361
అల్పబుద్ధివానికి అధికారమిచ్చిన దొడ్డవారినెల్ల తొలగగొట్టు చెప్పుతినెడి కుక్క చెఱకు తీపెఱుగునా ? వి. వే.
అల్పబుద్ధివానికి అధికారమిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగగొట్టు
చెప్పుతినెడి కుక్క చెఱకు
తీపెఱుగునా ? వి. వే.
దుష్టుడు అధికారియైనయెడల , వాడు మంచివారిని తరిమివేయును . చెప్పుతిను కుక్కకు చెరకురుచి ఏమి తెలియును ?
A bad manager will drive away good workers. How can a dog know the taste of sugarcane?
362
అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను సజ్జనుండు పల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా , వి. వే.
అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను
సజ్జనుండు పల్కు చల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు
మ్రోగునా , వి. వే.
దుష్టుడు ఆర్భాటముగా మాటలాడును . మంచివాడు మెల్లగా పల్కును . కంచు కంగున ధ్వని చేయును . బంగారము ధ్వనింపదు .
A bad person talks flamboyantly. A good person is soft. Brass makes more sound than gold.
363
అదికారణముల అల్పుడెట్టు ఎఱుంగు ? చెప్పలేడుగాని తప్పుబట్టు త్రోయనేర్చు కుక్క దొంతులు పెట్టునా , వి. వే.
అదికారణముల అల్పుడెట్టు ఎఱుంగు?
చెప్పలేడుగాని తప్పుబట్టు
త్రోయనేర్చు కుక్క దొంతులు
పెట్టునా , వి. వే.
ఉత్తములు చేయు సత్కార్యములకు కారణములను అల్పుడు తెలిసికొనలేడు . తప్పులు పట్టుట మాత్ర మెరుగును . కుక్క కుండ దొ౦తులను త్రోయగలదేకాని తిరిగి పేర్చలేదు కదా!
A low-life won't understand the importance of good acts done by people. He can only point out their flaws. A dog can knock-off a stack of pots but can't put them back.
364
ఆలమెఱుగు యోధుడు అల్పుని చేరిన మార్పుచేత బుద్ధి మరిగి తిరుగు మ్రానుమ్రాను తిరుగు మర్కట రీతిని , వి. వే.
ఆలమెఱుగు యోధుడు అల్పుని చేరిన
మార్పుచేత బుద్ధి మరిగి
తిరుగు మ్రానుమ్రాను తిరుగు
మర్కట రీతిని , వి. వే.
యుద్ధవీరుడు నీచుని చేరినచో , బుద్ధి మారుచుండును . అది కొమ్మ కొమ్మకును ఎగురు కోతివంటి దగును .
When a warrior makes friendship with a low-life it will alter his character. It's like a monkey jumping from branch to branch.
365
ఇచ్ఛకంబులాడు నిందీవరాక్షులు మచ్చరంబు మాని మాన్యుజేరి తుఛ్చగుణము విడక దూరుచునుందురు , వి. వే.
ఇచ్ఛకంబులాడు నిందీవరాక్షులు
మచ్చరంబు మాని మాన్యుజేరి
తుఛ్చగుణము విడక దూరుచునుందురు,
వి. వే.
దుష్టస్త్రీలు ఇచ్చకములు పల్కి , పురుషుని వశము చేసికొని , ఆ పిదప వానినే నిందించుచుందురు
Characterless women talk sweet words and dominate the men. Then they blame them.
366
ఇనుము విఱగెనేని యినుమాఱు ముమ్మాఱు కాచి యతుకనేర్చు కమ్మరీడు మనసు విఱిగెనేని మఱియంట నేర్చునా? వి. వే.
ఇనుము విఱగెనేని యినుమాఱు
ముమ్మాఱు కాచి యతుకనేర్చు
కమ్మరీడు మనసు విఱిగెనేని
మఱియంట నేర్చునా? వి. వే.
ఇనుప వస్తువు విరిగిన రెండుమూడు సార్లు కాచి దానిని అతుకవచ్చును . మనస్సు విరిగినచో మరి అతుకబడదు .
When an object made of iron breaks, it is possible to fix it. But not a broken heart
367
ఎంత సేవచేసి యేపాటు పడినను రాచమూక నమ్మరాదురన్న ! పాముతోడిపొందు పదివేలకైనను , వి. వే.
ఎంత సేవచేసి యేపాటు పడినను
రాచమూక నమ్మరాదురన్న!
పాముతోడిపొందు పదివేలకైనను,
వి. వే.
ఎంత సేవించి శ్రమపడినను రాజులకు విశ్వాసముండదు . వారిని నమ్మరాదు . వారితోడి పొత్తు పాము పొత్తువంటిది .
No matter how well one serves a king, there is no loyalty for the king. One should not trust royalty. Their friendship is like that of a snake.
368
ఎద్దుకన్న దున్న యేలాగు తక్కువ ? వివరమెఱిగి చూడు వృత్తియందు నేర్పులేనివాని నెఱయోధుడందురా , వి. వే.
ఎద్దుకన్న దున్న యేలాగు తక్కువ?
వివరమెఱిగి చూడు వృత్తియందు
నేర్పులేనివాని
నెఱయోధుడందురా , వి. వే.
ఎద్దు, దున్న ఒక్కరీతిపనినే చేయుచున్నను , ఆ పనిలో భేదమున్నది . అట్లే నేర్పులేనివాడు గొప్ప యోధుడనిపించుకొనలేడు
An ox and a male buffalo even though perform the same task there is a difference in their execution. An unskilled worker can't be called a great person.
369
ఎఱుకమాలువాడికేమేవి చదివిన చదివినంతసేపె సద్గుణియగు కదిసి తామరందు కప్ప కూర్చున్నట్లు , వి. వే.
ఎఱుకమాలువాడికేమేవి చదివిన
చదివినంతసేపె సద్గుణియగు
కదిసి తామరందు కప్ప కూర్చున్నట్లు,
వి. వే.
జ్ఞానహీనుడు చదువుచున్నంతసేపే బుద్ధిమంతుడుగా ఉండును . తామరాకుపై ఉన్నంతసేపే కప్ప బుద్ధిగా ఉండును .
A dunce behaves well for as long as he is a student. Just as a frog behaves when on a lotus leaf.
370
ఒకరి నోరుకొట్టి యొకరు భక్షించిన వాని నోరు మిత్తి వరుసగొట్టు చేపపిండు పెద్ద చేపలు చంపును చేపలన్ని జనుడు చంపు వేమ !
ఒకరి నోరుకొట్టి యొకరు భక్షించిన
వాని నోరు మిత్తి వరుసగొట్టు
చేపపిండు పెద్ద చేపలు చంపును
చేపలన్ని జనుడు చంపు వేమ
చిన్నవానిని పెద్దవారు మోసగించిన , వారిని దేవుడు శిక్షించును . చిన్న చేపలను పెద్ద చేపలు తినగా, వానిని జనులు తినుచున్నారు గదా!
When an adult cheats a child, God will punish him. The big fish eat small fish but people eat the big fish.
371
ఎడ్డెవానికి గురుతోర్చీ చెప్పినగాని తెలియబడునె ఆత్మ తెలివిలేక చెడ్డ కొడుకు తండ్రి చెప్పిన వినడయా ! వి. వే.
ఎడ్డెవానికి గురుతోర్చీ చెప్పినగాని
తెలియబడునె ఆత్మ తెలివిలేక
చెడ్డ కొడుకు తండ్రి
చెప్పిన వినడయా ! వి. వే.
