడువ ముడువలేక గడనలేక
నడువ సాగకున్న నడపీనుగందురు,
వి. వే.

దరిద్రునకు తన తిండి యుండదు . ఇతరులకిచ్చుటకు ధనముండదు. సంపాదన ఉండదు . బ్రతుకు సాగించుటకు గాని, విడుచుటకు గాని కుదరదు . అతడు నడపీనుగు . (అనగా నడుచుచున్న పీనుగు ).

An indigent person who has no money to feed himself, give alms to poor people and has no income can neither live nor die. He is a zombie.

307
కులము కలుగువారు గోత్రంబు కలవారు విద్యచేత విఱ్ఱవీగువారు పసిడికల్గువాని బానిస కొడుకులు , వి. వే.

కులము కలుగువారు గోత్రంబు
కలవారు విద్యచేత విఱ్ఱవీగువారు
పసిడికల్గువాని బానిస
కొడుకులు , వి. వే.

గొప్ప కులమువారు , గొప్ప వంశమువారు , విద్వాంసులు – వీరందరు ధనవంతునికి దాసులగుదురు .

People of high caste, great lineage and highly learned will be subservient to a rich person.

308
కులము లేనివాడు కలిమిచే వెలయును కలిమిలేనివాని కులము దిగును కులముకన్న నెన్న గలిమి ప్రధానంబు , వి. వే.

కులము లేనివాడు కలిమిచే వెలయును
కలిమిలేనివాని కులము
దిగును కులముకన్న నెన్న గలిమి
ప్రధానంబు , వి. వే.

సంపదయున్నచో తక్కువ కులమువాడు గొప్పవాడగును . అది లేనిచో గొప్ప కులమువాడు తక్కువ యగును . కులముకంటె కలిమియే గొప్పది .

With wealth a low caste person will be considered as great. Without wealth a high caste person will be considered as low-life. Wealth trumps caste.

309
కులుకుగుబ్బజూపి గొబ్బున వలపించి చేతికాసులెల్ల జేరదీయు అతను చేతికత్తు లమరంగ కాంతలు , వి. వే .

కులుకుగుబ్బజూపి గొబ్బున
వలపించి చేతికాసులెల్ల జేరదీయు
అతను చేతికత్తు లమరంగ
కాంతలు , వి. వే .

కాంతలు మన్మథుని కత్తుల వంటి వారు. వారు తమ చక్కదనమును చూపి పురుషుల ధనము లాగికొందురు

Women are as sharp as knives belonging to Manmatha (cupid). By flashing their beauty they embezzle a rich man's wealth.

310
కూరలేని తిండి కుక్క తిండనిపించు మాఱులేని తిండి మాలతిండి ధారలేని తిండి దయ్యపుతిండిరా , వి. వే.

కూరలేని తిండి కుక్క తిండనిపించు
మాఱులేని తిండి
మాలతిండి ధారలేని తిండి దయ్యపుతిండిరా,
వి. వే.

కూరలేని తిండి , మారు వడ్డన లేని భోజనము , నేతి ధార పడని తిండి , హీనమైనవి (మంచి తిండికి డబ్బు కావలెను )

A meal without vegetables, a service without second servings, a dinner without ghee happen when a person has no money to buy food

311
కూలినాలిచేసి గుల్లాము పనిచేసి తెచ్చి పెట్ట చాలు మెచ్చుచుండు లేమిజిక్కు విభుని వేమారు తిట్టును , వి. వే .

కూలినాలిచేసి గుల్లాము పనిచేసి
తెచ్చి పెట్ట చాలు మెచ్చుచుండు
లేమిజిక్కు విభుని వేమారు
తిట్టును , వి. వే .

కూలి నాలి చేసియో , సేవకుడుగా ఉండియో , ఏట్లో డబ్బు తెచ్చుచున్ననే భార్య భర్తను గౌరవించును . లేనియెడల తిట్టును . (ధనమే ముఖ్యము)

A wife will respect her husband when he earns somehow even in a lowly construction job or as a servant. Without a job a husband will not be respected.

312
కోమటి మదిగోరు క్షామమే యెల్లెడ వైద్యుడొరులకెపుడు వ్యాధిగోరు ఊరివాడు ధనికుజేరగా గోరును , వి. వే.

కోమటి మదిగోరు క్షామమే యెల్లెడ
వైద్యుడొరులకెపుడు
వ్యాధిగోరు ఊరివాడు ధనికుజేరగా
గోరును , వి. వే.