బుద్ధిలేనివాని కెంత చెప్పినను తల కెక్కదు . చెడ్డ కొడుకు తండ్రి చెప్పిన మాట వినడు కదా !
A person without character won't listen to good advice even when it comes from his father
372
కండ చక్కెఱయును గలియు బాల్పోసిన తఱిమి పాము తన్ను దాకుగాదె ? కపటమున్నవాని కన్పెట్టవలె సుమీ! వి. వే.
కండ చక్కెఱయును గలియు బాల్పోసిన
తఱిమి పాము తన్ను దాకుగాదె?
కపటమున్నవాని కన్పెట్టవలె
సుమీ! వి. వే.
చక్కెర కలిపి , పామునకు పాలు పోసినను కరవవచ్చును . కపటమున్నవాడు అట్టివాడే ; జాగ్రత్తగా ఉండవలెను .
One can feed a snake sweet milk. Despite that a snake can bite. So does a deceitful person.
373
కల్ల నిజముజేసి కపటభావముజెంది ప్రల్లదంబులాడు భక్తిలేక మాయలాడు ఖలుడు మహితాత్ముసాటియా , వి. వే.
కల్ల నిజముజేసి కపటభావముజెంది
ప్రల్లదంబులాడు భక్తిలేక
మాయలాడు ఖలుడు మహితాత్ముసాటియా,
వి. వే.
మోసాగాడైన దు రాత్ముడు కపటమున అసత్యమును సత్యముగా చేసి, పెద్దలను నిందించును .
A cheat morphs lies into truth and blames the elderly
374
కలియుగంబునందు ఘనతకు నైచ్యము ఘనత నైచ్యమునకు కలుగుచుండు శ్రద్ధ భక్తులుడిగి జనులంద్రు కావున , వి. వే.
కలియుగంబునందు ఘనతకు నైచ్యము
ఘనత నైచ్యమునకు కలుగుచుండు
శ్రద్ధ భక్తులుడిగి జనులంద్రు
కావున , వి. వే.
కలియుగమున జనులకు భక్తి శ్రద్ధలు లేనందున తక్కువది గొప్పదగును , గొప్పది హీనమగును .
In the present era (kaliyug) because people don't have faith, an unworthy matter or person becomes great and vice-versa
375
కలువపూలవంటి కన్నులుండిననేమి ? చిలుక పలుకులట్లు పలుకనేమి ? తెలివి బలిమి గల్గి తేజరిల్లిననేమి ? తులువ గామి నలరు నెలత వేమ !
కలువపూలవంటి కన్నులుండిననేమి ? చిలుక
పలుకులట్లు పలుకనేమి ? తెలివి
బలిమి గల్గి తేజరిల్లిననేమి?
తులువ గామి నలరు నెలత వేమ
చక్కని కన్నులు కల్గి అందముగా నున్నను , చిలుకవలె ఇంపుగా పల్కినను, తెలివితేటలున్నను స్త్రీ యోగ్యురాలుగా ఉన్నప్పుడే రాణించును . లేనిచో హీనురాలేయగును
A woman with beautiful face and sweet voice, in spite of intelligence, must be deserving to receive honor.
376
కల్లుకుండకెన్ని ఘనభూషణములిడ్డ అందులోని కంపు చిందులిడదె ? తులువ పదవిగొన్న తొలిగుణమేమగు ? వి. వే.
కల్లుకుండకెన్ని ఘనభూషణములిడ్డ
అందులోని కంపు చిందులిడదె?
తులువ పదవిగొన్న
తొలిగుణమేమగు ? వి. వే.
నీచునకు ఉన్నత పదవి ఇచ్చినను వాని చెడ్డ గుణము పోదు . కల్లుకుండ నెట్లు అలంకరించినను , లోని కల్లు కంపు పోదు .
A low-life granted a high post still harbors bad thoughts. A container holding alcohol (kallu), no matter how much it is decorated, won't lose its bad smell.
377
కల్లునీళ్ళు త్రాగి కడుపెద్దవారిలో చీరె విడిచి తిరుగు చెడునరుండు పనుల తీరు వెనుక పాతలు కట్టురా ! వి. వే.
కల్లునీళ్ళు త్రాగి కడుపెద్దవారిలో
చీరె విడిచి తిరుగు
చెడునరుండు పనుల తీరు వెనుక
పాతలు కట్టురా ! వి. వే.
కల్లు త్రాగి, చెడ్డవారితో చేరి అహంకరించిన చెడ్డవాడు అహంకారము పోయిన పిదప చింకిగుడ్డలే కట్టును .
One who drinks alcohol with bad company, after losing his pride, degenerates into indigence
378
కసినిగల్గి పాపకర్ముల పీడింతు రల్ల ప్రభులు యముని యల్లభటులు వృశ్చికంబుగన్న విడుతురే చంపక ? వి. వే.
కసినిగల్గి పాపకర్ముల పీడింతు
రల్ల ప్రభులు యముని
యల్లభటులు వృశ్చికంబుగన్న
విడుతురే చంపక ? వి. వే.
దుష్టులును రాజులు , నరకమున యమభటులు చలము పట్టి పీడింతురు . తేలును జనులు చంపక విడుతురా ?
A bad person will be punished by the king and then in hell. Will people leave a scorpion alive?
379
కానివానితోడ కలసి మెల౦గిన హానివచ్చు ఎంతవానికైన కాకిగూడి హంస కష్టంబు పొందదా ? వి. వే.
కానివానితోడ కలసి మెల౦గిన
హానివచ్చు ఎంతవానికైన
కాకిగూడి హంస కష్టంబు
పొందదా ? వి. వే.
చెడ్డవాని చెలిమి చేసిన హానియే కల్గును . కాకితో చేరిన హంస కష్టములనే పొందుచుండును . ప్రాణహానియు కల్గును .
Friendship with a low-life always leads to bad consequences. A swan in the company of a crow meets with ill consequences.
380
కులములోన ఒకడు గుణహీనుడుండిన కులముచెడును వాని గుణమువలన ఎలమి చెఱకునందు వెన్ను పుట్టినయట్లు , వి. వే.
కులములోన ఒకడు గుణహీనుడుండిన
కులముచెడును వాని గుణమువలన
ఎలమి చెఱకునందు వెన్ను
పుట్టినయట్లు , వి. వే.
వంశములో ఒక చెడ్డవాడు పుట్టిన ఆ వంశమే చెడును . చెఱకు చివర వెన్ను పుట్టిన , చెఱకు తీపియంతయు పోవును
When a person born in a dynasty turns into a scoundrel, it will destroy the dynasty. A sugar cane stick that has a bitter node will lose its sweetness
381
కుళ్ళుబోతునొద్ద గూడి మాటాడిన గొప్ప మర్మములను చెప్పరాదు పేరు తీరుదెల్ప ఊరెల్ల ముట్టించు , వి. వే.
కుళ్ళుబోతునొద్ద గూడి మాటాడిన
గొప్ప మర్మములను చెప్పరాదు
పేరు తీరుదెల్ప ఊరెల్ల
ముట్టించు , వి. వే.
ఖలునితో మాటలాడుట తటస్థి ౦చినపుడు రహస్య విషయములు చెప్పరాదు . చెప్పినచో ఊరెల్ల చాటును
One should not share secrets with a low-life. He will spread the word all over the town
382
కూళ కూళ్ళుమేయ గుణమంత చెడనాడి నెట్టివారు మెచ్చరట్టివాని కొయ్యదూలమునకు కుదురునా జ్ఞానంబు ? వి. వే.
కూళ కూళ్ళుమేయ గుణమంత చెడనాడి
నెట్టివారు మెచ్చరట్టివాని
కొయ్యదూలమునకు కుదురునా
జ్ఞానంబు ? వి. వే.
దుష్టుడు మన తిండి తిని మనలనే నిందించును . వానిని ఎవ్వరూ మెచ్చరు . కొయ్య దూలమునకు జ్ఞాన మెట్లు కలుగును ?
A bad person eats the food served and blames the host. No one praises him. A block of wood won't have any awareness.
383
కైపుమీఱువేళ కడకుజేరగరాదు అనువుదప్పి మాటలాడరాదు సమయమెఱుగనతడు సరసుండుకాడయా ? వి. వే.
కైపుమీఱువేళ కడకుజేరగరాదు
అనువుదప్పి మాటలాడరాదు
సమయమెఱుగనతడు సరసుండుకాడయా?
వి. వే.
బుద్ధిమంతుడు సమయము నెరిగి నడుచుకొనవలెను. కల్లు త్రాగి మత్తెక్కినవాని దగ్గరకు పోరాదు . అనువుతప్పి మాటలాడరాదు .
A good person should wait for a propitious time. He should not approach a drunkard. Nor should he talk loosely.
384
కొండగుహలనున్న కోవెలలందున్న మొ౦డుగాను బూది మెత్తియున్న దుష్టబుద్ధులకును దుర్బుద్ధి మానునా ? వి. వే.
కొండగుహలనున్న కోవెలలందున్న
మొ౦డుగాను బూది మెత్తియున్న
దుష్టబుద్ధులకును దుర్బుద్ధి
మానునా ? వి. వే.
దుష్టబుద్ధులు గుహలలో కూర్చున్నను , గుడులకు పోయినను , దట్టముగా విభూతి పూసినను వారి చెడ్డబుద్ధి మాఱనే మారదు .
A bad person despite retreating into caves, visiting temples, smearing holy ash all over his body, still remains as a person with bad character.
385
కొండముచ్చు పెండ్లి కోతి పేరంటాలు మొండివాని హితుడు బడవాడు దుండగీడునకును కొండెడు దళవాయి , వి. వే.
కొండముచ్చు పెండ్లి కోతి
పేరంటాలు మొండివాని హితుడు
బడవాడు దుండగీడునకును కొండెడు
దళవాయి , వి. వే.
కొండముచ్చు పెండ్లికి కోతి పేరంటాలైనట్లు , మొండివానికి బండవాడు మిత్రుడైనట్లు , దుర్మార్గునకు అబద్ధాలకోరు సహాయపడు చుండును .
A bad person gets bad advice from liars just as a team of monkeys assists in a gorilla's wedding or an intransigent person gets help from an inflexible person.
386
కోతిబట్టి తెచ్చి క్రొత్తపుట్టముగట్టి కొండమృచ్చులెల్ల కొలిచినట్లు నీతిహీనునొద్ద నిర్భాగ్యులు౦దురు , వి. వే.
కోతిబట్టి తెచ్చి క్రొత్తపుట్టముగట్టి
కొండమృచ్చులెల్ల కొలిచినట్లు
నీతిహీనునొద్ద నిర్భాగ్యులు౦దురు,
వి. వే.
కోతిని గౌరవించి కొండముచ్చులు సేవించినట్లు నీతిలేని వానిని నిర్భాగ్యులే ఆశ్రయించి ఉందురు .
A person without character is worshiped by unfortunate souls just as a monkey is served by gorillas.
387
కొండెగాడు చావ కొంపవాకిటికిని వచ్చిపోదురింతె వగపులేదు దూడ వగచునె భువి తోడేలు చచ్చిన ? వి. వే.
కొండెగాడు చావ కొంపవాకిటికిని
వచ్చిపోదురింతె వగపులేదు
దూడ వగచునె భువి తోడేలు
చచ్చిన ? వి. వే.
దుర్జనుడు చచ్చినయెడల , జనులు వాని యింట ముంగిట నుండియే తొంగిచూచి పోదురుగాని విచారింపరు . తోడేలు చచ్చినచో దూడ విచారించదు కదా !
When a bad person dies, no one will visit his casket. Just as when a wolf dies, the calf won't shed tears.
388
గంగపాఱుచుండ గదలని గతితోడ ముఱికివాగు పాఱు మ్రోతతోడ అధికుడోర్చునట్టు అధముడు ఓర్వగలేడు , వి. వే.
గంగపాఱుచుండ గదలని గతితోడ
ముఱికివాగు పాఱు మ్రోతతోడ
అధికుడోర్చునట్టు అధముడు
ఓర్వగలేడు , వి. వే.
గంగానది నెమ్మదిగా పారునుగాని మురికివాగు ధ్వనితో పారును . అట్లే అధికుడు ఆర్భాటాము చేయడు . అల్పుడే చేయును.
The holy river ganga flows silently but sewage flowing in a gutter makes too much noise. Just as a frivolous person talks trash when compared to a classy person.
389
గాడ్దెయేమెఱు౦ గంధపువాసన కుక్కయేమెరఱు౦గు గొప్ప కొద్ది అలపుడేమెఱు౦గు హరుని గొల్చు విరక్తు ? వి. వే.
గాడ్దెయేమెఱు౦ గంధపువాసన
కుక్కయేమెరఱు౦గు గొప్ప కొద్ది
అలపుడేమెఱు౦గు హరుని గొల్చు
విరక్తు ? వి. వే.
గాడిదకు గంధపు వాసన తెలియనట్లు , కుక్కకు ఎక్కువ తక్కువలు తెలియనట్లు అల్పునకు విరక్తుని గొప్పతనము తెలియదు .
A donkey cannot appreciate the fragrance of sandal wood. A dog won't know the difference between noble and ordinary persons. So doesn't a low-life who won't know the importance of a learned person
390
గుణికి భువిని విద్య గోరంత యబ్బిన కొండయగును వాని గుణముచేత కొండయ౦త విద్య గుణహీనుడు ఎఱుగడు , వి. వే.
గుణికి భువిని విద్య గోరంత
యబ్బిన కొండయగును వాని గుణముచేత
కొండయ౦త విద్య గుణహీనుడు
ఎఱుగడు , వి. వే.
ఉత్తముని విద్య కొంచెమైనను అతని గుణముచే అది గొప్పగా నగును . దుర్జనుడు కొండంత విద్యయున్నను గుర్తింపడు .
A person with character, even if less educated, becomes great. A low-life
with a number of academic achievements won't be recognized.
391
గుఱ్ఱమునకు తగిన గుఱుతైన రౌతున్న గుఱ్ఱములు నడచు గుఱుతుగాను గుర్తు దుర్జనులకు గుణములు ఇట్లు౦డురా ! వి. వే.
గుఱ్ఱమునకు తగిన గుఱుతైన రౌతున్న
గుఱ్ఱములు నడచు గుఱుతుగాను
గుర్తు దుర్జనులకు గుణములు
ఇట్లు౦డురా ! వి. వే.
రౌతు సరిగా ఉన్నచో గుర్రము సరిగా నడచును . దుర్జనుని శిక్షించిననే వాడు సరియైన దారికి వచ్చును .
A horse runs well under a proper rider when whipped. A low-life will not reform until punished
392
చంద్రునంతవాడె శాపంబు చేతను కళల హైన్యమంద కలిగె గదర !పుడమి జనులకెల్ల బుద్ధులు ఇట్లు ౦డురా ! వి. వే.
చంద్రునంతవాడె శాపంబు చేతను
కళల హైన్యమంద కలిగె గదర!
పుడమి జనులకెల్ల బుద్ధులు
ఇట్లు ౦డురా ! వి. వే.