కోమటి ఎప్పుడును తన లాభమునకై కరవునే కోరును. వైద్యుడు ఇతరుల రోగమునే కోరును. అట్లే గ్రామీణుడు ధన్నవంతుని ఆశ్రయించుటకే కోరును .

A trader hopes for famine. A doctor wants more sick people. Similarly a farmer likes to befriend a rich person.

313
చదువులందుబాడి సౌఖ్యములందును పెదవులందు రాజ్య పదవులందు ఆశలుడిగినట్టి అయ్యలు కలరొకో ! వి. వే.

చదువులందుబాడి సౌఖ్యములందును
పెదవులందు రాజ్య పదవులందు
ఆశలుడిగినట్టి అయ్యలు
కలరొకో ! వి. వే.

చదువులందు , పాడిపంటపైని , యువతులపైని , గొప్ప పదవులపైని (ధనముపై )ఆశాలేనివారుండరు .

There is no one who doesn't want superior knowledge, harvest, beautiful women and a powerful position.

314
చమురు గల్గు దివ్వె సంతోషముగ వెల్గు ధనముగల్గుదాని తలపుజెలగు ధనములేనివాని తలపులు తీరునా? వి. వే .

చమురు గల్గు దివ్వె సంతోషముగ
వెల్గు ధనముగల్గుదాని
తలపుజెలగు ధనములేనివాని
తలపులు తీరునా? వి. వే .

చమురున్ననే దీపము బాగుగా వెలుగును . అట్లే ధనమున్న వాని ఆలోచనలు ఎక్కువగును . ధనము లేనివాని ఆలోచనలు సాగవు .

A wick will be alight for as long as there is oil. Similarly a rich person's thoughts leads to more wealth. A poor person's ideas won't work.

315
చావు నేడొ రేపొ జతపడి వచ్చును పెక్కునాళ్ళు కూడబెట్టనేల ? అనుచు ఆశలుడిగినంతటివారేరి? వి. వే .

చావు నేడొ రేపొ జతపడి వచ్చును
పెక్కునాళ్ళు కూడబెట్టనేల?
అనుచు ఆశలుడిగినంతటివారేరి?
వి. వే .

“నేడో రేపో చావు సిద్ధము. ఆశతో డబ్బు కూడబెట్టనేల ?” అని తలచి ఆశలు విడిచిపెట్టిన వారుండరు .

A person even in the throes of death doesn't leave behind his greed for wealth.

316
జడలు దాల్చుటెల్ల జగము సీయనుటెల్ల ఒడలు విఱుచునట్టి యోగమెల్ల ముక్తికాంతబట్టి ముద్దాడుకొఱకురా ! వి. వే.

జడలు దాల్చుటెల్ల జగము సీయనుటెల్ల
ఒడలు విఱుచునట్టి యోగమెల్ల
ముక్తికాంతబట్టి ముద్దాడుకొఱకురా!
వి. వే.

ఆశలేనివారు ఎవరు? లోకమును నిందించి , జడలు ధరించి, యోగములు అభ్యసించుట కూడా ముక్తిపై ఆశచేతనే కదా!

Who is not greedy? Even yogis who blame the world and with matted hair, learn yoga with greed for salvation.

317
టంకమదకకున్న బొంకంబుగారాదు స్వర్ణభూషణంబు జగమెఱుగ భటుడు వెంటలేక ప్రభుడు శోభించునా ? వి. వే.

టంకమదకకున్న బొంకంబుగారాదు
స్వర్ణభూషణంబు జగమెఱుగ
భటుడు వెంటలేక ప్రభుడు
శోభించునా ? వి. వే.

వెంట సేవకుడు లేనిచో రాజు శోభింపడు , బంగారు నగయైనను టంకము లేనిదే శోభించదు కదా!

Without retinue a king is not recognized. Just as gold without copper can't shine.

318
డిందుపడినవాని నెందును లెక్కింప నిందునందుగాన నెట్టులయిన మందమతివి

డిందుపడినవాని నెందును
లెక్కింప నిందునందుగాన
నెట్టులయిన
మందమతివి
కాక మహిమలోన నుండుము , వి. వే.

ధనమున్నను మందమతిని ఎవ్వరును లెక్కింపరు . కావున జనుడు చురుకుగా ఉండవలెను.

People don't respect a rich man who is slow-witted. So one should be sharp witted.

319
డొక్కలెండిపోవు డొక్కుతానయ్యును మమత మానగలడె మానవుండు కాన ధనము గూర్ప గడగుము జ్ఞానివై , వి. వే.

డొక్కలెండిపోవు డొక్కుతానయ్యును
మమత మానగలడె మానవుండు
కాన ధనము గూర్ప గడగుము
జ్ఞానివై , వి. వే.

ముసలి డొక్కుకైనను మమత పోదు . ఇది తెలిసికొని ధనమును సంపాదింప యత్నింపవలెను (ఆశ తప్పదనుట )

Even a decrepit old man isn't above love of money. Knowing this, one should strive to earn money

320
తనకు బంధువనుచు దానె తోడుకవచ్చి కలిమి గలయజూచి కాంక్షపరుడు దక్షిణలనొస౦గి తరుణి నీయగజూచు , వి. వే.

తనకు బంధువనుచు దానె తోడుకవచ్చి
కలిమి గలయజూచి కాంక్షపరుడు
దక్షిణలనొస౦గి తరుణి
నీయగజూచు , వి. వే.

ఆశాపరుడు ధనవంతుని జూచి , ఏదో బంధుత్వము కలిపి , అతనిని తెచ్చి కన్యనిచ్చి పెండ్లి చేయనెంచును .

A greedy person, after meeting a rich person, makes up a relationship and wants to offer his daughter in marriage.

321
తఱచు కల్లలాడు ధరణీశులిండ్లలో వేళ వేళ లక్ష్మి వెడలిపోవు నోటికుండలోన నుండునా నీరంబు? , వి. వే.

తఱచు కల్లలాడు ధరణీశులిండ్లలో
వేళ వేళ లక్ష్మి వెడలిపోవు
నోటికుండలోన నుండునా
నీరంబు? , వి. వే.

రాజైనను సరే అసత్యము లాడినచో అతని సంపద నశించును . చిల్లి కుండలో నీరు నిలువదు కదా !

When a king is a liar, his wealth will dwindle. Water won't remain in a pot with a hole

322
తరుణి సుతులు ధనము ధాన్యముల్ సంపద లెంతచుట్టుకొనిన అంతచేటు పసిరికాయ పురుగు పద్ధతి కానరో ? వి. వే.

తరుణి సుతులు ధనము ధాన్యముల్
సంపద లెంతచుట్టుకొనిన
అంతచేటు పసిరికాయ పురుగు
పద్ధతి కానరో ? వి. వే.

పసిరికాయలోని పురుగు తన నోటి దారమును తన చుట్టు చేర్చిన , దానికే ప్రాణహాని యగును. అట్లే భార్యాపుత్రులు సిరిసంపదలు ఎక్కువైనకొలది తనకే హాని .

An insect in pasiri fruit if winds a thread drawn from its saliva around itself, it may die. Similarly a man afflicted with wife, kids and too much wealth can hurt himself.

323
తలను పాగ , పైని తగు పచ్చడము , బొజ్జ చెవులపోగు లరసి చేరు నర్ధి శుద్ధపశువులనుచు బుద్ధిలో నారయక, వి. వే.

తలను పాగ , పైని తగు పచ్చడము,
బొజ్జ చెవులపోగు లరసి
చేరు నర్ధి శుద్ధపశువులనుచు
బుద్ధిలో నారయక, వి. వే.

తలపాగ, దుప్పటి , పెద్ద బొజ్జ , అంటుజోళ్ళు చూచి శ్రీమంతుడని తలచి యాచకు డతని వద్ధకు వచ్చును . కాని ప్రయోజనమేమి ? శుద్ధ పశువువంటి ఆ వ్యక్తి ధనము నీయడు .

A beggar will approach a person with a turban, blanket, big paunch and expensive shoes thinking he is a wealthy man to seek alms. But what is the use if that person is a miser?

324
తల్లి బిడ్డలకును తగవు పుట్టించెడు ధనము సుఖము గూర్చదని వచింతరు కాని గడనలేక కడచుట యెట్లురా ? వి. వే.

తల్లి బిడ్డలకును తగవు పుట్టించెడు
ధనము సుఖము గూర్చదని
వచింతరు కాని గడనలేక కడచుట
యెట్లురా ? వి. వే.

ధనము , తల్లికి బిడ్డలకు విరోధము కల్గించును . దానివల్ల సుఖము లేదని అందురేకాని , సంపాదనలేక దినము గడపజాలరు

Mother and children will fight over money. Even though people say there is no peace in wealth, without earning money there is no life.