మహాత్ములను గేలి చేసిన దుష్టులకు హాని తప్పదు . చంద్రు నంతవానికి శాపమువల్ల కళలు నశించిపోయినవి గదా!
A low-life making less of a noble person will eventually meet with fate. The moon god was known to have lost his resplendence when he made fun of Lord Vinayaka (the elephant head God).
393
చెట్టుచేమగొట్టి చుట్టు గోడలబెట్టి ఇట్టునట్టి పెద్ద యిల్లు కట్టి మిట్టిపడును నరుడు మీదిచేటెఱుగడు , వి. వే.
చెట్టుచేమగొట్టి చుట్టు గోడలబెట్టి
ఇట్టునట్టి పెద్ద యిల్లు
కట్టి మిట్టిపడును నరుడు
మీదిచేటెఱుగడు , వి. వే.
ఈ లోకము శాశ్వతమనుకొని దుష్టుడు పెద్దయిండ్లు కట్టి గర్వించును . పరలోకమున గల్గు చేటును గుర్తింపలేడు .
A corrupt person may build mansions and take pride in his wealth thinking this world is permanent.
In the nether world he will face the consequences.
394
చెఱకులోనబైని చెడ్డగుణంబున్న తీసివేయకున్న దినగబొసగ దంతిపురపుద్రోహి యాతడెట్లు౦డురా ? వి. వే.
చెఱకులోనబైని చెడ్డగుణంబున్న
తీసివేయకున్న దినగబొసగ
దంతిపురపుద్రోహి యాతడెట్లు౦డురా?
వి. వే.
చెరుకు గడపై పుప్పి ఉన్నచో దానిని తీసివేసినగాని తినలేము. అట్లే దుష్టుడైన అంతఃపుర ద్రోహిని వెంటనే తీసివేయవలెను . లేనిచో హాని కలుగును .
When a part of sugar cane is bitter, we can still eat it after removing the spoilt portion. Unlike a treasonous person who should be removed immediately to safeguard royal palace.
395
చదువులన్ని చదివి చాలవివేకియై కలుషచిత్తుడైన ఖలుని గుణము దాలిగుంటగుక్క తలచిన చందమౌ , వి. వే.
చదువులన్ని చదివి చాలవివేకియై
కలుషచిత్తుడైన ఖలుని
గుణము దాలిగుంటగుక్క
తలచిన చందమౌ , వి. వే.
కుక్కకు దాలిగుంటలో ఉన్నంతసేపే మంచి ఆలోచన . విద్వాంసుడు దుష్టుడైనచో మంచిబుద్ధి స్వల్పకాలమే ఉండును .
A dog rests comfortably, albeit temporarily, in a fire-less stove. When a learned person is of bad character, his good behavior lasts for a small time.
396
చంపగూడ దెట్టి జంతువునైనను చంపవలయు లోక శత్రుగుణము తేలుకొండిగొట్ట తేలేమిచేయురా ? వి. వే.
చంపగూడ దెట్టి జంతువునైనను
చంపవలయు లోక శత్రుగుణము
తేలుకొండిగొట్ట తేలేమిచేయురా?
వి. వే.
ఏ ప్రాణిని చంపకూడదు . హింసాగుణమును విడువవలెను . తేలు ముల్లు తీసివేసిన అదేమి చేయగలదు ? చెడ్డబుద్ధి మానవలె
One should not kill any life-form. When you remove the tail of a scorpion, sparing its life, it won't sting. One should give up bad qualities.
397
చంపదలచు రాజు చన వగ్గలంబిచ్చు చెఱుపనున్న పగఱచెలిమి చేయు గఱవనున్న పాము నెఱిగాచుకొనియుండు , వి. వే.
చంపదలచు రాజు చన వగ్గలంబిచ్చు
చెఱుపనున్న పగఱచెలిమి
చేయు గఱవనున్న పాము నెఱిగాచుకొనియుండు,
వి. వే.
కాటువేయదలచిన పాము కన్నములో పొంచియుండును . చంపదలచిన రాజు ఎక్కువ చనవిచ్చి విరోధితో స్నేహము చేయును
A snake intending to bite will wait for the prey. A king is lenient and makes friendship before striking his enemy.
398
చర్దిపుట్టినపుడు సాపడసైపదు నాతిగన్న అపుడు నీతి తగదు చేటు మూడినపుడు మాటలు తోచవు , వి. వే.
చర్దిపుట్టినపుడు సాపడసైపదు
నాతిగన్న అపుడు నీతి
తగదు చేటు మూడినపుడు
మాటలు తోచవు , వి. వే.
వాంతి వచ్చినపుడు అన్నము హితము కాదు . యువతి కన్పడిన నీతి మరపునకు వచ్చును . చేటుకాలమున తప్పుకొనుట తోచదు
When one is sick, one can't enjoy food. When one sees a girl, one forgets morals. Ill fate is unavoidable.
399
జెట్టి సాముచేసి క్షితిలోన బేరెత్త దుష్టచింతచేత తొలగు తెలివి కష్టమెంతగాని కడతేఱుటా లేదు , వి. వే.
జెట్టి సాముచేసి క్షితిలోన
బేరెత్త దుష్టచింతచేత తొలగు
తెలివి కష్టమెంతగాని
కడతేఱుటా లేదు , వి. వే.
దుష్ట చింత కూడదు. జెట్టివాడు సాముచేసి పేరు పొందినను చెడ్డ ఆలోచనవలన తెలివి రాణింపక పడిన శ్రమ వ్యర్థమగును
One should not revel in bad thoughts. A wrestler who achieves fame with his strength, will lose it under bad behavior leaving his entire effort a waste
400
జంకులేని మదిని జగదీశు నుంచిన మంకుబుద్ధి మాని మట్టుపడును పంకమందు పురుగు పడి దొర్లుచుండదా ? వి. వే.
జంకులేని మదిని జగదీశు నుంచిన
మంకుబుద్ధి మాని మట్టుపడును
పంకమందు పురుగు పడి
దొర్లుచుండదా ? వి. వే.
ద్రోహచింత విడిచి మనస్సులో భగవంతుని నిల్పిన చెడ్డబుద్ధి పోవును. బురదలో పురుగు పడినను దానికి బురద అంటదు .
When one focuses on God and meditates on him without bad thoughts, the bad behavior will vanish. A worm falling into a marsh is not affected by it.
401
జగడమాడుచుండు చాడీలకోరెపుడు సాధుజనుల మీఱి బాధపెట్టు యముడు తప్ప వెఱతు అందఱు వానికి, వి. వే .
జగడమాడుచుండు చాడీలకోరెపుడు
సాధుజనుల మీఱి బాధపెట్టు
యముడు తప్ప వెఱతు అందఱు
వానికి, వి. వే .
చాడీలకో రెప్పుడును జగడమాడుచు , మంచివారిని బాధించుచుండును . వానికి యముడు తప్ప అందరు భయపడుదురు .
A tattletale often fights and hurts good people. Everyone is afraid of him except Yama, the God of death.
402
టక్కరులను గూడి యొక్కసక్కెములాడ నిక్కమైన ఘనుని నీతి చెడును ఉల్లి తోట పెరుగు మల్లెమొక్కకరణి , వి. వే.
టక్కరులను గూడి యొక్కసక్కెములాడ
నిక్కమైన ఘనుని నీతి
చెడును ఉల్లి తోట పెరుగు
మల్లెమొక్కకరణి , వి. వే.