325
తళుకు బెళుకుజూచి ధరలోని జనులెల్ల కద్దు లేదటండ్రు ఘనతగాను ఇదిగొ యదిగొ యనుచు నికనెక్కడందురు ? వి. వే.

తళుకు బెళుకుజూచి ధరలోని జనులెల్ల
కద్దు లేదటండ్రు ఘనతగాను
ఇదిగొ యదిగొ యనుచు
నికనెక్కడందురు ? వి. వే.

ధనికులగువారు చమత్కారముగా ఉన్నది , లేదు అని యాచకులకు చెప్పుట మర్యాద . ఇప్పుడు అప్పుడు అని చెప్పి త్రిప్పుట సరికాదు .

A rich person should not make mendicants run around him for money when he has no intention of giving alms to them.

326
తవిటికరయబోవ తండులంబుల గంప శ్వానమాశ్రయించు సామ్యముగను వైశ్యవరుని సొమ్ము వసుధ నీచుల కబ్బు , వి. వే.

తవిటికరయబోవ తండులంబుల గంప
శ్వానమాశ్రయించు సామ్యముగను
వైశ్యవరుని సొమ్ము వసుధ
నీచుల కబ్బు , వి. వే.

ఇంటి తలుపు తెరచి , తవుడునకు పొరుగింటికి పోగా కుక్క యింటిలో చొరబడి బియ్యము తినివేసినట్లు వైశ్యుల ధనము నీచులకే అబ్బును.

A trader's money will be stolen by cheats. Just as when the front-door is open, and the house owner goes to borrow fodder from the neighbor, a dog can enter the house and eat the rice.

327
తాను గడువలేడు తగవేది యాప్తుల జేరనీయ డట్టి చెనటి పశువు చేనిలోన బొమ్మజేసి కట్టినయెట్లు , వి. వే.

తాను గడువలేడు తగవేది యాప్తుల
జేరనీయ డట్టి చెనటి
పశువు చేనిలోన బొమ్మజేసి
కట్టినయెట్లు , వి. వే.

తాను అనుభవింపలేక , బంధువులకు పెట్టక యున్నవాడు చేనిలో దిష్టిబొమ్మను కట్టినట్లు ఉండును .

One who doesn't enjoy his wealth and won't offer to his friends and relatives, is like a scare-crow in an agricultural field

328
తాము తిరుగుభూమి క్షామపీడితమైన పొరుగు దేశమునకు జరుగవలయు కొలనటెండిపోవ గొక్కెరలుండునా ? వి. వే.

తాము తిరుగుభూమి క్షామపీడితమైన
పొరుగు దేశమునకు జరుగవలయు
కొలనటెండిపోవ గొక్కెరలుండునా?
వి. వే.

తమ దేశమునకు కరవు ఏర్పడినచో పొరుగు దేశమునకు పోవలెను . ఎండిన కొలనువద్ధ కొంగలు ఉండవు కదా!

When one's country is afflicted with famine, one should emigrate to a neighboring country. Cranes won't frequent a dry lake.

329
తిరిపేగాడైనను తీరిపెమెత్తినయట్టి తిరిపెమందె తాను తిరిపెమిడిన తిరిపెము తిరిపెమున దిగబడిపోవురా , వి. వే.

తిరిపేగాడైనను తీరిపెమెత్తినయట్టి
తిరిపెమందె తాను తిరిపెమిడిన
తిరిపెము తిరిపెమున
దిగబడిపోవురా , వి. వే.

బిచ్చగాడైనను తన బిచ్చములో ఇంకొకనికి బిచ్చము పెట్టిన ఆ బిచ్చము తగ్గిపోవును కదా! ధనికును ధనమును ఇతరులకు ఇచ్చిన తగ్గిపోవును .

When a beggar offers his food to another beggar his share will lessen. Similarly when a rich person gives alms to others he will end up with less wealth.

330
తీపికెల్లదీపి తెలియంగ ప్రాణంబు ప్రాణవితతికన్న పసిడి తీపి పసిడికంటె మిగుల పడతి మాటలు తీపి , వి. వే.

తీపికెల్లదీపి తెలియంగ ప్రాణంబు
ప్రాణవితతికన్న పసిడి
తీపి పసిడికంటె మిగుల పడతి
మాటలు తీపి , వి. వే.

తీపి వస్తువులలో ప్రాణము గొప్పది . దాని కంటె ధనము గొప్పది . దానికంటె ప్రియురాలి మాట ఎక్కువ తీపి .

Among all the sweet objects, one's life is the sweetest. Wealth is sweeter than that. A lover's word is the most sweetest.

331
తోటకూరకైన దొగ్గలికైనను తవిటికుడుముకైన దవుడుకైన కావ్యములను జెప్పు ఘనులెట్లు ధనికులు ? వి. వే.

తోటకూరకైన దొగ్గలికైనను తవిటికుడుముకైన
దవుడుకైన
కావ్యములను జెప్పు ఘనులెట్లు
ధనికులు ? వి. వే.

తోటకూరకు దొగ్గలికూరకు తవిటి కుడుమునకు తవుడునకు కవిత్వము చెప్పువారికి ధనమెట్లు వచ్చును?

How can one earn money by reciting poems to a green plant and cooked food?

332
దశగలారినెల్ల దనబంధువులటంచు దశయ లేమినెంత్రు తక్కువగను దశయనగను ధనదశయొప్పు నొక్కటే , వి. వే.

దశగలారినెల్ల దనబంధువులటంచు
దశయ లేమినెంత్రు తక్కువగను
దశయనగను ధనదశయొప్పు
నొక్కటే , వి. వే.

దశ అనగా ధనముండుట. ధనము ఉన్నచో తన బంధువులని , లేనిచో బంధువులు కారని తలంతురు. ఇది ధన మహిమ .

An ascending phase in life means having more money. A person will consider rich people as his relatives and otherwise not. It is the miracle of money.

333
దశయనంగ మెండు ధనముండుటేయండ్రు కూడు నిద్రలేక కుందుటయె కద!

దశయనంగ మెండు ధనముండుటేయండ్రు

కూడు నిద్రలేక
కుందుటయె కద
రాగముండబోవ బాగుగా నేడ్పి౦చు , వి. వే.

ధనము కల్గుటయే దశ యందురు . దానిని కాపాడుటకు తిండి నిద్ర మాని మానవుడు బాధపడును . ధనముపై ఉండు ప్రేమ బాగుగా ఏడ్పి౦చును

An ascending phase in life is having money. One loses sleep and meal to safeguard his wealth and as a result suffers. Love of wealth will contribute to a person's unhappiness.

334
దానములనుజేయు ధర జేతులాడక బహుధనంబు గూర్చి పాతిపెట్టి తుదకు దండుగనిడి మొదలచెడు నరుండు , వి. వే.

దానములనుజేయు ధర జేతులాడక
బహుధనంబు గూర్చి పాతిపెట్టి
తుదకు దండుగనిడి మొదలచెడు
నరుండు , వి. వే.

మానవుడు ఎక్కువ ధనము కూడబెట్టి ఇతరులకీయక నేలలో పాతిపెట్టి దండుగ ఖర్చుపెట్టి పూర్తిగా చెడిపోవును .

A person who accumulates wealth, won't give it to others, buries it underground and spends it on frivolous things, will totally degenerate.

335
దినము మూడుమార్లు తిని నిదిరించుచు సొగసుచనులవారి సొంపుతోడ చేరుచుండి ధనము చెరుపకుమెప్పుడు , వి. వే.

దినము మూడుమార్లు తిని నిదిరించుచు
సొగసుచనులవారి సొంపుతోడ
చేరుచుండి ధనము చెరుపకుమెప్పుడు,
వి. వే.

దినమునకు మూడుసార్లు తిని హాయిగా నిద్రపోవుచు అందగత్తెలను చేరి నీ ధనమును నశింపజేయకుము

Don't dwindle your wealth by eating 3 meals a day and running around beautiful women.

336
దేశదేశములను తేటయజేయగ దేవుడు ఆత్మలోన నుండు నణగి పెణగి వేసమరసి చూడ గ్రాసంబు కొఱకయా , వి. వే.

దేశదేశములను తేటయజేయగ దేవుడు
ఆత్మలోన నుండు నణగి
పెణగి వేసమరసి చూడ గ్రాసంబు
కొఱకయా , వి. వే.

దేవుడు తన ఆత్మలోనే ఉండగా , దేశదేశములకు తిరుగుట ఎందుకు?పొట్టగూటికే కదా!

When God is within us, why roam around the land if only for livelihood?

337
దోసకారియైన దూసరికాడైన బగతుడైన వేద బాహ్యుడైన ధనికు నెల్లవారు తనియింపుచుందురు , వి. వే.