ఉత్తముడు చెడ్డవారితో కలసి ఇతరుల నెకసక్కెమాడిన అతని ఘనత పోవును . ఉల్లితోటలో మల్లె మొక్క యున్న దాని గొప్పతనము నశించును గదా!
A good person loses integrity by befriending bad people. Just as jasmine loses its fragrance in an onion garden.
403
డెందమందు తలచు దెప్పరమెప్పుడు నోర్వలేనిహీను ఒరుని కట్టె తనకు మూడుసుమ్మి తప్పదెప్పటికైన , వి. వే.
డెందమందు తలచు దెప్పరమెప్పుడు
నోర్వలేనిహీను ఒరుని
కట్టె తనకు మూడుసుమ్మి తప్పదెప్పటికైన,
వి. వే.
అసూయాపరుడగు హీనుడు ఇతరులకు హానిని తలచిన యెడల ఎప్పటికైనను వానికే హాని కలుగక మానదు .
A jealous low-life contemplating on hurting others will meet with the same fate.
404
తనకుగలుగు పెక్కు తప్పులటుండగా పరులనేరుచు ౦డు నరుడు తెలియ దొడలెఱు౦గ డనుచు నొత్తి చెప్పగవచ్చు , వి. వే.
తనకుగలుగు పెక్కు తప్పులటుండగా
పరులనేరుచు ౦డు నరుడు
తెలియ దొడలెఱు౦గ డనుచు నొత్తి
చెప్పగవచ్చు , వి. వే.
తన తప్పులు నెరుగక ఇతరుల తప్పుల నెన్నువాడు ఒడలు తెలియక మాటలాడువాడని తప్పక చెప్పవచ్చును
One who is unaware of his own mistakes and pointing fingers at others, is one who is not conscious of his body.
405
తనకు మేలుచేయదా తెలియగ నేర్చు నెలమితోడ గుక్కయెఱుక భువిని తనకు మేలు చేయదా నెఱు ౦గగ వేమి మనుజుడెంత ఖలుడొ మహిని వేమ!
తనకు మేలుచేయదా తెలియగ నేర్చు
నెలమితోడ గుక్కయెఱుక భువిని
తనకు మేలు చేయదా నెఱు ౦గగ వేమి
మనుజుడెంత ఖలుడొ మహిని వేమ
సజ్జనుడు తనకు చేసిన మేలు మారువడు . కుక్కవంటిది మేలెరిగి విశ్వాసముతో నుండును . చేసిన మేలు మరచు దుర్జనుడు కుక్కకంటెను చాల హీనుడు
A good person will never forget the favor done to him by others. A dog is loyal to its master. A low-life is worse than a dog by forgetting the favors done to him by others.
406
తనర నృపతితోడ దగ దుర్జనునితోడ అగ్నితోడ పరుని ఆలితోడ హాస్యమాడుటెల్ల నగును ప్రాణాంతము , వి. వే.
తనర నృపతితోడ దగ దుర్జనునితోడ
అగ్నితోడ పరుని ఆలితోడ
హాస్యమాడుటెల్ల నగును
ప్రాణాంతము , వి. వే.
రాజుతోను , దుర్జనునితోను , నిప్పుతోను, పరస్త్రీతోను హాస్యమాడకూడదు . దానివల్ల ప్రాణాపాయము కలుగును .
One should not be flippant with a king, a bad person, fire, and a woman. He may lose his life.
407
తనయుడొదవె ననుచు దా బొంగుచుండును వాడు దుష్టుడైన గోడుగూర్చు తులువవాండ్రగూడి మెలగనీయగరాడు , వి. వే.
తనయుడొదవె ననుచు దా బొంగుచుండును
వాడు దుష్టుడైన గోడుగూర్చు
తులువవాండ్రగూడి
మెలగనీయగరాడు , వి. వే.
పుత్రుడు కలుగుట సంతోషమే . కాని వాడు దుష్టుడైనచో కష్టములు కలుగును . కాన వానిని చెడ్డవారితో చేరనీయరాదు
It is good to have a son. But if he turns out to be bad, then problems arise. One should keep his kids away from bad company.
408
తేలునకుండును తెలియగొండి విషంబు ఫణికినుండు విషము పండ్లయందు తెలివిలేనివాండ్ర దేహమెల్ల విషంబు , వి. వే.
తేలునకుండును తెలియగొండి విషంబు
ఫణికినుండు విషము పండ్లయందు
తెలివిలేనివాండ్ర దేహమెల్ల
విషంబు , వి. వే.
తేలుకు తోకయందు , పామునకు కోరలందు మాత్రమే విషముండును . కాని , ఖలునకు శరీరమంతయు విషమయము .
A scorpion's poison is confined to its tail. A snake's venom is restricted to its fangs. Whereas a bad person has poison all over his body.
409
తొత్తు తొత్తెగాని దొరసాని కాబోదు అరయుటింతె దానికైన ఫలము మిత్తికూళ్ళ దొంగ మేలు ఎట్లెఱుగురా ? వి. వే.
తొత్తు తొత్తెగాని దొరసాని
కాబోదు అరయుటింతె దానికైన
ఫలము మిత్తికూళ్ళ దొంగ మేలు
ఎట్లెఱుగురా ? వి. వే.
నీచు డెప్పుడును ఉత్తముడు కాలేడు . దాసి దాసియేగాని దొరసాని కాలేదు . చావుకూడుతిన నది ఎట్లు మేలైయుండును ?
A low-life cannot achieve fame. A servant maid cannot be the queen.
410
దిక్కులేనివారి దీనత బాపిన పురుషుడు ఇహమునందె పూజ్యుడగును పరమునందు వాని భాగ్యమేమనవచ్చు ? వి. వే.
దిక్కులేనివారి దీనత బాపిన
పురుషుడు ఇహమునందె పూజ్యుడగును
పరమునందు వాని భాగ్యమేమనవచ్చు?
వి. వే.
దిక్కులేనివారిని కాపాడినవాని కీ లోకముననే గౌరవము లభించుచుండగా , పరలోకము సంగతి వేరే చెప్పనేల ?
A person rescuing less-fortunate people receives honor both in this life and in heaven.
411
దాసరయ్య తప్పు దండంబుతో సరి మోసమేది తన్ను ముంచకున్న ? నీచుడై చెడునటు నీచుల నమ్మిన , వి. వే.
దాసరయ్య తప్పు దండంబుతో
సరి మోసమేది తన్ను ముంచకున్న?
నీచుడై చెడునటు నీచుల
నమ్మిన , వి. వే.
సేవకుడు తప్పు చేసినచో సజ్జనుడు క్షమించును . తప్పు ఒప్పుకొన్న చాలును . తనకు నష్టము లేకున్న చాలును . కాని నీచుడు తప్పును క్షమింపగోరినను క్షమించడు . దుష్టుల స్వభావ మీరీతి నుండును .
A good person forgives the errors of his servant as long as the servant confesses and there is no harm done. Whereas a low-life never forgives a servant who has done wrong.
412
దుండగీడు కొడుకు , కొండీడు చెలికాడు బండరాజునకును బడుగు మంత్రి కొండముచ్చునకును కోతియె సరియగు , వి. వే.
దుండగీడు కొడుకు , కొండీడు
చెలికాడు బండరాజునకును బడుగు
మంత్రి కొండముచ్చునకును
కోతియె సరియగు , వి. వే.
బండరాజునకు కొడుకు దుండగీడు . మిత్రుడు కొంటెగాడు . మంత్రి శక్తిలేనివాడు . కొండముచ్చుకు కోతికి సరిపడునట్లు – రాజునకు తగినవారే కుదిరిరి
A comic king's son will turn out to be a mischievous person. His friend will be equally mischievous.