దోసకారియైన దూసరికాడైన
బగతుడైన వేద బాహ్యుడైన
ధనికు నెల్లవారు తనియింపుచుందురు,
వి. వే.

ధనికుడు తప్పు చేసినను , చెడ్డవాడైనను, విరోధియైనను, నిందితుడైనను సరే ; అతనినే జనులు తృప్తిపరతురు

If a rich person makes mistakes, is a characterless person or an enemy or an accused, people still try to appease to him.

338
ద్రోహబుద్ధినైన దొంగఱికమునైన సటలనైన సాహసముననైన సంపాదధికువలన సాధింపదగుటొప్పు, వి. వే.

ద్రోహబుద్ధినైన దొంగఱికమునైన
సటలనైన సాహసముననైన
సంపాదధికువలన సాధింపదగుటొప్పు,
వి. వే.

ద్రోహము చేసియైనను , దొంగలించియైనను , మోసగించియైనను , సాహసించియైనను ధనికునినుండి ధనము తీసికొనవచ్చును . శంకింపనక్కరలేదు .

One can extract money from a rich man by being treacherous, a thief, a cheat, or a risk-taker.

339
ధనములేకయున్న ధైర్యంబు చిక్కదు ధైర్యమొదవదేని ధనమొదవదు ధనము ధైర్యమరయదగు భూమి నరులకు , వి. వే .

ధనములేకయున్న ధైర్యంబు చిక్కదు
ధైర్యమొదవదేని ధనమొదవదు
ధనము ధైర్యమరయదగు
భూమి నరులకు , వి. వే .

ధనము లేనిచో ధైర్యముండదు . ధైర్యము లేనిచో ధనము రాదు . కావున ధన ధైర్యములు రెండునూ ఉండవలెను .

When one has no money, one is fearful. Without boldness one can't earn money. So one needs both money and fearlessness to be rich.

340
ధనములేమి గుణము తక్కువపడవచ్చు ధనములేమి కీర్తి తొలగిపోవు ధనము లేమి శుచిని తగబుట్టనీయదు , వి. వే.

ధనములేమి గుణము తక్కువపడవచ్చు
ధనములేమి కీర్తి తొలగిపోవు
ధనము లేమి శుచిని
తగబుట్టనీయదు , వి. వే.

దారిద్ర్యమువలన గుణము తగ్గిపోవును , కీర్తి నశించును , పరిశుద్ధత నశించును .

One loses character, fame, and cleanliness by being indigent.

341
ధనములేని పేద తండ్రి గర్భంబున భాగ్యపురుషుడొకడు పరగబుట్టి బహుళధనముగూర్చు భద్రంబులొనగూర్చు , వి. వే.

ధనములేని పేద తండ్రి గర్భంబున
భాగ్యపురుషుడొకడు పరగబుట్టి
బహుళధనముగూర్చు భద్రంబులొనగూర్చు,
వి. వే.

దరిద్రులకు పుత్రుడై పుట్టినవాడు శ్రీమంతుడైనచో అది వాని పూర్వజన్మ పుణ్యఫలమనియే చెప్పవలెను .

When one born in an indigent family turns out to be rich, it is because of the good karma in the previous birth.

342
ధనములేమి యనుట దావానలంబగు దన్నుజెఱచు మీఱి దాపుజెఱుచు ధనములేని మదిని తలపగా బాపబు , వి. వే.

ధనములేమి యనుట దావానలంబగు
దన్నుజెఱచు మీఱి దాపుజెఱుచు
ధనములేని మదిని
తలపగా బాపబు , వి. వే.

దరిద్రము గొప్ప పాపము . అది కార్చిచ్చువలె తన్ను నశింపజేయుటయేకాక ప్రక్కనున్నవారినికూడ చెరచును .

Indigence is a great sin. It destroys, like wild-fire oneself as well as others attached to him.

343
ధనములేమి సుతులు తప్పుల నిడుదురు ధనములేమి పత్ని తాకనీదు ధనములే మెవనికి తాళిక నీయదు , వి. వే.

ధనములేమి సుతులు తప్పుల
నిడుదురు ధనములేమి పత్ని
తాకనీదు ధనములే మెవనికి
తాళిక నీయదు , వి. వే.

ధనము లేనియెడల పుత్రులు నిందింతురు. భార్య దగ్గరకు రానివ్వదు . లేమీచే ఓరిమి నశించును .

Without money, sons will blame their father and wife won't endear to him. With poverty tolerance is diminished.

344
నక్క వినయములను నయగారములబల్కి కడకు ధనముగూర్ప గడగుచుండ్రు కుక్కబోనువాత గూడు చల్లినయట్లు , వి. వే.

నక్క వినయములను నయగారములబల్కి
కడకు ధనముగూర్ప గడగుచుండ్రు
కుక్కబోనువాత గూడు
చల్లినయట్లు , వి. వే.

కుక్కను లొంగదీసుకొనుటకు దాని బోనువద్ద మెతుకులు చల్లినట్లు ధనమును సంపాదించుటకై జనులు నక్కవినయములు చూపి తీపిమాట లాడుదురు .

To subjugate a dog one offers food. People show false niceties and talk sweetly to earn money.

345
హరియనంగవచ్చు హరయనంగవచ్చు మేలువాని జూచి మెచ్చవచ్చు కొంగుకాసు విడిచి గొబ్బున నీరాదు , వి. వే.

హరియనంగవచ్చు హరయనంగవచ్చు
మేలువాని జూచి మెచ్చవచ్చు
కొంగుకాసు విడిచి గొబ్బున
నీరాదు , వి. వే.

హరి, హర అని భగవంతుని స్తుతింపవచ్చును . మంచివానిని మెచ్చుకొనవచ్చును . కాని, కొంగు ముడిని విప్పి ఒక కాసు (చిన్న నాణెము ) ను యివ్వకూడదు

One can worship Lord Vishnu or Lord Siva, appreciate a good person but never offer money to others when it is in scarcity.

346
పరగలేమిచేత బంధువుల్ పగవారు పరగ లేమిచేత పరము తప్పు పరగ లేమిచేత పరపతియును దప్పు , వి. వే.

పరగలేమిచేత బంధువుల్ పగవారు
పరగ లేమిచేత పరము
తప్పు పరగ లేమిచేత పరపతియును
దప్పు , వి. వే.

దరిద్రునికి తన బంధువులే విరోధులగుదురు . వానికి పరమున ఉత్తమ లోకము తప్పిపోవును . పరపతియు నశించును . అనగా ఎవ్వరు అప్పీయరు .

One's relatives will turn into enemies when in poverty. He will not go to heaven. There will be loss of character. And no one will loan money to him.

347
పాగ పచ్చడంబు పైగుబుసంబును పోగులుంగరములు బొజ్జకడుపు కలిగినట్టివాని గందురు చుట్టాలు , వి. వే.

పాగ పచ్చడంబు పైగుబుసంబును
పోగులుంగరములు బొజ్జకడుపు
కలిగినట్టివాని గందురు
చుట్టాలు , వి. వే.

తలపాగ , అంగీ , వల్లెవాటు వస్త్రము , పోగులు , ఉంగరములు , బొజ్జ ఉన్నవాడు (ధన్యవంతుడైనచో) బంధువు లతనినే చేరుదురు .

When a rich man has turban, expensive clothes, golden ear-rings and a big paunch, relatives flock around him.

348
పాపపుణ్యములను బసిగాపెఱుంగునా ? ధరను పరమయోగి యెఱుగుగాక పసిడి పొందికగని బాగుగాగూర్చుము , వి. వే.

పాపపుణ్యములను బసిగాపెఱుంగునా?
ధరను పరమయోగి యెఱుగుగాక
పసిడి పొందికగని బాగుగాగూర్చుము,
వి. వే.

ఇది పాపము , ఇది పుణ్యము అని యోగికి తెలియును గాని పశుల కాపరికి తెలియునా ? అట్లే ధనము సంగతి సంపాదించు వానికే తెలియను . (ధనము మిక్కిలి అవసరము).

A yogi can discriminate between good and bad. Will a cow-herder know that? Similarly a rich man knows how to earn money.

349
పాల సాగరమున పవ్వళించిన హరి గొల్లపల్లెపాలు కోరేనేల ? ఎదుటివారిద్రవ్య మెల్లవారికి దీపి , వి. వే.

పాల సాగరమున పవ్వళించిన హరి
గొల్లపల్లెపాలు కోరేనేల?
ఎదుటివారిద్రవ్య మెల్లవారికి
దీపి , వి. వే.

పాలసముద్రముపై పవ్వళించిన శ్రీహరికి వ్రేపల్లెలోని పాలు కావలసి వచ్చెను . ఎదుటవారి సొమ్ముపై ఆశ లేనివారెవరు ?