His minister is powerless. It's like a monkey making friendship with a chimpanzee
413
దుష్టజనులు మీఱి తుంటరిపనులను శిష్టకార్యములుగ చేయుచుంద్రు కూడదనెడువారి గూడ నిందింతురు , వి. వే.
దుష్టజనులు మీఱి తుంటరిపనులను
శిష్టకార్యములుగ చేయుచుంద్రు
కూడదనెడువారి గూడ
నిందింతురు , వి. వే.
దుష్టులు చెడ్డ పనులు చేసి , అవి మంచివేయని యందురు . అట్టివి చేయకూడదని చెప్పువారిని తిట్టుదురు .
Bad people do bad things and rationalize them. When others condemn them, they talk back with abuse.
414
దూరదృష్టిగనరు తూగినదనుకను బాఱుపట్టెఱుగరు పడినదనుక దండసాధ్యులరయ ధర్మసాధ్యులుకారు , వి. వే.
దూరదృష్టిగనరు తూగినదనుకను
బాఱుపట్టెఱుగరు పడినదనుక
దండసాధ్యులరయ ధర్మసాధ్యులుకారు,
వి. వే.
దుష్టులు తమ తలపై పడినవరకు ఆలోచన చేయరు . పడిపోయినగాని , పరుగు పద్ధతి నెరుగరు . వారిని శిక్షించినగాని , మంచి మాటలకు లొంగరు
Bad people can't think ahead of the consequences. And don't know how to run without falling on the ground. Unless they are punished, they won't listen to good advice.
415
దొడ్డవాడననుచు దొరల దగ్గఱజేరి చాడి చెప్పు పాపజాతి నరుడు చాడి చెప్పువాడు సాయుజ్యమొ౦దునా ? వి. వే.
దొడ్డవాడననుచు దొరల దగ్గఱజేరి
చాడి చెప్పు పాపజాతి
నరుడు చాడి చెప్పువాడు సాయుజ్యమొ౦దునా?
వి. వే.
దుర్జనుడు సజ్జనునివలె నటించి రాజును ఆశ్రయించి ఇతరులపై చాడీలు చెప్పుచుండును . అట్టివాని కెన్నటికిని ముక్తిలేదు .
A bad person masquerading as a good person receives royal patronage and becomes a tatter tale. He will never attain salvation.
416
దొంగతనము వలన ద్రోహమెంతయుజేసి ఎవ్వరెఱుగకుండ నిముడుకొన్న తాముచేయు పనుల దగులుకోకుందురా ? వి. వే.
దొంగతనము వలన ద్రోహమెంతయుజేసి
ఎవ్వరెఱుగకుండ నిముడుకొన్న
తాముచేయు పనుల దగులుకోకుందురా?
వి. వే.
దుష్టుడు దొంగతనముచేసి ఏమియు ఎరుగనట్లున్నను తాను చేసిన తప్పునకు చిక్కుకొనక తప్పదు
A bad person might not confess to stealing and get away easily on the short-run, but never for too long.
417
ద్రోహియైనవాడు సాహసంబున నెట్టి స్నేహితునికినైన జెఱుపుచేయు ఊహ కలిగియుండు నోగుబాగులు లేక , వి. వే.
ద్రోహియైనవాడు సాహసంబున నెట్టి
స్నేహితునికినైన జెఱుపుచేయు
ఊహ కలిగియుండు నోగుబాగులు
లేక , వి. వే.
ద్రోహబుద్ధి కల దుర్జనుడు మంచి చెడ్డల నాలోచింపక తన మిత్రునకైన చెరుపుచేయు సమయమును నిరీక్షించుచుండును .
A bad person without thinking of consequences tries to hurt even his best friend.
418
నేరని జనులకును నేరముల్ నేర్పుచు చక్కచేయరిల నసాధులెపుడు ఒప్పు దుర్జనముల తప్పుగనెంతురు , వి. వే.
నేరని జనులకును నేరముల్ నేర్పుచు
చక్కచేయరిల నసాధులెపుడు
ఒప్పు దుర్జనముల తప్పుగనెంతురు,
వి. వే.
దుర్జనులు తెలియనివారికి గూడ తప్పు మార్గములు నేర్పుదురే కాని సరియైనదారి చూపరు . ఒప్పునుకూడ తప్పుగానే ఎంచుదురు .
A bad person misleads the people who trust him. He even condemns good acts.
419
నొసలు బత్తుడయ్యె నోరు తోడలయ్యె మనసు భూతమువలె మలయగాను శివునిగాంతు ననుచు సిగ్గేలగాదురా, వి. వే .
నొసలు బత్తుడయ్యె నోరు తోడలయ్యె
మనసు భూతమువలె మలయగాను
శివునిగాంతు ననుచు సిగ్గేలగాదురా,
వి. వే .
భూతమువంటి మనస్సుతో , తోడేలువంటి నోటితో ఉండి , విభూతి పెట్టుకొని శివభక్తుడనని చెప్పుకొను దుష్టునకు సిగ్గేల కలుగదో తెలియకున్నది
With a devil's heart, a hyena's smile, sacred ash all over the body, claiming to be Lord Siva's devotee, an evil person is shameless.
420
పట్టనేర్చుపాము పడగ నోరగజేయు జెఱుపజూచువాడు చెలిమిజేయు చంపదలచురాజు చనివచ్చుచుందురా , వి. వే.
పట్టనేర్చుపాము పడగ నోరగజేయు
జెఱుపజూచువాడు చెలిమిజేయు
చంపదలచురాజు చనివచ్చుచుందురా,
వి. వే.
కరువదలచిన పాము పడగను ఓరగా పెట్టును . చంపదలచినప్పుడే రాజు చనువిచ్చును . అట్లే దుష్టుడు చెరుపదలచినప్పుడే స్నేహము చేయును
When a snake is ready to bite it will reveal its hood. A king is lenient until he is ready to hang one. So is an evil person who befriends one only to spoil him
421
పరగ రాతిగుండు పగులగొట్టగవచ్చు కొండలన్ని పిండిగొట్టవచ్చు కఠినచిత్తు మనసు కరిగింపగారాదు , వి. వే.
పరగ రాతిగుండు పగులగొట్టగవచ్చు
కొండలన్ని పిండిగొట్టవచ్చు
కఠినచిత్తు మనసు
కరిగింపగారాదు , వి. వే.
రాతిగుండును పగులగొట్టుటయు, కొండలను పిండి చేయుటయు సులభమైనవి గావచ్చునే కాని , కఠిన చిత్తుని మనస్సును కరగించుట , దయ కలిగించుట మాత్రము సాధ్యము కాదు
It is possible to crush a stone and one can flatten the mountains. But it is impossible to transform a stone-hearted person into a kind person
422
పరుల తిట్టినంత పాప కర్మంబబ్బు విడువదెన్నటికిని విశ్వమందు పరుడు పరుడుగాడు పరమాత్మయౌనయా , వి. వే.
పరుల తిట్టినంత పాప కర్మంబబ్బు
విడువదెన్నటికిని విశ్వమందు
పరుడు పరుడుగాడు
పరమాత్మయౌనయా , వి. వే.
తనకంటె ఇతరుని పరమాత్మగనే భావింపవలెనుగాని తిట్టరాదు . తిట్టినచో ఆ పాప మెన్నటికిని పోదు
One should view others in a spiritual way. One should not abuse others. Otherwise, the sin will last for ever.
423
పరుల చదువు జూచి నిరసన బుద్ధితో వట్టిమాటలాడు వదరుబోతు అట్టి ఖలుని జాడలరయుట దోసము , వి. వే.