The Lord who sleeps on ocean of milk had incarnated himself as a cow-herder for the love of milk. Is there a person who doesn't desire his neighbor's wealth?

350
పుత్తడి గలవాని పుండుబాధయు గూడ వసుధలోన జాల వార్తకెక్కు పేదవాని యింట పెండ్లైన నెఱుగరు , వి. వే .

పుత్తడి గలవాని పుండుబాధయు
గూడ వసుధలోన జాల వార్తకెక్కు
పేదవాని యింట పెండ్లైన
నెఱుగరు , వి. వే .

పేదవాని యింటిలో పెండ్లి అయినను ఎవ్వరికి తెలియక పోవచ్చును . కాని , ధనవంతుని పుండు పుట్టినను అందరికి తెలిసిపోవును .

One may not know about a marriage performed by a poor man but always knows about the ill-health of a rich person.

351
పూర్వజన్మమందు పుణ్యంబుచేయని పాపి తా ధనంబు బడయలేడు విత్తమఱచి కోయ వెదకిన చందంబు , వి. వే.

పూర్వజన్మమందు పుణ్యంబుచేయని
పాపి తా ధనంబు బడయలేడు
విత్తమఱచి కోయ వెదకిన
చందంబు , వి. వే.

వెనుక జన్మలో పుణ్యము చేయక ఇపుడు ధనమెట్లు వచ్చును ? విత్తుటను మరచి , పంట కాశపడిన ప్రయోజనమేమి ?

Without performing good karma in the previous birth, how can one be rich? Without planting seed, looking forward to a crop is futile.

352
పూసపోగుపసిడి పుట్టంబు విద్యయు కాయపుష్టి చాలగలిగెనేని కానికులజుడైన ఘనుడని రమ్మంద్రు , వి. వే.

పూసపోగుపసిడి పుట్టంబు విద్యయు
కాయపుష్టి చాలగలిగెనేని
కానికులజుడైన ఘనుడని
రమ్మంద్రు , వి. వే.

విలువైన నగలు , బట్టలు ధరించి , కాయపుష్టి కలవాడు నీచకులమువాడైనను మిక్కిలి గౌరవింపబడును

Even a low-caste person will be respected when he wears jewelry, expensive clothes and has robust physique.

353
ప్రాప్తిగల్గుచోట ఫలమిచ్చు దైవంబు ప్రాప్తిలేనిచోట ఫలములేదు ప్రాప్తిలేక పసిడి పరమాత్ముడు ఇచ్చునా? వి. వే.

ప్రాప్తిగల్గుచోట ఫలమిచ్చు దైవంబు
ప్రాప్తిలేనిచోట ఫలములేదు
ప్రాప్తిలేక పసిడి పరమాత్ముడు
ఇచ్చునా? వి. వే.

మనకు ప్రాప్తమున్నయెడల దైవము ఫలము ఇచ్చును . లేనిచో రాదు . ప్రాప్తము లేనిచో దేవుడును ఈయలేడు .

When one has luck, God will grant wealth. Without luck, even God won't bless with riches.

354
మగని కలిమిబలిమి మగువకును బలంబు కలిమిలేని మగడు కాసుకాడు పనికిరాని మగని పాటించి చూడదు , వి. వే.

మగని కలిమిబలిమి మగువకును
బలంబు కలిమిలేని మగడు కాసుకాడు
పనికిరాని మగని పాటించి
చూడదు , వి. వే.

భర్త ధనవంతుడైననే గృహిణికి బలము. లేనిచో కాసుకూడ విలువ చేయడు . అతనిని భార్యకూడ లెక్క చేయదు .

A wife feels secure when her husband is wealthy. If not, she won't care for him.

355
లేమి కల్గు వాడి కేమేలు చేసిన కలిసిరాదు ఫలము కాసుగూడ కలిమి కల్గుచోట దులతూగుచుండును , వి. వే.

లేమి కల్గు వాడి కేమేలు
చేసిన కలిసిరాదు ఫలము కాసుగూడ
కలిమి కల్గుచోట దులతూగుచుండును,
వి. వే.

దరిద్రుడు ఏ మేలు చేసినను అది లెక్కలోనికి రాదు . ధనమున్నచో అన్ని మేళ్ళును లెక్కకు వచ్చును .

When a poor man performs a kind act it is not recognized. With wealth all good acts get recognition.

No comments:

Post a Comment