పరుల చదువు జూచి నిరసన బుద్ధితో
వట్టిమాటలాడు వదరుబోతు
అట్టి ఖలుని జాడలరయుట
దోసము , వి. వే.
ఇతరులు చదువుచుండగా తిరస్కార బుద్ధితో పొల్లు మాటలు పల్కు అధిక ప్రసంగినిగూర్చి తలపనే కూడదు
One should ignore a flippant person who makes fun of studious learners.
424
పాల్ నీడిగింట గ్రోలుచునుండిన మనుజులెల్ల చూచి మద్యమండ్రు నిలువదగిన చోట నిలువ నిందులుపుట్టు , వి. వే.
పాల్ నీడిగింట గ్రోలుచునుండిన
మనుజులెల్ల చూచి మద్యమండ్రు
నిలువదగిన చోట నిలువ
నిందులుపుట్టు , వి. వే.
పోగూడని చోటికి పోయినచో నింద వచ్చును . ఈడిగవాని యింటిలో పాలు త్రాగినను కల్లే యందురు.
One gets blamed for being at the wrong place at the wrong time. When one drinks milk in the bootlegger's house, he will be blamed for drinking alcohol.
425
పాలు పంచదార పాపరపండ్లలో చాలబోసి వండ జవికిరావు కుటిలమానవులకు గుణమేల కల్గురా , వి. వే.
పాలు పంచదార పాపరపండ్లలో
చాలబోసి వండ జవికిరావు
కుటిలమానవులకు గుణమేల
కల్గురా , వి. వే.
పాలు, పంచదార కలిపి పాపరపండ్లను వండిన , వాటి తీపి పోవుటే కాదు , నోట పెట్టలేము . అట్లే కుటిలునకు ఎంత బోధించినను మంచి గుణము కలుగదు .
No matter how much you cook bitter apple with milk and sugar, the bitterness won't go away.
So is a conceited person's character. One can't teach such a person to keep good character.
426
పురుషుడెంతయున్న పుట్టవు మొదలుగా పాపచింత జేయు పాపి నరుడు మహిని కుంటికుక్క మాంసము తిన్నట్లు , వి. వే.
పురుషుడెంతయున్న పుట్టవు మొదలుగా
పాపచింత జేయు పాపి
నరుడు మహిని కుంటికుక్క మాంసము
తిన్నట్లు , వి. వే.
దుష్టుడు పుట్టుకనుండి ధనికుడే అయినను చెడ్డ ఆలోచనలచే పాపియే అగును. కుక్క కుంటిదై చావ సిద్ధముగా ఉన్నను , దానికి మాంసముపై కోరిక పోనేపోదు
Even if an evil person is born in a rich family, he will be sinful for holding bad thoughts. A legless dog on the throes of death is always on the lookout for food
427
బిడియ మింతలేక పెద్దను నేనంచు బొంకములను బల్కు శంకఠునకు ఎచ్చు కలుగదిచట జచ్చిన రాదట , వి. వే.
బిడియ మింతలేక పెద్దను నేనంచు
బొంకములను బల్కు శంకఠునకు
ఎచ్చు కలుగదిచట
జచ్చిన రాదట , వి. వే.
నీచుడు సిగ్గులేక తాను పెద్ద మనుష్యుడనని చెప్పుకొనవచ్చును . కాని అతనికి మర్యాద ఇహపరములు రెంటను లేదు
A low-life shamelessly can claim to be a famous person. But he won't receive the honor on earth as well as in the nether world
428
బాసలాడనేర్చి పలుమోసములు చేసి గ్రాసమునకు భువిని ఖలుడవైతి దోసకారి ! నీకు దొరకునా మోక్షము ? వి. వే.
బాసలాడనేర్చి పలుమోసములు చేసి
గ్రాసమునకు భువిని ఖలుడవైతి
దోసకారి ! నీకు దొరకునా
మోక్షము ? వి. వే.
ఖలుడు పొట్టకయి ప్రతిజ్ఞలుచేసి , ఇతరులను మోసగించి కాలము గడుపును . వానికి మోక్షమెట్లు కలుగును?
An evil person cheats others and bides time with empty promises all for livelihood. How can he attain salvation?
429
మనసున కృపలేని మాలలకొడుకుల యొద్దజేరినట్టి యోగులెల్ల పందకొడుకు చెంచుపడుచుల చందమౌ , వి. వే.
మనసున కృపలేని మాలలకొడుకుల
యొద్దజేరినట్టి యోగులెల్ల
పందకొడుకు చెంచుపడుచుల
చందమౌ , వి. వే.
దయ అన్నది లేని నీచు లను యోగులు చేరరాదు . చేరిన పందను చెంచు పడతిని చేరినట్లు ఉండును .
A yogi should not befriend a low-life. If not, it will be like a coward joining hands with a bold tribal woman.
430
మాటలాడు టొకటి మనసులో నొక్కటి ఒడలిగుణ మదొకటి నడత యొకటి ఎట్లుకలుగు ముక్తి యిట్టులుండగ తాను? వి. వే.
మాటలాడు టొకటి మనసులో నొక్కటి
ఒడలిగుణ మదొకటి నడత యొకటి
ఎట్లుకలుగు ముక్తి యిట్టులుండగ
తాను? వి. వే.
దుర్జనులు చెప్పునదొకటి , చేయునదొకటి . మనస్సులో ఒకటి, నడతలో నొకటి . ఇట్టి నీచులకు ముక్తి యెట్లు అబ్బును?
Bad people say something and do something else. Their words differ from their actions. How can they attain salvation?
431
ముష్టి వేపచెట్టు మొదలుగా ప్రజలకు పరగ మూలికలకు పనికివచ్చు . నిర్దయుండు ఖలుడు నీచుడెందులకగు ? వి. వే.
ముష్టి వేపచెట్టు మొదలుగా
ప్రజలకు పరగ మూలికలకు పనికివచ్చు.
నిర్దయుండు ఖలుడు
నీచుడెందులకగు ? వి. వే.
విషవృక్షములైనను మూలికలకు పనికివచ్చును . నిర్దయుడు , ఖలుడునైన నీచుడు ఎందుకును ఉపయోగింపడు .
Trees with bitter fruits are useful as herbs. A heart-less evil person is not useful for anything.
432
రామనామపఠనచే మహివాల్మీకి పాపి బోయడయ్యు కులము ఘనము కాదు గుణమే ప్రధానము , వి. వే.
రామనామపఠనచే మహివాల్మీకి
పాపి బోయడయ్యు కులము
ఘనము కాదు గుణమే
ప్రధానము , వి. వే.
బోయయై , పాపములు చేయు వాల్మీకి రామనామ జపముచే మహాముని అయ్యెను . గుణమే గొప్పదిగాని , కులము కాదు .
Valmiki was a hunter and a sinner who transformed into a sage by meditating on Lord Rama. Character is greater than caste
433
రేగుపుచ్చకాయ రేయెల్ల తన్నిన మురగ దంతకంత పెరుగుగాని ఒరులు ఛీయన్నను నోగు సిగ్గెఱుగునా ? వి. వే.
రేగుపుచ్చకాయ రేయెల్ల తన్నిన
మురగ దంతకంత పెరుగుగాని
ఒరులు ఛీయన్నను నోగు
సిగ్గెఱుగునా ? వి. వే.
నీచమైన రేగుపుచ్చకాయను తన్నిన అది పెరు గునేగాని మురగదు . ఎన్ని తిట్టినను నీచునకు సిగ్గు ౦డదు
The shrub of Regu, despite kicking, will flourish. Even after scolding a low-life has no shame.
434
లేనికాలముకు లేని మనమునొందు ఈనిన పులిరీతి నెఱుగకుండు కఠినబుద్ధి కింత కలిమెటు కల్గును? వి. వే.
లేనికాలముకు లేని మనమునొందు
ఈనిన పులిరీతి నెఱుగకుండు
కఠినబుద్ధి కింత కలిమెటు
కల్గును? వి. వే.
లేనికాలమునందే కోరికలు అధికముగా కలుగును . ఈనిన పులికి ఆకలి ఎక్కువ . దుష్టబుద్ధికి సంపద యెట్లు కల్గును?
The wants peak when indigent. A tigress is most hungry after giving birth. How can a bad person accumulate wealth?
435
వంపుకఱ్ఱగాంచి వంపు తీర్చగవచ్చు కొండలన్ని పిండిగొట్టవచ్చు కఠినచిత్తు మనసు కరగింపగారాదు , వి. వే.
వంపుకఱ్ఱగాంచి వంపు తీర్చగవచ్చు
కొండలన్ని పిండిగొట్టవచ్చు
కఠినచిత్తు మనసు
కరగింపగారాదు , వి. వే.
వంకర కర్రను తిన్నగా చేయవచ్చును . కొండలను పిండి చేయవచ్చును . కాని కఠినుని దయగలవానినిగా చేయలేము .
It is possible to straighten a curvy stick. Crushing the mountains is also possible. But it is impossible to transform a stone-hearted person into a kinder one.
436
వల్లకాళ్ళు దున్ను వాగులడ్డమురాగ తుమ్మకంపదుచ్చి త్రోవచేయు దండుగైనబెట్టు ధర్మానకోర్వడు , వి. వే.
వల్లకాళ్ళు దున్ను వాగులడ్డమురాగ
తుమ్మకంపదుచ్చి త్రోవచేయు
దండుగైనబెట్టు ధర్మానకోర్వడు,
వి. వే.
దుష్టుడు తన సొమ్మును కాడులు దున్నుటకును , తుమ్మచెట్లతో వాగులకు కట్టలు కట్టుటుకను , దండుగకును వ్యర్థముగా ఉపయోగించునే కాని ధర్మమునకు ఉపయోగించడు .
A bad person utilizes his wealth to till graveyards, build bridges on streams, or waste on any kind less acts but never for charity.
437
వాక్కు శుద్ధిలేనివైనమౌ దండాలు ప్రేమ కలిగినట్లు పెట్టనేల?నొసట బత్తిజూపు నోరు తోడేలయా ! వి. వే.
వాక్కు శుద్ధిలేనివైనమౌ దండాలు
ప్రేమ కలిగినట్లు
పెట్టనేల?నొసట బత్తిజూపు
నోరు తోడేలయా ! వి. వే.
దుష్టుడు వంకరమాటలతో వంకదండములు పెట్టునేకాని ప్రేమ యుండదు. విభూతి పెట్టి భక్తిని నటించునేకాని వాని నోరు తోడేలువలె ఇతరులను మ్రింగజూచును
A bad person feigns good manners but without any love. He might smear holy ash on his body. Inwardly he is like a wolf ready to swallow the opposite person
438
వాడకుఱికి తిట్టు వలదన్న మొఱపెట్టు ముందు మగని దిట్టు ముసుగు పెట్టు గడుసురాలు మగని గంపతో నమ్మురా! వి. వే.
వాడకుఱికి తిట్టు వలదన్న మొఱపెట్టు
ముందు మగని దిట్టు
ముసుగు పెట్టు గడుసురాలు మగని
గంపతో నమ్మురా! వి. వే.
గయ్యాళి స్త్రీ వీధిలోని అందరినీ తిట్టును . వద్ధన్నను అరచును . ముందు మగనిని కొట్టి తాను అలుగును . అట్టిది మగనినే అమ్మివేయగల జాణ
A shrew will abuse neighbors and bleats loudly. She will thrash the husband and pretend she is hurt. She is capable of selling her husband.
440
వేము పాలుపోసి వేయేండ్లు పెంచిన చేదు విడిచి తీపి చెందబోదు ఓగు గుణము విడిచి యుచితజ్ఞుడగునెట్లు ? వి. వే.
వేము పాలుపోసి వేయేండ్లు పెంచిన
చేదు విడిచి తీపి చెందబోదు
ఓగు గుణము విడిచి యుచితజ్ఞుడగునెట్లు?
వి. వే.
నీచడు తన చెడుగుణము విడిచి మంచితనము పొందనే లేడు . వేపచెట్టునకు పాలు పోసి పెంచినను చేదు పోదు . తీపి రాదు .
A bad person will not leave behind his bad characteristics and become a good one. One can feed a neem tree milk and honey, but it won't lose its bitterness.
442
శుష్కబుద్ధిచేత శుశ్రూష లొల్లక నిష్ఠబట్టి యేమి నిజమెఱి౦గె? కష్టమైన విద్య ఖలులకు వచ్చునా ? వి. వే.
శుష్కబుద్ధిచేత శుశ్రూష లొల్లక
నిష్ఠబట్టి యేమి నిజమెఱి౦గె?
కష్టమైన విద్య ఖలులకు
వచ్చునా ? వి. వే.
దుష్టుడు విద్య నేర్వ గురువులను సేవింపక తాను నిష్ఠతో ఉండిన లాభమేమి? అది వానికి అబ్బదు .
What is the use when a bad person without serving his teacher remains obstinate? He will never learn.
443
సత్పురుషుల మైత్రి జాలింపగారాదు ప్రకృతి నెఱుగకున్న భక్తిలేదు పలువ లెట్టి రీతి భక్తి నిల్పుదురయా , వి. వే.
సత్పురుషుల మైత్రి జాలింపగారాదు
ప్రకృతి నెఱుగకున్న భక్తిలేదు
పలువ లెట్టి రీతి భక్తి
నిల్పుదురయా , వి. వే.
దుష్టునికి మంచివారి స్నేహము అబ్బదు . ప్రకృతి నెరుగడు . అట్టివానికి భక్తి యెట్లు కుదురును ?
A bad person cannot befriend a good one. He won't know the nature of things. How can he be a God fearing person?
444
సారవిద్యలందు సరణి తెలియలేక దూరమందు చేరు దుర్జనుండు పరముదెలియ నతడు భావజ్ఞుడు ఎట్లగు ? వి. వే.
సారవిద్యలందు సరణి తెలియలేక
దూరమందు చేరు దుర్జనుండు
పరముదెలియ నతడు భావజ్ఞుడు
ఎట్లగు ? వి. వే.
దుర్జనుడు సారమైన విద్యకు దూరముగా ఉండును. అట్టివానికి పరతత్త్వ మెట్లు తెలియును ?
A bad person stays away from learning based on morals. How can he gain spiritual knowledge?
445
హీననరులతోడ నింతులతోడను పడుచువాండ్రతోడ ప్రభువుతోడ ప్రాజ్ఞ జనులతోడ పలకంగరాదయా ! వి. వే.
హీననరులతోడ నింతులతోడను
పడుచువాండ్రతోడ ప్రభువుతోడ
ప్రాజ్ఞ జనులతోడ
పలకంగరాదయా ! వి. వే.
హీనులతోను , స్త్రీలతోను , యువకులతోను , రాజుతోను, ప్రాజ్ఞులతోను మాటలాడరాదు (ఎట్లు మాటలాడిన ఏమి తప్పో?)
One should be aware that low-lives, women, youth, royalty and learned people can misunderstand very easily.
No comments:
Post a Comment